9, ఏప్రిల్ 2025, బుధవారం

రెండు గొప్ప శత్రువులు*

 *రెండు గొప్ప శత్రువులు* 


మనిషికి ఇద్దరు శత్రువులు వున్నారు. ఒకటి ' *అహంకారం'* మరి యొకటి ' *మమకారం'.* 


అహంకారం ' *నేను, నేను* ' అంటే మమకారం ' *నాది, నాది'* అంటూ ఉంటుంది.


ఎప్పుడైనా ఏదైనా ఒక వస్తువును స్వీకరించినప్పుడు ' *ఇది నాది* ' అని మమకారం వల్ల వస్తుంది. అదేవిదంగా ఏదైనా పని చేసినప్పుడు ' *ఇది నేను చేసినాను* ' అనే భావన అహంకారం వలన కలుగుతుంది.


దీనికి చక్కని తార్కాణం ఈసంఘటన.

జగద్గురువుల వారు ఒకసారి ఆంధ్ర ప్రదేశ్ లో పర్యటిస్తున్నప్పుడు వారు ఒక క్షేత్రాన్ని సందర్శించినారు. ఆ ప్రదేశం ఎంతో పుణ్య క్షేత్రం అయినప్పటికీ చాలా మంది యాత్రికులను అది ఆకర్షించుటలేదు. ఎందుకంటే ప్రయాణ సౌకర్యాలు సరిగ్గా లేవు అక్కడ. ఒక అధికారి దీనిని సరిదిద్దే కార్యక్రమాన్ని చేపట్టి ఎన్నో ఏర్పాట్లు చేశారు. ఆ తర్వాత యాత్రికులు పెద్ద సంఖ్యలో ఆ క్షేత్రాన్ని సందర్శించడం ప్రారంభించినారు. జగద్గురువుల వారు అచ్చటికి వెళ్ళినప్పుడు ఆ అధికారి అక్కడి విషయాలు చూపిస్తూ ఇది అంతా తన కృషివలననే అని ప్రఘర్భాలు పలికినాడు. అదివింటూ జగద్గురువుల వారు మోనంగా ఉండిపోయారు. ఆలయ ప్రధాన ద్వారం వద్దకు వచ్చినప్పుడు జగద్గురువులు ఆగిపోయినారు. గోపురాన్ని చూసి ఆ వ్యక్తిని అడిగినారు. *జగద్గురువులు* "మీరు ఈ గోపురాన్ని చూస్తున్నారా"..? *అధికారి* అవును చూస్తున్నాను.  

 *జగద్గురువులు* : దీని ఎత్తు ఎంత..?

 *అధికారి* : చాలా ఎక్కువ.

 *జగద్గురువులు* :దానితో పోలిస్తే మనం ఎక్కడ వున్నాము..?

 *అధికారి* :చాలా తక్కువ స్థాయిలో

 *జగద్గురువులు* :ఇలాంటి గోపురాలు ఎందుకు నిర్మించారో మీకు తెలుసా. ఇది మన అహంకారాన్ని వదిలించుకోవటానికి. మనం ఎంతటి అజ్ఞానమైన హీన స్థితి లో వున్నామో తెలియపరచేలా చేస్తుంది. ఈ అద్భుతమైన విశ్వ సృష్టికర్త అయిన విశ్వనాధుని గురుంచి ఆలోచించినప్పుడు వారి అద్భుతమైన పనులతొ పోలిస్తే వారి ముందు మనం సాధించినది ఏమంత ముఖ్యమైనది కాదని తెలుసు కుంటాము. అందువల్ల "నేను దీన్ని చేసాను" వంటి ఆలోచనలు కలిగివుండటం చాలా అర్ధ రహితం.


*హరనమః పార్వతీ పతయే హర హర మహా దేవ* 


 *--- జగద్గురు శ్రీ శ్రీ శ్రీ భారతీ తీర్ధ*

మహాభారతము

 *సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*

*ద్రోణ పర్వము పంచమాశ్వాసము*


*342 వ రోజు*


*అశ్వత్థామ ధృష్టద్యుమ్నుని ఎదుర్కొనుట*


అది గమనించిన కేకయ, పాంచాల సేనలు అశ్వత్థామను చుట్టుముట్టాయి. అశ్వత్థామ వారి మీద శరవర్షం కురిపించి వారిని పారతోలాడు. అది చూసి ధృష్టద్యుమ్నుడు అశ్వత్థామను ఎదుర్కొని " అశ్వత్థామా! నేను నీ తండ్రి ద్రోణుని చంపడానికి పుట్టిన వరప్రసాదిని. నీ తండ్రినే కాదు నిన్ను కూడా వధిస్తాను రా! " అన్నాడు. అశ్వత్థామ " ధృష్టద్యుమ్నా! నీ కోసమే ఎదురుచూస్తున్నాను రా! నా బాణములకు నిన్ను బలిచేస్తాను రా! " అంటూ ధృష్టద్యునుని ఎదుర్కొన్నాడు. ధృష్టద్యుమ్నుడు " నీ తండ్రి పని తరువాత చూడవచ్చు ముందు నీ పని పడతాను " అంటూ అశ్వత్థామ మీద శరములు గుప్పించాడు. అశ్వత్థామ కోపించి ధృష్టద్యుమ్నుని కేతనము ఖండించి, సారథిని, హయములను చంపి అతడి చక్రరక్షకులను నూరు మందిని చంపి సింహనాదం చేసాడు. పాంచాల సేనలు అశ్వత్థామ ధాటికి నిలువ లేక చెరిరి పోయాయు. అది చూసి ధర్మరాజు, భీముడు తమ సైన్యాలతో ధృష్టద్యుమ్నునికి సాయం వచ్చారు. సుయోధనుడు ద్రోణుని తీసుకుని అశ్వత్థామకు సాయం వచ్చాడు. అది చూసిన అర్జునుడు ధృష్టద్యుమ్నునికి సాయం వచ్చాడు. ఇరు పక్షాల నడుమ పోరు ఘోరమైంది. అర్జునుడు తన వాడి అయిన బాణములతో మగధ, మద్ర, వంగదేశముల నాశనం చేస్తున్నాడు. భీముడు అంబష్ట, శిబి, వంగదేశ సైన్యములను తుద ముట్టించాడు. అది చూసి ఆగ్రహించిన ద్రోణుడు వాయవ్యాస్త్రమును ప్రయోగించి పాండవసేనలను చెల్లాచెదురు చేసాడు. అర్జునుడు, భీముడు ద్రోణునికి రెండు వైపుల నిలిచి శరములు గుప్పించాడు. ద్రోణుడు బెదరక పాండవ సేనలను తనుమాడుతున్నాడు. సుయోధనుడు పాండవ సేనలను చెల్లాచెదురు చేస్తున్నాడు. అప్పుడు సోమదత్తుడు పాండవ సేనలను ఎదుర్కొన్నాడు. సాత్యకి సోమదత్తుడిని ఎదుర్కొన్నాడు. సోమదత్తుడు ఒకే బాణంతో సాత్యకి విల్లు విరిచి సాత్యకిని ముప్పై అయిదు బాణాలతో కొట్టాడు. సాత్యకి మరొక విల్లందుకుని సోమదత్తుని విల్లు విరిచాడు . సోమదత్తుడు మరొక విల్లు తీసుకున్నాడు. అది చూసి భీముడు సోమదత్తుడిని ఎదుర్కొన్నాడు. ఘటోత్కచుడు సోమదత్తుడి మీద పరిఘను విసిరాడు. సోమదత్తుడు దానిని రెండు ముక్కలు చేసాడు. సాత్యకి ఒక వాడి అయిన బాణములతో సోమదత్తుడి సారథిని, హయములను చంపి మరొక నారసముతో సోమదత్తుడి తల నరికాడు. సోమదత్తుడి మరణం చూసి కౌరవ సేనలు సాత్యకిని ఒక్కుమ్మడిగా ఎదుర్కొన్నాయి. అది చూసిన ధర్మరాజు సాత్యకిని అక్కడి నుండి తప్పించి తాను ద్రోణుని ఎదుర్కొన్నాడు. ద్రోణుడు ధర్మరాజు విల్లు విరిచి, కేతనము పడగొట్టి ధర్మజుని శరీరం తూట్లు పడేలా కొట్టాడు. ధర్మరాజు ఉగ్రరూపందాల్చి మరొక విల్లందుకుని ద్రోణుని శరీరంలో గుచ్చుకునేలా బాణములు సంధించాడు. ద్రోణుడు తన రథము మీద మూర్చిల్లాడు. కొంచెం సేపటికి తేరుకున్న ద్రోణుడు తేరుకుని పాండవ సైన్యం మీద వాయవ్యాస్త్రాన్ని ప్రయోగించాడు. ధర్మరాజు కూడా వాయవ్యాస్త్రాన్ని ప్రయోగించి దానిని నిర్వీర్యం చేసి ద్రోణుని మీద శరములు గుప్పించాడు. అది చూసిన శ్రీకృష్ణుడు ధర్మజుని వద్దకు వెళ్ళి " ధర్మజా ! నిన్ను పట్టుకుని సుయోధనుడికి అప్పగిస్తానన్న ద్రోణుని ప్రతిజ్ఞ మరిచావా ! ద్రోణునితో యుద్ధము మంచిది కాదు వెంటనే ఇక్కడి నుండి వెళ్ళి భీముడికి సాయపడు " అన్నాడు. కృష్ణుడి మాట మన్నించి ధర్మజుడు భీముని వద్దకు వెళ్ళాడు. ద్రోణుడు ధర్మజుడిని వదిలి పాంచాల సేనలను ఎదుర్కొన్నాడు. ధర్మరాజు, భీముడు, ధృష్టద్యుమ్నుడు, సాత్యకి కౌరవ సేనలను తనుమాడుతున్నారు. కృపాచార్యుడు, కర్ణుడు, ద్రోణుడు వారిని ఎదుర్కొన్నారు. యుద్ధం ఘోరరూపందాల్చింది. సేనల పదఘట్టనలకు రేగిన ధూళి ఆకాశాన్ని తాకి సూర్యుడిని మరుగున పరిచి చీకట్లు కమ్ముకున్నాయి. సైనికులకు కళ్ళు కనిపించడం కష్టమైంది. ద్రోణాచార్యుడు ఒక వైపు సుయోధనుడిని ఒక వైపు కురు సేనలను ప్రోత్సహిస్తూ యుద్ధోన్ముఖులను చేసి అప్పటికప్పుడు ఒక వ్యూహమును ఏర్పరిచాడు

*రేపు *

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*

*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*

శ్రీమద్భగవద్గీత

 శ్రీమద్భగవద్గీత: నాల్గవ అధ్యాయం

జ్ఞానయోగం: శ్రీ భగవానువాచ


యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత 

అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహమ్ (7)


పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతామ్ 

ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే (8)


ఈ లోకంలో ధర్మం అధోగతిపాలై అధర్మం ప్రబలినప్పుడల్లా నేను ఉద్భవిస్తుంటాను. సజ్జన సంరక్షణకూ, దుర్జన సంహారానికీ, ధర్మసంస్థాపనకూ నేను అన్ని యుగాలలోనూ అవతరిస్తుంటాను.

సుభాషితమ్

 💎🌅 *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 *_𝕝𝕝ॐ𝕝𝕝 సుభాషితమ్ 𝕝𝕝卐𝕝𝕝_* 💎


*శ్లో* 𝕝𝕝 *దారేషు కిఞ్చిత్ స్వజనేషు కిఞ్చిద్*

         *గోప్యం వయస్యేషు సుతేషు కిఞ్చిత్।*

         *యుక్తం న వా యుక్తమిదం విచిన్త్య*

         *వదేద్విపశ్చిన్మహతోఽనురోధాత్॥*

             

                -- *పఞ్చతన్త్రమ్*--


*తా 𝕝𝕝 కొన్ని విషయాలు భార్యవద్ద, కొన్ని స్వజనులవద్ద, కొన్ని మిత్రుల సమక్షంలో, కొన్ని పుత్రులముందు దాచదగినవై ఉంటాయి.... కాని మహాత్ములు నిర్బంధించి అడిగితే 'ఇది యుక్తం ఇది అయుక్తం' అని విచారించి వివేకియైనవాడు రహస్యాలను సైతం తెల్పాలి....*


 ✍️💐🌹🪷🙏

కాశి ఆలయ చరిత్ర*

 🤘🙂

*కాశి ఆలయ చరిత్ర*


👉 *కాశి విశ్వనాథ్ ఆలయం తొమ్మిదవ జ్యోతిర్లింగ క్షేత్రం.* 


👉 *కాశీలోని 88 ఘాట్ లలో అత్యంత ప్రసిద్ధి మణికర్ణికా ఘాట్.*


👉 *క్రీ.శ 508 గుప్త చక్రవర్తి వైన్య గుప్తుడిచే ఆలయ నిర్మాణం*


👉 *క్రీ.శ 635 చైనా యాత్రికుడు యుఆన్ చాంగ్ రచనల్లో కాశీ ప్రస్తావన*


👉 *క్రీ.శ 1194 ఆలయాన్ని ధ్వంసం చేసిన మహమ్మద్ ఘోరీ సైన్యం*


👉 *క్రీ.శ 1230 లో ఆలయాన్ని పునర్నిర్మించిన గుజరాతి వర్తకులు*


👉 *క్రీ.శ 1489 లో ఆలయ విధ్వంసానికి పాల్పడిన డిల్లీ సుల్తాన్ సికిందర్ లోథి*


👉 *క్రీ.శ 1585 లో ఆలయాన్ని పునర్నిర్మించిన రాజా తొడరమల్*


👉 *క్రీ.శ 1669 లో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు ఆలయ విధ్వంసం*


👉 *క్రీ.శ 1669 లో ఆలయ ప్రాంగణంలోని జ్యోతిర్లింగాన్ని బావిలోకి విసిరేసిన అర్చకుడు*


👉 *శివలింగాన్ని వేసిన బావికి జ్ఞానవాపి అని పేరు, ఆలయ ప్రాంగణంలోనే దర్శనమిచ్చే జ్ఞానవాపి బావి*


👉 *క్రీ.శ 1669 లో శిథిలమైన ఆలయ గోడలపైనే జ్ఞానవాపి మసీదు నిర్మాణం చేసిన ఔరంగజేబు*


👉 *క్రీ.శ 1742 లో మసీదు విధ్వంసానికి మల్హర్ రావు హోల్కర్ విఫలయత్నం*


👉 *క్రీ.శ 1780 లో 111 ఏళ్ల తర్వాత కాశీ విశ్వనాథుని కి పూర్వవైభవం*


👉 *క్రీ.శ 1780 లో నూతన ఆలయాన్ని మరాఠా రాణి అహల్యాబాయి హోల్కర్ జ్ఞానవాపి మసీదు ప్రక్కనే నిర్మించినారు*


👉 *క్రీ.శ 1835 లో స్వర్ణ తాపడం చేయించిన మహారాజా రంజిత్ సింగ్*


👉 *కాలక్రమంలో గృహ నిర్మాణాలతో ఆక్రమణకు గురైన ఆలయ ప్రాకారం*


👉 *ప్రతిరోజు జ్యోతిర్లింగ దర్శనం కి తరలి వచ్చే వేలాది భక్తులు చిన్నచిన్న గల్లీలు దాటుకొని ఆలయానికి అసౌకర్యంగా చేరుకునేవారు*


👉 *కాశీ పూర్వ వైభవానికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ సంకల్పం*


👉 *184 ఏళ్ల తర్వాత 2019 మార్చి 8 న ప్రధానమంత్రి నరేంద్ర దామోదర్ దాస్ మోడీ 1000 కోట్లతో కాశీ విశ్వనాథ్ ఆలయం పునర్నిర్మాణం కోసం కాశీ విశ్వనాథ్ కారిడార్ ప్రాజెక్టు శంకుస్థాపన.* 


👉 *12 ఎకరాల లో నూతన కారిడార్ నిర్మాణం.*


👉 *కారిడార్ నిర్మాణం కోసం 300కు పైగా నివాసాలను,1400 వ్యాపార సముదాయాలను ఒక్క కోర్టు కేసు లేకుండా తొలగింపు.*


👉 *మణికర్ణికా ఘాట్ నుంచి నేరుగా ఆలయానికి చేరుకునే విధంగా నిర్మాణం.*


👉 *కారిడార్ అవతలివైపు జ్ఞానవాపి మసీదు ఉండేలా డిజైన్.*


👉 *విశ్వనాథుని సన్నిధికి చేరుకునేందుకు సప్త ద్వారాలు.*


👉 *ఆలయ ప్రాంగణంలో ఆదిశంకరాచార్య మరియు అహల్యాబాయి విగ్రహాల ఏర్పాటు.*


👉 *ఆలయ పునర్నిర్మాణం రెండున్నర సంవత్సరాలలో పూర్తి చేసి రికార్డు సృష్టించిన ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం.*


👉 *2021 డిసెంబర్ 13 సోమవారం రోజున భారతదేశ ప్రధానమంత్రి యుగపురుషుడు హిందువులందరికీ ఆరాధ్య మైనవాడు శ్రీ శ్రీ శ్రీ నరేంద్ర దామోదర్ దాస్ మోడీ దివ్య కాశి-భవ్య కాశి కారిడార్ ప్రారంభోత్సవం చేసినారు.*


🙏 *ఈ మెసేజ్ చదివి ఊరుకోవడం కాకుండా మీకు వీలైనంత వరకు తప్పకుండా ఫార్వర్డ్ మరియు షేర్ చేయగలరు.*🙏

మంగళగిరి ఎయిమ్స్ ఆసుపత్రి

 👨‍⚕️ఆంధ్ర ప్రదేశ్ లోని మంగళగిరి ఎయిమ్స్ ఆసుపత్రి @183 ఎకరాల మంచి వాతావరణం లో, 1610 కోట్ల తో, 960 బెడ్లతో, షుమారు 600 మంది పైగా నిష్ణాతులైన ఉద్యోగులతో తో, 24/7 సేవలతో సెంట్రల్ గవర్నమెంట్ (జాతికి అంకితం చేసిన ) యొక్క యూజర్ చార్జీలు....

అద్భుతమైన హాస్పిటల్....

సరిహద్దు జిల్లాల (తెలంగాణ) సోదరులు కూడా ఈ సేవలు ఉపయోగించుకోవచ్చు....

అతితక్కువ చార్జీలు.... 

ఓపీ కేవలం పది 10/-  రూపాయలు.... 

ఆ పది రూపాయల ఫీజ్ తోనే జనరల్ మెడిసిన్, ఆర్థో, కళ్ళు, చెవి, ముక్కు, గొంతు (ENT) దంత వైద్యం, స్కిన్ లాంటివి చూపించుకోవచ్చు....

న్యూరో విభాగం ఇంకా ప్రారంభం కాలేదు....

అతిత్వరలో పూర్తిగా ఆపరేట్ చేస్తారు....

అలాగే క్యాంటీన్ కూడా చాలా నీట్ గా మెయింటైన్ చేస్తూ రుచికరమైన ఆహారం 75 రూపాయలకే....

బయట 5 నుంచీ 10 వేల రూపాయలు అయ్యే టెస్టులు కేవలం 500 నుంచీ 600 రూపాయలు మాత్రమే..

విజయవాడ నుంచీ హాస్పిటల్ కు బస్సులు ఉన్నాయి....

 మంగళగిరి బస్ స్టాండ్ నుంచి బస్సులు ఉన్నాయి కేవలం 10 రూపాయలు..

ఆటో ఐతే 30 నుంచి 50 రూపాయలు..

అత్యంత శుభ్రత...

డాక్టర్స్ కూడా అంకితభావంతో పని చేస్తున్నారు....

ఉదయం 9 గంటలకు వెళ్తే మధ్యాహ్నానికి బయటకు రావొచ్చు..

 ఈ అద్భుతమైన హాస్పిటల్ ను పూర్తిగా వినియోగించుకుందాం....

వివిధ టెస్టులు వాటికి అయ్యే చార్జీలు కింద ఉన్నాయి...


కన్సలటేషన్ ఫీజు -  Rs.10


కంప్లీట్ బ్లడ్ కౌంట్ (Hb%, TLC, DLC) - Rs.135


ఫాస్టింగ్ & రాండం బ్లడ్ షుగర్ - Rs.24+24


లివర్ ఫంక్షన్ టెస్ట్ - Rs.225


కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ - Rs.225


లిపిడ్ ప్రొఫైల్ - Rs.200


థైరాయిడ్ ప్రొఫైల్ - Rs.200


ECG - Rs.50


చెస్ట్ X-Ray - Rs.60


మామ్మోగ్రఫీ -Rs.630


అల్ట్రాసోనోగ్రఫీ - Rs.323


యూరిన్ ఎనాలిసిస్ - Rs.35


HIV రాపిడ్ టెస్ట్  - Rs.150


HBs యావరేజ్ రాపిడ్ టెస్ట్ - Rs.128

మిగిలిన టెస్టుల రేట్లు బిల్ కౌంటర్ వద్ద అందుబాటులో కలవు  ( కౌంటర్ No 06).


దీని గురించి తెలిసిన వారికి మెసేజ్ పెట్టండి కోంతమంది లేనివారు ఉంటారు వారికి మనం మెసేజ్ ద్వారా తెలియజేస్తే కోంత మీర మేలు జరుగుతుంది.... సర్వేజనా సుఖినోభవంతు🙏

నిరాడంబరత, నిర్భయత్వం

 🙏🕉️శ్రీమాత్రేనమఃశుభోదయం🕉️🙏        🏵️నిరాడంబరత, నిర్భయత్వం, నిరహంకారం, నిర్మలత్వం, నిర్మొహం వంటి ఉదాత్త లక్షణాలు వ్యక్తులకు సహజ మైన అలంకారాలుగా వర్దిల్లుతాయి.. సజ్జన సాంగత్యం అనేది సుగంద పరిమళ ద్రావ్యాల దుకాణం వంటిది.. ఆ దుకాణం వద్దకు వెళితే చాలు.. మనం కొన్నా, కొనపోయినా సువాసన మనకు తగలక మానదు🏵️జీవితంలో కొన్ని సార్లు ఒంటరిగా నడవాల్సిన సమయం రావచ్చు.. ఆది కష్టంగానే ఉంటుంది.. కానీ ఆ వంటరి తనమే డబ్బు విలువ, కష్టం విలువ, చదువు విలువ, మనుషుల విలువ, సమయం విలువ అన్నీ నేర్పిస్తుంది..ఒక సారి మనం ఓ ప్రయత్నం ప్రారంభిచాక ఆది సఫలంగా ముగిసే వరకూ మనం దాన్ని అంటిపెట్టుకుని ఉండడం చాలా ముఖ్యం🏵️మనిషి జీవితంలో నవ్విచ్చే పరిచయాలు కొన్ని,  ఏడిపించే పరిచయాలు కొన్ని, విసిగించే పరిచయాలు కొన్ని, వికశించే పరిచయాలు కొన్ని, కానీ ఏదో ఒకటి నేర్పించే పరిచయలే అన్నీ..జీవితంలో కష్టపడితే సంపద, హోదా, గౌరవం వస్తాయి.. కానీ దాన్ని నిలుపు కోవాలి అంటే గొప్ప సంస్కారం మంచి వ్యక్తిత్వం కలిగి ఉండాలి🏵️🏵️మీ *అల్లం రాజు భాస్కరరావు శ్రీ విజయ ఆయుర్వేదిక్ జనరల్ ఏజన్సీస్ D .N 29-2-3 గోకవరం బస్టాండ్ దగ్గర స్టేట్ బ్యాంక్ ఎదురుగా రాజమండ్రి వైద్య సలహాలు ఉచితం మందులు అయిపోయినా వారికి రాలేను వారికి కొత్త వారికి మందులు కొరియర్ ద్వారా పంపబడును  9440893593.9182075510* 🙏🙏🙏

⚜ శ్రీ పరశినికడవు ముత్తప్పన్ ఆలయం

 🕉 మన గుడి : నెం 1074


⚜ కేరళ  : కన్నూర్


⚜  శ్రీ పరశినికడవు ముత్తప్పన్ ఆలయం



💠 శ్రీ ముత్తప్పన్ దక్షిణ భారతదేశంలోని ఉత్తర కేరళ రాష్ట్రంలోని కన్నూర్ జిల్లాలో సాధారణంగా పూజించబడే ఒక దేవత.  

ముత్తప్పన్ లేదా తిరువప్పన్, శివుడు మరియు విష్ణువు యొక్క అభివ్యక్తిగా పరిగణించబడుతున్నాయి, 



💠 కన్నూర్ జిల్లాలోని తాలిపరంబ నుండి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న పరస్సినికడవు శ్రీ ముత్తప్పన్ ఆలయం లేదా పరస్సిని మడప్పుర శ్రీ ముత్తప్పన్ ఆలయం ఉత్తర కేరళలోని అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. 

ఈ ఆలయం మత, కులాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలను ఆకర్షిస్తుంది. 



💠 ముత్తపన్.. అతను తిరువప్పన (విష్ణువు) మరియు వెల్లతోమ్ (శివుడు) అనే రెండు వేర్వేరు దేవుళ్ల స్వరూపమని నమ్ముతారు.



💠 తిరువప్పన లేదా వలియ ముత్తపన్ ( విష్ణు ) ఎడమవైపు మరియు వెల్లతోమ్ లేదా చెరియ ముత్తపన్ ( శివుడు ) కుడివైపున ఉంటారు



🔆 ముత్తప్పన్ కథ


💠 నడువాజి (జమీందారు) అయ్యంకారా ఇల్లత్ వజున్నవర్ తనకు సంతానం లేనందున అసంతృప్తి చెందాడు. 

అతని భార్య  శివ భక్తురాలు.  

ఆమె శివునికి నైవేద్యంగా అనేక వస్తువులను సమర్పించింది.  

ఒకరోజు ఆమె కలలో స్వామిని చూసింది.  


💠 మరుసటి రోజు ఆమె సమీపంలోని నది నుండి స్నానం చేసి తిరిగి వస్తుండగా ఒక అందమైన పిల్లవాడు పూల మంచంలో పడుకుని ఉన్నాడు.  ఆ చిన్నారిని ఇంటికి తీసుకెళ్లి సొంత కొడుకులా పెంచింది.


💠 ఒకరోజు బాలుడు తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లి తన తల్లిదండ్రులకు విల్లు మరియు బాణం మరియు మండుతున్న కళ్ళతో తన దివ్య రూపాన్ని (విశ్వరూపం) చూపించాడు.  

ఆ అబ్బాయి మామూలు పిల్లవాడు కాదని, దేవుడని అతని తల్లిదండ్రులు అర్థం చేసుకున్నారు.


💠 బాలుడు స్థానికంగా తిరిగేవాడు మరియు ఎండు చేపలు, కందిపప్పు మరియు మాంసం కోసం తృప్తి చెందని ఆకలిని కలిగి ఉన్నాడు. 

అతని విచిత్రమైన మార్గాల కారణంగా అతను తన కుటుంబం నుండి బయటకు పంపబడ్డాడు. 

అతన్ని బయటకు పంపిన తర్వాత మాత్రమే విచిత్రమైన సంఘటనలు జరిగాయి మరియు ఈ బాలుడు సాధారణ పిల్లవాడు కాదని, దైవిక అవతారం అని నిరూపించబడింది. 

ఆ విధంగా ముత్తప్పన్‌ను ఆ ప్రాంతంలో పూజించడం ప్రారంభించారు. 


💠 చందన్ (నిరక్షరాస్యుడు మరియు నాగరికత లేని ఒక కల్లు కొట్టే వ్యక్తి )  అతని తాటి చెట్ల నుండి ప్రతిరోజూ తన కల్లు దొంగిలించబడుతుందని తెలుసు. కాబట్టి అతను తన తాటి చెట్లకు కాపలాగా ఉండాలని అనుకున్నాడు. అతను రాత్రి కాపలాగా ఉండగా, ఒక వృద్ధుడు కల్లును దొంగిలిస్తూ కనిపించాడు.  


💠 భర్త కోసం వెతుకుతూ అక్కడికి వచ్చిన చందన్ భార్య అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని చూసింది.  ఆమె గుండె పగిలి ఏడ్చింది.  

ఆమె తల ఎత్తి చూసేసరికి తాటిచెట్టు పైభాగంలో ఒక వృద్ధుడు కనిపించాడు.


💠 ఆమె “ముతప్ప” అని పిలిచింది (తాతని ఉద్దేశించి ముత్తప్పన్ అంటే మలయాళ భాషలో తాత అని అర్థం).  తన భర్తను రక్షించమని దేవుడిని ప్రార్థించింది. 

 చాలాసేపటికే చందన్ స్పృహలోకి వచ్చాడు.



💠 ఆమె ఉడకబెట్టిన కందులు , కొబ్బరి ముక్కలు, కాల్చిన చేపలు మరియు కల్లును ముత్తప్పన్‌కు సమర్పించింది. 

(ఈ రోజు కూడా శ్రీ ముత్తప్పన్ దేవాలయాలలో భక్తులకు ఉడకబెట్టిన కందులు  మరియు కొబ్బరి ముక్కలను అందిస్తారు).  

ఆమె అతని నుండి ఆశీర్వాదం కోరింది.  చందన్ కోరిక మేరకు ముత్తప్ప కున్నత్తూరును తన నివాసంగా ఎంచుకున్నాడు.


💠 ఆలయంలో ప్రసాదంగా సాధారణంగా ఉడకబెట్టిన నల్ల బీన్స్ మరియు టీ. 

ఇక్కడి దేవత చేపలు మరియు కల్లును నైవేద్యంగా సమర్పించడం ఆచారం. 

ఆ తర్వాత గుమిగూడిన వారికి పంపిణీ చేస్తారు. 


💠 ఈ ఆలయం దాని ప్రత్యేక సంప్రదాయాలు మరియు ఆచారాల కారణంగా మిగిలిన వాటి నుండి వేరుగా ఉంటుంది.

మూడు అంతస్తుల నిర్మాణంలో తెలుపు రంగులో చిత్రించబడిన ఆలయ నిర్మాణ శైలి కూడా సాంప్రదాయ ఆలయ నిర్మాణ శైలికి భిన్నంగా ఉంటుంది. 



💠 ముత్తప్పన్ తరచుగా కుక్కతో కలిసి ఉంటాడని నమ్ముతారు కాబట్టి, ఆలయంలో కుక్కలను పవిత్రంగా భావిస్తారు.

 అందువల్ల ఆలయ ప్రాంగణం నిండా వీధి కుక్కలతో గౌరవంగా చూసుకోవడం సర్వసాధారణం. 

వాస్తవానికి, ప్రతి రోజు ప్రసాదం సిద్ధంగా ఉన్నప్పుడు, ఇతర భక్తులకు అందించడానికి ముందు ఆలయ సముదాయంలో సిద్ధంగా ఉన్న కుక్కకు ఇది వడ్డిస్తారు. 


🔆 సమర్పణలు:


💠 శ్రీ ముత్తప్పన్‌కు భక్తులు సమర్పించే సాంప్రదాయ నైవేద్యాలు పైమ్‌కుట్టి, వెల్లట్టం మరియు తిరువప్పన.  

ప్రధాన పూజారి నైవేద్యాలు వేచెరింగట్ (అరటిపండు, మిరియాలు, పసుపు పొడి మరియు ఉప్పు కలిపిన మిశ్రమం), నీర్కారి (ముడి బియ్యం పొడి, ఉప్పు, పసుపు పొడి మరియు మిరియాల మిశ్రమం), ఉడికించిన శెనగ లేదా కొబ్బరి ముక్కలు. 



 💠 భారతదేశంలోని కేరళలోని కన్నూర్ జిల్లాలోని కన్నూర్ పట్టణానికి 20 కిమీ (12 మైళ్ళు) దూరం



రచన

©️ Santosh Kumar

16-04-గీతా మకరందము

 16-04-గీతా మకరందము

   దైవాసురసంపద్విభాగయోగము

       

-పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,

శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.


అవతారిక - ఇక అసురసంపదను (అసురగుణములను) పేర్కొనుచున్నారు -


దమ్భో దర్పోఽభిమానశ్చ 

క్రోధః పారుష్య  మేవ చ | 

అజ్ఞానం చాభిజాతస్య 

పార్థ సమ్పదమాసురీమ్ || 


తాత్పర్యము:- ఓ అర్జునా! డంబము, గర్వము, అభిమానము (దురహంకారము), కోపము, (వాక్కు మున్నగువానియందు) కాఠిన్యము, అవివేకము అను ఈ దుర్గుణములు అసురసంపత్తియందు పుట్టినవానికి కలుగుచున్నవి. (అనగా అసురసంపత్తిని పొందదగి జన్మించినవానికి కలుగుచున్నవని భావము).


వ్యాఖ్య:- ఇదివఱలో తెలుపబడిన సుగుణములను దైవనిష్ఠులు, భక్తులు, ఎట్లు  సంపదగను, గొప్పదనముగను భావించుచున్నారో అట్లే  ఈశ్లోకమునందు తెలుపబడిన దుర్గుణజాతమును అసురులు, దుర్మార్గులు గొప్పసంపదగ తలంచుకొని మురిసిపోవుచు వానినే ప్రీతితో సేవించుచున్నారు. కాబట్టియే వానికి అసురసంపదయను పేరు గలిగినది. అంతియేకాని వాస్తవముగ అవి సంపద్రూపములుకావు. దారిద్ర్యరూపములేయగును. పూర్వము ఇరువదియాఱు సుగుణములను పేర్కొని, ఇపుడు ఆఱు దుర్గుణములను మాత్రము వచించుచున్నారు. ఈ దుర్గుణములనే వివరించి భగవానుడు విస్తారముగ చెప్పబోవుదురు. సాధకుడు మాయతో, ప్రకృతితో, అవిద్యతో నొనర్చు సంగ్రామమందు స్వపక్షవీరులను, ప్రతిపక్షవీరులను ఇరువురినిగూర్చి బాగుగ తెలిసికొని యుండవలెను. అపుడే స్వపక్షసైనికులను బలపఱచుకొనుటకును, పరపక్షసైనికులను దునుమూడుటకును వీలుండును. కనుకనే భగవాను డిచట దైవసంబంధమైన పవిత్రగుణములను పేర్కొని అంతటితో ఊరుకొనక అసురసంబంధమైన అపవిత్రగుణములనుగూడ పేర్కొనుచున్నారు. ఒకయిల్లు శుభ్రముగానుండవలెననిన, అందు పూర్వముండిన దుమ్ము, బూజు, మురికినీరు మున్నగువానిని నిర్మూలించి, శుభ్రజలముచే కడిగి, ధూపాదులచే  ఇంటిని పరిమళవంతముగజేసి, త్రాగుటకు బయటనుండి మంచినీరు మున్నగువానిని లోనికి తెచ్చుకొనవలెను. శరీరము ఆరోగ్యముగ, పుష్టిగ నుండవలెననిన, లోనగల మలమూత్రాదులు బయటపోవలెను; చక్కని పుష్టికరఆహారము, పానీయము లోనికి పోవలెను. ఆ ప్రకారముగనే మనఃపారిశుద్ధ్యము నిమిత్తము ఆ మనస్సునందు అనాదిగనుండుచున్న దుష్టప్రవృత్తులను, దుర్వాసనలను, దుర్గుణములను బయటకుగెంటివేసి, అనగా ఆసురీసంపదకు ఉద్వాసనముచెప్పి, సద్గుణములను (సచ్ఛీలమును) అనగా  దైవీసంపదను ఆహ్వానించవలెను, అవలంబించవలెను.

       దుర్గుణములలో మొట్టమొదట దంభము చెప్పబడినది. పరమార్థరంగమునగాని ఏ రంగమునగాని కపటము, వేషము, మోసము పనికిరాదు. తాము గొప్పవారమని నటించినంత మాత్రమున ఒకవేళ వారు లోకులను మోసపుచ్చగలరేమో కాని భగవంతుని మోసపుచ్చలేరు. వారి హృదయగుహయందు దాగి వారి సంకల్పములన్నిటిని సర్వేశ్వరుడు కనిపెట్టుచునేయున్నాడు. కాబట్టి డంబమను దుర్గుణమును మొదలంట నఱకివేయవలెను. గర్వమును పారద్రోలవలెను. తనకేదైన గొప్పవిద్యగాని, అధికారముగాని లభించినచో గర్వపడక, అదియంతయు సర్వేశ్వరుని యనుగ్రహమువలననే కలిగినదని భావించి వినయాన్వితుడై యుండవలెను. అట్లే  క్రోధమును విడువవలెను. దైవగుణములలో ‘అక్రోధము’, అసురగుణములలో ‘క్రోధము’ చెప్పబడుట గమనింపదగినది. అక్రోధమును గ్రహింపుమని చెప్పినను, క్రోధమును త్యజింపుమని చెప్పినను రెండును ఒకటే. దైవ, అసురసంపత్తుల రెండిటియందును క్రోధమును గూర్చిన ప్రస్తావన వచ్చుట వలన క్రోధరాహిత్యము అధ్యాత్మక్షేత్రమున ఎంత ఆవశ్యకమో తేటతెల్లమగుచున్నది. మఱియు సాధకుడు పరుషముగా మాట్లాడరాదు. వాక్కు మున్నగు వానియందు కాఠిన్యము చూపరాదు. దైవగుణములలో పేర్కొనబడిన "మృదుత్వము”నే స్వీకరించవలెను.


ప్రశ్న:- అసురగుణము లెన్ని చెప్పబడెను? అవియేవి?

ఉత్తరము:- ఆఱు. అవి క్రమముగ (1) డంబము (2) గర్వము (3) అభిమానము (4) కోపము (5) కాఠిన్యము (6) అవివేకము అనునవి అయియున్నవి. ఈ దుర్గుణములే ఆసురీసంపద యనబడును.

ప్రశ్న:- ఈ దుర్గుణముల నేమిచేయవలెను? 

ఉత్తరము:- లెస్సగ పరిత్యజించవలెను.

తిరుమల సర్వస్వం 202-*

 *తిరుమల సర్వస్వం 202-*

 *శ్రీవారి సేవకులు-1* 


 శ్రీవారి గురించి, ఆనందనిలయం గురించి, తిరుమలక్షేత్రం గురించి ఎన్నో విషయాలు తెలుసుకున్న తరువాత సహజంగానే భక్తుల మదిలో ఎన్నో ఆలోచనలు వస్తాయి. తిరుమలలో కొద్ది రోజులు గడపాలని, స్వామివారికి సాధ్యమైనంత సేవ చేయాలని అసంకల్పితంగానే మదిలో మెదులుతుంది. శ్రీవెంకటేశ్వరుడు భక్తులను ప్రాణప్రదంగా చూసుకుంటాడని మనకు తెలుసు. అందువల్ల శ్రీవారి భక్తులను సేవించుకున్నా శ్రీనివాసుని సేవించుకున్నట్లే! ఈ పరమసత్యాన్ని గ్రహించినట్టి శ్రీవారి భక్తాగ్రేసరులైన శ్రీమద్రామానుజులవారు, హాథీరామ్ బావాజీ, తరిగొండ వెంగమాంబ, శ్రీకృష్ణదేవరాయల వంటివారు, శ్రీవారితో బాటుగా, వారి భక్తులకు సైతం అనేక రకాలుగా సేవలందించారు. ఇప్పుడు భక్తుడు భగవంతుడు, ఇరువురికీ సేవ చేసుకునే అవకాశాన్ని తి.తి.దే. వారు కల్పిస్తున్నారు.


 దాదాపు శతాబ్దం క్రితం వరకు కేవలం వందల సంఖ్యలో మాత్రమే ఉండే భక్తజనం ఇంతింతై వటుడింతై అన్నట్టుగా దినదిన ప్రవర్ధమానమవుతూ, క్రమంగా వేల సంఖ్యను దాటి ఇప్పుడు లక్షల్లోకి చేరుకుంది. అదే వేసవిశెలవులు, బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి, నూతన సంవత్సర సందర్భాల్లో, రోజువారీ భక్తుల సంఖ్య రెండు లక్షల పైమాటే! ఇంత మంది భక్తులను నియంత్రించడానికి, దర్శానాది కార్యక్రమాలు సజావుగా జరగటానికి స్వచ్ఛందంగా సేవలందించే వేలకొద్దీ కార్యకర్తలు కావాలి. అంతే గాకుండా ఆసక్తి కలిగిన భక్తులకు ఆ పరమపవిత్రమైన ప్రదేశంలో సేవ చేసుకునే అవకాశం కల్పించాలి. ఈ రెండు పరమార్థాలను నెరవేర్చటానికి తి.తి.దే. వారు ప్రవేశపెట్టినదే *'శ్రీవారిసేవకుల'* వ్యవస్థ.


 ఇప్పుడీ వ్యవస్థ తీరుతెన్నులను పరిశీలిద్దాం.


 *ఎంతెంత మంది? ఎవరెవరు??* 


 ప్రప్రథమంగా, 2000వ సంవత్సరంలో కేవలం 195 మంది స్వచ్ఛంద సేవకులతో 'శ్రీవారి సేవకులు' వ్యవస్థను తి.తి.దే. ప్రారంభించింది. క్రమంగా ఈ స్వచ్ఛంద సేవకుల సంఖ్య పెరుగుతూ, ప్రస్తుతం ప్రతిరోజు 1,500 నుంచి 2,500 వరకు సేవకులు వివిధ సేవాకార్యక్రమాల్లో పాలుపంచుకుంటున్నారు. అయినప్పటికీ ఇంకా కొన్ని వేల మంది భక్తులు తి.తి.దే. తో నమోదు చేసుకుని, అవకాశం కోసం నెలల తరబడి వేచి ఉంటున్నారు. ఇప్పటివరకు సుమారుగా 8 లక్షలకు పైగా భక్తులు శ్రీవారిసేవకులుగా నమోదు చేసుకొని సేవలందించారు.


 ప్రపంచం నలుమూలల నుండి శ్రీవారి దర్శనార్థం భక్తులు తిరుమలకు విచ్చేస్తుంటారు. వారిలో అన్నెం పున్నెం ఎరుగని గ్రామీణభక్తులు, జీవితంలో మొట్టమొదటిసారిగా తమతమ గ్రామాలను దాటి వేరే చోటికి వచ్చినవారు ఇలాంటి వారెందరో కూడా ఉంటారు. విశేషసందర్భాల్లో, పర్వదినాల్లో తిరుమలకొండ ఇసుక వేస్తే రాలనంతగా క్రిక్కిరిసి ఉంటుంది. దీంతో వృద్ధులు, వికలాంగులు, మహిళలకు దర్శనం, వసతి, తిరుగుప్రయాణం, స్వామివారి సేవల విషయంలో అనేక ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. అంతేగాక, ఇతర రాష్ట్రాలకు చెందిన భక్తులకు భాష విషయంలోనూ జటిలమైన సమస్య తల ఎత్తే సందర్భాలు ఉంటాయి. ఇలాంటి సమయాలలో శ్రీవారిసేవకులు వారికి చేదోడు వాదోడుగా ఉండి, తగిన సమాచారమిచ్చి, కావలసిన సహాయం అందిస్తారు. ఈ సేవలో పాల్గొనడానికి ప్రధానంగా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, ఒరిస్సా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు చెందిన భక్తులు ఆసక్తి చూపుతారు. శ్రీవారి సేవలో పేరెన్నికగన్న వైద్యులు, ఇంజినీర్లు, న్యాయవాదులు, విద్యావేత్తలు, ప్రముఖవ్యాపారులు వంటి సమాజంలో ఉన్నతస్థాయికి చెందిన వ్యక్తులు కూడా అధిక సంఖ్యలో పాల్గొంటారు. వీరందరికీ తమ తమ వృత్తి నైపుణ్యానికి అనువైన సేవావిభాగాన్ని తి.తి.దే. వారు కేటాయిస్తారు.


 *ఏఏ సేవలందిస్తారు ?* 


 ప్రస్తుతం ఇరవై ఐదు విభాగాల్లో శ్రీవారి సేవకులను తి.తి.దే. వినియోగించు కుంటోంది. వాటిలో ముఖ్యమైనవి శ్రీవారి ముఖ్యాలయంలో వరుస నియంత్రణ; వైకుంఠం క్యూ సముదాయాల్లో భక్తుల బాగోగులు చూడటం; నాలుగు మాడవీధుల్లో నడిచే భక్తులకు తగిన సూచనలు అందించడం; తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద సముదాయంలో భక్తులకు ఏ విధమైన ఇబ్బంది కలుగకుండా చూడటం; కూరగాయలను శుభ్రపరచడం, తరగడంలో వంటకార్మికులకు సహాయపడడం; లడ్డూ ప్రసాదకేంద్రాలలో క్యూలను నియంత్రించడం; ఉద్యానవన విభాగం ఆధ్వర్యంలో పూలమాలలను అల్లడంలో సహాయపడటం; వివిధ ప్రదేశాలలో వేచి ఉండే భక్తులకు మంచినీరు, ఇతర పానీయాలు, ఫలహారం అందించడం; చిన్నపిల్లలకు పాలు సరఫరా; లగేజీ సెంటర్లలో సాయం; భక్తులకు తిరునామం దిద్దటం; భక్తులకు అత్యవసర సందర్భాలలో ప్రథమచికిత్స అందించడం; తప్పిపోయిన పిల్లలను తల్లిదండ్రుల వద్దకు చేర్చడం; పరకామణి సేవలు మొదలైనవి.

*శ్రీనివాసుని శ్రీచరణాలను సేవిద్దాం, సకల శుభాలనూ పొందుదాం* 


*రచన* 

*పల్లపోతు కృష్ణ బాలాజీ గారు- వాణి శ్రీ దంపతులు*

ఫోన్ నెంబర్

99490 98406

మహాభారతము

 *సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*

*ద్రోణ పర్వము పంచమాశ్వాసము*


*341 వ రోజు

*కురు పాండవుల సమరం*

కర్ణుడు యుద్ధానికి రావడం చూసిన పాండవ యోధులు అందరూ " మన పాండవులు ఇంతటి దుర్ధశకు ఈ వినాశనానికి కారణమైన కర్ణుని వదలకండి వధించండి " అని అతడిని చుట్టుముట్టారు. కర్ణుడు అందుకు బెదరక ధైర్యంగా వారిని ఎదుర్కొని చీల్చిచెండాడసాగాడు. అది చూసి అర్జునుడు కర్ణుని ఎదుర్కొని ముప్పది బాణములతో అతడిని కొట్టాడు. కర్ణుని చేతిలో నుండి విల్లు జారిపోయింది. వేరొక విల్లు అందుకుని కర్ణుడు అర్జునుడు ఆశ్చర్యపడేలా శరములు గుప్పించాడు. అర్జునుడు ఆగ్రహించి ఒకే బాణంతో కర్ణుని విల్లు విరిచి, సారథి, హయములను చంపి కర్ణుని శరీరం నిండా శరములు గుచ్చాడు. వెంటనే కర్ణుడు కృపాచార్యుని దూషించానన్న సిగ్గు వదిలి పక్కనే ఉన్న అతడి రథము ఎక్కి తలదాచుకున్నాడు. కృపాచార్యుని రథము అక్కడి నుండి నిష్క్రమించింది. కర్ణుని పరాజయం చూసి కౌరవ సైన్యం పారిపోసాగింది. సుయోధనుడు " సైనికులారా ! పారిపోకండి నేను ఉన్నాను పాండవులను జయించగలము రండి " అని అర్జునుడిని ఎదుర్కోడానికి ముందుకు ఉరికాడు. ఇది గమనించిన కృపాచార్యుడు అశ్వత్థాను చూసి " కుమారా! అశ్వత్థామా ! రారాజు తన బలం ఎంతో ఎరుగక అర్జునుడితో యుద్ధానుకి సన్నద్ధమౌతున్నాడు. అలా జరిగితే అతడు అర్జునుడికి పట్టుబడగలడు. నీవు ఇక్కడ ఉండగా అది జరుగరాదు. కనుక నీవు రారాజుకు సాయంగా వెళ్ళు " అన్నాడు. అశ్వత్థామ సుయోధనుడిని సమీపించి " సుయోధనా ! నేనుండగా నీ కెందుకు శ్రమ నేను అర్జునుడిని ఎదుర్కొంటాను నువ్వు వెళ్ళు " అన్నాడు. సుయోధనుడు " గురుపుత్రా ! నీకు నీ తండ్రికి అర్జునుడంటే వల్లమాలిన ప్రేమ మీరు అర్జునుడితో మనసారా యుద్ధం చేసి అతడిని చంపరు. ఇప్పటికే నా తమ్ములు చనిపోయారు సైన్యం క్షీణించింది. కనుక మీరు పాండవుల వద్దకు రావద్దు. మీరు పాండవులతో యుద్ధం చెయ్య వద్దు నేను వారితో యుద్ధం చేస్తాను. మీరు వారి సేనలను నశింపచేయండి " అన్నాడు. అశ్వత్థామ " రారాజా ! నాకు నా తండ్రికి అర్జునుడంటే అభిమానం ఉన్న మాట నిజమే అయినా యుద్ధరంగంలో శత్రుపక్షాన ఉన్న వారు మిత్రులైనా, బంధువులైనా, అభిమానాలకు తావుండదు. మేము మా ఒళ్ళు దాచక యుద్ధం చేయడం చూస్తూనే నువ్వు మమ్ము నమ్మడం లేదు నువ్వు ఎవరినీ నమ్మవు అసలు నిన్ను నువ్వే నమ్మవు. అదంతా ఎందుకు నేను శత్రు సైన్యంలో ప్రవేశించి ధృష్టద్యుమ్నుని ఎదుర్కొని అతడి సైన్యమును పారతోలుతాను " అంటూ పాండసేనలో ప్రవేశించాడు.

.


*రేపు *

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*

*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*

విశ్వనాథాష్టకం

 *విశ్వనాథాష్టకం*


గంగా తరంగ రమణీయ జటా కలాపం

గౌరీ నిరంతర విభూషిత వామ భాగం

నారాయణ ప్రియ మనంగ మదాపహారం

వారాణసీ పురపతిం భజ విశ్వనాథం


వాచామ గోచర మనేక గుణ స్వరూపం

వాగీశ విష్ణు సురసేవిత పాద పీఠం

వామేణ విగ్రహ వరేణ కళత్రవంతం

వారాణసీ పురపతిం భజ విశ్వనాథం


భూతాదిపం భుజగ భూషణ భూషితాంగం

వ్యాఘ్రాజినాం బరధరం జటిలం త్రినేత్రం

పాశాంకుశాభయ వరప్రద శూలపాణిం

వారాణసీ పురపతిం భజ విశ్వనాథం


సీతాంశు శోభిత కిరీట విరాజమానం

ఫాలేక్షణానల విశేషిత పంచబాణం

నాగాధిపా రచిత బాసుర కర్ణ పూరం

వారాణసీ పురపతిం భజ విశ్వనాథం


పంచాననం దురిత మత్త మతంగజానాం

నాగాంతకం ధనుజ పుంగవ పన్నాగానాం

దావానలం మరణ శోక జరాటవీనాం

వారాణసీ పురపతిం భజ విశ్వనాథం


తేజోమయం సగుణ నిర్గుణ మద్వితీయం

ఆనంద కంద మపిరాజిత మప్రమేయం

నాగాత్మకం సకల నిష్కళ మాత్మరూపం

వారాణసీ పురపతిం భజ విశ్వనాథం


ఆశాం విహాయ పరిహృత్య పరశ్య నిందాం

ఉపేన చింత్య సునివార్య మనస్సమాధౌ

ఆదాయ హృత్కమల మధ్య గతం ప్రవేశం

వారాణసీ పురపతిం భజ విశ్వనాథం


రాగాధి దోష రహిత స్వజనానురాగం

వైరాగ్య శాంతి నిలయం గిరిజా సహాయం

మాధుర్య ధైర్య సుభగం గరళాభిరామం

వారాణసీ పురపతిం భజ విశ్వనాథం


వారాణసీ పురపతే స్థవనం శివస్య

వ్యాసోత్త మష్టకమిదం పఠతా మనుష్య

విద్యాం శ్రియం విపుల సౌఖ్యమనంత కీర్తిం

సంప్రాప్య దేహవిలయే లభతే చ మోక్షం


విశ్వనాథాష్టక మిదం యః పఠేః శివ సన్నిధౌ

శివలోక మవాప్నోతి శివేన సహమోదతే


                - వేదవ్యాస మహర్షి

       గానం - యస్.పి. బాలసుబ్రహ్మణ్యం

శ్రీమద్భగవద్గీత

 శ్రీమద్భగవద్గీత: నాల్గవ అధ్యాయం

జ్ఞానయోగం: శ్రీ భగవానువాచ


బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున 

తాన్యహం వేద సర్వాణి న త్వం వేత్థ పరంతప (5)


అజో௨పి సన్నవ్యయాత్మా భూతానామీశ్వరో௨పి సన్ 

ప్రకృతిం స్వామధిష్ఠాయ సంభవామ్యాత్మమాయయా (6)


అర్జునా.. నాకూ నీకూ ఎన్నో జన్మలు గడిచాయి. వాటన్నిటినీ నేను ఎరుగుదును. నీవు మాత్రం ఎరుగవు. జననమరణాలు లేని నేను సర్వప్రాణులకూ ప్రభువునైనప్పటికీ నా పరమేశ్వర స్వభావం విడిచిపెట్టకుండానే నేను మాయాశక్తివల్ల జన్మిస్తున్నాను.

తూర్పుగోదావరి* *కోనసీమ తిరుపతి*

 🍀🌻🍀🌻🍀🌻🍀🌻🍀


. *తూర్పుగోదావరి* 

    *కోనసీమ తిరుపతి* 

    *వాడపల్లి వెంకన్న...!!*


ఏడువారాల వెంకన్న *‘వాడపల్లి’* లో ఉన్నాడు…

తూర్పుగోదావరి జిల్లా. గోదావరి రెండుగా చీలి ప్రవహిస్తోంది. కలియుగ పుణ్యథామంగా విలసిల్లుతున్న వాడవల్లి గ్రామంలోని వెంకన్న గురించి చెప్పుకుని తరించాల్సిందే! 


గౌతమి వశిష్ట పాయలుగా విడి సుమారు 100కిమీ మేర ప్రయాణించి సముద్రుణ్ణి చేరుతుంది. రాజమండ్రి నుండి అటు ధవళేశ్వరం మీదుగా 30 కిమీ ప్రయాణం చేసినా.. ఇలా రావులపాలెంనుడి 8 కిమీ ప్రయాణం చేసినా *ఆత్రేయపురం మండలంలోని వాడపల్లి* గ్రామం చేరుకోవచ్చు.


ఇప్పుడు బాగా వినిపిస్తున్న మాటేమంటే ఒక ఏడువారాలు వాడపల్లి వెంకన్నను దర్శిస్తే అనుకున్నది నెరవేరుతుందని. పుణ్యతీర్థాల దర్శనం గురించి మనకు పురాణేతిహాసాలు చెబుతూనే ఉన్నాయి. భారతంలో ప్రతీపుడు అనేక పుణ్య తీర్థాల్లో స్నానం ఆచరించిన తర్వాతే శంతనుడు జన్మించాడు. తీర్థ స్నానాన్ని గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. గోదావరి నదీ ప్రవాహం అనేక మూలికా ద్రవ్యాలతో కూడుకున్నది. 


ఎన్నో వనాలనుండి నీరు ప్రయాణించుకుంటూ వస్తోంది. అందుకే నదీ స్నానం పరమ పుణ్యఫలం. అక్కడే భగవంతుని ప్రతిష్టలు జరిగాయి. ఈ వాడపల్లి క్షేత్రంకు అదే మహత్తు ఏర్పడటానికి కారణం. చందన వెంకన్న అని ఈయనకు పేరు. చందన వృక్షం మానులో ఈయన ఉన్న విషయాన్ని గ్రామ వాసులు కనుగొని ప్రతిష్టించారు. ఒకసారి పురాణ చరిత్రను చూద్దాం!


🌻 *స్థల పురాణం*


కలియుగంలో ప్రజలు ఆహార విహారాదులకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. అధర్మం పాలు పెరిగింది. స్వార్థం పెరిగి కామ క్రోథాదులతో జనం అధర్మజీవనం గడుపుతన్నారని వైకుంఠంలో సనకసనందనాదులు శ్రీమన్నారాయణుణ్ణి వేడుకున్నారు.  

తాను గౌతమీ నదీతీరంలోని నౌకాపురం వద్ద్ద లక్ష్మీ సమేతుణ్ణై చందన వృక్షపేటికలో వెలుస్తాను అని చెప్పడం, నారదుడు ఈవిషయాన్ని అందరికి చేరవేయడం జరిగింది.


కొంతకాలానికి నౌకాపురం(ఇప్పటి వాడపల్లి) ప్రజలకు గౌతమీ గోదావరిలో కొట్టుకొస్తున్న వృక్షం కనిపించింది. తీరా ఒడ్డునకు తీసుకొద్దామంటే దారిలో మాయమయ్యేది. కలి కల్మషం వల్ల మీరు దీనిని గుర్తించలేకపోతున్నారని పండితులకు స్వామి కలలో కనబడి ‘నదీగర్భంలో కృష్ణ గరుడ వాలినచోట చందనపేటికలో ఉన్నానని‘ తెలుపడంతో అందరూ వెళ్ళి చందన పేటికను కనుగొన్నారు. దానిని ఒడ్డునకు చేర్చి నిపుణుడైన శిల్పితో తెరిపిస్తే దానిలో శంఖ, చక్ర, గదలతో కంఠంలో వనమాలతో నుదుట ఊర్ధ్వపుండ్రాలతో పద్మాలవంటి కనులతో ఒప్పుతున్న స్వామి దివ్యమంగళ విగ్రహం కనబడింది.  


దేవర్షి నారదుడు అక్కడికి చేరుకుని గతంలో స్వామి మునులకు ఇచ్చిన వరాన్ని గుర్తు చేసుకుని ఇది విష్ణువు అర్చావతారంగా గుర్తెరిగి పురజనులకు తెలిపాడు. కలియుగంలో పాపం పెచ్చుమీరిన తరుణంలో స్వామి దర్శనంతో ఆలోచన సవ్యమై జీవనం సుఖంగా సాగుతుందనేది పురాణ ఇతివృత్తం. పెద్ద తిరుపతి, ద్వారకా తిరుమల (చిన్న తిరుపతి)లానే కోనసీమ తిరుపతిగా నౌకాపురమనే ఇప్పటి వాడపల్లి క్షేత్రం ఎంతో ఖ్యాతి గడించింది. నిలువెత్తు దివ్యమంగళ స్వరూపం చూడగానే ఆనందింప చేసే రూపంగా లక్ష్మీ స్వరూపుడై వెంకన్నదర్శనమిస్తాడు.


🌻 *ఆలయం*


మూడు మండపాలలో ఎత్తైన ప్రాకార గోపురాలతో దేవాలయం కట్టింపజేసి లయం ముందుభాగంలో పదహారు స్తంభాలతో కూడిన యజ్ఞశాల కనిపిస్తాయి. ప్రధానాలయానికి కుడివైపున క్షేత్రపాలకుడు మరియు ద్వాదశ గోపాలాలలో ఒకటిగా చెప్పుకునే నారద ప్రతిష్టితమైన శ్రీరుక్మిణీ సత్యభామ సమేత శ్రీవేణు గోపాలస్వామి, త్తరం వైపున అలివేలుమంగ, ఆగ్నేయ భాగంలో రామానుజులు, ఆలయ అభిముఖంగా గరుత్మంతుని ఆలయం కనిపిస్తాయి. అలాగే ఇదే ప్రాంగణంలో అన్నపూర్ణ సమేత విశ్వేశ్వరుని ఆలయం దర్శనమిస్తుంది.


పెద్దాపురం సంస్థానాధీశుడు రాజా వత్సవాయి తిమ్మగజపతి రాజు 1759లో స్థిరాస్థులు సమర్పించారు.గజేంద్రుడు అనే ఓడల వ్యాపారి ఇక్కడే నివసించేవాడు. దీనికి ఓడపల్లి అనే గ్రామంగా విలసిల్లి తర్వాత వాడపల్లిగా వినుతికెక్కింది. తన ఓడలన్నీ భ్రదంగా ఒడ్డుకు చేరితే గుడి కట్టిస్తానని మొక్కుకుని గజరాజు ఈ క్షేత్రం నెలకొల్పినట్టు స్థానికుల వాక్కు.


🌻 *చైత్రశుద్ధ ఏకాదశి*


చైత్ర శుద్ద ఏకాదశి రోజున స్వామి కల్యాణం తీర్థం జరగుతాయి. వాడపల్లి తీర్థం అంటే ఈ ప్రాంతంలో ఎంతో ప్రశస్థి కెక్కింది. మరో విశేషమేమంటే సంతానం కలగని వారు ఈయనను దర్శించుకున్న తర్వాత సంతానవంతులౌతారు. 

అందుకే పటికబెల్లం, హారతి, చిల్లరలతో సంతానం కలిగిన తర్వాత తూకం వేసి స్వామికి సమర్పించడం కద్దు. అంతేకాదు హారతికర్పూరం తోను తులాభారం వేస్తారు. ఈ వేడుకలు చూసి తరించాల్పిందే. కలియుగంలో పాప ప్రక్షాలన కోసం భగవదారాధన తప్పనిసరి. 


పుణ్యక్షేత్రాల ఫలితం తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే దేవతార్చన ప్రాంతాల్లో మంత్ర శక్తి (వైబ్రేషన్స్) ఉంటాయనడానికి ఆధునిక కాలంలో అనేక ఉదాహరణలు ఉన్నాయి.


🙏 *సర్వేజనా సుఖినోభవంతు*

దానగుణ విశిష్టత!

 శు  భో  ద  యం 🙏


దానగుణ విశిష్టత!


ఈరోజు దానగుణం ఎంతవిశిష్టమైనదో తెలిసికుందాము. 


                      శా:- ఆదిన్ శ్రీసతి కొప్పుపై, తనువుపై, నంశోత్తరీయంబుపై, 

                              పాదాబ్జంబులపై, కపోలతటిపై, పాలిండ్లపై , నూత్నమ 

                                ర్యాదంజెందు కరంబుక్రిందగుట, మీదై  నాకరమబుంటమే          

                                 ల్గాదే? రాజ్యము గీజ్యమున్ సతతమే కాయంబు వాపాయమే? 

                     

                  శ్రీమదాంధ్రమహాభాగవతము - పోతన- వామనచరిత్రము 


            వివరణ:- దేవతావిరోధియగు బలిచక్రవర్తని మూడడుగులదానమును వామనుడు అడుగుసందర్భము . 

                           వచ్చినది శ్రీహరియని శుక్రాచార్యులవారు గ్రహించి దానమువలన కలుగు పరిణామము నూహించి 

                            బలిని వలదని వారింపగా బలియన్నమాటలను కవినిపుణముగా వర్ణించినాడు అంత్యప్రాసలతో 

                             నందగించిన పోతనకవితాసౌందర్యము తోబాటుగా బలి పరమౌదార్యమును తెలిసికొనుటకు

                             ప్రయత్నంచేద్దాము. 


                                                   వచ్చినవాడు'హరి'దానమీయవలదు అనివారించు శుక్రునితో " శ్రీసతి శిరోజాలంకృతిపై, మేనుపై, భుజములపైనుండు ఉత్తరీయముపైనను ,పాదపద్మములపైనను,బుగ్గలపైనను,  పయోధరములపైనను  నూత్నమర్యాదలతో సంచరించు నా శ్రీహరి హస్తము క్రిందగుట, మీదుగా నాహస్తమగుట 

ఆహా !ఎంతటి అదృష్టము. ఈరాజ్యము శాశ్వతమా? శరీరము అపాయరహితమా? ఏదియేమైనను ఇంతటిమంచి 

అవకాశమునువిడువను దానమవస్యముగా నిత్తునని యట్లేయొనరించినాడు .ఆహా!బలియెంతటిమహనీయుడు!!.

                దానముమిగులగప్పది .వేదములు" నకర్మణా నప్రజయా నధనేన దానేనైకేనామృతత్వమానసుః" నీవు 

     చేయుపనులవలనగానీ, నీసంతానముచేతగానీ, నీకున్నధనముచేతగానీ అమృతత్వాన్ని (అమరత్వము)పొందలేవు. 

      దానగుణం ఒకటి ఉంటేచాలును అమృతత్వం పొందగలవు. అంటోంది. కాబట్టిఉత్తమ గుణాలలో మిన్నయైన దాన

        గుణాన్ని అందరూ అలవరచుకోవటం ఉత్తమం.అది మనకు సమాజానికీ చాలామేలు చేస్తుంది .🙏🙏🙏🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🙏🌷🌷🌷🌷

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*


*విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు*


*కలియుగాబ్ది 5126*

*శ్రీ శాలివాహన శకం 1947 స్వస్తి శ్రీ    చాంద్రమాన  విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం  - వసంత ఋతువు - చైత్ర మాసం - శుక్ల పక్షం  - ద్వాదశి - మఘా -‌‌ సౌమ్య వాసరే* (09.04.2025)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.






.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*