కొత్త కవులు

ఇక్కడ మీరు వ్రాసిన  కవితలను పోస్ట్ చేయవచ్చును. 
కవులకు విజ్ఞప్తి:
 మీరు వ్రాసే కవితలు స్వతంత్రయినవిగా ఉండాలి.  ఒకవేళ ఏదైనా ఇతర భాషా కవితకు అనువాదం ఐ ఉంటే దాని మూలం పేర్కొనాలి.  ఆ మూల కవినుండి వచ్చే సమస్యలకు మీరే బాధ్యత వహిస్తానని హామీ ఇవ్వాలి.

మీరు వ్రాసే కవితలు బ్లాగర్ పరిశీలన అనంతరం పబ్లిష్ చేయ బడును.  ఒక వేళ మీ కవిత పబ్లిష్ కాలేదంటే అది బ్లాగర్ నిరాకరించినట్లు తెలుసుకోండి.  మీ కవిత పబ్లిష్ చేసే లేక పబ్లిష్ నిరాకరించే హక్కుతో పాటు  పబ్లిష్ చేసిన కవితను ఎప్పుడైనా ఈ బ్లాగునుండి ఎలాంటి కారణం చూపకనే తొలగించే హక్కు బ్లాగరికి కలదు.  మీకు ఎలాంటి క్లెయిమ్ చేసే అధికారము లేదు. ఈ నిబంధలకి లోబడే మీరు కవితలను పంపుతున్నట్లు భావించాలి. మీ కవితలకు ఎలాంటి పారితోషకం ఇవ్వ బడదు కాబట్టి మీరు ఇక్కడ పబ్లిష్ ఐన కవితలను మరెక్కడైనా పబ్లిష్ చేసుకోవచ్చు. మీ కవితపై ఎవరికైనా ఏమైనా అభ్యన్తరాలువున్న అది మీకు ఆ వ్యక్తికీ మధ్య వివాదంగా  పరిగణించబడును. ఈ బ్లాగ్ ఎలాంటి సంబంధం కలిగి ఉండదు.  
కవిత ఎలా పంపాలి: 
మీరు తెలుగు, हिंदी, ಕನ್ನಡ, मराठी, English బాషలలో ఏదయినా భాషలో కవితను పంప వచ్చు, మీ కవిత చెందోబద్ధంగా ఉండొచ్చు, వచన కవిత కావచ్చు, గేయ కవిత కావచ్చు, ఏదయినా స్కెచ్, కధ కూడా కావచ్చు, అంతే కాక హిందూ ఆత్యాత్మిక, ధార్మిక పరమైన వ్యాసం కావచ్చు.  నాస్తిక వాద కవితలు, రాజకీయ పార్టీల సంబంధ కవితలు ఇక్కడ ప్రచురించబడవు, గమనించగలరు.  
మీ కవిత యెంత నిడివి వున్నా సందర్భానుసారంగా స్వీకరించబడును.  ఈ బ్లాగర్ మీ కవితను కుదించే, పెంపుచేసే, మార్పు చేసే హక్కు కలిగి వున్నారు.
ముందుగా మీరు మీ ఇమెయిల్ను Follow by Email Box లో పేర్కొని తరువాత Followers ని Click చేసి follower కండి  తరువాత

మీ కవితలను మీరు post a comment Box లో టైపు చేసి publish ను నొక్కండి. 

.
   *రెప్ప వాల్చని రేయి*
           --------
*ఎం* తసేపయిందో..
రాత్రినలా నిశ్శబ్దంగా చూస్తుండిపోయాను
కంటిరెప్పలపై సుతారంగా కదులుతున్న
నిన్నటి తాలూకు ఊసులు
నేల ఒడిలో ఒదుగుతున్న
నులివెచ్చని గాలులు

ఆకు చాటున ఒంటరి పిట్ట
గొంతు దాటని ఆర్తిరాగాన్ని
గుండె తీరా ఆలపిస్తోంది
మల్లె కొమ్మన విరిసిన లేతచివుళ్లు
వాడిపోతున్న దిగులు వాసన

నల్లదుప్పటి కప్పుకున్న నీలాకాశం
నీటి కళ్లతో నిరాశగా నవ్వుతుంది
మనసు పిడికిట్లోంచి
భారంగా ఒడుస్తున్న ఒక్కోక్షణం..
పెదవిచివర సన్నని జాలినవ్వు

మిత్రమా! కాసేపు దూరమవ్వు..
చెంప చెమరింతను
పైటకొంగుతో అద్దుకుంటాను
నీవు లేని శూన్యం లో
ఈ రాత్రిని కరగనివ్వు
మదిని వీడిన జ్ఞాపకాలను
తొలి పొద్దున వెతుక్కుంటాను
               ***
*సునీత గంగవరపు* -

                -------

*ఎండమావులు*
****************

చిన్నప్పుడు
ఏ పండక్కో..పబ్బానికో
కొత్త గౌను కుట్టిస్తే..
ఎంత ఆనందమో...
ఎప్పుడు పండగ
వస్తుందా, ఎప్పుడు
వేసేసుకుందామా
అన్న ఆతృతే...
ఇంటికి చుట్టాలొచ్చి
వెళ్తో వెళ్తూ.. చేతిలో
రూపాయో... అర్ధ
రూపాయో పెడితే
ఎంత వెర్రి ఆనందమో...
చుట్టాలొచ్చి వెళ్లిపోతుంటే
దుఃఖం తన్నుకు వచ్చేది...
ఇంకా ఉంటే బాగుండు
అన్న ఆశ...
ఎంత ఆప్యాయతలో...
సినిమా వచ్చిన ఏ
పదిహేను రోజులకో
ఎంతో ప్లాన్ చేసి
ఇంట్లో ఒప్పించి
అందరం కలిసి
నడిచి వెళ్లి..
బెంచీ టికెట్
కొనుక్కుని సినిమా
చూస్తే ఎంత ఆనందమో...
ఇంటికొచ్చాకా ఒక గంటవరకూ
ఆ సినిమా కబుర్లే...
మర్నాడు స్కూల్ లో
కూడా...
ఆ ఆనందం ఇంకో పది
రోజులుండేది...
అసలు రేడియో విచిత్రం..
అందులోకి మనుషులు
వెళ్లి మాట్లాడతారా అన్న
ఆశ్చర్యం...అమాయకత్వం..
పక్కింట్లో వాళ్లకి రేడియో
ఉంటే..ఆదివారం
మధ్యాహ్నం వాళ్ళ గుమ్మం
ముందు కూర్చుని 
రేడియో లో సంక్షిప్త
శబ్ద చిత్రం (ఒక గంట కి
కుదించిన) సినిమాని
వింటే ఎంత ఆనందం...
మనింట్లో కూడా రేడియో
ఉంటే...అన్న ఆశ...
కాలక్షేపానికి లోటే లేదు...
స్నేహితులు
కబుర్లు, కధలు
చందమామలు
బాలమిత్రలు...
సెలవుల్లో మైలు దూరం
నడిచి లైబ్రరీ కి వెళ్లి
గంటలు గంటలు
కథల పుస్తకాలు
చదివి ఎగురుకుంటూ
ఇంటికి రావడం....
సర్కస్ లు, 
తోలు బొమ్మలాటలు
లక్కపిడతలాటలు...
దాగుడు మూతలు...
చింత పిక్కలు
వైకుంఠ పాళీ
పచ్చీసు..
తొక్కుడు బిళ్ళలు..
ఎన్ని ఆటలో...
మూడు గదుల రైలుపెట్టి
లాంటి ఇంట్లో అంతమంది
ఎంత సంతోషంగా ఉన్నాం...
వరుసగా కింద చాపేసుకుని
పడుకున్నా ఎంత హాయిగా
సర్వం మరిచి నిద్రపోయాం...
అన్నంలో కందిపొడి..
ఉల్లిపాయ పులుసు
వేసుకుని తింటే
ఏమి రుచి...
కూర అవసరమే లేదు..
రెండు రూపాయలు తీసుకెళ్లి
నాలుగు కిలోల 
బియ్యం తెచ్చేది...
ఇంట్లో, చిన్నా చితకా
షాపింగ్ అంతా నేనే...
అన్నీ కొన్నాకా షాప్
అతను చేతిలో గుప్పెడు
పుట్నాల పప్పో, పటికబెల్లం
ముక్కో పెడితే ఎంత
సంతోషం...
ఎంత బరువైనా
మోసేసేవాని..
ఎగురుతున్న విమానం
కింద నుండి 
కళ్ళకు చెయ్యి అడ్డం
పెట్టి చూస్తే ఆనందం...
తీర్థం లో ముప్పావలా
పెట్టి కొన్న ముత్యాల దండ 
చూసుకుని మురిసి
ముక్కలైన రోజులు...
కొత్త పుస్తకం కొంటే
ఆనందం...వాసన
చూసి మురిపెం..
కొత్త పెన్సిల్ కొంటే
ఆనందం...
రిక్షా ఎక్కితే...
రెండు పైసల
ఇసుఫ్రూట్ తింటే
ఎంత ఆనందం..?
రిక్షా ఎక్కినంత తేలికగా... 
ఇప్పుడు విమానాల్లో 
తిరుగుతున్నాం...
మల్టీప్లెక్స్ లో ఐమాక్స్
లో సినిమా చూస్తున్నాం.
ఇంటర్వెల్ లో
ఐస్ క్రీం తింటున్నాం..
బీరువా తెరిస్తే మీద పడి
పోయేటన్ని బట్టలు...
చేతినిండా డబ్బు...
మెడలో ఆరు తులాల
నగ....
పెద్ద పెద్ద ఇళ్ళు, కార్లు...
ఇంట్లో పెద్ద పెద్ద టీవీలు...
హోమ్ థియేటర్లు...
సౌండ్ సిస్టమ్స్, అరచేతిలో
ఫోన్లు...అరచేతిలో
స్వర్గాలు...
అనుకోవాలే గానీ క్షణంలో
మన ముందు ఉండే 
తిను బండారాలు.. 
సౌకర్యాలు...
అయినా చిన్నప్పుడు
పొందిన ఆ ఆనందం
పొందలేకపోతున్నాం
ఎందుకు నేస్తం...?
ఎందుకు...?ఎందుకు...?
చిన్నప్పుడు కోరుకున్నవి
అన్నీ ఇప్పుడు  
పొందాము కదా...
మరి ఆనందం లేదేం...
ఎందుకంత మృగ్యం
అయిపోయింది...
ఎండమావి 
అయిపోయింది..
మార్పు ఎందులో...?
మనలోనా...?
మనసుల్లోనా...?
కాలంలోనా...?
పరిసరాల్లోనా...?
ఎందులో... ఎందులో...?
ఎందులో నేస్తం...?
చెప్పవా తెలిస్తే....!!
-----_----------------------------

శీర్షిక: *బతికిద్దాంభద్ర0గా బతుకుకాలాల్ని.* డా.శిరీష.
*ఉత్తేజమేమో గానీ సరదా లకు,
ఉస్సూరు మన్పిస్తూ సంసారాల్ని ,
ఉప్ మని ఊదేస్తూరి0గులపొగ.
రి0గుల్లో ఆలోచనలేమోగానీ  బుగ్గిచేయుబుసలపాములౌతు,
నిగ్గుతేల్చేనిజ0-నిషాలేమోగాని,
ఆరోగ్యంకిముప్పు,ఆయువుకపాయమే.
ఊహాఉపాయ0 మేఘాలనిమురియకు,
ఊపిరితిత్తుల్ని ఉరేస్తూ మరణం ద్వారం తెరుస్తుంది.
పొగలూ పగబట్టకమానవు, 
పొగాకూ పామైకాటేయకమానదు.
వేలికొనల్లో ధూమపానం కొరివై,
కుటుంబం ఆన0దాల్నిదూర0చేసే,
చెడు చిచ్చు చాపకింద చేటుచిత్రమే.
శ్వాసకోశ ధ్యాసలమవుతూ గురైన గు0డెగాన0,
శాంతి మహాయజ్ఞం కా0తులకోరుతూ,
కాలాన్నిపోగాల0 కానీయక,
కర్తవ్యం గా పొగాకుదూరమై, జీవకాలాల్ని జీవి0పజేద్దా0.
*ధూమపాన వ్యతిరేక దినోత్సవం నేడు.*
*డా.వేదులశ్రీరామశర్మ'శిరీష'.

*స్నేహం అంటే..* శీర్షిక :
 *ఎదరూపు మనసు చూపు.* dr.Vedula'sirisha'.
*స్నేహం అంటే కానేకాదు కాలక్షేపం,
సవ్యగతుల నవ్య జీవన కాల నిక్షేపం.
అల్లాటప్ప ఆటవిడుపు పిచ్చాపాటూ కాదు.
కల్మషమెరుగని భరోసా బాసటశ్వాస స్నేహం.
*విశ్వమంత విశ్వాసం గాలిపటాలయి,
విశాలభావ అక్షర కాంతి పతా కాలుగా,
ఎల్లల్లేని నమ్మకాల ఉల్లాసపు నింగిలై,
కల్లల్లేని ఆకాంక్షల అంకురాల నేలనూ స్నేహమే.
*జీవితం గీటురాయి బతుక్కి కలికితురాయి,
హృదయాలఉదయ పరాగం- రేయి రాగం స్నేహం.
మనసు చూపుల ఎదకి ఆత్మీయం రూపై,
మనుగడ చెలిమి మనోబాట కలిమినే.
*నాకు నువ్వు నీకూ నేననే బాసటభావనై,
నిస్వార్థం త్యాగాల అనుబంధం స్నేహసుగంధం.
సుధాస్వర్గం సువర్గ అనర్గం, స్నేహదుర్గమై,
ఆత్మీయత వర్షమై, ఆత్మస్థైర్య అమృతమే.
*కష్టం-ఇష్టంలో సమిష్టి పాటవం పల్లవమై,
చేతల చేతుల చేదోడు చైత్ర చిత్రమై,
నేస్తం బలిమి సమస్తం నిబద్ధతా హస్తమయ్యేది,
ఆదర్శమార్గమధురిమల మనోఉత్తేజం స్నేహమే.
*dr. వేదుల శ్రీరామ శర్మ 'శిరీష ',66-5-20, అశోక్ నగర్, కాకినాడ-3.,9866050220

------+-----



232 కామెంట్‌లు:

232లో 1 – 200   కొత్తది»   సరి కొత్తది»
Satya bhaskar చెప్పారు...

భయం లేదు

ఐసొలేషన్ మాకేం కొత్త కాదు
ఎప్పుడున్న అలవాటే!
ఇంతకుముందు మాత్రం
మమ్మలను పట్టించుకుందెవరు!పలకరించిందెవరు!
అందరికి మేం పనికిరాని వాళ్ళం అయిపోయాం!
యంత్రాల్లా పరిగెత్తే మనుషుల మధ్య
ఒంటరిగా ఓ మూల కాలం గడుపుతున్న వాళ్ళం
ఎప్పటినుండో మృత్యు వాకిట నిలబడి
పిలుపు కోసం ఎదురు చూస్తున్న వాళ్ళం!
మాలాంటి వాళ్ళను తీసుకుపోవడానికే
కరోనా వచ్చిందట!
భవిష్యతున్న వాళ్ళు భయపడాలిగాని
ఘనమైన గతం తప్ప
ఏమీలేని వాళ్ళం!మాకేం భయం!
***
-సత్య భాస్కర్
(నిరాదరణకు గురవుతున్న సీనియర్ సిటిజన్ లకు అంకితం)

cbs చెప్పారు...

స్పందన
నా లోని ప్రతి రక్తబిందువు నీదే
నా మదిలోని ప్రతి ఆలోచనకి మూలం నీవే
నా దేహం, నా జీవం అంతా నీదే
అని ప్రతి కొడుకు భావిస్తే
ఏ తల్లి బ్రతుకు భారం కాదు,
ఏ తండ్రి జీవితం అడియాస కాదు.
ప్రతి కొడుకు స్పందించాలని కోరుకుందాం
మార్పు నాసిద్దం

కోసూరు సుమంత్ బాబు "సుమకిరణసంయుక్తం" చెప్పారు...

కోసూరు సుమంత్ బాబు
170 /2 (46 ) బిగ్ స్ట్ర్రేట్ ,తిరువల్లిక్కేణి ,చెన్నై - 600 005
ఫోను 09445878668
వయోభారం – రాయబారం
వయస్సులోనే ‘వృధ్ధాప్యం’
మనస్సులో ఉత్సాహం
భౌతికంగానే జరావహం
నార నాళాలలో సరుధిరప్రవాహం
గుండెలలో ధైర్యం ,సాహసం
ఆధరసీమలో చిరుదరహాసం
హృదయరీతిలో నవ యవ్వనం
కల్గించవా మనోక్కాయ సమన్వయం
మరలించవా నిన్ను మళ్ళీ పసిప్రాయం
మరపించవా నీపై జరా ప్రభావం
మురిపించవా నీ సంధ్యా సమయ జీవనం
మరలా ఆయరుణోదయ కాంతులతో
మలచుకో ఓ క్రొత్త జీవితం
మరచిపో ఆ మళ్లిన వయస్సు
మరుజీవన మొసంగే మెరుగైన మనస్సుతో
దృఢమైన ‘చిత్త శక్తి’ తో , బలమైన యాత్మనిగ్రహంతో !!
నిండైన పరమాత్మ యనుగ్రహంతో ...

Satya bhaskar చెప్పారు...

good

కోసూరు సుమంత్ బాబు "సుమకిరణసంయుక్తం" చెప్పారు...

సత్యా భాస్కర్ గారికి నా కృతజ్ఞతలు

కోసూరు సుమంత్ బాబు "సుమకిరణసంయుక్తం" చెప్పారు...

కోసూరు సుమంత్ బాబు
170 /2 (46 ) బిగ్ స్ట్ర్రేట్ ,తిరువల్లిక్కేణి ,
చెన్నై - 600 005
ఫోను 09445878668
"సుమకిరణసంయుక్తం"

పుష్పం


మొక్కకు పువ్వందం
పూవుకు తావి యందం
పువ్వంటేనే అందం
నక్షత్ర రూపం,వృత్తాకారం
అమర్చిన దళాలు
ఆకర్షించే రంగులు
తనకు రక్ష కోరముండ్లు
రంగుంది,రూపముంది
విరజిమ్మే పరిమళాలు
విరాజిల్లే కాంతులు
సున్నితం,సుందరం
రమ్మని పిలిచే సోయగాలు
రారమ్మని పలికే సౌందర్యాలు
అందాల అతివకు అభివర్ణనలివే
అందమే తానౌ పుష్పానికి పొందు
అందుకే అన్నారు పూవులు,పడతులు ఒకే వర్గం .

పుష్పానికి ఆయు:కాలం అతిస్వల్పం
అయినా దాని ఆవిర్భావం మహదానందం
అంతటి అందం , డెందం దోచే చందం
ఆకర్షించే వంపులు,ఆకట్టుకొనే రంగులు
మైమరపించే సుగంధాలు ,మరపురాని మకరందాలు .

పూవు పుట్టుకకుంది ఓ అర్ధం
తన యునికి రోజేయైనా, కానివ్వదు వ్యర్ధం
తన జాతి వృధ్ధికే తన తపనంతా
కర్తవ్య సాధనతో సార్ధకమౌతుంది బ్రతుకు
తాను తనువు చాలించినా తరిస్తుంది జన్మ .

తావులు జల్లే పూవుకు నడుమ
జాతిని నిలిపే ఆశయం అండాశయం
చుట్టూ ఉన్నవి కేసరాలు
పుప్పొడి పొదిగిన బంగరు తీగలు
రాగాల పరాగాలు, సంతతికవి సరాగాలు
ఇన్నిటి నడుమ ఇంపైన తేనెలు
పరపరాగ సంపర్కం ,ప్రధాన ధ్యేయం
తేనెలు,తావులు,రంగులు,అందాలు
భ్రమరాలు,ఈగలు ,సీతాకోకచిలుకల
భ్రమింప జేస్తాయి ,రప్పిస్తాయి
మొగ్గతొడగగానే మూగుతాయి
విచ్చుకొంటుంది ,రెచ్చి పోతుంది
తేనెలు గ్రోలి ,తనివి దీరి
మళ్ళీ మళ్ళీ పై పై వాలి
తన తనువునంటిన పుప్పొడి దాల్చి
పువ్వు పువ్వు మారుతూ మళ్ళీ వ్రాలి
పరాగాలు పరపరాగ రాగాల జేయు.

పూవుమారి పిందెలు గాచు
పిందెలు కాయలై ,కాయలు పండ్లై
ఫలములో గింజలు,గింజలో ఫలములు
మళ్ళీ మొక్కలు ,మొక్కలకు పూవులు,
పూవులో కాయలు ,మారు మారు దశలు
ఇదే యొక ప్రకృతి ప్రవృత్తి .
పూవునకు ఆయుషు అచిరకాలం
తన కర్తవ్య సాధనయో చిరస్థాయి
ఒక మహావృక్షం చిన్న విత్తందే
విత్తుల ఉద్భవం చిన్న పుష్పమందే .

పువ్వులు మనిషికెంతో చేరువ
కన్నుల కింపులు కలర్ పూలు
సువాసనలకు సుగంధాలకు ఫూలే
సువాసినికి , సుమంగళికి సుమాలే
దైవాన్ని కొలువ , అంజలి నివాళులకు
కళ్యాణశోభకు , కళావేదికలకు
స్వాగతములకు, శుభాకాంక్షలకు
విజయోత్సాహమైనా ,వీడ్కోలుకైనా
ప్రేమ కానుక, ప్రేమసందేశమైనా
పూవులు లేక ఫలితం లేదు .

కుసుమమంటే సుకుమారం
సుమమంటే సున్నితం
పువ్వంటే ప్రేమతత్వం , సహాన రూపం
పుష్పమంటే ప్రశాంతం , శాంతం
విరులంటే వికాసం
జీవం స్వల్పం , భారం అపారం
అట్టి జీవం , అట్టి జననం
అర్ధవంతం, సార్ధకం ,నిస్స్వార్ధం
అందరికీ అందించే ప్రకృతి పాఠం !!!
*************


cbs చెప్పారు...

విగత జీవుడయ్యాకే......

విగత జీవుడ య్యాకే
విలువల్ని కీర్తిస్తూ ఉంటాం
నిండుగా ఉ న్నంత కాలం
నిలువ నీడ లేకుండా
ఉన్నంత కాలం
నిరంతరం సూటి పోటి
మాటలతో
ఎత్తి పొడుపు చేష్టలతో
బాధించే వాళ్ళం
కడకు దిక్కుతోచక
కనికరించే వారు లేక
సంఘ అవినీతి అసూయా ద్వేషపు కోరల్లో చిక్కు పడి చితికి
పోయిన
చినిగి నలిగి పోయిన
ఆ జీవుడు విగత జీవుడ య్యా కే
సానుభూతి నీ
కురిపి స్తుంటాం
విలువల్ని కీర్తిస్తూ ఉంటాం
ఆ తా లూకు విశేషాల్ని
చర్చిస్తుంటాం
ఎందు కంటే గతించిన
కాలాన్ని నేమరేసు కునే
తత్వం మనది కనుక
మనుగడ మసైయ్యాకే
మేల్కొనే వాళ్ళం మనం
కనుక
ఆ జీవి ఆ విలువైన జీవి
నేడు విగత జీవైంది
నేడు అందుకే జనతలోంచి సానుభూతి
పుట్టుకొచ్చింది....
దోసపాటి
సత్యనారాయణ మూర్తి.
9866631877

కోసూరు సుమంత్ బాబు "సుమకిరణసంయుక్తం" చెప్పారు...

వారివి మూగబోయిన జీవితాలు. మన పెద్దలకు మనమందరూ కృతజ్ఞులమై వారికివ్వవలసిన హామీ వారిని ప్రేమతో పలకరించడమే.మీ కూర్పు బాగున్నది

కోసూరు సుమంత్ బాబు "సుమకిరణసంయుక్తం" చెప్పారు...

తల్లిదండ్రుల వ్యధను తెలుపు మంచి స్పందన ఇది

cbs చెప్పారు...

*శీర్షిక: కరోనా నేర్పిన పాఠాలు-2*🌹🙏
*రచన: తుమ్మ జనార్దన్(జాన్)*

పరిశుభ్రతే
ఆరోగ్యానికి భద్రత.

డబ్బు, ఆస్తులకన్నా
ఆరోగ్యమే మహాభాగ్యం.

కష్టాలు ఎప్పుడైనా రావచ్చు
దానికి సిద్ధంగా లేకపోవడమే మన లోపం.

సమానత్వం ప్రకృతి ప్రతి రోజూ చూపిస్తూనే ఉంది
కరోనాలాంటివి వస్తేనే మనం గమనిస్తున్నాం, అంతే.

ఊయల ఎంత ఊగినా ఉన్నచోటికే వచ్చి ఆగుతుంది
ఇది వలస కార్మికులకే కాదు, అందరికీ, మన మూలాలు మనకు చూపించిందిగా.

కష్టాలు వస్తూ పోతుంటాయి, అలాగే కరోనా / ఏదీ నిత్యం కాదు
ఎంత పెద్ద కష్టమొచ్చినా ప్రపంచం ఆగిపోదు, చివరికి ప్రాణ సంకటమైనా / జీవించాలనేదొక్కటే సత్యం.

పెరుగుట విరుగుట కొరకే
ఇప్పుడు తిరుగుట (వైరస్) పెరుగుట కొరకే.

మూసుకుంటే మునిగిపోతాం, తెరుచుకుంటే ముగిసిపోతాం
అయినా రెండోదే మన ఎంపిక (బ్రతికించలేని ప్రభుత్వాలు మరి)

పరీక్షలు పరీక్షిస్తాయి, ఫలితాలిస్తాయి
కొన్ని పరీక్షలు (కరోనా), పరీక్షలే లేకుండా చేస్తాయి, సానుకూల ఫలితాలిస్తాయి(ఉదా: 10th)

వేదం : అందరూ భాగవత్ స్వరూపులే అని భావించమంటుంది.
కరోనా : అందరూ కరోనా స్వరూపులే అనుకోని మసలుకోమంటుంది.

cbs చెప్పారు...

సదా ఈ భువి పై.....

పాలక పట్టి రాసుకో
భవిత గూర్చి తెలుసుకో
బ్రతుకు తీర్చి దిద్దుకో
మనసెరిగి మసలు కో
మంచిని పెంచి కదలిపో
అమ్మా నాన్న కన్న కలలు
నిజం చేసుకుని నడుచుకో
నీ విలువను చాటుకో
తనయు డంటే వంశాం కుర మై
రేపటి భవితకు వారసుడై
నిలిచే వాడని తెలుసుకో
ఈ సమాజం పురోగ
మించేదిశగా ప్రగతి
మార్గాన నడుచుకో
ఎన్నటికీ నీవే ఆదర్శ
పౌరుడివై నిలిచి పో
ఈ జగతి యావత్తూ
నిన్ను ఉత్తమునిలా
తలచు కునేలా సదా
ఈ భువిపై నిలిచి పో
దోసపాటి
సత్యనారాయణ మూర్తి.
9866631877

cbs చెప్పారు...

లలితాభాస్కరదేవ్--9885552922
*చిన్నీలు*
నిత్యం ఎన్నో వీక్షణాలు
మరెన్నో నీరిక్షణలు
అప్పుడప్పుడు అంతః వీక్షణలు
అన్నీ మెరిసి మురిపించే క్షణాలే

వస్తూ వలపించేవే అన్నీ
వుంటూ వగపించేవి కొన్ని
వెళుతూ అలరించేవెన్నో
సత్యంగా వున్నవి ఎన్ని...?
లలితా భాస్కర దేవ్
13-7-2020

cbs చెప్పారు...

శతమానం భవతి ??
===================
1 తాజా కలం✒
====================
హా !
నూరేల్లు బతుకుడా ?
మన ముందున్న పెద్ద వాళ్లు
మనవెనుకున్న చిన్న వాళ్లు
వరుసగా పోయాకా
ఆసరా లేక
మనం ఒంటరి సహారాయే
ఆరోగ్యంగా అనుకున్నంత
బతికితే అవే నూరేళ్లు మరి !
- కందాళై రాఘవాచార్య

అక్షర సుమహారం.

ఉన్నత రైతు కుటుంబ ములో జన్మించి
విద్యార్థి దశలో నే
క్రమశిక్షణ నలవరచుకుని
మాతృభాషా భిమానిగా
ఎదిగి రాజకీయాల్లో సైతం ప్రవేశించి
న్యాయ కోవిదుడై
సత్యం అహింస ధర్మం
మార్గాల్లో పయనిస్తూ
బి.జే.పి.అధ్యక్షునిగా
సమర్థవంతమైన దక్షతను ప్రదర్శించి
రాజ్యసభ సభాధ్యక్షుని గ భారతదేశ ఉపాధ్యక్షునిగా ఉత్తమ
నిర్ణయాల మార్గదర్శి యై
మాటలలో తేనెలొలికే
చమత్కారం తో
తెలుగు హిందీ ఆంగ్లభాషల తో అశేష
జనావళిి నీ విశేషంగా
రంజింప చేసి నిలువెత్తు
స్పు రద్రూపానికి తెల్లని
పంచెను ధరించి
పదహారణాల అచ్చమైన
రాజ సమొలికించే తెలుగువాడు
వెరసి మన తెలుగు కీర్తి
మన భారతమ్మ ఆస్తి
నిజంగా మన భారత దేశం తెలుగు రాష్ట్రం
గర్వించతగ్గ ఏకైక
అద్భుత శక్తి
స్వార్థం అనర్థాలకు హేతువ ని వక్కాణీ స్టూ
మేరు నగ ధీరుడై నిలిచిన గౌరవ నీయులు
శ్రీ ముప్పవరపు
వెంకయ్య నాయుడు గారు. భారత ఉప రాష్ట్ర
పతికి ప్రేమతో అందించే
ఈ తెలుగు వర్నాక్షర సుమ హారం.
దోసపాటి.
సత్యనారాయణ మూర్తి.
రాజ మహేంద్ర వరం.
9866631877
*********
ఉత్పలమాల
_____
ఏ సిరి జూసినన్ యిలను యే సిరి లేదని యే డ్చుచుంద్రు సే
వే సిరిరా యిలన్ కనుము యెందరొ ఆర్తుల గావుకేకలన్
నీ సిరి కన్ననూ కొలువు నీదరి పేదల కూ ర్మి తోడ దా
నం సిరులే గదా నిజము నాదను భావము వీడి చూడుమా

దీనిలో...తేటగీతి
ఇలను ఏ సిరి లేదని యే డ్చు చుంద్రు
కనుము ఎందరొ ఆర్తుల గావుకేక
నిజము నాదను భావము వీడి చూడు
.....మరి కందం...ఇదిగో
సిరి జూసినన్ యిలను యే
సిరి లేదని ఏడ్చుచుంద్రు సేవే సిరిరా
సిరి కన్ననూ కొలువు నీ
దరి పేదల కూ ర్మి తోడ దానం సిరులే
..... రాఘవ మాస్టారు....
**********
చిన్న మాట నీవు విన్న చాలు
*"""""**"""*"""*
ఆటవెలది.
యినుము తుప్పుబట్టు తనువు జబ్బునపడు
నీరు గబ్బుబట్టు వూరకున్న
ఎన్నడైన వాడకున్న కదల కున్న
చిన్న మాట నీవు విన్న చాలు

అప్పులిచ్చువారు,అత్తయు మామయు
కన్నవారు, ఆదుకొన్నవారు
గురువు ధరణి లోన కొలువైన దేవుళ్ళు
చిన్న మాట నీవు విన్న చాలు

హితులు లేని చోట హీనమతుల చోట
జనము లేని చోట జగడమున్న
చోట నెన రు లేని చోట నిలువరాదు
చిన్ని మాట నీవు విన్న చాలు

నాశనంబు జేయు నాది యనె డి మాట
మనసు హాయి పొందు మనది యనిన
మనది యన్న మాట మానవత్వ ము పెంచు
చిన్న మాట నీవు విన్న చాలు

నీతి జెప్పువాని రీతిని నచ్చరు
సొల్లు కబురు లాడ సొంపు గలుగు
పొగడు వాడె మనకు తగని వాడని ఎరుగు
చిన్న మాట నీవు విన్న చాలు
..... రాఘవ మాస్టారు....
********
ఆడ జన్మ ఆటవెలది
_______
కన్న తల్లి ప్రేమ యెన్ని జన్మలనైన
తీర్చ లేము కొంత కూర్చ లేము
మోత వీపు నొకటి మోత నెత్తి నొకటి
ఉవిద జన్మ కెంత ఓ ర్మి కూ ర్మి
...... రాఘవ మాస్టారు
****

cbs చెప్పారు...

*ఏడ్వటం కష్టమేనట*??
<<<<<<<<<<>>>>>>>>>>
మా ఇంటికి పది ఇండ్ల ఆవల
ఎవరికో పరమ పదం కబురు --
అకాలంగా కాలం కమురు !!
కారణం ఎవరూ వ్యాఖ్యానం
చేసి చెప్పడంలే ---
అసందర్భ మౌనవ్రతం !
భగవద్గీత రికార్డు వెయ్యలే
బుద్ధిమంతులు మహామహా !
కొసరి కొసరి పచ్చడితో
అందరూ టిఫినులు
ఫిల్టరు నీళ్లు ఫిల్టర్ కాఫీలు
ఫికరేమి లేకుండా లాగేస్తూ -
ఆకలికేం చావు వాసనా !
ఎవడికీ ఇంటాయన చచ్చిన దుఃఖం
అంచుకైనా లేదు పాషాణులు !
కడప అవతలికి ఎవరూ రాలే --
కాళ్లకు తిమ్మిరేమో !
వడ్ల సంచులు లాగే ట్రాక్టర్
శవాన్ని దూకుడు దూకుడుగా
లాగేస్తోంది స్పీడు బ్రేకర్ బేకార్ !
సారథి దయాలువేనట
ట్రాక్టర్ నిండేంత పుణ్యం రానీ !
అందరూ బాల్కనిలోంచి
ఊరేగింపుగా చూస్తున్నారు
తమకు మరణం లేనట్లే !
ఎవరూ ఏడ్వటంలే
ఇంట్లోంచి పీడ పోయినట్లైంది
పీనుగు ఏనుగంత అందరికీ !
ఏడ్వటం కష్టమేనట ??
అనుబంధాలన్నీ మంట కలిస్తే
కన్నీళ్లకు చితి అంటుకోదా మరి
శవం ఒక్కటే లోలోపల
పురుగు పట్టినట్లు
ఏడ్చుకుంటూ ఇడ్చుకుంటూపోతోంది
ఒంటరి ఒంటరిగా !
దృశ్యంలో
మానవత్వం అదృశ్యం
అందరినీ కొట్టొచ్చినట్లే !
- కందాళై రాఘవాచార్య

cbs చెప్పారు...

ముక్తి కోసం నే తపిస్తూ
నీ కంఠాన సుమ మాల
గానో
నీ కోవెలలో చిరు దివ్వెగా నో
నీ ఉద్యాన వనంలో
తుమ్మెద గానో
నీ పాదాలకు చేరే
అర్ఘ్యం గా నో
నీ ఎదపై నిలిచే
వస్త్రంగానో
నీ నుదుటన దిద్దే
తిలకంగానో
నీ మేనిపై పూసే జవ్వాది
గానో
నీకై వెలిగే అగరు ధూపం
గానో
నిలిచిన చాలును క్షణమైనా అని
తలుస్తోంది నా మనం
ఓ సప్త గిరి వాసా
ప్రభో తిరుమలేశా.
+91 98666 31877: ఈ జన్మ కిది చాల నీ.....

శక్తి కోసం భుజిస్తూ
భక్తి తో నిను కొలుస్తూ
ఆర్తితో నిను పిలుస్తూ
ముక్తి కోసం భజిస్తూ
అరిషడ్వర్గాలను గెలవలేక
ఆశాజీవిగా బ్రతక లేక
ఒడి దుడు కుల ను
ఎదుర్కొంటూ
వడి వడిగా భవ సాగరాన్ని ఈదుతూ
నా అశాంతికి చరమ
గీతం పాడా లనీ
నీ సాన్ని ద్యాన్నీ
పొందాలనీ
నే
+91 98666 31877: దోస పాటి.సత్యనారాయణ
మూర్తి.9866631877.

cbs చెప్పారు...

మూలన పడేస్తే వృద్ధుడు వ్యర్థుడు
ముంగిట్లో కూచోబెడితే
ఇంటిని కాచే ఈశ్వరుడు
బతుకుబాటలో గతుకుల్ని
ముందుగా హెచ్చరించి
కాపాడే సిద్ధుడు వృద్ధుడు
వృద్ధులు సారధులైతే
యువకులు విజయులౌతారు
అనుభవాల గనులు ఆపాత బంగారాలు
వదిలేస్తే వృద్ధుడు మంచానికి బద్ధుడు
చేయూతనిస్తే ప్రతి వృద్ధుడు ఓ బుద్ధుడు
నిర్లక్ష్యంగా చూస్తే కేవలం
మూడుకాళ్ల ముసలివాడు
తగిన గుర్తింపునిస్తే
విజయాన్నిచ్చే త్రివిక్రముడు
ఒకనాటి బాలుడే ఈనాటి వృద్ధుడు
తనను పట్టించుకోకున్నా
నువ్వు పచ్చగా ఉండాలని తపించే
ఉదాత్తుడు వృద్ధుడు
పలకరిస్తే చాలు
పాలకడలిలా పొంగులు వారే
పసివాడు వృద్ధుడు
వృద్ధుడంటే పైపైన చూస్తే
జుట్టు తెల్లబడిన ఫలిత కేశాలవాడు
అంతర్గతంగా
తలపండిన పండితుడు.
🙏🙏🙏
అందుకే మనపూర్వీకులు
వృద్ధులకు అమిత గౌరవాన్నిచ్చేరు, ఇమ్మన్నారు.

cbs చెప్పారు...

ఇదే పుణ్య ప్రద.....

ఆషాఢ విరహాని కి
వీడ్కోలు పలికి
శ్రావణ మంగళ వేళకు
స్వాగత మిడు కాలం
ముంగిట రంగవల్లులు
లతో గడపకు పసుపు
కుంకుమలతో అలంకరించి సిరుల మా
లక్ష్మిని వరాల నోసగే తల్లిని దీర్ఘ సుమంగళిగా
వర్థిల్లమని దీవించడానికి
వనితలు శోభితులై
భక్తి ప్రపత్తులతో కీర్తించే
కాలం ముదితలకు
పెరంటములతో శనగలు
తాంబూలము లు వాయిన మీడు కాలం
విప్రులకుభక్తితో వరలక్ష్మీదేవి
పూజానంతరం భోజన
తాంబూలము లిడు కాలం వెరసి పతి దేవుని
ప్రేమాభి మానాల్ని నిండుగా శతాధిక కాలం
ఉండనివ్వమని మదిలో
కొలువున్న మహాలక్ష్మిని
కీర్తించు కాలం
ఇదే పుణ్య ప్రద శ్రావణ కాలం.
దోసపాటి. సత్యనారాయణ మూర్తి.
రాజ మహేంద్ర వరం.
9866631877.

cbs చెప్పారు...

వాలుకుర్చి
----------------లలితాభాస్కర దేవ్

రాజుగారి ఇంట్లో
రాజసంగా వెలిగిన కుర్చీ
పెద్ద వారి హోదాలకు
దర్పంగా నిలిచిన కుర్చీ

పాత తరానికి గుర్తుగా
తాతగారికి ఇష్టమైనది
కొత్తతరం కూర్చో లేనంతగా మెరిసిన కుర్చీ

కళ్లజోడు సరి చేసుకొంటూ
వార్తాపత్రిక చదివేది,
తాతగారు కూర్చోని
పిల్లలకు పాఠాలు చెప్పే
తీయని స్మృతులకునెలవైనది

కుర్చీ కర్ర తీసేసి
ట్యూషన్ మాస్టర్ ని పడెేయాలని
అమ్మమ్మ చూసేలోగ
కర్ర దాచేసే
ఆకతాయి పిల్లలకు
ఆ కర్రతోనే
దెబ్బలకు అనువైనది

అలసివచ్చిననాన్న
సేదతీరేందుకు సుళువైనది
అమ్మ ఇచ్చే కాఫీ తో
అపూర్వమైన దృశ్యమైంది

చాలా కాలం హాలులో
ఆపై వరండాలోకి చేరి
తరువాత స్టోర్ రూమ్ లోకి
మారిపోయింది
కాలాంతరంలో కొత్త రూపంలో
దర్శనం ఇచ్చిన ఓ వాలు కుర్చీ!
మా జ్ఞాపకాల మడతలలో
ఎప్పటికీ నువ్వు
మడత కుర్చీవేగా!🙏
లలితా భాస్కర దేవ్
22-7-2020

cbs చెప్పారు...

తెలుగుజాతి ఆత్మకథ లాగా ఉంటుంది కింది పద్యం..

ఎవరు కాకతి! ఎవరు రుద్రమ!
ఎవరు రాయలు! ఎవరు సింగన!
అంతా నేనే! అన్నీ నేనే!
అలుగు నేనే! పులుగు నేనే!
వెలుగు నేనే! తెలుగు నేనే!

నిరంకుశ నిజాము పాలన గురించి..

ఓ నిజాము పిశాచమా, కానరాడు
నిన్ను బోలిన రాజు మాకెన్నడేని
తీగలను తెంపి అగ్నిలో దింపినావు
నా తెలంగాణ కోటి రతనాల వీణ

cbs చెప్పారు...


Cheruvela bhargava sarma
06:33 (8 hours ago)
to bhargava

ఓ కవితా నీ........

జనం మనసును దోచు
కుంటావు
జాబిలమ్మ వై వెలుగు
తుంటావు
సిరిమల్లె లా నవ్వు
తుంటా వు
చెలి ఎదలో గిలి గింతలు
పెడతావు
చదు వు దామన్న వారి
మదిని మరీ ఆత్ర
పెడతావు
చదివిన వెంటనే
మస్తిష్కం లోంచి
మళ్లీ జారి పోతుంటావు
భావ కాముకుల ఎద ల్లో
భానుడవై భాసిస్తావు
చరిత హీనుల గుండెల్లో
చరితవై శాసిస్తావు
నీ కున్న స్పందన నిచ్చే
గుణం ఇంకెవరి కుందే
కవితా.....
అందుకే లతా కవిత వనిత అంతా ఓ జత
ప్రచురణ రూపంలో
ఉంటే నీ జన్మ కదో
సార్థకత
కాకుంటే నీ బ్రతుకే ఓ వెత.
దోస పాటి. సత్యనారాయణ మూర్తి.
రాజ మహేంద్ర వరం.
9866631877.

cbs చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
cbs చెప్పారు...

అనురాగాలు.........
ఆశ్రయ మిచ్ఛే రోజులు కావు
ఆత్మీయత కూ తిలోదాలి చ్చావు
దౌర్జన్యం అవినీతి హింసలే ప్రేరకం
ధనం కోసం ధనం వలన
ధనం కొరకు జీవితం
పేదరిక మున్న పాపానికి
శీలం సైతం వేలం
ఉన్నొడి గుడారములో
లేనొడి గులాం గిరి
పేదరికం బ్రతుకును
వెక్కిరి స్తుంటే
ధనంతో జ్ఞానాన్ని న్యాయాన్ని మానాన్ని
కడకు దేన్నైనా కొనే
జనం
అదేమంటే..........
దేవుణ్ణి కూడా దోస్తాం
దేవుని కీ లంచ మిస్తాం
మా అధికారం అహంకారం ఘోరం
నేరాల ముందు
సర్వం దిగ దుడుపే
ఇట్టి విపత్కర స్తితుల్లో
అనురాగాలు అంతరించాయి
ఆత్మీయత లూ చచ్చ్చాయి
ఆశ్రయాలూ కనుమరుగయ్యాయి
స్వలాభం కోసం సర్వం
పణంగా పెట్టే కాలం
నేదండుకే నేమో
ధర్మం నీతి న్యాయం
సత్యం శాంతి అహింస
నేటి కాలం ముందు
వెల వెల బోతు న్నాయి
దోసపాటి.సత్యనారాయణ మూర్తి.9866631877.
*****************************
*చిత్రాల చినుకులు*!
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
చినుకు
విత్తనం
పైబడి
ఉబ్బి ఉబ్బి
ఆనందంతో మొలక ---
చినుకు
చిప్పలో రాలి
ఖ్యాతిగా మేలి స్వాతిమత్యం -
పిల్లల గొంతులో
వడగండ్లుగా జారి జారి
చినుకు మధురం మధురం --
నాట్లు వేస్తున్న
శ్రామికుల వీపు పై పడి
శుభ్రంగా రాసిరాసి
చినుకు సబ్బుకన్నా గొప్ప --
అల్లంత దూరం
ఆకాశం నుండి
తరలి వచ్చే
చినుకునకు తీరిక లేని పనులే -
చినుకు మీద ఏమని రాస్తాం
చినుకును మనమే
ముఖానికి రాసుకోవాలి ---
ఆకాశం ముఖం నిండా
చల్లగా అద్దుకున్నట్లే మరి !
- కందాళై రాఘవాచార్య

cbs చెప్పారు...

అజరామర మైన.........

పండిత పామరులను
రంజింప చేసినవాడు
పడుగురు మెచ్చే నిజాన్ని ఇజంగా చేసి
చూపిన వాడు
శార్దూ లాన్ని తన
సాహితీ ప్రతిభతో
మెప్పించిన వాడు
శారద మ్మ మది గెలిచిన
వాడు
కరుణ రసాన్న లవోకగా
ఆర్ద్రత తో పండించిన
వాడు
మా నవుడి లోని మా
నవతను సైతం
మెల్కొల్పిన వాడు
తెలుగు వారికే కాక
అఖిల లోక జనావళికి
అభ్యుదయా న్నీ రుచి
చూపించిన వాడు
జీవితాన్ని మధించి
జీవన సత్యాన్ని రంగరించి తరతరాలకు
వన్నె తరగని చెరగని
జీవన చైతన్యా న్నందిచినవాడు
పేదరిక మన్నది మనిషికే
కానీ మనస్సుకు కాదన్న
నిజాన్ని చాటిన వాడు
సాహితీ దర్బారులో
సహజం గానే రాజిల్లిన వాడు
అభినవ కోకిలగా అశేష
జనత చే కీర్తిం పబడినవాడు
జగమెరిగిన విశ్వ నరుడు
అజరామరమైన యశస్సు తో
ఆచంద్ర తారా ర్కమూ
నిలిచిపోయే మనసెరిగి న మహా మనీ షే కాదు
మరో గొప్ప మహా కవి
కూడా మా గుర్రం జాషువా నే.
దోస పాటి.సత్యనారాయణ
మూర్తి.9866631877.

cbs చెప్పారు...

ఆటవెలది

కోటిరూకలున్న కోటకు రాజైన
కాటి కేగకుండ దాట గలడె
పుట్టు వాడు కడకు గిట్టుట తథ్యము
నేటి మాట కాదు నేను చెప్ప
పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం
7702090319

cbs చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
cbs చెప్పారు...

పంచదారకన్న, పట్టుతేనెలకన్న

తీయనైైన భాష తెలుగుభాష

అట్టి తెలుగు భాష అంపశయ్యను జేరె

దీనినుద్ధ రింప బూనిరండు

కందము



పలికెద వాణీ నినునే

పలికిన ప్రతి పలుకున తొలిపలుకై యెపుడన్

పలికిన పలుకులు క్రమమై

పలువురి మన్నన లనంద పలుకుము తల్లీ

పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం

7702090319

cbs చెప్పారు...

ఆటవెలదులు

అల్పబుద్ధి వాడు యధికుల తెగనాడు
తానెగొప్పయనును ధరణియందు
తనకు యున్న గొప్ప తననాలుకేచెప్ఫు
నేటిమాటకాదు నేను చెప్ప

పప్పు లోని రాయి పానకమునపుల్ల
తల్పమందు నల్లి తలనుపేను
పోరు బెట్టు సతిని కోరవారెవరంచు
నేటిమాట కాదు నేను చెప్ప

పాము విషము కలదు పడగలోనేగదా
ఉండు తేలు విషము కొండియందు
తలయుతోకగాక తనువెల్ల నరుడని
నేటి మాట కాదు నేను చెప్ప

పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం

cbs చెప్పారు...

*ఉభయ కుశలోపరి* ✒ ?!

~~~~~~~~~~~~~~~~

ఉదయం వాకింగ్ లో

పరిచయస్థులు ఎవరూ

ఎదురు బదురుగా రావడంలే -

శుభ శకునం కాదేమో

నా ముందు నా వెనకా నేనే !

రాని వారి కోసం కొసరి కొసరి

పోరు పెట్టినట్లు

ఇంటికి ఫోను చేస్తే

బదులు జవాబు లేదు ?

అధికంగా అడిగితే

బేతాళ ప్రశ్నలు మన పై !

చివరికి రాంగ్ నెంబరే విసుగు విసుగు జవాబు

ఏమో ! రోజు పెద్దలు స్వాగతం

అనేవారు జీవితానుభవ దరహాసంతో - ఏ ఊరు పోకడో

మరి చెప్పా పెట్టకుండా !

ఈ గార్డెన్ బెంచిలన్నీ ఖాళీ

లాక్ డౌన్ వీధుల్లా !

ఇప్పుడు నా కన్నా చిన్నవాళ్లే

ఎదురౌతున్నారు -

ముఖానికి డిజైన్ మాస్క్

ఐదారడుగులు దూరం దూరం

అనగా అనగా మాట లేదు

తలంతా రోబోల పోలికలు !

తలపులూ అంతే

ఎప్పుడూ ఇలాగే ఉంటే

సందడి కాలం ఎటో

అంగడి మాటలోనే -

అందరం దగ్గరై మంచి చెడులు

చెప్పుకునే రోజు వస్తేనే

భూమి నిజంగా తిరుతున్నట్లు !

పగలుకు పగలు - రాత్రికి రాత్రి

సరికి సరి తూకం వేసినట్లు !

అద్దంలో ముఖం సామూహిక

ఆనందంతో లేదు --

చోద్యం

ఏదో గోడకు అతికినట్లు ముఖం

నగరమైన -పేరుఎడారే

తప్పిపోయిన తోవలు

ఎవరు దొరుకుతారు !

మన చేయి మనమే పట్టుకుని

మన కాళ్లను మనమే

నడిపించుకోవాలి !

పదిలం సుమా !

ఉభయ కుశలోపరి

అని ఎప్పుడు అంటామో !

ఈ పదం కొత్తగా వింటున్నామా

కాదు పాత పాత పాతది !

ఈ తరానికి కొత్త పదమేమో

- కందాళై రాఘవాచార్య

cbs చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
cbs చెప్పారు...

'ఏమండీ... ఆపిల్‌ను నాలుగు ముక్కలు కట్ చేసి పెట్టరా?" అంది భార్య భర్తతో

"ఏం.. ఆరు ముక్కలుగా కోస్తే ఇబ్బందేంటో?" ప్రశ్నించాడు భర్త

"వద్దు.. వద్దు.. ఆరు ముక్కలు తినకూడదు. నేను డైటింగ్ చేస్తున్నాను. కాబట్టి నాలుగు ముక్కలు కొయ్యండి చాలు..! అంది భార్య.
😀😀😀😀😀😀😁😁😁
సుబ్బారావు తల పగిలి హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యాడు, తల కి కట్టుకడుతూ నర్స్ అడిగింది అసలు మీకు దెబ్బెలా తగిలింది సార్.
సుబ్బారావు : నాకు మేనేజర్ గా ప్రమోషన్ వచ్చింది
మా ఆవిడని సర్ ప్రైజ్ చేద్దామని ఇంటికెళ్ళగానే రేపటినుంచీ నువ్వు మేనేజర్ తో కాపురం చెయ్యాలోయ్ అన్నాను
అంతే.....
🤕🤕🤕🙄🙄🙄🙄🙄🙄
ఒక నల్లని మనిషి చనిపోయాక
స్వర్గానికి వెళ్లాడు..
దేవకన్య: ఎవరు నువ్వు?
నల్లని వ్యక్తి: (ఆమెని ఇంప్రెస్ చేయడానికి)
'టైటానిక్' సినిమాలో హీరోని
దేవకన్య: టైటానిక్ షిప్
మునిగిపోయిందిరా వెధవా.. కాలిపోలేదు..
😅😜😃😆😅😂😅😅

మందుబాటిల్ కొనుక్కుని బైక్ ఎక్కబోతుండగా అనుమానం వాచ్చింది .... ఒకవేళ బైక్ మీదినుండి పడిపోతే బాటిల్ పగులుతుందేమోనని ''

అందుకని బైక్ స్టాండ్ వేసి ఆ మందుబాటిల్ అక్కడే ముగించి ఇంటికి బయలుదేరాడు .

మద్యలో బైక్ మీదినుంచి పడి దెబ్బలు తగిలి హాస్పటల్ లో చేరి మంచంమీద పడుకొని ఆలోచిస్తున్నాడిలా....
*అక్కడేమందుకొట్టటం మంచిదైంది లేకపోతే బాటిల్ పగిలి పోయేది* 😱😱
😁😁😁😁😁😁😁😁😁
అలిగి పుట్టింటికొచ్చిన కూతురు , తిరిగి కాపురానికి వెళ్తుంటే తల్లి అడిగింది...
" ఏమ్మా తప్పు తెల్సుకున్నావా..?? అని.

కూతురు : నిజం తెలుసుకున్నా...
ఇక్కడ నా పనులు నేనే చేసుకోవాల్సి వస్తోంది... అక్కడైతే అన్ని పనులు ఆయనే చేస్తారు...
😁😁😁😁😁😂😁
తండ్రి కొడుకుతో కోపంగా..

కొత్తిమీర తీసుకొని రమ్మంటే పుదీనా తీసుకొని వచ్చావు కదరా. నీకు కొత్తిమీరకు పుదీనాకూ తేడా తెలియదా..? తాడిచెట్టులా పెరిగితే సరిపోయిందా వెళ్ళు వెళ్ళు. ఇల్లు వదిలి వెళ్ళిపో తెలుస్తుంది జీవితం అంటే ఎంటో..?!

కొడుకు : సరే నాన్న పద ఇద్దరమూ ఇల్లు వదిలి వెళదాం పద..

తండ్రి : ఎందుకు నేనెందుకు..?!

కొడుకు : అమ్మ చెప్పింది ఇది మెంతికూర అంటా..!!

cbs చెప్పారు...

వెలిగిపోయే దివ్వెలు.....
మానవ జన్మకు ఆద్యులు పూజ్యులు
లాలను పోసి ప్రేమతో
లాలన చేసి
జాబిల్లిని చూపించి
గోరుముద్దలు తినిపించి
ప్రేమను పంచి చిలిపి
చేష్టలకు మురిసేది తల్లి
తప్పటడుగుల కుమురిసి
తప్పుటడుగు లకు వెరసి
వంశ కీర్తిని ఇనుమడింప
చెయ్యా ల నీ
దేశపురోగ తిలో సైతం
పాలు పంచు కోవాల నీ
కలలు గనీ అందుకు
తగ్గ ట్టుగా పిల్లల్ని
తీర్చి దిద్దు తూ
సమాజానికి ఆదర్శ
పురు షుల నందించాల నీ అహరహం శ్రమించే
నాన్న
వెరసి కుటుంబ మ నే
రైలుకు అమ్మా నాన్న
లంటే రెండు రైలు
పట్టాల్లాంటి వాళ్ళు
పిల్లల ప్రగతిని కాంక్షిస్తూ
పిల్లల్ని సదా ప్రేమిస్తారు
మానవత కు అర్థమై
నిలుస్తారు
ప్రేమకు పెద్ద పీటను వేసే
తలిడండ్రులు
పిల్లలు పురోగమిస్తే
వారి ప్రగతికి ఎంతగానో
మురుస్తారు
తమ శ్రమ నంతా మరుస్తారు
అందుకే వీరు సృష్టిలో
ఆ చంద్ర తా రార్కా ము
వెలిగి పోయే దివ్వె లు
దోస పాటి. సత్యనారాయణ మూర్తి.
9866631877.

cbs చెప్పారు...


*భూలోకం దాటి పోరాదు*?
÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷
చూస్తున్నాం !
సముద్రం యుగాల క్రితం
ఉన్నట్లే ఆరోగ్యంగా కెరటాలతో
హోరు హోరుగా అనంతం !
సృష్టి ఆరంభం సంబరంలాగే
అడవులన్నీ నిండా వానలతో
జీవజాలంతో పచ్చపచ్చగా
ఉమ్మడి కుటుంబ ప్రపంచమే !
ఆకాశానికీ వికారం లేదు
ఎప్పటిలాగే ఉదయాస్తమయాలతో
జగమంతగ నిమాయిష్ !
ఎప్పటిలా పంచభూతాలు
వేల వేల వరాల దేవతలే
అయ్యో ! రసభంగం
సౌందర్యభంగం
స్వర్గాన్ని ధ్వసం చేసుకున్నాడు
మనిషి మాత్రం భూతమైపాయే
పురుగుల పరిశోధనలో
మనిషి పురుగుపట్టిపోయాడు
అడ్డమైనది ఆరగిస్తూ
ఇప్పుడు అర అరగా మనిషే !
అరే ! తనను తాను
రక్షించుకోవాలని ఉమ్మడిగా
కోట్ల మెదల్లను మొదల్లతో సహా
తవ్వుకుంటు తెగిపోతున్నాడు
పురుగు మనిషితో పోటిపడి
పరుగులు తీయిస్తూ
వరుగులు వరుగులుగా
మానవ సంబంధాలను తెంచి
మృత్యు బంధాలు వేస్తోంది
అర్థమై అర్థంకాని మృత్యువు
శ్వాస వదలడం తీసుకోవడం భయం భయం --
మనిషంటే మనిషికి జంకు
భయపడకుండా మనిషి
ఎప్పుడు శ్వాసిస్తాడు ?
పచ్చని చెట్టులా
మనిషి ఎప్పుడు స్వచ్ఛం !
ఆ తేది నెల సంవత్సరం
మనం పండుగ చేసుకోనే రోజే !
మనమంతా బతికేఉండాలి
ఒకరినొకరు లెక్కపెట్టుకుంటే
లెక్క సరిగా రావాలి సుమా
ఏ ఒక్కరైనా భూలోకం దాటిదాటి పోరాదు !
రేపటి సూర్యోదయం
చూడటానికి అందరూ ఉండాలి
- కందాళై రాఘవాచార్య

cbs చెప్పారు...

*ఉభయ కుశలోపరి* ✒ ?!
~~~~~~~~~~~~~~~~
ఉదయం వాకింగ్ లో
పరిచయస్థులు ఎవరూ
ఎదురు బదురుగా రావడంలే -
శుభ శకునం కాదేమో
నా ముందు నా వెనకా నేనే !
రాని వారి కోసం కొసరి కొసరి
పోరు పెట్టినట్లు
ఇంటికి ఫోను చేస్తే
బదులు జవాబు లేదు ?
అధికంగా అడిగితే
బేతాళ ప్రశ్నలు మన పై !
చివరికి రాంగ్ నెంబరే విసుగు విసుగు జవాబు
ఏమో ! రోజు పెద్దలు స్వాగతం
అనేవారు జీవితానుభవ దరహాసంతో - ఏ ఊరు పోకడో
మరి చెప్పా పెట్టకుండా !
ఈ గార్డెన్ బెంచిలన్నీ ఖాళీ
లాక్ డౌన్ వీధుల్లా !
ఇప్పుడు నా కన్నా చిన్నవాళ్లే
ఎదురౌతున్నారు -
ముఖానికి డిజైన్ మాస్క్
ఐదారడుగులు దూరం దూరం
అనగా అనగా మాట లేదు
తలంతా రోబోల పోలికలు !
తలపులూ అంతే
ఎప్పుడూ ఇలాగే ఉంటే
సందడి కాలం ఎటో
అంగడి మాటలోనే -
అందరం దగ్గరై మంచి చెడులు
చెప్పుకునే రోజు వస్తేనే
భూమి నిజంగా తిరుతున్నట్లు !
పగలుకు పగలు - రాత్రికి రాత్రి
సరికి సరి తూకం వేసినట్లు !
అద్దంలో ముఖం సామూహిక
ఆనందంతో లేదు --
చోద్యం
ఏదో గోడకు అతికినట్లు ముఖం
నగరమైన -పేరుఎడారే
తప్పిపోయిన తోవలు
ఎవరు దొరుకుతారు !
మన చేయి మనమే పట్టుకుని
మన కాళ్లను మనమే
నడిపించుకోవాలి !
పదిలం సుమా !
ఉభయ కుశలోపరి
అని ఎప్పుడు అంటామో !
ఈ పదం కొత్తగా వింటున్నామా
కాదు పాత పాత పాతది !
ఈ తరానికి కొత్త పదమేమో
- కందాళై రాఘవాచార్య

cbs చెప్పారు...

*************
*మెరుపులు*
1.అహా కొరోనా..
ఏమి నీ ఘనత
గంగ ప్రక్షాలమై
ప్రవహించుట చేత

2.వలస కూలీలు
వల వలలు అట
మందు బాబుల
విలవిలలు ఇట

3.చట్టి ముక్కు చినీలు
కోరిక తీరగ
లోకమెల్ల ముక్కులకు
ముసుగు తొడిగిరి

4.నమ్మకం వుంటే
మౌనమైనా మధురం
లేదా చిన్న మాటే
మారణాస్త్రం

5.సత్యం పలికితే
మెచ్చేదెవరు
నిత్యం చస్తే
ఏడ్చేదెవరు
.
6.తాటి చెట్టు
ఎంత చిన్నది ఎందుకు
ఇంత నీడైనా
ఇవ్వలేనందుకు
లలితా భాస్కర దేవ్
27-7-2020
****************

cbs చెప్పారు...

***************
నీవు కూడా........

రక్త స్పర్శ రాక్ష్సత్వాన్ని
బోధిస్తున్న వేళ
బంధుత్వం రాబందు
గీతాన్ని ఆలపిస్తున్న వేళ
సంస్కృతికి తిలోదకాలిచ్చి న వేళ
సాంప్రదాయాన్ని మొక్కు
బడిగా పాటిస్తున్న వేళ
ఆస్తీ అంతస్తుల కోసం
ధన దాహంతో జనం
పోటీ పడుతున్న వేళ
వనాల్ని నరికి పర్యా
వరణాన్ని కాలుష్యం
చేస్తున్న వేళ
వన్య ప్రాణులను సైతం
చంపి వ్యాపారం కొనసాగిస్తున్న వేళ
కల్తీ మయం తో జగతి
కడకు తన ఉనికినే
ప్రశ్నార్థకమ ని చాటుకున్న వేళ
అతిధి కను మెరుగైన వేళ
అయిన వాళ్ళు కాని
పనికిరాని వాళ్ళుగా
మారిన వేళ
గౌరవ మర్యాదలు అన్నవి ఆస్తీ అంతస్తూ
అధికారం ధన దాహం ముందూ మోక రిల్లు తున్న వేళ
భక్తి అన్నది పాపాన్ని
కడు క్కోవ డానికే నని
చాటు తున్న వేళ
ప్రేమ ఆప్యాయత లన్నవి
ఎడారిలో ఎండమావి తీరుగా గోచరిస్తున్న వేళ
ఋతువులు సైతం గతులు తప్పు తున్న వేళ
మానవుడు కూడా దానవుడు గా రూపాంతరం చెందుతున్న వేళ
కరోనాలు డెంగ్యూ లు
ఫ్లూ లు.... ఇలా... ఇలా....ఇలా....ఇంకా...
ఇంకా...ఎన్నో... ఎన్నెన్నో..మానవుడి వింత ప్రవర్తన తీరుగానే
విచిత్ర వ్యాధులు మాత్రం
శోకవా.......
అందుకే.. ఓ... మానవాి..
ఇకనైనా నీ వింత స్వార్థ
విచిత్ర వికృత బుద్ధిని
మార్చవా... నీ కోసం కాదు నిన్ను నమ్ముకు
నీ పైనే ఆధారపడ్డ నీ
కుటుంబం కోసం
నీ చుట్టూ ఉన్న సమాజం కోసం,.....
నీ వూరు కోసం.....
నీ వాడ కోసం.....
నీ జిల్లా కోసం....
నీ రాష్ట్రం కోసం....
నీ దేశం కోసం....
కడకు ఈ జగతి కోసం
నువ్వు నడుం కట్టి
దూరాన్ని పాటిస్తూ
శుభ్రత ననుసరిస్తూ
రేపటి నవ సమాజం
కోసం
నీవు కూడా ప్రపంచాగ్నికి
సమిధవై ఆహుతి ఔ తా
వని
ఈ కరోనా మహమ్మారిని
నీవు కూడా తరిమి కొడతావని
ఈ వసుధైక కుటుంబానికి నీ వంతు
సాయ మందిస్తావనీ..........
దోస పాటి.సత్యనారాయణ
మూర్తి.9866631877.
************

cbs చెప్పారు...


స్నేహమే...
మల్లేలల్లే వాడిపోనిదీ
మంచి గంధ మల్లె ఇగిరిపోని దీ
కప్పుర మల్లె కరిగి
పోనిదీ
కడలిలా అంతు చిక్కని దీ
కాఫీ కన్నా అతి చిక్కని దీ
కాపీ కన్న మచ్చ్చుకు
చిక్కని ది
పన్నగము కంటే పవరైన దీ
నక్షత్ర మల్లె తళుకు
మనే ది
వెన్నెల ల్లే వెలుగును చూపేదీ
కోకిల గీతమల్లే ఆహ్లాదాన్ని ఇచ్ఛేదీ
అన్నమయ్య గీతమ ల్లె
పరవశా న్నందించే దీ
సృష్టిలో అతి గొప్పదీ
ఈ స్నేహమే...
దోస పాటి.సత్యనారాయణ
మూర్తి.9866631877.

cbs చెప్పారు...

యశస్సును.......

ఊపిరి ఉన్నంత వరకే
ఊసులాడు కో వడాలూ
ఉన్నదంతా దోచుకో వాలనే ఊహలూ
ఉసురు పోయింతరావా త ఉందామన్నా ఉండలేం
అంతటితో బంధం సరి
మానవ సంబంధాలకు వురి
ఆపై ఆప్యాయత అనురాగాల మాట సరే సరి. నిజంగా అపుడు
నీవో చిత్తరువు వి
చిత్రంగా మాల వేస్తే
సుమంగా సుమధురంగా
వెలిగి పోయే చిత్రానివి
లేకుంటే అగరు ధూపం
లేకున్నా ఆపై సుమ మాల వేయకున్నా
ని జంగా నీ రూపం నీ
చిత్రం వర్ణాతి వర్ణం
బంధాలు అనుబంధాలు
భౌతికంగా నీవు ఉన్నంత
వరకే
ఆపై నీవు లేకున్నా
మిగిలేది నీ చరితమే
మంచిదైతే మనుగడ
సాగిస్తుంది
చెడ్డ దైతే అంతటితో
ముగుస్తుంది
అందుకే నే నం టా....
నీటి బుడగ జీవితం
దానిపై పెంచకు మమకారం
ధర్మం తో జీవిస్తూ
సత్య వ్రతాన్ని ఆచరిస్తూ
నీతిగా నిలవడమే
మానవత కు నిదర్శనం
అందుకే ఓ మానవా
మేలుకో
జీవిత పరమార్థాన్ని తెలుసుకో
వసుధైక కు టుంబ మై
మిగిలి పో
ఈ భువిన నీ చరితను
ఆచం ద్రతారార్కమై
నిలిచేలా చూసుకో.
దోస పాటి.సత్యనారాయణ
మూర్తి.9866631877.

cbs చెప్పారు...

స్నేహమే...
మల్లేలల్లే వాడిపోనిదీ
మంచి గంధ మల్లె ఇగిరిపోని దీ
కప్పుర మల్లె కరిగి
పోనిదీ
కడలిలా అంతు చిక్కని దీ
కాఫీ కన్నా అతి చిక్కని దీ
కాపీ కన్న మచ్చ్చుకు
చిక్కని ది
పన్నగము కంటే పవరైన దీ
నక్షత్ర మల్లె తళుకు
మనే ది
వెన్నెల ల్లే వెలుగును చూపేదీ
కోకిల గీతమల్లే ఆహ్లాదాన్ని ఇచ్ఛేదీ
అన్నమయ్య గీతమ ల్లె
పరవశా న్నందించే దీ
సృష్టిలో అతి గొప్పదీ
ఈ స్నేహమే...
దోస పాటి.సత్యనారాయణ
మూర్తి.9866631877.

cbs చెప్పారు...

స్నేహమే...
మల్లేలల్లే వాడిపోనిదీ
మంచి గంధ మల్లె ఇగిరిపోని దీ
కప్పుర మల్లె కరిగి
పోనిదీ
కడలిలా అంతు చిక్కని దీ
కాఫీ కన్నా అతి చిక్కని దీ
కాపీ కన్న మచ్చ్చుకు
చిక్కని ది
పన్నగము కంటే పవరైన దీ
నక్షత్ర మల్లె తళుకు
మనే ది
వెన్నెల ల్లే వెలుగును చూపేదీ
కోకిల గీతమల్లే ఆహ్లాదాన్ని ఇచ్ఛేదీ
అన్నమయ్య గీతమ ల్లె
పరవశా న్నందించే దీ
సృష్టిలో అతి గొప్పదీ
ఈ స్నేహమే...
దోస పాటి.సత్యనారాయణ
మూర్తి.9866631877.

cbs చెప్పారు...

నా తెలుగు ప్రజల........

సప్త గిరులపై వెలసిన
శ్రీ శ్రీనివాసుని నే కన్నప్పుడు
తిన్నడైన కన్న డికి మోక్ష
మొ సగిన సాలెపురుగు+పాము+యేనుగు లకు కైవల్య
మొసగిన శ్రీ.... కాళ......
హస్తీస్వరుని నే వీక్షించి
నప్పుడు
పాతాళ గంగ మ్మ సాక్షిగా
బ్ర మరాంబాసహితుడైన
శ్రీ మల్లి కా ర్జునుని నే
దర్శించి నప్పుడు
గోదావరి తరంగమంటి
వేద ఘోషను నే విన్నప్పుడు
అమర ధామ మనిపించే
రాజ మహేంద్రిని నే
కన్నపుడు
దక్షిణ కాశి యైన ద్రాక్షారామ భీమేశ్వరుని
నా సర్వేశ్వరు ని తలచి
పూజించి నప్పుడు
పంపా తీరాన భక్తుల
కోర్కె లీ డేర్చే రత్నగిరి
పై వెలసిన అన్నవర
సత్యనారా యణుని నే
మనసారా కీర్తించి
నప్పుడు
సకల జనుల కూ తన
మహిమను చాటి ఉగ్రరూ పుడై సింహాద్రి పై
నిలిచిన సింహా చలేసుని
నే స్తుతించి నప్పుడు
కృష్ణమ్మ గల గల లో
కేదారాల న్నీ సస్య శ్యామల మైనప్పుడు
ఇంద్రకీలాద్రిపై వేంచేసిన
విజయ వాటిక లోని
శ్రీ కనక దుర్గా మల్లి కార్జునులను నే మనసారా ప్రార్థించి నప్పుడు
రాయల వైభవాన్ని చాటే
తుంగభద్ర ఉత్తుంగ తరంగమై ఎగసి నప్పుడు
గున్న మావి కొమ్మ పైని
కోకిలమ్మ కూసి నప్పుడు
అజంతా ఎల్లోరా గుహ
ల్లోని అందాలన్నింటి నీ
నే తరచి నప్పుడు
యెచ్చట గాంచినా
యే చరిత ను గన్నా
ఈ జన్మకు ఇది చాలు
అనిపించే రీతిలో
అందందే నా తెలుగుజాతి కీర్తి
నా తెలుగు ప్రజల భక్తి
నా తెలుగు ప్రజల ఆర్తి
నా తెలుగు ప్రజల ప్రగతి
నడయా డు తున్నప్పుడు
నేనే మని వచి ఇంతు
నా తెలుగు జాతి కీర్తి
నేనేమ ని కీర్తీం తు
నా తెలుగు జాతి
నా తెలుగు భాష
నా తెలుగు ప్రజల
ఔన్న త్యాన్ని గూర్చి.....
దోస పాటి.సత్యనారాయణ
మూర్తి.9866631877.

cbs చెప్పారు...

జుగల్ బందీ
=================
అసాధ్యం ----
కన్నీటిని ఆచితూచే రాళ్లేవి ?
నిత్యజాగృతమైన
నీ నా ఒక్క సున్నిత హృదయానికే సాధ్యం ---
రాలిపడే ఒక్కో కన్నీటిబొట్టుకు
స్పందనగా ప్రతి స్పందనగా
పడి పడి కొట్టుకునే హృదయానికే తెల్సు
నాడీ పట్టుకుంటే సాక్ష్యం !
కన్నీరులో హృదయం --
హృదయంలో కన్నీరు !!
- కందాళై రాఘవాచార్య
హైదరాబాద్

cbs చెప్పారు...

*మహానీయుని మాట*🍁
-------------------------
ఎంత తక్కువ మాట్లాడితే అంత విలువ
ఎంత తక్కువ ప్రేమిస్తే అంత మనఃశాంతి
ఎంత దూరంగా ఉంటే అంత గౌరవం
ఎంత హద్దుల్లో ఉంటే అంత మర్యాద
ఎంత తక్కువ ఆశిస్తే అంత ప్రశాంతత.
-------------------
🌹 *నేటీ మంచి మాట* 🌼
---------------------------
గతం ఓ గుణపాఠం.
వర్తమానం ఒక అవకాశం.

cbs చెప్పారు...

కవితా శీర్షిక : "మధర స్మృతులు"

మదిలో భావాలు అనుభవాలు
మధుర ఘడియలు
ఆశీస్సులే తుది వరకు
రెండు దశాబ్దాల రైలు ప్రయాణం లా
ఆనాటి కళ నిజం చేసినట్టు
నా స్నేహం సజీవంలా మిగిలింది
స్పూర్తి మిగిల్చిన జ్ఞాపకం నాలో
ఇప్పటి వరకు నిజంగా సజీవంగా
జీవన యాత్రలో మలి మలుపు
పేరును సార్థకత చేసి
చెరని గూడును నాకై మిగిల్చి
సాగిపో నదిలా ప్రవహిస్తూ
జీవన యానంలో సరిగమలు
పదనిసలే జీవన ధ్యేయంగా
సంఘమంలో కలుద్దాం నేస్తమా
ఆనందాన్ని ఉత్సాహాన్ని నెమరేసుకుంటూ
ఆటుపోటుల కదలికలో
ప్రతి అడుగు మార్పును కాంక్షిస్తూ
దూరాన ఉన్నా కళ్ళలో నీ ప్రతిబింబం
మదిలో చెరగని గూడు కట్టిన నేస్తం
ఓ నేస్తం ప్రియనేస్తం
కలకాలం ఉండాలి నీ స్నేహం
కథలు కళలు సరాగాల జీవితం
మరపురాని మధుర స్మృతులు
రచన: డా.ఆలూరి విల్సన్
చరవాణి:9396610766

cbs చెప్పారు...

స్నేహం......

బాషకందని భావమై
ఊహకందని స్పూర్తి యై
పాటకందని మాధుర్యమై
మాటకందని మమతయై
మమేకమయ్యేది స్నేహం....

కష్టమందు ఓదార్పై
సుఖమందు భాగస్వామ్యమై
సమస్యకు సమాధానమై
చీకటిలో వెలుగు కిరణమై
సహచర తత్వ గమనమే స్నేహం...

ఆశయాల అరవిందమై
హృదయమునకు ప్రతిబింబమై
అనుభవాల అమరిన అలంకారమై
ఊహల ఊపిరిగా సాంత్వన చేకూర్చేది స్నేహం...

చెంతనిలిచి, వెంటనడచి
చేయిపట్టి త్రోవచూపి, అలసిపోక అడుగేస్తూ
కడవరకూ సాగిపోయే ప్రయాణబంధమే స్నేహం.....

.....డాక్టర్ దేవులపల్లి పద్మజ

cbs చెప్పారు...

స్నేహమే అమృతం

అన్ని బంధాలలో అద్భుతం స్నేహం
అనుబంధాలలో పటిష్టమైనది స్నేహం
అన్నివేళలా అంటివుండేది స్నేహం
అపురూపమైన వరం స్నేహం.

ఆనంద సాగరమే అందరికీ స్నేహం
ఆకర్షణ మంత్రానికి విరుగుడు స్నేహం
ఆవేదన గాయాలకు వైద్యం స్నేహం
ఆదుకునే హస్తానికి రూపం స్నేహం.

ఇద్దరుంటే చాలు ఇహమే స్వర్గం
ఇదీ అదీ అని చూడదు ఇద్దరి హృదయం
ఇక్కడ అక్కడ అంటూ చూడదు స్థానం
ఇదే నాకు ఇష్టమని చెప్పదు నేస్తం.

ఈనాటికి నానాటికీ నలగదు స్నేహం
ఈ రోజూ ఏ రోజూ నిలుచును స్నేహం
ఈతి బాధలన్నిటికీ ఎక్కం స్నేహం
ఈ రీతిని ఎదురీదితే జీవితం సుగమం.

ఏమైనా భుజం తట్టి నడిపే దైవం
ఏ క్షణం వీడకుండా నడిచే స్నేహం
ఏకాకిని చేయకుండా సాగును మిత్రం
ఏనాటికైనా వీడని బంధం స్నేహం.

అందరికీ అవసరమైన అమృతం

రచన : తుమ్మ జనార్ధన్, (జాన్)

cbs చెప్పారు...

ఇండో చైనా సరిహద్దుల్లో
ఒంటిని కొరికే చలిముద్దల్లో
తుపాకి మోతల సడి సద్దుల్లో
పొద్దే గడవని అర నిద్దర్లో
ముద్దుల చెల్లెలు గుర్తుకు వస్తే

రాఖీ పున్నమి రానే వస్తే
రావా అన్నా.. రాఖీ కడతా..

రక్షణ బాధ్యత నీదే తెలుసా
సరిహద్దైనా, సోదరిదైనా!!
దేశం కోసం దేహం, ప్రాణం
బంధం కోసం కాస్త అనురాగం
మోస్తే రెండూ బాధ్యతలేగా!!

రాఖీ పున్నమి రానే వచ్చే
రావా అన్నా.. రాఖీ కడతా..

ముద్దబంతుల తోరణాలతో
ముద్దుల అన్నకు స్వాగతమ్..
హద్దులులేని అనురాగానికి సరిహద్దులు అడ్డుగ రాబోవులే
జ్ఞాపకాలతో ఈ పొద్దు గడుపుతా
రాఖీ పండుగ రోజే వస్తే
రక్షగ నీకు రాఖీ కడతా..

నీ దేశభక్తి యావత్ జాతికి రక్ష!!
నా ప్రేమ శక్తి నీ ప్రాణానికి రక్ష!!!

రక్షాబంధన్ శుభాకాంక్షలతో..🌹🌹🌹🌹
గోపాలకృష్ణ
ప్రిన్సిపాల్
శ్రీ వంశీధర్ హైస్కూల్, నాదర్గుల్.

cbs చెప్పారు...

మీకోసం ఒక చమత్కార పద్యం

కం. అంచిత చతుర్ధ
జాతుడు
పంచమ మార్గమున నేగి ప్రధమ తనూజన్
గాంచి, తృతీయం బక్కడ
నుంచి, ద్వితీయంబు దాటి నొప్పుగ వచ్చెన్!!

భావం: గొప్పవాడైన నాల్గవ వాని కుమారుడు ఐదవమార్గంలో వెళ్ళి మొదటికుమార్తెను చూసి, మూడవదానిని అక్కడ ఉంచి, రెండవ దానిని దాటి వచ్చెను.

ఏమీ అర్థం కాలేదు కదా! ఈ పద్యం అర్థం కావాలంటే పంచ భూతాలతో అన్వయించి చెప్పుకోవాలి. పంచభూతాలు
1) భూమి
2) నీరు
3) అగ్ని
4) వాయువు
5) ఆకాశం.

ఇప్పుడు పద్యం చాలా సులభంగా అర్థం అవుతుంది చూడండి.
చతుర్థ జాతుడు అంటే వాయు నందనుడు,
పంచమ మార్గము అంటే ఆకాశ మార్గము,
ప్రధమ తనూజ అంటే భూమిపుత్రి సీత,
తృతీయము అంటే అగ్ని ,
ద్వితీయము దాటి అంటే సముద్రం దాటి ఇప్పుడు భావం చూడండి.

హనుమంతుడు ఆకాశమార్గాన వెళ్ళి సీతను చూసి లంకకు నిప్పు పెట్టి సముద్రం దాటివచ్చాడని భావం.

ఇటువంటి పద్యాలే తెలుగుభాష గొప్పతనం నిలబెట్టేవి
అదీ తెలుగు సంస్కృత భాషల గొప్పతనం.

cbs చెప్పారు...

అది వ్యర్ధమే

అమ్మను కనని జన్మ
అమ్మను కనలేని జన్మ
ఉన్నా అది దండగే
శిశువుల దశనుండీ
వార్ధక్యమొచ్చే వరకు
సృష్టిలోని ప్రతీ జీవిని
ఆలించి లాలించి పాలించికడకు
పురోభివృద్ధిని
కాంక్షించి
జగతిని చూపిస్తున్నది
జగతిని లాలిస్తున్నది
జగతిని పాలిస్తున్నది
జగతి శ్రేయస్సును
కాంక్షిస్తున్నది
మాతృమూర్తిగా
దేశ మాతగా
జగన్మాతగా
లలితగా
అన్నపూర్ణగా
శారద గా
లక్ష్మిగా
ఇలా ఇలా ఇలా
ఒకటనేమిటి
చివరకు శ్రీమాత్రే నమః
అంటూ
అమ్మ వివిధ రూపాల్లో
సాక్షాత్కరిస్తూ

ఈ జగతి పురో

కాంక్షిస్తూ చరియిస్తోంది
అందుకే నే నంటా
అమ్మను కనని జన్మ
అమ్మను కనలేని జన్మ
అమ్మ లేదన్న జన్మ
ఉన్నా అది వ్యర్ధమేనని

దోసపాటి సత్యనారాయణ మూర్తి
రాజమహేంద్రవరం
9866631877

cbs చెప్పారు...

సన్న్యాసాశ్రమం స్వీకరించిన ఆధ్యాత్మిక గురువుల చేతిలో ఉండే దండము ధర్మానికి ప్రతీక. వారిని కొలిచే భక్తులను గురువు గారి దండము కాపాడుతుందనే భావనతో వ్రాసాను. వ్యాకరణ, ఛందో దోషములు యున్నచో, పండితులు పెద్ద మనసుతో సరిచేసి నన్ను అనుగ్రహించెదరని ఆశిస్తున్నాను.

శ్రీ గురు దండాయుధ స్తోత్ర పంచకం (కంద పద్యములు)
===

1. దండము సుర రక్షాకర
దండాయుధమునకు చిత్ర తాండవ మహిమా
గాండీవమునకు హరి కో
దండమునకు మద్గురుని త్రిదండమునకిదే

2. దండన సేయగ షణ్ముఖ
దండము శివ మహితము హరి దంష్ట్రాయుధమౌ
ఖండించగ రిపు మూకల
చండీ ఖడ్గము కొలువుమచంచల భక్తిన్

3. అండగొను భక్తజనులకు
పాండు ప్రమేహ జ్వర వాయు పాంగుట్టు మహా
గండములు కల్గవిక గురు
దండము రక్షించు పెద్ద దండ్రియె గొల్వన్

4. గురుని కర స్పర్శ వలనన్
విరివిరిగ సుగుణములబ్బె విద్యలు గల్గెన్
తరయించె దండము నిజము
కరములు మొగిడించ మరి సకలమౌ మనకున్

5. అనుదిన గురు రక్షాకర
ఘనతర దండమును దలచి కనుగొను మదిలో
అనవరతము శాంతి, దయా
ఘనుడు మనల గాచును మురుగన్వేల్వోలెన్

ends

cbs చెప్పారు...

శవం నడిచిపోతే ఎంత బాగుండు !!
=============================
అవును ! శవం తనకు తాను
నడిచి పోతే ఎంత బాగుండు !
శవం తన చివరి మజిలీ ఐన వల్లకాడుకు
తనకు తానే తడబడకుండా పోతే
ఎందరెందరికో బాగుండు !
ఎవరికీ కనబడకుండా
ఎవరినీ భయపెట్టకుండా
ఆ నల్గురికీ భారం కాకుండా
చికిత్స చేసిన వారికీ చిక్కులు రాకుండా
శవం తనకు తానే పరుగులు పెడ్తూ
కాంతి వేగంతో
తన ఊరి హరిశ్చంద్రఘాట్ కు
తరలి పోతే ఎంత బాగుండు !
అందరికీ నిశ్చింత
తనకు తానే ఏడడుగుల గోయ్యి తవ్వుకుని
దూకి చచ్పినట్లు పూడ్చుకుని
అంతమైపోతే ఎంత బాగుండు !!
- కందాళై రాఘవాచార్య
8790593638

cbs చెప్పారు...

*సత్తా ధర్మం, సత్య మర్మం.
* *తప్పుముప్పుకానీక,/ విజయానికిమొదటిమెట్టంటాం,/ఒప్పుకితప్పునిసరిచేసేదే,
నిజానికితొలిమెట్టుగెలుపుకి.*
*సృష్టిఅద్భుతం,ప్రకృతిధర్మం,/సృజనగతిశీలం,విధివిధానం.
సూర్యోదయం,అస్తమంచిత్రం,
ఉదయించివెలుగుండిపోదని,అస్తమయంచీకట్లుండిపోవని,
తెలిసినకర్తవ్యందేమేలుజీవనం.
సకాలంచేతన,అకాలంసాధన,
సమసంయమనం,లోకగమనం,*డా.వేదుల శ్రీ రామశర్మ"శిరీష'
*సంకల్ప్ కరోనా* *వరమంటాం కరోనావికృతి, తరాలసంస్కారం ప్రకృతిని, మరలగుర్తుచేస్తూ ధర్మాన్ని.
వరమేఅసమర్ధపాలనానికి.
కట్టడిరక్షణలేక జనంకిశాపమే.
క్రమశిక్షణతో విలువలకాలమై,
కర్తవ్యశీలంవెలుగుల జీవనమే. ప్రయత్నిస్తూప్రగతీ,ప్రశాంతతే.*
+91 98660 50220: సవ్యసంయమనం,లోకగమనం.డా.వేదుల'శిరీష

cbs చెప్పారు...

*ఆదిత్య హృదయం*??
••••••••••••••••••••••••••••••••••
*సూర్యుడు అస్తమయంగా*
నీరెండలోనైనా ఎందరెందరినో
*మరి మరీ చూసుకుని*
పోతున్నాడు దయాపామురంగ
*ఉదయమయే సరికి*
పొద్దెక్కిన ఎండలోనూ
*కొందరే కనిపిస్తున్నారు*!
వేయి కిరణాలతో లెక్కపెట్టినా
*తక్కువ తక్కువే*
*లెక్కతప్పడంలే* --
ప్రతి అస్తమయం తరువాత
*మళ్లీ ఉదయం వేళకు*
సూర్యుడికి భయం భయమే
రోజు రోజుకూ
తక్కువ తక్కువ లెక్కలదస్త్రం !?
*భూమ్మిది మనుషులు*
*ఏమైపోతున్నారు*? --
నాల్గు దిక్కులను నమ్మగలమా
*ఆదిత్య హృదయం*
గాలి గాలి అలల కొలనులోని
పద్మంలా తాపతాపంగా
ఎలా కొట్టుకుంటుందో !!
అస్తమయానికి ఉదయానికి
ఆదిత్య హృదయం కందికంది
ఎరుపెక్కి ఏడ్పు మొగులు !
- కందాళై రాఘవాచార్య

cbs చెప్పారు...


శ్రీ కృష్ణ మిత్రమా సుధామా
పరమాత్మ చిన నాటి నేస్తమా
పురాణాలలోఎన్నోస్నేహా
బంధాలు చదివినాము
కానికుచేలా మీలాంటి స్నేహంలేదు
ద్రోణ ద్రుపదులస్నేహం
అనురాగంలేని స్నేహం
రామ సు గ్రీవుల స్నేహం
రమ్యమైన స్నేహం
దశరధ జటాయులస్నేహం
ఆద రణ తో కూడినస్నేహం
కర్ణధుర్యోధనులస్నేహం
చెడునడత గలస్నేహం
కాని కుచేల మీ స్నేహం
పరమపవిత్రమైనస్నేహం
కుచేలానీకు ఆదిదేవుని ఆహ్వనం
అమ్మవారు నీరుపోయటం
ఆదిదేవుడునీ పాదాలుకడగటం
నీవిచ్చిన అటుకులు తినటం
నీకు సంపదలు లివ్వటం
ఆహా సుధామా నీవు ధన్యడవు
పూజింపదగినవాడవు
కృష్ణ సఖా మీ స్నేహం
పరమపవిత్ర మైనది
ఆదర్శవంతమైనది
ఇట్లు
జయలక్ష్మి

cbs చెప్పారు...

[10:14 am, 14/08/2020] +91 95500 40618: చం:ఘనతర ఘూర్జరీ కుచయుగక్రియగూఢముగాక,ద్రావిడీ,
స్తనగతి తేటగాక యరచాటగు నాంధ్ర వధూటిచొక్కపుం,
జనుగవలీల;గూఢతయుజాటుతనంబునులేకయుండజె,
ప్పినయదెపో కవిత్వమనిపించునగిఃచటు గాక యుండినన్.
[10:14 am, 14/08/2020] +91 95500 40618: చం:నిరుపహతి స్థలంబు రమణీ ప్రియ దూతిక తెచ్చి యిచ్చుక,
ప్పుర విడె మాత్మకింపయిన భోజనముయ్యెల మంచమొప్పుత,
ప్పరయు రసజ్ఞులూహ తెలియంగల లేఖక పాఠకోత్తముల్,
దొరకిన గాక యూరక కృతుల్ రచియింపుమనంగ శక్యమే!

cbs చెప్పారు...


పll ఈ రతనదేశమే మముగన్న దేశం
మముగన్న దేశమే- మా భరతదేశం ll
అlపll ధరనున్న సురసీమ - ధైర్యశౌర్యలలామ
సతతసస్యశ్యామ - సుఫల సంపద్గ్రామl llఈll
1. వేదఋషి వాఙ్మయము - విజ్ఞాన విస్తృతము
సాధనగ సంస్కృతిని చక్కదిద్దినతల్లి
విద్దెలను సుద్దులను - వివిధకళలను పొదివి
విరచించి నేర్పినది విపులకల్పకవల్లి llఈll

2. సత్యమును ధర్మమ్ము - సహజగుణములు గాగ
సర్వభూతహితమ్ము నిర్వచించిన పృథ్వి
శాంత్యహింసయు నోర్పు - సమభావమును నేర్పు
నిత్యవిధి యజ్ఞములు - నిర్వహించిన సాధ్వి llఈll

3. ఒక రాముడొక కృష్ణు డొకహరిశ్చంద్రుడు
ఒకబుద్ధుడొకసిద్ధు డొక ఆదిశంకరుడు
ఒకశివాజియు, రాణ, ఒకబోసు ఒక గాంధి
లోకహితమున కిడిన మాజనని కానుకలుll llఈll

4. బహువేష భాషణల - బహుసంప్రదాయముల
ఆసేతు శీతాద్రి - ఆత్మీయ భావనల
బాహ్యాంతరములందు - భారతీయత వెలయ
అలరారుచున్న మా - అనురాగనిలయ llఈll

5. మా స్వయం ప్రతిపత్తి మాననీయుల స్ఫూర్తి
మా పుణ్య ఫలమైన మాయమ్మ ఘనకీర్తి
మా మేధ మరగించి మాశక్తి కరిగించి
మా ప్రాణమిడియైన మహినిల్పుకుంటాము llఈll

జై భరతమాత
జై భరతమాత
జై భరతమాత
******************
శంభుప్రసాద్

cbs చెప్పారు...

*******************
ఎగరాలని ఉంది నాకు
మువ్వెన్నల జెండా...


ఎగురుతుంది ఎగురుతుంది
మువ్వెన్నల జెండా

కూడు లేక, గూడు లేక
కట్టుకోను గుడ్డ లేక....
రాజ్యాంగం నమ్ముకోని బతుకుతున్నదెందరో....

ఆకలి దప్పికలతో
అలమటిస్తున్నట్టి.....
రోడ్డుపక్క బిచ్చమెత్తె
బిక్షగాళ్ళ సాక్షిగా...

ఎగురుతుంది ఎగురుతుంది
మువ్వెన్నల జెండా

రాజకీయ మోసాలు....
కాంట్రాక్టుల ఆగడాలు
బలవంతుల దౌర్జన్యం...
రౌడీల రాక్షసత్వం...

చట్టాలను చుట్టాలుగా...
న్యాయాన్ని నరికివేస్తూ
దళారుల దోపిడీలు,
పిడిత ప్రజల సాక్షిగా...

ఎగురుతుంది ఎగురుతుంది
మువ్వెన్నల జెండా

శాంతియుత సమాజంలో
ఆర్ధిక సమానత్వంలో...
కులరహిత సంఘంలో
కుళ్ళు కుతంత్రాల కతీతంగా...

రాజ్యాంగం సాక్షిగా...
రాజకీయ రహితంగా...
త్యాగధనుల ఆశయం
ఆ అమరుల సాక్షిగా...

ఎగరాలని ఉంది నాకు
మువ్వెన్నల జెండా...
ఎగరాలని ఉంది నాకు
మువ్వెన్నల జెండా...

74ప స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలతో

మీ
*అవ్వా లక్ష్మీ నరసింహ రావు..

cbs చెప్పారు...

దేశభక్తి గీతం***🔯
పల్లవి:-
సుందర సుమధుర దేశం మనది
సుశ్లోకమ్మగు యశస్సు గలది
కాశ్మీర్ మొదలు కన్యాకుమారి
కన్నులకింపగు ఆకృతి హారి.
*సుందర*
చరణం---1.
కన్యాకుమారి పాదాలనగా-కాశ్మీరమ్ము మస్తకమేగా
గుజరాత్ మరియు ఈశాన్య ప్రాంతం-
భుజములు కాగా పూర్ణభారతం.
*సుందర*
చరణం---2.
గంగా యమునా గోదావరితో
వింధ్య హిమాచల నగముల సిరితో
సస్యశ్యామల కర్షిత రుచితో
భిన్న మతముల వేదిక యనదగు
*సుందర*
చరణం---3.
వేదనాదము శ్రవణపేయమై
క్షేత్రదర్శనం నేత్రపర్వమై
బహువిధ సంపద వారసత్వమై
వెలుగులీనుచు విశిష్టమైన
*సుందర*
రచన:భోగయగారి. చన్ద్రశేఖరశర్మ
9440044142.*
***************

cbs చెప్పారు...

ఉ.
చిత్తము చంచలమ్మగుటచే నది నీ పదపంకజమ్ములన్
గుత్తగ యుండు తేనెలను గ్రోలగ చెంతను యున్ననైన తా
నత్తఱి త్రావలేక పలు యైహికభోగము లంచు బోవు, నీ
మెత్తని దృష్టిజాలముల మెల్లగ దారికి తెమ్ము శాంకరీ!
✍️శ్రీశర్మద.

cbs చెప్పారు...

శీర్షిక:భవ్యబాటబాసటకై..
*ఆన్ లైన్ల హీరోహీరోయిన్లుగా,
అందరిప్పుడు సెలబ్రటీస్ లే.
ఇంటిటింటిశ్రమవీడియోల్లో,
ఇతిహాసంమించి ఎపిసోడ్లు.*
*పరిశ్రమించినాఫలితమందని,
పంచే సుగుణంలేనీదోపిడీలు,
భ్రమల్లో ముంచి,పబ్బంగడిపే,
బడాతారలంమనే ఫోజులు.*
*వెర్రి వేయివిధాలవిర్రవీగుతూ,
ధర్మనీతుల సుధలుపంచుకోక,
కర్మరీతుల పథముపెంచనీక,
సఖ్యతకు వేధింపు పర్వాలు.*
*సెల్ఫీలసెల్ఫిష్ల సంబరాలతో,
అల్పబుద్ధులఆడంబరమెంతో,
బానిసభావాలై స్వధర్మంవీడిన,
భేషజనాగరికం,స్వేచ్ఛాషోలు.*
*మనల్నిమనంకానీనిదార్లువీడి,మనసుమాయాబంధీలంకాక,
మానవబంధాల మనిషితనంకై,
మానవత్వగంధంమాధుర్యాలం.**-డా.వేదుల శ్రీరామశర్మ'శిరీష'
కాకినాడ.9866050220.

cbs చెప్పారు...

అంశం : మట్టియే తుదకు.....

జనన మరణాలు అన్ని జగన్నాటకం..
మధ్యలో జీవితమంతా ఓ బూటకం..
తుదకి మట్టిగామారే దేహంపై..
అంతులేని అభిమానం పెంచుకుంటూ..
సాగించే బ్రతుకు పోరాటంలో...
ఆరాటం..ఉబలాటంతప్ప మిగిలేది శూన్యం.
మట్టిని నమ్ముకున్న జీవితాలు...
అన్ని అమ్ముకుని జీవిస్తూంటే
మట్టిని అమ్ముకునే బ్రతుకులు
బంగారం లా మెరుస్తూన్నాయి..
కాలిమన్నంటని కారిడార్ పై కదిలే పాదాలు
కన్నుమూసి మన్నులో కలుస్తున్నాయి...
అందం...అహంకారం...ఆస్తుల ఆడంబరం..
కుల మతభేధాల్లేక మట్టిలో కలుసుకుంటున్నాయి
రాలే పండుటాకుని చూసి పచ్చిఆకునవ్వినట్లు
చితి చేరిన దేహాన్ని చూసి
***************

cbs చెప్పారు...

రామోవిగ్రహవాన్ ధర్మ
శ్రీరాముడుధర్మవిగ్రహుడు

శ్రీ్రామునినడతధర్మం
అన్నదమ్ములపైప్రేమ ఆదర్శధర్మం!
గురువుల ఆజ్ఞ పాటించినధర్మం
మునులను కాపాడిన ధర్మం
తండ్రి సమక్షంలో సీతమ్మనుపెండ్లి ఆడటం
వివాహధర్మం
రామప్రభుతండ్రిమాట
తలదాల్చటంధర్మం
నదినిదాటించినగుహునితో స్నేహధర్మం
రాక్షస సంహారం ప్రభుధర్మం
హనుమంతునిపై అనురాగం
సుగ్రీవునితోస్నేహధర్మం
వాలిని
చంపటంరాజధర్మం వానరసహయముతో.సముద్రమునుదాటటం రావణునిచంపటంఅవతారధర్మం
సీతమ్మతోఅయోధ్య చేరటం
అయోధ్యపాలనలో రాజధర్మం
ధర్మరక్షణకేరాముని అవతారం
శ్రీరామచంద్రునిధర్మావతారం🙏🙏🙏🙏
జయలక్ష్మి పిరాట్ల
*******************

cbs చెప్పారు...

*భూమి పురుగు పుట్ట* 😩
<<<<<<<<<<>>>>>>>>>
నిశ్చింతగా తిరిగే భూమాత
*ఇప్పుడు పురుగుకు పుట్టైంది*!
రాత్రి పగలూ *ధరణికి ఇదే రంధి*
యుగాల క్రితం
*తాపసుల పై పుట్టగా పెరిగే*
భూమి పురుగుతో పుట్టైంది
పుట్టలు పుట్టలుగా
మనుషుల పై
*ఏ నామ జపం చేయనీయక*
*ఊపిరిని మింగి మింగి*
పురుగు పుటుక్కునిపిస్తోంది
స్మశానాలు పురుగుపట్టి
చచ్చిన మనుషులతో పుట్టలే
భూమతకు ఎంత కడుపు కోతో
*పుట్టంతగా లేచిన శోకం*
నా అక్షరాలూ దుఃఖ భావనతో
పదాలు పదాలగా పుట్డలే కదా
ఏ శీర్షిక పెడితే ఆనందం ??
*పురుగుకు అగ్గి తగులా*
పురుగు పుట్వడి మీద పెద్ద బండ పడ --- పుట్టలు పుట్టలుకాకుండా !
పుడమి తల్లి ! ఏడ్వకు !
కందాళై అక్షర శాపం తగిలి
పురుగుకు అగ్గి తగులా !
అస్తు ! అస్తు !
- కందాళై రాఘవాచార్య


Xxxxcccc

*హైకూ:* 1*తెల్ల అందమే,
నల్లకల్వ గొడుగై,
వర్షంలో కన్నె.*
*2జాగారం రేయి,
నాలోజగం వెలుగై,
నీలోకి నేను.*
*3.ఎండావానలై,
హోంక్వారంటైన్ బిడియం,
అల్లం మిరియం.*
*4.విశ్వం కట్టడ్లం,
విషక్రిమి ముట్టనీం,
విశ్వాసం శ్వాసై.*.డా.శిరీష. కాకినాడ.

cbs చెప్పారు...

" గొప్ప మనసు"*
🕉️🌞🌎🏵️🌼🚩

*మనిషంటేనే....*
*అనంతమైన ..*
*అపారమైన...*
*లోతైన మనసున్నవాడు.....*

*మనసున్న మనిషి జీవితం*
*ఎప్పుడూ అయోమయం ....*
*గందరగోళం....*
*దుర్భరం....పాప పంకిలం*

*గడ్డలా పేరుకుపోయిన స్వార్థంతో....*
*ఘనీభవించిన ....*
*ఆ మనసుని కాస్త కరిగించి.....*
*కర్మయోగులుగా మార్చగలిగే*
*"శుభ్రత సైనికుడు కావాలి"....*

*క్షణక్షణం*
*అడుగులు తడబడుతూ....*
*కూలబడుతూ ...*
*సాగుతున్న సమరంలో ...*
*నూతన జవజీవాలు* *అందించే ...*
*తెల్ల పావురాల*
*రెక్కల నీడ కావాలి.....*

*గగనానికి ఎగసినా ....*
*శిఖరాగ్రాన నిలిచినా...*
*అడుగు నిలపవలసింది*
*నేల మీదేనని ....*
*చేరేది మట్టిలోనని ...*
*నిశీధి దారులను చెరిపివేసి*
*జ్ఞాన సుమాలు విరబూసే....*
*సహాయక వసంతాలు కావాలి......*

*కాలం వెంట కుతంత్రాలతో ...*
*ధర్మ వ్యతిరేక పనులతో...*
*చెలియలికట్టదాటి* *ఉరకలేస్తున్న*
*అసంతృప్తి సాగరాలను....*
*నియంత్రించి ....*
*దారిలో పెట్టగలిగే*
*రక్షక భటుడు కావాలి....*

*అస్తమయానికి*
*దారి వెతుకుతున్న*
*హృదయానికి .....*
*ఆపన్న హస్తం* *బోధపరిచింది ....*
*మనిషి అంటే*
*మట్టిలో నుంచి పుట్టిన*
*గొప్ప సత్యమని.....*

*సృష్టిలో ....*
*ప్రేమ ,దయ,కరుణ లాంటి*
*విలక్షణమైన గుణాలు ఉన్న*
*ఏకైక జీవి మనిషేనని ....*

*ఇతర జీవులతో పోలిస్తే*
*ఆపదలో ఉన్న సాటి వారికి*
*మానవత్వాన్ని చూపించే*
*"గొప్ప మనసు "*
*మనిషికి మాత్రమే* *ఉంటుందని.....*

("నేడు "ప్రపంచ మానవతా దినోత్సవం" సందర్భంగా)

cbs చెప్పారు...

గాలిలో దీపం

గాలిలో దీపం లాంటిదే
మనిషిలో లో ప్రాణం...

దీపం
గాలి వచ్చినా పోతుంది
ఎవరైనా ఆర్పినా పోతుంది
నూనె అయిపోయినా పోతుంది...

అలాగే మనిషి ప్రాణం కూడానూ...
రోగాల బారిన పడి పోవచ్చు
ప్రమాదాల భారిన పడి పోవచ్చు
ఆయుష్షు తీరి కూడా పోవచ్చు...

అందుకే...
దీపం ఉన్నంత వరకు ఎలాగైతే
నలుగురికి వెలుగునిస్తుందో...

మనిషిలో ప్రాణం ఉన్నంత వరకు
అలాగే సాయం చేస్తుండాలి...

అప్పుడే ఆ జన్మకు సార్థకత

మీ
గోగులపాటి కృష్ణమోహన్
కవి, రచయిత, జర్నలిస్టు
సూరారం కాలనీ, హైదరాబాద్
9700007653

జాన్ చెప్పారు...

కోకిలల మధ్య కాకిని
పండితుల మధ్య పామరుడిని
పంతుళ్ళ మధ్య పఠితుడను
జ్ఞానుల మధ్య అజ్ఞానిని
మిమ్మల్ని చదవడం నేర్వడమే నా పని.
...వందనాలు అందరికీ...

cbs చెప్పారు...

వాన*
---------- *లలితా భాస్కరదేవ్*
ఉరుములు లెేవు
మెరుపులు లేవు
చడీ చప్పుడూ లేకుండా
అదే పనిగా వదలక కురుస్తోంది
ఆకాశం కుమిలి కుమిలి
ఒకటే ధారయై కురుస్తోంది
కాలం కంట్లో నీరు ఉబుకుతుంటే మబ్బులేమో ఒబ్బిడిగా సాక్ష్యం
పలకలేక కరిగి చేసే మౌన రోదన
కన్నీటి బాటలు కనబడనీయకుండా
కురుస్తూ వలస పోతున్నాయి

ఆకారాలన్నీ నిరాకారమైనిశ్శబ్దంగా
కదిలి పుడమితల్లిఒడిలోచేరుతుంటే
పుట్టెడు దుఃఖాన్నీ దాచేస్తూ కురుస్తోంది వాన

పులుముకంటూ వసంత శార్వరి కట్టుకొచ్చిన ఆకుపచ్చజిడ్డు
గ్రీష్మపు వేడికి కరగ లేదు సరికదా
వర్షమై కురుస్తోంది.
పరవళ్ళు తొక్కే సెలయేళ్ళు వీక్షకులు లేక కన్నీళ్లే వచ్చి కలుస్తుంటే వరదలై పొర్లుతున్నాయి
బిక్కచచ్చిన గువ్వలన్నీ ఆశ్వీజ శక్తి కై ఎదురురు చూస్తున్నాయి.

(కళాప్రపూర్ణ, కృష్ణానంద డా. పోతుకూచి సాంబశివరావు గారి వర్థంతి సందర్భంగా నిర్వహించిన కవితల పోటీలలో ప్రథమ బహుమతిని పొందిన కవిత)

cbs చెప్పారు...

శ్రీ.చిల్లర కృష్ణమూర్తి గారు వ్రాసిన
# శివామృతలహరి శతకంలోని ఒక పద్యం;

మ||
మణిహారాంగద రత్నకంకణ లసన్మంజీర ముఖ్యాంగ భూ
షణముల్ వీడి భవుండదేల కడునిస్సంగత్వభావమ్మునన్
ఫణి భూషల్ ధరియించు? కుండలిని విస్ఫారించి యోగార్ధ తో
షిణి గావించి ఫణంబు విప్పుకొరకే శ్రీ సిద్ధలింగేశ్వరా!
(వాయుతత్వం)
భావం : సంసారం చేస్తూ సకల భోగభాగ్యాలతో తులతూగుతూ కూడా, జ్ఞానియైన వ్యక్తి
నిస్పంగుడుగా వుండగలడు. యోగాభ్యాసం ద్వారా మానవుడు తనలోని కుండలిని
శక్తిని మేల్కొలిపి షట్చక్రమార్గంలో ఊర్ధ్వగతిని కల్పిస్తే సహస్రారం విచ్చుకుంటుంది. ఆ
సహస్రారానికి సంకేతమే ఫణం. కుండలి అంటే పాము అనే అర్థం వుంది. ఈ యోగార్జాని
సంకేతంగా శివుడు మణిభూషల బదులు ఫణిభూషలు ధరిస్తాడు. శివుని భూషణములుగా
ధరియింపబడిన పాములు పడగలు విప్పి వుండడం గమ

cbs చెప్పారు...

*మట్టి వఠ్ఠి మాట కాదు*
➿➿➿➿➿➿➿➿
నిన్న భూమంత మట్టి
గణపతులు గణపతులుగా
పార్వతి ప్రాణప్రాణాలుగా
రూపవంతమైనందుకు
భూమాత భ్రమాణాలతో
పరవశ పరిభ్రమణాలతో
ఆనంద వర్ష వర్షం !
మట్టి వఠ్ఠి మాట కాదు
మొదటి వేల్పుగా
ఇంటింటి గణపతి !
మన దోసిట్లో మట్టి
మలుపులై మలుపులై
గణపతులైతుంటే
బ్రహ్మకైతే ఆశ్చర్యం
దివి దేవతలు జాతరగా
భూమ్మీదికే దిగివస్తున్నారు !
నా చేతులూ పావనమైనాయి
మట్టి గణపతిని చేసి -
నా చేతులు పవిత్రమైనాయి
మట్టి గణపతిని పూజించి
ఇప్పుడు వఠ్ఠి మట్టి అని
ఎవరైనా అనగలరా !
•••••••••••••••••••••••
కందాళై రాఘవాచార్య

cbs చెప్పారు...

గోదావరిపరుగు
౼౼౼౼౼౼౼౼౼
కొండలన్కోనలన్ బండలన్దాటుచున్
నిర్ఝరమ్మై కన్నె నీటుగొనుచు
వాగులన్ వంకలన్ సోగలౌనడకలన్
నాట్యకత్తియల చందమ్ముగనుచు
పేటలన్ తోటలన్ బాటలన్ జూచుచున్
మునిముగ్ధకాంతల పొల్పుగనుచు
పల్లెలన్ పట్టణాల్ కళ్ళారవీక్షించు
ముత్తైదువ విధాన మురిసిమనుచు

ఔర!గోదావరీమాత! జేరి యాంధ్ర౼
భూమి సస్య సశ్యామల సీమగాగ
జనుల సుఖదుఃఖ భారమ్ముచాలమోసి
కడు సుదీర్ఘయానమ్మునన్ గడలికలిసె.


ఉరుకులన్ బరుగుల న్నురవడిన్ జాటుచున్
కనువిందు గావించు కమ్రతేజ
సుడులతో వడులతో పడుచుసందడులతో
అందాలరాణియౌ హ్లాదరూప
కవ్వించి కవ్వించి కవితలే యల్లగా
కల్పనా మతినిచ్చ నల్పశక్తి
నయగారమొలికించు నాట్యాలపాఠ్యాల
నృత్యగురువిధి సందీప్త రక్తి

ఆహ!పావన గౌతమీ ధ్యాసతోడ
హృదయముప్పొంగి పోవుగానెంతసేపు
కళల కదలిక లూహింప గల్గియున్న
కాల మది యాగిపోవుగా గణనలేక.

రాయప్రోలు సీతారామశర్మ భీమవరం
****************

cbs చెప్పారు...

26వ పద్యం
శా.
నీపేరున్, భవదంఘ్రి తీర్థము, భవన్నిష్య్ఠూత తాంబూలమున్
నీ పళ్ళెంబు ప్రసాదముం గొనికదా నే బిడ్డనైనాడ! న
న్నీపాటిం గరుణింపు మోపనిక నే నెవ్వారికిన్ బిడ్డగా
జేపట్టం దగు, బట్టి మానదగ దో శ్రీకాళహస్తీశ్వరా
తా|| నీ నామస్మరణము, నీపాద తీర్థము, నీవు నమలి విడిచిన తాంబూలము, నీకు నివేదన చేసిన ప్రసాదము వీనిని స్వీకరించి గదా నీ పుత్రుడనైనాను! నీకిట్లు కొడుకునైన తర్వాత మరెవ్వరికిని కొడుకుగా జనించలేను. నన్ను నీదరికి జేర్చుకొనుము. చేరుచుకొన్న తరువాత మరల విడిచి పెట్టగూడదు సుమా! (అనగా నీ సేవ చేయు నాకు పునర్జన్మము లేని మోక్షమును ప్రసాదింపుమని భావము).🙏🙏💐

ఆలక్ష్మీపతిపాదపద్మములెదన్ ధ్యానించుకాలంబెమేలౌలగ్నం,
,బదెచంద్రతారలబలంబౌ,
నాముహూర్తంబె విద్యాలాలిత్యము
లుల్లసిల్లుసమయంబానాడె
లాభంబులెన్నోలభ్యంబగుమంచివేళ,కనరారో;సత్యమిట్లుండుటన్.
!

👆27వ పద్యం
శా.
అమ్మా యయ్య యటంచు నెవ్వరిని నే నన్నన్ శివా! నిన్నునే
సుమ్మీ! నీమది దల్లిదండ్రుల నటంచుం జూడగా బోకు, నా
కిమ్మై దల్లియు దండ్రియున్ గురుడు నీవే కాన సంసారపుం
జిమ్మం జీకటి కప్పకుండ గనుమా! శ్రీకాళహస్తీశ్వరా!

cbs చెప్పారు...

భళీ! ఇలాతలాన భూరి వర్షధార జోరుతో
జలాశయాలె నీళ్ళతోడ సాగరాల బోలుచున్
ఫలింప పంటలెన్నొ బాగస్పర్థబూనినట్టులున్
జలంబె పర్వులెత్తె రైతు సంతసంబునందగన్.

మహోగ్రరూపధారి శేషుమస్తకాల విస్తృతో
మహేశుఫాలనేత్ర వహ్నిమార్గ విస్ఫులింగతో
అహీను వర్షదేవు నుగ్ర తాగ్రహ ప్రభావమో
అహా!జలంబె,పర్వులెత్తుటందగించెవార్ధులై.

వద్దు వద్దు వాన లింక వద్ద టన్న రీతిలో
హద్దు పద్దులేనిధాటి నవనియన్నిదిక్కులన్
ముద్దముద్దగాగ తడిసి భూమి ముద్దబంతియై
సుద్దులెన్నొతోప ప్రేమ సోయగంబులొల్కెగా!

రాయప్రోలు సీతారామశర్మ భీమవరం
********************

cbs చెప్పారు...

ఆ. వె.
"నేను" నేను కాదనెడి యెఱుక కలుఁగ

నేతి నేతి విద్య నేర్వ వలెను

నేను లేని స్థితియె నిక్కము ముక్తియౌ

అహమనెడి పిశాచ మణగి బోవ
****************

cbs చెప్పారు...

గిడుగువారికి నమస్సులు
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
గిడుగో తెలుగుంభాషకు
గొడుగో భాషామతల్లి కోరుకొనియెడు
న్నడుగో పదనిర్ఝరముల
పిడుగో వ్యవహారభాషవేడుక మడుగో!

తెలుగే కరువగుచుండెను
తెలియంగదె ఓగిడుగు సుధీచంద్రమ నీ
పలుకో కులుకో చురుకో
వలె నీతెలుగందమింత బ్రతుకగ నుర్విన్.

మనభాషారుచి యెరుగని
మననేతల పాలనంబు మనభాగ్యంబే
మనవారి కద్ది నేర్పగ
మనుమో గిడుగా మనధర మరలొకసారిన్.

రాయప్రోలు సీతారామశర్మ భీమవరం

cbs చెప్పారు...

శీర్షిక: *తెలుగమ్మగొడుగు-గిడుగు.*
*తెలుగుభారతికి మేలిమితొడుగు,
వెలుగుభావనల గతులముందడుగు,
తల్లి భాషతపనల గొడుగయినగిడుగు.*
పిడివాదులభాషపై,
పిడుగయ్యినగిడుగు,
వ్యవహారభాషోద్యమై
వ్యవస్థ ప్రగతిఅడుగు.
సవరభాషలిపిసంస్కరణ,
సమాజపదగతివ్యాకరణం.
తెలుగుజాతిభావిసంస్కృతి,
వెలుగువేడుకలభాషాహారతి,
మాతృభాషకుసంస్కారశృతి,
మాధుర్యం,భోధనభాషజగతి.
తెలుగుపతాకవెలుగుసాధకుడై,నిలువెత్తుమాతృభాషశిఖరమై,నమ్మకంమనోభావనస్వభాష,
అమ్మపాలఅమృతంసొంతిల్లు.
నిశ్చయనిండుజిలుగు,గిడుగు
తెలుగమ్మపదపూలగొడుగు.
పలుకుపదాలసేవాస్ఫూర్తి,
నిర్విరామభాషాప్రేమ,తొలి అడుగై,సమగ్రభాషాకీర్తి..
నిబ్బరపథం,గి.రాం.మూర్తి.*
*డా.వేదులశ్రీరామశర్మ'శిరీష'*

cbs చెప్పారు...

వామనజయన్తి
౼౼౼౼౼౼౼౼౼
వామనుడై మూడడుగుల
కామనుడై బలినిజేరు క్ష్మాసురవరుడై
శ్రీమహిళాసన్నుతుడౌ
స్వామికి పురుషోత్తమునకు ప్రణతులశతముల్.

ఇంతింతై వటుడంతయై
అంతయుతానై జగంబులచ్చెరువంతై
చింతం బడు బలితలపై
కాంతిద పాదంబునుంచు కంజాక్ష నతుల్.

రాయప్రోలు సీతారామశర్మ భీమవరం.

cbs చెప్పారు...

తెలుగు భాషా దినోత్సవ
సందర్భంగా....
జీవం పోసిన మేటి......
గ్రాంథిక భాషా సంకెళ్లను
త్రెంచి
వ్యావహారిక భాషోద్యమం సల్పి
తెలుగు ప్రజల బ్రతుకుల్లో వెలుగును. నింపి
గిరిజన సవరలకు లిపిని
నేర్పి
వ్యాకరణ బంధమైన
భావాన్ని
అచ్ఛ తెలుగు లో అందరూ పంచుకునేలా
తేనెలొలికే తీయ దనాన్ని
అందిస్తూ
అజరామర మై నిలుస్తూ
అశేష జనా వళీ కీర్తించే లా
సరికొత్త బాటను చూపి
భావసంపద ఉన్న వాళ్ళంతా స్వేచ్ఛగా
భావ వ్యక్తీకరణ చేసే దిశగా
అడుగులు వేయిస్తూ
మునుముందు కు
తెలుగు జాతిని
నడిపించిన వాడు
తెలుగు కీ ర్తిని దశ దిశలా వ్యాపింప చేసిన
వాడు
సృష్టి ఉన్నం త వరకు
తెలుగు భాష తెలుగుజాతి కీర్తిని
ఆచంద్ర తారార్క
యశస్సును బడసేలా
చేసిన యశస్వి
మరే వ్వరో కాదు
నేడు సైతం ప్రజ లందరిచే కీర్తింప బడుతూ తన జయంతినే కాక
తెలుగు భాషోద్య మానికి
తెలుగు భాషో త్సవానికీ
ఊ పిరులూ దిన మేటి
ఘనుడు మన గిడుగు
రామ్మూర్తి పంతులు గారు.
దోస పాటి.
సత్యనారాయణ మూర్తి.
రాజ మహేంద్ర వరం
9866631877.

cbs చెప్పారు...

*క్షేమమున మనము మనమన*
*మేమ నితరభాష జనులు మిడుకుదు రయ్యా!*
*ఏమని బొగడుదు తెలుగును*
*సీమంతిని మనదు తెలుగు సీమన ముదమౌ!*

తెలుగుభాషాదినోత్సవ శుభాకాంక్షలతో
మీ
*సింహశ్రీ*

cbs చెప్పారు...

*అప్పు అయ్యేలా*
*ఖర్చుచేయకండి*,
*పాపమయ్యేలా*
*సంపాదించకండి*,
*అజీర్తి అయ్యేలా*
*తినకండి*,
*మనస్పర్ధలొచ్చేలా*
*మాట్లాడకండి*,
*ఆలస్యమయ్యేలా*
*నడవకండి*,
*ఆలస్యం చేస్తూ*
*కాలాన్ని నిందించకండి*,
*అర్థం చేసుకోకుండా*
*అవమానపర్చకండి*,
*నాదే లోకం అనుకోకుండా*
*ప్రపంచాన్ని చూడండి*,
*ద్వేషాన్ని వదిలేసి*
*ప్రేమను ఆహ్వానించండి*,
*ఇతరులు తక్కువ అనకుండా*
*మనమే తక్కువ చేసుకోండి*,
*కోపంగా 10 మాటలు కాదు*
*ప్రేమగా ఒక్క మాట చాలు*,
*ముందు ఎంతున్నది కాదు*
*వెనక ఎంత ఖ్యాతి ఉందో తెలియాలి*,
*ఎంత సీనియారిటి అన్నది కాదు*
*ఎంత సిన్సియారిటి అన్నది ముఖ్యం*,
*ఎంత ఎత్తుకు ఎదిగామన్నది కాదు*
*ఎన్ని లోతులు తెలిసాయన్నది ముఖ్యం*,
*ఏమి సాధించామన్నది కాదు*
*ఏమి కోల్పోలేదన్నది ముఖ్యం*,
*ఎంత మంది స్నేహితులన్నది కాదు*
*ఒక్క శత్రువు లేరన్నది ముఖ్యం*,

cbs చెప్పారు...

తెలుగంటే
తెలుగంటే...గోంగూర
తెలుగంటే...గోదారి
తెలుగంటే...గొబ్బిళ్ళు
తెలుగంటే...గోరింట
తెలుగంటే...గుత్తోంకాయ్
తెలుగంటే...కొత్తావకాయ్
తెలుగంటే....పెరుగన్నం
తెలుగంటే...ప్రేమా, జాలీ, అభిమానం
తెలుగంటే...పోతన్న
తెలుగంటే...బాపు
తెలుగంటే...రమణ
తెలుగంటే...అల్లసాని పెద్దన
తెలుగంటే...తెనాలి రామకృష్ణ
తెలుగంటే...పొట్టి శ్రీరాములు
తెలుగంటే...అల్లూరి సీతారామరాజు
తెలుగంటే...కందుకూరి వీరేశలింగం
తెలుగంటే...గురజాడ
తెలుగంటే...శ్రీ శ్రీ
తెలుగంటే...వేమన
తెలుగంటే...నన్నయ
తెలుగంటే...తిక్కన
తెలుగంటే...ఎఱ్ఱాప్రగడ
తెలుగంటే...గురజాడ
తెలుగంటే...క్షేత్రయ్య
తెలుగంటే...శ్రీనాధ
తెలుగంటే...మొల్ల
తెలుగంటే...కంచర్ల గోపన్న
తెలుగంటే....కాళోజి
తెలుగంటే...కృష్ణమాచార్య
తెలుగంటే...సిద్ధేంద్ర
తెలుగంటే...గౌతమీ పుత్ర శాతకార్ణి
తెలుగంటే...రాణీ రుద్రమదేవి
తెలుగంటే...రాజరాజ నరేంద్రుడు
తెలుగంటే...రామలింగ నాయుడు
తెలుగంటే...తిమ్మనాయుడు
తెలుగంటే...రామదాసు
తెలుగంటే...ఆచార్య నాగార్జున
తెలుగంటే...పోతులూరి వీరబ్రహ్మం
తెలుగంటే...జిడ్డు కృష్ణమూర్తి
తెలుగంటే...వుప్పలూరి గోపాల కృష్ణమూర్తి
తెలుగంటే...సింగేరి శంకరాచార్య
తెలుగంటే...అన్నమాచార్య
తెలుగంటే...త్యాగరాజు
తెలుగంటే...వీర పాండ్య కట్టబొమ్మన
తెలుగంటే...విశ్వేశ్వరయ్య
తెలుగంటే...బాబూ రాజేంద్రప్రసాద్
తెలుగంటే...చిన్నయ్య సూరి
తెలుగంటే...సర్వేపల్లి రాధాకృష్ణన్
తెలుగంటే...పీవీ నరసింహారావు
తెలుగంటే...రాజన్న
తెలుగంటే...సుశీల
తెలుగంటే...ఘంటసాల
తెలుగంటే...రామారావు
తెలుగంటే...అక్కినేని
తెలుగంటే...సూర్యకాంతం
తెలుగంటే...ఎస్.వీ.రంగారావు
తెలుగంటే...అయ్యలరాజు రామభద్రుడు
తెలుగంటే...పండుమిరప
తెలుగంటే...సంక్రాంతి
తెలుగంటే...సరోజిని నాయుడు
తెలుగంటే....భద్రాద్రి రామన్న
తెలుగంటే...తిరుపతి ఎంకన్న
తెలుగంటే...మాగాణి
తెలుగంటే...సాంబ్రాణి
తెలుగంటే...ఆడపిల్ల ఓణి
తెలుగంటే...చీరకట్టు
తెలుగంటే...ముద్దపప్పు
తెలుగంటే...ఓంకారం
తెలుగంటే...యమకారం
తెలుగంటే....మమకారం
తెలుగంటే...సంస్కారం
తెలుగంటే...కొంచెం ఎటకారం
తెలుగంటే...పట్టింపు
తెలుగంటే...తెగింపు
తెలుగంటే....లాలింపు
తెలుగంటే...పింగళి వెంకయ్య
తెలుగంటే...పైడి మర్రి వెంకట సుబ్బారావు
తెలుగంటే....టంగుటూరి ప్రకాశం
తెలుగంటే...చిలకమర్తి లక్ష్మీనరసింహం
తెలుగంటే...భాస్కరుడు
తెలుగంటే...దేవులపల్లి
తెలుగంటే...ధూర్జటి
తెలుగంటే...తిరుపతి శాస్త్రి
తెలుగంటే...గుఱ్ఱం జాషువ
తెలుగంటే...కోరాడ మహాదేవశాస్ట్రీ
తెలుగంటే...కోరాడ రామకృష్ణయ్య
తెలుగంటే...కోరాడ రామచంద్రకవి
తెలుగంటే...కొనకళ్ల వెంకటరత్నం
తెలుగంటే...మల్లన్న
తెలుగంటే...నండూరి
తెలుగంటే...పానుగంటి
తెలుగంటే...రామానుజం
తెలుగంటే...రావి శాస్త్రి
తెలుగంటే...రవి వర్మ
తెలుగంటే...రంగనాధుడు
తెలుగంటే...కృష్ణదేవరాయలు
తెలుగంటే...తిరుపతి వెంకటకవులు
తెలుగంటే...విశ్వనాథ
తెలుగంటే...నన్నే చోడుడు
తెలుగంటే...ఆరుద్ర
తెలుగంటే...ఎంకి
తెలుగంటే...ఆదిభట్ల
తెలుగంటే...గాజుల సత్యనారాయణ
తెలుగంటే...మల్లాది సుబ్బమ్మ
తెలుగంటే...ఆర్యభట్టు
తెలుగంటే...త్యాగయ్య
తెలుగంటే...కేతన
తెలుగంటే...వెంపటి చిన సత్యం
తెలుగంటే...ఉషశ్రీ
తెలుగంటే...జంధ్యాల
తెలుగంటే...ముళ్ళపూడి
తెలుగంటే...మంగళంపల్లి బాలమురళీకృష్ణ
తెలుగంటే...అక్కిరాజు ఉమాకాంతం
తెలుగంటే...తిలక్
తెలుగంటే...అడివి బాపిరాజు
తెలుగంటే...జక్కన
తెలుగంటే...అచ్చమాంబ
తెలుగంటే...దాశరథి
తెలుగంటే...తెలంగాణ,ఆంధ్ర
తెలుగంటే...ముక్కుపుడక
తెలుగంటే...పంచెకట్టు
తెలుగంటే...ఇంటిముందు ముగ్గు
తెలుగంటే...నుదుటిమీద బొట్టు
తెలుగంటే...తాంబూలం
తెలుగంటే...పులిహోర
తెలుగంటే....సకినాలు
తెలుగంటే....మిర్చి బజ్జి
తెలుగంటే...బందరు లడ్డు
తెలుగంటే....కాకినాడ ఖాజా
తెలుగంటే.....జీడిపాకం
తెలుగంటే...మామిడి తాండ్ర
తెలుగంటే...రాగి ముద్ద
తెలుగంటే...జొన్న రొట్టె
తెలుగంటే...అంబలి
తెలుగంటే...మల్లినాథ సూరి
తెలుగంటే...భవభూతి
తెలుగంటే...ప్రోలయ నాయకుడు
తెలుగంటే...రాళ్ళపల్లి
తెలుగంటే...కట్టమంచి
తేనెలూరు తెలుగంటే ఆంధ్ర కోనసీమ పంట
తెలుగు నేలంటే రాయలేలిన సీమ రాయలసీమ
తెలుంగు ఆణమంటే తెలంగాణ
తెలుగంటే..... నీవు నేను మనం
జై తెలుగు తల్లీ 🙏

గిడుగు రామ్మూర్తి పంతులు గారికి అంజలి ఘటిస్తూ..🙏
తెలుగు భాషా ప్రేమికులందరికీ
తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు
************************

cbs చెప్పారు...

*జై తెలుగు భాషా*
*లలితా భాస్కరదేవ్*
తెలుగు వెలుగులెన్నో
తెలపగ తెరువులెన్నో
నేటి తెలుగుతల్లీ
ద్విరాష్ట్ర నయని
మాండలీకాల ముంగురులు
పిల్ల తెమ్మరలకు ఎగురుతుంటే
తెలుగు జిలుగుల వెలుగులు
తరలి తరలి తెలుగు భాష పెరిగి
*తానా* *నాటా* లవరకు సాగి
తెలుగు లోన ఆంగ్లమమరి
స్మార్ట్ ఫోను భాషలో
ఈమోజిలుచేరి
తెలుగు మారెనేమి?
గూగులమ్మ గుడిలో......జూమ్..
అంటూ అష్టావధానాలు అధిరే..
సామజిక దూరమున్న నేమి
ఇల్లు కదలక వున్న నెేమి?
సాహితీమాతకు సాంకేతికత
వూరట నిచ్చె తెలుగు కళలకు....
అచ్చతెలుగు పల్లె పలుకుల లో
డల్ అయినా నంటూ పలికే
పల్లె తల్లిని ..
మమ్మీ అంటూ పరుగునొచ్చే పాప..
గడబిడలెన్ని వున్న
గళమెత్తి పలుకుదాం
జై తెలుగు భాషా
జై తెలుగు తల్లీ
లలితా భాస్కర దేవ్
హైదరాబాద్
29-8-2020

cbs చెప్పారు...

చిక్కఁడు వ్రతములఁ గ్రతువులఁ
జిక్కఁడు దానముల శౌచ శీల తపములం
జిక్కఁడు యుక్తిని, భక్తిని
జిక్కిన క్రియ నచ్యుతుండు సిద్ధము సుండీ!
[29/08, 10:41 am] +91 99595 36545: వామనవటుమూర్తికి వందన పద్యత్రయము

బలిదనుజుని మదమణచగ
పలుయమరుల మొరలు వినియు బాలక వటుగా
యిలమూడడుగుల నడిగియు
పలులోకములెల్ల గొలిచె పాదము తోడన్

ఇంతింతగుచును విశ్వము
సాంతంబుగ గొలిచి జగతి సర్వేశుండై
వింతగు రూపము దాల్చియు
స్వాంతంబున బలిని మెచ్చి సద్గతి నిచ్చెన్

శ్రీకరంబైనట్టి చిరుత కూకటి తోడ
చిరునవ్వు లొలికించు చిన్ని వటువు
దారు కమండలం దాల్చియు కరమందు
విజ్ఞాన ఖనివోలె వెల్గు వాడు
పావన దర్భలు పట్టియు నొకచేత
నతి ప్రసన్నత నున్న యర్భకుండు
హస్తంబు పైకెత్తి నభయంబు నిచ్చుచు
గొడుగుతో నున్నట్టి వొడుగు కుర్ర
ఘనుడు బలిచక్రవర్తిపై కరుణ జూప
వామనుని వోలె వచ్చియు వరము నడిగి
విశ్వమును గొల్చి వెల్గిన విష్ణువునకు
ప్రణతు లర్పించు చుంటిని భక్తితోడ

గోపాలుని మధుసూదన రావు

cbs చెప్పారు...

*జై తెలుగు భాషా*
*లలితా భాస్కరదేవ్*
తెలుగు వెలుగులెన్నో
తెలపగ తెరువులెన్నో
నేటి తెలుగుతల్లీ
ద్విరాష్ట్ర నయని
మాండలీకాల ముంగురులు
పిల్ల తెమ్మరలకు ఎగురుతుంటే
తెలుగు జిలుగుల వెలుగులు
తరలి తరలి తెలుగు భాష పెరిగి
*తానా* *నాటా* లవరకు సాగి
తెలుగు లోన ఆంగ్లమమరి
స్మార్ట్ ఫోను భాషలో ఈమోజిలు చేరి తెలుగు మారెనేమి?
గూగులమ్మ గుడిలో......జూమ్..
అంటూ అష్టావధానాలు అధిరే..
సామజిక దూరమున్న నేమి
ఇల్లు కదలక వున్న నెేమి
సాహితీమాతకు సాంకేతికత చెయూత నిచ్చె తెలుగు నిలప......
అచ్చతెలుగు పల్లె పలుకుల లో
డల్ అయినా నంటూ పలికే పల్లె తల్లిని ..మమ్మీ అంటూ పరుగునొచ్చే పాప .....
గడబిడలెన్ని వున్న
గళమెత్తి పలుకుదాం
జై తెలుగు భాషా
జై తెలుగు తల్లీ
లలితా భాస్కర దేవ్
హైదరాబాద్
29-8-2020

cbs చెప్పారు...

తెలుగు భాషా దినోత్సవ
సందర్భంగా....
జీవం పోసిన మేటి......
గ్రాంథిక భాషా సంకెళ్లను
త్రెంచి
వ్యావహారిక భాషోద్యమం సల్పి
తెలుగు ప్రజల బ్రతుకుల్లో వెలుగును. నింపి
గిరిజన సవరలకు లిపిని
నేర్పి
వ్యాకరణ బంధమైన
భావాన్ని
అచ్ఛ తెలుగు లో అందరూ పంచుకునేలా
తేనెలొలికే తీయ దనాన్ని
అందిస్తూ
అజరామర మై నిలుస్తూ
అశేష జనా వళీ కీర్తించే లా
సరికొత్త బాటను చూపి
భావసంపద ఉన్న వాళ్ళంతా స్వేచ్ఛగా
భావ వ్యక్తీకరణ చేసే దిశగా
అడుగులు వేయిస్తూ
మునుముందు కు
తెలుగు జాతిని
నడిపించిన వాడు
తెలుగు కీ ర్తిని దశ దిశలా వ్యాపింప చేసిన
వాడు
సృష్టి ఉన్నం త వరకు
తెలుగు భాష తెలుగుజాతి కీర్తిని
ఆచంద్ర తారార్క
యశస్సును బడసేలా
చేసిన యశస్వి
మరే వ్వరో కాదు
నేడు సైతం ప్రజ లందరిచే కీర్తింప బడుతూ తన జయంతినే కాక
తెలుగు భాషోద్య మానికి
తెలుగు భాషో త్సవానికీ
ఊ పిరులూ దిన మేటి
ఘనుడు మన గిడుగు
రామ్మూర్తి పంతులు గారు.
దోస పాటి.
సత్యనారాయణ మూర్తి.
రాజ మహేంద్ర వరం
9866631877.

cbs చెప్పారు...

*క్షేమమున మనము మనమన*
*మేమ నితరభాష జనులు మిడుకుదు రయ్యా!*
*ఏమని బొగడుదు తెలుగును*
*సీమంతిని మనదు తెలుగు సీమన ముదమౌ!*

తెలుగుభాషాదినోత్సవ శుభాకాంక్షలతో
మీ
*సింహశ్రీ*

Sarma చెప్పారు...

ఆయనో ధృవతార.....
గ్రంథాలయాల్లో అవిశ్రాంత పాఠకుడై
చాసో రోణంకి శ్రీశ్రీ ల
పరిచయం తో
సాహితీ పథంపై దారి
మళ్ళించి
పదమూడవ ఏటనే
నా కలలో అనే కవిత ను
రచించి
జాతీయ రాజకీయ ప్రభావి తుడై మార్క్సిజం లో ప్రవేశించి
రజా కారుల కాలంలో
స్త్రీ పై జరిగిన దాడిని
నిరసిస్తూ త్వమే వాహం ను విరచించి
కొండగాలి తిరిగింది
గోదావరి వరదలా కోరిక
చెల రేగిందని ప్రకృతిని
మనకు దర్శింపచేసి
ముత్యాల చెమ్మ చెక్క
రత్నాల చెమ్మ చెక్కంటూ
జానపద సినీ బాణీని
మురిపించి
ఎదగ డాని కెందుకురా
తొందరా అంటూ
విద్యార్థి భవితవ్యాన్ని
సామాజిక రుగ్మతల్ని
తెలియజేస్తూ
గాంధీ పుట్టిన దేశమా I
ఇదంటూ
సామ్యవాదం కోసం
సంస్కార బాణాన్ని
ఎక్కుపెట్టి
సామాన్య మానవుడి కోసం అహరహం
రుధిర కేతన బాటలో
అభ్యు దయ పథాన
పయనిస్తూ
తాను చదివింది కొంచమైనా
ఈ జగతికి పంచింది మాత్రం అనంతమై
కొండ అద్దమందు
కొంచ మై ఉండదా
అన్న వేమన్న సూక్తిని
నిజం చేసిన ఘనుడు
అజరామ రుడు
మనకందరికీ మార్గదర్శి
ఆదర్శమూర్తి మరెవరో కాదు
ఆ రుద్రభూమి. కేగిన ఆరుద్ర
అందుకే నిజంగా ఆయనో ధృవతార.
ఆగస్ట్31న ఆరుద్ర జయంతి సందర్భంగా...
దోస పాటి.
సత్యనారాయణ మూర్తి.
9866631877.

Sarma చెప్పారు...

వ్రతమత్యంతవిశేషపుణ్యమొసగున్
భద్రంబులన్ గూర్చు,
వాంఛితముల్దీర్చు,గ్రహానుకూలఫలముల్ సిధ్ధింపగాజేయు,
సంచిత,మారబ్ధమునైనకర్మచయమున్ క్షీణింపగాజేయు,
సంతతమారోగ్యము,నాయు రర్థములు ,తత్కారుణ్యసంపత్తి,
సద్గతి, శ్రీ హరి, పద్మనాభుడొసగున్ కళ్యాణదృష్టిన్మహిన్.
మనతెలుగు
౼౼౼౼౼౼౼౼
బాలయో ప్రౌఢయోవ్యాకర్ణపాఠాల
పలుకుబడుల దోషముల గ్రహించి
దర్పణమ్మట్లు ఛందమ్ములన్నడల నొ
య్యారముల పథమ్ము లందియంది
భూషల రసమార్గముల రాగశోభల
ఒంపుసొంపుల తళ్కు లొలయజేసి
ధ్వన్యాత్మవైభవాధ్వరముల సరస వా
గ్ఝరులతో నెదవీణ సవదరించి

భాషయన నిద్దిరా యను ప్రాభవమున
పెక్కుతీరులమించి లోచొక్కజేసి
ప్రజల పాలకవర్యుల ప్రాపుగాంచు
తెలుగు లలితలలిత భావచలితభాష.

రాయప్రోలు సీతారామశర్మ భీమవరం.

Sarma చెప్పారు...

వ్రతములు నోములు పూజలు

సతతము హోమము జపంబు సలుపగనేలా

హితమగునది నద్వైతపు

మతమందున నిల్చువాడు మాన్యుడు గదరా

Sarma చెప్పారు...

ప్రజ్ఞా శాలి ప్రణబ్ జీ కి
అక్షర నివాళి.......

భారత దేశ తొలి పౌరుడుగా
మాజీ భారత దేశా ద్యక్షుడుగా
రాజకీయ దురంధరుడు గా
న్యాయశాస్త్ర కోవిదుడు గా
పశ్చిమ బెంగాల్ ప్రణబ్ జీగా
విదేశాంగ మంత్రి యై
విలువల్ని కాపాడినవాడుగా
ఆర్థికమంత్రి గా అందరి
మన్నల నందుకున్న వాడుగా
రక్షణమంత్రి గా భరత జాతి కీర్తిని ఇనుమడింప
చేసినవాడు.గా
పార్ల మెంటేరియన్ గా
ఉత్తమ ప్రశంస లు అందుకున్న వాడుగా
భారత రత్న బిరుదాంకితుడు గా
మంచి వ్యక్తిత్వ గుణ
సంపన్నుడు గా
ఉదారగుణ స్వభా వుడుగా
సామ్యవాద పరిరక్షకుడు గా
ప్రసంనీయమైన సేవలందించిన మహనీయుడు గా
ప్రణబ్ జీ జీవితం అజరామరం
అందుకే ఆయన గతించాదనడంకన్నా
నిజంగా ప్రజ ల హృదయాల్లో జీవించాడాన్నది పచ్చ్చి
నిజం
అందుకే ఆ ప్రజ్ఞాశాలి
ప్రణబ్ జీ కి అందిస్తున్నా
ఈ అక్షర నివాళి.
దోస పాటి.
సత్యనారాయణ మూర్తి.
రాజ మహేంద్ర వరం
9866631877.

Sarma చెప్పారు...

ఘంటారావం
..................
సుఖశాంతులు సృష్టించును
సృజనాత్మక సాహిత్యం
పరపీడన పురుడుపోయు
ప్రతిఘటనల చరిత్రం

— మనోహర్ రెడ్డి గంటా
తేది.02-09-2020

Sarma చెప్పారు...

ఆయ నే బొమ్మన.......
దేవాంగులకు దేవుడు
చేనేత బడుగు బలహీన
వర్గాలకు అత్యంత ఆప్తుడు
వస్త్ర రంగ కీర్తిని జగత్తు కే చాటిన వాడు
జ్యుయ లరీ రంగంలో
తన ప్రత్యేకతను చాటినవాడు
వస్ట్రవ్యాపారానికి రారాజై నిలిచినవాడు
అజాత శత్రువుగా
ఎదిగిన వాడు
వినమ్రతతో మెలిగేవాడు
తెలుగుత నానికి ప్రతీ కై న స్ఫురద్రూపుడు
దాతృత్వంలో ఎందరో
దెందాల్లో దివ్వెలా కొలువున్నవాడు
ఆకాలంగా కరోన రక్కసికి బలై
అశేష జనావళిని
అవాక్కయ్యేలా చేసి
శోక సంద్రంలో ముంచి
కడకు రాజ మహేంద్రి లోని వెన్నెల్లో గోదారి సైతం విస్తు బోయేలా
నిశీధిన తారగా
తన నిండు ప్రతి బింబాన్ని గోదారిలో
ప్రతిబింబింప చేస్తూ
యశస్వి యై నిలిచిన వాడు
ఆయనే మన బొమ్మన
రాజ కుమార్ గారికి
ఇదే నా అశ్రు నివాళి.
దోసపాటి.
సత్యనారాయణ మూర్తి.
రాజ మహేంద్ర వరం
9866631877.

cbs చెప్పారు...

అజ్ఞానము తొలగించియు
విజ్ఞానము కూర్చుసట్టి విభుడే గురువౌ
సుజ్ఞానముతో శిష్యుల
ప్రజ్ఞా వంతులను జేసి ప్రగతిన నడుపు‌న్

✍🏼 గోగులపాటి కృష్ణమోహన్ 🌹

cbs చెప్పారు...

ఉపాధ్యాయుడు అంటే?
ఉపాధ్యాయుడు అంటే ఉత్సాహం
ఉపాధ్యాయుడు అంటే ప్రోత్సాహం
ఉపాధ్యాయుడు అంటే విశ్వాసం
ఉపాధ్యాయుడు అంటే విజ్ఞానం
ఉపాధ్యాయుడు అంటే గంభీరం
ఉపాధ్యాయుడు అంటే గౌరవం
ఉపాధ్యాయుడు అంటే విలక్షణం
ఉపాధ్యాయుడు అంటే విచక్షణం
ఉపాధ్యాయుడు అంటే అధ్యాయనం
ఉపాధ్యాయుడు అంటే అభ్యాసనం
ఉపాధ్యాయుడు అంటే అనుభవం
ఉపాధ్యాయుడు అంటే అవధానం
ఉపాధ్యాయుడు అంటే సుకృతం
ఉపాధ్యాయుడు అంటే జాగృతం
ఉపాధ్యాయుడు అంటే సౌజన్యం
ఉపాధ్యాయుడు అంటే చైతన్యం
అందుకే !!!!
ఉపాధ్యాయుడితోనే ఈ సమాజం
ఉపాధ్యాయుడితోనే ఈ ప్రపంచం.
ఆచార్య దేవోభవ!!!!
ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు

cbs చెప్పారు...

గురువులు
****

అజ్ఞానతిమిరంబునాహుతి
గావించి
విజ్ఞాన దీపంబువెలుగజేసి!
లోకవృత్తంబు విలోకన
మొనరించి
జ్ఞానసంపదనెల్ల దానమొసగి!
మూఢనమ్మకముల
మూలమ్ములందెలిపి
పరమ సత్యంబుల
నెరుక పరచి!
జీవితవిలువలు జీవన
బంధాలు
తేటతెల్లంబుగ తెలియపరచి!

ప్రతిభ మీరగ జీవన
రాగమెరిగి!
సమ సమాజపు లక్ష్యమ్ము
సాగి సాగి,
బోధ సల్పెడి వాడెపో
పుడమి గురువు!
గురువు విజ్ఞానపుం
కల్పతరువు సుమ్ము!!

డా.ప్రభు దేవరపల్లి

Sarma చెప్పారు...

చెరగని సంతకం
----------------------
ఎస్.ఆర్.పృథ్వి

సామ్రాజ్యాధి నేతల గుండెల్లోకి
విభిన్న సరాల్ని ఎక్కు పెట్టి
బానిసత్వపు ఉక్కు సంకెళ్ళను
పగుల గొట్టిన తరం వాడివి
నిద్ర ఎరుగని కలాన్ని
ఆయుధంగా మలుచుకున్న
వాడివి
స్వచ్చమైన స్వేచ్ఛను గుండెల
కద్దుకొని
ఊపిరిగా స్వాసించిన వాడివి
నిత్యం చూపుల చుర కత్తుల్ని
అసహజాల పైకి దండు పంపిన
వాడివి
చెదిరి పోతున్న నిరాడంబరతనీ
తనువుతో కాపు కాచిన వాడివి
అవినీతి నల్ల బల్ల మీద
తెల్లని చాక్ పీస్ తో గొడవ
పడిన వాడివి

స్వార్ధం విసిరిన భ్రమల పూల
మాలల్ని
కంఠ సీమలకు అలంకరించు
కొని
స్వలాభాలు రాజ్యమేలడం
ఆరంభించాయి
అప్పుల ఆహారాని భోంచేస్తూ
బహుళ జాతులకి
స్వర్ణ సింహాసనాన్ని సిద్ద పరు
స్టున్నాయి
అప్పుడూ వ్యాపారమె నెప
మైంది
ఇప్పుడూ అదే
కొత్త రంగుల్ని పులుముకుని
విద్యను, వైద్యాని కూడా
వాణిజ్యం చేసిన సంస్కృతి
డాలర్కి కట్టు బానిసను
చేస్తోంది
వ్యక్తిత్వం కోల్పోతున్న
భవిష్యత్తు
ఉల్కై, ఏ సముద్రంలోకి
రాలిపోతాదో నన్న భయంతో
ఈ లోకం నాటక శాల నుండి
నిశ్క్రమించావా కాళన్నా!
అయినా, తొమ్మిది దశాబ్దాల
జీవన యాత్రలో
నీది చెరగని సంతకం కాదన్నా!
---------------
(సెప్టెంబరు 09 వ తేది కాళోజీ
జన్మ దినం సందర్భంగా)

Sarma చెప్పారు...

నేనందించే ఈ అక్షర నివాళి.....
సామాన్యుడి గెలుపుకై
సమరం చేసిన యోధుడివి నీవు
తెలంగాణా మాండలికానికే వన్నెతెచ్చిన వీరుడివి నీవు
సామాన్యుడి డెందంలో
ఆరని జ్యోతివి నీవు
నీ ధీరత్వంతో ధిక్కార
స్వరాన్నే ప్రదర్శించిన
ప్రళయ కాలుడివి నీవు
నీ హెచ్చరికతో ఓటర్లను
మేల్కొల్పిన ప్రజ్ఞాశాలివి
నీవు
నిరాశతో నీరసించ కూడదని
వెలుతురు నే నిరంతరం
కోరకూడదని
విజ్ఞతతో ముందసాగడమే జీవితమని
ప్రజల బాధల్ని నీ బాధలుగా చేసుకుని
కడ దాకా నా గొడవంటూ
ముందుకు సాగవు
కట్ట కడకు నీవు ఉదయించే భానుడవై
మా మనో ఫలకం పై
మెరిసే ఓ కాళోజీ

Sarma చెప్పారు...

తెలంగాణ భాషా దినోత్సవ శుభాకాంక్షలతో

జోహారు జోహార్లు కాళోజి సారూ
***************************
ఆడ యీడ యంటె యవమాన పరిచిండ్రు
పుంటికూరయంటె పెదవి విరిసిండ్రు
ఆనపకాయంటె అలగజనమన్నారు
తెలగాణ బాషను తేలికగ జూసిండ్రు

నాభాషనుజూసి నలుగురు నవ్విండ్రు
నా యాసను జూసి నారాజు జేసిండ్రు
నా యాస బాసనే నక్షత్రమయ్యింది
నాబాషకూ ఒక్క పండుగేవచ్చింది

‘నీ భాషల్నే నీ బతుకుంది అన్నాడు
నీ యాసల్నే నీ సంస్కృతుందన్నాడు
బడి పలుకుల భాష మనకెందుకన్నాడు
పలుకు బడుల భాష ముద్దని చెప్పాడు

తెలుగు బాషయంటె తెలగాణ భాషరా
కాళోజీ పుణ్యమా కదిలింది ప్రభుత
తెలగాణ భాషకు దినమునే ప్రకటించె
కాళోజీ సారుకూ నివాళి యర్పించె

జోహారు జోహార్లు కాళోజి సారూ
అందుకోండి ఈ కవి నీరాజనాలు

🌺🙏🌺

గోగులపాటి కృష్ణమోహన్
కవి, సీనియర్‌ జర్నలిస్టు
సూరారం కాలని, హైదరాబాదు.
9700007653

Sarma చెప్పారు...

ఆ. వె.

పతిత పావన హరి, పాపిని నేనయ్య

దీని భాంధవ హరి, దీనుడ మరి

పొత్తు గుదిరె మనకు, మొత్తుకుని యడిగె

చక్రి తోడు యున్న చాలు మేలు 🙏

Sarma చెప్పారు...

👆42వ పద్యం
మ.
అమరస్త్రీల రమించినన్ జెడదు మోహంబింతయున్, బ్రహ్మ ప
ట్టము సిద్ధించిన నాస తీరదు, నిరూఢక్రోధమున్ సర్వలో
కములన్ మ్రింగిన మాన, దిందుగల సౌఖ్యం బొల్ల, నీ సేవ చే
సి మహాపాతకవారిరాశి గడతున్ శ్రీకాళహస్తీశ్వరా!

Sarma చెప్పారు...

విశ్వంబందున శివుడును
విశ్వేశుని యందు జగము విభవము నొందున్
నశ్వరము కాని సృష్టికి
ఐశ్వర్యము నొసగు తండ్రి యా శంకరుడే!!

విశ్వేశుడు కరుణించిన
శాశ్వితమగు సంపదలును సంతోషంబున్,
విశ్వశ్రేయము కలుగును
విశ్వాసము నుంచ వలయు విశ్వేశునిపై!!

Sarma చెప్పారు...

జీవితం

అనుకున్నవి అనుకున్నట్లు జరగనప్పుడు
చేయాలనుకున్న పనితరగక కొండలా పెరిగినప్పుడు
ఆదాయం తక్కువై బయట ఖర్చులు ఎక్కువైనప్పుడు
నవ్వుతూ బ్రతుకుదామనుకుంటే
బాధతో వేడి నిట్టూర్పులు వస్తున్నప్పుడు
అన్నిరకాలుగా మనం వత్తిడిని ఎదుర్కొన్నప్పుడు
కావాలంటే కొంచెం విశ్రాంతి తీసుకొని మళ్లీ మొదలుపెట్టుకానీ చేస్తున్న పని మాత్రం వదిలి పారిపోవద్దు.
జీవితం ఒక రంగుల రాట్నం
అది మళ్లీ మనల్ని పైకి తీసుకు వస్తుంది
పెదాలపై చిరునవ్వుని,
చేస్తున్న పనిని మాత్రం వదిలి పెట్టొద్దు.
ప్రయత్నం కొనసాగిస్తే
మళ్లీ మనం గెలుస్తాము.
సుబ్బు శివకుమార్ చిల్లర

Sarma చెప్పారు...

కవివిశ్వనాధుని కవితా మధువయె రా
మాయణ కల్పవృక్షాయనమ్ము
కవివిశ్వనాథుని నవల వేయిపడగ
లాదిశేషశ్వాస లాదరమ్ము
కవి విశ్వనాథునికల్పిత కిన్నెర
సాని విన్యాసాలమానితమ్ము
కవి విశ్వనాథునిఘన పురాణవిరోధ
మాలసంస్కృతి ధారణాలయమ్ము

ఆర్షసంప్రదాయ సురక్షణార్ఘ్యధర్మ
మాకృతియెవిశ్వనాథప్రభాకరమ్ము
హారి సాహితీజ్ఞానపీఠాగ్రమర్మ
మద్ది సాత్యనారాయణాహార్యరమయ.

రాయప్రోలు సీతారామశర్మ భీమవరం.

Sarma చెప్పారు...



కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ మహనీయుల జయంతి సందర్భముగా
👇
శ్రీయుత విశ్వనాథ వర చిన్మయ వంశజులైన సత్యనా

రాయణ సత్ కవీంద్రులు నిరంతరమున్ మన యాంధ్ర మాతకున్

మాయని కీర్తిఁ గొల్పగ సమంచిత రీతిని కల్ప వృక్షమున్

ధీయుతులై రచించె. మహనీయుని కంజలి నే ఘటించెదన్.
🙏
చింతా రామకృష్ణారావు.

Sarma చెప్పారు...

*విశ్వనాథుని 125వ జయంతి*


సీ.
తెలుగుభాషామతల్లి తీర్చిదిద్దినయట్టి
ముద్దుబిడ్డడతండు స్ఫూర్తియుతుడు
నవలలెన్నియొ వ్రాసి నవ్యమార్గణమేసి
దివ్యచరిత నిల్పె ధీమతుండు
కల్పవృక్షపునీడ క్రమ్మగాజేసియు
జ్ఞానపీఠమునెక్కె జ్ఞానఖనుడు
వేయిపడగలెత్తి విశ్వరూపము జూపి
కిన్నెరరాగాల క్రీడలాడి
తే.గీ.
తెలుగువిభవమ్ము జగమెల్ల తేజరిల్ల
తెలుగుభాషామతల్లికి తేరుబట్టి
విశ్వవీథిని విహరించె విశ్వనాథ
భరతఖండమ్ము కన్నట్టి పసిడిబిడ్డ

శా.
ఉల్లేఖింపగజాలునే? యతడి పద్యోక్తప్రభారీతులన్
సల్లాలిత్యపదార్థనిర్మితవిలాసాలంకృతాప్రౌడులన్
కల్లోలంబులులేని కావ్యరచనాగాంభీర్యతాశోభలన్
సల్లాక్షిణ్యపువిశ్వనాథకవితాసంశోభితామార్గమున్
✍️శ్రీశర్మద. 9110380150

Sarma చెప్పారు...

శా శ్రీరామాయణకల్పవృక్షమునకున్
శ్రీకారముం జుట్టియున్
యారాధించియు రామునిన్మదిని ది
వ్యాకారు సీతాపతిన్
సారంబంతయు జెప్పినాడ వకటా
సాహిత్య ముప్పొంగ , నే
డేరీ ? నీవలె కావ్యమల్లు కవు లు
ర్విన్ విశ్వనాథాన్వయా !

Sarma చెప్పారు...

దేవకీగర్భసంజాతం
ధర్మసంస్థాపనేస్థితం
శ్రీమన్నారాయణం దేవం
కృష్ణం వందే జగద్గురుమ్

అవతారంబును దాల్చుచు
నవనీతంబపహరించి నారాయణుడీ
యవనిని జూపెను లీలల
నవె చూపునుకృష్ణతత్త్వమంతయు కనుమా!

చిలకమఱ్ఱి కృష్ణమా చార్యులు

Sarma చెప్పారు...

హే వంశీధర! వల్లవీ జనవిభో! హే రాసలీలా మణీ!
హేనందాత్మజ!హేయదూద్వహ!హరే!హేభీష్మకన్యా పతే!
హేదుర్యోధన వంశనాశ! కరుణాసింధో! పరంధామ! మాం
హేభక్తావన! కృష్ణ! పాలయ పరంజానామి నత్వాం వినా!

రాముని వై చూపించిన
నీమములన్ని నుడివితివి నిండుగ గీతన్
స్వామీ నీసుగుణంబుల
సామాన్యుడ పొగడ నాకు సాధ్యమె? కృష్ణా!
---------------------------------------------------------

సర్వాత్మక మయం దేవం
సర్వవ్యాపక సద్గుణం
రాక్షస గర్వ సంహారిం
శ్రీనృసింహం నమామ్యహం

ఎవ్వరి గావగ నెప్పుడు
రివ్వుననేరూపమున నరి శమనుడగుదో?
యవ్విధి నెఱుంగ తరమే
యవ్వనజాతాభవునకు నైనను నృహరీ!

చిలకమఱ్ఱి కృష్ణమా చార్యులు

Sarma చెప్పారు...

వసుదేవసుతునిగా వసుధపైజన్మించి
నందాంగనకు మోదమందజేయు
దైత్యమూకలగూల్చు నిత్యయజ్ఞముసల్పు
అగ్నహోత్రి విధాన యందమొలుకు
శిష్టరక్షణజేసి స్థితిప్రోవగానెంచు
దీక్షనే గ్రాలు సద్దీప్తియగుచు
భక్తలోకము బ్రోచు ప్రబలరక్తిని మెల్గు
వాత్సల్యవార్థిగా వరదుడగుచు

నల్లనయ్య మౌళిని పింఛముల్లసింప
మోవిరుచి వేణువే గానమోహమంద
రాసలీల గోపకులె సరాగమంద
మెలగు కృష్ణయ్య కృపగావ కొలుతునయ్య.


రాయప్రోలు సీతారామశర్మ భీమవరం.

Sarma చెప్పారు...

*విశ్వసమ్మతంవిశ్వరూపం* *నీతులై నడవడానికిధర్మం, నడతలునేర్పుతూజీవనం.
రీతినడకన్యాయమై సత్యం,
సంఘటిత సభ్యసమానత్వం. సంస్కారగతులసహనశీలత్వం సంయమనం,సమాజాభిమతం.*అహింసపరమోత్తమధర్మమై,అఖిల ఆదర్శం చిత్తశుద్ధి దన్ను,
సత్యానికిజయం,విశ్వాసంవెన్న,అనుబంధాల ఆత్మీయంవెన్ను. నిత్యపొద్దుపొడుపుతేజమార్గం,నిలకడసుద్దులుప్రబోధకాంతి, నిష్టనియమ జీవనాలప్రశాంతి. సమభావన,సంఘటితతత్వం.
ఆత్మసాక్షి,చిత్తశుద్ధికాలనిబద్ధం,అంతరంగం,విశ్వసనీయలోకం. స్ఫూర్తిశాస్త్రీయాల సాధనకీర్తికి,
జాతిశోధనఆరాధనలదీప్తులం.
యక్షప్రశ్నలకూ సమాధానాలం,
ధర్మసందేహాలసమన్వయాలం.
కర్తవ్యం కార్యశీలతప్రబోధాలం.
నైతికత్వం నిజాయితీపథాలం.
మూర్తిమత్వమనోభావనాలమై,వ్యక్తిత్వవేదం,వెన్నెలకన్నులం.కృతఘ్నుల్నీక్షమిస్తున్నపౌరులం,కృతకంవిద్వేషంకీకృతజ్ఞతలం.
ఆధ్యాత్మికంసుగుణశక్తులమై, సామర్ధ్యాలజ్ఞానసంపన్నులం.
సమస్తవృత్తులసమిష్టివ్యక్తులం.సహస్రాధికసమారాధనభక్తితో,
సహజ ప్రకృతి,సద్భక్తిపథముక్తి, స్వశక్తిశోభలసర్వఆరాధ్యులం.
స్వధర్మందక్షత,స్వచ్ఛందసేవగ,
స్వభావప్రభలగీతోపనిషత్తులం.సర్వప్రాణిసమాదరణశక్తులం,
సర్వజనసమాజసహజీవనులం.నిస్వార్ధసేవలసంకల్పవృక్షాలం,త్యాగ,యోగాలవిశ్వాదర్శాలం.రాగానుబంధం,అభిమతాలం,రాజనీతి,విజ్ఞతలస్నేహాలం. మనోసుగంధాల,జనసమ్మతం,
మానవత్వమతంహైందవాలం.
విశ్వస్వేచ్ఛలవిశాలదృక్ఫథాలై, వికృతాల్నీఓదార్చేసహృదయం,విపత్తునెదుర్కునే సహనాలం. కల్మషాల్ని,కలుపులుగాఏరేస్తూ,
కల్లగాని లౌకికత్వాల సాగులం.
కల్లోలం,లోపంసరిదిద్దేనేర్పుతో, నైపుణ్యం,నీతులపధఓర్పులం.
పుణ్యంపాపభీతిఔదార్యాలమే,
పట్టుతప్పనిజాతిఔన్నత్యాలం.
గట్టుదాటనీని నీతిరీతులం , పట్టుదలలం,ధర్మకట్టడులం.
చాపకిందికల్లోలంనీరుగుర్తించి,
చేటుచేతలముఠాముసుగులో,
చిచ్చుపెడ్తూరచ్చచేసేద్రోహుల్ని,
పక్కనేవున్న దుష్టదుర్నీతుల్ని,
పట్టించుకుంటే,పనిపట్టేజగాలై,గట్టిసంకల్పజగత్తుసూత్రాలం, శక్తిమంత్రాలశౌర్యస్థైర్యాలమే.*
ముసుగుతీసి,ముప్పుముట్టడ్నీ,మనిషిరంగువెలిసిమృగాలనూ,
మనలోంచికుయుక్తికూటముల్ని,మనంగాజాగృతి జీవనాలమై, ప్రభంజనమై,చీకట్లుతరిమేస్తూ, జాతిసంప్రదాయజ్యోతవుదాం.*డా.వేదుల శ్రీరామశర్మ'శిరీష'* **కాకినాడ.9866050220*

కోసూరు సుమంత్ బాబు "సుమకిరణసంయుక్తం" చెప్పారు...

కోసూరు సుమంత్ బాబు
170 /2 (46 ) బిగ్ స్ట్ర్రేట్ ,తిరువల్లిక్కేణి ,
చెన్నై -600 005, తమిళనాడు
ఫోను 09445878668
“సుమకిరణసంయుక్తం”


ధర్మం


ధరించునదే ‘ధర్మం’ అయినది
‘ధర్మం’అనిర్వచనీయం, నిగూఢం
ధర్మం నిత్య సత్యం, విశాల రూపం
‘ధర్మం’ పరమాత్మ ప్రసాదం!
“ధర్మో రక్షతి రక్షితః”
‘ధర్మాన్నిరక్షించు అది నిను రక్షించు’!
చేసిన ధర్మం చేతికొస్తుంది
తగు సమయం చేయూతనిస్తుంది!


భగవన్నువాచ:
‘పరిత్రాణాయ సాధూనాం
వినాశాయ చ దుష్కృతాం!
ధర్మ సంస్థాపనార్ధాయ
సంభవామి యుగే యుగే!!’
ఆ స్వామియే ధర్మ స్వరూపం
శ్రీకృష్ణుని నిర్గుణ స్వరూపమే ధర్మం
ఆ నామసంస్మరణయే ధర్మాచరణ!

మరో భగవన్నువాచ:
‘ఆచార ప్రభవో ధర్మః –
ధర్మస్య ప్రభరచ్యుతః’!
ఆచార ఆచరణే ధర్మవర్ధనం
‘ధ్రియతే ధారయతే ఇతి ధర్మః ‘!
‘వేదోఖిలోధర్మ మూలం' వేదం!
చేయవలసిన ,జేయ తగని విధినిషేధాలు వేదఘోషలు1
చేయవలసినవన్నీ ఆచరించు
చేయదగనివన్నీ నిరాకరించు
ఆచరించిన ధర్మం నిను రక్షించు!

సామాన్య, విశేష ధర్మమను రెండు
సగటు మనిషి సదా సాధన ధర్మం
“ధృతి, క్షమ, దమం, అస్తేయం,శౌచం ఇంద్రియ నిగ్రహం, హ్రీః (సిగ్గు), విద్య సత్యం , అక్రోధం”, దశ ధర్మ పాలనం:
తలచిన కార్యం కడవరకు సాగించుట
సాటివారిపై క్షమ,సహనము జూపుట
కార్యముపై కడు శ్రద్ధ నిశ్చలమనస్సు
అజ్ఞానమహంకారమతృప్తి లేకుండుట
పరిసరములు, మనోవాక్కాయ శుధ్ధి
పంచేంద్రియ నిగ్రహం,స్థిరత్వ గుణం అనుమానంఆత్మన్యూనత లేకుండుట
విద్యాభ్యాసం,వివేకం,విచక్షణా జ్ఞానం
అబధ్ధమాడక సదాసత్యవ్రతపరిపాలన
“తనదు కోపమే తన శత్రువు
తన శాంతమే తనకు రక్ష”
పగహింస,కోపం,ప్రతీకార ప్రవృత్తి లేమి
అట్టివి మానవునికి విశేషధర్మములు!

నిష్పాక్షికవిద్యాబోధన గురువు ధర్మం
శ్రధ్ధాపూర్వ విద్యాభ్యాసం శిష్య ధర్మం
శ్రమ, న్యాయార్జితం ఎజమాని ధర్మం
పొదుపైన జీవనం గృహిణి ధర్మం
ఇంటిల్లిపాది ఆనందం సంసార ధర్మం
కట్టుకున్నభర్తపైనమ్మకం భార్యధర్మం
నమ్మివచ్చిన భార్యక్షేమం భర్త ధర్మం
పుత్రుల ప్రయోజకత్వం తండ్రి ధర్మం
కన్నవారి తనవారి కీర్తి బిడ్డల ధర్మం
వృద్ధులైన పితృ పోషణ పుత్ర ధర్మం
క్రమశిక్షణ, దేశరక్షణ వీర సైనిక ధర్మం
పోషించు వృతిపై గౌరవమందరి ధర్మం
నమ్మినమిత్రునికుపకారం మిత్రధర్మం
ఆడినమాట తప్పకుండుటసత్యధర్మం
నిస్సహాయుల రక్షణమానవతా ధర్మం
సోమరితనంలేకుండుట పురుషధర్మం
నీటికి దాహం తీర్చుట,ప్రక్షాళన ధర్మం
గాలికి సేదదీర్చుట ప్రాణవాయుధర్మం
అగ్నికి శక్తినిచ్చి,కాంతినిచ్చుట ధర్మం
నేల ప్రాణులకాశ్రయమిచ్చుట ధర్మం
ఆకాశానికి వాయువర్షాలిచ్చుటధర్మం
తత్తమ విద్యుక్తధర్మం సామాన్యధర్మం

కర్తవ్యపాలన నరులందరి ధర్మం
ఫలిత, ఫలాపేక్ష రాహిత్యం ధర్మం
పర్యవసానం, పాపనాశం కృష్ణార్పణం!

సనాతన ధర్మం , హిందూ ధర్మం
సనాతన ధర్మ భావం - సమ భావం
మనుషులంతాఒక్కటే అందరూసమం స్వార్ధం, ఈర్ష్యాద్వేషాలను విసర్జించు
ఆ ధర్మం చరిత్రసంస్కృతి ప్రతిరూపం
అహింసా పరమో ధర్మః
భూతదయ,అవ్యాజ ప్రేమ పంచు దానధర్మములు చేయ ఆసక్తిచూపు జాతీయ సమైక్యతా భావం అలవరచు సంతోషకర జీవనం,సంఘీ భావానికి
సనాతన దర్మం ఉత్తమం!!

మన ధర్మచక్రంలో 24 గుణలక్షణాలు: “ప్రేమ,ధైర్యము,సహనం,శాంతి ,కరుణ మంచి,విశ్వాసం,మృదుస్వభావం సంయమనం,త్యాగనిరతి,ఆత్మార్పణ, నిజాయితీ,సచ్ఛీలత,న్యాయం,దయ,హుందాతనం,వినమ్రత,తాదాత్మయం జాలి,దివ్యజ్ఞానం,ఈశ్వరజ్ఞానం,దైవనీతి(దివ్యనీతి),దైవభీతి(దైవభక్తి),దైవంపై ఆశ/నమ్మకం/విశ్వాసం -24”
24 గంటలకాల చక్రమది “ధర్మచక్రం”
24 గుణముల ధర్మంగా పాటించు
దేశభక్తి,దేశోధ్ధరణ ప్రతిహిందూ ధర్మం!
************










కోసూరు సుమంత్ బాబు "సుమకిరణసంయుక్తం" చెప్పారు...

కోసూరు సుమంత్ బాబు
170 /2 (46 ) బిగ్ స్ట్ర్రేట్ ,తిరువల్లిక్కేణి ,
చెన్నై -600 005, తమిళనాడు
ఫోను 09445878668
“సుమకిరణసంయుక్తం”

‘అవ్వ లేఖ’
బామ్మ మా ‘నగరమవ్వ’
ఆమె లేఖలు ‘ప్రేమ’లేఖలు!
అనాదిగా పెంచుకొన్న అనురాగాలవి
అరవైయేళ్ళ ముందు మాట
ఫోన్లు,’మెసేజ్లు’ ఊహించనిరోజులవి?
ఉత్తర ప్రత్యుత్తరాలు లేకపోలేదు!!
తంతి తపాలా శాఖ వారి ‘ఇన్లెండ్లేఖ’
మూడు పేజీలు చాలని లేఖలామెవి!!

‘నగరం’నుండి మాగ్రామానికి విజయం
పయన దూరమేమో పదిమైళ్ళేనేమో!
గ్రామం చేరీచేరనంతలో చేరినవిషయం
‘నగరానికి’‘ఇన్లెండ్లేఖ’వెంటనేవ్రాయడం
ఉIIకుIIపరితోమొదలు చేరినవిషయం
గ్రామంలో మనవారి క్షేమంపేరుపేరున
ఇంటి పెద్ద మొదలు చంటి బిడ్డ వరకు
బంధువర్గమంతా 40-50మందివరకు
అందరిక్షేమం విశదంగనగరంలోవారికి
అందమైన లిపితోలిఖింప మనుమడు
వ్యాసునికి వినాయకుడిలావసంతన్న
ఓపికతో విని రాసి అయిందనుకుంటె

మళ్ళీమొదలౌ లేఖఅనుకోనిమలుపు
ఇపుడు కుశల ప్రశ్నలు అక్కడివారికి
వదలి వచ్చింది పదిమైళ్ళకాల వ్యవధి
అయినా అక్కడ 40-50 పేరుపేరునా
‘అడిగినట్లు తెలుపు’ ‘మందులువాడు’
చంటోడు జాగ్రత్త,పిల్లలబడిముగిసిందా
అబ్బాయారోగ్యం జాగ్రత్త,ఎండ చూస్కో
‘వచ్చింది మొదలు నా మనసక్కడే’
ఇలా సాగుతుంటుంది లేఖ పూర్తిగా!
వ్రాయడం, మధ్యమధ్యలో చదువడం
మనుమడి పని, మామ్మనమ్మేవరకు
మూడు పేజీలు నిండుచున్నదన్నను
మనుమని పాట్లు,అగచాట్లతోపనిలేదు
‘అవ్వ లేఖ’ ఆగదు!ఆ అనురాగ లేఖ!
అది అమ్మమ్మల ఆ తరం ఉత్తరం
పరస్పర ప్రేమాభిమానాల ప్రతిరూపం
‘డాక్’ లో దాగిన ‘ప్రియమైన’వాక్యాలు
లేఖల మార్గాన అవిఅనురాగ రాగాలు

శ్రీకృష్ణుడు బృందావనికి పంపిన ‘లేఖ’
గోపగోపికల ప్రతీక్ష,రాధ నోదార్చినరీతి
వైదర్భి వైకుంఠనాధునికీ వ్రాసిన ‘లేఖ’
నిశ్చిత ప్రేమ,నిశ్చల భక్తి సందేశాలు!!

అట్టి సందేశమిచ్చేదే మా ‘అవ్వలేఖ’
‘నగరమవ్వ లేఖ’గా ప్రత్యేక పేరుంది!
అవి నేటికీ మరపురాని “ప్రేమ”లేఖలు
***************



























Sarma చెప్పారు...

శ్రీ నరసింహ పంచరత్నం
1) నమో భగవతే నారసింహాయ
తీవ్రశిరోపీడారోగోపశమనాయ
తీవ్రమనోదుఃఖబాధానివారణాయ
తీవ్రహృద్రోగప్లీహభగందరోపశమనాయ ||

2) నమో భగవతే నారసింహాయ
తీవ్ర అతిసార అరోచక అస్మారిరోగనివారణాయ
తీవ్ర గ్రహణి గుహ్య హిద్మ హస్తి మేహ రోగనివారణాయ
తీవ్ర మధుమేహ మూత్రకృచ్ఛ్ర నష్టరక్తరోగనివారణాయ ||




3) నమో భగవతే నారసింహాయ
తీవ్ర రక్తమేహ రక్తప్రధార రక్తచాప రోగనివారణాయ
తీవ్ర ఉదరావర్త ఉదరామేహ వ్రిక్కశోతరోగనివారణాయ
తీవ్ర రాజయక్ష్మాది రక్తస్థివిసన్నియద్రోగనివారణాయ ||

4) నమో భగవతే నారసింహాయ
తీవ్ర అగ్నిమాంద్య అధిమంత అక్షిశూలవ్యాధి నివారణాయ
తీవ్ర అమావత ఆమజశూల అర్ధవభేదకవ్యాధి నివారణాయ
తీవ్ర దాహ దంతవేష్ట గలగండ కంఠశూలక రోగనివారణాయ ||






5) నమో భగవతే నారసింహాయ
తీవ్ర నాసపాక నాసప్రశోస నాసార్బుదవ్యాధి నివారణాయ
తీవ్ర కుష్ఠ ప్రలుప్తకుష్ఠ శిల్పాద శితపిత్తవ్యాధి నివారణాయ
తీవ్ర కర్కటి విశూచి మశూచికాది రోగనివారణాయ ||

సర్వం శ్రీనారసింహదివ్యచరణారవిందార్పణమస్తు

Sarma చెప్పారు...

శ్రీ వక్షుడె శ్రీకృష్ణుడు
జీవాత్ములు మెల్గునట్టి క్షితిసంస్థితికై
తావైన దైవమాతం
డావేల్పుని పాదపద్మ మఘదూరమ్మౌ.

అఘదూరుని మఖరూపుని
మఘవాది సురస్తుతుని ఉమాధవనుత నీ
లఘనాభుని నందసుతుని
లఘుదీక్షను కొలిచినంత రక్షణమిడడే.

పుణ్యాపుణ్య వికర్ముని
వన్యేభము గాచినట్టి వనజేక్షణునిన్
గణ్యాగ్రణులందగ్రణి
ధన్యంబవ జన్మ కృష్ణు తలచెదమయ్యా!

పలుభామల వలపుల సొం
పుల తేలుచు బ్రహ్మచారి పొలుపుంగొను న
స్ఖలితుని శ్రీ కృష్ణుని చే
ష్టల బ్రహ్మాది సురలెరుగజాలరు మహిమన్.

రాయప్రోలు సీతారామశర్మ భీమవరం.

Sarma చెప్పారు...

వేదశిఖలు వేదాంతాఖ్య విస్తృతములు
ఉపనిష ద్దశకమ్మున కున్నతమగు
వివరణమ్మును విజ్ఞాని వెలయజేసె
మరి వివాదాల భేదాలు మణగిపోవ|

నిగమ రాసి చెలగె నిశితంబు వ్యాసుండు
సుష్టు దెలిపె బ్రహ్మ సూత్ర తతిని
చక్కనైన వ్యాఖ్య సమకూర్చె వాటికై
వచ్చి వ్యాసమునియె మెచ్చుకొనగ |

సార్థకత గోరు జ్ఞానికి జగతియందు
నొక్కటే త్రోవ -గురుసేవ -నిక్కముగను
శంకరుని జేర దొడగిరి
ఛాత్రులగుచు
మహిని మధుసేవకై తేంట్లు మరలునట్లు |

Sarma చెప్పారు...

ఇనకులతిలకం దశరథ వరదం
హితకరవచనం ప్రియకరవదనం
నిశిచరశమనం సుజన శుభకరం
భజ జనక సుతావర పదమనిశం

అవనీ క్షేత్రమునందు మానవుడనై యానందమున్బొందగా
స్తవనీయంబగు కార్యముల్ సలిపి విశ్వంబంతటన్ శాంతి కై
సవనంబోయన జీవితంబు గడుపన్ సంసారమే వీడుచున్
భవదీయాంఘ్రిని చేరగల్గుదునదే భాగ్యంబు సీతా పతీ!

చిలకమఱ్ఱి కృష్ణమా చార్యులు

Sarma చెప్పారు...

సకలైశ్వర్యమునీయధీన,
మదివిశ్వంబెల్లవ్యాపించు
నీకొక లేశంబు వికారమున్
గలుగ ,దాత్మోత్కర్షులీక్షింపకూరక,
గర్వంబునవిఱ్ఱవీగెదరు;సర్వ
స్వామ్యముల్ నీవె .
పాయకరక్షించుట నీస్వభావము దయాఢ్యా!శ్రీనివాసప్రభూ!

అన్నీఉన్నవారు మౌనంగానేఉంటే,
ఏమీ లేనివారు
ఎగిరెగిరిపడతారన్నది
సామెత.

Sarma చెప్పారు...

శీర్షిక: *కర్తవ్యంజీవన్ కాంతికవచంఓజోన్.* *రవికిరణాలు,అందాలతారలై,
రాజిల్లేశోభలఆనందఅంబరం.
రాగానురాగాలజీవనసంబరం,
రక్షణలక్ష్యాలైప్రకృతిజీవనం.
*విశ్వశ్రేయంవాతావరణదక్షతై,
విశ్వగోళాన్నిచుట్టిపర్యావరణం.
ధరణితేజంప్రకృతిపచ్చదనాలై, కల్మషంబాటవీడితేకాంతిస్వరం*ధరిత్రిజీవరక్షణకవచంఓజోన్నే.మితమీరుఅతినీలలోహితాల్ని,అనునిత్యసూర్యకిరణహితమై,ప్రాణవాయుసంరక్షణజీవనం.
*మనంమేలుకుంటేమేలుకోరు,
మహితగొడుగై నింగిచేతుల్లో,
విశ్వసనీయతగమానవాళికి,
పంచభూతవరాలపొరఓజోన్.
*అవనిఇంటికప్పులాకాచుశక్తి,
అందరిరక్షణమిత్రత్వకవచమై,
కాలుష్యం కబళించనీనిశ్వాసగ,
కర్తవ్యంశీలతకాంతిఓజోన్పొరనే.*డా.వేదుల శ్రీరామశర్మ,"శిరీష",కాకినాడ.9866050220

Sarma చెప్పారు...

కాయంబస్థిరమౌట,సజ్జనులసాంగత్యంబుగావించి, విజ్ఞేయంబాత్మము,సద్వివేకగతులన్
క్లేశంబులన్ బాయగా
ధ్యేయంబాహరిరూప,మర్థితతికిన్
దేయంబువిత్తంబు,
సద్గేయంబెప్పుడుగీత,విష్ణుగుణముల్ కీర్తించు నామంబులున్

Sarma చెప్పారు...

తెలుగు భాషా భావాక్షర
నీరాజనం......

స్పందించింది హృదయం
నీ ప్రగతికి మురిసి
పురోగమించింది మానసం
నీ ప్రతిభను చూసి
ప్రజా రంజకుడుగా
ఏక ఛత్రాధి పత్యంతో
పడునాలుగేండ్లు గుజరాత్ ముఖ్యమంత్రిగా
ఆరు సంవత్సరాల నుండీ భారత ప్రధానమంత్రిగా
అఖండ విజయాలతో
మచ్చలేని నేతగా
ప్రశంసింప బడుతూ
అహమ్మదాబాద్ నుండి
హస్తినాపు రికి చేరి
దేశ విదేశ నాయకులచే
కీర్తింప బడుతూ
కర్షకుల కన్నీటిని తుడుస్తూ
కార్మికుల శ్రేయస్సును
కాంక్షిస్తూ
పేదల పెన్నిధిగా నిలుస్తూ
విద్యార్థుల భవితను
యోచిస్తూ
బడా బాబుల భరతం
పట్టడానికి ఆర్ధిక సంస్కరణలెన్నో
చేస్తూ
సరిహద్దు దేశాల్ని కూడా
ధీటుగా ఎదుర్కొంటూ
కరోనా కారణంగా ఆర్ధిక
సంక్షోభంలో సైతం
యుక్తితో భారత దేశాన్ని
మును ముందుకు నడిపిస్తూ
సాహస వీరుడుగా
సత్య వ్రతుడుగా
నీతి న్యాయ ధర్మ పరిపాలనా పరి రక్షకుడిగా
ఏడు దశాబ్దాల్ని పూర్తి
చేసుకుని
ఎదురులేని నేతగా
అజాత శత్రువుగా
భారతమ్మ యశస్సును
ఏదేశ మేగినా ఎందు
కాలిడినా అందం దే
నా దేశ నా ప్రజల
యసస్సన్నట్లుగా
మేరా భారత్ మహాన్ అంటూ
సారే జహాసే అచ్చా
హిందూ స్థాన్ హమారా
హమారా అంటూ
దేశాన్ని మును ముందుకు పయనింప
చేస్తూ
సెప్టెంబర్ 17న గుజరాత్
లోని వాద్ నగర్ లో
దామోదర్ దత్ దీనాబెన్ ల తృతీయ
సంతానమై శ్రీ నరేంద్ర
దామోదార్ధస్ మోదీజీ
అనురాగమై జనియించి
అందరినీ అలరించి
ఆదర్శ వంతుడై
యశోదా బెన్ కు పతిగా
నిలిచిన
మేరు నగ ధీరునికి
భారతమ్మ ముద్దు బిడ్డకి
మన భారత ప్రధానికి
జన్మ దిన సందర్భంగా
ఈ తెలుగు భాషా భావాక్షర నీరాజనం...
దోసపాటి.
సత్యనారాయణ మూర్తి.
ఎం.ఏ. లిట్.
డిప్యూటీ .యెస్.యెస్.
రిటైర్డ్. యెస్.సి.రైల్వే.
రాజ మహేంద్ర వరం
9866631877.

Sarma చెప్పారు...

శీర్షిక: *పరమార్ధంకవితాపదనిసలై.* *పచ్చనిపల్లవాలైకవిత్వం- పదం-పల్లవులభావుకత్వం, పలకరించు భాషాఫథాలమై,
పరిమళింపుమనోజ్ఞతత్వం.*
కొమ్మలకుఆకులొచ్చినట్లుగ,
అమ్మఆప్యాయంఅక్షరాలౌతూ,
నమ్మకాలపత్రహరితంఆకులై,
అచ్చమైనభావనం కవిత్వమే.
*లోకంరాగాల బాసటలవుతూ,
కాలంవ్యూహాలభరోసాగీతాలు.
భాష్యమైకలంకదలికలక్రాంతి,
విశ్వాసంఊపిర్లుజ్ఞానశాంతినే
*సమాజసందర్భాలగళాలిప్పి,
సమయాల సంఘటితంగసాగి,
సమగ్రత,విలువలవెలుగులుగ,
సఖ్యతానురాగంకావ్యసుగంధం.నల్లబొగ్గుని,ఎర్రగప్రజ్వరిల్లజేసే,అగ్నికణం,జీవజ్వాలకవిత్వం,
సానపెట్టినవజ్రం,కర్తవ్యగ్రంధం.
సాధనఉలిచెక్కేనైపుణ్యశిల్పం.
*డా.వేదుల శ్రీరామశర్మ"శిరీష",
కాకినాడ,9866050220.*

Sarma చెప్పారు...

శీర్షిక : తెలంగాణ విమోచనం

మొఘలాయుల పాలనలో
మోసపోయినారు ప్రజలు
ఆంగ్లేయుల పాలనలో
అణిగిమనిగి బతికినారు
నైజాముల రాజ్యంలో
రంకు రజాకర్ల హుకుం
కంటికి కనిపించింది
కళ్ళముందె క్రూరంగా
కసితీరా అనుభవించి
కాటికి పంపారుగా
పిల్లాతల్లని చూడక
కామాందుల ఘఢీలలో
బందీలై పోయారు
తెలంగాణ వనితలు
రజాకార్ల దాడికి
గుబురులే గుడిసెలాయె
చెల్కలే ఊరాయె
ఊర్లేమో ఎడారాయె
పంద్రాగష్టురోజు
దేశానికి స్వాతంత్ర్యం
వచ్చిందని వినడమే
నైజాముల పాలనలో
లేదుమనకు స్వాతంత్ర్యం
ఉక్కు మనిషి వల్లభాయ్
సలాం సలాం నీకు భాయ్
సర్ధార్జీ సాహసంతొ
హైదరాబాద్ దక్కినాది
ముష్కరులను పారద్రోల
లష్కర్లో సిపాయి దింపి
సవాలే విసిరావు
సావే దిక్కన్నావు
నైజామే దిగివచ్చి
నీకు సలాం పెట్టాడు
హైదరబాదు నీకు
హస్తగతం అయ్యింది
సెప్టెంబర్ పదిహేడున
తెలంగాణా దక్కింది
అదే మనకు స్వాతంత్ర్యం
అదే మనకు స్వతంత్రం

తెలంగాణా విమోచనా దినోత్సవ శుభాకాంక్షలతో

మీ
గోగులపాటి కృష్ణమోహన్
కవి, రచయిత, జర్నలిస్టు
సూరారంకాలని, హైదరాబాదు
9700007653

Sarma చెప్పారు...

శ్రీ లలితా పంచరత్నం
1) భవదారిద్ర్యనాశినీం
భావదారిద్ర్యభంజనీం
భవపాపౌఘవారిణీం
భవానీం లలితాంబికాం ||

2) భండాసురనిషూదినీం
భావనారూపసంచారిణీం
భార్గవరామసంసేవితాం
భవానీం లలితాంబికాం ||




3) భువనబ్రహ్మాండపాలినీం
బాలాత్రిపురసుందరీం
బాలారిష్టదోషవారిణీం
భవానీం లలితాంబికాం ||

4) భావోద్వేగరహితమానసాం
భానుమండలచారిణీం
భానుకోటిప్రకాశినీం
భవానీం లలితాంబికాం ||






5) బంధమోచనకారిణీం
బలోత్సాహప్రదాయినీం
బలభద్రవందితాఘ్రియుగాం
భవానీం లలితాంబికాం ||

సర్వం శ్రీలలితాంబికాదివ్యచరణారవిందార్పణమస్తు

Sarma చెప్పారు...

తోదకం
౼౼౼౼
తోదక తోటక తోరపు ఛందాల్
మోదము హ్లాదము ముచ్చటగొల్పున్
నాదము వేద నినాదము వోలెన్
స్వాదు తరంబగు చక్కని రీతిన్.

పందెపు గుఱ్ఱపు పర్గుల ధాటిన్
అందపు చానల యందెల మ్రోతన్
నందుని కుఱ్ఱ డొనర్చెడు లీలన్
సందడి డెందము ఝల్లను జేయున్.

భక్తిని రక్తిని పంచగ జాలున్
శక్తిని యుక్తిని చాటగ జాలున్
సక్తిని నెమ్మది చక్కగ పెంచున్
వక్త సమర్ధత వ్యాప్తము జేయున్.

భావము క్లుప్తత పంచగ జేయున్
భావుక శక్తికి భాగ్యము నిచ్చున్
భావి తరమ్ముల బాటలువేయున్
బావె కదా తలపన్ ఘన కీర్తిన్.

రాముని యాతని రామ సుగాథన్
భీముని యన్నను వ్రేలిన దారుల్
కాముని వైరి సుఖమ్మగు చేతల్
సామముగా వినజాలగ జేయున్.

ఛందములందున జాణలనంగన్
కందుక కేళిని కాన్కలు జేయున్
విందుల స్యందన వీథులసాగున్
వందన మందెడు వైభవమొప్పున్.

(పేరి వెంకటసూర్యగారి స్ఫూర్తితో)

రాయప్రోలు సీతారామశర్మ భీమవరం.

Sarma చెప్పారు...

శ్రీమన్నారాయణాంఘ్రిద్వయ సరసిజ సేవామహద్భాగ్యదాతా
పృథ్వీదాసార్తినాశః సతతశుభద వాక్ప్రాభవోపేత దేవః
సంసారోత్తారమంత్రః జనహితకర కార్యానుకూలో యతీంద్రః
శ్రీమద్రామానుజార్యః వసతుమనసి మోక్షప్రసాదాయ నిత్యం


శ్రీపతి సేవలో బ్రతుకు రీతిని తెల్పి పరంబు బొందగా
జూపెను మార్గమందరకు చొక్కపు బంగరు డెందమోయనన్
పాపములన్ని బాపి బహు భాగ్యములీయగ వచ్చె,ముక్తికిన్
దీపము భాష్యకారుడని దివ్య యతీంద్రుని గొల్తుభక్తితో

------------------*********-----------------*******-------------

గర్వాంధకారమగ్నోహం
స్వార్థపూర్ణ ప్రభావితం
భవబంధాత్ భయభ్రాంతం
హేహయగ్రీవ రక్షమాం!

కలియుగమున పుట్టి కలుషమతిగనుండి
తెలియ నైతి నీదు దివ్య మహిమ
పాప పంకిలమును ప్రక్షాళనముజేసి
కావుమశ్వ వదన కరుణజూపి

చిలకమఱ్ఱి కృష్ణమా చార్యులు

Sarma చెప్పారు...

*భోగలాలస మనిషి*?
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
మనిషి భోగలాలసుడోయ్
వీడికి ఎక్కడి వనరులు చాలవు !
దోచుకుంటూ దాచుకుంటూ గొంతు మునిగేంత
సుఖాలను అనుభవిస్తున్నాడు
రాత్రి లేదు- పగలు లేదు
24 గంటలూ సుఖ సమయం
పాపం ! మూగ జీవాలకేం సుఖం -
నరుకుడుపోతూ నరకం
బతకడానికి చస్తున్నాయి !
రేపు సుఖంమనిషి రాక్షసుడౌతాడు
ఒక్క పురుగునైనా వదలడు
రేపటి తరాలు ఏం చూస్తాయి ?
ఇంచు ఇంచు
భూమ్మీద ఎడారులను!
పీలిస్తే అంటుకట్టే రోగాలను
- కందాలై రాఘవాచార్య

Sarma చెప్పారు...

ఆశ్వయుజాగమనం(అధికం)
౼౼౼౼౼౼౼౼౼౼౼౼
అడుగుంబెట్టుచునుండె నాశ్వయుజమే అంబా దరస్మేరమే
యెడదంబండుగజేయుచుండె ననగా యీధాత్రినల్వంకలన్
బడిపండున్ తెలిపుచ్చపువ్వులవలెన్ పర్వంబుగావింప చం
ద్రుడె శోభామయ శార్వరీనిశల సంతోషంబు నందింపగన్.

మాసాధిక్యత శార్వరీనిశలె సమ్మాన్యంబులై యొప్పుగా!
ధీ సౌభాగ్యజనంబు శాస్త్రచయమున్ దీపింపగాజేయు శో
భా సర్వస్వమెపండి వ్యాప్తిగొనుచున్ భాసించెనా, ధాత్రిపై
గాసిం జెందగ చీకటే, వెలుగ రాకా భోగ భాగ్యంబులే!

రాయప్రోలు సీతారామశర్మ భీమవరం.

Sarma చెప్పారు...

సీ. పూర్వ పక్షము గాగ భువిని పాషండుని,
ప్రామాణికముగ నప్రతిభు జేసీ, విషయ వాదములను విజ్ఞత ఖండించి,
కుటిల తర్కములను కొట్టివైచి, యుక్తధర్మాచార భక్త సాధకులకు,
నిర్గుణ భావన నిగ్గు నేర్పి,
షణ్మతా చారంబు సంస్కారమొనరించి పరిపక్వ విధుల సుస్థిర మొనర్చి,
గీ, పాదచారిగ గురుడిల
భరత భూమి
హితవు గోరుచు నాసేతు హిమ నగంబు
పర్యటించి, బ్రహ్మాద్వైత పరమ
సత్య
వాదమున నుద్ధరించెను వేద మతము.

Sarma చెప్పారు...

*చిత్ర కవిత* ---- *లలితా చండీ*

తెలుగుతల్లిని చూడ మోదమె
పుడు కలుగు
నీరాజనములిడ నేతలందరు
వెడలిరి... వంది మాగధుల తోడ...
అక్షరాలు తరిగి ఆంగ్ల మమరె
భాషలో......
అచ్చరువొందె తెలుగు తల్లి !!
తేనె లొలుకు భాష.. తెలుగు భాష..
ఏ జన్మ పుణ్యమో తెలుగు నేపలక
నీకిదే శత సహస్ర నమస్సులమ్మ
గైకొనమ్మ ఈ లలిత వందనమ్ము
లలితా భాస్కర దేవ్
17-9-2020

Sarma చెప్పారు...

🌧️ *మాగింది మబ్బు* 🌧️
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
నల్ల నల్లగా మబ్బు
మాగి మాగి ఎంత నీటితోఉబ్బిందో
నీరుకారు మేఘం
ఊరంత మేఘం
ఊరిన మేఘం
ఒక్క ఉరుము మెరుపుతో మబ్బు
నీటి రసం చిమ్ముతోంది
నాల్క పైబడ్డ చినుకులు
ఎంత తియ్యనో చక్కెర అక్కరలేదు
వర్ష ఋతువుతో మొగులుమాగితే
భూమి ఆకుపచ్చగా మాగి
నోటి దగ్గరకు బుక్కలుగ వస్తుంది
ప్రతి ఊరి నిండు చెరువులో
మాగిన మబ్బు నీరే
పొలాల్లో ఊటలు ఊటలుగా భవిత
- కందాలై రాఘవాచార్య

Sarma చెప్పారు...

మోహముద్గరము

పద్యాను వాదము
గోపాలుని మధుసూదన రావు


భజన సేయుము గోవిందు భక్తి తోడ
మూఢ ! భజియించు గోవిందు ముక్తికొరకు
అంత్యకాలంబునందున నరయ నీదు
" విద్య " నీయదు రక్షణ వినుము వినుము

విత్త సముపార్జ కాంక్షను విడువు మూఢ !
మనసు సద్భుద్ధియందున మగ్న పరచు
అరయ నిజకర్మవలన నీ కందినట్టి
విత్తమున తృప్తిపరచు నీ చిత్తమెపుడు

నారి స్తనములపొందిక నాభి జూచి
మొహమందున మూర్ఘువై మునుగ వద్దు
సర్వమదియల్ల మాంసపు సంగతంచు
మాటిమాటికి తలచుము మనము నందు


కమలపత్రంబు పైనున్న సలిలముగను
సర్వ జీవిత మత్యంత చంచలంబు
అరయ నభిమాన రుజలకు నాటపట్టు
శోకమయమని తెలియుము లోకమంత


విత్తసంపాదనము సేయ , ప్రేమ తోడ
పలుకరింతురు నిన్ను నీ పరిజనంబు
బడుగుజర్జర దేహాన బ్రతుకు చుండ
నెవ్వ రడుగరు క్షేమంబు నింటియందు

Sarma చెప్పారు...

బ్రహ్మాండభాండాల భద్రతన్ గనుస్వామి
బ్రహ్మోత్సవానంద వైభవంబు
బ్రహ్మయేకడిగెడున్ పాదాలుగలస్వామి
బ్రహ్మోత్సవానంద వైభవంబు
శ్రీదేవి భూదేవి సేవలందెడు స్వామి
బ్రహ్మోత్సవానంద వైభవంబు
తిరువీథులాసక్తి తిరుగు చుండెడు స్వామి
బ్రహ్మోత్సవానంద వైభవంబు

భవ్య వాహనారూఢుడై ప్రాభవమున
భక్తజన నేత్రసందోహ పర్వదుడగు
శ్రీ కలియుగ వైకుంఠ విశ్వేశ్వరునకు
వసుధ బ్రహ్మోత్సవానంద వైభవంబు.

బ్రహ్మాండభాండాలె బ్రహ్మరథముపట్టు
బ్రహ్మాండనాయకు ప్రాభవంబు
అమరాపగాజన్మ కాధారభూతమౌ
బ్రహ్మాండనాయకు ప్రాభవంబు
బృందారకానంద సందోహకారియౌ
బ్రహ్మాండనాయకు ప్రాభవంబు
నారద సంకీర్త నాహ్లాద హృదయుడౌ
బ్రహ్మాండనాయకు ప్రాభవంబు

మహిజనమ్ముల వేల్పుగామానితుడగు
నిత్య కల్యాణ వైభవ స్తుత్యడైన
స్వామి వేంకటేశ్వరదేవు సాలకట్ల
పసిడి బ్రహ్మోత్సవంబుల ప్రాభవంబు.

రాయప్రోలు సీతారామశర్మ భీమవరం.

Sarma చెప్పారు...

మోహముద్గరము

పద్యానువాదము
గోపాలుని మధుసూదన రావు

తనువు నందున ప్రాణంబు తనరు వరకె
కుశలమడుగుదురింటిలొ కూర్మి తోడ
తనువు నందలి ప్రాణంబు తరలిపోగ
బంధు వర్గంబు నినుదాక భయము నొందు

ఆరయ బాల్యంబు నందున యాటలందు
తరుణవయసున సక్తత తరుణు లందు
చివరవయసున సక్తత చింతలందు
సమయమెపుడుండు పరమాత్ము స్మరణ సేయ

ఎవరు నీ భార్య ? పరికించ నెవరు సుతుడు ?
చిత్రమరయగ సంసార జీవనంబు
వఛ్చి రెటునుండి వారలు వసుధ పైకి ?
చింతసేయుము నిరతంబు చిత్తమందు

జగతి సత్సంగముననె నిత్సంగ మోదవు
ఉర్వి నిత్సంగముననె నిర్మోహమోదవు
నిశ్చలగు మదిగల్గు నిర్మోహమునను
మోహరహితంబునను గల్గు ముక్తితుదకు

వాంఛ లెక్కడ నరునకు వయసు పోగ
సలిలమెక్కడ నుండును సరసు యెండ
తనదు పరివార మెక్కడ ధనము తగ్గ
సత్యమరయగ సంసార సరళి యిదియె

Sarma చెప్పారు...

ఆంజనేయస్తుతి
౼౼౼౼౼౼౼౼౼
దాసాంజనేయుడై ధర్మావతారియౌ
శ్రీరామచంద్రుని సేవజేసె
భక్తాంజనేయుడై రక్తితో ననిశమ్ము
రామనామామృతరసముగ్రోలె
వీరాంజనేయుడై వేగమ్ముతోనేగి
లంకనగ్నికి కాన్కనుంకువ నిడె
అభయాంజనేయుడై అరిషట్కబాధల
నడగించి భక్తుల నాదరించె

పలువిధంబగురూపాల వాయుసుతుడె
ఆదరంబున జనులను ఆదుకొనుచు
శివునితత్త్వమ్ముతోమెల్గి క్షితినిగ్రాలె
నా చిరంజీవి కెదలోన అంజలింతు.

రాయప్రోలు సీతారామశర్మ భీమవరం.

Sarma చెప్పారు...

నేటి యువత సమాజంలో అన్నింటినీ తట్టుకోవడానికి
సిద్దపడాలనే ఉద్దేశ్యంతో వ్రాసాను.

సమాజం పోకడ
---------------------
ఓ యువకుడా ! రావయ్యా !
నేటి సమాజంలోకి.
నిన్నటి దాకా నువ్వు బాలుడివి
ఏం చేసినా గాని
మేం వదిలేసాము.
కానీ
ఇప్పటి నుండి ఇక అది కుదరదు
నీ గురించి నువ్వే జాగ్రత్త పడు,
ఎందుకంటే ఇకనుండి ఇక్కడ
చిన్న పొరపాటు జరిగినా నిన్ను
చీరెయ్యటానికి మేము సిద్దంగా ఉన్నాము.
నువ్వు చిరునవ్వు నవ్వితే మేము నొచ్చుకుంటాము,
నువ్వే దైనా సాధించావని
సంబరపడి వెలిగి పోతుంటే
విమర్శల చన్నీళ్లు గుమ్మరించటానికి
మా నోళ్ళ చెంబులతో
మేము సిద్దంగా ఉన్నాము.
నువ్వు చికాకు పడితే మేము కోప్పడతాము.
నువ్వు బాధపడితే మేము చీదరించుకుంటాము.
నువ్వు ఏడిస్తే ఎందుకూ పనికి రాని వాడివని అంటాము.
నువ్వు ఎలా ఉండాలో మేమే నిర్ణయిస్తాము.
నీ అభిప్రాయాలు నువ్వు నిర్భయంగా చెప్పవచ్చు
కానీ మాతో ఏకీభవిస్తే నే సుమా!
..సుబ్బు శివకుమార్ చిల్లర.

Sarma చెప్పారు...

[23/09, 4:56 am] Subtamanyam Vidik Fn: 👆55వ పద్యం
శా.
ఆలుం బిడ్దలు మిత్రులున్ హితులు నిష్టార్థంబు లీ నేర్తు రే
వేళన్ వారి భజింప, జాలి బడ కావిర్భూత మోదంబునన్
గాలం బెల్ల సుఖంబు నీకు, నిక భక్త్రశ్రేణి రక్షింప కే
శ్రీలెవ్వారికి గూడ బెట్టెదవయా? శ్రీకాళహస్తీశ్వరా!
[23/09, 4:56 am] Subtamanyam Vidik Fn: 👆56వ పద్యం
మ.
సులభుల్ మూర్ఖులు నుత్తమోత్తములు రాజుల్ కల్గి యేవేళ న
న్నలతం బెట్టిన నీ పదాబ్జముల బాయంజాల, నేమిచ్చినం
గలధౌతాచల మేలు, టంబునిథిలో గాపుండు, టబ్జంబుపై
జెలువొప్పన్ సుఖియింప గాంచుట సుమీ శ్రీకాళహస్తీశ్వరా!

Sarma చెప్పారు...

యశోదాత్మజుడు
౼౼౼౼౼౼౼౼౼౼౼
ప్రాతః స్మరణీయులకును
ప్రాతః స్మరణీయ సుగుణరాజిత శోభా
చైతన్యాగ్రణి కృష్ణుడు
స్తోతవ్యుం డాత్మసాక్షి క్షోణిస్థులకున్.

మర్దించుచు కాళీయుని
అర్దనమను తనదుదీక్ష కద్దమ్మనగా
నిర్దేశించిన కృష్ణుని
ప్రార్థించిన మోక్షరాజ్య భాగ్యంబిడడే.

అక్రూరుని రక్షించిన
చక్రాయుధు కృష్ణు పాదసరసీజములన్
వక్రోక్తుల విడనాడుచు
సక్రమముగ వేడ ఛాయసరణిని తోడౌ.

రాయప్రోలు సీతారామశర్మ భీమవరం.

Sarma చెప్పారు...

*జీవనంజవాబులమై*
*క్వారంటైన్,క్వారల్స్ టైమ్ గా, జీవితం గాడితప్పిందంటూ,
జీమూతంకరోనాబందీమని,
జీవించడంమానిగోలపెట్టొద్దు.
*గతంచీకటంటూగదిమూస్తే,
గమనంలో గుర్తింపు రుజువేది,
జీవనంతప్పినకాలాన్నిపట్టాలి,
చేతనవెలుగుగాలాలమవ్వాలి.
*కాలంతోజీవనప్రవాహాలమై,
లోకంరాగాల ప్రకృతులమౌతూ,
బతుకువిశ్వాససంస్కారాలమై,
మమతవెల్గుఆమనిజీవనాలం.
*మౌనంమాటుమనోవిలాపం,
మార్గసాధనకానివేదనతాపం,
నిర్లక్ష్యం నిరాశలభారంమోస్తూ,
నిర్లప్తశూన్యాల్నిపెంచుకోవడమే*మనసుకలల్నికళగాధ్యానిస్తూ,మనుగడఇక్కట్లోస్థైర్యశ్వాసలై,
మందిధైర్యంకు ఇంగితదార్లమే.
నిస్సారనిస్సత్తులవ్వనినేర్పునే.
*ప్రేమదివ్వెలకాంతినవ్వులతో,
స్వశక్తి సదాచారసంస్క్రతులం.
ఏకుమేకైఏకాకితనంఏబ్రాసవక,
ఏకమయ్యేఊఊపిర్లఉత్తేజమే.
*డా.వేదుల శ్రీ రామశర్మ, శిరీష

Sarma చెప్పారు...

గోవిందస్తుతి
౼౼౼౼౼౼౼
గోవిందనామంబె ఘోషించి గిరులెల్ల
మతిని భక్తిని పెంచు మహితమహిమ
గోవిందనామంబె భావించి జలపాత
ములె అందములె చిందు పొల్చుకరణి
గోవిందనామంబె కూజించి పశుపక్షు
లాహ్లాదమందించు హారిసరణి
గోవిందనామంబె సేవించి క్షితిజముల్
పూలతావుల నిచ్చు పూజ్యసరళి

పంచభూతమ్ము లాత్మానుభాష్యముగను
సతము గోవిందనామంబె సల్పుచుండు
నట్టి గోవిందనామంబు నవనిజనులె
తతము సేయంగ మోక్ష ప్రదమ్ముగాదె.

రాయప్రోలు సీతారామశర్మ భీమవరం.

Sarma చెప్పారు...

అలివేలుమంగమ్మ యరకొరలేకుండ
ననిశమ్ము సత్సేవ లందజేయ
పద్మావతీదేవి ప్రణయరాగముతోడ
హృదయానుతాపమ్మునందజేయ
అన్నమయ్యాఖ్యు గేయార్ఘ్యగానమ్ములె
హ్లాదానురంజన మందజేయ
గరుడ శేషాదులే ఘనవాహనాదులై
సంచారసౌఖ్యముల్ సల్పుచుండ
కొండలన్ మార్మ్రోగ గోవిందనామంబు
భక్త జనంబులే పలుకుచుండ
ప్రత్యేక హారతుల్ ప్రతినిత్యమునునీయ
కళ్ళె యద్దుకొనుచు గ్రాలుచుండ
పలుబృందములె రక్తి భజనగీతమ్ములే
పారవశ్యముగూర్ప పాడుచుండ
పెక్కు పారాయణల్ మక్కువగావించి
ప్రజ ధైర్యచిత్తాల వరలుచుండ

తిరుమలను తిరుపతిగ సందీప్తుడగుచు
భక్తమందారుడే కృపావర్షదుడయి
అండపిండాది లోకాల కండయైన
వేంక టేశ్వరస్వామిని వేడుకొందు.

రాయప్రోలు సీతారామశర్మ భీమవరం.

Sarma చెప్పారు...

ఎంపిక
---------
పడిపోయే మనల్ని నిలబెట్టే వారొకరు
పరుగెత్తే మనల్ని పడగొట్టే వారొకరు
వెన్నుతట్టి ప్రోత్సహించే వారొకరు
వెంట ఉండి వెనక్కిలాగే వారొకరు
సమస్యకన్నా నువ్వే
బలవంతుడివి అంటారొకరు
లేని సమస్యల్ని చూపించి
భయపెడతారొకరు
స్ఫూర్తిని నింపి బలాన్నిస్తారొకరు
నిస్తేజం కలిగించి శక్తినిలాగేస్తా రొకరు.
వాళ్లిద్దరూ మనలోనే ఉంటారు
మనం ఎవర్ని గట్టిగా నమ్మితే
వారే ముందుకు వస్తారు
మన మనస్సంతా ఆక్రమించేస్తారు.
మన జీవన రథానికి సారథులవుతారు,
మన నడతను శాసిస్తారు
మన గమ్యం నిర్దేశిస్తారు.
ఎవర్ని ఆహ్వానించాలి
అనే ఎంపిక మాత్రం మనదే!
రచన; సుబ్బు శివకుమార్ చిల్లర

Sarma చెప్పారు...

    శవం ఎవరికీ శతృవు కాదు . . .
  ======================
శవం ఏం తప్పు చేసింది
ప్రాణమే లేకపాయే
ఇంకా ఖననమో దహనమో చేయకుంటే
శవానికి ఊగిసలాటగా జాగరణే
మనకు కనిపించకున్నా 
సూక్మ శరీరాని సూదులు గుచ్చుకున్నట్లే
ఇక్కడే రౌరవ నరకం కదా !

బండ పడ్డట్టు ప్రపంచ రోగం పైన బడి
పురుగులా కొట్టుకుని కొట్టుకుని
ప్రాణాలు పోగొట్టుకున్న మనిషి శవమైతే
ఇంకా ముట్టకపోవుడా
ముట్టు ముట్టు అనుడా
నాగరికత నవ్వులపాలై ఆదిమజాతి ముద్రే !
 
ఇప్పుడు శవం ఎవరికీ శతృవు కాదు
ఏం పేరు
ఏ పేరు పెట్టి పిలవలేం
అనామకం
శవం ఎవరికీ బాకీ లేదు
సమాజమే శవానికి ఋణపడి ఉంది

ఇప్పుడు శవం ముందు అందరికీ
జ్ఞానోదయం కాకుండా ఎలా ఉంటుంది !
నాల్గు భుజాలు ముందుకు రానే వస్తాయి
పది మంది వెనక వెనక పోతారు
శవంకు అంత్యక్రియలు చేయనే చేస్తారు
మానవత్వం ఉప్పొంగి సాధిస్తుంది

రేపు ఇది వీధి వీధికి పరీక్ష కావచ్చు
మనిషి ఎప్పుడూ ఉత్తీర్ణుడే
శవమైతేనేం అందరినీ ఒకటి చేసి
మానవత్వం మకుటం పెట్టి
నిస్వార్థంగా నిష్క్రమిస్తుంది !
     - కందాళై రాఘవాచార్య
         

Sarma చెప్పారు...

సౌభాగ్యలక్ష్మీ రావమ్మా*
🙏🌸🙏🌸🙏🌸🙏🌸

సౌభాగ్యలక్ష్మీ రావమ్మా..... అమ్మా...... సౌభాగ్యలక్ష్మీ!!!!

నుదుట కుంకుమ రవి బింబముగ కనులనిండుగా కాటుక వెలుగ
కాంచన హరంము గళమున మెరియగ
పీతాంబరముల శోభలు నిండుగా,
సౌభాగ్యలక్ష్మీ రావమ్మా......

నిండుగ కరముల బంగారు గాజులు
ముద్దులకు లొలుకు వాదమ్ములమువ్వలు
గలగలమని సవ్వడి జేయగ సౌభాగ్యవతుల
సేవలనందగా,,
సౌభాగ్యలక్ష్మీ రావమ్మా...అమ్మా .....
సౌభాగ్యలక్ష్మీ.....

నిత్య సుమంగళి నిత్య కళ్యాణి భక్తజనుల
మా కల్పవల్లివై కమలాసనవై కరుణ నిండుగా కనకవృష్టీ కురిపించేతల్లి
సౌభాగ్య లక్ష్మి రావమ్మా అమ్మా||

జానకి రాజుని ముద్దుల కొరివితో
రవికుల సోముని రమణీమణీవై
సాధు సజ్జనుల పూజలందుకొని
శుభముల నిచ్చెడి దీవేనలీయగ
సౌభాగ్య లక్ష్మి రావమ్మా అమ్మా||

కుంకుమ శోభిత పంకజ లోచని
వెంకటరమణుని పట్టపు రాణి
పుష్కలముగా సౌభాగ్యములిచ్ఛే
పుణ్యమూర్తి
మా ఇంటను వెలయగ
సౌభాగ్య లక్ష్మి రావమ్మా||

భాగ్యముల బంగారు తల్లి పురందర
విఠలుని పట్టపు రాణి
శుక్రవారం(ప్రతి నిత్యం) పూజలందగా సాయంకాలం
శుభ ఘడియలలో సౌభాగ్యలక్ష్మీ రావమ్మా||

సౌభాగ్య లక్ష్మి రావమ్మా అమ్మాఆఆఆ
సౌభాగ్య లక్ష్మి రావమ్మా||

Sarma చెప్పారు...

*శీర్షిక : ముడుచుకున్న గాన పద్మం - బాలసుబ్రహ్మణ్యం*

సుమధుర గాన గంధర్వుడు
ఘంటసాల శిష్యుడు, గాత్ర వారసుడు
స్వర గాన పద్మభూషణుడు శ్రీ ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం.

శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం
తెలుగునాట బుట్టిన తెలుగువారి అభిమాన “బాలు”
తమిళవాసుడయ్యే దక్షిణాది గాయకుడు
పలు భారతీయ భాషా గాయకుడై వెలిగెను దేశాన.

శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న చిత్రంతో చలన చిత్ర గాయక జీవితం మొదలుపెట్టి
ఎన్నో జాతీయ పురస్కారాలు పొందినారు,
నటుడిగా, గాత్రదాన కళాకారుడిగా, సంగీత దర్శకుడిగా
29 నంది పురస్కారాలు అందుకున్న బహుముఖ ప్రజ్ఞాశాలి మన బాలు.

40 ఏళ్ళ సినీప్రస్తానంలో 11 భాషలలో 40 వేల పాటలు పాడి
40 సినిమాలకి సంగీత దర్శకత్వం, బుల్లితెర న్యాయ నిర్ణేతగా వ్యవహరించి
ప్రపంచములోనే ఒక అరుదయిన రికార్డు సృష్టించాడు
గాయకుడుగానే గాక నటుడిగానూ మెప్పించాడు మన బాలు.
భారతీయుల హృదయాలలో సుస్థిర స్థానం సంపాదించిన
ఆ సుస్వర సుమనోహర గాన గంధర్వునికి నా అక్షర నివాళి.🌹🌹🌹🙏😢😢😢

Sarma చెప్పారు...

ఎస్పి౼స్వర్లోకవాసి
౼౼౼౼౼౼౼౼౼౼౼
గంధర్వగాన సుగంధమాఘ్రాణమౌ
బాలసుబ్రహ్హణ్యు పాటయందు
పదభాషణా ప్రాభవమ్మదిశ్రావ్యమౌ
బాలసుబ్రహ్మణ్యు వాక్కునందు
నటనలో చాతుర్యవటవృక్ష వీక్షణౌ
బాలసుబ్రహ్మణ్యు కేళియందు
బాలగాయక శిక్షణాలయవ్యాప్తియౌ
బాలసుబ్రహ్మణ్యు ప్రతిభయందు

ఔర!చిత్రసంగీత సంచారమాగె
భక్తి సుశ్లోక ధారయే బండబారె
ప్రజయె బాధాగ్నికీలల బావురనియె
ఎస్పియే స్వర్గలోకాని కేగిపోవ.

( శ్రద్ధాంజలులతో )
రాయప్రోలు సీతారామశర్మ, భీమవరం.

Sarma చెప్పారు...

SP. బాలు
***********
పదునారు భాషల ప్రావీణ్య
తనుమీర
గానమ్ము జేసిన ఘనుడు 'బాలు'!
స్పష్ట యుచ్చారణ, స్వచ్ఛ
రాగమునొప్ప
గానమ్ము జేసిన ఘనుడు
'బాలు'!
పలువురు హీరోల పాత్రలు
పండగా
గాత్ర దానముజేసె ఘనుడు
'బాలు'!
ఏస్థాయి యైనను నెంతేని
సుళువుగా
గమకములను బాడు
ఘనుడు 'బాలు'!
ఏనటుని స్వర మేరీతి
నుండునో
గమనించి పాడిన ఘనుడు
'బాలు'!

మధుర సుస్వర భాసుర
సుధలు గురియ!పాటనవలీల బాడెడు
ప్రధితుడతడు!
యువత హృదయాల
దోచిన భవుడతండు!
పన్డితారాధ్యుల వంశంబు
పరిమళింప!
బాల సుబ్రమణ్యము గాంచె భవ్య కీర్తి!
ఆర్ద్ర హృదయాన
'బాలు'కు నంజలింతు!!


డా. ప్రభు దేవరపల్లి

Sarma చెప్పారు...

*గాయకమణిశిఖరం- బాలూగాంధర్వస్వరం.*
*వీణవేణువైనసరిగమస్వరం,
మూగవోయిందనలేనిప్పుడు.
మాటపాటబంధంతెగిందనను,
దివికేగిపదనిసలాగాయనలేను.
*బాలుఅంటేనలభైవేలపాటల,
బృందావనం, స్వరాభిషేకంనవరసగళ నందనం.
రాళ్ళుకరగించేభైరవరాగద్వీపం,సప్తస్వరసంస్కారశృతిరాజీవం.సంగీతబంధంఇగరనిసుగంధం.శబ్దమాధుర్యనాధుడుఎస్పీనే.వేకువసుప్రభాతంస్తోత్రవేల్పుడై,వేదనగీతం,వెన్నెలపాట జలపాతాలై,
విలక్షణవిఖ్యాతవిమలగాత్రుడై,పాడుతాతీయగ,జీవరాగశ్రుతి.
విఖ్యాతగాంధర్వగానగమకం,
బహుప్రజ్ఞాగాయక'మణి'శిఖరం.గానామృతంవెన్నెలగీతంశ్రీపతి,పాటఆరాధ్యపండితారాధ్యుడే.దిగ్గజంసుబ్రహ్మణ్యంస్వరంజీవే(అద్వితీయగాన'మణి'కినివాళి).డా.వేదుల శ్రీరామశర్మ'శిరీష'.
కాకినాడ.9866050220

Sarma చెప్పారు...

*ఇంటింటి "బాలు"డు* !
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
ఇంతింతగా ఎంతో బొద్దుగా
అనిపించే కనిపించే
ఇంటింటి "బాలు"డు లేడా !
కంటి ముందుకు రాడా!
టివి ఆన్ చేసినా
గుడికి పోయినా
పెండ్లి జంటలు నృతం చేసినా
ఎక్కడి నుండో వెనక వెనకే
బాలు పాడనే పాడుతాడు!
ఇప్పుడు 40,000 పాటలు
మనం హృదయం నిండా
బరువు అనుకోకుండా మోయాల్సిందే మరి!
బాలు లేడంటే ఉత్తుత్తి మాటలే
భౌతిక వాదం సోది సోది!
నిండుగా సూటు బూటుతో
వస్తేనే బాలు ఉన్నట్లా-
ఆపాదమస్తకం జలదరమయే
పాట వింటే చాలు!
బాలు బ్రహ్మాండమంతా ఉన్నట్లే !
ఇంటింటి "బాలు"డు
ఎక్కడికి పోలే-
పాటగా పూట పూట మనతోనే!
- కందాలై రాఘవాచార్య

Sarma చెప్పారు...

'నవయుగ కవిచక్రవర్తి'
శ్రీ గుఱ్ఱం జాషువ
*****************
కవితా సుగంధమ్ము కావ్యాల వెదజల్లి
చిరకీర్తినందిన శ్రేష్ఠుడతడు!
అంటరానితన మాహుతి
గావింప
కలము బట్టిన మహాకవి
యతండు!
చెడు దురాచారాల చీల్చి
చెండాడిన
అసమాన సాహితీ ఋషి
యతండు!
మూఢనమ్మకముల
మోసాల తెగనాడి
విజ్ఞానమును చాటె
విజ్ఞుడతడు!

గబ్బిలము,ఫిరదౌసియు
కన్నతల్లి
శిశువు,కొత్తలోకము,
కాందిశీకుడు, సఖి
రమ్య ముంతాజు మహ లును, రాజరాజు!
మధు రసాంచిత పద్యముల్ మనకునిచ్చె!
యతడె,నవయుగవ్
కవి చక్రవర్తి! సుకవి!
జగముమెచ్చినమొనగాడు
జాషువ కవి!!


డా. ప్రభు దేవరపల్లి

Sarma చెప్పారు...

తెలుగోడి గోడు!!

అమ్మయ్యా...
ఇక భాష గురించి వెంటబడే వారు లేరులెండి. ఇష్టం వచ్చినట్లు మాట్లాడుకోవచ్చు, పాటలు పాడుకోవచ్చు. మాటని పాటని చింపి పోగులు పెట్టుకోవచ్చు.
'నోరు తిరగాలి', 'గొంతులో ప్రతి అక్షరం పలకాలి'.. అంటూ సలహాలు ఉండవు. 'ఈ మాటకి అర్ధం తెలుసా', 'ఈ పదం ఎంత బావుందో', 'ఇంకో కవి రాయగలడా', ఎక్కడ్నుంచి తెస్తారండీ భావుకత' .. అంటూ మాట్లాడే గొంతుక వినబడదు. 'పదహారణాల తెలుగు పిల్లలా ముచ్చటగా ఉన్నావు. 'తెలుగుదనం ఉట్టిపడింది.. నీ గోంతులో' అంటూ వంద కేజీల అభిమానాన్ని ఒలకబోసే అప్యాయత మాటలు పిల్లలకి ఉండవు.
అసలు.. ఏ ఇంట్లో చూసిన.. ఎదో మాట, పాట టివిలోనో, రేడియోలోనో, ట్యాపుల్లో, అరచేతుల్లోనో వినబడుతూ ఉండొచ్చు. వింటూ ఉండొచ్చు. కాని అచ్చంగా మన వెంట, అదృశ్యంగా తిరిగే నిత్యనూతన నవయవ్వన గందర్వుడు కనపబడడు. 'అబ్బా.. ఇవాళ మిస్ అయ్యాను' అనే మాట ఇక శాశ్వతమై పోయింది.
'మేం తెలుగు వాళ్లమని' (ఆయన అన్నట్టు) ఘ..ర్వం....గా చెప్పడానికి ఓ గొంతు ఉండేదని మనం చరిత్రలో రాసుకోవచ్చు. ఒకటా.. రెండా..ఎన్ని వ్యసనాలు అలవాటు చేసేసారండి బాబు! పాటలు వినడం, మాటలు వినడం, ఆయన ఉర్లోకొస్తే.. టై కట్టుకున్న వాడి దగ్గర్నుంచి, ఆటో నడిపేవాడి వరకు ఎగేసుకుని ఆయన్ని చూడ్డానికి, వినడానికి వెళ్లడం, చెవులు సాగదిసుకుని మరీ మైమరచిపోవడం, భళ్లున నవ్వి చేతులు చరుచుకోవడం.. ఇలా అడ్డమైన అలవాట్లు చేసేసి, మన కొంప కొల్లేరు చేసి వెళ్లిపోయాడు. పైపెచ్చు మన ఇంట్లో, వంట్లో తిష్ఠ వేసేసి 'నేను త్యరగా వస్తాను లెండి! ఫోన్లు చేయకండి!' అంటూ అందరికి 'చెయ్యి' ఇచ్చి, పారిపోయాడు.
ఎంత ఇబ్బంది పెట్టేసారండి బాబు.
లేకపోతే ఏఁవిటండి..
.. ఆయనకి మన భాష అంటే అంత ఇదా..! ఉండొచ్చు! అరే.. పాటలు పాడుకోవచ్చుగా.. కబుర్లు చెప్పొచ్చుగా.. ! అబ్బే అలా ఊరుకుంటే ఆయన బాలు ఎలా అయ్యాడు. పాటలో మాటల్నుంచి, మాటల్లో పాటల వరకు ఒహటే వర్రి అయిపోయాడు. పిల్లల దగ్గర్నుంచి పెద్దవాళ్ల వరకు గోరుముద్దలు తినిపించినట్టు ఆ నేర్పడాలు, పదిసార్లు వల్ల వేయించడాలు, టీకా తాత్పర్యాలతో ఆ పాఠాలు ఎందుకు చెప్పండి! మన ఇంట్లో మనతో మాట్లాడినట్టు ఆ హితబోధలు, మంచి చెడ్డా, పాత కొత్త విషయాలు, అనుభవాలు, ఆత్మీయపలుకులు.. ఇవన్ని అలవాటు చేసేసి, ఇప్పుడు చెప్పా చేయకుండా అలా నిష్క్రమిస్తే, ఈ తెలుగుజాతి ఎక్కడికి పోతుంది చెప్పండి!
ఇప్పటికే.. మన భాషలోని పాట, మాటల్ని చిలక్కోట్లు కొట్టిసి, పట్టుకు పోతున్నారు. అలాంటి టైములో, టాఠ్ వీల్లేదు అని అడ్డం పడి బెత్తం పట్టుకునే ఆ మనిషి, చేసింది ఏఁవైనా బావుందా చెప్పండి!

ఏఁవిటో ఆయన పిచ్చి గాని, పాటల్లో, మాటల్లో కూడా భాషని గురించి ఒహెటే వర్రీ.. మరీ అంతలా పట్టించుకోవాలా?
'బాస కాదు.. భాష అనాలి' అని అక్షరాలన్ని బతికించారు.
'అది విసయం కాదమ్మా.. విషయం అని పలకాలి' అంటూ అసలు విషయాలు చెప్పారు.
'పెల్లి కాదయ్యా.. పెళ్ళి.. ళి..ళి.. అనాలి. తెలుగులో ల కి ళ కి తేడా ఉంది.' అంటూ లక్షణంగా పాఠాలు చెప్పారు.
'శృతి, లయ, గమకాలు, చమకాలు.. అన్నీ పస్ట్ క్లాస్ గా ఉన్నాయి. కాని పాట అర్ధం తెలుసుకుని అది అనుభవించి పాడితే ఇంకా బావుంటుంది' అంటూ చురకలు వేసి, పాటల భావాలకి పెద్దపీట వేసారు.
"సరే బండి ఱ ని అటకెక్కించిసారు. కనీసం ఉన్న 'ర' ని రాసి రంపాన పెట్టకండి." అంటూ తెలుగు మాష్టారిలా అక్షరాలకి ఆయువు పోసారు.
పిల్లల్ని, పెద్దల్ని, తోటి వారిని, పక్కవాళ్లని, ఎక్కడో ఉన్నవాళ్లని, అక్కడే ఉన్నవాళ్లని, రాసిన వారిని, రాస్తున్న వారిని, వాయించిన వారిని, వాయిస్తున్న వారిని.. అలా పాటకి మాటకి పట్టం కట్టిన ప్రతి ఒక్కరిని మెచ్చుకున్నారు.
ఎదుటివారికి నమస్కారం పెట్టే సంస్కారం, తనని మొసిన బోయిలా పాదాలకు నమస్కారం పెట్టి బుణం తీర్చుకున్నాడు.

పెద్దాయనలా నాలుగు పాటలు పాడి వెళ్లొచ్చుగా.. అబ్బే అలా చేయకుండా పాటలు, మాటలు, నటనలు...ఒకటేమిటి, ఇలా అన్ని చిందులూ వేసి డెబ్బై ఏళ్ల వయసులో లో కూడా ఇరవై ఏళ్ల 'బాలుడి'గా కోట్లాది కొంపల్లో కూర్చుని, ఒక్కసారిగా లేచి వెళ్లిపోవడం అస్సలు బాలేదు.

పాట ఉన్నంత వరకు ఆయన మనతో ఉంటారని సరిపెట్టుకోవడం.. జీవితంలో రాజీ పడటమే!
అసలు రాజీ పడలేని విషయం ఏఁవిటో తెల్సా..
తెలుగు మాటకి, పాటకి.. చివరికి ఒంటరి ఆక్షరానికి కూడా పెద్ద దిక్కు.. అర్దంతరంగా వలస వెళ్లిపోయింది.
తెలుగు పలుకలకు జీవం పోసే నాధుడు.. వెంటుండి కాపాల కాసే కాపరి .. కాటికి చేరిపోయాడు.
ఆనాధిగా మిగిలిపోయిందనే వేదన అక్షరానికి మిగిలిపోయింది!
చివరిగా ఒక్కమాట..
ఎదుటివారికి నమస్కారం పెట్టే సంస్కారంతో పాటు, తనని మోసిన బోయిలకి సైతం.. పాదాలు తాకి బుణం తీర్చుకున్నారు. కాని తనని మోసిన ఈ ఐదు తరాల బోయిలకు మాత్రం.. చెప్పా చేయకుండా శెలవుచీటి పంపిసారు!
ఇదేం.. బావులేదయ్యా!
ఇది తెలుగోడి గోడు!!

Sarma చెప్పారు...

కరుణారసము పొంగి పొరలుచున్నట్లుగ
శశిరేఖ నమృతము జాలు వార
హరినీలపాత్రలో సిరిచందనము రీతి
బొడ్డులో తామరపూవు మెఱయ
జగతి రక్షణ వేళ మిగిలిన గురుతుగా
కంఠంబు మెఱిసెడి కాంతి నొప్ప
యుదయ భానుని వోలె యురము పై నుండియు
కౌస్తుభరత్నంబు కాంతు లెసగ
తే గీ
గంగ యమునా నదుల్ రెండు గలసి నట్టి
కాంతిపూరంబు శోభిల్లు శాంతమూర్తి
నవ్య రుచిరమ్య హరిహరనాథమూర్తి
కాంతిపుంజంబు వోలె సాక్షాత్క రించె

Sarma చెప్పారు...

😃 *పరాట- కరాటే*😃
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
మా తల్లులూ !
వంటిట్లో
వేడి వేడిగా
కమ్మ కమ్మగా
పొరలు పొరలుగా
పరాటాలుచేయడమే కాదు---
నడి రోడ్డుమీద
ముఖం పదారు పచ్చలయేట్లుగా -
విర్రవీగిన వీపులు విరిగేట్లుగా -
శాశ్వతంగా మగ పుటుకను
పుట్టుక్కున మరిచిపోయట్లుగా చేసే
కరాటే కూడా నేర్వాల్సిందే !
అర్ధరాత్రి అమ్మాయి వస్తుందంటే
పోకిరి పోరలు హడలి చావాలి
సీసా మత్తు దిగి కోమాలోకి పోవాలి
మీకు మీరే పోలీస్
మీకు మీరే జేమ్స్ బాండ్
భలా ! సరికి సరి
స్వర్ణయుగం అంటే ఇదే మరి
- కందాలై రాఘవాచార్య

Sarma చెప్పారు...

శీర్షిక: గాంధీ జీవితం సందేశం

శా||
రైలున్ గెంటిరి జైళ్ళయన్ బెడితిరశ్రాంతంబుగన్ క్రోధులై
శైలంబంటి బ్రిటీషు రాజ్యసమవస్థాభీలతన్ స్వేచ్ఛయం
దోలన్ జేయగ బూని గాంధి మన దేశోద్ధారణన్ జీవితం
బాలంబించె పయోధిగన్ జనులయందావేశముప్పొంగగన్

శా||
గీతాచార్యుని బోధనల్ జనులు సంగీతంబుగన్ గ్రోలుటన్
శీతాద్రిన్ వలెనున్న స్వేచ్ఛగనుటన్ సిద్ధంబుగావించుటన్
స్వాతంత్ర్యంబను వేదికన్ సలుపనశ్రాంతంబుగన్ న్యాసమీ
రీతిన్ గాంధి యొసంగెనెల్లరకు ప్రేరేపింప చైతన్యమున్

మ||
పొలపన్నాంగ్లసభాంతరప్రకటనన్ పూర్ణస్వతంత్రంబు గా
వలెనంచున్ యట గాంధి సింహమువలెన్ భాషించి యోచింపజే
సె లయించంగ బ్రిటీషుపాలన బృహద్స్వేచ్ఛన్ గనన్ భారతం
బలసాగెన్ మరు జన్మయందు భవితాభాస్వద్ప్రభాగామియై

చం||
రఘుపతి రాఘవా యనెడి లాలితగీతము మానవాళికిన్,
అఘమును మాన్పుటన్ విషమమవ్వగ మారణహోమమంతటన్,
ప్రఘణమునందు గూర్చొనుచు రాట్నము దిప్పగ దేశివస్త్రముల్,
అఘటితకార్యసాధనలనచ్చెరువొందగ ధారబోసెగా!

ఆదిపూడి వెంకట రోహిత్
Detroit USA
Ph. +1 8188357381
🙏🏻🙏🏻🙏🏻

Sarma చెప్పారు...

గాంధీ మన మార్గదర్శి

గాంధీ జయంతి సందర్భంగా అక్షర నీరాజనం (పంచరత్నాలు)

1)
చేతిన్ కఱ్ఱను బట్టియు
తాతయు శాంతియెయసిగ స్వతంత్రత కొఱకై
జాతిపితగ గాంధీ మన
రాతను మార్చగనుబూనె త్రాతగ కృష్ణా

2)
పరదేశీ పాలనయను
చెరనుండి విముక్తిచేసి చింతలుదీర్పన్
వరముగసత్యాగ్రహమను
కరవాలము నందజేసె గాంధీ కృష్ణా

3)
గాంధీని చంపెను పిరికి
పందయసురుడౌను గాడ్సె భరతావనిలో
మందెంత మంది యుండిన
గాంధీనట కాపుకాయ గలిగిరె కృష్ణా

4)
ఏతీరుగ నిన్నుఁ గొలుతు
మేతీరుగ దీర్పగలము ఋణమును బాపూ
చేతులుమోడ్తుము నీకై
నీతికి నిలతుము నిరతము నీవలె కృష్ణా

5)
గాంధీ మనజాతికి పిత
గాంధీజీ మార్గదర్శి ఘనముగ మనమున్
గాంధీజీ కలలుగనిన
గాంధీయిజ భారతమును కాంక్షిద్దామా?

✍🏼 గోగులపాటి కృష్ణమోహన్
కవి, రచయిత, జర్నలిస్టు
సూరారం కాలనీ, హైదరాబాద్
9700007653

Sarma చెప్పారు...

😣 *అర్ధరాత్రి ఆశ*😣
~~~~~~~~~~~~~~~~~~~
ఎవరూ తోడు లేకున్నా
సొంత నీడలా
ఇంటికి క్షేమంగా చేరుస్తుందని
అర్ధరాత్రి పై
పైపైనే ఎంతెంత ఆశ బాపుకు ??!!
స్వతంత్రం సిద్దించినాకా
జన వాసాలు అరణ్యాలు !
మనుషులేమో మృగాలు !
బుడ బుడ మునిగేంతగా గాంధీజీ ఆశ పై
మూడు సముద్రాలంత నీరు!
ఇగ కొత్త నారుగా
ఏం చరిత్ర రాసుకుంటాం !
- కందాలై రాఘవాచార్య

Sarma చెప్పారు...

*అహింసా ప్రథమం పుష్పం*

బాపూ.. అంటూ ఒకరు
మహాత్మా..అంటూ మరొకరు
గాంధీతాత అంటూ
ముదమారగా అంతా పిలిచారే!

అహింసా సిద్దాంతమే
అస్త్రం అంటూ
ఆంగ్లేయులపై సందిస్తే..
అఖండ భారతావని
నీ వెంట నడచి ...
స్వేచ్ఛగా
జాతిపిత అంటూ పిలిచి
జేజేలు పలికింది..
కాలం కాలం ఇట్టే కరిగింది
దశాబ్దాలు గడిచాయి
ఇప్పుడు.....
మధ్య పానం మరవలేక
సత్యం పలకలేక..
నీ పుట్టినరోజే
ఏటేట పండగ అంది..

అర్ధరాత్రి ఒంటరిగా
అన్న మాటెక్కడ?
పట్టపగలే మహిళకు ప్రశ్నే.
అష్టాంగ యోగాలలో ఒకటైన అచరిస్తే ..
నేలతల్లీ నిండుగా నవ్వేను...
******* ******** ****** ******
జై జవాన్ జైకిషాన్ అన్న
మహానేత లాల్ బహుదూర్
శాస్త్రిజీ... నీ జయంతీ..ఈనాడే
హంసగానే దెేశాన్ని అలరించిన
తొలి భారతరత్నా నీకిదే అంజలి🙏
లలితా భాస్కర దేవ్
2-10-2020

Sarma చెప్పారు...

*అద్దంలోచూసుకుంటే
మనకుమనమేకనిపిస్తాం!*
*అర్థంచేసుకుంటేప్రతిమనిషి లోమనమే కనిపిస్తాం!*

Sarma చెప్పారు...

బరువు - తేలిక

పట్టుకొని ఉంటేనే బలమని
అందరూ అనుకుంటూ ఉంటారు
చేతులు తెగి పోతున్నా,శక్తి ఉడిగి
పోతున్నా, నెత్తిన బరువు పెరిగి పోతున్నా కొన్ని బాధాకర, ద్వేష పూరిత విషయాలను వదలకుండా
భద్రంగా పేర్చి పెట్టుకుంటూ ఉంటారు.
ఒకసారి వదిలేసి చూడండి తెలుస్తుంది
ఆశ్చర్యకరంగా బరువు తగ్గి తేలిక పడతారు
మనసెంతో సంతోషంగా ఉంటుంది ప్రపంచాన్ని మరో కోణం లోంచి
చూసే అవకాశం దొరుకుతుంది
వదిలి వేయడంలో ఇంత ఆనందం ఉందా? చెత్త దించేసుకుంటే ఇంత తేలిగ్గా ఉంటుందా?
అనే సుఖానుభూతి కలుగుతుంది.
ఒక విషయం స్పష్టంగా అర్థమ వుతుంది.
సంతోషకరమైన సమాచారం మనసులో ఎప్పటికీ ఉంచుకోవాలి.
బాధ కలిగించే విషయాలను
మదిలోంచి వెంటనే దించేయాలి అని.
సుబ్బు శివకుమార్ చిల్లర.

Sarma చెప్పారు...

*ఇదే కదా ఇంతే కదా నీ కథా..*

కూతురు అమెరికాలో..
అమ్మ పల్లెటూరి లో..
కొడుకు ఇంగ్లండ్ లో
తండ్రి ఇరుకు సందులో..
నువ్వు ఇన్ఫోసిస్
నాన్నకేమో క్రైసిస్..
నువ్వు వీసాపై ఎక్కడో
అమ్మ అంపశయ్యపై నీ ఊళ్ళో
నువ్వు రావు..
రాలేనంటావు..
నిజానికి రావాలని అనుకోవు..
టికెట్ దొరకదంటావు..
సెలవు లేదంటావు..
వస్తే తిరిగి రావడం కష్టమంటావు..
నువ్వు వచ్చేదాక
అమ్మ ప్రాణం పోనంటుంది..
నీ రాక కోసం ఆ కళ్ళు
గుమ్మం వైపే..
రావని తెలిసినా
నాన్న అమ్మకు
ఆ కబురు చెప్పలేక..
కక్కలేక..మింగలేక..
మంచం చుట్టూ
అటూ ఇటూ
అవతల ఆ తల్లి
ఇంకాసేపట్లో అటో ఇటో..

వయసు వచ్చినప్పటి నుంచి
డాలర్ డ్రీమ్సే..
పొద్దున లేస్తే ఆ ఊసే..
నీ కలల వెనకే
తల్లిదండ్రుల పరుగు..
వారి ఆశలన్నీ నీ అమెరికా పయనంతోనే కరుగు..
బ్రతుకుతెరువంటూ నువ్వక్కడ..
గుండె బరువుతో వారిక్కడ..
మొదట్లో రోజూ
ఓ వాట్సప్ కాలు
రెండ్రోజులకో వీడియో ఫోను
పోను పోను కొంత విరామం
ఏంట్రా అంటే వర్కులోడు
అప్పటికే నిద్ర లేచి ఉంటాడు
నీలో ఓ మాయలోడు...
అక్కడ కొనుక్కున్న కొత్త కారుతో నీ ఫొటో పోజు
ఇక్కడ డొక్కు స్కూటర్ తో
తంటాలే నాన్నకి ప్రతిరోజు..

ఈలోగా అన్నీ బాగుంటే
పెద్దలు కుదిర్చిన పెళ్లి..
లేదంటే అక్కడే
ఓ మేరీతో మేరేజ్..
ఆలికి కడుపో కాలో వస్తే
ఆయాగా అమ్మకి వీసా
నాన్నకి నేను డబ్బులు పంపుతాలే అని భరోసా..!
ఎంత అమ్మయినా
నీ పిల్లలకు నాన్నమ్మయినా
ఆమె నాన్నకు భార్య
అక్కడ పెద్దాయన
రోజూ చెయ్యి కాల్చుకుంటున్నాడేమోనని
ఒకటే బెంగ..
ఆ దంపతులను
అలా వేరుగా ఉంచి
మీ జంట మాత్రం
టింగురంగ..

మొత్తానికి అలా అమ్మ అవసరం కొంత తీరాక
అప్పుడిక ఆమె ఉంటే బరువు
ఈలోగా ముగుస్తుంది
ఆమె వీసా గడువు..
ఆమె చేతిలో టికెట్
నాన్నకిమ్మంటూ
ఓ గిఫ్టు పేకెట్..

ఇటు నిన్ను వదలి వెళ్ళలేక
అటు భర్తని విడిచి ఉండలేక
చెమ్మగిల్లిన కళ్ళతో
విమానం ఎక్కిన అమ్మకి తెలియదు అదే చివరి చూపని
ఊరెళ్ళాక కమ్మేసిన జబ్బు
నీళ్లలా ఖర్చయ్యే డబ్బు..
నువ్వు పంపుతావేమో..
కాని ఆ వయసులో
నాన్నకు శ్రమ..
నువ్వు వస్తావని అమ్మకి భ్రమ..
వచ్చే ప్రాణం..పోయే ప్రాణం
చివరకు అనివార్యమయ్యే మరణం..
వాడు వస్తున్నాడా.. ఏమంటున్నాడు..
ఊపిరి వదిలే వరకు అదే ప్రశ్నతో అమ్మ..
నిర్జీవమైన ఆ కళ్ళలో
నీ బొమ్మ..
కొరివి పెట్టాల్సిన
నువ్వు సీమలో...
నాన్న కర్మ చేస్తుంటే
ఖర్మ కాలి చూసేస్తావు లైవ్ లో..
అస్తికల నిమజ్జనం అంటూ
నాన్న కాశీకి పయనం
అంత శ్రమ ఎందుకు..
పక్కనే ఉంది కదా
గోదారని నీ అనునయం..

ఇప్పుడిక నాన్న కథ..
ఉన్న ఊరు..
కట్టుకున్న ఇల్లు
ముఖ్యంగా ఆ ఇంట్లో
అమ్మ జ్ఞాపకాలు
వదిలి రాలేక..
ఒంటరి బ్రతుకు ఈడ్వలేక..
కష్టాలకు ఓర్వలేక..
ఓ రోజున
ఆయన కధా కంచికి
ఈసారి వస్తావు..
కొరివి పెట్టి
ఊళ్ళో ఇల్లు అమ్మేసి
ఉన్న ఊరు..కన్న తల్లి..
అన్నిటితో రుణం తెంచుకుని
నేను ఎన్నారై..
మిగిలినవన్నీ
జాన్తా నై..
అంటూ
పుట్టిన గడ్డను వదిలి
పెట్టిన గడ్డకు శాశ్వతంగా వలస
ఇదే కదా చాలామంది వరస..!

(అన్ని కథలూ ఇలాగే ఉంటున్నాయని కాదు..
కానీ చాలా ఇళ్ళలో
ఇదే బాగోతం.!
సంపాదనపై మోజుతో విదేశాలకు వెళ్ళడం..
ఇక్కడి కన్నా అక్కడ జీవితం చాలా గొప్పగా
ఉంటుందంటూ
సన్నాయి నొక్కులు..
మారిపోయే దృక్కులు..
అక్కడి నుంచి మేజిక్కులు..జిమ్మిక్కులు..
ఎక్కడ ఉన్నా తల్లిదండ్రులను నెత్తిన పెట్టుకుని చూసే పిల్లలూ..
ఈ దేశంలో ఉండి కూడా పట్టించుకోని పిల్లలూ లేకపోలేదు.అయితే పూర్తిగా అలాగే ఉంటున్న సంతానం గురించే ఈ ఆవేదన..
కాస్తయినా
మారండని నా నివేదన)
*గంగారెడ్డి (ఎల్ఐసి)*

Sarma చెప్పారు...

నగుమోము నారాయణునికి తప్ప అన్యులకు అందనీయదు కమలాంబ!!

కడుచక్కనైన కమలనయనుని వీడి వచ్చునా కమలాంబ!!


మదిని నిలుపుమాతల్లి పాదములపై
ఘల్లు ఘల్లు మని నాట్యమాడు నీ ఇంటి లోని!!

చంద్రమోహన్ మాండవ్య సినీ రచయిత చెన్నై

Sarma చెప్పారు...

హిమనగం
౼౼౼౼౼౼౼
పాపాగ్ను లార్పంగ ప్రవహించు నదులనే
ఇంపార గన్న దా హిమనగంబు,
వైద్య మూలిక లిచ్చు భవ్య వనమ్ముల౼
వెన్నియో, నిడుచుండు హిమనగంబు,
పశుపక్షు లెన్నియో వసియించు తావులే
హేలగా నందించు హిమనగంబు,
ఘన తపంబులు సల్పు మునిజనవాటికల్
ప్రముదాన చూపించు హిమనగంబు,

దేవతతుల తిర్గాడెడు పావనమును
సుంద రప్రదేశానేక శోభితమును
విమల భావాల చైతన్య వీచికలను
ఇలకె వరమైన క్ష్మాభృత్తు హిమనగంబు.

రాయప్రోలు సీతారామశర్మ, భీమవరం.

Sarma చెప్పారు...

సెప్టెంబర్ 5న అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ
సందర్భంగా......
ఆద్యంత మై......

అక్షరాలకు సాక్షీ భూతమై నిలిచేవాడు
అర్ధించి నంతనే విద్యను
ప్రసాదించే వాడు
విద్యా దాతృత్వ గుణాన్ని విశేషంగా కలిగిన వాడు
ఊరు వాడ జిల్లా రాష్ట్రం
కడకు దేశ పురోగతికి
సతతం పరిశ్ర మించేవాడు
మానవతే ధ్యేయంగా
మమతను పంచుతూ
సమతా మార్గంలో భవితను తీర్చి దిద్దే వాడు
ఎల్లలు లేని కల్లా కప ట మూ లేని కడు పూజ్యుడు
కల్మష రహితుడు
ఈ సృష్టిలో విరించిని
మరపిం చి మరో విరించియై విరాజిల్లే వాడు
ఎంత తీర్చు కుందామన్నా
తీర్చుకోలేని రుణాన్ని
అందించే వాడు
ఈ సృష్టికి ఆద్యంతమై
నిలిచిన వాడు
ఈ గురువే...
అందుకే ఆయన పరబ్రహ్మ స్వరూపమే
సదా పోజ్యానీయు డూ
ఈ ఉపాధ్యాయుడే.

దోస పాటి. సత్యనారాయణ మూర్తి.
రాజ మహేంద్ర వరం 9866631877.

Sarma చెప్పారు...

భాష - భావం
***********

మాటలతో మన్నన పొందవచ్చు
మాటలతో యుద్దాలు సృష్టించవచ్చు
ప్రేమకి వారధి మాటలు
ద్వేషానికి సారథి మాటలు
వాడే భాష సరిగ్గా లేకపోతే
అనర్ధాలు వస్తాయి, అపోహలు
కలుగుతాయి
ఎదుటివారు కోపపు మాటల
వెనుక ఉన్న భయాల్ని, బాధలను
అర్థం చేసుకోవాలంటే
ప్రతీకా రాత్మాక ద్వేష భావం నుండి
క్రియాశీలక ప్రేమ భావం వైపుకి
పయనించాలి.
అప్పుడే ఎదుటివారి సమస్యలు
అవగతమవుతాయి
వారి భావాలు అర్థం చేసుకోగలుగుతాము.
సుబ్బు శివకుమార్ చిల్లర

Sarma చెప్పారు...

గోవింద శబ్దంబు గొంతెత్తి యనరాదె
గోవింద పదరుచి గ్రోలరాదె
గోవింద నామంబు ఘోషింపగారాదె
గోవిందు సదయాబ్థి కోరబోవె
గోవిందు గాథలే కొనియాడ గాలేవె
గోవిందు పదములే కొలువలేవె
గోవిందు లీలలే గురుతింప గాలేవె
గోవిందు గుణములే గూడలేవె

వరదు గోవిందు సేవింప వలపులేదె
భవ సముద్రమ్ము దాటంగ బాసటేది
పలుక గోవింద గోవింద చిలుకవోలె
ఇహ పరమ్ములు సిద్ధించు స్పృహనుగనుమ.

రాయప్రోలు సీతారామశర్మ భీమవరం.

Sarma చెప్పారు...

శ్రీ రామచంద్ర పంచరత్నం
1) ప్రాతర్నమామి పురుషోత్తమదివ్యదేహం
ప్రాతర్నమామి మిథిలాత్మజహృదయపీఠం
ప్రాతర్నమామి పవనాత్మజసన్నుతాంగం
ప్రాతర్నమామి శ్రీకౌశికయాగరక్షం ||

2) ప్రాతర్నమామి కోదండబాహుదండం
ప్రాతర్నమామి కాకాసురరక్షహస్తం
ప్రాతర్నమామి సువిశాలకమలనేత్రం
ప్రాతర్నమామి చందనచర్చితాంగం ||




3) ప్రాతర్నమామి శరణాగతపారిజాతం
ప్రాతర్నమామి మారీచసుబాహుమర్దనం
ప్రాతర్నమామి శివవిష్ణుచాపభంజనం
ప్రాతర్నమామి పూర్వభాషప్రియం ||

4) ప్రాతర్నమామి జటాయుమోక్షకారణం
ప్రాతర్నమామి కౌసల్యాప్రియనందనం
ప్రాతర్నమామి భక్తసంకటమోచనం
ప్రాతర్నమామి వేదవేదాంగపారగం ||






5) ప్రాతర్నమామి సుకుమారపాదపంకజం
ప్రాతర్నమామి ఘనధర్మనిగ్రహవిగ్రహం
ప్రాతర్నమామి మునిజనరక్షాదీక్షం
ప్రాతర్నమామి సదా శ్రీ రామచంద్రం ||

సర్వం శ్రీరామచంద్ర దివ్యచరణారవిందార్పణమస్తు

Sarma చెప్పారు...

🏵️🌻🌼🌸🌺
•••••••••••••
కృత్రిమ సౌకర్యాలు
మనిషి ని యంత్రం గా మలచాయి
మర మనిషి గా మార్చాయి

ఏనుగంత మనిషి కి
పిడికెడు హృదయం
చిటికెడన్నా....
మనసు మమతా లేకపోతే శూన్యం

డాబుసరి జీవితంలో
మోసపూరిత చర్యలతో
తెచ్చి పెట్టుకున్న గాంభీర్యంతో
సదా తనూ ప్రకృతి లో
ఒక భాగమని మరచి

సృష్టి కే
ఆధారమైన ప్రకృతి కే
హాని తలపెట్టిన మనిషి
తన వినాశనం తానే కొని తెచ్చుకుంటున్నాడు

ఏది ఏమైనా
మనుషులు తీరు మారాలి
రేపటి తరం కొరకు
యోచించి నేడు సంచరించాలి

లేదా
జన్మకు అర్థం లేదు
సనాతన
భారతీయ
సంస్కృతి సాంప్రదాయాలు

విశ్వ మానవ
సౌభ్రాత్వుత్వ ప్రహేళికలు

కొండంత మనిషి
గోరంత మనసుతో
ఆలోచించి ఆచరించు

*శుభమస్తు*
🙏

Sarma చెప్పారు...

🌺🌸🌼🌻🏵️
••••••••••••
నీతి నిజాయితీ అనే పదాలు
ఎదుటి వారి కి
చెప్పడానికే గానీ
తమ వరకు వచ్చేసరికి
ఆచరణయోగ్యం కాదు

ఏదో ఒక సమయంలో
తమ స్వార్థం కోసం
వినియోగించుకొనే
విషయాలుగా
ఈ రోజుల్లో చాలా మంది
తాము ఆచరించకుండా
అవసరార్థం వినియోగిస్తున్నారు


ఇది
కలియుగ ధర్మం
కానీ...
నీతి నిజాయితీ నమ్ముకున్న వారు

కాస్త ఆలస్యంగా అయినా
ఏ రోజయినా
కరుగబోసిన
మేలిమి వన్నె బంగారంలా
తళ తళ మెరుస్తూ ...

ప్రకాశించటం ఖాయం


మబ్బుల చాటున సూర్యునిలా
తాత్కాలికం గా ఇబ్బందులు ఎదురైనా
మబ్బులు వీడిన రవి కిరణం లా
దూసుకుపోవటం ఖాయం

*సత్యమేవ జయతే*

🙏

Sarma చెప్పారు...

శీతనగము
౼౼౼౼౼౼౼
శివదేవు తనుశోభ శివముగా తలపోసి
సితదేహ మందెనో శీతనగము,
మేరువే దక్కమిన్ చేరువే రజతమ్ము
చేయ తెల్పాయెనో శీతనగము,
శశికాంతినేమించు స్పర్థనే లోనంది
శీతలం బాయెనో శీతనగము,
మునుల కాతపబాధ పోగొట్టగానెంచి
చేర చలినిడునో శీతనగము,

అహహ!స్వేదంపు జాడలే యంతరింప
పలు నదీనదమ్ముల స్నేహబలముగనుచు
దేవ తాజన సంచార దీప్తిగొనుచు
క్షితి ధరమ్ముల రాజయ్యె శీతనగము.

రాయప్రోలు సీతారామశర్మ, భీమవరం.

Sarma చెప్పారు...

*బోడ గుట్ట*??
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
తాతల కాలం నాడు
గుట్ట మీద అడవి లెక్క చెట్లుండే
చెట్లల్ల మృగాల టీకాన ఉండే
జింకలకైతే లెక్కాపత్రం లేకుండే
గుట్ట మీదకు మబ్బులు దిగి
ఆటాడి వాన వాన చేస్తుండే--
గుట్టకు పోవుడంటే
మనిషి గుటుక్కే --
గుట్టంత అడవి
అడవంత గుట్ట --
తాతలు వోయిల్లు
గుట్ట మీది చెట్లువొయినై
మృగాలు మృగ్యం
అమ్మ లాంటి గుట్టను
మనిషి అమ్మేసిండు --
ఇప్పుడు గుట్ట బంగ్లాల దిబ్బ
ఎన్నెన్ని గుట్టలో అన్నన్ని దిబ్బలు
ఆడంబరంగా హిల్స్ నామధేయం !
నూరేండ్ల మా నానమ్మ బాధగా
బోడ గుట్ట అంటది
సెట్టు పాయే సెలక పాయే
మాయగాడు మనిషి
అన్నింటిని బోడ బోడ చేస్తడు
రేపు అన్నం ఎట్ల పుడ్తది
మనిషిల పురుగు పుడ్తది
బోడ బోడ ఐతడు
గుట్ట తావుల గుట్టంత ఏడుపు
- కందాలై రాఘవాచార్య

Sarma చెప్పారు...

2నామము: శ్రీ మహారాజ్ఞి

🌸శ్రీ మహారాజ్ఞి🌸

ప శ్రీ మహారాజ్ఞి శ్రీ చక్రవాసిని

అ.ప కరుణారసవాహిని మోహినీ చక్రినీ॥

చ.1సంగీతసాహిత్యసంతోషిణీ
చతుషష్ఠికళామయి చిదిలాసినీ
సమరోత్సాహిని శంభుమొహినీ
కళ్యణ కారిణి ప్రణవస్వరూపిణి ॥

చ.2 మంగళ శొభినీ కామరుపిణి
సర్వపేదచారిణీ పాపహరిణి
సర్వలోకమయి సర్వశక్తిమయి
ఆదిశక్తి మహిషాసురమర్దిని !!

3వ నమము:
శ్రీ మత్ సింహాసనేశ్వరీ

ప శ్రీమత్ సింహాసనేశ్వరీ

అ.ప. సింహవహినీ వారాహీ

చ.1. నర్వసృష్టికి మూలమునీవే
త్రిపురసుందరీ శ్రీ లలితా
ఆనందామృత వర్షిణివే
మణిమయ సింహసనాసీనవే॥

చ. 2 సర్వసముద్బవ కారిణివే
మల్లికాకుసుమ కోమలి శంకరి॥

Sarma చెప్పారు...

హిమనగాధిపు రాజ్యం
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
వాలవ్యజనసేవ వైభవంబుగసల్ప
చమరీ మృగంబులె సౌఖ్యముగను,
భరతనాట్యమ్ముల భాగ్యమ్ములొలికింప
శిఖులె పింఛమ్ముల శ్రేయముగను,
అందంపుచందాల యానందమందింప
జింకలె గంతుల స్నిగ్ధముగను,
స్వచ్ఛ మాధుర్యమౌ సంగీతమును పాడ
జలపాతధారలె శ్రావ్యముగను,

తుహిన సంపదలె దిశల తోరగింప
తరు లతాదుల వనలక్ష్మి సిరులనింప
స్వేద శూన్యమై ప్రాణులె వ్రేలుచుండ
హిమ నగాధిపు రాజ్య మశ్రమమెయయ్యె.

రాయప్రోలు సీతారామశర్మ, భీమవరం.

Sarma చెప్పారు...

భావ విహంగం
************
ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న
ఆలోచనా తరంగాల మీద
తేలుతూ వాటిలో కొన్నింటిని పుక్కెట్లో పట్టి,
కలంలో ప్రసరింప జేసి అక్షరాలుగా మార్చి
పదాల పంజరంలో బంధించి
పాఠకులకు అందిద్దాం అనుకొంటే
స్వేచ్ఛా వీధిలో రెక్కలు విప్పుకుని
విహరించే నా భావ విహంగం
పదాల పంజరంలో ఇమడగలదా?
అయినా
పదే పదే ప్రయత్నిస్తూనే ఉంటాను,
సూక్ష్మ గ్రాహకులైన పాఠకుల
మస్తిష్కంలో పద బంధమైఉన్న
భావం రెక్కలు విప్పుకుని
విహరిస్తుందేమోనన్న ఆశతో !

..సుబ్బు శివకుమార్ చిల్లర

Sarma చెప్పారు...

🖋️ *మనం పదాలు*🖍️
÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷
పదాలు నిశ్శబ్దంగా ఉండవు
మూగి మూగిగా ---
ఉదయం వాన అంగడిని
రాత్రి ఉరుముల తాండవాన్ని
పదాలు కలంతో మునకలేసి
లిపిలిపిగా లోకం ముందు
సభా సందడిగా సంబరం కావాలనే
సజీవ కవిత్వ జీవనంగా !
మనం పదాలు రాయడానికి
సమయం లేదనుకుంటాం
డాంబికమా -
దినమంతటి సమయం
పాచి పోతుంది - పడుకునే ముందు
ముందు లేని జ్ఞానోదయం !
పదాలు పండుటాకులై వ్యర్థాలే
రోజూ ఇన్ని ఇన్ని కొన్ని కొన్ని
పదాలు రాసుకుంటే
తరగని ఆస్తిపాస్తులే సుస్థిరంగా
ఇంకేం నీ కలం కలంకారీతనంగా
కదలిక కానీ భూభ్రమణంగా !
మనకోసం పదాలు
పదాల కోసం మనం !
గ్రంథంగా నీ హృదయం
యుగయుగాలకూ ఎప్పటికీ
ప్రపంచానికి శాశ్వతంగా !
- కందాలై రాఘవాచార్య
÷ *విరివిగా రాసే - రాయకూడదనుకునే*
*ఆప్తమిత్రుల కోసం మాత్రమే*

Sarma చెప్పారు...

తుడిచి తుడ్వని రోడ్ల దుమ్మంతయున్ బోవ
కడిగి శుభ్రము చేయగడగినట్లు
కఠినబాధలగూర్చు కాలుష్యభూతమ్ము
బూజునే వదిలింప బూనినట్లు
అధికారవర్గ దౌష్ట్యాహంకృతి నడంచ
పెనుయత్నమున్ జేయుపెంపునట్లు
ఆ కరోనాకు స్నేహకరమ్ము నందించి
పెంపొందగాజేయు ప్రేమమట్లు

చెరువులేపూడ్చ నడిరోడ్ల చెరువులనగ
వాన మేఘాలె కావించు వైభవమటు
సెంటి మీటర్ల లెక్కలో గంటలుగను
భయద భీభత్స వర్ష సంభవమునయ్యె.

రాయప్రోలు సీతారామశర్మ భీమవరం

Sarma చెప్పారు...

*🦜మూడు రోజుల వాన*🌧️
=====================
చెట్లు వానలో నానింది
గూడు వానలో నానింది
పక్షి వానలో నానింది
ఈ రోజు ఎండ వచ్చింది
చెట్టు ఆరింది
గూడు ఆరింది
రెక్కలు దులుపుకుని
పక్షి మబ్బు లేని
ఆకాశానికి ఎగిరింది
మూడు రోజుల వానకు *ఏకాదశి*
ఈ రోజు పక్షికి *ద్వాదశి*
- కందాలై రాఘవాచార్య

Sarma చెప్పారు...

*💎నేటి ఆణిముత్యం💎*


చీమ స్వార్థంబు కల్గిన జీవికాదు
పెక్కు చీమలు గుమిగూడి మెక్కుచుండు
దానికున్నట్టి బుద్ధి ఈ మానవులకు
కలుగదేటికి చిత్రమా కలియుగమున

*భావము :-*

చీమలకు స్వార్ధమనేది లేదు. ఒక చీమకు ఒక చిన్న బియ్యం గింజ కనబడితే చాలు వరుసగా పది చీమలు చేరి ఆ గింజను తోసుకెళ్ళి తింటాయి. కాని మానవుడట్లాకాదు. ఎంత పెద్ద మొత్తమయినా తనకు, తన పిల్లలకు కావాలనుకుంటాడే గాని తోటి మానవులతో పంచుకోడు. మనిషి స్వార్ధపరుడు. ఈ కలియుగంలో ఇది చాలా చిత్రమైనది.

*🎣సేకరణ:సొంటేల ధనుంజయ🎣*

Sarma చెప్పారు...

సందేహమాత్ర నరజీవనయానమేతత్
కర్మాను గుణ్యమతికర్కశమార్తి యుతం
శ్రీనాథ దివ్యకరుణామృతకాంక్షిణం మాం
మాతః విలోకయ కృపాకలితేక్షణ త్వం

జ్ఞాన ధనమునిచ్చి శాంతితో బ్రతుకగ
మార్గమిడిన గాని మనుజులిలను
వెఱ్ఱి యాశ లంద వేసట పడుచుండ
శుద్ధి చేయుమమ్మ బుద్ధినిపుడు

చిలకమఱ్ఱి కృష్ణమా చార్యులు

Sarma చెప్పారు...

వినుడు లోక రీతి వినయ శీల
___________&___________
నీతి రాని చదువు నీరు వూరని బావి
నవ్వు లేని మోము పువ్వు లేని
వనము లెన్ని యున్న ఫలమేమి పుడమికి
వినుడు లోక రీతి వినయ శీల

తోలు తిత్తి గాదె తొమ్మిది రంధ్రాల
దేహ మందు మాయ మోహమేల
చావు పుటుక నడుమ సంచారి నీవుర
వినుడు లోక రీతి వినయ శీల

పుట్టి నప్పు డేమి పట్టుకొచ్చితి వీ వు
పోవునప్పుడేమి పొందగలవు
నడుమ పాడు పనుల మిడిమేల మేలరా
వినుడు లోక రీతి వినయ శీల

నీరు వలన బురద చేరు,నీరు వలన
బురద తొలగునటులె పూని చూడ
పాప పుణ్యములకు వారధి మనసురా
వినుడు లోక రీతి వినయ శీల
...... రాఘవ మాస్టారు....
+91 86609 31280: కాసుల కలి మహిమ!?
********************
తే.గీ.
పైకము తొడగొట్టు మనసు బాధ పెట్టు
పైసలు చెడగొట్టు గుణము పాతి పెట్టు
కాసు విడ గొట్టు బంధాలు కసిరి గొట్టు
డబ్బు పడగొట్టు మనిషిని దెబ్బగొట్టు
కనుక ధనము కూడగ నీవు గర్వ పడకు
........ రాఘవ మాస్టారు.....
+91 86609 31280: కాల మహిమ కాన లేము
**********************
ఆట వెలదులు
____________
కనులు తెరువ పుట్టు కనులు మూయ గగిట్టు
రెప్పపాటు బ్రతుకు చెప్ప లేము
బ్రతికి బ్రతుకు నివ్వు పదిమంది కోసము
మనిషి జన్మ లోన మర్మ మిదియె

దేవు డెపుడు నడిగె దేబిరించి మనల
కానుకిచ్చి తనను కావు మనెన!
దానమివ్వు నీవు దీన జనులకును
మనుషులా దుకున్న మాధవుడగు

చిరుత నాకి విడుచు శివుని దయగలగ
గొర్రె గరచును విధి కూడ నపుడు
కటు కరో న తెవు లు కలగంటిమా యిలన్
కాలమహిమ మనము కాన లేము
...... రాఘవ మాస్టారు......
+91 86609 31280: మంచి మాటల ఆట వెలదులు
**************************
చిన్ని దీప మొకటి చీకట్లు తొలగించు
చీ కటనుచు తిట్ట సిగ్గు చేటు
చిన్ని సాయమైన చేయగ వచ్చుగా
గడ్డు కాలమందు గంజి చాలు

బుద్ది హీనులైన మొద్దు మిత్రులకన్న
బుద్ది గలుగు శత్రువులిల మేలు
చాలు సింహ మొ కటి వేల గొఱ్ఱెలకన్న
మంచి మాట జెప్పు మనిషె గొప్ప

సిరులు కూడ వచ్చు శీఘ్రము పోవచ్చు
చరిత నందు నిలుచు జనుల కీర్తి
నీవు జేయు మంచి నిన్నంటి కాపాడు
భక్తి కన్న మిన్న పరుల సేవ
..... రాఘవ మాస్టారు....
+91 86609 31280: మంచి మాటలు తృప్తి నిచ్చు
************"_****"""""""**

. ఆటవె ల దులు

ఆశ లేని మనిషి అసలిల మన లేడు
ఆ శ లోనె బ్రతుకు పాశముండు
ఆశ యుండ వచ్చు నత్యా శ ముప్పురా
తృప్తి లేక నీకు తృష్ఠి రాదు

పరుల దిట్టు నోరు బాధల పాలౌను
మంచి చెడులు గలుగు మాట వ లనె
తిట్ట రాదు బాధ పెట్ట రాదన్యుల
నోరు నదు పు నున్న పోరు రాదు

బ్రతుకు నిచ్చు వారు బ్రతుకు నేర్పిన వారు
మెతుకు పెట్టు వారు మేటి దైవ
సమము వారి పూజ స ల్పంగ వలెనురా
మనుషులం దు దైవ మగును వారు

రాయి తోడ కొట్ట కాయ నిచ్చును చెట్టు
కాలుచున్న దివ్వె కాంతి నిచ్చు
సజ్జనుండు నెపుడు జనుల మంచిని కోరు
ఇ చ్చు చేయి కెపుడు వచ్చు చుండు
..... రాఘవ మాస్టారు.......

Sarma చెప్పారు...

*సంస్కృత సూక్తి*

*ఆచారో హంత్యలక్షణమ్*

సదాచారం అవలక్షణాలను దూరం చేస్తుంది.

==========

Sarma చెప్పారు...

🌻*శీర్షిక : 2020 బతుకమ్మ ఉయ్యాలో*🌻

ఇరవై ఇరవై వచ్చింది ఉయ్యాలో
ఆశలే జూపింది ఉయ్యాలో
ఊసులే జెప్పింది ఉయ్యాలో
మార్చిలో మారింది ఉయ్యాలో
కరోనా వచ్చింది ఉయ్యాలో
పనులు పక్కకువెట్టే ఉయ్యాలో
బడులూ గుడులూ ఉయ్యాలో
వృత్తి వ్యాపారాలు ఉయ్యాలో
అన్నిటినీ మూసింది ఉయ్యాలో
లాక్ డౌన్ అంటూ ఉయ్యాలో
బందీల జేసింది ఉయ్యాలో!!

శుభ్రతను దెలిపింది ఉయ్యాలో
మూతి ముక్కు మూసి ఉయ్యాలో
దూరాలు వెంచింది ఉయ్యాలో
మరణామృదంగం ఉయ్యాలో
లోకమంతా మ్రోగే ఉయ్యాలో
బడులు మూతవడే ఉయ్యాలో
వలసకార్మికులంతా ఉయ్యాలో
పనిలేక పస్తులూ ఉయ్యాలో
వేల మైళ్ళ దారి ఉయ్యాలో
నడకదారి వట్టి ఉయ్యాలో
హరీగోస వడ్డారు ఉయ్యాలో!!

ఆన్ లైన్ సదువు ఉయ్యాలో
అంతటా పాకింది ఉయ్యాలో
ఆరునెలలైనా ఉయ్యాలో
అది పారిపోలేదు ఉయ్యాలో
పండుగలు జరగలే ఉయ్యాలో
ఉగాది వొయ్యింది ఉయ్యాలో
రంజాన్ వొయ్యింది ఉయ్యాలో!!

అది గట్ల ఉందంటే ఉయ్యాలో
కుండపోత వాన ఉయ్యాలో
గంగ పరుగులు వెట్టే ఉయ్యాలో
ఇంటింటా నీరాయే ఉయ్యాలో
వీధులే నదులాయే ఉయ్యాలో
పట్నమే చెరువాయే ఉయ్యాలో
పారేశాను బతుకాయే ఉయ్యాలో!!

బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో
తెలంగాణ బతుకమ్మ ఉయ్యాలో
బంతి పూలతోటి ఉయ్యాలో
చేమంతి పూలతోటి ఉయ్యాలో
గూనుగు పూలతో ఉయ్యాలో
తంగేడు పూలతో ఉయ్యాలో!!

పసుపు కుంకుమలతో ఉయ్యాలో
నవరాత్రులూ పూజింతు ఉయ్యాలో
మమ్ముగాపాడవే ఉయ్యాలో
వనదుర్గా మాతవై ఉయ్యాలో
భద్ర కాళివై ఉయ్యాలో
అందర్నీ కరుణించు ఉయ్యాలో
కరుణించి కాపాడు ఉయ్యాలో
మమ్ము బ్రతికించు బతుకమ్మ ఉయ్యాలో!!!

🌺🌺🌺బతుకమ్మ పండుగ శుభాకాంక్షలతో ... 🌺🌺🌺
🙏*~ తుమ్మ జనార్దన్(కలం పేరు: జాన్)*

Sarma చెప్పారు...



" వ్యక్తుల్ని ఆరాధించడం.....
మానుకో!
వ్యక్తిత్వాన్ని అభిమానించడం... నేర్చుకో" ..!!

" కాలాన్ని కాదన్న వాడు...
కాలంతో కలిసిపోతాడు
కాలం మాట విన్నవాడు...
కలకాలం నిలిచిపోతాడు"..!

ఎన్నడూ ఆశపడని వాడు
ఎన్నడూ అసంతృప్తికి గురి
కాడు......!!

అధైర్యం అనేక అనర్ధాలకి
దారితీస్తుంది.

పేదవాడు
ధనం కోసం చూస్తాడు
ధనికుడు
స్వర్గసుఖాలకోసం చూస్తాడు
కాని.....!
ఙ్ఞాని..
ప్రశాంతత కోసం చూస్తారు!!

గొప్ప గుణాలుంటే సరిపోదు
వాటిని వినియోగించగలగాలి

ఎప్పుడైనా సరే అడిగే ప్రశ్నలో
పద్దతి ఉంటే... వచ్చే సమాధానంలోసంస్కారం
ఉంటుంది.....!!

ఒకరు మరొకరికీ హాని చేస్తుంటే
చూసి నవ్వడం చాలా తేలిక!!
అదేహాని తనకి జరిగితే
భరించడం చాలా కష్టం..!!

ఒక నవ్వు చాలు స్నేహం మొదలు అవ్వడానికి,
ఒక చూపు చాలు హృదయం గెలవడానికి,
ఒక మాట చాలు యుద్ధం ముగించడానికి,
ఒక అడుగు చాలు గెలుపు తీరం చేరడానికి,
ఒక స్నేహితుడు చాలు బాధలు మరవడానికి...

స్నేహం చెయ్యడానికి ఒకే వయస్సు, ఒకే కులం, ఒకే అంతస్తు కానవసరం లేదు..అర్థం చేసుకునే రెండు హృదయాలు ఉంటే చాలు..!


*_సింహంలా పరిగెత్తాలని,_*
*_అందరికీ కుతూహలమే కానీ,_*
*_సింహం నుండి సైతం తప్పించుకునే,_*
*_జింక చాకచక్యాన్ని నేర్చుకోవడం కొంత మందికే సాధ్యం..._*
*_ఓపికని చేతకానితనం అనుకుంటే అది పొరపాటే!_*
*_ఒక్కసారి ఓపిక కట్టలుతెంచితే,_*
*_ప్రతి ప్రశ్నకి... ప్రతి కదలిక సమాధానంగానే మారుతుంది!_*

*_ఎవరైనా నచ్చలేదంటే,_*
*_వారి నుండి దూరంగా ఉండండి.!_*
*_అంతేకాని వారికి కారణాలు చెప్పకండి.?_*
*_రుజువు చేసి...మనల్ని మనం,_*
*_కించపరచుకోనవసరం లేదు.!_*
*_ఎప్పుడూ ఓకేలాగా ఉంటే అది జీవితం కాదు,_*
*_నువ్వు పరిస్థితులను అర్ధం చేసుకుని,_*
*_ఎక్కడ మాట్లాడాలి,_*
*_ఎక్కడ పొట్లాడాలి,_*
*_ఎక్కడ ఎదిరించాలి,_*
*_తెలుసుకొని మసలుకో..._*

Sarma చెప్పారు...

నవరాత్రి పర్వశుభాకాంక్షలు
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
కన్గవ చయములే కన్విందుగానెంచు
కమలాస్యముద్రను గ్రాలుతల్లి,
క,వచస్సమర్థమౌ కవితనా రాజిల్లు
కనుదామరల వెల్గు లమరుతల్లి,
కవచమేదానౌచు కాపాడగాబూను
హృ న్నీరజమ్ముతో నెసగుతల్లి,
కవచాది స్వర్ణవిఖ్యాతభూషణపాళి
అవతారరూపమ్ము నందుతల్లి,

ఇంద్ర కీలాద్రి నవరాత్రు లింపుమీర
మహిత శరదిందుకాంతినే మనసుమురియ
విజయవాడ విడిదిసేయు విభవదాయి
కనకదుర్గమ్మ నతికోటి కావుమమ్మ.

రాయప్రోలు సీతారామశర్మ, భీమవరం.

Sarma చెప్పారు...

*జయభారతి-జ్ఞానధాత్రి.*
*జేజేలు జనని జ్ఞాన దాయిని,
వేవేల గతుల భావరాగిణీ,
వందనాలు వేదగానమోదిని,
సుందరాలనాదరాగభారతి. 'జేజే'
1చ.
తన్మయిత్రిగుణశ్రుతివరదాయి,
చిన్మయి త్రిపురరసజగవాహినీ,
ధర్మ సురక్షణిఅక్షయజనశోభిని,
సత్యపథ అక్షరపద దరహాసినీ. 'జేజే'
2చ:
పలుకుచిలకల పరిమళహర్షిణి,
సకలజగరవళికి,సరిగమవర్షిణీ,
మనసుమాధురిపదనిసధరణి,
మమతకళలమహితజగదీశ్వరి.'జేజే'
3చ:
ప్రణతిలందవెఅంబాపరమేశ్వరి,ప్రణవపదమిడఅఖిలాండేశ్వరి,ప్రధమకళారూపిణి కళ్యాణీ,
ప్రభల విశ్వతేజిని శర్వాణి. 'జేజే'
4చ:
*భావాంబరి విశ్వజ్ఞాన వాగ్దేవి,
కావ్యసత్కళల శక్తిగాన రాగిణీ,
విరించి యుక్తి అమేయబుద్ధిప్రదాయిని,
విపంచి శక్తి అజేయసిద్ధిశాంకరీ.
'జేజే'.
*డా.వేదులశ్రీరామశర్మ'శిరీష'
కాకినాడ.9866050220.

Sarma చెప్పారు...

రచన.డానాయకంటి నరసింహ శర్మ

శా.హేమాబ్జాయుత సూర్యకోటి ప్రభవా!హేమాంబరాడంబరీ
సీమాలంకృత స్వస్థదాయినిసతీ!స్వర్లోకసంపత్కరీ
శ్యామావర్ణితనీలమేఘసదృశాశ్యాల్యౌదనోత్సాహితా
సా మాంపాతు మతంగమౌనితనయా సాతత్యసంతోషదా

మ.కురువిందాఖ్యమణీఘృణీ సులలితాకుంభోద్భవా సన్నుతా
తరమేనిన్నువచింప మాకుతృటిలోతన్వీ సమాహ్లాదినీ
తరళా!శాంభవి!చంద్రచూడుని సతీ తన్వంగి ఫాలేక్షణా
మరునిన్ గెల్చిన రుద్రనేత్రునిసఖీ మందేక్షణా శాంకరీ !

డా.నాయకంటి నరసింహ శర్మ

Sarma చెప్పారు...

అహంకారం కదా!?
****************
నేను, నాది
నా వాళ్ళు అనే అహంకారంతో
నాకే కాక
అన్నీ నా వారికే అనే అత్యాశతో

నాకేం ?
నేనే గొప్ప నే అహం తో
నాకే మెప్ప నే మోహం తో
నీవే నను ప్రేమించాల నే
అవివేకంతో
నీతో నాకేం పని లేదనే
అజ్ఞానం తో

నిను తలచడం మానినపుడు
నీతిగా బ్రతగడం లేనపుడు
మమకారం దూరమై
అనురాగం భారమై

వయసు మీరిన నేడు
మనసు వీగిన ఈ నాడు
నాకు శాంతి కరువై నది
నాకు కాంతి దూరమై నది

నా హృదయం భగ్నమైనది
బీటలు వారి చీలికలైనది

నీ ప్రేమ వర్షించి చాలా కాలమైంది
నా మనసు పులకించి చాలా కాలమైంది
నీ చల్లని చూపుల చినుకుల కోసం
నా మది పడి గాపులు గాస్తుంది

నిరాశతో
నా హృదయా న్నెందుకు మండిస్తావు
క్రూరంగా
ఇంకా నన్నెందుకు దండిస్తావు

ప్రభో!
నీ జేసిన తప్పిదం
ఈ మానవ నైజపు
రాగద్వేషాల చట్రంలో
కామార్థాల పాశంలో
నిరంతరం ఇరుక్కుపోవడ మే
జీవిత సత్యం తెలియక పోవడమే

ప్రభో! నను క్షమించు
వయసు పెరిగి పోతుంది
మనసు తరిగి పోతుంది
నల్లని నింగి మృత్యువు వోలె
ఉగ్ర రూపంతో ఉంది
ఎండిన నేల కలి పురుషుని
జే రి కరాళ నృత్యం లా ఉంది

ప్రభో! ఇకనైనా
నీ ప్రేమ కరుణామయ ప్రభంజనాలతో
ఆ వర మేఘమాల ను నా వైపుకు పంపించు

ఆకాసంపై జ్ఞాన మెరుపు కొరడాలను ఝుళి పించు
నా పై అనన్య సుధామయ ప్రేమ జల్లులు కురిపిం చు

నిశ బ్ధంగా
మానవాళి నంత టా కమ్ము కొన్న
ఈ మాయా మోహపు అజ్ఞాన బడభాగ్ని చల్లార్చు
ఈ జనానికి అద్ధ్వైత జ్ఞానోదయం కలిగిం చూ
..... రాఘవ మాస్టారు.....

Sarma చెప్పారు...

🌱🌱🌱🌱
🌷🌿 *HaPpY ℳỖŘŇĮŇĞ*🌿🌷
🌹jai sriram🌷
*లక్ష్య సాధనలో*...
*నువ్వు పడుతున్న బాధలు*
*ఎవరికీ అక్కరలేదు*,

*నీ కనుల వెనుక*
*కన్నీళ్లు ఎవరికీ పట్టవు*

*నీ మనస్సుకు అయిన గాయాలు*,
*అస్సలే అవసరం లేదు*...

*కానీ?.. నీవలన*
*ఒక చిన్న తప్పు జరిగితే*....
*వంద నోర్లు మాట్లాడుతాయి*..
*ఇదే జీవితం*

🌷🌿 * శుభోదయం ఫ్రెండు*🌿🌷

Sarma చెప్పారు...

*బతుకురక్ష బతుకమ్మదీక్ష.*
*బతుకిచ్చు అమ్మఉయ్యాలో,
బతుకమ్మ తల్లికి జేజేలో.
ప్రకృతి కాంతులు ఉయ్యాలో,
జగతికీ శాంతులు జేజేలో.
*జగాల బతుకమ్మ ఉయ్యాలో,
పదాల మెతుకమ్మ జేజేలో.
మంగళ గౌరమ్మ ఉయ్యాలో,
సుందరకళలమ్మ జేజేలో.
*పూబంతి పసుపుఉయ్యాలో,
మందార కుంకుమ జేజేలో,
చామంతి అందాలుఉయ్యాలో,
శ్రీ మంతి చందాలు జేజేలో.
*గుండెల్ల కొలువై ఉయ్యాలో
గండాలుదాటించ జేజేలో
బంగారు బతుకైఉయ్యాలో,
కంగారు పోగొట్టు జేజేలో.
*మమత పంచగ ఉయ్యాలో,
మనసు మంచిగ జేజేలో.
మనుగడ కలలు ఉయ్యాలో,
మధురాలకళ జేజేలో.
*కరుణించుతల్లిఉయ్యాలో,
కరువుబాపమ్మ ఉయ్యాలో,
కడగళ్ళుతొలగఉయ్యాలో,
దయగ బతుకమ్మజేజేలో.
*మూలలమేలిమిఉయ్యాలో,
మాలోని బలిమి జేజేలో.
మముగాచుఅమ్మ ఉయ్యాలో,
చల్లంగచూడ తల్లి జేజేలో.
*డా.వేదుల శ్రీరామశర్మ'శిరీష'
కాకినాడ.9866050220

Sarma చెప్పారు...

*🌊⛈️ శీర్షిక: అల్పులపై అల్పపీడనం ⛈️🌊*

కరోనా కరాళ నృత్యం
ఆగకమునుపే మొదలాయే
కుంభవృష్టి విలయ తాండవం
తట్టుకోలేని పట్టణం
పడవలకు నిలయమాయే
నీటబడి విలవిలాడుతున్న
చేపలైరి పేదలు
విహారయాత్రలు జేసిరి పెద్దలు
ఆదుకొనే నాదుడు లేక
అనాదలైరి అపర దీనులు
నిరాశచెందిరి నిరాశ్రయులై
అల్పులపై అల్పపీడనం
ఊహించని శరాఘాతం
ఇక దుర్గామాతే శరణం.
ఆగవే గంగమ్మా
దయదలచవే గౌరమ్మా
బ్రతికించవే బతుకమ్మా🙏🌹🙏.

💧 *తుమ్మ జనార్ధన్(జాన్)*💦

cbs చెప్పారు...

*విశ్వనాథ,రావూరికి అక్షరనీరాజనం.*
*సాహిత్యాన్ని వేయిపడగల సువర్ణంమణిమయంచేసిన,
ఆంధ్రత్వంపౌరుషవిశ్వనాధుడు
రామాయణకల్పవృక్షకవిసమ్రాట్.
*ఆంధ్రసాహిత్యంకుతొలిసారిగ,
ప్రతిష్టాత్మకంగజ్ఞానపీఠగ్రహీత,
కిన్నెరసానిప్రభతెలుగువెన్నెలై,
వన్నెలవిశ్వసాహిత్యసత్వమే.
*అద్వితీయుడుసినారేతదుపరి
అఖండప్రయోక్తరచనలరావూరి,మరోజ్ఞానపీఠపురస్కారమేటిగ,భరద్వాజ,తెలుగుపదదివిటీనే.*సాహిత్యలోక స్మ్రతిపథంలో,
సదా స్మరణీయమైన ఇర్వురూ,
సారసత్వప్రతిభాస్ఫూర్తులుగా,
వర్ధంతినేడుతెలుగుపదంవర్ధిల్ల.
*విశ్వనాథ,రావూరిలకునివాళి,
విశ్వఖ్యాతికిదేసహృదయజోత.
*డా.వేదులశ్రీరామశర్మ"శిరీష"

cbs చెప్పారు...

😫 *7 డుపు* 😪
~~~~~~~~~~~~~~~~~~~
వర్షం తలమీంచి జారిపడుతుంటే
7డుపు ఒడలంతా పాకురే !
వంతెన లేదు
రోడ్డు లేదు
ఇంటింటికి ఏది దారి
గోదారే --
ఈతకు "లాగిన్" కావాలి
ఏరులు దారి తప్ప్పినట్లు
నగర సంచారం !
మానవ సంచారం బంద్
నేలకు కి మీ ఎత్తునే మబ్బులు
వరద ఎత్తుకు పై ఎత్తు
ఎందుకు కాదు !
గృహం దాటి బయట పడకండి
కరోనా కాదు ---
నీరు కాటు వేస్తుంది
నీటి కాటుకు మందు లేదు
మునుగుడు తేలుడు !
వరుణుడు అందరి ఇంట్లో తిష్ఠ
జబర్ దస్తీ -
దస్తి కూడా ఆరలే!
ఆకాశం మాయమైపోతే బాగుండు
వరద గురించి ఏం రాస్తాం ?
కలం సిరా నీరు నీరు !
కాగితం ముద్ద ముద్ద !
7డ్పు ఒకటే మనకు మనకు
మనం మనంగా !
- కందాలై రాఘవాచార్య

cbs చెప్పారు...

అన్నపూర్ణాదేవి
౼౼౼౼౼౼౼౼౼
అక్షయపాత్రయు న్నందపు దర్వియున్ (గరిటె)
హస్త భూషలగు నేయన్నపూర్ణ
అఖిలాండజీవుల కాహారమందించి
ఆకలినడచు నేయన్నపూర్ణ
సర్వజ్ఞతాశక్తి సంపూర్ణ కృపజూపు
హరున కెల్లప్పు డేయన్నపూర్ణ
జ్ఞానవైరాగ్య భాగ్యానందమొదవించి
భవతాపమార్పు నేయన్నపూర్ణ

కాశియన కూర్మి కనురెప్ప ఘనతగాచు
సతము వాత్సల్యవార్థిని సాకుచుండు
అన్నపూర్ణమ్మ యవతార మందుతల్లి
కనకదుర్గా! నమస్కార కంజశతము.


రాయప్రోలు సీతారామశర్మ, భీమవరం

cbs చెప్పారు...

శ్రీరామ౫


అపరాధసహస్రఫలం జనితం
బహుసంకటదుర్భరసంఘటితం
స్థగితంజనజీవనచక్రమిదం
తవరక్షణమిచ్ఛతి రామ విభో!

కోరికలెన్నొపర్వులిడ కూడని కార్యములన్నిజేయ వి
స్తారము లైన పాపములె శాపములై పెను ముుప్పురాగ వే
సారుచునుండిరీ జనులు సాధ్యము గాక భరించ కష్టమున్
శ్రీరఘు రామ నీవెగతి శీఘ్రమె మాన్పగ నీప్రమాదమున్

చిలకమఱ్ఱి కృష్ణమాచార్యులు

cbs చెప్పారు...

😣 *వీధి నది*😪
🌀🌀🌀🌀🌀🌀🌀🌀🌀
హత విధి !
ఇప్పుడు వీధి వీధికి నది పారకం
నదుల నగరం
బతుకమ్మను వొంపడానికి
నదీ వరకు నడిచే పుణ్యం పాయే!
గృహం ముందే ఆగ్రహ నది
పండగ పడగొట్టరాదని
తీరు తీరు ఏడ్పులతో
తీరు తీరు పూలు పేర్చి
వాకిటి నదిలో వొంపండం తీరైంది
ముఖం చాటేసిన సూర్యుడా !
ఈ నదులను ఎండగొట్టి ఆరేయ్ !
- కందాలై రాఘవాచార్య

cbs చెప్పారు...

శీర్షిక : బతుకమ్మ
అతివలంతా చేరి ఆడుదురు బతుకమ్మ

రచన : గోగులపాటి కృష్ణమోహన్
సూరారంకాలని, హైదరాబాదు.


అక్కచెల్లి కలిసి... తల్లికూతురు కలిసి
అత్త కోడళ్ళతో... ఆడబిడ్డలతో
ఇరుగుపొరుగు కలిసి... వీధివాడకలిసి
అతివలంతా చేరి - ఆడుదురు బతుకమ్మ

తంగేడు పూలను... తెల్లనీ గునుగును...
ముత్యాల పూలనూ.. నేలచామంతినీ...
పల్లెములో పేర్చి... బతుకమ్మను కూర్చి...
అతివలంతా చేరి ఆడుదురు బతుకమ్మ

పట్టుచీరలు కట్టి.. బంగారు నగలేసి
కాళ్ళకూ పట్టీలు.. నిండగాజులు తొడిగి..
నడుముకు నిండుగా వడ్డాలము తొడిగి
అతివలంతా చేరి ఆడుదురు బతుకమ్మ

నాటి రాజుల కథలు... పురాణ గాధలు
దేవుళ్ళ పాటలు... జానపద గీతాలు
పాటకు తగ్గట్టు చప్పట్లు కొట్టుతూ
అతివలంతా చేరి ఆడుదురు బతుకమ్మ

అత్తింటి కష్టాలు.. అమ్మింటి ముచ్చట్లు
చిన్ననాటి చిలిపి చేతలు గుర్తులు
ముచ్చటించుకుంటు.. మురుపమెంతో పడుతు
అతివలంతా చేరి ఆడుదురు బతుకమ్మ

పెత్తరమాసతో ఎంగిళ్ళ పండుగ
సద్దులతో ముగియు బతుకమ్మ పండుగ
తొమ్మిది సద్దులు.. నైవేద్యమే పెట్టి
అతివలంతా చేరి ఆడుదురు బతుకమ్మ

చెరువు గట్టు కాడ... దేవునీ ముంగిట
వీధి కూడళ్ళలో... ఇంటి వాకిట్లలో
బతుకమ్మను ఆడి... చెరువులో వేయంగ
అతివలంతా చేరి ఆడుదురు బతుకమ్మ

చెరువులో మురికిని... నీటిశుబ్రతకునూ
బతుకమ్మ పూవులు మేలెంతో చేయునూ
పకృతి మేలుకు, సంస్కృతి జాగృతికి
అతివలంతా చేరి ఆడుదురు బతుకమ్మ

మీ
సహస్ర కవిమిత్ర, సహస్ర కవిరత్న
గోగులపాటి కృష్ణమోహన్
కవి, జర్నలిస్టు
9700007654

cbs చెప్పారు...

2020!

*ఇరవై ఇరవై*
*కరోనా పరమై*
*మనశ్శాంతి కరువై*
*చుట్టాలే దూరమై*
*కాలక్షేపమే భారమై*
*సోమరితనం దగ్గరై*
*ఆదాయం ఆవిరై*
*చింతలన్నీ చేరువై*
*మమతలన్నీ మాయమై*
*తనువు చిక్కి శల్యమై*
*పండుగలు దండగై*
*లోకమంతా చీకటై*
*కన్నీరు కాల్వలై*
*అయినవాళ్ళే కానివారై*
*కాలమే గాలమై*
*శాపమే శూలమై*
*ప్రకృతే వికృతై*
*మరణమే శరణమై*
*రొదచేస్తూ సుధలు మరిపించి* *వ్యథను పరిచయం చేసింది*
*ఇరవై ఇరవైలో మనతో కరోనా*
*ట్వంటీ ట్వంటీ ఆడింది స్వయానా*

cbs చెప్పారు...

అందరికి శుభోదయము:
ఎవరో డాక్టర్ చెప్పదంట
నవ్వుతూ ఉంటే ,అదే మందు
రొగానికి, అప్పుడే ఆనందంగా
ఉంటావు అన్నాడు,
ఇలా ఉండగలిగిన వాడు
ఒక్క సన్యాసి మాత్రమే.
కడుపు కాలి, డొక్క చిక్కి
జీవన్మరణ పోరాటంతో
బ్రతుకు ఈడ్చేవాడికి
నవ్వుతూ ఉండమంటే
ఎలా ఉంటాడు......
మీరు చెప్పినట్లు
మంచి తనము, మొండి తనము రెండు కావాలి..

cbs చెప్పారు...

*అమరకీర్తి పోలీస్ దీప్తి.*
*అమరవీరులకుజాతిజోహారు,
విధుల ధీరతలకు దేశ జేజేలు.
త్యాగాల పోలీసులకు జోహార్లు,
నేరాలరికట్టుసంరక్షణకుజేజేలు.
*చట్టాలబాట భరోసాజీవనమై,
దక్షత శ్వాసలసమాజబలగమై,
రక్షణధ్యాససంఘమిత్రత్వాలు,
దీక్షాసంరక్షణపోలీసుఆదర్శాలు.*ప్రతికూలకాలాల్లోననూవిధిగ,
ప్రతిభాసంపదలసేవాపెన్నధిలై,
ప్రజాసంక్షేమవిషయ శోభలతో,
ప్రాణాలుపణంబెట్టుప్రగతివెల్గు.
*రాత్రీపగలనకధాత్రిశాంతికోసంఎండావానల్లోధర్మస్థాపనఠీవిగ,
నిండైన కాపలా సత్తా బాధ్యత,
చట్టవ్యతిరేకచిచ్చులార్పధీరత.
*అనుక్షణంజాతిఆరాట స్థైర్యం,
క్షణంవిరామంలేనిపోరాటధైర్యం,కష్టనష్టాల్లోకూరిమిఖాకీఖలేజా,కర్తవ్యదీక్షాదక్షుడుశౌర్యపోలీసే.
*చీకాకుపడకచేతనశీలులయి,
చట్టశిక్షలమలురక్షకులూతామై,
చోరీ ఘోరాలరికట్టునేర్పుబాటై,
నేరస్థులకట్టడిఓర్పు ధీరపోలీసే.
*లాఠీచార్జిభయాలరూపాలైనా,
డ్యూటీ సేఫ్టీకిఅభయబాసటనే.
సమతుల్యతకై సంరక్షణశ్రమలై,
జనశ్రేయరక్షణస్ఫూర్తితపస్విలే.
*డా.వేదుల శ్రీరామశర్మ'శిరీష',
కాకినాడ.9866050220💐

cbs చెప్పారు...

సిద్ధిపేట జిల్లాలో ఉయ్యాలో
సిరులనిచ్చే ఊరు ఉయ్యాలో
ఆ ఊరునేలేది ఉయ్యాలో
వరదరాజపెరుమాళ్ ఉయ్యాలో
అందుకే ఆ ఊరు ఉయ్యాలో
వరదరాజ పురము ఉయ్యాలో
ఆ ఊరికొక్క ఉయ్యాలో
చరిత ఉన్నాది ఉయ్యాలో
చెబుతా నేనిప్పుడుయ్యాలో
అనండి శ్రద్ధగా ఉయ్యాలో
వినండి అక్కలూ ఉయ్యాలో
పాడండి చెల్లెళ్ళు ఉయ్యాలో
చదవండి అందరూ ఉయ్యాలో
భాగ్యవంతులౌతారు ఉయ్యాలో
గూడా వంశజుడుయ్యాలో
శనిగరం ఊరికి ఉయ్యాలో
దేవేరులతో ఉన్న ఉయ్యాలో
వరదరాజ పెరుమాళ్ ను ఉయ్యాలో
ప్రతిష్ఠ కోసముయ్యాలో
కంచి నుండి తెస్తు ఉయ్యాలో
విశ్రాంతి కోసమూ ఉయ్యాలో
గజ్వేలు తాలూకాలోని ఉయ్యాలో
అటవీ ప్రాంతంలో ఉయ్యాలో
ఎడ్ల బండ్లు ఆపి ఉయ్యాలో
అక్కడే పడుకొనిరి ఉయ్యాలో
తెల్లారి లేచి ఉయ్యాలో
బయలుదేరాజూస్తె ఉయ్యాలో
ఆ బండ్లు కదలవాయె ఉయ్యాలో
బండికి కట్టిన ఉయ్యాలో
ఎడ్లు మెదలవాయె
అయ్యో ఏమాయె ఉయ్యాలో
అయ్యయ్యో ఏమాయె ఉయ్యాలో
ఎంతకూ కదలవూ ఉయ్యాలో
విచారించి పండితుడు ఉయ్యాలో
ఏమీ చెయ్యాలేక ఉయ్యాలో
వదిలి వెళ్ళలేక ఉయ్యాలో
ఆరోజు కూడ ఉయ్యాలో
అక్కడే పడుకొనిరి ఉయ్యాలో
ఆ రేయి స్వప్నంలో ఉయ్యాలో
గూడా పండితుడికి ఉయ్యాలో
పెరుమాళ్ళు కనిపించి ఉయ్యాలో
తానిక్కడుంటనని ఉయ్యాలో
చెప్పి మాయమైయ్యె ఉయ్యాలో
మరుసటి రోజు ఉయ్యాలో
తోడు వచ్చిన వారికి ఉయ్యాలో
చెప్పి పండితుడు ఉయ్యాలో
ఏమీ చేద్దాము ఉయ్యాలో
ఎక్కడికెల్దాము ఉయ్యాలో
గుడి కట్టవలెనన్న ఉయ్యాలో
భూమీ కావాలి ఉయ్యాలో
ధనమూ కావాలి ఉయ్యాలో
నవాబు దొరనూ ఉయ్యాలో
సాయమర్థించిరీ ఉయ్యాలో
నవాబు అప్పుడు ఉయ్యాలో
నీకొక్క పరీక్ష అన్నాడు ఉయ్యాలో
అదేమిటంటే ఉయ్యాలో
తలపైన కుంపటితొ ఉయ్యాలో
ఎంత దూరం పోతె ఉయ్యాలో
అంతా భూమి నీదె ఉయ్యాలో
కావలసినంత ఉయ్యాలో
ధనమునీదె ఉయ్యాలో
అన్నాడు రాజు ఉయ్యాలో
అందుకూ పండితుడు ఉయ్యాలో
ఒప్పుకున్నాడు ఉయ్యాలో
తలపై కుంపటితో ఉయ్యాలో
తిరుగగలిగినంత ఉయ్యాలో
భూమి దానం తెచ్చి ఉయ్యాలో
గుడి కట్టించి ఉయ్యాలో
నిత్య పూజలకై ఉయ్యాలో
జనుల రప్పించి ఉయ్యాలో
బతుకు తెరువు చూపి ఉయ్యాలో
స్వామి సేవలకోసం ఉయ్యాలో
నియమించినాడు ఉయ్యాలో
ఆరోజు మొదలు ఉయ్యాలో
భక్తుల పాలిట ఉయ్యాలో
కొంగు బంగారమై ఉయ్యాలో
ఆ ఊరిలోన ఉయ్యాలో వరదరాజ పెరుమాళ్ ఉయ్యాలో
కొలువై ఉన్నాడు ఉయ్యాలో
వైశాఖ మాసంలో ఉయ్యాలో
శుద్ధ సప్తమి నుండి ఉయ్యాలో
బహుళ చవితి వరకు ఉయ్యాలో
అధ్యయనోత్సవాలు ఉయ్యాలో
శ్రద్ధాసక్తులతో ఉయ్యాలో
గూడా వంశస్తులుయ్యాలో ఉయ్యాలో
జరిపించుతున్నారు ఉయ్యాలో
ఇది జరిగి ఇప్పటికి ఉయ్యాలో
నాలుగు వందలేళ్ళాయె ఉయ్యాలో
నమ్ముకున్న వారినీ ఉయ్యాలో
నడిపించె దేవుడూ ఉయ్యాలో
నయవంచకులపాలిటీ ఉయ్యాలో
కాలాయముడు ఉయ్యాలో
కాంతలూ మీరంత ఉయ్యాలో
కామితం తీరగా ఉయ్యాలో
పాడండి మీరిప్పుడుయ్యాలో
పాపనాశనులౌతారు ఉయ్యాలో
ధన్యులౌతారు ఉయ్యాలో

cbs చెప్పారు...

*జయభారతి-జ్ఞానధాత్రి.*
*జేజేలు జనని జ్ఞాన దాయిని,
వేవేల గతుల భావరాగిణీ,
వందనాలు వేదగానమోదిని,
సుందరాలనాదరాగభారతి. 'జేజే'
1చ.
తన్మయిత్రిగుణశ్రుతివరదాయి,
చిన్మయి త్రిపురరసజగవాహినీ,
ధర్మ సురక్షణిఅక్షయజనశోభిని,
సత్యపథ అక్షరపద దరహాసినీ. 'జేజే'
2చ:
పలుకుచిలకల పరిమళహర్షిణి,
సకలజగరవళికి,సరిగమవర్షిణీ,
మనసుమాధురిపదనిసధరణి,
మమతకళలమహితజగదీశ్వరి.'జేజే'
3చ:
ప్రణతిలందవెఅంబాపరమేశ్వరి,ప్రణవపదమిడఅఖిలాండేశ్వరి,ప్రధమకళారూపిణి కళ్యాణీ,
ప్రభల విశ్వతేజిని శర్వాణి. 'జేజే'
4చ:
*భావాంబరి విశ్వజ్ఞాన వాగ్దేవి,
కావ్యసత్కళల శక్తిగాన రాగిణీ,
విరించి యుక్తి అమేయబుద్ధిప్రదాయిని,
విపంచి శక్తి అజేయసిద్ధిశాంకరీ.
'జేజే'.
*డా.వేదులశ్రీరామశర్మ'శిరీష'
కాకినాడ.9866050220.

cbs చెప్పారు...

✒️ *ఏదీ కవితా వస్తువు* ??
卐卐卐卐卐卐卐卐卐卐卐卐
కవిత్వానికి ఇప్పుడు వస్తువేది ?
అన్నీ నీట మునిగినై !!
ఆకాశం రచనకు అనుకుంటే
అది పగబట్టినట్లు
మనకు దమ్ము దమ్ముగా
డ్రమ్ముల నీరు వీధి వీధికి
మైదానమే చేసింది ---
సూర్యోదయాలు లేకనేపాయే
ఉసురుసురు ముసురు ---
వసంతం వచ్చేవరకు
మామిడి చెట్టు కింద కోయిల కోసం
ఆచారి పీఠం వేసుకు జపమాల !
కవి సమయం తడిసి తడిసి ముద్ద
ఆశువు ఆశువుగా వరద చరిత
గుండె గుండెకు
లబ్ డబ్ గా ముద్రణలు ముద్రణలు
- కందాలై రాఘవాచార్య

cbs చెప్పారు...

కనకదుర్గాదేవి
౼౼౼౼౼౼౼౼౼
ఏదేవి స్మరణమ్ము ఖేదాబ్ధి దాటించి
సౌఖ్యమ్ము నిడజాలు చందనమ్ము,
ఏదేవి దర్శన మ్మిహలోక తృష్ణాగ్ని
వారింపగాజాలు వర్షధార,
ఏదేవి సత్తేజ మెదలోని చీకట్ల
పారద్రోలగజాలు భానుదీప్తి,
ఏదేవి తెగువ మహిషదైత్యు శృంగభం౼
గముసేయగాజాలు కత్తిసాము,

అట్టి త్రైలోక్యపూజ్య,వీరావతార,
సింహవాహన,కృష్ణమ్మ సేవితాంఘ్రి,
ఇంద్రకీలాద్రి పొలుచు మాహేశుకొమ్మ
కనకదుర్గమ్మ! మది నమస్కారమమ్మ.

రాయప్రోలు సీతారామశర్మ, భీమవరం.

cbs చెప్పారు...

సరదా సరదాదసరా
సరదాలనుపెంచిమిగులసౌఖ్యముమీకున్
దరిజేర్చిజీవితంబున
సిరులనునింపేయుగాకమీకందరకున్

శ్రీ కరియై శుభకరియై
శోకంబులుపారద్రోలుసుందరవదనై
ప్రాకటముగువరములనిడి
మీకనునిత్యముశుభములుమిగులగనిడదే

«అన్నిటి కంటే పాతది ‹పాతవి   232లో 1 – 200   కొత్తది» సరి కొత్తది»