21, సెప్టెంబర్ 2022, బుధవారం

నలుగురు ఉంటేనే

 🌹🌹🌹🌹🌷🌷🌹🌹🌹🌹

*నలుగురు ఉంటేనే జీవితం* 

*నలుగురు మెచ్చుకుంటే జీవితం*

*నలుగురు వచ్చిపోతే జీవితం*

*నలుగురు మధ్య చనిపోతే జీవితం*


మన అనుకోవఢానికి నలుగురు ఉంటేనే జీవితం....

చివరి వరకు నలుగురితో ఉండు

నమ్మకంతో ఉండు

నవ్వుతూ ఉండు  

నవ్విస్తూ ఉండు... 


ఈ message  చదివా ఈ మధ్యనే... చదివిన దగ్గరనుంచి సంఘర్షణ మొదలయ్యింది... 


ఆ నలుగురు అన్నార..... కానీ ఆ నలుగురు కలిస్తే యుద్ధాలే  జరుగుతున్నాయ్...ఇంటా బయట ...స్నేహితులు, బంధువులు..... ఎక్కడ నలుగురు కలిసిన controversies.... చిన్న చిన్న విషయాలు... పెద్ద పెద్ద గొడవలు... చిన్న చిన్న వాటినే భూతద్దంలో చూడటాలు.... 


చిన్న చిన్న సంతోషాలు లేవు

చిన్న చిన్న సంగతులు లేవు

చిన్న చిన్న సరదాలు లేవు

ఎటుపోతున్నాం మనం?


ఎక్కడ జరుగుతోంది పొరపాటు? ఎందుకు ఆనందాలు మిస్ అవుతున్నాం? ఎందుకు నలుగురిలో ఇమడలేకపోతున్నాం? ఎక్కడ జరుగుతోంది పొరపాటు? ఏమిటి దీనికి మూలకారణం? 


నా ఆలోచనా పరిధిలో నేను విశ్లేషించు కున్నది ఏమిటంటే?..... చిన్న చిన్న కుటుంబాలు/గిరిగీసుకొని బ్రతికేయడం/చెప్పే పెద్దవారు లేకపోవడం/ఒకవేళ పెద్దవారు ఉండి చెప్పినా వినిపించుకోకపోవడం/ఉమ్మడి కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నమవడం/పెద్ద పెద్ద సమస్యలు లేకపోవడం/ప్రతిదానిని  negative గా చూడటం/నేనే గొప్ప అన్నది ఎక్కువవవ్వడం.....ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే....


ఇది కరోనా కంటే చాలా పెద్దగా కనిపిస్తున్న సమస్య. ఒక మనిషి ఇంకొక మనిషి గురించి మంచిగా ఆలోచించడం మానేశారు... ఎదుటి వారిలో లోపాలు ఏమున్నాయి/ఎదుట వారిని ఎలా కించపరచాలి/ఎదుట వారిని చూసి ఈర్ష్యపడటం/ఎదుటి మనిషిని అర్ధం చేసుకోలేకపోవడం.... ఇవే రాజ్యమేలుతున్నాయి... 


ఒకప్పుడు పెద్ద పెద్ద కుటుంబాలు, ఇరుగు పొరుగు, మంచి చెడు చెప్పే పెద్దలు ఉండటం ఇలా అన్నీ ఉండేవి....మన ప్రతి మాటను, ప్రతి పనిని ఎవరో ఒకరు గమనిస్తూ మనల్ని ఎప్పటికప్పుడు సరిచేస్తూ  ఉండేవారు....


ఇప్పుడు జీవితం నాలుగు గోడలకు అంకితం... మాట్లాడుకోవడానికి  ఇష్టపడని  సంస్కృతిలో పెరుగుతున్నాం...


పొలంలో పెరుగుతున్న కలుపు మొక్కలను ఓపికగా తీసేస్తేనే రైతుకు పంట చేతికందేది.. వాటిని పెరగనిస్తే  పంటకు సారం అందనీయక  పంట సరిగా పండగ రైతుకు కన్నీరే  మిగులుస్తాయి...


అలాగే

మనలో ఉన్న చెడుఆలోచనల కలుపు మొక్కలను ఆదిలోనే ఎవరో ఒకరి సాయంతో తీసివేస్తే మన మనసులు వికృతమవవు.. మనం మంచిగా ఉంటే సమాజంలో నలుగురిని కలిసినప్పుడు ఏ సమస్య ఉండదు. లేదంటే మనవల్ల నలుగురికి సమస్య. .ఆ సమస్యలకు భయపడి ఆ నలుగురు  అన్నమాట వదిలేసుకొని  నాలుగు గోడల మధ్య బంధీలమయి ఒంటరివారమయి పోతున్నాం. ఒంటరితనంలో మనసుని స్వాధీనం లో ఉంచుకోవడము చాలా కష్టము...ఆ ఒక్కరు ఆ నలుగురిలో మమైకమయితే ప్రతి కలయిక ఒక మధురానుభూతి  కాగలదు...😍 

ఒక మంచిమాట...ఒక చిరు నవ్వు..ఒక ఆత్మీయ పలకరింపు..ఒక ఓదార్పు...ఒక మెచ్చుకోలు...ఇవే కావాలి మనకి... 


*ఒక కోపం..ఒక ద్వేషం... ఒక ఈర్ష్య…*

*ఒక అసూయ...ఒక అహం......*

*ఇవే వద్దు మనకి....*


ఆ నలుగురుతో ఉందాం.....

ఆనందంగా ఉందాం....

       🌹💐🌹

కామెంట్‌లు లేవు: