ప్రపంచ కవులకు స్వగతం. మీ కవితలను ఇక్కడ పబ్లిష్ చేయవచ్చు. మీరు ముందుగా follow by Email బాక్సులో మీ మెయిల్ అడ్రసుని నింపి submit చేయండి. తరువాత followers ని click చేసి follower అవ్వండి. తరువాత మీ రచనను కొత్త కవులు పేజీలో అక్కడ సూచించిన విధంగా పంపండి. .
8, ఫిబ్రవరి 2026, ఆదివారం
సత్యవ్రతుడు
*సత్యవ్రతుడు*
➖➖➖✍️
```
కొన్ని వేల సంవత్సరాల క్రితం సత్యవ్రతుడనే రాజు ఉండేవాడు. ఆయన గుణగణాలు, పరిపాలనా దక్షత తెలియనివారు లేరు. ఆయన ధర్మదీక్ష, కీర్తి ప్రతిష్ఠలు దేవలోకం వరకు వ్యాపించి ఉండేవి.
అటువంటి ఆ మహారాజు ఒకనాటి రాత్రి రెండవఝామున రాజ్యపు దక్షిణద్వారం వద్ద పచార్లు చేస్తున్నాడు. ఆ సమయంలో ఎవరో ఒక దేవతా
స్త్రీమూర్తి రాజ్యపు ప్రధాన ద్వారాన్ని దాటుకొని పోతూ కనబడ్డది ఆయనకు.
ఆయన ఆమెను ఆపి, గౌరవంగా “ఎవరు తల్లీ, నువ్వు? ఇంత రాత్రి సమయంలో రాజ్యాన్ని విడిచి ఎందుకు వెళ్తున్నావు?” అని అడిగాడు.
“రాజా, నేను ధనలక్ష్మిని. ఏ ఒక్కచోటా ఆగటం నా స్వభావంలో లేదు. అయినా ఇన్నేళ్లుగా నీ రాజ్యంలో నేను ఆగిపోయాను. ఇక ఆగను. వెళ్లేందుకు నన్ను అనుమతించు” అన్నది ఆమె.
మహారాజు “తల్లీ! నిన్ను ఆపటం నావల్ల ఎలాగూ కాదు. సంతోషంగా వెళ్లు” అని ఆమెను సాగనంపాడు.
ఆమె అటు వెళ్లిందో, లేదో- ఇటుగా ఒక దివ్య పురుషుడు బయలు దేరాడు బయటికి. “అయ్యా! మీరెవరు? ఎటు వెళ్తున్నారు?” అని అడిగాడు రాజు, ఆయనను.
“రాజా నేను దానాన్ని. ధనం ఉన్నచోట దానం ఉంటుంది. ధన సంపద లేని నీ రాజ్యం ఇప్పుడు నాకు న్యాయం చేయజాలదు. నేనూ ధనాన్ని అనుసరించాల్సిందే. నీ రాజ్యాన్ని విడిచి వెళ్లేందుకు నన్ను అనుమతించు” అన్నాడు ఆ దివ్య పురుషుడు.
“సంతోషంగా వెళ్లండి” అని సాగనంపాడు మహారాజు.
అంతలోనే మరొక దేవతామూర్తి బయటికి పోతూ కనబడింది ఆయనకు. “తల్లీ! నువ్వెవ్వరు? ఎందుకు నన్ను వదిలి పోతున్నావు?” అడిగాడు రాజు.
“రాజా! నేను కీర్తికాంతను. ధన సంపత్తీ, దాన సంపదా లేని ఈ రాజ్యంలో నేను ఉండజాలను. నన్ను వెళ్లనివ్వు” అన్నది ఆ దేవతామూర్తి.
“సరేనమ్మా! నీ ఇష్టం వచ్చినట్లే కానివ్వు.” అన్నాడు రాజు.
ఇంకొంతసేపటికి మరొక దివ్య మూర్తి బయటి దారి పట్టింది. రాజుగారు అడిగారు “స్వామీ! మీరెవ్వరు?" అని.
“రాజా! నేను శుభాన్ని. సంపదా, దానం, కీర్తీ లేని ఈ రాజ్యంలో నేను ఉండీ ప్రయోజనం లేదు. అందువల్ల నేను వారిని అనుసరించి పోవటమే మంచిది. నన్ను క్షమించి, పోనివ్వు” అన్నాడా దివ్యమూర్తి. రాజుగారు శుభాన్నీ సాగనంపారు.
‘ఇంకా ఏమి చూడాల్సి వస్తుందోనని రాజుగారు విచార పడుతుండగానే మరో దేవతా మూర్తి బయటికి పోతూ కనబడ్డది. “తల్లీ! నువ్వెవ్వరు?” అని అడిగాడు సత్యవ్రతుడు.
“రాజా, నేను సత్య లక్ష్మిని. ధనలక్ష్మీ, దాన లక్ష్మీ, యశోలక్ష్మీ, సౌభాగ్యలక్ష్మీ నిన్ను విడిచి వెళ్ళిపోయారు. ఇక నీకు నా అవసరం ఉండదని, నేనూ పోనెంచాను. నాకూ అనుమతినివ్వు" అన్నది సత్యం.
రాజుగారు వెంటనే ఆమె పాదాలపై పడి “తల్లీ! నీకు ఆ అవసరం ఏమున్నది? వేరే ఏ సంపదనూ నేను కోరలేదు- వారంతట వారువచ్చారు; వారంతట వారు వెళ్ళారు. కానీ తల్లీ, నేను నీ పూజారిని. సత్యాన్ని కోరి, సత్యం కోసమే జీవించే నన్ను వదిలి వెళ్లటం నీకు భావ్యం కాదు. నన్ను వదిలి వెళ్ళకు తల్లీ!” అన్నాడు.
సత్యం సంతోషపడింది. సరేలెమ్మన్నది. తిరిగి రాజ్యంలోకి వెళ్లిపోయింది.
రాజుగారు నిట్టూర్చారు. సూర్యోదయం కాబోతున్నది. రాజుగారు కూడా వెనుదిరిగి తమ మందిరానికి పోబోతున్నారు- అంతలోనే ఒక దివ్యమూర్తి- ఈమారు ఆమె ప్రధాన ద్వారం గుండా రాజ్యంలోనికి ప్రవేశిస్తూ కనబడింది;
చూడగా, ఆమె ధనలక్ష్మి! “ఏం తల్లీ! మళ్ళీ వస్తున్నావు?" అడిగారు రాజుగారు.
“అవును సత్యవ్రతా! సత్యం లేనిచోట నేనూ ఉండలేను. అందుకే తిరిగి వస్తున్నాను” అన్నది ధనలక్ష్మి.
అంతలోనే దానలక్ష్మీ, ఆపైన యశోలక్ష్మీ, సౌభాగ్యలక్ష్మీ ఒకరి తరువాత ఒకరు తిరిగి వచ్చారు రాజ్యానికి.
మళ్లీ రాజ్యం కళకళలాడింది.
ఉపనిషత్తులలోని ఈ కథ, సత్యం ఎంత గొప్ప సంపదో వివరిస్తున్నది.
అన్ని విషయాల్లోనూ నిజం చెప్పగల్గటం అన్నది నిజంగానే గొప్ప సంపద.
ప్రపంచంలో మనకు అబద్ధమే రాజ్యమేలుతున్నట్లు అనిపిస్తుంది కానీ, అంతిమంగా నిలిచేది సత్యమే! సందేహం లేదు!!✍️```
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🌷🙏🌷
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
➖▪️➖
ఇలాటి మంచి విషయాలకోసం…
*“భగవంతుని విషయాలు గ్రూప్“* లో చేర్చమని ఈక్రింది నెంబరుకి వాట్సప్ లో మాత్రమే మెసేజ్ పెట్టండి... 8712184465. లింక్ పంపుతాము. దయచేసి ఫోన్ కాల్స్ చేయవద్దు.🙏
ఏ పువ్వు ఏ ఫలితాన్ని అందిస్తుంది..........!!
దేవునికీ సమర్చీంచే
ఏ పువ్వు ఏ ఫలితాన్ని అందిస్తుంది..........!!
1.దేవునికి జాజి పూలు..అర్పించి
ప్రసాదం స్వీకరిస్తే ..
మీలో ఉన్న దుష్టగుణాలు తొలగి
మంచి గుణం వస్తుంది .
ఉద్యోగంలో ఉన్నవారి సమస్యలు తొలగిపోతాయి
2.దేవునికి సంపెంగ పూలు అర్పించి..
ప్రసాదం స్వీకరిస్తే ..
మాంత్రిక ప్రయోగాలు మీఫై పని చేయవు .
శత్రువుల బాధ నివారణ సాధ్యం అవుతుంది
3.పారిజాత పువ్వుని అర్పిస్తే ....
కాల సర్ప దోషం నివారించబడి
మనస్సుకు శాంతి లబిస్తుంది.
4.రుద్రాక్ష పువ్వును అర్పిస్తే ...
ఎన్ని కష్టాలు వచ్చిన అంతిమ విజయం
మీదే అవుతుంది.
5.మొగలి పువ్వును అర్పిస్తే .....
అధికారంలో ఉన్నవారి మనస్తాపాలు పరిహరించబడుతాయి.
6.లక్కీ పువ్వుతో పూజిస్తే ....
భార్య పిల్లలతో కలహాలు లేకుండా
సంతోషంగా ఉంటారు.
7.పద్మం లేదా కమలంతో పూజిస్తే .....
సమస్త దారిద్ర నివారణ.
శ్రీమంతులు అవుతారు.
8. మల్లి పువ్వుతో పూజిస్తే ......
అన్ని రోగాలు నయం అవుతాయి .
ఆరోగ్యం ప్రాప్తిస్తుంది.
9.గన్నేరు పూలతో పూజిస్తే..
కవులకు కల్పనా సాహిత్యం వృద్ది చెందుతుంది.
10.కల్హార పుష్పం తో పూజిస్తే ...
అందరిలోనూ మీకు గుర్తింపు వచ్చి
ఆకర్షణ పెరుగుతుంది.
11.పాటలీ పుష్పంతో పూజ చేస్తే ..
వ్యాపార వ్యవహారంలో అధిక లాభం వస్తుంది.
12.కంద పుష్పంతో పూజ చేస్తే ....
ముఖంలో అధికమైన తేజస్సు కాంతి వస్తుంది.
13.తుమ్మ పూలతో ఈశ్వరునికి పూజ చేస్తే ...
దేవునిఫై భక్తి అధికం అవుతుంది.
14.నందివర్ధనం పూలతో శివునికి పూజ చేస్తే ... జేవితంలో సుఖం ,శాంతి ,ప్రశాంతత లబిస్తుంది.
15.కణగాలే పుస్ఫం ...దీనితో దేవునికి పూజ చేస్తే.. మనస్సును పట్టి పీడిస్తున్న భయం , భీతి తొలగిపోతాయి
గణపతికి ఈ పూలతో పూజ చేస్తే మాంత్రిక భాదలు తొలగిపోతాయి .
విద్య ప్రాప్తి సిద్దిస్తుంది .
దుర్గా దేవికి ఈ పూలతో పూజ చేస్తే
దేవి అనుగ్రహంతో శత్రువుల నిర్మూలన అవుతుంది.
16.అశోక పుష్పాలతో దేవికి పూజ చేస్తే .... జేవితంలో.. సంసారంలో ఉండే అన్ని దుఃఖాలు నాశనం అవుతాయి
17.నల్ల కలువ పుష్పాలతో శ్రీ శన్నైచ్చర మహారాజుకు పూజ చేస్తే అన్ని రకాల శని సమస్యలు తొలగిపోతాయి
18.పాదరి పుష్పంతో పూజ చేస్తే ...
అన్ని రకాల పితృ దోషాలు తొలగిపోతాయి.
19.మాలతి పుష్పంతో దేవునికి పూజ చేస్తే..
అన్ని పాపాలు తొలగిపోతాయి.
20.పున్నాగ పుష్పం... ఈ పువ్వుతో శ్రీ లక్ష్మి నారాయణ దేవునికి అయిన.. ,
శ్రీ గోపాల కృష్ణదేవునికి పూజ చేస్తే
మగ సంతానం కలుగుతుంది .
21.వకుళ పుష్పం ... శ్రీ భూవరాహ స్వామికి ,
శ్రీ లక్ష్మి నారాయణ దేవునికి ఈ పూలతో పూజ చేస్తే భూమి మరియు సొంత ఇల్లు పొందే యోగం వస్తుంది.
22.ఉత్ఫల పుష్పం ...జీవితంలో చాల కష్టాలు పడేవారు ప్రతిరోజు విష్ణు సహస్ర నామం
మహాలక్ష్మి సహస్ర నామం పఠించి..
ఉత్ఫల పుష్ఫంతో పూజ చేస్తే..
జీవితంలో చాలా అభివృద్ధి చెoదుతారు.
23. తెల్లని జీల్లేడు పువ్వుతో ... గణేశునికి ,శంకరునికి ,సూర్యదేవునికి చేసే పూజ వల్ల అన్ని రోగాలు తొలగి ,ఆరోగ్య్యం సిద్దిస్తుంది.
24.ద్రోణ పుష్పం ... ఈ పువ్వుతో సోమవారం ఈశ్వరునికి పూజ చేస్తే..శత్రువుల నాశనo , మిత్రలాభం అవుతుంది.
అధికారం ప్రాప్తిస్తుంది.
25. భందూక పుష్పం ... ఈ పుష్పంతో దుర్గా దేవికి మంగళవారం .శుక్రవారం పూజ చేస్తే..
బంధువులు క్షేమంగా ఉంటారు.
26.అగసి పువ్వుతో .... దేవికి పూజ చేస్తే..
పాపాలు తొలగిపోతాయి.
27.సురభి పుష్పం ... శ్రీ లక్ష్మి నారాయణ దేవునికి సురభి పుష్పంతో పూజిస్తే ఇష్టార్ధం సిద్ధిస్తుంది.
28.పొద్దు తిరుగుడు పుష్పంతో పూజ చేస్తే .... పువ్వును హోమం పూర్ణాహుతికి వేస్తె అష్ట ఐశ్వర్యాలు సిద్దిస్తాయి.
మాఘమాసం సప్తమి ఆదివారం
**మాఘమాసం సప్తమి ఆదివారం
భాను సప్తమి ఈ రోజు**
ఆదివారం రోజు సప్తమి తిధి రావడం వలన దీనిని భాను సప్తమి అంటారు.
ఇది చాలా గొప్ప యోగం, సాధారణంగా ఆదివారం రోజు అనేక నియమాలు పాటించాలని ధర్మశాస్త్రం చెబుతోంది. వాటిలో ప్రధానంగా చూస్తే...మొదట సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేవడం,రెండవది ఆదివారం రోజు అభ్యంగన స్నానం చేయకూడదు , ఈ రోజు కేవలం తలస్నానం మాత్రమే చేయాలి.మూడవది ఒంటికి , తలకు నూనె పెట్టుకోరాదు. నాల్గవది ఉల్లి , వెల్లుల్లి , మద్యము , మాంసాహారానికి దూరంగా ఉండాలి.ఐదవది బ్రహ్మచర్యం పాటించాలి.నవగ్రహాలకు అధిపతి సూర్యభగవానుడు.ఆయన అనుగ్రహం ఉంటే మనకు అసాధ్యమైనది అంటూ ఏదీ ఉండదు. సుర్యారాధనతో విద్యా , వ్యాపారాభివృద్ధి జరుగుతుంది, నిరుద్యోగులకు ఉద్యోగం కూడా లభిస్తుంది.
అవివాహితులకు వివాహమవుతుంది, సంతానం కలుగుతుంది, మనఃశ్శాంతి లభిస్తుంది. సూర్యారాధనతో లభించనిది అంటూ ఏదీ ఉండదు. ఈ భానుసప్తమి అనేది సూర్యునికి సంబంధించిన ఒక పర్వదినము లాంటిది , గొప్ప యోగము. ఈ రోజు చేసే స్నానం , దానము , జపము , హోమము లక్ష రెట్ల ఫలితాన్ని ఇస్తుందని శాస్త్ర వచనం. ఈ రోజున ఆవుపాలతో చేసిన పరమాన్నము శ్రీ సూర్య భగవానునికి నివేదన చేస్తారు.సూర్యోదయానికి పూర్వం నిద్రలేచి స్నానోదకాలు చేయక , ఆహార నియమాలు పాటించని వారికి అనారోగ్యం చేసి రోగాలు వస్తాయని , దరిద్రం పడుతుందని శాస్త్రవచనం. ఈ విషయాన్ని పరమశివుడే సూర్యాష్టకంలో చెబుతారు.
ఆమిషం మధుపానం చ యః కరోతి రవేర్ధినేసప్త జన్మ భవేద్రోగీ జన్మ కర్మ దరిద్రతాస్త్రీ తైల మధు మాంసాని హస్త్యజేత్తు రవేర్ధినేన వ్యాధి శోక దారిద్ర్యం సూర్య లోకం స గచ్ఛతి...
భావం:-🌷తినకూడని పదార్ధాలు , మద్యము , మాంసము మొదలైనవి తినేవాడు ఏడు జన్మల పాటు రోగాలతో బాధపడతారు.ఆజన్మాంతం దరిద్రం ఉంటుంది.స్త్రీ సమాగమము , తైలం రాసుకోనుట , మద్య మాంసాలను ఆదివారం విడిచిపెట్టినవానికి శోకం , వ్యాధి , దారిద్ర్యం ఉండదు , వారు సరాసరి సూర్యలోకనికి వెళతారు.ఈ నియమాలు ఒక్క భానుసప్తమికే పరిమితం కాదు ప్రతి ఆదివారం విధిగా పాటించమని పరమశివుడు సూర్యాష్టకంలో చెప్పారు.
కనుక అందరూ దీన్ని సద్వినియోగం చేసుకోమని దుర్వినియోగం చేయవద్దని సూచన.
ఈ రోజు సూర్యుని అనుగ్రహం కోసం సూర్యాష్టకం , ఆదిత్య హృదయం , సూర్య ద్వాదశ నామాలు పఠించడం శ్రేష్ఠం.
సూర్యనమస్కారాలు చేయడం వలన ఎన్నో శుభఫలితాలను , ఇష్ట కామ్యసిద్ధిని ఇస్తాయి.శ్రీ రామచంద్రుడంతటి వాడు రావణున్ని యుద్దంలో జయించడానికి సూర్యదేవుని ప్రార్ధించాడు ఇది అందరికీ తెలిసినదే ప్రతి రోజు ఎవరైతే సూర్యోదయ సమయంలో సూర్యనమస్కారాలు చేస్తారో వారికి అన్నింటా విజయం కలుగుతుంది
ఓం శ్రీ సూర్యనారాయణాయ నమః🙏🌻
ద్వాదశ ఆదిత్యుల నామాలు (Sri Aditya Dwadasa Namavali):
ఓం ఆదిత్యాయ నమః - అదితి పుత్రుడు
ఓం దివాకరాయ నమః - పగటి వెలుగును ప్రసాదించేవాడు
ఓం భాస్కరాయ నమః - ప్రకాశించేవాడు/కాంతినిచ్చేవాడు
ఓం ప్రభాకరాయ నమః - కాంతిని కలిగించేవాడు
ఓం సహస్రాంశవే నమః - వేయి కిరణాలు కలిగినవాడు
ఓం త్రిలోచనాయ నమః - మూడు నేత్రములు (వేదాలు) కలిగినవాడు
ఓం హరిదశ్వాయ నమః - ఆకుపచ్చని గుర్రాలు కలిగినవాడు
ఓం విభావసవే నమః - కాంతికి మూలమైనవాడు
ఓం సూర్యాయ నమః - సకల జగత్తును ప్రేరేపించేవాడు
ఓం పూష్ణే నమః - పోషించేవాడు/పోషకుడు
ఓం రవయే నమః - ప్రకాశించేవాడు
ఓం శుక్రాయ నమః - శుభకరుడు/శుద్ధుడు
మహాభారతము
*సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*
*645 వ రోజు*
అనుశాసనిక పర్వము తృతీయాశ్వాసము
శూద్రుడి ప్రవర్తన
ధర్మరాజు" పితామహా ! శూద్రుడు ఏ ప్రకారం చేస్తే ఇహ లోకంలోను, పరలోకంలోను సుఖములు పొందగలడు. భీష్ముడు " ధర్మనందనా ! పూర్వము పరాశరుడు తన శిష్యులకు కొన్ని ధర్మసూక్ష్మములు తెలియ చేసాడు. ఆ వాక్యముల సారాంశం ఇది. శూద్రుడైన వాడు ఇంద్రియములను జయించి అంతః శత్రువులైన కామ, క్రోధ, లోభ, మద, మాత్సర్యాలను జయించి గర్వమును వదిలి పెట్టి, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య కులముల వారికి భక్తితో శుశ్రూషలు చేసిన ఈ లోకములోనూ పరలోకము లోనూ సుఖపడగలడు. అలాకాక తన ధర్మమును వదిలి వేదాధ్యయనము, తపస్సు చేస్తే ఈ లోకములోనే కాక పరలోకములో కూడా హీనుడౌతాడు. బ్రాహ్మణుడికి వేదాధ్యయనం, క్షత్రియుడికి బలపరాక్రమాలు, వైశ్యునికి వాణిజ్యము శూద్రుడికి సేవకా వృత్తి అధిక ధనాలు. ఇది వేదము చూపిన మార్గము. ఈ మార్గములలో నడిచిన వారు ఉత్తమ గతులు పొందుతారు. అలా కాక స్వధర్మం వదిలి పరధర్మమును ఆచరించిన ఇహలోకంలోను పరలోకంలోను కూడా దుర్గతి కలుగుతుంది.
శౌచము
ధర్మనందనా ! నీకు పరాశరుడు తన శిష్యులకు శౌచము గురించి చెప్పినవి చెప్తాను. మానవుడు మలమూత్ర విసర్జన పగలు ఉత్తర దిక్కున, రాత్రి దక్షిణదిక్కున చేయడం మంచిది. ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలం ఉత్తరదిక్కుగా మలమూత్రములను విసర్జించి అవయవములను సున్నితంగా ఎడమచేతితో శుభ్రపరచుకోవాలి. లేని ఎడల రోగములు ప్రాప్తిస్తాయి. తరువాత చేతిని చక్కగా కడుగుకుని తరువాత చేతులకు మట్టి పూసుకుని రుద్దుకుని కడగాలి. తరువాత పాదములను శుభ్రంగా కడుగు కోవాలి. మలమూత్రములను బహిరంగ ప్రదేశములో విసర్జించ కూడదు. దూరంగా చాటుగా చేయాలి. మలమూత్ర విసర్జన తరువాత నురగలేని మంచి నీటితో ఆచమనం చేయాలి. ఆచమనం చేసిన తరువాత నోటిని తుడుచుకోవాలి. తలమీద నీళ్ళు చల్లుకోవాలి. తరువాత శుభ్రమైన నీటితో కళ్ళు, ముక్కు, చెవులు, భుజములు, గుండెలు, బొడ్డు తుడుచుకోవాలి. తలమీద నీళ్ళతో తుడుచుకోవాలి. ఆచమనం చేసేటప్పుడు తూర్పుముఖంగా గాని, ఉత్తరముఖంగా కాని కూర్చోవాలి. ఇలా చేసిన ఋగ్యజుర్సామ వేదములు సంతోషిస్తాయి. నీటితో ఆచమనం చేసిన అధర్వణవేదం సంతోషిస్తుంది. అలా ధర్మశాస్త్రములు, ఇతిహాసములు, పురాణములు సంతోషిస్తాయి. కాళ్ళు కడగడం వలన పుండరీకాక్షుడు సంతోషిస్తాడు. నీటితో కళ్ళు తుడుచుకుంటే సూర్యుడు సంతోషిస్తాడు. ఇది ఆచమనవిధి. ఈ ఆచనమును ప్రతి ఒక్కరు వస్త్రములు మార్చుకొనినప్పుడు, జంధ్యమును మార్చుకొనినప్పుడు, అన్న పానముల వేళలందు చేయాలి. అన్నము తిన్న తరువాత ఆహారపు ముక్కలు పళ్ళ మధ్య ఇరుక్కుంటాయి కనుక మూడు మార్లు పుక్కిలించి ఆ నీటిని ఉమ్మి వేసి ఆ తరువాత ఆచమనం చేయాలి. ఈ ఆచమనం అన్ని వర్గముల వారు చేయాలి.
*రేపు *
*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*
*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*
⚜ శ్రీ తిరుక్కల్లిల్ శివానందేశ్వరర్ ఆలయం
🕉 మన గుడి : నెం 1382
⚜ తమిళనాడు : తిరుక్కండలం
⚜ శ్రీ తిరుక్కల్లిల్ శివానందేశ్వరర్ ఆలయం
💠 భారతదేశంలోని తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లాలో తిరుక్కల్లిల్ ( ప్రస్తుతం తిరుక్కండలం అని పిలుస్తారు ) వద్ద ఉన్న ఒక హిందూ దేవాలయం . అధిష్టానం శివుడు .
ఆయనను శివానందేశ్వర్ అని పిలుస్తారు.
అతని భార్యను ఆనందవల్లి అమ్మాయ్ అని పిలుస్తారు.
💠 ఇక్కడ శివుడు కల్లి చెట్ల మధ్యలో ఉన్నాడు కాబట్టి ఈ ప్రదేశానికి తిరుకల్లిల్ అని పేరు వచ్చింది మరియు శివుడిని తిరుకల్లీశ్వరర్ అని పిలుస్తారు.
⚜ స్థల పురాణం
💠 బ్రుగుడు అనే మహర్షి శివుడిని మాత్రమే పూజించే అలవాటు ఉంది. ఆయన కైలాస పర్వతానికి వెళ్లి భగవంతుడిని పూజించాడు.
ఆ సమయానికి భగవంతుడు పార్వతితో ఉన్నాడు.
💠 ఆ మహర్షి తల్లిని పట్టించుకోకుండా భగవంతుడిని పూజించాడు, అది ఆమెను బాధించింది.
తల్లి భగవంతుడిని పూజించేలా చేయడానికి భగవంతుడికి చాలా దగ్గరగా కూర్చుంది.
కానీ ఆ మహర్షి ఈగ రూపాన్ని ధరించి శివుడిని మాత్రమే చుట్టుముటాడు.
💠 శివుడు మరియు శక్తి ఒక్కటే అని మహర్షికి పాఠం నేర్పడానికి, భగవంతుడు అర్థనారీశ్వర రూపంలో దర్శనం ఇచ్చాడు - సగం పురుషుడు మరియు సగం స్త్రీ. అయినప్పటికీ, ఆ మహర్షి ఇప్పటికీ శివుడు మాత్రమే సర్వోన్నతుడు అని భావించాడు.
💠 ఆ మహర్షి తీర్థయాత్రకు భూమికి దిగి వచ్చి ఈ ప్రదేశానికి చేరుకున్నాడు.
అగస్త్య మహర్షి ఒకసారి పూజించిన శివలింగాన్ని కల్లి పూలతో పూజించాడు.
శివుడు మరియు శక్తి విడదీయరానివారని మరియు ఒక శక్తి మాత్రమే పనిచేయలేరని శివుడు మహర్షికి చెప్పాడు.
💠 పరమాత్మ తల్లిని తన ఒడిలో ఉంచుకున్నాడు.
మహర్షి సత్యాన్ని అర్థం చేసుకున్నాడు.
తన మూర్ఖత్వానికి అంబికను క్షమించమని మహర్షి వేడుకున్నాడు. మహర్షి ప్రార్థనకు చాలా ఆహ్లాదకరంగా, తల్లి తాను ఎల్లప్పుడూ ఆనంద స్థితిలో ఉంటానని చెప్పింది.
అందుకే, ఆనందాన్ని ప్రసాదించే తల్లిని ఆనందవల్లి అని పిలుస్తారు.
💠 బ్రుగు మహర్షి కల్లి పువ్వులతో స్వామిని పూజించినందున, ఆయనకు తిరుకల్లీశ్వరర్ మరియు తిరుకల్లిల్ అని కూడా పేరు పెట్టారు.
💠 శివుడు మరియు తల్లి పార్వతి వివాహాన్ని చూడటానికి గుమిగూడిన జనసమూహం బరువు కారణంగా ఉత్తర భూమి లోతుగా పడిపోయింది.
శివుడు అగస్త్య మహర్షిని దక్షిణం వైపు వెళ్లి భూమిని సమానంగా సమతుల్యం చేయడానికి కోరాడు. అగస్త్య మహర్షి తాను కోరిన ఏ ప్రదేశంలోనైనా వివాహ దర్శనం ఇవ్వమని భగవంతుడిని వేడుకున్నాడు.
💠 ఆ మహర్షి కలలో భగవంతుడు కనిపించి ఈ ప్రదేశాన్ని చూపించాడు. శివుడు తన వివాహ దర్శనాన్ని మాత్రమే కాకుండా మురుగన్ తో పాటు సోమస్కంద దర్శనాన్ని కూడా ప్రసాదించాడు.
ఈ దర్శనం భక్తులందరికీ ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని అగస్త్య మహర్షిని ప్రార్థించాడు.
అగస్త్య మహర్షికి వరం ఇచ్చి, శివుడు ఇక్కడి నుండి స్వయంబు లింగంగా శివ నందీ ఈశ్వరుడు అనే పేరును స్వీకరించాడు.
💠 ఆలయంలో శివుడు 'శక్తి దక్షిణామూర్తి'గా ప్రత్యేక మందిరంలో కనిపిస్తాడు.
అతను అమృతకుండ మరియు తాటి ఆకులను ఎడమ చేతుల్లో పట్టుకుని తల్లిని ఆలింగనం చేసుకుంటున్నాడు.
💠 గర్భగుడి పైన ఉన్న విమాన-గోపురం గజబృష్ట విమానమని పిలుస్తారు.
💠 అమ్మవారి ఎడమ చేయి తన పాదాలను చూపుతుండగా, కుడి చేయి భక్తులకు అన్ని శ్రేయస్సులను అందిస్తుంది.
స్వామి మరియు తల్లి మందిరాలలో ఎప్పుడూ ఆరిపోని దీపం వెలుగుతూ ఉంటుంది.
💠 బాలసుబ్రహ్మణ్య స్వామి ఆలయం స్వామి మరియు తల్లి ఆలయం మధ్య ఉంది, ఎందుకంటే ఆయన అగస్త్య మహర్షికి దర్శనం ఇచ్చాడు.
దీనిని సోమస్కంద రూపం అంటారు.
💠 బాలసుబ్రహ్మణ్యస్వామి కుడి చేతిలో జపమాల పట్టుకుని, ఎడమ చేతిలో తీర్థ కలశం - నీటి కుండ - బ్రహ్మ లక్షణాలతో ఉన్నారు.
💠 వినాయకుడిని సుందర వినాయకుడిగా స్తుతిస్తారు. వినాయక మందిరం దగ్గర కాళహస్తీశ్వరుడికి ఆలయం ఉంది. సుందర వినాయకుడు మరియు శ్రీ ఆంజనేయుడు ప్రాకారంలో ఉండగా, నాగ దేవతలు చెట్టు కింద ఉన్నాయి.
💠 తమ వస్తువులను కోల్పోయిన వారు వాటిని తిరిగి పొందాలనే ఆశతో మిరపకాయ పొడితో భైరవుడికి అభిషేకం చేస్తారు మరియు తిరిగి పొందిన తర్వాత పాలతో అభిషేకం చేస్తారు.
💠 నవంబర్-డిసెంబర్లలో తిరుకార్తికై, ఫిబ్రవరి-మార్చిలో మహాశివరాత్రి, అక్టోబర్-నవంబర్లలో స్కంద షష్ఠి, వినాయక చతుర్థి, నవరాత్రి, ఐప్పసి మాసంలో పౌర్ణమి (అన్నాభిషేకం), తైపూసం మరియు డిసెంబర్-జనవరిలో మార్గశిర తిరువధిరై ఈ ఆలయ ఉత్సవాలు.
💠 బ్రుగఋషి ప్రకారం గురువారం ఇక్కడ శక్తి దక్షిణామూర్తిని కల్లి పూలతో పూజించే వారి ఆకలి, దారిద్య్రం తొలగిపోయి, గొప్ప జ్ఞానం, సంపదను పొంది, కోరికలు నెరవేరుతాయి.
💠 ఏదో ఒక కారణం చేత విడిపోయిన జంటలు తిరిగి కలవడానికి కల్లి పూలతో అర్చనలు చేస్తారు.
వివాహ ప్రతిపాదనలలో అడ్డంకులు తొలగిపోవడానికి, పేదరికం నుండి విముక్తి పొందటానికి మరియు కుటుంబ శ్రేయస్సు కోసం కూడా ప్రజలు ప్రార్థిస్తారు.
భక్తులు శివుడు, తల్లి అనంతవల్లి మరియు దక్షిణామూర్తికి వస్త్రాలు సమర్పిస్తూ అభిషేకం చేస్తారు.
రచన
©️ Santosh Kumar
25 ఆరోగ్య రహస్యాలు
*దీర్ఘకాలం వ్యాధులు లేకుండా జీవించిన మహానుభావుల 25 ఆరోగ్య రహస్యాలు*
➖➖➖✍️
*1. తక్కువ తినాలి, ఎక్కువ పని చేయాలి.*
*Eat less, move more.*
*2. నిద్ర పది గంటల (10pm)లోపే పడుకోవాలి.*
*Sleep before 10 PM.*
*3. ఉదయాన్నే లేచి నడవడం ఆరోగ్య రహస్యం.*
*Early morning walk brings longevity.*
*4. ఎక్కువగా గాలి వచ్చేటట్టు శ్వాస తీసుకోవాలి.*
*Breathe deeply and consciously.*
*5. రోజూ ఓ పండు, ఓ ఆకుకూర తినాలి.*
*Eat one fruit and one leafy green a day.*
*6. నీరు పుష్కలంగా తాగాలి – కానీ క్రమపద్ధతిలో.*
*Hydrate well, in regular intervals.*
*7. ప్రతిరోజూ అల్పాహారం తప్పక తినాలి.*
*Never skip breakfast.*
*8. మూడింటి భోజనం మధ్య గ్యాప్ ఉండాలి.*
*Maintain a gap between major meals.*
*9. తినేటప్పుడు మాట్లాడకూడదు – శాంతంగా నమలాలి.*
*Eat quietly, chew well.*
*10. శారీరక శ్రమ అవసరం –.*
*Physical work is essential for the body.*
*11. ఒత్తిడిని వదిలించుకోవడం ఒక కళ – నేర్చుకోండి.*
*Stress management is a daily art.*
*12. రోజూ కనీసం 5 నిమిషాల మౌనం పాటించండి.*
*Practice silence at least 5 minutes a day.*
*13. సేద్యం చేసే పని తప్పక ఉండాలి – తోటపని, కట్టెల నరకడం వంటివి.*
*Do one manual task daily.*
*14. భోజనానికి ముందు చేతులు, ముఖం కడగాలి.*
*Clean hands and face before meals.*
*15. మాంసాహారానికి తక్కువగా ప్రాధాన్యత ఉండాలి.*
*Limit non-veg foods.*
*16. రోజూ నవ్వండి – ఆనందాన్ని పంచండి.*
*Laugh daily, share joy.*
*17. ఇతరులను దీవించండి – శాపాలు, కోపాలు దూరంగా పెట్టండి.*
*Bless others, avoid anger.*
*18. మీకు నచ్చిన పని చేయండి – అది జీవశక్తిని పెంచుతుంది.*
*Do what you love – it heals you.*
*19. వాస్తవానికి అబద్ధం చెప్పవద్దు – మానసిక ప్రశాంతత కోల్పోతారు.*
*Be truthful for inner peace.*
*20. ప్రకృతి మద్దతుతో జీవించండి – భూమి మీద నడవండి, చెట్లతో మమేకం కావాలి.*
*Live in harmony with nature.*
*21. రోజుకు కనీసం ఒక మంచి పుస్తకం పేజీ చదవండి.*
*Read at least one page of a good book daily.*
*22. ప్రాణాయామం, ధ్యానం లేకపోతే ఆరోగ్య జీవితం అసంపూర్తి.*
*No health is complete without breathing & meditation.*
*23. ఒంటరిగా కాకుండా మానవ సంబంధాలతో బంధం పెంచుకోండి.*
*Build meaningful relationships.*
*24. ప్రతి రోజూ నేలపై పడుకుని నిద్రించకపోయినా, నేల మీద కనీసం కూర్చోవాలి.*
*Stay grounded – literally and emotionally.*
*25. చివరికి… ప్రతి శ్వాసకు కృతజ్ఞతతో జీవించండి.*
*Live every breath with gratitude.*✍️
-సేకరణ
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🌷🙏🌷```
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏
🍀🌺🍀🌺🍀🕉️🍀🌺🍀🌺🍀
*రేపటి తరానికి బతుకు, భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి.
➖▪️➖
నక్షత్రం: పుబ్బ / పూర్వఫల్గుణి* (
82f9;
🍀🌺🍀🌺🍀🕉️🍀🌺🍀🌺🍀
*నక్షత్ర స్తోత్ర మాలిక*
➖➖➖✍️
11 వ రోజు
*నక్షత్రం: పుబ్బ / పూర్వఫల్గుణి* (Pubba / Purva Phalguni)
అధిపతి: శుక్రుడు (Shukra)
*ఆరాధించాల్సిన దైవం:* మహాలక్ష్మి / భగుడు
పుబ్బ నక్షత్ర జాతకులు మరియు ఆర్థిక ఇబ్బందుల నుండి విముక్తి కోరుకునే వారు, ఐశ్వర్య ప్రాప్తి కోసం పఠించాల్సిన శక్తివంతమైన స్తోత్రం:
🙏 శ్రీ కనకధారా స్తోత్రం 🙏
*వందే వందారు మందార మిందిరా నందకందళమ్।*
*అమందానంద సందోహ బంధురం సింధురకన్యకామ్॥1॥*
*అంగం హరేః పులకభూషణ మాశ్రయంతీ*
*భృంగాంగనేవ ముకుళాభరణం తమాలమ్।*
*అంగీకృతాఖిల విభూతి రపాంగలీలా*
*మాంగళ్యదాస్తు మమ మంగళదేవతాయాః ॥ 2 ॥*
*ముగ్ధా ముహుర్విదధతీ వదనే మురారేః*
*ప్రేమత్రపా ప్రణిహితాని గతాగతాని ।*
*మాలా దృశోర్మధుకరీవ మహోత్పలే యా*
*సా మే శ్రియం దిశతు సాగర సంభవాయాః ॥ 3 ॥*
*విశ్వామరేంద్ర పదవిభ్రమ దానదక్షం*
*ఆనంద హేతు రధికం మురవిద్విషోఽపి।*
*ఈషన్నిషీదతు మయి క్షణమీక్షణార్ధం*
*ఇందీవరోదర సహోదర మిందిరాయాః॥ 4 ॥*
*దద్యాద్దయానుపవనో ద్రవిణాంబుధారాం*
*అస్మిన్న కించన విహంగ శిశౌ విషణ్ణే ।*
*దుష్కర్మఘర్మ మపనీయ చిరాయ దూరం*
*నారాయణ ప్రణయినీ నయనారువాహః||5॥*
*సంపత్కరాణి సకలేంద్రియ నందనాని*
*సామ్రాజ్యదాన విభవాని సరోరుహాక్షి ।*
*త్వద్వందనాని దురితాహరణోద్యతాని*
*మామేవ మాతరనిశం కలయంతు నాన్యే ॥ 6 ॥*
*కమలే కమలాక్షవల్లభే త్వం కరుణాపూర తరంగితైరపాంగైః।*
*అవలోకయ మామకించనం ప్రథమం పాత్రమకృత్రిమం దయాయాః ॥ 7 ॥*
*స్తువంతి యే స్తుతిభిరమీభిరన్వహం*
*త్రయీమయీం త్రిభువనమాతరం రమామ్ ।*
*గుణాధికా గురుతరభాగ్యభాగినో భవంతీ తే భువి బుధభావితాశయాః॥8॥*
॥ ఇతి శ్రీమచ్ఛంకరాచార్య విరచిత శ్రీ కనకధారా స్తోత్రం సంపూర్ణమ్ ॥
*విశేషం:*
పుబ్బ నక్షత్రం రోజున ఈ స్తోత్రాన్ని పఠించి, లక్ష్మీదేవికి పాయసం లేదా తీపి పదార్థం నైవేద్యంగా సమర్పిస్తే విశేష ఫలితం ఉంటుంది.✍️```
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🌷🙏🌷```
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏
🍀🌺🍀🌺🍀🕉️🍀🌺🍀🌺🍀
*రేపటి తరానికి బతుకు, భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి.
➖▪️➖
సుభాషితమ్
🍀🌅 *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🍀
🪔 ॐ卐 *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎
శ్లో𝕝𝕝 *కాకో ఆహ్వయతే కాకాన్*
*యాచకో న తు యాచకాన్* l
*కాకయాచకయోర్మధ్యే*
*వరం కాకో న యాచకః* ॥
తా𝕝𝕝 *కాకి తనకు మెతుకులు దొరికినంతనే తాను తినక కావు కావు మని మిగిలిన కాకులను పిలిచి వాటితో ఆ మెతుకులనూ పంచుకుంటుంది*.
*కాని యాచకుడు తనకు భిక్ష లభించించుచున్ననూ మరొక యాచకుడిని పిలవడు. వచ్చిననూ సహించడు*.
✍🌹💐🌸🙏
--------------------------
🌻🌹🌿🌴🥀🍀🌹🍁🌻🏵️🍂🪷🌴🌻
ఓమ్,
*భద్రం కర్డేభిశ్శృణుయామ దేవాః* ।
*భద్రం పశ్యేమాక్షభిర్య జత్రాః* |
*స్థిరైరంగైస్తుష్టువాంసస్తనూభిః* |
*వ్యశేమ దేవహితం యదాయుః* |
*స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః* |
*స్వస్తి నః పూషా విశ్వవేదాః* |
*స్వస్తినస్తార్డ్యో అరిష్టనేమిః* |
*స్వస్తి నో బృహస్పతిర్దధాతు* |
*ఓం శాంతిశ్శాంతిశ్శాంతిః* ।
*ఓ దేవతలారా! చెవులతో కల్యాణమును వినెదము 2గాక! యజ్ఞమును చేయువానిని పాలించే ఓ దేవతలారా! యజ్ఞమునందు సమర్థులమై కళ్లతో కల్యాణమును చూచెదము గాక! స్తోత్రము చేస్తున్న మేము స్థిరమైన అవయవములతో, శరీరములతో దేవతలకు హితకరమైన (హవిస్సులను సమర్పిస్తూ ఉండే) ఆయుర్దాయమును పొందెదము గాక! గొప్ప ప్రాచీనమైన కీర్తి గల ఇంద్రుడు మా కొరకు కల్యాణమును చేయుగాక! సర్వసంపదలు గలవాడు, సర్వము దెలిసినవాడు అగు పూష (సూర్యుడు) మా కొరకు కల్యాణమును చేయుగాక! దారికి అడ్డు వచ్చినవాటిని నశింపజేసే చక్రము వలె, అమంగళమును నశింపజేసే గరుత్మంతుడు, కశ్యపుని పుత్రుడు, మా కొరకు కల్యాణమును చేయుగాక! బృహస్పతి (వాక్కులకు ప్రభువు) మా కొరకు కల్యాణమును చేయుగాక!*
*దేహాదుల తాపములు శాంతించుగాక! పంచభూతములనుండి తలయెత్తే తాపములు శాంతించుగాక! దేవతలు కలిగించే తాపములు శాంతించుగాక!*
🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
*సూర్య ఆరోగ్య స్తోత్రము*
*బ్రహ్మోవాచ :-*
శ్లో॥ *నమః సూర్యాయ నిత్యాయ రవయే కార్యభానవే భాస్కరాయ మతంగాయ మార్తాండాయ వివస్వతే* ॥
*నమో గోపతయే నిత్యం దివాం చ పతయే నమః* ॥
*ఆదిత్యా యాదిదేవాయ నమస్తే రశ్మి మాలినే*
*దివాకరాయ దీప్తాయ అగ్నయే మిహిరాయ చ*॥
*నమో ధాత్రే విధాత్రే చ అర్యమ్ణే పరుణాయ చ*
*పూషే భగాయ మిత్రాయ పర్ణన్యాయాంశవే నమః*॥
*నమోహిత కృతే నిత్యం ధర్మాయ తపనాయ చ*
*హరయే హరితశ్వాయ విశ్వస్య పతయే సమః* ||
*విష్ణవే బ్రహ్మణే నిత్యం త్రయంబకాయ తథాత్మనే*
*నమస్తే సప్తలోకేశ నమస్తే సప్త సప్తయే* ॥
*ఏక స్మైహి నమస్తుభ్య మేక చక్ర రథాయ చ*
*జ్యోతిషాం పతయే నిత్యం సర్వ ప్రాణ భృతే నమః* ||
*హితాయ సర్వ భూతానాం శివాయార్తి హరాయ చ*
*నమః పద్మ ప్రబోధాయ నమో వేదాది మూర్తయే* ॥
*కాధిజాయ నమస్తుభ్యం నమస్తారా సుతాయ చ*
*భీమజాయ నమస్తుభ్యం పావకాయ చ వై నమః* ॥
*ధిషణాయ నమో నిత్యం నమః కృష్ణాయనితదా*
*నమోz స్త్వదితి పుత్రాయ నమో లక్ష్యాయ నిత్యశ* ॥
*ఏతా న్యాదిత్య నామాని మయా ప్రోక్తాని వైపురా*
*ఆరాధనాయ దేపస్య సర్వ కామే వ సుప్రత* ॥
!! *సూర్య ఆరోగ్య స్తోత్రం సంపూర్ణం* !!
🌿🌴🥀🍀🌹🍁🌻🏵️🍂🪷
08-02-2026 ఆదివారం రాశి ఫలితాలు
08-02-2026 ఆదివారం రాశి ఫలితాలు
మేషం
నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. గృహనిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. వృత్తి ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. ఖర్చుల విషయంలో కొంత ఆచితూచి వ్యవహరించాలి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.
---------------------------------------
వృషభం
ఆప్తుల నుండి సహాయ సహకారాలు అందుతాయి. కుటుంబ సభ్యులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ముఖ్యమైన వ్యవహారాల్లో జాప్యం జరిగిన నిదానంగా పూర్తిచేస్తారు. వృత్తి ఉద్యోగాలలో మరింత పురోగతి పెరుగుతుంది నిరుద్యోగులు అనుకూల వాతావరణం ఉంటుంది.
---------------------------------------
మిధునం
ముఖ్యమైన వ్యవహారాల్లో ఆశించిన విజయం సాధిస్తారు. సోదరుల నుండి కీలక సమాచారం అందుతుంది. దీర్ఘకాలిక ఋణాలు తీరి ఊరట పొందుతారు. వృత్తి ఉద్యోగాలలో మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది.
---------------------------------------
కర్కాటకం
చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో ఇతరులతో సమస్యలు ఏర్పడతాయి. సోదరులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. కుటుంబ సభ్యుల మాటలు కొంత బాధ కలిగిస్తాయి. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది.
---------------------------------------
సింహం
చిన్ననాటి మిత్రుల నుండి ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలలో పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. భూ సంబంధిత క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. బంధుమిత్రులతో శుభకార్యాలలో పాల్గొంటారు. నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూల ఫలితాన్ని ఇస్తాయి.
---------------------------------------
కన్య
వృత్తి వ్యాపారాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు. మిత్రులతో వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. వివాదాలకు సంబంధించిన కీలక సమాచారం సన్నిహితుల నుండి అందుతుంది. గృహ వాతావరణం సందడిగా ఉంటుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగస్తులు ఉన్నత పదవులు పొందుతారు.
---------------------------------------
తుల
చాలా కాలంగా వేధిస్తున్న సమస్యల నుండి కొంత ఉపశమనం పొందుతారు. గృహమున శుభకార్యాల ప్రస్తావన వస్తుంది. ఆధ్యాత్మిక చింతన వలన మానసిక ప్రశాంతత లభిస్తుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. వృత్తి ఉద్యోగాలలో అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు.
---------------------------------------
వృశ్చికం
ఆరోగ్య విషయాలలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. వృత్తి వ్యాపారాలలో శారీరక శ్రమ పెరుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో మిత్రుల సహాయ సహకారాలు సలహాలు తీసుకోవడం మంచిది. ఉద్యోగ విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకొని ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది.
---------------------------------------
ధనస్సు
ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు నిర్వహించి ప్రశంసలు అందుకుంటారు. సోదరుల నుండి స్థిరాస్తి లాభం పొందుతారు దూర ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో మీ శ్రమకు విశేషమైన గుర్తింపు లభిస్తుంది.
---------------------------------------
మకరం
వ్యాపారాలలో కష్టానికి తగిన లాభాలు అందుకుంటారు. గృహ నిర్మాణం పనులు మందకొడిగా సాగుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఇతరులు వ్యవహారాల్లో తలదూర్చడం మంచిది కాదు. వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి పెరుగుతుంది. ఆర్థికంగా అంతంత మాత్రంగా సాగుతుంది.
---------------------------------------
కుంభం
అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందుతారు. చేపట్టిన పనుల్లో శ్రమ కలిగిన సకాలంలో పూర్తి చేస్తారు. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో అదనపు పని ఒత్తిడి నుండి ఉపశమనం లభిస్తుంది. వ్యాపారపరంగా నూతన నిర్ణయాలు తీసుకుని లాభాలు అందుకుంటారు.
---------------------------------------
మీనం
ఇతరులపై మీ అభిప్రాయం మార్చుకోవడం మంచిది. ఉద్యోగ విషయమై వారి సహకారంతో పనులు త్వరితగతిన పూర్తి చేస్తారు. చేపట్టిన పనులలో కుటుంబ సభ్యుల నుండి సహాయ సహకారాలు అందుతాయి. పాత మిత్రులతో విలువైన సమయాన్ని గడుపుతారు. ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది.
---------------------------------------
స్త్రీ తైల మథు
శ్లో || స్త్రీ తైల మథు మాంసాని యే త్యజంతి రవేర్దినే|
న శోక దుఃఖ దారిద్ర్యం సూర్యలోకం స గచ్ఛతి|| 👏👏👏
*శ్రీ హరి స్తుతి 122*
*శ్రీ హరి స్తుతి 122*
*కం. రండో మానవులారా*
*గుండెల యందును నిలుపుకొని కోరికలడుగన్*
*కొండల యందున వెలసెను*
*నిండుగ యాశలను మనకు నిచ్చుట కొరకై*
*శ్రీ హరి స్తుతి 121*
*కం. భిన్నం బగు యాశలతో*
*నున్నారీ భక్తజనులు నుత్సాహముతో*
*ఎన్నో రీతుల కోర్కెలు*
*సున్నితముగ తీర్చుచుండు సుందర వదనా*
సిరిగలవానికెల్లపుడు
ఉ॥ సిరిగలవానికెల్లపుడు సేవలు చేయగఁ జూతురందరున్, అరయరువానివర్తనము, నాప్తుడటంచును జెప్పుచుందు, రా సిరిదిగిజారిపోవనిక చేయునదేమియులేక, యార్తితోఁ గరములుసాచివానిగని కావగరారొకరైన ఈశ్వరా !
చ|| కొడుకులుగల్గరంచు మదిఁగుందెదరేలకొ మూఢమానవుల్, కొడుకులు గల్గినంతనిక కోరిన సౌఖ్యములబ్బునే భువిన్ ? కొడుకులు నూర్గురుండియును క్రుంగికృశించడె యంధరాజు, ఆ కొడుకులికేల? నాకు మదిఁ గోరిన మోక్షమొసంగు మీశ్వరా! 21
చ|| చనితిననేక యాత్రలకు స్వాంతమునందున భక్తిమీరగన్,మునిగితి పెక్కు తీర్ధముల ముక్తిలభించు నటంచునెంచి, నేఁ గనుగొన లేకపోయితినిగామితదాయక ! మోక్షమార్గమున్, నినునికనాశ్రయించితిని నేరములెంచక గావుమీశ్వరా ! 22
చ|| అరయను వేదశాస్త్రముల, నారయలేదిలమంత్ర తంత్రముల్ఎరగనుసాంఖ్యయోగముల, నింతయెఱుంగను భక్తితత్వమున్ ఎఱుగక యింతకాలమును నెంతొమనంబునఁ గుందియింకనీచరణములాశ్రయించితిని
యోగులందరిలో
శ్రీల ప్రభుపాద ఉవాచ!
🌿🌷🌿🌷🌿🌷🌿🌷🌿🌷🌿🌷🌿🌷🌿
యోగినామపి సర్వేషాం
మద్గతేనాంతరాత్మనా ।
శ్రద్ధావాన్ భజతే యో మాం
స మే యుక్తతమో మతః ।।
మరియు యోగులందరిలో, ఎల్లప్పుడూ నాలో నిలిచివుండే గొప్ప విశ్వాసం ఉన్నవాడు, తనలో నన్ను గురించి ధ్యానిస్తూ, నాకు అతీంద్రియమైన ప్రేమతో సేవ చేసేవాడు - అతను యోగంలో నాతో అత్యంత సన్నిహితంగా ఐక్యమై అందరికంటే ఉన్నతమైనవాడు.
అది నా అభిప్రాయం.
భక్తి-యోగ మార్గంలో వేద సూచనల ప్రకారం కృష్ణ చైతన్యంలో మంచి స్థితిని పొందడం గొప్ప అదృష్టం.
ఆదర్శ యోగి తన దృష్టిని కృష్ణునిపై కేంద్రీకరిస్తాడు, అతను శ్యమసుందర అని పిలువబడ్డాడు, అతను మేఘం వలె అందమైన రంగులో ఉన్నాడు, ఆతని కమలంలాంటి ముఖం సూర్యుడిలా ప్రకాశవంతంగా ఉంటుంది, ఆతని దుస్తులు రత్నాలతో ప్రకాశవంతంగా మరియు అతని శరీరం పుష్పమాలలతో అలంక్రితమై ఉంటుంది.
ఆతని శరీరం నుండి అన్ని వైపులా ప్రకాశించే బ్రహ్మాండమైన మెరుపు, దీనిని బ్రహ్మజ్యోతి అని పిలుస్తారు.
అతను రాముడు, నృసింహుడు, వరాహుడు మరియు కృష్ణుడు వంటి వివిధ రూపాలలో అవతరించాడు, దేవాది దేవుడైన భగవంతుడు, అతను మానవుని వలె, తల్లి యశోద యొక్క కుమారునిగా అవతరిస్తాడు మరియు ఆయన కృష్ణ, గోవింద మరియు వాసుదేవ అని పిలువబడ్డాడు.
అతను ఒక పరిపూర్ణమైన శిశువు, భర్త, స్నేహితుడు మరియు యజమాని, మరియు అతను అన్ని ఐశ్వర్యలు మరియు అతీంద్రియ లక్షణాలతో నిండి ఉన్నాడు.
భగవంతుని యొక్క ఈ లక్షణాల గురించి ఎవరైనా పూర్తిగా స్పృహలో ఉంటే, అతన్ని అత్యున్నత యోగి అని అంటారు.
(భగవద్గీత అధ్యాయం.6
వచనం.47)
హరే కృష్ణ
ఎల్లప్పుడూ మీ శ్రేయోభిలాషి
క్రాంతి కిరణాలు*
*శ్రీ కిరణం*
*బాధ్యత ఎంతటి బరువునైనా ఆనందంగా మోయిస్తుంది*
*క్రాంతి కిరణాలు*
*పరువును కాపాడు కొనగ*
*బరువైనను మోయుచుండు బాధ్యత లున్నన్*
*జరిగే కార్యము తలచుచు*
*పరుగులు పెట్టును తలపులు పరి పరివిధముల్*
*పద్య కవితా శిల్పకళానిధి. మఱ్ఱిపల్లి శ్రీధరాచార్యులు మిట్టాపల్లి*
నరసింహ శతకంలోని 71వ పద్యం
*ఓం శ్రీ లక్ష్మీ నరసింహాయ నమః*
🙏🙏🙏
తేదీ 06/02/2026 శుక్రవారం ధర్మపురి శేషప్ప (కాకుస్థం శేషాచలదాసు) విరచితం నరసింహ శతకంలోని 71వ పద్యం పారాయణం చేద్దాం.
సీ. ప్రహ్లాదుఁడేపాటి పైడికానుకలిచ్చె?
మదగజంబెన్నిచ్చె మౌక్తికములు?
నారదుండెన్నిచ్చె నగలు రత్నంబుల
హల్యనీకే యగ్రహారమిచ్చె?
ఉడుతనీకేపాటి యూడిగంబులు చేసె?
ఘన విభీషణుడేమి కట్నమిచ్చె?
పంచపాండవులేమి లంచమిచ్చిరి నీకు?
ద్రౌపది నీకెంత ద్రవ్యమిచ్చె?
తే. నీకు వీరందఱయినట్లు నేను గాన?
యెందుకని నన్ను రక్షింపవిందువదన!
భూషణవికాస! శ్రీధర్మపురనివాస!
దుష్టసంహార! నరసింహ! దురితదూర!
భావం:- ఓ నరసింహా! ప్రహ్లాదుడు నీకు ఎన్ని బంగారు కానుకలు ఇచ్చాడు? మదపుటేనుగు ఎన్ని ముత్యాలు ఇచ్చింది? నారదుడు నగలు, రత్నాలు ఎన్ని ఇచ్చాడు? అహల్య నీకు ఏ అగ్రహారం ఇచ్చింది? ఉడుత నీకు ఏ పాటి సేవలు చేసింది? ఘనుడైన విభీషణుడు ఏమి కట్నం ఇచ్చాడు? పంచ పాండవులు ఏమి లంచం ఇచ్చారు? ద్రౌపది నీకు ఎంత ద్రవ్యం ఇచ్చింది? వీరందరి లాగా నేను కాదా? నన్ను ఎందుకు రక్షింపవు? ఓఇందువదనుడా! అంటూ విష్ణువు అభిమానం సంపాదించిన వారందరినీ చూపుతూ, తాను వారిలాగా కాదా? అని ప్రశ్నించడం శేషప్పకే చెల్లుతుంది!
సైనసైటిసంటు
సైనసైటిసంటు సర్జరీల్ జేసినా
తీరబోదు బాధ తిరిగి వచ్చు
సైనసైటిసుంటె సరియౌను హోమ్యోతొ
సకురు అప్ప రావు సత్య మిదిర!
భావం: ముక్కుకు ఇరువైపులా మరియు కళ్ళ కనుబొమ్మల మధ్య నుదుటి ప్రాంతంలోనూ ఉండే సైనస్ లు ముక్కు నాళాలతో అనుసంధానమై అనునిత్యం పీల్చే గాలి కొంతవరకూ వాటిలోకి ప్రవేశిస్తూ, వస్తూ, కఫాలంలోని వాతావరణాన్ని, టెంపరేచర్ నీ బయటి వాతావరణానికి అనుగుణంగా సరి చేస్తూ ఉంటాయి! జలుబు ముదిరినప్పుడు వీటిలో ఇన్ఫెక్షన్ చేసి, తీవ్రమైన పార్శ్వ తలనొప్పులుగా బాధిస్తూ, ముక్కునుంచి పచ్చని చీముడు కూడా కారవచ్చు! దీనికి ఇంగ్లీష్ వైద్యంలో తీవ్రమైన ఏంటీబయోటిక్స్, పెయిన్ కిల్లర్స్, స్టెరాయిడ్స్ వాడిపించడంతో బాగా ముదరబెట్టి, చివరకు అనేకసార్లు ఆపరేషన్ల పేరుతో వాటిని క్లీన్ చేసినా, మళ్ళీ మళ్ళీ ఇన్ఫెక్షన్లు వ్యాపిస్తూ, తలనొప్పి జీవితకాలం విడవకుండా వేధిస్తూనే ఉంటుంది! దీనికి సవ్యమైన ట్రీట్మెంట్ హోమియో మరియు యోగాలో మాత్రమే ఉంది! ఇది మాత్రమే కాదు భూమి మీద ఏ రకమైన తలనొప్పులైనా,మేగ్రేన్ తలనొప్పి అయినా హోమియోనే కరెక్ట్! అలా కాదని ఎక్కడికి వెళ్ళినా, జీవితాంతం సైనసైటిస్ తో, తలనొప్పులతో బాధలు పడుతూ, ఆపరేషన్లతో, సైడ్ ఎఫెక్ట్స్ తో తిప్పలు పడాల్సిందే, కర్మ ఫలితం అనుభవించాల్సిందే! ఎవరికి జాతకంలో మంచి రోజులు వస్తాయో, వాళ్ళు మాత్రమే హోమియోకి వెళ్తారు!
సకురు అప్పారావూ ఇది నిజంగా నిజం!
ఈ ఆటవెలది పద్యాల శతక కవి: హోమియో వైద్యులు సకురు అప్పారావు గారు, 9848025870
(ఎంతటి కఠినమైన, అసాధ్యమైన వ్యాధులకైనా దేశంలో ఎంతటి మారుమూల గ్రామంలో ఉన్న వారికైనా, ఇంటి వద్దకే మందులు పంపుతూ, అనునిత్యం ఫోన్ ద్వారా టచ్ లో ఉంటూ, క్షణక్షణం సూచనలిస్తూ, అనేక మంది వ్యాధులను నివారణ చేస్తున్నవారు! అలాగే కుటుంబ సభ్యులలో ఎవరికి ఎటువంటి ఎమర్జెన్సీ మరియు ప్రాణాపాయ ఆపద కలిగినా, ఎవరికి వారే వైద్యం చేసుకుని, ఇంటిలోని అందరినీ కాపాడుకోగలిగే సర్వరోగ నివారిణి లాంటి అమృతాన్ని కనిపెట్టి, "సకురు అప్పారావు గారి 1,2,3 ఫార్ములా ఫామిలీ కిట్" అనే పేరుతో ప్రజలకు అందిస్తున్నవారు!)
*శ్రీ హరి స్తుతి 119*
*శ్రీ హరి స్తుతి 119*
*ఆచార్యులు కరుణించిన*
*శ్రీ చరణములందు చేరు శ్రీహరి చేర్చున్*
*ప్రాచీన బాధలన్నియు*
*నీ చిరు జీవితమునందు నీదుట కొ*శ్రీ హరి స్తుతి 118*
*కం.మాధవునియంకమందున*
*శ్రీదేవియె చేరిపోయె సిరులను నిడగా*
*ఈ ధరణిని రక్షించుచు*
*బాధలను మాన్పివేసి పంచిరి సుఖముల్*రకై*
సప్తశృంగి మాత, ఆలయం, మహారాష్ట్ర*
*శ్రీ సప్తశృంగి మాత, ఆలయం, మహారాష్ట్ర*
🌹 సప్త శృంగాలు… అంటే ఏడు శిఖరాల మధ్య… చుట్టూ ప్రకృతి సౌందర్యంతో అలరారే కొండ మీద… అమ్మవారు స్వయంభువుగా వెలసిన క్షేత్రం…. సప్తశృంగి ఆలయం.
🌹 హిందూ సంప్రదాయాల ప్రకారం , దేవత సప్తశృంగి నివాసిని ఏడు పర్వత శిఖరాలలో నివసిస్తుంది.
( సప్త అంటే ఏడు మరియు శృంగ్ అంటే శిఖరాలు.)
ఇది భారతదేశంలోని నాసిక్ సమీపంలోని ఒక చిన్న గ్రామమైన కల్వాన్ తాలూకాలోని నండూరిలో ఉంది .
🌹 మరాఠాలు మరియు కొన్ని హిందూ తెగలు చాలా కాలంగా దేవతను పూజిస్తున్నారు మరియు కొందరు ఆమెను తమ కులదైవంగా పూజిస్తున్నారు.
🌹 ఈ ఆలయం మహారాష్ట్రలోని "మూడున్నర శాక్తి పీఠాలలో " ఒకటిగా కూడా ప్రసిద్ధి చెందింది.
ఈ ఆలయం భారత ఉపఖండంలో ఉన్న 51 శాక్తి పీఠాలలో ఒకటి మరియు సతి ( శివుని భార్య ) అవయవాలలో ఒకటి, ఆమె కుడి_చేయి పడిపోయినట్లు నివేదించబడిన ప్రదేశం . మహారాష్ట్రలోని మూడున్నర శక్తి పీఠాలలో దీని సగం శక్తిపీఠం అంటారు
🌹 మహారాష్ట్రలో మూడున్నర శక్త పిఠాలు ఉన్నట్లు నివేదించబడింది .
ఈ నాలుగు దేవతా ఆలయాలు
కొల్హాపూర్‌లోని మహాలక్ష్మి ఆలయం ,
తుల్జాపూర్‌లోని తుల్జా భవానీ ఆలయం ,
మహూర్ (మాత్రిపూర్)లోని రేణుకా ఆలయం
మరియు వాణిలోని సప్తశృంగి ఆలయం.
🌹ఈ 4 ఆలయాలు పవిత్ర ఓం యొక్క నాలుగు భాగాలు ,
అ కార ,
ఉ కార ,
మ కార
మరియు మ్మ కార ( అర్ధ మాత్ర ) లను సూచిస్తాయని కూడా అర్థం .
వీటిలో ఇది అర్ధ-పీఠం (సగం శక్తి పిఠము, పూర్తి శక్తీ పిఠము కంటే తక్కువ ప్రాముఖ్యత కలిగినదిగా పరిగణించబడుతుంది)
🌹 వివాదాస్పదమైనప్పటికీ, సప్తశృంగిని సాధారణంగా సగం శక్తి పిఠముగా పరిగణిస్తారు.
అయితే, ఆలయం యొక్క అధికారిక స్థలం దీనిని పూర్తి శక్త పిఠాగా ప్రకటిస్తుంది.
🌹 ఈ ఆలయ ప్రధాన దేవతను ఇతర పేర్లతో కూడా పిలుస్తారు:
సప్తశృంగి (ఏడు కొండల దేవత),
సప్తశృంగ-నివాసిని
("సప్తశృంగ - ఏడు కొండలపై నివసించేది"),
సప్తశృంగ-మాత
("సప్తశృంగ తల్లి. మొదటి రెండు పేర్లకు దేవి (దేవత) అనే ప్రత్యయాన్ని జోడించవచ్చు.
ఆమెను బ్రహ్మస్వరూపిణి (" బ్రాహ్మణ రూపం కలిగినది") అని కూడా పిలుస్తారు.
దేవత సృష్టికర్త-దేవుడు బ్రహ్మ యొక్క కమండలు (నీటి కుండ) నుండి ఉద్భవించిందని నివేదించబడింది ..
🌹 ఆ దేవత దుర్గా రూపాన్ని ధరించి విశ్వాన్ని ఇబ్బంది పెట్టిన రాక్షసుడు మహిషాసురుడిని సంహరించింది.
ఆ తరువాత దేవత ఇక్కడ స్థిరపడిందని నమ్ముతారు.
దేవత ఇక్కడ రూపం దాల్చి సప్తశృంగిలో నివసించినందున, ఇది దేవత యొక్క అసలు స్థానంగా పరిగణించబడుతుంది.
🌹 రెండు అంతస్తుల ఎత్తులో ఉండే ఆలయంలో అమ్మవారు 18 చేతులతో… ప్రతి చేతిలో ఒక భిన్నమైన ఆయుధంతో… అసురసంహారిణి అయిన దుర్గాదేవి రూపంలో… భీకరంగా కనిపిస్తుంది.
ప్రధాన ఆలయంలోని విగ్రహం పది అడుగుల ఎత్తుతో సమున్నతంగా ఉంటుంది. ఈ ఆలయ ప్రాశస్త్యాన్ని వివరించే కథలు ఎన్నో ఉన్నాయి.
🌹 దక్షయజ్ఞం జరిగినప్పుడు, తండ్రి దక్షుడి వల్ల భర్త మహా శివుడు పొందిన అవమానాన్ని సహించలేక సతీదేవి ఆత్మార్పణ చేసుకుంది.
ఆమె పార్థివ దేహాన్ని భుజాలపై పెట్టుకొని తాండవిస్తున్న శివుణ్ణి చూసి ముల్లోకాలూ కంపించిపోయాయి.
అప్పుడు విష్ణు మూర్తి తన సుదర్శన చక్రంతో సతీదేవి దేహాన్ని 52 భాగాలుగా ఖండించాడు. ఆ భాగాలు పడిన ప్రదేశాలు శక్తి పీఠాలయ్యాయి.
వాటిలో సతీదేవి కుడి చెయ్యి పడిన చోటు సప్త శృంగి అని చెబుతారు.
🌹 రామాయణ యుద్ధంలో , లక్ష్మణుడు యుద్ధభూమిలో అపస్మారక స్థితిలో పడి ఉన్నప్పుడు , హనుమంతుడు తన ప్రాణాన్ని పునరుద్ధరించడానికి ఔషధ మూలికలను వెతుకుతూ సప్తశృంగి కొండలకు వచ్చాడు.
రామాయణంలో ప్రస్తావించబడిన దండకారణ్యం అనే అడవిలో సప్తశృంగ్ పర్వతం ఒక భాగం .
రాముడు, సీత , లక్ష్మణుడితో కలిసి ఈ కొండలకు దేవతను ప్రార్థించడానికి మరియు ఆమె ఆశీర్వాదం పొందడానికి వచ్చాడని ప్రస్తావించబడింది .
🌹 కొండ దిగువన, మెట్లు ఎక్కడం ప్రారంభించే చోట, రాతితో తయారు చేయబడిన గేదె తల ఉంది, ఇది మహిషాసుర రాక్షసుడిదని నమ్ముతారు.
🌹 కాగా భీమాసురుడనే రాక్షసుణ్ణి వధించడం కోసం… మార్కండేయ మహర్షి ప్రార్థన మేరకు ఏడు శక్తి రూపాల కలయికగా… సప్తశృంగి అమ్మవారు వెలసిందంటారు.
🌹 స్వయంభువు అయిన ఈ అమ్మవారికి ఆలయం చుట్టూ అనేక తటాకాలు ఉన్నాయి. వాటిలో కాళీకుండ్, సూర్యకుండ్, దత్తాత్రేయకుండ్ ప్రధానమైనవి.
ఆ ప్రాంత గిరిజనులకు ఈ అమ్మవారు ఆరాధ్యదైవం.
🌹 విగ్రహానికి అన్ని వేళలా సిందూరంతో పూత వేస్తారు.
సప్తశృంగి మాతను మహిషాసుర మర్దినిగానూ స్థానికులు ఆరాధిస్తారు. మానసిక ఆందోళనలు, భయాలు తొలగించి, ధైర్యాన్నీ, సంకల్పబలాన్నీ సప్తశృంగి మాత ప్రసాదిస్తుందని భక్తుల విశ్వాసం...
🌹ఈ ఆలయం ఏడాది పొడవునా పెద్ద సంఖ్యలో భక్తులు మరియు పర్యాటకులను ఆకర్షిస్తుంది, ముఖ్యంగా నవరాత్రి ఉత్సవాలలో అమ్మవారి తొమ్మిది రాత్రులు జరుపుకుంటారు.
🌹 మహారాష్ట్రలోని నాసిక్ నుండి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్నది.
డెంగ్యూ జ్వరం
డెంగ్యూ జ్వరం వచ్చినపుడు ప్లేట్లెట్స్ సంఖ్య హఠాత్తుగా పడిపోతున్నప్పుడు ఉపయోగించవలసిన అద్బుత యోగం -
మొదట ఒక కప్పు నీటిలో ఒక స్పూన్ తేనే కరిగేలా చేసి దానిలో ఒకస్పూన్ గోధుమగడ్డి చూర్ణం కలిపి వెంటనే రోగికి తాగించాలి. కొంతసేపట్లో ప్లేట్లెట్ల సంఖ్య పెరగడం మొదలవుతుంది. ఒక గంట తరువాత ఒక పెద్ద గ్లాస్ నీటిలో ఒక బొప్పాయి ఆకు మొత్తం చిన్నచిన్న ముక్కలుగా చేసి పొయ్యి మీద పెట్టి అందులొ తాటిబెల్లం వేసి సగం గ్లాస్ కషాయం మిగిలేలా కాచి దానిని కూడా తాగించడం వలన వేగంగా ప్లేట్లెట్స్ సంఖ్య పెరిగి రోగి ప్రాణాయాపాయ స్థితి నుంచి బయటపడతాడు.
ఇది నా అనుభవ యోగం
పంచాంగం 08.02.2026
ఈ రోజు పంచాంగం 08.02.2026
Sunday,
స్వస్తి శ్రీ చాన్ద్రమాన విశ్వావసు నామసంవత్సర: ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘ మాస కృష్ణ పక్ష సప్తమి తిథి భాను వాసర స్వాతి నక్షత్రం గండ యోగః భద్ర తదుపరి బవ కరణం.
రాహుకాలం : సాయంత్రం 04:30 నుండి 06:00 వరకు.
యమగండం: మధ్యాహ్నం 12:30 నుండి 01:30 వరకు.
శ్రాద్ధ తిథి: సప్తమి
నమస్కారః , శుభోదయం
ఆర్యా శతకం - 1*
*శ్రీ మూకశంకర విరచిత*
*మూక పంచశతి*
*ఆర్యా శతకం - 1*
*శ్లోకము - 24*
*పౌష్టికకర్మవిపాకం పౌష్పశరం సవిధసీమ్ని కంపాయాః॥*
*అద్రాక్షమాత్తయౌవనమభ్యుదయం కంచిదర్ధశశిమౌళేః॥*
*భావము :*
*కామదేవుడైన మన్మధుడు, అనేక పుష్టికరమైన కర్మలను చేసి, వాటి ఫలితముగా, తల్లియొక్క యౌవనదశను పోలిన రూపాన్ని పొందాడు. అటువంటి స్త్రీ చంద్రశేఖరుడైన ఈశ్వరునికి భాగ్యదేవతగా లభించింది. అటువంటి సుందర స్త్రీ మూర్తి నాకు కంపానదీ తీరములో దర్శినమిచ్చింది.*
🙏🙏🙏 *శ్రీమాత్రే నమః* 🙏🙏🙏
భగవద్గీత
-------------------- భగవద్గీత. -------------------
ద్వితీయోధ్యాయ: సాంఖ్య యోగము.
తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పరః ।
వశే హి యస్యేంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా ।। 61 ।।
ప్రతిపదార్థ:
తాని — వాటిని; సర్వాణి — అన్నీ; సంయమ్య — లోబరచుకొని; యుక్త — ఐక్యమై; ఆసీత — కూర్చొని; మత్-పరః — నా యందు (శ్రీ కృష్ణుడు); వశే — వశమునందు; హి — నిజముగా; యస్య — ఎవరి యొక్క; ఇంద్రియాణి — ఇంద్రియములు; తస్య — వారి; ప్రజ్ఞా — పరిపూర్ణ జ్ఞానము; ప్రతిష్ఠితా — స్థిరంగా ఉండును.
తాత్పర్యము :
ఎవరైతే తమ ఇంద్రియములను వశమునందు ఉంచుకొని, మనస్సుని నాయందే ఎల్లప్పుడూ లగ్నం చేయుదురో, వారు సంపూర్ణ జ్ఞానంలో స్థితులై ఉన్నట్టు.
వివరణ:
ఈ శ్లోకంలో 'యుక్తః' (కూడియున్న) అన్న పదం 'భక్తితో లీనమైన' అనే అర్థంతో ఉన్నది, మరియు ‘మత్ పరః’ అంటే 'శ్రీ కృష్ణుడి పట్ల’. 'ఆసీత' అన్న పదాన్ని ఉపమానముగా 'నెలకొని లేదా స్థితమైఉండి' అని అర్థం చేసుకోవచ్చు. చంచలమైన మనస్సు, ఇంద్రియములను మచ్చిక చేసుకోవలసిన అవసరం ఉందని చెప్పిన శ్రీ కృష్ణుడు, ఇప్పుడు వాటిని సరియైన పద్ధతిలో ఎలా ఉపయోగించాలో తెలియచేస్తున్నాడు, అదే భగవత్ భక్తిలో నిమగ్నమవుట.
ఆదివారం రాశి ఫలితాలు
శ్రీ గురుభ్యోనమః 🙏
08-02-2026 ఆదివారం రాశి ఫలితాలు
మేషం
నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. గృహనిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. వృత్తి ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. ఖర్చుల విషయంలో కొంత ఆచితూచి వ్యవహరించాలి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.
---------------------------------------
వృషభం
ఆప్తుల నుండి సహాయ సహకారాలు అందుతాయి. కుటుంబ సభ్యులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ముఖ్యమైన వ్యవహారాల్లో జాప్యం జరిగిన నిదానంగా పూర్తిచేస్తారు. వృత్తి ఉద్యోగాలలో మరింత పురోగతి పెరుగుతుంది నిరుద్యోగులు అనుకూల వాతావరణం ఉంటుంది.
---------------------------------------
మిధునం
ముఖ్యమైన వ్యవహారాల్లో ఆశించిన విజయం సాధిస్తారు. సోదరుల నుండి కీలక సమాచారం అందుతుంది. దీర్ఘకాలిక ఋణాలు తీరి ఊరట పొందుతారు. వృత్తి ఉద్యోగాలలో మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది.
---------------------------------------
కర్కాటకం
చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో ఇతరులతో సమస్యలు ఏర్పడతాయి. సోదరులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. కుటుంబ సభ్యుల మాటలు కొంత బాధ కలిగిస్తాయి. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది.
---------------------------------------
సింహం
చిన్ననాటి మిత్రుల నుండి ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలలో పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. భూ సంబంధిత క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. బంధుమిత్రులతో శుభకార్యాలలో పాల్గొంటారు. నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూల ఫలితాన్ని ఇస్తాయి.
---------------------------------------
కన్య
వృత్తి వ్యాపారాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు. మిత్రులతో వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. వివాదాలకు సంబంధించిన కీలక సమాచారం సన్నిహితుల నుండి అందుతుంది. గృహ వాతావరణం సందడిగా ఉంటుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగస్తులు ఉన్నత పదవులు పొందుతారు.
---------------------------------------
తుల
చాలా కాలంగా వేధిస్తున్న సమస్యల నుండి కొంత ఉపశమనం పొందుతారు. గృహమున శుభకార్యాల ప్రస్తావన వస్తుంది. ఆధ్యాత్మిక చింతన వలన మానసిక ప్రశాంతత లభిస్తుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. వృత్తి ఉద్యోగాలలో అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు.
---------------------------------------
వృశ్చికం
ఆరోగ్య విషయాలలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. వృత్తి వ్యాపారాలలో శారీరక శ్రమ పెరుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో మిత్రుల సహాయ సహకారాలు సలహాలు తీసుకోవడం మంచిది. ఉద్యోగ విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకొని ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది.
---------------------------------------
ధనస్సు
ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు నిర్వహించి ప్రశంసలు అందుకుంటారు. సోదరుల నుండి స్థిరాస్తి లాభం పొందుతారు దూర ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో మీ శ్రమకు విశేషమైన గుర్తింపు లభిస్తుంది.
---------------------------------------
మకరం
వ్యాపారాలలో కష్టానికి తగిన లాభాలు అందుకుంటారు. గృహ నిర్మాణం పనులు మందకొడిగా సాగుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఇతరులు వ్యవహారాల్లో తలదూర్చడం మంచిది కాదు. వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి పెరుగుతుంది. ఆర్థికంగా అంతంత మాత్రంగా సాగుతుంది.
---------------------------------------
కుంభం
అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందుతారు. చేపట్టిన పనుల్లో శ్రమ కలిగిన సకాలంలో పూర్తి చేస్తారు. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో అదనపు పని ఒత్తిడి నుండి ఉపశమనం లభిస్తుంది. వ్యాపారపరంగా నూతన నిర్ణయాలు తీసుకుని లాభాలు అందుకుంటారు.
---------------------------------------
మీనం
ఇతరులపై మీ అభిప్రాయం మార్చుకోవడం మంచిది. ఉద్యోగ విషయమై వారి సహకారంతో పనులు త్వరితగతిన పూర్తి చేస్తారు. చేపట్టిన పనులలో కుటుంబ సభ్యుల నుండి సహాయ సహకారాలు అందుతాయి. పాత మిత్రులతో విలువైన సమయాన్ని గడుపుతారు. ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది.
---------------------------------------
వేద ఆశీర్వచనం.
*నమస్తే సదా వత్సలే మాతృ భూమే*
*కలియుగాబ్ది 5126*
*శ్రీ శాలివాహన శకం 1947 స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణము - శిశిర ఋతువు - మాఘ మాసం - కృష్ణ పక్షం - సప్తమి - స్వాతి - భాను వాసరే* (08.02.2026)
ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు
*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.
.🙏🙏
భవదీయుడు
దశిక ప్రభాకరశాస్త్రి
9849795167
----------------------------------------------
*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*
