20, అక్టోబర్ 2022, గురువారం

కార్తీక సోమవారాలు

 *కార్తీక సోమవారాలు*

.................................

తేదీ: 31-10-2022 కార్తీక సోమవారం అనగా *మొదటి సోమవారం*


తేదీ: 7-11-2022 కార్తీక సోమవారం అనగా *రెండో సోమవారం*


తేదీ:14 -11-2022 కార్తీక సోమవారం అనగా *మూడవ సోమవారం*


తేదీ: 21-11-2022 కార్తీక సోమవారం అనగా *నాలుగో సోమవారం*


*ముఖ్యమైన తేదీలు*

 

➡️తేదీ: 4-11-2022 శుక్రవారం *కార్తీక శుద్ధ ఏకాదశి*


➡️తేదీ: 5-11-2022 శనివారం *కార్తీక శుద్ధ ద్వాదశి (క్షీరాబ్ది ద్వాదశి)*


➡️తేదీ: 8-11-2022 మంగళవారం *కార్తీక శుద్ధ పౌర్ణమి*


తేదీ: 23-11-2022 బుధవారం *కార్తీక బహుళ అమావాస్య( కార్తీకమాసం ఆఖరు)*


➡️తేదీ: 24-11-2022  గురువారం *మార్గశిర శుద్ధ పాడ్యమి (మార్గశిర మాసం ప్రారంభం)* 


➡️తేదీ:24-10-2022 సోమవారం *ఆశ్వీయుజ బహుళ చతుర్దశి తత్కాల అమావాస్య (దీపావళి అమావాస్య)*


➡️తేదీ:25-10-2022 మంగళవారం *సూర్యగ్రహణం*


➡️తేదీ:26-10-2022 బుధవారం *కార్తీక శుద్ధ పాడ్యమి( కార్తీకమాసం ప్రారంభం)*


➡️తేదీ: 29-10-2022 శనివారం *కార్తీక శుద్ధ చవితి (నాగులు చవితి)*


మీ

*పారేపల్లి సాయిబాబు*

అధ్యక్షులు శ్రీ కన్యకాపరమేశ్వరీ దేవీ శ్రీ చక్రమందిరం,నందిగామ. 


*సర్వేజనా సుఖః నో భవంతు*


🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

చిత్రకేతూపాఖ్యానం

 Srimadhandhra Bhagavatham -- 48 by Pujya Guruvulu "Pravachana Chakravarthy" , "Vachaspathy" Brahmasri Chaganti Koteswara Rao Garu


3. చిత్రకేతూపాఖ్యానం:

పూర్వకాలంలో చిత్రకేతువు అనే మహారాజుగారు ఉండేవారు. ఆయన శూరసేన దేశమును ఏలుతూ ఉండేవాడు. ఆయనకు అనేకమంది భార్యలు. ఇంతమంది భార్యలతో కూడి చిత్రకేతువు రాజ్యపరిపాలన చేస్తున్నాడు. నిరంతరం మనస్సులో ఒక్కటే శోకం. ఆయనకు సంతానం లేదు. ఆయన పెద్ద భార్య పేరు ‘కృతద్యుతి’. ఒకరోజున ఆయన వద్దకు అంగీరస మహర్షి వచ్చారు. ఆయన స్వాగతం పలికి అర్ఘ్యపాద్యాదులు ఇచ్చాడు. అంగీరస మహర్షి – ‘ఇంతమంది భార్యలు ఉన్నారు, ఐశ్వర్యం ఉన్నది. ఇంత పెద్ద సామ్రాజ్యం ఉన్నది. నీ ముఖంలో కాంతి లేదు. నీవు దేనిని గురించి బెంగ పెట్టుకున్నావు’ అని అడిగారు. చిత్రకేతువు ‘మహానుభావా! మీరు త్రికాలజ్ఞులు. మీరు సర్వము తెలుసుకోగలరు’ అన్నాడు. అంగీరస మహర్షి ‘నాకు అర్థం అయింది. నీకు పిల్లలు లేరు. అందుకు కదా బాధపడుతున్నావు. నీచేత పుత్రకామేష్టి చేయిస్తాను. నీకు బిడ్డలు కలుగుతారు’ అని పుత్రకామేష్టి చేయించి యజ్ఞ పాత్రలో మిగిలిపోయిన హవిస్సును నీ పెద్ద భార్యచేత తినిపించు. నీకు యోగ్యుడయిన కుమారుడు కలుగుతాడు. వాడివలన నీవు సుఖదుఃఖములు పొందుతావు’ అని చెప్పాడు.

రాజు యజ్ఞపాత్ర తీసుకువెళ్ళి పెద్దభార్యకు ఇచ్చాడు. ఆవిడ దానిని స్వీకరించి గర్భాన్ని ధరించి ఒక పిల్లవాడు జన్మించాడు. ఇంక రాజు పరవశించి పోయాడు. అర్బుదముల బంగారమును దానం చేశాడు. రాజ్యం అంతా సంతోషంగా ఉన్నది. ఒకరోజు రాత్రి పెద్దభార్య కుమారుని పెట్టుకుని నిద్రపోతోంది. మిగిలిన భార్యలందరికీ కోపం వచ్చింది. ‘మనకందరికీ పిల్లలు లేరు కాబట్టి రాజు ఇప్పటివరకు మనందరితోటి సమానంగా ఉన్నారు. ఆవిడకి పిల్లవాడు పుట్టాడు కాబట్టి కృతద్యుతి మందిరానికే వెళుతున్నాడు. ఆవిడకి ఈ ఆదరణ పోవాలంటే ఆ పిల్లవాడిని చంపేయాలి’ అని వీళ్ళందరూ కలిసి ఆ పిల్లవానికి మెల్లగా విషాహారాన్ని పెట్టేశారు. మరునాడు ఉదయం చూసేసరికి పిల్లవాడు నల్లగా అయిపోయి మరణించి ఉన్నాడు. ఆ పిల్లవాని పాదముల వద్ద కూర్చుని తాను ప్రభువుననే విషయమును కూడా మర్చిపోయి ఏడుస్తున్నాడు.

అంగీరస మహర్షి బ్రహ్మలోకం నుంచి నారదునితో కలిసి వచ్చారు. వారు వచ్చేసరికి రాజు ఏడుస్తున్నాడు. ఎవరి వలన కొడుకు పుట్టాడో ఆ అంగీరస మహర్షిని మరచిపోయాడు. అంగీరస మహర్షి ‘రాజా ఎందుకు ఏడుస్తునావు?’ అని అడిగాడు. రాజు ఆశ్చర్యపోయి ‘కొడుకు చచ్చిపోయినందుకు ఏడుస్తున్నాను’ అన్నాడు. అంగీరసుడు ‘నువ్వు ఇప్పుడు నా కొడుకు నా కొడుకు అని ఏడుస్తున్నావు కదా. నేను ఇంతకుపూర్వం నీకు కొడుకు పుట్టడం కోసం నీచేత యజ్ఞం చేయించాను. నీకు ఈ కొడుకు లేడు. అంతకుముందు నీకు కొడుకు లేనపుడు నీవు సుఖంగా ఉండేవాడివి. ఈ కొడుకు మధ్యలో వచ్చాడు. మధ్యలో వెళ్ళిపోయాడు. చిత్రకేతూ, మనుష్యుల జీవితములు ఎలా ఉంటాయో తెలుసా? నీకు ఒక విషయం చెపుతాను. ‘ఈ శరీరమును చూసి అనేకమయిన అనుబంధములను పెట్టుకుంటారు. అసలు దేనితో అనుబంధం పెట్టుకున్నారో అది విష్ణుమాయ. అది ఉండేది కాదు. కానీ లోపల ఉన్నది ఎప్పుడూ ఉండేది. రాజా! అసలు ఉండవలసిన అనుబంధం ఈశ్వరుని ఒక్కనితోటే. అదిలేక నీ కొడుకుతో పిల్లలు లేరన్న భ్రాంతితో ఉండిపోయి జ్ఞానం కలగడం లేదని సుఖదుఃఖకారణమైన కొడుకును నీకు ఇచ్చాను. చూశావా – వాడే సుఖం, దుఃఖం ఇచ్చాడు. నీకు మాయయందు తగులుకునే స్వభావం ఉన్నది. దానివలన నీవు సుఖదుఃఖములను పొందుతున్నావు’. అపుడు నారదుడు ‘నాకొడుకు పోయాడు అని అంటున్నావు కదా! నీ కొడుకును బ్రతికిస్తాను. వరం ఇస్తాను. వాడు అంగీకరిస్తాడేమో చూద్దువు కాని వాడిచేత మాట్లాడిస్తాను’ అని నారదుడు తన తపశ్శక్తితో ఆ వెళ్ళిపోయిన జీవుణ్ణి తెచ్చాడు. నువ్వు వెళ్ళిపోవడం వల్ల నీ శరీరమునకు తల్లిని, తండ్రిని అనుకున్న వాళ్ళు ఖేదం పొందుతున్నారు. ఓ జీవుడా నువ్వు నీ శరీరము నందు ప్రవేశించి నీవు కోరుకుంటే దీర్ఘాయుర్దాయంతో సింహాసనమును అధిష్ఠించి నీ తల్లిదండ్రులకు ఆనందమును కలిగించు’ అన్నాడు. జీవుడు వెనక్కి వచ్చి తండ్రివంక చూసి భ్రుకుటి ముడివేసి ‘నేను ఈ శరీరము వదిలిపెట్టి వెళ్ళిపోయాను. ఈ శరీరమునకు వారు తల్లిదండ్రులు. నా కర్మ వల్ల నేను ఇప్పటికి ఎన్ని కోట్లమంది తల్లిదండ్రులకు కొడుకుగా పుట్టానో! వాళ్ళలో వీరొకరు’. ఈమాట విని చిత్రకేతువు ఇంతవరకు వీడు నాకొడుకు నాకొడుకని అనుకున్నాను. ఇదా వీడు మాట్లాడడమని వెనక్కి పడిపోయాడు. చిత్రకేతుడు అసలు విషయం అర్థం చేసుకుని ‘ఇప్పుడు నాకు బుద్ధి వచ్చింది. వాడు అలా మాట్లాడిన తరువాత నాకు తత్త్వం అంటే ఏమిటో తెలిసింది’ అన్నాడు. అంగీరసుడు ‘వానికి సంస్కారం చేసి యమునా నదిలో స్నానం చేసి ఆచమనం చేసి రావలసింది. నీకొక మంత్రం చెపుతాను. ఈ శరీరము ఉండగా చేరవలసింది ఈశ్వరుడిని. అనుబంధముల మాయా స్వరూపమని తెలుసుకొని ఈశ్వరుడి పాదములు పట్టుకో. నేను నీకు ఉపదేశం చేస్తాను. ఈ ఉపదేశం చేత ఏడురాత్రులు ఈ మంత్రమును జపిస్తే నీకు సంకర్షణ దర్శనం అవుతుంది’ అన్నారు. ఆయనను నమ్మి చిత్రకేతువు ఏడురాత్రులు, ఏడు పగళ్ళు జపం చేశాడు. అలా జపం చేస్తే ఆయనకి శ్రీమన్నారాయణుడు పాదం పెట్టుకునే పాదపీఠియైన ఆదిశేషుడు దర్శనం ఇచ్చాడు. ఆయనను విశేషంగా స్తోత్రం చేశాడు. అలా సోత్రం చేస్తే ఆయన –

ఆదిశేషుడు తన రూపమును భాసింప చేసి ‘నీటియందు బుడగపుట్టినట్లు ఆ బుడగకు అస్తిత్వము లేక నీటిలో కలిసిపోయినట్లు బ్రహ్మమునందే నామరూపములయిన మాయచేత జగత్తుగా పరిణమించింది. ఈ తత్త్వము అర్థమవడమే నా దర్శనం కలగడం. ఇపుడు నీవు బ్రహ్మజ్ఞానివి అయిపోయావు’ అన్నాడు. ఆయన ఇచ్చిన ఒకే ఒక వరం ఈయన పాలిటి శాపమయి కూర్చున్నది. అనంతుడు ఈయనకు ఒక విమానం ఇచ్చి ‘నీవు ఈ విమానంలో ఎక్కడికయినా విహరించు’ అని చెప్పి ఆయన తిరిగి సిద్ధ గణములతో వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోతుంటే చిత్రకేతుడు ఆయనను స్తోత్రం చేసి తదుపరి విమానమును ఎక్కి అన్ని బ్రహ్మాండములు తిరుగుతూ యక్ష కాంతలతో హరికథలను నాటకములుగా ప్రదర్శనలు చేయిస్తూ లోపల పరమ భక్తి తత్పరుడై ఉండేవాడు. ఒకనాడు ఆ విమానం ఎక్కి కైలాస పర్వతమునకు వెళ్ళాడు. పార్వతీదేవి పెనిమిటి అయిన పరమశివుడు సభలో కూర్చుని ఉండగా నాలుగు వేదములు పురుష రూపమును పొంది వాదించుకుంటున్నాయి. పరబ్రహ్మ తత్త్వం అంటే ఇలా ఉంటుందని అంటున్నారు కదా అంటే కాదు ఇలా ఉంటుంది అని వాదించు కుంటున్నాయి పరబ్రహ్మ తత్త్వాన్ని అర్థం చేసుకోలేక. బ్రహ్మగారు, సనక సనందనాది మహర్షులు అంజలి ఘటించి పరమశివా! మాయందు నీ అనుగ్రహమును ప్రసరింపజేసి మాకు జ్ఞానమును ప్రసాదించమని అడుగుతున్నారు. పార్వతీ పరమేశ్వరులను చూసి పొంగిపోయిన భృంగి నాట్యం చేస్తున్నాడు శంకర భగవత్పాదులు శివానందలహరిలో అంటారు. అంత పరమపవిత్రమయియన సభలోనికి చిత్రకేతువు తన విమానంలోంచి క్రిందకు దిగాడు. పరమశివుడు పార్వతీ దేవిని ఎడమ తొడ మీద కూర్చోపెట్టుకొని చేతితో గాఢాలింగనం చేసుకొని ఉన్నాడు. అది చూసి చిత్రకేతుడు అమ్మవారు వినేటట్లుగా పెద్ద ధ్వనితో నవ్వాడు. అందరూ ఆశ్చర్యపడిపోయి ఒక్కసారి అటు తిరిగి చూశారు.

అంత పెద్ద నవ్వు నవ్వేసరికి పార్వతీ దేవి చూసి ‘నీవు ఎందుకు నవ్వుతున్నావు’ అని అడిగింది. చిత్రకేతుడు అన్నాడు – ‘ఏమీ తెలియని అజ్ఞానికూడా భార్యను కౌగలించు కోవాలంటే ఇంట్లోకి వెళ్ళి కౌగలించుకుంటాడు. అంతేకానీ ఇంతమంది తాపసులు ఉన్న సభలో, బ్రహ్మగారు నిలబడ్డ సభలో, సనకసనందనాదులు నిలబడ్డ సభలో, సిగ్గులేకుండా ఆచార్యుడనని లోకానికి జ్ఞానమును ఇచ్చేవాడినని జగద్గురువునని లోక రక్షకుడనని అనిపించుకు సర్వమంగళప్రదుడనని అనిపించుకున్న పరమశివుడు ఎడమ తొడమీద భార్యను కూర్చోపెట్టుకుని ఇంతమంది చూస్తుండగా భార్యను గాఢాలింగనం చేసుకున్నాడు. ఆ మిథున రూపమును చూస్తే నవ్వు వస్తోంది. ఆయనకు కూడా ఇంత కామ వ్యామోహమా!' అన్నాడు. పార్వతీ దేవి ‘ఏమిరా ధూర్తుడా! కపిలుడు, భృగువు, నారదుడు, బ్రహ్మ, సనక సనందనాదులు శివుని ముందు నమస్కరిస్తూ నిలబడతారు. ఎవరి పాదములకు అంటుకున్న ధూళి మస్తకము మీద పడితే జ్ఞానము కటాక్షింపబడుతుందని కోరుకుంటారో ఎవరి పాదము తగిలితే మంగళ తోరణమై నీ ఇంటిని పట్టుకుంటుందో, ఎవరు అనుగ్రహిస్తే నీ ఇంట శుభకార్యములు జరుగుతాయో, ఎవరు లోపల ఉండడము చేత నీవు శివమై పదిమంది చేత నమస్కరింప బడుతున్నావో, ఏ శివము లోపలి నుంచి వెళ్ళిపోతే శవమై పోతావో, ఏ మహానుభావుడు లోకములన్నింటిని రక్ష చేస్తున్నాడో, ఎవరు తాను మహాత్యాగియై జ్ఞానిగా నిలబడ్డాడో అటువంటి పరమశివుని తూలనాడడానికి నీకు ఉన్న గొప్పతనం ఏపాటిది? ప్రకృతి పురుష తత్త్వమును తెలియక, గుర్తెరుగక ఒక ప్రాకృతమయిన మనుష్యుడు హీనుడు మాట్లాడినట్లు మాట్లాడావు. నీవు విష్ణుభక్తుడవని అనిపించుకునేందుకు నీకు అర్హత లేదు. శివుని గౌరవించనివాడు విష్ణు భక్తుడు కానేకాడు. నువ్వు ఇలా ప్రవర్తించావు కనక నిన్ను శపిస్తున్నాను. నువ్వు ఉత్తరక్షణం రాక్షస యోనియందు జన్మిస్తావు. నీవు చేసిన తపస్సు చేత శ్రీమన్నారాయణుని చేరెదవు గాక’ అని అనుగ్రహించింది.

చిత్రకేతువు విమానంలోంచి క్రింది పడిపోయి తల్లి పాదముల మీద పడిపోయి సాష్టాంగ నమస్కారం చేసి ఒక మాట అన్నాడు ‘అమ్మా! అనంతుని దర్శనం చేశాను. సంకర్షణుని దర్శనం చేశాను. ఎన్ని జన్మల నుంచో ఉన్న చిన్న అవిద్య అజ్ఞానం ఎక్కడో ఉండిపోయాయి. నీ మ్రోలకు వచ్చి ఒక వెకిలి నవ్వు నవ్వాను. ఇంత శాపమును పొందాను. నువ్వు శపించిన శాపం నన్ను ఉద్ధరించడానికేనని అనుకుంటున్నాను. అలాగే రాక్షసయోనియందు జన్మిస్తాను. నా అజ్ఞానము అక్కడితో తొలగుగాక’ అని నమస్కారం చేసి క్షమాపణ చెప్పి ప్రణిపాతము చేసి లేచి విమానం ఎక్కి వెళ్ళిపోయాడు.

ఇది చూసి పరమశివుడు ‘పార్వతీ చూశావా ఇతను పరమభక్తులు నీవు ఇంత శాపం ఇస్తే అతను కసుగందలేదు. నిజమయిన విష్ణుభక్తుడయినవాడికి అటువంటి సత్త్వగుణం కలగాలి. ఇతడు విష్ణు భక్తుడే. ఈ భక్తి వీనిని రక్షించి ఒకనాడు ఇంద్రసంహారం కోసం త్వష్ట ప్రజాపతి చేసిన యజ్ఞగుండంలోంచి వృత్రాసురునిగా పైకి వస్తాడు. వచ్చినా ధర్మం నిర్వర్తించాలి కాబట్టి యుద్ధం చేస్తాడు. మనస్సు మాత్రం శ్రీమన్నారాయణుడి దగ్గర పెట్టి శ్రీమన్నారాయణుని చేరుకుంటాడు. తాను చేసుకున్న సుకృతము చేత అపారమయిన భక్తితో నిలబడిపోతాడు’ అన్నాడు. ఈ ఆఖ్యానము ఇంత పరమ పావనమయినది కాబట్టి ఇహమునందు వాళ్లకి ఏమయినా ప్రమాదము రావలసి ఉంటే అటువంటి ప్రమాదములు తొలగి పుత్రపౌత్రాభివృద్ధిగా మూడు తరములు చూసి, సమస్త ఐశ్వర్యములు పొంది అంత్యమునందు భక్తి జ్ఞాన వైరాగ్యములు కలిగి, మరల పుట్టవలసిన అవసరం లేని పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుజ్యమును పొందుతారు. అటువంటి స్థితిని కటాక్షించ గలిగిన మహోత్కృష్టమయిన ఆఖ్యానము ఈ వృత్రాసుర వధ.



https://www.facebook.com/SriChagantiGuruvuGaariFollowersU...


instagram.com/pravachana_chakravarthy

ఒడిబియ్యం యొక్క విలువ,

 *ఒడిబియ్యం పోయటం వల్ల ఫలితాలు*

🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕

🌟 ప్రతి మనిషిలో వెన్నెముక లోపల 72 వేల నాడులు వుంటాయి. ఈనాడులను వెన్నెముకలు రక్షిస్తాయి. ఈనాడులు కలిసే ప్రతి దగ్గర ఒక చక్రం వుంటుంది. . ఇలాంటివి మనిషి శరీరంలో 7 చక్రాలు వుంటాయి. అందులో మణిపూర చక్రం నాభి దగ్గర వుంటుంది. ఈ మణిపూర చక్రంలో మధ్యబాగంలో 'ఒడ్డియాన పీఠం' వుంటుంది. మన అమ్మాయిలు నడుముకు పెట్టుకునే ఆభరణం పేరు కూడ అందుకే "ఒడ్డియాణం" వాడుకలో 'వడ్యాణం' అంటారు.


🌟 ఏడు చక్రాలలో శక్తి(గౌరీదేవి) ఏడు రూపాలలో నిక్షిప్తమవుతుందనేది సిద్దాంతం. ఒడిబియ్యం అంటే అమ్మాయి ఒడ్యాణపీఠంలో వున్న శక్తికి బియ్యం సమర్పించడం అన్నట్టు. ఒడ్డియాణపీఠంలో వుండే శక్తి రూపంపేరు మహాలక్ష్మి. ఒడిబియ్యం అంటే, ఆడపిల్లను మహాలక్ష్మి రూపంలో పూజించటం అన్నమాట. అలాగే పక్కనున్న భర్తను మహావిష్ణువులా భావించి సత్కారం చేయాలి. అమ్మలు చిన్నపిల్లలను ఒడిలో పెట్టుకుని కాపాడుకుంటారు. ఒడి అంటెనే రక్షణ.


🌟 ఒడిబియ్యం పోసే సమయంలో అమ్మాయిలను గమనిస్తే తెలుస్తుంది. వాళ్ళకు తెలియకుండానే మహాలక్ష్మిగా మారిపోతారు.మహాలక్ష్మి మొదటి లక్షణం రక్షించటం. బిడ్డను, అల్లుడిని రక్షించమని తల్లిదండ్రులు చేసే మహాలక్ష్మి వ్రతమే ఒడిబియ్యం. ఒడిబియ్యంలో ఒక బియ్యమే కాకుండా అష్ట ఐశ్వర్యాలు కూడా పోస్తారు. ఇవన్నీ తమబిడ్డను అష్ట ఐశ్వర్యాలతో ఉంచాలని తల్లివారు చేసే సంకల్ప పూజ మాత్రమే.


🌟 సంతోషంతో ఆ మహాలక్ష్మి(ఆడపడుచు), తన తల్లిగారి ఇల్లు అష్టైశ్వర్యాలతో తులతూగాలని 5 పిడికిల్ల బియ్యం అమ్మవాళ్లకు ఇచ్చి, దేవుని ప్రార్ధించి, మహాధ్వారానికి నూనె రాసి, పసుపు కుంకుమ బొట్లు పెట్టి అత్తారింటికి వెళుతుంది. అక్కడ ఆడాళ్లను పేరంటానికి పిలిచి అమ్మగారిచ్చిన సారెను(ఐశ్వర్యాన్ని) ఊరంతా పంచుతుంది.


🌟 ఇది అత్తవారు కూడ చేయవచ్చు.....


🌟 అందుకే ఒడిబియ్యం యొక్క విలువ, గౌరవం, సారాంశం తెలుసుకోవాలి అత్యంత నిష్ఠతో చేయాలి.

కర్మచేయకుండా చిత్తశుద్ది రాదు

 విశేష వ్యాఖ్య:

అంతకు ముందు శ్లోకాలలో ఏంచెప్పారు ?...

కర్మచేతగాని, జన్మచేతగాని, జనబాహుళ్యప్రచారంచేత గాని మనకు అమృతత్త్నం రాదు అని. కేవలం త్యాగభావన

చేతమాత్రమే అమృతత్త్వం సాధ్యము. అని ముందు శ్లోకాలలో చెప్పినది ఎలాగ నిరూపిస్తున్నారు...

అందుకని ఎత్తుకోడం ఎలా ఎత్తుకున్నారు? ... కర్మ వలన చిత్తశుద్ది సాధ్యం...!

అంటే కర్మచేయకుండా చిత్తశుద్ది రాదు ఎప్పటికీ !

కాబట్టి ప్రతిఒక్కరూ మొదట ఏంమార్గంలో ప్రవేశించాలిట? ..... కర్మ మార్గములో.

కర్మ మార్గం అంటే ఏమిటి ? .....

అన్నీ కర్మే. ... కనురెప్పలు తీసి వేయడం కూడా కర్మయే! గాలి పీల్చి వదిలిపెట్టడం కూడా కర్మయే!!

రోజువారీ మనం మన దైనందిక కార్యక్రమాలలో చేసే సమస్తమూ కర్మలే. .. మేలుకోవడం కర్మ, కలగనడం కర్మ,

నిద్రపోవడం కర్మ, జననమరణాలు, వాటిమధ్యలో జరిగే వన్నీ కూడా కర్మలే. ఇవన్నీ ఒక కారణంనుండే

ఉదృవిస్తున్నాయి.

మనం ప్రతీ సంఘటనకు కారణం వేరువేరుగా ఉందని అనుకుంటున్నాం. రోజువారీ జీవితంలో 'దీనికి కారణం వేరే

ఉందిలెండి' అనుకుంటూ ఉంటాం.. ప్రతీదానికి కారణం వేరే ఉందని మన అభిప్రాయం. ...

కానీ వారేంచెపుతున్నారు? నాయనా ప్రతీ దానికి కారణములు వేరువేరు లేవు. ... జననం నుండి మరణం వరకు ఇది

అంతా ఒకటే ఘటన...

జీవితమనే ఘటన! ...... ఒక సంఘటనే ఇది.

కానీ మనం ఎలా అనుకొంటున్నాం? ప్రతీ సంఘటననూ వేరువేరుగా చూస్తున్నాం.



కాబట్టి జీవభావము అంటే ఏమిటంటే ఈ భేద బుద్దియే జీవభావము.


ఏకత్వభావనే ఆత్మభావము.


కాబట్టి మనం కర్మ చేసేటప్పుడు ఎలా చేయాలి? ఆ కర్మని చిత్తశుద్ది సాధించడంకోసం ఎలా చేశాం?


కర్మ ద్వారా ఆత్మోపలబ్ది జరుగుతుందా? ... అన్న విషయాన్ని ఈ శ్లోకంలో చర్చిస్తున్నాం.


ఈ జన్మలో నువ్వు ఆత్మ స్వరూపాన్ని, బ్రహ్మ స్వరూపాన్ని తెలుసుకోవాలని గానీ , ఈశ్వర సాక్షాత్కారాన్ని పొందాలనే

జిజ్ఞాస గాని - ఇవి ఏమైనా కలిగినయ్‌ అంటే కారణం ఏమిటి అని ప్రశ్న వేశారు?


అందరికి కలగడం లేదుగా.... భూమండలం మీద 750 కోట్లమంది మానవులుంటే ఈ ఆసక్తి అందరికి కలగడంలేదు.

ఎందువలన అంటే గత జన్మనుండి నువ్వు తెచ్చుకున్న జ్ఞానవాసన అంటూ ఏదుందో, సాధనా పరమైన వాసన అంటూ

ఏదుందో, ఆ పుణ్య వాసనా బలం చేత నీకు ఈ జన్మలో ఒక ఆసక్తి, ఒక జిజ్ఞాస కలిగింది.


అంటే దైవసాక్షాత్కారం, ఆత్మసాక్షాత్కారం, ఈశ్వరసాక్షాత్కారం - ఇవన్నీ సాక్షాత్కారాలే... వీటియందు ఆసక్తి, జిజ్ఞాస

కలిగాయి.


మిగిలిన వారందరూ ఏం ఆసక్తి కలిగియున్నారటా - ప్రపంచభావన కలిగి ఉన్నారట.!


అంటే ధనధాన్యవస్తు సమృద్ది కలిగియుంటే చాలు అనే లక్షణం కలిగివున్నారు. అంచేత రోజూ ఉదయం లేచినప్పటినుంచి

రాత్రి నిద్రపోయేవరకు, రాత్రి నిద్రలో కూడా ఏం కలుగుతున్నాయ్‌?


-... ఆ ప్రపంచ భావనలే కలుగుతున్నాయి. ... ప్రపంచానికి భిన్నమైన భావనలు కలగడంలేదు.


ఎందుకనిట ? --- సదా ఆ ప్రపంచంతో కలిసి రమిస్తున్నాం కనుక. .. విడిగా లేవు. ఆ ప్రపంచంలో ఉన్న వస్తువులు,

ధనధాన్యాలు, .. ఏ సమృద్ది కలిగితే సుఖసంతోషాలు నీకు కలుగుతాయనే ఆసక్తి బలంగా ఉందో అదే ఆసక్తి నీ

కలలోకూడా పనిచేసి నీ మానసిక ప్రపంచాన్ని తయారుచేస్తుంది.!


ఇంకేం చేస్తోంది? ...


ఆ వస్తుఉపలబ్ది నీకు స్వయంగా కలగకుండానే నువ్వు అనుభవించినట్టు నీకు సుఖప్రాప్తిని కలుగచేస్తోంది!


తద్వారా నువ్వు మేలుకోగానే రోజూ ఏం చేస్తున్నావట ?! ....


ఆ కలలో అనుభవించిన వస్తువును ఇలలో అనుభవించాలని చూస్తున్నా వట.


జననం నుండి మరణం దాక మనం చేస్తున్నది ఒకటే పనిట ? ... ఏమిటది? ...


కలలో కలగనడం,... ఆ కలగన్న వాటిని అక్కడే యధాతధంగా అనుభవించడం, ...


కలలో ఆకలేసిందండీ... , అప్పుడు లడ్డూ తింటే బాగుండు అనిపించిందట. !...


ఆకలి వేయడానికి, లడ్డూ తినడానికి సంబంధం ఏమిటి?


లడ్డూ తింటే ఆకలి తీరుతుందన్న ఒక నిర్ణయం ఉందా పోనీ? .. కానీ నీకనిపించింది అంతే !


కలలో ఆకలి వెయ్యడం ఎంత వాస్తవమో, లడ్డూ తింటే ఆకలి తీరుతుందన్నది కూడా అంతే వాస్తవం! ...



ఆ ఆసక్తి ఇప్పుడు కలలో లడ్డూని సృజించింది. లడ్డూ తింటే ఆకలి తీరుతుందని స్పురించింది.. తినేశావ్‌ ! .....

లడ్డూ తిన్న సుఖం కూడా వచ్చేసింది! తృప్తి కూడా కలిగింది. ఆకలి తీరింది !


మేలుకుని చూస్తే ..... లడ్డూ లేదు.


కానీ నీ స్పురణ ఎక్కడ ఉండిపోయింది? లడ్డూ మీద ! ... ఇలలో లడ్డూ తిన్న అనుభవం పూర్తికాలేదు కాబట్టి. ... ఆ

అనుభూతి సంతృప్తికరంగా లేదు. ...


పూర్ణమైనట్టి ఆసక్తి సంతృప్తి చెందలేదు. .. అప్పుడేం చేశాడట? .... ఇలలో లడ్డూ కోసం ప్రయత్నం చేశాడు.

కలలో లడ్డూ ఎవరు ?-... నువ్వే.


తిన్నదెవరూ ?.... నువ్వే.


ఆకలి ఎవరూ ?... నువ్వే .


సంతృప్తి పొందినదెవరూ ? ... - అదికూడా నువ్వే.


కానీ ఇలలో అలా ఉండదే!


నేనూ, లడ్డూ ఒకటే ... అని లడ్డూ షాపు వాడిదగ్గరకెళ్ళి అన్నావనుకో ,


ఏం అంటాడు వాడు? ... నువ్వు, లడ్డూ ఒకటే అయితే ఇక్కడిదాకా రావడం ఎందుకూ, అంటాడా లేదా ? ....

ఇంకేవంటాడు ?... - ఆ! వెర్రోచ్చింది అంటాడు!


అంచేత ఇలలో ఎలావున్నాం ? ... అన్నీ భిన్నంగా, వేరువేరుగా ఉన్నాం. ... కానీ కలలో ప్రపంచాన్ని ఎవరు

సృష్టించారు? - నువ్వే! .. కాబట్టి ఆ ప్రపంచంలో వస్తువులు కూడా నువ్వే!!


ఇలలో సూది బెజ్జం లోంచి ఏనుగును పంపించాలి.. వెడుతుందా ? ... వెళ్ళదు...


కానీ కలలో.... ?


మనకి ఎలా కావాలంటే ఆలా !!


అంటే ఇలలో సాధ్యంకాని వన్నీ కలలో సాధ్యమౌతాయి... ఎందుకంటే ఆది సూక్ష్మం! .. స్టూలం కాదుగా.

నువ్వేమనుకుంటున్నా వ్‌ ? సూక్ష్మంలో జరిగినవన్నీ స్టూలం లో జరగాలంటున్నావ్‌...


అదెప్పటికీ సాధ్యం కాదుగా ... !


ఏనుగుపట్టేటంత బెజ్జం స్టూలంలో ఉండదు... కానీ సూక్ష్మంలో సాధ్యమే.


ఈరకంగా ఇలలో సాధ్యం కానివన్నీ కలలో సాధ్యమే.


ఈవాళ రాత్రి కలలో భాగ్యలక్ష్మి లాటరిలో 100కోట్ల రూపాయలు తగిలినట్టు ఆసక్తికలిగి ఆమేరకు కల వచ్చింది.

సాధ్యమేగా కలలో...



కలలో లాటరీ వచ్చిందని ఇలలో ఏమి చేసాడు? ... జీవితమంతా లాటరీ టిక్కెట్లు కొంటూనే ఉన్నాడు. ఎప్పుడుచూసినా

1....


మరి ఏదిబలంగా పనిచేసినట్టు? ... ఆ ఆసక్తియే కలయ్యింది.


ఆసక్తి అంటే ? .... రాగద్వేషాలు రెండూ బలంగా ఉన్నాయి.


ఎవరితోనయినా శతృత్వభావన బలంగా ఉందనుకో అప్పుడు వాళ్ళుకూడా కలలోకి వస్తారు.


వచ్చి ఏంచేస్తారు ? .... ఇలలో చాలలేదు పోట్లాట. కలలోకూడా ఫైటింగే !!


పోనీ కలలోనైనా వాడితో సఖ్యంగా ఉండొచ్చుగా ?!... అబ్బే. ... ఆ భావనలో స్మృతిజ్ఞానం స్థిరపడిపోయిందిగా, ఇంకా

దాంట్లోనే తిరుగుతూ ఉంటుంది. దాంట్లోంచి బయటకు రాదన్నమాట.


రావాలంటే ఇలలో ప్రయత్నించాలే కానీ కలలో ప్రయత్నిస్తాననడం వట్టిదే...


అట్లాగే కర్మవలన వచ్చేటటువంటి సుఖదుఃఖాలనే ఫలితాలవంటి చట్రం ఏదైతే ఉన్నదో ఆ కర్మ చట్రంలో నీ

జననమరణాలు వస్తూ, పోతూ ఉంటాయి.


ఒకవేళ ఇదే కర్మ దైవం కోసం చేయబడింది, ఫలాసక్తిలేకుండా చేయబడింది. ...


అప్పుడేమయింది? ... నిష్కామకర్మ అయ్యింది.


మన జీవితంలో నిష్కామకర్మ అంటూ ఏదైనా ఒకటుందా ? ...


ఏమీ ఆశించకుండా చేయడమే నిష్కామకర్మ అయినట్లయితే, అక్కడేం చేయమన్నాడు”...


ఈశ్వరార్పణ బుద్దితో చేసినప్పుడు మాత్రమే అది నిష్కామకర్మ అయ్యింది.


అంటే?...


భార్యకి చెయ్యలా ... ఈశ్వరుడికి చేశావ్‌!


భర్తకి చెయ్యలా ... ఈశ్వరుడికి చేశావ్‌!


పిల్లలకి చెయ్యలా ... ఈశ్వరుడికి చేశావ్‌!


తల్లితండ్రులకు చెయ్యలా ... ఈశ్వరుడికి చేశావ్‌!


అంటే వాళ్ళ స్టానంలో ఎవరిని పెట్టాలట ? ... ఈశ్వరుడిని.


అప్పుడది నిష్కామ కర్మ అయ్యింది.


కానీ నాకు ఈశ్వరుడు అదిస్తాడు, ఇదిస్తాడు ... అంటే, మళ్లీ కదా మామూలే.


నేను ఈశ్వరుడిని ఏమీ కోరను అంటేనే నిష్కామకర్మ.


కానీ ఈశ్వరుడిని దల్లగా దూడమని కోరవచ్చా? ... (ఆడియన్స్‌ ప్రశ్న).


ఏమండీ ... ఈశ్వరుడిని చల్లగా చూడు, వేడిగాచూడు ... ఆయనకి వేరే పనేమీ లేదా ?


మనం ఆలోచించాలి కదా...



ఇలా అయితే మన కో రికలన్నీ నేను వేరే, ఈశ్వరుడు వేరే అనే భావాన్ని బలపరిచే విధంగానే ఉన్నాయి.

'ఈశ్వరుడిచ్చేవాడు, నేను పుచ్చుకునేవాడిని' అన్నట్టుగా.


అసలు ఈశ్వరుడు ఏమిస్తాడు?.....


జ్ఞానం తప్ప ఇంక ఏమీ ఇవ్వడు!


గ్రా


నిరూపణ ఎలా ? ... అదేమిటండీ .. ఇన్నాళ్లు మేము ఆయన్ని ఈ ప్రపంచంలో ఉన్నవన్నీ గుర్తాలు, ఏనుగులు,

చీమలు, ఆ10 అడుగుతూనే ఉన్నాంకదా. చ అడిగినివన్నీ ఇస్తున్నాడు కదా, అడగనిఎి కూడా ఇస్తున్నాడు.


మనం ఏమనుకుంటున్నాం? ... ఈశ్వరుడే ఇస్తున్నాడని అనుకుంటున్నాం...


నిన్ను ఈశ్వరుడికి అనుకూలంగా ఉండవయ్యా అంటే, నీ మనసుకి అనుకూలంగా ఈశ్వరుడిని ఉంచుకోవడానికి

ప్రయత్నిస్తున్నాం...


ఈశ్వరానుగ్రహం ఏది లభిస్తే అది స్వీకరిస్తా అనడం లేదు, ఏమంటున్నాం? నాకు కావలసినది ఈశ్వరుడివ్వాలని

అంటున్నాం. చ


ఇప్పుడు నీ చెయ్యి పైచేయి అయినట్టా లేక ఈశ్వరుడి చేయి పైన అయినట్టా?


ఇది ఎప్పడికైనా సాధ్యమా ఫం...


ఈశ్వరుడు జగన్నియామకుడు, సృష్టి కర్త అని ఒప్పుకొంటున్నావా ? ... మరి ఆయనను నీవు ఎలా డిమాండ్‌

చేయగలుగుతావ్‌? ....


అయన అధిపత్యానికి లొంగి ఉన్నవాళ్ళమే కానీ ఆయనను ఒత్తిడి చేయగల సమర్ధత మానవులకు లేదు.


కానీ భ్రాంతి చేత, ... ఏంభ్రాంతి చేత ? ,.... కర్మభ్రాంతి చేత - నేను అడగందే ఈశ్వరుడెలా పెడతాడు? ... అడగందే

అమ్మ యినా పెళ్టదుకదా - అనే లౌకికమైన స్టాయికి ఈశ్వరుడిని తగ్గించాం...!


కానీ నువ్వు తగ్గించినంత మాత్రాన ఈశ్వరుడి స్టాయి తగ్గిపోదుకదా... !


అయన వరదానం ఏమిటి? ..... జ్ఞానం ఇవ్వడం మాత్రమే!


ఆ ఒక్క జ్ఞానం ఇస్తే నువ్వే అన్నీ సమర్టించుకో గలుగుతావ్‌. ... ఆ ఒక్క జ్ఞానం తీసేస్తే ఏమవుతుంది?... మిగిలిన

84లక్షల జీవరాశులలో సమానం అయిపోయారగా !


పోల్చిచూసుకోండి? ఒక చీమ, ఒక దోమ,సూక్ష్మ జీవులు .... వీటితో పోలిస్తే నీ జీవితం ఎంత ఉత్తమమైనది ? ఇన్ని

హీనా జంతువులతో పోలిస్తే ఏంటో ఉన్నతమైన జీవనం సాగిస్తున్నావ్‌. ... కానీ నీ పోలికంతా ఎవరితో ఉంది ?


ఒక టాటా అయితే చాలా ? లేకబిర్లా?.... ఇద్దరూ చాలరు! అంతూ , దరీ లేదు ఆశకు.... అనంతం అంటే అర్ధం తెలీదు

కానీ అనంతమైన డబ్బు కావాలి !


కాబట్టి పోలిక ద్వారా నియమించలేని నీ కర్మ సంజాతమేదైతే ఉన్నదో, అది ఈశ్వరుడిని ఎలా నియమిస్తుంది ? ....



ఈశ్వరుడు కర్మకు అధిస్టానం. ... అయన నీకు ఏమి సహాయం చేయగలుగుతాడంటే, ఆ కర్మని అధిగమించడానికి

కావాల్సిన జ్ఞానాన్ని మాత్రమే ఇవ్వగలుగుతాడు...


ఒక జన్మనుండి మరొక జన్మకు నీవు మారినపుడల్లా నీలో జ్ఞాన వృద్ది జరుగుతోంది.. కాబట్టి అవసాన దశలో నీకు ఏది

ఉపయోగపడుతోంది ? ... - నీవు చివర శ్వాసలలో ఉన్నప్పుడు నువ్వు ఏవైతే కష్టపడి పోగుచేసుకున్నావో అవి నీకు

అక్కరకొస్తున్నాయా  ... మీ ఇంట్లో ఉన్న కంచాలు, మంచాలు చాల ఉన్నాయిగా - ఇవి ఏమైనా పనికొ స్తున్నాయా

మరణకాలంలో ? ...


చనిపోయేకాలంలో నీలో ఉన్న జ్ఞానము, నీలో ఉన్న అజ్ఞానము - ఈ రెండే లెక్క కట్టబడతాయి. ... ఈ రెంటిని ఆధారం

చేసుకొని,... ఈ రెంటిని బేరీజు వేయబడి తద్వారా నువ్వు ఒక ఉపాధి నుండి వేరొక ఉపాధికి మారుతున్నావ్‌....


ఈ జన్మకి వస్తూనే ఒక మూట తెచ్చుకున్నాం... , తెచ్చినవాటిని అనుభవించేస్తే, ఒకపని అయిపోతుంది... కానీ మనం

ఏంచేస్తున్నాం ?...


ఎంత అనుభవించినా, ఇంకా కావాలి అనే కోరిక మిగిలిపోతోంది!


... మీ ఇంటికివెళ్ళి, ఒక డైరీ పెట్టుకొని “ఇంకా కావాలి' అని తోచే వాటి లిస్ట్‌ రాయండి. ... వాటన్నిటి ఎదురుగా ఒక

ప్రశ్న వేయండి... “ఇవన్నీ మరణకాలంలో ఏమైనా ఉపయోగపడతాయా ? ' అని.


ఈసారి వచ్చినప్పుడు చెప్పండి, ఎంత జాబితా వచ్చిందో! పం


మీకు స్పష్టత రావాలి.


ఎప్పటికైనా ఈ “ఇంకా కావాలి అని తోచే వాటి లిస్ట్‌ సున్నాకి రావాలి.... !


అప్పుడు మీరు ఆత్మనిష్టులయ్యే అవకాశం ఉంది.


ఈ “ఇంకా కావాలి” అని తోచే వాటి లిస్ట్‌ ఎప్పటికైనా మిమ్మల్ని మళ్ళీ కర్మచక్రంలోకి, మళ్ళీ జననమరణచక్రంలోకి

తీసుకువస్తాయే గానీ, మీకు ఎప్పటికి కూడా ఆత్మనిష్టులయ్యే అవకాశం అందించవు.


కాబట్టి మొదటి లిస్ట్‌ ఏంరాసుకోవాలి, ఎవరికి వాళ్ళు? ...... “ఇంకా కావాలి” అని తోచే వాటి లిస్ట్‌!


మా జీవితం మొదట్లో మాకు ఇలాగే చెప్పారు - 'నాయనా , నీకం కావాలి” అని...


మాకేం అక్కరలేదు అన్నదశకు వచ్చిన తరువాతే మాకు జ్ఞానం గూర్చి చెప్పడం ప్రారంభించారు... అప్పడివరకు జ్ఞానం

గురించి చెప్పలేదు. మం


“ఇంకా కావాలి' అని తోచే వాటి లిస్ట్‌ పెట్టుకొని ఈ వివేకచూడామణి పూర్తయ్యేలోపుగా పరిష్కారం అయిపోవాలి. ఆలా

అయితేనే నీవు ఆత్మనిష్టుడవు కాగలవు...


ప్రపంచం మీద నీకు ఏమాత్రం ఆసక్తి మిగిలిఉన్నప్పడికి నీకు మరల కర్మచక్రం లో పడకతప్పదు.


“ఇంకా కావాలి” అనే జాబితా పూర్తిగా పోవడం ద్వారా నీకు చిత్త శుద్ది లభిస్తుంది.


ఇంకొక లిస్ట్‌ రాసుకోవాలి - “ఇది లేకుండా నేను ఉండలేను' ... అనే లిస్టు. ...


ఎన్నున్నా ఫరవాలేదు... ఒక పుస్తకం రాయి అవసరమైతే... !



ఎందుకంటే నీకు ఒక స్పష్టత వస్తుంది.


ఎప్పుడు పడితే అప్పుడు కాకుండా నీమీద నీకు ఒక అధ్యయనం చేసే అవకాశం ఇది... ఏంకావాలో తెలుసు, ...

ఏదీలేక ఉండలేవో కూడా తెలుసు...


ఈ రెండు జాబితాలలో ఈశ్వరుడు ఉండడు ! .... ఉండే అవకాశం ఉందా !?


ఇప్పుడు ఈశ్వరుడిని ఎక్కడ చూడాలి? ... మొదట నీలోనేగా! ముందు నీలోపల ఈశ్వరదర్శనం జరగాలి...


కాబట్టి ఈ రెండు జాబితాలను ప్రాధాన్యతాక్రమంలో నువ్వు స్కీనింగ్‌ చేయాలి... విచారణ చేయాలి.


అందులోఅన్నీ అవసరమా 1... గ


మా ఇంట్లో బెదలు పట్టకుండా ఉంటేబావుణ్ను ... బెదలు పడితే నేను ఉండలేను. ' - ఏంచేయాలో రాసుకో ...


నువ్వు గమనించేదేమిటంటే చాలావరకు ఈ ప్రపంచం, ప్రపంచంతోనే సమాధాన పడిపోతోంది ...


ఈశ్వరుడివరకు అవసరం లేదు.


కానీ ఈశ్వరుడు లభిస్తేనే మాత్రమే సమాధానపడే అంశాలు కొన్ని ఉంటాయి...


అలాంటి అంశాలు మిగిలినప్పుడు మాత్రమే నీకు ఈ తత్త్వజ్ఞానం అనేది ఉపయోగపడుతుంది.


కర్మాచరణ వల్ల చిత్తశుద్ది ఎవరికైతే కలిగిందో, ఆ చిత్తశుద్ది వలన ఈశ్వర సాక్షాత్కారాన్ని, ఆత్మ సాక్షాత్కారాన్ని, బ్రహ్మ

సాక్షాత్కారాన్ని పొందాలనేటటువంటి జిజ్ఞాస తీవ్రంగా ఉన్నటువంటి వాడెవడైతే ఉన్నాడో , వాడికి మాత్రమే ఈ

వస్తూపలచ్చి - బ్రహ్మవస్తూపలబ్ది, అనేది సాధ్యమవుతుంది.


మిగిలినవన్ని ప్రపంచంతో సరిపెట్టేయవచ్చు... ఈ ప్రపంచంలో ఉన్నటువంటి వస్తువులద్వారా ఆ కోరికలు తీరిపోతాయి.

కానీ ఈ ముక్తి, మోక్షం అనేటటువంటివి మాత్రం ఆత్మ సాక్షాత్కారం తో మాత్రమే, బ్రహ్మ సాక్షాత్కార జ్ఞానం తో మాత్రమే

సాధ్యమౌతాయి.


ఈ రెండూతో తప్ప మిగిలినవన్నీ కర్మ ఆసక్తి ద్వారా, కర్మ విచారణ ద్వారా, కర్మ ఆచరణ ద్వారా సాధించడం సాధ్యం

కాదు!


నిరంతర బ్రహ్మ విచారముబేతనే ఆత్మ సాక్షాత్కారం సిట్జించును - ఇప్పుడు నిరంతరాయంగా ప్రపంచాన్ని గురించి

విచారణ చేస్తున్నామా ౪ లేక నిరంతరాయంగా బ్రహ్మమును గురించి విచారణ చేస్తున్నామా? ...


మనం చేసే విచారం అంతా ప్రపంచాన్ని గురించే - కాబట్టి ప్రపంచాన్నే పొందుతున్నాం. -. అందువల్ల ఈ ప్రపంచం స్థానంలో

ముందు ఈశ్వరుణ్ణి పెట్టాలి.


“నీ” స్థానంలో ఈశ్వరుణ్ణి పెట్టాలి. ... పెట్టగా, పెట్టగా నీలో భక్తి బాగా బలపడి, బలమైనటువంటి భక్తిభావన స్థిరపడి, ఆ

భక్తిభావన నుంచి నువ్వు జ్ఞానభావనకు ఎదుగుతావ్‌. ...


ఆలా ఎదిగినప్పుడే నీకు ఆత్మ సాక్షాత్కారం కలుగుతుంది.


ప్రపంచ భావన నీకు తోచినంతవరకు నీకు ఆత్మ సాక్షాత్కార జ్ఞానం కలుగదు.


 *ఓం శాంతిః శాంతిః శాంతిః*


*సేకరణ:*  శ్రీ కె.వి. రమణమూర్తి గారి వాట్సాప్ పోస్ట్.

ధర్మాకృతి : ఇంద్రసరస్వతీ, భారతీ మహాస్వాములు - 4

 ధర్మాకృతి : ఇంద్రసరస్వతీ, భారతీ మహాస్వాములు - 4


సదాశివేంద్రులకు పిచ్చి ఎక్కిందని మిగతా శిష్యులు వారి గురువులు పరమ దేవేంద్రుల వద్దకు పోయి చెప్పారట. గురువుతో “అయ్యో! అలాంటి పిచ్చి నాకు పట్టలేదే!” అని వెతనొందారట. శివాభినవ సచ్చిదానంద నృసింహ భారతీ స్వామివారి వంటి మహాత్రికాలజ్ఞాన సంపన్నులకు శుశ్రూష చేసిన మహా పండితులయిన శ్రీకంఠశాస్త్రిగారు స్వామివారి పరిస్థితిని అర్థం చేసుకోకపోవడం ఆశ్చర్యంగా అనిపిస్తోందా? నోట్లో సమస్త బ్రహ్మాండాన్ని చూపిన కృష్ణుని, ఎంత తాడు తెచ్చినా పొట్ట చుట్టూ అయినా తిరగక పోయినా చెమటోడ్చి కష్టపడి రోటికి కట్టి వెయ్యడం ఆశ్చర్యంగా లేదూ!


వారి సంగతి అలా ఉంచండి. ఒక మహాపండితులు. రెండు పీఠాలకు శిష్యులైన వారు కంచిస్వామి వారి వద్దకు వచ్చి “ఆయన(శృంగేరీ స్వామి) పిచ్చివారయిపోయారని” చెప్పారట. అది విన్న స్వామివారు ‘శివశివ’ అంటూ మాన్పడిపోయి, పెద్దగా నిట్టూర్చి కోపంతో ఊగిపోతూ (అంత కోపం ఎప్పుడూ చూడలేదంటారు. స్వామివారికి బహుకాలం సేవ చేసిన మఠమేనేజర్ విశ్వనాథ అయ్యర్) “మీకు పిచ్చికి మంచికి తేడా తెలుసా? తమరు సర్వజ్ఞులో? అలా మాట్లాడడానికి ఎంత ధైర్యం” అని పెద్దగా కేకలు పెట్టి “నీ ఈ అపరాధానికి నిష్కృతి ఈ ప్రపంచంలో ఎవరూ ప్రసాదించలేరు. పోయి చంద్రమౌళీశ్వరుని పాదాలు ఆశ్రయించు” అంటూ ముగించారట.


1935లో కంచిస్వామి కలకత్తాలో నవరాత్రి పూజలు చేస్తున్నారు. మంత్రేశ్వర శర్మగారు అనే శృంగేరీ స్వామివారి పరమ భక్తులొకాయన కమిటీలో ఉండి నిర్వాహక వర్గానికి ఎంతో అండదండలుగా ఉన్నారు. నాల్గవరోజు వరకూ ముఖ్య భూమిక నిర్వహించారు. నాల్గవ రోజు అనిపించింది. ఎంతయినా మా స్వామివారు చేసే పాటి అవుతుందా ఈ పూజ అని ఇక ఆగలేకపోయారు. సరాసరి శృంగేరీ చేరారు. శృంగేరీ స్వామి తమ మృదు ప్రవృత్తికి భిన్నంగా ఎంతో కఠినంగా మా ఇద్దరికీ వ్యత్యాసం ఉందని, అక్కడ పూజ వదిలి ఇక్కడికి పరిగెత్తుకు వచ్చావా? ఇది చాలా తప్పు. ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండవద్దు. శీఘ్రం తిరిగిపో అని త్రిప్పి పంపెవేశారట. రైళ్ళు కూడా సరిగా లేని ఆ కాలంలో విజయదశమి నాటికల్లా కలకత్తా చేరి కంచిస్వామికి విషయం విన్నవించి భేద భావం సమూలంగా నాశనం అయిందని మనవి చేశారట. వారు ఎంతో ఆదరంగా ప్రసాదాలననుగ్రహించారు. చివరగా “శంకర అండ్ షణ్మత’ అనే పుస్తకంలో అగ్నిహోత్రం తాతాచార్యుల వారు వ్రాసిన వ్యాసం నుండి ఒక ఉదంతం వివరించి ముగిస్తారు.


తాతాచార్యుల వారు ఒక నిపుణుల బృందంతో కంచిస్వామివారి పనుపున రాజ్యాంగ నిర్మాణ సంబంధమైన కార్యంలో వివిధ హిందూ మతాచార్యులను, పీఠాధిపతులనూ కలుసుకొంటూ శృంగేరీ చేరారు. అంతవరకూ బాహ్యస్మృతిలో లేని భారతీ స్వామివారు ఆ రోజునే దైనందిన కార్యక్రమాలలోనికి వచ్చారు. వీరిని చూసి ఎంతో ఆప్యాయంగా ‘కామకోటి ఆచార్యులు. ఇప్పుడు ఎక్కడ చాతుర్మాస్యం చేస్తున్నారు” అంటూ ప్రశ్నించారు. కంచిస్వామి వారి గురించి ఎంతో ప్రశంసాపూర్వకంగా మాట్లాడారు.


తరువాత వీరు వచ్చిన కార్యం తెలుసుకొని ఎంతో ప్రసన్న చిత్తులయ్యారు. “దేశ పరిస్థితులను సుసూక్ష్మంగా గుర్తించి ప్రస్తుత పరిస్థితిలో మన కర్వవ్యమేమిటో గుర్తించగల్గిన వారు కంచిస్వామి వారొక్కరే. ఆ విషయంలో మేమందరమూ వారి కృషి పైనే ఆధారపడతాము. ఇందుకు వారికెంతో కృతజ్ఞులము. వర్తమాన కాలంలో కాన దేశంలోని హిందువులు ఈ మాత్రమైన స్వధర్మావలంబకులై ఉన్నారంటే దానికి కంచి స్వామివారే ప్రేరకులు” అని చెప్పి ఈ ప్రయత్నంలో సహాయకులుగా శ్రీసంగమేశ్వర శాస్త్రి అనే ఆయనను వీరి ప్రతినిధి వర్గంతో పాటు పంపారట. 


ఈ విషయం విన్న కంచిస్వామి వారు ఎంతో గౌరవంతో “వారెల్లప్పుడూ ఆత్మనిష్ఠలో ఉంటూ బహిః ప్రపంచంతో సంబంధం లేకుండా ఉన్నప్పటికీ, ఆ జ్ఞాని జ్ఞాన ప్రకాశం వల్లనే ఈ దేశం శ్రేయస్సును పొందుతోంది. ఇందుకు యావద్భారతం వారికే కృతజ్ఞతతో ఉండాలి” అన్నారట. 


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

కడుపులో బిడ్డ ఆలోచనలు

 


కడుపులో బిడ్డ ఆలోచనలు


• ఏడవ నెలకి జ్ఞానోదయమై కడుపులో అటు ఇటూ కదులుతూ గత జన్మలో చేసిన పాప పుణ్యాలు తలుచుకుంటాడు.


అర్జించిన సంపదలను అనుభవించిన వారే తనను నిర్లక్ష్యం చేసిన క్షణాలు గుర్తుచేసుకుని ఏడుస్తాడు.


దుర్గంధ భూయిష్టమైన ఈ గర్భకూపం నుంచి త్వరగా బయటకు త్రోసి వేయి తండ్రీ... మరో జన్మ ఎత్తి నీ పాదసేవ చేస్తాను, త్వరగా మోక్షప్రాప్తిని కలిగించు అని ప్రార్థిస్తాడు.


• ఇలా ఏడుస్తూ వాయుదేవుని సహాయంతో ఈ లోకంలో జన్మించి వెంటనే ముందున్న జ్ఞానం నశించి అజ్ఞానం ఆవరించి ఏడవడం మొదలు పెడతాడు.


• ఆ తర్వాత తన అధీనంలోంచి పరాధీనంలోకి వెళ్లి ఇష్టాయిష్టాలు, శరీర బాధలు చెప్ప లేక బాల్యావస్థలు పడుతూ యవ్వనంలోకి అడుగుపెడతాడు


• యవ్వనంలో ఇంద్రియాలకు వశుడై ప్రవర్తించి పాపపుణ్యాలు మూటగట్టుకుని తిరిగి వృద్ధాప్యానికి చేరుకుని మరణిస్తాడు.


• తిరిగి కర్మానుసారంగా గర్భవాసం చేసి మరో జన్మెత్తుతాడు.


@HINDU_DEVOTIONAL


• గరుడ పురాణం •