5, డిసెంబర్ 2023, మంగళవారం

 🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

.    *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*

.   *ఓం నమో భగవతే రామకృష్ణాయ*


.       *🚩శ్రీ వివేకానందస్వామి🚩*

.                *🚩జీవిత గాథ🚩*   

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

.                    *భాగం 107*


*శిష్యుని భారం వహించిన గురువు*


శరత్ తన ఉద్యోగానికి తిలోదకాలిచ్చి స్వామీజీతో బయలుదేరాడు. ప్రప్రథమంగా వారు హృషీకేశ్ వెళ్లారు. అప్పటి దాకా హాయిగా జీవితం గడుపుతున్న శరత్  సన్న్యాస జీవితంలోని  యాతనలను ఎదుర్కొనలేకపోయాడు. చాలాదూరం నడవడం, ఆకలిదప్పులను భరించడం అతడికి మరీ క్రొత్త; అతడు ఎంతో కష్టపడ్డాడు. కాని స్వామీజీ మూర్తీభవించిన ప్రేమస్వరూపులై శిష్యుని బరువులను తామే స్వీక రించారు. బరువులను మాత్రమే కాదు, శిష్యుణ్ణే ఆయన మోశారు. 


కాలాంతరంలో శరత్ ఇలా అన్నాడు:


"ఒక పర్యాయం హిమాలయాల్లో మేమిద్దరం కాలినడకన వెళుతున్నప్పుడు, ఆకలి దప్పులతో నాకు స్పృహతప్పింది. అప్పుడు నా మూటాముల్లెనేగాక నన్ను కూడా స్వామీజీ మోసుకెళ్లారు.  మరొక సందర్భంలో మేం ఒక ఏరు దాటవలసివచ్చింది.ఆ ఏరు అమిత వేగంతో ప్రవహిస్తూన్నది. ఆ ప్రాంతం బాగా జారుడుగా ఉండడంతో నేను భయపడ్డాను. అప్పుడు స్వామిజీ నవ్వుతూ నన్ను ఒక గుర్రం మీద కూర్చోబెట్టి, తాము గుర్రం కళ్లాన్ని పుచ్చుకొని నడిచారు. గుర్రాన్ని నడిపిస్తూ నదిని దాటారు. ఆయన నా కోసం తమ ప్రాణాలనే పణంగా ఒడ్డారు. మిత్రులారా! ఆయనను గురించి నేను ఏం చెప్పను! ప్రేమ, ప్రేమ, ప్రేమ - ఈ ఒక్క మాట తప్ప ఇంకేమీ చెప్పలేను. నాకు బాగా అస్వస్థతగా ఉన్నప్పుడు నా సంచీ, నా కట్టుబట్టలు, ఇంకా చెప్పాలంటే నా పాదరక్షలను సైతం ఆయన మోశారు."


కాలాంతరంలో ఒకసారి మనస్సు కాస్త చంచలమవగా, శరత్,... 

"స్వామీజీ, నన్ను వదలిపెట్టేస్తారా?"  

            

   ‌‌          "మూర్ఖుడా! నీ చెప్పులు కూడా నేను మోశానని మరచిపోయావా?" అంటూ స్వామీజీ అతణ్ణి సుతిమెత్తగా చీవాట్లు పెట్టారు.


ఒకసారి స్వామీజీ శరత్ లు ఒక కీకారణ్యం గుండా వెళ్తున్నారు. దారిలో ఒక చోట (మనిషి) కొన్ని ఎముకలూ, ప్రక్కనే కాషాయవస్త్రాలు చెల్లాచెదరుగా పడివున్నాయి. "శరత్, అదిగో చూడు, పులో లేక మరేదో క్రూరమృగమో ఇక్కడ ఒక సన్యాసిని చంపి తినివుంటుంది" అంటూ స్వామీజీ ఆ ఎముకల గుట్టను శరత్ కు చూపించారు. శరత్ అదంతా చూసి విస్తుబోయాడు వెంటనే స్వామిజీ, "ఏం నాయనా, భయంగా ఉందా?" అని అడిగారు. అందుకు శరత్. "లేదు. ప్రక్కన మీరు ఉన్నప్పుడు నా కెందుకు భయం?" అని జవాబిచ్చాడు.🙏


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

👉 *రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

కామెంట్‌లు లేవు: