24, మే 2024, శుక్రవారం

Telugu


 

డొనెషన్లు

 డొనెషన్లు

మిత్రులారా మన బ్లాగు అభివ్రుద్దికి డొనేషనులు +91 9848647145 మొబేలు నంబరుకు జీ పే, ఫొనె పె, పేటియం లొ దేనితొ నయినా పంప వచ్హు. మీ స్క్రీన్ షాట్ పంపిస్తె మన బ్లాగులొ పబ్లిష్ చేస్తాము. ఇక ఆలశ్యం యెందుకు ఇప్పుడె మీరు డొనెషన్ పంపండి. మన బ్లాగు అభివ్రుద్దికి తొట్పడండి 

శనివారం*🍁 🌹 *మే 25, 2024*🌹

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*

           🍁 *శనివారం*🍁

       🌹 *మే 25, 2024*🌹

       *దృగ్గణిత పంచాంగం*                

*స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం* 

*ఉత్తరాయణం - వసంతఋతౌః* *వైశాఖమాసం - కృష్ణపక్షం*

*తిథి : విదియ* సా 06.58 వరకు ఉపరి *తదియ*

వారం :*శనివారం* (స్ధిరవాసరే)

*నక్షత్రం : జ్యేష్ఠ* ఉ 10.30 వరకు ఉపరి *మూల*

*యోగం  : సిద్ధ* ఉ 10.07 వరకు ఉపరి *సాధ్య*

*కరణం   : తైతుల* ఉ 07.14 గరజి సా 06.58 ఉపరి *వణజి*

*సాధారణ శుభ సమయాలు*

*ఉ 10.30 - 12.30 సా 04.30 - 06.00* 

అమృత కాలం :*రా 04.12 - 05.48 తె*

అభిజిత్ కాలం :*ప 11.38 - 12.30*

*వర్జ్యం : సా 06.36 - 08.12*

*దుర్ముహుర్తం : ఉ 05.35 - 07.19*

*రాహు కాలం : ఉ 08.50 - 10.26*

గుళిక కాలం :*ఉ 05.35 - 07.12*

యమ గండం :*మ 01.42 - 03.19*

సూర్యరాశి : *వృషభం* 

చంద్రరాశి : *వృశ్చికం/ధనస్సు*

సూర్యోదయం :*ఉ 05.35* 

సూర్యాస్తమయం :*సా 06.34*

*ప్రయాణశూల  :‌ తూర్పు* దిక్కుకు ప్రయాణం పనికిరాదు


*వైదిక విషయాలు*

ప్రాతః కాలం :*ఉ 05.35 - 08.11*

సంగవ కాలం :*08.11 - 10.46*

మధ్యాహ్న కాలం :*10.46 - 01.22*

అపరాహ్న కాలం :*మ 01.22 -03.58*

*ఆబ్ధికం తిధి:వైశాఖ బహుళ విదియ*

సాయంకాలం :*సా 03.58 - 06.34*

ప్రదోష కాలం :*సా 06.34 - 08.46*

నిశీధి కాలం :*రా 11.42 - 12.26*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.06 - 04.50*

______________________________

          🌷 *ప్రతినిత్యం*🌷

 *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*

            🍁 *ఓం శ్రీ*🍁

🌹 *ఆంజనేయాయ నమః*🌹

*బుద్ధిర్బలం-యశోధైర్యం నిర్భయత్వమరోగతా ।*

*అజాడ్యం-వాఀక్పటుత్వం చ హనుమస్స్మరణాద్-భవేత్ ॥*


*జయత్యతి బలో రామో లక్ష్మణస్య మహాబలః ।*

*రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభి పాలితః ॥*


*దాసోఽహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్ట కర్మణః ।*

*హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజః ॥*🍁🙏🍁🙏🍁🙏🍁🙏🍁


🌴🪷🌹🛕🌹🌷🪷🌷🌴

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*


          🌷 *సేకరణ*🌷

      🌹🌿🍁🍁🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🍁🍁🍃🌷

🌹🌷🍁🍁🍁🍁🌷🌹

Doctor to treat knee pain

 


జడ్చర్ల తరువాత కొత్తకోట అనే ప్లేస్ వస్తుంది... కొత్తకోట బస్టాండ్ near by రాములు..ఆయుర్వేదిక్ అని అడగండి మీకు అడ్రస్ చెబుతారు..హైదరాబాద్ నుండి nearly 120 to 130 km ఉంటుంది.. Bangalore హైవే లోనే ఉంటుంది ఈ ప్లేస్

Panchaag



రసధార పాటలూరి వేటూరి

 *రసధార పాటలూరి వేటూరి.* డా.వేదుల శ్రీరామ శర్మ 'శిరీష ' 9866050220

*భువన వేణువు గగనం గాలి యైన అక్షర దీప్తి,

సుమధురపాటలసుందర స్పూర్తి రామమూర్తి.

గంగమ్మ తలపులఝరి ఉప్పొంగే గోదావరి వేటూరి.

ఓంకారనాద సంధాన శంకర వేదగాన లహరి రసభావనల,

ఉచ్చ్వాస వాయులీన రాగవిరి.

మనోహర శిల్ప ఎడపదాల విఙ్ఞత, 

స్త్రీశక్తిఉత్తేజభావగాన వేటూరి.

*అభినవ శ్రీనాథ జీవనప్రబంధ 

అద్వితీయ మాధుర్య పాటవసిరి.

నిప్పుకన్ను నిద్రోయి నుదుటి బొట్టవడం, నెలవంక తలపాగా 

పట్టుదలరసరమ్యపట్టువేటూరి.

(మనోజ్ఞ కవనశిల్ప కవిశ్రేష్ట వేటూరి కి సహృదయ నీరాజనాలు..డా.శిరీష

వైశాఖ పురాణం - 16.

 వైశాఖ పురాణం - 16.


16వ అధ్యాయము - వైశాఖవ్రత మహిమ


నారదమహర్షి అంబరీష మహారాజునకు వైశాఖ మహత్మ్యమును వివరించుచు నిట్లనెను. శ్రుతదేవుని మాటలను విని శ్రుతకీర్తి మహారాజు శ్రుతదేవమునీ! వైశాఖ ధర్మములు సులభములు అఖండ పుణ్యప్రదములు విష్ణుప్రీతికరములు ధర్మాధిధర్మార్థపురుషార్థ సాధకములు. ఇట్టియుత్తమ ధర్మములు శాశ్వతములు వేదనిరూపితములు కదా ఇట్టి యుత్తమధర్మములు లోకమున నెందుకని ప్రసిద్ధములు కాలేదు? రాజస, తామస ధర్మములు కష్టసాధ్యములు అధికధనసాధ్యములు అట్టి ధర్మములు లోకమున ప్రసిద్దములైనవి. కొందరు మాఘమాసమును మెచ్చుకొందురు. కొందరు చాతుర్మాస్యముల నుత్తమములనియందురు. వ్యతీపాతాది ధర్మములను మరికొందరు ప్రసంసింతురు. వీనిని వివరించి సరియగు వివేకమును కలిగింపగోరుచున్నానని యడిగెను.


శ్రుతదేవుడును మహారాజా! వైశాఖ ధర్మములెందుకని ప్రసిద్ధములు కాలేదో యితర ధర్మములకెందుకు ప్రసిద్ధి కలిగెనో వివరింతును వినుము. లోకములోని జనులు చాలమంది ఐహికభోగములను, పుత్రపౌత్రాది సంపదలను కోరుచుందురు. వారు రాజసతామసగుణప్రధానులు. ఇంతమందిలో నెవడో యొకడు యేదో యొక విధముగ స్వర్గము కావలయునని యజ్ఞాది క్రతువులను చేయుచున్నాడు. ఆ యజ్ఞాది క్రియలు కష్టసాన్నిధ్యములైనను స్వర్గవ్యామోహముతో వానినే అతికష్టముపై చేయగోరుచున్నాడు. కాని ఒకడును మోక్షమునకై ప్రయత్నించుటలేదు. చాలామంది జనులు క్షుద్ర ప్రయోజనములకై ఆశపడి అధికకర్మలు చేయుచు కామ్యసాధనకై యత్నించుచున్నారు. కావున రాజసతామస ధర్మములు లోకమున ప్రసిద్ధములైనవి. విష్ణుప్రీతికరములగు సాత్త్విక ధర్మములు ప్రసిద్ధములు కాలేదు. సాత్త్వికకర్మలు నిష్కామకర్మలు కాని ఐహికమును ఆయుష్మికమును అగు సుఖమునిచ్చునవి. దేవమాయా మోహితులు కర్మపరతంత్రులునగు మూఢులు యీ విషయము నెరుగురు. ఆధిపత్యము ఉన్నతపదవి సిద్దించినచో వాని మనోరధమ్ములన్నియు తీరినవనియనుకొనుచున్నారు. వ్యామోహనమే ప్రయోజనముగా కల కర్మలను చేసినచో సంపదలు క్షీణింపవు. వృద్ధినందును. ఆధిపత్య ప్రయోజనముతో వారి పురుషార్థ సాధన ఆగిపోవును.


వైశాఖ ధర్మములు సాత్త్వికములు అవి నిగూఢములుగ యెవరికిని దెలియకయున్న కారణమును వినుము. పూర్వము కాశీరాజు కీర్తిమంతుడనువాడు కలడు. అతడు నృగమహారాజు కుమారుడు ఇక్ష్వాకు వంశరాజులలో ఉత్తముడు. కీర్తిశాలి. అతడు యింద్రియములను జయించినవాడు. కోపము నెరుగనివాడు. బ్రహ్మజ్ఞాని. అతడొకనాడు వేటాడుటకై అడవికి పోయెను. వశిష్ఠ మహర్షి యాశ్రమ ప్రాంతమును చేరెను.


అతడు వెళ్లిన కాలము వైశాఖమాసము. వశిష్టమహర్షి శిష్యులు వైశాఖమాస ధర్మములను ఆచరించుచుండిరి. కొందరు చలివేంద్రములను, మరికొందరు నీడనిచ్చు చెట్టును, మరికొందరు దిగుడు బావులను, యేర్పాటు చేయుచుండిరి. బాటసారులకు చెట్ల నీడలయందు కూర్చుండబెట్టి విసనకఱ్ఱలతో విసురుచుండిరి. చెరకుగడలను, గంధములను, ఫలములను యిచ్చుచుండిరి. మధ్యహ్నకాలమున ఛత్రదానమును, సాయంకాలమున పానకమును, తాంబూలమును, కన్నులు చల్లబడుటకు కర్పూరమును యిచ్చుచుండిరి. చెట్లనీడలయందు, యింటి ముంగిళ్లయందు మండపములయందు యిసుకను పరచి కూర్చుండుటకు వీలుగచేయుచుండిరి. చెట్ల కొమ్మలకు ఉయ్యాలలను కట్టుచుండిరి. రాజు వారిని జూచి యిదేమని ప్రశ్నించెను. వారును వైశాఖమాసమున చేయవలసిన ధర్మములివి. మానవులకు సర్వపురుషార్థములను కలిగించును. మా గురువుగారైన వశిష్టులచే ఆజ్ఞాపింపబడి వీనిని చేయుచున్నాము అని పలికిరి. మరింత వివరించి చెప్పుడని రాజు వారిని అడిగెను. మేమీ పనులను గురువుల యాజ్ఞననుసరించి చేయుచున్నాము. మీకింకను వివరములు కావలసినచో మా గురువులనడుగుడని సమాధానమిచ్చిరి. రాజు వారి మాటలను విని పవిత్రమగు వశిష్టుని యాశ్రమమునకు వెళ్లెను.


అట్లు వచ్చుచున్న రాజును వాని పరివారమును జూచి వశిష్ఠ మహర్షి సాదరముగ రాజును వాని పరివారమును అతిధి సత్కారములతో నాదరించెను. రాజు మహాముని యిచ్చిన ఆతిధ్యమును స్వీకరించి నమస్కరించి సంతోషాశ్చర్యములతో చేయునిట్లడిగెను. మహర్షీ! మార్గమున మీ శిష్యులు బాటసారులకు చేయు అతిధిసత్కారములు ఉపచారములు నాకు మిక్కిలి ఆశ్చర్యమును కలిగించినవి. ఇట్లెందులకు చేయుచున్నారని నేను వారి నడిగితిని. వారును మహారాజా! దీనిని వివరించునవకాశము లేదు. మా గురువుల యాజ్ఞననుసరించి శుభకరములగు వీనిని చేయుచున్నాము. మీరు మా గురువులనడిగిన వారు మీకు వివరింపగలరు. నేనును వేటాడి అలసితిని. అతిధి సత్కారమును కోరు పరిస్థితిలోనుంటిని. ఇట్టి స్థితిలో మీ శిష్యులు బాటసారులకు చేయు ఆతిధి సత్కారములు విస్మియమును కలిగించినవి. నీవు మునులందరిలో మొదటివాడవు. శ్రేష్ఠుడవు. సర్వధర్మములనెరిగినవాడవు. నేను మీకు శిష్యుడను దయయుంచి నాకీ విషయము నెరిగింపుడని ప్రార్థించెను.


వశిష్ఠ మహర్షియు రాజునకు గల ధర్మజిజ్ఞాసకు వినయవిధేయతలకు సంతసించెను. రాజా! నీ బుద్ధికిగల క్రమశిక్షణ మెచ్చదగినది. విష్ణుకధా ప్రసంగమునందు విష్ణుప్రీతికరములగు ధర్మములనెరుగుటయందు ఆసక్తి కలుగుట సామాన్య విషయము కాదు. నీవడిగిన విషయమును వివరింతును. వినుము. వైశాఖమాస వ్రత ధర్మ విషయములను వినిన సర్వపాపములును నశించును. ఇతర ధర్మముల కంటె వైశాఖ ధర్మములు మిక్కిలి యుత్తమములు. వైశాఖమాసమున బహిస్నానము చేసినవారు శ్రీమహావిష్ణువునకు ప్రియమైనవారు అన్ని ధర్మముల నాచరించి స్నానదానార్చనములెన్ని చెసినను వైశాఖమాస ధర్మముల నాచరింపనిచో అట్టివారికి శ్రీహరి దూరముగ నుండును. వారు శ్రీహరికి ప్రియులుకారని భావము. వైశాఖమాసమున స్నానదానములు, పూజాదికములు మానినవారెంత గొప్ప కులమున జన్మించిననువారు కర్మననుసరించి మిక్కిలి నీచ జన్మకలవారని యెరుగుము. వైసాఖమాస వ్రత ధర్మముల నాచరించి శ్రీహరిని పూజించినచో శ్రీహరి సంతసించి వారి కోరికల నిచ్చి రక్షించును. శ్రీపతియు జగన్నాధుడునగు శ్రీమహావిష్ణువు సర్వపాపముల నశింపజేయువాడు సుమా! వ్యయ ప్రయాసలు కల వ్రతము చేతను ధర్మ సూక్ష్మముల చేతను ధనములచేతను శ్రీహరి సంతసింపడు. భక్తి పూర్వకముగ నారాధింపబడిన శ్రీహరి భక్తిపూర్వకమైన స్వల్పపూజకైనను స్వల్పకర్మకైనను సంతసించును. భక్తిలేని కర్మయెంత పెద్దదైనను అతడు సంతసించును సుమా. అధికకర్మకు అధికఫలము, స్వల్పకర్మకు స్వల్పఫలము అని శ్రీహరి లెక్కింపడని భక్తియధికమైనచో స్వల్పకర్మకైనను అధికఫలమునిచ్చును. భక్తిలేని కర్మయే అధికమినను ఫలితముండదు. కర్మమార్గమును దాని ఫలమును నిర్ణయించుట చాలా కష్టము సుమా! వైశాఖమాస వ్రత ధర్మములు స్వల్పములైన వ్యయప్రయాసలు చేయబడినను భక్తిపూర్ణములైనచో శ్రీహరికి మిక్కిలి సంతోషమును కలిగించును కావున రాజా! నీవును వైశాఖమాస ధర్మములను యెక్కువ తక్కువలనాలోచింపక భక్తిపూర్ణముగ నాచరింపుము. నీ దేశప్రజలచేతను చేయింపుము. వారికిని శుభము కలుగును. వైశాఖధర్మములనాచరింపని నీచుని అతడెవరైనను తీవ్రముగ శిక్షింపుము అని వశిష్ఠమహర్షి శాస్త్రోక్తములగు శుభకరములగు వైశాఖమాసవ్రత ధర్మములు వానియంతరార్థమును మహారాజునకు విశదపరచెను. రాజు మహర్షికి నమస్కరించి తన రాజ్యమునకు పోయెను.


ఆ రాజు వశిష్ఠమహర్షి చెప్పిన మాటలను పాటించెను. వైశాఖధర్మములను పాటించుచు శ్రీ మహావిష్ణువును మిక్కిలి భక్తితో సేవించుచుండెను. ఏనుగుపై భేరీ వాద్యమునుంచి దానిని మ్రోగించి భటులచే గ్రామ గ్రామమున ప్రజలారా వినుడు. ఎనిమిది సంవత్సరముల వయసు దాటిన వారు యెనుబది సంవత్సరముల లోపువారు ప్రాతఃకాలమున స్నానము చేసి వైశాఖమాసమున వైశాఖమాసవ్రత ధర్మము నాచరింపవలెను. అట్లాచరింపని వారిని దండించి వధింతును. లేదా దేశమునుండి బహిస్కరింతునని చాటించెను. వైశాఖవ్రతము నాచరింపని వారు తండ్రియైనను, పుత్రుడైనను, భార్యయైనను, ఆత్మబంధువైనను తీవ్రదండన కర్హులేయనియు ప్రకటించెను. వైశాఖమున ప్రాతఃకాలస్నానము చేసి సద్బ్రాహ్మణులకు జలము మున్నగు వానిని యధాశక్తిగ దానము చేయవలయును. చలివెంద్రములు మున్నగు వాని నేర్పాటు చేయవలయును అని వైశాఖ ధర్మములను పాటింపని వారిని తెలిసికొనుటకై ధర్మవక్తను నియమించెను. వైశాఖవ్రతమును పాటింపని వారిని శిక్షించుటకై అయిదు గ్రామముల కోక ధర్మాధికారిని నియమించెను. వాని అధీనమున పది మంది అశ్వికులనుంచెను. ఈ విధముగ నా మహారాజు ఆజ్ఞచే వాని దేశమున వైశాఖమాస వ్రతము సుస్థిరమయ్యెను. ఈ రాజు ప్రారంభించిన నాటిన వైశాఖ ధర్మవృక్షము సుస్థిరమయ్యెను. ఆ రాజు రాజ్యమున మరణించిన స్త్రీలు, బాలురు, పురుషులు అందరును యిహలోక సుఖములనందిన వారై విష్ణులోకమును చేరుచుండిరి. వైశాఖమాసమున ఏ కారణముచే ప్రాతఃకాలస్నానము చేసినను పాపవిముక్తులై శ్రీహరి లోకమును చేరుచుండిరి.


ఇట్లు ఆ రాజ్యము దేశములోని ప్రజలందరును వైశాఖ మహత్మ్యమున శ్రీహరి లోకమునకు పోవుటచే యమ ధర్మరాజ్యమునకు(నరకమునకు) పోవువారెవరును లేకపోయిరి. ప్రతిప్రాణియు లోగడ చేసిన పాపములన్నిటిని చిత్రగుప్తుడు వ్రాసినను కొట్టివేయవలసి వచ్చెను. ఈ విధముగ చిత్రగుప్తునికి జనుల పాపములను వ్రాయుత కొట్టివేయుట జరిగి అతడూరకనుండవలసి వచ్చెను. ఏ పనులు చేసిన వారైనను వారు నరకమునకు పోవలసినవారైనను వైశాఖస్నాన మహిమచే విష్ణులోకమునకు పోవుటచే నరకలోకములన్నియు వచ్చు వారు లేక శూన్యములై యుండెను. అంతే కాదు స్వర్గలోకమునకై యజ్ఞయాగాదుల నెవరును చేయక వైశాఖమాస వ్రతములను ధర్మముల నాచరించుచుండుటచే వారును విష్ణులోకమును చేరుటచే స్వర్గలోకములును శూన్యములై యుండెను. ఈ విధముగ యమధర్మరాజు లోకము నరకము, ఇంద్రుని దేవలోకము స్వర్గము వచ్చువారెవరును లేక శూన్యములై యుండెను.


వైశాఖ పురాణం 16వ అధ్యాయం సమాప్తం.

⚜ శ్రీ వెంకటరమణ దేవాలయం

 🕉 మన గుడి : నెం 327


⚜ కర్నాటక  :-కార్‌స్ట్రీట్ - మెంగళూరు


⚜ శ్రీ వెంకటరమణ దేవాలయం 



💠 శ్రీ వెంకటరమణ దేవాలయం మంగళూరులోని కార్-స్ట్రీట్‌లో ఉంది.

ఈ ఆలయం శ్రీ మధ్వాచార్య (శ్రీమద్ ఆనంద తీర్థ)చే ప్రకటించబడిన మాధ్వ వైష్ణవ సంప్రదాయాన్ని అనుసరిస్తుంది



🔆 చరిత్ర


💠 శ్రీ వెంకట్రమణ దేవాలయానికి గొప్ప చరిత్ర ఉంది. ఈ ప్రదేశంలో వైశ్యులు ప్రధాన నివాసులు మరియు పోర్చుగీసు వారు ఈ ప్రదేశాన్ని ఆక్రమించినప్పుడు, వైశ్యులు దక్షిణం వైపు వెళ్ళవలసి వచ్చింది. ఇలా చాలా మంది మంగళూరులో స్థిరపడ్డారు. 

శ్రీ వెంకట్రమణ ఈ ప్రాంతపు వైశ్యుల ప్రధాన దేవుడు మరియు ఆలయాన్ని వారి సంఘం సభ్యులు నిర్మించారు.


💠 ఒక మూలం ప్రకారం 1804 లో, ఒక పరిధీయ సన్యాసి మంగళూరును సందర్శించారు. కార్‌ స్ట్రీట్‌లో తాత్కాలిక ఆశ్రయం కల్పించి, తాను పూజించే వీర వెంకటేశుని అందమైన బొమ్మను ఉంచి, ప్రజల అర్పణలతో జీవించేవాడు. 

అతను సాహుకర్ మ్హాల్ పాయ్ యొక్క దుకాణంలో విగ్రహాన్ని (బట్టతో కప్పి) ఉంచాడు, అతను త్వరలో తిరిగి వస్తానని మరియు అతను కొద్ది రోజుల్లో తిరిగి రాకపోతే గుడ్డ  తెరవాలని అన్నాడు.

లోపల ఏముందో తెలియక, ఈ ప్యాకెట్ నుండి పొగలు ఎగసిపడే వరకు ఎవరూ దాని గురించి బాధపడలేదు. గుడ్డ తీసివేసినప్పుడు లోపల వేంకటరమణ భగవంతుని అందమైన చిత్రం కనిపించింది.


💠 ఈ విగ్రహాన్ని శ్రీ కాశీ మఠంలోని శ్రీమద్ విభుదేంద్ర తీర్థ స్వామీజీ వద్దకు తీసుకువెళ్లారు, వారు అందమైన చిత్రాన్ని మెచ్చుకున్నారు మరియు మంగళూరులోని శ్రీ వెంకటరమణ ఆలయంలో దాని ప్రతిష్టాపనకు ఆమోదం తెలిపారు, సమాజంలోని నలుగురు ప్రముఖ పురోహితులు మూడు రోజుల పాటు నిరంతరంగా పూర్వ ప్రతిష్ఠాపనను నిర్వహించి, ప్రతిష్టించారని చెబుతారు.


💠 గర్భ గృహ స్థలంలో శ్రీ వీర వెంకటేశ స్వామి, శ్రీ వీర విట్టల, ఉత్సవ శ్రీ శ్రీనివాస,

శ్రీ మూల వెంకటరమణ , శ్రీ గోపాలకృష్ణ , శ్రీ హయగ్రీవ  మరియు శ్రీ నాగదేవర విగ్రహాలు ఉన్నాయి.


💠.పంచలోహ విగ్రహం విజయనగర వాస్తుశిల్పం. పీఠంతో సహా దాని ఎత్తు దాదాపు 2 అడుగులు. విగ్రహం దాని కుడి నడుముకి కటారి (కత్తి) జోడించబడింది.

 అందుకే భగవంతుని బిరుదుకు 'వీర' అనే పేరు ఉపసర్గ పెట్టబడింది.


💠 పురాణాల ప్రకారం, విజయనగర సామ్రాజ్యం యొక్క చక్రవర్తులు ఏదైనా యుద్ధంలో పాల్గొనే ముందు ఈ విగ్రహానికి తమ ప్రార్థనలు చేశారు. అన్ని వైష్ణవ దేవతలతో సమానంగా ఈ విగ్రహం నుదుటిపైన ముకుట కిరీటాన్ని కలిగి ఉంటుంది, వివాహ సమయంలో వరుడు ధరించే బాసింగ ఉంటుంది.

భగవంతుడు శ్రీ పద్మావతి దేవితో తన వివాహం వైపు కవాతు చేస్తున్నాడని మరియు అతని నడుముపై కటారి తన మార్గానికి ఆటంకం కలిగించే దుష్ట & రాక్షస మూలకాలను పారద్రోలేందుకు ఉద్దేశించబడ్డాడని ఇది సూచిస్తుంది. 


💠 భగవంతుని రెండు చెవులకు మకర కుండల మరియు చెవికి పైన రత్నం వంటి పుష్పం ఉంటాయి. , ఈ విగ్రహం విజయనగర కాలానికి చెందినదని రుజువు చేస్తుంది. 

ఇది మెడపై లాకెట్టుతో చిన్న నెక్లెస్ & దండ కూడా ఉంది.

విగ్రహం భుజాలపై స్కంద మాల కూడా ఉంటుంది. ఈ విగ్రహం కుడిచేతి పైభాగంలో చక్రముతోనూ, ఎడమవైపు పైభాగంలో శంఖంతోనూ అలంకరించబడి ఉంటుంది. 

దిగువ కుడి చేతిలో వరద ముద్ర పాదాల వైపు క్రిందికి చూపుతుంది మరియు దిగువ ఎడమ చేతిని నడుము క్రింద ఉంచబడుతుంది. భగవంతుని సేవలో ఉన్న భక్తులు సంసారం అనే భయంకరమైన సముద్రంలో మునిగిపోరని ఇది సూచిస్తుంది. ఈ విధంగా విగ్రహం పైన పేర్కొన్న అన్ని లక్షణాలతో ప్రకాశిస్తుంది.

అందుకే, వీర వెంకటేశ భగవానుడు ఇప్పటివరకు తన ప్రకాశవంతమైన అనుగ్రహంతో భక్తులందరినీ పోషిస్తున్నాడు.


💠 ప్రధాన దేవత పక్కన శ్రీదేవి మరియు భూదేవి వంటి ఇతర దేవతలు ఉన్నారు. ఈ దేవతలు పంచలోహముతో చేయబడినవి - అంటే, విగ్రహాల తయారీకి ఐదు లోహాలు ఉపయోగించబడ్డాయి. భగవంతుడు వెంకట్రమణ తన కుడి చేతిలో చక్రాన్ని మరియు ఎడమ చేతిలో శంఖాన్ని కలిగి ఉన్నాడు. 

దేవత శ్రీదేవి శ్రేయస్సు మరియు సంపదకు ప్రతీక మరియు భూదేవి పవిత్రత, ప్రకృతి మరియు విజయానికి స్వరూపిణి.


💠 ఈ ఆలయం  మంగళూరు నగరం నడిబొడ్డున ఉంది. సిటీ బస్సులు మరియు ఆటో రిక్షాలు అందుబాటులో ఉన్నందున ఆలయానికి సులభంగా చేరుకోవచ్చు.

అపర శంకరులు

 అపర శంకరులు ఆ పరమాచార్యులు !



మే 24 చంద్రశేఖరేంద్ర స్వామి జయంతి

నడిచే దైవంగా జగత్‌ ప్రసిద్ధులైన ఆధ్యాత్మిక గురువు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి. ఆదిశంకరాచార్యులు స్థాపించిన కంచి పీఠానికి 87 సంవత్సరాల పాటు పీఠాధిపత్య బాధ్యతలు వహించిన మహనీయులు. అపర శంకరులుగా పూజలందుకున్న ప్రేమస్వరూపులు. 1894 వైశాఖ బహుళ పాడ్యమి నాడు తమిళనాట విల్లిపురంలో జన్మించిన చంద్రశేఖరేంద్రుల అసలు పేరు స్వామినాథన్‌. పదమూడేళ్లకే కంచి పీఠాధిపతి అయిన కారణజన్ములు వారు.

నడిచే దేవుడు: ఆదిశంకరాచార్యుల మార్గాన్నే అనుసరిస్తూ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి కాలినడకనే దేశమంతా పర్యటించి తమ అనుగ్రహాన్ని వర్షింపజేశారు. ‘ఇలా నడవటం వల్ల నా ఆరోగ్యం బాగుంటుంది. ప్రజలనూ కలుసుకోగలుగుతున్నాను. ఇంతకంటే కావల్సింది ఏముంది?’ అనేవారు. అందుకే భక్తులంతా ‘నడిచే దేవుడు’ అనేవారు ఆరాధనాభావంతో.

అప్పుడే లక్ష్మీకటాక్షం: ‘లోకంలో ఎందరో దుఃఖితులూ, దారిద్య్రం అనుభవిస్తున్న వారూ ఉన్నారు. కనీస అవసరాలైనా తీరని అలాంటివారిని చూస్తూ కూడా, మనం వృథాగా డబ్బు ఖర్చుచేయటం.. పాపంతో సమానం. దీనుల వేదనను కొంతైనా తగ్గిస్తే, మన సంపదకు సార్థకత లభిస్తుంది. సంపద ఉన్నంతలో సరిపోదు. అది పరోపకారానికి ఉపయోగపడుతోందా? అని ఆలోచించాలి. అలా సంపద సద్వినియోగం అయ్యే కొద్దీ లక్ష్మీకటాక్షం సమృద్ధిగా లభిస్తుంది’ అనేవారు పరమాచార్యులు.

దోషాలు ఎంచకూడదు: ఇతరుల్లో దోషాల్ని వెతికేవారు ఎన్నటికీ ఆధ్యాత్మికంగా పురోగమించలేరని చెప్పేవారు చంద్రశేఖరేంద్రులు. ‘ఈశ్వరుడు పాలసంద్రంలో పుట్టిన కాలకూట విషాన్నీ, చంద్రుణ్ణీ స్వీకరించాడు. చంద్రుని శిరస్సున ధరించి, విషాన్ని పైకి రానీయక కంఠంలోనే దాచుకున్నాడు. అలాగే ఉత్తములు పరుల సుగుణాలను అందరి ముందూ శ్లాఘిస్తూ, దోషాలను తమ మనసులోనే దాచుకుంటారు’ అన్నారు కంచి పరమాచార్యులు.

భగవద్భక్తితోనే దేశప్రగతి: భక్తిని మించిన పారమార్థిక పురోగమనం మరేదీ లేదనేవారు చంద్రశేఖరేంద్ర స్వామి. ‘మనకు కావలసింది సర్వరుగ్మతల నివారిణి అయిన భక్తే! ఈశ్వరభక్తి- అతడి బిడ్డలైన సకల జీవుల మీద ప్రేమగా పరిణమిస్తుంది. అప్పుడు సేవాభావం తప్ప మరి దేనికీ చోటుండదు. ఆ దయాగుణంతోనే సార్థకత. ఆ అన్నపూర్ణాదేవి ప్రేమస్వరూపమైన జ్ఞానాన్ని భిక్షగా వేయాలని ప్రార్థిద్దాం. ఆనాడు ఆదిశంకరాచార్యులు ఆ దేవిని అర్థించింది ఇలాంటి జ్ఞానాన్నే!’ అన్నారు పరమాచార్యులు.

మన పతాకానికి మహాస్వామి నిర్వచనం: దేశానికి స్వాతంత్య్రం వచ్చిన సందర్భంగా చంద్రశేఖరేంద్ర స్వామి కంచిపీఠంలో ప్రసంగిస్తూ ‘మన జాతీయ పతాకంలో కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగులున్నాయి. కాషాయరంగు సౌభాగ్యాలనిచ్చే మహాలక్ష్మిది. తెలుపు బ్రహ్మజ్ఞానాన్ని ఇచ్చే సరస్వతీదేవిది. ముదురుపచ్చ మనల్ని రక్షించే పరాశక్తి రూపమైన దుర్గాదేవిది. దేవీశక్తుల ప్రతీకలే మూడు చారలుగా కనబడటం విశేషం. అపార ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందటానికి కావలసిన శక్తిని ప్రసాదించాల్సిందిగా భగవంతుణ్ణి ప్రార్థించాలి. సముపార్జించుకున్న స్వాతంత్య్రాన్ని భగవదనుగ్రహంతోనే కాపాడుకోగలం. పరమాత్మ కృపతోనే సమస్త మానవాళీ ఆనందమయమైన జీవితాన్ని గడపగలదు’ అన్నారు.

రమణమహర్షిపై పూజ్యభావం వ్యక్తం చేసేవారు కంచి పరమాచార్యులు. వారి భక్తుల్లో ఒకరి పుత్రుడికి మతి భ్రమించింది. అప్పుడు చంద్రశేఖరేంద్ర ‘ఇతన్ని రమణుల సన్నిధిలో పది రోజులు ఉంచండి. అంతా సర్దుకుంటుంది’ అన్నారు. ఆ రమణుడి వద్దకు వెళ్లిన యువకుడు ‘నన్నందరూ పిచ్చివాడు అంటున్నారు’ అని విన్నవించుకున్నాడు. రమణులు కరుణతో ‘అలాగా! నన్ను కూడా ఒకప్పుడు పిచ్చివాడనే అన్నారు. నువ్వు నాకు తోడు ఉన్నావన్న మాట! చాలా సంతోషం’ అన్నారు. అలా మహర్షి సన్నిధిలో పదిరోజులున్న అతడికి స్వస్థత చేకూరింది.

చంద్రశేఖరేంద్ర సరస్వతి 1994 జనవరి 8న, తమ 99వ ఏట భౌతికంగా ఈ లోకాన్ని విడిచినా, ఆధ్యాత్మిక గురువుగా చిరస్థాయిగా నిలిచిపోయారు.

Digital Medicine for Heart

 


Digital Medicine for Heart

(Heart can be recycled without cardiac transplant)


Ultra modern English medicine without knife and blood.


*1) No angiogram *


2) No bypass surgery


3) No angioplasty or stent


Two super modern machines have been discovered

1)CT-700

2)EECP


1) The most modern machine called CT-700 has been discovered to detect heart blockage without angiogram..


Two minutes is enough for this.

No need to stay in hospital for this


This cost is also less

This is done in two places only in Chennai.


Early heart blockage detection in early stages

There is a great chance of healing through pills..


And that now

2) Heart can be cured and recycled without bypass surgery and stent through the sophisticated machine called EECP.


Government approved medical system


To know the truth

* Sri Vivekananda Hospital *

Chennai

08925015666

08778463371

09500037040

04443192129


DR.G. Vivekanandan in Doctors Conference Interview

This is the news published


Millions of diabetes and heart patients benefited from this.


Share this to everyone you know without any block.


*One share can save lives of many heart patients , PLEASE  DO SHARE MAXIMUM *

Thank you 🙏🙏🙏

తెలుగు భాషను మరచిపోవడం

 


శ్రీభారత్ వీక్షకులకు శుభాకాంక్షలు 🌹 తెలుగు వారు అయిఉండి తెలుగు నేర్చుకొనకపోతే వారి జీవితం వ్యర్థమేనంటున్నారు ప్రముఖ రచయిత్రి డా. తిరుమల నీరజ గారు. తెలుగు భాషను మరచిపోవడం వల్ల ఎన్నో తెలుగు అలవాట్లను ముఖ్యంగా ఆహారపు అలవాట్లను కూడా మరచిపోతున్నామనీ, దానివల్ల ఎన్నో రకాల అనారోగ్యాలకు కూడా గురవుతున్నామనీ అంటున్నారు. తెలుగు తెలిస్తేనే కదా! తెలుగు అలవాట్లేమిటో తెలిసేది! అందుకే తెలుగును మాటలు వచ్చినప్పటి నుంచి నేర్చుకోవాలంటున్నారు.. వినండి. ఇటువంటి విశిష్టమైన ఎపిసోడ్స్ ఉచితంగా వీక్షించడానికి వెంటనే చానల్ ను subscribe చేయండి, శ్రీభారత్ కుటుంబ సభ్యులు కండి.🙏

_మే 24, 2024_

 ॐశుభోదయం, పంచాంగం ॐ 

 *ఓం శ్రీ గురుభ్యోనమః* 

*_మే 24, 2024_

*శ్రీ క్రోధి నామ సంవత్సరం*

*ఉత్తరాయణం*

*వసంత ఋతువు*

*వైశాఖ మాసం*

*కృష్ణ పక్షం*

తిథి: *పాడ్యమి* సా6.52

వారం: *భృగువాసరే*

(శుక్రవారం)

నక్షత్రం: *అనూరాధ* ఉ9.58

యోగం: *శివం* ఉ11.27

కరణం: *బాలువ* ఉ6.45

*కౌలువ* సా6.52

వర్జ్యం: *మ3.43-5.21*

దుర్ముహూర్తము: *ఉ8.04-8.56*

*మ12.22-1.13*

అమృతకాలం: *రా1.34-3.13*

రాహుకాలం: *ఉ10.30-12.00*

యమగండం: *మ3.00-4.30*

సూర్యరాశి: *వృషభం*

చంద్రరాశి: *వృశ్చికం*

సూర్యోదయం: *5.30*

సూర్యాస్తమయం:*6.23*

లోకాః సమస్తాః *సుఖినోభవంతు*

ఔషధే చింతయే ద్విష్ణుం

 🙏🏻 ఓం నమో నారాయణాయ నమః 🙏🏻


ఔషధే చింతయే ద్విష్ణుం 

భోజనే చ జనార్ధనమ్ |

శయనే పద్మనాభం చ 

వివాహే చ ప్రజాపతిమ్ ||


యుద్ధే చక్రధరం దేవం 

ప్రవాసే చ ప్రజాపతిమ్ |

నారాయణం తనుత్యాగే 

శ్రీధరం ప్రియసంగమే ||


దుస్స్వస్నే స్మర గోవిందం 

సంకటే మధుసూదనమ్ |

కాననే నారసింహం చ 

పావకే జలశాయినమ్ ||


జలమధ్యే వరాహం చ 

పర్వతే రఘునందనమ్ |

గమనే వామనం చైవ 

సర్వకాలేషు మాధవమ్ ||


షోడశైతాని నామాని 

ప్రాతరుత్థాయ యః పఠేత్ |

సర్వపాప వినిర్ముక్తో 

విష్ణు లోకే మహీయతే ||



ఔషధసేవనం బాచరించెడి వేళ

          వినుతించ వలయును 'విష్ణు' నెపుడు

భోజనమ్మును తాను భుజియించు వేళలో 

          తలచ తగును 'జనార్దను'ని మదిని

శయనించు సమయాన సంతృప్తి తోడను 

          ప్రార్తించ వలయును 'పద్మనాభు'

ప్రార్థించవలె 'ప్రజాపతి' యంచు వినయాన 

          పరిణయ వేళందు భక్తితోడ

సమరంబు నందున 'చక్రధరా' యంచు

          జపియించ వలయును జయము పొంద

పరదేశమున నుండ హరిని 'ప్రజాపతి'

         యనుచు పలుకతగు న్నాత్మ యందు

తనువు నొదులు వేళ తా బల్క వలయును

         'నారాయణా' యంచు నయము గాను

ప్రియసంగమమునందు ప్రియమార స్వామిని 

        'శ్రీధరా' యనుచును చెప్ప తగును

దుస్వప్నముల యందు దుఃఖించకను తాను

       'గోవింద' యని మది కొలువతగును

సంకటసమయాల సద్భక్తి తోడను

        'మధుసూదన' నతగు మదిని నరుడు 

విపినంబునందున వెఱవక మనుజుండు

         కోరి దల్చ తగును 'నారసింహు'

అగ్నిజ్వాలల మధ్య ననయంబు మదియందు 

         'జలశాయి' భజనమ్ము సల్ప తగును

పర్వతంబుల మధ్య 'పట్టాభిరఘురాము'

        నెంచంగ వలయును నెపుడు నరుడు

గమనంబు నందున కల్కంగ నశ్రమ

        భక్తి నెంచ తగును 'వామనుడి'ని

సర్వకాలములందు సర్వేశు "మాధవున్"

        మదిదల్చ వలెనెప్డు మానవుండు

శుభము లిచ్చు "విష్ణు షోడశనామముల్"

యుదయ వేళ యందు చదివి తేని

సర్వ పాపరాశి సమసియు మనుజుండు 

విష్ణునెలవు చేరు విమల మతిని.


✍️గోపాలుని మధుసూదన రావు 🙏

అన్నం పరబ్రహ్మ స్వరూపమని

 అన్నం పరబ్రహ్మ స్వరూపమని ఎందుకంటారు?


మనిషి మాటలు నేర్చి, వివేకం తెలిసి, వికసించి విజ్ఝానవంతుడైన తర్వాత ఆహారానికి ఉన్న విలువను గుర్తించాడు, మానవుని ప్రాథమిక అవసరాలన్నింటిలోకి ఆహారమే ముఖ్యమైనది అని తెలిసిన తర్వాత సహజంగానే భక్తిభావం పెరిగింది ‘ఆహార ఉపాహారాల ఇష్టత లేనివానికి సుఖాపేక్ష ఉండదు. సుఖాపేక్ష లేనివానికి సంతుష్టత ఉండదు. ఆహారాన్ని సక్రమంగా తీసుకోనని వానికి ఏ కోరికలు ఉండవు' అని చెబుతుంది భగవద్గీత.

ఆలికి అన్నం పెట్టడం ఊరికి ఉపకారం చెయ్యడం’ అన్నాడట వెనకటికెవడో. ఎంత విడ్డూరమైన సామెతో కదా! కానీ జాగ్రత్తగా పరిశీలిస్తే సతికి అన్నం పెట్టడమే కాదు తను తినటం కూడా ఊరికి ఉపకారమే. ‘శరీరమాద్యం ఖలు ధర్మసాధనం’ అన్నాడు మహాకవి కాళిదాసు. ధర్మసాధనకు అత్యవసరమైంది శరీరం. దేహమే కాదు ఈ సృష్టి అంతా ధర్మసాధన నిమిత్తమే. అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయాలనే పంచకోశ సమన్వితమైన శరీరంలో అన్నమయకోశానికి మొదటి స్థానం ఇవ్వటం ఆహార ప్రాధాన్యతనే తెలియజేస్తుంది. అన్నపూర్ణ ఆత్మసఖుణ్ణి ఆదిభిక్షువుగాచేసి అన్నాన్ని అందించడం వెనుక ఆంతర్యమూ ఇదే. మనుగడకు మూలాధారమైన ఆహారాన్ని, ఆరోగ్యాన్ని విడదీసి చూడలేం. 

‘అన్నాద్భవంతి భూతాని’ అంటుంది భగవద్గీత. సకల ప్రాణులకూ మూలాధారం అన్నం. అన్నమంటే ఆహారం. దాని నుంచే సకల ప్రాణులూ ఉద్భవించాయని కృష్ణపరమాత్ముడి సందేశం. ఇదే విషయాన్ని ‘ఆత్మనః ఆకాశః, ఆకాశాద్వాయుః, వాయోరగ్నిః, అగ్నేరాపః, అద్భ్యః పృథివీ, పృథివ్యా ఔషధయః, ఓషధీభ్యోన్నం, అన్నాత్‌ పురుషః’ అంటుంది తైత్తరీయోపనిషత్తు. అన్నిటికీ మూలమైన ఆత్మ, ఆత్మ నుంచి ఆకాశం, ఆకాశం నుంచి వాయువు, వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి నీరు, నీటినుంచి పృథివీ, నేల నుంచి ఔషధాలు, వాటినుంచి అన్నం, దాన్నుంచి ప్రాణులు- ఇదీ క్రమం. ఈ గొలుసును (శృంఖల) పట్టుకుని వెనక్కి వెళ్తే దానికి మూలమైన ఆత్మ, ఆత్మకు మూలమైన పరమాత్మ కనిపిస్తాయి. అందుకే అన్నం పరబ్రహ్మ స్వరూపం. శరీరంలోని ప్రాణ, అపాన, ఉదాన, వ్యాన, సమాన రూపాల్లో ఉండే పంచప్రాణాలకు పంచభూతాల్లోని శక్తిని అందించడానికి పరమాత్మ తత్వమైన ఆహారాన్ని తీసుకోవాలి.

ఆహారం ఎలా తినాలి?

పృథ్వి, జలం, అగ్ని, వాయువు- ఆకాశ తత్వాలు కలిగిన, బొటనవేలు చూపుడువేలు మధ్యవేలు ఉంగరంవేలు చిటికినవేళ్లతో కలిపి చేతితో ఆహారం తీసుకోవడం వల్ల శరీరంలో ఉండే పంచభూతాలు ఉత్తేజితమౌతాయి. ఆ ఆహారాన్ని వైశ్వానరాగ్ని రూపంలో ఉండే పరమాత్మ పచనం చేసి ధర్మసాధనకు కావలసిన శక్తిని ప్రసాదిస్తాడు.

అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః

ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం

అంటూ ఇదే విషయాన్ని ధ్రువీకరిస్తుంది భగవద్గీత. శక్తిని ప్రసాదించే ఈ ఆహారాన్ని భగవంతుడికి సమర్పిస్తూ, ప్రశాంత వాతావరణంలో, శుచిగా, మౌనంగా, ఆకులో లేదా బంగారు, వెండి లాంటి ఉత్తమ లోహ పాత్రల్లో తీసుకున్నప్పుడు అది ప్రసాదమౌతుంది. భోజనానికి ముందు శాస్త్రం తెలిసినవారు మంత్రయుక్తంగా ఆచమనం చేసి, ఆ పరిజ్ఞానం లేనివారు భగవంతుని స్మరిస్తూ కొన్ని నీళ్లు తాగి, అప్పుడు తినడం మానసిక ప్రశాంతతను, శారీరక ఆరోగ్యాన్ని కలిగిస్తుంది.

ఏం తినాలి?

పరమేష్ఠి దేవతలకు అమృతం, మనుషులకు అన్నం, పశువులకు ఆకులలములు, దైత్య రాక్షస పిశాచ జాతులకు మద్య మాంసాలు ఆహారంగా ఏర్పరచారు. ప్రకృతిసిద్ధమైన సహజ ఆహారం సాత్వికాహారం. రుచి కోసం వండి తినడం రాజసాహారం, మసాలాలు, మాంసాహారాలు తామసాహారం. మనం తినే ఆహారాన్ని బట్టే శారీరక, మానసికతత్వాలు ఆధారపడి ఉంటాయి. రాక్షసాదులు తామసిక ఆహారం తీసుకుంటారని కాకుండా, అలాంటివి తినేవారు ఆ ప్రవృత్తి కలిగుంటారని అర్థం చేసుకోవాలి.

ఎప్పుడు తినాలి?

‘న సంధ్యయోర్న మధ్యాహ్నే నార్థరాత్రే కదాచన’ అన్నారు. అంటే ప్రాతఃసంధ్య, సాయంసంధ్య, అర్ధరాత్రి సమయాల్లో భోజనం చెయ్యకూడదంటుంది శాస్త్రం. సాధు, సన్యాసులకు మధ్యాహ్న సమయాన్ని కూడా నిషేధించింది. సంధ్యాసమయాలు సత్ఫలితాన్నిచ్చే ఉపాసనా సమయాలు. అలానే అర్ధరాత్రి ప్రత్యక్ష నారాయణుడైన సూర్యభగవానుడి జాడ శరీరానికి అందని కారణంగా జీర్ణక్రియ మందగించి అనారోగ్యాన్ని కలిగిస్తుంది. కనుక అది కూడా భోజనానికి నిషిద్ధసమయం.

అన్నం తినడానికి అర్హత ఏమిటంటే జిల్లెళ్లమూడి అమ్మ చెప్పినట్లు ‘ఆకలే అర్హత’. ఆయుర్వేదం ప్రకారం అన్నమంటే ఔషధమే. మనిషి రుతు చర్యను పాటించాలి. అంటే ఆయా రుతువుల్లో, ఆయా ప్రాంతాల్లో దొరికే ఆహారాన్ని, శరీరతత్వాల అనుకూలతను బట్టి తినాలి. ఆహార, జల, విహారాదుల్ని పాటించని ప్రాణిలో వాతపిత్తకఫాలనే త్రిదోషాలు విజృంభించి గుండె, కాలేయం, మూత్రపిండాలు, ఊపిరితిత్తుల్లాంటి అవయవాలు దెబ్బతిని ప్రాణం దేహాన్ని వదిలి వెళ్లిపోతుంది.

ఎక్కడ తినాలి?

ఆహారాన్ని పరబ్రహ్మ స్వరూపంగా, ప్రసాదంగా భావించి మౌనంగా స్వీకరించాలి. ఎక్కడబడితే అక్కడ తింటే అధ్వాన్నం అంటారు. అధ్వ అంటే దారి, అన్నం అంటే ఆహారం. రోడ్ల పక్కన శుచీ శుభ్రత లేకుండా దొరికే ఆహారమన్నమాట. అది అనారోగ్య హేతువు. దేహం దేవాలయం, అందులో ఉన్న జీవుడు దేవుడన్న భావన ఉన్నప్పుడు ఆహారవిషయంలో జాగ్రత్తపడతాం. అన్నం పరబ్రహ్మ స్వరూపమన్నది ఆధ్యాత్మికతకే కాదు, ఆరోగ్యానికీ సంబంధించింది.

ఎలాంటి ఆహారం తినాలి?

అసలే తినకపోవడం, అతిగా తినడం రెండూ ప్రమాదమే. సగం ఉడికిన, అతిగా వేగిన, ఎప్పుడో వండిన, విరుద్ధ పదార్థాలు, దుమ్మూధూళీ కలిసిన దోషపూరిత ఆహారం, చలికాలంలో చలువచేసేవి, వేసవిలో వేడిచేసేవి- లాంటివన్నీ అనారోగ్య హేతువులే. అలాంటివన్నీ పరిహరించి పరబ్రహ్మ స్వరూపమైన ఆహారాన్ని ఔషధంగా స్వీకరించి శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ఉన్నతిని సాధించాలి. 

ఇంట్లోని పిల్లలు భోజనం సరిగా తినకుండా వెదజల్లితే పెద్దలు వారిని మందలిస్తారు. అంతే కాకుండా దాన్ని అలా పారవేయరాదని అన్నం పరబ్రహ్మస్వరూపం అని వారితో అంటారు. అసలు ఇలా ఎందుకు అంటారు అని పిల్లలు అడితే దీనికి నూటికి నూరు శాతం సరైన కారణం చెప్పరు, చెప్పలేరు కూడా.

ప్రతి జీవికి కావాల్సిన ఆహార పదార్థాలను పుట్టుకతోనే ఈ భూమి మీద భగవంతుడు కల్పిస్తాడు. కాబట్టే ఎవరైనా జన్మించిన తర్వాత నారు పోసిన వాడు నీరు పోయకపోడు అని భగవంతుని గురించి పెద్దలు చెబుతుంటారు. అంటే అమ్మ కడుపులో నుంచి బయటకు రాకముందే మనకు ఇంత ఆహారం అని, ఇన్ని నీళ్లని నిర్ణయిస్తాడు. గత జన్మలో చేసిన పాప పుణ్యాలను లెక్కించి వాటిని అనుగుణంగా మనకు సమకూర్చి ఎవరికి కడుపు పుట్టాలో కూడా నిర్ణయిస్తాడట. ఆయన సమకూర్చిన ఆన్న, పానీయాలు ఎప్పుడు నిండుకుంటాయో ఆ జీవికి ఈ భూమి మీద నూకలు చెల్లిపోయినట్లే. అందుకే మీరు తినగా ఉన్న ఆహారాన్ని, తాగే నీటిని వృథా చేయకుండా అవసరమైన వారికి దానంగా ఇవ్వడం వల్ల పుణ్యఫలం పెరుగుతుందట. అలాగే భవిష్యత్తులో మనకు నచ్చిన ఆహారం మరింత లభించి దీర్ఘాయుష్షు కలుగుతుందట. అలా కాకుండా సృష్టికర్త ఇచ్చిన ఆహారాన్ని వృథాచేస్తే నీ ఆయువు క్షీణించి పోతుందట.

ఏ తల్లి అయినా తన బిడ్డల ఆయు: క్షీణాన్ని తట్టుకోలేదు. అందుకే అన్నంపారబోయవద్దని ఒకటికి పదిసార్లు చెబుతుంది. అవసరమైతే దండిస్తుంది కూడా. ఇదంతా వివరంగా చెప్పలేక అన్నం పరబ్రహ్మస్వరూపం అని మాత్రమే చెబుతారు. అందుకే అన్ని దానాలో కన్నా అన్నదానం మిన్న. ఎవరికైనా కోట్లు ఇచ్చినా సంతృప్తి చెందరు కడుపు నిండా భోజనం పెడితే చాలు అంటారు.

మహాభారత యుద్ధంలో కర్ణుడు మరణించిన తరువాత స్వర్గానికి వెళ్ళాడు. అక్కడ కర్ణునికి అన్ని సౌకర్యాలు లభించాయి. స్వాగత సత్కారాలు లభించాయి. ఏది కావాలంటే అది పొందే అవకాశం ఉంది. అన్నీ అందుబాట్లో ఉన్నాయి. ఏంలాభం...! కర్ణుడికి ఏదో అసంతృప్తి. ఏదో వెలితి. ఎంత తిన్నా కడుపు నిండినట్టుండడంలేదు. సంతృప్తినేది లేదు. ఎందుకు ఈ విధంగా ఉంటుందో అతనికర్థం కావడంలేదు. ఇదే మాట దేవేంద్రుడిని అడిగాడు కర్ణుడు. అప్పుడు దేవేంద్రుడు చిరునవ్వుతో, నీవు అనేక దానాలు చేసావని, అడిగినవాడికి లేదనకుండా ఇచ్చే దానకర్ణుడివని చెప్తారు. మరి.. ఎప్పుడైనా అన్నదానం చేసావా?'' అనడిగాడు. దానికి సమాధానంగా లేదు.. నేనెన్నో దానాలు చేసాను గాని అన్నదానం మాత్రం చేయలేదు అన్నాడు కర్ణుడు. ''పోనీ అన్నం పెట్టే ఇల్లయినా చూపించావా?'' అనడిగాడు దేవేంద్రుడు. కాస్త ఆలోచించిన కర్ణుడు చెప్పాడు- ''అవును. ఓ బీద బ్రాహ్మణుడు నా దగ్గరకు వచ్చి అన్నం పెట్టించమని అడిగాడు. అపుడు నేను ఏదో ధ్యాసలో ఉండి, నాకు అవకాశం లేదు గానీ... అక్కడ ఆ ఇంటికి వెళ్ళు అని ఒక ఇంటిని చూపించాను'' అని. నీవుఅన్నదానం చేసిన ఇంటిని చూపించిన వేలిను నోట్లో పెట్టుకో'' అన్నాడు ఇంద్రుడు. సరేనని ఆ వేలిని నోట్లో పెట్టుకున్నాడు కర్ణుడు. ఒక్క గుటక వేసాడు. ఆ క్షణంలోనే అతని కడుపు నిండిపోయింది. అంతవరకున్న అసంతృప్తి మటుమాయమైంది. ఎనలేని తృప్తి కలిగింది. ఈ కథనం ద్వారా అన్నదానం యొక్క మహత్మ్యం, దాని ప్రాశస్త్యం తెలుస్తోంది...


జై శ్రీ రామ్ 

కంచర్ల వెంకట రమణ

అలిపిరి

 **అలిపిరి* *మెట్ల మార్గం కు అలిపిరి అనే పేరు ఎలా వచ్చిందో తెలుసా?*


కొండ క్రింద ఉన్న ఈ "అలిపిరి" కి ఆ పేరు ఎలా వచ్చిందో మనలో చాలామందికి తెలియదు.


అసలు " అలిపిరి " అనే పేరే ఒక విచిత్రమైన పేరు లాగా ఉంది కదా ... ? మన తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం ఇలా ఏ భాషలోనూ ఈ " అలిపిరి " అనే పదం లేదు.


అయితే, " అలిపిరి " అనే ఈ పదం ఎలా పుట్టింది ... ?


దీని వెనుక చరిత్ర ఏమిటి ... ?

అనే విషయం మన చరిత్రని నిశితంగా గమనించినట్లయితే ఆశ్చర్యకరమైన యదార్థ సంఘటలను గురించి మనం తెలుసుకోవచ్చు.


పూర్వం ఐదు వందల సంవత్సరాల క్రితం," తిరుపతి " నగరం ఇప్పటిలాగా లేదు.


ఇప్పుడు " అలిపిరి " అని పిలుస్తున్న ప్రాంతానికి-

"అలిపిరి" అన్న పేరు కూడా లేదు.

అది ( 1656 - 1668 ) ప్రాంతం .


ఢిల్లీలో మొఘల్ చక్రవర్తులు పాలిస్తున్న సమయం. శ్రీ కృష్ణ దేవరాయల అనంతరం జరిగిన " రాక్షసి తంగడి & తళ్ళికోట " మొ || యుద్ధాల తర్వాత, విజయనగరం రాజుల ప్రాబల్యం తగ్గింది. అప్పుడు నిజాం నవాబు రాయల సీమ ప్రాంతాన్ని ఆక్రమించాడు.


ఆ సమయంలో హిందువులను, హిందూ సానుభూతిపరులను, సాధుసంతులను చాలా దారుణంగా హింసించారు.


పదిహేడో శతాబ్దం చివరిలో ఢిల్లీ ఆదేశాల మేరకు, హైదరాబాద్ నిజాం ప్రభుత్వం ఫర్మానా ( ఆర్డర్ ) మేరకు సుల్తాన్ అబ్దుల్లా - కుతుబ్ షా & వజీర్ల సైన్యం, " ఆలీ " అనే అత్యంత కరడుగట్టిన మహమ్మదీయుని నేతృత్వంలో, కడప, కర్నూలు, నెల్లూరులలో దారుణంగా దాడులు చేసి దేవాలయాలను ధ్వంసం చేసారు. ఆ తరువాత " ఆలీ " సైన్యం తిరుపతికి చేరుకుంది.


అప్పుడు, తిరుపతి చిన్న గ్రామం.


ఇప్పుడు " మంచినీళ్ళ కుంట " అని చెప్పుకుంటున్న

" నరసింహ తీర్థమే " అప్పటి తిరుపతి గ్రామం.


ఇక్కడ ఒక నరసింహ స్వామి మందిరం ఉంది, దానికి ప్రజలు నిత్యం ధూప, దీప, నైవేద్యాలు సమర్పిస్తుండేవారు. చరిత్ర తెలిసిన పెద్దవారు ఇప్పటికీ దీనిని " నరసింహ తీర్థం రోడ్ " అనే పిలుస్తారు.


ఆలీని తిరుపతికి పైకి దండయాత్రకు పంపించటానికి మూల కారణాలు రెండు :


ఒకటి : శ్రీ వేంకటేశ్వర స్వామి వారు అత్యంత శక్తివంతమైన దేవుడు అనీ & తిరుమల లాంటి దివ్య క్షేత్రం ఇంకొకటి లేదు, భవిష్యత్తులో ఉండబోదు అనే వైభవమ్ విశ్వాసం భారత దేశం నేల నాలుగు చెరలా ఉండడం వలన, ఈ దేవాలయం పై దాడి చేసి స్వామి వారి స్వరూపాన్ని పెకలించి కొండపై నుంచి తొలగించేస్తే, హిందువుల దేవుడు బలహీనుడనీ తద్వారా, ప్రజలందరూ " అల్లా " యే గొప్ప దేవుడని భావించి, " ఇస్లాం " మతాన్ని విధిలేక స్వీకరిస్తారని వారి పిచ్చి ఆలోచన.


రెండోది : శ్రీ కృష్ణ దేవరాయలు, భక్తితో స్వామి వారికి సమర్పించుకున్న విలువ కట్టలేనన్ని వజ్రాలు, వైఢూర్యాలు, కనక పుష్యరాగాలు, కెంపులూ & అపారమయిన బంగారం దోచుకెళ్ళి వాళ్ళ ఖజానా నింపుకుందామని.


అయితే అప్పటి తిరుపతి గ్రామస్తులు, " ఆలీ " ( కమాండర్ ఇన్ చీఫ్ ) ని సమీపించి నీక్కావలసింది బంగారమే కదా ! మా తిరుపతి గ్రామంలో ఉన్న స్త్రీ & పురుషుల వద్ద వున్న బంగారం అంతా ఇచ్చేస్తాం, దానితో తృప్తిపడి వెనక్కి వెళ్ళిపో, కానీ మా స్వామి వారి జోలికి రావద్దు, ఆయన మా ప్రాణం కన్నా కూడా ఎక్కువ అని విన్నవించుకున్నారు.


దానికి ఆలీ అంగీకరించినట్లు నటించి వాళ్ళు స్వచ్చందంగా ఇచ్చిన బంగారం, ఆభరణాలు తీసుకుని, మీరు చెప్పింది బాగానే ఉంది కానీ, ఈ దేవాలయాన్ని దోచుకుని ధ్వంసం చెయ్యకపోతే నిజాం నవాబూ & ఢిల్లీ సుల్తాను నా తల తీసేస్తారు కాబట్టి, తప్పదు అని తన అపార బలగాలతో ముందుకు కదిలాడు.


సరిగ్గా ఇప్పుడు " అలిపిరి " అని పిలవబడుతున్న ప్రాంతాన్ని చేరుకోగానే, శ్రీ ఆది వరాహ స్వామి అవతారమైన శ్రీవారు వరాహ రూపంలో వచ్చి నిలువరించారు.


మొదట కొంచెం బెదిరినా కూడా ముందుకు కదిలాడు. అంతే హఠాత్తుగా ఎవరి ప్రమేయమూ లేకుండా అతని రెండు కళ్ళూ పోయాయి, దృష్టి పోవడంతో దిక్కులేని స్థితిలో ఎంతో విలపించాడు.


అప్పుడు , శ్రీ స్వామి వారి " అమృత వాణి " వాడికి వినబడింది, దైవం పైనే దాడికి సిద్ధపడ్డావా ? ఎంత ధైర్యం ... ? అని. అప్పుడు ఆలీ బిగ్గరగా రోదిస్తూ ... క్షమాభిక్ష అడిగి, నేత్ర దానం చెయ్యమని వేడుకున్నాడు.


అప్పుడు దయార్ద్రచిత్తుడయిన స్వామి వారు, నీవు వెనుదిరిగి వెళ్ళిపో, నీకు దృష్టి వస్తుందని ఆదేశించారు.


దానితో ఏమీ సాధించకుండానే రిక్త హస్తాలతో వెనుదిరిగాడు "ఆలీ".


ఉర్దూ లేక హిందీ భాషలో " ఫిర్ నా " అంటే వెనక్కి మళ్ళడం, " ఫిరే ' అంటే వెనక్కి మళ్ళాడు అని అర్థం.


ఎప్పుడు, ఎక్కడా ఓటమెరుగని పరమ ఆ దుర్మార్గుడైన ఆలీ వెనుతిరిగిన వెంటనే ఈ విషయం తెలుసుకున్న అందరూ " ఆలీ ఫిరే, ఆలీ ఫిరే " అని చెప్పుకునేవారు.


కొన్ని సంస్థానాలకి సంబంధించిన గ్రామాలలో అయితే తిరుపతి ఆలయం మీదకు దండయాత్రకు వెళ్లిన ఆలీ తిరుపతిలోని ఒక ప్రదేశం నుంచి ముందుకెళ్లలేక వెనుదిరిగాడు " ఆలీ ఫిరే ",

"ఆలీ ఫిరే" అని సూచిస్తూ ... చాటింపులు సైతం వేయించారు.


" ఆలీ " ఏ ప్రాంతం నుంచి వెనక్కి మళ్ళాడో ఆ ప్రాంతాన్నే అప్పటివారు ప్రత్యేకంగా వచ్చి సందర్శించేవారు.ఆ ప్రదేశాన్ని చూడటానికి వెళ్ళేటప్పుడు లేదా వెళ్లి వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్లారని ఎవరైనా అడిగినప్పుడు " అలీ ఫిరే"

ప్రదేశానికి వెళ్తున్నామని చెప్పేవారు. కాలక్రమంగా ఆ ఆలీ ఫిరే అనే పదం - ఆలి పిరే గా రూపాంతరం చెంది ఇప్పుడు " అలిపిరి గా స్థిరపడింది.


ఇదీ మనమిప్పుడు " అలిపిరి " గా పిలుచుకునే ప్రదేశం యొక్క యదార్థమైన చరిత్ర.


ఈ విధంగా శ్రీవారి మహిమ వలన ఆలీ వెనుదిరిగిన కారణంగా, ఈనాడు మనం చూస్తున్న " అలిపిరి ఏర్పడింది

జంబూద్వీపము

 జంబూద్వీపము 


బ్రహ్మాండపురాణంలో సూతుడు ప్రపంచములోని భూభాగములు, జలభాగముల గురించి ఇలా చెప్పాడు - స్వాయంభువమనువు కొడుకు ప్రియవ్రతుడు. ప్రియవ్రతునికి 10 మంది కుమారులు, ఇద్దరు కుమార్తెలు. స్వాయంభువ మనువు తన మనుమలలో ఏడుగురిని ఏడు ద్వీపములకు చక్రవర్తులను చేసెను. వారు తమ తమ సంతానానికి ఆయా ద్వీపాలను పంపకం చేయడం వలన అనేక రాజ్యాలు ఏర్పడినాయి. అలా ముందుగా వివిధ ద్వీపాలకు చక్రవర్తులైన మనువు మనుమలు


జంబూద్వీపం - అగ్నీంద్రుడు ప్లక్షద్వీపం - మేధాతిథి శాల్మలీద్వీపం - వపుష్మంతుడు కుశద్వీపం - జ్యోతిష్మంతుడు క్రౌంచద్వీపం - ద్యుతిమంతుడు శాకద్వీపం - హవ్యుడు పుష్కరద్వీపం - సేవనుడు.

జంబూ అనగా నేరేడు పండ్లు, లేదా గిన్నెకాయలు. ఇవి ఎక్కువగా ఉంటాయి కనుక ప్రస్తుతము మనము ఉంటున్న ద్వీపాన్ని జంబూద్వీపము అంటారు. జంబూద్వీపము 9 వర్షాలు లేదా భాగాలుగ విభజించబడినది.


 అవి

ఇలావృత (హిమాలయాలు మరియు టిబెట్ ప్రాంతము) 

భధ్రవర్ష (హిమాలయాల తూర్పు ప్రాంతము) - తూర్పు 

హరి (అరేబియా) - దక్షిణము 

కేతుమాలం (ఇరాన్, టర్కీ ) పశ్చిమం 

రమ్యక (రష్యా, సైబీరియా) ఉత్తరము 

హిరణ్మయ (మంచూరియా) ఉత్తరము 

కురు (మంగోలియా) ఉత్తరము 

కింపురుష / కిన్నర (హిమాలయాల దక్షిణ ప్రాంతాలు) దక్షిణము 

భరత (భారత ఉపఖండము)

Photo










 

భాగస్వాములు కండి

 మీరు భాగస్వాములు కండి 


ఈ బ్లాగును ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలోని తెలుగువారు చూస్తున్నారు. మనలో ఎంతోమంది, కవులు, పండితులు, ఫొటోగ్రాఫరులు ఇంకా ఇతర కళాకారులు ఉండి వుంటారు. వారందరికీ ఇదే మా సాదర ఆహ్వానం. మీరు మీ రచనని లేదా మీరు ఈ బ్లాగులో ప్రచురించదలచిన అంశం ఏదైనా కానీ అందరకు ఉపయోగపడుతుందని తలుస్తే దాని మీద "తెలుగు పండిత కవులలో ప్రచురణార్ధం" అని వ్రాసి మీ పేరు, చిరునామా, ఫోను నెంబరు పేర్కొంటూ 9848647145 కు వాట్సాప్ చేయండి. దానిని మేము మన బ్లాగులో ప్రచురిస్తాము. మీరు పంపిన అంశాలు (content ) ప్రపంచమంతా చూస్తారు. 


ఈ బ్లాగును మరింత సుందరంగా తీర్చి దిద్దే దిశలో మీ వంతు భాగస్వామ్యంగా విరాళాలు 9848647145 ఫోను నెంబరుకు ఇవ్వగలరు   


ఇట్లు 


మీ బ్లాగరు



సంకల్పము

 *శుభోదయం*

*********

సంధ్యా వందన 

మరియు ఇతర 

పూజాకార్యక్రమాల సంకల్పము. 

పూర్వ పద్ధతి పంచాంగం.

తేదీ.24.05.2024

శుక్ర వారం (భృగు వాసరే) 

*********

గమనిక:-ఇక్కడ నేను ఇచ్చే సంకల్పం మా పెద్దలు మరియు గురువుల ద్వారా నేర్చుకున్న నిష్కామ సంకల్పం.  దీనిని మీరు ఉన్న ప్రదేశం మరియు మీరు మీ గురువు ద్వారా నేర్చుకున్న విధంగా మార్చుకో  వచ్చును. 

__________________

శుభాభ్యుదయార్ధంచ, శుభే శోభనే ముహూర్తే శ్రీ  మహావిష్ణోరాజ్నేయా  ప్రవర్తమానస్య అద్యబ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేత వరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రధమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే

మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీ శైలస్య వాయువ్య దిగ్భాగే (హైదరాబాద్ లో వారికి మాత్రమే)గంగా కావేర్యోర్మధ్య ప్రదేశే  శ్రీలక్ష్మీ నివాస గృహే సమస్థ దేవతా హరిహర గురు గో బ్రాహ్మణ చరణ సన్నిధౌ  అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన

శ్రీ  క్రోధి నామ సంవత్సరే ఉత్తరాయణే

వసంత ఋతౌ వైశాఖ మాసే కృష్ణ పక్షే ప్రతి పత్తిథౌ

(సూర్యోదయానికి ఉన్న తిథే  చెప్పుకోవాలి సంధ్యావందనాలకు మాత్రమే) భృగు వాసరే 

శుభ నక్షత్రే

శుభ యోగే,

శుభకరణ,  

ఏవంగుణ విశేషణ విశిష్ఠాయాం శుభ తిధౌ 

శ్రీమాన్_______గోత్రః_____నామధేయః  

శ్రీమతః ______గోత్రస్య_______ నామధేయస్య మమ ఉపాత్త దురిత క్షయ ద్వారా శ్రీ పరమేశ్వర  ముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం ప్రాతః/మాధ్యాహ్నిక/సాయం 

సంధ్యాముపాసిష్యే. 

సంధ్యా వందనం కొరకు మాత్రమే.

ఇతర పూజలకు శ్రీ క్రోధి  నామ సంవత్సరే ఉత్తరాయణే

వసంత ఋతౌ 

వైశాఖ మాసే  కృష్ణ పక్షే  ప్రతి పత్తిథౌ

భృగు వాసరే అని చెప్పుకోవాలి.

ఇతర ఉపయుక్త విషయాలు

సూ.ఉ.5.30

సూ.అ.6.24

శాలివాహనశకం 1946 వ సంవత్సరం.  

విక్రమార్క శతాబ్దం లో 2081 వ సంవత్సరం. 

కల్యబ్దాః 5125 వ సంవత్సరం. 

శ్రీ క్రోధి నామ సంవత్సరం 

ఉత్తరాయణ పుణ్యకాలం

వసంత ఋతువు

వైశాఖ మాసం 

కృష్ణ పక్షం 

పాడ్యమి సా.6.55 వరకు. 

శుక్ర వారం. 

నక్షత్రం అనూరాధ ఉ.9.58 వరకు. 

అమృతం రా.1.34 ల 3.12 వరకు. 

దుర్ముహూర్తం ఉ.8.05 ల 8.56 వరకు.

దుర్ముహూర్తం మ.12.23 ల 1.14 వరకు

వర్జ్యం సా. 3.43 ల 5.21 వరకు. 

యోగం శివం  ప.11.16 వరకు.  

కరణం బాలవ ఉ. 6.11 వరకు. 

కరణం  కౌలవ సా. 6.55 వరకు. 

సూర్యోదయము  ఉ.6.00 గంటలకు అయితే

రాహు కాలం ఉ. 10.30 ల 12.00 వరకు. 

గుళిక కాలం ఉ.7.30ల 9.00 వరకు. 

యమగండ కాలం మ.3.00 ల 4.30 వరకు. 

***********   

పుణ్యతిధి వైశాఖ బహుళ పాడ్యమి. 

****************

Note:-

శ్రీ పద్మావతి శ్రీనివాస వివాహ సమాచార సంస్థ

*(రి.జి.నెం.556/2013) *

వనస్థలిపురం,హైదరాబాద్* - 500070

*వారి* 

బ్రాహ్మణ వధూవరుల పరిచయ వేదిక

*పరిచయం - పరిణయం*

26/05/2024(ఆదివారం) రోజు వనస్థలిపురం లో

ఏర్పాటు చేయటం జరిగినది. రిజిస్ట్రేషన్ లు  జరుగుతున్నాయి ఇతర వివరాలకై సంప్రదించండి.

98487 51577 / 80195 66579.

****************

మాస్క్ ధరిస్తూ సామాజిక దూరం పాటిస్తూ ఆరోగ్యం గాను క్షేమంగాను ఉండాలని ఆకాంక్షిస్తూ మీ శ్రేయోభిలాషి.


ఈ రోజు పుట్టినరోజు  మరియు పెళ్ళి రోజు జరుపు కుంటున్న   అందరికీ గాయిత్రి మాత ఆయురారోగ్యాలు సర్వదా ప్రసాదించాలని  కోరుకుంటూ మీ  శ్రేయోభిలాషి.

🙏🙏🙏

పంచాంగం 24.05.2024 Friday.

 ఈ రోజు పంచాంగం 24.05.2024  Friday.


స్వస్తి  శ్రీ చాన్ద్రమాన క్రోధి నామసంవత్సర: ఉత్తరాయణం వసంత ఋతు వైశాఖ మాస కృష్ణ    పక్ష: ప్రతిపత్తి తిధి భృగు వాసర: అనురాధ  నక్షత్రం శివ యోగ: బాలవ తదుపరి కౌలవ కరణం. ఇది ఈరోజు పంచాంగం.


పాడ్యమి రాత్రి 07:21 వరకు.

అనురాధ పగలు 10:07 వరకు.

సూర్యోదయం : 05:46

సూర్యాస్తమయం : 06:40


వర్జ్యం : మధ్యాహ్నం 03:49 నుండి 05:27 వరకు.


దుర్ముహూర్తం : పగలు 08:21 నుండి 09:12 వరకు తిరిగి మధ్యాహ్నం 12:39 నుండి 01:30 వరకు.


అమృతఘడియలు : రాత్రి 01:35 నుండి 03:13 వరకు.


రాహుకాలం : పగలు 10:30 నుండి 12:00 వరకు.

యమగండం: మధ్యాహ్నం 03:00 నుండి 04:30 వరకు.

 


శుభోదయ:, నమస్కార:

శ్రీ కంచి పరమాచార్య స్వామివారి జయంతి

 జయ జయ శంకర !! హర హర శంకర !!

కాంచి శంకర కామకోటి శంకర !!


వైశాఖ బహుళ పాడ్యమి శ్రీ కంచి పరమాచార్య స్వామివారి జయంతి. ‘ఆదిశంకర భగవత్పాద స్థాపిత మూలామ్నాయ సర్వజ్ఞపీఠమైన కంచి కామకోటి పీఠం 68వ పీఠాధిపతులు జగద్గురువులు “శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి” వారి జయంతి (వర్ధంతి). ఆయనను భక్తులు పరమాచార్య అని, మహాస్వామి అని, పెరియవా, శ్రీ చరణులు, నడిచే దైవం అని పలు నామలతో పిలుచుకునేవారు. ఆయన పరమాత్మస్వరూపం, కాషాయం కట్టిన కామాక్షి స్వరూపం, తలపైన చంద్రుడు లేని పరమశివుడు (పేరులోనే ఉందిగా). జటాజూటం లేని ఈశ్వరుడు. అపర శంకరావతారులు.


ఆది శంకరాచార్య స్వామివారు సనాతన ధర్మాన్ని బ్రతికించడానికి ఈ భూమిపైన 32 సంవత్సరాలు ఉంటే, పరమాచార్య స్వామి వారు సన్యాసాశ్రమ ధర్మాలను నిలబెట్టడానికి శతాయుష్కులై 100 సంవత్సరాలు జీవించారు (20 May 1894 – 8 Jan 1994). ఆయన జీవితం గురించి పరిశీలిస్తే, 13వ ఏటనే సన్యాసం తీసుకున్నారు. ఆనాటి నుండి సనాసాశ్రమ ధర్మం ప్రకారం వాహనం ఎక్కరాదు అని బ్రతికినంతకాలం పాదచారి అయి భారతదేశం 3 సార్లు పర్యటించారు.


ఒక్క మాటలో చెప్పాలంటే ధర్మం ఒక రూపం ధరిస్తే అది సాక్షాత్ పరమాచార్య స్వామివారే. త్రేతాయుగంలో శ్రీరామచంద్ర మూర్తి ఎంతటి ధర్మమూర్తో ఈ కలియుగంలో మహాస్వామి వారు అంతటి ధర్మ స్వరూపులు. ఆయన ఒక పాదం ధర్మం మరొక పాదం సత్యం. ధర్మం సత్యం అనే రెండు పాదాలతో ఆసేతు సీతాచలం కాలినడకన యాత్ర చేసి ధర్మస్థాపన చేసారు.


దలైలామ అంతటి వారే ‘ఈ శతాబ్ధపు నిజమైన సన్యాసి అంటే పరమాచార్య స్వామి వారే’ అని వేనోళ్ల పొగిడారు. కామకోటి పీఠానికి 68వ జగద్గురువుగా అపర శంకరావతారులుగా ఈ దేశానికి వారు చేసిన సేవ అనన్యసామన్యం. పరమ నిరాడంబరత్వం, అపార కరుణా స్వరూపం, జ్ఞాన స్వరూపం. ఆయన చిత్రపటాన్ని తదేకంగా ఒక్క నిముషం చూస్తే చాలు మన మనస్సు ప్రశాంతతను పొందుతుంది. అంతటి మహానుభావులు పరమాచార్య స్వామి వారు.


87 చాతుర్మాస్యాలు చేసిన ఒకేఒక్క సన్యాసి, ఆయన నడిచే విశ్వవిద్యాలయం, వారికి తెలియని విషయం ఈ ప్రపంచంలోనే లేదు. 23 భాషలయందు దిట్ట. గాలిలో విభూతి తీయడం గొలుసులు తీయడం వంటి అనవసరమైన మహిమలు ఆయన ఎన్నడూ ప్రదర్శించలేదు. ఆయన వద్ద ఉంటే మనకు భగవంతుని సన్నిధిలో ఉన్నాము అనే భావన మనకు కలుగచేయడమే పెద్ద మహిమ. అణిమాది అష్టసిధ్ధులు ఆయన వశం. సకల శాస్త్రాల యందు ఆయన దిట్ట. వేదమన్నా శాస్త్రమన్నా ప్రాణం. గోవుల కోసం తన ప్రాణాలను సైతం వదులుకోవడానికి సిధ్ధపడ్ద త్యాగి.


లక్షల కుటుంబాలను సదాచారం వైపు, వైదిక అనుష్టానం వైపు మళ్ళించి సనాతన ధర్మాన్ని ఉధ్ధరించారు. ఆయన అవతారం రాకుండా వుండి ఉంటే ఈవాళ మనం ఈమాత్రం కూడా ధర్మాన్ని ఆచరించేవారం కామేమో. అలాంటి మహాపురుషుడు జన్మించిన ఈ రోజు ఆయాన్ను స్మరించుకోవడం పాప హరణం.


జయ జయ శంకర హర హర శంకర

కంచి శంకర కామకోటి శంకర

కొల్హాపూర్ ... మహలక్ష్మీ అమ్మవారు*

 *కొల్హాపూర్ ... మహలక్ష్మీ అమ్మవారు*


అష్టాదశ శక్తిపీఠాలలో 7వ శక్తి పీఠం.. 

మనం ప్రత్యక్షంగా అక్కడికి వెళ్ళినా ఇలా దర్శనం చేసుకోలేము...

అమ్మవారి అభిషేకం.. హారతి... అర్చన... అలంకారాలు అద్భుతంగా తీసారు.. 

🙏🙏🙏🙏🙏🙏


ప్రళయకాలంలో పరమశివుడు తన త్రిశూలంతో కాశీనగరాన్ని ఎత్తి రక్షించగా,

 నీటిలో మునిగిపోయిన ఈ క్షేత్రాన్ని మహాలక్ష్మి అమ్మవారు తన కరములతో పైకి ఎత్తినందువల్ల ఈ క్షేత్రానికి కరవీర క్షేత్రమనే పేరు వచ్చిందని చెబుతారు. 


ఈ క్షేత్రంలో మహాలక్ష్మి అధిష్టాన దేవత కాగా, శివుడు నీరుగా, విష్ణువు రాయిగా, మహర్షులు ఇసుకగా, దేవతలు చెట్లుగా, మూడున్నర కోట్ల తీర్థాలూ సూర్యగ్రహణం రోజున ఇక్కడ కొలువై ఉంటారని, 


అందుకే సూర్యగ్రహణం రోజున ఈ క్షేత్రంలో స్నానాలు చేస్తే పంచ మహాపాతకాలు సైతం ప్రక్షాళనమవుతాయంటారు.

 

*కొల్హాపూర్ క్షేత్రాన్ని కరవీర నగరమని, ఇక్కడ కొలువై ఉన్న మహాలక్ష్మి అమ్మవారిని కరవీర మహాలక్ష్మి అని స్తుతించారని పద్మ, స్కాంద, దేవీభాగవతాలు ప్రస్తావించాయి.*🙏🙏👌👌🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

వైశాఖ_పురాణం__16_వ_అధ్యాయము

 *వైశాఖ_పురాణం__16_వ_అధ్యాయము*


నారాయణం నమస్కృత్య నరం చైవనరోత్తమం |

దేవీం సరస్వతీం వ్యాసం తతోజయ ముదీరయేత్ ||


*యముని_పరాజయము*


అప్పుడు నారద మహర్షి యమలోకము నకు వెళ్లెను. యమలోక స్థితిని జూచెను.. యమధర్మరాజా..! నీ లోకమున నరకబాధలు పడువారి రోదన, ధ్వనులు వినిపించవేమి? చిత్రగుప్తుడును ప్రాణుల పాపముల లెక్కను వ్రాయుట మాని మునివలె మౌనముగ నున్నాడేమి? సహజముగ బహువిధ పాపములను చేయు మానవులు నీ లోకమునకు రాకుండటకు కారణమేమి? అని ప్రశ్నించెను. యముడును దీనుడై యిట్లనెను.


 నారద మహర్షీ..! భూలోకమున యిక్ష్వాకు వంశము వాడైన కీర్తిమంతుడను రాజు మిక్కిలి విష్ణుభక్తుడు. అతడు ధర్మభేరిని మ్రోగించి తన ప్రజలందరిని వైశాఖ వ్రతము నవలంభించునట్లు చేయుచున్నాడు. చేయని వారిని తీవ్రముగ శిక్షించుచున్నాడు. ఇందువలన ప్రతివారును భక్తి వలననో, దండన భయముననో తప్పక వైశాఖ మాస వ్రతమును, ధర్మములను ఆచరించుచు చేసిన పాపములను పోగొట్టుకొని విష్ణు లోకమును చేరుచున్నారు. ఇందువలన నరకమునకు వచ్చు వారెవరును లేక వైశాఖ స్నానాదుల మహిమ వలన శ్రీహరి లోకమునకే పోవుచున్నారు. ఇందువలన నేను మ్రోడైన మానువలె నుంటిని. నాకు యిట్టి స్థితి పోయి పూర్వపు స్థితి రావలెను. అందులకై ఆ రాజుపై దండెత్తి వానిని చంపదలచితిని. యజమాని చెప్పిన పనిని చేయక అతడిచ్చు ద్రవ్యమును తీసికొని ఊరకుండువాడు తప్పక నరకము నందును.. నేనును బ్రహ్మచే యమలోకమున పాపులను విచారించి శిక్షించుటకై నియమింపబడి ఇట్లు ఊరకుండుటయు నాకు పాపమును కలిగించును. ఆ రాజును నేను చంపలేక పోయినచో బ్రహ్మ వద్దకు పోయి నేను చేయవలసిన దేమియని యడుగుదును. అని యమధర్మరాజు నారదునకు చెప్పెను. నారదుడును బాగున్నదని తన దారిన పోయెను.


యమధర్మరాజు తన వాహనమైన మహిషము నెక్కి భయంకరాకారముతో యమ దండమును ధరించి భీకరులగు యేబది కోట్ల యమభటులతో కీర్తిమంతుడును వచ్చినవాడు యమధర్మరాజని తెలిసికొని యుద్ధ సన్నద్ధుడై యమధర్మరాజు నెదిరించెను. యమునకు కీర్తిమంతునకు మిక్కిలి భయంకరమైన యుద్ధము జరిగెను. యముని సేవకులగు మృత్యువు, రోగము, యమదూతలు కీర్తిమంతుని యెదిరింపలేక పారిపోయిరి. యముడు ప్రయోగించి ఆయుధములన్నియు కీర్తిమంతుని ఆయుధముల ముందు శక్తి హీనములైనవి. తుదకు యముడు బ్రహ్మాస్త్రముతో మంత్రించి దండమును కీర్తిమంతునిపై ప్రయోగించెను. మిక్కిలి భయంకరమైన ఆ యమదండమును జూచి అందరును బెదిరి హాహాకారములను చేసిరి.


అప్పుడు శ్రీహరి తన భక్తుడగు కీర్తిమంతుని రక్షణకై తన సుదర్శన చక్రమును పంపెను. భయంకరమగు సుదర్శన చక్రము యమదండమును, దానిలోని బ్రహ్మాస్త్రమును శక్తిహీనముల గావించి మరలించి యమునిపై మరలెను. విష్ణుభక్తుడను కీర్తిమంతుడును శ్రీహరికి నమస్కరించి ఆ చక్రము నిట్లు స్తుతించెను.


సహస్రార నమస్తేస్తు విష్ణుపాణి విభూషణ

త్వం సర్వలోక రక్షాయై ధృతః పురా

త్వాం యాచేద్యయమంత్రాతుం విష్ణుభక్తం మహాబలం ||

నృణాందేవద్రుహాంకాల స్త్వమేవహినచాపరః

తప్పాదేవం యమం రక్ష కృపాంకురు జగత్పతే ||


అని కీర్తిమంతుడు ప్రార్థింపగా సుదర్శన చక్రము యముని విడిచి దేవతలందరును చూచుచుండగా నా రాజు వద్దకు వచ్చి నిలిచెను. యముడును తన సర్వ ప్రయత్నములను వ్యర్థములగుటను గమనించెను. కీర్తిమంతుడు సుదర్శనమును ప్రార్థించి తనను రక్షించుటను చూచి మిక్కిలి అవమానమును, విషాదమును పొందెను.


అతడు తలవంచుకొని సవిచారముగ బ్రహ్మదేవుని వద్దకు పోయెను. ఆ సమయమున బ్రహ్మ సభదీర్చి యుండెను. మూర్తములు, అమూర్తములు నగు వారిచే బ్రహ్మ సేవితుడై యుండెను. బ్రహ్మ దేవతల కాశ్రయమైనవాడు. జగములు అను వృక్షమునకు, బీజము, విత్తనము అయిన వాడు. అన్ని లోకములకును పితామహుడు. ఇట్టి బ్రహ్మను లోకపాలకులు, దిక్పాలకులు, రూపము కల, ఇతిహాస పురాణాదులు, వేదములు, సముద్రములు, నదీ నదములు, సరోవరములు, అశ్వర్థాది మహా వృక్షములు, వాపీకూప తటాకములు, పర్వతములు, అహోరాత్రములు, పక్షములు, మాసములు, సంవత్సరములు, కళలు, కాష్ఠములు, నిమేషములు, ఋతువులు, ఆయనములు, యుగములు, సంకల్ప వికల్పములు, నిమేషోన్మేషములు, నక్షత్రములు, యోగములు, కరణములు, పూర్ణిమలు, అమావాస్యలు, సుఖ దుఃఖములు, భయాభయములు, లాభాలాభములు, జయాపజయములు, సత్వ రజ స్తమో గుణములు, సాంత, మూఢ, అతిమూఢ, అతి ఘోరావస్థలు, వికారములు సహజములు, వాయువులు, శ్లేష్మవాత పిత్తములు వీనితో కొలువు దీరిన బ్రహ్మను చూచెను.


ఇట్టి దేవతలున్న కొలువు లోనికి యముడు సిగ్గుతో క్రొత్త పెండ్లి కూతురు వలె తలవంచుకొని ప్రవేశించెను. ఇట్లు సిగ్గుతో తన వారందరితో వచ్చిన యముని జూచి సభలోని వారు క్షణమైన తీరిక యుండని యితడిక్కడి కెందులకు వచ్చెను. తల వంచుకొని విషాదముగ నుండుటకు కారణమేమియని సభలోని వారు విస్మయ పడిరి. ఇతడు వచ్చిన కారణమేమి? పాప పుణ్యములను తెలుపు పత్రము కొట్టివేతలతో నుండుటేమి? అని యిట్లు సభలో నున్న భూతములు, దేవతలు ఆశ్చర్య పడుచుండగా యమధర్మరాజు బ్రహ్మ పాదముల పైబడి దుఃఖించుచు రక్షింపుము రక్షింపుము అని యేడ్చెను.. స్వామీ! నన్ను రక్షించు నీవుండగా నేను పరాభవము నందితిని. మానవుల పుణ్యపాపముల దెలుపు పటమున పాపములను నేనే వ్రాయించి నేనే కొట్టి వేయింపవలసి వచ్చినది. నేను నిస్సహాయముగ నిర్వ్యాపారముగ చేతులు ముడుచుకొని యుండవలసి వచ్చినది అని పలికి నిశ్చేష్టుడై యుండెను.


దీనిని జూచి సభలో గగ్గోలు బయలుదేరెను. స్థావరజంగమ ప్రాణులన్నిటిని యేడ్పించు నితడే యేడ్చుచున్నాడేమి? అయినను జనులను సంతాప పరచువాడు శుభమును పొందునా? చెడు చేసినవాడు చెడును పొందక తప్పునా యని సభలోని వారు పలు విధములుగ తమలో తాము అనుకొనిరి.


వాయువు సభలోని వారిని నిశ్శబ్దపరచి బ్రహ్మ పాదములపై వ్రాలిన యమధర్మరాజును దీర్ఘములు, దృఢములునగు తన బాహువులతో పైకి లేవదీసెను. దుఃఖించుచున్న అతనిని ఆసనమున కూర్చుండబెట్టి యూరడించెను. నిన్ను పరాభవించిన వారెవరు? నీ పని నిన్ను చేసికొనకుండ అడ్డగించిన వారెవరు? ఈ పాప పట్టికను యిట్లు తుడిచిన వారెవరు వివరముగ చెప్పుము..? నీవెందులకు వచ్చితివి..? అందరను పరిపాలించు వారే నీకును నాకును ప్రభువు. భయము లేదు చెప్పుమని వాయువు అడుగగా యమధర్మరాజు 'అయ్యో' అని అతి దీనముగ బలికెను.


#వైశాఖ_పురాణం పదహారవ అధ్యాయము సంపూర్ణము...

బుద్ధితో విచారించడం

 💎🌅  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 ॐ卐  *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎


శ్లో𝕝𝕝 *రత్నైఃకల్పితమాసనం హిమజలైః స్నానం చ దివ్యాంబరం*

*నానారత్న విభూషితం మృగమదామోదాంకితం చందనమ్* |

*జాతీచంపక బిల్వపత్రరచితం పుష్పం చ ధూపం తథా*

*దీపం దేవ దయానిధే పశుపతేహృత్కల్పితం గృహ్యతామ్* || ౧ ||


               [ *శివ మానస పూజ* ]


ఓ భగవాన్ పశుపతి, కరుణకు పభ్రువు. అమూల్యమైన రత్నాలతో తయారు చేయబడిన సింహాసనంపై, హిమాలయాల నుండిచల్లటి నీటితో స్నానం చేసి, దివ్య వస్త్రాలు ధరించి, వివిధ విలువైన రత్నాలు

మరియు ఆభరణాలతో అలంకరించబడి, మీ శరీరంపై చందనం

మరియు కస్తూరితో మీరు కూర్చున్నారు. నేను భక్తితో నీకు

సమర్పిస్తున్న మల్లెపూలు, చంపక పుష్పాలు, బిల్వ పత్రాలు, ధూపం, పక్రాశించేదీపం స్వీకరించండి.


   👇 //------ ( *మోహముద్గరం* )-----// 👇


శ్లో𝕝𝕝 

*ప్రాణాయామం ప్రత్యాహారం*

*నిత్యానిత్య వివేకవిచారం* ౹

*జాప్యసమేత సమాధివిధానం*

*కుర్వవధానం మహదవధానం* ॥30॥


భావం: క్రమపద్ధతిలో శ్వాసను నియమించడం, విషయాల నుండి మనసుని వెనక్కి మళ్లించడం, నిత్య వస్తువేదో, అనిత్య వస్తువేదో నిరంతరం బుద్ధితో విచారించడం, జపంతో కూడుకున్న ధ్యాననిష్ఠను సాగించి సర్వ సంకల్పాలను విడిచిపెట్టడం అనే సాధనలను ఎంతో జాగ్రత్తగా అనుష్ఠించుము.

రాశిఫలాలు

 ☘️🙏🕉️శ్రీ గురుభ్యోనమః🕉️🙏☘️


•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━

*24-05-2024 / శుక్రవారం / రాశిఫలాలు*

•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━

మేషం


స్థిరస్తి వివాదాలకు సంబంధించి. ఆత్మీయుల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. సన్నిహితుల సహాయంతో  నూతన కార్యక్రమాలు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. ఇంటాబయట పరిస్థితులు అనుకూలిస్తాయి. వృత్తి వ్యాపారాల్లో పురోగతి సాధిస్తారు. ఉద్యోగాలలో బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు.

---------------------------------------

వృషభం


వృధా  ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఆర్థిక లావాదేవీలు మందకొడిగా సాగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు శ్రమ అనంతరం పూర్తవుతాయి. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. వ్యాపారాలలో సొంత నిర్ణయాలు అంతగా కలిసి రావు. నిరుద్యోగ యత్నాలు మందగిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో  శ్రమ అధికమవుతుంది.

---------------------------------------

మిధునం


దూర ప్రయాణాలు వాయిదా వేయుట మంచిది. వ్యాపార వ్యవహారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. చేపట్టిన వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. మిత్రులతో మాటపట్టింపులు  కలుగుతాయి. ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త వహించాలి. ఉద్యోగమున పని ఒత్తిడి అధికమవుతుంది. 

---------------------------------------

కర్కాటకం


ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. నిరుద్యోగుల కలలు సహకారం అవుతాయి. వ్యాపారాలలో తగినంత లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది.

---------------------------------------

సింహం


ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. స్థిరాస్తి ఒప్పందాలు వాయిదా పడతాయి. నూతన కార్యక్రమాలు ప్రారంభించిన అప్రయత్నంగా పూర్తి చేస్తారు. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. గృహ వాతావరణం చికాకుగా ఉంటుంది. వ్యాపారాలు కొంత మెరుగైన పరిస్థితులు ఉంటాయి. ఉద్యోగాలలో అధికారుల ఆదరణ పెరుగుతుంది.

---------------------------------------

కన్య


మిత్రుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు.  చేపట్టిన పనులు ముందుకు సాగక నిరాశ పెరుగుతుంది. దూరప్రయాణ సూచనలున్నవి. నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు. వ్యాపారపరంగా తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు. ఆర్థికంగా స్వల్ప ఇబ్బందులు ఉంటాయి. 

---------------------------------------

తుల


ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. బంధుమిత్రుల వలన ఊహించని  సమస్యలు కలుగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయుట మంచిది. పాత రుణాలు తీర్చడానికి నూతన రుణాలు చేస్తారు. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపారాలు మందకోడిగా  సాగుతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.

---------------------------------------

వృశ్చికం


కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటారు. వృత్తి వ్యాపారాలు మరింత అనుకూలంగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలలో మీ శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. చేపట్టిన  పనుల్లో విజయం సాధిస్తారు. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగమున బాధ్యతలు సమర్థవంతంగా నిర్వర్తిస్తారు.

---------------------------------------

ధనస్సు


ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగిస్తుంది. ముఖ్యమైన పనులు వాయిదా వెయ్యటం  మంచిది. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది. నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. ఉద్యోగము అధికారులతో  ఓర్పుగా వ్యవహరించడం మంచిది.

---------------------------------------

మకరం


ఇంటాబయట బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. మొండి  బకాయిలు వసూలవుతాయి. దైవ సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపార విస్తరణకు ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. ఆర్థిక అనుకూలత  కలుగుతుంది.

---------------------------------------

కుంభం


కొన్ని పనులు శ్రమతో కానీ పూర్తి కావు. ఇతరులతో మాట పట్టింపులు తప్పవు. చేపట్టిన వ్యవహారాలు ముందుకు సాగక నిరాశ పెరుగుతుంది. ఉదర సంబంధిత అనారోగ్య సమస్యలు ఇబ్బంది కలిగిస్తాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. వ్యాపార ఉద్యోగాలు కొంత సామాన్యంగా సాగుతాయి.

---------------------------------------

మీనం


నూతన వాహనం కొనుగోలు చేస్తారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి.  దైవ కార్యక్రమాలలో  నిర్వహిస్తారు. బంధుమిత్రులతో విందువినోదాలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాలలో అవాంతరాలు తొలగుతాయి. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది.

•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━

🍁 *శుభం భూయాత్* 🍀

శ్రీ కాంచీ పరమాచార్య శ్రీ చన్ద్రశేఖరేన్ద్ర సరస్వతీ

 *𝕝𝕝ॐ𝕝𝕝 24/05/2024 శ్రీ కాంచీ పరమాచార్య శ్రీ చన్ద్రశేఖరేన్ద్ర సరస్వతీ వారి జయన్తీ 𝕝𝕝卐𝕝𝕝*

*≈≈≈❀┉❀ 🕉️ ❀┉❀≈≈≈*


*సదాశివ సమారంభాం*

*శంకరాచార్య మధ్యమాం*

*అస్మదాచార్య పర్యంతాం*

*_వందే గురు పరంపరాం_*


1894 వైశాఖ బహుళ పాడ్యమి నాడు తమిళనాట విల్లిపురంలో జన్మించిన చంద్రశేఖరేంద్రుల అసలు పేరు స్వామినాథన్‌. పదమూడేళ్లకే కంచి పీఠాధిపతి అయిన కారణజన్ములు వారు. జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్యులు స్థాపించిన కంచి పీఠానికి 87 సంవత్సరాల పాటు పీఠాధిపత్య బాధ్యతలు వహించిన మహనీయులు.


ఆయన పరమాత్మ స్వరూపం, కాషాయం కట్టిన కామాక్షి స్వరూపం, తలపైన చంద్రుడు లేని పరమశివుడు (పేరులోనే ఉందిగా). జటాజూటం లేని ఈశ్వరుడు. అపర శంకరావతారులు. ఆయనను భక్తులు పరమాచార్య అని, మహాస్వామి అని, పెరియవా, శ్రీ చరణులు, నడిచే దైవం అని పలు నామలతో పిలుచుకునేవారు. ఇలా నడవటం వల్ల నా ఆరోగ్యం బాగుంటుంది. ప్రజలనూ కలుసుకోగలుగుతున్నాను. ఇంతకంటే కావల్సింది ఏముంది?’ అనేవారు.


ఆది శంకరాచార్య స్వామి వారు సనాతన ధర్మాన్ని బ్రతికించడానికి ఈ భూమిపైన 32 సంవత్సరాలు ఉంటే, పరమాచార్య స్వామి వారు సన్యాసాశ్రమ ధర్మాలను నిలబెట్టడానికి శతాయుష్కులై 100 సంవత్సరాలు జీవించారు (20 May 1894 – 8 Jan 1994). ఆయన జీవితం గురించి పరిశీలిస్తే, 13వ ఏటనే సన్యాసం తీసుకున్నారు. ఆనాటి నుండి సన్యాసాశ్రమ ధర్మం ప్రకారం వాహనం ఎక్కరాదు అని బ్రతికినంతకాలం పాదచారి అయి భారతదేశం 3 సార్లు పర్యటించారు.

ఒక్క మాటలో చెప్పలంటే ధర్మం ఒక రూపం ధరిస్తే అది సాక్షాత్ పరమాచార్య స్వామి వారే. త్రేతాయుగం లో శ్రీరామచంద్ర మూర్తి ఎంతటి ధర్మమూర్తో ఈ కలియుగంలో మహాస్వామి వారు అంతటి ధర్మ స్వరూపులు. ఆయన ఒక పాదం ధర్మం మరొక పాదం సత్యం. ధర్మం సత్యం అనే రెండు పాదాలతో స్వామి ధర్మస్థాపన చేసారు.


దలైలామ అంతటి వారే ‘ఈ శతాబ్ధపు నిజమైన సన్యాసి అంటే పరమాచార్య స్వామి వారే’ అని వేనోళ్ల పొగిడారు. కామకోటి పీఠానికి 68వ జగద్గురువుగా అపర శంకరావతారులుగా ఈ దేశానికి వారు చేసిన సేవ అనన్యసామన్యం. అపర కరుణా స్వరూపం, జ్ఞాన స్వరూపం, పరమ నిరాడంబరత్వం. ఆయన చిత్రపటాన్ని తదేకంగా ఒక్క నిముషం చూస్తే చాలు మన మనస్సు ప్రశాంతతను పొందుతుంది. అంతటి మహానుభావులు పరమాచార్య స్వామి వారు.


87 చాతుర్మాస్యాలు చేసిన ఒకేఒక్క సన్యాసి, ఆయన నడిచే విశ్వవిద్యాలయం, వారికి తెలియని విషయం ఈ ప్రపంచంలోనే లేదు. 23 భాషలయందు దిట్ట. గాలిలో విభూతి తీయడం గొలుసులు తీయడం వంటి అనవసరమైన మహిమలు ఆయన ఎన్నడూ ప్రదర్శించలేదు. ఆయన వద్ద ఉంటే మనకు భగవంతుని సన్నిధిలో ఉన్నాము అనే భావన మనకు కలుగచేయడమే పెద్ద మహిమ. అణిమాది అష్టసిధ్ధులు ఆయన వశం. సకల శాస్త్రాల యందు ఆయన దిట్ట. వేదమన్నా శాస్త్రమన్నా ప్రాణం. గోవుల కోసం తన ప్రాణాలను సైతం వదులుకోవడానికి సిధ్ధపడ్ద త్యాగి.


లక్షల కుటుంబాలను సదాచారం వైపు, వైదిక అనుష్టానం వైపు మళ్ళించి సనాతన ధర్మాన్ని ఉధ్ధరించారు. ఆఅయన అవతారం రాకుండా వుండి ఉంటే ఈవాళ మనం ఈమాత్రం కూడా ధర్మాన్ని ఆచరించేవారం కామేమో. అలాంటి మహాపురుషుడు జన్మించిన ఈ రోజు ఆయాన్ను స్మరించుకోవడం సకల పాప హరణం.


*𝕝𝕝 ॐ 𝕝𝕝 oఓo శ్రీ గురుభ్యో నమః 𝕝𝕝 卐 𝕝𝕝*


*𝕝𝕝 ॐ 𝕝𝕝 శ్రీ జగద్గురు శఙ్కరాచార్య దివ్యాజ్ఞాం వర్ధతాం అభివర్ధతాం 𝕝𝕝 卐 𝕝𝕝*


*𝕝𝕝 ॐ 𝕝𝕝 జయ జయ శఙ్కర హర హర శఙ్కర 𝕝𝕝 卐 𝕝𝕝*


*𝕝𝕝 ॐ 𝕝𝕝 కాంచీ పరమాచార్య శ్రీ చన్ద్రశేఖరేన్ద్ర సరస్వతీ వారి జయన్తీ శుభాకాంక్షలు 𝕝𝕝 卐 𝕝𝕝*

*ఓ తండ్రి ఆవేదన

 *ఓ తండ్రి ఆవేదన...తన మాటల్లోనే*


👉నాకు77 ఏండ్లు. నా భార్య చనిపోయి 10 సంవత్సరాలు అవుతోంది. 


👉నాకు 3గురు కొడుకులు.. ఒక్కొక్క నెల ఒక్కో కొడుకు ఇంట్లో నా జీవనం

👉ఆప్యాయంగా పలకరించే మనిషి కోసం ఆరాటపడే వారిలో నేనూ ఒకడిని...ఇంక 4 రోజుల్లో చిన్న కొడుకు ఇంటికి వెళ్ళాలి..


👉ముడతలుపడ్డ తన వేళ్ళతో రోజులు లెక్కపెట్టుకుంటున్నాడు ఆ పెద్దాయన.


👉చిన్నకోడలి దగ్గరికి పోవడానికి ఇంక కొన్ని గంటలే సమయం ఉంది.


👉పోయిన పండుగకి 2వ కొడుకు పంచలు తీసిచ్చాడు 

అవి బాగా పాతబడిపోయాయి


👉పెద్దకొడుకు కొనిచ్చిన అద్దాలు పగిలిపోయి 3 వారాలు అయింది.కొడుక్కి చెపితే విసుక్కుంటాడని అద్దాలు పెట్టుకోవడం మానేశాను.

కోడలితో చెప్తే గొడవ అవుతుందని చెప్పలేదు.


*ఎవ్వరినీ ఇబ్బంది పెట్టలేని మనస్తత్వం నాది*


👉చిన్నకోడలికి చెప్పి అద్దాలు మార్చుకోవాలి. ఇంకా 4 రోజులుంది.అందరూ ఆఫీస్ కు వెళ్ళాక ఆ పంచలు ఉతుక్కోవాలి

నల్లగా ఉంటే చిన్నకొడలు కొప్పడుతుంది.


👉4 రోజులు గడిచిపోయాయి...హాస్టల్ నుండి ఇంటికి పోయే పిల్లవాడిలా ఆనందం నాకు..కొడుకు బస్ ఎక్కించి వెళ్ళిపోయాడు


👉బస్ దిగగానే నా "చిన్నకొడలు" నాకోసం స్కూటీ తెచ్చింది

నన్ను చూడగానే ' అద్దాలు ఏమయ్యాయి మామయ్యా?' 

అని అడిగింది


👉బ్యాగ్ లో ఉన్నాయి పదమ్మా! అన్నాను.తీసి పెట్టుకోమని ఆర్డర్ వేసింది


👉పగిలిపోయాయని చెప్పాను.కోపంగా నా వంక చూసింది. తలవంచుకున్నాను.


👉సరే!జాగ్రత్తగా నా వెనుక కూర్చోండి' అంటూ స్కూటీ స్టార్ట్ చేసింది...నాకు ఇష్టమైన బాదంపాలు త్రాగించి,అద్దాల షాపు దగ్గరికి వెళ్లి అద్దాలు ఆర్దరు చేసి ఇంటికి బయలుదేరింది కోడలు.


👉దారి మధ్యలో ఇలా అంది.

'అందుకే మామయ్యా!మిమ్మలి ఎక్కడికీ పంపడం నాకు ఇష్టముండదు


👉ఆ అద్దాలు కూడా తీసి ఇవ్వలేనంత బిజినా నీ కొడుకు..ఆ పంచ ఎలా ఉందో చూడరా వాళ్ళు. మిమ్మల్నే అనాలి'


👉పోనిలేమ్మా!ఎవ్వరినీ ఏమి అనకు.'అన్నాను


👉 స్కూటీలో వెళ్తుండగా ' మామయ్యా!జాగ్రత్తగా కూర్చోండి. కావాలంటే నా భుజంపై తల వాల్చుకోండి.' అంది కోడలు.


👉 ఆమె భుజంపై తల వాల్చుకున్నాను.

కుతురిలా చూసుకునే కోడలు భుజంపై తల వాల్చగానే కళ్ళల్లో కన్నీరు....!!


👉ఇంటికి చేరగానే నా బ్యాగ్ తీసి బట్టలన్నీ తీసింది...ఇలా అడిగింది...


👉 నిజం చెప్పండి ! మీ బట్టలు మీరే ఉతుక్కుంటున్నారు కదా!'


👉'లేదమ్మా! వాషింగ్ మెషిన్ లో వేస్తారు..'అన్నాను.

అబద్ధం చెప్పేసి తలవంచుకున్నాను


👉నన్ను ఒక టీచరులా సీరియస్ గా చూసింది..తలవంచుకున్న నన్ను చూసి పక్కున నవ్వేసింది...


👉'నా బాధ మీకు అర్థం అవుతోందా.. మిమ్మల్ని చూసుకోలేనంత బిజీగా ఉన్నవారి ఇంటికి మీరు ఎందుకు వెళ్లడం.


👉ఇక్కడ నేను మీ చిన్నకొడుకు సరిగ్గా చూసుకోవడం లేదా చెప్పండి మామయ్యా!'

 

👉కోడలి రెండు చేతుల్లో నా ముఖాన్ని ఉంచి వెక్కి వెక్కి ఏడ్చాను...

'నన్ను పసిబిడ్డలా చూసుకునే నీ దగ్గరికి ఎప్పుడు వస్తానా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తానమ్మా!


👉మరు జన్మ ఉంటే నీకు బిడ్డనై పుట్టాలని ఉంది తల్లీ!' ప్రేమగా నువ్వు చూసుకునే ఈ నెల రోజుల అనుభూతి మిగితా అన్ని నెలలకు సరిపోతుంది


నీ రుణం ఎలా తీర్చుకోను తల్లీ!

ఇలా అన్న నన్ను ప్రేమతో ఓదార్చింది నా కోడలు... కాదు కాదు నా కూతురు.......!!!


*పెద్దవారు పసిపిల్లలతో సమానం.. వారికి ఆకలి వేసి

అడిగేదాకా చూడకండి*


పిల్లలకు ఆకలివేస్తుందని తెలుసుకుని అన్నం పెడతాం కదా !వీరుకూడా అంతే!


ఈ ప్రపంచంలో.....!!!!

తల్లిదండ్రులు తర్వాతే ఎవరైనా


ఒక సారి టైం చూసుకుని ఈ పోస్టు చదివి కొంతమందైనా అర్థం చేసుకుంటారనీ వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకుంటారని ఆశిస్తూ....🙏

A Collection from 

Admin 

Brahmana samaakhya

శ్రీమన్నారదాష్టక స్తోత్రము*

 దేవర్షి నారదమహర్షులవారి ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా....


*శ్రీమన్నారదాష్టక స్తోత్రము*


१.

శ్రీనారాయణ నామయుగ్మ జప సౌభాగ్యప్రదః శాశ్వతా

నందాకందమరందబంధుర సుహృద్వ్యాజేక్షణాక్షాక్షితః |

ధన్యోపాయన మార్గవర్గ విశదో దేవర్షిభిర్వందితః

శ్రీమన్నారదమౌని జీవనవిధౌ శ్రేయాంసి భూయాంసి నః ||


२.

భక్త్యాబద్ధ విశుద్ధ సిద్ధ కరుణోద్ధారాత్మకశ్శంభుకృ

త్స్వీయోదాత్త వరప్రదాన విషయోపాంత ప్రమాదాచిరమ్ |

దుష్టోన్మత్త కుతంత్రదైత్య మరణాయోపాయ సంధాయకః

శ్రీమన్నారదమౌని జీవనవిధౌ శ్రేయాంసి భూయాంసి నః ||


३.

సత్సంపత్ప్రద మాన్యభాస విభవోద్ధామేశ హృద్రాజితా

శ్రీలక్ష్మీ పతిదర్శనోత్సుకమతీ చింతా విచారాంతకః |

దైత్యేంద్రోబలిబద్ధ రక్షక గదాధారీతి విద్యోతితః

శ్రీమన్నారదమౌని జీవనవిధౌ శ్రేయాంసి భూయాంసి నః ||


४.

ధాతాధాతవిధూతధౌత కలితాధానోన్మనః ప్రాభవః

పారంపర్య విధేర్విచార విధృతోపాంత ప్రధానాదృతః |

జన్మోపాధిక తత్త్వదర్శన విధిజ్ఞః సర్వ విజ్ఞానధీః

శ్రీమన్నారదమౌని జీవనవిధౌ శ్రేయాంసి భూయాంసి నః ||


५.

ఇంద్రోపేంద్ర మహేంద్ర జాల విదితః శోభాకరాగామి కా

లోత్పన్న ప్రణవాభిధా భగవతా లీలావతీ సన్మతీ |

సూక్ష్మజ్ఞేయ విశారద ప్రౘురగః శుద్ధాంతరంగేంగితః

శ్రీమన్నారదమౌని జీవనవిధౌ శ్రేయాంసి భూయాంసి నః ||


ధర్మశ్రీకర సద్విలాస సుకృతీ శ్రీరామచంద్రాకృతీ

లీలాగానవినోద మోదన విధానోద్దీపనాలంకృతీ |

వాల్మీకేర్గురు బోధనైక మహతీ వైణీయ భక్తద్యుతీ

శ్రీమన్నారదమౌని జీవనవిధౌ శ్రేయాంసి భూయాంసి నః ||


७.

శ్రీకృష్ణప్రభు గార్హ్యజీవనకలా శ్రీలాలితానంద బో

ధాభిజ్ఞ ప్రకటీ పటిష్ట భృకుటీ పాటీరఖేటీ తృటీ |

శాటీరార్క సువర్ణభూషిత నిభః సౌహృద్విదః శాంతదః

శ్రీమన్నారదమౌని జీవనవిధౌ శ్రేయాంసి భూయాంసి నః ||


८.

ఆబాలాక్షయ బోధనార్ద్ర సుధృవః ప్రహ్లాద హృత్ప్రేరితః

జ్ఞానాజ్ఞాన వివేకశీల విశదానంద స్వబుద్ధ్యాత్మకః |

శ్రీమద్భాగవతోత్తమేషు కుశలః

క్షేమంకరః శ్రీకరః

శ్రీమన్నారదమౌని జీవనవిధౌ శ్రేయాంసి భూయాంసి నః ||


బాలాకృతి ముకుందాఖ్య

శర్మణా రచితం చ యత్ |

పఠితారో భవేద్ధన్యాః

గురు దైవత శాసనాత్ ||

పదవిని బట్టి విలువ!

 శు భో ద యం🙏


పదవిని బట్టి  విలువ!

              

           ఉ: "స్థాన  విశేష మాత్రమున  'తామఱపాకున  నీటిబొట్ట'! నిన్


                 బూనిక  మౌక్తికంబనుచుఁ బోల్చినమాత్రన  నింత గర్వమా?


                 మానవతీ శిరోమణుల  మాలిక లం దునఁ గూర్ప వత్తువో?


                 కానుక లీయవత్తువొ?  వికాసము నిత్తువొ?  విల్వ నిత్తువో?


                  చాటుపద్యం-- నందితిమ్మన-- రాయల యాస్థాని!


                       

                            విచిత్రమైన పద్యమే ! కానీ  లోకంలో  నకీలీల బారిన పడి బాధపడుతున్నవారెందరో?  అలాంటి కవులెవ్వరో  రాయల పరిసరాలలో చేరి డాబుచేస్తూ, తిమ్మనకు దక్కవలసిన గౌరవాన్ని  దక్కకుండా చేస్తున్నారేమో? వారిని మనస్సులో 

పెట్టుకొని  తిమ్మనగారు యీపద్యం వ్రాశారు.


               "  ఉదయపువేళలో  సరోవరాలలో  కనిపించే  దృశ్యం,తామఱాకుపై పడిన  నీరు ముత్యంలా  తళతళలాడుతూ  కనిపిస్తుంది.సూర్యరస్మి వలన తామరపాకుకుండే  స్నిగ్ధత్వంవలన  ఆవిధంగా కనిపిస్తుంది.చూచేవారికది ముత్యమేమోనని  భ్రమకల్గిస్తుంది.

అది నీరేగానీ  ముత్యంగాదు. అదిగో దాన్ని నిందిస్తున్నట్లుగా  సాకుచేసికొని  తిమ్మనగారు  యీవిధంగా అంటున్నారు.


                            "ఓనీటి చుక్కా! తామఱపాకుపై  నిలచి నేను  ముత్యాన్నని డాబులు కొట్టబోకు. తెలియని వారు నిన్ను ముత్య

మనుకొనినంత మాత్రమున నీకంతగర్వమా? నీవేమైనా  ఆడవారి పూమాలలలో  నలంకరింప దగియున్నావా? కానుకలిచ్చుటకు పనికివత్తువా? నీవల పరిసరములకేదైన వికాసము కలుగునా? అమ్ముకొందమనిన నీకేమైన  విలువయున్నదా? గాలివాటుకు నీటిలోకిజారితివా? ఇకనీపనిశూన్యము. ఇంతదానికంత మిడిసిపడుటయేల? మేలుగాదు సుమా?"-అని హెచ్చరిక!


                   నేడు గూడా  యేమాత్రము విలువలేనికొందరు  మహానాయకుల నాశ్రయంచి  తామేదో మహనాయకులమన్నట్లు

డాబులు చేయువారున్నారు. అట్టి నకిలీల కందరకూ యాపద్యము చెంపపెట్టు.


                      మహా కవుల  నర్మగర్భసందేశము  లిట్లుండు🌷ను!


                                               స్వస్తి!🙏🙏🌷🌷🌷🌷

డొనెషన్లు

 డొనెషన్లు

మిత్రులారా మన బ్లాగు అభివ్రుద్దికి డొనేషనులు 9848647145 మొబేలు నంబరుకు జీ పే, ఫొనె పె, పేటియం లొ దేనితొ నయినా పంప వచ్హు. మీ స్క్రీన్ షాట్ పంపిస్తె మన బ్లాగులొ పబ్లిష్ చేస్తాము. ఇక ఆలశ్యం యెందుకు ఇప్పుడె మీరు డొనెషన్ పంపండి. మన బ్లాగు అభివ్రుద్దికి తొట్పడండి 

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*


*కలియుగాబ్ది 5125*

*శ్రీ శాలివాహన శకం 1946 స్వస్తి శ్రీ    చాంద్రమాన క్రోధి నామ సంవత్సరం ఉత్తరాయణం  - వసంత ఋతువు - వైశాఖ మాసం - కృష్ణ పక్షం  -‌ ప్రతిపత్  -  అనూరాధ -‌‌ భృగు వాసరే* (24.05.2024)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.





.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

-----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*

సంకల్పము

 *శుభోదయం*

*********

సంధ్యా వందన 

మరియు ఇతర 

పూజాకార్యక్రమాల సంకల్పము. 

పూర్వ పద్ధతి పంచాంగం.

తేదీ.24.05.2024

శుక్ర వారం (భృగు వాసరే) 

*********

గమనిక:-ఇక్కడ నేను ఇచ్చే సంకల్పం మా పెద్దలు మరియు గురువుల ద్వారా నేర్చుకున్న నిష్కామ సంకల్పం.  దీనిని మీరు ఉన్న ప్రదేశం మరియు మీరు మీ గురువు ద్వారా నేర్చుకున్న విధంగా మార్చుకో  వచ్చును. 

__________________

శుభాభ్యుదయార్ధంచ, శుభే శోభనే ముహూర్తే శ్రీ  మహావిష్ణోరాజ్నేయా  ప్రవర్తమానస్య అద్యబ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేత వరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రధమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే

మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీ శైలస్య వాయువ్య దిగ్భాగే (హైదరాబాద్ లో వారికి మాత్రమే)గంగా కావేర్యోర్మధ్య ప్రదేశే  శ్రీలక్ష్మీ నివాస గృహే సమస్థ దేవతా హరిహర గురు గో బ్రాహ్మణ చరణ సన్నిధౌ  అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన

శ్రీ  క్రోధి నామ సంవత్సరే ఉత్తరాయణే

వసంత ఋతౌ వైశాఖ మాసే కృష్ణ పక్షే ప్రతి పత్తిథౌ

(సూర్యోదయానికి ఉన్న తిథే  చెప్పుకోవాలి సంధ్యావందనాలకు మాత్రమే) భృగు వాసరే 

శుభ నక్షత్రే

శుభ యోగే,

శుభకరణ,  

ఏవంగుణ విశేషణ విశిష్ఠాయాం శుభ తిధౌ 

శ్రీమాన్_______గోత్రః_____నామధేయః  

శ్రీమతః ______గోత్రస్య_______ నామధేయస్య మమ ఉపాత్త దురిత క్షయ ద్వారా శ్రీ పరమేశ్వర  ముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం ప్రాతః/మాధ్యాహ్నిక/సాయం 

సంధ్యాముపాసిష్యే. 

సంధ్యా వందనం కొరకు మాత్రమే.

ఇతర పూజలకు శ్రీ క్రోధి  నామ సంవత్సరే ఉత్తరాయణే

వసంత ఋతౌ 

వైశాఖ మాసే  కృష్ణ పక్షే  ప్రతి పత్తిథౌ

భృగు వాసరే అని చెప్పుకోవాలి.

ఇతర ఉపయుక్త విషయాలు

సూ.ఉ.5.30

సూ.అ.6.24

శాలివాహనశకం 1946 వ సంవత్సరం.  

విక్రమార్క శతాబ్దం లో 2081 వ సంవత్సరం. 

కల్యబ్దాః 5125 వ సంవత్సరం. 

శ్రీ క్రోధి నామ సంవత్సరం 

ఉత్తరాయణ పుణ్యకాలం

వసంత ఋతువు

వైశాఖ మాసం 

కృష్ణ పక్షం 

పాడ్యమి సా.6.55 వరకు. 

శుక్ర వారం. 

నక్షత్రం అనూరాధ ఉ.9.58 వరకు. 

అమృతం రా.1.34 ల 3.12 వరకు. 

దుర్ముహూర్తం ఉ.8.05 ల 8.56 వరకు.

దుర్ముహూర్తం మ.12.23 ల 1.14 వరకు

వర్జ్యం సా. 3.43 ల 5.21 వరకు. 

యోగం శివం  ప.11.16 వరకు.  

కరణం బాలవ ఉ. 6.11 వరకు. 

కరణం  కౌలవ సా. 6.55 వరకు. 

సూర్యోదయము  ఉ.6.00 గంటలకు అయితే

రాహు కాలం ఉ. 10.30 ల 12.00 వరకు. 

గుళిక కాలం ఉ.7.30ల 9.00 వరకు. 

యమగండ కాలం మ.3.00 ల 4.30 వరకు. 

***********   

పుణ్యతిధి వైశాఖ బహుళ పాడ్యమి. 

****************

Note:-

శ్రీ పద్మావతి శ్రీనివాస వివాహ సమాచార సంస్థ

*(రి.జి.నెం.556/2013) *

వనస్థలిపురం,హైదరాబాద్* - 500070

*వారి* 

బ్రాహ్మణ వధూవరుల పరిచయ వేదిక

*పరిచయం - పరిణయం*

26/05/2024(ఆదివారం) రోజు వనస్థలిపురం లో

ఏర్పాటు చేయటం జరిగినది. రిజిస్ట్రేషన్ లు  జరుగుతున్నాయి ఇతర వివరాలకై సంప్రదించండి.

98487 51577 / 80195 66579.

****************

మాస్క్ ధరిస్తూ సామాజిక దూరం పాటిస్తూ ఆరోగ్యం గాను క్షేమంగాను ఉండాలని ఆకాంక్షిస్తూ మీ శ్రేయోభిలాషి.


ఈ రోజు పుట్టినరోజు  మరియు పెళ్ళి రోజు జరుపు కుంటున్న   అందరికీ గాయిత్రి మాత ఆయురారోగ్యాలు సర్వదా ప్రసాదించాలని  కోరుకుంటూ మీ  శ్రేయోభిలాషి.

🙏🙏🙏

శుక్రవారం,మే24,2024

 *శ్రీమ‌తే రామానుజాయ‌ న‌మ:*


*శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయరు స్వామివారి మంగళాశాసనాలతో*


*ఆప‌దామ‌ప‌హ‌ర్తారం దాతారం స‌ర్వ‌ సంపదాం*

*లోకాభిరామం శ్రీరామం భూయో భూయో* *న‌మామ్య‍హo*


శుక్రవారం,మే24,2024

శ్రీ క్రోధి నామ సంవత్సరం

ఉత్తరాయణం - వసంత ఋతువు

వైశాఖ మాసం - బహుళ పక్షం

తిథి:పాడ్యమి సా6.52 వరకు

వారం:శుక్రవారం(భృగువాసరే )

నక్షత్రం:అనూరాధ ఉ9.58 వరకు

యోగం:శివం ఉ11.27 వరకు

కరణం:బాలువ ఉ6.45 వరకు

తదుపరి కౌలువ సా6.52 వరకు

వర్జ్యం:మ3.43 - 5.21

దుర్ముహూర్తము:ఉ8.04 - 8.56

మరల మ12.22 - 1.13

అమృతకాలం:రా1.34 - 3.13

రాహుకాలం:ఉ10.30 - 12.00

యమగండ/కేతుకాలం:మ3.00 - 4.30

సూర్యరాశి : వృషభం

చంద్రరాశి' వృశ్చికం 

సూర్యోదయం:5.30

సూర్యాస్తమయం:6.23


*శ్రీమ‌తే రామానుజాయ‌ న‌మ:*

*పద్య కవితా శిల్పకళానిధి*

*మఱ్ఱిపల్లి శ్రీధరాచార్యులు*

*మిట్టాపల్లి*