25, జనవరి 2024, గురువారం

నవగ్రహా పురాణం

 🌹🌹🌹🌹🌷🌷🌷🌷🌹🌹🌹🌹

.        *🪐నవగ్రహా పురాణం🪐*  

.               *147వ అధ్యాయం*


*పురాణ పఠనం ప్రారంభం*

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐


*శుక్రగ్రహ మహిమ - 2*


అదితి వ్రతం ఫలించింది. ఆదిదేవుడి వరం సాకారమైంది. అదితి దివ్యగర్భం ధరించింది. ఆమె శరీరాన్ని ఏదో దివ్యకాంతి ఆవరించింది. సహజ సౌందర్యవతి అయిన ఆమె అందం వెయ్యింతలయ్యింది.


ఆదితి గర్భాన అందంగా , ఆనందంగా కదలాడుతూ అవతరించడానికి సన్నద్ధుడవుతున్న క్షీరసాగరశాయిని చతుర్ముఖ బ్రహ్మ పరిపరివిధాలుగా ప్రస్తుతించాడు. 


నారదమహర్షి అదితి గర్భవతి అయిన శుభవార్తను , అందుకు మూలకారణాన్ని ఇంద్రాదులకు చేరవేశాడు.


★★★★★★★★★★★★★★★★


*"మహేంద్రా ! దేవతల కష్టాలు కడతేరే కాలం కనుచూపు మేరలో ఉంది. పూర్వ వైభవం అందుకోవడానికి , నీ వంతు కృషి నీవు చేయాలి.”* బృహస్పతి సాలోచనగా అన్నాడు.


*“శలవియ్యండి, గురుదేవా!”* 


*"స్వర్గరాజ్యం రాక్షసరాజ్యం కావడానికి మూలకారణం...”* బృహస్పతి ఏదో చెప్పబోయాడు.


*"తెలుసు... బలిచక్రవర్తి !"* ఇంద్రుడు అడ్డుతగిలాడు.


*"బలిచక్రవర్తి కారణం కావచ్చు , కానీ , మూలకారణం వేరే వుంది , దేవేంద్రా !"*


*“ఏమిటది , గురుదేవా?"*


*"నీ మీద ప్రసరిస్తున్న శుక్రుడి వక్రదృష్టి !"* బృహస్పతి ఇంద్రుడి కళ్ళల్లోకి చూస్తూ అన్నాడు. *“శుక్రుడు అశుభ దృష్టితో నిన్ను చూస్తున్నాడు. అతడి అశుభ దృష్టిని , శుభదృష్టిగా మార్చుకోవాలి నువ్వు !"*


*"ఊ....మార్గం ఉపదేశించండి !"*


*“భక్తిశ్రద్ధలతో నవగ్రహాలలో ఆరవగ్రహమైన శుక్రుడిని ధ్యానించు ! ఆరాధించు !"*


*"గురుదేవా !"* ఇంద్రుడు నివ్వెరపాటుతో అన్నాడు. *"శుక్రుడు సురవిరోధుల గురువు ! శుక్రుడు గురువు శత్రువే కద ! ఆయన నాకు ప్రసన్నుడవుతాడా ? అసంభవం !”*


*"సందేహాన్ని పరిత్యజించి , శుక్రుడిని ఆరాధించు , మహేంద్రా !”* బృహస్పతి గంభీరంగా అన్నాడు. *“శుక్రుడు కరుణిస్తాడు !”*


*"ఒక్క మాట చెప్పండి , గురుదేవా ! రాక్షసరాజు బలిచక్రవర్తి మిమ్మల్ని ఆరాధిస్తే అతనికి మీరు ప్రసన్నులవుతారా ?”*


*"తప్పక ప్రసన్నుడవుతాను ! తప్పదు ! అది మా విధి !”* బృహస్పతి చిరునవ్వుతో అన్నాడు. *"చరాచర ప్రపంచంలో అందరినీ శుభంగా , అశుభంగా , ఆగ్రహంతో , అనుగ్రహంతో వీక్షించే అధికారం త్రిమూర్తులు మా నవగ్రహాలకు ప్రసాదించారు. ఏ దైవమైనా నిన్ను కనికరించాలంటే , దానికి ముందుగా పునాది రూపంలో నవగ్రహాలలో అనుకూలంగా లేని గ్రహవీక్షణ శుభంగా మారాల్సిందే. నా మాటను విశ్వసించు ! ఐశ్వర్య వైభవ కారకుడైన శుక్రగ్రహ దేవతను ఆరాధించు !"* బృహస్పతి నొక్కి వక్కాణించాడు.


*"ఆజ్ఞ !"* ఇంద్రుడు వినయంగా అన్నాడు.


★★★★★★★★★★★★★★★★


అది శ్రావణమాసం. ద్వాదశ తిథి. శ్రవణా నక్షత్రయుక్త అభిజిత్ లగ్నం. సూర్య భగవానుడు ఆకాశ మధ్యంలో ప్రకాశించే మధ్యాహ్న సమయం. చంద్రుడూ , ఇతర గ్రహాలూ , నక్షత్రాలూ ఉచ్ఛస్థితిలో ఉన్న శుభఘడియలలో అదితి కుమారుణ్ణి ప్రసవించింది.


ఆ బాలకుడు గోరోచన వర్ణ వస్త్రంతో , మకర కుండలాలతో , శ్రీవత్సంతో మెరిసిపోతున్నాడు. చతుర్భుజుడుగా జన్మించిన ఆ శిశువు నాలుగు చేతులలో శంఖ చక్ర గదా పద్మాలను ధరించి ఉన్నాడు. కిరీటమూ , కంఠంలో కౌస్తుభమణీ , ఇతర హారాలూ దివ్యకాంతుల్ని వెదజల్లుతున్నాయి.


నాలుగు చేతులతో , ఆభరణాలతో , ఆయుధాలతో ఆ శిశువు తన గర్భవాసాన ఎలా ఉన్నాడో అన్న ఆలోచనలో పడింది అదితి. ఆశ్చర్యానందాలతో , భక్తి ప్రపత్తులతో అదితీ కశ్యపులు శిశురూపంలో ఉన్న శ్రీమహావిష్ణువును కీర్తించారు. మరుక్షణం ఆయుధాలతో , అలంకారాలతో , ఆభరణాలతో ఉన్న దివ్య స్వరూపాన్ని వదలి సామాన్య బాలక రూపాన్ని ధరించాడు. ఆ వెంటనే ఉపనయనానికి తగిన వయసుతో పొట్టివాడుగా రూపొందాడు. అదితి అబ్బురపాటు నుండి తేరుకుంది. ఆమెలో మాతృ వాత్సల్యం స్తన్యంగా పెల్లుబికింది. పొట్టిగా ఉన్న చిట్టి తండ్రిని అక్కున చేర్చుకుంది.


★★★★★★★★★★★★★★★★


నిర్వికల్పానంద చిరునవ్వుతో చూశాడు. *"ఇదీ వామనావతార గాథ ! బలిచక్రవర్తి స్వాధీనపరుచుకున్న స్వర్గసామ్రాజ్యాన్ని ఇంద్రుడికి అప్పగించే లక్ష్యంతో శ్రీమహావిష్ణువు వామనుడుగా అవతరించాడు.*


*“ఆ వామనుడు బలిచక్రవర్తి యాగానికి వెళ్ళడం , మూడడుగుల చోటు దాన మదగడం , దానం చేయబోయిన బలిని గురువు శుక్రాచార్యుడు వారించడం , జలధార పడకుండా శుక్రుడు సూక్ష్మ రూపం ధరించి కలశ రంధ్రానికి అడ్డుపడడం , కలశ రంధ్రాన్ని వామనుడు దర్భతో పొడవడం , ఫలితంగా శుక్రుడికి ఒక కన్ను పోవడం , దానంగా స్వీకరించిన సామ్రాజ్యాన్ని వామనరూప విష్ణువు ఇంద్రుడికి ప్రసాదించడం - అనే అంశాలు అందరికీ తెలిసినవే !"* నిర్వికల్పానంద ఆగాడు. 


*"గురువుగారూ... మరి శుక్రుడు..."* చిదానందుడు ఏదో అడిగే ప్రయత్నం చేశాడు.


*"అదే చెప్పబోతున్నాను , చిదానందా !"* నిర్వికల్పానంద నవ్వుతూ అన్నాడు. *"సరిగ్గా సమయానికి , ఇంద్రుడు చేసిన ధ్యాన పూర్వక శుక్రారాధన ఫలించింది ! ఇంద్రుడికి ప్రసన్నుడయ్యాడు. ఆయన మీద శుభవీక్షణలు ప్రసరించాడు...”* 


*"గురువుగారూ...ఒక సందేహం..."* విమలానందుడు వినయంగా అన్నాడు. *"శుక్రుడు వక్రంగా చూడడం , ఇంద్రుడు శుక్రుడిని ఆరాధించడం , ఆయన కరుణించడం అనే అంశాలు కొత్తగా ఉన్నాయి. యధార్థంగా ఆ సంఘటనలు జరిగాయా ?"*


నిర్వికల్పానంద చిరునవ్వు నవ్వాడు. *“వివరిస్తాను. జాగ్రత్తగా వినండి. కారణాన్ని ఆధారం చేసుకుని కార్యాన్ని , ఫలితాంశాన్ని గుర్తించడం ఒక పద్ధతి. తదనంతర కాలంలో జరిగిన కార్యాన్ని బట్టి కారణాన్ని ఊహించడం ఒక పద్ధతి. మొదటి పద్ధతిలాగే ఇది కూడా తర్కబద్ధమైనదే ! శాస్త్రీయమూ అయినదే ! ఎలాగంటే , ఒకసారి నువ్వు పగలంతా నిద్రలో మునిగిపోయావు. నువ్వు లేచేసరికి సూర్యుడు అస్తమిస్తున్నాడు. సాయం సమయంలో అస్తమిస్తున్న సూర్యుడు ఉదయాన ఉదయించాడా అని నువ్వు ఆలోచించవు. సూర్యోదయాన్ని చూడకపోయినా , ఉదయించాడని నిశ్చయంగా అనుకుంటావు. అది సత్యం కూడా !"*


*“అదే విధంగా , నవగ్రహాలలో ఒకానొక గ్రహం అశుభ దృష్టిని ప్రసరించబోతోందనీ , ఫలితంగా కష్టనష్టాలు సంభవిస్తాయనీ జ్యోతిషగణన చెప్తుంది – ముందుగా పరిశీలిస్తే. అలా కాకుండా , కష్టనష్టాలు వాటిల్లిన అనంతరం జాతక గణన చేస్తే , ఏ గ్రహ వీక్షణం అశుభంగా ఉన్న కారణంగా ఆ కష్టనష్టాలు సంభవించాయో చెప్తుంది జ్యోతిషం. రెండవ విశ్లేషణను ఆధారంగా తీసుకుని , ఇంద్రుడికి కలిగిన నష్టాలకూ , కష్టాలకూ కారణం - ఐశ్వర్యాన్నీ , వైభవాన్నీ కరుణించే శుక్రగ్రహ వక్రవీక్షణ అని అనుకోవడంలో తప్పులేదు.*


*"మరొక అంశం ఏమిటంటే శుక్రుడు అసుర గురువు. దేవతలకు సహజ శత్రువు.. ఆయన దేవరాజైన ఇంద్రుడిని క్రూరంగా చూడడంలో ఆశ్చర్యం లేదు. సందేహించాల్సిన అవసరమూ లేదు. నవగ్రహాలు దైవ స్వరూపాలు. ఆగ్రహించడంలో , అనుగ్రహించడంలో ఆ గ్రహదేవతలకు దేవ , దానవ , మానవ జాతులన్నీ సమానమే ! అదే ఆ గ్రహదేవతల ఔన్నత్యం ! కాబట్టి , తన శిష్యుడైన బలిచక్రవర్తి విజయం కోసం శుక్రుడు సురసార్వభౌముడైన ఇంద్రుడి మీద వక్రవీక్షణను ప్రసరించడంలోనూ , తదనంతరం ఇంద్రుడి ప్రార్థనను మన్నించి , వక్రదృష్టిని ఉపసంహరించి సక్రమ దృష్టిని ప్రసరించడంలోనూ - ఆశ్చర్యం ఏమీ లేదు !"*


*"గురువు గారూ ! మరొక సందేహం..."* శివానందుడు అన్నాడు. అడగమన్నట్టు నిర్వికల్పానంద తల పంకించాడు.


*“శుక్రుడు ఇంద్రుడికి ప్రసన్నం కావడం వల్ల బలిచక్రవర్తికి అన్యాయం జరిగింది కదా ? అది శుక్రుడికి మచ్చ కదా ?"*


*"కాదు ! తార్కికంగా ఆలోచిస్తే శుక్రుడు బలికీ , ఇంద్రుడికీ ఇద్దరికీ మహర్దశ కలిగించే ప్రయత్నమే చేశాడు. గురువుగా , మంత్రాలోచన చెప్పే మేధావిగా బలిచక్రవర్తిని దానం చేయవద్దంటూ వారించాడు. కలశ రంధ్రానికి అడ్డుపడ్డాడు. ఆ ప్రయత్నంలో కన్ను పోగొట్టుకున్నాడు. ఆ విధంగా గురువుగా తన విధిని నిర్వర్తించాడు. గ్రహదేవతగా ఇంద్రుడిని కరుణించాడు !"*


*"మీ విశ్లేషణ చక్కటి సమన్వయంతో , తార్కికంగా తృప్తి కలిగించే విధంగా సాగింది , గురువుగారూ !"* సదానందుడు మెప్పుగా అన్నాడు.


*"స్పష్టంగా లేని విషయాలను తార్కికమైన సమన్వయంతో సాధించి , నిర్ధారణ చేయాలి. మీకు చక్కటి అవగాహన కలగడానికి మరొక ఉదాహరణ చెప్తాను. వధూవరులకు వివాహం జరిగింది. కాలక్రమంలో వాళ్ళకు కొడుకు పుట్టాడు. అరె ! కొడుకు పుట్టాడే... ఆ ఇద్దరి మధ్యా దాంపత్యం సాగిందా ? అని అనుమానించడం ధర్మం కాదు కదా ! మన కంటికి కనిపిస్తున్న కొడుకుని ఆధారంగా చేసుకుని , ఆ ఇద్దరి మధ్యా దాంపత్యం జరిగిందనీ , అది ఫలించిందనీ నిర్ధారణగా అనుకుంటాం కద ! ఇదీ అంతే ! ఇంద్రుడికి జరిగిన వైభవ నష్టం , ఐశ్వర్య నష్టం ఇవన్నీ శుక్రగ్రహ దుర్వీక్షణ ఫలితమే అని లెక్కగట్టడం అపరాధం కాదు. ఈ విషయాన్ని ఇంతటితో వదిలేసి - శనిగ్రహ మహిమను శ్రవణం చేద్దాం !"* నిర్వికల్పానంద వివరించాడు.


*రేపటి నుండి శనిగ్రహ మహిమ ప్రారంభం*

 

👆 *సేకరణ:-  శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐

భండనభీముఁడార్తజన బాంధవు

 చొప్పకట్ల

  శు భో ద యం!


"భండనభీముఁడార్తజన బాంధవు డుజ్జ్వలబాణతూణ కో

దండ కళా ప్రచండ భుజతాండవకీర్తికి రామమూర్తికిన్

రెండవసాటి దైవ మికలేడనుచున్ గడఁగట్టి భేరికా

డాండ డడాండ డాండ నినదంబు లజాండమునిండ మత్త వే

దండము నెక్కి సాటెదను దాశరధీ! కరుణాపయోనిధీ!!

            -రామదాసకృతము.

జగద్గురువుల పరంపర

 అవిచ్ఛిన్న జగద్గురువుల పరంపర

పూరి 145మంది

ద్వారకా 78మంది

బదరీ 46మంది ( విచ్చిన్నం)

శృంగేరి 37మంది

కంచి 70మంది 


జగద్గురువులు

 పూరి పీఠం ( గోవర్ధన మఠం) 145 అధిక సంఖ్యలో ఉన్నారు , అక్కడి పీఠాధిపతులు కొద్ది సంవత్సరాలు మాత్రమే పీఠాధిపత్యం నిర్వహించి, తదుపరి ఉత్తరాధికారికి పీఠాధిపత్యం ఇచ్చివేసి వారు ,ఆత్మ నిష్టలో ఉండిపోయేవారు , అందువలన పూరీకి అత్యధిక జగద్గురువులు కలిగి ఉన్నారు.


ఇక బదరీ విషయానికి వస్తే , దురదృష్టవశాత్తు 165 సంవత్సరాలకు పూర్వం బదరీ పీఠ జగద్గురు పరంపర

విచ్చిన్నమయ్యింది ( ఆగిపోయింది) మరలా దాన్ని  విదేహముక్తులు అయినటువంటి జగద్గురు శ్రీ బ్రహ్మానంద సరస్వతి స్వామి వారి పునరుద్ధరించారు ,

ఆ తర్వాత శ్రీ కృష్ణబోదాశ్రమ స్వామి వారు ఆ తరువాత  శ్రీ స్వరూపానంద సరస్వతి స్వామి ఇప్పుడు ప్రస్తుత పీఠాధిపతిగా జగద్గురు శ్రీ అవిముక్తానంద  స్వామి వారు కొనసాగుతున్నారు, 


అన్నిటికంటే అత్యంత స్వల్ప ( తక్కువ) పీఠాధిపతుల సంఖ్య శృంగేరికి మాత్రమే కలిగి ఉన్నది , కారణం వారు శ్రీ ఆది శంకరాచార్యుల వారిని క్రీస్తు శకం 788 సంవత్సరంలో జన్మించారని పరిగణిస్తారు , 

అనగా ఇప్పటికీ 1232 సంవత్సరాలు  అయినది

కావున వారి సంఖ్య 37 మంది మాత్రమే ఉన్నారు, 

ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే , 

మిగతా ప్రముఖ నాలుగు పీఠాలు అయినా బదరీ పూరీ ద్వారకా కంచి పీఠాలు మాత్రం శంకరాచార్య స్వామి వారు క్రీస్తుపూర్వం 509 వ సంవత్సరంలో జన్మించారని సత్యాన్ని తెలియజేస్తున్నాను

అందువలన వారి పీఠాధిపతుల సంఖ్య హెచ్చుగా ఆ సంవత్సరానికి సరిపోయే విధంగా ఉన్నది, 


ఆదిశంకరాచార్య స్వామి జనన  కాలం భారత ప్రభుత్వం వారు ఇప్పటికీ అధికారికంగా క్రీస్తు శకం 788 అనే చెబుతున్నారు ఎందువలన అంటే

భారత  చరిత్రను ఆంగ్లేయులు మరియు కమ్యూనిస్టులు రచించారు, వారు అనేక కుట్రల ద్వారా భారత చరిత్ర చాలా హీనంగా హేయంగా చిత్రీకరించారు, అందువలన ఆదిశంకరాచార్యుల జన్మ సంవత్సరాన్ని దాదాపు 1500 సంవత్సరాలు తగ్గించేశారు, 

ఈ విషయాన్ని అనేక భారత సాంప్రదాయ చరిత్రకారులు సాధికారికంగా ఖండించారు

అనేక కోణాలలో ప్రమాణాలు చూపించారు

అయినా ఇప్పటికే మన భారత దేశ చరిత్ర మార్చబడలేదు, 

దురదృష్టవశాత్తు దానినే జగద్గురు పీఠమైనటువంటి శృంగేరి శారదా పీఠం వారు కూడా క్రీస్తు శకం 788 ప్రమాణంగా తీసుకోవడం చాలా బాధాకరం.

అందువల్లనే శృంగేరి జగద్గురుల పరంపర 37 మాత్రమే ఉంటుంది, 

జయ జయ శంకర హర హర శంకర,

సుభాషితమ్

 💎🌅  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 ॐ卐  *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎


// *శ్లోకం* // 


*కంఠగతై ర్యసుభికస్య*    

*హ్యాత్మా నశక్యతే జేతుమ్*!    

*మూర్ఖ స్యశంకితస్యచ*,          

*విషాదినోవా కృతఘ్నస్య*!!!!!      


/- *_సంస్కృత సూక్తి సుధ_* /-


భావము -  *చావుకు సిద్ధమై ఉండికూడా ఎవరి చిత్తం వశం కాకుండా ఉంటుంది... మూర్ఖుడు, ప్రతి విషయంలోనూ సంశయించేవాడు, ఎప్పుడూ దుఃఖించే స్వభావం కలవాడు, చేసిన మేలు మరచేవాడు---- మరణం ఆసన్నమైవున్నా ఆత్మను జయించలేరు*.....

శ్రీమద్భగవద్గీత

 🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

*శ్రీమద్భగవద్గీత - 2వ అధ్యాయము* 

. *సాంఖ్య యోగము*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹 

ఈ అధ్యాయములో అర్జునుడు, పరిస్థితిని తట్టుకోవడంలో ఉన్న తన పూర్తి అశక్తతని పునరుద్ఘాటించి, ఆసన్నమైన యుద్దంలో తన విధిని నిర్వర్తించడానికి నిరాకరించాడు. ఆ తరువాత శ్రీ కృష్ణుడిని తన ఆధ్యాత్మిక గురువు గా ఉండమని పద్ధతి ప్రకారముగా, మర్యాదపూర్వకంగా ప్రాధేయపడి, తను ఉన్న ఈ పరిస్థితిలో ఏమి చెయ్యాలో తనకు దిశానిర్దేశము చేయమని శ్రీ కృష్ణుడిని బ్రతిమాలతాడు. శరీరము నశించినా, నశించిపోని, మరణము లేని ఆత్మ గురించి చెప్పటం ద్వారా దివ్య జ్ఞానాన్ని విశదీకరించటం ప్రారంభిస్తాడు, ఆ పరమాత్మ. ఒక మనిషి పాత బట్టలు తీసివేసి కొత్త బట్టలు ఎలాగైతే వేసుకుంటాడో ఆత్మ అనేది కేవలం ఒక జీవిత కాలం నుండి ఇంకో జీవిత కాలానికి శరీరాలను మార్చుకుంటుంది. ఆ తరువాత శ్రీ కృష్ణుడు సామాజిక భాధ్యతల గురించి ప్రస్తావిస్తాడు. ధర్మాన్ని పరిరక్షించడానికి యుద్ధం చేయవలసిన తన క్షత్రియ భాద్యతలను అర్జునుడికి గుర్తుచేస్తాడు. సామాజిక భాధ్యతని నిర్వర్తించటం ఒక పవిత్రమైన ధర్మమని, అది ఉత్తమ గతుల వైపు దారి చూపుతుందని, అదేసమయంలో, కర్తవ్య ఉల్లంఘన వలన అవమానము, తలవంపు, అపకీర్తి కలుగుతాయని చెప్తాడు.

అర్జునుడిని లౌకిక స్థాయి నుండి పైకి తీసిన శ్రీ కృష్ణుడు, తదుపరి, కర్మ శాస్త్రాన్ని లోతుగా విశదీకరిస్తాడు. కర్మ ఫలాలపై అనురక్తి పెంచుకోకుండా కర్మలను ఆచరించమని అర్జునుడికి సూచిస్తాడు. ప్రతిఫలాన్ని ఆశించకుండా కర్మలని ఆచరించడాన్ని 'బుద్ధి యోగము' అన్నాడు. బుద్దిని ఉపయోగించి మనము కర్మ ప్రతిఫల కాంక్షని నిగ్రహించాలి. ఇలాంటి దృక్పథంతో పని చేస్తే, బంధాన్ని కలిగించే కర్మలే, బంధ-నాశక కర్మలుగా మారిపోయి, అర్జునుడు దుఃఖ రహిత స్థితిని చేరుకుంటాడు.

దివ్య జ్ఞానం లో ఉన్న వారి లక్షణాల గురించి అర్జునుడు అడుగుతాడు. దానికి జవాబుగా, శ్రీ కృష్ణుడు, ఆధ్యాత్మిక జ్ఞానం లో ఉన్న వారు మోహము, భయం, కోపములకు అతీతంగా ఎలా ఉంటారో విశదీకరించాడు. వారు సుఖః-దుఃఖాలను సమానంగా స్వీకరిస్తూ, అన్ని పరిస్థితులలో ప్రశాంతంగా ఉంటారు; వారి ఇంద్రియములు నిగ్రహించబడి ఉంటాయి; వారి మనస్సు ఎప్పుడూ భగవంతునిలో లీనమై ఉంటుంది; మానసిక క్లేశములైన - కామము, క్రోధము, లోభములు - ఎలా ఎదుగుతాయో, వాటిని ఎలా నిర్మూలించవచ్చో, దశల వారీగా శ్రీ కృష్ణుడు విశదీకరిస్తాడు.

🌹🪷🌹🪷🌹🪷🌹🪷🌹🪷

. *🌹శ్రీమద్భగవద్గీత🌹*

. *రెండొవ అధ్యాయము* 

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐

. *సాంఖ్య యోగము*

. *శ్లోకము 01*

🌹🪷🌹🪷🌹🪷🌹🪷🌹🪷


*సంజయ ఉవాచ ।*

*తం తథా కృపయావిష్టమశ్రుపూర్ణాకులేక్షణమ్ ।*

*విషీదంతమిదం వాక్యమువాచ మధుసూదనః ।।*


*భావము:* 

సంజయుడు పలికెను : జాలి నిండినవాడై, శోకతప్త హృదయంతో, కంటి నిండా నీరు నిండిపోయున్న అర్జునుడిని చూసిన, శ్రీ కృష్ణుడు ఈ విధంగా పలికెను.

 

*వివరణ:*

అర్జునుడి మనో భావాలని వర్ణించడానికి సంజయుడు, 'కృపయా', అంటే జాలి లేదా కరుణ, అన్న పదం వాడాడు. ఈ కరుణ రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి- ఈశ్వర విముఖత వల్ల భౌతిక జగత్తులో వేదనని అనుభవిస్తున్న జీవాత్మలపై భగవంతుడికి, సత్పురుషులకు కలిగే దివ్యమైన కరుణ. మరియొకటి - ఎదుటివారిలో శారీరిక కష్టాలని చూసినప్పుడు మనకు కలిగే భౌతికమైన కరుణ. భౌతికమైన కరుణ ఒక మహనీయమైన భావమే కానీ అది సంపూర్ణంగా సరియైనదే అని చెప్పలేము. అది, కారులో డ్రైవర్ ఆహారం లేక ఆకలితో అలమటించి పోతుంటే, కారు పరిస్థితి గురించి ఆలోచించినట్టుగా ఉంటుంది. అర్జునుడు ఈ రెండవ శ్రేణి మనోభావం అనుభవిస్తున్నాడు. యుద్ధం కోసం చేరివున్న శత్రువులపై అతనికి భౌతికమైన కారుణ్యం పెల్లుబికింది. అర్జునుడి నిరాశ, శోకం తో తల్లడిల్లిపోతున్న పరిస్తితి చూస్తే, అతనికే కనికరము అవసరం వుంది అని తెలుస్తోంది. కాబట్టి తను వేరే వారి మీద దయతో ఉండటం అనేది అర్థరహితమైనది.

ఈ శ్లోకం లో శ్రీ కృష్ణుడు “మధుసూదనా” అని పిలవబడ్డాడు. మధు అనే రాక్షసుడిని సంహరించాడు కాబట్టి ఆయనకు ఆ పేరు వచ్చింది. ఇక్కడ అర్జునుడి మనస్సులో జనించిన, స్వధర్మాన్ని నిర్వర్తించటానికి అడ్డుగావున్న, అనుమాన రాక్షసిని మట్టుబెట్టబోతున్నాడు.



👆 *సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

వేమన పద్యములు

 🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

. *🌹వేమన పద్యములు🌹* 

. *అర్థము - తాత్పర్యము*

. *Part - 9*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹


*💥వేమన పద్యాలు-- 22*

      

*అండమండము గన నన్నియు నటుపిండ*

*మండమెట్లో బమ్మ యండ మట్లే*

*కర్మబంధమునను గానరే యీ నరుల్* 

*విశ్వదాభిరామ రామ వినుర వేమా !*


*🌹తాత్పర్యము --*

కర్మను ఎవరూ తప్పించలేరు గదా !

అండ పిండ బ్రహ్మాండములు కర్మబంధమునకు మూలములు.


*💥వేమన పద్యాలు -- 23*

 

*అండమందునుండు నఖిలమై జనులార*

*ఎందులేక యుండు నెరుగు నతడె*

*యతని పూజఫలము నందె నాశివయోగి* 

*విశ్వదాభిరామ రామ వినుర వేమా !*


*🌹తాత్పర్యము --*

మనిషి పూజాఫలమే శివ సాక్షాత్కారమునకు ముఖ్యము.


*💥 వేమన పద్యాలు -- 24*

 

*అండములో నాకాశం*

*బుండంగా జూడ జూడ నొనరగ దీపై*

*యుండును నంతయు దెలిసిన*

*మెండుగ నొక ముక్తి కాంత మెలగుర వేమా*


*🌹తాత్పర్యము --*       

సర్వజ్ఞునికి మోక్షము సులభము.

ముక్తి కాంత సర్వజ్ఞుని మెచ్చుకొనును.


*పార్వతీపరమేశ్వరుల దివ్య ఆశీస్సులు అందరిపై ఉండాలని మనసారా కోరుకుంటూ అందరికీ శుభరాత్రి* 


*సర్వేజనా సుఖినోభవంతు*


👆 *సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

భాగవతము

 🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹

*🌹పోతనామాత్యులవారి భాగవతము నందలి ఆణిముత్యాలు🌹*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

*తృతీయ స్కంధము*


*హరి నరుల కెల్లఁ బూజ్యుఁడు*

*హరి లీలామనుజుఁడును గుణాతీతుఁడు నై*

*పరఁగిన భవ కర్మంబులఁ*

*బొఁరయం డఁట హరికిఁ గర్మములు లీల లగున్.*


మహానుభావా! ఉద్ధవా! కర్మవశం వలన పుట్టిన జీవులందరికీ శ్రీహరి పూజింప దగినవాడు. ఆయన కోరికోరి కొన్ని మహాకార్యాలను చేయటానికి భూమిపై పుడుతూ ఉంటాడు. అందువలననే ఆయనను లీలామనుజుడు అంటారు. జీవులందరు సత్త్వము, రజస్సు, తమస్సు అనే గుణాలనుబట్టి మెలగుతూ ఉంటారు. దానివలన వారు బంధాలను వదలించుకోలేరు. కానీ శ్రీహరి గుణాలకు లోబడినవాడుకాడు. కాబట్టి ఆయనకు కర్మబంధాల అంటుసొంటులు ఉండవు. ఆయన చేసే కర్మములు ఆ విధంగా లీలలు అవుతాయి.


👆 *సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹

నేటివేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే!*

               🌷🌷🌷

ప్రముఖ వేదపండితులు, *బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* గారి నేటివేద ఆశీర్వచనం *(25-01-2024 గురువారం)* 


https://youtu.be/HTjWSJKqiRk?si=58yFLC17Clb8rWuk


🙏🙏

రాశిఫలాలు

 ☘️🙏🕉️శ్రీ గురుభ్యోనమః🕉️🙏☘️


•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━

*25-01-2024 / గురువారం / రాశిఫలాలు*

•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━

మేషం


వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగమున అధికారుల ఆగ్రహానికి గురి అవుతారు. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. చేపట్టిన పనులు కష్టసాద్యంతో పూర్తవుతాయి. స్ధిరాస్తి వ్యవహారాలలో పెద్దలతో మాటపట్టింపులు తప్పవు. సంతాన విద్యా విషయాలు నిరుత్సాహపరుస్తాయి.

---------------------------------------

వృషభం


సోదరులతో మనస్పర్ధలు తొలగుతాయి. గృహ వాతావరణం సంతోషకరంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో కీలక నిర్ణయాలు తీసుకుని లాభాలు అందుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాలలో స్వంత ఆలోచనలు కలసి వస్తాయి. అవసరానికి ఇతురుల నుండి ధన సహాయం అందుతుంది. నూతన ఉద్యోగ అవకాశలు అందుతాయి.

---------------------------------------

మిధునం


నూతన వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. నిరుద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగులకు అధికారుల నుండి ఒత్తిడి తప్పవు. నేత్ర సంభందిత అనారోగ్య సమస్యలు కొంత బాధిస్తాయి. చేపట్టినపనులు మందకొడిగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి గంధరగోళంగా ఉంటుంది. దైవ చింతన పెరుగుతుంది.

---------------------------------------

కర్కాటకం


సంతాన విద్యా ఉద్యోగం విషయాలు సంతృప్తి కరంగా సాగుతాయి. వ్యాపారాలలో ఆశించిన విధంగా రాణిస్తారు. సంఘంలో  గౌరవ మర్యాదలకు లోటుండదు. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి. దూరపు బంధువుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది.

---------------------------------------

సింహం


ఆదాయనికి మించి ఖర్చులు పెరుగుతాయి. ఋణదాతల ఒత్తిడి పెరుగుతుంది. ఉదర సంబంధ అనారోగ్య సమస్యలు భాదిస్తాయి. చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. వ్యాపారాలలో ఊహించని సమస్యలు ఎదురవుతాయి. వృత్తి ఉద్యోగాలలో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.

---------------------------------------

కన్య


సంఘంలో ప్రముఖుల నుండి విశేషమైన ఆదరణ లభిస్తుంది. సంతాన ఉద్యోగ వివాహ ప్రయత్నాలు  సత్ఫలితాలు ఇస్తాయి. ధన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. గృహమున సంతాన శుభకార్య విషయమై ప్రస్తావన వస్తుంది. ముఖ్యమైన పనులు బంధు మిత్రుల సహాయ సహకారాలతో పూర్తి చేస్తారు.

---------------------------------------

తుల


ఉద్యోగమున చాలా కాలంగా వేదిస్తున్న సమస్యలు పరిష్కరించుకుంటారు. వ్యాపార వ్యవహారాలు  ఆశాజనకంగా సాగుతాయి. ఇంటాబయటా అనుకూల వాతావరణం  ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో స్వంత ఆలోచనలతో ముందుకు సాగడం మంచిది. బంధువులలో చిన్నపాటి వివాదాలు ఉంటాయి. దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు.

---------------------------------------

వృశ్చికం


ఒక వ్యవహారంలో ఇతరుల ప్రవర్తన వలన మానసిక అశాంతి కలుగుతుంది. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు   విఫలమౌతాయి. కుటుంబ సభ్యులతో చిన్నపాటి మాటపట్టింపులుంటాయి. చేపట్టిన పనులు మధ్యలో నిలిచిపోతాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. 

---------------------------------------

ధనస్సు


వృత్తి వ్యాపారాలలో గందరగోళ పరిస్థితులుంటాయి. నిరుద్యోగులకు అతి కష్టం మీద అల్ప ఫలితం పొందుతారు. ఉద్యోగాలలో  బాధ్యతలు మరింత అధికమౌతాయి. దూర ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది.  కొన్ని వ్యవహారాలు సమస్యాత్మకంగా సాగుతాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. 

---------------------------------------

మకరం


ఉద్యోగమున అధికారుల ఆదరణ పెరుగుతుంది. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో జీవిత భాగస్వామి సలహాలు కలసి వస్తాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.

---------------------------------------

కుంభం


బంధు మిత్రులతో  సఖ్యత పెరుగుతుంది. వ్యాపారాలలో  శత్రు సమస్యలు నుండి తెలివిగా బయటపడతారు. ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది. ఆర్థిక  ఆలోచనలు అనుకూలంగా సాగుతాయి. వృత్తి  ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు. సన్నిహితులతో గృహమున ఆనందంగా గడుపుతారు.

---------------------------------------

మీనం


నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. దూరప్రాంత బందు మిత్రుల నుండి శుభవార్తలు అందుతాయి. ఉద్యోగమున మంచి పనితీరుతో అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు. కీలక సమయంలో మంచి ఆలోచన జ్ఞానంతో ముందుకు సాగుతారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.

•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━

🍁 *శుభం భూయాత్* 🍀