ప్రపంచ కవులకు స్వగతం. మీ కవితలను ఇక్కడ పబ్లిష్ చేయవచ్చు. మీరు ముందుగా follow by Email బాక్సులో మీ మెయిల్ అడ్రసుని నింపి submit చేయండి. తరువాత followers ని click చేసి follower అవ్వండి. తరువాత మీ రచనను కొత్త కవులు పేజీలో అక్కడ సూచించిన విధంగా పంపండి. .
13, మార్చి 2022, ఆదివారం
చదువేముందిరా
ఇకనుండి "తెలుగు కవులు" తెలుగు పండిత కవులు"
పాఠకులకు విజ్ఞప్తి
కొన్ని అనివార్య కారణాలవలన మన బ్లాగు పేరును "తెలుగు పండిత కవులు" గా మార్చటం జరిగింది. దయచేసి గమనించండి. ప్రపంచ పాఠకులు ఇకనుండి మన బ్లాగుని గతంలో మాదిరిగానే ఆదరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము.
మన బ్లాగులో కవితలు, ఆధ్యాత్మిక విషయాలు తత్వవిషయాలు, భక్తి విషయాలు సామాజిక విషయాలు అనేక విషయాలమీద ప్రశ్నపత్రాలు ఇలా అనేక శీర్షికలతో మీ ముందుకు వస్తున్న సంగతి మీకు తెలిసిందే. మీ ఆదరాభిమానాలతోటే ఈ బ్లాగు గత పుష్కర కాలంనుండి నిరంతరాయంగా నడుస్తున్న సంగతి మీకు విదితమే. కేవలము తెలుగు కవులు అనే పేరుతొ ఉంటే ఇది కేవలం కవిత్వానికి సంబంధించిందే అనే భావన ఉండవచ్చు అలంటి భావనను తొలగించి సర్వులకు ఉపయుక్తంగా చేయాలనే సంకల్పంతో మన బ్లాగుని "తెలుగు పండిత కవులు" గా మార్చినాము ఈ మార్పుని గమనించి పాఠకులు తమ ప్రోత్సాహాన్ని మునుపటి మాదిరిగానే అందించి ఈ బ్లాగు సర్వులకు జ్ఞ్యానవిస్తర్ణ చేసే ప్రక్రియలో అందరు భాగస్వాములు కావాలని కోరుకుంటూ మన బ్లాగ్ యుఆర్ఎల్ మాత్రము మారలేదు కేవలము పేరు మాత్రమే మారింది గమనించగలరు. ముందుగా మీరు మన బ్లాగ్ యుఆర్ఎల్ ను కాపీ చేసుకొని ఒక చోట భద్రపరచుకొని ఎప్పుడు అంటే అప్పుడు క్లిక్ చేసి చూడగలరు
క్రింద మీకు యుఆర్ఎల్ లింకు ఇవ్వబడింది
http://kavulu.blogspot.com/
మీ బ్లాగు నిర్వాహకుడు.
భార్గవ శర్మ
మూడు కోరికలు
మూడు కోరికలు
మనకు రోజు ఎన్నో కోరికలు కలుగుతుంటాయి. నాకు మంచి ఇల్లు కావలి, మంచి కారు కావలి, మంచి ఉద్యోగం కావలి ఇట్లా చెప్పుకుంటూ పొతే కోరికల జాబితాకు అంతేవుండదు. నిజానికి మనం ఒక పరిశీలన చేస్తే ప్రపంచంలో పాపాలకు మూలం కోరికలే అని తేలుతుంది. ఒక ప్రభుత్వ ఉద్యోగి నిజానికి తనకు వచ్చే నెలజీతంతో కుటుంబాన్ని సంతోషంగా పోషించుకోవచ్చు. కానీ అతనికి తృప్తి ఉండదు ఇంకా ఇంకా ధనం కావలి తన సుఖాలని ఇంకా ఇంకా పెంచుకోవాలి అనే తాపత్రయం తప్పుడు మార్గాలలో పయనించే విధంగా ప్రోత్సహిస్తుంది. ఇది కేవలం ఒక ప్రభుత్వ ఉద్యోగికి మాత్రమే కాదు సగటు మనిషి ప్రతివాడు తనకు సాధ్యమైనంతవరకు ఎదుటివానిని మోసం చేసి ఆర్జన చేయాలనే చూస్తాడు.
కూరలు, పండ్లు అమ్మేవారి వద్దనుండి బంగారం అమ్మేవారివరకు ఎవరి స్థాయిలో వారు మోసాలకు పాలుపడుతున్నారు. ఇప్పుడు ప్రపంచంలో అమలులో వున్న నియమం ఏమిటంటే "ఎదుటివాని అవసరము నాకు అవకాశం" ఈ నియమం ఎంతో పాపభరితమైనది. సాటివానిని నీవు దోచుకుంటే నీవు కూడా ఇంకొకడి చేతిలో మోసపోతావు అనే సత్యాన్ని అందరు నమ్ముతున్నారు. ఎప్పుడో చదివిన ఆరు సారా కధలు లో చెప్పిన ఒక విషయం జ్ఞ్యప్తికి వస్తున్నది అడవిలోకి వచ్చిన మేక పిల్లదే దోషమట కానీ దానిని తినే అడవి మృగానిది కాదట. ఇప్పుటు సమాజం దాదాపు అదే కోవకు చెందినట్లు కనపడుతున్నది. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం.
ఒక ప్రశ్నకు నీవు సమాధానం చెప్పలేస్తావా అదేమిటంటే నీవు వున్న స్థితిలో నీవు తృప్తిగా వున్నావా? ఎవరైనా నేను తృప్తిగా వున్నాను అని చెప్పారు ఎందుకంటె పేదవాడు నాకు అన్నం దొరకడంలేదు అన్నం దొరికితే నేను తృప్తిగా వుంటాను అంటాడు. ధనవంతుడు. ఇక మధ్యతరగతి వానిని అడిగితె నాకు ఇది వుంది అది లేదు అది ఉంటే నేను తృప్తిగా వుంటాను అంటాడు. మనం విస్తృతంగా పరిశీలిస్తే ఈ ప్రపంచంలో ఏ మానవుడు తృప్తిగా లేడు అన్నది సత్యం. దీనిని బట్టి మనకు ఒకవిషయం తెలుస్తుంది అదేమంటే మనిషికి తృప్తిని ఇచ్చేది కేవలం ధనం కాదు అది కాక ఇంకొకటి ఏదో వుంది అది నా దగ్గర లేదు.
మనిషి యెంత సంపాదించిన కొంతవరకు శారీరిక సుఖాలను పొందగలుగుతాడేమో కానీ శాశ్వితము నిత్యముఅయిన శాంతిని, ఆనందాన్ని మాత్రము అది కేవలము మానసికమైనది. మనస్సు ఎప్పుడైతే విషయం వాంఛల నుండి విడివడుతుంతో అప్పుడే మనస్సు నిర్మలం అవుతుంది. ప్రవహించే నీటిలో తామరలు వుండవు కేవలం నిర్మలమైన సరస్సులోనే తామరలు వికాసిస్తాయి
మనం ఎలా ఉండాలి ఎలాంటి కోరికలు కోరుకుంటే మనకు నిత్యానందం, నిత్యా తృప్తి కలుగుతుంది అన్నది మన ఋషులు వారి దివ్యజ్ఞానంతో మనకు తెలియచేసారు.
వినా దైన్యేన జీవనం అనాయాసేన మరణం అంతిమే తవ సాయుజ్యమ్ దేహిమే పార్వతీపతే ౹
భూమిమీద వున్నప్రతి మనిషి స్త్రీ,పురుష, కులమత వర్ణ భేదములోలేకుండా ప్రతి వారు కోరుకోవలసిన 3 కోరికలు ఏమిటో ఇప్పుడు చూద్దాం. మొదటి కోరిక 1) వినా దైన్యేన జీవనం అంటే జీవితంలో దైన్యత అనేది ఉండకుండా జీవించాలి అంటే నాకు ఏది కొరత లేకుండా ఉండాలి అని కోరుకోవాలి దానర్ధం సర్వ సుఖాలు కావాలని కాదు ఒక సాధారణ మనిషి అవసరాలు అన్ని తీరాలని మాత్రమే ఉదాహరణకు నివసించటానికి ఒక గృహం, ఆకలి తీర్చటానికి భోజనము, నిద్రించటానికి శయనం. ఇలా ఉంటే మనస్సు ప్రశాంతంగా ఉంటుంది, అది భగవంతునిమీదకు మళ్లుతుంది.
ఇక రెండవ కోరిక 2)అనాయాసేన మరణం మనం మన జీవితంలో ఏది మనం అనుకున్నట్లుగా జరుగదు భూమి మీద వున్నా ఏ మనిషి తాను అనారోగ్యం పాలు కావాలని కోరుకోడు కానీ రోజు అనేక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. ప్రతి మనిషికి మరణం మాత్రమే అంతిమ గమ్యం దానికి అధిగమించటం ఏ మనిషికి సాధ్యం కాదు కానీ అనేకవిధాల రోగాలపాలు పడి పంచేంద్రియాల పట్టు తప్పి బాహ్య స్పృహ కోల్పోయి మంచానికే పరిమితమై ఇతరుల మీద ఆధారపడి అనేక నెలలు, కొన్ని సందర్భాలలో ఏళ్ళు ఆలా వుంటూ ఐనవారికి భారమై ఎందుకురా దేముడా నన్ను పుట్టించవు అని వేదన చెందుతూ, తనవారి అసహనానిని వింటూ భరిస్తూ అంతిమ జీవనం చేయటం కన్నా నరకం ఇంకొకటి ఉండదు. ఇరుగుపొరుగు వాళ్ళు వాడు చేసిన దానికి ఇక్కడే నరకం అనుభవిస్తున్నాడు అని అంటం వంటి జీవితం చాలా దుఃఖప్రదమైనది. అదే ముందుగానే మన ఉనికిని తెలుసుకొని మన మనస్సుని ఆ భగవంతుని మీదకు మళ్లించి నిత్యం సాధన చేసే సాధకుడు పాపాలకు, పుణ్యాలకు దూరంగా వుంది ఆత్మ తత్వాన్ని తెలుసుకొని పరమాత్మతో ఐక్యం చెందుతాడు. శరీరం పూర్తిగా స్వాధీనంలో వున్నప్పుడు ఏ సాధకుడు బ్రహ్మ జ్ఞ్యాన పిపాసి అవుతాడో ఆటను నిశ్చయంగా బ్రహ్మిఇక్యం చెందుతాడు.
ఇక మూడవ కోరికను పరిశీలిద్దాము. అంతిమే తవ సాయుజ్యమ్ దేహిమే పార్వతీపతే ౹ ఇక
మనసు మాట వినదు
మనసు మాట వినదు
దాదాపు అందరు సాధకులు చెప్పేది ఒక్కటే అదేమిటంటే నేను సాధన చేస్తున్నపుడు నా మనసు నా మాట వినటంలేదు మనసుని నియంత్రించుకోవడం ఎలా ఈ ప్రశ్న ఈ రోజుదికాదు యుగయుగాలనుండి ముముక్షువులను వేధిస్తున్నది. సాధకునికి మనస్సు వశం కాకపొతే ధ్యానం నిలవదు. ఎంతసేపు ధ్యానం చేసిన కూడా ఫలితం ఉండదు. మరి ఈ మనస్సుని ఎలా నియంత్రించాలి. ఈ విషయంలో మనకు అనేక మంది మహర్షులు అనేక విధాలుగా తెలిపారు. శ్రీ భగవానులవారు కూడా భగవత్గీతలో చాలా స్పష్టంగా తెలిపారు.
మనస్సు చేష్టలు:
మన పంచేంద్రియాలు వాటి వాటి అవధులలోనే ప్రవర్తిస్తాయి. కన్నులు నీ ముందు ఉన్నవాటిని మాత్రమే చూడగలవు. నీకు దూరంగా ఉన్నవాటిని లేక వాటిమధ్య ఏవైనా ఇతరవస్తువులు వున్నా వాటినిదాటి నీ దృష్టి పోదు. అంటే కండ్లకు వున్న శక్తికి ఒక అవధి (limitation ) వున్నది. అదేవిధంగా చెవులు, ముక్కు,ఇతర ఇంద్రియాలు. కానీ ఏ ఇంద్రియానికి లేనివిధంగా అవధులు లేని అనంతమైన విస్తృత శక్తి కేవలం మనస్సుకి మాత్రమే ఉంది. నీవు నీ ఇంట్లో కుర్చోనికూడా నిన్న నీ ఆఫీసులో జరిగిన విషయాన్నీ గూర్చి ఆలోచించటమే కాకుండా అప్పుడు నీవు పొందిన భావాన్ని ఇప్పుడు పొందగల్గుతున్నావు. ఉదాహరణకు నిన్న నీవు ఏదో ఒకవిషయంలో నీ ఆఫీసరు నిన్ను దూషించెదనుకోండి. నీకన్నా పెద్ద అధికారి కాబట్టి నీవు అతనిని ఎదిరించలేవు దానిపర్యవసానమే నీవు బాధపడటం. నిజానికి ఆ బాధ నిన్ననే నీవు అనుభవించావు. కానీ నీ మనస్సు నీవు ఒంటరిగా ఉన్నప్పుడు మళ్ళీ ఆ విషయాన్ని తలపిస్తూ మళ్ళీ మాళ్ళీ నీకు ఆ బాధనే కలుగచేస్తుంది. దాని పర్యవసానమే నీవు ఇతరవిషయాలమీద నీ మనస్సుని నిలపలేకపోవటం. భౌతిక విషయాలమీదనే మనస్సు నిలపలేని నీవు ఇక భగవంతునిమీద ఎలా నిలుపగలవు అది పూర్తిగా అసాధ్యం.
మనస్సుని ఎలా స్వాధీన పరచుకోవాలి:
ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే ఈ మనస్సుని ఎలా స్వాధీనపరచుకోవాలి.
ఇంకా వుంది