6, జులై 2020, సోమవారం

పాపం-పుణ్యం-దేముడు

ప్రతి జీవి ఎవరి కర్మ వారే అనుభవించాలి.  కర్మ ఫలితాన్ని మంచిదైన, చెడుదైన దానిని మార్పు  చేసే శక్తి ఏ మానవుడికి లేదు. దీనిని ఒక చిన్న ఉదాహరణతో వివరిస్తాను. 
మీరు ఒక బ్యాంకులో అకౌంటు కలిగి వున్నారు అనుకోండి ఆదే  బ్యాంకులో మీరు అప్పు తీసుకున్నారనుకోండి. అప్పుడు మీకు బ్యాంకులో రెండు అకౌంట్లు వున్నాయి  ఒకటి డిపాజిట్ అకౌంట్ రెండు లోన్ అకౌంట్. ఇప్పుడు మీరు లోనే అకౌంటులో తక్కువ డిపాజిట్ అకౌంట్లో ఎక్కువ డబ్బులు వున్నాయనుకోండి అప్పుడు మీరు ఇచ్చిన చెక్కు బ్యాంకు వారు తీసుకొని మీకు డబ్బులు ఇస్తారు. అదే మీ లోనే అకౌంట్లో ఎక్కువ డిపాజిట్ అకౌంట్లో తక్కువ డబ్బులు ఉంటే మీ చెక్ బౌన్స్ చేసి ముంది మీ లోన్ తీర్చమని మీకు బ్యాంకు మేనేజర్ సూచిస్తాడు.  కట్టక పొతే మీ ఆస్తిని అమ్మి డబ్బు వసులు చేస్తాడు. 
ఇప్పుడు మన కర్మ గూర్చి మాట్లాడుదాము. మీ డిపాసిట్ అకౌంట్లో వున్న డబ్బులు మీరు చేసుకున్న పుణ్యం అనుకోండి. మీ లోన్ అకౌంట్లో డబ్బులు మీరు చేసుకున్న పాపం అనుకోండి. బ్యాంకు మేనేజర్ భగవంతుడు అనుకోండి. ఇప్పుడు మీకు మీ కర్మ ఫలితం ఎలా అనుభవిస్తారో తెలుస్తుంది. పుణ్యం చేసిన వారు దేముడిని కోరుకునే కోరిక వెంటనే నెరవేరుతుంది. అంటే వారి చెక్కు హానర్ అవుతుంది అని అర్ధం. మరి మీ అకౌంట్లో పాపం ఎక్కువుంటే మీ ప్రార్ధన నెరవేరదు ఎందుకంటె మీ పాపం ఎక్కువ వున్నది. ముందు అది కట్టాలి అని మేనేజర్ (దేముడు) నిన్ను పాప ఫలాన్ని అనుభవించేటట్లు చేస్తాడు.  అయితే పాపఫలితాని అనుభవించకుండా తప్పించుకునే మార్గం వుంది అదే ఇప్పుడు మనం పుణ్య కార్యాలు చేయటం. పుణ్య కార్యాలు ఎక్కువ చేస్తే మీ డిపాజిట్ అకౌంట్లో జమ పెరుగుతుంది. అప్పుడు మీ చెక్ ఆనర్ అవుతుంది అదే మీరు దేముడిని కోరుకున్న కోరిక నెరవేరుతుంది.   దేముడు కేవలం బ్యాంకు మేనేజరులాంటి వాడు అయన ఎవరిని ప్రేమించడు, ద్వేషించాడు. అందుకే దేముడు త్రిగుణాతీతుడు. అందరు వారు వారు చేసుకున్న కర్మను మాత్రమే అనుభవించాలి. 

చంద్రశేఖరాష్టకం

రత్నసాను శరాసనం
రజతాద్రి శృంగ నికేతనం
శింజినీకృత పన్నగేశ్వర
మచ్యుతానల సాయకం
క్షిప్రదగ్ద పురత్రయం
త్రిదశాలయై రభివందితం
చంద్రశేఖర మాశ్రయే
మమ కిం కరిష్యతి వై యమః

మత్తవారణముఖ్య చర్మ
కృతోత్తరీయ మనోహరం
పంకజాసన పద్మలోచన
పూజితాంఘ్రి సరోరుహమ్
దేవసింధు తరంగశీకర
సిక్త శీత జటాధరం
చంద్రశేఖర మాశ్రయే
మమ కిం కరిష్యతి వై యమః

కుండలీకృత కుండలేశ్వర
కుండలం వృషవాహనం
నారదాది మునీశ్వర స్తుత
వైభవం భవ నాశనమ్
అంధకాంతక మాశ్రితామర
పాదపం మదనాంతకం
చంద్రశేఖర మాశ్రయే
మమ కిం కరిష్యతి వై యమః

పంచపాదప పుష్పగంధ
పదాంబుజద్వయ శోభితం
ఫాలలోచన జాతపావక
దగ్ద మన్మథ విగ్రహం
భస్మదిగ్ధ కళేబరం
భవనాశనం భవ మవ్యయం
చంద్రశేఖర మాశ్రయే
మమ కిం కరిష్యతి వై యమః

యక్షరాజ సఖం భగాక్ష
హరం భుజంగ విభూషణం
శైలరాజసుతా పరిష్కృత
చారుదివ్య కళేబరమ్
క్ష్వేల నీలగళం పరశ్వథ
ధారిణం మృగధారిణమ్
చంద్రశేఖర మాశ్రయే
మమ కిం కరిష్యతి వై యమః

ఔషధం భవరోగిణా
మఖిలాపదా మహహారిణం
దక్షయజ్ఞ వినాశనం
త్రిగుణాత్మకం త్రివిలోచనమ్
భుక్తి ముక్తి ఫలప్రదం
సకలాసంఘ నిభర్హణం
చంద్రశేఖర మాశ్రయే
మమ కిం కరిష్యతి వై యమః

విశ్వసృష్టి విధాయకం
పునరేవ పాలనతత్పరం
సంహరంతమపి ప్రపంచమ
శేషలోక నివాసినమ్
క్రీడయంత మహర్నిశం
గణనాథయూథ సమావృతం
చంద్రశేఖర మాశ్రయే
మమ కిం కరిష్యతి వై యమః

భక్తవత్సల మర్చితం
నిధి మక్షయం హరిదంబరం
సర్వ భూతపతిం పరాత్పర
మప్రమేయ మనుత్తమం
సోమవారిన బోహుతాశన
సోమపాద్య అఖిలాకృతిం
చంద్రశేఖర మాశ్రేయే
మమ కిం కరిష్యతి వై యమః
             
                  - మార్కండేయ మహర్షి

పూజాప్రక్రియ విదులు

పూజాప్రక్రియలో పాటించాల్సిన
విదులు మరియూ నిషిద్ధకర్మలు

ముందుగా స్నానవిధి

మగవారు ప్రతీరోజు తలస్నానం చేయాలి
నదీ స్నానం ఉత్తమం, తటాక(చెరువు) స్నానం మధ్యమం, కూప(బావి)స్నానం అధమం, పాత్రస్నానం అధమాధమం. అయితే నేటి తరంలో నగర జీవనంలో బహుళ అంతస్థుల నివాసాలలో ఇవి సాధ్యం కావు కాబట్టి బోరుబావి నీరు ఏరోజుకారోజు పట్టుకొని చేయటం మంచిది, అలాకూడా వీలుకాకుంటే చేసేది ఏమీలేదు.

ఈ శ్లోకాలు పఠిస్తూ చేస్తే ఉత్తమం 
1.గoగేచ యమునేచైవ గోదావరీ సరస్వతీ,నర్మదా సింధూ కావేరీ జలేస్మిన్ సన్నిదీమ్ కురూ, అనుకుంటూ....
అపవిత్రాహ:పవిత్రోవా సర్వాస్తాoగాతోపీవ యస్మరేత్ పుండరీకాక్షం సభాహభ్యంతరం శుచీహీ...
 అనీ చెప్పుకుంటే రోజూ పుణ్యనదీ స్నానాలు చేసిన ఫలితమే వస్తుందీ అనీ శాస్త్రవచనం

2.ఏకవస్త్రంతో స్నానం దోష కారకం, పాపం కూడాను, ఉపవస్త్రం (తువ్వాలు / పంచ) చుట్టుకొని స్నానం చేసి ఆవస్త్రం పిండి ఒళ్లు తుడుచుకొని మళ్ళీ నీళ్లలో జాడించి పిండి చుట్టుకొని వచ్చి మడివస్త్రం కట్టుకోవాలి ఈ పంచని నడుముకు చుట్టుకోవాలి పూజలో మగవారు ఏకవస్త్రంతో పూజ చేయరాదు, ఎడమ భుజం మీదుగా ఉత్తరీయం ఉండి తీరాలి, చినిగిన వస్త్రం అశుభ్రంగా ఉన్న వస్త్రాలు కట్టుకోరాదు

3).గృహంలో దేవతా విగ్రహాలు ఆరు అంగులముల కన్నా తక్కువ పరిమాణంలోపే ఉండాలి.
అంతకన్నాపెద్దగా ఉండరాదు. మంత్ర పుష్పం, సుప్రభాతం కూర్చుని చదవరాదు. అలాగే దేవుడికీ పవళింపు సేవ చేయనప్పుడు నిలబడి చేయరాదు. 
4).నుదుట బొట్టు, విభూతి లేదా కనీసం కుంకుమ అయినా లేకుండా పూజ చేయకూడదు.
5.ఈశ్వరుడికి, గురువుకి ఒక చేతితో నమస్కారం చేయరాదు అలా చేస్తే పై జన్మలో చేతులు లేకుండా జన్మించటం,  చేతులు పోవటం కానీ జరుగుతాయి.

6).దేవునికి (ఈశ్వరునికి)ఏ సందర్భంలోనైనా సరే వీపు చూపరాదు, ఈశ్వరుడి ఎదురుగా నిలబడి ఆత్మప్రదక్షిణ చేయరాదు, కాస్త ప్రక్కన నిలబడి చేయాలి

 7).ఈశ్వరుడికి చేసే దీపారాధన పరదేవతతో సమానం. ఆ దీపాలతో వేరే పుల్లలు కానీ, సాంబ్రాణికడ్డికానీ, హారతి కర్పూరం కానీ మరి ఏదైనా కానీ వెలిగించకూడదు. 

8).పూజ సమయమున ఈశ్వరుడు మన కంటే ఎత్తులో వుండాలి. అలానే పూజా వస్తువులు కుడి వైపు నుంచి తీసుకోవాలి. ఎడమ చేయి పూజా విధులలో నిషేధం. 

9).ఆచమనం చేసేటప్పుడు శబ్దం రాకూడదు.

10).ఈశ్వర నిర్మాల్యం  తీసేసిన పూలను కాలితో తొక్కరాదు. అలాచేస్తే ఈ జన్మలో చేసుకున్న పుణ్యంతో పాటు పూర్వ జన్మలో చేసుకున్న పుణ్యం కూడా నశించును. 

11).రుద్రాక్షలు ,తులసీ మాలలు ధరించే వారు మద్యం, మాంసము, ఉల్లి, వెల్లుల్లి, మునగ, లాంటి శ్లేషాత్మక పదార్ధాలు తినకూడదు.

స్త్రీలకి నిషిద్ధకర్మలు :-

1. స్త్రీలు తులసీ దళాలు తుంచ రాదు.

2.ప్రతీ రోజు తలస్నానం చేయకూడదు, (సంసార జీవితంలో పాల్గొన్నా, మాంసాహారం భుజించినా సరే)
మంగళవారం, శుక్రవారం, తలస్నానం అస్సలు చేయకూడదు.
3.ముత్తైదువులూ శిరో ముండనం చేయించుకోకూడదు. భర్త తలనీలాలు ఇస్తే భార్యకు సగం పుణ్యం వస్తుంది ప్రత్యేకంగా ఆడవారు తలనీలాలు ఇవ్వాల్సిన అవసరం లేదు
4. సాధారణంగా శుక్రవారం వ‌స్తే ఆడ‌వాళ్ళు త‌ల‌స్నానం చేసేస్తుంటారు. అయితే అలా చేయడాన్ని శాస్త్రాలు తప్పు పడుతున్నాయి.
రోజు త‌ల‌స్నానం చేసే వారికి మాత్రం ఇది వ‌ర్తించ‌దు. వారానికి ఒక్క‌సారి లేదా రెండు సార్లు త‌ల‌స్నానం చేసేవారికి మాత్రం శుక్రవారం తలస్నానం మంచిదికాదని ఆధ్యాత్మిక శాస్త్రాలు వెల్లడిస్తున్నాయి. 
ముఖ్యంగా మంగ‌ళ‌వారం, శుక్ర‌వారం ఆడ‌వాళ్ళు త‌ల‌స్నానం చేయ‌రాదు. ఒక వేళ శుక్ర‌వారం త‌ల‌స్నానం చేస్తే సౌఖ్యాల‌న్నీ దూర‌మ‌వుతాయని శాస్త్రాలు హెచ్చరిస్తున్నాయి. అదే శ‌నివారం త‌ల‌స్నానం చేస్తే ఐశ్వ‌ర్యం ల‌భిస్తుంది అంటున్నారు.

గాయత్రీ మూల తత్వం

గాయత్రీ శక్తి యెుక్క మూల తత్వం వక పరిశీలన.లింగోధ్భవం అనంతమైన శక్తి. హాలాహలమే లింగరూపం.దానివి తెలుసుకొనుటకు అనగా రుద్రుని మూల ప్రకృతి తెలియుట ఎవరి తరము .అనగా బ్రహ్మ విష్ణవుకైనా తెలియుదు. కాని అట్టి తత్వం తెలియవలెనని వేరు రూపంలో అనగా అయ్యప్ప, గణపతి,హనుమంతుడు, వీరికి మన సూర్య శక్తికి కోటి సూర్యుల సమానమైన అనగా అనంతమైన శక్తి కలవని నిరూపణకు పై అవతారములు. అదియును బ్రహ్మ చర్యమే దీని ఉనికి. యింతవరకు భౌతిక వాదమునకు అందని తత్వం. వివిధ శక్తిగల లింగముల మూల కణముల ప్రకృతి. అదియును వాని శక్తి పరిమిత గ్రహముల నడకలో అనగా కొన్ని ముఖ్యమైన కాలములలో కలుగు శక్తి మూలమవి ఆయా గ్రహముల కాంతి వలననే ఏర్పడునని తెలియుచున్నది. వెర్రి వెర్రి ప్రయెూగములతో వక మనిషి జీవన కాలమును వృధాచేయుట మాని నిరంతరం నామ జప శక్తితో సాధనలో సమస్త ప్రకృతి తెలియనగునని, 
దీనినే వేదమూలమని విశ్వ ఆవిర్భావ రహస్యమని తెలియును. యిలా చేయగా చేయగా ఎన్నో జన్మలలో యీ అనంత విశ్వ రహస్యం తెలియును. 
మహా ప్రళయములో సమస్తం అనగా సూర్యుని తో సహా సమస్త శక్తి సూక్మమైనది రూపం దాల్చును.యిదియే సృష్టికి మూలంగా తెలియుచున్నది. మామూలుగా సూర్యుని చూడలేని మనం అనంతమైన సూర్య శక్తి చూచుట అసంభవం. అందుకే అటువంటి శక్తిని మనకు తెలియజేయునేమో యీ అవతార రహస్యములు.

నవగ్రహ దోషములకు చేయవలసిన స్నానములు.

.మానవ జీవితమున నవగ్రహాల ప్రభావంతో ఈతిబాధలు తప్పవు. నవగ్రహాలలో ఒక్కో గ్రహం, దాని తాలూక దోషం.. ఆయా వ్యక్తులకు మనఃశాంతి లేకుండా చేస్తుంటాయి. అందువల్ల గ్రహదోషం అనగానే వాటికి శాంతి చేయించడానికి పలు రకాల అవస్థలు పడుతుంటారు. అయితే ఈ గ్రహదోషాలు తొలగిపోవడానికి నియమబద్ధమైన పూజలే కాదు, వివిధ రకాల స్నానాలను గురించి కూడా శాస్త్రాలు చెబుతున్నాయి.
స్నానౌషధములు సిద్ధౌషధ సేవల వల్ల వ్యాధులు, మంత్ర జపము వల్ల సకల భయం తీరునట్లుగా ఔషధస్నాన విధానం వల్ల గ్రహదోషములు నశించును. 

 సూర్య గ్రహ దోష నివారణకు...కుంకుమ పువ్వు, మణిశిల, ఏలుకలు, దేవదారు, వట్టివేళ్ళు, యష్టిమధుకము, ఎర్ర పుష్పాలు, ఎర్రగన్నేరు పువ్వులు.. ఈ వస్తువులను నీళ్ళలో వేసి కాచి, ఈ నీటితో స్నానం చేయాలి. సూర్య గ్రహ దోష నివారణకు గాను సూర్యున్ని పూజించుట, ఆదిత్య హృదయం పారయణ చేయుటకు, కెంపు,(మాణిక్యము) ధరించుట, సూర్యునకు గోధుములు, బెల్లం, కంచు, గుర్రము, రక్త చందనం, పద్మములు, ఆదివారం, దానం చేస్తే.. రవి వలన కలిగిన దోషాలు తొలుగును. 
కంచుతో చేయబడిన ఉంగరం ధరించుట వల్ల మంజిష్టం గజమదం, కుంకుమ పువ్వు రక్త చందనములను రాగి పాత్రయందలి నీటిలో కలిపి ఆ రాగి పాత్ర యందలి నీటితో స్నానము చేసిన దోష నివృత్తి కలుగుతుంది. రాగి ఉంగరము ధరించడం కూడా మంచిదే. శుభ తిధి గల ఆదివారము రోజున సూర్యుని ఓం-హ్రాం-హ్రీం-హ్రౌం-సః సూర్యాయనమహః అను మూలమంత్రమును 40 రోజులలో 6 వేలు జపము పూర్తి చేసిన సూర్య సంబంధమైన దోషాలు తొలగిపోతాయి.  

 చంద్ర గ్రహ దోష నివారణకు...గో మూత్రం, ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు పేడ, ఆవు నెయ్యి, శంఖములు, మంచి గంధములు, స్పటికము.. ఈ వస్తువులను నీళ్ళలో వేసి కాచి, ఆ నీటితో స్నానము చేయాలి. చంద్రగ్రహ దోష నివారణకు చంద్రుని పూజించుట, దుర్గా దేవి ఉపాసించుట, బియ్యం దానం చేయుట, ముత్యం ఉంగరాన్ని ధరించుట గాని, మాలగా వేసుకొనుట గాని చేయాలి. సీసం, తెల్లని ఆవు, ముత్యములు, తెల్లని వస్త్రం నేయితో నింపిన కలశం, ఎద్దులలో ఎదేని ఒకటి సోమవారం దానము చేసినచో చంద్రునకు సంబంధించిన దోషం పోవును. వట్టివేర్లు, దిరిసెన గంధం, కుంకుమ పువ్వు, రక్త చందనము కలిపి శంఖములోపోసిన నీటితో స్నానం ఆచరిస్తే చంద్ర దోష పరిహారం కలుగుతుంది.
సీసపు ఉంగరము, వెండి ఉంగరము గాని ధరించుట మంచిది. శుభ తిధి గల సోమవారము నందు ఓం-శ్రాం-శ్రీం-శ్రౌం-సః చంద్రయనమః అను మంత్రమును 40 జపము చేసి చివరి రోజున అంటే.. 41వ రోజున బియ్యం, తెల్లని వస్త్రం నందు పోసి దానం చేస్తే చంద్ర దోష నివారణ కలుగుతుంది. 

 కుజ గ్రహ దోష నివారణకు...మారేడు పట్టూ, ఎర్ర చందనము, ఎర్ర పువ్వులు, ఇంగిలీకము, మాల్కంగినీ, సమూలంగా పొగడ పువ్వులు.. ఈ వస్తువులను నీళ్ళలో వేసి కాచి ఆ నీటితో స్నానం ఆచరించాలి. కుజ దోష నివారణకు గాను కుజుని పూజించి సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం వల్లగానీ, ఎర్రని పగడమును గాని కందులు, మేకలు, బెల్లము, బంగారము, ఎర్రని వస్త్రము, రాగి వీటి యందేదయిన దానము చేయుటకు కాని కుజదోష నివారణ అవుతుంది. వెండి పాత్రయందు చండ్రకర్ర గంధము, దేవదారుగంధం ఉసిరిక పప్పు కలిపిన నీటితో స్నానం ఆచరిస్తే అంగారకదోష నివారణ కలుగుతుంది.
బంగారు ఉంగరము ధరించు ఆచారము కలదు. శుభ తిధి గల మంగళవారం రోజున ఓం-క్రాం-క్రీం-క్రౌం-సః భౌమాయనమః అను మంత్రమును 7 వేలు 40 రోజులలో పూర్తి చేసిన ఎర్రనిరంగు బుట్టలో కందులు వేసి 41 వ రోజున దానం చేయడం మంచిది.

బుధ గ్రహ దోష నివారణకు...చిన్న సైజులో ఉండే పండ్లు, ఆవు పేడ, గోరోచనము, తేనే, ముత్యములు బంగారము.. ఈ వస్తువులను నీళ్ళలో వేసి కాచి, ఆ నీటితో స్నానం ఆచరించవలెను. బుధ గ్రహ దోష నివారణకుగాను బుధ గ్రహమునకు పూజ,విష్ణు సహస్రనామ పారయణ చేయాలి. పెసలు దానము చేయాలి. ఆకు పచ్చ రంగు బట్ట, తగరము, టంకము, పచ్చ పెసలు, మరకతము, లొట్టపిట్ట, గజదండము (అంకుశము), పచ్చని పూవులు... వంటి వానిలో ఒకటి దానం చేసినచో బుధగ్రహం వలన కలుగు దోషం పరిహరించబడును. 
నదీసంగమము నందు గల సముద్రపు నీటిని మట్టిపాత్రలో పోసి ఆ నీటిలో గజమదము కలిపి, ఆ నీటిని స్నానం చేస్తే కూడా బుధ దోషం తొలగును. ఇత్తడి లేక కంచు ఉంగరము ధరించుట సంప్రదాయము. శుభ తిధితో కూడిన బుధవారమునందు ఓం-బ్రాం-బ్రీం-బ్రౌం-సః బుధాయనమః అను మంత్రమును 40 రోజులలో జరిపించి చివరి రోజున అనగా 41 ఆకు పచ్చని వస్త్రములలో పెసలు పోసి దానము చేసినచో బుధగ్రహ దోష నివారన కలుగును. 

గురు గ్రహ దోష నివారణకు...మాలతీ పువ్వులు, తెల్ల ఆవాలు, యష్టి మధుకం, తేనే... వస్తువులను నీళ్ళలో వేసి కాచి, ఆ నీటితో స్నానము చేయాలి. గురు దోష నివారణకు గురుగ్రహమును పూజించుట నమక పారాయణ చేయడం వల్ల దోష నివారణయగును. పుష్యరాగం ఉంగరమున ధరించుట శనగలు, పుష్యరాగం, పసుపు, చక్కెర, ఏనుగు, బంగారు రంగువస్త్రము గాని, బంగారము గాని ఎదొకదానిని దానము చేయుటవలన కూడా గురునకు సంబంధించిన దోషము శాంతించగలదు. బంగారుతో చేసిన పాత్రతో బ్రహ్మమేడి (బొడ్డ), మారేడు, మర్రి, ఉసిరిక ఫలములను వేసి ఆ నీటితో స్నానం చేస్తే.. గురువునకు సంబంధించిన దోషము తొలగిపోవును. 
బంగారముతో చేసిన ఉంగరము సాంప్రదాయము. శుభతిధి గల గురువారము నాడు ఉదయము ఓం-హ్రాం-హ్రీం-హ్రౌం-సః బృహస్పతయే నమః అను మంత్రము 40రోజులలో 16వేలు జపము పూర్తి చేసి పసుపు పచ్చని బట్టలో సెనగలు దానమిచ్చినచో గురుగ్రహ దోష శాంతి కలుగును. 

 శుక్ర గ్రహదోష నివారణకు...కుంకుమ పువ్వు, యాలుకలు, మణిశిల, శౌవర్చ లవణము.. ఈ వస్తువులను నీళ్ళలో వేసి కాచి, ఆ నీటితో స్నానం ఆచరించాలి. శుక్ర గ్రహ గ్రహ నివారణకు గాను శుక్ర గ్రహమునకు లక్ష్మీదేవికి పూజ చేయాలి. వజ్రమును ఉంగరంను ధరించుట వలన శుభ వస్త్రము, తెల్లని గుర్రము తెల్లని ఆవు, వజ్రం, వెండి, గంధము, బియ్యం బొబ్బర్లు వీటియందేదొకటి దాన మిచ్చుట వలన గాని శుక్ర గ్రహ దోషం నివారింపబడును. వెండి పాత్రయందలి నీటిలో గోరోచనము గజమదము, శక్తిపుష్పము, శతావరిని కలిపి, ఆ నీటితో స్నానం ఆచరిస్తే శుక్రగ్రహ సంబంధమైన దోషం తొలగును. 
వెండితో చేసిన ఉంగరము గాని, ముత్యముతో వెండి ఉంగరము ధరించుట సంప్రదాయము. శుభతిధితో కూడిన శుక్రవారమునందు ఓం-ద్రాం-ద్రీం-ద్రౌం-సః శుక్రాయనమః అను మంత్రము 20,వేలు 40రోజులలో జపము పూర్తిచేసి ,41వ రోజున తెల్లని వస్త్రములో బొబ్బరులుపోసి దానము చేసిన శుక్ర సంబంధమైన దోషం నివారింపబడును. 

 శని గ్రహ దోష నివారణకు..:సాంబ్రాణి, నల్ల నువ్వులు, సుర్మరాయి, సోపు.. వస్తువులను నీళ్ళలో వేసి కాచి, ఆ నీటితో స్నానం చేయాలి. శని గ్రహ దోష నివారణకు శనిగ్రహ పూజలు,ఈశ్వర పూజ, తైలాభిషేకం, నీలమణి ధరించుట, నువ్వులు దానం చేయడం వల్ల గ్రహ దోష నివారణ కలుగును. నీలం, నూనె, నువ్వులు, గేదె, ఇనుము, నల్లని ఆవులందు ఏదో ఒకటి దానం చేయవలెను. ఇనుప పాత్రయందు గల నీటిలో మినుములు, ప్రియంగు ధాన్యము, నీలగంధ, నీల పుష్పములు వేసి ఆ నీటితో స్నానము చేస్తే శనిగ్రహ దోష నివారణయగును. 
శుభతిధి గల శనివారము నుండి ఓం-ఖ్రాం-ఖ్రీం-ఖ్రౌం-సః శనయేనమః అను మంత్రము 40 రోజులలో 19వేలు జపము చేసి, 41వ రోజున నువ్వులు నల్లని బట్టలో వేసి శని గ్రహ దోష నివారణ కలుగుతుంది. 

 రాహు గ్రహ దోష నివారణకు...నువ్వు చెట్టు ఆకులు, సాంబ్రాణి, కస్తూరి, ఏనుగు దంతము (ఏనుగు దంతం లభించకపోతే మిగిలినవి).. ఈ వస్తువులను నీళ్ళలో వేసి ఆ నీటితో స్నానం ఆచరించాలి.  రాహు గ్రహ దోష నివారణకుగాను రాహు గ్రహమును పూజించుట, దుర్గాదేవిని పూజించుట, గోమేధికమును ధరించుట వలన రాహు గ్రహ దోష నివారణ యగును, గోమేధ్కము, గుర్రము, నీలవస్త్రము, కంబళి నూనె, మినుములు, పంచలోహములు, వీటియందేదైన దానం చేయడం వల్ల కూడా దోష శాంతి కలుగును. 
గేదె కొమ్ముతో చేసిన పాత్రయందలి ఉదకమున గుగ్గిలము, ఇంగువ,హరిదళము, మనశ్శిలలతో కలిపి ఆ నీటితో స్నానం చేసి అన్చో రాహు దోషం తొలగును. పంచ లోహములతో చేసిన ఉంగరము ధరించుట సాంప్రదాయం. శుభతిధి గల శనివారము నాడు రాహుమంత్రమగు ఓం-భ్రాం-భ్రీం-భ్రౌం-సః రాహవే నమః అను మంత్రమును 40 రోజులలో 18 వేలు జపము పూర్తి చేసి, 41వ రోజున మినుము చల్లని బట్టలో వేసి దానం చేసినచో రాహుగ్రహ సంబంధమైన దోషం తొలగిపోవును. 

 కేతు గ్రహ దోష నివారణకు...సాంబ్రాణి, నువ్వుచెట్టు ఆకులు, మేజ మూత్రం, మారేడు పట్ట, ఏనుగు దంతం, (ఏనుగు దంతం లభించకపోతే మిగిలినవి)..  ఈ వస్తువులను నీళ్ళలో వేసి కాచి ఆ నీటితో స్నానం చేయవలెను. కేతు దోష నివారణకుగాను కేతుగ్రహమును పూజించి సూర్యనమస్కారములు చేస్తూ ఉలవలు దానం ఇవ్వాలి. వైఢూర్యం, నూనె, శాలువా, కస్తూరి, ఉలవలు వీటిని దానం చేసినా కూడా కేతుగ్రహ దోష నివారణ కలుగుతుంది. 
ఖడ్గమృగము కొమ్ముతో చేయబడిన పాత్రయందు గల నీటిలో పర్వతముల యందు పందికొమ్మతో తవ్వబడిన మట్టి, మేక పాలు కలిపి ఆ నీటితో స్నానం ఆచరిస్తే కేతుగ్రహ దోష నివారణ కలుగును. పంచలోహముల ఉంగరం ధరించుట సాంప్రదాయం. శుభ తిధి గల మంగళవారం నాటి నుంచి ఓం-ప్రాం-ప్రీం-ప్రౌం-సః కేతవే నమః అను మంత్రమును 40 రోజులలో 7 వేలు జపము పూర్తి చేసి 41వ రోజున ఎర్రని వస్త్రంలో ఉలవలు పోసి దానమిచ్చిననూ కేతుగ్రహ దోష నివారణ కలుగుతుంది....
 లోకాస్సమస్తాస్సుఖినోభవంతు .

శబ్దము దాని లక్షణం

శబ్దము దాని లక్షణం. శంఖం శబ్ద లక్షణం, యినుప గంట యెక్క శబ్ద లక్షణం ,ఢమరురం అనగా చర్ముయెుక్క శబద లక్షణం అలగే వెదురు కర్ర పిల్లనగ్రోవి శబ్ద లక్షణం, కంచు గంట లక్షణం, పిడుగు యెుక్క శబ్ద లక్షణం అలాగే మనషియెుక్క భాష శబ్ద లక్షణం, యీ విధంగా శబ్ధం అనేక రూపములుగా మనకు ప్రకృతిలో గోచరించుచున్నది . వివిధ రకాలైన శబ్ద లక్షణమును వివిధ గుణ ములుగా మనస్సును ప్రభావితం చేయుచున్నవి. అనంత మైన శబ్గ శక్తి యే సృష్టి మూల మునకు కారణముగా అంతః కరణము నందు మానవ దేహంలో కూడా అటులనే ప్రభావితం చేయుచున్నవి మంత్రములచే చేత శక్తి కూడా ఆరోహ అవరోహ మధ్యమ  లక్షణముగా శక్తిని ప్రభావితమై మనకు ప్రకృతి గా మారు చున్నది. మంత్ర శక్తి కూడా అటువంటి లక్షణములు కలిగియున్నవని అవి మన శరీరములను కూడా ప్రభావితం చేయుచున్నవి. తెలుసుకుంటూనే ఉందాం ఆచరిస్తూనే ఉందాం.

సుభాషితం - వార్ధకం వయసా నాస్తి


సంస్కృతాంధ్ర సాహితీసౌరభం
श्लोकम्  :
वार्धकं वयसा नास्ति मनसानैव तद्भवेत ।
सन्ततोद्यमशीलस्य नास्ति वार्धक पीडनम् ।।

శ్లోకం:
వార్ధకం వయసా నాస్తి,  మనసా నైవ తద్భవేత్‌ ।
సంతతోద్యమ శీలస్య, నాస్తి వార్ధక పీడనమ్‌ ।।

పద విభాగం:
వార్ధకం, వయసా, నాస్తి, మనసా, నైవ, తత్, భవేత్,
సంతత, ఉద్యమ శీలస్య, నాస్తి, వార్ధక పీడనమ్,

ప్రతిపదార్థం:
వార్ధకం = ముసలితనం, వయసా = వయస్సుచేత, నాస్తి = లేదు, మనసా = మనస్సుచేత, ఏవ = అయిననూ, తత్ = అది, న భవేత్ = అవకూడదు,
సంతత = నిరంతరమూ, ఉద్యమ శీలస్య = ఉద్యమ శీలునికి అంటే ప్రయత్నము చేయువానికి,  వార్ధక పీడనమ్ = వయోబాధ, నాస్తి = లేదు,

Meaning:
Being old is not due to the advancement of the age. Even it should not occur from the very thinking of your mind. The one who always works hard there is no burden of being old.

తాత్పర్యం:
ముసలితనం వయసులో లేదు. మనసులోనూ ఉండకూడదు. ఎప్పుడూ పని చేసుకునేవానికి ముసలితనపు పీడ ఉండదని సుభాషితం.

ముసలితనం రెండు రకాలుగా వస్తుంది. వయోభారంతో వచ్చేది శారీరకం. దుఃఖం వల్ల వచ్చేది భావజం. వయోభారం వల్ల వచ్చేది కూడా ఆపాదింపబడిన ముసలితనమే. కొంతమంది యాభయ్యవ పడిలోకి రాగానే వృద్ధులయ్యారంటారు. కొందరు అరవై సంవత్సరాలకు ముసలివారనిపించుకుంటారు. 70 ఏళ్లు వచ్చినా చురుగ్గానే ఉండేవారు మరికొందరు. శరీర బలం తగ్గి, అవయవాలు పటుత్వం కోల్పోయి, నరాల కండరాల పట్టు సడలినా.. బుద్ధిబలంతో నిత్యం విజయాలను సాధించేవారు ఉన్నారు. కొందరికి సోమరితనం వల్ల వృద్ధాప్యం వస్తుంది.

పని చేయడానికి బద్ధకించి పని సామర్థ్యాన్ని కోల్పోతే దాన్ని మించిన వార్ధక్యం మరొకటి లేదు. అటువంటివారు సమాజ ప్రగతికే కాక సొంత ప్రగతికి కూడా శత్రువులే. అతి పిసినారితనం, స్వార్థం, మద్యపానం, ధూమపానం, మత్తుమందుల వాడకం వంటి దురలవాట్లు శరీరంలో అనేక సామర్థ్యాలను బలహీన పరుస్తాయి. అకాల వార్ధక్యానికి దారి తీస్తాయి. ఆయుర్దాయాన్ని తగ్గిస్తాయి. అటువంటి వృద్ధులు తమ కుటుంబాలకు సమాజానికి కూడా భారమే. మానసిక ఒత్తిడులు, కుంగుబాటు వల్ల వచ్చే ముసలితనం చెద పురుగులాంటిది. మనిషి భవితను సమూలంగా తినేస్తుంది.

మానసిక వృద్ధాప్యం అంటే.. ‘నాకు ముసలితనం వచ్చేసింది’ అనే భావన. అలాంటి వృద్ధాప్యాన్ని రానీయ కూడదు. ‘సంతతోద్యమ శీలస్య నాస్తి వార్ధక పీడనం’ అన్న మాటలను గుర్తుపెట్టుకుని ఏదో ఒక పని పెట్టుకోవాలి. భారతీయ సంప్రదాయంలో జ్ఞాన వార్దక్యాన్ని అంగీకరించారు గానీ వయో వార్ధక్యాన్నికాదు. భరద్వాజ మహర్షి మూడు ఆయుర్దాయాల కాలం తపస్సు చేసి జ్ఞానాన్ని సంపాదించాడని పురాణ ప్రతీతి. నిత్య వ్యాయామం, యోగాభ్యాసం, సద్గ్రంథ పఠనం, సతత క్రియాశీలత, మితాహారం, హితాహారం, ఇష్టదేవతా ఉపాసనం, ఇవి ఉన్న చోట ముసలితనం ఉండదు.
మనకి  గురువు గారు ప్రతి సారి చెబుతూ నే ఉంటారు
యాదేవీ సర్వ భూతేషు శక్తి రూపేణ సంస్థితా నమస్తస్యై నమస్తస్యై నమ స్తస్యై నమో నమః.
భరద్వాజ మహర్షి మూడు ఆయుర్దాయాల కాలం తపస్సు చేసి జ్ఞానాన్ని సంపాదించాడని మనకి భాగవత ప్రవచనం లో గురువు గారు తెలియచేసారు . నిత్యవ్యాయామం, యోగాభ్యాసం, సద్గ్రంథ పఠనం, సతతక్రియాశీలత, మితాహారం, హితాహారం, ఇష్టదేవతా ఉపాసనం, ఇవి ఉన్న చోట ముసలితనం ఉండదు అని శ్రీమద్ భాగవతం నుంచి మనం నేర్చుకుంటున్నాము

ఇట్లు
శివ పరివారం

గురువందనము

గురుత్న సస్యాత్ స్వజనోన సస్యాత్
పితాన సస్యాత్ జననీన నస్యాత్
దైవంన సస్యాత్ నృపతిశ్చ సస్యాత్
నమోచయేద్యస్సముసేత మృత్యుమ్

మృత్యుముఖము నుండి తన్ను తప్పించి మోక్షసాధనము బోధింపని గురువు, బంధువులు, తండ్రి, తల్లి, ఇలవేల్పు, రాజు మొదలగు వారి వలన లాభము లేదు. కనుక మోక్షసాధనంబగు బ్రహ్మ జ్ఞానమును ఎవరు బోధించునో వారే గురువు.

శుభంభూయాత్