5, నవంబర్ 2022, శనివారం

జలుబు నివారణ కొరకు -

 చిన్నపిల్లల అనారోగ్య సమస్యల నివారణ కొరకు - 1


 * జలుబు నివారణ కొరకు - 


     చిన్నపిల్లలకు జలుబు చేసిన రోజున తమలపాకులు కు ఆముదం రాసి వెచ్చచేసి రొమ్ముపైన , పొట్టపైన , తలపైన వేసి కట్టు కట్టుచున్న జలుబు హరించును . 


 *  కడుపు నొప్పి హరించుట కొరకు - 


      నీరుల్లిపాయను కుమ్ములో (పొయ్యిలో ) వేసి ఉడికించి దంచి రసము పిండుకొని కడుపునొప్పి గల పిల్లలకు ఒక పావు తులము రసము తాగించిన చిన్నపిల్లల కడుపునొప్పులు వెంటనే హరించును . 


 *  చిన్నపిల్లల శరీరం బలపడుటకు - 


     శిశువు పుట్టిన దగ్గర నుంచి 5 సంవత్సరముల వయస్సు వచ్చువరకు ప్రతిరోజూ నువ్వులనూనె ఒంటికి రాసి రెండు గంటలు ఆగిన తరువాత నలుగుపెట్టి స్నానం చేయించుచుండిన యెడల శరీరము నందలి ఎముకలు మిక్కిలి గట్టిపడి క్రిందపడినను విరగకుండా ఉండును . మరియు శరీరము కాంతివంతముగా తయరగును . 


 *  మాటలు రాని చంటిపిల్లలకు - 


     మర్రి ఊడలు మెత్తగా నూరి చిక్కని గంధము తీసి నాలుకపై వేసి రుద్దుతుండవలెను . ప్రతిరోజూ ఇలా చేయుచుండిన త్వరగా మాటలు వచ్చును . 


 *  చిన్నపిల్లల కాళ్లు , చేతులు బలహీనమై నడవకుండా ఉండిన - 


   పచ్చి ఆవుపాలలో ఉండు వెన్నని తీసి గోరోజనము కొంచం ఆ ఆవు వెన్నకి కలిపి ప్రతిరోజూ పొట్టకి , కాళ్ళకి , చేతులకు బాగా రుద్దుతున్న కొంతకాలానికి మంచి బలం కలిగి నడవటం జరుగును . 


 *  చిన్నపిల్లల విరేచనాలు తగ్గుటకు -

    మారేడుకాయ గుజ్జు ౩ గ్రాములు నీళ్లతో కలిపి తాగించిన చిన్నపిల్లల విరేచనాలు తగ్గును . 


 *  పాలు కక్కుట తగ్గుట కొరకు - 


       ఇంగువను నీళ్లతో అరగదీసి కడుపు పైన లేపనం చేయుచుండిన పిల్లలు పాలు కక్కుట తగ్గును . 


       మరింత విలువైన సమాచారం కొరకు నేను రచించిన గ్రంథాలు చదవగలరు . 


  

   గమనిక  -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా 

కామెంట్‌లు లేవు: