2, మార్చి 2024, శనివారం

ఆభరణం

 🙏🙏🙏

********

              **శుభోదయం**

                        ***

**మానవుని యొక్క ఆభరణం రూపం. రూపం యొక్క ఆభరణం గుణం. గుణం యొక్క ఆభరణం జ్ఞానం, జ్ఞానం యొక్క ఆభరణం క్షమ. ఇది కల్గిన వారు సర్వత్రా శ్రేష్టులుగా చెప్పవచ్చును.**

                     ***

 ""సత్యం మాతా పితా జ్ఞానం ధర్మో భ్రాతా దయా సఖా

శాంతి:పత్నీ క్షమా పుర: షడేతే మమ బాంధవా""

                      ***

**ఆత్మ బంధువులు ఆరుగురున్నారు మనకు. అవి సత్యం, జ్ఞానం, ధర్మం, దయ, శాంతి, క్షమాగుణం. తల్లిని ఎంతగా ప్రేమిస్తామో సత్యాన్ని అంతగా ప్రేమించాలి. తండ్రిని ఆరాధించినట్లే జ్ఞానాన్ని సంపాదించాలన్న తృష్ణను కలిగి ఉండాలి. ధర్మాన్ని సోదరునిగా ఎంచాలి. దయను ప్రియనేస్తంగా భావించాలి. శాంతిని భార్యలా, క్షమను పుత్రునిలా భావిస్తూ ఆ గుణాలతో మమేకం కావాలి. పరిపక్వమైన వ్యక్తిత్వం అంటే అదే! ఆప్తులవల్ల కూడ ఒక్కోసారి మన మనసుకు బాధకలుగుతుంటుంది. అంత మాత్రావ వారిని మనం ప్రేమించకుండా ఉండలేం! అలాగే పై గుణాలవల్ల అప్పుడప్పుడు కొంత నష్టమో, కష్టమో కలిగినా సంతోషంతో స్వీకరించాలి తప్ప వాటిని వదులుకోవాలని భావించకూడదు.* 

*సన్మార్గాలు అనేవి ఎప్పుడూ మనలను పరీక్షించేవి, రక్షించేవీను. ఆ పరీక్షలకు తట్టుకుని నిలబడగలిగే మానసిక ధృడత్వాన్ని మనలో పెంపొందించుకోవాలి. చెక్కుచెదరని ధృఢ సంకల్పంతో ముందుకు సాగాలి. అప్పుడు ఎవరైనా మన తీరుతెన్నుల్ని విమర్శించినా, ఎగతాళి చేసి మాట్లాడినా వాటి ప్రభావం మనపై పడదు. ఇతరుల విమర్శల వెనుక ఒక్కోసారి వారి అజ్ఞానమో, స్వార్ధపూరిత మనస్తత్వమో ఉంటుంది.**

*కనుక ఇతరుల విమర్శలకు కాకుండా ఆత్మవిమర్శకే అధిక* *ప్రాధాన్యతను ఇవ్వాలి.**

                        ***

             **ఇదం న మమ**

          **శుభప్రదమైన రోజు**

                        ***

**యం.వి.శర్మ**

🙏🙏🙏

ఉన్నప్పటికీ పేదవాడు.

💎🌅 *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔
🪔 *_𝕝𝕝ॐ𝕝𝕝 సుభాషితమ్ 𝕝𝕝卐𝕝𝕝_* 💎

శ్లో𝕝𝕝.      
*పూర్ణే తటాకే తృషితః సదైవ*
*భూతేపి గేహే క్షుధితః స మూఢః౹*
*కల్పద్రుమే సత్యపి వై దరిద్రః*
*గుర్వాదియోగేేఽపి హి యః ప్రమాదీ॥*

భావము - 

*సద్గురువును కలుసుకున్నప్పటికీ తిరిగి తప్పులు చేసే మూఢుడు* ఎలాంటి వాడంటే, నిండు చెరువు దగ్గర ఉన్నా దాహంతో ఉండేవాడు, సొంత ఇల్లు ఆస్తిపాస్తులు ఉన్నప్పటికీ ఆకలితో అలమటించేవాడు, మరియు కల్పవృక్షం తన వద్ద ఉన్నప్పటికీ పేదవాడు.....

విటమిన్లు

 విటమిన్లు అవి లభించు ఆహారపదార్థాలు  - తగ్గుట వలన కలుగు సమస్యలు  : -


        మానవశరీరానికి రసాయనికంగా మరికొన్ని ద్రవ్యాలు అవసరం. వీటికే విటమిన్ అని పేరు పెట్టారు. ఇవన్నియు జీవకణములే . ఇప్పటివరకు శరీరశాస్త్రముకు సంభందించినంత వరకు ఆరు రకాల విటమిన్స్ కనిపెట్టారు.   అవి 


    A , B , C , D , E , K .


*  " A "  విటమిన్ - 


             "A " విటమిన్ ముఖ్యంగా కంటిచూపుకు సంభందించినది. శరీరంలో A విటమిన్ తగ్గిన కంటిదృష్టి తగ్గును. ఆవుపాలు ఇంకా వెన్న , నెయ్యి, ఆకుకూరలు ముఖ్యంగా మునగ , బచ్చలి, తొటకూర వర్గానికి  చెందిన ముల్లంగి, పుదినా ఆకు, కొత్తిమీర వీటి యందు "A " విటమిన్ ఉంటుంది. మామిడి పండు, బొప్పాయి, మంచిగుమ్మడి , క్యాబేజిల యందు కూడా "A " విటమిన్ ఉంటుంది.


*  " B " విటమిన్  - 


             " B "  దీనిలో కొన్ని ఉప విటమిన్లు కలిపి ఒక సమూహంగా ఉన్నవి.  ఈ విటమిన్ సక్రమంగా ఉండటం వలన రక్తం మంచి స్థితిలో ఉండును. ఈ విటమిన్ లోపించడం వలన రక్తంలో బలం తగ్గి " మేహనంజు " అను వ్యాధి సంప్రాప్తినిచ్చును . దీనిని ఆంగ్లమున బెరిబెరి వ్యాధి అని పిలుస్తారు . ఆకలి ఉండదు. కాళ్లల్లో చేతుల్లో తిమ్మిర్లు  , రక్తప్రవాహం మందగించి ఉండటం , గుండె బలహీనం అవ్వడం , ఎగశ్వాస వంటివి సంప్రాప్తి అగును.ఇది ఎక్కువుగా బియ్యపు తవుడు, , గోధుమలు , కాయధాన్యాలలో ఉంటుంది.


                ఈ " B " విటమిన్ సమూహంలో చేరిన మిగతా విటమిన్లు వరసగా రిబోఫ్లోవిన్ థయామిన్, కోటినిక్ ఆసిడ్ , ఫాంటో తెనిక్ ఆసిడ్ , ఫాలిక్ ఆసిడ్, బోరిన్ వంటివి ఉన్నాయి. శరీర అభివృద్ధికి ఇవి కొద్ది మోతాదులో అవసరం. ఇవి పాల వర్గంలో , మెట్ట ధాన్యాల యందు శించి ధాన్యాల యందు బాదం , అక్రోటు, కొబ్బరి, వెలగ , జీడిపప్పుల్లో ఉంటుంది. 


              మన ఆహారంలో ఇవి లోపించిన విషయం కంటిరెప్పలు , పెదవులు , చర్మం పగుళ్లు రావటం వంటి లక్షణాల ద్వారా తెలుసుకోవచ్చును. ఆహారంలో కోటిన్ ఆసిడ్ చాలక పోయినచో నొటిపూత వంటివి కలుగును. ఫాలిక్ ఆసిడ్ శరీరంలో ఉండు జీవకణములను పోషించి బలపరుస్తుంది. ఈ జీవకణములు నిరంతరం కొన్ని నశించిపోతూ కొన్ని ఉత్పత్తి అగుచుండును. ఫాలిక్ ఆసిడ్ ఈ జీవకణముల బలపరుస్తూ జీర్ణకోశంలో ఆహారమునకు జరుగుచుండు పరిణామాలు కు సహాయపడును . దీనిలోపం వలన రక్తం క్షీణించి పాండురోగం వచ్చును.


 *   " C "  విటమిన్  - 


              ఈ " C " విటమిన్ ఆకుకూరల యందు పప్పు దినుసుల యందు ఉంటున్నది.  C విటమిన్ చేయు ముఖ్యమైన పని నోటి యందలి దంతాలు , శరీరం నందలి ఎముకలు మన ఆహారం లో వీటిపోషణకు , అభివృద్దికి అవసరం అయిన సున్నం , ఇనుము వంటి వాటిని విడదీసి వాటిని దంతములకు , ఎముకలకు అనువుగా మార్చి  వాటికి సరఫరా చేయును . ఈ కార్యక్రమం సరిగ్గా జరగనిచో మనుష్యులు మరుగుజ్జులు కావడం , కాళ్ల యందలి చేతుల యందలి ఎముకలు క్రమం దప్పి వంకరగాను , వికారంగాను అంగవైకల్యం ఏర్పడును . ఉశిరికాయలో ఈ C విటమిన్ విశేషంగా ఉండును. ఈ ఉశిరికలో మరొక్క విశేషం ఉంది . అది ఏమనగా మిగతా ద్రవ్యములలో ఎండినచో ఈ విటమిన్ నశించినట్లు ఉశిరకాయలో నశించిపోదు.


 *  


" D " విటమిన్  - 


          ఈ D విటమిన్ విశేషంగా మనము సేవించు పాలు , వెన్న , నెయ్యి వీటిలో ఉంటుంది. దీని పనికూడా C విటమిన్ విధంగానే ఉంటుంది. మన పేగుల్లో ఉండు ఆహారపదార్థాల్లోని క్షారమును వేరుపరిచి దానిని ఎముకల యందు చేర్చుట. ఈ విటమిన్ ఎముకలకు చాలా ముఖ్యమయినది. ఈ D విటమిన్ ఆహారపదార్థాల్లోనే కాకుండా సూర్యరశ్మిలోను దొరుకుతుంది . 


                 మనుష్యుడికి ఉదయపు ఎండలో తిరగడం వలన శరీరానికి కావలసిన D విటమిన్ పుష్కలంగా దొరకును.  వ్యవసాయ పనులు చేసేవారికి ఈ విటమిన్ పుష్కలంగా దొరకును. 


 *  " K " విటమిన్  - 


            మనం భుజించు ఆహారములలో అనగా ఆకుకూరలు , క్యాబేజి , క్యారెట్లు ఇత్యాదుల యందు K విటమిన్ ఆకారం అయిన కెరోటిన్ ఉంటుంది. ఈ కెరొటిన్ మనశరీరంలో ఉత్పత్తి అగుచున్న ప్రాణవాయువు వలన భస్మీపటలం అగుచున్నది. అట్లు జరిగిన పక్షంలో దానివల్ల శరీరానికి ఎటువంటి ఉపకారం ఉండదు.  అలాంటి సమస్యని నివారించుటకు   e విటమిన్ కు కలదు.


               ఈ K విటమిన్ కు రక్తం గడ్డకట్టే గుణం కలదు. ఈ విటమిన్ శరీరంలొ సరైన మోతాదులో ఉన్నంతవరకు దేహంకు ఎట్టి గాయాలు అయినను రక్తస్రావం శీఘ్రంగా నిలిచిపోవును . కాయకూరలు , ఆకుకూరలు వీటియందు ఈ విటమిన్ ఎక్కువుగా ఉండును.


                  కావున మనం తీసుకునే ఆహారములో అన్ని రకాల పదార్థాలు సమపాళ్లలో తీసుకున్నప్పుడే మనశరీరం మంచి ఆరోగ్యంతో ఉంటుంది. 


 

  ఆయుర్వేదములోని ఎన్నొ రహస్య మూలికల అనుభవ యోగాల గురించి నా గ్రంథాల యందు సంపూర్ణముగా , అందరికి అర్థమయ్యే సులభ భాషలో వివరించాను . వాటిని చదివి మరింత విజ్ఞానాన్ని పొందగలరు . 


  

 గమనిక  -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


      ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .


     కాళహస్తి వేంకటేశ్వరరావు  


 అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


         9885030034

🪐శ్రీ కృష్ణావతారం

 🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐

. *పురాణ పఠనం*

. *🪐శ్రీ కృష్ణావతారం🪐*

. *107వ అధ్యాయం*

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐


*శ్రీకృష్ణ నిర్యాణంబు* 


ఇలా అడిగిన రాజుతో శుకుడు ఇలా చెప్పాడు. “అలా శ్రీకృష్ణుడు అన్యాయమార్గంలో నడిచే దుర్మార్గులను చంపి, న్యాయమార్గంలో నడిచే సజ్జనులను కాపాడి బలరాముడు తాను ద్వారకనుండి వెళ్ళిపోయారు. పిమ్మట యాదవులు తమలో తాము మద్యపానంచేసి మత్తిల్లి, ఈర్ష్యతో పరిహాసంగా పోట్లాడుకోవడం మొదలుపెట్టారు. అది నిజమైన పోట్లాటగా మారింది. ఏనుగులు, గుఱ్ఱాలు, రథాలు, కాల్బలములు తోకూడి అడ్డు ఆపు లేకుండా వారిలో వారే యుద్ధాలు మొదలుపెట్టారు. మునిశాపం కారణంగా ఎత్తుగా పెరిగిన తుంగ బెత్తాలతో అలసిపోయేలా కొట్టుకుంటూ బాదుకుంటూ యుద్ధాలు చేయసాగారు. ఆ తుంగబెత్తాలు వజ్రాయుధంతో సమానమైన ఆయుధాలవలె తాక సాగాయి. అలా ఒకరినొకరు పొడుచుకుంటూ భయంకరంగా యుద్ధం చేశారు. రణరంగమంతా ముక్కలు ముక్కలై చెదరిన మొండెములతో, వికలమైన దేహాలతో, విరిగిన రథాలతో, కూలిన గుఱ్ఱాలతో, వాలిన ఏనుగులతో నిండిపోయింది. యాదవులు అందరూ ఆ సమరంలో చచ్చిపోయారు. ఇదంతా చూసి నవ్వుకుంటూ శ్రీకృష్ణుడు బలరాముడు ఎటో వెళ్ళిపోయారు. కొంతదూరం వెళ్ళిన తరువాత బలరాముడు ఒక్కడు వేరు మార్గాన పోయి యోగమార్గంతో అనంతునిలో కలిశాడు. పరమేశ్వరుడు శ్రీకృష్ణుడు మరో మార్గంలో వెళ్ళి ఒక గుబురు పొద చాటున విశ్రాంతిగా పడుకుని ఒక కాలు మీద మరొక కాలు పెట్టి వినోదంగా ఆడిస్తున్నాడు. ఆ సమయంలో, ఒక బోయవాడు వేటకు వచ్చి అన్ని ప్రక్కలకు నిక్కి చూస్తూ ఉంటే, ఆ చెట్టుచాటున ఆ పరమపురుషుని కదలుతున్న కాలు లేడి చెవిలాగా కనిపించింది. అది చూసి, అంబులపొది నుంచి బాణం తీసి విల్లెక్కుపెట్టి గురిచూసి కొట్టాడు. ఆ బాణం తగిలి శ్రీకృష్ణుడు హాహాకారం చేయసాగాడు. వాడు దగ్గరకు వచ్చి చూసి జగదీశ్వరుడైన కృష్ణుడని తెలుసుకుని భయంతో, “అపరాధం చేసాను పాపాత్ముడిని వక్రబుద్ధిని.” అని రకరకాలుగా దీనంగా ఏడుస్తూ కన్నీరు కార్చసాగాడు. వానిని చూసి కృష్ణుడు దయతో ఇలా అన్నాడు. “నీవు దుఃఖిచనక్కర లేదు. పూర్వజన్మల కర్మలు అనుభవించక ఎంతటి వారికి అయినా తప్పవు. వాటి ఫలితాల ఊరకే పోవు. నీవు నిమిత్రమాతృడివి మాత్రమే.” ఇలా వాడికి నచ్చ చెప్పినా వాడు, “ఇంత పెద్ద తప్పు చేసాక ఊరకే పోదు. దైవానికి, గురువులకు, వైష్ణవులకు, ద్రోహం చేసినవాడు ధరణిపై నిలువరాదు.” అని పలికి, పవిత్రమైన మనస్సుతో ప్రాయోపవేశం చేసి ప్రాణాలు వదిలి వైకుంఠానికి వెళ్ళాడు. ఆ సమయంలో రథసారథి అయిన దారుకుడు వచ్చి సర్వజ్ఞుడు, మేరుపర్వతధీరుడు, దనుజ సంహారుడు అయిన శ్రీకృష్ణుడు ఒంటరిగా ఉండటం చూసాడు. “నిన్ను చూడని కన్నులు నిష్ఫల మైనవి; నిన్ను వర్ణించని నాలుక నీరసమైనది; నిన్ను కనుగొనని దినాలు నిందింపదగినవి; స్వామీ! నీ కనులెత్తి మమ్ము దయతో చూడు.” అంటూ దారుకుడు మిక్కిలి దుఃఖంతో ఇలా విన్నవించాడు. “సముద్రమంత యాదవ సమూహం నశించింది. బంధువులు, గురువులు, మిత్రులు అందరు అటు ఇటూ చెల్లాచెదురైపోయారు. ద్వారకకు పోయి మిత్రులతో ఏమని చెప్పాలి.” అని అంటూండగానే, శ్రీకృష్ణుని దివ్యమైన ఆయుధాలు, గుఱ్ఱాలూ మాయమైపోయాయి. శ్రీకృష్ణుడు దారుకుడితో, “అక్రూరునికీ విదురునికీ జరిగిందంతా చెప్పు. స్త్రీలను, పిల్లలను, పెద్దవారిని హస్తినాపురానికి తీసుకుని వెళ్ళమని అర్జునుడితో చెప్పు. వెళ్ళు.” అన్నాడు. దారుకుడు తిరిగివెళ్ళి కృష్ణుడి మాటలు వివరంగా అందరికీ చెప్పాడు. ఆయన చెప్పినట్లు చేసేటంతలో ద్వారకానగరం పూర్తిగా జలాలలో మునిగిపోయింది. ఎవరికీ ప్రవేశించటానికి వీలులేని స్థితికి వెళ్ళిపోయింది.

అప్పుడు పరమేశ్వరుడైన శ్రీకృష్ణుడు నూరుకోట్ల సూర్యుల దివ్యతేజస్సుతో వెడలి నారదుడు మున్నగు మునులు, బ్రహ్మదేవుడు, రుద్రుడు, మొదలయిన దేవతలు జయజయ నినాదాలతో వెంట రాగా తన స్థానానికి వెళ్ళిపోయాడు. ఆ నారాయణుని విగ్రహము సముద్ర ప్రాంతంలో జగన్నాథుడి రూపంతో ఉంది.” అని శుకబ్రహ్మ పరీక్షిన్మహారాజుకి చెప్పాడు. ఈ కథను విన్నవారు, వ్రాసినవారు సిరిసంపదలు కీర్తి అదృష్టము కలిగి దీర్ఘాయువుతో లోకులు మెచ్చే గొప్పవారై ప్రకాశిస్తారు. నవ్వు ముఖము; చక్కని నడుము; నల్లని దేహము; లక్ష్మీదేవికి నివాసమైన వక్షస్థలము; పెద్ద బాహువులు; అందమైన కుండలాలు కల చెవులు; గజగమనము; నల్లనిజుట్టు; దయారసం చిందే చూపు కలిగిన విష్ణుమూర్తి నేను కనులు మూసినపుడు తెరచినపుడు పొడచూపు గాక.


 


సశేషం🙏


*హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే*


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐