భూమిని వదిలి విమానంలో కూర్చున్న ప్రయాణికుడు కూర్చున్నప్పుడు ఒక బస్సులోనో, రైల్లోనో, కార్లోనో కూర్చున్నట్లే ఉంటుంది కానీ విమానం కదిలి అది భూమిమీద వేగాన్ని పుంజుకుంటే అప్పుడు అది ఒక రైలు, బస్సు,కారుకన్నా ఎంతో వేగంగా వెళ్ళటం గమనిస్తాము. వేగాన్ని అధికంగా పెంచి ఒక దశలో పైలట్ టేక్ ఆఫ్ అయినప్పుడు కూర్చున్న ప్రయాణికుడికి విమానం భూమిని వదిలిన క్షణం ఏదో తెలియని అనుభూతి (feeling ) కలుగుతుంది. నిజానికి ప్రయాణికుడు కూర్చున్న సీటుకు దాదాపు పది, పదిహేను అడుగుల క్రింద విమానపు టైర్లు ఉంటాయి అయినాకూడా విమానం భూమిని వదిలిన క్షణం ప్రతి ప్రయాణికుడు స్పష్టంగా తెలుసుకోగలుగుతారు. విమానం గాలిలో ఏటవాలుగా వెళ్లి ఒక దశలో అది చేరుకోవలసినంత ఎత్తుకు చేరుకోగానే ఇక మీరు సీటు బెల్టు తీయవచ్చు అని అనౌన్సమెంట్ వస్తుంది. మరల విమానం దిగవలసిన పట్టణంలో లాండింగ్ గేరు వేస్తె ప్రయాణికుడు ఒక జారుబండమీదనుండి క్రిందికి దిగుతున్న అనుభూతితో వినంలోంచి దిగటం మనందరికీ అనుభవమే. ఇక్కడ కొంత సమంయం మాత్రమే ప్రయాణికుడు భూమిని వదిలి వుంటాడు. అది అతని ప్రయాణపు దురంమీద ఆధారపడి ఉంటుంది. మరల విమానం భూమిని చేరుకోవటంతో ప్రయాణికుడు విమానం దిగి భూమి మీద తన గమనం మొదలుపెడతాడు. భూమిని వదిలి మానవుని మనుగడ సాగించలేడు అదే శాస్వితంగా భూమిని వదిలితే అది ఎంతమాత్రం సాధ్యం కాదు అని ఎవరైనా అంటారు. కానీ అది నిజంకాదు ఇంజానికి ప్రతి మానవుడు ఏదో ఒకరోజు శాస్వితంగా భూమిని వదలి వెళ్ళాలి. కాకపొతే విమానంలో ప్రయాణించే ప్రయాణికుడు తాను (అంటే దేహం దేహి రెండూకూడా) భూమిని వదలి కొంతకాలం మాత్త్రం ఉండి గగన విహారం లోని అనుభూతిని పొందుతాడు. కానీ తన చివరి ప్రయాణంలో మాత్రం మానవుడు తాను ఒక్కడే భూమిని వదిలి వెళతాడు. అంటే దేహాన్ని ఇక్కడే వదలి వెళ్లాల్సి ఉంటుంది. దానినే మరణం అని భావించి ప్రతివారు మరణాన్ని గూర్చి భయపడతారు మరి తనతో పాటు తీసుకొని వెళ్ళేది అంటే లగేజి ఏమిటి అంటే ఈ భూమి మీద నీవు సంపాదించిన సంపద అది ఎటువంటిది అయినా కూడా నీవు తీసుకొని పోవటానికి వీలు లేదు. అదే విధంగా ఇక్కడి నీ తోటి ప్రయాణికులు అదే భార్య, పిల్లలు, బంధువులు, స్నేహితులు ఎవ్వరు కూడా నీ వెంట రారు. మరి నీతో వచ్చే లగేజి ఏమిటంటే అది కేవలం నీవు భూమి మీద ఆచరించిన కర్మల ఫలితం మాత్రమే . నీవు సత్కర్మలు ఆచరిస్తే ఆ ఫలం పుణ్యంగా, నీవు దుష్కర్మలు ఆచరిస్తే దాని ఫలితముగా పాపం నీకూడా వస్తాయి. తరువాత ఆ విధాత నీ ప్రారబ్దాన్ని పట్టి తిరిగి భూమిమీదకు తిరిగి పంపుతాడు. . కానీ నిజానికి మిత్రమా ఈ భూమిమీదికి రాకముందు నీవు ఎక్కడ వున్నావు అది నీకు తెలియదు, అలాగే నీవు భూమిని వదిలి వెళ్ళేటప్పుడు ఎక్కడికి వెళతావో అది కూడా నీకు తెలియదు. దానిని తెలుసుకోవటమే బ్రహ్మ జ్ఞాన సముపార్జనగా మన మహర్షులు తెలిపారు. బ్రహ్మ జ్ఞాని (బ్రహ్మమును తెలుసుకున్నవాడు)మాత్రమే ఈ జనన మరణ చక్రం నుండి విడివడుతాడు. "బ్రహ్మ వేద బ్రహ్మయేవ భవత్" మానవుని జీవిత గమ్యం ఒక్కటే అది బ్రహ్మమును తెలుసుకోవటం మాత్రమే. సాధక ఈ క్షణమే ఉద్యుక్తునివి కమ్ము బ్రహ్మ్మముని తెలుసుకో బ్రహ్మ జ్ఞానివి అయి ఈ జనన మరణ చెక్రము నుండి విడివడి ఈశ్వరుని సాన్నిధ్యాన్ని చేరుకొనే ప్రయత్నం చేయి.
ఓం తత్సత్
ఓం శాంతి శాంతి శాంతిః
మీ భార్గవ శర్మ