22, జనవరి 2024, సోమవారం

హిదూత్వమంటే

 https://youtu.be/KHf028cV-0E?si=Y9JuPY_sxt485ou_


శ్రీభారత్ వీక్షకులకు అయోధ్య రాముని ప్రతిష్ఠాపన దినోత్సవ శుభాకాంక్షలు 🌹జనవరి 22 భారతీయులందరు గర్వించిన రోజు. అయోధ్యలో ప్రధాని మోడీ స్వయంగా విగ్రహ ప్రతిష్ఠ జరిపించిన రోజు. ఇది మన దేశ పెద్ద పండుగ. బాలరాముని విగ్రహం అయోధ్యలో ఎందుకు ప్రతిష్ఠించవలసి వచ్చిందో, దానవల్ల దేశ ఖ్యాతి ఇంకెంతగా పెరుగుతుందో ఎంతో చక్కగా వివరించారు ప్రముఖ రచయిత జంధ్యాల శరత్ బాబు గారు. హిదూత్వమంటే ఒక మతం కాదనీ, అది ఒక జీవన విధానమనీ ఆయన అంటారు. అందరి రాముని గురించి వినండి. ఇటువంటి విశిష్టమైన ఎపిసోడ్స్ ఉచితంగా వీక్షించడానికి వెంటనే చానల్ ను subscribe చేయండి, శ్రీభారత్ కుటుంబ సభ్యులు కండి.🙏

రామా కనవేమిరా

 🌹🌹🌹🌹🌷🌷🌷🌷🌹🌹🌹🌹

రామా కనవేమిరా ....


🦜🌺🦜🌺🦜🌺🦜🌺🦜

       విశ్వనాధ సత్యనారాయణ గారు స్కూలు టీచరుగా వారి ఊరికి దగ్గర గా ఉన్న గ్రామం లో పని చేస్తుండేవారు. 


అప్పటి వారి జీతం ఇరవై ఒక్క రూపాయలు.


 విశ్వనాధ వారు పోషించేది తొమ్మిదిమందిని:


 తల్లి,తోబుట్టువులు,వారి పిల్లలు,ముగ్గురు తమ్ముళ్ళు.


రాబడి తక్కువ .


ఒకనాటి రాత్రి వారి అమ్మగారు పార్వతమ్మగారు వచ్చి “నాన్నా, బియ్యం రేపటికి నిండుకున్నవి.చాట అప్పుపుట్టే తీరు లేదు.” అన్నారు.


విశ్వనాధ వారు “సరేలే,అమ్మా “ అన్నారు.


పాపం మరుసటి రోజు స్నానాదికాలు ముగించుకుని బయటకు వెళ్లారు.


ఆ రోజుల్లో శనాదివారాలు రెండూ సెలవుదినాలు.


ఉదయం వెళ్లి రాత్రి పదిన్నరకు తిరిగి వచ్చారు. 


ఆరోజుల్లో బ్రాహ్మణుల ఇళ్ళలో ముందు ఒక నీళ్ళ తొట్టి,దాని మీద ఒక కర్ర తో చేసిన మూత ఉండేది .పెరట్లో మరొక నీళ్ళ తొట్టి మూతతో ఉండేది. బయట నుంచి రాగానే ముందు కాళ్ళు కడుక్కుని ఇంటి లోకి ప్రవేశించటం పద్ధతి .భోజనానంతరం పెరట్లో ఉన్న తొట్టి వద్ద కాళ్ళు కడుక్కోటం ఆచారం.


విశ్వనాథవారు వచ్చీ రావటంతోటే పద్ధతి ప్రకారం కాళ్ళు కడుక్కోకుండానే సరాసరి వంటింట్లో కి వెళ్లి చూసారు.


పొయ్యిలో పిల్లి లేవలేదు. గొప్ప ఖేదానికి గురయ్యారు.


 అప్పుడు పాదప్రక్షాళనం చేసి,ముఖం కడుక్కుని “మా స్వామి“ అనే శతకం వ్రాయటం మొదలు పెట్టారు. 


'మా స్వామి' లోని మొదటి రెండు పద్యాలు రామాయణ కల్పవృక్షానికి నాంది.


పది,పదిహేను పద్యాలు వ్రాసిన తర్వాత ఒక పద్యంలో అంటారు,


“మా నాన్నగారికి,నీకు లావాదేవీలు ఏమున్నాయో నాకు తెలియదు.ఏమైనా ఉంటే మీరూ మీరూ చూసుకోండి.

నన్నిలా కష్ట పెడితే మాత్రం నేను ఊరుకునేదిలేదు.

ఆహితాగ్ని పెట్టెలో ఉన్న నీ బంగారు లింగాన్ని తెగనమ్ముతాను.రెండు బస్తాల బియ్యం,దినుసులు తెచ్చుకుంటాను.” అని వ్రాస్తుండగా తలుపు తడుతున్న శబ్దం అయింది.


 తల్లిగారైన పార్వతమ్మ గారు తలుపు తెరిచారు. 


బండి తీసుకుని వచ్చిన వ్యక్తి “అమ్మా, కపిలేశ్వరపురం నుంచి రావి సూరయ్య గారు తమకు ఇవ్వమని రెండు బస్తాల బియ్యం ,కందిపప్పు మూట,బెల్లపు బుట్ట,నెయ్యి పంపించారు. ఎవరైనా కొద్దిగా సాయం చేస్తే ఆ బస్తాలు పంచలో పెడతాను.“ అన్నారు.


అదీ విశ్వనాధ వారి భక్తి ,నిర్భీతి ,వారి కున్న దైవానుగ్రహం.



రామ రామ అంటేనే చాలదా... శ్రీ రామ రామ అంటేనే చాలదా...


జై శ్రీరామ్🙏


సేకరణ:- వాట్సాప్ పోస్ట్. 

🦜🌺🦜🌺🦜🌺🦜🌺🦜

శ్రీ రామ ప్రతిష్ఠా మహోత్సవo

 శ్రీ రామ ప్రతిష్ఠా మహోత్సవ శుభాకాంక్షలు, శుభోదయం.

🌷🙏🌷🙏🌷🙏🌷🙏

ఉత్పలమాల

చేతనమొందె నీ ధరణి శ్రీ రఘు వీరుని గాంచు వేడ్క, వి

న్నూతన దీప్తి పొందుచు ననూహ్యపు రీతిని నేడు నింగిలో

జ్యోతిపథంబు నంతటను శోభల జిమ్మెను రామ నామమే,

జాతి చరిత్ర యందు నిది స్వర్ణయుగంబుకు శోభ కృత్ గదా.🙏🙏


🙏🌷🙏🌷


ఉత్పలమాల

రామ రసాయనంబు భవ లాలస మాపెడు సాధనంబిదే,

నామము జీవితంబుకు పునాదిగ జేసుకు సాగుడందరున్,

నీమము లేదు, కావలెను నీరజ నేత్రుని ధ్యానమే హృదిన్,

సేమము నిచ్చు నెల్లరకు శ్రేయము తారక నామమే సదా.🙏🙏


🙏🌷🙏🌷


ఉత్పలమాల

మానవ జీవితంబునకు మార్గము జూపెను రామ చంద్రుడే,

పూనిక తోడ సత్యమును భూషగ దాల్చెను ధర్మ శస్త్రుడై,

కానల కేగె లోకమును కావగ సాధుల, వ్రేయ దుష్టులన్,

మానవ జాతి కంతకు ప్రమాణము జూపెను లోక పూజ్యుడై,

తాను నృపాలుడై నిలిపె ధారుణి యంతయు రామ రాజ్యమే.🙏🙏


🙏🌷🙏🌷


చంపకమాల

జగదభి రాము సాటి సరి శాసకుడెందును లేడు నేటికిన్,

నగధరు డొచ్చె ధాత్రి కరుణాంబుధి శ్రీరఘు రాము రూపమై,

జగమున నిన్ని కావ్యముల శాశ్వత మైనది రామ గాథయే,

యుగములు దాటి పోయినను యుర్విని యున్నది రామ నామమే.🙏🙏


🙏🌷🙏🌷

శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః 🙏🙏🙏

శ్రీ రామ జయ రామ జయ జయ రామ   🙏🙏🙏  

శ్రీ రామ జయం     🙏🙏🙏

🙏🌷🙏🌷

అవధూతల దర్శనం..

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారితో అనుభవాలు..


*అవధూతల దర్శనం..*


నెల్లూరు నుంచి శ్రీ చంద్రశేఖర్ గారు అదే మొదటిసారి మొగలిచెర్ల లోని శ్రీ దత్తాత్రేయ స్వామి వారి మందిరానికి రావడం..శ్రీ స్వామివారి సమాధిని దర్శించుకుని..మందిరం లోని ప్రధాన మంటపం చుట్టూరా ప్రదక్షిణం చేసి..శ్రీ స్వామివారి విగ్రహం వద్ద పూజ చేయించుకొని..కొద్దిసేపు మంటపంలో కూర్చున్నారు..చంద్రశేఖర్ గారి మనసులో ఒక కోరిక కలిగింది..అడగాలా?..వద్దా?..అనే సందేహం లో కొంచెం సేపు మథనపడి.. చివరకు..


"ప్రసాద్ గారూ..మిమ్మల్ని ఒకటి అడగొచ్చా?.."అన్నారు..


"మందిరానికి సంబంధించినది ఏదైనా సరే..నిరభ్యంతరంగా అడగండి.." అన్నాను..


"శ్రీ గొలగమూడి వెంకయ్య స్వామి వారి పటాన్ని తీసుకొచ్చి..ఇక్కడ..ఈ మందిరం వద్ద ఒక ప్రక్కన పెట్టాలని కోరిక కలిగిందండీ..మీరు అనుమతి ఇస్తే..శ్రీ వెంకయ్య స్వామి వారి పటాన్ని తీసుకొస్తాను.." అన్నారు..


"ఎటువంటి ఇబ్బందీ లేదు..మీరు చూస్తున్నారు కదా..నైరుతి మూలలో శ్రీ సాయిబాబా మందిరం ఉన్నది..శ్రీ దత్తాత్రేయ స్వామివారిని దర్శించిన తరువాత..శ్రీ సాయిబాబా ను కూడా దర్శించుకుంటున్నారు..అలాగే శ్రీ వెంకయ్య స్వామి వారి పటం వుంటే..ఆ స్వామికి నమస్కరించుకుంటారు..గొలగమూడి లో ఉన్న వెంకయ్య స్వామి వారిని కూడా అవధూత పరంపర లోనే పరిగణిస్తున్నారు కదా..నాకు ఎటువంటి అభ్యంతరమూ లేదండీ.." అన్నాను..


చంద్రశేఖర్ గారు ఎంతో సంతోషం తో .."ఈసారి వచ్చేటప్పుడు శ్రీ వెంకయ్య స్వామి వారి పటాన్ని తీసుకొస్తానండీ..ఒప్పుకున్నందుకు ధన్యవాదాలు.." అని చెప్పి..నెల్లూరు వెళ్లిపోయారు..


రెండు నెలలు గడిచాయి..ఒకరోజు చంద్రశేఖర్ గారు ఫోన్ చేసి.."ప్రసాద్ గారూ..శ్రీ వెంకయ్య స్వామి వారి చిత్రం ఒక్కటే కాకుండా..ఇతర అవధూతల చిత్రాలు కూడా తీసుకురావాలని నాకు స్వప్నంలో ఆదేశం వచ్చిందండీ..శ్రీ దత్తాత్రేయస్వామి వారి గర్భ గుడి వెలుపల గోడ మీద నాలుగు వైపులా కొలతలు తీసుకొని..అందుకు తగ్గట్టుగా అవధూతల పటాలు చేయించి..తీసుకొస్తాను..రేపుదయం వస్తున్నాను..నాతో పాటు నెల్లూరు లోని సత్యం స్థూడియో యజమాని గారు కూడా వస్తున్నారు.." అన్నారు..తీరా చూస్తే..ఆ సత్యం గారు మాకు దూరపు బంధువు..దత్త భక్తుడూ..


అనుకున్న విధంగానే ప్రక్కరోజు శ్రీ స్వామివారి మందిరానికి వచ్చి..ప్రధాన మంటపం చుట్టూరా కొలతలు తీసుకొని వెళ్లిపోయారు..మళ్లీ రెండు నెలల పాటు ఎటువంటి కబురూ లేదు..


ఆ తరువాత ఒక ఆదివారం నాడు..

శ్రీ దత్తాత్రేయ (త్రిమూర్తి స్వరూపుడు)

శ్రీ పాద శ్రీ వల్లభులు..

శ్రీ నృసింహ సరస్వతి..

శ్రీ స్వామీ సమర్ధ..

శ్రీ మాణిక్ ప్రభు మహారాజ్

శ్రీ సాయిబాబా..

శ్రీ వెంకయ్య స్వామి..


వీటన్నింటి తో పాటు..మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారు..


మొత్తం ఎనిమిది చిత్రపటాలు.. పెద్ద సైజువి తీసుకొని వచ్చి..మంటపం చుట్టూ ఒక పద్ధతి ప్రకారం అమర్చారు..


"చిత్రమేమిటంటే..అందరు అవధూతల చిత్రపటాలు తయారయ్యేదాకా..శ్రీ వెంకయ్య స్వామి వారి చిత్రపటం పూర్తి కాకపోవడం..అందరి తో కలిసే శ్రీ వెంకయ్య స్వామి వారు మొగలిచెర్ల స్వామివారి దగ్గరకు రావడం.."


మొగలిచెర్ల శ్రీ దత్తాత్రేయ స్వామి వారి మందిరానికి వచ్చిన భక్తులు ప్రధాన ఆలయం చుట్టూ ఒక ప్రదక్షిణ చేసేటప్పుడు..పై అవధూతలందరి దర్శనము అవుతుంది..


ఒక్క వెంకయ్య స్వామి వారి పటాన్ని మాత్రం పెట్టుకోవడానికి అనుమతి కోరిన చంద్రశేఖర్ గారు..శ్రీ స్వామివారి ఆదేశం తో అందరు అవధూతల చిత్రపటాలూ తీసుకొచ్చారు..తనకూ ఇతర అవధూతలకూ బేధమే లేదని శ్రీ స్వామివారు పరోక్షంగా సూచించారు..


*మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి చరిత్రను ఆడియో రూపంలో ఈ క్రింద ఇచ్చిన లింక్ ద్వారా యూట్యూబ్ లో వినవచ్చు..*


https://youtube.com/playlist?list=PLZ3oJviTRayHLeRpuozyT55d-H-4xmTHs&si=xqCIrCAE0k1Rmrnx


సర్వం..

దత్తకృప.


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం.. మొగలిచెర్ల గ్రామం...లింగసముద్రం మండలం..SPSR నెల్లూరు జిల్లా..పిన్:523114..సెల్..94402 66380 & 99089 73699).