5, నవంబర్ 2022, శనివారం

రాయబార కార్యాలయంలో మహిళ మోదీజీ గురించి ఇలా ఒక పోస్ట్‌లో రాసింది !*

 *జర్మనీలోని భారత రాయబార కార్యాలయంలో పనిచేస్తున్న ఓ మహిళ మోదీజీ గురించి ఇలా ఒక పోస్ట్‌లో రాసింది !*


 ఆమె రాసింది ...........


 మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ జర్మనీకి వచ్చినప్పుడు, అతను తనతో పాటు తన బంధువులైన 40 మందిని తీసుకువచ్చాడు.


 వారి బస కోసం మొత్తం ఐదు హోటళ్లు (అన్నీ ఫైవ్-స్టార్) బుక్ చేయబడ్డాయి.


 బంధువులందరూ ప్రతిరోజూ ఖరీదైన మాల్స్‌లో షాపింగ్ చేసి లక్షలాది రూపాయలకు వస్తువులను కొనుగోలు చేశారు.


 మొత్తం విదేశాంగ శాఖ పేరుతో బిల్లులు వసూలు చేశారు.


 మన్మోహన్‌ సింగ్‌ పర్యటన కరెన్సీ అంతటా ఇదే రోజువారీ కథనం.


 స్టేట్ డిపార్ట్‌మెంట్‌లోని మొత్తం భారతీయ-సిబ్బంది సేవకుడు వారందరి ముందు నృత్యం చేసేవారు.


 మన్మోహన్‌జీ ఒక్కసారి కూడా రాయబార కార్యాలయానికి రాలేదు లేదా మమ్మల్ని కలవలేదు.


 ఇప్పుడు మోడీజీ జర్మనీకి రెండుసార్లు ప్రధానిగా వచ్చినప్పుడు, సిబ్బంది అంతా మళ్లీ అదే ప్రదర్శనను ఆశించారు.


 కానీ అతను ఒంటరిగా రావడం నాకు ఆశ్చర్యంగా ఉంది!


 బంధువుల సైన్యం లేదు.


 కాబట్టి భద్రత & భద్రత కారణాల దృష్ట్యా హోటల్‌లోని ఒక అంతస్తు మాత్రమే పూర్తిగా బుక్ చేయబడింది.


 మాల్స్‌లో షాపింగ్ లేదు


 ఫుల్ టైమ్ వర్క్ తో బిజీగా ఉన్నారు.


 ఎంబసీ సిబ్బంది చంచగిరి చేయడానికి అనుమతించబడలేదు;


 అయితే, సిబ్బంది తమ కార్యాలయంలోని రోజువారీ పనులను కొనసాగించారు.


 నిజానికి డేటా మొత్తం సేకరించి ఫైల్ ఫోల్డర్‌లో పెట్టే పనిలో చాలా బిజీగా ఉన్నాము, మూడు రోజులు ఇంటికి వెళ్లలేము.


 తన బిజీ షెడ్యూల్‌లో ఉన్నప్పటికీ, మోడీజీ కొంత సమయం తీసుకొని రాయబార కార్యాలయానికి వచ్చారు మరియు పర్యటనను విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి క్రెడిట్ ఇచ్చారు మరియు వారందరూ అతనితో ఒక కప్పు టీ తాగారు.


 ఇది ఒక గొప్ప వ్యక్తి పరిచయం!


 మిత్రులారా, చాలా సంవత్సరాల తర్వాత, మీకు నిజాయితీ గల ప్రధానమంత్రి లభించారు.


70 యేళ్లు విదేశీ శక్తులు పరిపాలనలో లేని అభివృద్ధి 8 ఏళ్లలో ఎలా సాధ్యపడింది ప్రపంచ దేశాలు భారత్ ను హీరో గా ఎందుకు చూస్తున్నాయి దేశ ద్రోహులు మోడీ గారి మీద ఎందుకు పడి ఏడుస్తున్నారు

కార్తీక పురాణం 11 వ అధ్యాయం

 *కార్తీక పురాణం 11 వ అధ్యాయం*

🌺🌺🌺🌺🌺🌺🌺🌺


*మంథరుడు - పురాణ మహిమ*


ఓ జనక మహారాజా! యీ కార్తీకమాస వ్రతము యొక్క మహాత్యమును గురించి అనేక ఉదాహరణలు చెప్పియుంటిని. ఇంకనూ దీనిని గురించి యెంత చెప్పినను తనివి తీరదు. ఈ మాసమందు విష్ణువును అవిసె పూలతో పూజించిన యెడల చాంద్రాయణ వ్రతము చేసినంత ఫలము కలుగును. విష్ణ్యర్చనానంతరం పురాణ పఠనం చేసినా, చేయించినా, వినినా, వినిపించినా అటువంటి వారు తప్పని సరిగా వైకుంఠాన్నేపొందుతారు. దీనిని గురించి మరొక ఇతిహాసము చెప్పెదను. శ్రద్దగా ఆలకింపుము. అని వశిష్టుల వారు ఈ విధముగా చెప్పసాగిరి.

పూర్వము కళింగ దేశమున మంధరుడను విప్రుడు గలడు. అతడు ఇతరుల యిండ్లలో వంటలు చేయుచు అక్కడే భుజించుచు, మద్య మాంసాది పానీయాలు సేవించుచూ కొన్ని జాతుల వారి సాంగత్యము వలన స్నానజప, దీపారాధనాదికములను! ఆచారములును పాటింపక దురాచారుడై మెలుగుచుండెను. అతని భార్య మహాసాధ్వి, గుణవంతురాలు, శాంతిమంతురాలు, భర్త యెంత దుర్మార్గుడయిననూ, పతినే దైవముగానెంచి విసుగు చెందక సకలోపచారములు జేయుచు, పతివ్రతా ధర్మమును నిర్వర్తించుచుండెను. మంధరుడు ఇతరుల ఇండ్లలో వంటవాడుగా పని చేయుచున్ననూ ఇల్లు గడవక చిన్న వర్తకము కూడా చేయసాగెను. ఆఖరికి దాని వలన కూడా పొట్ట గడవక పోవుటచే దొంగ తనములు చేయుచూ, దారి కాచి బాటసారులను బాధించి వారి వద్ద నున్న ధనము, వస్తువులు అపహరించి జీవించుచుండెను. ఒక దినమున ఒక బ్రాహ్మణుడు అడవి దారిని బడి పోవుచుండగా అతనిని భయపెట్టి కొట్టి ధనమపహరించుచుండగా అక్కడకు మరొక కిరాతకుడు వచ్చి ధనాశచే వారిద్దరిని జంపి ధనము మూటగట్టుకొని వచ్చుచుండెను. సమీపమందున్న ఒక గుహ నుండి వ్యాఘ్ర మొకటి గాడ్రించుచు వచ్చి కిరాతుకుని పైబడెను. కిరాతుకుడు దానిని కూడా చంపెను. కానీ అ పులి కూడా తన పంజా తో కిరాతుకకుని కొట్టి యుండుట వలన ఆ దెబ్బకు కిరాతకుడు కూడా చనిపోయెను. ఈ విధముగా ఒక కాలమున నలుగురూ నాలుగు విధముల హత్యలు చేసి చనిపోయినందున ఆ నలుగురు కూడా యమ లోకమున అనేక శిక్షలు అనుభవించుచు రక్తము గ్రక్కుచు బాధ పడుచుండిరి.


మంధరుడు చనిపోయిన నాటి నుండి అతని భార్య నిత్యమూ హరి నామ స్మరణ చేయుచు సదాచర వర్తినియై భర్తను తలచుకుని దుఃఖించుచు కాలము గడుపుచుండెను. కొనాళ్ళుకు ఆమె ఇంటికి ఒక ఋషి పుంగవుడు వచ్చెను. ఆ వచ్చిన ఋషిని గౌరవముగా ఆహ్వానించి అర్ఘ్య పాద్యాదులచే పూజించి " స్వామి!నేను దీనురాలను, నాకు భర్త గాని, సంతతిగానిలేరు. నేను సదా హరి నామ స్మరణ చేయుచు జీవించుచున్న దానను, కాన, నాకు మోక్ష మార్గము ప్రసాదించు" మని బ్రతిమాలుకోనేను. ఆమె వినయమునకు, ఆచారమునకు ఆ ఋషి సంతసించి" అమ్మా! ఈ దినము కార్తిక పౌర్ణమి, చాల పవిత్రమైన దినము. ఈ దినమును వృథాగా పాడు చేసుకోనువద్దు. ఈ రాత్రి దేవాలయములో పురాణము చదువుదురు. నేను చమురు తీసికొన వచ్చెదను. నీవు ప్రమిదను, వత్తి ని తీసికొని రావలయును. దేవాలయములో ఈ వత్తిని దెచ్చిన ఫలమును నీ వందుకోనుము" అని చెప్పిన తోడనే అందుకామె సంత సించి, వెంటనే దేవాలయమునకు వెళ్లి శుభ్రము చేసి గోమయముచే అలికి ముగ్గులు పెట్టి తానే స్వయముగా వత్తి చేసి రెండు వత్తులు వేసి ఋషి తెచ్చిన నూనే ప్రమిదెలో పోసి దీపారాధ న చేసెను. అటు తరువాత యింటికి వెడలి తనకు కనిపించిన వారి నెల్ల " ఆరోజు రాత్రి ఆలయ ముందు జరుగు పురాణ కాలక్షేపము నకు" రమ్మని చెప్పెను. ఆమె కూడా రాత్రి అంతయు పురాణమును వినెను. ఆనాటి నుండి ఆమె విష్ణు చింతనతో కాలము గడుపుచు కొంత కాలమునకు మరణించెను. ఆమె పుణ్యాత్మురాలగుటచే వల్ల విష్ణుదూతలు వచ్చి విమాన మెక్కించి వైకుంఠమునకు దీసికునిపోయిరి. కానీ - ఆమెకు పాపత్ముడైన భర్తతో సహవాసము వలన కొంచెము దోషముందుట చేత మార్గ మధ్యమున యమలోకమునకు దీసికోనిపోయిరి. అచట నరక ముందు మరి ముగ్గురితో బాధ పడుచున్న తన భర్తను జూచి " ఓ విష్ణుదూతలారా! నా భర్త మరి ముగ్గురును యీ నరక  బాధపడుచున్నారు . కాన, నాయ౦ందు దయయుంచి వానిని వుద్ధరింపుడని ప్రాధేయపడెను. అంత విష్ణుదూతలు " అమ్మా! నీ భర్త బ్రాహ్మణుడై యుండియు స్నాన సంధ్యాదులు మాని పాపాత్ముడై నాడు. రెండవ వాడు కూడా బ్రాహ్మణుడైననూ అతడు కూడా ధనాశ చే ప్రాణహితుని చంపి ధనమపహరించెను. మూడవ వాడు వ్యాఘ్రము నాలుగవ వాడు పూర్వము ద్రావిడ దేశమున బ్రాహ్మణుడై జన్మించిననూ అనేక అత్యాచారములు చేసి ద్వాదశి రోజున కూడా తైలలేపనము, మద్య మాంసభక్షణ చేసినాడుగాన పాపాత్ముడైనాడు. అందుకే యీ నలుగురు నరకబాధలు పడుచునారు. " అని వారి చరిత్రలు చెప్పిరి. అందులకు ఆమె చాలా విచారించి "ఓ పుణ్యాత్ములారా! నా భర్తతో పాటు మిగిలిన ముగ్గురిని కూడా ఉద్ధరింపుడని ప్రార్ధించగా , అందులకా దూతలు " అమ్మా! కార్తీక శుద్ధ పౌర్ణమినాడు నీవు వత్తి చేసిన ఫలమును వ్యాఘ్రమునకు, ప్రమిదఫలము కిరాతకునకు, పురాణము వినుటవలన కలిగినఫలము ఆ విప్రునకు ధారపోసినచో వారికి మోక్షము కలుగునని  చెప్పగా అందులకామె అట్లే ధారపోసేను. ఆ నలుగురును ఆమె కడకు వచ్చి విమానమెక్కి వైకుంఠమునకు వెళ్లిరి. కావున, ఓరాజా! కార్తీకమాసమున పురాణము వినుటవలన, దీపము వెలిగించుట వలన ఎట్టి ఫలము కలిగెనో వింటివా? అని వశిష్టులవారు అడిగిరి.


పదకొండవ అధ్యాయం సమాప్తము.

క్షీరాబ్ది ద్వాదశి/కైశిక ద్వాదశి*

 🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏

   

              *_నేటి విశేషం_*


*క్షీరాబ్ది ద్వాదశి/కైశిక ద్వాదశి*

         *శని త్రయోదశి*

క్షీరాబ్ధి ద్వాదశి వ్రత విధానం 


శ్రీ పసుపు గణపతి పూజ


శ్లో // శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం

ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే

దీపత్వం బ్రహ్మరూపో సి జ్యోతిషాం ప్రభురవ్యయః

సౌభాగ్యం దేహి పుత్రాంశ్చ సర్వాన్ కామాంశ్చదేహిమే


(దీపము వెలిగించి దీపపు కుందెకు గంధము,కుంకుమబొట్లు పెట్టవలెను.)


శ్లో // అగమార్ధం తు దేవానాం గమనార్ధం తు రక్షసాం

కురుఘంటారవం తత్ర దేవతాహ్వాన లాంఛనమ్

(గంటను మ్రోగించవలెను)


ఆచమనం


ఓం కేశవాయ స్వాహా,ఓం నారాయణాయ స్వాహా,ఓం మాధవాయ స్వాహా,


(అని మూడుసార్లు ఆచమనం చేయాలి)


ఓం గోవిందాయ నమః, విష్ణవే నమః,

మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః,

వామనాయ నమః, శ్రీధరాయ నమః,

ఋషీకేశాయ నమః, పద్మనాభాయ నమః,

దామోదరాయ నమః, సంకర్షణాయ నమః,

వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః,

అనిరుద్దాయ నమః, పురుషోత్తమాయ నమః,

అధోక్షజాయ నమః, నారసింహాయ నమః,

అచ్యుతాయ నమః, జనార్ధనాయ నమః,

ఉపేంద్రాయ నమః, హరయే నమః,

శ్రీ కృష్ణాయ నమః


యశ్శివో నామరూపాభ్యాం యాదేవీ సర్వమంగళా

తయోః సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళమ్ //

లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవహః

యేషా మిందీవర శ్యామో హృదయస్థో జనార్థనః

ఆపదా మపహర్తారం దాతారం సర్వసంపదాం

లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహమ్ //

సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే

శరణ్యే త్ర్యంబికే దేవి నారాయణి నమోస్తుతే //

శ్రీ లక్ష్మీ నారాయణాభ్యాం నమః ఉమామహేశ్వరాభ్యాం నమః

వాణీ హిరణ్యగర్బాభ్యాం నమః శచీపురందరాభ్యం నమః

అరుంధతీ వశిష్ఠాభ్యాం నమః శ్రీ సీతారామాభ్యాం నమః

నమస్సర్వేభ్యో మహాజనేభ్య నమః అయం ముహూర్తస్సుముహోర్తస్తు

ఉత్తిష్ఠంతు భూతపిశాచా ఏతే భూమి భారకాః

ఏతేషా మవిరోధేనా బ్రహ్మకర్మ సమారభే //

(ప్రాణాయామం చేసి అక్షతలు వెనుకకు వేసుకొనవలెను.)

ప్రాణాయామము

(కుడిచేతితో ముక్కు పట్టుకొని యీ మంత్రమును ముమ్మారు చెప్పవలెను)

ఓం భూః ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్

ఓం అపోజ్యోతి రసోమృతం బ్రహ్మ భూర్బువస్సువరోమ్

సంకల్పం

ఓం మమోపాత్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్ధం శుభే, శోభ్నే, ముహూర్తే, శ్రీ మహావిష్ణో రాజ్ఞాయా ప్రవర్తమానస్య అద్యబ్రహ్మణః ద్వితీయ పరార్ధే, శ్వేత వరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే, భరతఖండే మేరోర్ధక్షిణదిగ్భాగే, శ్రీశైలశ్య ఈశాన్య (మీరు ఉన్న దిక్కును చెప్పండి) ప్రదేశే కృష్ణ/గంగా/గోదావర్యోర్మద్యదేశే (మీరు ఉన్న ఊరికి ఉత్తర దక్షిణములలో ఉన్న నదుల పేర్లు చెప్పండి) అస్మిన్ వర్తమాన వ్యావహారిక చంద్రమాన (ప్రస్తుత సంవత్సరం) సంవత్సరే (ఉత్తర/దక్షిణ) ఆయనే (ప్రస్తుత ఋతువు) ఋతౌ (ప్రస్తుత మాసము) మాసే (ప్రస్తుత పక్షము) పక్షే (ఈరోజు తిథి) తిథౌ (ఈరోజు వారము) వాసరే (ఈ రోజు నక్షత్రము) శుభ నక్షత్రే (ప్రస్తుత యోగము) శుభయోగే, శుభకరణే. ఏవం గుణ విశేషణ విషిష్ఠాయాం, శుభతిథౌ,శ్రీమాన్ (మీ గోత్రము) గోత్రస్య (మీ పూర్తి పేరు) నామధేయస్య, ధర్మపత్నీ సమేతస్య అస్మాకం సహకుటుంబానాం క్షేమ, స్థైర్య, ధైర్య, విజయ, అభయ,ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్యర్థం, ధర్మార్ద, కామమోక్ష చతుర్విధ ఫల,పురుషార్ధ సిద్ద్యర్థం, ధన,కనక,వస్తు వాహనాది సమృద్ద్యర్థం, పుత్రపౌత్రాభివృద్ద్యర్ధం, సర్వాపదా నివారణార్ధం, సకల కార్యవిఘ్ననివారణార్ధం,సత్సంతాన సిధ్యర్ధం, పుత్రపుత్రికానాం సర్వతో ముఖాభివృద్యర్దం, ఇష్టకామ్యార్ధ సిద్ధ్యర్ధం, శ్రీమత్ క్షీరాబ్దిశయన దేవతా ముద్దిశ్య శ్రీ క్షీరాబ్ధిశయన దేవతా ప్రీత్యర్ధం యావద్బక్తి ధ్యాన,వాహనాది షోడశోపచార పూజాం కరిష్యే

(అక్షతలు నీళ్ళతో పళ్ళెములో వదలవలెను.)

తదంగత్వేన కలశారాధనం కరిష్యే

కలశారాధనం

శ్లో // కలశస్యముఖే విష్ణుః కంఠేరుద్ర స్సమాశ్రితః

మూలే తత్రోస్థితోబ్రహ్మా మధ్యేమాతృగణా స్మృతాః

కుక్షౌ తు సాగరా స్సర్వే సప్తద్వీపా వసుంధరా

ఋగ్వేదోథ యజుర్వేద స్సామవేదోహ్యథర్వణః

అంగైశ్చ సహితాస్సర్వే కలశాంబు సమాశ్రితాః

(కలశపాత్రకు గంధము,కుంకుమబొట్లు పెట్టి పుష్పాక్షతలతో అలంకరింపవలెను.కలశపాత్రపై కుడి అరచేయినుంచి ఈ క్రింది మంత్రము చదువవలెను.)

శ్లో // గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి

నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు

ఆయాంతు దేవపూజార్థం - మమ దురితక్షయకారకాః

కలశోదకేన పూజా ద్రవ్యాణి దైవమాత్మానంచ సంప్రోక్ష్య

(కలశములోని జలమును పుష్పముతో దేవునిపైనా పూజాద్రవ్యములపైన,తమపైన జల్లుకొనవలెను.తదుపరి పసుపు వినాయకునిపై జలము జల్లుతూ ఈ క్రింది మంత్రము చదువవలెను.)

మం // ఓం గణానాంత్వ గణపతి హవామహే కవింకవీనాముపమశ్రస్తవం

జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత అనశ్శృణ్వన్నూతిభి స్సీదసాదనమ్

శ్రీ మహాగణాధిపతయే నమః ధ్యాయామి,ఆవాహయామి,నవరత్న ఖచిత సింహాసనం సమర్పయామి(అక్షతలు వేయవలెను)

శ్రీ మహాగణాధిపతయే నమః పాదయోః పాద్యం సమర్పయామి

(నీళ్ళు చల్లవలెను)

శ్రీ మహాగణాధిపతయే నమః హస్తయోః ఆర్ఘ్యం సమర్పయామి

(నీళ్ళు చల్లవలెను)

ముఖే శుద్దాచమనీయం సమర్పయామి శుద్దోదకస్నానం సమర్పయామి

(నీళ్ళు చల్లవలెను)

శ్రీ మహాగణాధిపతయే నమః వస్త్రయుగ్మం సమర్పయామి

(అక్షతలు చల్లవలెను)

శ్రీ మహాగణాధిపతయే నమః దివ్య శ్రీ చందనం సమర్పయామి

(గంధం చల్లవలెను)

శ్రీ మహాగణాధిపతయే నమః అక్షతాన్ సమర్పయామి

(అక్షతలు చల్లవలెను)

ఓం సుముఖాయ నమః,ఏకదంతాయ నమః,కపిలాయ నమః,గజకర్ణికాయ నమః,లంబోదరాయ నమః,వికటాయ నమః,విఘ్నరాజాయ నమః,గణాధిపాయ నమః,ధూమకేతవే నమః,గణాధ్యక్షాయ నమః, ఫాలచంద్రాయ నమః, గజాననాయ నమః, వక్రతుండాయ నమః,శూర్పకర్ణాయ నమః, హేరంబాయ నమః, స్కందపూర్వజాయ నమః, ఓం సర్వసిద్ది ప్రదాయకాయ నమః,మహాగణాదిపతియే నమః నానావిధ పరిమళ పత్ర పుష్పపూజాం సమర్పయామి.

మహాగణాధిపత్యేనమః ధూపమాఘ్రాపయామి

(అగరవత్తుల ధుపం చూపించవలెను.)

ఓం భూర్బువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్

సత్యంత్వర్తేన పరిషించామి అమృతమస్తు అమృతోపస్తరణమసి శ్రీ మహాగణాధిపతయే నమః గుడోపహారం నివేదయామి.

(బెల్లం ముక్కను నివేదన చేయాలి)

ఓం ప్రాణాయస్వాహా, ఓం అపానాయస్వాహా, ఓం వ్యానాయ స్వాహా

ఓం ఉదానాయ స్వాహా, ఓం సమానాయ స్వాహా ,మధ్యే మధ్యే పానీయం సమర్పయామి.

(నీరు వదలాలి.)

తాంబూలం సమర్పయామి, నీరాజనం దర్శయామి.

(తాంబూలము నిచ్చి కర్పూరమును వెలిగించి చూపవలెను)

ఓం గణానాంత్వ గణపతిగ్ హవామహే కవింకవీనాముపమశ్రవస్తవం

జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత అనశ్శృణ్వన్నూతిభి స్సీదసాదనమ్

శ్రీ మహాగణాదిపతయే నమః సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి

ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి

అనయా మయా కృత యధాశక్తి పూజాయచ శ్రీ మహాగణాధిపతిః సుప్రీతః సుప్రసన్నో వరదో భవతు

(అనుకొని నమస్కరించుకొని, దేవుని వద్ద గల అక్షతలు ,పుష్పములు శిరస్సున ధరించవలసినది.)

తదుపరి పసుపు గణపతిని కొద్దిగా కదిలించవలెను.

శ్రీ మహాగణాధిపతయే నమః యధాస్థానం ముద్వాసయామి.

(శ్రీ మహాగణపతి పూజ సమాప్తం.)

ప్రాణప్రతిష్ఠపన

అసునీతే పునర్స్మాసుచక్షుఃపునః ప్రాణమిహనో దేహిభోగం జ్యోక్పశ్యేమ సూర్యముచ్చరంత మనమతే మృడయానః స్వస్తి అమృతంవైప్రాణాః అమృతమాపః ప్రాణానేవ యధాస్థానముపహ్వయతే ఉపహితో భవ, స్థాపితోభవ, సుప్రసన్నోభవ, అవకుంఠితోభవ ప్రసీద ప్రసీద ప్రీతిగృహాణ యత్కించిత్ నివేదితం మయా// తదంగ ధ్యానావాహనాది షోడశోపచారపూజాంకరిష్యే // అధ ధ్యానం.

క్షీరాబ్ధి పూజ విధానము

ధ్యానం:

(పుష్పము చేతపట్టుకొని)

శ్లో. దక్షిణాగ్రకరే శంఖం పద్మం తస్యాన్యథః కరే

చక్రమూర్ధ్వకరే వామం, గదా తస్యా న్యధః కరే

దధానం సర్వలోకేశం సర్వాభరణ భూషితం

క్షీరాబ్ధిశయనం దేవ ధ్యాయే న్నారాయణం ప్రభుం

తులసీ ధాత్రీ సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమః // ధ్యాయామి ధ్యానం సమర్పయామి.

(పుష్పము వేయవలెను).

ఆవాహనం:

ఓం సహస్రశీర్ షా పురుషః, సహస్రాక్ష స్సహస్రపాత్,

స భూమిం విశ్వతోవృత్వా, అత్యతిష్ఠ ద్దశాంగులమ్.

తులసీ ధాత్రీ సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమః ఆవాహయామి ఆవాహనం సమర్పయామి.

(పుష్పము వేయవలెను).

ఆసనం:

శ్లో. అనేక హార సంయుక్తం నానామణి విరాజితం

రత్న సింహాసనందేవ ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం

తులసీ ధాత్రీ సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమః రత్నసింహాసనం సమర్పయామి.

(అక్షతలు వేయవలెను.)

పాద్యం:

శ్లో . పద్మనాభ సురారాద్య పాదాంబుజ శుభప్రద

పాద్యం గృహాణ భగవాన్ మయానీతం శుభావహం

తులసీ ధాత్రీ సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమః పాద్యం సమర్పయామి.

(నీరు చల్లవలెను.)

అర్ఘ్యం:

శ్లో. నిష్కళంక గుణారాధ్య జగత్రయ రక్షక,

ఆర్ఘ్యం గృహాణమద్దత్తం శుద్దోదక వినిర్మితం

తులసీ ధాత్రీ సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమః // ఆర్ఘ్యం సమర్పయామి.

(నీరు చల్లవలెను.)

ఆచమనం:

శ్లో. సర్వారాధ్య నమస్తేస్తు సంసారార్ణవతారక

గృహాణ దేవమద్దత్తంపరమాచమనీయకం .

తులసీ ధాత్రీ సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమః ఆచమనీయం సమర్పయామి.

(నీరు చల్లవలెను.)

పంచామృతస్నానం

శ్లో. స్వాపాదపద్మసంభూత గంగాశోభిత విష్ణునం

పంచామృతైః స్నాపయిష్యేతంశుద్ధో దకేనాపిచ //

తులసీ ధాత్రీ సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమః // పంచామృతస్నానం సమర్పయామి.

టహ్దనంతరం శుద్ధోదకస్నానం సమర్పయామి.

(నీరు చల్లవలెను.)

వస్త్రం:

శ్లో. విద్యుద్విలాసరమ్యేణ స్వర్ణవస్త్రేణ సంయుతం,

వస్త్రయుగ్మం గృహణేదం భక్తాదత్తం మయాప్రభో

తులసీ ధాత్రీ సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమః వస్త్రయుగ్మం సమర్పయామి.

ఉపవీతం:

శ్లో.నారాయణ నమస్తేస్తు నాకాధిపతిపూజిత,

స్వర్ణోపవీతం మద్దత్తం స్వర్ణంచ ప్రతి గృహ్యతాం

తులసీ ధాత్రీ సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమః యజ్ఞోపవీతం సమర్పయామి.

గంధం:

శ్లో. రమాలింగన సంలిప్త రమ్య కాశ్మీర వక్షసే

కస్తూరీమిళితం దాస్యే గంధం ముక్తి ప్రదాయకం

తులసీ ధాత్రీ సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమః గంధం సమర్పయామి.

(గంధం చల్లవలెను.)

అక్షితలు:

శ్లో. అక్షతానక్షతాన్ శుభ్రాన్ పక్షిరాజధ్వ జావ్యయ,

గృహాణ స్వర్ణవర్ణాంశ కృపయాభక్త వత్సల

తులసీ ధాత్రీ సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమః // అక్షితాన్ సమర్పయామి.

(అక్షితలు సమర్పించవలెను)

పుష్పసమర్పణం:

చామంతికా వకుళచంపక పాటలాబ్జ పున్నాగ జాజికరవీరరసాల పుష్పై బిల్వ ప్రవాళతులసీదళ మల్లికాభిస్త్వాం

పూజయామి జగదీశ్వర, వాసుదేవః పుష్పాణి పూజయామి.

(పుష్పాములు వేయవలెను)

అథాంగపూజా:

శ్రీకృష్ణాంగపూజా పారిజాతాపహారకాయనమః పాదౌ పూజయామి,

గుణాధరాయ నమః గుల్ఫౌ పూజయామి,

జగన్నాథాయ నమః జంఘే పూజయామి,

జానకీవల్లభాయ నమః జానునీ పూజయామి,

ఉత్తాలతాల భేత్రై నమః ఊరూ పూజయామి,

కమలానాథాయ నమః కటిమ్ పూజయామి,

నిరంజనాయ నమః నితంబర పూజయామి,

నారయణాయ నమః నాభిమ్ పూజయామి,

వామ్నాయ నమః వళిత్రయం పూజ,

కాలాత్మనేనమః గుహ్యం పూజయామి,

కుక్షిస్థాఖిలభువనాయ నమః ఉదరమ్ పూజయామి,

హృషీకేశాయ నమః హృదయమ్ పూజయామి,

లక్ష్మీవక్షస్థలాయ నమః వక్షఃస్థలమ్ పూజయామి,

పార్థసారథయే నమః పార్శ్వే పూజయామి,

మధురానాథాయ నమః మధ్యమ్ పూజయామి,

హరయే నమః హస్తాన్ పూజయామి,

అనిరుద్ధాయనమః అంగుళీః పూజయామి,

శంఖచక్ర గదాశారఙ్గథారిణే నమః బాహూన్ పూజయామి,

వరదాయనమః స్తనౌ పూజయామి,

అధోక్షజాయ నమః అంసౌ పూజయామి,

కంబుకంఠాయ నమః కంఠం పూజయామి,

ఓజిస్వినే నమః ఓష్ఠౌ పూజయామి,

దామోదరాయ నమః దన్తాన్ పూజయామి,

పూర్ణేందునిభవక్త్రాయ నమః ముఖమ్ పూజయామి,

గరుడవాహనాయ నమః గండస్థలమ్ పూజయామి,

నరనారాయణాత్మకాయ నమః నాసికమ్ పూజయామి,

నీలోత్పలదళశ్యామాయ నమః నేత్రే పూజయామి,

భృగ్వాదిమునిసేవితాయై నమః భ్రువౌ పూజయామి,

భృంగరాజవిరాజిత పాదపంకజాయ నమః భ్రూమధ్యమ్ పూజయామి,

కుండలినే నమః శ్రోత్రే పూజయామి,

లక్ష్మీపతయే నమః లలాటమ్ పూజయామి,

శిశుపాలశిరశ్చేత్త్రే నమః శిరః పూజయామి,

సత్యభామారతాయ నమః సర్వాణ్యాంగాని పూజయామి

ధూపం:

శ్లో . దశాంగం గుగ్గులో పేతంచందనాగురువాసితం

ధూపం గృహాణ దేవేశ దూర్జటీనుతసద్గుణా

తులసీ ధాత్రీ సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమః ధూప మాఘ్రాపయామి.

(ఎడమచేతితో గంటను వాయించవలెను)

దీపం:

శ్లో// అజ్ఞాన ధ్వాంతనాశాయ అఖండ లోకశాలినే

ఘృతాక్తవర్తి సంయుక్తం దీపం దద్యామి శక్తితః

తులసీ ధాత్రీ సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమః దీపం దర్శయామి.

(ఎడమచేతితో గంటను వాయించవలెను)

ధూపదీపానంతరం శుద్దాచమనీయం సమర్పయామి

నైవేద్యం:

పృధుకానిక్షుఖండాంశ్చ కదళీఫల కానిచ,

దాపయిష్యే భవత్ప్రీత్యై గృహాణసురపూజిత

(మహా నైవేద్యం కొరకు ఉంచిన పదార్ధముల చుట్టూ నీరు చిలకరించుచూ.)

ఓం భూర్భువ స్సువః, ఓం త తసవితు ర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి, ధియో యోనః ప్రచోదయాత్, సత్యం త్వర్తేన పరిషించామి, అమృతమస్తు, అమృతోపస్తరణ మసి,

(మహా నైవేద్య పదార్ధముల పై కొంచెం నీరు చిలకరించి కుడిచేతితో సమర్పించాలి.)

(ఎడమచేతితో గంటను వాయించవలెను)

ఓం ప్రాణాయస్వాహా - ఓం అపానాయ స్వాహా,

ఓం వ్యానాయ స్వాహా ఓం ఉదనాయ స్వాహా

ఓం సమనాయ స్వాహా ఓం బ్రహ్మణే స్వాహా.

తులసీ ధాత్రీ సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమః నైవేద్యం సమర్పయామి

మధ్యే మధ్యే పానీయం సమర్పయామి.

అమృతాభిధానమపి - ఉత్తరాపోశనం సమర్పయామి

హస్తౌ పక్షాళయామి - పాదౌ ప్రక్షాళయామి - శుద్దాచమనీయం సమర్పయామి.

తాంబూలం:

విస్తీర్ణ సుసంయుక్తం నాగవల్లీ విరాజితం

కర్పూరేణసుసమ్మి శ్రం తాంబూలం స్వీకురుప్రభో

తులసీ ధాత్రీ సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమః తాంబూలం సమర్పయామి.

నీరాజనం:

ప్రదీపితంచ కర్పూర ఖండకైః జ్ఞానదాయినం

గృహాణేదంమయాదత్తం నీరాజనమిదం ప్రభో

తులసీ ధాత్రీ సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమః నీరాజనం సమర్పయామి.

(ఎడమచేతితో గంటను వాయించుచూ కుడిచేతితో హారతి నీయవలెను)

నీరాజనాంతరం శుద్ధాచమనీయం సమర్పయామి

మంత్రపుష్పమ్:

పుష్పాంజలిం ప్రదాస్యామి భక్త్యాభక్తాశ్రయ ప్రభో అనుగ్రహంతుభద్రం మే దేహి దేవేశ్వరార్చిత!

తులసీ ధాత్రీ సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమః మంత్రపుష్పం సమర్పయామి.

( అని మంత్ర పుష్పం సమర్పించి లేచి నిలబడి ముకళితహస్తులై )

ప్రదక్షిణ

ప్రదక్షిణం కరిష్యామి సర్వభ్రమనివారణం సంసార సాగరాన్మాం త్వ ముద్ధరస్య మహాప్రభో ప్రదక్షిణ.

(కుడివైపుగా 3 సార్లు ప్రదక్షిణం చేయవలెను)

శ్లో//యానకాని చ పాపాని జన్మాంతర కృతాని చ

తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదేపదే

పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాపసంభవ

త్రాహిమాం కృపయా దేవి శరణాగత వత్సల

అన్యథా శరనం నాస్తి త్వమేవ శరణం మమ

తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష జనార్దన

ప్రదక్షిణం కరిష్యామి సర్వభ్రమనివారణం.

సంసారసాగరా న్మాం త్వ ముద్ధరస్వ మహాప్రభో.తులసీ ధాత్రీ సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమః ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి.

సాష్టాంగ నమస్కారం:

తులసీ ధాత్రీ సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమః సాష్టాంగనమస్కారన్ సమర్పయామి యస్య స్మృత్యాచ నామోక్త్యా తపః పూజాక్రియాదిషు న్యూనం సంపూర్ణతాం యాతి సద్యో వందేతమచ్యుతం ఏతత్ఫలం

తులసీధాత్రీసమేత శ్రీలక్ష్మీ నారాయణార్పణమస్తు

శ్రీ కృష్ణార్పణమస్తు.

(శ్రీ తులసీ ధాత్రీ సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామి షోడశోపచార పూజ సమాప్తం.)

క్షీరాబ్ధి ద్వాదశి వ్రత కథ

పూర్వము దర్మరాజు రాజ్యము పోగొట్టుకొని తమ్ములతో గూడి ద్వైతవనమందుండగా, నచ్చటికి అనేక ఋషులతోఁ గూడి వ్యాసులవారు వచ్చిరి. అట్లు వచ్చిన వ్యాసుని గని ధర్మరాజు తగుపూజలు సలిపి కూర్చొండబెట్టి తానును వారి యనుజ్ఞ బొంది కూరుచుడి కొంతతడువు మాటలాడి యాయనతో 'స్వామీ! మీరు ఎల్లధర్మములను ఉపదేశించదగిన మహానుభావులు. మీకు దెలియని దర్మసూక్ష్మములు లేవు. మనుష్యులకు సర్వకామములను ఏ యుపాయము చేత సిద్దించునో సెలవిండు, అని యడుగగా వ్యాసుడు 'నాయనా! మంచి ప్రశ్న చేసినావు. ఈ విషయమునే పూర్వం నారదమహాముని బ్రహ్మనడుగగా నాతడు సర్వకామప్రదములగు రెండు వ్రతములు చెప్పినాడు.క్షీరాబ్ధి ద్వాదశి వ్రతము, క్షీరాబ్ధి శయన వ్రతము అను నా రెండు వ్రతములలో క్షీరాబ్ధి ద్వాదశీవ్రతమును నీకు జెప్పెదను వినుము. కార్తిక శుక్ల ద్వాదశి నాడు ప్రొద్దుకూఁకిన తర్వాత పాలసముద్రము నుండి లేచి మహావిష్ణువు సమస్త దేవతల తోడును, మునులతోడును, లక్ష్మీ తోడును గూడి బృందావనమునకు వచ్చి యుండి, యొక ప్రతిజ్ఞ చేసినాడు. ఏమనగా - ఏ మానవుడైనను ఈ కార్తిక శుద్ద ద్వాదశి నాటి కాలమున సర్వమునులతో, దేవతలతో గూడి బృందావనమున వేంచేసియున్న నన్ను లక్ష్మీదేవితో గూడ పూజించి తులసిపూజచేసి తులసికథను విని భక్తితో దీపదానము చేయునోవాడు సర్వపాపములు వీడి నా సాయుజ్యమును బొందును. అని శపథము చేసినాడు గాన నీవును పుణ్యకరమైన ఆ వ్రతమును చేయుము, అని వ్యాసుడు చెప్పగా విని ధర్మరాజు అయ్యా ఈ వ్రతము చేయవలసిన విధాన మెట్టిదో నాకు జెప్పమని యడుగగా వ్యాసిడిట్లు చెప్పదొండగెను. ' దర్మరాజా! ఏకాదశి నాడు ఉపవాసము చేసి ద్వాదశి పారణ చేసికొని సాయంకాలమున మరల స్నానము చేసి శుచియై తులసికోట దగ్గర చక్కగా శుద్ది చేసి ఐదు వన్నెల మ్రుగ్గుల పెట్టి పలువిధముల నలంకరించి తులసీ మాలమందు లక్ష్మీసహితుడైన విష్ణువును తులసిని భక్తితో సర్వోపచారములతోను బూజించి నైవేద్యమైన తర్వాత కొబ్బెర, బెల్లము, ఖర్జూరము, అరటిపండ్లు, చెఱుకుముక్కలు సమర్పించి తాంబూలనీరాజనములొసగి మంత్రపుష్పము పెట్టి పూర్తి చేసి తులసీసహిత లక్ష్మీనారాయణ మహత్మ్యమును దీపదాన ఫలమును విని యనంతరము బ్రాహ్మణునకు గంధపుష్ప ఫలాదులొసగి తృప్తిపరచి వ్రతము పూర్తిచేయవలెను. ఇట్లే మానవుడు చేసినను ఇష్టముంగాంచును. ధర్మరాజది విని దీపదాన మహిమను జెప్పుమని యడుగగా వ్యాసుడు చెప్పుచున్నాడు. 'యుధిష్టిరా! దీపదానమహిమనెవడు చెప్పగల్గును ? కార్తిక శుద్ద ద్వాదశి దినమున బృందావన సమీపమున దీపదానము చేయవలెను. ఒక దీపదానముచే ఉప పాతకములు పోవును. నూఱు చేసిన విష్ణు సారూప్యము గలుగును. అంతకెక్కువగాఁ జేసిన నా ఫలములు నేను జెప్పలేను. భక్తితో నొకవత్తితో దీపము బెట్టిన బుద్దిశాలి యగును. నాలుగు వత్తులు వేసి వెలిగించిన రాజగును. పదివేసిన విష్ణుసాయుజ్యము నొందును. వేయివత్తులు వేసినచో విష్ణురూపుడగును. ఇది బృందావనములో చేసిన యెడల కురుక్షేత్రమందు జేసినంత ఫలము గలుగును. దీనికి ఆవునేయి మంచిది. నూవులనూనె మధ్యమము. తేనె యదమము. ఇతరములైన అడవినూనెలు కనీసము, ఆవునేయి జ్ఞానమోక్షముల నొసగును. నువ్వుల నూనె సంపదను కీర్తినిచ్చును. ఇప్పనూనె భోగప్రదము, అడవినూనె కామ్యార్థప్రదము, అందులో ఆవనూనె మిగుల కోరికలనిచ్చును. అవిసెనూనె శత్రుక్షయకారి. ఆముదము ఆయుష్షును నాశనము చేయును. బఱ్ఱె నేయి పూర్వపుణ్యమును దొలగించును. వీనిలో కొంచమైన ఆవునేయి కలిసిన దోషపరిహారమగును. ఈ దీపదానములవలననే యింద్రాదులకు వారివారి పదవులు దొరకినవి. దీనివలన ననేక మహిమలు కలుగును. ద్వాదశి నాడు దీపదానము చేసిన శూద్రాదులను ముక్తిగాంతురు. బృందావనమందొక మంటపము గట్టి వరుసగా దీపపంక్తులు పెట్టి యున్న నెవడు చూచి యానందపడునో వాని పాపములన్నియు నశించును. ఈ దీపదాన మహిమను విన్నవారు చదివినవారు మోక్షప్రాప్తులగుదురు.' అని చెప్పగా విని ధర్మరాజు మహానందమును జెంది తులసీ మహత్మ్యమును జెప్పమని కోరగా వ్యాసుడు చెప్పుచున్నాడు. తులసీ మహిమ పూర్తిగా బ్రహ్మ కూడా చెప్పలేడు. అయినను ఆ బ్రహ్మ నారదునకు జెప్పినట్లు చెప్పుచున్నాను. కార్తికమాసమందు తులసిపూజ చేయువారుత్తమలోకమును బొందుదురు. తుదకు ఉత్థానద్వాదశినాడైనను తులసిపూజ చేయనివారు కోటిజన్మలు చండాలులై పుట్టుదురు. తులసిమొక్క వేసి పెంచినవారు దానికెన్ని వేళ్ళు పారునో అన్ని మహాయుగములు విష్ణులోకమందుందురు. తులసీదళములు కలిసిన నీట స్నానమాడినవారు పాపము వదలి వైకుంఠమునకు బోవుదురు. బృందావనము వేసినవారు బ్రహ్మత్వము బొందుదురు.తులసి యున్న ఇంటిలో గాపురము చేయుట, తులసితోట వేసి పెంచుట, తులసిపేరులు దాల్చుట, తులసిదళము భక్షించుట, పాపహరములు. తులసి యున్న చోటునకు యమకింకరులు రారు. 'యాన్ములే....' అను మంత్రమును బఠించు వారికి నే బాధయు నంటదు. యమకింకరులు దగ్గరకు రారు. ఈ తులసి సేవయందే ఒక పూర్వకథను జెప్పెద వినుము. కాశ్మీరదేశ వాసులగు హరిమేధసుమేదులను నిద్దఱు బ్రాహ్మణులు తీర్థయాత్ర చేయుచుండి యొక స్థలములో నొక తులసితోటను జూచిరి. చూచినతోడనే వారిలో సుమేధుడు భక్తితో బ్రదక్షిణ నమస్కారములు చేసెను. అది చూచి హరిమేధుడిదియే మని యడిగెను. సుమేధుడు ఇక్కడ నెండబాధగా నున్నదని యొక మఱ్ఱిచెట్టునండకుజేరి తులసికథ నిట్లు చెప్ప దొడఁగెను. పూర్వము దేవాసురులు సముద్రము చిలికినప్పుడు దానియందు ఐరావతము కల్పవృక్షము మొదలుగా నెన్నియో యుత్తమ వస్తువులు పుట్టెను. తర్వాత లక్ష్మీదేవి పుట్టెను. తర్వాత అమృతకలశము పుట్టెను. ఆ యమృతకలశమును జేత బూని మహానందము నొంది విష్ణువు ఆ కలశముపై నానందబాష్పములు విడువగా నందు ఈ తులసి పుట్టినది. ఇట్లు పుట్టిన తులసిని, లక్ష్మిని విష్ణువు పరిగ్రహించెను. ఇట్లు పరిగ్రహించి వేడుకతో తులసిని తొడమీద నుంచుకొని నీవు లోకముల పావనము జేయగలదానవగు మని ప్రేమ మీఱ బలికెను. అందువలన నారాయణునకు తులసియందు ఎక్కువ ప్రీతి కలిగియుండును. అందువలన నేను తులసికి మ్రొక్కినాను. అని యా బ్రాహ్మణుండు పలుకుచుండగానే యామఱ్ఱి ఫెళ్ళుమని విరిగి కూలెను. ఆ చెట్టు తొఱ్ఱలోనుండి ఇద్దరు పురుషులు వెలుపలకు వచ్చి దివ్యతేజముతో నిలిచియుండగా హరిమేధ సుమేధులు చూచి దివ్యమంగళ విగ్రహధారులైన మీ రెవరిని యడిగిరి. ఆ పురుషులను మీరే మాకు తండ్రులు గురువులు నని చెప్పి వారిలో జ్యేష్ఠుడిట్లనియెను. ' నేను దేవలోకవాసిని, నాపేరు ఆస్తికుడందురు. నేనొకనాడు అప్సరసలతోగూడి నందనవనమున గామవికారముచే మైమరచి క్రీడించుచుండగా మేము ధరించిన పుష్పమాలికలు పైనిబడి మా సందడివలన సమాధి చలించి యచ్చట తపస్సు చేయుచున్న రోమశమహాముని నన్ను చూచి నీవు మదోన్మత్తుడవై యిట్లు నాకలజడి కలిగించితివి గావున బ్రహ్మ రాక్షసుడవగు మని శపించి తప్పిదము పురుషునిది గాని స్త్రీలు పరతంత్రలు గనుక వారివలన తప్పు లేదని వారిని క్షమించి విడిచెను. అంతట నేను శాపమునకు వెఱచి యా మునిని వేడి ప్రసన్నునిజేయగా నాయన యనుగ్రహము గలిగి నీవెప్పుడు తులసిమహిమను, విష్ణుప్రభావమును విందువో అప్పుడు శాపవిముక్తుడవుగుదువని అనిగ్రహించెను. నేనును బ్రహ్మరాక్షసునై యీ చెట్టు తొఱ్ఱలో జేరి మీ దయవలన నేడు శాపమోక్షణము నొందితిని' అని జెప్పి , రెండవవాని వృత్తాంతము చెప్పసాగెను. ' ఈయన పూర్వమొక మునికుమారుడిగానుండి గురుsకులవాసము జేయుచుండి ఒక యపరాధము వలన బ్రహ్మరాక్షస్సువగు మని గురువు వలన శాపము బొంది యిట్లు నాతో గలసియుండెను. మేమిద్దఱమును మీదయ వలన బవిత్రులమైతిమి. ఇట్లు మమ్మనుగ్రహించినారు గాన మీతీర్థయాత్రాఫలము సిద్దించినది.' అని చెప్పి వారిరువురు వారిత్రోవను బోవగానే బ్రాహ్మణులిద్దఱు ఆశ్చర్యానందములతో మునిగి తులసి మహిమను బొగడుచు యాత్రముగించుకొని యిండ్లకేగిరి. ఈ కథను ఎవరు విన్నను వారు సర్వపాపములు వదలి యుత్తమగతిని జెందుదురని బ్రహ్మ నారదునకు జెప్పెను.' అని వ్యాసుడు చెప్పి ధర్మరాజా ! ఇట్లు క్షీరాబ్ధివ్రతము జేసి తులసికథ విన్నవారుత్తములగుదురు.


               *_🌸శుభమస్తు🌸_*

     🙏సమస్త లోకా సుఖినోభవంతు 🙏

జలుబు నివారణ కొరకు -

 చిన్నపిల్లల అనారోగ్య సమస్యల నివారణ కొరకు - 1


 * జలుబు నివారణ కొరకు - 


     చిన్నపిల్లలకు జలుబు చేసిన రోజున తమలపాకులు కు ఆముదం రాసి వెచ్చచేసి రొమ్ముపైన , పొట్టపైన , తలపైన వేసి కట్టు కట్టుచున్న జలుబు హరించును . 


 *  కడుపు నొప్పి హరించుట కొరకు - 


      నీరుల్లిపాయను కుమ్ములో (పొయ్యిలో ) వేసి ఉడికించి దంచి రసము పిండుకొని కడుపునొప్పి గల పిల్లలకు ఒక పావు తులము రసము తాగించిన చిన్నపిల్లల కడుపునొప్పులు వెంటనే హరించును . 


 *  చిన్నపిల్లల శరీరం బలపడుటకు - 


     శిశువు పుట్టిన దగ్గర నుంచి 5 సంవత్సరముల వయస్సు వచ్చువరకు ప్రతిరోజూ నువ్వులనూనె ఒంటికి రాసి రెండు గంటలు ఆగిన తరువాత నలుగుపెట్టి స్నానం చేయించుచుండిన యెడల శరీరము నందలి ఎముకలు మిక్కిలి గట్టిపడి క్రిందపడినను విరగకుండా ఉండును . మరియు శరీరము కాంతివంతముగా తయరగును . 


 *  మాటలు రాని చంటిపిల్లలకు - 


     మర్రి ఊడలు మెత్తగా నూరి చిక్కని గంధము తీసి నాలుకపై వేసి రుద్దుతుండవలెను . ప్రతిరోజూ ఇలా చేయుచుండిన త్వరగా మాటలు వచ్చును . 


 *  చిన్నపిల్లల కాళ్లు , చేతులు బలహీనమై నడవకుండా ఉండిన - 


   పచ్చి ఆవుపాలలో ఉండు వెన్నని తీసి గోరోజనము కొంచం ఆ ఆవు వెన్నకి కలిపి ప్రతిరోజూ పొట్టకి , కాళ్ళకి , చేతులకు బాగా రుద్దుతున్న కొంతకాలానికి మంచి బలం కలిగి నడవటం జరుగును . 


 *  చిన్నపిల్లల విరేచనాలు తగ్గుటకు -

    మారేడుకాయ గుజ్జు ౩ గ్రాములు నీళ్లతో కలిపి తాగించిన చిన్నపిల్లల విరేచనాలు తగ్గును . 


 *  పాలు కక్కుట తగ్గుట కొరకు - 


       ఇంగువను నీళ్లతో అరగదీసి కడుపు పైన లేపనం చేయుచుండిన పిల్లలు పాలు కక్కుట తగ్గును . 


       మరింత విలువైన సమాచారం కొరకు నేను రచించిన గ్రంథాలు చదవగలరు . 


  

   గమనిక  -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా 

క్షీరాబ్ది ద్వాదశి

 *ॐ        క్షీరాబ్ది ద్వాదశి* 

          *(చిలుకు ద్వాదశి)*


*1. ఇళ్ళల్లో తులసీ*  *బృందావనంలో తులసి మొక్కవద్ద ఉసిరి కొమ్మ గ్రుచ్చి, సాయంకాలవేళ "తులసీ ధాత్రీ సహిత లక్ష్మీనారాయణ" పూజ - " క్షీరాబ్ది ద్వాదశీ" వ్రతంగా ఆచరించడం.* 

*2. ఆనాటి సాయంత్రమే విష్ణ్వాలయాలలో విష్ణుమూర్తి దర్శనం చేసికొని, మోహినీ రూపంలో స్వామి పంచియిచ్చే "అమృతం" పొందడం.* 

    *మనకి ఒక సందేహం కలుగుతుంది. "ఆ అమృతం స్వీకరిస్తే, మనకి అమరత్వం సిద్ధిస్తుందా?" అని.* 

    *కానీ మనకి శాశ్వతమైనదేదో తెలిపే జ్ఞానాన్ని అందించి, తద్వారా శాశ్వతత్వాన్ని అనుగ్రహిస్తాడు స్వామి.* 

    *మెదడనే మంధర పర్వతాన్ని కవ్వంగా చేసికొని, నరాలనే వాసుకితో క్రియగా చిలకాలి.*

    *కామక్రోధాది విషం వస్తుంది. దాన్ని మనలోని చిదానందరూపుడైన శివునకర్పించాలి.* 

    *తదుపరి వచ్చేవన్నీ మన సాధనలో ఉత్పన్నమయ్యేవిగా అన్వయించుకుంటూ ముందుకు సాగాలి.* 

    *చివరకి మనలో శాశ్వతమైన  "ఆత్మ" అమృతంగా వస్తుంది. అది తెలుసుకుని మనం  చిరంజీవులమవుతాం.* 


                    *=x=x=x=* 


  *— రామాయణంశర్మ* 

            *భద్రాచలం*

నమస్కార ప్రక్రియ

 నమస్కార ప్రక్రియ 


మనకున్న ఆస్తి అంతా నమస్కార క్రియే. భగవత్పాదుల వారు ఒకప్పుడు కనకధారా స్తోత్రంతో లక్ష్మి దేవిని ఉద్దేశించి ప్రార్థించారు. ఒక బీద బ్రాహ్మణ వనితకోసం ఈ స్తోత్రాన్ని ఆయన చెప్పారు. ఆయనకు స్వయంగా కావలసినది ఏదీ లేదు. కానీ మహాలక్ష్మిని ప్రార్థించి ఆమె దర్శనమిచ్చిన పిదప ఆమెను దేనినీ కోరకుండా ఉండడానికీ లేదు. అందుచేత ఆయన నమస్కారమనే సంపదను మాత్రం ఆమెవద్ద కోరుకుంటారు.


సంపత్కరాణి సకలేంద్రియనందనాని 

సామ్రాజ్యదాన నిరతాని సరోరుహాక్షీ 

త్వద్వందనాని దురితోద్ధరణోద్యతాని 

మామేవ మాతరనిశం కలయంతునాన్యే ||


కట్టకడపట ‘నాన్యే’ అన్న పదప్రయోగం చేశారు ఆచార్యులు. ‘మహాలక్ష్మీ! నేను చేసే ఈ నమస్కార క్రియను మించిన సంపద వేరే ఏదీ అక్కరలేదు. త్వద్ వందనాని ఏవ – నిన్ను ఉద్దేశించి చేసే ఈ నమస్కారము మాత్రము “మామ్ – నన్ను – అనిశం – ఎల్లప్పుడూ, కలయంతు – చేరుగాక – నాకు కలుగు గాక – నాన్యే – ఇతరము కాదు” అని ఆచార్యులు ప్రార్థించారు. 


అమ్మవారికి చేసే ఆ నమస్కారం ఎటువంటిది? సంపత్కరాణి – సంపదలు కలిగించునది. సకలేంద్రియ నందనాని – అన్ని ఇంద్రియములను సంతోషపెట్టునది. సామ్రాజ్య దాన నిరతాని - అంతేకాదు ఆ నమస్కారము సామ్రాజ్యమునే ఇవ్వగల శక్తి గల యట్టిది. లలితా సహస్ర నామములలో “రాజరాజేశ్వరి రాజ్యదాయిని రాజపీఠ నివేశిత నిజాశ్రితా” – అన్న నామములున్నవి. రాజ్యమును ఇచ్చుటకునూ, తన ఆశ్రితులను రాజపీఠం అనగా సింహాసనమందు కూర్చోపెట్టుటకు అమ్మవారికి అనుగ్రహ శక్తి కలదు.


ఆ నమస్కారానికి మరొక శక్తి కలదు. అది, దురితోద్ధరణోద్యతాని – దురితములు అంటే పాపములు దురితముల నుండి ఉద్ధరించుటకు ఉద్యమించే శక్తి అంటే మన పాపములను ఆ నమస్కారం పోగొడుతుంది. దీనికి మరొక పాఠాంతరమును చూస్తున్నాం. అది “దురితాహరణోద్యతాని” వ్యాకరణ యుక్తంగా హరణ, ఆహారణ రెండూ ఒక్కటే. హరణ అంటే పోగొట్టుట, ఆహరణ అంటే తీసుకొని వచ్చుట అనే అర్థం కూడా ఉంది. అపుడు దురితములను తీసుకొని వస్తుందనే అపార్థం ఔతుంది. అందుచేత “దురితోద్ధరణోద్యతాని” అనేదే సరియైన పాఠం. ఆమె మన నమస్కార క్రియ చేత దురితములను వ్రేళ్ళతో పెకలించగలదు.


మామేవ అన్న పదప్రయోగంలోని ‘ఏవ’ అను పదమును – వందనాని అనే పదముతో కలిపి చదువుకోవాలి. వందనాని ఏవమామ్ మాత అనిశం కలయంతు – నాన్యే – అనగా ఈ వందనం మాత్రం, వేరే ఏదీ కాదు – నన్ను వచ్చి చేరుగాక అని ఆచార్యుల భావం.


ఆచార్యుల వారు ప్రశ్నోత్తర రత్నమాలికను వ్రాశారు. అందులో ప్రశ్నలు, వానికి ఉత్తరాలు వుంటాయి. అందులో ఒక ప్రశ్న; కింవిషం? విషము ఏది? అని ప్రశ్న దానికి జవాబు – “అవధీరణా గురువు” – గురువును అవమర్యాద చేయడమే విషం అని ఉత్తరం. అందులోనే మరొక్క ప్రశ్న ఉంది. పాతుం కర్ణాంజలిభిః “కిం అమృతం?” శ్రవణామృతము వుండేదేది? దానికి బదులు –“సదుపదేశం”, “కిం ఉపాదేయం?” దేనిని మనం గ్రహించ వలసినది? – “గురు వచనం. ఉపాదేయము గురువచనమే. వారి ఉపదేశములే మనకు శిరోధార్యములు. “కో గురుః? – గురువెవ్వరు?” – “యో అధిగతతత్త్వః శిష్యహి తాయోద్యతః సతతం” – గురువు తత్త్వాన్వేషణ చేసి తత్త్వజ్ఞుడై ఉండాలి. అతడు అనుభవశాలిగా ఉండవలె. అట్టి గురువు, అన్ని కాలములలోనూ శిష్యుని హితాన్ని ఉద్దేశించి పాటుపడుతూ ఉంటాడు. “శిష్యహి తాయోద్యతః సతతం”.


శిష్యుని హితమేది? అతనిని కర్మ బంధం నుండి తప్పించి, సంసార విమోచనతో అతనికి మోక్ష సౌఖ్యం కల్గించడమే గురువు చేసే హితచర్య. గురువుకు చేసే నమస్కార క్రియ శిష్యునికి ఆ హితాన్ని చేకూరుస్తుంది. గురువు యొక్క కృపాధార అనే కనకధార అతనిపై వర్షిస్తుంది. అందుచేత మనకు ఆ ఒక్క నమస్కారమనే సంపద ఉంటే చాలు. వేరే ఏదీ అక్కరలేదు. 


“తస్మై శ్రీ గురవే నమః”


--- శ్రీకార్యం చల్లా విశ్వనాథశాస్త్రి గారి ‘ఆచార్యవాణి’ ప్రథమ సంపుటం నుండి


#KanchiParamacharyaVaibhavam #Paramacharya

దుర్గా పంచరత్న స్తోత్రం*

 🙏 *దుర్గా పంచరత్న స్తోత్రం* 🙏



 *కంచి కామకోటి పీఠాధిపతులు జగద్గురు శంకరాచార్య శ్రీశ్రీశ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి విరచితం.*


తే ధ్యాన యోగానుగతాపస్యన్ 

త్వామేవ దేవీం స్వగుణైర్నిగూఢాం

త్వమేవ శక్తి హి పరమేశ్వరస్య 

మాం పాహి సర్వేశ్వరి మోక్షధాత్రి . 1



దేవాత్మ శక్తీహీ శ్రుతివాక్య గీత

మహర్షిలోకస్య పురః ప్రసన్న

గుహాపరం వ్యోమ సద ప్రతిష్ఠ 

మాం పాహి సర్వేశ్వరి మోక్షధాత్రి . 2



పరాస్యశక్తిహి వివిధైవ శ్రూయసే 

శ్వేతాశ్వ వాక్యోదిత దేవి దుర్గే

స్వాభావికీజ్ఞానబలక్రియార్తే

మాం పాహి సర్వేశ్వరి మోక్షధాత్రి . 3



దేవాత్మ శబ్దేన శివాత్మ భూత 

యత్కూర్మ వాయవ్య వాచో వివృత్య

త్వం పాశవిఛ్చేదకరి ప్రసిద్ధ

మాం పాహి సర్వేశ్వరి మోక్షధాత్రి . 4



త్వం బ్రహ్మ పుచ్చా వివిధా మయూరీ 

బ్రహ్మ ప్రతిష్ఠాసి ఉపతిష్ఠ గీత 

జ్ఞాన స్వరుపాత్మదయా౭ఖిలానాం

మాం పాహి సర్వేశ్వరి మోక్షధాత్రి . 5


🙏🙏🌹☘️🌷🪷🌺

ఆర్థిక నిపునత్వం

 *వైశ్యుని అద్భుతమైన ఆలోచన* 


*తెలంగాణాలోని ఒక కుగ్రామం లో ఒక చిన్న కిరాణా షాప్ నిర్వహిస్తున్న ఒక సామాన్య శంకరయ్య గుప్త అనే వైశ్యుడు సూచించిన ఒక అద్భుతమైన సూచన.*


*మన కరెన్సీ నోట్ లకు కూడా ముద్రించిన సంవత్సరాన్ని బట్టి ఐదు సంవత్సరాల ఎక్స్పైరీ సంవత్సరాన్ని విదించినట్లైతే, ఆయా సంవత్సరాలలో  విధిగా బ్యాంకులకు, తన  ఖాతాలో జమచేసుకోవాలి, మార్చుకోవడానికి వీలుండకూడదు. ఈ విధంగా చేస్తే బ్లాక్ మనీ తగ్గి ఆన్లైన్ ట్రాన్జాక్షన్స్ 100% పెరుగుతాయి. ప్రపంచ చరిత్రలో మొదటి సారి అవుతుంది అంటాడు.*


*సాద్యా సాద్యాలు ఎలావున్నా .ఆర్థిక నిపునత్వం వైశ్యుని రక్తంలో ఉందని నిరూపించాడు.*

మహాకాళేశ్వరం – ఉజ్జయిని

 Sri Siva Maha Puranam -- 10 By Pujya Guruvulu Brahmasri Chaganti Koteswara Rao Garu


మహాకాళేశ్వరం – ఉజ్జయిని


అవంతికాయాం విహితావతారం, ముక్తి ప్రదానాయచ సజ్జనానాం!

అకాల మృత్యోః పరిరక్షణార్థం వందే మహాకాల మహాసురేశం!! (ద్వాదశ జ్యోతిర్లింగస్తోత్రం – 3)

ఈ శ్లోకం ద్వారా ఉజ్జయినిలో ఉన్న మహాకాళుడికి నమస్కారం చేస్తున్నాము. సజ్జనులకు ముక్తినిచ్చువాడు. అయితే సజ్జనుడు అనగా ఎవరు? పరమేశ్వరార్చన చేసేవాడికి సదాచారము తెలిసి ఉండాలి. శౌచము తెలిసి ఉండాలి. ఈ సదాచారం పథ్యం లాంటిది భగవద్భక్తి ఔషధం లాంటిది. ఈ ఔషధం వేసుకుని పథ్యం పాటిస్తే భవరోగం తగ్గుతుంది. లౌకికంగా బయటవచ్చే వ్యాధికి, భగవత్సంబంధంలో వచ్చే భవరోగమునకు ఒక తేడా ఉన్నది. ఒకనికి ఆచారం, శౌచం తెలియదు. తెలిసి మానిన వాడు కాదు. ఆయన గుండెల నిండా భక్తి ఉన్నది. శౌచం లేకపోయినా వాని భక్తి వృధా పోదు. సదాచారం తెలిసీ దానిని విడిచిపెట్టి భక్తిని పాటిస్తే అది మాత్రం అక్కరకు రాదు. ఆచారం తెలిస్తే పాటించాలి. తెలిసి ఉన్నది అనుష్ఠాన పర్యంతం రావాలి. ఏమీ తెలియనప్పుడు తెలియక పొరపాటు చేసినా ఈశ్వరుడు దానిని పక్కన పెట్టి ఏలుకుంటాడు. మాహాకాళ దర్శనమునందు ‘సజ్జనానాం’ అనేమాట ఎందుకు వాడారో గుర్తెరిగి ప్రవర్తించాలి. అందుకే మహాకాళుడు. కామమును పోగొట్టు వాడు, కాలారి, కామారి అనే రెండు మాటలను పరమశివునికి వాడతారు. కాలారిగా అనుగ్రహం కావాలన్నా, కామారిగా అనుగ్రహం కావాలన్నా ఉన్న స్థాయిలో అనుష్ఠానమునకు తెచ్చుకుని మాత్రమే ఈశ్వరుని యందు ప్రవర్తించాలి.

పూర్వకాలంలో ఉజ్జయినికి అవంతి అని పేరు. అవంతి అనగా స్త్రీ అని, అక్క అని రెండు అర్థములు. అవంతి సాక్షాత్తు జగదంబ అయిన అమ్మవారి స్వరూపము. ఏడు మోక్షపురులు ఉన్నాయి. వీటిలో జగద్విఖ్యాతి గాంచిన పట్టణం అవంతి – ఉజ్జయిని. ఈ ఉజ్జయిని ఒకపక్క మహా కాళుడి చేత ఎంత ప్రసిద్ధి పొందిందో మహాకాళి చేత కూడా అంత ప్రసిద్ధి పొందింది. అక్కడ ఉన్న రెండు స్వరూపములు కూడా కాల స్వరూపములై, లయకారకములై ఉంటాయి. ఉజ్జయిని ఒకానొకప్పుడు అంతర్జాతీయ ఖ్యాతిని చూరగొన్న పట్టణం. భోజరాజు, మహాకవి కాళిదాసు ఇద్దరూ నడయాడిన ప్రాంతం ఉజ్జయిని. పూర్వకాలంలో ఈ ఉజ్జయిని పట్టణమునందు వేదప్రియుడు అనబడే ఒక బ్రాహ్మణుడు త్రికాలములయందు సంధ్యావందనం చేస్తూ శివార్చనా శీలుడై షట్కాలముల యందు శివపూజ చేసి వేదము ఏమి చెప్పిందో దానియందు అపారమయిన ధృతి కలిగి ఉండేవాడు. వేదప్రియుడికి నలుగురు కుమారులు. నలుగురు సుగుణోపేతులే. తండ్రిగారు ఎంత ధర్మానుష్టాన పరుడో కొడుకులు కూడా అంతటి ధర్మానుష్టాన పరులు. దొరికిన దానితో తృప్తిగా జీవించేవారు. ఆయన పెద్ద కొడుక్కి దేవప్రియుడు, రెండవ వానికి ప్రియమేథుడు, మూడ వానికి సుకృతుడు, నాల్గవ వానికి సువ్రతుడు అని పేర్లు పెట్టుకున్నాడు. ఆ నలుగురు పిల్లలు వృద్ధిలోకి వచ్చారు.

ఆ పక్కనే ఉన్న పర్వత శిఖరములలో ఒక రాక్షసుడు బయలుదేరాడు. ఏదయినా కష్టం వచ్చినప్పుడే పరీక్షకు నిలబడినప్పుడే వాటి వాటి వ్యక్తిత్వములు ప్రకాశించి నిలబడతాయి. ఈశ్వరుడు ఆ కుటుంబమును ప్రకాశింపచేయాలనుకున్నాడు. భగవంతుడు భక్తుల యెడ అంత ఉదారుడై ఉంటాడు. దూషణుడు అనే రాక్షసుడు లోకం అంతటా బాధలు పెడుతూ అందరినీ ఇబ్బంది పెడుతూ చిట్టచివరకు ఎక్కడా ఎవరూ ఈశ్వరార్చన చేయలేని స్థితిని కల్పించాడు. ఒక్క ఉజ్జయినిలో మాత్రం ఈ నలుగురు పిల్లలు శివార్చన చేస్తున్నారు అని తెలుసుకుని వాళ్ళ దగ్గరకు వచ్చి నన్ను మాత్రమే అర్చించాలి, శివపూజను విడిచిపెడతారా లేక లింగమును ధ్వంసం చేయనా? అని అడిగాడు వాళ్ళు కనీసం బెదరకుండా శంకరుని రక్షణ యందు ఉండగా భయం ఏమిటి అని వాళ్ళు అనుకున్నారు. దూషణుడు ఈ నలుగురు బ్రాహ్మణుల మీద కత్తి ఎత్తి కంఠం మీద వేయబోతున్నా వాళ్ళు కదలకుండా హర ఓం హర అంటూ అలానే ఆరాధన చేస్తూ కూర్చున్నారు. ఏ రూపంలో వస్తున్న మృత్యువునైనా ఈశ్వరుడు తప్పించగలడు. అక్కడ ఉన్న చిన్న పార్థివ లింగం నుండి మహాకాళ స్వరూపంతో పరమేశ్వరుడు బయటకు వచ్చాడు. ఇప్పుడు చూడబడే రూపం సామాన్యమయిన రూపం కాదు. స్వామి మహాకాళ రూపంలో వచ్చి ఒక్కసారి హుంకరించాడు. ఆ హుంకారమునకు దూషణుడి సైన్యములు బూడిద రాశులై పడిపోయాయి. ఆ రూపము అత్యంత వేడితో వచ్చింది కానీ ఆ వేడి అక్కడే కూర్చున్న బ్రాహ్మణ కుమారులను చెణకలేదు. బ్రాహ్మణ కుమారులు ఆ రూపమును చూసి ఆశ్చర్యం పొంది చచ్చిపోయే వారిని చంపకుండా మిగిల్చిన రూపంగా భావించి స్తోత్రం చేశారు. ఈశ్వరానుగ్రహం ఉన్నవాడికి అపమృత్యువు లేదు.

ప్రదోష వేళలో శివమహాపురాణాంతర్గతంగా ఇటువంటి క్షేత్రములకు సంబంధించిన మాటలు చదవడం చేత శాబ్దికంగా ఉజ్జయినిలో మహాకాళ దర్శనం చేసినట్లే. ఆ ఫలితం ఉత్తరక్షణం ఖాతాలో పడిపోతుంది. పిమ్మట ఆ స్వరూపము చూసి దేవతలు పొంగిపోయారు. వాళ్ళందరూ వచ్చి స్తోత్రం చేశారు. ‘ఈశ్వరా! మీరు ఇక్కడ లింగరూపంలో వెలవ వలసింది. కేవలం ఈ బ్రాహ్మణ కుమారులే కాక మిమ్మల్ని నమ్మిన వారెందరో ఉంటారు. సజ్జనులు, నీమీద పూనిక ఉన్నవాళ్ళు, నీవు ఉన్నావని నమ్మినవాళ్ళు ఎవరు ఇక్కడకు వస్తున్నారో వారు కాలమునందు పడిపోకుండా చూడవలసిన బాధ్యతా అటువంటి అనుగ్రహ ప్రసరణ కొరకు నీవు ఇక్కడ స్వయంభూలింగముగా ఉండాలని అడిగితే స్వామి తప్పకుండా ఉంటాను అని ప్రసన్నమూర్తియై మహాకాళలింగముగా ఆవిర్భవించాడు.

ఉజ్జయినిలో శివలింగములు మూడు అంతస్తులుగా ఉంటాయి. క్రింద ఉండేది మహాకాళ లింగము, మధ్యలో ఓంకార లింగము, ఆపైన నాగేంద్ర స్వరూపమయిన లింగము ఉంటాయి. క్రింద ఉండే మహాకాళ లింగమును భక్తులు వెళ్లి దర్శనం చేసుకుంటూ ఉంటారు. ఉజ్జయినిలో ఈ శివలింగం దగ్గరే ఒక ఆశ్చర్యకరమయిన సంఘటన జరిగింది. చంద్రసేనుడనే ఒక మహారాజు ఉజ్జయినీ రాజ్యమును పరిపాలిస్తున్నాడు. ఆయన గొప్ప శివభక్తుడు. ప్రతిరోజూ శివార్చన చేసేవాడు. ఈ శివార్చనకు మెచ్చి పరమశివునికి అత్యంత సన్నిహితుడయిన మణిభద్రుడు చంద్రసేనుడికి ఒక మణిని బహూకరించాడు. ఈ మణిని నీవు కంఠంలో పెట్టుకుంటే ఇది రాగి, ఇనుము, ఇత్తడి దేనిని తగిలినా అవి బంగారంగా మారిపోతాయి. దేశంలో క్షామం ఉండదు. అతివృష్టి ఉండదు. నీ దేశంలో అందరూ సుభిక్షంగా ఉంటారని చెప్పాడు. చంద్రసేనుడు ఆ మణిని కట్టుకుని తిరుగుతూ ఉండేవాడు. మిగిలిన రాజులందరూ ఆ రాజు ఎందుకు అలా సుఖపడుతున్నాడో తెలుసుకుని ఆయన వద్దవున్న మణిని ఎత్తుకు వచ్చెయ్యాలని భావించారు. అందరూ కలిసి చంద్రసేనుడి మీదికి యుద్ధానికి బయలుదేరారు. లోపల వున్న వేగుల వలన విషయం తెలుసుకున్న రాజు యుద్ధం చేస్తే గెలవడం చాలా కష్టం అని గ్రహించి యుద్ధానికి వెళ్ళడం అంటే నాకు సంతోషమే. లోకంలో ఉన్న రాజులందరూ కట్ట కట్టుకుని వస్తే నేను ఏకాకిని’ అన్నాడు. ఆయనయందు ధర్మలోపం లేదు. యుద్ధం చేయడానికి వచ్చిన రాజులలో ధర్మలోపం ఉన్నది. తానిప్పుడు ఏం చేయాలా అని ఆలోచించి ఎవరు నాకీ మణిని ఇవ్వడానికి కారకుడో వాడి పాదములే నేను గట్టిగా పట్టుకుంటానని భావించి వెంటనే దేవాలయమునకు వెళ్లి పూనికతో శివారాధన చేయడం ప్రారంభించాడు. ఆ సమయంలో ఆయన భక్తి ప్రవిఢవిల్లి ఉన్నది.

ఆ సమయంలో ఒక గోపాలబాలుడు దేవాలయంలో దర్శనం చేసుకోవడానికి వచ్చాడు. ఆ పిల్లవాడు తల్లితో కలిసి లోపలి వచ్చి నమస్కారం చేసి బయటకు వెళ్ళిపోయారు. ఇద్దరూ దర్శనం చేసినా గోపకాంత మనసు చిన్నపిల్లవాడి మనస్సంతగా భగవంతుని యందు కేంద్రీకరించబడలేదు. రాజు చేస్తున్న పూజను చూసిన పిల్లవాడు తానుకూడా అలాగే పూజచేయాలి అనుకున్నాడు. వాడికి పూజ చేయడం రాదు. వాడు తల్లితో ఇంటికి వెళ్ళిపోయాడు. వాని దృష్టి అంతా రాజు చేస్తున్న లింగార్చన మీద ఉన్నది. అర్చన చేయడానికి శివలింగం కోసం వెతకగా ఒక గుండ్రాయి కనిపించింది. వాడు దానిని రాయిగా కాక శివలింగంగా చూశాడు. పూజచేయడం రాదు కాబట్టి చుట్టుపక్కల చెట్ల నుంచి కొన్ని ఆకులు తెచ్చి పూజచేయడం ప్రారంభించాడు. రాజు చేస్తున్న పూజయందు సదాచారం ఉన్నది. ఈ పిల్లవాడు చేసున్న పూజయందు సదాచారం లేదు భక్తి ఉన్నది. వాడికి అభిషేకం, పురుషసూక్తం తెలియదు నైవేద్యం లేదు. వాడు ఒక్కొక్క ఆకు తీసి శివ అంటూ వేస్తున్నాడు. వాడు మనస్సులో అలాగే మహాకాళలింగానికి పూజ చేస్తున్నాడు. పిల్లవానికి అన్నం పెడదామని గొల్లవనిత వచ్చి పిలిచినా వాడికి ఇవేమీ వినపడలేదు. నటిస్తున్నాడని ఆవిడకి కోపం వచ్చింది. గుండ్రాయిని తీసి విసిరి అవతల పారేసింది. ఆకులన్నిటిని కాలితో తోసేసింది. ఇంట్లోకి రా అన్నం పెడతాను అని లోపలికి వెళ్ళిపోయింది.

పిల్లవాడు కళ్ళు తెరిచాడు. ఎదురుగుండా ఉన్న శివలింగం కనపడలేదు. వెంటనే ఆర్తితో ఏడ్చాడు. ఇప్పుడు వారు రమ్మని తన స్వామిని పిలుస్తున్నాడు. స్వామి కనపడలేదన్న బెంగతో మూర్ఛపడిపోయాడు. తనకోసం ఇంత పరితపించిపోయిన పిల్లవానిని శంకరుడు చూశాడు. అక్కడ బంగారు కాంతులతో గోపురంతో ఒక పెద్ద దేవాలయం, పెద్ద శివలింగం ఏర్పడ్డాయి. పిల్లవాడు బంగారు పువ్వులు తాపడం చేయబడిన పీటమీద పట్టు పంచెతో కూర్చుని పూజ చేస్తున్నాడు. వానికి సమస్తమయిన శివజ్ఞానము భాసించింది. తల్లికి ఆ ఘోష వినపడి బయటకు వచ్చి చూసి తెల్లబోయింది. నా వంశమే తరించిపోయిందిరా తండ్రీ ఈ పూజ చేశావని నాకు తెలియదు అని వెళ్లి బిడ్డడిని కౌగలించుకుంది. ఆనందపడిపోయింది. ఈ సమయంలో స్వామి హనుమ అక్కడ ఆవిర్భవించి ఒకమాట చెప్పారు “ఎవడు నొసట భస్మరేఖలను పెట్టుకుంటాడో, లలాటమునందు బొట్టు పెట్టుకుంటాడో మెడలో రుద్రాక్షమాల దాల్చి ఉంటాడో నాలుక చివర శివనామము పలుకుతున్నాడో వానికి మోక్షము కరతలామలకము. ఈ పిల్లవాడికి ఏమీ తెలియక పోయినా పరమేశ్వరుడిని నమ్మాడు. దీనివలన ఈతడు పొందబోయే భాగ్యం ఏమిటంటే గొప్పగొప్ప వాళ్ళందరూ ఈ గొల్లవంశంలో పుడతారు. ఇతడు గొప్ప ఐశ్వర్యమును అనుభవిస్తాడు. వీని పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఎనిమిది తరములు గడిచిన తర్వాత సాక్షాత్తు పరబ్రహ్మమే గోపాలబాలుడై ఈ భూమి మీద నడయాడతాడు. ఈ బాలుడు నందునిగా శ్రీకృష్ణ పరమాత్మకు తండ్రి అనిపించుకుంటాడు. మీ వంశం అటువంటి వంశం కాబోతోంది’ అని హనుమ ఆనాడు శివభక్తి విశేషమును ఆవిష్కరించి వెళ్ళాడు.

ఈవార్త ఊరంతా పాకింది. ఈవార్త బయట విడిది చేసిన శత్రు సైన్యములకు తెలిసింది. ఇది నిజంగా అలా ఏర్పడినది అయితే మాలో కొంతమంది ప్రతినిధులం స్నేహంగా లోపలికి వస్తాం మాకు చూపించండి అని రాజుకు కబురు పంపారు. అపుడు రాజు వారిని లోపలికి తీసుకువెళ్ళి దేవాలయ దర్శనం చేయించాడు. ఇంత భక్తి పరిపుష్టి కలిగిన గోపాలబాలుడు ఈ రాజ్యంలో ఉంటే మన బతుకులు ఏమవుతాయో, మన వంశములు ఏమవుతాయో అని చంద్రసేనుడికి నమస్కారం చేసి వెళ్ళిపోదామని యుద్ధం చెయ్యకుండా వెనుతిరిగి వెళ్ళిపోయారు. చంద్రసేనుడు హాయిగా రాజ్యం చేశాడు. ఈవిధంగా ఆ ఉజ్జయిని యందు మహాద్భుతమయిన మహాకాళేశ్వరుని దేవాలయం ఆవిర్భవించింది.

ఉజ్జయినిలో సంవత్సరమునకు ఒకసారి వర్షాకాలమునకు ముందర ‘పర్జన్యానుష్టానము’ అని చేస్తారు. వర్షములు బాగా పడాలని, పంటలు బాగా పండాలని మహాకాళేశ్వరాలయంలో కూర్చుని అనుష్ఠానం చేస్తారు. ఇది పూర్తి అవగానే ఆకాశంలో నల్లటి మబ్బులు పట్టి వర్షం కురుస్తుంది. ఇప్పటికీ ఉజ్జయినిలో ఈ తంతు కొనసాగుతుంది.

ఈ ఉజ్జయినిలో మహాకాళేశ్వరుడు వెలిసిన ప్రాంతం క్రిందనే శంఖ యంత్రం అనే యంత్రం ఉన్నదని పెద్దలు నమ్ముతారు. శంఖం విజయమునకు గుర్తు. అందుకే కురుక్షేత్ర యుద్ధం ప్రారంభం ముందు ధృతరాష్ట్రుడు సంజయుడిని కౌరవులు ఏమి చేస్తున్నారని అడుగుతాడు. సంజయుడు పాండవులు శంఖములు ఊదుతున్నారని చెప్పాడు. ఎవరు శంఖమును ఊదాడో వానికి విజయం కలుగుతుంది. మహాకాళేశ్వరుని క్రింద శంఖయంత్రం ఉన్నది. అందుకని ఆయన దగ్గరకు వెళ్ళి దర్శనం చేసుకున్నవాడు ఎటువంటి విజయమునయినా పొందుతాడు. అపమృత్యుదోషం పోతుంది. ఎటువంటి కోర్కెలు అయినా తీరతాయి.

అక్కడి అమ్మవారికి అవంతిక అని పేరు. ఇక్కడ ఉండే కాళికాదేవి ఒక కోటలో ఉంటుంది. ఆవిడ రాత్రివేళ పట్టణం అంతా సంచరించి తెల్లవారే సరికి దేవాలయంలోకి వెళ్ళిపోతుంటే కాళిదాస మహాకవి వెళ్లి తలుపులు వేసుకుని లోపల కూర్చున్నాడు. తెల్లవారి పోతోంది. లోపల కూర్చున్న ఆయన తనకు జ్ఞానం ఇవ్వమని అమ్మవారిని ప్రార్థించాడు. అమ్మవారు కాళిదాసును తలుపు సందులోంచి నాలుకను బయట పెట్టమని చెప్పి ఆయన అలా పెట్టగానే నాలుక మీద బీజాక్షరములను రాసింది. మహానుభావుడు తలుపులు తీసి అమ్మవారి మీద శ్యామలాదండకం చేశారు. ఈ విధంగా కాళిదాస మహాకవికి జ్ఞానమబ్బిన క్షేత్రము ఉజ్జయిని క్షేత్రం.

ఇప్పటికీ ఎన్ని వేల సంవత్సరముల నుంచో ఉజ్జయినిలో ఉన్న అంతరాలయమునందు రెండు జ్యోతులు వెలుగుతుంటాయి. ఈ రెండు జ్యోతులను అఖండ దీపములు అని పిలుస్తారు. ఈశ్వరుడిని దానిలో చూడవచ్చు.

ఉజ్జయిని దేవాలయంలో భస్మమందిరం అని ఉన్నది. అక్కడ ఆవుపేడతో విభూతిని తయారుచేస్తారు. భస్మ మందిరంలోనికి ఆవులను తీసుకువచ్చి ఆవులు వేసిన పేడను ఎంత వరకు కాలిస్తే అది చక్కటి విభూతిగా మారుతుందో అటువంటి విభూతిగా మార్చి ఆ విభూతితో స్వామివారికి అభిషేకం చేస్తారు. ఈ విభూతి అభిషేకం రెండు రకములుగా ఉంటుంది. తెల్లని పల్చటి బట్టలో మెత్తటి విభూతిని పోసేసి మూట కట్టి ఆ మూటను పట్టుకుని కొడతారు. అలా కొట్టినప్పుడు ఒక్క శివలింగం ఉన్నచోటే కాదు అంతరాలయం అంతా భస్మంతో నిండిపోతుంది. అలా నిండిపోతున్నప్పుడు శంఖముకు, భేరీలు, పెద్ద పెద్ద మృదంగములు ఇవన్నీ మ్రోగిస్తారు. అపుడు ఒక అలౌకికమయిన స్థితికి వెళ్ళిపోయినా అనుభూతిని పొందుతారు. రెండవ రకం అభిషేకంలో అభిషేకం చేసుకోవాలి అనుకున్న పురుషులను సాంప్రదాయక వస్త్రాలతో తెల్లవారు జామున దేవాలయంలోపలికి పంపిస్తారు. అప్పుడు శ్మశానంలో కాలిన శవభస్మమును అర్చకులు పట్టుకు వచ్చి చుట్టూ కూర్చును ఆ శవ భస్మంతో అభిషేకం చేస్తారు. అప్పుడు నిజంగా మనం కైలాసపర్వతం మీద కూర్చున్నట్లే ఉంటుంది.

అసురసంధ్య వేళలో మహాకాళేశ్వరుడికి చిత్రవిచిత్రమయిన నీరాజనములను ఎత్తుతారు. దానికోసం ప్రత్యేక మహంతులు వస్తారు. ఈ దీపారాధనతో కూడిన జ్వాలని నీరాజనముగా చూపించేముందు ఇక్కడ ఒక నియమం ఉన్నది. మహా కాళేశ్వరుడికి సమీపంలోనే మరొక శివలింగం ఉన్నది. ఆ శివలింగం పేరు కోటేశ్వర మహాకాళుడు. ఆయనకు ముందు పూజ చేస్తే తప్ప అసలు మహా కాళుడికి పూజచేయడం నిషిద్ధం. ముందు కోటేశ్వర మహా కాళుడికి నీరాజనములను ఎత్తి తరువాత కాళేశ్వరుడికి ఇస్తారు. అందుకని ఉజ్జయినిలో కోటేశ్వర మహాకాళ దర్శనం కూడా చేయవలసి ఉంటుంది.

ఏడాదికొక్కసారి స్వామివారు సవారీ వెడతారు. ఆయన కారుణ్యమునకు పరాకాష్ఠ ఈ సవారీ ఉత్సవం. దీనిని ఊరేగింపు/ఊరెరిగింపు అంటారు. ఉజ్జయిని జిల్లా కలెక్టర్, పోలీస్ సూపరింటెండెంట్, ఎన్నికయిన మంత్రి ఎవరయినా లేదా పరిపాలన చేసే మంత్రి ఈ ముగ్గురు ప్రతి ఏటా స్వామివారి సవారీ ఉత్సవమునకు వచ్చి తప్పనిసరిగా సవారీని మోయాలి. కొన్ని వేల సంవత్సరములనుంచి ఇదే ఆనవాయితీ.

ఉజ్జయినిలో శివరాత్రినాడు స్వామి పుష్ప కిరీటం పెట్టుకుని పెళ్లికొడుకు అవుతాడు. మహాశివరాత్రి వెళ్ళిపోయిన మరునాడు ఈ అలంకారం అంతా తీసేసి మరల భస్మాభిషేకమును అందుకుంటారు. అక్కడే బలరామ కృష్ణులు ఇద్దరూ సాందీపని మహాముని ఆశ్రమంలో విద్యాభ్యాసం చేశారు. ఈవిధంగా ఉజ్జయిని అన్నిరకములుగా ప్రకాశిస్తున్నది. అటువంటి దివ్యక్షేత్రమును జీవితంలో ఒక్కసారయినా దర్శనం చేసి, అక్కడ కొన్నిరోజులు గడిపి, జన్మసార్థకం చేసుకోవాలి.


facebook.com/SriChagantiGuruvuGaariFollowersUnofficialPage


instagram.com/pravachana_chakravarthy

కపటత్వాన్ని

 శ్లోకం:☝️

  *అభక్తానాం విభక్తానాం*

*భక్తభక్తివిరోధినామ్ |*

  *కుత్ర భక్తిస్థలం తేషాం*

*సర్వాఽధర్మసమానినామ్ ||*


భావం: నాస్తికులు, వేర్పాటువాదులు, భక్తంటే నమ్మకం లేనివారు, కేవలం హిందూమతానికి మాత్రమే వ్యతిరేకులు అయిన సూడోసెక్యులర్లు ఎక్కడ ఉన్నారో? వారి కపటత్వాన్ని బయట పెడదాం! అంటున్నాడు ఓ కవి.

_(సర్వాధర్మం = సర్వ+అధర్మం) సమానినాం_