23, జులై 2023, ఆదివారం

Sun God

 


Pension


 

Don't drive fast


 

వృద్ధుడు వ్యర్థుడు కాదు

 *వృద్ధుడు వ్యర్థుడు కాదు... ఇంటికి ఈశ్వరుడు---//-*


*మూలన పడేస్తే వృద్ధుడు వ్యర్థుడు... ముంగిట్లో కూచోబెడితే ఇంటిని కాచే ఈశ్వరుడు...*


*బతుకుబాటలో గతుకుల్ని ముందుగా హెచ్చరించి. కాపాడే సిద్ధుడు వృద్ధుడు...* *వృద్ధులు సారధులైతే యువకులు విజయులౌతారు... అనుభవాల గనులు... ఆపాత బంగారాలు...*


*వదిలేస్తే వృద్ధుడు మంచానికి బద్ధుడు...* *చేయూతనిస్తే ప్రతి వృద్ధుడు ఓ బుద్ధుడు..* 

*నిర్లక్ష్యంగా చూస్తే కేవలం మూడుకాళ్ల ముసలివాడు..*

*తగిన గుర్తింపునిస్తే విజయాన్నిచ్చే త్రివిక్రముడు...*


*ఒకనాటి బాలుడే ఈనాటి వృద్ధుడు... తనను పట్టించుకోకున్నా నువ్వు పచ్చగా ఉండాలని తపించే ఉదాత్తుడు వృద్ధుడు...*


*పలకరిస్తే చాలు పాలకడలిలా పొంగులు వారే పసివాడు వృద్ధుడు... వృద్ధుడంటే పైపైన చూస్తే జుట్టు తెల్లబడిన ఫలిత కేశాలవాడు... అంతర్గతంగా తలపండిన పండితుడు...*     


*వృద్ధుడు వ్యర్థుడు కాదు... ఇంటికి ఈశ్వరుడు...*


*వృద్దులకు గౌరవం ఇద్దాం*

*మన గౌరవం పెంచుకుందాం ---//-*

మేము అరవై లో ఇరవై. 


పచ్చగా మెరిసే పండుటాకులమే గాని

             చప్పుడు చేసే ఎండుటాకులం కాదు

కలలు పండినా పండకపోయినా

            మేము తలలు పండిన తిమ్మరుసులం


కొరవడింది  కంటి చూపు గాని

          మందగించలేదు ముందు చూపు


అలసిపోయింది  దేహమే గాని

          మనసుకు లేనే లేదు సందేహం


ఎగిరి అంబరాన్ని అందుకోకున్నా

                      ఈ భూమికి కాబోము భారం


అరవై లో ఇరవై కాకున్నా

                      అందని ద్రాక్ష కై అర్రులు చాచం


కుందేళ్ళమై పరుగులు తీయకున్నా

               తాబేళ్లమై గెలుపు బాట చూపగలం


చెడుగుడు కూతల సత్తా లేకున్నా

              చదరంగపు ఎత్తులు నేర్పగలం


సమయం ఎంతో మాకు లేకున్నా

            సమయమంతా మీకు సమర్పిస్తాం


అనుకోకుంటే అధిక ప్రసంగం

              అనుభవ సారం పంచుకుంటాం


వాడిపోయే పూవులమైనా

                        సౌరభాలు వెదజల్లుతాం


రాలిపోయే తారలమైనా

                        కాంతి పుంజాలు వెదజల్లుతాం

శ్రీ నాగశంకర్ మందిర్

 🕉 మన గుడి : 




⚜ అస్సాం : సూటియా ( నాగశంకర్ మౌజా)


⚜ శ్రీ నాగశంకర్ మందిర్



💠 నాగశంకర్ టెంపుల్ అనేది అస్సాంలోని సోనిత్‌పూర్ జిల్లాలో, తేజ్‌పూర్‌కు తూర్పున, సూటియా సమీపంలోని నాగశంకర్ మౌజాలో ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. 

 ఈ ఆలయాన్ని 4వ శతాబ్దంలో నాగఖారాజు నరశంకరుడు నిర్మించాడని నమ్ముతారు.


💠 ఒక నమ్మకం ప్రకారం, నాగశంకర్ ఆలయం 4వ శతాబ్దం చివరిలో లోహిత్య రాజవంశానికి చెందిన నాగ్ శంకర్ అనే రాజుచే నిర్మించబడింది.  

నాగశంకర్ 378 సం.లో తూర్పు కామరూప (అస్సాం యొక్క పురాతన పేరు)ని పాలించాడు. 


💠 మరొక నమ్మకం ప్రకారం, ఈ ఆలయాన్ని నాగమత్త రాజు నిర్మించాడు.  నాగమట్ట అనేది అస్సాం యొక్క శక్తివంతమైన రాజు అరిమట్ట యొక్క మరొక పేరు.  

పురాణాలలో కూడా అరిమట్టకు ముఖ్యమైన స్థానం ఉంది. 

 


💠 ఒక పురాణం ప్రకారం,  సతీదేవి  నాభి భాగం నాగశంకర్ ఆలయంలో పడింది అంటారు.

అందుకే, ఈ ఆలయానికి మొదట నాభిశంకర్ అని పేరు వచ్చింది తరువాత అది నాగశంకర్‌గా మారింది.  

 

💠 అహోం రాజు సు-సేన్-ఫా 1480లో నాగశంకర్ ఆలయాన్ని మరమ్మత్తు చేసాడు.

ఈ పనితో రాజు తన రాజ్యాన్ని బ్రహ్మపుత్ర నది ఉత్తర ఒడ్డుకు విస్తరించి, ఆ ప్రాంత ప్రజల విశ్వాసాన్ని గెలుచుకోగలిగాడు.


💠 ఈ ఆలయంలో శివరాత్రి వేడుకలు చాలా ఘనంగా నిర్వహించబడతాయి.  శివరాత్రి మరియు వివిధ కార్యక్రమాలతో స్థానిక ప్రజలు రెండు రోజుల పాటు ఘనంగా ఆచరిస్తారు మరియు ఈ సమయంలో దాదాపు 5 వేల మంది యాత్రికులు ఎల్లప్పుడూ ఆలయ ప్రాంగణంలో దర్శనానికి వస్తారు

 

💠 ఆలయానికి పక్కనే పెద్ద చెరువు ఉంది. 

ఈ చెరువు పెద్ద రకాల తాబేళ్లు మరియు చేపలకు నిలయం. కొన్ని తాబేళ్లు వందల సంవత్సరాల నాటివని నమ్ముతారు.

100 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న తాబేళ్లు కొన్ని ఉన్నాయని నమ్ముతారు. 


💠 తాబేళ్లు భగవంతుని రూపమని, అందుకే తాబేళ్లను ఎవరూ చంపరని ఈ ప్రాంతంలోని స్థానికులు విశ్వసిస్తారు. 

ఆలయంలో మరియు చుట్టుపక్కల ఉన్న మరొక ఆకర్షణ ఏమిటంటే, జింకలు, కొండచిలువ మరియు ఇతర జంతువులు వంటి అడవి జంతువులు కూడా నాగశంకర్ ఆలయాన్ని సందర్శించినప్పుడు చూడవచ్చు మరియు జంతువులు ఆలయ వాతావరణాన్ని మరింత ఆకర్షణీయంగా ఉంచుతాయి.


💠 నాగశంకర్ ఆలయానికి సమీపంలోని విమానాశ్రయం తేజ్‌పూర్ విమానాశ్రయం మరియు సమీప రైల్వే స్టేషన్ తేజ్‌పూర్ రైల్వే స్టేషన్.

ఇది తేజ్‌పూర్ పట్టణం నుండి దాదాపు 55 కిలోమీటర్ల దూరంలో ఉంది. 

తేజ్‌పూర్ విమానాశ్రయం ప్రధాన నగరం నుండి దాదాపు 40 కిమీ (25 మై)దూరంలో ఉంది మరియు దీనికి 30 నుండి 40 నిమిషాల ప్రయాణం మాత్రమే పడుతుంది.

పరాశర మాధవీయె*

 *కలౌ బ్రాహ్మణ నిందా న కర్తవ్యా!* ఇతి

 *పరాశర మాధవీయె* 


కలౌహి పాపబాహుళ్యం దృశ్యతే స్మర్యతే2 పిచ|

నరాః ప్రాయో2ల్ప సామర్ధ్యాస్తేషామనుజి ఘృక్షయా|| 


సమకోచ యదాచారం

ప్రాయశ్చిత్తం వ్రతాని చ|

తేషాం నిందా న కర్తవ్యా  యుగరూపాహి తే ద్విజాః|


కలియుగమునందు

అనేక పాపములు స్మరించ బడుచున్నవి కనబడుచున్నవి!

కలియుగంలో మనుషులందరూ

కఠినమైన ఉపవాసాది నియమాలు

ఆచరించ సామర్థ్యం లేని వారు కావున

వారిపైన దయతో

ఆచారములను తగ్గించి,

ప్రాయశ్చిత్త వ్రతా దులు చెప్పబడినవి!

    అలాంటి అల్పవ్రత నిష్ఠా పరులైన బ్రాహ్మణులను నిందించరాదు!

ఎందుకనగా *కలి* సంబంధమైన వ్యక్తిత్వం కలవారు కనుక!

ఆర్య చాణక్య*♦️ *పార్ట్ - 123*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

.    *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*

.           ♦️ *ఆర్య చాణక్య*♦️


*పార్ట్ - 123*


🔴 *రాజనీతి సూత్రాణి - రెండవ అధ్యాయం* :


📕 *ఇష్టమైన ఆయా కార్యాలు సాధించే ఉపాయాలు* : 📕


1. అర్ధమూలం సర్వం కార్యమ్ యదల్ప ప్రయాత్నాత్ కార్యం భవతి 

(అన్ని కార్యాలకూ మూలం ధనం. ఉన్నవాడు స్వల్పప్రయత్నంతోనే కార్యం సాధిస్తాడు.) 


2. ఉపాయపూర్వం కార్యం న దుష్కరం స్యాత్ (ఉపాయంతో చేసే పనిలో శ్రమ ఉండదు.) 


3. అనుపాపూర్వం కార్యం న దుష్కరం స్యాత్ (ఉపాయం లేకుండా చేసినా పని జరిగినా కూడా చెడిపోతుంది.) 


4. కార్యార్థినాముపాయ ఏవ సహాయః 

(పనులు తలపెట్టినవారికి నిజమైన సహాయం ఉపాయమే.) 


5. కార్యం పురుషకారేణ లక్ష్యం సంపద్యతే (పురుషప్రయత్నం సరిగా చేస్తే కార్యస్వరూపం స్పష్టంగా కనబడుతుంది. అప్పుడు లక్ష్యాన్ని సాధించవచ్చు.) 


6. పురుషకారమనువర్తతే దైవమ్ 

(దైవం పురుషప్రయత్నాన్ని అనుసరించి ఉంటుంది. పురుషప్రయత్నం చేస్తే దైవం దానంతట అదే తోడ్పడుతుంది.) 


7. దైవం వినాతిప్రయత్నం కరోతి తద్విఫలమ్ 

(దైవం ప్రతికూలంగా ఉన్నప్పుడు ఎంత ప్రయత్నం చేసినా అది వ్యర్థమే అవుతుంది.) 


8. అసమాహితస్యకార్యం న విద్యతే 

(బుద్ధి నిలకడలేనివానికి పనులేమిటి ?) 


9. పూర్వం నిశ్చిత్య పశ్చాత్కార్యమారభేత

(ఎలా చెయ్యాలో ముందు నిశ్చయించుకున్న తర్వాత ఆ పని ప్రారంభించాలి.) 


10. కార్యాంతరే దీర్ఘసూత్రతా న కర్తవ్యా 

(కార్యం ప్రారంభించిన తర్వాత మధ్యలో తెగతెంపులు లేని ఆలోచనలు చెయ్యకూడదు.) 


11. న చలచిత్తస్య కార్యావ్యాప్తిః 

(చపలచిత్తుడు ఏ పని చేయలేడు.) 


12. హస్తగతావమానాత్ కార్యవ్యతిక్రమో భవతి (చేతిలో ఉన్నదాన్ని చిన్నచూపు చూస్తే కార్యం చెడుతుంది.) 


13. దోషవర్జితాని కార్యాణి దుర్లభాని 

(దోషాలు లేని కార్యాలు అంటూ ఉండవు.) 


14. దురనుబస్థం కార్యం నారభేత 

(చెడుగా పరిణమించే కార్యాన్ని ప్రారంభించకూడదు.) 


15. కాలవిత్ కార్యం సాధయేత్ (సమయాసమయాలు తెలిసినవాడు కార్యం సాధించగలుగుతాడు.) 


16. కాలవితిక్రమాత్ కాల ఏవ ఫలం పిబతి (సమయం దాటబెడితే కాలమే ఫలాన్ని మింగేస్తుంది.) 


17. క్షణం ప్రతి కాలవిక్షేపం న కుర్యాత్ సర్వకార్యేషు (ఏ పని విషయంలోనూ ఒక్క క్షణమైనా ఆలస్యం చెయ్యకూడదు.) 


18. దేశకాలవిభగౌ జ్ఞాత్వా కార్యమారభేత 

(ఏ దేశంలో ఏ కాలంలో ఏమి చెయ్యాలో తెలుసుకుని పని ప్రారంభించాలి.) 


19. దైవహీనం కార్యం సుసాధ్యమపి దుస్సాధ్యం భవతి 

(సులభంగా జరగవలసిన పనికూడా దైవం ప్రతికూలంగా ఉంటే కష్టసాధ్యమవుతుంది.) 


20. నీతిజ్ఞో దేశకాలౌ పరీక్షతే 

(నీతి తెలిసినవాడు దేశాన్ని, కాలాన్ని జాగ్రత్తగా పరీక్షించుకోవాలి.) 


21. పరీక్ష్యకారిణి శ్రీ శ్చీరం తిష్టతి 

(ఏ పనైనా పరీక్షించి చేసేవాడి దగ్గర లక్ష్మి చాలా కాలం ఉంటుంది.) 


22. సర్వాశ్చ సంపద సర్వోపాయేన పరిగృహ్నీయాత్ (అన్ని ఉపాయాలూ ప్రయోగించి అన్ని సంపదలూ సమకూర్చుకోవాలి.) 


23. భాగ్యవంత మప్యపరీక్ష్యకారిణిం శ్రీపరిత్యజతి (విషయం బాగా తెలుసుకొని ఊహించుకొని పరీక్ష చెయ్యాలి.) 


24. యో యస్మిన్ కర్మణి కుశలస్తం తస్మిన్నేవ యోజయేత్ 

(ఎవడికి ఏ పనిలో నేర్పు ఉందో వాడిని ఆ పనిలోనే నియమించాలి.) 


25. దుఃసాధమపి సుసాధం కరోత్యుపాయజ్ఞః (ఉపాయం తెలిసినవాడు కష్టమైన కార్యాన్ని కూడా సులువుగా చేసేస్తాడు.) 


26. అజ్ఞానినా కృతమపి వ బహుమనస్తవ్యమ్: యాదృచ్చికత్వాత్ 

(తెలివి తక్కువవాడు ఏదైనా సాధించినా వాడిని మెచ్చుకోకూడదు. ఎందుచేతనంటే అతడా పని యాదృచ్ఛికంగా చేయగలిగాడు.) 


27. కృపయో పి హి కదాచిద్రూపాంతరాణి కుర్వంతి (పురుగులు కూడా కర్ర దొలచి కొన్ని ఆకారాలు తయారుచేస్తాయి. కదా.) 


28. సిద్దస్థైవ కార్యస్య ప్రకాశనం కర్తవ్యమ్ 

(కార్యాన్ని పూర్తి చేశాకే పైకి ప్రకటించాలి.) 


29. జ్ఞానవతామపి దైవమానుషదోషాత్ కార్యాణి దుష్యంతి 

(ఎంత తెలివైనవాళ్ళయినా దైవదోషం చేత, మానవదోషం చేతా కార్యాలు చెడిపోతుంటాయి.) 


30. దైవం దోషం శాంతికర్మణా వినివారయేత్ (దైవదోషాన్ని శాంతికర్మలు చేసి నివారించుకోవాలి.) 


31. మానషీం కార్యవిపత్తం కౌశలేన వనివారయేత్ (మనుష్యుల వల్ల కలిగే కార్యవిఘాతాన్ని నేర్పుతో తప్పించుకోవాలి.) 


32. కార్యవిత్తౌ దోషాన్ వర్ణయంతి బాలిఇశాః 

(కార్యం చెడిపోతే మందబుద్ధులు తమ ప్రయత్నలోపం అని చెప్పకుండా ఏవేవో దోషాలు వర్ణించి చెబుతారు.) 


33. కార్యార్థినా దాక్షిణ్యమ్ న కర్తవ్యమ్ 

(పని కావలసినవాడు అనవసరంగా మొహమాట పడకూడదు.) 


34. క్షీరార్థీ వత్స మాతురూథః ప్రతిహంతి 

(పాలుకోరే లేగదూడ తల్లి పొదుపు పొడుస్తుంది.) 


35. అప్రయత్నాత్ కార్యవిపత్తి ర్భవేత్ 

(సరిగా ప్రయత్నం చేయకపోతే కార్యం చెడిపోతుంది.) 


36. న దైవమాత్రప్రమాణానాం కార్యసిద్ధి 

(అన్నిటికీ దైవమే ఉన్నదనుకొనేవాళ్ళకు పనులు జరగవు.) 


37. కార్యబాహ్యోన పోషయత్యాశ్రితాన్ 

(ఏ పనులూ చేయలేనివాడు తన వాళ్ళని పోషించజాలడు.) 


38. యః కార్యం న పశ్యతి సో స్థః 

(కార్యాన్ని గుర్తించనివాడే గుడ్డివాడు.) 


39. ప్రత్యక్షపరోనుమానైఃకార్యం పరీక్షేత 

(ప్రత్యక్షంగా చూచి, పరోక్షంగా ఇతరులవల్ల విని తాను ఊహించుకొని కార్యాన్ని పరీక్షించాలి.)


40. అపరీక్ష్యకారిణం శ్రీ పరిత్యజతి 

(పరీక్షించకుండా పనులు చేసేవారిని లక్ష్మీ త్యజిస్తుంది.) 


41. పరీక్ష్య తార్యా విపత్తి 

(ఆపద వచ్చినప్పుడు బాగా పరీక్షించి దాన్ని దాటాలి.) 


42. స్వశక్తీం జ్ఞాత్వా కార్యమారభేత 

(తనకి ఎంత శక్తి ఉందో తెలుసుకొని ప్రారంభించాలి.) 


43. స్వజనం తర్పయిత్వా యః శేషభోజీ సో మృతభోజీ 

(తనవాళ్ళ కందరికీ తృప్తి కలిగించి మిగిలినది భుజించేవాడు అమృతభోజి (అమృతం తినేవాడు).)


44. సమ్యగనుష్టానాదాయముఖాని వర్ధంతే (పనులు సక్రమంగా నిర్వహించడంవల్ల రాబడికి దారులు పెరుగుతాయి.) 


45. నాస్తి భీరో కార్యచింతా 

(పిరికివాడు ఏ కార్యాన్ని గుర్చీ ఆలోచించజాలడు.) 


46. స్వామినః శీలం జ్ఞాత్వా కార్యార్థీ కార్యం సాధయేత్ 

(పని కావాల్సినవాడు ప్రభువు స్వభావం ఎలాంటిదో తెలుసుకొని తన పని సాధించుకోవాలి.) 


47. ధేనో శీలం జ్ఞాత్వా కార్యార్థీ కార్యం సాధయేత్ (ఆవు స్వభావం తెలిసినవాడే దాని పాలు త్రాగగలుగుతాడు కదా.)


48. క్షుద్రే గుహ్యప్రకాశనమాత్మవాన్ న కుర్యాత్ (తెలివైనవాడు నీచబుద్ధికి రహస్యవిషయాలు చెప్పకూడదు.) 


49. ఆశ్రితై రప్యపమన్యతే మృదుస్వభావః (మెత్తటివాడిని ఆశ్రితులు కూడా అవమానిస్తారు.) 


50. తీక్ష్ణ దండ సర్వేషాముద్వేజనీయో భవతి (తీక్షణంగా శిక్షించేవాడ్ని అందరూ ఏవగించుకుంటారు.) 


51. యథార్హదండకారీ స్యాత్ 

(తగు విధంగానే శిక్ష విధించాలి.) 


52. అల్పసారం శ్రుతవంతమపి న బహుమన్యతే లోకః 

(ఎంత చదువుకున్నవాడైనా శక్తి లేనివాడ్ని లోకం గౌరవించదు.) 


53. అతిభారః పురుషమవసాదయతి 

(ఎక్కువ కార్యభారం మనిషిని కృంగదీస్తుంది.) 


54. యః సంసది పరదోషం శంసతి స స్వదోషబహుత్వమేవ వ్రఖ్యాపయతి 

(పదిమందిలో ఇతరుల దోషాలను గూర్చి చెప్పేవాడు తనలో ఉన్న దోషాలను చాటి చెప్పుకున్న వాడవుతాడు.) 


55. ఆత్మానమేవ నాశయత్యనాత్మవతాం కోపః (తనను తాను అదుపులో ఉంచుకొనలేనివాని కోపము తననే నశింపజేస్తుంది.) 


56. నాస్త్యప్రాప్తం సత్యవతామ్ 

(సత్యమే పలికేవాళ్ళకి లభ్యం కానిదంటూ ఉండదు.) 


57. న కేవలేన సాహసేన కార్యనసిద్దర్భవతి (సాహసం చేత మాత్రమే పనులు జరగవు.) 


58. వ్యసనార్తో విస్మరత్యవశ్యకర్తవ్యాన్ (వ్యసనాలలో చిక్కుకొన్నవాడు తప్పనిసరిగా చేయవలసిన పనులు కూడా మరిచిపోతాడు.)


59. నా స్త్యనంతరాయః కాలవక్షేపే 

(కాలవిలక్షేపం చేస్తూ పోతే పనికి విఘ్నాలు కలుగుట తథ్యం.) 


60. ఆసంశయవినాశాత్ సంశయవినాశఃశ్రేయాన్ (నిస్సంశయమైన వినాశం కంటే సంశయవినాశం మేలు.) 

(ఇంకా ఉంది)...🙏


*సేకరణ:- శ్రీ రమణమూర్తి గారి వాట్సాప్ పోస్ట్.* 


🎄🌲🪻🎄🌲🪻🎄🌲🪻🎄

👉 *రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

సూర్య భగవానుడు

 సూర్య భగవానుడు నమస్కార ప్రియుడు.ఆరోగ్య ప్రదాత..మహా శక్తి మంతుడు..సకల శాస్త్రపారంగతుడు..కశ్యపునికి,అదితి కి విష్ణువు అనుగ్రహముతో జన్మించాడు.. ఈ "సూర్యునికి" 7 గుర్రాల రథం ఉందని అందరూ అనుకుంటారు..కానీ వారి రథానికి వుండే అశ్వము ఒక్కటే..సూర్యునికి "సప్తమి" అను పేరు కూడా ఉంది.."ఏకో అశ్వ సప్తమాన"...అదే "సప్త" అని పేరు పొందినది..ఆ ఏక కాంతిని సప్త వర్ణాలుగా విశ్లేషించి సప్తాశ్వాలుగా ఋషులు దర్శించారు."అరుణ కేతుకం" ప్రకారం సూర్యునికి "సప్త"  (వేగవంతమైన) అనే అశ్వం ఉంది.ఇది సూర్యుని రథము యొక్క పేరు.. అదే అశ్వము కూడా..అంతే గానీ ఆయన రథానికి 7 అశ్వాలు లేవు...ఆ "సప్త" కు ఒకే చక్రం..అది సంవత్సరానికి సంకేతం..ఆ చక్రానికి ఉన్న 6 ఆకులు 6 ఋతువులకు చిహ్నాలు.. సూర్యుని కిరణాలలో నుండి  ప్రధానంగా 7 కిరణాలు వెలువడుతాయి.. అవి 1. సుషుమ్నము.2.హరి కేశము.3. విశ్వవ్యచ 4.సంపద్వసు.5.అర్యాస్వం 6.సర్వాద్వసు           7. విశ్వ స్రవ... ఇవే సప్త చందస్సులు..సప్త వర్ణాలు.సప్త లోకాలు...ఇలా అనేకం..ఇవి అన్నీ కూడా "సప్త" అనే రథం వల్ల లేదా అశ్వం వల్ల  ప్రభావితం అవుతున్నాయని వేదమంత్రం చెబుతోంది.." సప్తయుంజంతి రథ మేక చక్రం ఏకో అశ్వోవహతి సప్తనామా" అంటూ ఉంది ఋగ్వేదం... ఆదిత్యుడు,కాశ్యపేయుడు అని కూడా సూర్యునికి పేర్లు..ఆదిత్యునికి నమస్కరిస్తే జన్మ జన్మ పాపాలు పటాపంచలు అవుతాయి.." "చక్షో సూర్యో అజాయతే" అని మరో వాక్యం కూడా ఉంది...అంటే సాధారణ చక్షువులతో (కన్నులు)ఇతరులు చూడటానికి వీలు కానివాడు  అని అర్థం.. అలాగే "భగవద్గీత" లోని "విభూతి యోగం" లో "ఆదిత్యానాం మహా విష్ణుః" అనీ, " జ్యోతిషామ్ రవి  రంశుమాన్" అని శ్రీకృష్ణుడు చెప్పాడు.."పంచాయతనం" అనే అర్చనా విధానాన్ని ( ఆదిత్య,అంబిక,విష్ణు,గణనాథ,ఈశ్వర) శంకర భగవత్పాదుల వారు ఏర్పరచారు..అందుకే మనం ప్రభాకరుణ్ణి  ప్రధాన దైవం గా, ప్రత్యక్ష దైవం గా ఆరాధిస్తూ ఉన్నాము...."మాఘ శుద్ధ సప్తమి "  వీరి జన్మ తిధి...దీనినే "రథ సప్తమి" గా విశిష్టమైన పర్వదినంలా చేసుకుంటాము... ఓం సూర్య దేవాయ నమః.....ఆ సూర్య భగవానుని ఆశీస్సులు అందరిపై ఉండాలని, సదా ఆరోగ్యవంతులుగా జీవించాలని  మనసారా కోరుకుంటూ ఉన్నాను....... శుభంభూయాత్!

శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర🪔

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

*🪔శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర🪔*


                     *శ్రీ గణేశాయ నమః* 


 *శుక్లాం భరదరం విష్ణుం శశి వర్ణం చతుర్ భుజం* 

 *ప్రసన్న వదనం ద్యాయేత్ సర్వ విఘ్నోపశాన్తయేత్* 


 *వక్ర తుండ మహా కాయ సూర్య కోటి సమ ప్రభ* 

 *నిర్విఘ్నం కురుమే దేవ సర్వ కార్యేషు సర్వదా!* 


 *శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర -1*


✍️  *సంకలన కర్త:*

 *శ్రీ జొన్నలగడ్డ మల్లికార్జున శర్మ గారు.*


          🍁🍁🍁🍁🍁


ఒకనాడు శౌనకాది మునిపుంగవులు సూతుల వారిని సకల ఇష్టార్థ సిద్ధి ప్రదంబగు పుణ్యస్థలం బేదియయి యున్నది? 


శ్రీమన్నారాయణుడు భూలోకమునకు మానవుల పూజల బొందుటకు భూతలమునకు విచ్చేయుట, దానికి సంబంధించిన కథలను మాకు చెప్పవలసినది అని ప్రార్ధించిరి. 


అంతట సూతులవారు – మునులారా! 


భూలోకము మొత్తము మీద శ్రీవేంకటాచలము శ్రేష్ఠతరమయిన పుణ్యస్థలము, అందు శ్రీమహావిష్ణువు వేంకటేశ్వరుడై కలియుగమున దైవమై భక్తుల కోరికలీడేర్చుచుండును


తన  భక్తుల కోరికలను తీర్చుటయందు శ్రీవేంకటేశ్వరుని ముందు సర్వదైవములున్నూ తీసికట్టుగానేయుందురు. 


అనగా విని శౌనకాదులు మహానుభావా


ఆ మహావిష్ణువు శ్రీ వేంకటేశ్వరుడైన విధము,

 ఆ శ్రీ వేంకటేశ్వరునికి చెందిన అనేకానేక లీలలను, మాకు తెలియజెప్పి, పుణ్యము కట్టుకొనుమనీ, తమ్ము మహానంద భరితులుగా నొనర్చవలసినదనిన్నీ కోరిరి. 


అంతట సూతులవారు మునీశ్వరులారా! నేను ఆ మహిమాన్వితుని వేంకటేశ్వరుని లీలలు చెప్పుట కెంతటివాడను,


 కాని మీరు ఆసక్తితో భక్తిశ్రద్ధలతో వినకోరెదరని నేను భావించి శ్రీ వేంకటేశ్వరునకు చెందిన యేవియో కొన్ని లీలలను చెప్పగలవాడను అని తన సహజ వినయమును ప్రకటించుకొని హృదయము గురువైన వేదవ్యాసుని తలపోసెను.


 అట్లు వేదవ్యాసుని తలచుకొనుట వలన సూతులవారికి తాను శౌనకాదులకు చెప్పబోవు కథా విశేషములు అన్నియు కళ్ళకు కట్టినట్లు అవగతమయ్యెను. అనంతరము శౌనకాది మహర్షులతో యిట్లు చెప్పసాగినారు.


మునులారా! నారదుడు మహాభక్తుడు. అతడు మఱి యెవరోకాడు. సాక్షాత్తూ బ్రహ్మదేవుని కుమారుడే, భగవద్భక్తులను అభిమానించు నారదుడు సజ్జనుల పాలిట కామధేనువుగ నుండి గర్వముతో పెటపెటలాడువారిని ఒక చూపు చూసి గర్వపు కోరలనుతీసి వినోదించు స్వభావము కలవాడు. 


నిరంతరము శ్రీమన్నారాయణుని నామస్మరణతో పరవశుడై గానము చేయుచూ యెచ్చట నాటంక మనునది లేకయే త్రిలోకములలో సంచరించు నారదుని మహిమ నారాయణునకు తెలియును. 


నారాయణుని లీలలు నారదునకు తెలియవలసినంతగా తెలియును.


ఒకనాడు తన జనకుడగు బ్రహ్మదేవుని సందర్శించుటకై సత్యలోకమునకు ప్రయాణమయి వెడలినాడు. 


పద్మాసనమున నాలుగు మోములతో చక్కగ కూర్చునియున్నాడు బ్రహ్మ, ఆయన భార్య అందాల రాశి, చదువుల తల్లియయిన సరస్వతీదేవి వీణ పై సామగానము చేస్తూ భర్తచెంత కూర్చోని యున్నది. 


ఇంద్రుడు మున్నగు దిక్పాలకులు, సూర్యుడు మున్నగు కాంతులీను గ్రహములూ, అనేక మంది మునులు, ముఖ్యముగా సప్తఋషులు, అప్పటికే ఆ సభలో తము అర్హమైన ఆసనముల నలంకరించియుండిరి.


అటువంటి మహాసభకు నారద మునీంద్రుడు విచ్చేసి వినయ పూర్వకంగా బ్రహ్మ, సరస్వతులకు నమస్కరించాడు. వారు నారదుననుగ్రహించి దీవించినారు. 


నారదుడు ఆ సభకు వచ్చుట సభాసదులకాసక్తికరముగా నుండెను. కారణము నారదుడు త్రిలోక సంచారి కదా. అతడు దేవతల వద్దకు వెడలును, రాక్షసుల వద్దకు వెడలును ఆయన ఎక్కడకు వెడలినను అడ్డు ఆపులుండవు కదా!


 అందువలన అచ్చటి విశేషము లిచ్చటను, ఇచ్చటి విశేషము లచ్చటను ముచ్చటించుట ఆయన కుండనే యున్నది. 


అందువలననే నారదాగమనం ఆనందకరమగుట బ్రహ్మదేవుడు తనయుని ఉచితాసనమలంకరింపజేసి యిట్లనెను –


 కుమారా! నారదా! నీవు మహాభక్తులలో ఒకడవు. లోకోపకార కార్యక్రమములు నిర్వహించుటయందు నీ ఆసక్తి, శక్తి నాకు తెలియనివి కావు. 


నీచే నాకొక మహాకార్యము జరుగుదగియున్నది. అందువలన నీ వర్హుడవని నేననుకొందును. ఇంతకు అది ఏమన...


మానవులందరూ దైవభక్తియనునది దానంతయులేక నాస్తిక భావములతో నజ్ఞానాంధ కారమున కొట్టుమిట్టాడుచున్నారు. మూర్ఖభావములు కలిగి, ఆ మనుష్యులు బరితెగించి యిష్టము వచ్చినట్లు చేయరాని పాపము లెన్నియో చేస్తూ యున్నారు. 


తల్లితండ్రుల మాటలు పిల్లలు వినుట లేదు. భర్తల మాటలకు భార్యలు విలువనిచ్చుట లేదు. పెద్దవారిని గౌరవించుట, గురువుల పట్ల భక్తి కలిగియుండుట యివి భూలోకమున నీ కలియుగమున నల్లపూసలగుచున్నవి. 


ఇవి అన్నియు మానవులందు పొడజూపుటకు కారణము యీ సర్వలోకము లకూ సర్వగ్రహ నక్షత్రాదులకు మొత్తము మీద సర్వ ప్రకృతి సృష్టికి కారకుడైన దైవము యొక్క చింతన లేకపోవుటయే. 


పైగా యీ కలియుగమందు శ్రీమహావిష్ణువుయొక్క అవతారము లేకపోయెను. కనుక, నారదా! ఇంతకూ నేను చెప్పబోవునదీ, నీవు చేయవలసినదీ యేమనగా నీ యొక్క నేర్పు చూపించి, యోచించి యెట్లయిననూ శ్రీమహావిష్ణువు భూలోకమున అవతరించునట్లు చేయవలెను. 


దానివలన మానవ కళ్యాణమగును. మరల భూలోకవాసులందు ఆస్తికత్వము ప్రబలుటకు వీలుండును అనెను.


 సభలో గల ఇంద్రాదులకు బ్రహ్మదేవుని ఆలోచన ఆనందమును రేకెత్తించినది. జనకుని మాటలను శ్రద్ధగా విని, నారదుడు తానా పనిని చేయబూనుట లోకోపకారమని భావించి చేయుటకు నిశ్చయించుకొని మరల తండ్రికి నమస్కరించి శెలవు గైకొని వీడి వెడలినాడు.


కశ్యపాది మహర్షులు గంగానది ఒడ్డున కలియుగ రక్షణార్థం క్రతువు చేయ నిర్ణయించారు.

 యజ్ఞం ఆరంభించే సమయానికి నారదుడు అక్కడకు వచ్చి, అక్కడ ఉన్న కశ్యప, ఆత్రేయ, మార్కండేయ, గౌతమాది మహర్షులను చూసి, ఆ మహర్షులను

 క్రతువు దేనికొరకు చేస్తున్నారు, 

యాగఫలాన్ని స్వీకరించి కలియుగాన్ని సంరక్షించే వారు ఎవరు అని 


ప్రశ్నను వదలి నారదుడు వెడలిపోగా వారలు చర్చించుకొనసాగిరి. 


కొందరు మునులు ‘‘బ్రహ్మ గొప్పవాడని కొందరు ‘‘కాదు విష్ణువే గొప్పవా’’డనిరి. మరికొందరు ‘కాదు’ శంకరుడు గొప్పవాడనిరి.


 తుదకు ఆయన గొప్పవారు, ఈయన గొప్పవారని అనుట నుండి ఈయన తక్కువవారు ఆయన తక్కువవారని అనుటవరకు దిగినది. చిలికి చిలికి గాలివాన అయినది. 


వాదోపవాదములు పెచ్చు పెరిగినవి. ఇవి వినిన కొందరు పెద్దలు ‘‘ఋషులారా! న్యాయా న్యాయములు, ధర్మసూక్ష్మములు, నీతి సూత్రములు ప్రకటించు అర్హత గలిగిన మీరు ఈ విధముగ తర్జన భర్జనలతో పరస్పర నిందలతో అసలు పని మరచుట న్యాయమా? నారదుడు విజ్ఞాన సంపన్నుడు, ఆయన మనకు చాలా ముఖ్యమైన ఒక సమస్యను గుర్తుకు తెచ్చి వెడలినాడు. 


మనము కార్యశూరులమయి సమస్యను పరిష్కరించు మార్గమును కనుగొనవలెనే కాని వ్యర్ధ వాదోపవాదములు కిది తగిన కాలము కాదు గదా అనిరి. 


‘‘సత్త్వగుణము, రజోగుణము, తమోగుణము అను త్రిగుణములందున సత్త్వగుణమే మహోన్నతము కదా! అందువలన త్రిమూర్తులలో సత్త్వ గుణ ప్రధానుడెవ్వరో గ్రహించుట శ్రేయస్కరము. 


మునులారా! మీ యందరి యందును త్రిమూర్తులను పరీక్షింపగల సమర్థుడెవ్వరో యాతనిని ఎంపిక చేసి పంపుడు, అందువలన మన సందేహము తీరుట జరుగును’’ అని కూడ ప్రవచించిరి. 


మునులు దాని కంగీకరించినారు. కాని అది కత్తి పై సాము వంటిది అని వారికి తెలియకపోలేదు. 


సరే ఎవ్వరిని పంపిన బాగుండునని బాగుగా యోచించసాగిరి మునీశ్వరులు, అంతలో కొంతమంది మన మునులలో ఘనుడగువాడు ఒక్క భృగువు మాత్రమే, అతడు మహా తపస్సును చేసి శక్తిని సంపాదించినవాడు. 


ఆయన మాత్రమే ఈ మహా కార్యమును నిర్వహించుటకు సమర్ధుడు అని వారు పలికినారు


ఇది అంతయు శ్రద్ధతో ఆలకించు చున్న మునులందరూ మహానుభావ అటువంటి మహోన్నత వ్యక్తి ,విష్ణుస్వరూపుడైన భృగు మహర్షి చరిత్రను మాకు తెలియజేయ వలసినదిగా కోరినారు 


దానికి సూతమహర్షి చిరు మందహాసముతో ఆ వృత్తాంత మంతయు తెలియజేయుటకు సంకల్పించినారు .


 

 *శ్రీనివాస గోవిందా, శ్రీ వేంకటేశా గోవిందా,* 

 *భక్తవత్సల గోవిందా, భాగవతప్రియా గోవిందా; |* 


 *గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా, గోవిందా* *హరి గోవిందా, వేంకట రమణా గోవిందా. ||1|* |


శ్రీవేంకటేశ్వరునిదివ్య లీలల లో మరికొన్ని తదుపరి సంపుటిలో తెలుసుకుందాం.


 *ఓం నమో వెంకటేశాయ*


*సేకరణ:- శ్రీ రమణమూర్తి గారి వాట్సాప్ పోస్ట్.* 

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

పండితవర్యుల నెయ్యము

 సుభాషితమ్

             ll శ్లోకం ll


పణ్దితైస్సహ సాఙ్గత్యం

పణ్దితైస్సహ సంకథాః।

పణ్దితైస్సహ మిత్రత్వం

కుర్వాణో నావసీదతి॥


తా𝕝𝕝 

*పండితులతో సహవాసం, పండితులతో....మాటలాడుట.....పండితులతో మైత్రి* - వీటిని ఆచరించువాడు నాశమునొందడు.....



పండితవర్యుల నెయ్యము

పండితులను కూడి యుంట

భాషించుటయున్

మెండుగ కల్గిన మానవు 

డుండును నాశమ్ములేక నుర్విన్ సుఖిగన్


గోపాలుని మధుసూదన రావు

ధర్మమనే పదానికి

 శ్లోకం:☝️

*ధారణాద్ధర్మ ఇత్యాహుః*

  *ధర్మో ధారయతే ప్రజాః |*

*యత్స్యాద్ధారణ సంయుక్తః*

   *సధర్మ ఇతినిశ్చయః ||*


భావం: ధర్మమనే పదానికి, 'లోక వ్యవస్థ దెబ్బ తినకుండా అందరు అనుసరించవలసిన సామాన్య నియమము' అని అర్థం చెబుతారు. ధర్మం అన్న పదం ధారణ అనే పదం నుంచి వచ్చింది. ప్రజలచే ధరించబడేది, ఆచరించబడేది ధర్మం. ప్రజలలో ఐక్యభావాన్ని తీసుకువచ్చి, సమాజాన్ని ఒక్కటిగా ఉంచేది, అందరిని భగవంతుని దగ్గరకు చేర్చేది ధర్మం.🙏

శ్రీ శివ సహస్రనామ స్తోత్రమ్

 ॐ   శ్రీ శివ సహస్రనామ స్తోత్రమ్ 


                             శ్లోకం :25/150 


తీక్ష్ణతాపశ్చ హర్యశ్వః 

సహాయః కర్మకాలవిత్ I 

విష్ణుప్రసాదితో యజ్ఞః 

సముద్రో బడబాముఖః ॥25 ॥  


* తీక్ష్ణతాపః = తీక్షణమైన వేడిమి కలవాడు (కలుగజేయువాడు), 

* హర్యశ్వః = పచ్చని కాంతిగల గుర్రములు కలిగియున్న సూర్యుడు, 

* సహాయః = ఎల్లప్పుడు మనతో ఉండువాడు, 

* కర్మకాలవిత్ = కర్మ, కాలముల గురించి తెలిసినవాడు, 

* విష్ణుప్రసాదితః = విష్ణువు యొక్క అనుగ్రహము పొందినవాడు, 

* యజ్ఞః = యజ్ఞ రూపుడు, 

* సముద్రః = సముద్ర రూపుడు, 

* బడబాముఖః = సముద్ర గర్భమున ఉండే బడబాగ్ని రూపము తానే అయినవాడు.


                    కొనసాగింపు ... 


https://youtu.be/L4DZ8-2KFH0 


                    =x=x=x= 


  — రామాయణం శర్మ 

           భద్రాచలం

వేదవిహితధర్మమే

 వేదవిహితధర్మమే శ్రేయఃప్రాప్తిహేతువు


ఈశ్వరానుగ్రహాదేవ పుంసా మ ద్వైతవాసనా,

దుర్లభం త్రయ మేవైతత్ దైవాను గ్రహహేతుకమ్ ||

మనుష్యత్వం ముముక్షుత్వం మహాపురుషసంశ్రయః,

స్వవర్ణా శ్రమధర్మేణ తపసా హరితోషణాత్ ||

జ్ఞానముత్పద్యతే పుంసాంవైరాగ్యాది చతుష్టయం,

తథాప్యనుగ్రహాదేవ తరుణేందు శిఖామణేః |

అద్వైతవాసనా పుంసా మావిర్భవతి నాన్యథా||


మనుష్యత్వమూ, ముముక్షుత్వమూ, మహాపురుషుల సంశ్రయమూ యీ మూడూ దుర్లభములు, దైవానుగ్రహమే వీటికి హేతువు పరుషుల స్వవర్ణాశ్రమధర్మాల నాచరించడం వల్లా, తపోనిష్ఠచేతా, పరమేశ్వరుని ప్రీతుని చేయడంవల్లనూ, ఇహాముత్రఫలభోగ విరాగరూపమైన జ్ఞానాన్ని పొందగలుగుతారు.


''తరుణేందు శేఖరుడైన స్వామి అనుగ్రహం లేకుంటే అద్వైతవాసన పట్టుబడుదు.''

ఈశ్వరానుగ్రహంవల్లనే పురుషునకు పరమశ్రేయం దొరుకుతుందనియీవిధంగా ఆచార్యపురుషుల ఉపదేశములు, ఆప్తవాక్యములు భోధిస్తున్నవి. కనుక మనమందరం ఆ ఈశ్వరానుగ్రహంకోసం తీవ్రమైన యత్నం చేయవలసివుంది. సకల శ్రేయఃప్రాప్తికి ఆ యనుగ్రహమే కారణం. ఈశ్వరుడు మనకిచ్చిన ఆయుస్సంతటిని తదనుగ్రహ సంపాదనకోసమేవ్యయిస్తే సార్ధకమవుతుంది. ఇతర విధాల గడపిన ఆయువంతా వ్యర్థమే అవుతుంది.


కాబట్టి, నీబ్రతుకు ఫలవంతం కావాలంటే స్వామిఅనుగ్రహంమీదనే దృష్టిని నిలిపివుంచు. ఈశ్వరానుగ్రహ సంపాదనాన్ని ఏమరి ఒక్కక్షణం గడపినా నీ బ్రతుకంతా నిరర్ధకమైవూరుకుంటుంది. మావనులందరు ఈశ్వరభక్తియం దోలలాడ వలెననీ, ఈశ్వరానుగ్రహం అందరిమీదా ప్రసరింపచేయవలెననీ సర్వదా స్వామి చరణకమల సన్నిధిని చేరి వేడుకో. ప్రతి మానవునియందు ఈశ్వరపదార్థం ఉండనేవుంది. కనుక భక్తులైనవారు సకలమానవులను ఒక్కరీతిగానే భావించవలసివుంటుంది.


శ్రీ కామకోటిపీఠాన్ని ఏబదేండ్లుగా మేము సేవించితిమి. ఈ ఏబదేండ్లలో మేము చేసిన కార్యములను సింహావలోకనం చేయడంవల్ల అంతగా ప్రయోజనంలేదు. ఇకముందు కూడా పరమేశ్వరుడు మాకు ఏ కొంచెమో ఆయువు అనుగ్రహిస్తే దాని నెలా వినియోగించాలి? మాకు కర్తవ్యమేమిటి? అని విచారించుకోగా, నైష్కర్మ్య సంపాదనమే కర్తవ్యమని తేలుతున్నది. మరి భగవంతుడు గీతాశాస్త్రంలో నైష్కర్మ్యమంటే చేతులు ముడుచుకొని కూరుచుండటం కాదని పదేపదే సెలవిస్తూవచ్చారు. మీదుమక్కిలి కర్మాచరణంవల్లనే నైష్కర్మ్యం సిద్ధిస్తుందన్నారు. ఆకర్మ ఎంత తీవ్రమైనదో! ఏకర్మను ఆచరించడంవల్ల నైష్కర్మ్యసిద్ధి కలుగుతుందో? అని విచారించగా భగవత్పాదుల ఆజ్ఞయే గుర్తుకువస్తుంది. అందరికీ ఉపదేశిస్తున్న ఆయాజ్ఞనే మేమూ స్మరిస్తున్నాము. ''కర్మ స్వనుష్ఠీయతాం తేనేశస్యవిధియతా మపచితిః'' 'నీవంతుకు వచ్చిన కర్మను లెస్సగా ఆచరించు. అదే ఈశ్వరునకుతుష్టికూరుస్తుంది, అనేదే ఆ యాజ్ఞ.

కాబట్టి ఎవరివంతుకు వచ్చినపని వారువారు లెస్సగా ఆచరించాలి. స్వస్వకర్మాను ష్ఠానమును మించిన ఈశ్వరపూజా, ఈశ్వరారాధనమూ లేదు. భగవదనుగ్రహ సంపాదన కదే మార్గము. ఎవరివంతునకువచ్చిన కర్మలనువారువారు అనుష్ఠించుతూ తద్వారా ఈశ్వరార్చనపరులమై శ్రేయమును సంపాదించు కొందాము.


ఇతరులకు, మనకుకూడా శ్రేయంగూర్చే కర్మలనాచరించుట వల్లనే జన్మము చరితార్ధమగును. కడచిన ఏబదేండ్లలో మేము చేసిన పనులను అందలి లోపములను ఒకతూరి వెనుకకు పారజూచుకొన్నచో అది భావిజీవితానికి మార్గదర్శకం కాగలదు. కడచిపోయినదానిని గూర్చి వ్యర్ధముగా చింతించుచు గూర్చుండుటకంటె పాపపుణ్య వివేచనం చేసుకోగలిగితే అది దోషములనుండి కాపాడుతుంది.


ఏపనియైనా ఇతరులను కూడగట్టుకొని చేస్తే ఫలప్రదమవుతుంది. అలా యితరుల సహాయముతో మే మీ చరమ జీవితమున ఏమి చేయవలసిఉంటుందో ఆలోచించుకోవాలి. లోకంలో ఎవ్వరికీ దుఃఖము, లోపము లేకుండా అందరూ సుఖం పొందవలెననే విషయం సకల దేశాలవారు, సమస్త మతములవారు అంగీకరించి, అందుకై ఎంతో కృషిచేస్తున్నారు. బహుజనులకు అత్యధికసుఖం చేకూర్చడమే మాకు ధ్యేయమని అన్ని పార్టీలవారూ చెబుతున్నారు.


వేదవిహితమైన ధర్మాచరణంవల్లనే బహుజనులకు సుఖం లభిస్తుందని కనిపిస్తున్నది. శ్రేయఃప్రాప్తికి వేదవిహిత ధర్మమొక్కటే మార్గము.


ఎందరో మహనీయులు శ్రేయఃప్రాప్తికి మార్గములు చెప్పియున్నారుకదా! అట్టి వారిని కాదని, ఒక్క వైదికధర్మమునే ఎందుకు ఆశ్రయించాలి అని కొందరు ఆక్షేపించవచ్చును. ఇందుల కొక్కటే సమాధానము. ఇతర మత కర్తలు చెప్పిన ధర్మాలన్నీ వేదములందే పరిశీలించిచూస్తేకనిపించుతవి. ఇతర ధర్మగ్రంధములన్నీ వేదములకు పిమ్మటనేపుట్టినట్లు చరిత్రవల్ల ఏర్పడుతున్నది. వేదములు చెప్పని ధర్మమూసత్యమూ అంటూలేదు. వేదము లెప్పుడు పుట్టినవో మనము నిర్ణయింపలేము. వేదకాల నిర్ణయము చేయబూనడం నష్టజాతకాన్ని గణించడంవంటిది.


ఉదారము, నిర్మలమునైన మన వైదికధర్మమును అనుసరించకపోవడంవల్లనే మన మతము దుర్బలమై మనము కష్టనష్టముల పాలగుట తటస్థించినది. వైదిక ధర్మము తదనుయాయులను పరిశుద్ధులనుచేసి, ఈశ్వరానుగ్రహపాత్రులను గావింపగలదనీ, ఇతరమతములు పుట్టకమున్నే వైదికధర్మం లోకమంతటికీ మేలుగూర్చే మార్గం ఉపదేశించిందనీ మనం గ్రహించి ఇతరులకు తెలియచెప్పవలసివుంది. వేదములయం దేమాత్రమోభక్తిగల మన కందరకు ఇది విహితమైన పని. సమస్తమునకు మూలకందమైన వేదముల నాశ్రయించినచో శాఖలయందు వినవచ్చే భేదమర్మములన్నీ సమసిపోగలవు. వైదిక ధర్మావలంబులు ఇతరమతస్థులను రండని చేరబిలుచుట మన పనికాదు. అనాదియైన వేదమే సకల శ్రేయములకు మూలమని మనము గ్రహించినచో చాలును. ఇంతకంటే మనకిపుడు పరమధర్మము లేదు.


లోకమున భిన్న మతయలకు విరోధములు కొరగావని వేదము చెపుతూవుంది. ఎవరేమార్గ మనుసరించినను అందరు ఏకగమ్యమునేచేరుదురని వేదమొక్కటే చెప్పుచున్నది. ఇతర మతములు తమమార్గమేసత్యమని, తక్కినవినరకహేతువులనీ చెప్పుచున్నవి. ఒక గమ్యమునకే పెక్కుమార్గములున్నవని వేదముతప్ప ఇతరమతము లంగీకరింపవు. ఈ పరమార్ధమును గ్రహించు భారముమనపై నున్నది. కాని వేదవిహితానుష్ఠానముపై శ్రధ్ధలేక ధర్మాచరణమున ఇతర మతస్థులకంటె వెనుక బడియున్నచో యీ పరమార్ధమునుపదేశించే అర్హత మనకు కలుగదు.


సకల జగద్ధాత్రియైన పరమేశ్వరి, ఆపరాసక్తిని మనసారా భజించినచో లోకాని కేకొంచెమోక్షేమం చేకూర్చటంవల్ల మనం విశ్వాన్ని జయిచగలుగుతాం. జయించుట అంటే ఇతరుల కపజయం కూరుస్తామని కాదు. వారు, మనం ఎల్లరం శ్రేయస్సౌఖ్యములం దోలలాడగలుగుతాము. ఈ సత్యాన్ని గ్రహించి మాకు మిగిలియున్న జీవితమందు దీనిని సమస్త లోకానికి చాటిచెప్పి తోడిమానవులను సేవించుకునే శక్తిని పరమేశ్వరుడు మా కనుగ్రహించుకాక!

నమః పార్వతీపతయే


హరహర మహాదేవ.


--- “జగద్గురు బోధలు” నుండి


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం ।।


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

ధర్మ సందేహములు

 ధర్మ సందేహములు

సందేహం:-


మౌనం అంటే ఏమిటి?

సమాధానము:-


మౌనం అనగా వాక్కుని నియంత్రించడం లేదా మాటలాడడం తగ్గించడం. ఇదొక అపూర్వమైన కళ మరియు తపస్సు. మాటలను వృథాగా వినియోగించకుండా దైవమిచ్చిన వరంగా భావించి ముక్తసరిగా అవసరం మేరకే మాట్లాడటం సర్వదా శ్రేయస్కరం. వినేవారికి ఇంపుగా, హితంగా, మితంగా మాట్లాడాలని, అలా చేతకానప్పుడు మౌనమే మేలని విదురనీతి వివరిస్తోంది. 


పాపాల పరిహారార్ధం నిర్దేశించబడిన ఐదు శాంతులలో మౌనం ఒకటి. 

పంచ శాంతులు

1) ఉపవాసం

2) జపం

3) మౌనం

4) పశ్చాత్తాపం

5) శాంతి

మౌనంగా ఉండేవారిని మునులు అంటారు. మాట వెండి అయితే, మౌనం బంగారం అని సామెత. 


మాట్లాడటం ద్వారా శక్తిని వృథా చేసుకునేకంటే మౌనంగా ధ్యానం చేయడం ద్వారా ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితికి చేరుకోవచ్చుఅన్నారు స్వామి వివేకానంద. 


నేరనిర్థారణ సందర్భాల్లో నేరస్థుడు మౌనం వహిస్తే నేరం అంగీకరించిన భావం వస్తుంది కాబట్టి ఆ సమయంలో మౌనాన్ని ఆశ్రయించడం అనుకూలం కాదు. 


అతిగా మాట్లాడేవారికి విలువ తగ్గిపోతూ ఉంటుంది.

మౌనం మూడు విధాలుగా చెప్తారు.


1)వాజ్మౌనం: 


వాక్కును నిరోధించడమే వాజ్మౌనం. దీనినే మౌనవ్రతం అంటారు. ఇలాంటి మౌనం వల్ల పరుష వచనాలు పలుకుట, అబద్ధము లాడుట, ఇతరులపై చాడీలు చెప్పుట, అసందర్భ ప్రలాపాలు అను నాలుగు వాగ్దోషాలు హరించబడతాయి.


2) అక్షమౌనం: 

అనగా ఇంద్రియాలను నిగ్రహించడం. ఇలా ఇంద్రియాల ద్వారా శక్తిని కోల్పోకుండా చేస్తే ఆ శక్తిని ధ్యానానికి, వైరాగ్యానికి సహకరించేలా చేయవచ్చును.


3)కాష్ఠమౌనం: 

దీనినే మానసిక మౌనం అంటారు. మౌనధారణలో కూడా మనస్సు అనేక మార్గాలలో పయనిస్తుంది. దానిని కూడా అరికట్టినప్పుడే కాష్ఠమౌనానికి మార్గం లభిస్తుంది. దీని ముఖ్య ఉద్దేశము మనస్సును నిర్మలంగా ఉంచుట. కాబట్టి ఇది మానసిక తపస్సుగా చెప్పబడింది.


ప్రయోజనాలు:


మౌనం ఆరోగ్య వృద్ధికి తోడ్పడుతుంది. దీనివలన దివ్యశక్తి ఆవిర్భవిస్తుంది. బాహ్య, ఆంతరిక సౌందర్యాలను పెంచుతుంది. మనోశక్తులు వికసిస్తాయి. ఎదుటవారిలో పరివర్తనను తెస్తుంది. ఆధ్యాత్మిక శక్తి ఉత్పన్నమై ఆత్మకి శాంతి లభిస్తుంది. సమయం సదుపయోగమౌతుంది. 


పతంజలి మహర్షి తన యోగసిద్ధాంతంలో అవలంబించవలసిన మౌనానికి ప్రాధాన్యతనిచ్చారు. మౌనాన్ని అవలంబించిన మహాత్ములలో రమణ మహర్షి, శ్రీరామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద మున్నగు వారెందరో ఉన్నారు.


జై శ్రీమన్నారాయణ


జై శ్రీ రామ్


హిందూ సాంప్రదాయాలు ఆచరిద్దాం-పాటిద్దాం

ఆర్య చాణక్య*♦️ *పార్ట్ - 122*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

.    *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*

.           ♦️ *ఆర్య చాణక్య*♦️


*పార్ట్ - 122*


🔴 *రాజనీతి సూత్రాణి - ప్రథమధ్యాయము* :


📕 *దుర్వవ్యసనాదుల దుష్పరిణామాలు* : 📕


1. న వ్యసనపరస్య కార్యవాప్తిః (దుర్వ్యసనాలకి లొంగిపోయినవారికి ఏ పనీ జరగదు.) 


2. ఇంద్రియవశవర్తీ చతురఙ్ఞవాసపి వినశ్యతి (ఇంద్రియాలకి లొంగిపోయినవాడు చతురంగబలం ఉన్నా నశిస్తాడు.) 


3. నాస్తి కార్యం ద్యూతప్రవృత్తస్య (ద్యూత (జూదం) వ్యసనంలో పడ్డవాడు ఏ పనీ సాధించలేడు.) 


4. మృగయాపరస్య ధర్మార్థౌ నశ్యతః 

(వేట వ్యసనం ఉన్నవాని ధర్మం, అర్థం కూడా నశిస్తాయి.) 


5. న కామాసక్తస్య కార్యానుష్ఠానమ్ 

(కామాసక్తుడు ఏ పనీ చేయలేడు.) 


6. అర్థేషణా న వ్యసనేషు గణ్యతే 

(రాజుకు ధనాసక్తి ఉండడం వ్యసనంగా పరిగణించబడదు.) 


7. అర్థతోషిణం హి రాజానం శ్రీపరిత్యజతి 

(ఉన్న ధనం చాలునులే అనుకునే రాజును లక్ష్మి విడిచివేస్తుంది.) 


8. అగ్నిదాహాదపి విశిష్టం పరుషవాక్యమ్ (వాక్పారుష్యం అగ్ని వేడికంటే కూడా అధికమైనది.) 


9. దండపారుష్యాత్ సర్వజనద్వేష్యో భవతి

(దండం (శిక్షించడం) లో పరుషంగా ఉంటే అందరికీ ద్వేషపాత్రుడు అవుతాడు.) 


10. అమిత్రో దండనీత్యామాయత్తః

(శత్రువు దండనీతికి లొంగుతాడు.) 


11. దండనీతిమధితిష్టన్ ప్రజాః సంరక్షతి 

(దండనీతి అవలంబించినవాడే ప్రజల్ని రక్షించగలుగుతాడు.) 


12. దండః సంపదా యోజయతి 

(దండం సంపదను సంపాదించి పెడుతుంది.) 


13. దండాభావే త్రివర్గాభావః

(దండం అనేది లేకపోతే త్రివర్గమే (ధర్మ-అర్థ-కామాలే) లేదు.) 


14. న దండాదకార్యాణి కుర్వంతి 

(దండం ఉంది కాబట్టే చెడ్డపనులు చెయ్యరు.) 


15. దండనీత్యామాయత్త మాత్మరక్షణమ్ 

(ఆత్మ రక్షణం దండనీతిమీద ఆధారపడి ఉంటుంది.) 


16. ఆత్మనీ రక్షితే సర్వం రక్షితం భవతి 

(తనని తాను రక్షించుకుంటే అన్నీ రక్షించినట్లే.) 


17. ఆత్మాయత్తౌ వృధ్ధివినాశౌ

(అభివృద్ధి వినాశనము తన చేతుల్లోనే ఉంటుంది.) 


18. దండో హి విజ్ఞానేన ప్రణీయతే 

(దండాన్ని వివేకపూర్వకంగా ప్రయోగించాలి.) 


19. దుర్భలో పి రాజా నావమస్తవ్య 

(దుర్బలుడైన రాజును అవమానించకూడదు.) 


20. నాస్త్యగ్నే ర్ధౌర్భల్యమ్ 

(అగ్నికి దుర్భలత్వం అనేది ఉండదు.) 


21. దండే ప్రణీయతే వృత్తిః 

(దండం ఉంటేనే వృత్తులు (జీవనోపాయాలు) సాగుతాయి.) 


22. వృత్తి మూలమర్థలాభాః 

(వృత్తికి మూలం ధనలాభం. ధనలాభం ఉంటేనే ఎవరైన ఆ వృత్తి చేపడుతారు.) 


23. అర్థమూలౌ  ధర్మకామః

(ధర్మ-కామాలకి మూలకారణం అర్థమే.) 

(ఇంకా ఉంది)...🙏


*సేకరణ:- శ్రీ రమణమూర్తి గారి వాట్సాప్ పోస్ట్.*  


🎄🌲🪻🎄🌲🪻🎄🌲🪻🎄

👉 *రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹