21, సెప్టెంబర్ 2022, బుధవారం

భూమి కొలతలు

 *భూమి కొలతలు మరియు రెవిన్యూ భాషలో రికార్డుల పేర్లు*

1) ఒక ఎకరాకు = 40 గుంటలు

2) ఒక ఎకరాకు = 4840 Syd

3) ఒక ఎకరాకు = 43,560 Sft

4) ఒక గుంటకు = 121 Syd

5) ఒక గుంటకు = 1089 Sft

6) ఒక స్క్వయర్ యార్డ్ కు 3 x 3 = 09

చదరపు ఫీట్లు

7) 121 x 09 = 1089 Sft

8) 4840 Syd x 09 = 43,560 Sft

9) ఒక సెంట్ కు = 48.4 Syd

10) ఒక సెంట్ కు = 435.6 Sft ఎకరానికి 1⁄100 (40.5 మీ 2; 435.6 చదరపు అడుగులు) విస్తీర్ణంలో ఒక శాతం నిర్వచించబడింది. ఇది ఇప్పటికీ చాలా వార్తా నివేదికలు మరియు రియల్ ఎస్టేట్ ఒప్పందాలలో ఉపయోగించబడుతుంది.

*(ఒక ఎకరానికి 4046.8564224 చదరపు మీటర్లు (4046.82 చ.మీ కొందరు) ఒక ఎకరానిక్ 43, 560 చదరపు అడుగులు ఒక ఎకరానికి 0.405 హెక్టార్లు.ఒక ఎకరానికి 4840 చదరపు గజాలు (4800 చ.గ. కొందరు)ఒక ఎకరానికి 605 అంకణములు.ఒక ఎకరానికి 100 సెంట్లు. సెంటుకి 48.4 గజములు. అంటే 4840 గజములు ఒక ఎకరం. 40 గుంటలు ఒక ఎకరం (4840 గజములు) . 121 గజములు ఒక గుంట. 66 చదరపు అడుగులు × 660 చదరపు అడుగులు = ఒక ఎకరం సుమారుగా 208.71 చదరపు అడుగులు × 208.71 చదరపు అడుగులు = ఒక ఎకరం. 2.47 ఎకరాలు ఒక హెక్టారు. ఒక హెక్టారుకు 2 ఎకరాల 47 సెంట్లు)*

Land servay కోసం అత్యవసరమైన information...

*అడంగల్ (పహాణీ)* :

గ్రామంలోని సాగు భూముల వివరాలు నమోదు చేసే రిజిస్టర్ను అడంగల్ (పహాణీ) అంటారు. ఆంధ్ర ప్రాం తంలో అడంగల్ అనీ, తెలంగాణలో పహాణీ అని పిలుస్తారు. భూమికి సంబంధించి చరిత్ర మొత్తం ఇందులో ఉంటుంది. భూముల కొనుగోలు, అమ్మకాలు, సాగు చేస్తున్న పంట వివరాలు ఎప్పటికపుడు ఇందులో నమోదు చేస్తారు.

*తరి* : నీటి పరిదాల భూమి

*ఖుష్కీ* : మెట్ట ప్రాంతం

*గెట్టు* : పొలం హద్దు

*కౌల్దార్* : భూమిని కౌలుకు తీసకునేవాడు

*కమతం* : భూమి విస్తీర్ణం

*ఇలాకా* : ప్రాంతం

*ఇనాం*: సేవలను గుర్తించి ప్రభుత్వం ఇచ్చే భూమి

*బాలోతా ఇనాం* :

భూమిలేని నిరుపేద దళితులకు ప్రభుత్వం ఇచ్చే భూమి

*సర్ఫేఖాస్* : నిజాం నవాబు సొంత భూమి

*సీలింగ్* : భూ గరిష్ఠ పరిమితి

*సర్వే నంబర్* : భూముల గుర్తింపు కోసం కేటాయించేది.(మనిషికి పేరు లాగా)

*నక్షా* : భూముల వివరాలు తెలిపే చిత్రపటం

*కబ్జాదార్* : భూమిని తన ఆధీనంలో ఉంచుకుని అనుభవించే వ్యక్తి

*ఎన్కంబరెన్స్ సర్టిఫికెట్ (ఈసీ)* : భూ స్వరూపాన్ని తెలియజేసే ధ్రువీకరణ పత్రం. 32 ఏళ్లలోపు ఓ సర్వే నంబర్ భూమికి జరిగిన లావాదేవీలను తెలియజేసే దాన్ని ఈసీ అంటారు.

*ఫీల్డ్ మెజర్మెంట్ (ఎఫ్ఎంబీ) బుక్* :

దీన్నే ఎఫ్ఎంబీ టీపన్ అని కూడా అంటారు. గ్రామ రెవెన్యూ రికార్డుల్లో ఎఫ్ఎంబీ ఒక భాగం. ఇందులో గ్రామంలోని అన్ని సర్వే నంబర్లు, పట్టాలు, కొలతలు ఉంటాయి.

*బందోబస్తు* వ్యవసాయ భూములను సర్వే చేసి వర్గీకరణ చేయడాన్ని బందోబస్తు అంటారు.

*బీ మెమో* : ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుని సాగు చేసుకుంటున్న వ్యక్తి శిస్తు, జరిమానా చెల్లించాలని ఆదేశించే నోటీస్ను బీ మెమో అంటారు.

*పోరంబోకు* : భూములపై సర్వే చేసే నాటికి సేద్యానికి పనికిరాకుండా ఉన్న భూములు. ఇది కూడా ప్రభుత్వ భూమే.

*ఫైసల్ పట్టీ* : బదిలీ రిజిస్టర్

*చౌఫస్లా* : ఒక రెవెన్యూ గ్రామంలో ఒక రైతుకు ఉన్న వేర్వేరు సర్వేనంబర్ల భూముల పన్ను ముదింపు రికార్డు.

*డైగ్లాట్* : తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో ముద్రించిన శాశ్వత ఏ-రిజిస్టర్.

*విరాసత్/ఫౌతి* భూ యజమాని చనిపోయిన తర్వాత అతడి వారసులకు భూమి హక్కులు కల్పించడం.

*కాస్తు* : సాగు చేయడం

*మింజుములే* : మొత్తం భూమి.

*మార్ట్గేజ్* : రుణం కోసం భూమిని కుదవపెట్టడం.

*మోకా* : క్షేత్రస్థాయి పరిశీలన(స్పాట్ఇన్స్పెక్షన్).

*పట్టాదారు పాస్ పుస్తకం* : రైతుకు ఉన్న భూమి హక్కులను తెలియజేసే పుస్తకం.

*టైటిల్ డీడ్* భూ హక్కు దస్తావేజు, దీనిపై ఆర్డీవో సంతకం ఉంటుంది.

*ఆర్వోఆర్ (రికార్డ్స్ ఆఫ్ రైట్స్)* : భూమి యాజమాన్య హక్కుల రిజిస్టర్.

*ఆర్ఎస్సార్ * రీ సెటిల్మెంట్ రిజిస్టర్ లేదా శాశ్వత ఏ రిజిస్టర్.

*పర్మినెంట్ రిజిస్టర్* :

సర్వే నంబర్ల వారీగా భూమి శిస్తులను నిర్ణయించే రిజిస్టర్. సేత్వార్ స్థానంలో దీన్ని ప్రవేశపెట్టారు.

*సేత్వార్* : రెవెన్యూ గ్రామాల వారీగా మొదటి సారి చేసిన భూమి సర్వే వివరాలు, పట్టాదారుల వివరాలు తెలిపే రిజిస్టర్. ఇది 1953 దాకా అమలులో ఉంది. తర్వాత ఖాస్రా పహాణీ అందుబాటులోకి వచ్చింది.

*సాదాబైనామా* : భూ క్రయ విక్రయాలకు సంబంధించి తెల్లకాగితంపై రాసుకొనే ఒప్పంద పత్రం.

*దస్తావేజు * భూముల కొనుగోళ్లు, అమ్మకాలు, కౌలుకు ఇవ్వడం లాంటి ఇతరత్ర లావాదేవీలను తెలియజేసే పత్రం.

*ఎకరం* భూమి విస్తీర్ణం కొలమానం. 4840 చదరపు గజాల స్థలంగానీ, 100 సెంట్లు (ఒక సెంటుకు 48.4 గజాలు)గానీ, 40గుంటలు (ఒక గుంటకు 121 గజాలు)ను ఎకరం అంటారు. ఆంధ్రా ప్రాంతంలో సెంటు, తెలంగాణలో గుంట అని అంటారు.

*అబి* వానకాలం పంట

*ఆబాది* : గ్రామకంఠంలోని గృహాలు లేదా నివాస స్థలాలు

*అసైన్మెంట్* ప్రత్యేకంగాకేటాయంచిన భూమి

*శిఖం* చెరువు నీటి నిల్వ ఉండే ఏరియా విస్తీర్ణం

*బేవార్స్* హక్కుదారు ఎవరో తెలియకపోతే దాన్ని బేవార్స్ భూమి అంటారు.

*దో ఫసల్* రెండు పంటలు పండే భూమి

*ఫసలీ* జులై 1నుంచి 12 నెలల కాలన్ని ఫసలీ అంటారు.

*నాలా* వ్యవసాయేతర భూమి

*ఇస్తిఫా భూమి* పట్టదారు స్వచ్ఛందంగా ప్రభుత్వపరం చేసిన భూమి

*ఇనాం దస్తర్దాన్ :

పొగడ్తలకు మెచ్చి ఇచ్చే భూమి

*ఖాస్రాపహానీ* ఉమ్మడి కుటుంబంలో ఒక వ్యక్తి పేరుమీద ఉన్న భూ రికార్డులను మార్పు చేస్తూ భూమి పట్టా కల్పించిన పహాణీ.

*గైరాన్* సామాజిక పోరంబోకు

*యేక్రార్నామా* ఇరు గ్రామాల పెద్దల నుంచి సర్వేయర్ తీసుకునే గ్రామాల ఒప్పందం.

By CCLA

భారతదేశ ఆర్థిక వ్యవస్థ

 నరేంద్ర మోదీ అధికారములోకి రాకుంటే ఈరోజు భారతదేశ ఆర్థిక వ్యవస్థ యెంత అద్వాన్నంగా ఉండేదో పూర్తి ఆధారాలతో రిజర్వ్ బ్యాంకు మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ దైర్యంగా వ్రాసిన సంచలన వ్యాసానికి తెలుగు స్వేచ్ఛానువాదము.ఈ వ్యాసాన్నిభారతపౌరులు,జాతీయభావాలు గలవారు ముఖ్యం గా హిందువులమని చాటుగా అనుకునేవారు విధిగా చదువాలి.

🚩ఏ దేశ ప్రభుత్వమైనా మొదట చేయాల్సింది తమ దేశ ఆర్థిక వ్యవస్థను పరిపుష్ఠం గావించడం,రుణ విముక్తి గావించడం,దేశ జి.డి.పిని పెంచుకోవడం, అంతర్జాతీయ స్థాయిలో తన దేశాన్ని నిలదొక్కుకునే విధంగా చేయడం,ఇంటా,బయట శత్రువులను అణచి వేయడం, సైనికపాటవాన్ని ,పటాలాన్ని పెంచుకోవడం మరియు అత్యాధునిక ఆయుధాలను సమకూర్చుకో వడం.

🚩ఈ విషయాలలో నరేంద్ర మోదీ రాకపూర్వం భారత్ యెలా ఉండింది?వచ్చాక ప్రస్తుతం ఎలా వుంది?అని బేరీజు వేసుకున్నప్పుడే అతడి పాలనా దక్షత దేశ ప్రజలకు అర్థమవుతుంది.వారు 2014 మే 26 వ తేదీన మన్మోహన్ సింగ్ నుండి 14 వ భారతదేశ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. 

🎈మన్మోహన్ సింగ్ నేతృత్వములోనున్న యూ.పి.ఏ ప్రభుత్వ హయాములో అగస్టు,29,2013 నఈ దేశ మీడియా ఒక సంచలన వార్త ప్రచురించింది.

అది అంతర్జాతీయ స్థాయిలో మన భారతదేశ ప్రతిష్టను దిగజార్చింది.అదేమంటే అప్పటి కేంద్ర ప్రభుత్వ వాణిజ్య,పరిశ్రమల శాఖ మంత్రి ఆనంద్ శర్మ దేశములోని 5 లక్షల 57 వేల కిలోల బంగారములో 5 లక్షల కిలోల బంగారాన్ని తీసివేయాలని నిర్ణయిం చింది. అంటే 90% గోల్డ్ కార్పస్ ను తనఖా పెట్టాలని నిర్ణయించిందన్న మాట.ఈ వార్త మన దేశ ఆర్థిక పరిస్థితి యెంత క్లిష్ట స్థితిలో ఉందో చెప్పకనే చెబుతుంది.ఆర్థిక నిపుణుడని సర్టిఫికేటు పొందిన మన్మోహన్ సింగ్ పది సంవత్సరాల పాలనలో దేశ ఆర్థిక వ్యవస్థను యెంత దిగజార్చారో తెలుస్తుంది.

🎈అప్పుడు మనదేశ గోల్డ్ కార్పస్ నిల్వలు కేవలం 

5 లక్షల 57 వేల కిలోలు మాత్రమే .అప్పుడు పది గ్రాముల బంగారం ధర రూ.27,750లు. అంటే,మొత్తం బంగారం విలువ రూ.1.38 లక్షల కోట్లు.

🎈ఈ వార్త ప్రచురించ బడ్డాక దేశప్రజలు అగ్రహెూద గ్రులై,అభద్రతకు గురై ఒత్తిడికి లోసయ్యారు.అప్పుడు వాణిజ్య శాఖా మాత్యులు ఆనంద్ శర్మ తన ప్రతిపాదనను ఉపసంహరించుకొని తన అభిప్రాయాన్ని మీడియా తప్పుగా ప్రచురించిందని,సవరణ వివరణనిచ్చారు.

ఆ తరువాత రెండు,మూడు సంఘటనలతో భారతదేశ ఆర్థిక వ్యవస్థ కుదేలయింది.అంతర్జాతీయంగా భారతదేశ పరువు పోతుందని బంగారాన్ని కుదువబెట్టే చర్యను మానుకొన్నారు.

🎈మరి ఆర్థిక దుస్థితినుండి బయట పడడానికి మన్మోహన్ సింగ్ నేతృత్వములోని యూ.పి.ఏ. ప్రభుత్వము చేసిన పని అప్పు చేయడం.అదే,విదేశీ కరెన్సీ,నాన్ రెసిడెంట్ డిపాసిట్(F.C.N.R[B])ద్వారా 25బిలియన్ల రుణాలు+32.32 బిలియన్ల (రూ2.23లక్షల కోట్లు)రుణం తీసుకొంది.

🎈మోదీ అధికారములోకి వచ్చేనాటికి 5 లక్షల 57 వేల కిలోల బంగారము మరియు 2.23 లక్షల కోట్ల రుణమున్నది.

🎈ఆ రుణాన్ని వడ్డీతో సహా మోదీ ప్రభుత్వం చెల్లించింది.

🎈బంగారం నిల్వలను 5.57 టన్నులనుండి 

 148 టన్నులకు పెంచారు.

🎈30 వ జూన్ 2021 నాటికి దేశంలో బంగారం నిల్వలు 705 టన్నులయ్యాయి.

🎈తమ కాంగ్రేస్ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ హయాములో జరిగిన దివాలాకోరు ఆర్థిక వ్యవస్థను కప్పిపుచ్చి రాహుల్ గాంధీ కాంగ్రేస్ మరియు కమ్యూనిస్టు పార్టీలకు వత్తాసు పలికే Lutyens media సైకోఫాంటిక్ జర్నలిస్టులు ప్రధాని నరేంద్ర మోదీ దేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తున్నారని నిరంతరం దుఃఖం నటిస్తున్నారు.

 

 🎈1. అప్పటి RBI గవర్నర్ రఘురామ్ రాజన్ యొక్క ఈ *ఒప్పుకోలు* చదవండి.

 https://indianexpress.com/article/business/banking-and-finance/fcnr-bonds-were-least-bad-option-to-raise-dollars-raghuram-rajan-3011772/


 🎈2. మోదీ ప్రభుత్వం ఆ రుణాన్ని తిరిగి చెల్లించింది. దీన్ని ధృవీకరించడానికి ఈ లింక్‌పై క్లిక్ చేసి ని చదవండి.

 https://www.thehindubusinessline.com/money-and-banking/fcnr-deposits-of-2013-set-to-mature-reserve-bank-ready-to-tackle-volatility/article8472235.ece


 🎈కాంగ్రెస్, కమ్యూనిస్టు మున్నగు పార్టీల తప్పుడు ప్రచారాలను తెలుసుకొని అర్థం చేసుకోండి.


 🎈కావున దేశ ప్రయోజనాల దృష్ట్యా మేలుకోండి.


 🚩స్వతంత్ర భారత చరిత్రలో ఇప్పటి వరకు యెవరూ చేయలేని పనిని నరేంద్ర మోదీ ఈ 7 ఏళ్లలో చేశారు. తప్పక చదవండి, మధ్యలో ఎక్కడైనా వదిలేస్తే, మీ కళ్ళు మూసుకుపోతాయి, కాబట్టి ఖచ్చితంగా పూర్తిగా చదవండి.


 🎈తొలి విజయం:మన దేశాన్ని 200 ఏళ్ల పాటు బానిసలుగా మార్చిన బ్రిటన్ దేశము‌లో జరిగిన 53 కామన్ వెల్త్ దేశాల సమావేశంలో నరేంద్ర మోదీగారు జనరల్ ప్రెసిడెంట్ అయ్యాడు.దీనికి ప్రతి భారతీయుడు గర్వించాలి.మరియు అతడి వక్షస్థలం విశాలం కావాలి.


 🎈రెండవ విజయం: UN హ్యూమన్ రైట్స్ కౌన్సిల్‌లో భారత్‌కు భారీ విజయం లభించింది, అందు సభ్యుడగుటకు 97 ఓట్లు అవసరం,కాగా మనకు 188 ఓట్లు వచ్చాయి.ఇది చూశాక ,భారత ప్రజలు నరేంద్ర మోడీ విదేశాలకు ఎందుకు వెళ్ళాడని ఇంకా అడుగుతారా?


 🎈మూడవ విజయం:ప్రపంచంలోని 25 అత్యంత శక్తివంతమైన దేశాల జాబితా విడుదలైంది.అందు భారత్ ఉండడం,పాకిస్తాన్ లేకపోవడం గర్వం కాదంటారా?


 🎈నాల్గవ విజయం:మన GST నెలవారీ పన్ను వసూళ్లు 1 లక్ష కోట్లకు చేరుకొంది.ఇది రైల్వే ప్లాటుఫామ్ పైన టీ అమ్మిన నరేంద్రమోదీ ఆర్థశాస్త్ర పరిమళం కాదా?


 🎈ఐదవ విజయం:నూతన సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటులో అమెరికా మరియు జపాన్‌లను వెనక్కి నెట్టి భారతదేశం రెండవ స్థానానికి చేరుకుంది.


 🎈ఆరవ విజయం:2017-18లో సౌరశక్తి ఉత్పత్తి రెండింతలయింది.దీన్ని చూసి చైనా, అమెరికాలు కంగుతిన్నాయి.


 🎈ఏడవ విజయం:ఆకాశాన్నంటుతున్న భారతదేశ జి.డి.పిని చూడండి.మన దేశ జి.డి.పి 8.2% కాగా,చైనాది 6.7% మరియు అమెరికాది 4.2%. నరేంద్రుడు విదేశాలకు ఎందుకు వెళ్ళాడో ఇప్పుడు భారతీయులకు అర్థమై యుండాలి.


 🎈ఎనిమిదవ విజయం:భూమి,జలము మరియు ఆకాశం అనే మూడు ప్రాంతాల నుండి సూపర్ సోనిక్ క్షిపణులను ప్రయోగించిన మొదటి దేశం మన భారతదేశం.ఇది రాజరాజనరేంద్రుని యుగం.

మీకు గర్వంగా ఉంటే, “జైహింద్ “అని వ్రాయడం మర్చిపోకండి.

🎈తొమ్మిదవ విజయం:70 ఏళ్లలో పాకిస్థాన్ పేదరికాన్ని ఎప్పుడూ చవి చూడలేదు, కానీ నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చాక దొంగనోట్ల రద్దుతో , పాకిస్తాన్ దరిద్రంగా మారింది.

🎈పదో విజయం: 2014లో కాంగ్రెస్ రక్షణ మంత్రి ఎ.కె.ఆంథోనీ దేశం ఆర్థిక దుస్థితిలో ఉందని, మనము రాఫెల్, చిన్న జెట్ కూడా కొనలేని స్థితిలో ఉన్నామని అన్నారు.కాని నరేంద్రుడి హయాములో,

 రాఫెల్ డీల్ కుదిరింది.ఎస్-400 కూడా తీసుకుంటోంది.

 మరి కాంగ్రెస్ హయాంలో దేశ సొమ్ము ఎక్కడికి పోయింది?


 🎈పదకొండవ విజయం:సైన్యం బుల్లెట్ ప్రూఫ్ స్కార్పియో యొక్క రక్షణ కవచాన్ని పొందగలిగింది.

 జమ్మూ కాశ్మీర్‌లో సైన్యానికి 2500 బుల్లెట్ ప్రూఫ్ స్కార్పియోలు అందించబడ్డాయి.


 🎈పండ్రెండవ విజయము:ఈ 4 సంవత్సరాలలో భారతదేశములో యెంత అభివృద్ధి జరిగిందో నేను మీకు చెబుతాను.

 🎈ఆర్థిక వ్యవస్థలో ఫ్రాన్స్‌ను వెనక్కి నెట్టి భారత్ 6 వ స్థానానికి చేరుకుంది.


 🎈పదమూడవ విజయం:ఆటోమోబైల్ రంగములో జర్మన్ ను వెనక్కి నెట్టి భారత్ 4 వ స్థానంలో నిలిచింది.


 🎈పద్నాలుగో విజయం:విద్యుత్ ఉత్పత్తిలో రష్యా వెనుకబడి పోగా,భారత్ 3వ స్థానంలో నిలిచింది.


 🎈పదిహేనవ విజయం ;వస్త్ర ఉత్పత్తిలో ఇటలీని అధిగమించి,భారత్ రెండవ స్థానానికి చేరుకుంది.


 🎈పదహారవ విజయం:మొబైల్ ఉత్పత్తిలో వియత్నాం వెనుకబడి పోగా,భారత్ రెండవ స్థానంలో నిలిచింది.


 🎈పదిహేడవ విజయం: ఉక్కు ఉత్పత్తిలో జపాన్‌ను అధిగమించి భారత్ రెండవ స్థానానికి చేరుకుంది.


 🎈పద్దెనిమిదవ విజయం:చక్కెర ఉత్పత్తిలో బ్రెజిల్‌ను అధిగమించి భారత్ నెంబర్ వన్ గా నిలిచింది.


 🎈పంతొమ్మిదవ విజయం:శ్రీ రామమందిరం, ఆర్టికల్ 370, ట్రిపుల్ తలాక్, CAA.NRC మరియు యువతులకు వివాహ వయస్సు 18 నుండి 21 సంవత్సరాలకు బిల్లులను ప్రవేశపెట్టి విజయాన్ని సాధించారు.యూనిఫాం సివిల్ కోడ్, జనాభా నియంత్రణ చట్టములు చేయుటకు అడుగులు పడుతున్నాయి.


 🎈ఇరువదవ విజయం:గాఢ నిద్రలోనున్న హిందువులలో, జాతీయవాదాన్ని మేల్కొల్పారు. ప్రపంచం మొత్తం మీద 125 కోట్ల మంది ఉన్న హిందువులకు తమకంటూ ఒక్క దేశం కూడా లేదనే విషయం చెప్పగలిగారు.

 🚩నేను ఈ పనిని అత్యంత ముఖ్యమైనదిగా భావిస్తున్నాను.


 🚩దీన్నే నరేంద్ర మోదీ యుగం అంటారు.

 🚩మోదీ ప్రభుత్వంలో ఉగ్రవాదులు కాశ్మీర్ లోయల నుంచి తుడిచిపెట్టుకుపోతున్నారు.

 🚩లష్కరే తోయిబా ఉగ్రవాది నవేద్ వట్ హతమయ్యాడు.

 🚩హిజ్బుల్‌కు చెందిన ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.

 🚩8 నెలల్లో, 72 మందిని హురాన్ సమీపంలో, 230 మంది ఉగ్రవాదులను నరకానికి పంపారు.


 🚩కాంగ్రేసు పార్టీ ఉగ్రవాదులను చూచి భయందోళనలకు గురికాగా,నరేంద్ర సింగమును చూచి ఉగ్రవాదులు భయాందోళనలకు గురవుతున్నారు.

🚩 కాంగ్రేసు హయాములో భారత సైన్యం ఉగ్రవాదులకు భయపడగా,నరేంద్రుని పాలన‌లో, ఉగ్రవాదుల దాడి కొరకు సైన్యం విజృంభిస్తున్నది.


 🚩తమ అవినీతి వ్యూహాలు ఫలించలేకపో తున్నాయని, కాంగ్రేస్, కమ్యూనిస్టులు.,తృణమూల్, టి.ఆర్.ఎస్.యు,సమాజ్ వాది,బహుజనసమాజ్, యం.ఐ.యం మున్నగునవన్ని, నరేంద్రుడనే అభిమన్యుడిని చంపాలని అనగా 2024 సార్వత్రిక ఎన్నికలలో ఓడించేందుకు పద్మవ్యూహం పన్నుతున్నారు.రోజురోజుకు నరేంద్రమోదీజీకి పెరుగుతున్న కీర్తిప్రతిష్టలను చూసి ప్రతిపక్ష పార్టీలన్ని కంగు తింటున్నాయి.కానీ ఆ అవినీతిపర పార్టీలు మోదీని ఏం చేయలేవు.ద్వాపర యుగములో అభిమన్యుడు పద్మవ్యూహాన్ని ఛేదించడం తల్లి గర్భంలో యున్నప్పుడు గ్రహించాడు.ఈ మోడి రూప అభిమన్యుడు పద్మవ్యూహాన్ని ప్రవేశించి,తిరిగి ఛేదించుకొని రాగల విద్యలను భరతమాత ఒడిలో నేర్చుకొన్నాడు.ఆమె అజేయురాలు, తన పుత్రుడైన నరేంద్రుడిని అజేయుడగుటకు ఆశీర్వదిస్తున్నది.


 🚩2024లో భరతమాత పుత్రుడిని గతంలోకంటె భారీ మెజారిటీతో గెలిపించేలా ఈరోజు మనమందరం ఒక తీర్మానం చేద్దాం, ఆ సంఖ్య ఎవరూ చేరుకోలేని విధంగా గిన్నిస్ బుక్‌లో నమోదవ్వాలి.


  🚩2024లో నరేంద్రుడిని తిరిగి భారత ప్రధానిని చేయవలయునని భారత ప్రజలందరికి నమస్కరిస్తున్నాను.


 🚩ఈ పోస్ట్‌ను గర్వంగా ఐదు గ్రూపులుగా పంపండి.తద్వారా సందేశం ప్రజలందరికి చేరుతుంది.

ధర్మాకృతి : పీఠాధిపత్యము - 2

 ధర్మాకృతి : పీఠాధిపత్యము - 2


పండితవర్యుని హృదయం హర్షవిస్మయములతో నిండిపోయింది. అహో! ఎవరీ బాలకుడు. విశేష శాస్త్రములను అధ్యయనం చేయలేదు. తల్లిదండ్రుల ఒడి నుండి ఇప్పుడే కదా బయటకు వచ్చారు! అయిన మహా పండితుని వలె ప్రకాశిస్తున్నారు.  ఉచితతమంగా మాట్లాడుతున్నారు. వీరి వదనం బ్రహ్మజ్ఞత్వాన్ని అభివ్యాంజనం చేస్తోంది. వచనం ధర్మ విత్తమునిగా తెలియజేస్తోంది. ఈతనిని సామాన్య బాలకునిగా భావించరాదు. అతి త్వరలోనే ఈయన ద్వారా ఈ గొప్ప పీఠము సర్వతోముఖ వికాసాన్ని పొందుతుంది అని నిశ్చయించుకొని తన భావాలను అక్కడ ఉన్న వారి వద్ద వేనోళ్ళ పొగిడి సంతోషంతో తన పురానికి తిరిగి వెళ్ళారు. ఆ బాలయతి ఖ్యాతి బాగా కుసుమించిన వృక్షపు గంధం వలె దూరదూరములకు బాగా వ్యాప్తి చెందింది.


మఠనిర్వహణము సామాన్యమైన విషయం కాదు. మఠంలోని అధికారులందరూ రెండు మూడు తరములుగా పాతుకొని పోయి ఉన్నవారు. ఎంత ఆచార్యభక్తి ఉన్నప్పటికీ మొన్నటి వరకు పసి బాలునిగా భావించిన వారికి, ఆచార్యుల వారికి చూపవలసిన వినయ విధేయతలు చూపడానికి సమయం పడుతుంది కదా! ఈ ఆచార్యుల వారు కూడా తమ నిర్వహణా సామార్థ్యాన్ని ఋజువు చేసుకోవలసి ఉన్నది. పరిచారక వర్గంలో కొందరు ఉద్దండ పండితులు మరికొందరు పరమ గురువులకు అత్యంత ఆంతరంగికులయిన అధికారిక వర్గము. ఇంకొందరు బహుకాలంగా శ్రీమఠమును ఆశ్రయించి బ్రతుకుతూ ఆనుపానులన్నీ సంపూర్ణంగా ఎరిగి ఉన్నవారు. వీరందరి మీదా ఆధిపత్యం నెరపడానికి కుశాగ్రమైన ధీసంపత్తి, అనుభవము, జాగరూకత అవసరము. ఇది పీఠనిర్వహణ విషయం. 


సన్యాసాశ్రమపు నియమ నిష్ఠలు, శంకరుల వారినుంచి వస్తున్నా ఆచారములు పూజా పద్ధతులను సంపూర్తిగా తెలుసుకొని తమ అలవాటు లోనికి తెచ్చుకోవడమూ, అద్వైత పీఠనాయకులైనందున పండితులతో, ప్రతివాదులతోనూ చర్చించి అద్వైతమతాన్ని సుప్రతిష్ఠితంచేయడానికి తగిన పాండిత్యమూ అవసరము. హిందూ మతమునకు అధినాయకులైనందున వారి ప్రయోజనాలను దృష్టిలో దృష్టిలో నుంచుకొని తగిన రక్షణ చర్యల గురించి ఆలోచించడం ఒక పని. ఇవన్నీ కాక ప్రతిదినము ఆధ్యాత్మిక గురువుగా, దైవ ప్రతినిధిగా, దైవంగా భావించి అనేకమంది భక్తజనుల ఆదిభౌతిక, ఆధిదైవిక, ఆధ్యాత్మిక అవసరాలను తీర్చడానికి తగిన తపోబలం అత్యంత ఆవశ్యకము. ఈరకంగా ఒక పీఠాధిపతికి ఆచారానునుష్ఠానాలలోనూ, శాస్త్రం లోనూ, తపోనిష్ఠలోనూ లౌకికమైన తెలివితేటలలోనూ, బలం ఉంటే కానీ పీఠనిర్వహణ సాధ్యపడదు. ఇంతటి మహత్తరమైన బాధ్యత పదమూడేళ్ళ బాలసన్యాసి పైన పడింది. పై విషయాలను దృష్టిలో ఉంచుకొనే “నాకు గురు సాన్నిధ్యంలో ఉండే భాగ్యము లేదు. సన్యాసాశ్రమపు మొదటి నాటి నుండే పీఠాధిపాత్యపు కష్టసుఖాలు, బాధ్యతలు నన్ను చుట్టుముట్టాయి” అంటారు స్వామివారు. దీనికి తోడు ఈ మఠంలో ఏమి జరుగుతున్నదో ఎప్పటికప్పుడు గమనించుతూ అవకాశం దొరికితే హాని చేయాలని కాచుకొని కూర్చొని ఉన్న వర్గం ఆనాటికి కూడా ప్రబలంగా ఉన్నది.  


పీఠాధిపత్యపు మొదటిరోజు విరామం తీసుకోబోయే సమయానికి శ్రీమఠపు కార్యనిర్వహణాధికారి సదాచార సంపన్నుడయిన ఒక వృద్ధ బ్రాహ్మణుని స్వామివారికి పరిచయం చేసూ ఇకనుంచి వీరు తమకు పరిచర్య చేస్తారని చెప్పే వెళ్ళారు. సర్వాధికారి అలా వెళ్ళారో లేదో ఈ వృద్ధ బ్రాహ్మాణుడు స్వామివారికే సాష్టాంగంగా నమస్కరించి “స్వామీ! మహా పురుషులయిన తమ పరమ గురువుల పరిచర్యల ఈ జీవితం ధన్యమయింది. వారి సేవలో పునీతమయిన ఈ తనువును ఇంకొకరి సేవను వినియోగింపజాలను. స్వామివారు ఈ అపరాధమునకు నన్ను క్షమించాలి అంటూ వినమ్రంగా శలవు తీసుకొన్నారుట. అప్పుడు స్వామివారు ఏమనుకొన్నారో! 99వ ఏట తమ పరిచారకుల ఎదుట ఈ విషయాన్ని జ్ఞప్తికి తెచ్చుకొన్న స్వామివారు వారిది ఎంత గొప్ప అనన్యమైన ఆచార్య భక్తి’ అని మెచ్చుకొన్నారు. 


పీఠాధిపత్యము స్వీకరించిన తరువాత పీఠపరిస్థితులు ఆకళింపు చేసుకోవడానికి, పీఠనిర్వహణలోనూ, వివిధ శాస్త్రములలోనూ, పూజా పద్ధతులలో సుశిక్షుతులవడానికి పీఠమునకు అప్పటి ప్రధాన కేంద్రమయిన కుంభకోణం బయలుదేరారు. దారిలో తమ పూర్వాశ్రమపు కుటుంబమున్న తిండివనంలో కొంతకాలం బసచేశారు.


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

నలుగురు ఉంటేనే

 🌹🌹🌹🌹🌷🌷🌹🌹🌹🌹

*నలుగురు ఉంటేనే జీవితం* 

*నలుగురు మెచ్చుకుంటే జీవితం*

*నలుగురు వచ్చిపోతే జీవితం*

*నలుగురు మధ్య చనిపోతే జీవితం*


మన అనుకోవఢానికి నలుగురు ఉంటేనే జీవితం....

చివరి వరకు నలుగురితో ఉండు

నమ్మకంతో ఉండు

నవ్వుతూ ఉండు  

నవ్విస్తూ ఉండు... 


ఈ message  చదివా ఈ మధ్యనే... చదివిన దగ్గరనుంచి సంఘర్షణ మొదలయ్యింది... 


ఆ నలుగురు అన్నార..... కానీ ఆ నలుగురు కలిస్తే యుద్ధాలే  జరుగుతున్నాయ్...ఇంటా బయట ...స్నేహితులు, బంధువులు..... ఎక్కడ నలుగురు కలిసిన controversies.... చిన్న చిన్న విషయాలు... పెద్ద పెద్ద గొడవలు... చిన్న చిన్న వాటినే భూతద్దంలో చూడటాలు.... 


చిన్న చిన్న సంతోషాలు లేవు

చిన్న చిన్న సంగతులు లేవు

చిన్న చిన్న సరదాలు లేవు

ఎటుపోతున్నాం మనం?


ఎక్కడ జరుగుతోంది పొరపాటు? ఎందుకు ఆనందాలు మిస్ అవుతున్నాం? ఎందుకు నలుగురిలో ఇమడలేకపోతున్నాం? ఎక్కడ జరుగుతోంది పొరపాటు? ఏమిటి దీనికి మూలకారణం? 


నా ఆలోచనా పరిధిలో నేను విశ్లేషించు కున్నది ఏమిటంటే?..... చిన్న చిన్న కుటుంబాలు/గిరిగీసుకొని బ్రతికేయడం/చెప్పే పెద్దవారు లేకపోవడం/ఒకవేళ పెద్దవారు ఉండి చెప్పినా వినిపించుకోకపోవడం/ఉమ్మడి కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నమవడం/పెద్ద పెద్ద సమస్యలు లేకపోవడం/ప్రతిదానిని  negative గా చూడటం/నేనే గొప్ప అన్నది ఎక్కువవవ్వడం.....ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే....


ఇది కరోనా కంటే చాలా పెద్దగా కనిపిస్తున్న సమస్య. ఒక మనిషి ఇంకొక మనిషి గురించి మంచిగా ఆలోచించడం మానేశారు... ఎదుటి వారిలో లోపాలు ఏమున్నాయి/ఎదుట వారిని ఎలా కించపరచాలి/ఎదుట వారిని చూసి ఈర్ష్యపడటం/ఎదుటి మనిషిని అర్ధం చేసుకోలేకపోవడం.... ఇవే రాజ్యమేలుతున్నాయి... 


ఒకప్పుడు పెద్ద పెద్ద కుటుంబాలు, ఇరుగు పొరుగు, మంచి చెడు చెప్పే పెద్దలు ఉండటం ఇలా అన్నీ ఉండేవి....మన ప్రతి మాటను, ప్రతి పనిని ఎవరో ఒకరు గమనిస్తూ మనల్ని ఎప్పటికప్పుడు సరిచేస్తూ  ఉండేవారు....


ఇప్పుడు జీవితం నాలుగు గోడలకు అంకితం... మాట్లాడుకోవడానికి  ఇష్టపడని  సంస్కృతిలో పెరుగుతున్నాం...


పొలంలో పెరుగుతున్న కలుపు మొక్కలను ఓపికగా తీసేస్తేనే రైతుకు పంట చేతికందేది.. వాటిని పెరగనిస్తే  పంటకు సారం అందనీయక  పంట సరిగా పండగ రైతుకు కన్నీరే  మిగులుస్తాయి...


అలాగే

మనలో ఉన్న చెడుఆలోచనల కలుపు మొక్కలను ఆదిలోనే ఎవరో ఒకరి సాయంతో తీసివేస్తే మన మనసులు వికృతమవవు.. మనం మంచిగా ఉంటే సమాజంలో నలుగురిని కలిసినప్పుడు ఏ సమస్య ఉండదు. లేదంటే మనవల్ల నలుగురికి సమస్య. .ఆ సమస్యలకు భయపడి ఆ నలుగురు  అన్నమాట వదిలేసుకొని  నాలుగు గోడల మధ్య బంధీలమయి ఒంటరివారమయి పోతున్నాం. ఒంటరితనంలో మనసుని స్వాధీనం లో ఉంచుకోవడము చాలా కష్టము...ఆ ఒక్కరు ఆ నలుగురిలో మమైకమయితే ప్రతి కలయిక ఒక మధురానుభూతి  కాగలదు...😍 

ఒక మంచిమాట...ఒక చిరు నవ్వు..ఒక ఆత్మీయ పలకరింపు..ఒక ఓదార్పు...ఒక మెచ్చుకోలు...ఇవే కావాలి మనకి... 


*ఒక కోపం..ఒక ద్వేషం... ఒక ఈర్ష్య…*

*ఒక అసూయ...ఒక అహం......*

*ఇవే వద్దు మనకి....*


ఆ నలుగురుతో ఉందాం.....

ఆనందంగా ఉందాం....

       🌹💐🌹

తిరుమల మార్గదర్శిని*

 భక్తుల అరచేతిలో తిరుమల మార్గదర్శిని*


*– ఒక చోటి నుంచి మరో చోటికి సులువుగా చేరుకునేలా నూతన ఆవిష్కరణ*

*– శ్రీవారి సేవకుల ద్వారా ప్రయోగాత్మకంగా అమలు*

*తిరుమల 20 సెప్టెంబరు 2022: వివిధ ప్రాంతాల నుంచి తిరుమలకు వచ్చే భక్తులు ఆండ్రాయిడ్ ఫోన్ ఉంటే చాలు ఎవరినీ అడగకుండా ఒక చోటి నుంచి మరో చోటికి సులువుగా చేరుకోవచ్చు. సాంకేతికత పరిజ్ఞానాన్ని ఉపయోగించి టీటీడీ ఈ నూతన ఆవిష్కరణకు శ్రీకారం చుట్టింది.*

*తిరుమలలో తన కార్యాలయంలో ఈవో శ్రీ ఎ వి ధర్మారెడ్డి మంగళవారం ఈ విధానాన్ని పరిశీలించారు.* *తిరుమలలో టీటీడీ కి సంబంధించిన అతిథి గృహాలు,వసతి సముదాయాలు, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లు, లడ్డూ కౌంటర్లు, ఆసుపత్రి, పోలీస్ స్టేషన్లు, విజిలెన్స్ కార్యాలయాలు ఇలా భక్తులకు అవసరమైన సుమారు 40 విభాగాల సమాచారాన్ని టీటీడి"క్యూఆర్ కోడ్" లో నిక్షిప్తం చేస్తుంది. భక్తులు బస్టాండ్ లో దిగి సిఆర్వో, అదనపు ఈవో కార్యాలయం, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ఇలా ఎక్కడికి వెళ్లాలనుకున్నా టీటీడీ వివిధ ప్రాంతాల్లో అందుబాటులో ఉంచిన క్యూ ఆర్ కోడ్ ను తమ.మొబైల్ లో స్కాన్ చేస్తే వారికి విభాగాల వారీగా పేర్లు కనిపిస్తాయి. అందులో తాము ఎక్కడికి వెళ్ళాలో ఆ ప్రాంతం మీద క్లిక్ చేస్తే మ్యాప్ డిస్ప్లే అయ్యి నేరుగా అక్కడికి తీసుకుని వెళుతుంది. టీటీడీ ఇంజినీరింగ్, ప్రజా సంబంధాల విభాగాలు తయారు చేసిన ఈ విధానాన్ని ఈవో అభినందించారు. ఇది భక్తులకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయన చెప్పారు. సేవా సదన్ నుంచి వివిధ ప్రాంతాల్లో సేవ చేయడానికి వెళ్ళే శ్రీవారి సేవకులు వారు వెళ్ళాల్సిన ప్రాతం కనుక్కోవడానికి ఇబ్బంది పడుతున్నారు. బ్రహ్మోత్సవాల్లో ప్రయోగాత్మకంగా శ్రీవారి సేవకుల ద్వారా ఈ విధానం అమలు అమలు చేయాలని పిఆర్వోను ఈవో కోరారు .*

టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది