5, డిసెంబర్ 2023, మంగళవారం

 వ్యాధుల చికిత్సలో ఉపయోగించవలసిన పచ్చి కూరగాయల రసాలు  - 


 ప్రియమితృలకు నమస్కారం ,


      ఇప్పుడు నేను  చెప్పబోయే    పచ్చికూరగాయలు మరియు ఆకుకూరల పచ్చి రసాలు మీరు వ్యాధి నివారణ కొరకు తీసుకునే ఔషదాలు కు అనుబంధంగా తీసుకుంటూ ఉంటే మరింత తొందరగా మీరు అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. 


 *  ఉబ్బసం , తీవ్ర జ్వరాల కొరకు  - 


      పచ్చి క్యారెట్ , తొటకూర , కూరాకు ( endive ) రసాలను కలిపి తీసుకొనిన చాలా బాగా పనిచేస్తుంది .


 *  మొటిమలు మరియు కాలిన బొబ్బలకు - 


        క్యారెట్ మరియు బీట్ రూటు రసాలను కలిపి వాడవలెను. ( పచ్చిరసం మాత్రమే ).


 *  గాస్ట్రిక్ సమస్య కొరకు  - 


        తోటకూర మరియు క్యారెట్ పచ్చిరసాలను రెండు పూటలా రెండు గ్లాసుల 

మోతాదుగా తాగవలెను .


 *  గొంతు మీద వచ్చు కాయ ( goiter) కొరకు 


         క్యారెట్ మరియు వాటర్ క్రెస్ రసములను వాడవలెను .


 *  గుండె సమస్యల కొరకు  - 


         క్యారెట్ మరియు బీట్ రూట్ రసమును వాడవలెను.


 *  మూలవ్యాది కొరకు  - 


         క్యారెట్ మరియు కొత్తిమీర ఆకు కూర రసంని తాగించవలెను . 


 *   అజీర్ణ వ్యాధి కొరకు  - 


         క్యారెట్ మరియు తోటకూర రసం తాగవలెను .


 *  ఎక్కువుగా ఉన్న రక్తపోటు కొరకు  - 


         తోటకూర మరియు బీట్రూట్ మరియు క్యారెట్ రసంని వాడవలెను .


 *  నిద్రసరిగ్గా పట్టనందుకు  - 


          పడుకునే ముందు తోటకూర రసంని తాగవలెను .


 *   మూత్రపిండాల బాధల కొరకు  - 


           క్యారెట్ మరియు parsly అని కొత్తిమీర వంటి ఆకురసం తాగవలెను . జలోదరం అనగా పొట్ట నిండా నీరు చేరు రోగం కు కూడా ఇదే రసాల్ని వాడవలెను .


 *   కాలేయ సమస్యల కొరకు  - 


        క్యారెట్ , బీట్ రూట్ మరియు దోసకాయ   

రసాలని వాడవలెను .గాల్ బ్లాడర్ సమస్యలకు కూడా ఈ రసాలని తాగవలెను .


 *   నరాల బాధల కొరకు  - 


        తోటకూర మరియు లెట్యూస్  పచ్చి రసాలని తాగవలెను .


 *   అధిక బరువు తగ్గించుట కొరకు  - 


        తోటకూర , క్యారెట్ మరియు క్యాబేజ్ రసాలని తాగవలెను .


 *   హృదయంకి నల్ల రక్తం తీసుకుని పోవు సిరలని బాగు చేయుట కొరకు  - 


          క్యారెట్ , బీట్ రూట్ మరియు తోటకూర రసంలని తాగవలెను .


 *   క్షయ వ్యాధి నివారణ కొరకు  - 


          పచ్చి బంగాళా దుంపలు రసం పిండి ఒక గిన్నెలొ పోసి దానిలో పిండిపదార్థాలు అడుగుకు పేరుకొనునట్లు చేసి పైన రసముని ఒక గ్లాసుడు , అంతే పరిమాణంలో మరొక గ్లాసుడు బీట్రూట్ రసంని కలిపి దానిలో ఒక చెంచాడు ( tea spoon ) ఆలివ్ ఆయిల్ చేర్చి నురుగు వచ్చేవరకు చిలికి ఆ రసంని రోజుకి రెండు మూడు సార్లు ఇచ్చుచుండవలెను .


 *   అల్సర్ , పెద్ద పేగుల్లో వాపు ( colitis) సమస్య నివారణ కొరకు  - 


       క్యారెట్ లేదా క్యాబిజి రసం తీసికొనవలెను 


 *   సిరలకు సంబందించిన వ్యాధి కొరకు  - 


        క్యారెట్ , స్పినాచ్ మరియు turnip tops రసమును తీసుకొనుచుండవలెను .


 *  ఎడినోయిడ్స్ , టాన్సిల్స్ వ్యాధుల కొరకు 


         టమోటా మరియు బీట్రూట్ రసాలు లేక క్యారెట్ మరియు బీట్రూట్ రసాలు కలిపి తాగవలెను .


 *  రక్తహీనత కొరకు  - 


          క్యారెట్ మరియు తోటకూర మరియు పాలకూర లేక క్యారెట్ మరియు బీట్రూట్ రసాలని కలిపి తాగవలెను .


 *  సంధివాతం  - 


          తోటకూర మరియు క్యారెట్ రసాలు తాగవలెను . 


 *  ఉబ్బసం , రొమ్ము పడిశం , జలుబు నివారణ  కొరకు  - 


      ఒక ఔన్స్ ముల్లంగి తురుము , ఒక ఔన్సు నిమ్మరసం తో కలిపి రోజుకి రెండు సార్లు అరచెంచా చొప్పున తీసుకుంటూ క్యారెట్ , ముల్లంగి రసాలు తీసుకోవాలి . 


        మీగడ, ఐస్క్రీమ్ , గుడ్లు, పిండిపదార్థాలు చక్కెర బుజించరాదు . 


 *  కాన్సర్ , శరీరం పైన కలిగెడి కాయలు , ఉబ్బు , వాపులు , శరీరంలో నీరు చేరుట , ఉపిరితుత్తులలో సమస్యల కొరకు  - 


      క్యారెట్ , లెట్యుస్ , తోటకూర రసాలను సేవించాలి . 


 *  రక్తప్రవాహంలోని దోషాల కొరకు  - 


      క్యారెట్ , బీట్రూట్ రసాలను కలిపి సేవించాలి . 


 *  మలబద్దకం సమస్య నివారణ కొరకు  - 


        క్యాబేజి , తోటకూర , పాలకూర రసాలు కలిపి కాని లేక తోటకూర రసంని నిమ్మరసం కలిపికాని సేవించవలెను . 


 *  మధుమేహము కొరకు  - 


        తోటకూర , క్యారెట్ , తీగ చిక్కుడు రసాలని సేవించాలి . 


 *  చర్మవ్యాధులు కొరకు  - 


         క్యారెట్ , బీట్రూట్, తోటకూర రసాలని కలిపి సేవించాలి . 


 *  కంటిజబ్బులు  - 


         క్యారెట్ మరియు parsly అనగా కొత్తిమీర వలే ఉండు ఆకుకూర రసాలని సేవించవలెను . 


 *  మూత్రావయవాలలో రాళ్లు , పిత్తాశయంలో రాళ్లు కరుగుట కొరకు  - 


       క్యారెట్ , బీట్రూట్ , దోసకాయ రసాలను సేవించవలెను . 


 గమనిక  - 


           పైన చెప్పిన సమస్యలకు ఔషదాలు వాడుకుంటూ పచ్చి కూరగాయలు , ఆకు కూరల రసాలని సేవించాలి . ఫలితం తొందరగా వస్తుంది.


            మంచి ఫలితాలు పొందవలెను అనుకుంటే రోజుకి కనీసం 180ml రసాన్ని లొపలికి తీసుకోవాలి . శీఘ్రంగా ఫలితం రావాలి అనుకునే వారు రోజుకి రెండు లేదా మూడుసార్లు సేవించవచ్చు . అయితే బీట్రూట్ రసం , parsly రసం మరియు water  kres రసములను మరియు మితముగా తీసికొనవలెను . 6 ఔన్సుల మించి వాడరాదు. పైన చెప్పిన రసాల్లో ఏవైనా ఎక్కువ తీసుకోవాలి అంటే 180 ml వరకు తీసుకోవచ్చు . ఎక్కువ మోతాదులో తీసుకోవలసిన అవసరం వస్తే క్యారెట్ రసం గాని , తొటకూర రసంతో గాని తీసుకోవలెను . 


  

   ఆయుర్వేదములోని ఎన్నొ రహస్య మూలికల అనుభవ యోగాల గురించి నా గ్రంథాల యందు సంపూర్ణముగా , అందరికి అర్థమయ్యే సులభ భాషలో వివరించాను . వాటిని చదివి మరింత విజ్ఞానాన్ని పొందగలరు . 


 గమనిక  -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


            

        ఈ గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా ఫొన్ చేయండి  . సంప్రదించవలసిన నెంబర్ 

                   

                        9885030034 


         మెస్సేజిస్ , కామెంట్ల రూపంలో పెట్టవద్దు .


                  


     కాళహస్తి వేంకటేశ్వరరావు 


  అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


          9885030034

 ఈ మెసేజ్ మళ్ళా దొరకదు.. అరుదైన సమాచారం. దీనిని   తయారు  చేయడానికి  ఒక  రోజు  పట్టింది

ఈ తరం పిల్లలకు నేర్పించండి. చదివించండి మరియు మనం కూడా మరోసారి మననం చేసుకుందాం.

దిక్కులు : (1) తూర్పు, (2) దక్షిణం, (3) పడమర, (4) ఉత్తరం

మూలలు :(1) ఆగ్నేయం, (2) నైరుతి,(3) వాయువ్యం, (4) ఈశాన్యం

వేదాలు :(1) ఋగ్వే దం,

(2) యజుర్వేదం,(3) సామవేదం,

(4) అదర్వణ వేదం

పురుషార్ధాలు :(1) ధర్మ, (2) అర్థ,

(3) కామ,(4) మోక్షా

పంచభూతాలు :(1) గాలి, (2) నీరు,

(3) భూమి,(4) ఆకాశం,(5) అగ్ని.

పంచేంద్రియాలు : (1) కన్ను,

(2) ముక్కు, (3) చెవి, (4) నాలుక,

(5) చర్మం.

లలిత కళలు : (1) కవిత్వం,

(2) చిత్రలేఖనం, (3) నాట్యం,

(4) సంగీతం, (5) శిల్పం.

పంచగంగలు : (1) గంగ, (2)  కృష్ణ,

(3) గోదావరి, (4) కావేరి,

(5) తుంగభద్ర.

దేవతావృక్షాలు : (1) మందారం,

(2) పారిజాతం, (3) కల్పవృక్షం,

(4) సంతానం, (5) హరిచందనం.

పంచోపచారాలు : (1) స్నానం,

(2) పూజ,  (3) నైవేద్యం,

(4) ప్రదక్షిణం, )5) నమస్కారం.

పంచామృతాలు : (1) ఆవుపాలు,

(2) పెరుగు, (3) నెయ్యి, (4) చక్కెర,

(5) తేనె.

పంచలోహాలు : (1) బంగారం,

(2) వెండి,  (3) రాగి,

(4) సీసం, (5) తగరం.

పంచారామాలు : )1) అమరావతి,

(2) భీమవరం, (3) పాలకొల్లు,

(4) సామర్లకోట, (5) ద్రాక్షారామం

షడ్రుచులు : (1) తీపి, (2) పులుపు,

(3) చేదు, (4) వగరు,

(5) కారం, (6) ఉప్పు.

అరిషడ్వర్గాలు  షడ్గుణాలు:(1) కామం,

(2) క్రోధం, (3) లోభం, (4) మోహం,

(5) మదం, (6) మత్సరం.

ఋతువులు : (1) వసంత,(2) గ్రీష్మ,

(3) వర్ష, (4) శరద్ఋతువు,

(5) హేమంత, (6) శిశిర

సప్త ఋషులు : (1) కాశ్యపుడు,

(2) గౌతముడు,  (3) అత్రి,

(4) విశ్వామిత్రుడు, (5) భరద్వాజ,

(6) జమదగ్ని, (7) వశిష్ఠుడు.

తిరుపతి సప్తగిరులు : (1) శేషాద్రి,

(2) నీలాద్రి, (3) గరుడాద్రి,

(4) అంజనాద్రి, (5) వృషభాద్రి,

(6) నారాయణాద్రి, (7) వేంకటాద్రి.

సప్త వ్యసనాలు : (1) జూదం,

(2) మద్యం, (3) దొంగతనం,

(4) వేట, (5) వ్యభిచారం,

(6) దుబారఖర్చు,

(7) కఠినంగా మాట్లాడటం.

సప్త నదులు : (1) గంగ,

(2) యమునా,  (3) సరస్వతి,

(4) గోదావరి,  (5) సింధు,

(6) నర్మద,  (7) కావేరి.

నవధాన్యాలు : (1) గోధుమ,

(2) వడ్లు,  (3) పెసలు,

(4) శనగలు, (5) కందులు,

(6) నువ్వులు, (7) మినుములు,

(8) ఉలవలు, (9) అలసందలు.

నవరత్నాలు : (1) ముత్యం,

(2) పగడం, (3) గోమేధికం,

(4) వజ్రం, (5) కెంపు, (6) నీలం,

(7) కనకపుష్యరాగం,

(8) పచ్చ (మరకతం),

(9) ఎరుపు (వైడూర్యం).

నవధాతువులు : (1) బంగారం,

(2) వెండి, (3) ఇత్తడి, (4) రాగి,

(5) ఇనుము, (6) కంచు,

(7) సీసం, (8) తగరం,

(9) కాంతలోహం.

నవరసాలు : (1) హాస్యం,(2) శృంగార,

(3) కరుణ, (4) శాంత, (5) రౌద్ర,

(6) భయానక, (7) బీభత్స,

(8) అద్భుత, (9) వీర

నవదుర్గలు : (1) శైలపుత్రి,

(2) బ్రహ్మ చారిణి, (3) చంద్రఘంట,

(4) కూష్మాండ, (5) స్కందమాత,

(6) కాత్యాయని, (7) కాళరాత్రి,

(8) మహాగౌరి, (9) సిద్ధిధాత్రి.

దశ సంస్కారాలు : (1 ) వివాహం,

( 2 ) గర్భాదానం, (3 ) పుంసవనం ,

(4 ) సీమంతం, (5) జాతకకర్మ,

(6 ) నామకరణం, (7) అన్నప్రాశనం,

(8 ) చూడకర్మ, (9 ) ఉపనయనం,

(10) సమవర్తనం

దశావతారాలు : (1) మత్స్య,

(2) కూర్మ, (3 ) వరాహ,

(4) నరసింహ, (5) వామన,

(6) పరశురామ, (7) శ్రీరామ,

(8) శ్రీకృష్ణ, (9) బుద్ధ, (10) కల్కి.

జ్యోతిర్లింగాలు :

హిమలయపర్వతం ~ కేదారేశ్వరలింగం .

కాశీ ~ కాశీవిశ్వేశ్వరుడు .

మధ్యప్రదేశ్ ~ మహాకాలేశ్వరలింగం, ఓంకారేశ్వరలింగం. (2)

గుజరాత్ ~ సోమనాధలింగం, నాగేశ్వరలింగం. (2)

మహారాష్ట్ర ~ భీమశంకరం, త్ర్యంబకేశ్వరం,    ఘృష్ణేశ్వరం, వైద్యనాదేశ్వరం. (4)

ఆంధ్రప్రదేశ్ ~ మల్లిఖార్జునలింగం (శ్రీశైలం)

తమిళనాడు ~ రామలింగేశ్వరం

తెలుగు వారాలు : (1) ఆది, (2) సోమ,

(3) మంగళ, (4) బుధ, (5) గురు,

(6) శుక్ర, (7) శని.

తెలుగు నెలలు : (1) చైత్రం,

(2) వైశాఖం,(3) జ్యేష్ఠం,(4) ఆషాఢం,

(5) శ్రావణం, (6) భాద్రపదం,

(7) ఆశ్వీయుజం, (8) కార్తీకం,

(9) మార్గశిరం, (10) పుష్యం,

(11) మాఘం, (12) ఫాల్గుణం.

రాశులు : (1) మేషం,(2) వృషభం,

(3) మిథునం, (4) కర్కాటకం,

(5) సింహం, (6) కన్య, (7) తుల,

(8) వృశ్చికం, (9) ధనస్సు,

(10) మకరం, (11) కుంభం,

(12) మీనం.

తిథులు : (1) పాఢ్యమి, (2) విధియ,

(3) తదియ, (4) చవితి,(5) పంచమి,

(6) షష్ఠి, (7) సప్తమి, (8) అష్టమి,

(9) నవమి, (10) దశమి,(11) ఏకాదశి,

(12) ద్వాదశి, (13) త్రయోదశి,

(14) చతుర్దశి,

(15) అమావాస్య /పౌర్ణమి.

నక్షత్రాలు : (1) అశ్విని, (2) భరణి,

(3) కృత్తిక, (4) రోహిణి, (5) మృగశిర,

(6) ఆరుద్ర, (7) పునర్వసు,

(8) పుష్యమి, (9) ఆశ్లేష, (10) మఖ,

(11) పుబ్బ, (12) ఉత్తర, (13) హస్త,

(14) చిత్త, (15) స్వాతి, (16) విశాఖ,

(17) అనురాధ, (18) జ్యేష్ఠ,

(19) మూల, (20) పూర్వాషాఢ,

(21) ఉత్తరాషాఢ, (22) శ్రావణం,

(23) ధనిష్ఠ, (24) శతభిషం,

(25) పూర్వాబాద్ర, (26) ఉత్తరాబాద్ర,

(27) రేవతి.

తెలుగు సంవత్సరాల పేర్లు :

(1) ప్రభవ :-

1927, 1987, 2047, 2107

(2) విభవ :-

1928, 1988, 2048, 2108

(3) శుక్ల :-

1929, 1989, 2049, 2109

( 4 ) ప్రమోదూత :-

1930, 1990, 2050, 2110

( 5 ) ప్రజోత్పత్తి :-

1931, 1991, 2051, 2111

( 6 ) అంగీరస :-

1932, 1992, 2052, 2112

( 7 ) శ్రీముఖ :-

1933, 1993, 2053, 2113

( 8 )భావ. -

1934, 1994, 2054, 2114

9యువ.  -

1935, 1995, 2055, 2115

10.ధాత.  -

1936, 1996, 2056, 2116

11.ఈశ్వర. -

1937, 1997, 2057, 2117

12.బహుధాన్య.-

1938, 1998, 2058, 2118

13.ప్రమాది. -

1939, 1999, 2059, 2119

14.విక్రమ. -

1940, 2000, 2060, 2120

15.వృష.-

1941, 2001, 2061, 2121

16.చిత్రభాను. -

1942, 2002, 2062, 2122

17.స్వభాను. -

1943, 2003, 2063, 2123

18.తారణ. -

1944, 2004, 2064, 2124

19.పార్థివ. -

1945, 2005, 2065, 2125

20.వ్యయ.-

1946, 2006, 2066, 2126

21.సర్వజిత్తు. -

1947, 2007, 2067, 2127

22.సర్వదారి. -

1948, 2008, 2068, 2128

23.విరోధి. -

1949, 2009, 2069, 2129

24.వికృతి. -

1950, 2010, 2070, 2130

25.ఖర.

1951, 2011, 2071, 2131

26.నందన.

1952, 2012, 2072, 2132

27 విజయ.

1953, 2013, 2073, 2133,

28.జయ.

1954, 2014, 2074, 2134

29.మన్మద.

1955, 2015, 2075 , 2135

30.దుర్మిఖి.

1956, 2016, 2076, 2136

31.హేవళంబి.

1957, 2017, 2077, 2137

32.విళంబి.

1958, 2018, 2078, 2138

33.వికారి.

1959, 2019, 2079, 2139

34.శార్వారి.

1960, 2020, 2080, 2140

35.ప్లవ

1961, 2021, 2081, 2141

36.శుభకృత్.

1962, 2022, 2082, 2142

37.శోభకృత్.

1963, 2023, 2083, 2143

38. క్రోది.

1964, 2024, 2084, 2144,

39.విశ్వావసు.

1965, 2025, 2085, 2145

40.పరాభవ.

1966, 2026, 2086, 2146

41.ప్లవంగ.

1967, 2027, 2087, 2147

42.కీలక.

1968, 2028, 2088, 2148

43.సౌమ్య.

1969, 2029, 2089, 2149

44.సాధారణ .

1970, 2030, 2090, 2150

45.విరోధికృత్.

1971, 2031, 2091, 2151

46.పరీదావి.

1972, 2032, 2092, 2152

47.ప్రమాది.

1973, 2033, 2093, 2153

48.ఆనంద.

1974, 2034, 2094, 2154

49.రాక్షస.

1975, 2035, 2095, 2155

50.నల :-

1976, 2036, 2096, 2156,

51.పింగళ

1977, 2037, 2097, 2157

52.కాళయుక్తి

1978, 2038, 2098, 2158

53.సిద్ధార్ధి

1979, 2039, 2099, 2159

54.రౌద్రి

1980, 2040, 2100, 2160

55.దుర్మతి

1981, 2041, 2101, 2161

56.దుందుభి

1982, 2042, 2102, 2162

57.రుదిరోద్గారి

1983, 2043, 2103, 2163

58.రక్తాక్షి

1984, 2044, 2104, 2164

59.క్రోదన

1985, 2045, 2105, 216

60.అక్షయ

1986, 2046, 2106, 2166.

ఈ తరం పిల్లలకు నేర్పించండి. చదివించండి మరియు మనం మరోసారి మననం చేసుకుందాం....

నమస్కారం


 


 

 ///// ఆలోచనాలోచనాలు /////       (సాధు సంగంబు సకలార్థ సాధనంబు.) ***** భక్తి శతక పద్య సంకలనం *****                                   1* దిక్కెవ్వరు ప్రహ్లాదకు/ దిక్కెవ్వరు పాండుసుతుల దీనుల కెపుడున్/ దిక్కెవ్వర య్యలహల్యకు/ దిక్కెవ్వరు నీవె నాకు దిక్కువు కృష్ణా! ( కృష్ణ శతకం, నరసింహకవి)           2* దాసిన చుట్టమా శబరి? దాని దయామతి నేలినావు; నీ/ దాసుని దాసుడా గుహుడు? తావకదాస్యమొసంగినావు; నే/జేసిన పాపమా? వినుతి సేసిన గావవు; గావుమయ్య, నీ/ దాసులలో నేనొకఁడ దాశరథీ కరుణాపయోనిధీ! (కంచెర్ల గోపన్న , భక్త రామదాసు బిరుదాంకితులు, దాశరథి శతకం)                                3* అడవి పక్షుల కెవ్వడాహార మిచ్చెను? మృగజాతికెవ్వడు మేత పెట్టె?                                     జలచరాదులకు భోజనమెవ్వడిప్పించె? చెట్ల కెవ్వడు నీరు చేది పోసె?                                   స్త్రీల గర్భంబులన్ శిశులనెవ్వడు బెంచె? ఫణుల కెవ్వడు పోసె పరగపాలు?                         మధుపాళికెవ్వండు మకరందమొనరించె? పశుల కెవ్వ డొసంగె బచ్చిపూరి?                          జీవకోట్లను బోషింప నీవెకాని/ వేరె దాత లేడయ్య వెదకి చూడ/ భూషణవికాస! శ్రీ ధర్మపుర నివాస! దుష్ట సంహార!నరసింహ! దురితదూర! ( నరసింహ శతకం, కాకుస్థం శేషప్ప కవి)              4* వెలయన్ యౌవనకాలమందు మరుడున్, వృద్ధాప్యకాలంబునన్/ పలు రోగంబులు, నంత్యమందు యముడుం బాధింప నట్లైన యీ/ పలు జన్మంబులు చాల తూలితి, ననుంపాలింపవే దేవ మీ/ ఫలితానంద దయావలోకనము నాపై జూపు నారాయణా! ( నారయణ శతకం, బమ్మెర పోతనామాత్యులు)              5* తరులంపువ్వులు పిందెలై యొదవి తత్తజాతితోఁ పండ్లగున్/ హర! మీ పాద పయోజపూజితములై యత్యద్భుతం బవ్విరుల్/ కరులౌ, నశ్వములౌ, సువర్ణమణులౌ, కర్పూరమౌ, హారమౌ/ తరుణీ రత్నములౌ, పటీర తరులౌ, దధ్యంబు సర్వేశ్వరా! ( సర్వేశ్వర శతకం, యథావాక్కుల అన్నమయ)                          6* ఏ వేదంబు పఠించెలూత, భుజగంబే శాస్త్రముల్సూచె, తా/ నే విద్యాభ్యసనంబొనర్చె కరి, చెంచే మంత్ర మూహించె, బో/ ధావిర్భావ నిధానముల్ చదువులయ్యా! కావు! మీ పాద సం/ సేవాసక్తియె కాక జంతుతతికిన్ శ్రీకాళహస్తీశ్వరా! ( శ్రీ కాళహస్తి శతకం‌, ధూర్జటి)  7* అల విభీషణు పల్కు లాదరించిన వాఁడె, యతి దుష్టుడౌ రావణాసురుండు.      వసుదేవముఖ్యుల వరబోధ వినియెనే దుండగీడైన కంసుండు నాఁడు.                                  విదురాది బుధుల వివేకముల్దెలిసెనే, క్రోధాత్ముఁడైన దుర్యోధనుండు.                    భీష్మాదులెంత చెప్పిన నిచ్చగించెనే బాలిశుఁడగు శిశుపాలకుండు.                    కొట్టకుండఁగ ధూర్తుల వట్టిశాంతి/ తాలిమేటికి తురకలు తరిమిరాఁగ/ నొదిగి చూచెదు కలిబోయ నుట్లదిక్కు/ వైరిహరరంహ! సింహాద్రి నారసింహ! ( సింహాద్రి నారసింహ శతకం, గోగులపాటి కూర్మనాథ కవి)                      8* విరధుఁడై యున్న భాస్కర పుత్రునాజిలో నరునిచేఁ జంపింప న్యాయమగునె?                  ధర్మజుచే నసత్యఁపు పల్కుఁ పల్కించి, గురుని ద్రుంపించుట ఘనగుణంబె?                       గంగాకుమారు , శిఖండి యుద్ధంబున పడగూల్చజూచుట పౌరుషంబె?                          మారుతిచే యధర్మముగా సుయోధను తొడలు దున్మించుట దొడ్డతనమె?      ఇట్టి పుణ్యుండవన్న నీ గుట్టుగన్న! భావజ విలాస! హంసల దీవి వాస! లలిత కృష్ణాబ్ధి సంగమస్థల విహార! పరమ కరుణాస్వభావ! గోపాలదేవ!! ( హంసలదీవి గోపాల శతకం, కాసుల పురుషోత్తమ కవి)             9* ఏనుంగెక్కినవాఁడు గుక్కలకు! దానేరీతిగా జంక క/ త్యానందంబున నేగునో, యటు తనూయాత్రన్, జగన్నాథు ని/ న్నే నిక్కంపుసహాయుఁగాఁ గొనునరుండేయాపదల్ వచ్చినన్/ దానిన్ లక్ష్యమొనర్పఁడించుకయు; దేవా! భక్త చింతామణీ! ( భక్త చింతామణీ శతకం, వడ్డాది సుబ్బారాయుడు)   10* వేదంబులును నీవె, వేదాంగములు నీవె! జలధులు నీవె, భూజములు నీవె;                  క్రతువులు నీవె; సద్వ్రతములు నీవెకో!విదుఁడటంచన నీవె, నదులు నీవె;                        కనకాద్రి నీవె; ,యాకాశంబు నీవె; ప! ద్మాప్తసోములు నీవె; యగ్ని నీవె;                   యణు రూపములు నీవె; యవనీతలంబు నీవె! బ్రహ్మము నీవె, గోపతియు నీవె;                                    ఇట్టి నిన్ను సన్నుతింప నేనెంతవాడ! గించనుడ నన్ను బ్రోవుము కింకరునిగ/ మదరిపు విఫాల మునిజన హృదయలోల! వేణుగోపాల సంత్రాణశీల!   (వేణుగోపాల శతకం, పోలిపెద్ది వేంకటరాయ కవి)                                     11* చిఱుత తనంబునన్ జెలులంజేరి విహారము సల్పువేళ నా/ దరమునఁ గొయ్యబొమ్మను ముదంబునఁ బుత్రునిగాఁదలంచి, తాఁ/ బరశవమంది వేడుక నెపంబిడి లాలనఁజేసి మిక్కిలిన్/ మురిపముఁగాంచి, మోహమున నూల్కొను తల్లినిఁ బోలరెవ్వరున్. ( మాతృ శతకం, మాతూరి అప్పావు మొదలారి)            12* కలికి యిచ్చిన పాలు కడుపు నిండని లాగు! రక్కసి విసపుఁ బాల్గుక్కకొనుట.              .   తరుణి పెట్టిన వెన్నఁదనివి దీఱనియట్లు! వ్రేపల్లె మ్రుచ్చిల్లి వెన్నఁదినుట.          నతివ గట్టిన చల్దియాపోవనటువలె! విప్ర భార్యల బువ్వ వేడుకొనుట                           వన్నొనంగిన కజ్జమాసదీఱని రీతి! మేలి యపూపమూల్ చాల గొనుట.                                రట్టడితనానఁ దల్లిని రవ్వసేయ! దలచికాక జగంబులు గలుగనీదు          బొజ్జ నిండింపనెవ్వరు పూనువారు! బళిర కఱివేల్ప!పసిఁడి దువ్వలువ దాల్ప! ( కఱివేల్పు శతకం, వైదర్శు అప్పయ కవి)                   13* శ్రీ రుక్మిణీ నాథ, జితకోటి రతినాథ, సుందరాకార సానంద శరణు!                                 సుర యక్ష కిన్నర వరమౌని శుభాకర, నరకాంతకా శరణు, శరణు.                      జలధరనిభ గాత్ర, జలజాతదళనేత్ర, పరమపవిత్ర, గోపాల శరణు.                                 నిర్మల గుణ తోష, నిజ భక్త జన పోషక, వివచో భూష ప్రకాశ శరణు.                         అనుచు నిను చాల నుతియించి యబ్జభవుని ! వెలది నెంతయు గొనియాడి విఘ్నపతిని.            సన్నుతి యొనర్చి, రచియింతు శతకముగను! మదన గోపాల సత్యభామా విలోల! ( మదన గోపాల శతకం, చెంగల్వరాయుడు)     తేది 12-12-2023, మంగళవారం, శుభోదయం.

 ప్రాణాలకు తెగించి #శబరిమలను కాపాడుతున్న 

#హిందూవీరులను తయారుచేసిన ఈ #వీరవనిత ఎవరో తెలుసా.?.. వి. ఎస్. మూర్తి



ఈరోజు రాజకీయాలకు అతీతంగా కేరళలో బంద్ ఎందుకు జరుగుతున్నదో తెలుసా.?


 మన భారతీయ సనాతన సంప్రదాయాలు చూసి,...


వాటిలో ఉండే లోతైన శాస్త్రీయ విజ్ఞానాన్ని,...


 వాటి ఆచరించడం వలన వలన కలిగే శుభ  ఫలితాలను...


 గమనించి, ఆచరించి.....


మన భారతీయ సాంప్రదాయానికి,ఆచారాలకి...


 ముగ్గులై,... మన భారతీయతను వారిలో  సంపూర్ణంగా నింపుకుని...


 మనలో మమేకమైన వారిలో....


సర్ ఆర్థర్ కాటన్ దొర వద్ద నుంచి చూస్తే...


సి.పి.బ్రౌన్.... మొదలుకుని


ఈ నాటికి...


 అనేకమంది పాశ్చాత్యులు విదేశీయులు,.....


మన భారతీయ సనాతన సాంప్రదాయాలను ఆచరిస్తూ....


 పూర్తిగా వారి దేశాన్ని వదిలి.. 


 మన భారతదేశంలోనే స్థిర  నివాసం ఉంటూ....


 వారి జీవితాలు ధన్యం చేసుకుంటున్నారు ఎందరో .. ఎందరెందరో....


 నేటికీ మనం అరుణాచలం లోని రమణాశ్రమం లో.....


 పాండిచ్చేరిలోని అరవిందాశ్రమం లోను.....


 ఇంకా మన భారతదేశం లోని వివిధ ప్రదేశాలలో...


 విదేశీయులను కోకొల్లలుగా చూడవచ్చు.


 ఇప్పుడు అసలు విషయానికి వద్దాం.....


అది 1975 సంవత్సరం.

కేరళలోని పాలక్కాడ్ జిల్లాలో ఒక ఉన్నత పాఠశాలలో 9వ తరగతి గదిలో చరిత్ర ఉపాధ్యాయుడు పాఠం చెబుతున్నాడు.

ఆరోజుటి పాఠం #ఔరంగజేబు దండయాత్రలు-#శివాజీ మరియు #శంభాజీ లు ఔరంగజేబు ఆగ్రా బంధీఖానా నుంచి తప్పించుకుని ప్రతాప్‌ఘడ్ కోటకు చేరుకున్న ఘట్టం..

15 ఏళ్ళ బాలిక చెవులు చాటంత చేసుకుని ఏకాగ్రతగా వింటున్నది.

పాఠం అయిపోయిన తరువాత తిన్నగా ఉపాధ్యాయుని దగ్గరకెళ్ళి ఔరంగజేబు దౌర్జన్యాలూ/అరాచకాల గురించి మరింతగా వివరంగా చెప్పమని ప్రాధేయపడింది.

చుట్టూ ఉన్న పరిస్థితుల రీత్యా చెప్పడానికి ఆ ఉపాధ్యాయుడు నిరాకరించాడు.

కానీ ఆ బాలిక చలాకీతనాన్ని ఏకసంథాగ్రాహ నిశితాగ్ర బుధ్ధిని గమనించిన ఆ టీచరు కొన్ని పుస్తకాల పేర్లు చెప్పి లైబ్రరీకి వెళ్ళమన్నాడు.

అంతే. ఆ బాలిక సరాసరి లైబ్రరీకి వెళ్ళి.. లైబ్రేరియన్ "ఈరోజు సమయం అయిపోయింది, ఇక తలుపులు మూసేయాలి.." అని చెప్పేవరకు ప్రతిరోజు అనేక చరిత్ర పుస్తకాలు చదివేది..

ఆతరువాత 6 ఏళ్ళకు 1981లో టీచర్స్ రిక్రూట్‌మెంట్ పరీక్షలో Social Studies & History విభాగంలో ఈ బాలికే జిల్లాలో ప్రథమ స్థానం దక్కించుకుని #ఉపాధ్యాయురాలిగా తన ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించింది..

ఆమె చరిత్ర పాఠాలు చెబుతుంటే విద్యార్థులు నిజంగానే చరిత్రలోకి (ఆదిత్య 369 సినిమాలో మాదిరి) వెళ్ళినంతగా ముగ్దులయ్యేవారు..

మన దేశంపై 712 AD లో  #మహమ్మద్_బీన్‌ఖాసిం తో ప్రారంభమైన దండయాత్రలు ఏవిధంగా 2014 వరకు కొనసాగాయో వివరించి చెప్పేది..

కానీ ఇదంతా ఇతర మతస్తులకూ, కమ్యూనిస్టులకూ తల నొప్పిగా మారింది..

దీనితో ఆమెపై సస్పెన్షన్ వేటు వేశారు..

ఆమె ధీరవనిత., ఏమాత్రం వెనకడుగు వేయలేదు..

అప్పుడు క్లాస్‌రూం వదిలి సభలూ సమావేశాలూ నిర్వహించి హిందువులు ఏవిధంగా 1200 ఏళ్ళుగా ఊచకోతకు గురయ్యారో వివరిస్తూ అసలైన చరిత్రను చెప్పసాగింది..


ఆమెను 2003లో #హిందూఐక్యవేదికకు (HAV) ఉపాధ్యక్షురాలిగా హైందవ సంఘాలు ఎన్నుకున్నాయి..

అప్పటి నుంచి సర్వస్వం హిందువుల అభ్యున్నతికే పాటుపడుతూ పోరాడుతున్నది..

కేవలం నాలుగేళ్ళలోనే 2007లో "హిందూ ఐక్య వేదిక"కు ఆమె అధ్యక్షురాలు అయినది..

కేరళలోని దక్షిణ మలబార్ జిల్లాలైన #పాలక్కాడ్, #త్రిశూర్, #మలప్పురం జిల్లాలలో ఆమెకు లక్షలాదిమంది అనుచరులు ఉన్నారు..

ఆమెపై ఇంతవరకు 3సార్లు హత్యాయత్నాలు జరిగాయి..

ప్రతిసారీ కోలుకుని రెట్టించిన ఉత్సాహంతో ఆమె పనిచేస్తున్నారు..

ప్రస్తుతం ఆమె పాలక్కాడ్ జిల్లా #వల్లప్పూజ అనే మేజర్ పంచాయితీ గ్రామంలో ఉన్నత పాఠశాలలో డెప్యూటీ హెడ్‌మిస్ట్రెస్‌గా పనిచేస్తున్నారు..

37 ఏళ్ళుగా ఉపాధ్యాయురాలిగా ఎంతోమంది హిందూ వీరులను ఆమె తయారుచేసింది..

#అయ్యప్ప_శబరిమల విషయంలో ఆమె నేత్రృత్వంలోనే ఉద్యమం నడుస్తున్నది..

స్వయానా #సుప్రీంకోర్టు మరియు #ప్రభుత్వం ఒకటై దుష్టులకు అండగా ఉన్నా కూడా, ఆమె వ్యూహం వల్లనే సన్నిధానంలోకి ఆ దుర్మార్గులు అడుగు పెట్టలేక పోతున్నారు..


దానితో ఆమెను కేరళ కమ్యూనిస్టు ప్రభుత్వం నిన్న అరెస్టు చేసింది..


ఆమె అరెస్టుకు నిరసనగా రాజకీయాలకు అతీతంగా


 *నేడు కేరళలో బందు* జరుగుతున్నది..వి. ఎస్. మూర్తి


 ఇప్పుడు మన కర్తవ్యం ఏమిటి?


 ఆవిడ తన జీవితాన్నే పణంగా పెట్టి,


 మన భారత దేశం కోసం, సనాతన సాంప్రదాయ కోసం పోరాడుతూ ఉంటే....


 నేటికీ బ్రిటిష్ పరిపాలన విధానాలను  తమ నరనరాలలో జీర్ణించుకున్న కొంతమంది... రాజకీయ నేతలు.....


 ఆమెను ఇబ్బందులపాలు చేస్తూ......


 చివరికి ఆమెను కారాగారం పాలు చేస్తే....


 స్పందించాల్సిన అవసరం మనకు లేదంటారా...?


 ఇప్పటికైనా మేల్కొని మన స్పందనలను వివిధ మార్గాల ద్వారా తెలియ చేద్దామా.....?


 లేక...


 ఎప్పటికీ చేతులు ముడుచుకుని కూర్చుని


 అంతా అయిపోయాక....


 భగత్ సింగ్..


 అల్లూరి సీతారామరాజు....


నేతాజీ సుభాష్ చంద్రబోస్...


 వంటి దేశభక్తులు,...


ఈ అవినీతి పరుల,.....


అరాచకవాదుల దౌర్జన్యాలకు బలైపోయాక...


 బాగా తీరిక చేసుకుని,


 వారి శిలా విగ్రహాలు ముందు....


 మన దేశ భక్తిని ప్రదర్శించు కుంటున్నట్లుగా....


 తీరుబడిగా మనకు అవకాశం కుదిరినప్పుడు...


 మన అనుకూలం ని బట్టి..


 స్పందిద్దామా....?


 నిజంగా మీ నరనరాల్లో భారతీయ రక్తం ప్రవహిస్తూ ఉంటే.....


.....


.....


.....


👏👏👏


🙏🙏🙏


  👍  👍    👍


 నాకు తెలుసు మీరు స్పందించారు....


 ఎందుకంటే మనం అందరం భారతీయులం కనుక!


ఇంతకూ ఆ వీరవనిత పేరు చెప్పలేదు కదూ..


ఆమె పేరు #KP_Sashikala..


"కెపి శశికళ టీచర్" అంటే తెలియని వారు కేరళలో కనిపించరు.


ఆమెను "కేరళ_ఝాన్సీరాణి" అని అక్కడివారు ఎంతో గౌరవంగా పిలుచుకుంటారు.


 ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప 🙏🙏🙏


 హరిహరపుత్ర అయ్యప్ప 🙏🙏🙏


🙏🙏 ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప 🙏🙏🙏

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*


*కలియుగాబ్ది 5124*

*శ్రీ శాలివాహన శకం 1944 స్వస్తి శ్రీ    చాంద్రమాన శోభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం - శరదృతువు - కార్తీక మాసం - కృష్ణ పక్షం  -‌ అషౄ - పూర్వాఫల్గని -‌ భౌమ వాసరే* (05.12.2023)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.


https://youtu.be/_h40EV9nSSc?si=g1pJlcHIvQ47DZPE



.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

-----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర...


*పులిచర్మం..ప్రలోభం... మొదటి భాగం.*


*(నలభై ఎనిమిదవ రోజు)*


శ్రీ స్వామివారి సాధన నిరంతరంగా నిరాఘాటంగ సాగిపోతోంది..మోక్షసాధనే ధ్యేయంగా చేస్తున్న కఠోర తపస్సు క్రమంగా ముగింపుకు వస్తోందని  స్వామివారికి అనుభవపూర్వకంగా అర్ధమవుతోంది.. శ్రీ స్వామివారు తీసుకుంటున్న మిత ఆహారం కూడా ఇంకా తగ్గించుకొని..మరీ అల్పపరిమాణంలో స్వీకరించసాగారు..దేహం కూడ శుష్కించిపోతున్నది.


ఒకరోజు శ్రీధరరావు ప్రభావతి గార్లు శ్రీ స్వామివారిని కలవడానికి ఆశ్రమానికి వెళ్లారు..శ్రీ స్వామివారు వారితో తన తపస్సు గురించి కొన్ని విషయాలు మాట్లాడి.."పులిచర్మం మీద కూర్చుని తపస్సు లోని చివరి సాధన  చేస్తే ఫలితం విశేషంగా ఉంటుంది..అది ముక్తికి చివరి మెట్టు!..వ్యాఘ్ర చర్మం ధరించే పరమశివుడు నిరంతర విరాగి గా ఉండటం లోని పరమ రహస్యం అదే!.." అన్నారు..


ప్రభావతి గారి మనస్సులో ఈ మాటలు బాగా నాటుకొని పోయాయి..ఎలాగైనా పులిచర్మం సంపాదించి..శ్రీ స్వామివారికి అందచేయాలి..శ్రీ స్వామివారి తపస్సుకు తన వంతు సహాయం చేశానన్న తృప్తి ఉండాలని ఆవిడ బలంగా కోరుకున్నారు..


ఆ ప్రక్కరోజే..కందుకూరు మహిళామండలి అధ్యక్షురాలు..(ఆవిడ ప్రభావతి గారికి బాబాయి గారి కూతురు) తమ మహిళామండలి లో సాహిత్యోపన్యాసం చేయమని ప్రభావతి గారిని కోరారు..ప్రభావతి గారూ ఒప్పుకొని..శ్రీధరరావు గారితో సహా కందుకూరు చేరారు..బంధువులే కనుక, నేరుగా వాళ్ళింటికి తీసుకెళ్లారు..ప్రభావతి గారు వారింట్లో అడుగుపెట్టేసరికి.. ఆ ఇంటి హాలులో గోడకు ఒక పులిచర్మం తగిలించి ఉంది..బాబాయి గారి పెద్ద కుమారుడు ఫారెస్ట్ ఆఫీసర్ గా పనిచేస్తున్నారు..అతను కూడా వచ్చి ఉన్నాడారోజు..


అందరూ భోజనానికి కూర్చున్నారు..ప్రభావతి గారి మనసంతా ఎదురుగ్గా గోడకు తగిలించి ఉన్న పులిచర్మం మీదే ఉంది..తాను నోరు తెరచి అడిగితే..వీళ్ళు కాదని అనలేరు..కాబట్టి అడిగి ఆ పులిచర్మం తీసుకొని..శ్రీ స్వామివారి కి అందచేయాలని గట్టిగా నిర్ణయించుకున్నారు..


ప్రభావతి గారి మనసులోని ఆలోచనను శ్రీధరరావు గారు పసిగట్టేశారు..ప్రభావతి గారి మనసులోని భావాలను ఆయన చదవగలరు..లో గొంతుకతో.."ప్రభావతీ..నువ్వు ఆ పులిచర్మాన్ని ఇమ్మని అడగకు..పద్ధతి కాదు..వాళ్ళు ముచ్చటబడి దానిని అలా ఉంచుకున్నారు..నువ్వు ప్రలోభపడకు.." అన్నారు..ప్రభావతి గారు చివ్వున చూస్తూ.."ఇదేమన్నా నా కోసమా?..శ్రీ స్వామివారి తపస్సు కోసం కదా!..వాళ్లకు కూడా పుణ్యం వస్తుంది..మీరూరుకోండి..అన్నిటికీ అడ్డం పడకండి!.." అన్నారు.."ఒద్దు ప్రభావతీ..నామాట విను..ఇలా అడగటం తప్పని నీకూ తెలుసు!.." అన్నారు శ్రీధరరావు గారు..


ఆ క్షణంలో సరే అన్నట్లు తలూపిన ప్రభావతి గారు..మరి కొద్దిసేపటికే భోజనాలు తినడం పూర్తి అయిన మరుక్షణం..."బాబాయ్..పిన్నమ్మా..తమ్ముడూ.. చెల్లాయ్.." అంటూ పేరు పేరు నా అందరినీ పిలిచారు..అందరూ ప్రభావతి గారి దగ్గరకు వచ్చారు..శ్రీధరరావు గారు వారిస్తున్నా వినకుండా..

"నాకు ఆ పులిచర్మం కావాలి.." అన్నారు..

వింటున్న వాళ్ళు ఒక్కక్షణం నిర్ఘాంతపోయారు..


"అక్కయ్యా..అది నాకు బహుమానంగా ఒక ఆప్తుడు ఇచ్చాడు..వాళ్ళ జ్ఞాపకార్ధం ఇక్కడ ఉంచుకున్నాను..పైగా నాకు అదంటే ఇష్టం కూడానూ.." అన్నాడు నెమ్మదిగా..


"ఏం ఫర్లేదు తమ్ముడూ..ఒక మహానుభావుడి తపస్సుకు మీరు సహకరిస్తున్నారని తెలుసుకోండి..ఎంత పుణ్యమో మీకు తెలీక ఇలా అంటున్నారు.." అంటూ.."నేను మామూలుగా ఇటువంటి సాహిత్య సభలకు రాను..అదే గొప్ప గొప్ప రచయిత్రులు..కవులు..వస్తే..వారికి సన్మాన సత్కారాలు చేయాలి..నేను అలాకాదే!..నాకు భగవంతుడు వాక్కు ఇస్తేనే మాట్లాడతాను సభల్లో..నేను షరతులేవీ పెట్టను.. అటువంటిది ఈరోజు నేను అడుగుతున్నానని మీరు భావించినా పర్లేదు..నాకు ఆ పులిచర్మం కావాలి..అంతే!." అని గబ గబా అక్కడున్న కుర్చీ లాక్కొని..దానిమీదకు ఎక్కి..గోడకు తగిలించి ఉన్న పులిచర్మాన్ని మెల్లిగా మేకులనుంచి ఊడతీయడం మొదలెట్టారు..


ఈ పరిణామానికి బిత్తరపోయిన ఆ తమ్ముడు కాస్తా..తానే పులిచర్మాన్ని ఊడదీసి..ప్రభావతి గారికి ఇచ్చేసాడు..వాళ్ళ కళ్ళల్లో కనబడ్డ నిరాశ ప్రభావతి గారు, చూసికూడా  చూడనట్లే నటించి..ఆ పులిచర్మాన్ని చుట్ట చుట్టుకొని పట్టుకున్నారు..శ్రీధరరావు గారి వైపు చూసే సాహసం ఆవిడ చెయ్యలేదు..ఆయన చూపుల్లోని కోపాగ్నికి భస్మం అవుతానని భయం!..ఆ ఇంట్లో ఎవరూ మాట్లాడే అవకాశం ఇవ్వకుండా బైటకు వచ్చేసి రిక్షా ఎక్కి బస్టాండ్ కు వచ్చేసారు..దారిపొడుగునా శ్రీధరరావు గారు చీవాట్లు పెడుతున్నా లెక్కచేయలేదు ఆవిడ!..


ఆ పులిచర్మం తీసుకొని మొగలిచెర్ల కు చేరారా దంపతులు..


పులిచర్మం..శ్రీ స్వామివారి లీల..రెండవభాగం..రేపు..


*మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి చరిత్రను ఆడియో రూపంలో ఈ క్రింద ఇచ్చిన లింక్ ద్వారా యూట్యూబ్ లో వినవచ్చు..*


https://youtube.com/playlist?list=PLZ3oJviTRayHLeRpuozyT55d-H-4xmTHs&si=xqCIrCAE0k1Rmrnx



సర్వం..

శ్రీ దత్తకృప!.


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..SPSR నెల్లూరు జిల్లా..పిన్: 523114..సెల్..94402 66380 & 99089 73699).

 శ్రీ దేవీ భాగవతం

.శ్రీగణేశాయనమః.శ్రీసరస్వత్యైనమః శ్రీగురుదత్తాత్రేయపరబ్రహ్మణేనమః

శ్లో)వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయవిష్ణవే|

నమోవైబ్రహ్మనిధయే వాసిష్ఠాయనమోనమః||

శ్లో)నారాయణంనమస్కృత్య నరంచైవ నరోత్తమం|

దేవీంసరస్వతీం వ్యాసం తతోజయముదీరయేత్||


శ్లో)సృష్టౌ యా సర్గరూపా జగదవనవిధౌ పాలినీ యా చ రౌద్రీ

సంహారే చాపి యస్యా జగదిదమఖిలం క్రీడనం యా పరాఖ్యా |

పశ్యంతీ మధ్యమాథో తదను భగవతీ వైఖరీవర్ణరూపా

సాస్మద్వాచం ప్రసన్నా విధి హరి గిరిశారాధితాలంకరోతు||


శ్లో)కాత్యాయనిమహామాయే భవాని భువనేశ్వరి |

సంసారసాగరోమగ్నం మాముద్ధరకృపామయే||

బ్రహ్మ విష్ణు శివారాధ్యే ప్రసీదజగదంబికే|

మనోఽభిలషితందేవివరందేహినమోఽస్తుతే||



వ్యాసమహర్షీ! హరిశ్చంద్రుడి కథ బాగానే ఉంది. ఇంతకీ త్రిశంకుడి తరవాత కథ ఏమిటి ?

శాపం నుంచి విముక్తి పొందాడా ? లేకపోతే ఆ గంగాతీరంలో అలాగే కృశించి అసువులు బాశాడా ?

వదిష్ఠులవారేమైనా కరుణించి శాపం ఉపసంహరించారా ? వినాలని చాలా కుతూహలంగా ఉంది.

దయచేసి శేషవృత్తాంతాన్ని తెలియజెప్పమంటూ జనమేజయుడు కోరాడు. యథాప్రకారం జనమేజయా!

అంటూ వ్యాసుడు మళ్ళీ ఉపక్రమించాడు.

హరిశ్చంద్రుడు పట్టాభిషిక్తుడయ్యాడనే వార్త తెలిసి వసిష్ఠుడు సంతోషించాడు. దేవీధ్యానతత్పరుడై

గంగాతీరంలోనే కాలం గడుపుతున్నాడు.

* విశ్వామిత్ర శ్వపచుల కథ

కౌశికినదీతీరంలో దీర్ఘ తపస్సును ముగించుకున్న విశ్వామిత్రుడు తన ఆశ్రమానికి తిరిగి

వచ్చాడు. భార్యాపుత్రులు క్షేమంగా ఉన్నందుకు సంతోషించాడు. పన్నెండేళ్ళ దుర్భిక్షం వచ్చిందని

విన్నాను. తిండి దొరకక ఎందరెందరో మరణించారట. ఆ కరువు కాలాన్ని నువ్వెలా గడిపావు? ని

పిల్లల్ని అన్నం పెట్టి ఎవరు పోషించారు ? తపస్సులో మునిగిపోయి నేను రాలేకపోయాను. వచ్చిమాత్రం

నిర్ధనుణ్ణి ఏమి చెయ్యగలనులే అని ఆగిపోయాను. చేతిలో చిల్లిగవ్వలేదుగదా ఎలా ఇల్లు గడిపావో చాలా

ఆశ్చర్యంగా ఉంది. దుర్భిక్షం గురించి విని మిమ్మల్ని తలుచుకుని బాధపడ్డానేతప్ప ఏ సహాయము

అందించలేకపోయాను. యజమానుడుగా నా కర్తవ్యం నిర్వహించలేకపోయినందుకు సిగ్గుపడుతున్నాను.

ఇలాంటివి తట్టుకుంటేనే తప్ప తపస్సు సాధ్యంకాదాయె

 卐ఓం శ్రీ గురుభ్యోనమః卐

*సోమవారం, డిసెంబరు 4, 2023*

*శ్రీ శోభకృత్ నామ సంవత్సరం*

  *దక్షిణాయనం - శరదృతువు*

  *కార్తీక మాసం - బహళ పక్షం*

తిథి      : *సప్తమి* రా8.28 వరకు

వారం   : *సోమవారం* (ఇందువాసరే)

నక్షత్రం  : *మఖ* రా11.57 వరకు  

యోగం : *వైధృతి* రా9.59 వరకు

కరణం  : *విష్ఠి* ఉ7.26 వరకు

            తదుపరి *బవ* రా8.28 వరకు

వర్జ్యం  : *ఉ10.41 - 12.27* 

దుర్ముహూర్తము : *మ12.11 - 12.55* &

                          *మ2.23 - 3.07*

అమృతకాలం    : *రా9.17 - 11.03*                   

రాహుకాలం : *ఉ7.30 - 9.00*

యమగండ/కేతుకాలం : *ఉ10.30 - 12.00*

సూర్యరాశి: *వృశ్చికం* || చంద్రరాశి: *సింహం*

సూర్యోదయం: *6.19* || సూర్యాస్తమయం: *5.20*

🕉️మహాడేవాయనమః🙏

🕉️శ్రీరామభద్రాయనమః🙏

*సర్వేజనా సుఖినో భవంతు - శుభమస్తు* 🙏

---------------------------------

     గోమాతను పూజించండి

     గోమాతను సంరక్షించండి

 *కార్తిక పురాణము - 23*

🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔

కార్తిక పురాణము - ఇరవై మూడవ అధ్యాయము


అగస్త్య ముని పల్కెను. అత్రి మునీంద్రా! పురంజయుడు యుద్దమందు జయమొందిన తర్వాత ఏమి చేసెనో నాకు దెలియజెప్పుము. అత్రి పల్కెను. శత్రు బాధారహితమైన అయోధ్యా పట్టణమందు పురంజయ మహారాజు సమస్త ధనుర్ధారులలో శ్రేష్ఠుడై ఇంద్రతుల్య పరాక్రమవంతుడై సత్యవాదియు, సదాశుచియు, దాతయు, భోక్తయు, ప్రియవాదియు, రూపవంతుడును, అమిత కాంతియుతుడును, సమస్త యజ్ఞకర్తయును, బ్రాహ్మణ ప్రియుడును, ధనుర్వేదమందు వేదములందు శాస్త్రములందు ప్రవీణుడును, పూర్ణిమ చంద్రుడు జనులకు వలె స్త్రీ ప్రియుడును, సూర్యుడు వలె చూడ శక్యముగాని వాడును, శత్రువులను శిక్షించు వాడును, హరిభక్తి పరాయణుడును, బలయుతుడును, కామక్రోధలోభ మోహ మద మాత్సర్యములను జయించిన వాడును, కార్తిక వ్రతము చేత పాపములన్నియు నశింపజేసి కొనిన వాడై యుండెను. ఇట్లున్న పురంజయునకు విష్ణు సేవయందు బుద్ధి జనించి హరిని ఎట్లారాధింతును? ఏ దేశమందు ఏ మాసమందు ఏ క్షేత్రమందు సుఖముగా ఆరాధింతును? ఇట్లని చింతించుచున్న రాజుకు ఆకాశవాణి యిట్లనియె. ఓ పురంజయా! శీఘ్రముగా కావేరికి పొమ్ము. అచ్చట శ్రీరంగమను దివ్యక్షేత్రమున్నది. అచ్చట శ్రీరంగనాథుడు వసించి యున్నాడు. కాబట్టి సంసారచ్చేదమును జేయువాడగు శ్రీరంగ నిలయుని సేవిన్చుమని చెప్పి ఊరకుండెను. ఆ మాట విని రాజు అయోధ్యా పట్టణమును విడిచి తన చతురంగ బలములతోను అనేక క్షేత్రములను తీర్థములను జూచుచు కావేరీ మధ్యనున్న శ్రీరంగము చేరెను. కార్తికమాసమంతయు అచ్చట ఉంది కావేరీ మధ్యము, నివాసముగా గలవాడిన శేష శాయియయిన విశ్వమంగళుడైన శ్రీరంగనాథ స్వామిని పూజించుచు కార్తిక వ్రతమును శాస్త్రోక్తముగా జేసెను. కృష్ణా, కృష్ణాయని గానము చేయుచు గోవిందా, వాసుదేవా యని నిరంతరమూ కీర్తించుచు, విష్ణు పూజా పరాయణుడై స్నాన దాన జప హోమములు దేవాభిషేకములు చేయుచు శేషశాయి శ్రీరంగనాథుని విధియుక్తముగా ఆరాధించి మాసమంతయు ఇట్లు వ్రతము సల్పి మాసాంతమందు ఉద్యాపన చేసి తన పట్టణమును గురించి బయలుదేరెను. మధ్యనున్న దేశములను జూచుచు సమృద్ధమైన తన దేశమునకు పోయి అందున్న అయోధ్యా పట్టణమును జూచెను. ఆ అయోధ్య అనేక రాష్ట్రములకు అలంకారమై సంతోషముతోను, పుష్టితోను గూడిన జనులు గలిగినదియు, దృఢముగా నున్న యంత్రములు గడియలు గలిగినదియు అగడ్తలు గలిగినదియు, గుర్రములతోను, ఏనుగులతోను, రథములతోను నిండియున్నదియు, గృహ గోపురముల వెంట వీధులు గలిగినదియు, అనేక వర్ణములు గల పతాకములు గలదియు, వాయువుచేత చలింప జేయబడుచున్న పతాకములు గలదియు, అనేక భటులు కలదియు అనేక దేశ వాసులతో గూడినదై యుండెను. అచ్చట స్త్రీలు సుందరులును, హంసల వలే, ఏనుగుల వలె నడుచు వారును, చెవుల వరకునుండు విశాల నేత్రములు గలవారును, గొప్ప పిరుదులు గలవారును, సన్నని నడుము గలవారును, బలిసిలావుగా వున్న కుచములు గలవారును, మంచి వస్త్రములు గలవారును, సమస్త భూషణ భూషితలుగా నుండిరి. అచ్చటి వేశ్యలు సంగీతమందు, నృత్యమందు నిపుణులును, సౌందర్యముతోను, లావణ్యముతోను గూడియున్న వారును, నిత్యమానంద యుక్తులు, మదోన్మత్తులును సమస్త స్త్రీ గుణ భూషితలై చూచుటలోను, మాట్లాడుట లోను బహు నేర్పరులై సభలలోను రాజమార్గముల లోను రచ్చలలోను ఆటలాడుచుండువారి యుండిరి.

అచ్చట కుల స్త్రీలు గుణవంతులై సర్వాభరణ భూషితలై పాతివ్రత్య పరాయణలై యుండిరి. ఓ అగస్త్య మునీంద్రా అచ్చటి మనుజులందరు తమ తమ వర్ణాశ్రమ ధర్మములందు ఉండిరి. పురంజయుడిట్లున్న పట్టణమును జూచి సంతోషించెను. "యధారాజా తథా ప్రజా" అను న్యాయమును బట్టి రాజు న్యాయ వర్తనుడైన ప్రజలును న్యాయమందే యుందురు గదా! పురజనులందరును రాజు వచ్చుటను విని వేలవేలు గూడి ఎదుర్కొనిరి. రాజు మీద పేలాలు పుష్పములు చల్లిరి. రాజు పట్టణమును బ్రవేశించి తన యింటి ముందు ప్రవేశించినది మొదలు ధర్మ యుక్తముగా భూమిని పరిపాలించెను. తరువాత కుమారులు మనుమలు గలవాడై అనేక భోగములననుభవించి చివరకు కుమారునికి రాజ్యభారమును అప్పగించి తన భార్యతో కూడా వనమునకు పోయి వానప్రస్థాశ్రమమవలంబించి కార్తి వ్రతమును విడువక చేయుచు హరిభక్తిని స్థిరముగా చేసి దానిచేత వైకుంఠ లోక వాసియై సుఖముగా నుండెను. అగస్త్య మునీంద్రా! కార్తిక వ్రతము మహా మహిమ గలది. ఈ కార్తిక ధర్మము హరికి ప్రియకరము. కార్తిక వ్రతమును జేయువాడు పరమ పదమును బొందును. అవశమై చేసినను ఉత్తమగతి పొందును. సమస్త సౌఖ్యములను యిచ్చునదియు, కలికల్మష నాశకారియు నైన కార్తిక వ్రతమును జేయని మనుష్యుడు దుఃఖమును బొందును. హరిభక్తి యుక్తుడై శుచితో ఈ అధ్యాయమును వినువాడు సమస్త పాతకములను నశింపజేసికొని పునరావృత్తి రహితమైన మోక్షమును పొందును.

ఇతి శ్రీ స్కాంద పురాణే కార్తిక మాహాత్మ్యే త్రయోవింశాధ్యాయ సమాప్తః!!

 🌻ఓం నమః శివాయ 🌹


శ్రీకైలాసనివాసా !

లోకేశ్వర ! నిగమవినుత !లోకపవిత్రా !

భీకరవిషకంఠేశ్వర ! 

చేకూర్చుము ముక్తి  నాకు శ్రీ పరమేశా !     01*


అక్కజముగ విషముం గని

దిక్కుల పరువెత్తుచుండ దేవత లెల్లన్ 

మక్కువ  దానిన్ గైకొని 

గ్రక్కున కంఠాన నిల్పి గ్రాలితె  యీశా !    02*


ఒడ లెల్లశ్రీవిభూతిని

కడు మక్కువ తోడ దాల్చి కన్పించు హరా !

ఇడుముల నుండెడి భక్తుల 

కడు సంపద లిత్తు ఔ ర ఘనతన్నీ శా !    03*


ద్వారాన నున్న బాలుని

దారుణ శూలంబు తోడ తరిగియు శిరమున్

కారుణ్యముతో పిమ్మట

వారణశిర ముంచినట్టి వంద్యుడ వీశా !         04*


బాలుడు మార్కండేయుని 

కాలుడు గొంపోవగాంచి కడు కుపితుడవై 

శూలము బెట్టితి వడ్డుగ 

లీలగ సురకోటి జోత లీయగ నీశా.   05*


✍️గోపాలుని మధుసూదన రావు 🙏

 .        *🪐నవగ్రహా పురాణం🪐*  

.               *97వ అధ్యాయం*


*పురాణ పఠనం ప్రారంభం*

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐


*శుక్రగ్రహ చరిత్ర - 9*



*"మృతసంజీవనికి విరుగుడా ?"* బృహస్పతి ఆశ్చర్యంగా అన్నాడు. *"అది పరమశివుని వరప్రసాదం , మహేంద్రా ! దానికి తిరుగూ లేదు. విరుగుడూ ఉండదు !"*


*"అయితే స్వర్గ రాజ్యాన్ని ఆ రాక్షసులకు అప్పగించి , అడవుల దారి పట్టటమే !"* ఇంద్రుడి కంఠంలో విచారం ధ్వనించింది.


*"ప్రతి వ్యాధికీ ఒక ఔషధం ఉన్నట్టే. ప్రతి సమస్యకూ పరిష్కారం ఉంటుంది. దేవరాజా ! ఆలోచించాలి !"* దేవగురువు చిరునవ్వుతో అన్నాడు.


*"ఆలోచించండి !"* ఇంద్రుడు విసుగ్గా అన్నాడు.


*"మార్గాంతరం ఒక్కటే ఉంది !"* బృహస్పతి సాలోచనగా అన్నాడు. *"మృతసంజీవని లాంటి విద్యను మనమూ సంపాదించడమే !”*


ఇంద్రుడు కళ్ళు చిట్లించాడు. *"మృతసంజీవనినే సాధిస్తే ? కత్తికి కత్తితో , గదకు గదతో సమాధానం చెప్పినట్లుంటుంది !".*


బృహస్పతి ఆమోద సూచకంగా తలపంకించాడు. *"దివ్యమైన ఆలోచన !”* 


*"అయితే సురగురువులాగా , దేవగురువు తపస్సుతో మెప్పించి , మృతసంజీవని సంపాదించడమేగా మన కర్తవ్యం , గురుదేవా ?"* ఇంద్రుడు ఆవేశంగా అన్నాడు.


*"తపస్సు మాత్రమే మన చేతిలో ఉంటుంది. పరమేశ్వరుడి ప్రతిస్పందన ఎలా ఉంటుందో ఊహించలేం. పరమేశ్వరుడి దృష్టిలో శుక్రుడు వేరు , మనం వేరు ! శుక్రుడిని శంకర దంపతులు పుత్రుడిగా భావిస్తారు కదా !"* బృహస్పతి సాలోచనగా అన్నాడు.


*"మరి , 'దివ్యమైన ఆలోచన !' అన్నారు కదా ! దివ్యమైన ఆలోచనకు దివ్యమైన ఆచరణ విధానం చెప్పండి !"* ఇంద్రుడు అసహనంగా అన్నాడు.


*"మృతసంజీవనీ విద్య ప్రస్తుతం ఇద్దరికి తెలుసు ! ఒకరు పరమశివుడు , ఇంకొకరు శుక్రుడు !"* బృహస్పతి ఇంద్రుణ్ణి సూటిగా చూస్తూ అన్నాడు. *"శివుడి కన్నా శుక్రుడి నుండే సంపాదించడం సులభం !"*


ఇంద్రుడు ఏదో చెప్పబోయాడు. బృహస్పతి అతడిని చెయ్యెత్తి వారించాడు. *"శుక్రుడు శత్రువులకు ఆ విద్యను ఎందుకు దానం చేస్తాడన్నది నీ సందేహం. నాకు తెలుసు ! శ్రద్ధాభక్తులతో శుశ్రూష చేసే శిష్యులకు గురువు సకల విద్యలూ బోధిస్తాడు. శుక్రుడు మంచి గురువు !"* అన్నాడు బృహస్పతి.


*“అయితే మనవాళ్ళలో ఎవరో ఒకరు శుక్రాచార్యుడిని ఆశ్రయించాలన్న మాట...”*


*"ఎవరో ఒకరు కాదు ! వినయ విధేయతలూ , శ్రద్ధా భక్తులూ , సునిశితమైన బుద్ధి బలం - ముఖ్యంగా కార్యదీక్షా ఉన్న యువకుడిని ఆ కార్యానికి నియోగించాలి. మహేంద్రా !"* బృహస్పతి సూచించాడు.


దేవేంద్రుడు చిన్నగా నవ్వాడు. *"మీరు పేర్కొన్న అన్ని లక్షణాలూ ఉన్న యువకుడు , నా ఎరుకలో ఒక్కడే ఉన్నాడు. గురుదేవా !".*


*"ఎవరు ?"*


*"మీ సుపుత్రుడు కచుడు !"*


*"కచుడా ?"*


*"ఔను ! శుక్రుడికి శుశ్రూష చేసి , మృతసంజీవనిని సంపాదించగలిగిన చతురత కలిగిన యువకుడు కచుడే !"*


*"దేవ గురువుగా నేను చేయవలసిన సహాయం నా కుమారుడు చేయడం నాకు ఆనందం కలిగించే విషయమే ! నా పుత్రుడు విజయం సాధించగలిగితే ఆ ఘనత నాదే అవుతుంది కదా ! గురుభక్తికి కచుడు పెట్టింది పేరు. రేపే కచుడిని శుక్రుడి ఆశ్రమానికి పంపుదాం !"* బృహస్పతి అన్నాడు..


*"ధన్యుణ్ణి , గురుదేవా ! కుమార కచుడి వద్దకు మనం ఇప్పుడే వెళ్ళాలి. దేవతల పక్షాన కుమారుడిని నేను స్వయంగా అభ్యర్థిస్తాను !"* ఇంద్రుడు ఆవేశంగా అన్నాడు.


********************************

అది వృషపర్వుడి పట్టణంలోని శుక్రాచార్యుడి ఆశ్రమ ప్రాంగణం. దట్టంగా నీడను పరిచిన చెట్టుక్రింద గుంపుగా కూర్చున్న అసుర విద్యార్థులకు శుక్రుడు. పాఠప్రవచనం చేస్తున్నాడు. ఆయన కుమార్తె దేవయాని నీళ్ళు తాగేపాత్రతో తండ్రి సమీపానికి వచ్చింది. తండ్రి వెనుక , చెట్టు భోదికి దగ్గరగా నిలుచున్న దేవయాని , చూపులు , ఆశ్రమ ప్రాంగణంలోకి వస్తున్న యువకుడి మీదే కేంద్రీకరించబడి ఉన్నాయి. ఆశ్రమ ప్రాంతంలో గానీ , వృషపర్వుడి మందిర ప్రాంతంలో గానీ ఎప్పుడూ చూడలేదు తను , ఆ యువకుడిని. అందం , ఆకర్షణా రెండు ఆభరణాల్లా ఉన్నాయతనికి. యువకుడు తిన్నగా శుక్రుడి ముందుకు వచ్చి నిలిచాడు. వినయంతో చేతులు జోడించాడు.


*"గురుదేవా ! దేవ గురువు బృహస్పతి ఆచార్యుల పుత్రుణ్ణి నేను. నా పేరు కచుడు. విద్యాభ్యాసం కోసం మీ చరణ సన్నిధికి వచ్చాను. మీ సేవకు అంకితమవుతాను. నన్ను శిష్యుడిగా అంగీకరించి , విద్యా దానం చేయండి !"*


శుక్రుడు కచుడిని ఆశ్చర్యంతో ఎగా దిగా చూశాడు. ఆయన కళ్ళు తీక్షణంగా ఉన్నాయి.


*"నువ్వు... బృహస్పతి పుత్రుడివా ?!"* శుక్రుడు నమ్మలేనట్టు అన్నాడు. *"యధార్ధమేకద!"*


*"చిత్తం ! నేను తారా బృహస్పతుల తనయుణ్ణి ! విద్యార్జన కోసం స్వయంగా మా తండ్రి గారే నన్ను తమ సన్నిధికి పంపించారు ! అనుగ్రహించండి !"* కచుడు వినయంగా. అన్నాడు.


*"బృహస్పతి వద్ద లేని విద్య వుందా , నాయనా ?"* శుక్రుడు చిరునవ్వుతో అన్నాడు.


*"తన ఆధ్వర్యంలో కన్నా , తమ ఆధ్వర్యంలో అభ్యసించడం సహస్రాధికంగా ఫలదాయకం అన్నారు - మా జనకులు !"* కచుడు చిరునవ్వు నవ్వాడు.


*"అబ్బ...ఎంత చక్కగా ఉంది ఆ చిరునవ్వు !"* అనుకుంది , తండ్రికి నీళ్ళు ఇవ్వడం మరిచిపోయి కచుడినే తదేకంగా చూస్తున్న దేవయాని. కచుడు ! దేవగురువు బృహస్పతి కుమారుడు ! అంటే శత్రుపుత్రుడు ! తన తండ్రి చేరదీస్తాడా ? తృణీకరించి తొలగి పొమ్మంటారా ! తన తండ్రి కచుడిని శిష్యుడిగా స్వీకరిస్తే ఎంత బాగుంటుంది దేవయానిలో కచుడి పట్ల సానుకూలమైన ఆలోచనలు ప్రవాహ వేగంతో సాగుతున్నాయి.


అదే సమయంలో , అసుర విద్యార్థులు కచుడిని కోపంగా చూస్తున్నారు. దేవగురువు పుత్రుడు ! విద్యార్థిగా నటిస్తూ , రాక్షసుల రహస్యాలు కనిపెట్టే ప్రయత్నంలో వచ్చాడు !. సందేహం లేదు ! గురువు గారు పొగడ్తకు లొంగిపోయి శిష్యుడిగా స్వీకరిస్తారేమో ! అసుర యువకులలో కచుడి పట్ల ప్రతికూల ఆలోచనలు సాగుతున్నాయి.


*"నాన్నా ! విద్యను అర్థిస్తూ వచ్చిన వారు ఎవరైనప్పటికీ..."* దేవయాని ఏదో చెప్పబోయింది.


*“నిరాకరించడం ధర్మం కాదమ్మా !"* శుక్రుడు దేవయాని వైపు చూడకుండా , కచుడి వైపే చూస్తూ అన్నాడు. 


*“గురుదేవా !”* ఒక అసుర శిష్యుడు ఆశ్చర్యంతో అన్నాడు. *"దేవగురువు కుమారుణ్ని చేరదీస్తారా ?”*


*"ఔను , నాయనా ! అది మనకు గౌరవ కారణమూ , గర్వకారణమూ !"* శుక్రుడు అసుర శిష్యుడితో అన్నాడు. *“అర్థించిన వ్యక్తిని అనాదరించకూడదు ! ఈ సువర్ణసూత్రాన్ని కూడా మీరు పాఠంలాగే గుర్తుంచుకోవాలి !”*


*"నాన్నా ! జలపానం చేయండి !"* దేవయాని ఆనందంగా తండ్రికి నీళ్ళ పాత్ర అందించింది. శుక్రుడు పాత్రను కచుడివైపు చూపాడు.


*"కచా , ఉదకం స్వీకరించు ! నిన్ను ఆదరిస్తే , నీ తండ్రి బృహస్పత్యాచార్యులను ఆదరించినట్టే !"* అన్నాడు చిరునవ్వుతో.


దేవయాని కచుడిని మరోసారి చూసి , ఆశ్రమం వైపు పరుగెట్టింది.

 

*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐

 🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱

.      *శివానందలహరీ – శ్లోకం – 21*

.        శ్రీ ఆదిశంకరాచార్య విరచితం

🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱

   

*ధృతి స్తంభాధారాం దృఢ గుణ నిబద్ధాం సగమనాం*

 *విచిత్రాం పద్మాఢ్యాం ప్రతి దివస సన్మార్గ ఘటితామ్,*

 *స్మరారే మచ్చేత స్స్ఫుటపటకుటీం ప్రాప్య విశదాం*

 *జయ స్వామిన్ శక్త్యా సహశవగణైస్సేవిత విభో ।।*


ఈ శ్లోకంలో మనస్సు పటకుటీరముతో (గుడ్డ డేరాతో) పోల్చబడింది. ఓ మదనాంతకా! శివా! ధైర్యము అనే స్తంభము ఆధారంగా గలదియూ, స్థిరములైన త్రాళ్ళచే కట్టబడినదియూ, ఎక్కడికైననూ పోవునదియూ, (ఎక్కడికైనా తీసికొని పోవడానికి వీలయినదియూ) ఆశ్చర్యకరమైనదియూ (చిత్ర వర్ణములతో కూడినట్టిదియూ, పద్మమువలె సుందరమైనదియూ, (పద్మాకార చిత్రములచే సుందరమైనదియూ,) ప్రతి దినమున ఉత్తమ మార్గమున ఉంౘబడునదియూ ( యోగ్యమైన విధమున ఏర్పరుపబడినదియూ) అయిన నా చిత్తము అనే స్ఫుటమైన డేరాలో ప్రవేశించి, ప్రమథగణ సేవితుడవైన ప్రభూ! దేవా! శక్తియైన పార్వతీదేవితో కలిసి నివసించి యుండుము. నా చిత్తము అనే డేరా, నీవు నివసింౘడానికి సుఖకరంగా ఉంటుంది. కాబట్టి గణసేవితుడవై, పార్వతితో కలసి, అందు నివసింపుము.


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱

 🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹

.          *🌹సౌందర్యలహరి🌹*

.                   *శ్లోకం - 97*

🌷🪷🌷🪷🌷🪷🌷🪷🌷🪷


*గిరా మహుర్దేవీం ద్రుహిణగృహిణీ మాగమవిదో*

*హరేః పత్నీం పద్మాం హరసహచరీ మద్రితనయామ్ |*

*తురీయా కాపి త్వం దురధిగమనిస్సీమమహిమ*

*మహామయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మమహిషి ||*



సౌందర్యలహరి కి ఇది మకుటాయమానమైన శ్లోకం. అమ్మవారి తత్త్వాన్ని చెప్పే శ్లోకం.


గిరా మహుర్దేవీం = నీవు వాగ్దేవివి


ద్రుహిణగృహిణీమ్ = బ్రహ్మ భార్యవు, సరస్వతి అనీ


హరేః పత్నీం పద్మాం = విష్ణు పత్నివైన లక్ష్మివనీ


హరసహచరీ మద్రితనయామ్ = రుద్రుని భార్యవైన హిమగిరి తనయవనీ అంటున్నారు ఆగమ శాస్త్రవేత్తలు. అనగా వారి శక్తివిగా  సృష్టి స్థితి లయ కార్యములను నీవు నిర్వహిస్తున్నావని. ముగురమ్మల మూలపుట్టమ్మవని.కానీ వారు నీకు సదా సేవ చేస్తుంటారు.

లలితా సహస్రనామము *సచామర రమావాణీ సవ్య దక్షిణ సేవితా*


తురీయా కాపి త్వం దురధిగమనిస్సీమమహిమా = ఇక్కడ పరతత్త్వాన్ని గురించి చెపుతున్నారు.

జగత్తు అంతా మూడిటితో ఉన్నది.జాగ్రత్,స్వప్న, సుషుప్త అవస్థలు. అంటే మేల్కొని ఉండటం, నిద్రలో స్వప్నావస్థలో ఉండటం, స్వప్నం కూడా లేని గాఢనిద్రలో ఉండటం. సుషుప్తి- గాఢనిద్రలో మనస్సు కూడా పనిచేయదు. ఈ మూడింటికీ అవతల మరొకటుంది. దానిని తురీయం అంటారు అదే పరతత్త్వం. దీపకాంతిలో మనము మన వ్యవహారాలు చక్కపెట్టుకుంటామని ఆ కాంతి పరమేశ్వరి అయితే ఆ దీపము పరేశ్వరుడు. చైతన్యం ఈశ్వరునిది కాంతి జ్యోతిదైనట్లు. వారిద్దరూ వేరుకాదు వాటిని వేరు చేసి చూడలేము. అదే *శివశక్త్యయిక రూపిణి* 

ఓంకారంలో అ, ఉ, మ శబ్దాలు సృష్టి స్థితి లయ శక్తులైతే చివరిలో మ్ అనే సూక్ష్మ నాదం తురీయం పరతత్త్వం. ఈ తురీయము హద్దులు లేని అధిగమించలేని నీ మహిమేనమ్మా అంటున్నారు ఈ పాదంలో.

మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మమహిషి = మహామాయ పరమేశ్వరుని శక్తియే.ఆ మహామాయతోనే ఈశ్వరుడు ఈ ప్రపంచ నిర్వహణ చేస్తున్నాడు.ఆమె పరమేశ్వరుని పట్టమహిషి.

*మహాకామేశ మహిషి మహాత్రిపురసుందరి* లలితా సహస్రనామాల్లో రెండవ నామం *శ్రీ మహారాజ్ఞీ* అని కదా.మరి ఇక్కడ మహాకామేశ మహిషీ అన్నారేమిటి అంటే కంచి పరమాచార్య వారన్నారు మహారాజ్ఞీ అంటే సమస్త స్వతంత్రాధికారం కలది.కానీ అమ్మవారు శివశక్త్యయి రూపిణి కనుక ఆమె ఇక్కడ కామేశ్వర పట్టమహిషి అనే పిలవబడుతుంది అన్నారు. అమ్మవారు మహామాయయై విశ్వమునంతా త్రిప్పి వేస్తున్నది. మహాకామేశ్వరుడు త్రిమూర్తుల స్వరూపమైతే ఆమె వారి శక్తుల స్వరూపము. 

ఈ మాటనే శ్రీకృష్ణుడు అర్జునునితో భగవద్గీతలో అంటాడు....

*ఈశ్వరః సర్వభూతానాం హృద్దేశేఽర్జున తిష్ఠతి ౹*

*భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా ౹౹*

ఈశ్వరుడు సమస్త ప్రాణుల హృదయములలో స్థితుడై ఉంటాడు. ఓ అర్జునా భౌతిక శక్తిచే తయారు చేయబడిన యంత్రమును అధిరోహించి ఉన్న జీవాత్మల గతిని వాటి వాటి కర్మల అనుగుణంగా ఆయన నిర్దేశిస్తూ ఉంటాడు.

           🙏🏻 *శ్రీమాత్రే నమః*🙏🏻


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

 🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

.    *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*

.   *ఓం నమో భగవతే రామకృష్ణాయ*


.       *🚩శ్రీ వివేకానందస్వామి🚩*

.                *🚩జీవిత గాథ🚩*   

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

.                    *భాగం 107*


*శిష్యుని భారం వహించిన గురువు*


శరత్ తన ఉద్యోగానికి తిలోదకాలిచ్చి స్వామీజీతో బయలుదేరాడు. ప్రప్రథమంగా వారు హృషీకేశ్ వెళ్లారు. అప్పటి దాకా హాయిగా జీవితం గడుపుతున్న శరత్  సన్న్యాస జీవితంలోని  యాతనలను ఎదుర్కొనలేకపోయాడు. చాలాదూరం నడవడం, ఆకలిదప్పులను భరించడం అతడికి మరీ క్రొత్త; అతడు ఎంతో కష్టపడ్డాడు. కాని స్వామీజీ మూర్తీభవించిన ప్రేమస్వరూపులై శిష్యుని బరువులను తామే స్వీక రించారు. బరువులను మాత్రమే కాదు, శిష్యుణ్ణే ఆయన మోశారు. 


కాలాంతరంలో శరత్ ఇలా అన్నాడు:


"ఒక పర్యాయం హిమాలయాల్లో మేమిద్దరం కాలినడకన వెళుతున్నప్పుడు, ఆకలి దప్పులతో నాకు స్పృహతప్పింది. అప్పుడు నా మూటాముల్లెనేగాక నన్ను కూడా స్వామీజీ మోసుకెళ్లారు.  మరొక సందర్భంలో మేం ఒక ఏరు దాటవలసివచ్చింది.ఆ ఏరు అమిత వేగంతో ప్రవహిస్తూన్నది. ఆ ప్రాంతం బాగా జారుడుగా ఉండడంతో నేను భయపడ్డాను. అప్పుడు స్వామిజీ నవ్వుతూ నన్ను ఒక గుర్రం మీద కూర్చోబెట్టి, తాము గుర్రం కళ్లాన్ని పుచ్చుకొని నడిచారు. గుర్రాన్ని నడిపిస్తూ నదిని దాటారు. ఆయన నా కోసం తమ ప్రాణాలనే పణంగా ఒడ్డారు. మిత్రులారా! ఆయనను గురించి నేను ఏం చెప్పను! ప్రేమ, ప్రేమ, ప్రేమ - ఈ ఒక్క మాట తప్ప ఇంకేమీ చెప్పలేను. నాకు బాగా అస్వస్థతగా ఉన్నప్పుడు నా సంచీ, నా కట్టుబట్టలు, ఇంకా చెప్పాలంటే నా పాదరక్షలను సైతం ఆయన మోశారు."


కాలాంతరంలో ఒకసారి మనస్సు కాస్త చంచలమవగా, శరత్,... 

"స్వామీజీ, నన్ను వదలిపెట్టేస్తారా?"  

            

   ‌‌          "మూర్ఖుడా! నీ చెప్పులు కూడా నేను మోశానని మరచిపోయావా?" అంటూ స్వామీజీ అతణ్ణి సుతిమెత్తగా చీవాట్లు పెట్టారు.


ఒకసారి స్వామీజీ శరత్ లు ఒక కీకారణ్యం గుండా వెళ్తున్నారు. దారిలో ఒక చోట (మనిషి) కొన్ని ఎముకలూ, ప్రక్కనే కాషాయవస్త్రాలు చెల్లాచెదరుగా పడివున్నాయి. "శరత్, అదిగో చూడు, పులో లేక మరేదో క్రూరమృగమో ఇక్కడ ఒక సన్యాసిని చంపి తినివుంటుంది" అంటూ స్వామీజీ ఆ ఎముకల గుట్టను శరత్ కు చూపించారు. శరత్ అదంతా చూసి విస్తుబోయాడు వెంటనే స్వామిజీ, "ఏం నాయనా, భయంగా ఉందా?" అని అడిగారు. అందుకు శరత్. "లేదు. ప్రక్కన మీరు ఉన్నప్పుడు నా కెందుకు భయం?" అని జవాబిచ్చాడు.🙏


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

👉 *రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

 🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱

.          *⚜️పెరియ పురాణం⚜️*

.           *నాయనార్ల చరిత్ర - 21*

🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱

 

*కులచ్చిరై నాయనారు*


మణ మేక్కుడి అనే అందమైన గ్రామంలో గొప్ప శివభక్తుడైన

కలచ్చిరైయారు జన్మించాడు. నిరంతరమూ శివభక్తిలో లీనమై యున్న

అతడు పాండ్య చక్రవర్తికి ప్రధానమంత్రిగా ఉండేవాడు.


శివుని అనుగ్రహం పొందాలంటే శివభక్తులకు సేవ చేయాలనే

విషయాన్ని గ్రహించిన కులచ్చిరైయారు శివభక్తులు తనకు ఎదురైతే వారి

పాదాలకు సాష్టాంగ నమస్కారం చేస్తుండేవాడు. వాళ్లు ఏ కులానికి చెందిన

వారైనా ధనవంతులైనా పేదవారైనా అందరినీ సమానంగా భావించేవాడు.


శివభక్తులు సమూహంగా వచ్చినా, లేక ఒక్కరే వచ్చినా వారిని సంతోషంగా ఆహ్వానించి, వారిని అతిథి మర్యాదలతో సంతృప్తి

పరుస్తుండేవాడు. పాండ్య చక్రవర్తికి అమాత్యులుగా ఉన్న కులచ్చిరైయారు

దేశాన్ని శత్రువుల బారి నుండి సంరక్షిస్తూ వచ్చాడు. 


శైవమతం అభివృద్ధి

చెందడానికి కారణమైన మంగయర్ క్కరసి రాణిగారి శైవభక్తి సేవలకు

నిజమైన సేవకుడుగా ఉంటూ శివభక్తులను ఆదరిస్తూ వచ్చాడు. తిరుజ్ఞాన

సంబందరు తిరుచరణాలను తన శిరసున ధరించిన మహానుభావుడితడు.

సుందరమూర్తి నాయనారుచే 'తిరుతొండ తొగై’ గ్రంథంలో 'పెరునంబి’

అని కీర్తింపబడ్డ శివభక్తుడు కులచ్చిరైనాయనారు.

*ఇరవై ఒకటవ చరిత్ర సంపూర్ణం*


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱

 •••••┉━•••••┉━•••••┉━•••••┉━

*05-12-2023 / మంగళవారం / రాశిఫలాలు*

•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━

మేషం


వ్యాపారాలు, ఉద్యోగాలలో పరిస్థితులు అనుకూలిస్తాయి. నూతన వ్యక్తులతో పరిచయాలు కలుగుతాయి. మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. సంఘంలో ప్రముఖుల ఆదరణ పెరుగుతుంది. విలువైన వస్తు, వస్త్ర లాభాలు అందుతాయి. నూతన ఉద్యోగ అవకాశములు అందుతాయి.

---------------------------------------

వృషభం


వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగాలలో ఊహించని సమస్యలు ఎదురవుతాయి. వృధా ప్రయాణాలు చెయ్యవలసి వస్తుంది. ఇంటాబయట ఒత్తిడులు పెరుగుతాయి.

---------------------------------------

మిధునం


ఆరోగ్య పరంగా చికాకులు తప్పవు. సన్నిహితులతో విభేదాలు కలుగుతాయి. చేపట్టిన పనులలో శ్రమాధిక్యత కలుగుతుంది. వ్యాపార, ఉద్యోగాలలో సమస్యలు తప్పవు. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి.

---------------------------------------

కర్కాటకం


వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణిస్తాయి. బంధు మిత్రులతో సఖ్యత కలుగుతుంది. ఉద్యోగాలలో మరింత అనుకూల వాతావరణం ఉంటుంది. నిరుద్యోగులకు అధికారుల అనుగ్రహం పొందుతారు. కొన్ని పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఇంటా బయట అందరిలోనూ గుర్తింపు లభిస్తుంది. 

---------------------------------------

సింహం


స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. చేపట్టిన వ్యవహారాలలో అవాంతరాలు కలుగుతాయి. కుటుంబసభ్యులతో విభేదాలు కలుగుతాయి. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగాలలో ఊహించని మార్పులు ఉంటాయి. నూతన రుణయత్నాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాల వలన మార్గ అవరోధాలు కలుగుతాయి.

---------------------------------------

కన్య


వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆప్తుల నుండి శుభవార్తలు అందుతాయి. ఆకస్మిక ధన, వస్తులాభాలు  పొందుతారు. ఉద్యోగాలలో సమస్యలు తొలగుతాయి. చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. విందువినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు.

---------------------------------------

తుల


పుణ్యక్షేత్రాలు  సందర్శిస్తారు. చేపట్టిన పనుల్లో అవాంతరాలు కలుగుతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. వ్యాపార, ఉద్యోగాలలో ఇబ్బందులు తప్పవు. వృధా ఖర్చుల విషయంలో పునరాలోచన చెయ్యాలి. కుటుంబసభ్యులతో వివాదాలు చికాకు పరుస్తాయి.

---------------------------------------

వృశ్చికం


మిత్రులతో విందువినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. నూతన ఉద్యోగ అవకాశములు లభిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు విస్తృతమౌతాయి. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి. స్థిరస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి.

---------------------------------------

ధనస్సు


చిన్ననాటి మిత్రులను కలుసుకుని కీలక విషయాలు చర్చిస్తారు. దీర్ఘకాలిక వివాదాలు తీరి ఊరట చెందుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల మార్పులు ఉంటాయి. విద్యార్థులకు నూతన విద్యావకాశాలు లభిస్తాయి. సంఘంలో పేరు కలిగిన వారితో పరిచయాలు పెరుగుతాయి.

---------------------------------------

మకరం


ధనపరంగా ఇబ్బందులు తప్పవు. చేపట్టిన వ్యవహారాలలో చికాకులు తొలగుతాయి. కుటుంబసభ్యులతో స్వల్ప విభేదాలు కలుగుతాయి. దైవ చింతన పెరుగుతుంది. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగాలలో  గందరగోళ పరిస్థితులుంటాయి. అనారోగ్య సమస్యలు చికాకు పరుస్తాయి. వృధా ప్రయాణాలు చేస్తారు.

---------------------------------------

కుంభం


ఆర్థిక ఇబ్బందులు చికాకు పరుస్తాయి. మిత్రులతో మాటపట్టింపులు తప్పవు. చేపట్టిన పనులు మందగిస్తాయి. వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితం కనిపించదు. ఉద్యోగాలలో అధికారుల నుండి సమస్యలు తప్పవు. నూతన రుణయత్నాలు చెయ్యవలసి వస్తుంది. ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది.

---------------------------------------

మీనం


వ్యాపారాలలో ఆశించిన రీతిలో లాభాలు అందుకుంటారు. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో  పాల్గొంటారు. నూతన వాహనయోగం ఉన్నది. ఉద్యోగయత్నాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగమున జీతబత్యముల విషయంలో శుభవార్తలు అందుతాయి. మొండి బాకీలు వసూలవుతాయి. పనులు సకాలంలో పూర్తి చేస్తారు.

•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━

🍁 *శుభం భూయాత్* 🍀

*నమస్తే సదా వత్సలే మాతృ భూమే!*

               🌷🌷🌷

*కలియుగాబ్ది 5124* *శ్రీ శాలివాహన శకం 1944 స్వస్తి శ్రీ    చాంద్రమాన శోభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం - శరదృతువు - కార్తీక మాసం - కృష్ణ పక్షం  -‌ అషౄ - పూర్వాఫల్గని -‌ భౌమ వాసరే* *(05-12-2023)* 


ప్రముఖ వేదపండితులు,  *బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* గారి నేటి వేద ఆశీర్వచనం.


https://youtu.be/_h40EV9nSSc?si=g1pJlcHIvQ47DZPE


🙏🙏

 🕉️🪔  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🪔🕉️

🪔 ॐ卐  *_-|¦¦|భక్తిసుధ|¦¦|-_* ॐ卐 🪔


*శ్లో* 𝕝𝕝 

*సంసార యూథ గజసంహతి సింహదంష్ట్రా*

*భీతస్య దుష్టమతిదైత్య భయంకరేణ*  *ప్రాణప్రయాణభవభీతినివారణేన*

*లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్* ||


_ *_శ్రీ లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం - 12_* _


*తా*: ఓ నృసింహ మూర్తీ! నీ స్వరూపము దుష్ట బుద్ధులగు

రాక్షసులకు మిగుల భయము కల్గించుచున్నది. సంసార

సమూహములనెడి భయమును పోగొట్టునది. అట్టి రూపము

ధరించి నాప్రాణములు కాపాడుము. *లక్ష్మీదేవితో కూడిన నృసింహమూర్తీ! నాకు చేయూత నిమ్ము*.

 🕉 మన గుడి : నెం 259


⚜ గుజరాత్ : మాధవపూర్


⚜ శ్రీ మాధవరాయ్‌జీ దేవాలయం . 



💠 మాధవ్‌పూర్ (ఘేడ్) భారతదేశంలోని గుజరాత్‌లోని పోర్‌బందర్ జిల్లాలో ఒక పట్టణం. దీనికి శ్రీకృష్ణుని మరో పేరు మా


ధవరాజ్ అనే పేరు పెట్టారు.

మాధవపూర్ యొక్క ఆకర్షణలు అందమైన మాధవరాయ్జీ హవేలీ ఆలయం, రుక్మణి నో చోరో, శివాలయం, బీచ్, ఓషో ఆశ్రమం, వల్లభాచార్యబేతక్. 


💠 ఈ ప్రాంతాన్ని భీష్మకుని రాజ్య ప్రాంతంగా భావిస్తారు. ఇక్కడ శ్రీకృష్ణ రుక్మిణీలు కొలువై వున్నారు. ప్రతి సంవత్సరం పెద్ద ఉత్సవం జరుగుతుంది. శ్రీకృష్ణుడు రుక్మిణి కోరికపై వచ్చి తీసుకొని వెళ్ళిపోయిన ఘట్టాలను ఉత్సవాలలో ప్రదర్శిస్తారు.


💠 శ్రీ కృష్ణుడు ఇక్కడే రుక్మణి దేవిని వివాహం చేసుకున్నాడని నమ్ముతారు.  ఈ సంఘటన జ్ఞాపకార్థం, 12వ లేదా 13వ శతాబ్దంలో రాజ్‌పుతానా నిర్మాణ శైలిలో మాధవరాయ్‌జీ ఆలయం నిర్మించబడింది.


💠 భారతదేశంలో కృష్ణుడు మరియు అతని సోదరుడు బలరామ్‌ల విగ్రహాలు ఉన్న ఏకైక ఆలయం మాధవ్‌పూర్‌లోని మాధవరాయ్ ఆలయం.


⚜ స్థల పురాణం ⚜


💠 పురాణాల ప్రకారం, శిశుపాలుడితో వివాహాన్ని నిరోధించడానికి రుక్మిణి  కోరికపై శ్రీకృష్ణుడు యువరాణి రుక్మిణిని అపహరించాడు. 

రుక్మణి విదర్భ్ రాజు భీష్మకుని కుమార్తె. యువరాణి రుక్మణి శ్రీ కృష్ణుని గొప్పతనం, ఆకర్షణ మరియు స్వభావం కారణంగా కృష్ణుడితో ప్రేమలో పడింది. 

రుక్మణి తల్లిదండ్రులు ఆమెను కృష్ణుడితో వివాహం చేసుకోవడానికి అంగీకరించారు, అయితే ఆమె సోదరుడు రుక్మి దానిని వ్యతిరేకించాడు మరియు మగధ రాజు జరాసంధుతో సంబంధం ఉన్న అతని స్నేహితుడు శిశుపాలతో రుక్మణి వివాహం నిశ్చయించాడు.


💠 ఈ వివాహాన్ని నివారించడానికి రుక్మిణి తన విశ్వసనీయ పండితుడి  ద్వారా శ్రీకృష్ణునికి కబురు  పంపింది. 

శ్రీ కృష్ణుడు పరిస్థితిని అర్థం చేసుకున్నాడు మరియు ద్వారక మరియు విదర్భల మధ్య యుద్ధాన్ని నివారించడానికి రుక్మిణి అపహరణకు అంగీకరించాడు. 


💠 జానపదుల ప్రకారం,శ్రీకృష్ణుడు రుక్మణిని అపహరించిన తర్వాత ఈ గ్రామానికి వచ్చి ఆమెను ఈ ప్రదేశంలోనే వివాహం చేసుకున్నాడు. 

ఆ ఘట్టం జ్ఞాపకార్థం మాధవరాయ్‌కు ఆలయం నిర్మించబడింది. 

ఈ వివాహాన్ని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం మాధవపూర్‌లో సాంస్కృతిక ఉత్సవం నిర్వహిస్తారు. 


💠 మాధవరాయ్జీ మందిరాన్ని సందర్శించడానికి ఉత్తమ సమయం శ్రీ 

కృష్ణజన్మాష్టమి, తులషి వివాహ, దీపావళి వంటి కొన్ని పండుగలు మరియు రామ్ నవమి నుండి వచ్చే నాలుగు రోజులు.


💠 మాధవ్‌పూర్ 13వ శతాబ్దపు శ్రీకృష్ణుని రూపమైన మాధవరాయ్‌జీ దేవాలయం ఉన్న ప్రదేశంలో 14వ శతాబ్దం మధ్య నాటికి సముద్రంలో భూకంపం వచ్చిందని, దాని కారణంగా సముద్ర మట్టం పెరిగి ఆలయం సముద్రంలో మునిగిపోయిందని, 15వ శతాబ్దం ప్రారంభంలో సముద్ర మట్టం పడిపోయిందని, ఆలయం మళ్లీ కనుగొనబడిందని నమ్ముతారు.  అప్పటి నుండి స్థానికులు ఈ ఆలయం మనుషులచే నిర్మించబడలేదు మరియు దేవుళ్లచే సృష్టించబడింది అని నమ్ముతారు.


💠 అసలు ఆలయం ముస్లిం ఆక్రమణదారుల దాడుల వల్ల తీవ్రంగా దెబ్బతింది, అయినప్పటికీ శిథిలమైన నిర్మాణం ఇప్పటికీ ఉంది. పాత ఆలయానికి ఆనుకుని కొత్తగా నిర్మించిన ఆలయాన్ని ఇప్పుడు పూజల కోసం ఉపయోగిస్తున్నారు.


💠 గ్రామం పేరు: మాధవపూర్;  ఘెడ్ అంటే కోట. అందుకే, ఈ గ్రామాన్ని మాధవపూర్ ఘెడ్ అని పిలుస్తారు.


💠 ప్రతి సంవత్సరం, రామ నవమి రోజు నుండి 5 రోజుల పాటు, ప్రధానంగా కృష్ణుడు రుక్మిణి వివాహం చేసుకున్న  నేపథ్యంలో సాంస్కృతిక ఉత్సవం నిర్వహించబడుతుంది.  

కృష్ణుడి కళ్యాణ వేడుకలో భాగంగా రంగురంగుల రథాన్ని అలంకరించి కృష్ణుడి విగ్రహాన్ని ఉంచి గ్రామం గుండా ఊరేగింపు సాగుతుంది. 

వేడుకలో భాగంగా గ్రామ ప్రజలు ఒకరిపై ఒకరు రంగులు వేసుకుంటారు మరియు ఆనందకరమైన నృత్యాలు కూడా చేస్తారు.


💠 ఉత్తర వైష్ణవ హిందూ శాఖ స్థాపకుడైన వల్లభాచార్య పీఠం కారణంగా మాధవపూర్ సాంస్కృతికంగా కూడా ముఖ్యమైనది.  

బైఠక్ గా  పిలువబడే ఈ పీఠం వల్లభాచార్య యొక్క 84 బైఠక్‌లలో 66వది.



💠 ఓషో యొక్క ధ్యాన కేంద్రం: 

మాధవపూర్‌లో ఓషో యొక్క ధ్యాన కేంద్రాలలో ఒకటి కూడా ఉంది, ఇక్కడ ప్రముఖ ఓషో సన్యాసి స్వామి బ్రహ్మవేదాంత్ నివసిస్తున్నారు మరియు ప్రతిరోజూ ఉపన్యాసాలు ఇస్తారు. ఆశ్రమంలో ఉండేందుకు ఎలాంటి తప్పనిసరి రుసుము లేదు. 

ఇది ఎక్కువగా డొనేషన్ సిస్టమ్‌పై నడుస్తుంది. ఎవరైనా తన సౌలభ్యం ప్రకారం డబ్బును విరాళంగా ఇవ్వవచ్చు మరియు ఎవరైనా డబ్బు లేకుంటే ఫర్వాలేదు.

ఆశ్రమం గుజరాత్‌లోని మారుమూల ప్రాంతంలో ఉన్నప్పటికీ, ఇది భారతదేశంలోని అత్యంత అందమైన మరియు పెద్ద ఓషో ఆశ్రమాలలో ఒకటి.


💠 మాధవపూర్ ఘేడ్ ద్వారకా - సోమనాథ్ ప్రధాన రహదారిపై ఉంది మరియు పోర్ బందర్ నుండి కేవలం 58 కి.మీ దూరంలో ఉంది కాబట్టి దీనిని రోడ్డు మరియు రైలు నెట్‌వర్క్ ద్వారా సులభంగా చేరుకోవచ్చు. 

 🪔🪔  *అంతర్యామి*  🪔🪔


_*#దేవుడు మెచ్చిన పూలు#*_


🍁మనం భగవంతుడి పట్ల భక్తి ప్రపత్తులతో, ప్రేమతో ఎన్నోరకాల పుష్పాలు తెచ్చి పూజిస్తాం. మల్లెలు, మొల్లలు, మందారాలు, సంపెంగలు, గులాబీలు, పారిజాతాలు- ఇలా ఎన్నెన్నో పూలతో పూజిస్తూ భగవదర్చనలో భాగంగా భావించి, తృప్తిచెందుతాం. ఉపాసన రెండువిధాలుగా ఉంటుంది- సగుణోపాసన, నిర్గుణోపాసన అని. దైవాన్ని ఓ విగ్రహంలోనో, పటంలోనో, శిలలోనో చూసుకుంటూ, అదే నమ్మకంతో పూలు, ధూపదీప నైవేద్య, తాంబూలాదులతో అర్చించడం సగుణోపాసన, పేరు.. రూపం మొదలైనవి ఏవీ లేవని, స్వామి నిర్గుణ 0 పరబ్రహ్మస్వరూపుడని ఆత్మజ్ఞానంతో, ధ్యానంతోఉపాసించడమనేది నిర్గుణోపాసన. 


🍁కొద్దికాలమే ఉండి, తరవాత వాడి, వాసన కోల్పోయి, నిర్మాల్యంగా మిగిలిపోయే ఈ పూలకంటే నిజంగా దైవం మెచ్చిన పూలు వేరే ఉన్నాయి. అవి అంతర్యామికి అర్పించుకోవడమే అసలైన పూజ అని విజ్ఞులు చెబుతున్నారు.


🍁పరమాత్మకు అందించవలసిన ప్రథమపుష్పం అహింస. మనం అహింసా ధర్మం పాటిస్తే ఆ పుష్పంతో పరంధాముణ్ని పూజించినట్లే. లోకంలో O దీన్ని మించిన ధర్మం లేదు కనుక దీన్ని పరమధర్మం అన్నారు. శారీరకంగా సాటివారిని హింసించడం శారీరక హింస. మానసికంగా హింసించడం మానసిక హింస. ఈ రెండూ మనిషికి కూడనివి.


🍁రెండో కుసుమం- ఇంద్రియ సంయమనం. మనిషి ఇంద్రియ నిగ్రహం అలవరచుకుంటే పాపాలు చేయడు. నేడు ముఖ్యంగా సంయమన లోపం వల్లనే సమాజంలో ఎన్నో దుష్కృతాలు జరుగుతున్నాయి. దోపిడీళ్లు, దొంగతనాలు, హత్యలు, అత్యాచారాలు, పగలు, ప్రతీకారాలు పెచ్చరిల్లిపోతున్నాయి. మనోనియంత్రణ ఉంటే ఇటువంటి అల్లకల్లోలాలు చాలావరకు తగ్గుతాయి.


🍁మూడోది దయాపుష్పం. సృష్టిలోని ప్రతి ప్రాణికీ జీవించే హక్కుంది. 'బతుకు, బతకనివ్వు' అన్నారు అందుకే! సమాజం ఎంతోమంది అనాథలు, వృద్ధులు, దివ్యాంగులు, పీడితులు, క్షుద్బాధతో అలమటిస్తున్నవారున్నారు. వారిపట్ల దయ చూపించడమే కాక, ఆదుకుని చేయి అందించడం మన ధర్మం. ఈ దయా ప్రసూనాన్నే దేవుడు స్వీకరిస్తాడు.


🍁మరో పుష్పం - క్షమా పుష్పం. క్షమ అంటే ఓర్పు, సహనం. క్షమ అనేది మనిషికి పెట్టని ఆభరణం. క్షమ వల్ల ఖ్యాతి లభిస్తుంది. గౌరవం, అధికారం, అభిమానం సహనం వల్లనే లబిస్తాయి.


🍁ఆశ్రితవత్సలుడు మెచ్చే మరో అపురూప ప్రసూనం- శాంతి. ఎన్ని కష్టాలు పడ్డా తుకారాం, మీరాబాయి శాంతిని విడనాడలేదు.


🍁తపఃపుష్పం దేవుడు మెచ్చే మరో పుష్పం. అడవుల్లో చేసేదే తపస్సు కాదు. నిరంతరం త్రికరణ శుద్ధిగా దైవాన్ని స్మరిస్తూ తన కర్తవ్య నిర్వహణలో నిమగ్నం కావడమూ తపస్సే. అరిషడ్వర్గాలను దూరంగా ఉంచి, తమ విధులనే నిధులుగా భావించేవారిని భగవంతుడు ఇష్టపడతాడు.


🍁మరో పుష్పం ధ్యాన పుష్పం. శ్వాసపైన ధ్యాస ఉంచి, అహం బ్రహ్మాస్మి అనుకోగల పరిణతి పొందడమే ధ్యాన పుష్పం.


🍁చివరి పుష్పం సత్యం. విశ్వమంతా సత్యం మీదనే

ఆధారపడి ఉంది. సత్యం నిత్యమైనది. శాశ్వతమైనది. సత్యమే దైవమన్నారు.

🍁ఈ అష్టగుణ సుమాలతో చేసే ఆరాధనే తన కిష్టమన్నాడు ఆపద్బాంధవుడు.

 🕉️ *శివునికి సోమ‌వార‌మే ఎందుకు?* 🕉️


🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸


శివున్ని పూజించే భ‌క్తులంతా సోమ‌వారం రోజున ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించ‌డం స‌హ‌జం.

ఆ రోజునే ఉప‌వాసం ఉంటారు చాలామంది.ఎందుక‌ని..? అంటే…. సోముడు అంటే చంద్రుడు. మనకు ఉన్న వారాల పేర్లన్నీ గ్రహాలను అనుసరించి వచ్చాయి. చంద్రుని వారం సోమవారం.


చంద్రుని ధరించినవాడు శివుడు. 

చంద్రుడే సోముడు కనుక శివుని చంద్రశేఖరుడు అనీ, సోమశేఖరుడు అని పిలుస్తారు. 

చంద్రునికి ప్రత్యేకించి ఆలయం లేనందున శివుని ఆరాధించడం ఆనవాయితీగా వస్తోంది. 

అంతేకాదు. సోమ అనే శబ్దాన్ని స+ఉమ అని విడగొడితే ఉమాసహితుడు అనే అర్థం వస్తుంది.


ఉమాసహితుడైనవాడు అంటే పార్వతీపతి ఎవరు? శివుడే కదా..! ఆ విధంగా సోమవారం శివునికి 

ప్రత్యేక దినంగా రూపాంతరం చెందింది. 


స్కాందపురాణంలో సోమవార వ్రతమహిమ ఉంది. ఈ రోజున శివుడు ఉమాసహితుడై భక్తులను అనుగ్రహిస్తాడు.


సోముడంటే కుబేరుడు అనే అర్థం కూడా ఉంది. ఐశ్వర్యం ఈశ్వరాదిచ్ఛేత్.. ఈశ్వరుడు ఐశ్వర్యదాయకుడు. శివుని ఆరాధించిన కుబేరుడు ఐశ్వర్యవంతుడైన రోజు కనుక ఈ రోజును సోమవారం అని పిలుస్తున్నారని పెద్దలు చెబుతారు. 


స్కాందపురాణం సోమవారవ్రతం వైశిష్ట్యాన్ని చెబుతూ అందుకు ఉదాహరణగా చంద్రాంగదుని కథ చెప్పింది. 


నలదమయంతుల మనుమడు చంద్రాంగదుడు , అతడు చిత్రకర్మ కుమారై సీమంతినిని వివాహమాడి కొంతకాలం మావగారింట్లోసుఖంగా గడిపాడు. ఓరోజు యమునా నదిలో మిత్రులతో నౌకావిహారం చేస్తూ పెద్దగాలికి నౌక తిరగబడగా నీటిపాలయ్యాడు.అప్పుడు మైత్రేయి అనే మునిపత్ని సీమంతినికి దైర్యంచెప్పి పరమశివునికి ఇష్టమైన సోమవారవ్రతం చేయమని ప్రోత్సహించింది. అమె వ్రతం ఆరంభించింది. నౌకాప్రమాదంలో నీళ్ళలో పడిన చంద్రాంగదుడు అట్టడుగున ఉండే నాగలోకం చేరాడు. అక్కడ నాగరాజైన తక్షకుడు చంద్రాంగదుని వినయవిధేయతలకు మెచ్చి, కానుకల్చి, నాగకన్యలతో పాటు ఒక నాగ యువకుని తోడిచ్చి సాగనంపాడు అప్పటికి భూలోకంలో మూడేళ్ళు గడిచిపోయాయి. అతని రాజ్యాన్ని శత్రువులు ఆక్రమించారు. భార్య వ్రతదీక్షలో ఉంది.  పరిస్థితిని గమనించిన చంద్రాంగదుడు శత్రువులను జయించి రాజ్యాన్ని సుభిక్షంగా పరిపాలించాడు. పరమశివునికి ప్రీతికరమైన సోమవార వ్రతాన్ని కార్తీక సోమవారాలలో చేస్తే సత్ఫలితాన్నిస్తుంది...🚩


🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿