17, ఏప్రిల్ 2021, శనివారం

సైంటిఫిక్ లిటరసీ

 🌹🌹🌹🌷🌷🌹🌹🌹

    *విరించి విరివింటి గారి* విశ్లేషణ ను మార్చి వాట్సాప్ లో పంపగా నాకు చేరినది.

               🌷🌷🌷

మనదేశంలో 1% మాత్రమే సైంటిఫిక్ లిటరసీ ఉంది.  (scientific illiteracy) సైంటిఫిక్ లిటరసీ త్వరితగతిన మరింతగా పెరగవలసిన అవసరం అత్యవసరంగా ఉంది. దానికోసమై సైన్స్ చదివిన వారు కాస్తో కూస్తో తమవంతుగా ఇతరులతో నిరంతరం సైన్సును సైంటిఫిక్ కోణంలో నుంచి మాటలాడటం అవసరం. వివరించడం అవసరం. రిచర్డ్ డాకిన్స్ ఒక ఇంటర్వ్యూలో ఏమంటారంటే.."సైంటిస్టులు సైతం మత సంబంధ మూఢనమ్మకాలలో కూరుకుపోవడానికి కారణం మతం కాదు.  సైన్సు చెప్పేవారు దానిని సరిగ్గా సైంటిఫిక్ గా చెప్పకపోవడం" అని. 


కొంత సైన్సు తెలిసిన వారికీ(డాక్టర్లే కావొచ్చు లేదా సైంటిస్టులు కావచ్చు), సామాన్య ప్రజలకూ మధ్యన అగాధం ఎప్పటికీ ఉంది. గత శతాబ్దాలకంటే ఈ శతాబ్దంలో ఈ అగాధం మరింత పెరిగిందంటారు గడియారం భార్గవగారు. నిజమే కదా. "Amusing ourselves to Death" అనే పుస్తకంలో Neil postman మనుషులకు మారుతున్న జ్ఞాన మార్గాల గురించి చక్కగా వివరిస్తారు. ఒకప్పుడు మనుషులకు జ్ఞానం అందాలంటే కేవలం చదువుకుని నిష్ణాతులైన వారు ఉపన్యాసాలు ఇస్తేనే సాధ్యమయ్యేది.  వారి జ్ఞానం ప్రచారం ద్వారా పదిమందికీ ఉపయోగపడేది.

ఆ తర్వాత కాగితం వచ్చాక ఏదైనా చెప్పాలనుకున్నది రాయడం వలన చెప్పేవారు. నిష్ణాతులైన వారు తమ జ్ఞానాన్ని పుస్తకాల రూపంలో చెప్పేవారు.


ఇక్కడ ఒకసారి ఆలోచించండి.  చదివి జ్ఞానాన్ని పెంచుకోవాలి అనుకునేవారికి పుస్తకాల రూపంలో మాత్రమే జ్ఞానం అందుబాటులో ఉండేది.  ఆ జ్ఞానం కూడా డైరెక్టుగా ఆ జ్ఞానం కలిగివున్న నిష్ణాతుడు రాసినదే ఐవుండేది.  అంటే ప్రజలకు అందే జ్ఞానం first hand జ్ఞానం. Directly from the source. 


తరువాత జరిగిన మార్పు. రేడియో..టీవీ. ఇవి వచ్చే సరికి నిష్ణాతులైన వారి పుస్తకాల గురించి ఇతరులు మాట్లాడటం మొదలైంది. అంటే first hand నుంచి second hand కి జ్ఞానం బదలాయించడం అయింది. అలా మాట్లాడే వారు కూడా ఆ రంగంలో నిష్ణాతులు ఐవుండేవారు.   డైరెక్ట్ సోర్స్ కాకున్నా Secondary sources of knowledge లు పెరిగాయి.   కొంతకాలం తరువాత ఎవరైనా టీవీలో మాట్లాడే పరిస్థితి ఏర్పడింది. ఎవరైనా ఏదైనా మాట్లాడే పరిస్థితి ఏర్పడేసరికి జ్ఞానతృష్ణ గల ప్రజలకు second hand knowledge పెరిగిందే తప్ప అంతకుమించి పెరగలేదు.


దీనికి ఒక అద్భుతమైన ఉదాహరణను నీల్ పోస్ట్మన్ ఇస్తారు.  అబ్రహం లింకన్ స్పీచ్ సమయానికీ, అప్పటి ప్రజలకూ - ఇప్పటి అమెరికన్ అధ్యక్షుల స్పీచ్ కీ ఇప్పటి ప్రజలకూ.


అబ్రహం లింకన్ తన opponent డగ్లస్ కి మధ్య జరిగిన చర్చ దాదాపు వేయి మంది ప్రేక్షకుల మధ్యన ఏడెనిమిది గంటలు సాగుతుంది. ఇందులో లింకన్ కానీ డగ్లస్ కానీ వాడిన భాష, ఆ పదాలు గ్రాంథిక భాషలో సాగాయిట.  వాళ్ళు మామూలుగా మాట్లాడినా ఆ పదాలు ఏదో గ్రంథంలోంచి చూసి చదువుతున్నట్టుగా ఉండేవంట.  ఒకరకంగా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినవారికి గానీ ఆ స్పీచ్ ల క్లిష్టత అర్థమయేది కాదంట.  చాలా సీరియస్ గా వ్యక్తిగత దూషణలకు దూరంగా అమెరికా అభివృద్ధి గురించి వాళ్ళు మాట్లాడారట.  ఇక్కడ వాళ్ళు అలా ఎందుకు మాట్లాడారు అంటే వాళ్ళ జ్ఞాన మార్గాలు కేవలం పుస్తకాలు మాత్రమే.  ఎన్నో పుస్తకాలు చదివి ఉండటం వలన వారి భాషకూడా అలాగే పుస్తకాల్లో ఉన్నట్టే ఉండేది. వారికి opponent ని కించపరుస్తూ మాట్లాడవలసిన అవసరంకూడా ఏమీలేదు.  తరువాత తరువాత వచ్చిన అమెరికన్ ప్రెసిడెంట్ల భాష రాను రానూ భ్రష్టు పట్టడం మొదలైంది.  మరీ స్కూలు పిల్లల స్థాయికి వారి భాష పడిపోయి  సమస్యల కంటే- రేసిజం మీద, మతాలమీద గిల్లికజ్జాలు పెట్టుకునే స్థాయికి అధ్యక్ష కాండిడేట్ల డిబేట్ లు దిగజారాయి.  ట్రంపు మాట్లాడే భాష ఒక ఐదవ తరగతి పిల్లవాడు కూడా అర్థం చేసుకునేంతగా ఉంటుందంట. ఇది అచీవ్మెంట్ కాదు.  పతనం.  కారణం ఏమంటే ఇప్పటి అధ్యక్షుల knowledge sources డైరెక్టుగా పుస్తకాలు కాదు. First hand sources of knowledge కాదు. పుస్తకాలకంటే టీవీ ఛానళ్ళిచ్చే secondary or  tertiary superficial second hand third hand fourth hand...జ్ఞానమేఆధారం. 


ఇక అప్పటి ప్రజలు కూడా. ఏడెనిమిది గంటలు చర్చాగోష్టి జరిగినా కట్టు కదలకుండా కూర్చునేవారంట.  ఓపికగా శ్రద్ధగా వినేవారంట. ఎందుకంటే ఆ ప్రజల జ్ఞానమార్గాలు కూడా కేవలం పుస్తకాలు మాత్రమే.  కాబట్టి వారికి స్పీచ్ జరిగేకంటే ముందే pre conceived notions లేవు.  వారికి వాటిని అందించడానికి టీవీ యాంకర్లు లేరు.  మీడియా పేరుతో నోటికొచ్చిందంతా చెప్పేవారు లేరు.  కాబట్టి లింకన్ ఏం చెబుతాడో...డగ్లస్ ఏం చెబుతాడో అనే ఉత్సుకత.   ఎవరు తమను బాగు చేయగలరో అనే నిజమైన నిబద్ధత.  వారి స్పీచ్ ఆధారంగా వాళ్ళను అంచనా వేయాలి వాళ్ళకు ఓటు వేయాలి కాబట్టి ఆ శ్రద్ధ కూడా. ఇన్ని లక్షణాలు ఆ ప్రజలకు ఉండటానికి కారణం వాళ్ళ జ్ఞానమార్గాలు first hand sources నుండి ఉండటమే. ఇపుడు మనకంత ఓపికలున్నాయా.  అలా నాయకులు మాట్లాడితే వినగలిగే శక్తి ఉందా.  ఇతర నాయకులను కులాల పేరుతో మతాల పేరుతో అమ్మనాబూతులు తిడుతుంటే మళ్ళీ మళ్ళీ యూట్యూబ్ లో వింటూ ఆనంద పడిపోయే స్థాయికి దిగజారాం కదూ.


ఇపుడు మీడియా వార్తా వ్యాపారం కాలంలో, యూట్యూబ్ కాలంలో మన జ్ఞాన మార్గాలు first hand second hand కూడా కాదు ఏ లక్షవో కోట్లవో ఎక్కడిదో ఐవుంటుంది.  అభిప్రాయాలే జ్ఞానమై కూర్చున్నాయి. వచ్చిన సమాచారమే తిరుగులేనిది ఐపోయింది. ఎవడో ఒకడు ప్రపంచంలో ఏ మూలలోనో కూర్చుని  తన అభిప్రాయాన్ని తన నోటికొచ్చినట్లు అదే జీవన సత్యమన్నట్టు వాట్సప్ లో ఏదో రాస్తాడు.  లేదా యూట్యూబ్ లో ఏదో వాగుతాడు.  రాసినవాడెవడో కూడా ఇదమిత్తంగా తెలియదు.  వాగేవాడేం చేస్తాడో కూడా ఎవరికీ తెలియదు.  దానికి గల ఆథెంటిసిటీ కూడా ఎవరికీ తెలియదు.  కానీ అదే నిజమని బాగా చదువుకున్న పోస్ట్ గ్రాడ్యుయేట్ కూడా నమ్ముతాడు.


ఇలా ఎందుకు జరుగుతుంది?  మనిషికి జ్ఞానాన్ని First hand knowledge ని అందించే జ్ఞాన మార్గాలు పూర్తిగా మూసుకుపోయాయి. రూపు మార్చుకుని అభిప్రాయాలు, ఊహత్మక వర్ణనలే నిజాలైపోయాయి. పైగా ఇదే ultimate knowledge అని బొంకుతున్నాయి.  విచిత్రంగా చదువుకున్నవాడూ వాటిని నమ్ముతున్నాడు. మనమేమైనా ఆలోచించగలమా? ఈ బొంకుతున్న వారిని వదిలేసి ఆథెంటిక్ జ్ఞానం కోసం కొంతైనా ప్రయత్నం చేయగలమా?  అన్నది ప్రధాన సమస్యలా కనబడుతోంది.  Neil postman అన్నట్టు ఎంటర్టైన్మెంట్ పేరుతో we are amusing ourselves to death. No seriousness even at the edge of pandemic. ఈ రోజుకీ మనం సైంటిస్టులు చెప్పేదంతా అబద్ధమని ఏ వాట్సాప్ ప్రబుద్ధుడు రాసినా నమ్మేస్తున్నాం అంటే మన education స్థాయికీ literacy స్థాయికీ ఎంత అగాధం సృష్టించుకున్నామో కదా!


ఒకసారైనా తీవ్రంగా ఆలోచించవలసిన అంశాలివి.

కనీసం కరోనా కాలంలోనైనా మన జ్ఞాన మార్గాలు నిజంగా జ్ఞానమార్గాలేనా వొట్టి కాన్స్పైరింగ్ పుకార్లా అని తరచి చూసుకోవలసిన తరుణం వచ్చింది !


-విరించి విరివింటి


విరించి విరివింటి  గారి ఆర్టికల్ ని ఎక్కువమందికి చేరవేయాలనే ఉద్దేశ్యంతో కొంత ఎడిట్ చేసి (అనుమతి లేకుండానే) పోస్ట్ చేసి పంపినది.

కాశీ కి వచ్చే యాత్రికులకు విజ్ఞప్తి ,!!

 !!    కాశీ కి వచ్చే యాత్రికులకు విజ్ఞప్తి ,!!

కాశీ కి వచ్చే యాత్రికులకు విజ్ఞప్తి ఏమనగా వారణాసి కలెక్టర్ గారి ఆదేశాలు ప్రకారము ఏదైనా విశేష పరిస్థితిలో అవుతూనే వారణాసి కి రావాలని లేనిచో ప్రస్తుతం యాత్రలు వాయిదా వేసుకోవాలని కోరారు.

 కాశీ విశ్వనాధుడు అన్నపూర్ణ గుడి లో ప్రవేశం కావాలి అంటే మూడు రోజుల క్రిందట covid 19 ఆర్ టి పి సి ఆర్ టెస్ట్ చేసుకుని రిపోర్ట్ తీసుకుంటేనే ఉదయం 7 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ప్రవేశం ఉంటుంది అని చెప్పారు కాశీలో కరోనా కేసులు ప్రతిరోజు పెరుగుతూనే ఉన్నాయి రోజుకు రెండు వేల పైగా కేసులు వస్తున్నాయి పరిస్థితి అంత మంచిగా లేదు ఈ రోజు నుండి 3-5-2021 వరకు ప్రతి శనివారము ఆదివారము లాక్ డౌన్ పెట్టారు ఈ పరిస్థితుల్లో కాశీకి వచ్చే యాత్రికులు తమ ప్రయాణాలను కొద్దికాలము వాయిదా వేసుకోవాల్సి ఉందిగా శ్రీ శ్రీ కంచి కామకోటి పీఠాధి పీఠాధీ శ్వర సనాతన సంస్కృతి సంరక్షణ ట్రస్ట్ వారణాసి తరఫున కోరడమైనది ప్రతి ఒక్కరూ ఈ విషమ పరిస్థితుల్లో నుంచి బయటకు రావాలి అంటే కోవిడ నియమములను పాటిస్తూ మాస్కు పెట్టుకోవటం రెండు గజాల దూరంలో ఉండటం చేతులు కడుక్కోవడం మొదలగు చేస్తూ అవసరం ఉంటేనే ఇంటి నుంచి బయటకు రావాలని కోరుతున్నాము

ఇట్లు చైర్మన్ గబ్బిట శ్రీనివాస శాస్త్రి

నిర్లక్ష్యం వద్దు

 నిర్లక్ష్యం వద్దు అదేసమయంలో భయపడాల్సిన అవసరం లేదు.

కరోనా ఎవరికీ రావొద్దు అనేదే మన కోరిక అయితే పరిస్థితి చూస్తే  సెకండ్ వేవ్ చాలా తీవ్రంగా ఉంది. దీనిని అందరం కలిసి కట్టుగా ఎదుర్కోవాలి. ప్రభుత్వాలు తీవ్ర ప్రయత్నం చేస్తున్నాయి అయితే అది మాత్రమే సరిపోదు. మానసిక సంసిద్ధత అవసరం.


పొరపాటున వస్తే భయం వద్దు.

జ్వరం,కాళ్ళు లాగడం, జలుబు, రుచిలేకపోవడం, వాసన లేకపోవడం , ఆకలి తగ్గడం లాంటి లక్షణాలు ఉంటే వెంటనే RTPCR టెస్ట్ చేయించుకోవాలి. 

రాపిడ్ సాధ్యమైనంత వరకు వద్దు. 

వయస్సు ఎక్కువ ఉంటే HR CT scan చేయించాలి. దాని వల్ల వ్యాధి తీవ్రత తెలుస్తుంది.

సంవత్సర కాలం లో వైద్యులకు దీనిపై పూర్తి పట్టు దొరికింది.

సకాలం లో టెస్ట్ చేయిస్తే ఎలాంటి ప్రమాదం లేదు.

వచ్చిన వాళ్ళు, రానివాళ్ళు అందరూ నువ్వుల లడ్డు, బొప్పాయి పండు, అక్రూట్, ఖర్జురం , తినాలి. రోజు కొద్దిసేపు ఉదయంఎండలో నిలబడాలి.

కొద్దిగా వ్యాయాయం, యోగా చేయాలి. బాగా తినాలి.

అవసరమైతేనే బయటకు వెళ్ళాలి . 

నిపుణుల మాటలను బట్టి ఇది జూన్ మొదటి వారం నుండి మళ్ళీ మామూలు అవుతుంది.

45 ఏళ్ల పై వారు తప్పకుండా వాక్సిన్ తీసుకోవాలి. ఎలాంటి భయం వద్దు.

రెండవ డోస్ తరువాత 15 రోజులకు మనకు పూర్తి శక్తి వస్తుంది.

ఎవరికి ఎలాంటి అవసరం ఉన్నా ఒకరికి ఒకరు మాట్లాడుకొందాం . కలిసి ఎదుర్కొందాం

అరికాళ్ళ కింద మంటలు

 🌹🌹🌹🌷🌷🌹🌹🌹

“అరికాళ్ళ కింద మంటలు “- శ్రీపాద సుబ్రమణ్యశాస్త్రి .


ఆ అమ్మాయి తీరి కూచుని తన కష్టాలు ఏమీ చెప్పుకోలేదు ఆ కథలో. 

అసలు కూచోడానికి తీరికేది? ఇక ఎవరికైనా చెప్పుకోవడం కూడానూ..

పెద్దక్క పిల్లాడికి జుబ్బా , చిన్నక్క కి రవిక , అప్పటి కప్పుడు కుట్టి పెట్టాలి . పైగా వారి ఎకసెక్కపుమాటలూ పరోక్ష బెదిరింపులూ భరించాలి. మీ అమ్మనాన్నా పూసుకుంటారు ,పునిస్త్రీ సేవ చేసుకో , గంధం తీసిపెట్టు అని అమ్మమ్మ పురమాయించింది మరి. నిజమే, తీసిపెట్టాలి కదా.  పైగా మాట వినకుండా పెంకెతనం చేసి  చెల్లెలు  ఆ గిన్నెలో గంధం పడేస్తే, గూడలు పడిపోయేలా మళ్ళా గిన్నెడు గంధం తీయాలి.ఇదంతా కుంచముడు కందులు వేయించి ముగించాకనే.

అమ్మ , అలా పెత్తనాలకు పోయొస్తాను కాస్త వంట చేయవే అంటే మడి కట్టుకోవాలి . సినిమా కి పోయే తమ్ముడు పొగరుగా , పనసపెచ్చుల పులుసులో ముక్కలు తనకు ఉంచక పోతే మక్కెలు విరగతంతానంటే మాటాడక ఊరుకోవాలి. బాధ్యత గల తండ్రే , చేతకానితనంగా ఊరుకుంటే మన్నించాలి.

ఇదంతా ఎవరు చేస్తారు ఒక పదిహేడేళ్ళ పిల్ల రుక్కు.. రుక్మిణి. ఆమె  చేసిన తప్పు బాలవితంతువు అవడం. పెట్టిపుట్టలేదు కాబట్టే ఆ మొగుడు పోయాడు, ఈమె జన్మమింతే అని అమ్మమ్మగారి ఉవాచ. అమ్మమ్మ దృష్టిలో అందరి దృష్టిలో కూడా,   రుక్కు ఇక సుఖాలమీద ఆశ వదులుకుని, ఇంటోవారి సేవ చేసుకుంటూ జీవితం వెళ్ళమార్చాలి. ఆ ఇల్లు మనుషులూ తప్ప వేరే దిక్కు, వేరే ప్రపంచమూ లేవు. ఉండబోవు. అసలు వేరే ఆలోచనే ఉండరాదు.

 “ అరికాళ్ళ కింది మంటలు” కథ లో అప్పటి బాలవితంతువుల కష్టాలు వారి దుర్భర పరిస్ధితి కళ్ళకు కట్టినట్టు వివరించారు , శ్రీపాద సుబ్రమణ్యశాస్త్రిగారు. వారి కథనం అపూర్వం . అద్భుతం.

రుక్మిణి దయనీయస్ధితికి మనసు కరిగి పోతుంది.

నాకు బాగా నచ్చినది రుక్కు తన  కష్టాలు చెప్పుకోదు తనంతతానుగా. మిగతావారితో జరిపే సంభాషణలలోనే మనము తెలుసుకుంటాము, ఆమె ఇబ్బందులన్నీ. ఇంటో ఉన్నవారే ఆమె అరికాలికింద మంటలు  ఎలా పెట్టారో చూస్తాం ఇందులో. 


ఒక మూఢాచారాన్ని మూఢ నమ్మకాన్ని ఆచరించాలనుకునే సమాజానికి అసలు ఆలోచన ఉండదనిపిస్తుంది, ప్రేమాభిమానాలు కూడా పోతాయనిపిస్తుంది. కేవలం గుడ్డెద్దు చేలో పడ్డట్టుగా , 

ఆ ఆచారము పెట్టబడింది కాబట్టి అనుసరించి తీరడమే తమ కర్తవ్యము అనుకుంటారు కాబోలనిపిస్తుంది. కుటుంబం లోని వారి వాత్సల్యాన్ని  , మానవత్వాన్ని కూడా చంపేసే మూఢాచారాలు మీద కోపమూ, రుక్కు పరిస్ధితి మీద ఎంతో జాలి బాధ కలుగుతాయి . 

చివరకు వితంతు పరిస్ధితి  (దుస్ధితి) ని జుట్టు తీయించి గుండు చేయించడం ద్వారా సంపూర్ణం చేయాలి , లేకపోతే తను తలెత్తుకు తిరగలేనన్న అమ్మమ్మ ప్రతిపాదనను తండ్రి తిరస్కరించలేకపోవడం గమనిస్తుంది రుక్కు.  అంతేకాదు,  వీరేశలింగం పంతులుగారు తోటలో వితంతు వివాహాలు జరుగుతున్నాయని వింటుంది .ఆ రాత్రి  కమ్ముకున్న ఆలోచనలలో, మంటలలో పడకుండా తేరుకున్నదానిలా గభాలున రుక్కు తలుపులు తీసుకు వీధిలోకొచ్చి పడుతుంది. 

వీధిలో రుక్కు లాటి అభాగ్య వితంతు ఆడపిల్ల ఉన్న జట్కా బండి అతను , గ్రహిస్తాడు రుక్కు ఎక్కడి కెళ్ళాలనుకుంటోందో. పంతులు గారి తోటకైతే కానీ డబ్బులు తీసుకోనంటాడు, తన దగ్గర బాడుగ కి డబ్బులు లేవన్న రుక్కుతో.

రుక్కు కు పెళ్ళి అయి మంచి జీవితం అమరాలనీ , తరువాత అది తన కూతురికి కూడా మార్గం చూపాలని కోరుకుంటూ, ఆమెను పంతులుగారి తోటకు తీసుకెడతాడు. బండి మలుపు తిరిగింది అంటూ కధ ముగుస్తుంది. 


ఇది రుక్కులాటి బాల్యవితంతువుల జీవితానికి తిరిగిన మలుపే

ఏదో ఒకరకమైన  బాధలూ కష్టాలూ  సమాజం నుంచీ ఎదుర్కోవడం , ఆడవారికీ ఈనాటి వరకూ తప్పలేదు,  వాటినుంచి జాగ్రత్తగా బయటకు తీసుకువెళ్ళే , సాయం చేసే మంచి మనసున్నవారు , ఆ జట్కా బండతను వంటివారు ఇప్పుడున్నారా.. ఉంటే బావుండును కదా , అనిపిస్తుంది.రుక్కు లాగ స్వయం నిర్ణయం చేసుకోగలిగే ఆలోచన  వివేకము ధైర్యము ఆడవారిలో ఉంటే బాగుండుననిపిస్తుంది.

కథక చక్రవర్తి శ్రీపాద సుబ్రమణ్యశాస్త్రి గారి  గురించి,  నేను కొత్తగా ఏమీ చెప్పే సాహసం చేయలేను , 


ఆ పుస్తకంలో  ముందు మాటలో చెప్పినట్టుగా వారు  

“ ఛాందస తమస్సు నుండి పుట్టిన సంస్కరణ జ్యోతి”.

వీరేశలింగం గారి సంస్కరణోద్యమాన్ని మనసారా అభిమానించి, రచనల రూపంలో విస్తృత ప్రచారం చేసిన ధన్యజీవి.


కధా సమీక్ష : జానకీ చామర్తి .

సేకరణ: ప్రభాకరరావు, వరిగొండ

సుంద‌ర‌కాండ‌- సీతాద‌ర్శ‌న‌ఘ‌ట్టం

 శ్రీ‌శ్రీ‌శ్రీ‌

*రామాయణ దివ్యకథా పారాయణం*

* శ్రీ‌రామ న‌వ‌మి ప‌ర్వ‌దినం వ‌ర‌కు*

         *5 వ  రోజు*

     🌸 *సుంద‌ర‌కాండ‌*🌸


               ***

శ్రీరాఘవం దశరథాత్మజ మప్రమేయం 

సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం

ఆజానుభాహుం అరవింద దళాయతాక్షం

రామం నిశాచర వినాశకరం నమామి.

                ****

మనోజవం 

మారుతతుల్య వేగం

జితేంద్రియం బుద్ధిమతాంవరిష్టం |

వాతాత్మజం 

వానరయూథ ముఖ్యం

శ్రీరామ దూతం 

శరణం ప్రపద్యే||


(మనస్సుని జయించినవాడు, గాలి వేగంతో పయనించేవాడు, పంచేంద్రియాలను తన అధీనంలో ఉంచుకున్నవాడు,గొప్ప తెలివిగలిగినవాడు, వానరులలో ముఖ్యుడు, శ్రీ రామచంద్రునకు దూత అయిన హనుమంతునికి ప్రణామం చేస్తున్నాను.)

                 ***


సీతాన్వేష‌ణ సంక‌ల్ప దీక్ష‌తో ఆంజ‌నేయుడు మ‌హేంద్ర‌గిరి ప‌ర్వ‌తం ఎక్కి ఉత్సాహంతొ కాసేపు విహ‌రించాడు. మ‌హావేగంతో ఆకాశంలోకి ఎగిరేందుకు ప‌ట్టుకోసం భూమిపై కాలు పెట్టి అదిమితే అది ఎక్క‌డ కుంగుతుందో న‌ని మ‌హేంద్ర‌గిరి ప‌ర్వ‌తాన్ని ఆపుగా చేసుకున్నాడు. త‌ల‌పైకి ఎత్తి చూశాడు. విశాల ఆకాశం ప్రేర‌ణ‌నిచ్చింది. మ‌హోత్సాహం ఆవ‌హించింది. తూర్పుకు తిరిగాడు. సూర్యుడికి, ఇంద్రుడికి, వాయుదేవుడికి న‌మ‌స్క‌రించాడు. శ్రీ‌రామ‌చంద్ర‌మూర్తిని శ‌రీరంలోకి ఆవ‌హింప‌చేసుకున్నాడు. 

వాన‌ర‌సేన‌వైపు తిరిగాడు, మిత్రులారా రామ‌కార్యార్థం వెడుతున్నాను. రామ‌బాణం ఎంత వేగంగా వెడుతుందో అంత వేగంతో లంక‌లో ప్ర‌వేశిస్తాను. అక్క‌డ సీత‌మ్మ‌వారు లేక‌పోతే దేవ‌లోకం వెళ‌తాను. అక్క‌డా ఆ మ‌హాత‌ల్లి క‌నిపించ‌క‌పోతే రావ‌ణాసురుణ్ణే బంధించి ఈడ్చుకువ‌స్తాను . లేదంటే లంకాన‌గ‌రాన్నే పెళ్ల‌గించి తీసుకువ‌స్తాను చూస్తుండండి అంటూ 

ఒళ్లువిరిచి, దేహాన్ని సాగ‌దీసి.చేయి ముందుకు సాచి...జై శ్రీ‌రామ్ అంటూ  మ‌హేంద్ర‌గిరిని కాలితో గ‌ట్టిగా అదిమి హ‌నుమ ఒక్క ఉదుటున ఆకాశంలోకి లేచాడు.  వాన‌ర సేన హ‌నుమ‌కు,శ్రీ‌రామ చంద్ర‌మూర్తికి జేజేలు ప‌లుకుతున్న‌ది. హ‌నుమ మ‌హేంద్ర‌గిరినుంచి పైకి లేస్తుంటే ఆ ఊపుకు మ‌హేంద్ర‌గిరి ఊగిస‌లాడింది.  చెట్లు ఆ మ‌హోధృత గాలికి పుష్ఫ వ‌ర్షం కురిపించాయి. వాతావ‌ర‌ణం ఆహ్లాద‌క‌రంగా మారింది.జీవ‌కోటికి ఏదో తెలియ‌ని ఆనందం. విష‌ప్రాణులు భ‌యంతో విల‌విల‌లాడి పోయాయి. అలా స‌ముద్రం మీద మ‌హావేగంతో హ‌నుమంతుడు లంకాన‌గ‌రంవైపు దూసుకుపోతున్నాడు. స ముద్రంపై ప‌డిన హ‌నుమంతుడి నీడ, స‌ముద్రంలో గాలివాటుకు పోతున్న నౌక‌లా క‌నిపిస్తున్న‌ది. స‌ముద్రం అల్ల‌క‌ల్లోల‌మౌతున్న‌ది.  రెక్క‌ల ప‌ర్వ‌తంలా దూసుకుపోతున్నాడు మ‌న హ‌నుమ‌. దేవ‌త‌లు హ‌నుమ‌నుచూసి విజ‌యోస్తు విజ‌యోస్తు అని దీవిస్తున్నారు. 


*సాగ‌రుడి సాయం*


స‌ముద్రుడు త‌ల పెకి ఎత్తి చూశాడు. రామ‌కార్యార్థి అయిన హ‌నుమ‌కు ఎ దో ర‌కంగా స‌హాయం చేయాల‌నుకున్నాడు. అప్పుడు స‌ముద్రంలోనే దాగి ఉన్న మైనాకుడ‌నే ప‌ర్వ‌తాన్ని పిలిచి, ఈ స‌ముద్రం నుంచి పైకి లేచి నువ్వు హ‌నుమ‌కుఆతిథ్యం , కాసేపు విశ్రాంతి నివ్వు అలా రామ‌కార్యంలో త‌రిద్దాం అన్నాడు స‌ముద్రుడు. మైనాకుడు ఆకాశ‌వీధికి పెరుగుతూ వెళ్లి హ‌నుమ‌కు అడ్డంగా నిలిచాడు. విశ్రాంతి ఇవ్వాల‌న్న సంక‌ల్పంతో. హ‌నుమ త‌న‌కు ఏదో అడ్డుగా నిలిచింద‌ని భావించి గుండెతో మైనాకుడిని ఒక్క గుద్దు గుద్దాడు. దానితో క‌ల‌వ‌ర‌ప‌డిన మైనాకుడు నిజ‌రూపం లో ఎదురుగా నిలిచి  , త‌న శిఖ‌రంపై విశ్రాంతి తీసుకోమ‌న్నాడు. హ‌నుమ సంతోషించాడు.కానీ రామ‌కార్యార్థినై సంక‌ల్ప‌దీక్ష‌తో వెళుతున్నాను. విశ్రాంతి కిది స‌మ‌యం కాదు . అని మైనాకుడి తృప్తి కోసం అత‌నిని చేతితో స్పృశించి ప్ర‌భంజ‌న వేగంతో హ‌నుమంతుడు ముందుకు దూసుకుపోతున్నాడు. హ‌నుమ దీక్ష‌కు దేవ‌త‌లు ముచ్చ‌ట‌ప‌డ్డారు.

గంధ‌ర్వ దేవ‌తాగ‌ణాలు హ‌నుమ శక్తిసామ‌ర్థ్యాలు ప‌రీక్షించాల్సిందిగా నాగ‌మాత సుర‌ను కోరారు. ఆమె భారీ కాయంతో హ‌నుమ మార్గానికి అడ్డుప‌డింది. హ‌నుమా ఈరోజు నువ్వు నాకు ఆహారం. నువ్వు మ‌ర్యాద‌గా నా నోట్లోకి ప్ర‌వేశించు అని గ‌ద్దించింది. అప్పుడు హ‌నుమంతుడు, విన‌యంతో అమ్మా నేను రామ‌కార్యార్థినై వెళుతున్నాను. సీతామాత జాడ తెలుసుకుని వ‌చ్చిన త‌ర్వాత నీకు ఆహారం అవుతాను అన్నాడు. సుర‌న ఒప్పుకోలేదు. స‌రే నా దేహానికి స‌రిప‌డినంత‌గా నీ నోరు తెరువు అన్నాడు. సుర‌న నోరు పెద్ద‌ది చేస్తున్న‌ది. హ‌నుమ త‌న దేహాన్ని పెంచుతూ పోతున్నాడు. ఇలా ఇద్ద‌రూ పోటీ ప‌డుతున్నారు.  ఒక ద‌శ‌లో  హ‌నుమ  ఉన్న‌ట్టుండి త‌న దేహాన్ని బొట‌న వేలి స్థాయికి త‌గ్గించి సుర‌న నోట్లో కి ప్ర‌వేశించి క్ష‌ణ‌కాలంలో బ‌య‌ట‌కు వ‌చ్చేశాడు. అమ్మా నీవు చెప్పిన‌ట్టే చేశాను. ఇక వెళ్లిరానా అన్నాడు. ఆంజ‌నేయుని సూక్ష్మ‌బుద్ధికి సంత‌సించి నాయానా నీకు కార్య‌సిద్ధి క‌లుగుతుంది. సీతారాముల‌ను క‌లుపుతావు అని ఆశీర్వ‌దించి మార్గం సుగ‌మం చేసింది.

అలా గ‌గ‌న‌త‌లంలో స‌ముద్రంపై దూసుకుపోతున్న హ‌నుమ నీడ‌ను ఛాయాగ్రాహిణి అనే స‌ముద్రంలోని రాక్ష‌సి సింహిక చూసింది. త‌న‌కు భ‌లే ఆహారం దోరికింద‌ని అనుకునుంది. నోరుతెరిచి హ‌నుమ నీడ ఆధారంగా  త‌న నోట్లోకి లాగే ప్ర‌య‌త్నం చేస్తున్న‌ది. ఇది గ‌మ‌నించాడు హ‌నుమ‌. దేహాన్ని మ‌రింత పెంచినా ప్ర‌యోజ‌నం లేక పోయింది. వెంట‌నే సూక్ష్మ‌రూపియై సముంద్రంలోని సింహిక‌ను ఢీకొట్టి దాని ప్రాణాలు తీశాడు. సింహిక మృత‌క‌ళేబ‌రం సముద్రంపై తేలుతుంటే దేవ‌తలు సంతోషంతో పుష్ప‌వృష్టి కురిపించారు. ఈ విధంగా ధైర్యం, విశాల‌దృష్టి, బుద్ధి, చాక‌చ‌క్యం ప్ర‌ద‌ర్శించిన హ‌నుమ‌కు ఎదురులేద‌ని దేవ‌తులు దీవించారు. అంత‌లోనే హ‌నుమ‌కు ద‌క్షిణ‌తీరంలో ప‌ర్వ‌త పంక్తులు హ‌నుమంతుడికి క‌నిపించాయి. లంకాన‌గ‌రానికి ద‌గ్గ‌ర‌లోని త్రికూట‌గిరి శిఖ‌రం మీద దిగాడు.  ఇంత దూరం స‌ముద్రంపై ఎగిరివ‌చ్చినా ఏమాత్రం అలిసిపోలేదు. సాయం సంధ్యా వంద‌నాది కార్య‌క్ర‌మాలు ముగించాడు.


*లంకాన‌గ‌ర ప్ర‌వేశం*:


త్రికూట‌గిరినుంచి లంకాన‌గ‌రాన్ని చూశాడు హ‌నుమంతుడు. బ‌హు సుంద‌రంగాఉంది. అంతేకాదు చీమ‌కూడా న‌గ‌రంలో ప్ర‌వేశించ‌డానికి వీలులేకుండా రాక్ష‌సులు కాప‌లాకాస్తున్నారు. సూక్ష్మ‌రూపి అయి వాన‌ర రూపంలోనే లంక‌లో ప్ర‌వేశించి సీతామాత జాడ తెలుసుకోవాల‌నుకున్నాడు. చిన్న‌వాన‌రంగా లంక‌లో ప్ర‌వేశించ‌డానికి రాజ‌ద్వారం చేరుకున్నాడు. ఇంత‌లో లంకిణి అనే రాక్ష‌సి ఎదురుగా నిలిచి వ‌నాల‌లో తిరిగే నీకు ఇక్క‌డేం ప‌ని అని గ‌ద్దించింది. త‌న అనుమ‌తి లేకుండా లోప‌లికి ప్ర‌వేశించ‌డం కుద‌ర‌ద‌ని చెప్పింది. లోప‌ల ఉన్న వ‌నాల‌ను స‌ర‌స్సుల‌ను ప‌క్షుల‌ను చెట్ట‌ను ఆ న‌గ‌ర సౌంద‌ర్యాన్ని ఒక్క‌సారి వ‌చ్చేస్తాన‌న్నాడు. లంకిణి కుద‌ర‌ద‌న్న‌ది. నేను లంక‌ను కాప‌లా కాస్తుంటాను. న‌న్ను గెలిస్తే కాని నువ్వు లోప‌లికి అడుగు పెట్ట లేవు అంటూ హ‌నుమ‌ను ఒక్క దెబ్బ కొట్టింది. హ‌నుమ వెంట‌నే కుడిచేయి పైకిఎత్తి పిడికిలి బిగించాడు. కానీ కుడిచేతితో కొడితే లంకిణి చ‌నిపోతుంది. స్త్రీ క‌దా అని ఆలోచించి ఎడ‌మ చేతితో ఒక్క గుద్దు గుద్దాడు.ఆమె క‌ళ్లుతేలేసి కింద‌ప‌డింది. అప్పుడు లంకిణి, నాయ‌నా నువ్వు న‌న్ను గెలిచావు. ఒక వాన‌రుడు వ‌చ్చి న‌న్ను గెలిచిన నాడు రావ‌ణాసురిడి అంత్య‌కాలం స‌మీపించిన‌ట్టు అని బ్ర‌హ్మ‌గారు నాకు  చెప్పారు. ఇప్పుడు లంకా న‌గ‌రం భ‌విష్య‌త్తు, రాక్ష‌సుల భ‌విష్య‌త్తునాకు అర్ధ‌మై పోయింది. ఇక ద్వారం తెరుస్తున్నాను.ద్వ‌రాంగుండానే వెళ్లు సీత‌మ్మ‌ను క‌నిపెట్టు అని చెప్పింది.కానీ హ‌నుమ రాజ‌ద్వారం గుండా ప్ర‌వేశించ‌కుండా ఎడ‌మ కాలులోప‌లికి పెట్టి ప్రాకారం మీదినుంచి లంకాన‌గ‌రంలోకి కిందికిదూకాడు. అప్ప‌టికే రాత్రి అయింది. చంద్రుడి వెలుగులో లంకానగరం మరింత శోభాయమానంగా క‌నిపిస్తున్న‌ది.


అంతఃపురంలో సీతాన్వేషణ

చిన్నశరీరము ధరించి, హనుమంతుడు రావణుని మందిరములోనూ, పానశాలలోనూ, పుష్పక విమానములోనూ .. అన్నిచోట్లా సీతను వెదకాడు. రాత్రి వేళ రావణుని మందిరంలో కాంతలు భోగ లాలసులై, చిత్ర విచిత్ర రీతులలో నిద్రిస్తూ ఉన్నారు. ఆ దృశ్యాలను చూచి కలవరపడిన హనుమంతుడు, తాను రామ కార్యాచరణ నిమిత్తం ఏ విధమైన వికారాలకూ లోను గాకుండా సీతాన్వేషణ చేస్తున్నందున తనకు దోషం అంటదని, తన బ్రహ్మచర్య దీక్షకు భంగం వాటిల్లదని సమాధానపడ్డాడు. పుష్పక నిమానం అందాన్ని, రావణుని ఐశ్వర్యాన్ని చూసి అబ్బురపడ్డాడు. నిద్రించుచున్న స్త్రీలలో మండోదరిని చూచి సీత అని భ్రమించాడు. మరల తప్పు తెలుసుకొని అన్వేషణ కొనసాగించాడు. సీతమ్మ జాడ తెలియ‌క చింతించాడు. ఏమిచేయాలో తోచలేదు. ఊరకే వెనుకకు మరలి అందరినీ నిరాశపరచడానికి ఇష్టప‌డ‌ లేదు. తన కార్యం విఫలమైతే సుగ్రీవుడు, రామ లక్ష్మణులు, మరెందరో హతాశులౌతారని బాధ‌ప‌డ్డాడు. ప్రాణ‌త్యాగం చేసుకుందామ‌ని కూడా ఆలోచించాడు. సీత కనుపించకుండా తాను వెనుకకు వెళ్ళేది లేదని నిశ్చయంచుకొన్నాడు. ఆ సమయంలో అశోక వనం కనిపించింది.


నమోస్తు రామాయ సలక్ష్మణాయ,

 దేవ్యైచ తస్యై జనకాత్మజాయై, 

నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో, 

నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్యః అని ప్రార్థించాడు.

 దేవతలు, మహర్షులు తనకు కార్య సాఫల్యత కూర్చవలెనని కోరాడు. బ్రహ్మ, అగ్ని, వాయుదేవుడు, ఇంద్రుడు, వరుణుడు, సూర్యచంద్రులు, అశ్వినీ దేవతలు, మరుత్తులు, శివుడు, సకల భూతములు, శ్రీమహావిష్ణువు తనకు కార్యసిద్ధి కలిగించాల‌ని ప్రార్థించి సీతాన్వేషణకు చివ‌రి ప్ర‌య‌త్నంగా అశోకవనంలో అడుగుపెట్టాడు.


అశోకవనంలో సీతమ్మ దర్శనం



అశోకవనం అనన్య సుందరమైనది. అందులో చక్కని వృక్షాలు, పూలు, చిత్ర విచిత్రములైన కృతక పర్వతాలు, జలధారలు ఉన్నాయి. అక్క‌డ‌ అతి మనోహరమైన ఒక శింశుపా వృక్షాన్ని ఎక్కి హనుమంతుడు చుట్టుప్రక్కల పరిశీలింపసాగాడు.


అక్కడ శింశుపా వృక్షము క్రింద, రాక్షసకాంతలచే పీడింపబడుతూ, సింహముల మధ్యనున్న లేడివలే భీతయై కృశించిన ఒక స్త్రీని చూశాడు..  ఆమె ధరించిన ఆభరణాలు, ఆమె తీరు, ఉన్న స్థితిని బట్టి హనుమంతుడు ఈమె సీతయే అని నిర్ధారించుకొన్నాడు. ఆమె దీనావస్థను, రామలక్ష్మణాదుల దుఃఖమును తలచుకొని, కాలం ఎంతటివారికైనా అతిక్రమింపరాని బలీయమైనది అనుకొని, హనుమంతుడు దుఃఖించాడు.


*త్రిజటాస్వప్నం*

అశోక‌వ‌నానికి రావ‌ణుడు వ‌చ్చాడు. సీతమ్మ‌ను బెదరించి, తనకు వశంకావాల‌ని ఆదేశించాడు. సీత ఒక గడ్డిపరకను అడ్డంగా పెట్టుకొని, రావణుని ధర్మహీనతను, భీరత్వాన్ని నిందించింది. పోగాలము దాపురించినందువల్లనే ఈ నీచ సంకల్పం కలిగిందని హెచ్చరించింది. శ్రీరాముని బాణాగ్నితో లంక భస్మం కావ‌డం తథ్యమని రావణుడికి గట్టిగా చెప్పింది. ఒక నెల మాత్రము గడువు పెట్టి రావణుడు వెళ్ళిపోయాడు. రాక్షసకాంతలు సీతను నయానా, భయానా అంగీకరింపచేయాలని ప్రయత్నించ సాగారు. రావణునికి వశం కాకపోతే ఆమెను తినేస్తామని బెదరించారు. భయ విహ్వలయై, ఆశను కోల్పోయిన సీత ప్రాణత్యాగం చేయాలని నిశ్చయించుకొన్నది.


వారిలో సహృదయయైన త్రిజట అనే రాక్షసకాంత మిగిలిన రాక్షస స్త్రీలను గద్దించి, సీతవంటి పుణ్యస్త్రీకి హాని చేయడం రాక్షస జాతికి వినాశకరమని హెచ్చరించింది. తనకు వచ్చిన క‌ల గురించి ఇలా  చెప్పింది 

"వేయి హంసలు పూన్చిన తెల్లని ఏనుగుదంతపు పల్లకీలో రామలక్ష్మణులు లంకకు వచ్చారు. తెల్లని పర్వతాగ్రంపై సీత ఆసీనయై ఉంది. ఆమె సూర్య చంద్రులను స్పృశించింది. నాలుగు దంతాలు కలిగిన తెల్లని ఏనుగు నెక్కి, రాముని ఒడిలో సీత కూర్చుని ఉంది. సీతారామలక్ష్మణులు అధివసించిన భద్రగజం ఆకాశంలో లంకపైభాగాన నిలిచింది. ఎనిమిది వృషభములు పూన్చిన రథంపై రాముడు తెల్లని వస్త్రాలతో, సీతా లక్ష్మణులతో లంకలో కనిపించాడు. తరువాత, వారంతా పుష్పకం ఎక్కి ఉత్తర దిశగా వెళ్ళారు.ఇంకో వైపు, "ఎర్రని వస్త్రములు ధరించి, తైలము పూసుకొని రావణుడు మత్తిల్లి, పుష్పకంనుండి క్రింద పడ్డాడు. గాడిదలు పూన్చిన రధంలో ఉన్నాడు. అతని మెడలో త్రాడు కట్టి, నల్లని వస్త్రములు ధరించిన ఒక స్త్రీ దక్షిణానికి లాగుతున్న‌ట్టుంది. అతడు దుర్గంధ నరక కూపంలో పడిపోయాడు. రావణుడు పందినెక్కి, కుంభకర్ణుడు పెద్ద ఒంటెనెక్కి, ఇంద్రజిత్తు మొసలినెక్కి దక్షిణ దిశగా పోయారు. విభీషణుడు మాత్రం తెల్లని గొడుగుతో, దివ్యాభరణాలతో, తెల్లని గజం అధిరోహించి, మంత్రులతో కూడి ఆకాశంలో ఉన్నాడు. లంకా నగరం ధ్వంసమై సముద్రంలో కూలింది. రాక్షస స్త్రీలంతా తైలం త్రాగుతూ, పిచ్చివారివలె లంకలో గంతులు వేస్తున్నారు.....ఇలాంటి దృశ్యాన్ని నేను క‌ల‌లో చూశాను అని త్రిజట చెప్పింద‌. ఇది లంక‌కు రాబోయే చేటుకాలాన్ని సూచిస్తున్న‌ద‌ని హెచ్చ‌రించింది.

ఇలా చెప్పి త్రిజట తమను ఆపదనుండి కాపాడమని సీతాదేవిని వేడుకొనమని తక్కిన రాక్షస కాంతలకు హితవు పలికింది. భయంకరమైన ఆ కల విని రాక్షసకాంతలు భీతిల్లారు. ఆత్మహత్యకు సిద్ధపడిన సీతకు శుభ శకునములు కనిపించసాగాయి.

త్రిజ‌ట త‌న స్వ‌ప్న వృత్తాంతాన్ని వివ‌రించ‌డం హ‌నుమ చెట్టుపై నుంచి విన్నాడు.ఇక ఆల‌స్యం చేయ‌కూడ‌ద‌నుకున్నాడు. అయితే ఒక్క‌సారిగా ఆమెకు క నిపిస్తే కంగారుప‌డుతుంద‌ని, కేక‌లు వేస్తే కాగ‌ల కార్యం చెడిపోతుంద‌ని గ్ర‌హించాడు. నెమ్మ‌దిగా రామ‌క‌థా గానం చెట్టుపైనుంచే ప్రారంభించాడు.

    

ఆ రాముడు సీతను వెదకడానికి పంపిన దూతలలో ఒకడైన తాను ప్రస్తుతం లంకను చేరి, చెట్టుపైనుండి, సీతను చూచానని ఆ కథాక్రమంలో తెలియజేశాడు. ఆ రామకథా శ్రవణంతో సీత కొంత ఆనందించింది. కానీ తాను కలగంటున్నానేమోనని భ్రమ పడింది. తల పైకెత్తి, మెరుపు తీగవలె, అశోక పుష్పము వలె ప్రకాశిస్తున్న వానరుని చూచి కలవరపడింది. తాను విన్న విషయాలు సత్యాలు కావాలని బ్రహ్మకు, మహేంద్రునికి, బృహస్పతికి, అగ్నికి నమస్కరించింది. హనుమంతుడు మెల్లగా చెట్టు దిగివచ్చి ఆమెకు శుభం పలికాడు. సీతకు తన వృత్తాంతాన్ని, రాముని దుఃఖమునూ వివరించాడు. శ్రీరాముని పరాక్రమాన్నీ, గుణగణాలనూ ప్రశంసించి ఆమెకు త్వరలో విముక్తి కలుగుతుందని అనునయ వచనాలు పలికాడు. సీత దుఃఖించి, అందరి క్షేమసమాచారములు అడిగి, ఆపై రాముని వర్ణించమని కోరింది.

 

హనుమంతుడు భక్తితో అనన్య సుందరుడు అయిన రాముని, అతని సోదరుడైన లక్ష్మణుని వర్ణించాడు. "రాముడు ఆజానుబాహుడు. కమల పత్రాక్షుడు. రూప దాక్షిణ్య సంపన్నుడు. శుభలక్షణములు గలవాడు, తేజోమూర్తి, ధర్మ రక్షకుడు, సర్వ విద్యాపారంగతుడు, లోకమర్యాదలను పాటించువాడు. సమ విభక్తములైన శరీరాంగములు కలవాడు. దీర్ఘములైన బాహువులు, శంఖమువంటి కంఠము కలవాడు.  ఉత్తముడు, వీరుడు. నల్లనివాడు. అతని తమ్ముడు లక్ష్మణుడు అట్టి శుభలక్షణములే కలిగి, ఎర్రని మేని ఛాయ గలవాడు - అట్టి రామలక్ష్మణులు నీ కోసం దుఃఖిస్తున్నారు త‌ల్లీ . సుగ్రీవునితో చెలిమి జేసి, నిన్ను వెదక‌టానికి నలువైపులా వానరులను పంపారు. ఓ సీతా దేవీ! త్వరలోనే శ్రీరాముడు నిన్ను ఇక్క‌డినుండి తీసుకువెళ‌తాడు, మ‌న‌స్సు దిట‌వుచేసుకుని ఉండు" - అని హనుమంతుడు చెప్పాడు.


*హనుమంతుడికి* 

*చూడామణి ఇచ్చిన  సీత* :

శ్రీరాముని గురించి విని, సీత ఊరడిల్లింది. తరువాత హనుమంతుడు ఆమెకు శ్రీరాముని ఆనవాలైన అంగుళీయకమును ఇచ్చాడు. రాముడు చెప్పిన మాటలు తెలియజేశాడు. ఆమెకు శుభం పలికాడు. తనతో వస్తే ఆమెను తీసికొని వెళ్ళగలనని అన్నాడు. సీత హనుమంతుని పలుకులకు సంతోషించి అతని పరాక్రమాన్ని ప్రశంసించింది. కాని స్వయంగా శ్రీరాముడే వచ్చి, రావణుని పరిమార్చి, తనను తీసికొని వెళ్ళాలని చెప్పింది. రాముని పరాక్రమానికి ముల్లోకాలలోను ఎదురు లేదని తెలిపింది. రామలక్ష్మణులకు, సుగ్రీవునకు, భల్లూక వానరులకు ధర్మక్రమ మనుసరించి కుశలం అడిగినట్లు తెలుపమని పలికింది. హనుమంతుని ఆశీర్వదించి, తన చూడామణిని ఆనవాలుగా ఇచ్చింది. ఒక్క నెలలో రాముడు తనను కాపాడకుంటే తాను బ్రతుకనని చెప్పింది. ఆ మ‌హాస‌ముద్రాన్ని దాటడం హనుమంతుడు, వాయుదేవుడు, గరుత్మంతుడు తప్పఇతరులకు ఎలా శక్యమని సంశయించింది.


అందుకు హనుమంతుడు తనకంటే గొప్పవారైన మహావీరులు వానరులలో ఎందరో ఉన్నారని, తాను సామాన్యుడను గనుకనే ముందుగా తనను దూత కార్యానికి -యుద్ధానికి కాదు,పంపారని ఆమెకు నచ్చచెప్పాడు. మహావీరులైన రామలక్ష్మణులు కపి భల్లూక సేనా సమేతంగా, త్వరలో లంకకు వచ్చి లంకను వాశనం చేసి రావణ సంహారం సాగించడం తథ్యమని ఆమ‌కు న‌చ్చ చెప్పాడు. హనుమంతుని సీతమ్మ ఆశీర్వదించింది.


యత్ర యత్ర రఘునాథ కీర్తనం

తత్ర తత్ర కృత మస్తకాంజలిం|

బాష్ప‌వారి పరిపూర్ణ లోచనం

మారుతిం నమత రాక్షసాంతకం||


          **

బుద్ధిర్బలం యశో ధైర్యం నిర్భయత్వమరోగతా|

అజాడ్యం వక్పటుత్వంచ హనుమత్ స్మరణాత్ భవేత్||

( ఎవరైతే హనుమంతున్ని నిత్యం ధ్యానిస్తారో వారు ఆరోగ్యం, ఐశ్వర్యం, బుద్ధి, బలం, ధైర్యం, పేరుప్రఖ్యాతులు, ఙ్ఞానం, వాక్చాతుర్యం తప్పక పొందగలుగుతారు.)

   ***

     (సుంద‌ర‌కాండ‌- సీతాద‌ర్శ‌న‌ఘ‌ట్టం స‌మాప్తం)



----------

ఇతిహాసాలు

 *📖 మన ఇతిహాసాలు 📓*


*సృష్టికర్త బ్రహ్మదేవుడికి ఆలయాలే లేవెందుకు? త్రిమూర్తుల్లోకెల్లా చిన్నవాడయిన బ్రహ్మ ఎప్పుడూ వృద్ధుడుగానే ఉంటాడెందుకు?*


పద్మపురాణం ప్రకారం వజ్రనాభ అనే రాక్షసుడు ప్రజల్ని హింసించడం చూసి తట్టుకోలేక వెంటనే తన చేతిలోని తామరపూవునే ఆయుధంగా విసిరి ఆ రాక్షసరాజుని సంహరించాడట సృష్టికర్త. ఆ సందర్భంగా పూవునుంచి రేకులు మూడుచోట్ల రాలి మూడు సరస్సులు ఏర్పడ్డాయట. వాటినే జ్యేష్ట పుష్కర్‌, మధ్య పుష్కర్‌, కనిష్ట పుష్కర్‌ అని పిలుస్తున్నారు. పైగా బ్రహ్మ భూమ్మీదకి వచ్చి తన చేతి(కరం)లోని పుష్పం నుంచి రాలిపడ్డ ప్రదేశం కాబట్టి ఆ ప్రాంతానికి పుష్కర్‌ అని పేరు పెట్టాడట. ఆ తరవాత లోకకల్యాణం కోసం అక్కడే యజ్ఞం చేయాలనీ సంకల్పించాడట. ఎలాంటి ఆటంకాలూ లేకుండా యజ్ఞం ప్రశాంతంగా నిర్వహించేందుకు రాక్షసులు దాడి చేయకుండా సరస్సుకి దక్షిణాన రత్నగిరి, ఉత్తరాన నీలగిరి, పశ్చిమాన సంచూరా, తూర్పున సూర్యగిరి అనే కొండల్ని సృష్టించి దేవతలందరినీ ఆహ్వానించాడు. సుమూహుర్తం ఆసన్నమయింది. ఆహూతులంతా విచ్చేశారు. సావిత్రీదేవి(ఈమెనే సరస్వతి అని పిలుస్తారు)ని తీసుకుని రమ్మని కుమారుడైన నారదుడిని పంపిస్తాడు బ్రహ్మ.


నారదుడు వెళ్లేసరికి ఆమె రావడానికి సిద్ధంగానే ఉంది. కానీ కలహభోజనుడు వూరికే ఉంటాడా... 'నువ్వు ఒక్కదానివే అప్పుడే వచ్చి ఏం చేస్తావు. నీ స్నేహితులతో కలిసిరమ్మ'ని సలహా ఇస్తాడు. దాంతో తన సహచరులైన లక్ష్మీ, పార్వతిలతో కలిసి వద్దామని ఆగిపోతుంది సావిత్రి. యజ్ఞవాటిక దగ్గర మూహూర్తం మించిపోతోంది. సావిత్రీదేవి జాడ లేదు. దేవతలు, రుషులు అంతా సిద్ధంగా ఉన్నారు. అనుకున్న మూహూర్తానికే యజ్ఞం జరగాలన్న తలంపుతో బ్రహ్మదేవుడు ఇంద్రుడితో 'వెంటనే ఓ అమ్మాయిని చూడు. వివాహం చేసుకుని యజ్ఞం నిర్వహిస్తాను' అనడంతో సమీపంలోని గుజ్జర్ల కుటుంబానికి చెందిన పాలమ్ముకునే ఓ అమ్మాయిని తీసుకొస్తాడు ఇంద్రుడు. శివుడు, శ్రీమహావిష్ణువు సలహాల ప్రకారం గోవులోకి పంపించడం ద్వారా ఆమెను శుద్ధి చేస్తారు. ఇలా చేస్తే ఆమె పునర్జన్మ ఎత్తినట్లేనని చెప్పి అభ్యంగన స్నానం

చేయించి సర్వాభరణశోభితురాలిని చేస్తారు. గోవుతో శుద్ధిచేయబడినది కాబట్టి ఆమెకు గాయత్రి అని నామకరణం చేసి నిర్ణీత సమయానికి యజ్ఞం ప్రారంభిస్తారు. పూర్తవుతున్న సమయంలో అక్కడకు వచ్చిన సావిత్రీదేవి బ్రహ్మదేవుడికి పక్కన మరో స్త్రీ ఉండటం చూసి ఉగ్రరూపం దాలుస్తుంది. బ్రహ్మదేవుడితోసహా అక్కడున్న వారందరినీ శపిస్తుంది. భర్తని వృద్ధుడై పొమ్మనీ ఆయనకు ఒక్క పుష్కర్‌లో తప్ప మరెక్కడా ఆలయాలు ఉండవనీ శపిస్తుంది. అన్ని యుద్ధాల్లోనూ ఓటమి తప్పదని ఇంద్రుడినీ, మానవజన్మ ఎత్తి భార్యావియోగంతో బాధపడతావని విష్ణుమూర్తినీ, శ్మశానంలో భూతప్రేతగణాలతో జీవించమని ఈశ్వరుణ్ణీ, దారిద్య్రంతో ఇల్లిల్లూ తిరిగి భిక్షాటన చేసుకొమ్మని బ్రాహ్మణులనీ ధనమంతా దొంగలపాలయి నిరుపేదగా మారమని కుబేరుణ్ణీ శపిస్తుందట. తరవాత ఆమె రత్నగిరి పర్వతాల్లోకి వెళ్లి తపస్సమాధిలోకి వెళ్లిపోయిందనీ ఆపై నదిగా మారిందనీ చెబుతుంటారు.


దీన్ని సూచిస్తూ రత్నగిరి కొండమీద సావిత్రీమాత ఆలయంతోపాటు ఓ చిన్న నీటిప్రవాహం కూడా ఉంది. దీన్ని సావిత్రీనది అని పిలుస్తారు స్థానికులు. ఆమెను పూజించిన స్త్రీలకు నిత్యసుమంగళి వరాన్ని ప్రసాదిస్తుందన్న నమ్మకంతో పుష్కర్‌ను సందర్శించిన భక్తులంతా ఆమె ఆలయాన్ని కూడా తప్పక దర్శిస్తారు.


సావిత్రీదేవి వెళ్లిన తరవాత బ్రాహ్మణులను యజ్ఞం పూర్తిచేయమని కోరతాడు బ్రహ్మదేవుడు. అందుకు వారంతా తమకు శాపవిముక్తి చేయమనీ ఆ తరవాతే యజ్ఞక్రతువు చేస్తామనీ అంటారట. అప్పటికే యజ్ఞఫలంతో సిద్ధించిన శక్తులతో గాయత్రీదేవి పుష్కర్‌ ప్రముఖ తీర్థక్షేత్రంగా వర్ధిల్లుతుందనీ ఇంద్రుడు మళ్లీ స్వర్గాన్ని గెలుచుకుంటాడనీ విష్ణుమూర్తి రాముడిగా జన్మిస్తాడనీ బ్రాహ్మణులు గురువులుగా గౌరవాన్ని అందుకుంటారంటూ శాపతీవ్రతని తగ్గిస్తుందట. బ్రహ్మదేవాలయం పుష్కర్‌లో మాత్రమే ఉండటానికి ఇదే కారణమట. అయితే బ్రహ్మదేవాలయాలు అత్యంత అరుదుగానయినా అక్కడక్కడా లేకపోలేదు.


*chandrasekharrallabhandhiastrloger🎣*

మొగలిచెర్ల

 *చీటీలు..స్వామి ఆదేశం..*


"నీకు గుర్తుంది కదా?..రెండేళ్ల క్రిందట నేను ఏ పరిస్థితుల్లో ఈ స్వామివారి వద్దకు వచ్చానో..అడుగుతీసి అడుగు వేయాలంటే ఆయాసం.. తలకాయ లోపల బొంగరం లా తిప్పుతున్నట్లు ఒకటే బాధ..ఏ దిక్కూ తోచక..స్వామినే నమ్ముకొని వచ్చాను..ఐదు రోజులు ఉండిపోదామని అనుకున్నదానిని నలభై రోజులపాటు నన్ను ఇక్కడే ఉంచాడు..రోజూ ఉదయం సాయంత్రం నా చేత ప్రదక్షిణాలు చేయించాడు..నా జబ్బు లన్నీ తగ్గిపోయేదాకా ఇక్కడే వున్నాను..నువ్వు కానీ..ఇక్కడున్న ఇతర మనుషులు కానీ నన్ను స్వంత మనిషిలా చూసుకున్నారు..అన్నీ గుర్తున్నాయి నాయనా..ఆరోగ్యం కుదటబడి మా ఊరికి వెళ్ళిపోయాను..రోజూ స్వామివారి పటానికి దణ్ణం పెట్టుకున్న తరువాతే నా పని చేసుకోవడం అలవాటైపోయింది..మూడు నెలల క్రితం ఇక్కడికి రావాలని అనుకున్నాను..ఒకరోజు దత్తదీక్ష తీసుకున్న స్వాముల భిక్ష కొరకు విరాళం ఇద్దామని అనుకున్నాను..తీరా మా ఆయన నేనూ రెండురోజుల్లో ఇక్కడికి వద్దామని బైలుదేరేలోపల..లాక్ డౌన్ పెట్టేసారు..ఎటూ వెళ్లలేని పరిస్థితి..మొన్న నీకు ఫోన్ చేస్తే..స్వామివారి మందిరం తీసే ఉంది..మీరు దర్శనం చేసుకొని వెళ్లొచ్చు అని చెప్పావు..సరిగ్గా బస్సులు లేవు..రైళ్ళూ లేవు..అంతదూరం నుంచి కారు మాట్లాడుకుని వచ్చాము..కళ్లారా స్వామి సమాధిని చూసాను నాయనా..తృప్తిగా ఉంది..మళ్లీ భోజనాలు కూడా పెడుతున్నారు..మంచిపని చేశారు..ఈ మారుమూల ఏమీ దొరకదు..దత్తుడి దగ్గరకు వచ్చిన వాళ్ళు ఆకలితో వుండరు..ఉండకూడదు.." 


అని నిన్న ఆదివారం ఉదయం 11 గంటల వేళ మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి మందిరానికి వచ్చిన సరస్వతమ్మ గారు చెప్పారు..వారి భర్త వామనరావు గారు ప్రక్కనే కూర్చుని వున్నారు.."సరస్వతి మళ్లీ మామూలు మనిషి అవుతుందని నేను ఏకోశానా నమ్మలేదు ప్రసాద్ గారూ..అటువంటిది ఆమె తన పనులు తాను చేసుకోవడమే కాకుండా..మునుపటి లాగా నాకూ అన్ని ఏర్పాట్లూ చేస్తోంది..స్వామివారి మహిమను కళ్లారా చూసాము..సమాధి లో ఉన్నాడేగానీ..పిలిస్తే పలుకుతారు..మాకు ఏ కష్టం వచ్చినా..స్వామివారి పటం ముందు నిలబడి చెప్పుకుంటాము..ఇంకా సందేహం ఉంటే..చీటీలు వ్రాసి..ఆ పటం ముందు పెడతాము..ఏ చీటి లో ఉన్నది ముందుగా మా చేతికి వస్తే..అదే స్వామివారి ఆదేశం క్రింద లెక్క పెట్టుకుంటాము..మా పిల్లల ఇళ్లకు వెళ్లాలన్నా..స్వామివారి ఆదేశం ఉంటేనే వెళతాము..లేకుంటే వెళ్ళము.." అని చెప్పారు..


ఆ దంపతులు మధ్యాహ్నం స్వామివారి నైవేద్యం అప్పుడు ఇచ్చే హారతి కళ్లకద్దుకొని..అన్నదాన సత్రం వద్దకు వెళ్లి భోజనం చేసి మళ్లీ వచ్చారు.."ఎప్పటిలాగే ఈ సంవత్సరం కూడా గురుపౌర్ణమి కి దత్తహోమము చేస్తున్నారు కదా.." అని అడిగారు.."నిర్వహిస్తున్నాము.." అని చెప్పాను..కాకుంటే..ఇప్పుడున్న పరిస్థితులలో ఎక్కువ మంది కొరకు హోమగుండాలు నిర్మించడం లేదు..చాలా పరిమితంగా చేస్తున్నాము..ప్రభుత్వ ఆదేశాలు పాటించాలి.." అన్నాను.."అలాగా.." అన్నారు..కొంచెం సేపు ప్రక్కకు వెళ్లి మాట్లాడుకుని వచ్చారు.."ప్రసాద్ గారూ..దత్తా దీక్ష ల సమయం లో స్వాముల అన్నదానం కొరకు మేము తీసివుంచిన డబ్బు అలాగే ఉండిపోయింది..దత్తహోమము లో మేము పాల్గొంటాము..ఆరోజు ఆదివారం కూడా..స్వామి దగ్గరే ఉంటాము..ఆ తరువాత..మీకు వీలున్నప్పుడు..మా పేరుతో రెండురోజులు అన్నదానం చేయండి.." అని చెప్పారు.."నాయనా..నువ్వు అనుమతి ఇస్తే..ఇంకొక్కసారి స్వామివారి సమాధి దర్శించుకొని వెళ్లిపోతాము.." అని సరస్వతి గారు ప్రాధేయపూర్వకంగా అడిగారు..సరే అన్నాను..స్వామివారి సమాధిని దర్శించుకొని ఆ దంపతులు వెళ్లిపోయారు..


సర్వం..

శ్రీ దత్తకృప!!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..వయా కందుకూరు..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్ : 523114..సెల్..94402 66380..మరియు..99089 73699).

- అధి దేవతలు

 🎻🌹🙏*🌹తెలుగు అక్షరాలు- అధి దేవతలు- పదప్రయోగం..*


🌺🌿🌺🌿🌺🌿🌺🌿🌺🌿🌺🌿


*🌹అధిదేవతలు:*🌹


వసినీన్యాది వాగ్దేవతలు: వశిని , కామేశ్వరి, మోదిని, విమల, అరుణా . జయని కౌళిని మరియ సర్వేశ్వరి మొదలగు తెలుగు భాషలో  వాగ్దేవతల యొక్క వర్ణమాల 



*🌹అంతర్నిర్మాణం :*🌹


"అ నుండి అః" వరకు ఉన్న 16 అక్షరాల విభాగాన్ని "చంద్ర ఖండం" అంటారు. 


ఈ చంద్రఖండంలోని అచ్చులైన 16 వర్ణాలకు  అధిదేవత "వశిని" అంటే వశపరచుకొనే శక్తి కలది అర్ధం.


"క"  నుండి  "భ" వరకు ఉన్న 24 అక్షరాల విభాగాన్ని " సౌర ఖండం " అంటారు.


 "మ" నుండి "క్ష" వరకు ఉన్న 10 వర్ణాల విభాగాన్ని " అగ్ని ఖండం" అంటారు.  


ఈ బీజ శబ్దాలన్నీ జన్యు నిర్మాణాన్ని క్రోమౌజోములను ప్రభావితం చేయగలుగుతాయి.


సౌర ఖండంలోని " క "నుండి "ఙ" వరకు  గల ఐదు అక్షరాల అధిదేవత కామేశ్వరి. అంటే కోర్కెలను మేలుకొలిపేది అని అర్ధం.


"చ" నుండి "ఞ" వరకు గల ఐదు వర్ణాలకు అధిదేవత  "మోదిని"  అంటే సంతోషాన్ని వ్యక్తం చేసేది.


"ట" నుండి "ణ" వరకు గల ఐదు అక్షరాల  అధిదేవతా శక్తి "విమల". అంటే మలినాలను తొలగించే దేవత.


"త" నుండి "న" వరకు గల ఐదు అక్షరాలకు అధిదేవత "అరుణ"  కరుణను మేలుకొలిపేదే అరుణ.


"ప" నుండి "మ" అనే ఐదు అక్షరాలకు అధిదేవత "జయని". జయమును కలుగ చేయునది.


అలాగే అగ్ని ఖండంలోని " య, ర,ల, వ అనే అక్షరాలకు అధిష్టాన దేవత " సర్వేశ్వరి". శాశించే శక్తి కలది సర్వేశ్వరి.


ఆఖరులో ఐదు అక్షరాలైన "శ, ష, స, హ, క్ష లకు అధిదేవత "కౌలిని" 


ఈ అధిదేవతలనందరినీ "వాగ్దేవతలు" అంటారు. 


అయితే ఈ ఏడుగురే కాకుండా అన్ని వర్ణాలకు ప్రకృతిలో ఒక రూపం, ఒక దేవతాశక్తి ఉంది. ఎందుకంటే శబ్దం బ్రహ్మ నుండి అద్భవించింది. అంటే బ్రహ్మమే శబ్దము. ఆ బ్రహ్మమే నాదము.


మనం నిత్యజీవితంలో  సంభాషించేటప్పుడు వెలువడే శబ్దాలు మనపై, ప్రకృతి పై ప్రభావం చూపుతాయి. అదే మంత్రాలు, వేదం అయితే ఇంకా లోతుగా ప్రభావం చూపుతుంది. భూమి మీద పుట్టిన ప్రతి జీవి ఈ శబ్దాల్ని ఉచ్ఛరించి అమ్మవార్లును అర్చిస్తున్నాయి..సేకరణ..🙏🌹🎻


🌺🌿🌺🌿🌺🌿🌺🌿🌺🌿🌺🌿

మహా పానీయం

 🎻🌹🙏*మజ్జిగ - మహా పానీయం* 


        🌷  “మ౦చుకొ౦డల్లో పాలు తోడుకోవు. అ౦దుకని, అక్కడ పెరుగుగానీ, దాన్ని చిలికిన మజ్జిగ గానీ దొరికే అవకాశలు ఉ౦డవు. ఈ కారణ౦గా, కైలాస౦లో ఉ౦డే పరమ శివుడికి, మజ్జిగ తాగే అల వాటు లేకపోవటాన ఆయన నీలక౦ఠుడయ్యాడు. “🌷


🌷“ పాల సముద్ర౦లో నివసి౦చే విష్ణుమూర్తికి మజ్జిగ ఎటు తిరిగీ దొరకవు కాబట్టే, ఆయన నల్లని వాడయ్యాడు. 🌷“


🌷“స్వర్గ౦లో ‘సుర’ తప్ప మజ్జిగ దొరకవు కాబట్టి, ఇ౦ద్రుడు బలహీనుడు అయ్యాడు. 🌷“


   🌷“మజ్జిగతాగే అలవాటే గనక ఉ౦టే, చ౦ద్రుడుకి క్షయ వ్యాధి, వినాయకుడికి పెద్ద పొట్ట, కుబేరుడికి కుష్టురోగ౦, అగ్నికి కాల్చే గుణ౦ ఇవన్నీ వచ్చేవే కాదు” 🌷


🌷*యోగ రత్నాకర౦* అనే వైద్యగ్ర౦థ౦లో ఈ *చమత్కార విశ్లేషణ* కనిపిస్తు౦ది. 🌷


🌷మజ్జిగ తాగేవాడికి ఏ వ్యాధులూ కలగవనీ, వచ్చిన వ్యాధులు తగ్గి, తిరిగి తలెత్తకు౦డా ఉంటాయనీ, “విషదోషాలు”, “దుర్బలత్వ౦”, “చర్మరోగాలు”, “క్షయ”, “కొవ్వు”, “అమిత వేడి” తగ్గిపోతాయనీ, శరీరానికి మ౦చి వర్చస్సు కలుగుతు౦దనీ దీని భావ౦. అక్కడ దేవతల కోస౦ అమృతాన్నీ, ఇక్కడ మానవుల కోస౦ మజ్జిగనీ భగవ౦తుడు సృష్టి౦చాడట!*🌷


🌷వేసవి కాలాన్ని మన౦ మజ్జిగతోనే ఎక్కువగా గడిపే౦దుకు ప్రయత్ని౦చాలి. తోడుపెట్టిన౦దు వలన పాలలో ఉ౦డే పోషక విలువలన్నీ మజ్జిగలోనూ పదిల౦గా ఉ౦డట౦తో పాటు, అదన౦గా “లాక్టో బాసిల్లై” అనే “మ౦చి బాక్టీరియా” మనకు  దొరుకుతు౦ది. పాలలో ఈ ఉపయోగకారక బాక్టీరియా ఉ౦డదు.🌷


🌷అ౦దుకని, వయసు పెరుగు తున్నకోద్దీ మజ్జిగ అవసర౦ పెరుగుతు౦ది. *ప్రిజ్జులో పెడితే మజ్జిగలోని ఈ బాక్టీరియా నిరర్థక౦ అవు తు౦ది. అ౦దుకని అతి చల్లని మజ్జిగ తాగకూడదు.🌷 


🌷చిలికిన౦దువలన మజ్జిగకు తేలికగా అరిగే గుణ౦ వస్తు౦ది. అ౦దుకని పెరుగుకన్నా మజ్జిగ మ౦చిది.🌷


🌷*వేసవి కోస౦ ప్రత్యేక౦ “కూర్చిక పానీయ౦”:*🌷    


🌷ఒక గ్లాసు పాలు తీసుకొని, కాచి చల్లార్చి అ౦దులో రె౦డుగ్లాసుల పుల్లని మజ్జిగ కలప౦డి. ఈ పానీయాన్ని  *‘కూర్చిక’* అ౦టారు. ఇ౦దులో “ప౦చదార” గానీ, “ఉప్పు” గానీ కలపకు౦డానే తాగవచ్చు. *”ధనియాలు”, “జీలకర్ర”, “శొ౦ఠి” ఈ మూడి౦టినీ  100 గ్రాముల చొప్పున దేనికదే మెత్తగా ద౦చి, మూడి౦టినీ కలిపి తగిన౦త “ఉప్పు” కూడా చేర్చి, దాన్ని ఒక సీసాలో భద్రపరచుకో౦డి. “కూర్చిక”ను తాగినప్పుడల్లా, అ౦దులో దీన్ని ఒక చె౦చా మోతాదులో కలిపి తాగ౦డి. వడదెబ్బ కొట్టదు. పేగులకు బలాన్నిస్తు౦ది. జీర్ణకోశ వ్యాధులన్ని౦టికీ ఇది మేలు చేస్తు౦ది. వేసవిలో కలిగే జలుబుని నివారిస్తు౦ది.🌷


🌷*వడదెబ్బ కొట్టని పానీయ౦ “రసాల”:*🌷


🌷పెరుగు మీద తేరుకున్న నీళ్ళు, పాలు కలగలిపి ఆరోగ్యకరమైన “రసాల” అనే పానీయాన్ని “భీముడు” తయారు చేశాడని “భావప్రకాశ” వైద్య గ్ర౦థ౦లో ఉ౦ది*. అరణ్యవాస౦లో ఉన్నప్పుడు, పా౦డవుల దగ్గరకు శ్రీ కృష్ణుడు వస్తే, భీముడు స్వయ౦గా దీన్ని తయారు చేసి వడ్డి౦చాడట! *ఇది దప్పికని పోగొట్టి వడదెబ్బ తగలకు౦డా చేస్తు౦ది* కాబట్టి, ఎ౦డలో తిరిగి ఇ౦టికి వచ్చిన వారికి ఇచ్చే పానీయ౦ ఇది. తన ఆశ్రమాన్ని స౦దర్శి౦చటానికి శ్రీరాముడు వచ్చినప్పుడు భరద్వాజ మహర్షి  రాముని గౌరవార్థ౦ ఇచ్చిన వి౦దులో రసాల కూడా ఉ౦ది. *భావ ప్రకాశ* వైద్య గ్ర౦థ౦లో దీన్ని ఎలా తయారు చేసుకొవాలో వివర౦గా ఇచ్చారు:🌷


🌷*ఎoడలోకి వెళ్లబోయే ము౦దు దీన్ని తాగoడి:*🌷


🌷*చక్కగా “చిలికిన  మజ్జిగ” ఒక గ్లాసుని౦డా తీసుకో౦డి. అ౦దులో ఒక “నిమ్మకాయ రస౦”, తగిన౦త “ఉప్పు”, “ప౦చదార”, చిటికెడ౦త “తినేసోడాఉప్పు” కలిపి* తాగి అప్పుడు ఇ౦ట్లో౦చి బయటకు వెళ్ల౦డి వడదెబ్బకొట్టకు౦డా ఉ౦టు౦ది. మరీ ఎక్కువ ఎ౦డ తగిలి౦దనుకొ౦టే తిరిగి వచ్చిన  తరువాత ఇ౦కోసారి త్రాగ౦డి. *ఎ౦డలో ప్రయాణాలు చేయవలసి వస్తే, ఒక సీసాని౦డా దీన్ని తయారు చేసుకొని వె౦ట తిసుకెళ్ల౦డి. మాటిమాటికీ తాగుతూ ఉ౦టే వడదెబ్బ కొట్టదు...🌞🙏🌹🎻


🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸