5, నవంబర్ 2023, ఆదివారం

కార్తీక మాస విశేష కార్యక్రమాలు

 అక్షరకోటి గాయత్రీ పీఠం లో కార్తీక మాస విశేష కార్యక్రమాలు. రాజమహేంద్రవరం, గౌతమఘాట్ లో వేంచేసి యున్న అక్షరకోటి గాయత్రీ శ్రీచక్ర పీఠంలో కార్తీక మాసమును పురస్కరించుకొని  సుందరేశ్వరస్వామికి  నలభైరోజులు మండలదీక్షతో నిత్యాభిషేకం నిర్వహించ తలపెట్టినాము.   గాయత్రీ అమ్మవారికి నిత్య సహస్ర గాయత్రీ మంత్ర హవనము కూడ సంకల్పించడం జరిగింది. నవంబర్ 14వ తేదీనుండి డిసెంబర్ 23 వతేదీ వరకు జరుగు  ఈ విశేష కార్యక్రమములలో  పాల్గొన దలచిన భక్తులు ఈ  సెల్ నెంబర్లకు ఫోన్ చేసి వివరములు తెలుసుకోవలసిందిగా తెలియజేయుచున్నాము.  సంప్రదించవలసిన నెంబర్లు --9949739799,, 9849461871

Panchaag


 

⚜ శ్రీ దామోదర్ ఆలయం

 🕉 మన గుడి : నెం 229




⚜ గోవా  : జాంబౌలిమ్


⚜ శ్రీ దామోదర్ ఆలయం 



💠 దామోదరుడు అనగా.. దామము అంటే త్రాడు, ఉదరము అంటే కడుపు.

నడుము భాగంలో త్రాడుతో కట్టబడినవాడు అని అర్థం.

అనగా యశోదా మాత చేత కట్టబడిన శ్రీకృష్ణుడు అని అర్థం...

ఈ నామమును సాధారణంగా శ్రీకృష్ణునికె 

అన్వయిస్తారు...

కానీ ఆ నామముతో పరమశివుని కొలిచే ఒక ప్రత్యేక ఆలయం గోవా రాష్ట్రంలో కలదు...

అదే దామోదర్ మందిర్ ,జాంబౌలిమ్, గోవా..


💠 పోర్చుగీస్ ఆక్రమణ సమయంలో మార్గోవ్ అభివృద్ధి చెందుతున్న స్థితిలో ఉంది మరియు చాలా బాగా నిర్మించిన భవనాలను కలిగి ఉంది, వాటిలో అత్యంత విశేషమైనది దామోదర్ ఆలయం. 


💠 శ్రీ దామోదర్ ఆలయం గోవాలోని అత్యంత అందమైన మరియు ప్రసిద్ధ నిర్మాణాలలో ఒకటి.  

ఇది గోవాకు దక్షిణాన ఉన్న క్యూపెం ప్రాంతం సరిహద్దులో మార్గోవో నగరానికి కేవలం 22 కిలోమీటర్ల దూరంలో జాంబౌలిమ్ గ్రామ సమీపంలో కుశావతి నది ఒడ్డున ఉంది.  హిందువులు కుశావతి నది ఒక పవిత్రమైన నదిగా మరియు దానికి వివిధ శరీర వ్యాధుల నుండి రక్షించే గుణం ఉందని నమ్ముతారు. 


💠 ఈ ప్రసిద్ధ ఆలయంలో దామోదర పేరుతో   శివుని రూపం ఉంది.  

1565లో పోర్చుగీస్ నుండి తప్పించుకోవడానికి మార్గోవోలోని హోలీ స్పిరిట్ చర్చి ఉన్న ఆలయంలో ఈ దేవత మొదటగా ఉంది మరియు ఆలయం ధ్వంసం చేయబడింది మరియు చర్చి దాని స్థలంలో నిర్మించబడింది.  హిందువులు, అలాగే కాథలిక్కులు ఇద్దరూ దీనిని గౌరవిస్తారు. మరియు ఇది మొదట మఠగ్రామ్‌లో స్థాపించబడింది, తరువాత దీనినే మడ్గావ్ అని పిలుస్తారు.


💠 1567వ సంవత్సరంలో సషష్టి తాలూకాలో పోర్చుగీసు పాలకులు ప్రారంభించిన ఆలయ విధ్వంసం ప్రచారం కారణంగా, మడ్గావ్ నుండి వచ్చిన మహాజనులు స్థానిక దేవతలను (శ్రీ రామ్‌నాథ్, దామోదర్, లక్ష్మీ-నారాయణ్, చాముండేశ్వరి, మహాకాళి, మహేశ్, మొదలైనవి) జాంబౌలిమ్‌కు మార్చారు.  


💠 ఈ ఆలయం గోకర్ణ పర్తగాలి జీవోత్తం మఠం నిర్దేశించిన నియమాలను అనుసరిస్తుంది.

ఈ ఆలయాన్ని ప్రభుదేశాయిలు స్థాపించారు, వీరు క్రీ.శ. 1500లో లోలియం కుగ్రామానికి చేరుకున్నారు, ప్రభుదేశాయిలు ఒకప్పుడు ప్రస్తుత మహారాష్ట్రలో ఉన్న కుడాల్ అనే గ్రామాన్ని పాలించారని చరిత్ర చెబుతోంది. 


💠 జాంబౌలిమ్‌లోని అసలు దామోదర్ ఆలయ నిర్మాణ తేదీ మరియు 1885 వరకు ఆలయాల పృష్ఠ పొడిగింపులు లేదా పునర్నిర్మాణ తేదీల గురించిన రికార్డులు ఇప్పటివరకు అందుబాటులో లేవు.

1910 సంవత్సరంలో, చిన్న దేవాలయం స్థానంలో భారీ ఆలయాన్ని నిర్మించారు, ఇది ప్రస్తుతం ఉన్న ప్రదేశంలో శివుని మంత్రముగ్ధమైన విగ్రహం ప్రతిష్ఠించబడింది.


💠 ఆలయ ప్రాంగణంలో తులసి బృందావనం ఉంది. ఆలయ ప్రాంగణంలో వేంకటేశ్వరుని మందిరం కూడా ఉంది. 

ఇది 1910 సంవత్సరంలో స్థాపించబడింది. వేంకటేశ్వరుని ముందు ఒక సాలిగ్రామం ఉంచబడింది. 

ఆలయ గోడలు మరియు స్తంభాలు అందమైన శిల్పాలతో పాటు భగవద్గీత శ్లోకాలు ఉన్నాయి. కొన్ని స్తంభాలు మహాభారతంలోని దృశ్యాలను అలాగే ఇతర హిందూ దేవుళ్ల చిత్రాలను వర్ణిస్తాయి. 


💠 హిందువులు మరియు క్యాథలిక్‌లు గౌరవించే దామోదర్ మూర్తితో పాటు, చాముండేశ్వరి (శక్తి యొక్క ఉగ్ర రూపం), మహాకాళి కూడా ఈ ప్రదేశంలో గౌరవించబడ్డారు.


💠 గర్భగుడి లోపల లక్ష్మీనారాయణ విగ్రహం కూడా ఉంది. ప్రధాన ఆలయానికి ఇరువైపులా చాముండేశ్వరి మరియు శివుని ఆలయాలు ఉన్నాయి.


💠 దామోదర్ ఆలయం రూపురేఖల్లో కొంతవరకు ఉత్తర భారతీయమైనది.

ఈ ఆలయం 1892 మరియు 1908 మధ్య సాధారణ గోపురం స్థానంలో రాగి శిఖరం (హిందూ దేవాలయాల పైన ఎత్తైన గోపురం)తో పునరుద్ధరించబడింది.

 1951 మరియు 1972 మధ్యకాలంలో మరోసారి పునర్నిర్మించబడిన ఆలయంలోని దాదాపు ప్రతి భాగం కొత్తది. 

1915లో ఆలయంలోని 'పిండిక' స్థానంలోకి వచ్చింది మరియు ఈ కార్యక్రమం చైత్ర శుద్ధ షష్ఠి నాడు ప్రతి సంవత్సరం పిండిక జీవోద్ధర్ దినంగా జరుపుకుంటారు


💠 శ్రీ దామోదర్ ఆలయంలో జరుపుకునే ప్రధాన పండుగను షిగ్మో అంటారు.

ఇది గోవా హిందూ వసంత రంగుల పండుగ, ఇది ఒక వారం మాత్రమే ఉంటుంది. 

పండుగ సమయంలో జాతర జరుగుతుంది మరియు జానపద ప్రదర్శనలో పాల్గొనే వారందరూ ఒకరికొకరు గులాలను  (వివిధ రంగుల పొడులు) మార్పిడి చేసుకుంటారు మరియు వివిధ విందులను నిర్వహిస్తారు.

ఈ ఆలయంలో కార్తీక పూర్ణిమ, ఆశ్వయుజ పూర్ణిమ మరియు మహాశివరాత్రి కూడా జరుపుకుంటారు.


💠 సమయాలు: 5:30 AM - 9:45 PM.


💠 పంజిం కదంబ బస్ స్టాండ్ నుండి 54 కి.మీ దూరంలో, వాస్కోడగామా రైల్వే స్టేషన్ నుండి 49 కి.మీ మరియు మార్గోవ్ రైల్వే స్టేషన్ నుండి 19 కి.మీ దూరం.

ఉద్ధవగీత

 ఉద్ధవగీత

శ్లో)మామేవ నై రపేక్ష్యేణ భక్తి యోగేన విందతి | 

భక్తి యోగం స లభతే ఏవం యః పూజయేతమామ్


అ)నిష్కామ భక్తి యోగముచే న న్నర్చించువాడు నిన్నే పొందును. వెనుక చెప్పిన విధితో నన్ను పూజించువాడు భక్తియోగమును బొందును.

విదుర నీతిః

 విదుర నీతిః

ప్రహ్లాద ఉవాచ = ప్రహ్లాదుడిట్లు పలికెను.


శ్లో)ఇమౌ తౌసంప్రదృశ్యతే యాభ్యాంగచరితం సహ

 ఆశీ విషా వివ క్రుద్ధావేక మార్గా విహాగతౌ॥


అ)వీరుభయులు ఇంతకు ముందెప్పుడూ కలిసి తిరుగలేదు. ఇప్పుడు కలిసి కనిపిస్తున్నారు. కోపంతో ఉన్నత్రాచు పాముల వలె ఒక్కదారిలో వచ్చినారేమి కారణము? అని ప్రహ్లాదుడు తలచెను

Sangeet


 

*తన కోపమే తన శత్రువు*

 *తన కోపమే తన శత్రువు*


పూర్వం విశ్వామిత్రుడు 1000 సంవత్సరాలు తపస్సు పూర్తయ్యాక లేచాడు. అక్కడికి ఇంద్రుడు వచ్చాడు. మాటామాటా వచ్చింది. ఇంద్రుడి స్వర్గాన్ని తలదన్నే స్వర్గం సృష్టించాడు విశ్వామిత్రుడు. అదే త్రిశంఖు స్వర్గం!


అయితే పుణ్యాత్ములంతా ఇంద్రుడు ఉన్న స్వర్గానికే వెళతారు తప్ప విశ్వామిత్రుడు తన తపోశక్తిని ధారబోసి సృష్టించిన స్వర్గంలోకి వెళ్ళరు.


కొన్నాళ్ళకి ఆవేశం నుండి తేరుకున్న విశ్వామిత్రుడు ‘అయ్యయ్యో తపశ్శక్తిని అంతా కోపం, ఆవేశం వల్ల పోగొట్టుకున్నానే!’ అని మళ్ళి తపస్సు చేశాడు.


మళ్ళి 1000 సం.లు పూర్తయ్యాయి. ఈసారి ఇంద్రుడు తాను వెళితే సామరస్యంగా ఉంటుందని, పెద్దగా స్పందించడని భావించి ఊర్వశిని పంపాడు. 


తప్పస్సు నుండి లేచేసరికి ఊర్వశి ఎదురుగా వయ్యారాలు పోతూ నిలబడి ఉంది. ఊర్వశిని చూసిన విశ్వామిత్రుడు మోహితుడై 1000 సంవత్సరాల పాటు ఊర్వశితో ఉన్నాడు.


 అనంతరం మోహం, పరవశం నుండి తేరుకున్న విశ్వామిత్రుడు తన తపశ్శక్తి వృథా అయినందుకు బాధపడి అక్కడి నుండి వెళ్ళిపోయి మళ్ళి తపస్సు చేశాడు.


ఈసారి కూడా వేయి సంవత్సరాలు తపస్సు పూర్తయ్యే సమయానికి ఇంద్రుడు బాగా ఆలోచించాడు. నేను వెళ్ళినా, ఊర్వశిని పంపినా ఉపయోగం ఉండదు. 


అందుకని వశిష్టుడిని ఎదురుపడేలా చేద్దాం అనుకుని తపస్సు పూర్తయ్యేసరికి వశిష్ఠుడు ఎదురుపడేలా చేశాడు. విశ్వామిత్రుడు వశిష్టుడిని చూసేసరికి అగ్గిమీద గుగ్గిలం అయిపోయాడు. 


తీవ్రమైన కోపంతో విపరీతంగా తిట్టేశాడు. అంతే వెయ్యేళ్ళ తపశ్శక్తి అంతా క్షణకాలంలో పోయింది.


తపోశక్తి పోవడంతోనే తేరుకున్న విశ్వామిత్రుడు ‘అయ్యయ్యో ఎంత పొరబాటు చేశాను. తపశ్శక్తిని క్షణకాలంలో వృథా చేసేశాను,’ అని బాధపడ్డాడు.


ఇంద్రుడు ఎదురుపడినప్పుడు ఆవేశాపడినా తపశ్శక్తి పోవడానికి చాలాకాలం పట్టింది. ఊర్వశి ఎదురుపడినప్పుడు మోహించినా కూడా తపశ్శక్తి పోవడానికి చాలాకాలం పట్టింది. కాని కోపం రావడం వల్ల తపశ్శక్తి పోవడానికి కేవలం క్షణకాలంలో హరించుకు పోయింది. కోపం అంత బలమైనది.


ఒకరిని తిట్టి తెగ సంబరపడిపోతూ ఉంటారు చాలామంది. కాని అలా తిట్టడం వల్ల వారి దోషాలు తొలగిపోతాయి. మీరు ఎంతోకాలం కష్టపడి సంపాదించుకున్న పుణ్యం క్షణకాలంలో హరించుకొని పోతుంది.


 వేయి సంవత్సరాలు ఇంద్రియ నిగ్రహంతో చేసిన తపస్సే క్షణకాలంలో పోయినప్పుడు, యే సాధనలు లేని సామాన్య జీవితం గడిపే సామాన్యుడికి కోపం మహాపెద్ద శత్రువు.   


మంచి హరించుకుపోతే మిగిలేది చెడే. చెడు సంస్కారాలు ప్రబలమైతే మిగిలేది బాధలు, దుఃఖం, అనారోగ్యం! మీరు ఎందులో వీక్ గా ఉంటే దాన్ని దెబ్బతీస్తుంది. 


కోపమే మహా శత్రువు. దీనిని దృష్టిలో  పెట్టుకొని కోపం తగ్గించుకోండి!అందున సాధనలో వున్న వారు మరింత జాగ్రత్తగా వుండాలి సుమీ!

Wheel bicycle


 

Hundilo dabbulu


 

Independent house


 

Anubhavam


 

Nirasaaniki


 

Manchivallu


 

Mokalla noppulaku


 

Mudra vesaaru


 

AavApettina kura

 


Dosakaaya pachadi


 

ఆదివారము, నవంబర్, 5, 2023

 ఆదివారము, నవంబర్, 5, 2023

-----------------------------------------

మాసం: ఆశ్వీయుజ మాసం

ఆయనం: దక్షిణాయణం

పక్షము: కృష్ణ పక్షము

ఋతువు: శరత్ ఋతువు

అమృతకాలము: ఏమిలేదు

సూర్యోదయము: 06:16

సూర్యాస్తమయము: 17:43

రాహు కాలం: 16:17 నుండి 17:43 వరకు

యమగండము: 12:00 నుండి 13:26 వరకు

దుర్ముహుర్తములు: 16:12 నుండి 16:57 వరకు

అభిజిత్: 11:37 నుండి 12:23 వరకు

కరణం: బాలవ 14:06 వరకు, కౌలవ 03:18, నవంబర్ 06 వరకు

చంద్రోదయం: 00:18, నవంబర్ 06

చంద్రాస్తమయం: 12:52

చంద్ర రాశి: కర్కాటకం

తిథులు: అష్టమి 03:18, నవంబర్ 06 వరకు

నక్షత్రము: పుష్యమి 10:29 వరకు

గుళిక కాలం: 14:51 నుండి 16:17 వరకు

శక: 1945 శోభకృత్

వర్జ్యం: 00:50, నవంబర్ 06 నుండి 02:37, నవంబర్ 06 వరకు

యోగా: శుభ 13:37 వరకు


 

Checkout Telugu Calendar Panchangam App: 

 IOS :  https://itunes.apple.com/app/telugu-calendar/id1448360812

Budda kaalara


 

Anvesh


 

Pichikusuma


 

6 thousands laptops


 

Atibala


 

Mokku


 

Uthareni podi


 

Ficou guarden


 

Shaakaahaaram


 

సౌందర్యలహరి🌹* *శ్లోకం - 63*

 🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹

.          *🌹సౌందర్యలహరి🌹*


*శ్లోకం - 63*

🌷🪷🌷🪷🌷🪷🌷🪷🌷🪷


*స్మిత జ్యోత్స్నాజాలం తవ వదన చంద్రస్య పిబతాం*

*చకోరాణామాసీద్ అతిరసతయా చంచుజడిమా |*

*అత స్తే శీతాంశో రమృతలహరీ మామ్లరుచయః*

*పిబంతి స్వచ్ఛందం నిశి నిశి భృశం కాంజి కధియా ‖*


ఈ శ్లోకంలో అమ్మవారి  చిరునవ్వును వర్ణిస్తున్నారు. 


స్మిత జ్యోత్స్నాజాలం తవ వదన చంద్రస్య = అమ్మా, చందమామ వంటి నీ ముఖము నుండి వెలువడే చిరునవ్వు అనే వెన్నెల కాంతులను,


పిబతాం చకోరాణాం = తాగిన చకోరములు (చకోర పక్షులు వెన్నెలను తాగి జీవిస్తాయట) 


అతిరసతయా చంచుజడిమా అతస్తే శీతాంశోరమృతలహరీ = అతి మధురమైన ఆ శీతాంశువుల అమృతమును సేవించిన చకోరముల ముక్కు మొద్దుబారిపోయాయట.


అమ్మవారు కురిపించేది చైతన్యామృత మందస్మితం. అది జ్ఞానానందామృతం కూడా. క్షీరసాగర మధనంలో వెలువడ్డ అమృతం కాదు. ఆ అమృతాన్ని త్రాగే దేవతలు కూడా మహాప్రళయంలో నశించవలసిందే. అయితే, అమ్మవారి చిరునవ్వు యొక్క మాధుర్యామృతము వినాశము లేనిది. మహాప్రళయములో కూడా అంబ, సదాశివుడు ప్రళయ నృత్యం చేస్తుంటే చిరునవ్వుతో చూస్తూ ఉంటుందని ఇంతకు ముందు చెప్పుకున్నాము. 


ఆమ్లరుచయః పిబంతి స్వచ్ఛందం నిశి నిశి భృశం కాంజి కధియా = ఇప్పుడు ఆ చకోరములు, ఆ జ్ఞానానందము వలన కలిగిన జ్ఞానముతో,తెలివితో కొద్దిగా పుల్లని పదార్ధం ఏదైనా సేవిస్తే బాగుంటుందని, మళ్ళీ భూమిపై దొరికే మామూలు వెన్నెల కాంతులను త్రాగాయట, అన్నపు గంజి వలె.


లలితా సహస్రనామాల్లో పదకొండవ శ్లోకం *నిజసల్లాప మాధుర్య వినిభర్త్సిత కచ్ఛపీ*  *మందస్మిత ప్రభాపూర మజ్జత్కామేశ మానసా* తో అన్వయం చేసుకోవచ్చు. ఈ శ్లోకార్ధం కచ్ఛపి అనగా సరస్వతీ దేవి వీణ. ఈ కచ్ఛపీ నాదాన్ని మించిన మాధుర్యం అమ్మవారి పలుకుల్లో ఉందట. కామేశ్వరుడు ఆ పలుకులు వింటూ, అమ్మవారి చిరునవ్వు ప్రవాహంలో మునిగిపోయాడట. అమ్మ చిరునవ్వు జ్ఞానానందమయము.


           🙏🏻 *శ్రీమాత్రే నమః*🙏🏻


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

Turnel


 

Kaala pramaanam

 


ఇంతకీ ఎవరీ దక్షిణామూర్తి?*

 *ఇంతకీ ఎవరీ దక్షిణామూర్తి?*


మొదటగా ఆయన వయసు ఎంత అని చూద్దాం. 'వృద్ధాఃశిష్యా గురుర్యువా' అని ఉంది. అంటే శిష్యులు వృద్దులు, గురువు యువకుడు. ఎవరీ గురువు? దక్షిణా మూర్తి.  'యువానమ్‌' అని అయన గురించి చెప్పబడి ఉంది. అంటే ఆయన యువకుడు. అయన నిత్య యవ్వనుడు. అంటే ఎప్పటికీ యువకుడే. 


అయన ఎలా ఉంటాడు? ఆయన రూపమెట్టిది? 'కరకలిత చిన్ముద్ర మానందమూర్తిం' - చిన్ముద్ర లో ఉన్న ఆనంద మూర్తి. స్వాత్మారాముడు – తనలో తాను ఆనందించేవాడు, 'ముదిత వదనం' – ముఖంలో చిరునవ్వులు చిందించే వాడు(విషణ్ణ వదనంతోనో గంభీర వదనం తోనో ఉన్నవాడు కాదు). 'నిర్మలాయ' – కల్మషం లేని వాడు, 'ప్రశాంతాయ' – పరమ శాంతితో కూడిన వాడు. 


అయన ఎవరు? గురువా దైవమా? 'ఆచార్యేంద్ర' - ఉపాధ్యాయులకు రాజు, గొప్ప గురువు. త్రిభువనగురుమీశం - మూడు లోకాలకు గురువైన ఈశ్వరుడు, 'ఈశ్వరో గురు రాత్మేతి' - గురు స్వరూపుడైన ఆత్మ, ఈశ్వరుడు. అంటే అయన గురువు, దైవమూనూ.


అయన ఎక్కడుంటాడు?   'వట విట సమీపే భూమిభాగేనిషణ్ణం' - మఱ్ఱి చెట్టు సమీపంలో నేలపై కూర్చొని ఉంటాడు. సమీపం అంటే ఎంత సమీపంలో? 'వట తరోర్మూలే' - చెట్టు మూలంలో, అంటే దాని వేర్ల దగ్గర. 


ఎటు తిరిగి కూర్చొని ఉంటాడు? ఇది ఆయన పేరులోనే ఉంది. దక్షిణ దిక్కు చూస్తూ కూర్చొని ఉంటాడు. శిష్యులు ఉత్తర దిక్కు లోని గురువును చూస్తూ కూర్చొని వుంటారు. ఉత్తర దిక్కు మోక్షానికి ప్రతీక. దక్షిణ దిక్కు సంసారానికి. 


అయన ఏ భాషలో బోధిస్తాడు? సంస్కృతమా లేక ఏ ఇతర భాషైనానా? 'గురోస్తు మౌన వ్యాఖ్యానం' - ఈ గురువు మౌనంగా బోధిస్తాడు. 'మౌనవ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మ తత్వం' - ఎందుకంటే పరబ్రహ్మ తత్వం మౌనంగానే ప్రకటించబడింది. సంస్కృతమైనా మరే ఇతర భాషైనా మనసుకు బుద్ధికి సంబంధించింది. పరబ్రహ్మ తత్వం మనసుకు, బుద్ధికి అతీతమైనది. అందుకే మౌనంగా ప్రకటితమయ్యే పరబ్రహ్మ తత్వాన్ని మౌన భాషలోనే వివరిస్తాడు దక్షిణామూర్తి. భాషంటే క్రమబద్దీకరించబడిన పాదాల సమూహం. భావాలను పదాలలో వ్యక్తీకరిస్తే దానిని వినేవాడు భావంలోకి మార్చుకొని అర్థం చేసుకుంటాడు. ఇదంతా మనసులో జరుగుతుంది. ఆ భావాలను తార్కికంగా  విశ్లేషించేది బుద్ధి. ఆత్మ జ్ఞానము మనసుకు బుద్ధికి అతీతమైనది కనుక అది ఏ భాషలో చెప్పలేము. 


మరైతే ఆయన ఏమీ చెప్పడా? సూన్యంలో ఏమి అర్థమవుతుంది? చెపుతాడు. అందుకే 'మౌనవ్యాఖ్యా ప్రకటితం' అన్నది. వ్యాఖ్య ఉన్నది అంటే బోధ వున్నది. అట్లని చెప్పడమూ లేదు. కేవలం ప్రకటితం అవుతుంది. దానిని అపరోక్షంగా అనుభూతి చెందాలి. 


ఆయన ఎలాంటివాడు? 'బ్రహ్మ నిష్టైహి' - బ్రహ్మ నిష్ఠ కలవాడు, 'నిధయే సర్వ విద్యానాం' - సమస్త విద్యలకు నిధి, 'శుద్ధజ్ఞానైక మూర్తయే' - శుద్ధజ్ఞానైక మూర్తి, 'ప్రణవార్ధాయా' - ప్రణవానికి అర్థం  లాంటివాడు.   


ఏమి బోధిస్తాడు? ఆయనను ఆశ్రయిస్తే మనకు ఒనగూరేదేమీ? 'జ్ఞానదాతారమారాత్' - జ్ఞానాన్ని ఇస్తాడు. 'జనన మరణ దుఃఖచ్చేద దక్షం' - జనన మరణ దుఃఖము నుండీ విముక్తి కలిగించే నైపుణ్యం కలిగిస్తాడు. 'శిష్యోస్తు చ్ఛిన్న సంశయాః' - శిష్యుల సంశయాలను విచ్చిన్నం చేస్తాడు. 'భిషజే భవ రోగిణామ్‌' - భవరోగ నివారణకోసం ఆయన ఔషధం లాంటి వాడు. 


ఇంతవరకూ వాక్యార్ధం తెలుసుకున్నాము. ఇప్పుడు నిగూడార్థం తెలుసుకుందాం. దక్షిణామూర్తి మనలాగా శరీరధారి కాదు. అట్లయితే దేశకాలాలకు పరిమితమౌతాడు. జనన మరణాలుంటాయి. కౌమారం, యవ్వనం, వృద్యాప్యం ఉంటాయి. ఆయన నిత్య యవ్వనుడు. దక్షిణామూర్తి (దక్షిణ + అమూర్తి) అంటే దక్షిణ దిక్కుకు చూస్తున్న 'ఆమూర్తి'. అంటే ఆయన శరీరి కాదు. 'వ్యోమవత్‌ వ్యాప్త దేహాయ' - ఆకాశంలా సర్వ వ్యాపితమైనవాడు. ఆద్యంత రహితుడు, కాలాతీతుడు. ఆయన ఓంకారానికి రూపం. ఆయనే శివుడు. 'ఈశ్వరో గురురాత్మేతి' - గురు స్వరూపుడైన ఆత్మ. అంటే ఆత్మే గురువు రూపంలో ఉంది. 


అంటే ఆయన దేవుడా? ఆయన శివుడా? శివుడే గురువై మనకు బోధచేసే అవతారమే దక్షిణామూర్తి అవతారమా ? అవును - కాదు. అవునెందుకంటే దక్షిణామూర్తి శివ స్వరూపం కాబట్టి. కాదెందుకంటే శివుడంటే మేడలో పామును పెట్టుకొని శరీరానికి బూడిద రాసుకున్న శివుడి గురించి కాదు ఇక్కడ చెప్పింది. శివుడంటే ఆత్మ స్వరూపం. 


'నేను'లు రెండు - నేను శరీరము, మనసు, బుద్ది అనుకొనే 'నేను' ఒకటైతే నిజమైన 'నేను' వేరొకటి. నేను శరీరం అనుకొనే 'నేను' శిష్యుడికి ప్రతీక. నిజమైన 'నేను' గురువుకు ప్రతీక. అంటే నిజమైన 'నేను' దక్షిణామూర్తి. అంటే దక్షిణామూర్తి ఎక్కడో హిమాలయాలలో మఱ్ఱిచెట్టు కింద లేడు. నీలోనే ఉన్నాడు. నువ్వే దక్షిణామూర్తి. 


'బీజస్యాంతరి వాంకురో..' అన్న శ్లోకంలో విత్తనం నుంచీ మహా వృక్షం బహిర్గతమైనట్లు, ఈ జగతిని ఇంద్రజాలికునిలా గా తననుంచీ బహిర్గతము చేసి తన మాయా శక్తితో స్వేచ్ఛగా జగన్నాటకం నడిపే మహా గురువు దక్షిణా మూర్తి అని వుంది. ఇలా జగత్తును సృష్టించేది ఆత్మ అని వివేకచూడామణిలో ఉంది. ఇలా సృష్టించబడ్డ జగత్తు తిరిగి ఆత్మలో లయం కావడం తో జనన మరణ చట్రం నుంచీ బయటపడతాం. అప్పుడు ఏ సంసార బంధాలూ ఉండవు. అంటే దక్షిణా మూర్తి అంటే మనలోనే ఉండే సచ్చిదానంద స్వరూపమే. అందుకే ఆయన చిద్విలాసంగా ఉంటాడు అని చెప్పింది. ఆత్మ అంటే ఒక జ్యోతి కాదు. అది ఒక సత్ చిత్ ఆనంద స్వరూపం. దుఃఖ రహితమైన ఆ స్థితిలో కేవలం ఆనందమే ఉంటుంది. 


వివేకానంద స్వామికి రామకృష్ణ పరమ హంస గురువు. రామకృష్ణ కు తోతాపురి. మరి తోతాపురికి ఎవరు గురువు? రమణ మహర్షి ఎందరికో గురువు. మరి రమణ మహర్షికి ఎవరు గురువు? అని బీసెంట్ జేకే ప్రపంచానికి గురువు అంటే, నేనెవరికీ గురువు కాదు. మీ గురువు మీలోపలే ఉన్నాడు అన్నాడు జేకే. 


మనం గురువు కోసం ఎక్కడా ఇక వెతకాల్సిన పని లేదు. దక్షిణామూర్తి యే అందరికీ గురువు. ఆయన ప్రతి ఒక్కరిలో కొలువై వున్నాడు. ఆయనను శరణు వేడు. తానే ప్రకటితమౌతాడు . అప్పుడు నీవంటూ వేరే ఎవరూ ఉండవు. అప్పుడు జీవుడు, దేవుడు, జగత్తు అంతా ఒకటైపోతుంది. అంతా బ్రహ్మమే.

Jobs


 

Ram mandir


 

Vaikunta Dwara Darshanam

 



👆 Vaikunta Dwara Darshanam SSD Tokens Issue Places Tirupati Along With G Maps:-


1)👉 Bhudevi Complex - Near Alipiri:- https://bit.ly/3WJP5Lz


2)👉Vishnu Nivasam - opp to Railway Station:- https://bit.ly/3FSyNJH


3)👉 Srinivasam Complex - Opp yo Bus Stand:- https://bit.ly/3C2tJBc


4)👉 Govinda Raja Choultry - Backside of Railway Station:- https://bit.ly/3YIAe5U


5)👉 Indira Maidanam (municipal office):- https://bit.ly/3vgshHG


6)👉 Jeevakona Zilla Parishad High school: - https://bit.ly/3vkd746


7)👉 Ramanaidu high School, Bhairagipatteda: - https://bit.ly/3PTMo7Y


8)👉 MR palli ZP high School:- https://bit.ly/3hTzjPz


9)👉 Near Ramachandra Pushkarini:- https://bit.ly/3Gl3SXW


-------------------------

👆గత 2సంవస్తరాలు నుంచి వైకుంఠ ఏకాదశి SSDటోకెన్లు  👆పైన ఉన్న 9కౌంటర్లలోనే ఇస్తున్నారు.

 ఈ సంవస్తరం కూడా ఈ కౌంటర్లలోనే ఇచ్చే అవకాశం ఉంది.

 కౌంటర్ల లో ఏదైనా మార్పులు చేర్పులు జరిగితే, అప్డేట్ సమాచారం పోస్ట్ చేయడం జరుగుతుంది.


ధన్యవాదములు 

----

తిరుమల తాజా సమాచారం కోసం మన వాట్సప్,  తెలిగ్రామ్ & యూట్యూబ్ ఛానెల్స్ లో జాయిన్ కాగలరు🙏:-

https://www.youtube.com/@TtdLatestUpdates


https://t.me/LaxmiTeluguTech


https://whatsapp.com/channel/0029Va9i1SHId7nLkglmaW0g


🙏 ఓం నమో వేంకటేశాయ 🙏

Saatvika aahaaram


 

Prapanchaanni control


 

Australia


 

Vundavu


 

10వ తరగతికి పబ్లిక్ పరీక్షలు

 *10వ తరగతికి పబ్లిక్ పరీక్షలు ఉండవు*


ఇకపై కొత్త విద్యా విధానానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 36 ఏళ్ల తర్వాత కొత్త విద్యా విధానం అమల్లోకి వస్తోంది.


కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన కొత్త విధానం ప్రకారం కొత్త విద్యా విధానం 2023కి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కొత్త విద్యా విధానంలోని అతి ముఖ్యమైన ప్రతిపాదనలు ఈ విధంగా ఉన్నాయి:


5 సంవత్సరాల ప్రాథమిక విద్య


1. నర్సరీ @ 4 సంవత్సరాలు


2. Jr KG @ 5 సంవత్సరాలు


3. Sr KG @ 6 సంవత్సరాలు


4. 1వ స్టడీ @ 7 సంవత్సరాలు


5. 2వ స్టడీ @ 8 సంవత్సరాలు


మూడు సంవత్సరాల ప్రిపరేటరీ


6. 3వ తరగతి @ 9 సంవత్సరాలు


7. 4వ తరగతి @10 సంవత్సరాలు


8. 5వ తరగతి @11 సంవత్సరాలు


మూడు సంవత్సరాలు మిడిల్


9. 6వ తరగతి @ 12 సంవత్సరాలు


10. 7వ తరగతి @ 13 సంవత్సరాలు


11. 8వ తరగతి @ 14 సంవత్సరాలు


నాలుగేళ్ల సెకండరీ


12. 9వ తరగతి @ 15 సంవత్సరాలు


13. స్టడీ SSC @ 16 సంవత్సరాలు


14. స్టడీ FYJC @17ఇయర్స్


15. స్టడీ SYJC @18ఇయర్స్


10వ తరగతికి బోర్డు పరీక్షలు లేవు. 5వ తరగతి వరకు విద్యార్థులకు మాతృభాష, స్థానిక భాష, జాతీయ భాషలలో మాత్రమే బోధన ఉంటుంది. మిగిలిన సబ్జెక్టులు, ఇంగ్లీష్ అయినా సబ్జెక్టుగా బోధిస్తారు. ఇంతకుముందు 10వ బోర్డ్ పరీక్షకు హాజరు కావడం తప్పనిసరి, అది ఇప్పుడు రద్దు అయ్యింది.


9వ తరగతి నుండి 12వ తరగతి వరకు సెమిస్టర్ వారీగా పరీక్ష జరుగుతుంది. పాఠశాల విద్యను 5+3+3+4 ఫార్ములా కింద బోధిస్తారు. కళాశాల డిగ్రీ 3, 4 సంవత్సరాలు ఉంటుంది. అంటే గ్రాడ్యుయేషన్ మొదటి సంవత్సరంలో సర్టిఫికేట్, రెండవ సంవత్సరంలో డిప్లొమా, మూడవ సంవత్సరంలో డిగ్రీ ఉంటుంది.


ఉన్నత విద్యను అభ్యసించకూడదనుకునే విద్యార్థులకు 3 సంవత్సరాల డిగ్రీ ఉంటుంది. ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులు 4 సంవత్సరాల డిగ్రీ కోర్సును అభ్యసించవలసి ఉంటుంది. 4 సంవత్సరాల డిగ్రీ చదివిన విద్యార్థులు ఒక సంవత్సరంలో MA చేయగలుగుతారు. MA విద్యార్థులు ఇప్పుడు నేరుగా PhD చేయగలుగుతారు.


విద్యార్థులు మధ్యలో ఇతర కోర్సులు చేయగలుగుతారు. ఉన్నత విద్యలో స్థూల నమోదు నిష్పత్తి 2035 నాటికి 50 శాతం ఉంటుంది. మరోవైపు, కొత్త విద్యా విధానం ప్రకారం, ఒక విద్యార్థి ఒక కోర్సు మధ్యలో మరో కోర్సు చేయాలనుకుంటే, అతను/ఆమె ఒక కోర్సు తీసుకున్న తర్వాత రెండో కోర్సు చేయవచ్చు. పరిమిత సమయం వరకు మొదటి కోర్సు నుంచి విరామం పొందవచ్చు.


ఉన్నత విద్యలో అనేక ఇతర సంస్కరణలు కూడా ప్రతిపాదించారు. సంస్కరణల్లో గ్రేడెడ్ అకడమిక్, అడ్మినిస్ట్రేటివ్, ఫైనాన్షియల్ అటానమీ మొదలైనవి ఉన్నాయి. ఇది కాకుండా, ప్రాంతీయ భాషలలో ఇ-కోర్సులు ప్రారంభిస్తారు. వర్చువల్ ల్యాబ్‌లను అభివృద్ధి చేస్తారు.


నేషనల్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ ఫోరమ్ (NETF)ని ప్రారంభిస్తారు. దేశంలో ఇప్పటి వరకు 45 వేల కాలేజీలు ఉన్నాయి. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, డీమ్డ్ సంస్థలకు ఏకరూప నియమాలు ఉంటాయి..

     ఇది ప్రభుత్వ నిర్ణయం

    ....ఉచిత విద్య వైద్య సాధన సమితి

కావలెను

 *కావలెను*

 *తెలుగు బ్రాహ్మణ లేదా ఆర్యవైశ్య* (శాఖాహారులు) *రామ్ రామ్ గురూజీ నిత్య అన్నదాన సత్రంలో సేవ చేయుటకు  మహిళ సేవకురాలు కావలెను* (దంపతులు కూడా రావచ్చు)


 *గౌరవ వేతనం* తో పాటు భోజన, వసతి సౌకర్యములు కల్పించ బడును.

మరిన్ని వివరములకు సంప్రదించండి👇

రామ్ రామ్ గురూజీ,

శ్రీరామ పంచవటి క్షేత్రం,

పాతపట్నం

శ్రీకాకుళం జిల్లా

మొబైల్ నెంబర్ *9533713055*


🙏 *దయచేసి మీకు తెలిసిన అన్ని బ్రాహ్మణ, ఆర్యవైశ్య గ్రూపులకు ఫార్వర్డ్ చేయండి. ఎవరికైనా ఉపయోగపడవచ్చు*

 


🙏🏻😌Pranams😌🙏🏻  Pl see the above card issued to a Purohitar in Coimbatore. Request to inform all Temple Gurukals,  their Assistants, Vadhyars and Purohits whom you know to get registered and obtain a similar card to avail the benefits from Government of India. This is a new welfare scheme lodged by the Modi Govt, to offer Welfare benefits which are announced by the central Govt. Pl make everybody aware of this new scheme and help our fellow brothers to get Benefits.  🙏🏻😌🙏🏻😌🙏🏻😌🙏🏻

మోక్షాన్ని ప్రసాదించే వాడు

 🕉️  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🕉️

 ॐ卐  *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 


*శ్లోకం*


*_భుక్తిముక్తిదాయకం ప్రశస్తచారువిగ్రహం_*

*_భక్తవత్సలం స్థితం సమస్తలోకవిగ్రహమ్_*

*_వినిక్వణన్మనోజ్ఞహేమకింకిణీలసత్కటిం_*

*_కాశికాపురాధినాథకాలభైరవం భజే....._*


_ *_శ్రీ కాలభైరవాష్టకమ్ - 04_* _


 *భా*:  

కోరికలు తీర్చి, మోక్షాన్ని ప్రసాదించే వాడు,  పేరుగాంచిన సౌందర్యమున్న దేహము కలవాడు, శివుని రూపమైన వాడు , భక్త ప్రియుడు, లోకేశ్వరుడు, వేరు వేరు రూపములలో విలసించే వాడు, చిరు గజ్జెలు కలిగిన బంగారు మొలత్రాడు ధరించిన  *కాశీ పురానికి పాలకుడు అయిన కాలభైరవుని నేను భజిస్తున్నాను*

మహిళలకు బస్సు ఉచితం


 కాంగ్రెస్ పెబుత్వం నిర్వాకం మహిళలకు బస్సు సౌకర్యం ఉచితం అని చెప్పి ప్రతి బస్సు మీద పురుషులకు మాత్రమే అని రాశారు. కాంగ్రెస్ ను నమ్మి బకరాలు అవ్వొద్దు వెర్రి వెన్కళప్పలు అవ్వొద్దు, ధేడ్ దిమాక్ మొహాలతో కాంగ్రెస్ కు ఓటేసి దేబిరిమొహాలతో బస్సులకోసం ఎదురు చూసే పరిస్థితి తెచ్చుకోకూడదు.



శివాయవిష్ణురూపాయ

 శ్రీరస్తు  శుభమస్తు అవిఘ్నమస్తు 


 శివాయవిష్ణురూపాయ శివరూపాయవిష్ణవే! శివస్యహృదయం విష్ణుర్విష్ణోశ్చహృదయగ్ంశివః!


*సమస్త ఆస్తికజనులారా*  ! 

శివకేశవులకు ప్రీతికరమైన ఈ కార్తికమాసమున కార్తికదామోదర ప్రీతిగా సకల దేవతా స్వరూపముగా 365  మృణ్మయ లింగములను ఈశ్వర స్వరూపముగా అమర్చి అభిషేక. అర్చనాదులు జరుపుటకు కార్తిక దామోదరుని అనుగ్రహముతో  బ్రహ్మశ్రీ తంగిరాల సుబ్రహ్మణ్య సోమయాజిగారి పర్యవేక్షణలో మాసదీక్షా పూర్వక మహాలింగార్చ చేయుటకు పరమేశ్వరుని యొక్క ప్రేరణ జరిగినది 


           కార్యక్రమ వివరాలు

తేదీ : 14.11.2023 మంగళవారం నుండి  12:12:2023 మంగళవారం వరకు

ప్రతీరోజూ ప్రదోష (సాయం) సమయమున గణపతి పూజ మహాలింగార్చన ఆవరణ పూజ పంచామృతసహిత సుగంధద్రవ్య పాశుపత ఏకాదశ రుద్రాభిషేకము జరుగును 

   *విశేష కార్యక్రమ వివరాలు*

*సోమవారములు* 4

*ఏకాదశిలు* 2

*కార్తిక పౌర్ణమి*

*ఆరుద్రా నక్షత్రము*

*మాసశివత్రి*

*ఈ యొక్క పర్వదినములలో సహస్ర లింగార్చన జరుగును*

పై జరుగు కార్యక్రములలో

 ఆసక్తి గల భక్తులు అందరూ ప్రత్యక్షముగా కానీ పరోక్షముగా కానీ పాల్గొనవచ్చును


ఈ మహత్కార్యములో పాల్గోదలచిన‌‌ భక్తులు రూ 5556/ రుసుమును చెల్లించవలెను 

వివరముల‌ కొరకు మీరు తంగిరాల భార్గవ శర్మ గారిని సంప్రదించగలరు 9502925449


         *కార్యస్థలము*

*రాజమహేంద్రవరం. కొంతమూరు బ్రాహ్మణ అగ్రహారం అభీషగణపతి ఆలయమ్*

5-11-2023* *భాను వాసరః ఆది వారం* *రాశి ఫలితాలు

 *05-11-2023*

*భాను వాసరః ఆది వారం*

*రాశి ఫలితాలు*

*మేషం*

ఆరోగ్య విషయంలో  అశ్రద్ధ చెయ్యడం మంచిది కాదు. మాతృ వర్గ బంధువులనుండి వివాదాలు కలుగుతాయి. చేపట్టిన పనులులో జాప్యం  కలుగుతుంది. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు వాయిదా పడతాయి. నిరుద్యోగులకు రావలసి అవకాశములు అందక నిరాశ పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలు మందగిస్తాయి.

*వృషభం*

ఇంట బయట సంతోషకర వాతావరణం ఉంటుంది. నూతన వస్తు వస్త్ర లాభలు పొందుతారు. సంతాన విద్యా ఉద్యోగ విషయాలలో ఆశించిన ఫలితాలు పొందుతారు. అన్నివైపుల నుండి ఆదాయం అందుతుంది. వృత్తి ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగుతాయి. నూతన వాహన యోగం ఉన్నది.

*మిధునం*

మానసిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. కుటుంబ విషయంలో తొందరపాటు ఆలోచనలు ఇబ్బందికి గురిచేస్తాయి. వృత్తి వ్యాపారాలు నిదానంగా సాగుతాయి.  ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. వృధా ఖర్చులు పెరుగుతాయి. చిన్ననాటి మిత్రులతో ఆధ్యాత్మిక, సేవ కార్యక్రమాలలో   పాల్గొంటారు.

*కర్కాటకం*

ముఖ్యమైన పనులు ప్రారంభించి విజయం సాధిస్తారు. కుటుంబ విషయంలో నూతన ఆలోచనలు అమలు చేస్తారు. ఆర్ధిక పరిస్థితి ఆశించిన రీతిలో ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో  దైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు. నిరుద్యోగులకు నూతన అవకాశములు అందుతాయి. ఉద్యోగుల కష్టం ఫలిస్తుంది. 

*సింహం*

చేపట్టిన పనులలో అవాంతరాలు చికాకు పరుస్తాయి. వృత్తి ఉద్యోగాలలో మీ శ్రమకు తగిన గుర్తింపు లభించదు. ఆర్థిక వ్యవహారాలలో స్వంత  ఆలోచనలు కలసిరావు. భాగస్వామ్య వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. గృహమున  కొందరి ప్రవర్తన ఆశ్చర్యం కలిగిస్తుంది.

*కన్య*

ఋణ పరమైన సమస్యలు నుండి బయటపడతారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో కొన్ని పనులను పూర్తిచేస్తారు. వృత్తి, ఉద్యోగాలలో ఉన్నత పదవులు పొందుతారు. వ్యాపారాలలొ అంచనాలను దాటి లాభాలు  అందుతాయి.

*తుల*

బంధు మిత్రులతో గృహమున ఆనందంగా గడుపుతారు.   చేపట్టిన పనులలో అవరోధాలు ఉన్నప్పటికీ సకాలంలో పూర్తిచేస్తారు. ఆర్థిక ఇబ్బందులు  అధిగమించి దీర్ఘాకాలిక ఋణాలు  సైతం తీర్చగలుగుతారు. ఉద్యోగాలలో అధికారుల ఆదరణ పెరుగుతుంది. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి.

*వృశ్చికం*

ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. భవిష్యత్తుకు సంబంధించిన కీలక  నిర్ణయాలు తీసుకుంటారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలొ కుటుంబ సభ్యులతో విశేషంగా పాల్గొంటారు. వృత్తి ఉద్యోగాలలో అరుదైన అవకాశములు అందుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.

*ధనస్సు*

శారీరక మానసిక ఆరోగ్య సమస్యలు చికాకు పరుస్తాయి. ఇతరులపై మీ ఆలోచనా విధానం మార్చుకోవడం మంచిది. అనుకున్న సమయానికి అనుకున్న విధంగా పనులు పూర్తికావు. బంధు మిత్రులతో చిన్న చిన్న విభేదాలు తప్పవు. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. 

*మకరం*

 నూతన వస్తు వాహన సౌకర్యాలు పొందుతారు. ధనపరంగా  చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. బంధు మిత్రుల సమాగమం ఆనందం కలిగిస్తుంది. ఉద్యోగాలలో  బాధ్యతలను  సమర్థవంతంగా  నిర్వహిస్తారు. దూర ప్రయాణ సూచనలున్నవి. చేపట్టిన పనులు సజావుగా సాగుతాయి. నిరుద్యోగ సమస్యలు పయిష్కారామౌతాయి.

*కుంభం*

ఇంట బయట  మీ  మాటకు విలువ  పెరుగుతుంది.  చేపట్టిన పనులలో జాప్యం కలిగిన నిదానంగా పూర్తిచేస్తారు. కీలక వ్యవహారాలలో సోదరుల సలహాలను తీసుకుని ముందుకు సాగడం మంచిది. సంతాన ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది.

*మీనం*

దీర్ఘ కాలిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ధన విషయాలలో ఇతరులకు తొందరపడి మాట ఇవ్వడం మంచిది కాదు. వృత్తి వ్యాపారాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది. ప్రారంభించిన పనులు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగ వాతావరణం సమస్యాత్మకంగా ఉండి శిరో బాధలు పెరుగుతాయి.

🕉️

ఆదివారం, నవంబరు 5,2023

 *శ్రీమ‌తే రామానుజాయ‌ న‌మ:*


*శ్రీశ్రీశ్రీ త్రిదండి  శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయరు స్వామివారి మంగళాశాసనాలతో*


*ఆప‌దామ‌ప‌హ‌ర్తారం దాతారం స‌ర్వ‌ సంపదాం*

*లోకాభిరామం శ్రీరామం భూయో భూయో* *న‌మామ్య‍హం*


ఆదివారం, నవంబరు 5,2023

శ్రీ శోభకృత్ నామ సంవత్సరం

దక్షిణాయనం - శరదృతువు

ఆశ్వయుజ మాసం - బహుళ పక్షం

తిథి:అష్టమి తె3.18 వరకు  

వారం:ఆదివారం (భానువాసరే)

నక్షత్రం:పుష్యమి ఉ11.46 వరకు

యోగం:శుభం మ3.40 వరకు

కరణం:బాలువ మ2.25 వరకు

తదుపరి కౌలువ తె3.18 వరకు

వర్జ్యం:రా1.50 - 3.30

దుర్ముహూర్తము:మ3.54 - 4.39

అమృతకాలం:ఉ6.32వరకు

రాహుకాలం:సా4.30 - 6.00

యమగండ/కేతుకాలం:మ12.00 - 1.30

సూర్యరాశి: తుల

చంద్రరాశి:  కర్కాటకం 

సూర్యోదయం:6.04

సూర్యాస్తమయం: 5.25


*శ్రీమ‌తే రామానుజాయ‌ న‌మ:*

*మఱ్ఱిపల్లి శ్రీధరాచార్యులు*

*మిట్టాపల్లి*

ప్రోత్సాహకాలు

 👆

🌹🌹🌹🌹🌷🌷🌷🌷🌹🌹🌹🌹

మొన్న ఓరోజు మా మేనల్లుడు మా ఇంటికి వచ్చాడు , అతను ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో చాలా ఉన్నతస్థిలో వున్నాడు. ఎదో మాటల సందర్భంగా ఇప్పటికి మనదేశం చాలా వెనుకబడి ఉంది , నెహ్రు 1956 లో  ఐఐటీ లు ప్రారంభించినా మనవాళ్ళు ప్రపంచస్థాయి కంప్యూటర్లు కాదుకాని నాణ్యత గల సూదులు కూడా కనుక్కోలేకపోయారు అంటే మా ఇద్దరి మధ్య ఆసక్తికరమైన సంభాషణ చోటుచేసుకుంది.


నేనన్నాను " నువ్వు కంప్యూటర్ రంగంలో పనిచేస్తున్నావు కదా, నువ్వేపుడైనా సమరేంద్ర కుమార్ మిత్ర పేరు విన్నవా అని అడిగాను". లేదు ఎప్పుడు వినలేదు ఎవరాయన అని అడిగాడు.


 మావాడు చాలా దేశాలు తిరిగాడు, నా రెండో ప్రశ్న :


నీకు చేతి గడియారాల గురించి బాగా తెలుసు కదా , ప్రపంచంలో అతి పల్చటి చేతి గడియారం ఏ దేశం తయారు చేసిందో తెలుసా ? అని అడిగితే నేననుకున్న సమాధానమే చెప్పాడు మావాడు స్విట్జర్లాండ్ దేశమే అయ్యుంటుంది , చేతి గడియారాలకి వాళ్లే కదా ప్రసిద్ధి అన్నాడు. 


ఎవరీ సమరేంద్ర కుమార్ మిత్ర? కంప్యూటర్ రంగంలో ఆయనకున్న పేరు ప్రఖ్యాతులు ఏమిటి? ఎక్కడో అమెరికా దేశంలో కాలిఫోర్నియాలో ఉన్న కంప్యూటర్ చరిత్రకు సంబంధించిన మ్యూజియంలో ఆయన ఫోటో , ఆయన తయారు చేసిన కంప్యూటర్ ఎందుకున్నాయి? 


సమరేంద్ర కుమార్ మిత్ర గారు 1916 మార్చ్14న బెంగాల్ రాష్ట్రంలో పుట్టారు. 1998 , సెప్టెంబర్ 26న స్వర్గస్తులైనారు. వీరు గణితశాస్త్రజ్ఞులు, శాస్త్రవేత్త.


ఇంకా దేశంలో ఐఐటీలు ప్రారంభం కాక మూడేళ్లముందు ఈయన నేతృత్వంలో మొట్టమొదటి కంప్యూటర్ తయారైంది. ఈయన కలకత్తాలోని భారతీయ గణాంక సంస్థలో రూపకల్పన, (ISI) అభివృద్ధి , తయారుచేసిన ఎలెక్ట్రానిక్ అనలాగ్ కంప్యూటర్ దేశం మొత్తాన్ని నివ్వెరపరిచింది. నాటి దేశ ప్రధాని స్వయంగా చూసి మెచ్చుకున్న ఫోటో చూడండి. (అప్పటి నాయకులెవ్వరికి కంప్యూటర్ అంటే అర్థం అయ్యుండదు)

ఈ సంఘటన దేశంలో ఇంకా ఐఐటీలు ప్రారంభం కాక ముందు జరిగింది అంటే మనల్ని విస్మయానికి గురి చేస్తుంది. 


అప్పటికింకా అమెరికా శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం కంప్యూటర్లు పెద్ద సంస్థలకు, ప్రభుత్వలకు మాత్రమే ఉపయోగపడతాయి అన్న నిశ్చితాభిప్రాయంతో ఉన్న రోజులవి. వాళ్ళు తయారు చేసిన కంప్యూటర్లు పెద్దపెద్ద హాలంత ఉండేవి . అలాంటి తరుణంలో మన శాస్త్రజ్ఞులు అతిచిన్న కంప్యూటర్ను తయారుచేయడమే కాకుండా , చిన్న సంస్థలు, పాఠశాలలు, కాలేజీలు, కొనే ధరలో తయారు చేశారు. ఈ ఆవిష్కరణ ప్రపంచ కంప్యూటర్ శాస్త్రవేత్తలను ఆలోచింపచేసింది. 


సమరేంద్ర కుమార్ మిత్రా గారు వారితో కలిసి పనిచేసినవారు ప్రాచుర్యంలోకి ఎందుకు రాలేదు అన్నదానికి సమాధానం మన వ్యవస్థ అన్నది చరిత్రలో నిలిచిపోయిన సాక్ష్యం. నేటి తరం కంప్యూటర్ రంగంలో పనిచేసే వారికి ఆయన పేరు తెలియకుండా చేసిన మన పాలకులు ఎంత చిన్నచూపు చుసారో అర్ధమౌతుంది. 


సమరేంద్ర కుమార్ మిత్రా గారు దేశ కంప్యూటర్ రంగానికి జాతిపిత. అందుకే వారి సాధించిన విజయానికి ప్రతీకగా వారిగురించి ప్రపంచ కంప్యూటర్ మ్యూజియంలో ఒక ప్రత్యేక స్టాల్ ఏర్పరిచారు

అమెరికాలో. 


నేటి యువతరం ఆరాధించి , వారిని స్ఫూర్తిగా తీసుకునే అవకాశాలు మన ప్రభుత్వాలు కల్పించలేదు. ఇలాంటి అవిష్కర్తలు ఎందరో దేశంలో . వారిగురించి ఒక్క పాఠ్య పుస్తకంలో లేదు అంటే ఎంత శోచనీయం, ఆలోచించండి.

మనకు తరతరాలుగా అమెరికా, రష్యా ,యూకే , జపాన్ దేశ శాస్త్రజ్ఞుల గురించి బోధించారు.  ఒకటో తరగతి కూడా చదవని వారు దేశ ప్రధానులయ్యే అవకాశం ఉంది, అత్తెసరు మార్కులు వచ్చిన వారికి మెడిసిన్, ఇంజనీరింగ్, పీజీ కళాశాలలో సులువుగా దొరికే అవకాశాలు వున్నప్పుడు, వారికి ఉద్యోగాలు దొరికే పరిస్థితి వున్నప్పుడు , శోధించి, ఆవిష్కరించే శాస్త్రవేత్తలు ఎలా , ఎక్కడినుంచి పుట్టుకువస్తారు? ఈనాటి, ఇలాంటి విద్యార్థులవల్ల కొత్త ఆవిష్కరణలు ఆశించడం అత్యాశే. వారు చదువుకున్న విద్యకు సార్ధకత చేకూరిస్తే చాలు. సరైన వైద్యం, పదికలాలపాటు ఉండే కట్టడాలు కట్టగలిగితే చాలు అన్న అభిప్రాయం ప్రజల్లో ఉంది.(అనుమానమే) ఇది మన వ్యవస్థలో ఉన్న లోపం. ఎవరిని కించపరచడం నా అభిమతం కాదు. పిజిలు , ఏళ్ళ తరబడి పిహెచ్డిలు ప్రభుత్వం ఆయాచితంగా అన్ని , అంటే వసతి, భోజనం నలబై ఏభై వేల స్టీఫెన్డ్ లు ఇస్తే వారిలో జీవితంలో ఎదగాలి అన్న తపన ఎక్కడినుంచి వస్తుంది. పిల్లల తప్పుకాదు ,పాలకుల తప్పు.


 సమరేంద్ర మిత్ర లాంటి వారు ఎలా అత్యున్నత స్థాయికి ఎదిగారు? వారున్న కాలంలో ఏ వసతులు లేవు. రవాణా, అందుబాటులో సమాచారం , ఆధునిక పరికరాలు ఏవి లేవు. ఇప్పుడవన్ని ఉన్నా ఆ దిశలో ప్రోత్సాహకాలు కరువయ్యాయి. 


సశేషం. (రేపు స్విస్ కంపెనీలు చేయలేము అని తెగేసి చెప్పిన ప్రపంచలో అత్యంత పల్చటి వాచి గురించి)


By Subramanyam Valluri

*సేకరణ:- వాట్సాప్ పోస్ట్.*

ఆడకోతి

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

చందమామ కథ 

ఆడకోతి 

డి.సుబ్రహ్మణ్యం 


పూర్వం కాంచీపురరాజ్యాన్ని కనకసేను డనే రాజు పాలిస్తూవుండేవాడు. ఆయన చాలా విలాసపురుషుడు. దూరదేశాలనుంచి కూడా అనేకరకాల పూలమొక్కలూ వృక్షజాతులూ తెచ్చి, రాజభవనంవెనక చక్కని ఉద్యానవనం పెంచాడు.


అందమైన ఆ ఉద్యానవనంలో, అతి మనోహరమైన కొలను తవ్వించాడు. కొలను చుట్టూ పెద్ద పెద్ద చెట్లూ, వాటిని అల్లుకుని రకరకాల పుష్పలతలూ ఉన్నయి.


ఒకనాడు కాంచీపురరాణి కొలనుకు స్నానానికని వెళ్లింది. కొలనులో దిగుతూ తను ధరించిన నగలన్నీ దాసీదాని చేతికి ఇచ్చింది వాటిలో ఒక అమూల్యమైన రత్నాలహారంకూడా వుంది.


రాణి యిచ్చిన నగలన్నిటినీ దాసీది కొలను ఒడ్డున పెట్టి, అక్కడ చేతికి అందిన చెట్లనుంచి పూలు కోయసాగింది. ఇంతలో అక్కడ చెట్లపైన వుండే ఒక ఆడకోతి హఠాత్తుగా కిందకు దూకి ఆరత్నాలహారాన్ని ఆందిపుచ్చుకొని, ఒక్కగంతులో మళ్లీ చెట్టు ఎక్కేసింది.


హారాన్ని కోతి ఎత్తుకుపోవటం దాసీది చూసింది. కాని ఏంచేయటానికీ తోచక చూస్తూవుండిపోయింది. ఇంతలో రాణి కొలనునుండి బయటికి వచ్చి, దుస్తులు ధరించి, నగలలో తన రత్నాలహారం కనబడకపోయేసరికి దాసీదానిని అడిగింది.


"ఏమోనమ్మా, మీరు ఇచ్చిన నగలన్నీ యిక్కడే పెట్టాను!" అన్నది దాసి, రాణి కోపగిస్తుందేమో నన్న భయంతో.


రాణి వెళ్ళి రాజుతో యీ దొంగతనం సంగతి చెప్పింది. రాజు మంత్రిని పిలిపించి సూర్యాస్తమయంలోపల దొంగను పట్టి తీసుకురావాలని ఆజ్ఞాపించాడు. రాజాజ్ఞ ప్రకారం మంత్రి వెంటనే దండనాయకుణ్ణి పిలచి జరిగినదంతా వివరించి, సూర్యాస్త మయం లోపల రత్నాలహారంతో స హా దొంగను పట్టి ఒప్పగించకపోతే వుద్యోగానికి తిలోదకాలేనని గట్టిగా చెప్పాడు.


దండనాయకుడు యుద్ధానికి వెళుతున్నట్టుగా వందలకొలది సైనికులతో బయలుదేరాడు. పట్టణం అంతా గాలించి వేశాడు. దొంగ యెవడో, యెలా వుంటాడో యెవరికీ తెలీదు. కాని, దొంగతనం చేసిన వాడు తప్పక బీదవాడై వుంటాడనీ, బీద వాడైతే మాసిన దుస్తులతో, పెరిగిన గడ్డంతో వుంటాడనీ వారి నమ్మకం.


చివరికి పట్టణమూ, ఆ చుట్టుపట్ల వున్న అడవులూ వెదికి సూర్యాస్తమయంలోపల ఒక చింకిగుడ్డలవాణ్ణి కోటకు లాక్కొని వచ్చారు. దొంగ దొరికాడని వినగానే రాజు తక్షణం దర్బారుకు వచ్చాడు.


"రత్నాలహారం యెక్కడ దాచావు?" అని గద్దించి ప్రశ్నించారు రాజుగారు. దొంగిలించలేదంటే యెవ్వరూ నమ్మరనీ, ఆ నిమిషానే వురితీయిస్తారనీ భయపడి, ఆ బీదవాడు " రత్నాలహారం, కోశాధిపతిగారికి యిచ్చానండీ!” అన్నాడు. ఇలా అన్న వెంటనే కోశాధిపతిని రెక్కలు విరిచికట్టి  రాజుముందుకు లాక్కొని వచ్చారు. 


రాజు అదేప్రశ్న మళ్లీ అడిగాడు. కోశాధిపతికి రాజు మనస్తత్వం తెలుసు; కనుక తడుముకోకుఁడా "మన ఆస్థానజ్యోతిష్టుల వారికి యిచ్చానండీ!” అన్నాడు.


ఆస్థానజ్యోతిషుణ్ణి కాళ్లూ చేతులూ కట్టి తెచ్చి రాజుగారిముందు నిలబెట్టారు. రాజు అంతకుముందు ఇద్దరినీ ప్రశ్నించినట్టే మళ్లీ ప్రశ్నించాడు. దానికి జోతిష్కుడు తడబడ కుండా "మంత్రిగారి పెద్దకుమారుడికి యిచ్చానండి! " అన్నాడు. ఇంతవరకు విచారణ జరిగేసరికి చాలా పొద్దుపోయింది.


అందుచేత "తతిమ్మా వ్యవహారం అంతా రేపు వుదయం చూసుకుందాం. నేరస్థులను మాత్రం ఖైదులో వేయండి!'' అని చెప్పి రాజుగారు లేచిపోయారు.


ఆరాత్రి మంత్రికి నిదురపట్టలేదు. రత్నాలహారం పోవడం, ఆ దొంగతనం యెవడో బీదవాడితో ప్రారంభమై చివరకు తన కొడుకుమీదికి రావడం— —అంతా చిత్రంగా తోచింది. అర్ధరాత్రిసమయాన పడక గదినుంచి  బయలుదేరి సరాసరి నేరస్థులు బంధింపబడి ఉండే గది తలుపు దగ్గరకు వెళ్ళి చెవి ఒగ్గి వినసాగాడు. జైలు గదిలోపలనుంచి సన్నగా ఏడుపు వినబడింది. మంత్రి అలానే తలుపుదగ్గిరసా చెవివుంచి వింటున్నాడు. ఇంతలో ఆ యేడుపు ఆగిపోయింది. అదేసమయాన బీదవాడి గొంతుక యిలా అన్నది:


" కోశాధిపతిగారూ ! నన్ను క్షమించాలి. ప్రాణభయంవల్ల అలా మీ మీద అబద్దం చెప్పేశాను. నిజానికి ఆ రత్నాలహారాన్ని గురించి నాకేమీ తెలియనే తెలియదు.”


తరవాత కోశాధి పతి: "జ్యోతిషుల వారూ! నన్ను క్షమించాలి. ప్రాణభీతివల్ల మీ మీద చెప్పేశాను. జ్యోతిష్కులు గనక, నిజం తెలుసుకోగలరు కదా అని అలా అనేశాను " అన్నాడు.


ఇక జ్యోతిష్కుడు ప్రారంభించాడు: "జ్యోతిషం, నా శ్రాద్ధమును! యిలాంటి దొంగతనాలు జ్యోతిషానికి అందేవికావు.  అందుకే మంత్రికొడుక్కి వుచ్చువేశాను."


ఇంతవరకూ అందరి మాటలూ విన్న మంత్రికి రహస్యం తెలిసిపోయింది. సరాసరి అర్ధరాత్రివేళ రాజుదగ్గరకు పోయి, నిద్ర లేపి, తను విన్నదంతా చెప్పేశాడు.


మంత్రి చెప్పినదంతా విని, రాజు ఒక పెద్ద నిట్టూర్పు విడిచాడు. తన రాణికి ప్రాణప్రదమైన ఆ వెలలేని రత్నాలహారం యెవరు దొంగిలించినట్టు? తెల్లవార్లూ రాజుకు యిదే ఆలోచన.


తెల్లవారింది. రాజు దాసీదానిని ఎదటికి పిలిపించాడు. 'నిజం చెప్తావా, లేకపోతే నిన్ను ముక్కలుముక్కలుగా నరికించి, కాకులకూ గద్దలకూ వేయించమంటావా?' అని బెదిరించాడు.


దాసీది హడిలిపోయింది.


"మహారాజా ! నేను నిర్దోషిని. కాని కొలనుపక్షని రావిచెట్టుమీద నివసించే ఆ ఆడకోతిమీద మాత్రం నాకు అనుమాన మున్నది !” అని చెప్పింది.


"కోతిమీద ఎందుకని అనుమానం! అది నీకన్న అందంగా వుందనా ?” అన్నాడు రాజు, గుడ్లెర్రజేస్తూ.


"లేదు ప్రభూ! అది అమ్మగారిలాగే వయ్యారంగా నడవాలని ప్రయత్నించడం నేను చూశాను. అమ్మగారు కొలనులో స్నానంచేస్తున్నంతసేపూ, అదికూడా చెట్ల కొమ్మల మీద స్నానంచేస్తున్నట్టు అభినయిం చేది. అమ్మగారిలాగానే కనపడీ కనపడనట్టు చిరునవ్వు నవ్వాలని కూడా ప్రయత్నించటం నేను చూశాను!" అన్నది. 


రాజుగారికి, దాసీవాని మాటలు వినే సరికి అరికాలు మంట నెత్తికెక్కినట్టయింది. దాసీదానిని నిలువునా నరికేద్దామను కున్నాడు. కాని రత్నాలహారం సంగతి గుర్తుకొచ్చి శాంతం వహించాడు.


"ఐతే, రత్నాల హారం ఆ ఆడకోతే దొంగలించిందంటావా? బాగానే వుంది. మరి ఆ హారాన్ని అదెక్కడ దాచిందో తెలుసు కోవడం ఎలా ?" అన్నాడు రాజు.


"అదేమంత కష్టంకాదు ప్రభూ!" అని మెల్లగా అంటూ ముసిముసినవ్వులు నవ్వింది ఆ దాసీది. ఎందుకని కష్టం కాదు ?" అని గాడు రాజు ఉగ్రుడై.


తమరు భవనంలో వున్నప్పుడేగదా రాణీగారు ఆ రత్నా లహారాన్ని ధరిస్తారు ?" అని ఎదురు ప్రశ్న వేసింది దాసీది.


" కావొచ్చు!" అన్నాడు రాజు కనుబొమలు చిట్లిస్తూ.


"ప్రభూ! తమకు నా మీద కోపం రావొచ్చు కనక, అంత వివరంగా చెప్పలేను. కాని, ఆ ఆడకోతి రత్నాలహారాన్ని ఎక్కడ దాచిందో కనుక్కోవాలంటే, మనం ఒక మగకోతిని తీసుకొనివస్తే వెంటనే తెలిసిపోతుంది !" అన్నది దాసి.


దాసీదాని మాటలలోని అంతరార్థం గ్రహించి, రాజు చిరునవ్వు నవ్వుకున్నాడు. రాణీని ఆడకోతితోను, తనను మగకోతి తోనూ ఆది పోల్చుతున్నదని గ్రహించాడు. కాని, యెలా అయినా ముందు ఆ రత్నాల హారం రాబట్టుకోవాలిగదా ! రాజు ఆజ్ఞాపించగా, క్షణాలమీద ఒక మగకోతిని తెచ్చారు. రాజోచితంగా దానిని అలంకరించారు. మగకోతి  వెనుక రాజూ, మంత్రి మొదలైనవారు అందరూ సపరివారంగా ఉద్యానవనంలోకి వెళ్ళారు.


రావిచెట్టు మీద నివసిస్తున్న ఆడకోతి యిదంతా చూచింది. ఒక్కగంతులో ఆ పక్కనవున్న చెట్టుతొర్రలో జొరబడి, అక్కడ దాచివుంచిన రత్నాలహారం బయటికి తీసి, మెడలో వేసుకున్నది. తరు వాత చెట్టు దిగి , రాణీగారిలాగే వయ్యారంగా నడుస్తూ, మగకోతివేపు బయలుదేరింది.


రాజభటులు ఆడకోతిని పట్టుకుని, దాని మెడలోని రత్నాలహారం లాక్కున్నారు. ఆది కీచుకీచుమంటూ తిరిగి చెట్టుమీదకు పారిపోయింది.


రత్నాలహారం రాణికి యిచ్చి, నిర్దోషులందర్నీ వదిలేశారు. అందరితోపాటు రాజూ, దాసీదాని తెలివిని మెచ్చుకుని తగిన రీతిన  బహుమతి ప్రదానం చేశాడు .

(చందమామ - 1953, ఏప్రిల్ )


*సేకరణ:- శ్రీ శర్మద గారు*

మొలలు వ్యాధి

 మొలలు వ్యాధి ఉన్నవారు పాటించవలసిన జాగ్రత్తలు  -


 *  పాతబియ్యం , పాతగోధుమలు వాడవలెను.


 *  బార్లీ , సగ్గుబియ్యం జావ వాడవలెను.


 *  బీరకాయ, పొట్లకాయ కూరలు తినవలెను .


 *  పెసరపప్పు తినవలెను . కందిపప్పు , మినపపప్పు తినవద్దు.


 *  కోడి మాంసం , గుడ్డు నిషిద్దం . ఎప్పుడైనా ఒకసారి మేకమాంసం అతి తక్కువ మోతాదులో మసాలా చాలా తక్కువ మోతాదులో కలిపి తీసుకొవచ్చు.


 *  పాతపచ్చళ్ళు పూర్తిగా నిషిద్దం.


 *  ఎక్కువసేపు ప్రయాణాలు చేయరాదు .


 *  పళ్ల రసాలు తీసుకోవచ్చు . ముఖ్యంగా యాపిల్ రసం తీసుకోవలెను .


 *  కఠినంగా ఉండే చెక్క కుర్చీల పైన ఎక్కువసేపు కూర్చోరాదు. స్పాంజితో చేసినవి కూడా వాడకూడదు . బూరుగు దూది లేదా పత్తితో చేసినవి వాడవలెను.


 *  పెరుగుతోటకూర, మెంతికూర, పాలకూర, గంగపాయల కూర , చక్రవర్తికూర వంటి ఆకుకూరల తరుచుగా తీసికొనవలెను.


 *  మలబద్దకం లేకుండా చూసుకొనవలెను. సుఖవిరేచనం అయ్యేలా చూసుకోవాలి .


 *  ఆవునెయ్యి , ఆవుమజ్జిగ, ఆవుపాలు వాడుకుంటే మంచిది .


 *  శరీరానికి వేడిచేసే పదార్థాలు తీసుకోరాదు . వీలయినంత ఎక్కువ మజ్జిగ తీసికొనవలెను.


 *  కొత్తబియ్యం, కొత్తగోధుమలు వాడరాదు.


 *  కొత్తచింతపండు , కొత్తబెల్లం నిషిద్దం.


 *  నువ్వులు , ఆవాలు , నువ్వు చెక్క వాడరాదు.


 *  ఆహారంలో నూనె తగ్గించి వాడుకొనవలెను.


 *  కొడి చేప , రొయ్యలు వాడరాదు.


 * చద్దన్నం, చల్లబడినవి , మెత్తపడిన ఆహారాన్ని తినకూడదు.


 *  వంకాయ , గోంగూర, సొరకాయ, బచ్చలి ఎట్టి పరిస్థితుల్లోనూ మొలల సమస్య ఉన్నవారు తీసుకోకూడదు .


       మొలల సమస్య ఉన్నవారు శరీరంలో వాతం , వేడి పెరగకుండా జాగ్రత్తపడుతూ సరైన వైద్యుడుని సంప్రదించి చికిత్స తీసుకొనవలెను .


     మొలలకు సంబంధించి సంపూర్ణ చికిత్సకు నన్ను సంప్రదించవచ్చు. రక్తం కారే తీవ్రమైన సమస్య ఉన్నను కేవలం 10 రోజులలోపు రక్తం ఆగిపోయి నొప్పి తగ్గుతుంది . మొలల పిలకలు కూడా ఎటువంటి సర్జరీ లేకుండా ఊడిపోతాయి.


      మరింత విలువైన సమాచారం కొరకు నా గ్రంథములు చదవగలరు . 


   గమనిక  -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


            

        ఈ గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా ఫొన్ చేయండి  . సంప్రదించవలసిన నెంబర్ 

                   

        9885030034 


     కాళహస్తి వేంకటేశ్వరరావు  


   అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


            9885030034

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే!*

               🌷🌷🌷

*కలియుగాబ్ది 5124* *శ్రీ శాలివాహన శకం 1944 స్వస్తి శ్రీ    చాంద్రమాన శోభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం - శరదృతువు -  ఆశ్వీయుజ మాసం - కృష్ణ పక్షం  - అష్టమి -  పుష్యమి - భాను వాసరే* *(05-11-2023)* 


ప్రముఖ వేదపండితులు,  *బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* గారి నేటి వేద ఆశీర్వచనం.


https://youtu.be/1RNOzuGyW94?si=6108rHixJ4r-GEln


🙏🙏

అధ్వాన్నంగా వుంది...

 ఏదైనా నచ్చకపోతే చాలు వెంటనే మనం అధ్వాన్నంగా వుంది... ఇలా అయితే కష్టం... అంటూ వుంటాం. మనం వాడే బాషలో అధ్వాన్నంకి మీనింగ్ నెగిటివ్‌గా వుంటుంది... ఈ పదాన్ని నెగిటివ్‌గా వాడటమే అలవాటు. మరి నిజంగానే అధ్వాన్నం పదానికి నెగిటివ్‌ మీనింగే వుందా... అసలు అధ్వాన్నం మీనింగ్ ఏమిటో చూద్దాం.

అధ్వాన్నం......


అధ్వ అంటే దారి;

అన్నం- తిండి.

రెండు మాటలు సవర్ణదీర్ఘ సంధితో కలిస్తే “అధ్వాన్నం”.  అవుతుంది... అంటే దారి మధ్యలో వండుకుని తిన్నది, వండినది అని. ఇంట్లోలా అన్నీ కుదిరినా, కుదరకపోయినా, రుచి-శుచి లేకపోయినా ఆకలితో అలమటించి స్పృహతప్పి పడిపోకుండా దారిలో ఏదో ఒకటి అనుకుని తినే అన్నమే “అధ్వాన్నం”.


భాషలో మాటలకు అర్థవ్యాప్తి, అర్థ సంకోచాలు వస్తుంటాయి. ఆ రుచి పచీ లేని ఆహారపరమైన అధ్వాన్నం కాస్త ఇప్పుడు బాగాలేని దేనికయినా “అధ్వాన్నం” అయ్యింది. మన పూర్వీకులు వాడిన ఏ పదానికి దాదాపు అన్ని పదాలకు మనిషి జీవన విధానానికి  మార్గదర్శకాలుగా వుంటాయి అంతే ఎక్కడ నెగిటివ్‌ అర్ధాలు వుండవు... వున్నా కూడా అవి మనిషి నిజ జీవితంలో ఉపయోగపడేవే.....

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*



*కలియుగాబ్ది 5124*

*శ్రీ శాలివాహన శకం 1944 స్వస్తి శ్రీ    చాంద్రమాన శోభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం - శరదృతువు -  ఆశ్వీయుజ మాసం - కృష్ణ పక్షం  - అష్టమి -  పుష్యమి - భాను వాసరే* (05.11.2023)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.


https://youtu.be/1RNOzuGyW94?si=6108rHixJ4r-GEln


.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

-----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*

దత్తక్షేత్రం ఫకీరు మాన్యం

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర...

 

*దత్తక్షేత్రం ఫకీరు మాన్యం..*


*(పద్దెనిమిదవ రోజు)*


శ్రీ స్వామివారితో సహా శ్రీధరరావు దంపతులు, కౌసల్యమ్మ గారు రమణయ్య గారు అందరూ మొగలిచెర్ల సరిహద్దుల దగ్గరకు వచ్చేసరికి..రమణయ్య గారు తాను పొట్టిపల్లె వెళ్ళిపోతానని చెప్పి..బండి దిగి శ్రీధరరావు గారి వద్ద సెలవు తీసుకొని వెళ్లిపోయారు..


శ్రీ స్వామివారిని తోడ్కొని దంపతులిద్దరూ తమ ఇంటికి చేరారు..కౌసల్యమ్మ గారు ముందుగా బండి దిగి ఇంటిలోకి వెళ్లారు..ప్రభావతి గారు కూడా దిగి గబ గబా  వెళ్లి, శ్రీ స్వామివారు కాళ్ళు కడుక్కోవడానికి ఒక బకెట్ తో నీళ్లు సిద్ధం చేశారు..ఈలోపల శ్రీధరరావు గారి తల్లి.. సత్యనారాయణమ్మ గారు మెల్లగా బైటకు వచ్చారు..ఆవిడ శ్రీ స్వామివారిని చూసి ఏమని వ్యాఖ్యానిస్తారో నని, ప్రభావతి శ్రీధరరావు గార్లు మధనపడుతున్నారు..


శ్రీ స్వామివారు కాళ్ళు కడుక్కుని నేరుగా సత్యనారాయణమ్మ గారి ముందు చిరునవ్వుతో నిలబడ్డారు..ఆవిడ అవాక్కైపోయినట్లుగా మారిపోయి..అప్రయత్నంగా రెండు చేతులూ జోడించి నమస్కారం చేసి.."స్వామీ మీరు ఇక్కడికే వచ్చారా?..మిమ్మల్ని చూడగలనో లేదో అని ఈరోజు చాలాసార్లు లోలోపల బాధపడుతున్నాను..నా కోసమే వచ్చినట్లు ఉంది నాయనా.." అన్నారు..శ్రీధరరావు ప్రభావతి గార్లకు ఆశ్చర్యంగా ఉంది..అంతకుముందు బండిలో శ్రీ స్వామివారు.. "అన్నీ సవ్యంగా జరుగుతాయి!.."అన్నమాట ఇప్పుడు అక్షర సత్యమై కూర్చుంది..శ్రీ స్వామివారు ఎంతో ప్రసన్నంగా.."అమ్మా!..ఆరోగ్యం నెమ్మదిగా ఉందా?.." అని అడిగి ఆమె చేతులను స్పృశించి..ఇంటి వరండాలోకి వచ్చారు..ఎన్నో ఏళ్ల నుంచి పరిచయం ఉన్నవాళ్లు మాట్లాడుకుంటున్నట్లుగా ఉంది ఆ సన్నివేశం చూస్తే!..


సత్యనారాయణమ్మ గారు పట్టరాని సంతోషంతో.."అమ్మాయ్ ప్రభావతీ..స్వామివారికి ఏలోటూ చేయకండమ్మా.. అన్నీ దగ్గరుండి చూడండి నువ్వూ శ్రీధరుడూ..ఇదిగో మా చెల్లెలు వచ్చిందికదా..అదీ నేనూ మాట్లాడుకుంటూ ఉంటాము..మా గురించి ఆలోచించకండి..ముందు మీరిద్దరూ స్వామి వారి ఏర్పాట్లు చూడండి!.."అన్నారు..ఆవిడ ముఖం లో ఆనందం తాండవిస్తోంది..శ్రీ స్వామివారు మళ్లీ ఆవిడ దగ్గరకు వచ్చి.."అమ్మా!..నాకు ఒక గ్లాసు పాలు చాలు!..మీరు విశ్రాంతి తీసుకోండి.."అన్నారు..


శ్రీ స్వామివారు బావి వద్ద స్నానం చేస్తూ..శ్రీధరరావు గారితో.."ఈ బావి ఇక్కడ ఉండకూడదు!.." అన్నారు.."అది మా నాన్నగారు త్రవ్వించినది..ఆయనకు వాస్తుపైనా..దైవం పైనా పెద్దగా నమ్మకం లేని వ్యక్తి.."అన్నారు.."అలాగా..సరేలేండి..కాలమే దిద్దుతుంది!.." అన్నారు..ఆ తరువాత శ్రీధరరావు గారింటి ఆవరణ లోనే ఉన్న మరో ఇంట్లో(ఔట్ హౌస్) స్వామివారికి బస ఏర్పాటు చేశారు..శ్రీ స్వామివారు ఒక్క గ్లాసు పాలు త్రాగి ఆ ఇంట్లోకి వెళ్లి, ధ్యానంలోకి వెళ్లిపోయారు..


మరునాడు ఉదయాన్నే శ్రీధరరావు దంపతులు, శ్రీ స్వామివారిని వెంట పెట్టుకొని మొగలిచెర్ల కు దక్షిణంగా సుమారు రెండుకిలోమీటర్ల దూరంలో ఉన్న తమ పొలం వద్దకు తీసుకెళ్లారు..ఆ మొత్తం పొలం బీడువారి ఉంది..పూర్తిగా రేగు చెట్ల మయం..గొర్రెలు కాచుకునే వాళ్ళు తిరిగే కాలిబాటలు..ముళ్ళు..సన్నని పలుకురాళ్లు..చూడకుండా పాదం మోపితే కస్సున దిగుతాయన్నట్లుగా ఉన్నాయి..ఆ భూమి పేరు.."ఫకీరు సాహెబ్ మాన్యం"..ఎవరో ఫకీరు కొన్ని తరాల క్రిందట అమ్ముకొని వెళ్లిన భూమి..


శ్రీ స్వామివారు బండి దిగి..ఆ నేలపై పాదం మోపారు..ఆయన ముఖంలో ఒక్కసారిగా ఎక్కడలేని కాంతి వచ్చింది..తేజోరూపుడిగా మారిపోయారు..పట్టరానంత సంతోషంతో.."ఇదే భూమి!..ఇదే భూమి!..నేను కోరుకున్నదీ.. నాకు కావాల్సింది..ఇదే..ఈ పవిత్రభూమి కోసమే నేను ఇంతకాలం వేచి ఉంది..నా తపస్సుకు అనువైనది..శ్రీధరరావు గారూ ఇది క్షేత్రం..దత్త క్షేత్రం..మీ దంపతులకు ఇక్కడ ఈశ్వర సాక్షాత్కారం అయింది!..అవునా?.."అంటూ..పసిపిల్లాడు తిరిగినట్లు..ఆ భూమిలో తిరుగాడారు..


ఈశ్వర సాక్షాత్కారమా?..శ్రీధరరావు గారికి శ్రీ స్వామివారు చెప్పిన మాట అర్ధం కానట్లు గా చూస్తూ ఉండిపోయారు..కానీ ప్రభావతిగారికి చప్పున గుర్తుకొచ్చింది...కొన్ని సంవత్సరాల క్రిందట ఒక శివలింగం ఈ భూమిలోనే వారికి దొరికింది..ఆ శివలింగం ప్రస్తుతం వారింట్లో పూజామందిరంలో ఉంది..అది జరిగి కూడా చాలా ఏళ్ళు అయింది..శ్రీ స్వామివారు గుర్తుచేసారు.. దంపతులిద్దరూ శ్రీ స్వామివారి ప్రవర్తనకు ఆశ్చర్యపోతున్నారు..సిద్ధులూ సాధకుల గురించి విని వున్నారు కానీ..ప్రత్యక్షంగా వారి ప్రవర్తన ఇదే చూడటం..శ్రీ స్వామివారు అలౌకిక ఆనందాన్ని అనుభవిస్తున్నారు..


అక్కడినుండి కొద్దిదూరంలోనే ఉన్న "మన్నేరు"నది వద్దకు అందరూ వెళ్లారు..శ్రీ స్వామివారు ఆ నదినీటిలో కేరింతలు కొడుతూ స్నానం చేశారు.."ఇది మార్కండేయ నది..అది ఫకీరు భూమి!..ఫకీరు అంటే సాధువు అని అర్ధం!..నా తపస్సు..నా శేషజీవితం.. ఇక ఇక్కడే..ఇది దత్తక్షేత్రం..భవిష్యత్ లో మహా పుణ్యక్షేత్రం అవుతుంది..శ్రీధరరావు గారూ..అమ్మా..ఇద్దరూ వినండి..ఇది పుణ్యక్షేత్రం..సాక్షాత్తూ దత్తుడి భూమి..నా తపస్సుకు ఇంతకంటే అనువైనది లేదు.."అన్నారు..


మన్నేరు నుంచి మరలా ఫకీరు మాన్యం లోకి వచ్చి, కొంతసేపు గడిపిన తరువాత అందరూ మొగలిచెర్ల చేరారు..శ్రీ స్వామివారు ధ్యానానికి వెళ్లిపోయారు..


శ్రీ స్వామివారి ఆహార పద్ధతులు...రేపటి భాగంలో..


*మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి చరిత్రను ఆడియో రూపంలో ఈ క్రింద ఇచ్చిన లింక్ ద్వారా యూట్యూబ్ లో వినవచ్చు..*


https://youtube.com/playlist?list=PLZ3oJviTRayHLeRpuozyT55d-H-4xmTHs&si=xqCIrCAE0k1Rmrnx


సర్వం..

శ్రీ దత్తకృప!.


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..SPSR నెల్లూరు జిల్లా..పిన్ : 523 114..సెల్..94402 66380 & 99089 73699).

విదురనీతి

 [: విదురనీతి

విదుర ఉవాచ = విదురుడిట్లన్నాడు.

శ్లో )ఏవం కృత పణౌ క్రుద్ధౌ తత్రాభీజగ్మతుస్తదా

 విరోచన సుధన్వానౌ ప్రహ్లాదో యత్రతిష్ఠతి॥


అ)ఈ విధంగా పందెం కట్టుకొని, మిక్కిలి కోపం కలవారై, విరోచన సుధన్వులిద్దరు ప్రహ్లాదుడున్నచోటికి వెళ్లిరి

 ఉద్ధవగీత

శ్లో)ప్రతిష్ఠయా సార్వభౌమం సద్మనా భవనత్త్రయమ్| పూజాదినా బ్రహ్మలోకం త్రిభిర్మత్సామ్యతామియాత్||


అ)విగ్రహ ప్రతిష్ట చేత సార్వభౌమపదవిని, మందిర నిర్మాణమునచేత త్రిలోకాధిపత్యమును, పూజాదులచే బ్రహ్మలోకమును, మూడింటిచే నాతో సమానత్వమును బొందును

శయన నియమాలు

 🪷 *శయన నియమాలు (నిద్రించే సమయంలో పాటించవలసిన సూత్రాలు)* 🪷


1. *నిర్మానుష్యంగా, నిర్జన  గృహంలో* ఒంటరిగా పడుకోవద్దు. *స్మశానవాటికలో* కూడా పడుకోకూడదు.( *మనుస్మృతి*)


2. పడుకోని ఉన్న వారిని *అకస్మాత్తుగా* నిద్ర లేపకూడదు. *(విష్ణుస్మృతి)*


3. *విద్యార్థి, నౌకరు, మరియు ద్వారపాలకుడు* వీరు అధిక సమయం నిద్రపోతున్నచో, వీరిని మేల్కొలప వచ్చును. *(చాణక్య నీతి)*


4. ఆరోగ్యవంతులు  ఆయురక్ష కోసం *బ్రహ్మా ముహూర్తం* లో నిద్ర లేవాలి. *(దేవీ భాగవతము)* పూర్తిగా చీకటి గదిలో నిద్రించవద్దు. *(పద్మ పురాణము)*


5. *తడి పాదము* లతో నిద్రించవద్దు. పొడి పాదాలతో నిద్రించడం వలన లక్ష్మీ (ధనం) ప్రాప్తిస్తుంది. *(అత్రి స్మృతి)* విరిగిన పడకపై, ఎంగిలి మొహంతో పడుకోవడం నిషేధం. *(మహాభారతం)*


6. *వివస్త్రలులై (నగ్నంగా)* పడుకోకూడదు. *(గౌతమ ధర్మ సూత్రం)*


7. తూర్పు ముఖంగా తల పెట్టి నిద్రించిన *విద్య*, పశ్చిమ వైపు తల పెట్టి నిద్రించిన *ప్రబల చింత,* ఉత్తరము వైపు తల పెట్టి నిద్రించిన *హాని, మృత్యువు,* ఇంకా దక్షిణ ముఖంగా తల పెట్టి నిద్రించినచో *ధనము, ఆయువు* ప్రాప్తిస్తుంది. *(ఆచార మయూఖ్)*


8. *పగటిపూట* ఎపుడు కూడా నిద్రించవద్దు. కానీ *జ్యేష్ఠ మాసం* లో  1 ముహూర్తం (48నిమిషాలు) నిద్రిస్తారు. (పగటిపూట నిద్ర రోగహేతువు, మరియు ఆయుక్షీణత  కలుగచేస్తుంది)


9. పగటిపూట సూర్యోదయము మరియు సూర్యాస్తమయం వరకు పడుకొనే వారు రోగి మరియు దరిద్రులు అవుతారు. *(బ్రహ్మా వైవర్తపురాణం)*


10. సూర్యాస్తమయానికి ఒక ప్రహారం (సుమారు మూడు 3 గంటల) తరువాతనే *పడుకోవాలి*


11. ఎడమవైపు పడుకోవడం వలన  *స్వస్థత* లభిస్తుంది.


12. దక్షిణ దిశలో *పాదములు పెట్టి ఎపుడు నిద్రించకూడదు. యముడు మరియు దుష్ట గ్రహము* ల  నివాసము వుంటారు. దక్షిణ దిశలో కాళ్ళు పెట్టడం వలన చెవుల్లో గాలి నిండుతుంది. *మెదడుకు రక్త సరఫరా* మందగిస్తుంది. *మతిమరుపు* *మృత్యువు* లేదా *అసంఖ్యాకమైన రోగాలు* చుట్టుముడుతాయి.


13. గుండెపై చేయి వేసుకుని, కాలుపై కాలు వేసుకుని నిద్రించ రాదు.


14. పడక మీద *త్రాగడం- తినడం* చేయకూడదు.


15. పడుకొని *పుస్తక పఠనం* చేయడానికి వీల్లేదు. (పడుకొని చదవడం వలన *నేత్ర జ్యోతి* మసకబారుతుంది)

 

*ఈ పదిహేను అనుసరించేవారు యశస్వి, నిరోగి, మరియు దీర్ఘాయుష్మంతులు అవుతారు..

విద్య లేనివాడి జీవితం

 శ్లోకం:☝️

*శునః పుచ్ఛమివ వ్యర్థం*

  *జీవితం విద్యాయా వినా ।*

*న గుహ్యగోపనే శక్తం*

  *న చ దంశనివారణే ॥*

- చాణక్యనీతిః 7.19


భావం: విద్య లేనివాడి జీవితం కుక్క తోక వలె పనికిరానిది, అది దాని వెనుక భాగాన్ని కప్పదు, లేదా కీటకాల కాటు నుండి రక్షించదు!

పంచాంగం 05.11.2023 Saturday,

 ఈ రోజు పంచాంగం 05.11.2023  Saturday,

 

స్వస్తి  శ్రీ చాన్ద్రమాన శోభకృన్నామ సంవత్సర: దక్షిణాయనం శరదృతు ఆశ్వీయుజ మాస కృష్ణ పక్ష: అష్టమి తిధి భాను వాసర: పుష్యమి నక్షత్రం శుభ యోగ: బాలవ తదుపరి కౌలవ కరణం ఇది ఈరోజు పంచాంగం.


అష్టమి రాత్రి 03:18 వరకు.

పుష్యమి పగలు 10:29 వరకు.

సూర్యోదయం : 06:20

సూర్యాస్తమయం : 05:39

వర్జ్యం : రాత్రి 12:49 నుండి 02:37 వరకు.

దుర్ముహూర్తం : సాయంత్రం 04:08 నుండి 04:54 వరకు.


రాహుకాలం : సాయంత్రం 04:30  నుండి 06:00 వరకు 


యమగండం : మద్యాహ్నం  12:00 నుండి 01:30 వరకు.  



శుభోదయ:, నమస్కార:

పూజాకార్యక్రమాల సంకల్పము.

 **********

*శుభోదయం*

*********

సంధ్యా వందన మరియు 

ఇతర పూజాకార్యక్రమాల సంకల్పము. 

పూర్వ పద్ధతి పంచాంగం.

తేదీ. 05.11..2023

ఆది వారం (భాను వాసరే) 

**************

గమనిక:-ఇక్కడ నేను ఇచ్చే సంకల్పం మా పెద్దలు మరియు గురువుల ద్వారా నేర్చుకున్న నిష్కామ సంకల్పం.  దీనిని మీరు ఉన్న ప్రదేశం మరియు మీరు మీ గురువు ద్వారా నేర్చుకున్న విధంగా మార్చుకో  వచ్చును. 

__________________

శుభాభ్యుదయార్ధంచ, శుభే శోభనే ముహూర్తే శ్రీ  మహావిష్ణోరాజ్నేయా  ప్రవర్తమానస్య అద్యబ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేత వరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రధమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే

మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీ శైలస్య వాయువ్య దిగ్భాగే (హైదరాబాద్ లో వారికి మాత్రమే)గంగా కావేర్యోర్మధ్య ప్రదేశే  శ్రీలక్ష్మీ నివాస గృహే సమస్థ దేవతాు హరిహర గురు గో బ్రాహ్మణ చరణ సన్నిధౌ  అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన

శ్రీ శోభకృత్ నామ సంవత్సరే దక్షిణాయనే

శరదృతౌ

ఆశ్వయుజ మాసే కృష్ణ పక్షే అష్టమ్యాం (సూర్యోదయానికి ఉన్న తిథే  చెప్పుకోవాలి సంధ్యావందనాలకు మాత్రమే)

భాను వాసరే 

శుభ నక్షత్రే

శుభ యోగే,

శుభకరణ,  

ఏవంగుణ విశేషణ విశిష్ఠాయాం శుభ తిధౌ 

శ్రీమాన్_______గోత్రః_____నామధేయః  

శ్రీమతః ______గోత్రస్య_______ నామధేయస్య మమ ఉపాత్త దురిత క్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం ప్రాతః/మాధ్యాహ్నిక/సాయం 

సంధ్యాముపాసిష్యే. 

సంధ్యా వందనం కొరకు మాత్రమే.


ఇతర పూజలకు 

శ్రీ శోభకృత్  నామ సంవత్సరే దక్షిణాయనే

శరత్ ఋతౌ  ఆశ్వయుజ మాసే  కృష్ణ పక్షే అష్టమ్యాం

భాను వాసరే అని చెప్పుకోవాలి.


ఇతర ఉపయుక్త విషయాలు

సూ.ఉ.6.03

సూ.అ.5.26

శాలివాహనశకం 1945 వ సంవత్సరం.  

విక్రమార్క శతాబ్దం లో 2080 వ సంవత్సరం. 

కల్యబ్దాః 5124 వ సంవత్సరం. 

శ్రీ శోభకృత్ నామ సంవత్సరం 

దక్షిణాయన పుణ్యకాలం శరత్ ఋతువు

ఆశ్వయుజ మాసం 

కృష్ణ పక్షం అష్టమి రా. 1.13 వరకు. 

ఆది వారం. 

నక్షత్రం పుష్యమి ప.11.46 వరకు. 

అమృతం  ఉ. 6.32 వరకు. 

దుర్ముహూర్తం సా. 3.55 ల 4.40 వరకు. 

వర్జ్యం రా. 1.51 ల‌ 3.7 వరకు .

యోగం శుభం మ. 3.40 వరకు.

కరణం  బాలవ ప.2.17 వరకు.

కరణం కౌలవ రా.1.13 వరకు. 

సూర్యోదయము ఉ.6.00 గంటలకు అయితే.

రాహు కాలం సా.4.30 ల 6.00  వరకు. 

గుళిక కాలం మ. 3.00 ల 4.30  వరకు. 

యమగండ కాలం మ.12.00 ల 1.30 వరకు. 

.***********

పుణ్యతిధి ఆశ్వయుజ బహుళ అష్టమి.

.**********

*శ్రీ పద్మావతీ శ్రీనివాస వివాహ సమాచార సంస్థ*,

(స్థాపితము 11/08/2000 రి.జి.నెం.556/2013)

S2,/C92, 6 -3 -1599/92,బి 

Sachivalayanagar,

Vanasthalipuram,

Rangareddy Dist, 500 070,

80195 66579.

.**********

*బ్రాహ్మణ వధూవరుల సమాచార కేంద్రం*

                           వారి

*బ్రాహ్మణ వధూవరుల ద్వై మాసవపత్రిక*

*పత్రికలో రిజిస్ట్రేషన్*ఉచితం, పుస్తకం కావలసిన వారు ₹100/- చెల్లించిన చో పుస్తకం వారి చిరునామాకు పంపబడును* 

*రిజిస్ట్రేషన్ మరియు ఇతర వివరాలకై*

*సంప్రదించండి*

ఫోన్(చరవాణి) నెం లను 

*9030293127/9959599505

*.**************

ఈ రోజు పుట్టినరోజు మరియు పెళ్ళి రోజు జరుపు కుంటున్న   అందరికీ గాయిత్రి మాత ఆయురారోగ్యాలు సర్వదా ప్రసాదించాలని  కోరుకుంటూ మీ  శ్రేయోభిలాషి.

**************

మాస్క్ ధరిస్తూ సామాజిక దూరం పాటిస్తూ ఆరోగ్యం గాను క్షేమంగాను ఉండాలని ఆకాంక్షిస్తూ మీ శ్రేయోభిలాషి.

🙏🙏🙏