1, మార్చి 2022, మంగళవారం

ప్రత్యక్ష ప్రమాణం:

 ప్రత్యక్ష ప్రమాణం: 

ప్రత్యక్షం అనే పదానికి అర్ధం మనం ఇంద్రియాలద్వారా ఒకదాని ఉనికిని తెలుసుకోవటం అంటే నీ ముందు రామారావు నిలుచున్నడనుకోండి మీరు రామమారావుని ప్రత్యక్షముగా చూస్తున్నారు, అతని మాటలు మీ చెవులతో వింటున్నారు, అతను రాసుకున్న సెంటు వాసన మీ ముక్కుతో గ్రహిస్తున్నారు, అతని చేతిని మీ  చేతితో కరచాలనం చేసి స్పృశిస్తున్నారు ఇలా మీరు మీ ఇంద్రియ జ్ఞానం తో రామారావుని తెలుసుకోవటాన్ని ప్రత్యక్ష జ్ఞ్యానం అంటారు వీటివలన మీకు నీ ఎదురుగా రామారావు ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది ఆలా నిర్ధారణ కావటమే ప్రత్యక్ష ప్రమాణం 

అనుమాన ప్రమాణం 
ఇది ప్రత్యక్ష ప్రమాణానికి దోహదం చేసే ప్రమాణం.  మీరు అడివిలో వెళుతున్నారనుకోండి దూరంగా మీకు ఆకాశంలో పొగ కనబడిందనుకోండి అప్పుడు మీరు ఆ పొగ వలన అక్కడ నిప్పు వుండివుండొచ్చని తలుస్తారు. ఎందుకంటె మీకు పొగ కేవలం నిప్పుద్వారానే వస్తుందనే జ్ఞ్యానం వుంది.  కాబట్టి అక్కడ నిప్పు వున్నదనుకోవటం అనుమానప్రమాణం . అడివిలో నిప్పు ఉండటానికి అవకాశం లేదు కాబట్టి అక్కడ ఎవరో మనుషులు నిప్పు రాజేసి ఉండొచ్చు అంటే అక్కడ మనుషులు వుండివుండొచ్చు అనేది కూడా అనుమానప్రమాణమే. 
కార్య కారణ సంబంధము: 
మన ముందున్న ప్రతి కార్యానికి (పనికి) కారణం (పనిచేసిన వాడు) ఉండొచ్చు అనేది ఒక అనుమాన ప్రమాణం. మీ ముందు ఒక ఇల్లు ఉందనుకోండి అంటే ఆ ఇల్లు కట్టిన కూలివాళ్ళు, మేస్త్రీలు, ఇంజనీరులు వుండివుంటారు అనేది అనుమాన ప్రమాణం.  అంటే ప్రతి కార్యానికి ఒక కారణం లేక కారకుడు వుంటారు. మీరు ఒక హోటలులో రుచికరమైన ఫలహారం తిన్నారనుకోండి ఆ ఫలహారం మీకు రామారావు వడ్డించాడనుకోండి అప్పుడు మీరు దాని రుచిని ఆస్వాదిస్తే దానిని తయారుచేసిన వంటివారు ఎవరు అని విచారిస్తారు. దీనిని బట్టి తెలిసేది ఏమిటంటే ఫలహారం ఎవరో తయారు చేస్తే కానీ నీ వద్దకు రాలేదు.  అది తయారుచేసిన వాడు నీకు తెలిసిన లేక తెలిసిరాకపోయిన అతను మాత్రం వున్నాడు అతను లేకుండా మాత్రం నీ వద్దకు అది రాలేదన్నది నిజం. 
భగవంతుడు ఎలా వున్నాడు: 
మనం మన ఇంద్రియాలతో ప్రత్యక్షంగా ఈ జగత్తుని (ప్రపంచం, విశ్వము) చూస్తున్నాము అంటే ఇది ఒక కార్యం అంటే ఈ కార్యాన్ని చేసిన కారణం అంటే కారకుడు వుండివుండాలి ఆ కారకుడు నీకు గోచరించవచ్చు లేక గోచరించక పోవచ్చు కానీ అతను వున్నాడన్నది మాత్రం నిజం (ఇక్కడ అతను అంటే పురుషుడు అని అర్ధం కాదు కేవలం కారణమైనది అన్న భావం తీసుకోవాలి) 

ఇంకా మనం ఈ ప్రపంచంలో ఒక నియమాన్ని చూస్తున్నాము అది నిన్న మనం విత్తనంగా ఉన్నదానిని భూమిలో నాటంగానే రేపు మొక్కగా తరువాత చెట్టుగా, చెట్లకు పువ్వులు, కాయలుగా మనం చూస్తున్నాం.  ఈ మొత్తం క్రమ పద్దతిలో వృద్ధి కావటానికి కారణం అంటే ఈ మొత్తం ప్రోగ్రాం తయారు చేసింది ఎవరు, అని ఆలోచిస్తే ఎవరో ఒకరు తప్పకుండ వుండివుండాలని  తెలుస్తుంది. ఆలా ఉండివున్న వానినే మన మహర్షులు వారి దివ్య జ్ఞాణంతో "భగవంతుడు" అని తెలుసుకొని మనకు తెలిపారు. 

కామెంట్‌లు లేవు: