12, డిసెంబర్ 2021, ఆదివారం

అహం

 *అహం*


కొన్ని విషయాలను బాగా గమనించండి... 

ఊపిరి పీల్చడం మన ప్రమేయం లేకుండా జరుగుతోంది. 

కనురెప్పలు వేయటం మన అనుమతితో జరగటం లేదు.

మరుక్షణం ఏమి చేస్తామో తెలీదు..?

ఇంకా కొన్ని అసంకల్పితంగా మననుంచి ఎన్నో జరుగుతున్నాయి. ప్రతీ క్షణం మన శరీరంలో ఎన్నో వేల మార్పులు జరుగుతున్నా...

మనకు వీటిపైన ఎలాంటి నిర్ణయం, నియంత్రణ 

లేకున్నా. 'అన్నీ నేనే చేస్తున్నాను' అని కేవలం భావిస్తాము. ఇలాంటి భావననే *అహము* అని గీతలో శ్రీ కృష్ణుడు చెప్పాడు. అహము అంటే ఇప్పటికీ మనిషికి అర్థము కాకుండా ఉంది.

ఈ అహాన్ని గుర్తించటం పెద్ద పెద్ద స్వాములకు కూడా వీలుకాకుండా ఉన్నది. ప్రతీ క్షణం... మన కర్మ ప్రకారం జరిగే పనుల్ని మనిషి నేను చేసాను అని అనుకోవడమే 'అహము'. వేటి మీదా మన ప్రమేయం లేదు. అని తెలుపుటకు ఉదాహరణకోసమే. మన ఊపిరిని, కనురెప్పలను అసంకల్పితంగా జరిగేలా ప్రత్యక్ష సాక్షంగా దేవుడు నిలిపాడు. అయినా ఇవేవీ అర్ధము చేసుకోక, మనిషి అంతా 'నేనే చేస్తున్నాను' అనే గొప్పలు పోతాడు... అహాన్ని గుర్తించటమే కర్మయోగము. మరి ఇవన్నీ చేస్తోంది ఎవరు? ఇన్ని పనులను చేసేది ఒక్కడే... 'ఆత్మ'. 

ఈ ఆత్మనే అందరిలో గలదు అని గీతయందు చెప్పారు. ఒక్కో మనిషి కర్మను బట్టి... ఆత్మ ఒక్కోలా ప్రవర్తిస్తుంది. కర్మ ప్రకారమే మనిషి కష్టమైనా, సుఖమైనా... వీటి అనుభవాలు అహం ద్వారా మనకు తాకుతున్నాయి... అసలు అహమే లేకుంటే వీటి రెండింటిని మనము పొందకుండా కర్మయోగులము అవుతాము. కాబట్టి అహముపై ధ్యాస పెట్టి మన లోపలి అహము చెప్పే మాటలు వినకపోతే అప్పుడు నువ్వు కర్మయోగివై...

శ్రీ కృష్ణుడి ప్రియశిష్యుడవు అవుతావు.


_సేకరణ_