9, మే 2021, ఆదివారం

మాత అన్న పదమునకు గల వ్యుత్పత్తులు

 సంస్కృత భఆషలో మాత అన్న పదమునకు గల వ్యుత్పత్తులు 


మార్జయతి మాతి తోలయతి లాలయతి మాపయతి త్రాయతే రంజయతి మనుతే మన్వతే మానయతి సమ్మానయతి జనయతి జన్మదదాతి ఇతి మాతా జననీ ఇత్యనయోః శబ్దయోః వ్యుత్పత్తిః నిర్వచనం చ అస్తి


మలమూత్రములను తొలగించునది కొలుచునది లాలించునది పోషింప చేయునది కాపాడునది ఆనందింప చేయునది భావించునది గౌరవించునది గౌరవింప చేయునది జనింప చేయునది జన్మనిచ్చునది అని మాతా జనని శబ్దములకు సంస్కృత భాషా సాహిత్యములో వ్యుత్పత్తులు   నిర్వచనములు చెప్పబడి ఉన్నాయి.

 మాతృదివసోత్సవశుభాశయాః

. బుద్ధి కర్మానుసారిణే

 🌹🌹🌹🌷🌷🌹🌹🌹

🔴  *కరోనా ఎందుకొస్తోంది? ఎవరికొస్తోంది?*

*(❀ ఓపిగ్గా చివరికంటా చదవండి)*


ప్రతిరోజూ ఎంతోమంది తెలిసినవాళ్లు పోతున్నారు. ప్రతిరోజూ ఎన్నో చావు వార్తలు వింటున్నాం. ఎక్కడ చూసినా భయం రాజ్యమేలుతోంది. రేపేం జరుగుతుందో ఎవరికీ తెలియడంలేదు. ఇదంతా చూస్తూ, 

☞︎︎︎ *"అసలు కరోనా ఎందుకొస్తోంది?" అన్న ప్రశ్న ఎవరినడిగినా ఒకటే చెబుతారు.*


𖠌 *వైరస్' వల్ల వస్తున్నది'*

👌 *చాలామంచి జవాబు.*


☞︎︎︎'మరి వైరస్ అందర్నీ  కాటేయడం లేదేంటి?'

𖨆 *ఇంట్లో జాగ్రత్తగా ఉంటే రాదు'*

☞︎︎︎  *ఇది కూడా* చాలామంచి జవాబే. 


☺︎︎'మరి ఇంట్లో ఉన్నవాళ్లకు కూడా చాలామందికి వస్తోంది కదా? ఇదేంటి?'

☻︎ *గాలిలో వస్తోంది*


𖨆𖨆అదే గాలిని అందరూ పీలుస్తున్నారు కదా? మరి అందరికీ రావడం లేదెందుకు?

۞ *రోగనిరోధకశక్తి లేనివాడికి వస్తోంది*


𑁍రోగనిరోధకశక్తి ఎందుకు తగ్గుతోంది?

𖦹 *తెలియదు'?*😫


👉🏼 *ఇప్పుడు ఇంకో కోణం చూద్దాం.*


𒊹︎︎︎'మా మామయ్య కూరగాయలకని మార్కెట్టుకి వెళ్ళొచ్చాడు. అక్కడ సోకింది'

మరి అక్కడే ఉంటూ, రోజంతా కూరగాయలు అమ్ముతున్నవాడికి ఎందుకని రావడం లేదు?

☯︎ *నో ఆన్సర్*


☹︎మా బాబాయి పాలప్యాకెట్ కని బయటకెళ్ళి వైరస్ కొనితెచ్చుకున్నాడు'

𖨆'మరి రోజంతా అదే షాపులో పాలప్యాకెట్లు అమ్ముతున్నవాడికి ఎందుకని రాలేదు?'

㋛︎ *మళ్ళీ నో ఆన్సర్*

☺︎︎'మా నాన్న వద్దంటున్నా వినకుండా బయటకెళ్ళి మామిడిపండ్లు కొన్నాడు. అక్కడ సోకి ఉంటుంది'

❦︎ 'రోజంతా ఎండలో రోడ్డుపక్కన కూచుని పండ్లు అమ్ముతున్న ఆమెకు ఎందుకని కరోనా సోకలేదు?'

㋛︎ *మళ్ళీ నో ఆన్సర్*

✋🏼 *చివరకు ఇలా జవాబు వస్తుంది.*


🤗 *'కాయకష్టం చేసేవాళ్లకు రోగనిరోధకశక్తి ఎక్కువగా ఉంటుంది. అందుకని వాళ్లకు రాదు'*


✌︎ ఏతావాతా తేలిందేమిటి? ఎవడికైతే రోగనిరోధకశక్తి ఎక్కువగా ఉంటున్నదో వాడికి కరోనాయే కాదు.  ఏ వైరసూ సోకదు. ఏ బాక్టీరియా సోకదు. ఏమీ కాదు. డా || హన్నేమాన్ ఈ మాటను రెండు వందల ఏళ్ళక్రితం చెప్పాడు. ఆయుర్వేద సృష్టికర్తలైన ఋషులు వేల ఏళ్ళనాడే ఈ మాటను చెప్పారు. అంతేగాక ఏమేం చేస్తే, ఎలా బ్రతికితే, రోగనిరోధకశక్తి బాగుంటుందో కూడా చెప్పారు. ఏం చేస్తుంటే అది క్షీణిస్తుందో కూడా చెప్పారు. వినేవారేరీ? వింటే, జనం పోగుచేసుకుంటున్న చెడుకర్మను ఎవడనుభవిస్తాడు? అందుకే మంచి చెప్పినా ఎవడూ వినడు. వినలేడు. విన్నట్టు విని వదిలేస్తాడు గాని ఆచరించలేడు. కనుక వాడి ఖర్మ వాడిని వెంటాడుతుంది. గొంతు పట్టుకుంటుంది. తీసుకుపోతుంది. అదంతే !


𑁍 *ఇప్పుడు విషయంలోకొద్దాం.*


చాలా మంది ఓవెన్ ను కొనలేదు. ఎందుకో తెలుసా? దానివల్లనే అమెరికాలో పెద్దప్రేగు కాన్సర్ వస్తున్నదని. ఎందుకని?


☀︎︎ *వినండి మరి.*


☻︎ స్టోర్స్  లో ఉన్న మాంసం ఎన్నో రోజులనుంచీ డీప్ ఫ్రిజ్ లో ఉంటుంది. మైనస్ డిగ్రీలలో ఉంటుంది.  దాన్ని తెచ్చి, ఓవెన్లో పడేసి ఒకేసారి 160 ఫారెన్ హీట్ దాకా వేడిచేసేసి తింటారు. ఒకేసారి అంత టెంపరేచర్ తేడా వస్తే ఆ మాంసంలో ఏమౌతుంది? పైగా, మంటపైన, కుండలో వండితే జరిగే ప్రక్రియ వేరు. అక్కడ ఆక్సిజన్ పుష్కలంగా ఉంటుంది.  ఓవెన్ లో ఏ ఆక్సిజన్ ఉంటుంది? ఒక ఉదాహరణ చెప్తాను, వినడానికి ఇబ్బందిగా  ఉన్నా ఇది నిజం. 


చనిపోయిన శవాన్ని మార్చురీలోని కోల్డ్ స్టోరేజిలో ఉంచడానికి, మాంసాన్ని, కూరగాయలను ఫ్రిజ్ లో ఉంచడానికి తేడా ఏంటి? అలాంటి శవాలను తెచ్చి, కనీసం వాటిని కట్టెలమీదకూడా ఉడికించకుండా, ఆక్సిజన్ లేని, అదసలు అవసరంలేని, మైక్రో వేవ్స్ క్రింద ఓవెన్లో ఉడికిస్తే ఏమౌతుంది? వాటిల్లో ఏయే మార్పులొస్తాయి? తినేవాడికి   కాన్సర్లు రాక ఏమౌతుంది? చెప్పండి.


*ఈరోజుల్లో, ఏ పూటకాపూట, ఏరోజు కూరగాయలను ఆరోజున వేడివేడిగా వండుకుని, ఏపూట అన్నం ఆపూట వేడిగా వండుకుని ఎవరు తింటున్నారు? చెప్పనా? రోజుకూలీలు తింటున్నారు. కాయకష్టం చేసుకునేవాళ్ళు తింటున్నారు. వాళ్ళు ఏరోజుకు ఆరోజున కూరగాయలు తెచ్చుకుంటారు. మంటమీద వండుకుని తింటారు. ఓవెన్ వాడరు. అందుకే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటున్నారు. సుఖానికిపోయే సంపన్నులు, ఫ్రిజ్ లో వారాల తరబడి ఆహారాన్ని మురగబెట్టుకుని తినేవాళ్లు, ఓవెన్లు వాడేవాళ్లు రోగాల పాలౌతున్నారు. ఇన్ని సౌకర్యాలున్నప్పటికీ వంట చెయ్యడానికి బద్ధకిస్తూ, పొద్దున్నే ఒకేసారి అన్నీ వండిపారేసి, వాటినే రాత్రికి పెట్టుకుని తినేవాళ్లు రోగాలపాలౌతున్నారు.*


𑁍 జొమాటోలో ఆర్డర్ చేసి తెప్పించుకుని లొట్టలేసుకుంటూ మింగే తిండిలో ఏముంటుందో మీకు తెలుసా? అదెప్పటి ఆహారమో మీకు తెలుసా? ఈ రోజున మిగిలిపోయిన ఫుడ్ ని ఏ హోటలువాడూ పారెయ్యడు. రేపు, ఎల్లుండి, ఎంతవరకూ దానిని ఉంచగలిగితే అంతవరకూ ఫ్రిజ్ లో ఉంచి, ఓవెన్లో ఇన్స్టెన్ట్ గా వేడిచేసి మీకు పంపిస్తాడు. దానికితోడు, వాడు ఫ్రీగా ఆఫర్లో పంపించే కూల్ డ్రింక్ ఉండనే ఉంటుంది. అది యాసిడ్. ఇక రోగాలు రాక ఏమౌతాయి?


యాసిడ్ తో కడగాల్సింది టాయిలెట్ ని. పొట్టని కాదు. 


ప్రతిరోజూ చెమటపట్టేలాగా వ్యాయామం ఎవరు చేస్తున్నారు? ఏసీ జిమ్ముల్లో అమ్మాయిలూ అబ్బాయిలూ ఒకరినొకరు చూసుకుంటూ కులుక్కుంటూ ఎగరడం కాదు. చక్కటి ఎండలో, ఆరుబైట గాలిలో ఎవరు వ్యాయామాలు చేస్తున్నారు? ఆ చేసే వ్యాయామాలు మాత్రం ఏమిటి? కండలు పెంచే జిమ్ము వ్యాయామాలు. అవి రోగనిరోదకశక్తిని పెంచగలవా? లేవు. ఏడాదిపాటు పెంచిన కండలు, ఒక్క జ్వరంతో కరిగి వేలాడటం మొదలుపెడతాయి. మరెందుకవి? మనదైన యోగాభ్యాసాన్ని శుద్ధంగా చేస్తున్నవారెందరు?


𑁍 అసలు కనీస వ్యాయామమంటూ ఏదో ఒకదాన్ని ఏడుస్తున్నవారెందరు? ఎవరూ లేరు. పొద్దున్న పదింటికి నిద్ర లేవడం, ఆ సోఫాలోనో, బెడ్ మీదనో రోగిష్టిలాగా పడుకుని, టీవీనో, మొబైల్ నో చూస్తూ, ఫోన్లో సొల్లు వాగుతూ  ఉండటం, టైమైతే జొమాటో ఆర్డర్ పెట్టడం, తిని మళ్ళీ మొబైల్లోకి చూస్తూ పడుకోవడం. లేకపోతే ఆ ఫ్రిజ్ లో కుక్కిన పదిరోజులనాటి చెత్తను మింగడం.  ఇది మన దినచర్య. ఇక రోగాలు రాక మరేమొస్తాయి?


𑁍 ఏదో రోగం వచ్చినపుడు కూడా ప్రకృతిసిద్ధమైన మందులు వాడకుండా, సింథటిక్ ముందులు వాడటం. అక్కడకూడా డబ్బులు పారేసి పెద్ద ఆస్పత్రిలో చేరి దేహాన్ని వారికి అప్పజెప్పడం. అదృష్టం బాగుంటే ప్రాణంతో తిరిగి రావడం, లేదా శవంగా బయటకు రావడం. దహనం కూడా ఎలక్ట్రిక్ క్రిమటేరియంలో. ఇదీ మన బ్రతుకు.


𑁍 తింటున్నవేవీ సహజం కానపుడు. ఇన్ని అసహజములైన పనులు, ప్రకృతికి వ్యతిరేకమైన పనులు ప్రతిరోజూ చేస్తూ, మన రోగనిరోధకశక్తి గట్టిగా ఉండాలంటే ఎలా ఉంటుంది?


🛑 *పోనీ మనసన్నా శుద్ధంగా ఉంటున్నదా మనకు?*


☠︎︎ ఓర్వలేనితనం, కుళ్ళు, కుట్రలు, కుతంత్రాలు, కోపాలు, అహంకారాలు, గర్వాలు, దనమదం, కులగర్వం, ఆశ, నాటకాలు, వేషాలు, పొగరు, లెక్కలేనితనం, అన్నీ నాకే తెలుసన్న మదం ఇలా చెప్పుకుంటూ పోతే  ఎన్నో ఎన్నెన్నో మన మనస్సులో ఉన్న దయ్యాలు.


☻︎ ఒళ్ళూ కుళ్లిపోతూ, మనసూ కుళ్లిపోతూ, పైకిమాత్రం 'అంతా భలేబాగుంది' అనుకుంటూ  మొహానికి మాత్రం క్రీములు పూసుకుంటూ, ఒళ్ళు అందరికీ చూపించుకుంటూ బ్రతుకుతున్న  ఇలాంటి స్థితిలో కరోనా ఎందుకు? గట్టిగా ఒక చిన్న గాలివీస్తే చాలు మనం నేలకూలిపోవడానికి.


𑁍 *ఏవిధంగా మనం ఆరోగ్యవంతులం అసలు?*


𖣔 ఇలాంటి వారిని చంపడానికి కరోనాయే అవసరం లేదు. చిన్న సూది గుచ్చుకుంటే కూడా, కుప్పకూలిపోయి, ప్రాణాలు పోతాయి. కూచున్నవాడు కూచున్నట్టు, నుంచున్నవాడు నుంచున్నట్టు, నడుస్తున్నవాడు నడుస్తూనే చనిపోయే రోజులు ముందున్నాయి. బ్రహ్మంగారు వ్రాసినది అబద్ధం కాదు ! 


𑁍 బుద్ధి కర్మానుసారిణి. ఎవడాపగలడు? ఎవడెన్ని చెప్పినా, ఎంత మంచిని చెవిలో వినిపించినా, ఎవడూ వినడు. ఆచరించడు. పోగాలం వచ్చినపుడు ఇలా ఉండక ఇంకెలా ఉంటుంది?


᪥ *కానివ్వండి, జరిగేది జరగకమానదు. బుద్ధి కర్మానుసారిణే.*

 *ఓ బుద్ధిజీవి ఆవేదన.* 

సేకరణ:- వాట్సాప్.

యాంటీ కోవిడ్ డ్రగ్...భారత్

 యూరోప్ మరియు పశ్చిమ దేశాలకి అతి పెద్ద షాక్ ఇచ్చింది భారత్! 2-deoxy-D-glucose (2-DG) అనే డ్రగ్ కి భారత ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. 

ప్రపంచవ్యాప్తంగా చైనా వైరస్ వల్ల ఏర్పడిన సంక్షోభాన్ని ఆసరా చేసుకొని తమ వాక్సిన్ లని అమ్ముకొని [1.25 ట్రిలియన్ డాలర్లు ] లాభపడదామని ఆశించి భంగపడ్డాయి ఇప్పటికే. కాస్తో కూస్తో అత్యధిక జనాభా ఉన్న భారత్ దేశంలో తమకి కాసుల వర్షం కురుస్తుంది అనుకుంటే అది కాస్తా భారత దేశ స్వంత వాక్సిన్ కోవాక్సిన్ తయారు చేసి వాళ్ళ ఆశల మీద నీళ్ళు చల్లింది భారత్. తాజాగా మరో షాక్ ఇచ్చింది భారత్ పశ్చిమదేశాలకి. అది 2-deoxy-D-glucose (2-DG) అనే యాంటీ కోవిడ్ డ్రగ్. 

DRDO అనుబంధ సంస్థ ఇన్ మాస్ [Institute of Nuclear Medicine and Allied Sciences (INMAS) ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ మెడిసిన్ మరియు అలైడ్ సైన్సెస్ సంస్థ అత్యవసర పరిస్థితుల్లో వాడడానికి ఉపయోగపడే యాంటీ కోవిడ్ డ్రగ్ ని విజయవంతంగా ఆవిష్కరించింది. 

డ్రగ్స్  కంట్రోలర్ జెనెరల్ ఆఫ్ ఇండియా [DCGI ] ఈ రోజు ఇన్మాస్ యాంటీ కోవిడ్ డ్రగ్ ని అత్యవసర పరిస్థితుల్లో వాడడానికి అనుమతి ఇచ్చింది. ఇది వాక్సిన్ కాదు డ్రగ్ మాత్రమే. 

ఇన్ మాస్ ఆవిష్కరించిన యాంటీ కోవిడ్ డ్రగ్ 2-deoxy-D-glucose (2-DG) ప్రధానంగా హాస్పిటల్ లో ఉన్న కోవిడ్ పేషంట్స్ కి ఆక్సిజెన్ మీద ఆధారపడకుండా చేస్తుంది. ఇది చాలా పెద్ద అచీవ్మెంట్ ! ఈ మందు వాడితే కోవిడ్ పేషంట్ కి ప్రత్యేకంగా ఆక్సిజెన్ ఇవ్వడం అవసరం ఉండదు. అలాగే కోవిడ్ పేషంట్ త్వరగా కొలుకునేలా సహాయపడుతుంది. 

అసలు విషయం వేరే ఉంది !

2020 సంవత్సరం ఏప్రిల్ నెలలో INMAS హైదరాబాద్ లోని సెంటర్ ఫర్ సెల్యులర్ మరియు మాలిక్యులర్ బయాలజీ [CCMB] తో కలిసి ప్రయోగాత్మకంగా పరీక్షలు చేయడం ప్రారంభించారు. గుర్తు పెట్టుకోండి అది లాక్ డౌన్ సమయం. ఒక మాలిక్యుల్ కోవిడ్ ని సమర్ధవంతంగా ఎదుర్కోవడం మాత్రమే కాకుండా కోవిడ్ వైరస్ కణాలు వృద్ధి చెందకుండా ఆపడం గమనించిన శాస్త్రవేత్తలు ఆ దిశగా ప్రయోగాలు చేశారు. అయితే ఇది మొదటి క్లినికల్ ట్రయల్. డ్రగ్స్  కంట్రోలర్ జెనెరల్ ఆఫ్ ఇండియా [DCGI ] తో పాటు సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ [Central Drug Standard Control Organaisation-CDSCO] లు సంయుక్తంగా రెండో క్లినికల్[Phase-II] ట్రయల్స్ కోసం అనుమతి ఇచ్చాయి మే నెల 2020 లో. 

May - October 2020. DRDO తో పాటు అనుబంధ సంస్థ అయిన DRL [Defence Reacerch Laboratory ] లు కలిసి క్షేత్ర స్థాయిలో పరీక్షలు చేయడం మొదలు పెట్టాయి. ఈ పరీక్షలు కోవిడ్ పేషంట్ కి ఎంత మోతాదు ఇవ్వాలి ఇచ్చిన తరువాత ఆ పేషంట్ ఎలా రెస్పాండ్ అవుతున్నాడు అనే అంశం మీద ట్రయల్స్ నిర్వహించాయి. అంటే ఇది డోస్ & సేఫ్టీ కోసం అన్నమాట. అయితే డ్రగ్ బాగా పనిచేసింది అలాగే ఎలాంటి సైడ్ ఎఫ్ఫెక్ట్స్ కనిపించలేదు పేషంట్ త్వరగానే కొలుకున్నాడు. తరువాత ఫేజ్ 2 a కోసం అనుమతి వచ్చింది. ఫేజ్ 2 a పరీక్షల కోసం భారత దేశంలోని 11 హాస్పిటల్స్ లో మొత్తం 110 మంది కోవిడ్ పేషంట్ల మీద పరీక్షలు నిర్వహించారు అన్నీ కేసులు విజేయవంతంగా ముగిశాయి. 

ఫేజ్ 3 క్లినికల్ ట్రయల్స్ : November 2020-March 2021  లో మూడో దశ క్లినికల్ ట్రయల్స్ కోసం అనుమతి వచ్చింది. ఈ సారి ఢిల్లీ , ఉత్తర ప్రదేశ్ , వెస్ట్ బెంగాల్ , గుజరాత్ , మహారాష్ట్ర,తెలంగాణ ,ఆంధ్ర ప్రదేశ్ , తమిళనాడు,కర్ణాటక రాష్ట్రాలలో 220 మంది కరోనా రోగుల మీద పరీక్షలు నిర్వహించారు. అన్నీ కేసుల్లో కూడా ఉత్తమ ఫలితాలు వచ్చాయి. 

మొత్తం మూడు దశల క్లినికల్ ట్రయల్స్ వాటి డాటా ని విశ్లేషించిన తరువాత ఈ రోజు అత్యవసరంగా అవసరం అయితే వాడడానికి అనుమతి లభించింది   యాంటీ కోవిడ్ డ్రగ్ 2-deoxy-D-glucose (2-DG) కి. 

So! మన స్వంత వాక్సిన్ తో పాటు అత్యవసర పరిస్థితుల్లో వాడడానికి ఒక డ్రగ్ కూడా అందుబాటులోకి వచ్చేసింది. ఇప్పటివరకు అవసరార్ధం కోసం రెమిడిసివర్ ని వాడుతూ వచ్చారు ఇక ఆ డ్రగ్ అవసరం ఉండదు. దూరాశతో బ్లాక్ చేసిపెట్టుకున్న అక్రమదారులకి ఇది చేదు వార్త ! అలాగే ముందుగా ఆక్సిజెన్ కాన్సంట్రేట్ లు,ఆక్సిజెన్ సిలిండర్ లు బ్లాక్ చేసిపెట్టుకున్న వాళ్ళకి కూడా ఇది చేదు వార్త. ఈ రోజు నుండి హాస్పిటల్ వరకు వెళ్లక్కర లేకుండా డాక్టర్ పర్యవేక్షణలో యాంటీ కోవిడ్ డ్రగ్ 2-deoxy-D-glucose (2-DG) ని వాడి ప్రమాదం లేకుండా బయటపడవచ్చు. వెంటీలేటర్ల అవసరం కూడా పెద్దగా రాదు.

మోడీ మౌనంగా ఉంటూ అంతా చూస్తూ ఉన్నాడు అంటే దాని వెనుక కారణం ఇదే. DRDO,INMAS,CCMB ల కృషి దాని ఫలితాలు 2020 మే నెల నుండి ప్రధాన మంత్రికి ఎప్పటికప్పుడు అందుతూనే ఉన్నాయని తెలిసిపోతుంది కాబట్టి నిబ్బరంగా ఉన్నారు మోడీ ! లాక్ డౌన్ ఉన్నా శాస్త్రవేత్తలు నిరంతరం పరీక్షలు చేసుకుంటూ వెళ్లడమే యాంటీ కోవిడ్ డ్రగ్ 2-deoxy-D-glucose (2-DG) బయటికి వచ్చింది. 

DRDO,INMAS,CCMB శాస్త్రవేత్తలకి అభినందనలు మరియు ప్రణామములు. 

జైహింద్ !

వృద్దాశ్రమం

 *వృద్దాశ్రమం (చిన్న కథ)* 


🌸🌸🌸🧘🏻🧘🏻🧘🏻🌸🌸🌸


యశోదమ్మకు రాత్రంతా నిద్ర పట్టలేదు.. కొడుకు అన్న మాటలు విని నెత్తిన పిడుగు పడ్డట్టయిందీ.. పాపం.. మరి నిద్ర ఐనా ఎలా వస్తుంది... అక్కడ, ఇక్కడ కొన్నిచోట్ల తాను కూడా విన్నది.. పిల్లలు తమ తల్లిదండ్రులను వృద్దాశ్రమంలో వదులుతారని... 


       కానీ తనకు కూడా అటువంటి రోజు వస్తుందని కలలో కూడా ఊహించుకోలేదు.. కొడుకు చాలా మంచివాడు.. కోడలిదే అంతా పెత్తనం.. ఐనా ఇన్ని రోజులు చూపించిన ప్రేమ అంతా నాటకమా...?  అనుకుంది.. 

 

    రాత్రి భోజనం సమయంలో కొడుకు తల్లితో చెప్పాడు.. అమ్మా.. రేపు ఉదయం తొందరగా తయారవ్వు..వృద్దాశ్రమానికి వెళ్ళాలి..అన్ని ఏర్పాట్లు చేసాను.. వాళ్లు కూడా తొందరగా రమ్మన్నారు... అని చెప్పాడు.. యశోదమ్మకు గొంతులో ముద్ద దిగలేదు.. ఆ రాత్రంతా ఒక యుగంలా గడిచింది యశోదమ్మకు... 


      ఉదయం కోడలు యశోదమ్మ దగ్గరకు వచ్చి అత్తయ్య తొందరగా రెడీ అవ్వండి.. నేను అన్ని సర్దేశాను.. తొందరగా బయలుదేరాలి అని చెప్పింది.. యశోదమ్మకు గట్టిగా ఏడ్వాలనిపించింది.. కానీ కోడలి ముందు తన దౌర్బల్యము చూపించడం ఇష్టం లేక., తనను తాను సముదాయించుకుని.. వాళ్ళకు ఇష్టం లేనప్పుడు నేను ఎక్కడ ఉంటే ఏంటి ?  అని మనసు ధృడం చేసుకుంది.. మనసు భారంగా ఉంది... నాలుగు సంవత్సరాల క్రితం మరణించిన భర్త గుర్తుకు వచ్చి కళ్ళలో నీళ్లు పెట్టుకుంది.. 


      ఇంతలో కొడుకు వచ్చి అమ్మా.. పద వెళదాం... ఇప్పటికే ఆలస్యం అయింది అంటూ పిలిచినపుడు యశోదమ్మ మనసు భారంతో బయలుదేరింది.. ఇంతలో కోడలు ప్యాక్ చేసిన అన్నింటినీ కారు డిక్కీలో సర్దేశింది.. అరగంటలో ఆశ్రమానికి చేరుకున్నారు.. 


     వెనక సీట్లో కూర్చున్న యశోదమ్మను దించి భుజాలపై చేతులు వేసి ప్రేమగా పదమ్మా.. అంటూ ఆఫీస్ రూం వైపు నడిచారు.. ఆ సమయంలో యశోదమ్మకు ఈ ప్రేమంతా నాటకమా... అనుకుంది.. కళ్ళలో నీళ్లు తిరిగాయి.. 


     ఆఫీసు రూంలో కొడుకు వాళ్ళతో ఏవేవో మాట్లాడాడు... అంతా ఇంగ్లీష్ లోనే.. యశోదమ్మకు అర్థం కాలేదు.. 


   అక్కడినుండి అందరూ ఆశ్రమంలోనికి వెళ్ళారు.. అక్కడ ఒక పెద్ద హాలు.. సుమారు నూటయాబై మందికి పైగా తనలాంటి వృద్దులు ఉన్నారు.. బహుశా తనని వాళ్ళకు పరిచయం చేస్తారేమో అనుకుంది.. 


    కానీ తన ఊహకు భిన్నంగా అక్కడ ఉన్న వాళ్లందరూ ఒక్కసారిగా "హ్యాపీ బర్త్ డే టూ యూ" అంటూ రాగయుక్తంగా అనేసరికి  ఆశ్చర్యపోయింది.. 


      వెంటనే కొడుకు తేరుకొని అమ్మ కాళ్లకు నమస్కరించి... 

అమ్మా.. క్షమించమ్మా.. నీకొక చిన్న సర్ ప్రైజ్ ఇవ్వాలనే ముందుగా నీకు తెలుపలేదు.. నీ కోడలుకు విషయం చెప్పవద్దని మాట తీసుకున్నా.. అంటూ ఆప్యాయంగా హత్తుకున్నాడు.. ఇంతలో కోడలు కూడా వచ్చి "జన్మదిన శుభాకాంక్షలు అత్తయ్య" అంటూ ఆప్యాయంగా హత్తుకుంది.. 


     అమ్మా.. నీ జన్మదినాన్ని వృద్దాశ్రమంలో చేసుకుని.. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నీ చేతులతో కొత్త బట్టలు ఇచ్చి, స్వీట్లు ఇచ్చి.. వారితో పాటు మనమూ ఇక్కడే భోంచేసి వెళదామని ప్లాన్ చేసానమ్మా అంటూ కొడుకు అనేసరికి యశోదమ్మకు ఎక్కడ లేని సంతోషంతో కళ్ళలో ఆనంద భాష్పాలు రాలాయి... 


కన్న ప్రేమ గొప్పదనం పై చాగంటి వారి మనస్సు కదిలించే ప్రసంగం 


      ఆ రోజంతా అందరూ అక్కడే గడిపి హాయిగా ఇంటికి చేరుకున్నారు.. 

 *లోకాన్ సమస్తాన్ శుఖినోభవంతూ* 

 🌸🌸🌸🧘🏻🧘🏻🧘🏻🌸🌸🌸

ఏది గొప్పది

 *🧘‍♂️పంచేంద్రియాలలో ఏది గొప్పది?🧘‍♀️*

🕉️🌞🌏🌙🌟🚩


*ఘ్రాణం - రసము - చక్షువు - త్వక్ - శ్రోత్రము.*



*ఈ ఐదు పంచేంద్రియములు లేదా జ్ఞానేంద్రియములు అంటారు. (ముక్కు - నోరు - కన్నులు - శరీరము - చెవులు) ఈ ఐదింటిలో ఘ్రాణేంద్రియము (ముక్కు) గొప్పదిగా చెప్పవచ్చు. ఎందుకంటే మనిషి మరణానికి చేరువ కాబోతున్నపుడు చెవులు వినిపించవు. కన్నులు దృష్టిని కోల్పోతాయి. శరీరం స్పర్శను పోగొట్టుకొంటుంది. నోరు మాటను కోల్పోతుంది. కాని ముక్కు మాత్రం తన శ్వాసక్రియను కొనసాగిస్తూనే వుంటుంది. మనిషి మరణం పొందేవరకు తోడుగా నిలిచి వుండే ఇంద్రియం ఘ్రాణేంద్రియం ఒక్కటే. అన్ని మతాల మహిళలు ముక్కును కుట్టించుకోవటంలోని సదుద్దేశ్యం ఇదే!*



*ఘ్రాణేంద్రియానికి మంచి సువాసన కావాలి. లేకుంటే మిగిలిన ఇంద్రియా లను ప్రేరేపించి మనిషిని దూరంగా నడిపిస్తుంది చివరకు మనిషి తినే ఆహారమైనాసరే, ముందుగా ముక్కుకి నచ్చాలి. తరువాత కళ్ళకు నచ్చాలి. తరువాత నోటికి నచ్చాలి. అందుకే మనం భుజించే ఆహార పదార్థాలలో సువాసనా ద్రవ్యాలను తప్పకుండా వాడుతుంటాం. సువాసన లేని నేతిని ఎవరైనా ఇష్టపడతారా!*



*మంచి పరిమళం ముక్కుకి తగిలిన వెంటనే నరనాడులు వికసిస్తాయి. శరీరం ప్రశాంతతను అనుభవిస్తుంది. కన్నులు విప్పారుతాయి. మనిషి మొత్తం చైతన్యవంతుడౌతాడు. నాడీమండలమంతా ఉత్తేజితమైపోతుంది. కాబట్టి పంచేంద్రియాలలో ముక్కు గొప్ప ఇంద్రియం. మనిషి అందమంతా ముక్కులోనే వుంటుంది.*



*ఘ్రాణేంద్రియం ఉల్లాసంగా వుంటే శరీరం మొత్తం హుషారుతో వుంటుంది. అందుకే మనం పరిమళం వుంటే సబ్బులను, పౌడర్లను ఇష్ట పడుతుంటాం. చాలామంది మనస్సుకి మత్తెక్కించే సెంట్లను వాడుతూ వుంటారు.*



*పంచేంద్రియాలకూ మనస్సుకీ ఎంతో సంబంధం వుంది. మంచి సువాసన తగిలినా, మంచి సంగీతం విన్నా, మంచి సన్నివేశం చూసినా చల్లని గాలి వీచినా, రుచికరమైన పదార్థాలు ఆరగించినా మనస్సుకి ఎంతో సంతోషం కల్గుతుంది. తన్మయత్వం అనుభవిస్తుంది.*


🕉️🌞🌏🌙🌟🚩

మాతృ_పంచకం

 *మాతృ_పంచకం :*🕉️


👉కాలడిలో ఆదిశంకరుల తల్లి ఆర్యాంబ మరణశయ్యపై ఉంది. తనను తలచుకొన్న వెంటనే ఆమె దగ్గరకు శంకరులు వచ్చి ఉత్తరక్రియలు చేశారు.

ఆ సందర్భంలో శంకరులు చెప్పిన ఐదు శ్లోకాలు "#మాతృపంచకం" గా ప్రసిద్ధమైనవి. మనస్సును కదిలించే 

*ఆదిశంకరుల మాతృ పంచకం* స్మరించుకొందాం.



*ముక్తామణిస్త్వం నయనం మమేతి*

*రాజేతి జీవేతి చిరం సుత త్వం*

*ఇత్యుక్తవత్యాస్తవవాచి మాతః*

*దదామ్యహం తండులమేవ శుష్కమ్.1*


అమ్మా! "నువ్వు నా ముత్యానివిరా! , నా రత్నానివిరా!, నా కంటి వెలుగువు నాన్నా! నువ్వు చిరంజీవి గా ఉండాలి" అని ప్రేమగా నన్ను పిలిచిన నీనోటిలో - ఈనాడు కేవలం ఇన్ని శుష్కమైన బియ్యపు గింజలను వేస్తున్నాను. నన్ను క్షమించు.


*అంబేతి తాతేతి శివేతి తస్మిన్*

*ప్రసూతికాలే యదవోచ ఉచ్చైః*

*కృష్ణేతి గోవింద హరే ముకుందే*

*త్యహో జనన్యై రచితో యమంజలిః.2*


పంటిబిగువున నా ప్రసవ కాలములో వచ్చే ఆపుకోలేని బాధను "అమ్మా! అయ్యా! శివా! కృష్ణా! హరా! గోవిందా!" అనుకొంటూ భరించి నాకు జన్మనిచ్చిన తల్లికి నేను నమస్కరిస్తున్నాను.


*ఆస్తాం తావదియం ప్రసూతిసమయే దుర్వార శూలవ్యథా*

*నైరుచ్యం తనుశోషణం మలమయీ శయ్యా చ సంవత్సరీ*

*ఏకస్యాపి న గర్భభార భరణ క్లేశస్య యస్యాక్షమః*

*దాతుం నిష్కృతి మున్నతోపి తనయః తస్యై జనన్యై నమః.3*


అమ్మా! నన్ను కన్న సమయంలో నువ్వు ఎంతటి శూలవ్యథను (కడుపునొప్పి) అనుభవించావో కదా! కళను కోల్పోయి, శరీరం శుష్కించి ఉంటుంది. మలముతో శయ్య మలినమైనా – ఒక సంవత్సరకాలం ఆ కష్టాన్ని ఎలా సహించావోకదా! ఎవరూ అలాంటి బాధను సహించ లేరు. ఎంత గొప్పవాడైనా కుమారుడు తల్లి ఋణాన్ని తీర్చుకోగలడా? నీకు నమస్కారం చేస్తున్నాను.


*గురుకుల ముపసృత్య స్వప్న కాలే తు దృష్ట్వా*

*యతి సముచితవేషం ప్రారుదో త్వముచ్చైః*

*గురుకులమథ సర్వం ప్రారుదత్తే సమక్షం*

*సపది చరణయోస్తే మాతరస్తు ప్రణామః. .4*


కలలో నేను సన్యాసివేషంలో కనబడేసరికి బాధ పడి, మా గురుకులానికి వచ్చి పెద్దగా ఏడ్చావు. ఆ సమయంలో నీ దుఃఖం అక్కడివారందరికీ బాధ కలిగించింది. అంత గొప్పదానివైన నీ పాదాలకు నమస్కరిస్తున్నాను


*న దత్తం మాతస్తే మరణ సమయే తోయమపివా*

*స్వధా వా నో దత్తా మరణదివసే శ్రాద్ధవిధినా*

*న జప్త్వా మాతస్తే మరణసమయే తారక మను-*

*కాలే సంప్రాప్తే మయి కురు దయాం మాతురతులామ్.5*


అమ్మా! సమయం మించిపోయాక వచ్చాను. నీ మరణసమయంలో కొంచెం నీళ్ళు కూడా నేను నీగొంతులో పోయలేదు. శ్రాద్ధవిధిని అనుసరించి “స్వధా”ను ఇవ్వలేదు. ప్రాణము పోయే సమయంలో సమయంలో నీ చెవిలో తారకమంత్రాన్ని చదవలేదు. నన్ను క్షమించి, నాయందు దేనితో సమానము కాని దయ చూపించు తల్లీ! 🙏

గమనించండి

 దయచేసి గమనించండి: *

 * 01 కడుపులను ఖాళీగా ఉంచకండి *

 * 02 ఉపవాసం చేయవద్దు *

 * 03 రోజూ ఒక గంట సూర్యరశ్మిని ఆస్వాదించండి.

 * 04 ఎసి ఉపయోగించవద్దు *

 * 05 వెచ్చని నీరు త్రాగండి, గొంతు తడిగా ఉంచండి *

 * 06 ముక్కుకు  ఆవ నూనె రాయండి *

 * 07 ఇంట్లో హారతి కర్పూరం కాల్చండి *

 * 08 ప్రతి కూరగాయకు అర టీస్పూన్ పొడి అల్లం జోడించండి *

 * 09 దాల్చినచెక్క వాడండి *

 * 10 రాత్రి కప్పు పాలతో ఒక స్పూన్ పసుపు త్రాగాలి 

 * 11 వీలైతే ఒక చెంచా చ్యవన్ ప్రాష తినండి.

 * 12 ఇంటిలో కర్పూరం మరియు లవంగాలతో పొగ వేయండి. 

 * 13 ఉదయం టీలో లవంగం వేసి మరిగించి తాగండి 

 * 14 పండ్లలో ఎక్కువ నారింజ మాత్రమే తినండి 

 * మీరు కరోనాను ఓడించాలనుకుంటే, దయచేసి ఇవన్నీ చేయండి. *

 * పాలలో పసుపు మీ శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. 

హాయ్ ఫ్రెండ్స్..! 

 * Possible అయితే ఈ పోస్ట్‌ను వీలైనంత వరకు భాగస్వామ్యం చేయాలని నేను ప్రతి ఒక్కరికీ విజ్ఞప్తి చేస్తున్నాను *


 ధన్యవాదాలు🙏🙏🙏🙏🙏

మొగలిచెర్ల

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర...

 

*ఆశ్రమ నిర్మాణానికి సూచనలు..జలకళ!!*


*(ఇరవై రెండవ రోజు)*


శ్రీధరరావు దంపతులు, చిన మీరాశెట్టి గారూ కలిసి, సోమవారం ఉదయాన్నే మాలకొండకు వెళ్లారు..పార్వతీదేవి మఠం వద్ద  కొంతసేపు ఎదురుచూసిన తరువాత, శ్రీ స్వామివారు వెలుపలికి వచ్చారు..మీరాశెట్టి గారిని చూసి, పలకరింపుగా నవ్వారు..శ్రీధరరావుగారు, ప్రభావతి గార్లు ఒక ప్రక్కగా కూర్చున్నారు.. వారికెదురుగా శ్రీ స్వామివారు పద్మాసనం వేసుకొని కూర్చుని..


"మీరాశెట్టి ని వెంటబెట్టుకొని మరీ వచ్చారే!.." అని..మీరాశెట్టి గారి వైపు చూసి.."నిస్వార్ధబుద్ధితో, నిర్మల చిత్తంతో మందిర నిర్మాణం చెయ్యి నాయనా!..నీకు శుభం కలుగుతుంది.." అని చెప్పారు..మీరాశెట్టి గారు అలాగే నన్నట్లుగా తలా ఊపి..


"స్వామీ!..నాకు తెలిసిన వాస్తు పండితుడు వున్నాడు..ఆయనను సంప్రదించి, ఆ స్థలం లో వాస్తు నిర్ణయం చేసి, ముహూర్తం చూసుకొని..పని మొదలు పెడతాను.." అన్నారు..


శ్రీ స్వామివారు పెద్దగా నవ్వి..పార్వతీదేవి అమ్మవారి దగ్గరకు వెళ్లి, ఆ అమ్మవారి ముందు పెట్టివున్న నోట్ పుస్తకం లోంచి ఒక కాగితం తీసుకొని..దానిమీద మందిరం ఎలా వుండవలసినదీ..వాస్తు ప్రకారం ఏ ఏ జాగ్రత్తలు తీసుకోవలసినదీ..ప్రతి చిన్న విషయాన్నీ వివరంగా వ్రాసి..మీరాశెట్టి గారికి ఇచ్చారు..శంఖుస్థాపన కు ముహూర్తం కూడా నిర్ణయించి..వ్రాసి ఇచ్చారు..


"ఇక సందేహాలన్నీ తీరి పోయినట్లేనా?..మీరాశెట్టీ..నువ్వు ఎవరినీ సంప్రదించనక్కరలేదు..అన్నీ సవ్యంగా జరిగిపోతాయి.." అన్నారు..


శ్రీధరరావు దంపతుల తో.."మీరూ..మీరాశెట్టి కలిసి చేయవలసిన కార్యక్రమం ఇది..బావి పని మొదలుపెట్టారు కదా..అది పూర్తి కాగానే..మందిర నిర్మాణం మొదలుపెట్టండి.." అని చెప్పి వారి స్పందన కోసం చూసారు..


అందరూ శ్రీ స్వామివారికి నమస్కారం చేసికొని..తిరిగి మొగలిచెర్ల వచ్చారు..మీరాశెట్టి గారు కూడా శ్రీధరరావు గారి వద్ద సెలవు తీసుకొని..బావి పని పూర్తి కాగానే తనకు కబురుచేస్తే..మందిరం పని మొదలుపెడతానని చెప్పి..తమ గ్రామానికి వెళ్లిపోయారు..


బావి త్రవ్వకం జరుగుతోంది..దాదాపు 35, 40 అడుగుల లోతు త్రవ్వారు..నీటి జాడే లేదు..పైగా చట్టుబండ తగిలింది..గునపాలు దిగడం లేదు..ఆరోజుల్లో ఈనాటి లాగా బోరు మిషన్లు అందుబాటులో లేవు..పనివాళ్ళతో త్రవ్వించవలసిందే..అతి కష్టం మీద ఆ బండ తొలగించాలని చూసారు కానీ..పని చేసే వడ్డెర వాళ్ళు ఇక తమ వల్ల కాదని పనిముట్లు అక్కడే వదిలేసి వచ్చేసారు..శ్రీధరరావు గారు ఎంత నచ్చ చెప్పినా..తమ వల్ల కాదని..మందుగుండు పెట్టి పేల్చినా ఆ బండ పగలదని తేల్చేసారు..


ఆ పొలంలో అలా ఓ నలభై అడుగుల గొయ్యి తీసి వదిలేస్తే..గొర్రెలు, మేకలు కాచుకునే వారు గానీ..లేదా ఆ దారంట పోయే వాళ్ళు పొరపాటున అందులో పడితే..తమకెంత చెడ్డపేరు..అదీకాక, శ్రీ స్వామివారు స్వయంగా నిర్ణయం చేసిన స్థలం లో నీళ్లు పడకపోవడమేమిటి?..ఇలా ఆలోచిస్తూ..ప్రభావతి గారు..ఆ లక్ష్మీనృసింహుడినే వేడుకున్నారు.


ప్రక్కరోజు ఉదయాన్నే శ్రీధరరావు గారు ప్రభావతి గారు కావలి లో "కుమారి" (ఇంతకుముందు మొగలిచెర్ల కు వచ్చి శ్రీ స్వామివారిని చూసి వెళ్లిన అమ్మాయి) వివాహ నిశ్చయతాంబూలాలు తీసుకునే వేడుకకు హాజరు కావాల్సి వెళ్లారు..వెళ్ళారిగానీ..వాళ్ళిద్దరి మనసంతా ఈ బావి మీదే ఉంది..అందులో జల పడకపోగా రాయి తేలిందేమిటా అని ఒకటే ఆలోచన..ప్రభావతి గారి నాన్నగారు అడగనే అడిగారు.."అమ్మా!..మీరిద్దరూ ఏదో బాధలో ఉన్నట్లు వున్నారు.." అని.."ఏమీ లేదు.." అని బుకాయించారిద్దరూ..అక్కడ ఆ కార్యక్రమం చూసుకొని రాత్రి పది గంటలకు ఆఖరి బస్సు లో మొగలిచెర్ల చేరారు..


బస్సు దిగి ఇంటి వరండాలోకి అడుగుపెట్టగానే..బావి త్రవ్వుతున్న పనివాళ్ళు నలుగురైదుగురు కూర్చుని వున్నారు...


"ఒరేయ్ శ్రీధరా..పాపం సాయంత్రం నుంచీ మీకోసం వీళ్ళు కాచుక్కూర్చున్నారు..స్వామి వారి బావిలో నీళ్లు పడ్డాయట!.." అని శ్రీధరరావు గారి తల్లి గారు చెప్పారు..


వీళ్ళను చూడగానే..ఆ వడ్డెర వాళ్ళు ఒక్క ఉదుటున లేచి.."అయ్యా!..మీకోసమే ఇక్కడున్నాము స్వామీ..నిన్న బావి త్రవ్వలేమని చెప్పి వెళ్ళామా..ఈరోజు పొద్దున్న ..అయినా ఒకసారి చూద్దామని వెళితే..ఆ చట్టుబండ చీలిక లోంచి జల వస్తోంది..గునపంతో కొద్దిగా పెళ్లగించ గానే.. పైకి చిమ్మాయి నీళ్లు..ఆ జల ఆగలేదు స్వామీ..తీయటి నీళ్లు!..మీకోసం ఒక చెంబులో పట్టుకొచ్చాము..రేపుదయం మీరిద్దరూ అక్కడికి రండి..కళ్లారా చూద్దురు గానీ.." అన్నారు..


శ్రీధరరావు ప్రభావతి గార్లకు ఒక్కసారిగా మనసు తేలికపడింది..శ్రీ స్వామివారు నవ్వుతూ ఆశీర్వదిస్తున్నట్లు అనిపించింది.. సిద్ధపురుషుల మాటలు పొల్లుపోవు!..ఫకీరు మాన్యం లో మొట్టమొదటి జలధార అదే!..


ప్రక్కరోజే ప్రభావతి గారు ఆ నీటితోనే పొంగలి వండి..దైవానికి నివేదించి..పనివాళ్లకు పెట్టి..తామూ ప్రసాదంగా తీసుకున్నారు..


మందిర నిర్మాణం..మీరాశెట్టి దంపతుల కృషి..రేపటి భాగంలో..


సర్వం..

శ్రీ దత్తకృప!.


(పవని నాగేంద్ర ప్రసాద్.. శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్: 523114..సెల్..94402 66380 & 99089 73699).

Anti-Covid Drug

 Happy Morning !


Anti-Covid Drug Developed by DRDO Cleared For Emergency Use

Anti-Covid Drug: The drug comes in powder form in a sachet and is taken orally by dissolving it in water.New Delhi : A drug to treat coronavirus patients, developed by the DRDO (Defence Research and Development Organisation), has been approved for emergency use by the country's top drugs controller as India battles the second wave of the pandemic that is killing thousands every day.

The drug comes in powder form in a sachet and is taken orally by dissolving it in water.


A DRDO lab and Hyderabad-based Dr Reddy's Laboratories developed the anti-Covid therapeutic application of the drug 2-deoxy-D-glucose (2-DG).

The Drugs Controller General of India (DCGI) cleared the drug after clinical trial results showed that a molecule present in the drug helps in faster recovery of hospitalised patients and reduces supplemental oxygen dependence.


A higher proportion of patients treated with the drug tested negative for Covid in RT-PCR tests.


https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1717007


Stay Safe 🙏


Lokah Samastah Sukhino Bhavanthu