1, మార్చి 2022, మంగళవారం

మారేడుదళములు

 *🌿మారేడుదళములు* 🌿


మారేడు  దళములకు బోళా శంకరుడి పూజ కీ చాలా సన్నిహిత సంబంధం! బిల్వ వృక్షం (మారేడు చెట్టు) అంటేనే వృక్ష రూపంలో ఉన్న పరమశివుడు అని పురాణాలు చెప్తున్నాయి. మూడు విభూతి రేఖలు నుదుటి మీద ధరించకుండా, రుద్రాక్ష మాల లేకుం డా, బిల్వ పత్రం లేకుండా సంప్రదాయం తెలిసిన పండితులు శంకరుడిని పూజించరు! అంటుంది శివ పురాణం.


 బిల్వ వృక్ష దర్శనం, స్పర్శన మాత్రం చేతనే పాపక్షయం అవుతుందనీ, బిల్వ వృక్షాన్ని పూజలతో, చందనాది ద్రవ్యాలతో పూజిస్తే వంశాభివృద్ధి కలుగుతుందనీ శ్రద్ధాళువుల నమ్మకం. మారేడు చెట్టు కనిపించినప్పుడు, దాని ఆకులు కోసి, వాటితోనే ఆ వృక్షాన్ని పూజించినా పుణ్యమే అంటారు.


నిజానికి మారేడు చెట్టు చాలా సాధారణమైన వృక్షంగానే కంటికి కనిపిస్తుంది. మర్రి,, రావి చెట్ల లాగా మహావృక్షమూ కాదు. చెప్పుకోదగ్గ అందమైన పూలూ కనబడవు. తియ్యటి రుచికరమైన ఫలాలూ కావు. పోనీ అరుదైన వృక్షమా అంటే అదీ కాదు, ఆసి యా ఖండంలో దాదాపు అన్ని ప్రాంతాలలోనూ, అన్ని శీతోష్ణస్థితులు తట్టుకొని పెరిగే చెట్టు, నిరాడంబరతా, సాదాతనం, శీతోష్ణాలను ఓర్చుకోగల సహనం మొద లైన లక్షణాలలో మహాదేవుడికీ మారేడు చెట్టును శివా లయాలలో, దేవీ మందిరాల ప్రాంగణాలలో తప్పక పెంచుతారు. సాధారణంగా ఈ చెట్టును ఇళ్లలో పెం చరు. మారేడు ఆకులకూ, ఫలాలకూ ఓషధీ లక్షణాలు న్నాయని, కఫ వాత సంబంధమైన దోషాలను ఇవి నివారిస్తాయనీ ఆయుర్వేద వైద్యవేత్తలు అంటారు.


బిల్వ పత్రాలు మూడు దళాల రూపంగా ఉండ టం ఒక విశేషం అని చెప్పవచ్చు. ఆ త్రిదళ రూపం వల్ల వీటిని సత్వ రజస్తమోగుణాలకూ, సృష్టి స్థితి లయా లకూ, అకార ఉకార మకార సంయోగమైన ఓంకా రానికీ, శివుడి త్రినేత్రాలకు, ఆయన త్రిశూలానికి ప్రతీకలుగా భావించుతారు. త్రిదళం, త్రిగుణాకారం, త్రినేత్రం చ, త్రియాయుధం, / త్రిజన్మ పాప సంహారం, ఏక బిల్వం శివార్పణం అంటూ ఆరంభమౌతుంది. 


మారేడు దళాల ప్రశస్తిని ఉగ్గడిస్తూ చెప్పిన బిల్వా ష్టకం. ఇలా ఒక వృక్ష జాతి ప్రాశస్త్యాన్ని గురించి చెప్పే అష్టకం మారేడు గురించి తప్ప, మరే చెట్టు గురించీ కనబడదు.


వినాయక చవితి పూజలో వాడే పత్రిలో కూడా బిల్వ పత్రాలు భాగమే. తులసి, బిల్వ, నిర్గుండీ (వావి లి), అపామార్గ (ఉత్తరేణి) కపిత్థక (వెలగ), శమీ (జమ్మి), ఆమలక (ఉసిరిక),  దూర్వా (గరిక) పత్రాల ను అష్ట బిల్వాలుగా పేర్కొనే పరిగణన కూడా ఒకటి ఉంది.


‘మారేడు దళాన్ని శివ లింగానికి తాకిస్తే, ఆ స్పర్శ వల్ల కలిగిన స్పందనల ప్రభావం ఆ దళంలో చాలా సేపు నిలిచి ఉంటుంది. అలాంటి మారేడు దళం మీరు రోజంతా మీ జేబులో, హృదయానికి దగ్గరగా ఉంచుకొని చూడండి. అది మీ శారీరక స్థితినీ, మానసిక స్థితినీ కూడా ఆరోగ్యంగా, ఆహ్లాదంగా ఉంచుతుంది.


ఒకనాడు శనిదేవుడు, శివుని దర్శించుటకై కైలాసమునకేగి పార్వతీ పరమేశ్వరులను దర్శించి భక్తితో స్తుతించాడు. అంతట శివుడు శనిదేవుని విధి ధర్మమును పరీక్షించు నెపమున నీవు నన్ను పట్టగలవా? అని ప్రశ్నించాడు. అందుకు శని మరునాటి సూర్యోదయము నుండి సూర్యాస్తమయ కాలము వరకూ శివుని పట్టి ఉంచగలనని విన్నవించాడు. అంత శివుడు మరునాటి ఉషోదయ కాలమున బిల్వవృక్షరూపము దాల్చి, ఆ వృక్షమునందు అగోచరముగా నివసించాడు. మహేశ్వరుని జాడ తెలియక పార్వతీదేవితో సహా దేవతలందరు ముల్లోకములనూ గాలించారు. వారెవ్వరికి ఆ మహేశ్వరుని జాడగానీ, శనిదేవుని జాడగానీ తెలియలేదు. ఆనాటి సూర్యాస్తమయ సంధ్యాకాలము గడచిన పిదప మహేశ్వరుడు బిల్వ వృక్షము నుండి సాకార రూపముగా బయలు వెడలినాడు. మరుక్షణమే శనిదేవుడు అచట ప్రత్యక్షమైనాడు. "నన్ను పట్టుకోలేకపోయావే?" అని పరమేశ్వరుడు ప్రశ్నించగా శనిదేవుడు నమస్కరించి "నేను పట్టుటచేతనే గదా, లోకారాధ్యులు తమరు ఈ బిల్వ వృక్షరూపముగా ఇందులో దాగి వసించినారు" అన్నాడు. శనిదేవుని విధి నిర్వహణకు, భక్తి ప్రపత్తులకు మెచ్చిన శివుడు "ఈశ్వరుడినైన నన్నే కొద్దికాలము పట్టి, నాయందే నీవు వసించి యుండుటచేత నేటినుండి నీవు 'శనీశ్వరుడు' అను పేర ప్రసిద్ధి నొందగలవు. అంతట శని దోషమున్న వారు, ఆ దోషమున్నవారు, ఆ దోషపరిహారార్ధము నన్ను బిల్వ పత్రములలో పూజించిన దోష నివృత్తి జరుగును. బిల్వ పత్ర పూజ చేత శివభక్తులైన వారిని ఈ శనీశ్వరుడు బాధించడు' అని అభయమిచ్చెను.

లక్ష్మీదేవి తపస్సు వలన బిల్వవృక్షము పుట్టినది.


 ఆమెను 'బిల్వనిలయా' అని పిలుస్తారు. బ్రహ్మ వర్చస్సు పొందడానికి, సూర్యుని మెప్పుకోసం చేసే కామ్య యాగంలో బిల్వకొయ్యను యూప స్తంభముగా నాటుతారు. అశ్వమేధ యాగములో ఇలాంటి బిల్వయూపములను ఆరింటిని ప్రతిష్టించుతారు.


మారేడు దళాన్ని సోమవారము, మంగళ వారము, ఆరుద్రానక్షత్రము, సంధ్యాసమయము, రాత్రి వేళలందు, శివరాత్రి రోజున, సంక్రాంతి రోజున, పండుగల సమయాన కోయకూడదు. కనుక ఈ దళాలను ముందు రోజు కోసి, భద్రపరచిన దళాలతో పరమశివుని పూజిస్తారు.


మారేడు దళము శివార్చనకు పనికి వచ్చే, శివుడికి అతి ప్రీతికరమైన పత్రము.

మారేడుదళము గాలిని, నీటిని దోషరహితము చేస్తుంది.

త్రిఫలా చూర్ణం

 త్రిఫలా చూర్ణం  -  ఉపయోగాలు .


 *  శిరోవ్యాధులకు  - 


        త్రిఫలా చూర్ణం 30 గ్రా , పటికబెల్లం చూర్ణం 30 గ్రా కలిపి బధ్రపరచుకోవాలి. రొజూ 2 పూటలా పూటకు 10 గ్రా చొప్పున మోతాదుగా సేవిస్తూ ఉంటే తలలో పుట్టే వంద రకాల శిరోవ్యాదులు హరించి పోతాయి.


 *  మూర్చ  -  అపస్మారం  -


      త్రిఫల చూర్ణం అర టీ స్పూన్ మోతాదుగా ఒక టీ స్పూన్ తేనే కలుపుకుని రోజు సాయంత్ర సమయాలలో సేవిస్తూ ఉంటే క్రమంగా మూర్ఛ వ్యాధులు నయం అవుతాయి.


 *  కామెర్లు  -  ఉబ్బస రోగం . -


      

       ఉదయం పూట త్రిఫలా చూర్ణం కషాయం పెట్టి ఒక ఔన్స్ కషాయంలో ఒక టీ స్పూన్ అల్లంరసం , రెండున్నర గ్రాముల బెల్లం కలిపి సేవించాలి . రాత్రిపూట త్రిఫలా చూర్ణం , అతిమధురం సమంగా  కలిపి ఆ చూర్ణాన్ని 5 గ్రా మోతాదుగా మంచినీళ్ళతో వేసుకోవాలి. ఈ విధంగా రెండు వారాలపాటు ఈ ఔషధాన్ని సేవిస్తే మూర్చలు, దగ్గులు , కామెర్లు, ఉబ్బసం హరించి పొతాయి.


 *  కడుపు నొప్పుల కోరకు  - 


       త్రిఫలా చూర్ణం , అతిమధుర చూర్ణం , ఇప్పచెక్క చూర్ణం సమంగా కలుపుకుని పూటకు అర టీ స్పూన్ మోతాదుగా రెండు పూటలా నెయ్యి కలుపుకుని సేవిస్తూ ఉంటే కడుపులో వచ్చే అన్ని రకాల నొప్పులు అదృశ్యం అవుతాయి.


 *  విరేచనాలు కొరకు  - 


       త్రిఫలా చూర్ణం , కాచు చూర్ణం సమభాగాలు గా కలిపి పూటకు 1 టీ స్పూన్ మోతాదుగా మజ్జిగతో గాని , తేనెతో కాని రెండు పూటలా సేవిస్తూ ఉంటే రక్తం , జిగట, అజీర్ణ , నీళ్ల విరేచనాలు అన్ని కట్టుకుంటాయి. కాచు అనేది పచారి షాపుల్లో దొరుకును.


 *  అతిమూత్ర వ్యాదికి   - 


      త్రిఫలా చూర్ణం అర టీ స్పూన్ మోతాదుగా పావు గ్లాస్ మంచి నీళ్లలో కలిపి రొజూ పడుకునే ముందు తాగుతూ ఉంటే మూత్రంలో చక్కర తగ్గిపోయి అతిమూత్రం అరికట్టబడును.


 *  శరీరం ఉబ్బు  - 


       50 గ్రా త్రిఫలా కషాయంలో రెండు గ్రా గో మూత్ర శిలాజిత్ భస్మం కలిపి పూటకు ఒక మోతాదుగా రెండు పూటలా తాగుతూ ఉంటే ఇంత అసాధ్యం ఐన ఉబ్బురోగం హరించి పొతుంది.


 *  కామెర్ల వ్యాధి  నివారణ  - 


        10 గ్రా త్రిఫల రసంలో కొంచం తేనే కలిపి రెండుపూటలా ఇస్తూ ఉంటే కామెర్ల వ్యాధి హరించును.


 *  పైత్య రోగాలు   - 


       ప్రతిరోజూ 2 పూటలా అర టీ స్పూన్  త్రిఫలా చూర్ణం లో ఒక టీ స్పూన్ తేనే కలిపి సకల పైత్య రోగాలు హరించి పొతాయి.


 *  యోని దుర్వాసన  కొరకు  - 


       త్రిఫల కషాయంలో ప్రతిరోజు మూడు పూటలా స్త్రీలు తమ యోనిని కడుగుతూ ఉంటే భోజనంలో తీపి పదార్దాలు కొంచం ఎక్కువుగా తింటూ ఉంటే యోని దుర్గంధం హరించిపొయి భర్తకు ఇష్టులవుతారు.


 *  దగ్గుల కొరకు   - 


       త్రిఫలా చూర్ణం , శోంటి , పిప్పిళ్ళు , మిరియాలు కలిపిన దానిని త్రికటుక చూర్ణం అంటారు. ఈ రెండు  చుర్ణాలని కలిపి పూటకు అర టీ స్పూన్ మోతాదుగా తేనెతో కలిపి  సేవిస్తూ ఉంటే పొడిదగ్గు , నసదగ్గు, కళ్ళే దగ్గు, కళ్లెలో రక్తం పడే దగ్గు ఇలా అన్ని రకాల దగ్గులు అంతం అయిపోతాయి. 


            పైన చెప్పిన శొంటి , పిప్పిళ్ళు , మిరియాలు త్రిఫలా చూర్ణం తో కలిపే ముందు విడివిడిగా దొరగా వేయించుకొని చూర్ణం చేసుకొవాలి .


  కంటి మసకలకు  - 


   

     త్రిఫల చూర్ణం 30 గ్రా , మూడు లీటర్ల మంచి నీళ్లతో కలిపి ఒక లీటరు నీరు మిగిలేవరకు సన్నని సెగ మీద మరిగించి వడపోసి ఆ లీటరు కషాయంలో అర లీటరు పాలు , పావు కిలొ నెయ్యి కలిపి పొయ్యి మీద పెట్టి నెయ్యి మాత్రం మిగిలేవరకు మరిగించాలి. ఈ నెయ్యిని ప్రతిరోజు రెండు పూటలా పూటకు ఉసిరికాయంత మోతాదుగా తింటూ ఉంటే కంటి మసకలు తగ్గిపొయి దృష్టి పెరుగుతుంది.


  *  సిగిరెట్లు తాగడం వలన వచ్చే నోటి దుర్వాసన -


       త్రిఫలా చూర్ణం , సన్నజాజి ఆకులు సమంగా కలిపి మంచినీళ్ళలో వేసి సగానికి మరిగించి కషాయం కాచి ఆ కషాయం తో రోజుకీ రెండు మూడు సార్లు పుక్కిలిస్తూ ఉంటే పొగ త్రాగటం వలన వచ్చే నోటి దుర్వాసన పొతుంది.


  

     ఆయుర్వేదములోని ఎన్నొ రహస్య మూలికల అనుభవ యోగాల గురించి నా గ్రంథాల యందు సంపూర్ణముగా , అందరికి అర్థమయ్యే సులభ భాషలో వివరించాను . వాటిని చదివి మరింత విజ్ఞానాన్ని పొందగలరు . 


  గమనిక  -


           నేను రచించిన నా మూడొవ గ్రంథం అయిన " సర్వమూలికా చింతామణి " యందు అనేక రకాల మొక్కల గురించి అత్యంత విపులముగా , వివరణాత్మకంగా ఇవ్వడం జరిగింది . మా వంశపారంపర్య రహస్యయోగాలు మాత్రమే కాకుండా అత్యంత పురాతన , అరుదైన గ్రంథాలు మరియు కొన్ని తాళపత్రాల నుంచి తీసుకోబడిన ఎన్నొ విలువైన యోగాలు అన్ని ఎంతో పరిశోధించి మీకు ఇవ్వడం జరిగింది . ఒకటి మాత్రం ఖచ్చితముగా చెప్పగలను . ఈ గ్రంథములో లభ్యమయ్యే సంపూర్ణ సమాచారం మరియు అత్యంత సులభయోగాలు మరే గ్రంథములో మీకు దొరకవు . ఈ ఒక్క గ్రంథం రచించుటకు సుమారు సంవత్సన్నర సమయం కేటాయించడం జరిగింది . 50 రకాల మొక్కల గురించి ఈ ప్రథమ భాగములో ఇవ్వడం జరిగింది . కేవలం మొక్కల గురించియే కాకుండా యే వ్యాధికి ఏమి పథ్యం చేయవలెనో కూడ వివరణాత్మకంగా ఇవ్వడం జరిగింది . 


        ఈ గ్రంథం ఎక్కువ కాలం మన్నికగా ఉండుటకు కుట్టించి ఇవ్వడంతోపాటు 90gsm పేపర్ వాడటం జరిగింది . మొక్కల యొక్క రంగుల ఫొటోస్ తో పాటు సంపూర్ణ సమాచారం ఇందులో మీకు లభ్యం అగును . దీని ఖరీదు  550 రూపాయలు ( ఆంధ్ర మరియు తెలంగాణ ) మరియు వేరే రాష్ట్రమునకు పంపుటకు మరొక్క 50 రూపాయలు అదనంగా ఖర్చు అగును . 


      ఈ గ్రంథము కావలసిన వారు 9885030034 నంబర్ కి phoneపే , google pay or paytm చేసి ఇదే నంబర్ కి whatsup నందు screenshot పెట్టి మీ Adreass  pincode and landmark తో సహా ఇవ్వగలరు . 


             కాళహస్తి వేంకటేశ్వరరావు . 


         అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


                    9885030034

హర హర స్తోత్రం

   హర హర స్తోత్రం

-----------------------------   ---------------------

నమశ్శివాయ మంత్రమొండు నాల్కపల్కబూనుచో

క్రమంబు తప్ప కోంకృతే విరాజిలంగ పూర్వమై

సముద్రమంటి కూర్మితోడ చంద్రశేఖరుం డహో!

ప్రమోదమందజేయు కష్టవహ్ని కాల్చకుండగన్.


మనమ్మె పాద సన్నిధానమందు నుంచి భక్తితో

వనంబెపోయ మోదమందు వాంఛితార్థదాయియౌ

మనోజ్ఞమంచు బిల్వపత్రమాత్రమీయ మెచ్చుచున్

సనాతనుండు శంకరుండు సాంబమూర్తి యండయౌ.


హరా!హరా! యటంచు మానకార్తితోడ పల్కినన్

హరించి భక్తపాళి ఆర్తులబ్ధి ముంచివేయునే!

హరుండెతండ్రియౌచు రక్షనందజేయు ప్రేమతో

హరా!హరా!హరా! యటంటలాపు టింక నేలరా!


శాప బాధనంది క్రుంగు చంద్రుగాచె నీశుడే!

పాప మామృకండసూతి బాధమాన్పెశంభుడే!

ఆపృథాసుతుండె జయమునందజేసె శర్వుడే!

రేపుమాపు లనెడు వంకలేక బ్రోచు సాంబుడే!


సురాసురాదులెవ్వరేని సుంతభక్తిదల్చినన్

హరీశ చర్మధారి,మన్మథారి వ్యోమకేశుడే!

వరోరగంబుభూషవాడు భస్మధారి సత్కృపన్

వరంబులీయ వచ్చు వేగ భక్త వత్సలుండెగా!


రాయప్రోలు సీతారామశర్మ ,భీమవరం .

క్రూర (రా) కథ*

 _*మాఘమాసం*_

   🍁 _*మంగళవారం*_🍁

🌴 _*మార్చి 1వ తేది 2022*_🌴


   _*🍁మాఘ పురాణం🍁*_

🌴 _*28 వ అధ్యాయము*_🌴


🕉🌴🌹🍁🍁🌹🌴🕉️


*క్రూర (రా) కథ*


☘☘☘☘☘☘☘☘


గృత్నృమహమహర్షి జహ్నుమునితో నిట్లనెను. మాఘమాసమున నదీ ప్రవాహ స్నానము చేసి శ్రీహరిని పూజించి మాఘవ్రతము నాచరించిన వాని పుణ్య భాగ్యమును వినుము. అట్టివాడు దివ్య విమానమునెక్కి పూజ్యుడై తన వంశమువారి నందరినుద్ధరించుచు పుణ్యలోకమును చేరెను. ఈ విషయమును తెలుపు మరియొక కథను చెప్పుదును వినుము. పూర్వము ద్వాపర యుగమున విదేహదేశమున క్రూరయను పేరుగల శూద్ర స్త్రీ యుండెను. ఆమె యొక రైతు భార్య మిక్కిలి కోపము కలది. ఆ దంపతులకు జ్ఞానియగు పుత్రుడుకలడు. అతడు దయావంతుడు ధర్మాచరణమనిన ఇష్టము కలవాడు. వాని భార్య పతి భక్తి కలిగినది ఉత్తమురాలు. ఆమెకును ధర్మకార్యములను చేయుటయందిష్టము కలదు. బంధువులకు దీనులకు అతిథులకు అందరికి యధా శక్తి సేవ చేయునది. అత్తమామలకెప్పుడును సేవచేయుచుండెను. క్రూర కోడలిని యే దోషము లేకున్నను నిందించెడిది కిట్టెడిది. అప్పుడప్పుడామె భర్తయు తలచి అత్తమామలు పెట్టు హింసలను భరించుచు నోర్పుతో వినయ విధేయతలతో వారికి యధాశక్తిగ సేవలు చేయుచుండెడిది.


ఒకనాడు యిట్టి హింసను పొంది దుఃఖించుచున్న భార్యను జూచి క్రూరా పుత్రుడు తన తల్లిదండ్రులతో నిట్లనెను. నాయనా ! అమ్మా ! నా మాటను వినుడు. నా మాట కీర్తిని కలిగించునది ధర్మమును సాధించునది. మీకు కోడలిపై కోపమెందులకు ? కలహమునకు కారణమేమి ? మీ శరీరములకును బాధను కలిగించు యీ కోపముతో మీకేమి ప్రయోజనము ? సర్వ సంపదలను నశింపజేయు కలహమెందులకు ? నేను గాని , నా భార్యగాని మీకేమి ఉపకారమును చేసితిమి ? మీ యీ కోపమునకు కారణమేమియు నాకు కనిపించుటలేదు. పెరిగిన కోపముచే ఆయువు ధనము , కీర్తి , సుఖము , గౌరవము , జ్ఞానము మున్నగునవి నశించును కదా ! సర్వజ్ఞులైన , పెద్దలైన మీరు కోపమును మాని మాయందు దయను చూపి సర్వజన సమ్మతమైన ఓర్పు వహించుడు అని పలికెను.


పుత్రుని మాటలను విని క్రూర భర్తతోబాటు మిక్కిలి కోపముతొ యిట్లనెను. మూర్ఖుడా పో పొమ్ము. నీవెంత ? నీ భార్యయెంత ? తల్లిదండ్రులకిట్లు నీతి బోధను చేయు నిన్ను నీ భార్యను యేమి చేసినను తప్పులేదు , అని పలికి కొడుకును కోడలిని మరల మాటిమాటికి పలుమార్లు నిష్కారణముగ కొట్టెను. ఇట్లు దెబ్బలు తినుచున్న పుత్రుడు రోషమును చెందెను. కాని సహజమైన శాంతమును పొందెను. *'అయ్యో తల్లితండ్రులను ద్వేషించుట యెంత తప్పు అట్టివారు శాశ్వతముగా నరకమునకు పొందుదురు కదా. తల్లిదండ్రులకు సమానమైన దైవము వేరొకటిలేదు. స్త్రీకి భర్తను మించిన దైవమును లేదు కదా ! విష్ణువుతో సమాన దైవము , గంగతో సమానమగు తీర్థము లేవు కదా అని తలచెను. భార్యను తగుమాటలతో నూరడించెను. ఓర్పుగా నుండుమని సమాధాన పరచెను.


కోపిష్టియగు క్రూర కోడలిని కొట్టి ఒక గదిలో నుంచి తలుపులను మూసి వేసెను. ఆమె కుమారుడీ ఆకృత్యమును జూచి తల్లినేమియు అనలేక పితృభక్తి వలన నేమియు చేయలేక మౌనముగా బాధపడుచు పూర్వము వలెనే తల్లిదండ్రులకు సేవ చేయునుండెను. కోడలు ఆ గదిలో ఏడురోజులు అన్నము , నీరులేక ఆవిధముగా నిర్భంధములోనుండెను. యిరుగుపొరుగువారు, బంధువులు , మిత్రులు యీపని కూడదని చెప్పినను క్రూర వారి మాటలను వినిపించుకొనలేదు, కోడలిని అట్లె నిర్బంధించి పీడించెను. ఏడవదినమున కోడలు అన్నము నీరు లేకుండుటచే దుఃఖించి కృశించి మరణించెను. పన్నెండవ దినమున క్రూర కుమారుడు భార్యను చూడవలయునని తల్లికి తెలియకుండ తలుపు తెరచి చూచెను. మరణించిన భార్యను జూచి సంతాపమునంది నిశ్చేష్టుడైయుండెను. కొంతకాలమునకు స్పృహ వచ్చి చిరకాలము దుఃఖించెను. గాలికి పడిన చెట్టువలె దుఃఖభారముచే నేలపై బడెను.


క్రూరయూ తలుపు తెరచి యుండుటను గమనించి కోపించెను. మరణించిన కోడలిని దుఃఖవివశుడైన పుత్రుని జూచెను. ఆశ్చర్యము ఆమెకును దుఃఖము యెక్కువగా వచ్చెను. ఆమె చేతులతో కొట్టుకొనుచు చిరకాలము శోకించెను. ఆమె యెడ్పును విని అందరును యేమియనుచు చూడవచ్చిరి. విషయమును తెలిసికొని క్రూరను బహువిధములుగ నిందించిరి. కొందరు బంధువులు కోడలి శవమును గొనిపోయి దహనము చేసిరి. క్రూర కుమారుడు దుఃఖమును భరింపలేక అచట నుండలేక గంగా తీరమును చేరెను. కొంతకాలమునకు శోక భారమున మరణించెను.


క్రూర పశ్చాత్తాపమునందెను , పుత్రశోకమును భరింపలేక చిరకాలము దుఃఖించెను. ఆమె భర్తయు శోకించెను. వారట్లు అధికముగ శోకించుటను జూచి జనులందరును విచారించిరి. కాని ఈ సమయమున విచారించి లాభమేమి , పుత్రశోకమును భరింపలేక నిద్రాహారములు మానిన వారు కొంతకాలమునకు మరణించిరి. యమలోకమును చేరిరి. వారు అసివత్ర నరకము(కత్తుల బోను) చిరకాలమనుభవించిరి. తరువాత చంపా తీరమున సర్పములై జన్మించిరి. రావి చెట్టు తొఱ్ఱలో నివసించుచుండిరి. కొంతకాలమునకు ధీరుడు , ఉపధీరుదు అను ఇద్దరు సజ్జనులు అచటకి వచ్చిరి , చంపానదిలో మాఘమాస స్నానము నాచరించి సర్పదంపతులున్న చెట్టు క్రింద శ్రీహరిని అర్చించిరి. మాఘమాస మహిమను పురాణముగ చెప్పుకొనిరి.


సర్పదంపతులు శ్రీహరి పూజను చూచుట వలన , శ్రీహరి మహిమను వినుటవలన , వారి పాపములు పోయినవి. పుణ్యము కలిగెను. వారు వెంటనే సర్పదేహములను విడిచి దివ్యదేహములను ధరించిరి. వారికై దివ్య విమానము వచ్చెను. శ్రీహరి సాన్నిధ్యమును చేరిరి. జహ్నుముని వర్యా ! మాఘమాసవ్రత మిట్టిదని యెంతకాలము చెప్పినను పూర్తికాదు. ఇంతమందియే మాఘమాసవ్రత మహిమ వలన తరలచిరని చెప్పుటకును వీలులేదు. ఎన్నో యుగముల నుండి యెంతమందియో , ఉత్తమ మునులు , సజ్జనులు , రాజులు , వైశ్యులు , బ్రాహ్మణులు , శూద్రులు , పురుషులు , స్త్రీలు , బాలురు , పశుపక్ష్యాదులు వారు వీరననేల సర్వప్రాణులును మాఘమాసవ్రతము నాచరించుట వలన , చూచుట వలన , వినుట వలన తరించిరి. ఎట్టి పాపాత్ముడైనను మాఘమాస వ్రతము నాచరించినచో , చేసిన పాపములు పోయి పుణ్య లోకములు కలుగుననుటకెన్ని ఉదాహరణములను చెప్పగలను ? ఎన్నియో ఉదాహరణములు ఉన్నవి సుమా అని గృత్నృమదమహాముని జహ్నుమునికి మాఘమాస వ్రత మహిమను వివరించెను.


     🌷🌷 *సేకరణ*🌷🌷

        🌴 *న్యాయపతి*🌴 

      🌿 *నరసింహారావు*🌿

🌴🎋🌾🕉️🕉️🌾🎋🌴


🙏🙏🌴🍁🍁🌴🙏🙏

శివ రాత్రి

 శివ రాత్రి


ఎస్.ఆర్.పృథ్వి


తే.గీ.


వచ్చినన్ జాలు శివరాత్రి పర్వదినము శివ శివ యనుచు భక్తులు చెలయు చుండు పుణ్య క్షేత్రము లందున పులకితులగు భక్తి, ఓంకారమందున పరవశించు


తే.గీ.


కాలిడినచో పులకితమౌ గాలి చేత దర్శనము గోరి మనసెల్ల తల్లడిల్లు నిక్కముక్కంటి ఆశీస్సు నేరి కోరి కలయ తిరుగు భక్తులు కనులు మూసి


తే.గీ.


నల్లమల గిరి శిఖరము యెల్లరకును ముక్తి ధామమై నోంకార ముట్టి పడును మల్లిఖార్జునుడున్నట్టి మలయ మందు భక్తి రసము పొంగి పారును శక్తి మీర


తే.గీ.


ఎట్టి తావున జూచిన ఎరుక యగును నదులు, గుడులెల్ల భక్తితో నాట్య మాడు దైవ దర్శనంబు కొరకు దార్లు కట్టు కంటితో శివ లింగము గనుటె ముక్తి ఓం నమశ్శివాయ


అంతరాలు

 అంతరాలు, ఓ చక్కని వ్యాసం :


*మధ్యతరగతి అంతరంగంలో ఆ  #అంతరం అలాగే ఉండిపోయింది!*

🤔🤔🤔🤔🤔🤔🤔🤔


1) *చిన్నప్పుడు రైల్లో ప్రయాణం చేసేటప్పుడు తినడానికి ఇంటినుండి అమ్మ చేసినవి తీసుకెళ్ళేవాళ్ళం, కొంతమంది రైల్లో కొనుక్కుని తినేవాళ్ళని చూసినపుడు మనమూ అలాగే కొనుక్కుని తినాలనిపించేది!* 

అప్పుడు నాన్న చెప్పేవాళ్ళు, అది మన స్థాయికి చేయదగ్గది కాదు, డబ్బులున్న గొప్ప వాళ్ళు చేసేది అని!


ఇప్పుడు పెద్దయ్యాక మనం కొనుక్కుని తినే టైంకి ఆ పెద్ద వాళ్ళు గొప్పవాళ్ళు ఆరోగ్య రీత్యా ఆహారం ఇంటినుండి తెచ్చుకుని తింటున్నారు.


*దాంతో ఆ అంతరం అలాగే ఉండిపోయింది .*


2) *చిన్నప్పుడు కాటన్ దుస్తులు వేసుకుంటే, కొంతమంది టెర్లిన్ బట్టలు తొడుక్కునే వాళ్ళు, అదిచూసి అటువంటివి కావాలనిపించినపుడు, నాన్న చెప్పే వారు అది ఖరీదైనది మనం అంత పెట్టగలిగేవాళ్ళంకాదని!*   


పెద్దయ్యాక మనం టెర్లిన్ వాడటం మొదలు పెడితే వాళ్ళు కాటన్ కు దిగారు ఇప్పుడు, కాటన్ దుస్తుల ధరే ఎక్కువ ! 


*దాంతో ఆ అంతరం అలాగే ఉండిపోయింది ..*😒🤔


⚖⚖⚖⚖⚖⚖⚖


3) *చిన్నప్పుడు ఆడుకుంటూ ఉన్న కాటన్ ప్యాంటుకే మోకాళ్ళ దగ్గర చినిగితే పారేసెందుకు మనసొప్పక అమ్మ లేదా టైలర్ తమ పనితనం చూపి నీట్ గా #రఫ్ చేసి ఇస్తే మళ్ళీ హ్యాపీగా వేసుకునేవాళ్ళం!* 


పెద్దయ్యాక చూస్తే జనం ఆ మోకాళ్ళదగ్గర చిరుగులు ఉన్నవాటిని ఫ్యాషన్ పేరుతో #అధికధరలకు కొంటున్నారు !


*దాంతో ఆ అంతరం అలాగే ఉండిపోయింది ...*🤔😒


⚖⚖⚖⚖⚖⚖⚖⚖


4) *ఓ వయసులో మనకు సైకిల్ కొనగలగడమే కష్టం, అదీ సాధించేసరికి వాళ్ళు స్కూటర్ నడిపించేవాళ్ళు, మనం స్కూటర్ కొనే సమయానికి వాళ్ళు కార్లలో తిరిగేవారు, మనం కొంచెం ఎదిగి మారుతి 800 కొనే సమయానికి వాళ్ళు BMW ల్లో తిరిగారు, మనం రిటైర్మెంట్ వయసుకి  వచ్చిన కూడబెట్టుకున్న వాటితో  కొంచెం పెద్ద కారు కోనేసమయానికి వాళ్ళు ఆరోగ్యావసరాలతో సైక్లింగ్ చేస్తున్నారు!


*దాంతో ఇప్పటికి ఆ అంతరం

 అలాగే ఉండిపోయింది . .🤔😒*

                        **

ప్రతి దశలో ప్రతి సమయాన విభిన్న మనుషుల మధ్య స్థాయి అంతరం ఉండనే ఉంటుంది.


*"ఆ అంతరం నిరంతరం" ఎప్పటికి ఉండి తీరుతుంది *


రేపటిఆలోచనతో ఇవాళ్టిది వదులుకుని మళ్ళీ రేపటిరోజున గతించిన  #ఇవాళ్టి గురించి చింతించేకంటే, ఇవాళ అందినదానితో ఆనందిస్తూ ఆస్వాదిస్తూ రేపటి స్వాగతం పలకడం శ్రేయస్కరం.


*మన, మనవారి గురించి

కాలాన్ని వెచ్చిద్దాం *

💐🌹💐🌹💐🌹💐🌹


*మనం నవ్వుతూ ఉందాం*😊

 *జీవితం కూడా సంతోషంగా ఉంటుంది * 😊

🙏🙏🙏🙏🙏🙏

దైవాంశ లేని వాడు

 శ్రీమాత్రే నమః: మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శుభాకాంక్షలు _శివపార్వతుల అనుగ్రహం మన అందరికీ కల్గాలి               శ్లో_మాతాచపార్వతీదేవీ పితాదేవో మహేశ్వరః బాంధావాశ్శివభక్తాశ్చ  స్వదేశో భువనత్రయం"


మహాదేవ మహాదేవ మహాదేవ

🕉️🕉️🕉️🕉️🕉️

న దైవాంశో దదాత్యన్నం|

నా రుద్ర: రుద్ర మర్చతి|

నా నృషి: కురుతే కావ్యం|

నా విష్ణు: పృథివీ పతి:!!||


*తాత్పర్యము*:- దైవాంశ లేని వాడు అన్నదానం చేయలేడు, రుద్రాంశ లేని వాడు దైవపూజ చేయలేడు, ఋషికాని వాడు కావ్యమును వ్రాయలేడు, విష్ణువు అంశలేని వాడు పృథ్విని పరిపాలించలేడు (భూసంపద పొందలేడు) ...!!

*నారుద్ర:రుద్ర మర్చతి* 👉 రుద్రాంశ లేని వాడు రుద్రార్చన చేయలేడు...!!

త్రిపురాసుర సంహారాన్ని

 👆నిజంగా ఈ ఆర్టిస్ట్ ఎవరో కానీ శివమహాపురాణంలోని త్రిపురాసుర సంహారాన్ని మనకు కళ్ళకు కట్టేలా చూపించారు


త్రిపురాసురులు చతుర్ముఖ బ్రహ్మ గారిని కోరుకున్న కోరిక ఏంటంటే 


బంగారం, వెండి, ఇనుము అని మూడు పురాలను సృష్టించండి, మేము ఒక్కోక్కరం ఒక్కోదాంట్లో ఉంటాము. ఆకాశంలో వివిధ సరళరేఖల్లో తిరుగుతూ ఉంటాము. వెయ్యి దివ్య సంవత్సరాలకు ఒకసారి  క్షణకాలం మాత్రమే  ఒకే సరళరేఖలోకి వచ్చినపుడు ఇంతకు మునుపు ఎవరూ వాడని రథం, గుర్రాలు, కట్టే తాళ్ళు, వాటి చక్రాలు, రధసారథి, ధనస్సు, దాని వింటినారి(బాణాన్ని కట్టేది). ఇంతవరకూ వాడని బాణం ,ఇంతవరకూ ధనస్సు ఎక్కుపెట్టని వాడు బాణాన్ని విడిచి పెడితే అదీ మేము క్షణకాలం పాటు ఒకే  సరళరేఖ మీదకు వచ్చినప్పుడు విడిచి పెడితే మేం చనిపోతాం అని వరం కోరారు


ఇప్పుడు రథాన్ని జూమ్ చేసి జాగ్రత్తగా పరిశీలన చేయండి.

1బ్రహ్మాండాన్ని రథంగా చేశారు (చిన్న గ్లోబ్ లా వేశారు చూడండి)

2. సూర్యచంద్రులు రథచక్రాలు

3. ఉత్తరాయణం, దక్షిణాయన కాలాలను రథాలను, గుర్రాలను కలిపి ఉంచే అటూ ,ఇటూ హద్దు కర్రలుగా

4.నాలుగు వేదాలు గుర్రాలుగా

5. పంచభూతాలను రథసారథి పట్టుకున్న గుర్రాలను కట్టే తాళ్ళుగా

6.ఇంతవరకూ రధసారథ్యం చేయని సారధిగా చతుర్ముఖ బ్రహ్మగారిని సారధిగా

7. మేరు పర్వతాన్ని ధనస్సుగా

8. వింటినారి(బాణాన్ని కట్టే తాడుగా ) శివుని మెడలో ఉండే వాసుకి(పామును) తాడుగా

9. ఇంతవరకూ బాణంగా వాడని శ్రీమహావిష్ణువును బాణంగా చేసి

10. ఇంతవరకూ బాణం విడిచి పెట్టని పరమేశ్వరుడు  విడిచి పెడితే వారు చనిపోయిన దాన్ని మనకు కళ్ళకు కట్టినట్లు చూపించారు.


ఆ ఆర్టిస్ట్ కి  

💐💐💐🙏🙏🙏💐💐💐

మనందరి కధ

 🌹🌹🌹🌹🌷🌷🌹🌹🌹🌹

కధ కాని కధ...మనందరి కధ !

💐💐💐💐💐💐💐💐💐


ఇది మన సమాజంలో 70 - 80 ఏళ్ళ క్రితం నుంచీ జరిగిన, ఇప్పుడు జరుగుతున్న పరిస్థితుల స్ఫూర్తితో అల్లిన అనుభవాల పందిరి.


అప్పట్లో దాదాపు అందరం అమ్మమ్మల ఇళ్ళలోనే పుట్టేవాళ్ళం. ఎందుకంటే...అదే సంప్రదాయం, 

సుఖము, సురక్షితము, సాగుబడి. ముఖ్యంగా, 

ప్రేమతో చాకిరీ చేసేవాళ్ళు, వైద్య సలహాలిచ్చేవాళ్ళు,

ప్రతి ఇంటా దండిగా అనుభవజ్ఞులు వుండేవారు.

అదంతా ఒక సహకార సమాఖ్య !


పురుళ్ళు - పుణ్యాలు, రోగాలు - రొష్టులు, పండగలు - పబ్బాలు, పెళ్ళిళ్ళు - పేరంటాలు, నోములు - వ్రతాలు, కష్టాలు - సుఖాలు ఏవి వచ్చినా, పెద్దల దగ్గిరనించీ పిల్లకాయల దాకా అందరూ తమకు చేతనైన పనులు బాధ్యతగా, ప్రేమతో ఒకళ్ళకొకళ్ళు చేసుకునేవారు.

దాన్నే ఇప్పుడు "టీమ్ వర్క్" అంటున్నారు !


"అందరికోసం ఒక్కడు నిలిచి, ఒక్కనికోసం అందరు కలిసి" అని శ్రీశ్రీ గారు రాసినట్టు, అక్షరాలా నడిచేది.


"ఆ రోజులే వేరు...అదొక గుప్తుల స్వర్ణయుగం, 

మళ్ళీ రమ్మన్నా రాదు" అని వాపోయేవాళ్ళు 

ఎప్పుడూ ఉంటూనే వుంటారు !


                     💐💐💐💐💐💐


నాటి - ఆనాటి అమ్మమ్మల ఇళ్ళలో ఉన్న జరుగుబాటు, ఆప్యాయతలు, ముఖ్యంగా 

పిల్లలు పుట్టినపుడు, అందరూ తలో చెయ్యీ వేసి, చూపించిన ప్రేమలు, పొందిన అనుభూతులు తల్చుకుని...ఎన్నో సౌకర్యాలు వచ్చిన ఈ రోజులతో పోల్చుకున్నా, ఎందుకో...

ఆ తరం వాళ్ళ మనసులు, అటే ఓటు వేస్తాయి అనిపిస్తుంది.


చెప్పుకోదగ్గ హాస్పిటళ్ళు, డాక్టర్లు లేని ఆ ఊళ్ళలో డెలివరీలంటే భయం ఉండేది కాదు.


(ఇప్పుడు స్కానింగులతో మొదలై, 'సీ సెక్షన్' లతో 

ముగుస్తోంది !)

రోమన్ చక్రవర్తి, జూలియస్ సీజర్ పుట్టిన పద్ధతి కాబట్టి, దానికి 'సిజేరియన్' అనే పేరు వచ్చిందిట !

(మా ఫామిలీ 'సిజేరియన్ డాక్టర్' చెబితే తెలిసింది.)


ఇప్పటి కార్పొరేట్ డాక్టర్లకి ఈ "సిజేరియన్" చెయ్యడం అంటే కత్తితో నేర్పిన విద్య ! ఎందుకంటే...

"డబ్బు సంపాదించడం ఎలా ?" అనే రహస్యం వాళ్ళందరికీ "స్టాఫ్ రెగ్యులేషన్స్" లోనే ఉంటుందిష !...

టార్గెట్లలోనే ప్రింటు చేయించి మరీ యిస్తారుట !


కొంచెం ఫన్నీ గా చెప్పుకుంటే...ఇప్పటి బాలింతరాళ్ళు, కొత్తగా పుట్టిన బిడ్డకంటే ఎక్కువగా, సెల్ ఫోనునే చూసుకుంటున్నారు ! ఆ బిడ్డని చూసుకుందుకు, 

షిఫ్టు డ్యూటీల్లో నర్సులు వస్తారుగా ...

వాళ్ళకి డబ్బులు ఇన్సూరెన్స్ కంపెనీ సార్ వాండు..

ఇచ్చి పూడుస్తాడు !

😜


మళ్ళీ 'అప్పట్లోకి' వెళ్ళిపోదాం...

చిన్న చిన్న జ్వరాలు, రోగాలు వచ్చినా ఎక్కువగా 

గృహ వైద్యాలతోనే నడిచిపోయేది.


ప్రతి ఊళ్ళోను ఒకళ్ళిద్దరు చెయ్యి తిరిగిన మంత్రసానులు ఉండేవారు. ప్రతి ఇంటికీ ఆస్థాన పనిమనిషి - చాకలి - మంగలి - పురోహితుడితో పాటు, ఒక మంత్రసాని కూడా ఉండేది.


ప్రతి ఇంట్లోను కనీసం ఐదారుగురు ఆడపిల్లలు ఉండేవాళ్ళు కాబట్టి, ఏడాదిలో నాలుగైదు డెలివరీలు ఖాయం ! "టర్నోవరు" కి ఢోకా లేదు !


కూతుళ్ళతో పాటు, తల్లులు కూడా పురిటి మంచం అలంకరించడం రివాజు. అందుకోసం...

ప్రతి ఇంట్లోనూ కనీసం నాలుగైదు నులక మంచాలు రడీగా ఉండేవి.


మనవరాళ్ళతో పాటు, పక్కనే చంటాడితోపాటు నులకమంచం వేయించుకున్న అదృష్టవంతులైన అమ్మమ్మలు కూడా అక్కడక్కడ వుండేవారు !

(అప్పటికింకా కుటుంబ నియంత్రణలు రాలేదుగా !)


                    💐💐💐💐💐💐


ఇప్పటి డాక్టర్లు హాస్పిటల్ వార్డుల్లో రౌండులకి వెళ్ళినట్టుగా...మంత్రసానులు చూలింతలని, బాలింతలని చూసుకుంటూ ఊళ్ళో రౌండ్లు వేసేవాళ్ళు.


తమ అనుభవాన్ని బట్టి, ఏ రోజుకి ఆయా ఇళ్ళలో

బాలకృష్ణులు లేక లక్ష్మీదేవులు ఉద్భవిస్తారో చెప్పేసి, చెయ్యవలసిన ఏర్పాట్లు, సిద్ధంచేయవలసిన సరంజామా వివరించేసి, ఆ ప్రకారం తమ కాల్షీట్లు ఇచ్చేవాళ్ళు.


సరే..'ఆ రోజు' రాగానే, ఇంటిల్లిపాదీ ఎవరికిచ్చిన డ్యూటీ వాళ్ళు ఎక్కేసి, రెడీగా ఉండేవాళ్ళు.


ఇంటి పెద్ద... పుట్టబోయేవాళ్ళ పుట్టిన సమయం, 

నక్షత్రం, పాదం రాసుకుందుకు వీలుగా, ఒక గడియారం, తెలుగు కాలెండరు, పంచాంగం 

రడీ చేసుకునేవాడు.


ఒకవేళ జన్మ నక్షత్రం శాంతి నక్షత్రం లేక దోషం ఉన్నదైతే, కన్నతండ్రి ఏ ఏ గ్రహాలకు శాంతి చేయించుకుని, ఏ ఏ దానాలు ఇచ్చి, 

ఏ రోజున తన సంతానం మొహం నూనెలో చూడాలో, ఆస్థాన పురోహితుడు గారు నిర్ణయించేవాడు. 

(చాలా చోట్ల యిప్పటికీ జరుగుతోంది అనుకోండి)


అమెరికా లాంటి చోట్ల, కనబోయే తల్లికి బాసటగా, కాబోయే తండ్రిని కూడా డాక్టర్లతో పాటు, లేబర్ రూములో వుండమంటున్నారు, బొడ్డుతాడు  కూడా తండ్రి చేతే కోయిస్తున్నారు !


తమ ప్రమేయం లేకుండా తాము పుట్టబోయే టైము, నక్షత్రాన్ని బట్టి, తమ భవిష్యత్తు జీవితం మొత్తం 

నిర్ణయం అయిపోతుందని, ఆ 'విధివ్రాతను' ఎవరూ తప్పించలేరని, పాపం ఆ గర్భస్థ శిశువులకు అప్పటికి తెలియదు !


'జ్యేష్ఠ' నక్షత్రం అయితే, తనకంటే ముందు పుట్టినవాళ్ళకి, 'రోహిణి' అయితే...మేనమామలకి,

(కృష్ణ పరమాత్మ 'రోహిణి' లోనే పుట్టి, స్వయానా తన మేనమామ - కంసుడి పుట్టి ముంచాడు కాబట్టి, అప్పట్నుంచీ మేనమామలందరికీ ఆ సౌకర్యం వచ్చిందిట !)

'మూల' నక్షత్రం అయితే...మూలనున్న ముసలాళ్ళకి.

"బోర్డింగు పాసులు" వచ్చినట్టే అని, 

గాఢంగా నమ్మేవారు/తున్నారు.


"వీడు/ఇది పుట్టి, మా తాత/నాయనమ్మని 

చంపేశాడు/సింది అని, వాళ్ళ జీవితాంతం 

గుర్తుచేస్తూనే వుండేవారు !

కానీ..పాపం దయదల్చి, ఐపీసీ సెక్షన్ 302 కింద 

బుక్ చేసేవారు కాదు ! 😊😊


ఆ పురిటిగది బయట...కావలసిన మగాళ్ళందరూ...

చేతులు వెనక్కి పెట్టుకుని, సినిమాల్లో చూపించినట్టు,

"కువ్వా...." అని వినిపించేదాకా అటూ - ఇటూ ఆతృతగా తిరుగుతూ...ఒకళ్ళనొకళ్ళు గుద్దుకుంటూ వుండేవారు !


                     💐💐💐💐💐💐


బాలింతరాళ్ళు ఏమి తినాలో, ఏది తినకూడదో, 

ఎప్పుడు తినాలో, ఎంత తినాలో అనుభవజ్ఞులైన

సీనియర్లు యిప్పటి 'డైటీషియన్' ల పాత్ర పోషించేవారు.


పెళ్ళికాని క్రితం, బొండు మల్లెల్లా ఉన్న తల్లులు,

ఒక పిల్ల పుట్టగానే...కాడ మల్లెల్లాగ అయిపోయేవారు.


నడ్డి కట్టు బిగించడానికి కాస్త బలంగా ఉన్న చెల్లెళ్ళకి, తమ్ముళ్ళకీ డ్యూటీ పడేది. పథ్యం పెట్టగానే బాలింతలకి...ఏ నిద్రమాత్రకీ రానంత 

నిద్ర ముంచుకొచ్చేది. కానీ నిద్రపోకూడదుట ! 

అందుకని, నిద్ర చెడగొట్టడానికి, ఇంట్లో వాళ్ళు...

పళ్ళాలు వాయిస్తూ, తప్పెట్లూ - తాళాలూ మోగించేవాళ్ళు !


సరే...మామూలుగా... పుట్టిన బంగారుకొండలు, 

తల్లిని తిండి తిననివ్వరు...రాత్రిళ్ళు నిద్రోనివ్వరు !

కన్నతల్లి అన్నం తినే సమయానికే అలారం కొట్టినట్టు లేచి, ఆరున్నొక్క రాగం మొదలెట్టేవాళ్ళు.


తెల్లారుఝామున సరిగ్గా తల్లికి నిద్ర ముంచుకొచ్చే సమయానికే...కన్న కాసులు లేచి, ఆడుకునే సమయం !


పూర్వం ఇప్పటిలాగ, పుట్టిన దగ్గరనుంచి, మూడేళ్ళు వచ్చేదాకా 'డైపర్ల' భోగం లేదు కాబట్టి, ఆ పురిటి గది అంతా...చిత్ర విచిత్ర వాసనలతో ప్రత్యేకత సంతరించుకునేది.


పది - పదిహేను పాత బొంత గుడ్డలు సర్వకాల సర్వావస్థలయందు తయారుగా ఉండేవి...

కొన్ని బయట ఎండలోనూ...కొన్ని ఇంట్లోనూ...


మూడేళ్ళు వచ్చేదాకా మగ పిల్లలు - బోసి మొలలతోను, ఆడపిల్లలు - సిగ్గుబిళ్ళలతోను తిరుగాడేవాళ్ళు.


బాలింతరాలి ఒళ్ళు గట్టిపడి, వేడి చెయ్యాలని,

'కాయం ఉండలు' అనే ప్రత్యేక సరుకు ఖాయంగా ఉండేవి. వాటి దెబ్బకి, చంటాళ్ళ దెబ్బకి, అమ్మణ్ణి గారి బూరి బుగ్గలు కాస్తా...లోపలికి పోయి, చపాతీలు అయిపోయి, కళ్ళు పైకి తేలిపోయేవి !

మొహంలో కళ్ళు - పళ్ళు మాత్రమే కనపడేవి !


                   💐💐💐💐💐💐


బాలింతరాళ్ళని ఒకరకమైన 'క్వారంటయిన్' లో వుంచేవారు. 'ఎంట్రీ పాస్' లు లేనివాళ్ళకి ఆ గదిలోకి 'నో ఎంట్రీ....'


(ఇప్పుడు హాస్పిటల్లోనే...ఫోటోలు, వీడియోలు తీసేసుకుని, చంటాళ్ళని దేశ - విదేశాల్లో ఉన్న వాళ్ళందరికీ చూపించెయ్యలిగా ?)

😊😊


ఇప్పుడు భారసాల దాకా ఆగకుండా, ఆరోజే పేరు చెప్పేస్తే, హాస్పిటల్ వాళ్ళు బర్త్ సర్టిఫికెట్ తయారు చేసేసి, పాస్ పోర్టుకి కూడా రడీ చేసేస్తున్నారు.


అప్పట్లో ఇంటిపేరు వాళ్ళందరూ ఏ వూళ్ళో వున్నా, పురిటి వాళ్ళే కాబట్టి, ఆ పదిరోజులూ వాళ్ళందరూ వాళ్ళ ఇళ్ళలో పూజలు, శుభకార్యాలు చేసుకోకూడదు.

(ఇప్పుడు ఇంట్లో వాళ్ళకి కూడా...ఆ పట్టింపులు వుండట్లేదనుకోండి !)


పసికందుల కడుపు "వేక్యూమ్" చెయ్యడం కోసం, స్వచ్ఛమైన ఆముదం హోల్ సేల్ గా కొనేసి, దాన్ని పట్టించడానికి, ఒక 'అచ్చొచ్చిన' ఉగ్గు గిన్ని తయారుగా పెట్టేవారు. ప్రతిరోజూ కడుపు లోపలికి ఆముదం పోసి, తలకీ, ఒంటికీ దిట్టంగా పట్టించేస్తే, పిల్లలు 

ఘుమఘుమలాడిపోయేవారు !


(మా అమ్మమ్మ అయితే...

"చంటిపిల్లలు 'కంహ్మటి' వాసనొస్తారు" అనేది !)

😊😊


వాళ్ళ ఉగ్గు గిన్నెలు..తండ్రుల - తాతల ఆర్ధిక స్థోమతుని బట్టి, వెండివి, బంగారంవి కూడా ఉండేవి.


వాళ్ళకి ఆముదం పట్టించడం ఒక పెద్ద ప్రహసనం !

ఆ పసి గుడ్డులకి కూడా ఆముదం వాసన, రుచి పడదు కాబట్టి, మొహం చిట్లించి, తెగ గింజుకుంటూ ఏడ్చేవాళ్ళు.

అందుకు ముందుగా కాస్త తేనె నాకించి, తరవాత 

'అసలు సరుకు' నోటికి వేలు అడ్డంపెట్టి, 

వాటంగా పట్టించి, పని కానిచ్చేవారు. 

అప్పటికి చూసేవాళ్ళకి పెద్ద రిలీఫ్ వచ్చేది !


తరవాతి ఘట్టం...వాళ్ళ స్నానం ! సీనియర్లతో ఒకరు,

రెండు పీటలు వేసుకుని, రెండు కాళ్ళమీద పడుకోబెట్టుకుని, నలుగు పెట్టి, వేడి వేడి నీళ్ళు పోస్తూ, గిన్ని తోమినట్టు తోమేస్తే, ఏడ్చి ఏడ్చి, వాళ్ళు బయటికి రాగానే, ఒళ్ళు తుడిచే డ్యూటీ ఒకళ్ళది. సాంబ్రాణి పొగ వేస్తూ, కడుపు నింపే బాధ్యత కన్నతల్లిదేగా?


ఎప్పుడో...పెళ్ళికి కొన్న మధుపర్కాలు, ఉయ్యాలగా మార్చి, దూలానికి వేలాడదీసి, అందులో పడుకోబెట్టి,

తల్లికి నోటికొచ్చిన 'వరహాల లాలి' పాట అందుకుంటే,

అప్పటికి ఇంట్లో తాత్కాలిక ప్రశాంతత నెలకొనేది,

తల్లి బ్రేక్ ఫాస్టుకి బ్రేకూ దొరికేది.


తరవాతి కాలంలో స్టాండు ఉయ్యాళ్ళు,

స్ప్రింగు ఉయ్యాళ్ళు వచ్చేశాయి.


                  💐💐💐💐💐💐


భారసాల నాడు, పేరుకోసం వెతుక్కోఖ్ఖర్లేకుండా

ఆడపిల్లకి నాయనమ్మ పేరు, మగపిల్లాడికి 

పితామహుడి పేరు రడీగా ఉండేవి.

అవీగాక, ఇతరత్రా మొక్కులూ గట్రా వుంటే, 

ఆ దేవుళ్ళందరి పేర్లూ ముందూ - వెనకా చేరి, 

"వీర వెంకట సత్య సూర్య శివరామ నాగేంద్ర వల్లీశ్వర సుబ్రహ్మణ్యేశ్వర రావు" ఉరఫ్ 'సుబ్బి గాడు'...

లేక... డిట్టో డిట్టో.. "అలివేలు మంగతాయారు" 

ఉరఫ్ 'మంగ' పేర్లు ఖాయం అయ్యేవి.


వాళ్ళు పెద్దయ్యాక...ఇస్కూళ్ళలో వాళ్ళని,

"ఏబీసీడీ ల సుబ్బు" అని, లేక..

"గూడ్సు బండి మంగ" అని ముద్దుగా పిలిచేవారు !


పాపం వాళ్ళు బడిలో చేరాక, వాళ్ళ పేరే 

తప్పుల్లేకుండా రాయలేకపోయేవాళ్ళు !

తరవాత్తరవాత...పాస్ పోర్టుల్లోనూ...

ఎయిర్ పోర్టుల్లోనూ చోటు సరిపోయేది కాదు !


ఇప్పుడు ఆ బాధ లేదు కదా !

ఇంటర్నెట్ లో అంతకుముందు ఎవరికీ లేని పేరు, 

కనీ - వినీ ఎరుగని పేరు, ఎవరికీ అర్థం కాని పేరు, గూగుల్లో మాత్రమే అర్ధం దొరికే పేరు, వెతికి పట్టుకుని, సింపుల్ గా ఆడపిల్లకి..."జిష్ణ" లేక "తృష్ణ" అని, మగపిల్లాడికి అయితే, "హితేష్' లేక "మటాష్" అనీ పెట్టేసి, రికార్డుల్లో రాయించేసి, అప్పుడు ఎవరైనా (అడిగితే)...చెబుతున్నారు...ట !

😂😂


                     💐💐💐💐💐💐


అలా కొద్దికాలం గడిచాక, కన్నతల్లి,

"ఆ దొంగ కలవ రేకుల్లో తుమ్మెదలాడేనా...

  ఆ సోగ కనుల రెప్పల్లో తూనీగలాడేనా..."

  అని ఆ జాబిలి కూనకి జోల పాడుతుంటే...


కన్నతండ్రి ఒక చేతి సంచీతో బస్సు దిగొచ్చి,


"చిట్టి తమ్ముడొకడు నీ తొట్టిలోకి రానీ..."

 అని పాట పూర్తిచేసేవాడు.


ఒకే యింట్లో కొంచెం అటూ - ఇటూ గా,

ఇద్దరు ముగ్గురు బాలింతరాళ్ళు పోటా పోటీగా 

కూడా ఉండేవారు.


వాళ్ళ పిల్లలకి పెద్దవాళ్ళు టోకెన్ నెంబర్ల ప్రకారం, స్నానాలు చేయించేవాళ్ళు.


ఒకే గదిలో దూలానికి రెండు - మూడు గుడ్డ ఉయ్యాళ్ళు ఊగుతుంటే చూడముచ్చటగా ఉండేది.


అలా దిన దిన ప్రవర్ధమానంగా ఎదిగిన ఎడ పిల్లలకి మాత్రం, ఆముదంతో అనుబంధం తీరిపోయేది కాదు.

మూణ్ణెల్లకోసారి, అంబాజీపేట నుంచి, స్వచ్ఛమైన సరుకు 

'డోర్ డెలివరీ' అవ్వాల్సిందే...పెద్దలకీ...పిల్లలకీ...

వంతులవారీగా పట్టించాల్సిందే !

🤢🤮


ఆ రోజంతా...ఆ ఆముదం త్రేణుపులు వస్తుంటే వుండేదీ...చెప్పనలవి కాదు...ఎవరికి వారు 

'ఫ్లాష్ బ్యాక్' లోకి వెళ్ళి తల్చుకోవాల్సిందే !


నిత్యం తెల్లారకుండానే, చెవులమీంచి మొహమ్మీదకి కారేట్టుగా తలకి ఆముదం పట్టించే 'ఆముదం మొహం గాళ్ళు' ఇంటికి యిద్దరైనా వుండేవారు. ఆరోజుల్లో వాళ్ళ దరిదాపుల్లోకి వెళ్ళడానికి ఎవరూ సాహసించేవారు కాదు ! 

(పాపం ! భార్యలకి తప్పదుగా !)

😂😂


                     💐💐💐💐💐💐


అంతేనా ? జ్వరాలు వస్తే, ముందు ఆముదంతో 

కడుపు ఖాళీ చేశాక, పైనుంచి నోరు ఎండగట్టేవారు !


నాలుగో - అయిదో లంఖణాల స్కోరు చేశాక, 

జ్వరం తగ్గితే...పథ్యం పెట్టడానికి ఒక చిన్న పరీక్ష పెట్టేవారు !


చేతి జానతో...బొడ్డు దగ్గిరనుంచి ముక్కుదాకా అందుకో గలిగితేనే...పథ్యం భాగ్యం ! 

లేకపోతే...కోర్టు వాయిదానే !

(ఇప్పుడు మనం జ్వరం లేకపోయినా...

లంబోదరం నుంచి - నాసికా త్రయంబకం దాకా అందుకోడం కష్టసాధ్యమే !)


నామాట మీద నమ్మకం లేకపోతే...ట్రై యువర్ లక్...

😌😌


ఈలోగా...ఆ జ్వరం రోగికి, అడ్డమైనవన్నీ తినెయ్యాలనిపించేటంత కరువు వచ్చేసేది !

నోరు కట్టుకోలేక, దొంగచాటుగా తినేసి, 

వాంతులు చేసుకున్న "వమన" రావులూ వుండేవారు.


ఇంక పథ్యం పెట్టడం అంటే...అదొక స్టాండర్డ్ పేకేజీ.

శొంఠిపొడి, కారప్పొడి, పాత చింతకాయ్ పచ్చడి,

చారు ! బస్ !!... నో మజ్జిగ / పెరుగు.

అదికూడా... మజ్ఝాన్నం రెండు దాటాక !


తరవాత కొంతకాలం దాకా, డోక్కుపోయిన మన మొహాల్ని అద్దంలో చూసుకుంటే, మనకే డోకొచ్చేది.


ఇతి  లంఖణాల అధ్యాయం సమాప్తః !


                     💐💐💐💐💐💐


నెలకోసారి నలుగు పెట్టి, కుంకుడు కాయ పులుసుతో తలంట్లు మష్టు ! అలా తలంటుకున్నవాళ్ళకి 

కళ్ళలో కుంకుడు రసం ఫ్రీ ! మనని చూస్తే...

వాళ్ళకి "కన్నెర్రగా" వుండేది !


మళ్ళీ... అంబాజీపేట ఎక్కడుందో తెలీకపోయినా,

అక్కణ్ణించి వచ్చిన స్వచ్ఛమైన వంటాముదమును...

ముదమున మూణ్ణెల్లకోసారి తాగి తీరాలి !


                      💐💐💐💐💐💐


అలా పుట్టి - అలా పెరిగి, ఇంత వాళ్ళమైన మనం...

ఉగ్గుపాలతో తాగిన ఆముదాన్ని మర్చిపోయి,

"నలుగు పెట్టుకోవడం అంటే ఏంటి మమ్మీ...?"

అని ఇప్పటి పిల్లలు అడిగేట్టుగా పెంచి,

"లంఖణం" స్పెల్లింగు మర్చిపోయి, జ్వరం రాగానే 

ఒఖ్ఖ మాత్రతో దాని పీచమణిచేసి, శుభ్రంగా అన్నీ

అడ్డంగా తినేసే సౌలభ్యం కలిగించుకున్నాం.

భళా - భళీ !


బహుశా... అప్పుడది కరెక్టు...ఇప్పుడిది కరెక్టు !


             మూల కధ... అమ్మమ్మలు - నాయనమ్మలు...

                 కధనం - గ్రాఫిక్స్ - చిలవలు - పలవలు...

                          వారణాసి సుధాకర్.

                        

                  💐💐💐💐💐💐💐💐

మాతృమూర్తి ఋణం🌷

 🌹🌹🌹🌹🌷🌹🌹🌹🌹

     🌷మాతృమూర్తి ఋణం🌷   

                  🌹🌹🌹     

ఆదిశంకరాచార్యులవారు సన్యాసాశ్రమం స్వీకరించి తన ఆప్తులందరినీ త్యజించి వేళ్ళే ముందు తల్లి ఆర్యాంబ

చాలా బాధ పడింది.

"శంకరా, నువ్వు నాకు ఏకైక పుత్రుడువి కదా! నన్ను వదలి వెళ్ళి పోతున్నావు, ఆఖరి క్షణాల్లో నాకని ఎవరున్నారు? నాకు దిక్కెవరు " అని దీనంగా ప్రశ్నించింది.

" అమ్మా! ఏ సమయమైనా సరే, నీవు తల్చుకుంటే చాలు నీ ముందు వుంటాను." అన్నాడు శంకరుడు.

భగవత్పాదులు శంకరాచార్యులవారి తల్లికి మరణకాలం సమీపించింది. మూసిన కళ్ళు తెరవలేదు.

"నేను తలచిన వెంటనే వస్తానన్నాడే శంకరుడు" అని మనసులోనే తలుచుకుంటూ వున్నది ఆర్యాంబ.

తల్లి తలచుకుంటున్నదన్న విషయం ఆదిశంకరులు గ్రహించారు.

వెంటనే శ్రీకృష్ణుని ధ్యానించారు. శ్రీకృష్ణుడు ఏం కావాలని అడిగాడు.

కురుపితామహుడు భీష్మాచార్యునికి మోక్షమిచ్చినట్లుగా నా మాతృమూర్తికి

మోక్షం ప్రసాదించమని వేడుకున్నారు శంకరాచార్యులవారు.

అర్యాంబ , తలుచుకుంటే శంకరుడు వస్తానన్నాడే అని తపిస్తున్నప్పుడు అక్కడికి ఎవరో వస్తున్న అలికిడయింది.

కళ్ళు కూడా తెరవలేని స్థితిలో వున్న ఆర్యాంబ చటుక్కున లేచి శంకరా! అంటూ , అక్కడికి వచ్చిన ఒక పసిబాలుని, గట్టిగా హృదయానికి హత్తుకుంది.

బాలుని ఒంటి నిండా ఆభరణాలను గమనించిన ఆర్యాంబ‌, శంకరుడు సన్యాసి కదా ! యీ ఆభరణాలు ఎలావచ్చాయని అనుకున్నది.

బరువెక్కిన కనురెప్పలను మెల్లిగా తెరచి చూసింది ఆర్యాంబ.

అక్కడ తను అను నిత్యం పూజించే గురువాయూరు శ్రీకృష్ణుడు సాక్షాత్కరించి నిలచివుండడం గమనించింది.

గురువాయూరప్పని చూసిన ఆర్యాంబ మహదానందంతో " అప్పా! నోరు తెరిచి, నీ నామజపం చేసే శక్తి కూడా లేని యీ దీనురాలి ఆఖరిక్షణాలలో నను చూసేందుకు వచ్చావా? కృష్ణా " అని మెల్లిగా గధ్గదకంఠంతో పలికింది.

శ్రీకృష్ణుడు వెంటనే "నీ పుత్రుని ఆదేశం. రాకుండా వుండగలనా ? అమ్మను చూడకుండా వుండగలనా " అని

చిరునవ్వులు చిందిస్తూ అన్నాడు.

అదే సమయానికి శంకరాచార్యులవారు కూడా అక్కడికి వచ్చారు.

ఉప్పొంగిన ఆనందంతో ఆ మాతృమూర్తి శంకరునితో " నాయనా ! నా భాగ్యమేమని చెప్పను? నిన్ను పుత్రుని గా పొంది నేను తరించాను. సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడినే నా ముందు నిలబెట్టావుకదా, శంకరా!" అని కన్నీళ్ళు కార్చింది .

గోపాలుని నేను నిలబెట్టడమేమిటి? నేను జన్మించినది మొదలు నీవు నా కోసం పడ్డ శ్రమకు , కష్టాలకు బదులుగా

నేనేమీ చేయలేకపోయాను.

సాక్షాత్తు భగవంతుడే మానవరూపంలో పుట్టినా మాతృ ప్రేమకు సాటిగా , ఎంతటి సేవచేసినా కన్నతల్లి ఋణం అణువంతైనా తీరదు.

నేనైనా అంతే. నేను చేయగలిగినదంతా నీ దివ్య చరణాలకు హృదయపూర్వకమైన సాష్టాంగ ప్రమాణం ఒక్కటే "

అని మాతృదేవత పాదాలముందు మోకరిల్లారు ఆదిశంకరాచార్యులవారు.

***

మన తల్లి తండ్రుల కు మనం చేసే సేవల వల్లనే వారి మనసు సంతృప్తిచెంది వారి దివ్యాశీస్సులు సదా తమ బిడ్డలకు ప్రసాదిస్తారని జగద్గురు ఆదిశంకరాచార్యులవారు ఈ లోకానికి సందేశమిచ్చారు.

సేకరణ:- చొప్పకట్ల సత్యనారాయణ గారి పోస్ట్. 

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

శివోహం

 🌹🌹🌹🌹🌷🌷🌹🌹🌹🌹

           *🌷శివోహం 🌷* 

                 🌷🌷🌷

పరమ జిజ్ఞాసువు, కారణజన్ముడైన ఒక విద్యార్థిని ఒక ఆధ్యాత్మిక గురూత్తముడు ‘నీ వెవరివి?’ అని ప్రశ్నించాడు ఆ విద్యార్థి సవినయంగా నమస్కరించి ‘చిదానందరూపః శివోహం శివోహం’ అని సమాధానం చెప్పాడు. ఇక్కడ శివుడు అన్న పదానికి పరబ్రహ్మం అనే అర్థం. మనం పరమేశ్వరుడు, శివుడు అని అర్థం చెప్పుకొంటే సందర్భోచితంగా ఉంటుంది. ఏ వ్యక్తి అయినా ‘నేను శివుడిని, నేనే శివుడిని’ అని మనసులో అనుకున్నా, పైకి అన్నా బాగానే ఉంటుంది. శివతత్వాన్ని అర్థం చేసుకుని శివుడిలాగా ప్రవర్తిస్తే ఇంకా బాగుంటుంది. 

శివం అంటే శుభం అని అర్థం. శివుడు అంటే శుభాన్ని కలిగించేవాడు. శం అంటే సుఖం. శంకరుడు అంటే సుఖాన్ని కలిగించేవాడు. పాలసముద్రం నుంచి హాలాహలం ఆవిర్భవించినప్పుడు లోకాలన్నీ భయకంపితాలై హాహాకారాలు చేస్తుంటే శివుడు ఆ ఘోర విషాన్ని అరచేతిలోకి తీసుకొని ఆనందంగా తాగాడు. తనకు వెలుపల ఉన్న లోకాలకు, తనకు లోపల ఉన్న లోకాలకు ఇబ్బంది కలగకుండా దాన్ని తన కంఠ ప్రదేశంలో నిలుపుకొన్నాడు. ఇతరుల ఇబ్బందిని తొలగించడం మన పని అయినట్లయితే, మనం ఆ పనిని చేసి తీరవలసిందే. వారికి వచ్చిన ఇబ్బందిని తీర్చవలసిందే. ఇదీ శివతత్వం!


శివుడు అభిషేక ప్రియుడు. భక్తిప్రపత్తులతో ఒక్క ఉద్ధరిణెడు నీళ్లు తీసుకొని ‘హరహర మహాదేవ!’ అంటూ శివలింగం మీద పోస్తే చాలు. ఒక్క మారేడు దళాన్ని తీసుకొని ‘ఓం నమశ్శివాయ!’ అంటూ శివలింగం మీద ఉంచితే చాలు- శివుడు పొంగిపోతాడు. అతగాడి కోరికలనన్నింటినీ తీరుస్తాడు. మనవద్దకు వచ్చిన వ్యక్తి ఎంత విలువైన వస్తువును తెచ్చాడనేది కాదు, ఎంత ఆప్యాయతతో తెచ్చాడనేది ప్రధానం. మనం చూడవలసింది అర్థాన్ని కాదు, ఆత్మీయతనే. ఇదీ శివతత్వం!


శివుడు రుద్రుడు. అపరిమితమైన ఆగ్రహం కలవాడు. అదే శివుడు పరమ శాంతమూర్తి కూడా! శివుడి ఫాలనేత్రంలో భయంకరమైన అగ్ని ఉన్నది. తలమీద చల్లని వెన్నెలను కురిపించే చంద్రుడున్నాడు. మన్మథుడు తన మీద బాణంవేసిన సమయంలో శివుడు కాలాగ్నిరుద్రుడయ్యాడు. తన మూడో కంటిమంటతో అతణ్ని భస్మీపటలం చేశాడు. మన్మథుడి భార్య రతి దీనంగా ప్రార్థించగానే చల్లబడ్డాడు. ఆమెకు పతిభిక్ష పెట్టాడు. కోపమనేది మనిషికి చాలా సహజమైన లక్షణం. దీర్ఘక్రోధం పనికిరాదు. ఇరుగు పొరుగుకు నష్టాన్ని కలిగించే క్రోధం అసలు పనికిరాదు. పశ్చాత్తాపం చెందినవారిని క్షమించే గుణం ఉండాలి. ఇదీ శివతత్వం!


ఎక్కడో గగనతలంలో ఉన్న గంగానదీ ప్రవాహం ఒక్క వూపున భూమి మీదకు దూకితే చిన్న మట్టిముద్దలాంటి భూగోళం మొత్తం తడిసి బద్దలైపోవటం ఖాయం. అటువంటి సంకట పరిస్థితిలో భగీరథుడు ‘త్వమేవ శరణం మమ’ అంటూ ప్రార్థిస్తే శివుడు తన రెండు చేతులనూ నడుంమీద మోపి, రెండు పాదాలనూ కైలాస పర్వతశిల మీద స్థిరంగా వూని గంభీరంగా నిలబడ్డాడు. ఆకాశం నుంచి ఒక్క వూపున దూకిన గంగను తన శిరస్సు మీద భరించాడు. జటాజూటంలో బంధించాడు. ఒక్క పాయను వదిలి గంగను నిదానంగా హిమవత్పర్వతం మీదకు పంపాడు. మన సమక్షంలో ఏదైనా మహాప్రమాదం జరగబోతూ ఉంటే దాన్ని ఆపగలిగిన సామర్థ్యం మనకుంటే మనం ఆపవలసిందే. ఇదీ శివతత్వం!


శివుడు విభూతిరాయుడు. విభూతి అంటే ఐశ్వర్యం. అన్ని విధాలైన ఐశ్వర్యాలకూ ఆయన అధిపతి. సమస్త సంపదలకూ అధీశ్వరుడైన కుబేరుడు అతడికి ప్రియమిత్రుడు. అయినప్పటికీ శివుడు నిరాడంబరుడే! మన ఘనత అనేది మన వ్యక్తిత్వంలో ఉండాలి. మన ప్రవర్తనలో ఉండాలి. మన కర్తవ్య నిర్వహణలో ఉండాలి. అంతేకానీ, బాహ్యవేషంలో కానేకాదనటానికి శివుడే ఉదాహరణం; ఆదర్శం. ఇదీ శివతత్వం!


మహాన్యాసం అనే శివాభిషేకంలో దశాంగరౌద్రీకరణం అని ఉంది. అదేవిధంగా షోడశాంగరౌద్రీకరణం కూడా ఉంది. ఇవి మన శరీరంలోని లలాటం, నేత్రం మొదలైన పది అవయవాల్లోనూ, శిఖ, శిరస్సు మొదలైన పదహారు అవయవాల్లోనూ శివుడున్నాడని తెలియజేస్తున్నాయి. అంటే, మన శరీరం యావత్తూ శివస్వరూపమేనన్నమాట. మన శరీరం ఇంత పవిత్రమైనదీ, విలువైనదీ కనుక దీన్ని మనం సత్కార్యాల కోసమే వినియోగించాలని దీని అంతరార్థం. శివోహం- నేను శివుడిని; నేనే శివుడిని అనే మాటకు అసలైన అర్థమిదే!

                           స్వస్తి,!

సేకరణ:- శ్రీ చొప్పకట్ల సత్యనారాయణ గారి ముఖ పుస్తకం పోస్టు.

శివరాత్రి - శివార్చన

 🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸

🌸 *శివరాత్రి - శివార్చన* 🌸



దీపారాధన చేసి, ఆచమనం సంకల్పం చేసుకొని కలశ గణపతి పూజ ముగించుకోవాలి.   

(శివునిపై ఉదకము చల్లుచూ, లేక విడుచుచు)


ఓం శూల పాణీయే నమః శివోః హం ప్రతిష్ఠితోభవ.


ధ్యానం:


(పుష్పము చేతపట్టుకొని)


శ్లో // శుద్ధస్పటిక సంకాశం త్రినేత్రం పంచవక్త్రం /

గంగాధరం దశభుజం సర్వాభరణ భూషితం //

నీలగ్రీవం శశాంకాంకం – నాగ యజ్ఞోపవీతినం /

వ్యాఘ్ర చర్మోత్తరీయంచ వరేణ్య మభయప్రదం //

కమండల్వక్ష సూత్రభ్యామాన్వితం శూలపాణినం /

జ్వలంతం పింగళజటా శిఖాముద్యోత ధారిణిం //

అతృతేనాప్లుతం హృష్టముమాదేహార్ధ ధారిణం /

దివ్యసింహాసనాసీనం – దివ్య భోగ సమన్వితం //

దిగ్దేవతా సమాయుక్తం – సురా సుర నమస్కృతం /

నిత్యం చ శాశ్వతం శుద్ధం ధ్రువమక్షరమవ్యయం

సర్వవ్యాపిన మీశానమేవం వై విశ్వరూపిణం //

(పుష్పమును స్వామిపై నుంచవలయును. అనంతరము ఆవాహనమును చెప్పవలయును. నమకము నందలి 23 వ మంత్రము)


ఆవాహనం:


(మం) మానోమహన్తముతమానో అర్భకం మాన ఉక్షన్తముత మాన ఉక్షితమ్ /

మానోవధీః పితరం మోతం మాతరం ప్రియమాన్తనస్త నువోః // రుద్రదీరిష //

ఓం శివాయనమః ఆవాహయామి /

(పుష్పము నుంచవలయును. తరువాత నమకము నందలి యాతే రుద్రయను ప్రథము మంత్రముచే పుష్పాసనము సమర్పించవలయును.).


ఆసనం:


(మం) యాతేరుద్ర శివాతనూరఘోరా పాపకాశినీ //

తయానస్తనువాశంతమయా గిరీశన్తాభిచాకశీహి //

ఓం మహేశ్వరాయ నమః పుష్పం సమర్పయామి

(అక్షతలు వేయవలెను.)


పాద్యం:


(మం) యామిషుం గిరిశన్త హస్తే భిభిర్ష్యస్తవే

శివాం గిరిత్రతాంకురు మహిగం సీః పురుషంజగత్

ఓం శంభవే నమః పాద్యం సమర్పయామి.

(ఉదకమును విడవవలెను.)


అర్ఘ్యం:


(మం) శివేన వచసా త్వా గిరిశాచ్చా వదామసి /

యదానస్సర్వమిజ్జగదయక్ష్మగం సుమనాఅసత్ //

ఓం భర్గాయ నమః అర్ఘ్యం సమర్పయామి.

(నీరు చల్లవలెను.)


ఆచమనం:


(మం) అధ్య వోచద ధివక్త్రా ప్రథమో దైవ్యోభిషక్ /

అహంగ్ హీశ్చ సర్వానమ్భజస్సర్వాశ్చ యాతుధాయన్య

ఓం శంకరాయ నమః ఆచమనీయం సమర్పయామి.

(ఉదకమును విడువవలెను.)


స్నానం :


(మం) అసౌ యస్తామ్రౌ అరుణ ఉతబభ్రుసుమంగళః

యే చేమాగం రుద్రా అభితోదిక్షు //

శ్రితాస్సహస్ర శోవై షాగం హేడ ఈమహే //

ఓం శాశ్వతాయ నమః శుద్ధోదకస్నానం సమర్పయామి.

(నీరు చల్లవలెను.)


పంచామృతస్నానం


ఆప్యాయస్వమేతుతే విశ్వతస్సోమవృష్టియం /

భవా వాజస్య సంగధేః //

ఓం పశుపతయే నమః క్షీరేణ స్నాపయామి .

(స్వామికి పాలతో స్నానము చేయవలెను)


ధదిక్రావుణ్ణో అకారిషం జిష్ణోరస్వశ్యవాజినః /

సురభినో ముఖాకరత్ప్రమణ అయుగంషితారిషత్ //

ఓం ఉమాపతయే నమః దధ్యాస్నాపయామి .

(స్వామికి పెరుగుతో స్నానము చేయవలెను)


శుక్రమసి జ్యోతిరసి తేజోసి దేవేవస్సవితోత్సునా

త్వచ్చిద్రేణ పవిత్రేణ వసోస్సూర్యస్యరస్మిభిః //

ఓం పరబ్రహ్మణే నమః అజ్యేన్న స్నాపయామి.

(స్వామికి నెయ్యితో స్నానము చేయవలెను)


మధువాకా యతాయుతే మధుక్షరంతి సింధవః

మాధ్వీన్నస్సంత్వౌషమాధీః / మధునక్తముతోషినీ //

మధువత్పార్ధిగం రజః మధుదౌరస్తునః స్థితాః /

మధుమాన్నో వనస్పతిర్మధురాగం (అస్తు) సూర్యః

మాధ్వీర్గావో భవంతునః //

ఓం బ్రహ్మాధిపాయనమః / మధునా పపయామి

(స్వామికి తేనెతో స్నానము చేయవలెను)


స్వాధుః సవస్వ దివ్యాయ జన్మనే స్వాదురింద్రాయ

సహనేతునామ్నే ! స్వాదుర్మిత్రాయ వరుణాయ

వాయవే బృహస్పతయే మధుమాగం అదాభ్యః /

ఓం పరమేశ్వరాయ నమః! శర్కరాన్ స్నపయామి.

(స్వామికి పంచదారతో స్నానము చేయవలెను)


యాః ఫలవీర్యా అఫలా అపుష్పాయాశ్చ పుష్పిణీః

బృహస్పతి ప్రమాతోస్తానో ముస్త్వగ్ హంసః //

ఓం ఫాలలోచనాయ నమః – ఫలోదకేన స్నాపయామి

(స్వామికి కొబ్బరినీళ్ళుతో స్నానము చేయవలెను)


(తతః నమకచమకపురుషసూక్తేన శుద్ధోదకస్నానం కుర్యాత్)

అపోహిష్టామయోభువః – తాన ఊర్జేదధాతన /

మహేరణాయ చక్షసే యోవశ్శివ తమోరసః /

తస్మా అరంగ మామవః యస్యక్షయాయ జిన్వధ //

అపోజన యధాచనః

ఓం అష్టమూర్తయే నమః – శుద్ధోదకస్నానం సమర్పయామి.

(స్వామికి నీళ్ళుతో స్నానము చేయవలెను)


అభిషేకము:


(క్రింది మంత్రములను చదువుచు జలధార విడువవలయును)


ఓం నమస్తే రుద్రమన్యవ ఉతోత ఇషవే నమః

నమస్తే అస్తుధన్వనే బాహుభ్యాముత తే నమః //

తయాన స్తనువాశం తమయా గిరిశన్తాభి చాకశీహి /

యామిషుం గిరిశన్త హస్తే భిభిర్ష్యస్తవే

శివాం గిరిత్రతాంకురు మహిగం సీః పురుషంజగత్ //

శివేన వచసా త్వా గిరిశాచ్చా వదామసి /

యదానస్సర్వమిజ్జగదయక్ష్మగం సుమనా అసత్ //

అధ్య వోచద ధివక్త్రా ప్రథమో దైవ్యోభిషక్ /

అహంగ్ హీశ్చ సర్వానమ్భజస్సర్వాశ్చ యాతుధాయన్యః //

అసౌ యస్తామ్రౌ అరుణ ఉతబభ్రుసుమంగళః

యే చేమాగం రుద్రా అభితోదిక్షుః //

శ్రితాస్సహస్ర శోవై షాగం హేడ ఈమహే

అసౌయో పరస్పతిః నీలగ్రివో విలోహితః

ఉత్తైనం గోపా అదృశన్నదృశన్నుదహార్యః

ఉత్తైనం విశ్వాభూతాని సదృష్టో మృడయాతినః //

నమోఅస్తు నీలగ్రీవాయ సహస్రాక్షాయ మీఢుషే / అథోయే అస్య సత్వానో హం తేభ్యో కరం నమః

ప్రముంచ ధన్వన స్వముభయోరార్న్తి యోర్జ్యామ్

యశ్చతే హస్త ఇషవః పరాతా భగవోవ ప

అవతత్యదనుస్ట్వగం సహస్రాక్ష శతషుధే //

నిశీర శల్యానాం ముఖాశివో నస్సుమానాభవ //

విజ్యం ధనుః కపర్దినో విశల్యో బాణవాగం ఉత //

అనేశన్న స్యేషవ అభురస్య నిషంగధిః //

యాతే హేతిర్మీఢుష్టమ హస్తేబభూవతే ధనుః

తయా స్మానిశ్వత స్త్వమయక్ష్మ యా పరిభుజ //

నమస్తే అస్త్యాయుధాయాతా నాత య ధృష్ణవే

ఉభాభ్యాముత నమో బాహుభ్యా తవ ధన్వనేః

పరితే ధన్వనోహేతిరస్మాన్మృణక్తు విశ్వతః

అథోధియ ఇషు స్తవా రే అస్మిన్న దేహితమ్ //

మానో మహాన్త ముతమానో అర్భకం మాన ఉక్షన్త

ముతమాన ఉక్షీతమ్ / మానో వధీః పితరం మోతమాతరం

ప్రియామానస్తనువోః రుద్రరీరిషః //

మానస్తోకే తనయే మాన ఆయుషిమానో గోషుమానో

అశ్వేషిరీరిషః వీరాజన్మానో రుద్రభామితో వఢఃఇర్హవిష్మన్తో నసుసావిధేమ తే //

అణోరణీయా మహమేవకత్వం మహానహం విశ్వ మదం వచైత్రం

పురాతనోహం పురుషోహమీశో హిరణ్యయోహం శిరూప మస్తి //

ఓం మృత్యుంజయాయ నమః అభిషేకం సమర్పయామి.


వస్త్రం:


(మం) అసౌ యో వసర్పతి నీలగ్రీవో విలోహితః

ఉతైనం గోపా అదృశన్నదృశన్ను దహార్యః

ఉతైనం విశ్వభూతానిసః దృష్టో మృడయాతినః

ఓం మృడాయ నమః – వస్త్రయుగ్మం సమర్పయామి.


కటిబంధనము:


(మం) దీర్ఘాయుత్వాయజదృష్టిరస్మితం జీవామివరదః

పురూచరాయ సోషమభిసంవ్య యిష్యే /

ఓం భూతేశాయ నమః కటిబంధేనవస్త్రం సమర్పయామి.


భస్మదారణం:


(మం) అగ్నిరితభస్మ వాయురిత భస్మజమితి

భస్మస్థలమితి భస్మ వ్యోమేతిభస్మ సర్వగం హవాయ ఇదగం సర్వంభస్మ /

(మం) త్ర్యంబకం యజామహే ఉగంధిం పుష్టివర్ధనమ్

ఉర్వారుకమివబంధనాన్మృత్యోరుక్షీయమా మృతాత్ /

ఓం శర్వాయ నమః ఇతి భస్మధారణం.


యజ్ఞోపవీతం:


(మం) యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతే ర్యత్సహజం పురస్తాత్ /

ఆయుష్యమగ్ర్యం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః //

ఓం సర్వేశ్వరాయ నమః యజ్ఞోపవీతం సమర్పయామి.


గంధం:


(మం) యోవైరుద్రవః యశ్చసోమో భూర్భువ

సువస్తస్మై నమోనమశ్శీర్ షంజనదోం విశ్వరూపోసి

గంధద్వారాం దురాధర్షాం నిత్యపుష్టాం కరీశిణీం

ఈశ్వరీగం సర్వభూతానాంత్వామిహోపహ్వయేశ్రియం

ఓం సర్వజ్ఞాయ నమః గంధం విలేపయామి.

(గంధం చల్లవలెను.)


అక్షతలు


(మం) ఆయనే తే పరాయణే దూర్వారోహస్తు పుష్పిణః

హ్రదాశ్చ పుండరీకాణి సముద్రస్య గృహాణమే //

ఓం సదాశివాయ నమః అక్షతాన్ సమర్పయామి.

(అక్షతలు సమర్పించవలెను)


బిల్వపత్రం:


(మం) యావై రుద్రస్య భగవాన్యశ్చ సూర్యోభూర్భువ

సువస్తస్మైవై జనమోనమశ్శీర్ షంజనదో విశ్వరూపోసి //

శ్లో // అమృతోద్భవ శ్రీవృక్షం శంకరస్య సదాప్రియా /

తత్తేశంభో ప్రయచ్ఛామి బిల్వపత్రం సురేశ్వర //

త్రిశాఖై ర్భిల్వపత్రైశ్చ అచ్చిద్రైః కోమలై శుభైః /

తవపూజాం కరిష్యామి అర్చయేత్పరమేశ్వరః //

గృహాణ బిల్వపత్రాణి సుపుష్పాణి మహేశ్వరః /

సుగంధేన భవానీశ హివత్త్వం కుసుమప్రియః //

ఓం అభయాయ నమః బిల్వపత్రాణి సమర్పయామి.

(బిల్వపత్రములు వేయవలెను)

(అనంతరం అష్టోత్తరశతనామైర్వాత్రిశతనామైర్వా సహస్ర నామైర్వాప్రపూజయేత్)


అథాంగపూజ:


ఓం శంకరాయ నమః – పాదౌ పూజయామి.

ఓం శివాయ నమః – జంఘే పూజయామి.

ఓం మహేశ్వరాయ నమః – జానునీ పూజయామి.

ఓం త్రిలోకేశాయ నమః – ఊరుం పూజయామి.

ఓం వృషాభారూఢాయ నమః – గుహ్యం పూజయామి.

ఓం భస్మోద్ధోళిత విగ్రయా నమః – కటిం పూజయామి.

ఓం మృత్యుంజయాయ నమః – నాభిం పూజయామి.

ఓం రుద్రాయ నమః – ఉదరం పూజయామి.

ఓం సాంబాయ నమః – హృదయం పూజయామి.

ఓం భుజంగభూషణాయ నమః – హస్తౌ పూజయామి.

ఓం సదాశివాయ నమః – భుజౌ పూజయామి.

ఓం విశ్వేశ్వరాయ నమః – కంఠం పూజయామి.

ఓం గిరీశాయ నమః – ముఖం పూజయామి.

ఓం త్రిపురాంతకాయ నమః – నేత్రాణి పూజయామి.

ఓం విరూపాక్షాయ నమః – లలాటం పూజయామి.

ఓం గంగాధరాయ నమః – శిరః పూజయామి.

ఓం జటాధరాయ నమః – మౌళీం పూజయామి.

ఓం పశుపతయే నమః – సర్వాణ్యంగాని పూజయామి.

ఓం పరమేశ్వరాయ నమః – పూజయామి.


లింగపూజ:


ఓం నిధనపతయే నమః

ఓం నిధనపతాంతికయై నమః

ఓం ఊర్ధ్వాయ నమః

ఓం హిరణ్యాయ నమః

ఓం సువర్ణాయ నమః

ఓందివ్యాయ నమః

ఓం భవాయ నమః

ఓం శర్వాయ నమః

ఓం శివాయ నమః

ఓం జ్వలాయ నమః

ఓం ఆత్మాయ నమః

ఓం పరమాయ నమః

ఓం ఊర్థ్వలింగాయ నమః

ఓం హిరణ్యలింగాయ నమః

ఓం సువర్ణలింగాయ నమః

ఓం దివ్యలింగాయ నమః

ఓం భవలింగాయ నమః

ఓం శర్వలింగాయ నమః

ఓం శివలింగాయ నమః

ఓం జ్వలలింగాయ నమః

ఓం ఆత్మలింగాయ నమః

ఓం పరమలింగాయ నమః


ధూపం:


నవవస్త్వా ధూపయంతు / గాయత్రే ఛందసాంగి -

రస్వద్ద్రుద్రాస్త్వా భూపయంతు / త్రెష్టుభేన ఛందసాంగి

రస్వదాదితాస్త్వా ధూపయంతు / జగతేన ఛందసాంగి

రస్వదిఁ బ్రస్త్వా ధూపయత్వం / గిరిస్వదివ్వష్ణుస్త్వా ధూపయర్వంగిరస్వ /

వ్వరుణత్వా ధూపయత్వం గిరిస్వదదలిప్తా దేవీర్విశ్వ దేవ్యాపతీ /

పృధీవ్యాసృభస్థేంగిదసర్దనత్యనట దేవానాం త్వాపత్నీ /

ఓం భీమాయ నమః – ధూపమాఘ్రాపయామి.

(ఎడమచేతితో గంటను వాయించవలెను). దీపం:

ఆపాణి పాదోహ మంచిత్తపశ్శ్క్తిం, పశ్వామ్య చక్షుస్స

శృణోన్యుకర్ణః సవేత్తివేద్యం నదతపాప్తి, వేత్తాత మహురగ్ర్యం పురుషం మహంతం

సర్వవ్యాపిన మాత్మానం క్షీరే సర్పి శివార్పితంసా

ఆత్మవిద్యా తపోమూలం త్ద్బ్రహ్మోపవిషదమ్ //

నతత్ర సూర్యోభాతినః చంద్రతారకం

నేమావిద్యుతో భాంతికురో యమగ్ని తస్యభాసా సర్వమిదమ్ విభాతి //

ఓం మహాదేవాయ నమః దీపం దర్శయామి.

(ఎడమచేతితో గంటను వాయించవలెను)


నైవేద్యం:


(మం) దేవసవితః ప్రసువసత్యంత్వర్తేన పరిషంచామి

అమృతమస్తు అమృతోప స్తరణమసి స్వాహా //

(మహా నైవేద్యం కొరకు ఉంచిన పదార్ధముల చుట్టూ నీరు చిలకరించుచూ.)


ఓం భూర్భువ స్సువః, ఓం త తసవితు ర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి, ధియో యోనః ప్రచోదయాత్, సత్యం త్వర్తేన పరిషించామి, అమృతమస్తు, అమృతోపస్తరణ మసి,

(మహా నైవేద్య పదార్ధముల పై కొంచెం నీరు చిలకరించి కుడిచేతితో సమర్పించాలి.)

(ఎడమచేతితో గంటను వాయించవలెను)


ఓం ప్రాణాయస్వాహా – ఓం అపానాయ స్వాహా,

ఓం వ్యానాయ స్వాహా ఓం ఉదనాయ స్వాహా

ఓం సమనాయ స్వాహా ఓం బ్రహ్మణే స్వాహా.

తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రఃప్రచోదయాత్

మధ్యే మధ్యే పానీయం సమర్పయామి.

అమృతాభిధానమపి – ఉత్తరాపోశనం సమర్పయామి

హస్తౌ పక్షాళయామి – పాదౌ ప్రక్షాళయామి – శుద్దాచమనీయం సమర్పయామి.


తాంబూలం:


(మం) ఉమారుద్రాయ తవసే కపర్థినేక్షయద్వీరాయ

ప్రభరామహమతిం / య్ధావశ్శమ అద్విపదే

చతుష్పదే విశ్వం పుష్టంగ్రామే అస్మిన్న నాతురమ్ //

ఓం త్రిపురాంతకాయ నమః తాంబూలం సమర్పయామి.

తాంబూలం చర్వణానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి.


నీరాజనం:


శ్లో // పరానంద చిదాకాశ – పరబ్రహ్మ స్వరూపికా /

నీరాజనం గృహాణేశ – ఆనందాఖ్యం సదాశివ //

(మం) అర్యప్రజామే గోపాయ – సర్వప్రజామే గోపాయ – అమృతత్త్వాయ జీవసే జనిష్యమాణాంచ / అమృతేసత్యే ప్రతిష్టితామ్ అధర్వపితుంమే గోపాయ రసమన్న మిహాయుషే అదబ్దాయో శీతతనో అవిషన్న పితుంకృణుః స్వపశూన్మే గోపాయః ద్విపాదో యే చతుష్పదః అష్టాశ పాశ్చాయ ఇహగ్నే / యేచైక్ శపా అనుగాః సప్రధస్సభాంమే గోపాయ యేచక్యాస్సభాసదః తానింద్రియావతః కురుసర్వమయూరు పానతామ్ హేర్భుద్ని య మంత్రం మే గోపాయ యమృషయస్రై విదావిదుః // ఋచుస్సామాని యజూగంషిపాహి శ్రీరమృతానతామ్ / మానో వాగంసీ జాతవేదోగామశ్వం పురుషం జగత్ అభిభ్రదగ్న గహిశ్రియా మా పరిపాలయా సామ్రాజ్యం చ విరాజం చాభి శ్రీర్యాచనో గృహలక్ష్మీ రాష్ట్రస్యయ ముఖేతయా మానగం సృజామసినం తత శ్రీరస్తుః నిత్యమంగళాని భవంతు.

ఓం సదాశివాయ నమః కర్పూరనీరాజనం సమర్పయామి.

(ఎడమచేతితో గంటను వాయించుచూ కుడిచేతితో హారతి నీయవలెను)

అనంతరం ఆచమనీయం సమర్పయామి.


మంత్రపుష్పమ్:


ఓం సహస్ర శీర్ షం దేవం విశ్వాక్షం విశ్వశంభువం,

విశ్వం నారాయణం దేవ మక్షరం పరమం పదం.

విశ్వతః పరమాన్నిత్యం విశ్వం నారాయణగం హరిం.

విశ్వమేవేదం పురుషస్త ద్విశ్వముఅపజీవతి,

పతిం విశ్వస్యాత్మేశ్వరగం శాశ్వతగం శివమచ్యుతం

నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం,

నారాయణ పరోజ్యోతి రాత్మా నారాయణః పరః,

నారాయణ పరంబ్రహ్మ తత్త్వం నారాయణః పరః

నారాయణపరో ధ్యాతా ధ్యానం నారాయణః పరః

యచ్చకించిజ్జగ త్సర్వం దృశ్యతే శ్రూయతే పివా,

అంతర్బహిశ్చ త త్సర్యం వ్యాప్య నారాయణ స్స్థితః

అనంతమవ్యయం కవిగం సముద్రేంతం విశ్వశంభువం

పద్మకోశ ప్రతీకాశగం హృదయం చాప్యధోముఖం,

అధోనిష్ట్యా వితస్త్యాన్తే నాభ్యాముపరి తిష్ఠతి,

జ్వాలామాలా కులం భాతి విశ్వస్యాయతనం మహత్,

సన్తతగం శిలాభిస్తు లంబత్యాకోశ సన్నిభం.

తస్యాన్తే సుషిరగం సూక్ష్మం తస్మిన్ త్సర్వం ప్రతిష్ఠతం,

తస్య మధ్యే మహా నగ్ని ర్విశ్వార్చి ర్విశ్వతోముఖః.

సోగ్రభు గ్విభజ న్తిష్ఠ న్నాహార మజరః కవిః

తిర్యగూర్థ్వ మధశ్శాయీ రశ్శయస్తస్య సంతతా,

సంతాపయతి స్వం దేహ మాపాదతలమస్తగః,

తస్య మధ్యే వహ్నిశిఖా అణీయోర్ధ్వా వ్యవస్థితః,

నీలతోయదమధ్యస్థా ద్విద్యుల్లేఖేవ భాస్వరా,

నీవారశూకవ త్తన్వీ పీతా భాస్వత్యణూపమా,

తస్య శ్శిఖాయా మధ్యే పరమాత్మా వ్యవస్థితః,

స బ్రహ్మ స శివ స్స హరిస్సేంద్ర స్సోక్షరః పరమః స్వరాట్.

రాజాధిరాజాయ ప్రసహ్య సాహినే,

నమో వయం వై శ్రవణాయ కుర్మహే

స మే కామా న్కామకామాయ మహ్యం

కామేశ్వరోవైశ్రవణో దదాతు.

కుబేరాయవైశ్రవణాయ, మహారాజాయ నమః

ఓం తద్బ్రహ్మ – ఓం తద్వాయుః ఓం తదాత్మా

ఓం తత్సత్యం ఓం తత్సర్వం ఓం తత్పురోర్నమః.

అన్తశరతి భూతేషు గుహాయాం విశ్వమూర్తిషు త్వం యజ్ఞస్త్వం వషట్కాస్త్వ మింద్రస్తగం రుద్రస్త్వం విష్ణుస్త్వం బ్రహ్మస్త్వం ప్రజాపతిః / త్వం తదాప ఆపోజ్యోతి రసో మృతం బ్రహ్మ భూర్భువస్సువరోమ్ //

(ఈశాన్యస్సర్వవిద్యానామీశ్వరస్సర్వభూతానాం బ్రహ్మధిపతిర్బ్రహ్మణీధిపతిర్బ్రశివోమే అస్త్సదా శివోం

తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నోరుద్రః ప్రచోదయాత్ //

( అని మంత్ర పుష్పం సమర్పించి లేచి నిలబడి ముకళితహస్తులై )


ఆత్మప్రదక్షిణ. (కుడివైపుగా 3 సార్లు ఆత్మప్రదక్షిణం చేయవలెను)

యానికానిచ పాపాని జన్మాంతరకృతాని చ,

తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదేపదే.

పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాపసంభవః,

త్రాహి మాం కృపయా దేవ శరణా గతవత్సల.

శ్రీ సదాశివాయ నమః ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి.

పునః పూజాం కరిష్యే ! 

ఛత్రం సమర్పయామి, చామరం సమర్పయామి , నృత్యం సమర్పయామి , గీతం సమర్పయామి, వాహనం సమర్పయామి సమస్త రాజోపచారం దేవోపచార పూయం సమర్పయామి . 

 

                 *శివ పరివార అర్ఘ్యములు*

1 ). శివ అర్ఘ్య ప్రదానం.  


శ్లో !! నమో విశ్వ స్వరూపాయ విశ్వ సృష్ట్యాధికారక !

గంగాధర నమస్తుభ్యం గృహాణార్ఘ్యం మయార్పితం !!

శంకరాయ నమః ఇదమర్ఘ్యం ఇదమర్ఘ్యం ఇదమర్ఘ్యం 


శ్లో !! నమశ్శివాయ శాంతాయ సర్వపాప హరాయచ !

శివరాత్రౌ మయాదత్తం గృహాణార్ఘ్యం మయార్పితం !!

శంకరాయ నమః ఇదమర్ఘ్యం ఇదమర్ఘ్యం ఇదమర్ఘ్యం 


శ్లో !! దుఃఖ దారిద్ర్య పాపైశ్చ దగ్ధోహం పార్వతీపతే !

మాం త్వం పాహి అహాబాహో గృహాణార్ఘ్యం మయార్పితం !!

శంకరాయ నమః ఇదమర్ఘ్యం ఇదమర్ఘ్యం ఇదమర్ఘ్యం 


శ్లో !! శివ శివరూపాయ భక్తానాం శివదాయక !

ఇదమర్ఘ్యం ప్రదాస్యామి ప్రసన్నో భవ సర్వదా !!

శంకరాయ నమః ఇదమర్ఘ్యం ఇదమర్ఘ్యం ఇదమర్ఘ్యం 


2 ) ! పార్వతీ దేవి అర్ఘ్యం !           

అంబికాయై నమస్తుభ్యం నమస్తే దేవి పార్వతీ !

అంబికే వరదే దేవి గృహ్ణీదార్ఘ్యం ప్రసీద !!

అమ్బికాయై నమః ఇదమర్ఘ్యం ఇదమర్ఘ్యం ఇదమర్ఘ్యం 


3 ) ! గణపతి అర్ఘ్య ప్రదానం !

విఘ్న నాశాయ దేవేశ విఘ్నరాజ నమామ్యహం !

త్వత్ ప్రసాదేన కార్యాణి చ కరోమ్యహం !!

గణపతయే నమః ఇదమర్ఘ్యం ఇదమర్ఘ్యం ఇదమర్ఘ్యం 


4 ) ! సుబ్రహ్మణ్య స్వామి అర్ఘ్యం !

సుబ్రహ్మణ్య మహాభాగ కార్తికేయ సురేశ్వర !

ఇదమర్ఘ్యం ప్రదాస్యామి సుప్రీతో వరదా భవ !!

సుబ్రహ్మణ్యాయ నమః నమః ఇదమర్ఘ్యం ఇదమర్ఘ్యం ఇదమర్ఘ్యం 


5 ) శ్రీ చండికేశ్వరాయ నమః 

ఇదమర్ఘ్యం ఇదమర్ఘ్యం ఇదమర్ఘ్యం 


6 ) శ్రీ నందికేశ్వరాయ నమః 

ఇదమర్ఘ్యం ఇదమర్ఘ్యం ఇదమర్ఘ్యం 


శ్లో // యస్యస్మృత్యాచనామోక్త్యా తపః పూజా క్రియాదిషు

న్యూనం సంపూర్ణతాం యాతి సద్యోవందేతమీశ్వరం //

మంత్రహీనం క్రియాహీనమ్ భక్తహీనం మహేశ్వర

యత్పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్తుతే //

సుప్రీత స్సుప్రసన్నో వరదోభవతు

శ్రీ సదాశివ ప్రసాదం శిరసా గృహ్ణామి //

(పుష్పాదులు శిరస్సున ధరించవలెను.)


తీర్థస్వీకరణం:


శ్లో // అకాలమృత్యుహరణం – సర్వవ్యాధి నివారణం

సమస్త పాపక్షయకరం – శివపాదోదకం పావనం శుభం //

(అనుచు స్వామి పాద తీర్థమును పుచ్చుకొనవలెను.)

*పూజా విధానము సంపూర్ణం*. 🙏

మహేశ్వరం

 🪔 *ॐ卐 _-|¦¦|శుభోదయమ్-సుభాషితమ్|¦¦|-_ ॐ卐*💎


శ్లో𝕝𝕝 మహేశ్వరం మంజుల వాగ్విలాసం

గంగాధరం చంద్రకళావతంసం

గౌరీవరం శ్రీనిధిశైలవాసం

శ్రీమల్లినాధం శిరసానమామి॥


తా𝕝𝕝 మహేశ్వరుడును, మృదువైన వాగ్విలాసము కలవాడును, గంగను ధరించు వాడును, చంద్రకళ శిరోభూషణముగ కలవాడును, పార్వతీ భర్తయు, సంపదకు నిధియైన పర్వతము నివాసముగా కలవాడునైన *శ్రీమల్లికార్జున స్వామికి శిరస్సుతో నమస్కరించుచున్నాను*....

ప్రశ్న పత్రం సంఖ్య: 41 జవాబులు

 ప్రశ్న పత్రం సంఖ్య: 41 జవాబులు

కూర్పు: సి. భార్గవ శర్మ న్యాయవాది  

క్రింద ఇచ్చిన ప్రశ్నలకు 4 జవాబులు వున్నాయి ఒక జవాబు మాత్రం ఎంచుకోండి.

1) హమ్మయ్య అని ఎప్పుడు అనుకుంటాము

i ) ఏదైనా సందిద్గత తొలగినప్పుడు *

ii ) ఆనందంగా వున్నప్పుడు

 iii ) ఈష్యతో వున్నప్పుడు

 iv ) దుఃఖంగా వున్నప్పుడు . 

2) విమానం టైర్లను ఈ గ్యాసుతో నింపుతారు

i ) నైట్రోజన్ *

  ii ) ఆక్సిజన్ 

 iii ) హీలియం 

 iv ) సాదారణ గాలి 

3) క్రింది పద్యం వ్రాసిన కవి ఎవరు.

సిరిగలవానికి చెల్లును
తరుణులు పదియారువేల తగ పెండ్లాడన్
తిరిపెమున కిద్దరాండ్రా
పరమేశా గంగ విడుము పార్వతి చాలున్

i ) పెద్దన

 ii ) రామకృష్ణ 

iii ) శ్రీనాధుడు*

iv ) తిక్కన 

4) ఇటాలియన్ అఫ్ ది ఈస్ట్ అని యేభాషను అంటారు 

i ) తమిళ 

ii ) కన్నడ

 iii ) తెలుగు*

 iv ) హిందీ 

5) జాతక చక్రంలో మందకొడిగా చలించే గ్రాహం ఏది

i ) గురుగ్రహం 

ii ) రాహు గ్రాహం 

 iii ) శని గ్రాహం*

iv ) బుధ గ్రాహం 

 6) డు ము వు లు

i ) ద్వితీయ విభక్తి

తి ii ) ప్రధమా విభక్తి*

తి iii ) తృతీయ విభక్తి

 iv )  విభక్తికానే కాదు

7) మన శరీరంలోని కండరాలను దీనితో పోల్చవచ్చు

స్క్రూలతో 

 ii ) నట్టులతో 

 iii ) స్ప్రింగులతో *

 iv ) స్క్రూ డ్రైవరుతో

8) పాలు పెరుగుగా మారటానికి కారణం

i ) తోడు పెట్టిన మజ్జిగలో లాక్టోబాసిల్లస్ అనే బాక్టీరియంలు*

ii ) తోడుపెట్టిన మాజ్జిగలోని లాక్టోస్ 

iii ) తోడుపెట్టిన మజ్జిగలో గ్లూకోజ్ 

iv ) తోడుపెట్టిన మజ్జిగతో సంబంధం లేదు

9) వేదాంతం అనగా 

i ) వేదాల చివరి వున్నఉపనిషత్తులు *

 ii ) వేదాల చివరి వున్న  కర్మ కాండ 

iii ) వేదాలలో వున్న కర్మ కాండ 

iv ) స్వామీజీలు చెప్పే ప్రవచనాలు

10) మానవ రక్తం ఎర్రగా ఉండటానికి కారణం

i ) తెల్ల రక్తకణాలు 

 ii ) హిమోగ్లోబిన్ *

 iii ) ప్లాస్మా 

 iv ) రక్తంలోని ద్రవపదార్థం 

11) సింగరేణి బొగ్గు గనులు ఈ వూళ్ళో వున్నాయి

i  )విజయవాడ

 ii ) హైదరాబాదు

 iii ) కొత్తగూడెం*

 iv ) వరంగల్లు

 12) సీలింగ్ ఫాను ఒక

i ) విద్యుతు దీపము 

ii ) విద్యుత్ ఎల్ ఈ డి డివైస్ 

 iii ) విద్యుత్ మోటారు*

 iv ) విద్యుత్ కండెన్సరు

13) వివాహానికి సంబంధించి జాతక రీత్యా లగ్నంలో ఈ  శుద్ధి ఉండాలి

i ) సప్తమ శుద్ధి *

ii )అష్టమ శుద్ధి 

iii )ద్వాదశ శుద్ధి 

iv ) పంచమ శుద్ధి  

14) తొమ్మిది విధముల భక్తి మార్గములు తెలిపినది

i ) వసిష్ఠ మహాముని 

ii )నారద మహాముని*

 iii ) త్యాగరాజు 

iv ) రమణ మహర్షి 

15) ఈ గుణాన్ని ఉత్తమ గుణంగా అంటారు

i )తామస గుణం 

 ii )  సత్వ గుణం *

 iii ) రజోగుణం 

iv ) అమాయక గుణం

16) ప్రత్యక్ష ప్రమాణం  అంటే అర్ధం

i )ఇంద్రియాలద్వారా తెలుసుకోవటం*

ii ) మనస్సుద్వారా తెలుసుకోవటం 

 iii ) ఇతరులద్వారా తెలుసుకోవటం 

 iv ) దీనినే అనుమానప్రమాణం అని కూడా అంటారు

17) దీనిని చుస్తే నోరూరుతుంది  

i ) కుంకుడు కాయ 

ii ) తరిగిన దోసకాయ  

 iii ) తరిగిన ఉల్లిగడ్డ

 iv ) జిలేబి *

18) కదళీ ఫలం అని దీనిని అంటారు

i ) అరటి ఫలం*

 ii ) రేగి ఫలం 

 iii ) జామ ఫలం 

iv ) ద్రాక్ష ఫలం 

19)రుచి అని ఈ పదార్ధాన్ని అప్పుడప్పుడు పేర్కొంటారు

i ) లవణం*

ii )బెల్లం 

 iii ) పంచదార 

iv ) కాకర కాయ 

20)  అపుత్రస్య _______

i ) గతిమ్ నాస్తి *

ii ) సౌఖ్యం నాస్తి 

iii ) భోజనం నాస్తి 

iv ) సంపద నాస్తి 

ప్రత్యక్ష ప్రమాణం:

 ప్రత్యక్ష ప్రమాణం: 

ప్రత్యక్షం అనే పదానికి అర్ధం మనం ఇంద్రియాలద్వారా ఒకదాని ఉనికిని తెలుసుకోవటం అంటే నీ ముందు రామారావు నిలుచున్నడనుకోండి మీరు రామమారావుని ప్రత్యక్షముగా చూస్తున్నారు, అతని మాటలు మీ చెవులతో వింటున్నారు, అతను రాసుకున్న సెంటు వాసన మీ ముక్కుతో గ్రహిస్తున్నారు, అతని చేతిని మీ  చేతితో కరచాలనం చేసి స్పృశిస్తున్నారు ఇలా మీరు మీ ఇంద్రియ జ్ఞానం తో రామారావుని తెలుసుకోవటాన్ని ప్రత్యక్ష జ్ఞ్యానం అంటారు వీటివలన మీకు నీ ఎదురుగా రామారావు ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది ఆలా నిర్ధారణ కావటమే ప్రత్యక్ష ప్రమాణం 

అనుమాన ప్రమాణం 
ఇది ప్రత్యక్ష ప్రమాణానికి దోహదం చేసే ప్రమాణం.  మీరు అడివిలో వెళుతున్నారనుకోండి దూరంగా మీకు ఆకాశంలో పొగ కనబడిందనుకోండి అప్పుడు మీరు ఆ పొగ వలన అక్కడ నిప్పు వుండివుండొచ్చని తలుస్తారు. ఎందుకంటె మీకు పొగ కేవలం నిప్పుద్వారానే వస్తుందనే జ్ఞ్యానం వుంది.  కాబట్టి అక్కడ నిప్పు వున్నదనుకోవటం అనుమానప్రమాణం . అడివిలో నిప్పు ఉండటానికి అవకాశం లేదు కాబట్టి అక్కడ ఎవరో మనుషులు నిప్పు రాజేసి ఉండొచ్చు అంటే అక్కడ మనుషులు వుండివుండొచ్చు అనేది కూడా అనుమానప్రమాణమే. 
కార్య కారణ సంబంధము: 
మన ముందున్న ప్రతి కార్యానికి (పనికి) కారణం (పనిచేసిన వాడు) ఉండొచ్చు అనేది ఒక అనుమాన ప్రమాణం. మీ ముందు ఒక ఇల్లు ఉందనుకోండి అంటే ఆ ఇల్లు కట్టిన కూలివాళ్ళు, మేస్త్రీలు, ఇంజనీరులు వుండివుంటారు అనేది అనుమాన ప్రమాణం.  అంటే ప్రతి కార్యానికి ఒక కారణం లేక కారకుడు వుంటారు. మీరు ఒక హోటలులో రుచికరమైన ఫలహారం తిన్నారనుకోండి ఆ ఫలహారం మీకు రామారావు వడ్డించాడనుకోండి అప్పుడు మీరు దాని రుచిని ఆస్వాదిస్తే దానిని తయారుచేసిన వంటివారు ఎవరు అని విచారిస్తారు. దీనిని బట్టి తెలిసేది ఏమిటంటే ఫలహారం ఎవరో తయారు చేస్తే కానీ నీ వద్దకు రాలేదు.  అది తయారుచేసిన వాడు నీకు తెలిసిన లేక తెలిసిరాకపోయిన అతను మాత్రం వున్నాడు అతను లేకుండా మాత్రం నీ వద్దకు అది రాలేదన్నది నిజం. 
భగవంతుడు ఎలా వున్నాడు: 
మనం మన ఇంద్రియాలతో ప్రత్యక్షంగా ఈ జగత్తుని (ప్రపంచం, విశ్వము) చూస్తున్నాము అంటే ఇది ఒక కార్యం అంటే ఈ కార్యాన్ని చేసిన కారణం అంటే కారకుడు వుండివుండాలి ఆ కారకుడు నీకు గోచరించవచ్చు లేక గోచరించక పోవచ్చు కానీ అతను వున్నాడన్నది మాత్రం నిజం (ఇక్కడ అతను అంటే పురుషుడు అని అర్ధం కాదు కేవలం కారణమైనది అన్న భావం తీసుకోవాలి) 

ఇంకా మనం ఈ ప్రపంచంలో ఒక నియమాన్ని చూస్తున్నాము అది నిన్న మనం విత్తనంగా ఉన్నదానిని భూమిలో నాటంగానే రేపు మొక్కగా తరువాత చెట్టుగా, చెట్లకు పువ్వులు, కాయలుగా మనం చూస్తున్నాం.  ఈ మొత్తం క్రమ పద్దతిలో వృద్ధి కావటానికి కారణం అంటే ఈ మొత్తం ప్రోగ్రాం తయారు చేసింది ఎవరు, అని ఆలోచిస్తే ఎవరో ఒకరు తప్పకుండ వుండివుండాలని  తెలుస్తుంది. ఆలా ఉండివున్న వానినే మన మహర్షులు వారి దివ్య జ్ఞాణంతో "భగవంతుడు" అని తెలుసుకొని మనకు తెలిపారు.