20, జులై 2024, శనివారం

అజ్ఞానపు తిమిరంబును

 *2041*

*కం*

అజ్ఞానపు తిమిరంబును(చీకట్లను)

విజ్ఞాన పు కాంతి చేత వెలిగించుటకై

సుజ్ఞాన బోధలొనరెడి

ప్రజ్ఞావంతుడు గురువిల(గురువగు) పదపడి సుజనా.

*భావం*:-- ఓ సుజనా! అజ్ఞానం అనే చీకటి ని విజ్ఞానమనే కాంతి తో వెలిగించడానికి మంచి జ్ఞానం బోధించగలిగే సమర్థుడే గురువు.


*అందరికీ గురుపూర్ణిమ శుభాకాంక్షలు.*

*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*

Panchaag


 

జూలై 21, 2024*🌹 *దృగ్గణిత పంచాంగం*

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*

        🌞 *ఆదివారం*🌞

   🌹 *జూలై 21, 2024*🌹

      *దృగ్గణిత పంచాంగం*                   


 *స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం* 

*దక్షిణాయణం - గ్రీష్మ ఋతౌః*

 *ఆషాఢమాసం - శుక్లపక్షం*


*తిథి : పౌర్ణమి* మ 03.46 వరకు ఉపరి *కృష్ణ పాడ్యమి*

వారం :*ఆదివారం* (భానువాసరే)

*నక్షత్రం : ఉత్తరాషాడ* రా 12.14 వరకు ఉపరి *శ్రవణం*

*యోగం : విష్కుంబ* రా 09.11 వరకు ఉపరి *ప్రీతి*

*కరణం : బవ* మ 03.46 *బాలవ* రా 02.31 ఉపరి *కౌలువ*

*సాధారణ శుభ సమయాలు* 

 *ఉ 07.30 - 09.00  మ 12.30 - 04.00*

అమృత కాలం :*సా 06.15 - 07.45*

అభిజిత్ కాలం :*ప 11.48 - 12.40*

*వర్జ్యం : ఉ 09.17 - 10.47 & రా 03.55 - 05.24*

*దుర్ముహుర్తం : సా 04.59- 05.51*

*రాహు కాలం :సా 05.06 - 06.43*

గుళిక కాలం :*మ 03.28 - 05.06*

యమ గండం :*మ 12.14 - 01.51*

సూర్యరాశి : *కర్కాటకం* చంద్రరాశి : *ధనుస్సు/మకరం*

సూర్యోదయం :*ఉ 05.45* 

సూర్యాస్తమయం :*సా 06.43*

*ప్రయాణశూల :‌ పడమర దిక్కుకు* 

*ప్రయాణం పనికిరాదు*


*వైదిక విషయాలు*

ప్రాతః కాలం :*ఉ 05.45 - 08.20*

సంగవ కాలం :*08.20 - 10.56*

మధ్యాహ్న కాలం :*10.56 - 01.32*

అపరాహ్న కాలం :*మ 01.32 - 04.07*

*ఆబ్ధికం తిధి : ఆషాఢ పౌర్ణమి/బహుళ పాడ్యమి*

సాయంకాలం :*సా 04.07 - 06.43*

ప్రదోష కాలం :*సా 06.43 - 08.55*

నిశీధి కాలం :*రా 11.52 - 12.36*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.17 - 05.01*

______________________________

           🌷 *ప్రతినిత్యం*🌷

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


☀️ *ఓం సూర్యాయ నమః* ☀️

త్రయీమయాయ త్రిగుణాత్మధారిణే విరఞ్చి నారాయణ శఙ్కరాత్మన్ ॥ ౧ ॥


యన్మణ్డలం దీప్తికరం విశాలం రత్నప్రభం తీవ్రమనాదిరూపమ్ ।

దారిద్ర్యదుఃఖక్షయకారణం చ పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ ॥ ౨ ॥


🌞🪷🌹🛕🌹🌷🪷🌷🌞

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*


           🌷 *సేకరణ*🌷

         🌹🌿🌞🌞🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

        🌷🍃🌞🌞🍃🌷

        🌹 🌷🌞🌞🌷🌹

సత్కర్మలే

 _*💫 సత్కర్మలే (మంచి పనులే)..*_ 

       _*ఎందుకు చేయాలి..!?  🫵*_

*꧁♪•••┉┅━❀❀━┅•••♪꧂*

*_కర్మ అంటే ఏమిటి ❓_* 

*_సత్కర్మ అంటే ఏమిటి ❓♪._* 


*_🪷 మొదట వీటి గురించి తెలియాలి♪. కర్మ అంటే మనం చేసే అన్ని పనులను కర్మలు అంటారు♪. అవి ఏవైనా కావచ్చు. కాని, చేసే పనులలో ప్రావీణ్యత వుండాలి. అప్పుడు అవి నీకు సత్ఫలితాన్ని ఇస్తాయి♪._* 


*_కర్మలలో ప్రావీణ్యత అంటే..❓_*  

*_🪷 మనం జ్ఞానాన్ని కలిగి వుండి కర్మలను ఆచరించడాన్ని కర్మలలో ప్రావీణ్యత అంటారు♪. జ్ఞానం అంటే ఆత్మానాత్మ వివేకం. నేను ఎవరు? దేవుడు ఎవరు? ఈ ప్రకృతి ఏంటి? దీని కర్త ఎవరు? ఇలా విచక్షణ జ్ఞానాన్ని కలిగి వుండడమే జ్ఞానం•._* 


*_🪷 ఇక్కడ మనకు కావలసింది - సత్కర్మలే (మంచి పనులే) ఎందుకు చేయాలి♪?_* 


*_🪷 అవును, మంచి పనులే చేయాలి, ఎందుకంటే, ఇక్కడ ప్రకృతికి కొన్ని సహజ గుణాలు వున్నాయి♪. అవి భగవంతుడు సృష్టితో పాటు ఇచ్చాడు♪._* 


*_🪷 నువ్వు మంచి పని చేస్తే, నీకు మంచి ఫలితాన్ని, అదేవిధంగా చెడు చేస్తే ఫలితం కూడ అదేలా వుంటుంది. ఇక్కడ కర్మ ఫలితాలను అనుభవించడమే కాకుండా నీవు ఈ శరీరాన్ని వదిలిన తరువాత కూడ వాటిని అనుభవించాల్సి వస్తుంది. ఎందుకంటే,  'నేను' అనే భావంతో.. అజ్ఞానంతో.. అహంకారంతో అన్ని పనులు చేస్తూ వుంటావు కావున._*  


*_🪷 అయితే, మంచి పనులు చేసి మంచి చేస్తున్నాను అని అనుకొని ఉంటే స్వర్గానికి వెళ్లి ఆ కర్మ ఫలితాలను దేవతలతో సమానంగా అనుభవిస్తావు♪. అవే చెడు అయితే నరకానికి వెళ్లి అనుభవిస్తావు♪. ఇక్కడ కర్మ భూమిలో అయితే స్థూల శరీరం వుంటుంది. అదే అక్కడ అయితే నీవు అజ్ఞానంతో ఏర్పరచుకున్న కర్మ బంధనాలే ఒక సూక్ష్మ శరీరంగా ఏర్పడి ఆ సూక్ష్మ శరీరం వాటిని అనుభవిస్తుంది♪. అంతే తప్ప వీటి అన్నిటితో ఆత్మకు ఎటువంటి సంబంధం ఉండదు♪. అంటే నువ్వు చేసే రెండు కూడా నీకు (అంటే ఆత్మకు) బంధనాలే అవి మంచి అయితే బంగారు జైలు అదే చెడు అయితే ఇనుప జైలు అన్నమాట♪. రెండును నిన్ను (అంటే ఆత్మను) బందీ చేసేవే♪._* 


*_🪷 మరి ఈ రెండింటి నుండి తప్పించుకోవడం ఎలా? ఎలా అంటే ఇక్కడ యోగాన్ని అవలంబించాలి, అప్పుడు మనం చేసే కర్మలను యోగం ద్వారా చేయాలి దానినే కర్మయోగం అంటారు. మనకు శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో కర్మయోగం గురించి చాల విపులంగా తెలియజేసాడు♪. మనం చేసే ప్రతి పనిని భగవదర్పణ బుద్దితో, ఫలాపేక్షరహితంగా, కర్మలను ఆచరిస్తూ వుంటే నిదానంగా నీ మనస్సు అంతఃకరణ శుద్ధి అవుతుంది. ఇలా శుద్ధి అయిన అంతఃకరణ భగవంతుని అన్వేషిస్తుంది♪. అప్పుడు నీలో సత్వ గుణం అధికమవుతుంది♪. అంతే కాకుండా చేసే కర్మలు నిష్కల్మషంగా కూడ వుండాలి అంటే చేసే పనులలో ఏ కల్మషం లేకుండా చేస్తే నువ్వు అప్పుడు కర్మలలో ప్రావీణ్యత సాధించినట్లు♪._* 


*_🪷 మరి మంచి పనులే ఎందుకు చేయాలి ?_* 

*_అంటే మంచి పనులు చేస్తూ వుంటే నీకు తెలియకుండానే నీ అంతఃకరణ (నీ మనస్సు) పరిశుద్దమవుతుంది. అప్పడు నీకు భగవంతుని తత్వం బోధపడుతుంది. (అర్థం అవుతుంది) లేకపోతే నీకు భగవంతుని తత్వం తెలియదు అప్పుడు నువ్వు ఇట్లే ఈ జనన మరణ చట్రంలో తిరుగుతూనే వుంటావు. ఒకవేళ దుష్కర్మలు ఆచరిస్తే నీకు పతనం తప్పదు. అది ప్రకృతి సహజ గుణం._* 


🙏✅👉 *_అందువలన ఈ రోజు నుండే నీవు మంచి పనులు మాత్రమే చేయాలి అని భీష్మించుకొని నీ మనస్సును స్థిరపరచు. అయితే, నువ్వు చేసే పని ఎలా వుండాలి అంటే,  కుడి చేత్తో చేసే పని నీ ఎడమ చేతికి కూడా తెలియకూడదు అనే విధంగా వుండాలి. అప్పుడు మానవుడు మాధవుడు అవుతాడు♪._*


*_🙏 ఇలా అందరూ మంచి పనులు చేసి, వారి అంతఃకరణను శుద్ధి పరచుకొని, భగవంతుని తత్వాన్ని తెలుసుకొని, గ్రహించి ఆ దేవదేవుని గురించి తెలిసికొని జ్ఞానాన్ని సంపూర్ణంగా సముపార్జించి అందరూ మీమీ  స్వస్వరూపాలను తెలుసుకోవాలని నా మనవి అదే విధంగా సాధన (ధ్యానం) చేసి మహాత్ములుగా మారాలని ఆ విధంగా మీ మనస్సులను ఆ భగవంతుని మీదకు మరల్చాలని నేను ఆ దేవదేవుడైన పరమాత్ముని ప్రార్ధిస్తున్నాను._* 🙏

               *_-(సూరి నాగమ్మ)._*

      ❀┉┅━❀ 🕉️ 

🙏🇮🇳🎊🪴🦚🐍🔱⚜️

గత స్మృతులు

 🔴సెలవలు కి తాతయ్య గారి ఊరు వెళ్లి తిరిగి వస్తున్నప్పుడు....


🔵ఎవరికి తెలియకుండా అమ్మమ్మ మన చేతిలో కుక్కిన పది రూపాయల కాగితం విలువ ఏన్ని లక్షలు చేస్తుందో లెక్క కట్టగలరా...


🟢తాతయ్య ప్రేమ తో స్వయం గా పొలం వెళ్లి కోయించి తెచ్చిన తాటి ముంజలు,ఈత పళ్ళ రుచి అమృతం కన్న తియ్యనిది.


⚫మామయ్య సైకిల్ ఎక్కి ఊరంతా కలయ తిరుగుతుంటే పుష్పకవిమానం ఎక్కినట్లు వుండేది.


🟡అమ్మమ్మ ఎదురింటి వాళ్ళ బర్రె జున్ను పాలను అడిగి మరి తెచ్చి చేసి పెట్టిన జున్ను రుచి ఇప్పటికీ నోట్లో నానుతూ వుంటుంది.


🔵కొత్త  మామిడి ఆవకాయ  పచ్చడి వేస్తున్నప్పుడు,చివరిలో మిగిలిన కారం లో అన్నం వేసి కలిపి తలో ముద్ద తినిపించిన తీరు వర్ణనాతీతం.


🟠అత్త కుట్టిచ్చిన రంగు రంగుల పూల చొక్కా వేసుకుంటే,పట్టు పీతాంబరాలు ధరించిన అనుభూతి కల్గి,ఆ చొక్కా చిరిగిపోయినప్పుడు పడ్డ భాద ఆపడం ఎవరితరం కాదు.

✍✍ *మూర్తి's కలం గత స్మృతులు*...

కాలమిస్ట్,9985617100.

ఆపాదించుకోదగిన

  

మహా 

... నేటికీ ఆపాదించుకోదగిన గ్రంథం. శకుంతల దుష్యంతుల కథ, తరవాత వారిద్దరి మధ్య జరిగిన సంభాషణ, వీటికి ఈ తరంతో పోలిక... హిడింబ భీముల  ప్రణయం, అందుకు కుంతీ దేవి ఎలా కారణమైంది.... ద్రౌపదిని పాండవులు వివాహం చేసుకోవడానికి ప్రధాన కారణం. ఇలా ఎన్నో అంశాలకు సమాధానాలు ఉషశ్రీ ఉపన్యాసంలో లభిస్తాయి. నలభై ఏళ్లకు ముందు విజయవాడ కొత్త గుళ్ళు ప్రాంగణంలో చేసిన ఈ ప్రవచనం అనేక సందేహాలను నివృత్తి చేస్తుంది. ఆసాంతం వినండి. మీ సన్నిహితులకు, స్నేహితులకు షేర్ చెయ్యండి.

అహంకారం

 *అహంకారం పనికిరాదు అది వ్యక్తి పతనానికి దారితీస్తుంది* 


ఒక వ్యక్తి యొక్క అహంకారానికి అతని డబ్బు, పాండిత్యం లేదా బలం అతనిని గర్వించేలా చేస్తుంది, అయితే ఈ అహంకారమే వాస్తవానికి శత్రువు అని మనిషి అర్థం చేసుకోవాలి. ఎందుకంటే అది అతన్ని చాలావిధంగా ఇబ్బందులకు చేస్తుంది మరియు తప్పులలో మునిగిపోయేలా చేస్తుంది. 


తనను ఎవరూ ఎదిరించలేరని తప్పుగా భావించి అలా చేస్తాడు. కానీ అతని చెడు కర్మ కారణంగా అతను ఖచ్చితంగా బాధపడతాడు. అహంకారాన్ని విడిచిపెట్టడం ద్వారా ఇవన్నీ నివారించవచ్చు. 


 *భగవత్పాద శంకరులు* 

డబ్బు, యవ్వనం, పాండిత్యం కారణంగా మనిషి అహంకారంతో ఉండకూడదు. కాలం అన్నింటినీ దూరం చేస్తుంది. అవి నిలకడగా లేవని ఆయన చెప్పారు.


భగవత్పాదుల వంటి మహర్షులు ఎంతటి జ్ఞానసంపన్నులైనా వారికి అహంకారం ఉండేది కాదు. అందుకే వారిని మహాపురుషులుగా అభివర్ణించారు. 


అందుచేత మనిషి ఏ కారణం చేతనైనా అహంకారానికి లోనుకాకుండా సరళంగా జీవించాలి. 


తనకు శత్రువైన, కంఠంలో ముల్లులా ఉన్న ఈ అహంకారాన్ని నాశనం చేయడానికి జ్ఞానాన్ని కోరుకునేవాడు, ఆత్మనిగ్రహం యొక్క ఆనందాన్ని పొందుతాడని ఖచ్చితంగా తెలుసు.


-- *జగద్గురు శ్రీశ్రీశ్రీ భారతితీర్ధ మహాస్వామి వారు*

శనివారం / రాశి ఫలితాలు*

 ☘️🙏🕉️శ్రీ గురుభ్యోనమః🙏☘️


*20-07-2024 / శనివారం / రాశి ఫలితాలు*

•••••┉━•••••┉━•••••┉━•••••

మేషం


సంతానం విద్యా విషయాలలో  శుభవార్తలు అందుతాయి. సోదరులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. సమాజంలో  పలుకుబడి పెరుగుతుంది. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. దైవ అనుగ్రహం తో  వ్యాపారాలు లాభాల బాట పడతాయి. ఉద్యోగాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు.

---------------------------------------

వృషభం


వాహన  ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. చేపట్టిన పనులలో అధిక శ్రమతో అల్ప ఫలితాన్ని పొందుతారు. చిన్ననాటి మిత్రులతో మాట పట్టింపులు కలుగుతాయి. దాయాదులతో  ఆస్తి వివాదాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగ ప్రయత్నములు అంతగా అనుకూలించవు. 

---------------------------------------

మిధునం


ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు. ఇంటాబయట  ఊహించని చికాకులు పెరుగుతాయి. దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో  శ్రద్ధ వహించాలి. వృత్తి వ్యాపారాలు మందకోడిగా  సాగుతాయి. ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు తప్పవు.

---------------------------------------

కర్కాటకం


ప్రయాణాలలో  కొత్త వ్యక్తుల పరిచయాలు భవిష్యత్తుకు  ఉపయోగపడతాయి. బంధు మిత్రుల నుండి శుభవార్తలు అందుకుంటారు. చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. ఆర్థిక వ్యవహారాలు  సంతృప్తినిస్తాయి. వృత్తి వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలించి నూతన అవకాశాలు లభిస్తాయి.

---------------------------------------

సింహం


సంతానానికి నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. మంచి మాట తీరుతో  ఇంటాబయట అందరినీ ఆకట్టుకుంటారు. సమాజంలో పెద్దల నుండి ప్రశంసలు పొందుతారు. వృత్తి వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. 

---------------------------------------

కన్య


దూరప్రయాణాలు  ఆకస్మికంగా వాయిదా వేస్తారు. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. దీర్ఘ కాలిక రుణ ఒత్తిడి అధికమవుతుంది. పుణ్యక్షేత్రాలను  దర్శించుకుంటారు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో అదనపు పనిభారం ఉంటుంది.

---------------------------------------

తుల


బంధు మిత్రులతో  ఊహించిన మాటపట్టింపులు కలుగుతాయి. ఆర్థిక ఇబ్బందులు వలన నూతన ఋణప్రయత్నాలు చేస్తారు. చేపట్టిన పనులలో   వ్యయ ప్రయాసలు తప్పవు  ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు అంతంత మాత్రంగా సాగుతాయి.

---------------------------------------

వృశ్చికం


నిరుద్యోగులకు నూతన ఉద్యోగ యోగం ఉన్నది. ప్రణాళికలతో అనుకున్న పనులను పూర్తిచేస్తారు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఒక వ్యవహారంలో దూరప్రాంత బంధుమిత్రుల నుంచి కీలక సమాచారం సేకరిస్తారు.  వ్యాపారాలలో ఉత్సాహంతో  ముందుకు సాగుతారు. వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి.

---------------------------------------

ధనస్సు


వృధా  ప్రయాణాలు చేయవలసి వస్తుంది. బంధువులతో తొందరపడి మాట్లాడటం మంచిది కాదు. కొన్ని వ్యవహారాలు ముందుకు సాగక నిరాశ పెరుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. దైవదర్శనాలు చేసుకుంటారు. ఉద్యోగాలలో అధికారులతో చర్చలు అంతగా అనుకూలించవు.

---------------------------------------

మకరం


ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది. సంతానం పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలు అందుతాయి. ముఖ్యమైన పనులు  అప్రయత్నంగా పూర్తి చేస్తారు.  వ్యాపారాలు అంచనాలు అందుకుంటారు.

---------------------------------------

కుంభం


ఆరోగ్య  విషయంలో  అశ్రద్ధ  చేయడం మంచిది కాదు. ముఖ్యమైన పనులు వాయిదా వేయుట మంచిది.  దూర ప్రయాణం సూచనలు ఉన్నవి. ఇంటాబయట చికాకులు పెరుగుతాయి. సోదరులతో  స్థిరస్తి వివాదాలు కలుగుతాయి. వృత్తి ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు మందగిస్తాయి.

---------------------------------------

మీనం


ఆర్థిక వ్యవహారాలు  గతం కంటే మెరుగ్గా ఉంటాయి. సన్నిహితుల నుంచి అవసరానికి ధనసహాయం   అందుతుంది. దీర్ఘకాలిక రుణాలు తీర్చగలుగుతారు. ఆప్తుల  నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి.  వ్యాపారాలకు  నూతన పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగమున  అధికారుల అనుగ్రహంతో హోదాలు పెరుగుతాయి.

•••••┉━•••••┉━•••••┉━•••••

🍁 *శుభం భూయాత్* 🍀

Support this blog

 Support this blog


Do you think this blog is useful. 

Please support financially by donating via G Pay Or phone pay to this Mbl. 9848647145

పోతన రూపచిత్రణ!

 

               చొప్పకట్ల.


పోతన రూపచిత్రణ! 


మ:  త్రిజగ  న్మోహన  నీలకాంతి  తనువుద్దీపింపఁ  బ్రాభాత   నీ


        రజ  బంధుప్రభమైన   చేలము  పయిన్  రంజిల్ల , నీలాలక


        వ్రజ   సంయుక్త   ముఖారవింద   మతి  సేవ్యంబై  విజృభింప   మా


        విజయుం   జేరెడు   వన్నెలాఁడు   మది   నావేశించు  నెల్లప్పుడున్!


                   ఆం: భాగవతం-  ప్రధమస్కంథం-  247: వ: పద్యము;


                     

                   ముల్లోకాలను   మైమరపించే   నీలమేఘ  ఛ్ఛాయగల   తనువుతో, ఉదయారుణ   కిరణ  కాంతిని 


   ప్రతిఫలించు   నుత్తరీయంబుతో ,గాలికి  నూయలలూగు  నల్లని   ముంగురులతో  నొప్పు  ముఖారవిందముతో  చూడముచ్చటఁ  గొల్పుచు  మా  అర్జును  దరికి  నరుదెంచుచుండు  అందగాడు  శ్రకృష్ణుఁ డెల్లవేళల  నామదిలో  నిలచుగాక!  అనిభీష్మ స్తుతి;


                 నల్లనివాడే  గాని  యామేనిలో  నొక  మెఱపున్నది. ఆకర్షణ యున్నది. అదియెంతటిదనగా  ముల్లోకములను  మోహింప  జేయు  నంతటిదట! ఆమూర్తి  కన్నుల బడెనా  అంతే  ఆయాకర్షణ  ప్రవాహమున  గొట్టికొని పోవలసినదే!


                         ఇఁక  నాతఁడు ధరించిన పీతాంబరమా  ఉదయారుణ కాంతి రంజితమై  చూపరులకు  యింపు నింపు  చున్నది. 

కృష్ణుడు కదలివచ్చుచుండ  బాలసూర్యోపమ మైన  కాంతిపుంజ  వలయమేర్పడుటకా  వస్త్రము  ఆధారమగుచున్నది. ఎంత యద్భుతము! 


                  మోమా  అరవిందమును  బోలియున్నది. అది నల్లని  ముంగులతో  శోభాయమానమై  యున్నది.కవి బయటకు చెప్పకున్నను  తుమ్మెదలు  ముసిరిన  పద్మమును  బోలియున్నది. 


                              ఇంత  యందమును  మూటగట్టి  వచ్చువాడు  వన్నెలాడు (సోకులరాయడు)  గాకుండునా? 


              ఇదీ  పోతన  గారి  యద్భుత  రూప  చిత్రణా   సామర్ధ్యము!


                                                             స్వస్తి!🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

ప్రక్కటెముకలలో ( side ribs ) నొప్పి -

 ప్రక్కటెముకలలో ( side ribs ) నొప్పి  - 


        జిల్లేడు ఆకు రసం , గొధుమ పిండితో కలిపి మెత్తగా పిసికి ఆ ముద్దను రొట్టెలాగా వెడల్పు చేసి ప్రక్కటెముకల పైన పట్టు వేయాలి . 


                  ఈ విధంగా చేయడం వలన నిమోనియా వలన కలిగే ప్రక్కటెముకల నొప్పి కాని , వాతం వలన కలిగే నొప్పి కాని బహుత్వరగా తగ్గిపోతుంది . 


   

       ఆయుర్వేదములోని ఎన్నొ రహస్య మూలికల అనుభవ యోగాల గురించి నా గ్రంథాల యందు సంపూర్ణముగా , అందరికి అర్థమయ్యే సులభ భాషలో వివరించాను . వాటిని చదివి మరింత విజ్ఞానాన్ని పొందగలరు . 


  

 గమనిక  -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


      ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .


     కాళహస్తి వేంకటేశ్వరరావు  


 అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


         9885030034

పంచాంగం 20.07.2024 Saturday.

 ఈ రోజు పంచాంగం 20.07.2024 Saturday.


స్వస్తి  శ్రీ చాన్ద్రమాన క్రోధి నామసంవత్సర: దక్షిణాయనం గ్రీష్మ ఋతు ఆషాఢ మాస శుక్ల పక్ష  చతుర్థశి తిధి స్థిర వాసర: పూర్వాషాఢ  నక్షత్రం వైధృతి యోగ: గరజి తదుపరి వణిజ తదుపరి భద్ర కరణం. ఇది ఈరోజు పంచాంగం.


చతుర్థశి సాయంత్రం 05:55 వరకు .

పూర్వాషాఢ రాత్రి 01:46 వరకు.


సూర్యోదయం : 05:55

సూర్యాస్తమయం : 06:49


వర్జ్యం : మధ్యాహ్నం 12:02 నుండి ఉదయం 01:33 వరకు.


దుర్ముహూర్తం : ఉదయం 05:55 నుండి 07:38 వరకు.


అమృతఘడియలు : రాత్రి 09:11 నుండి 10:42 వరకు.


రాహుకాలం : పగలు 09:00 నుండి 10:30 వరకు.



యమగండం: మధ్యాహ్నం 01:30 నుండి 03:00 వరకు.



శుభోదయ:, నమస్కార:

జనకుని విద్యల యందున

 *2040*

*కం*

జనకుని విద్యల యందున

తనయులు వర్ధిల్లగలుగు తప్పక నెపుడున్.

తనయులకిడు సిరులందున

తన విద్యయె గొప్ప ధనము ధరణిన సుజనా.

*భావం*:-- ఓ సుజనా! తన విద్యలలో తన పిల్లలు తప్పకుండా వర్ధిల్లగలరు. తన పిల్లలకు తండ్రి ఇచ్చే సంపదలలో తన విద్యయే అత్యంత గొప్పది.

*సందర్భం*:-- నేటి సమాజం లో తండ్రి యొక్క విద్యకాకుండా మరో విద్యలలో తన పిల్లలు రాణించాలని కోరుకునే తల్లిదండ్రులు ఎక్కువ మంది ఉన్నారు. అందువలన నే ఎన్నో కష్టాలు పడి 10% కూడా సరైన విద్యా ప్రగతి పిల్లలకు లభించడం లేదు. మార్కులకోసమే విద్యాసంస్థలు ఉన్నాయి గానీ విద్యాభ్యాసానికి కాదు. తండ్రి విద్య ఒక్క టే తనయులకు రక్షణ కాగా ఆ ఒక్క విద్యమాత్రమే పిల్లల కు నేర్పకపోవడమే పెద్ద సమస్య గా మారింది.

*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*