28, మే 2026, గురువారం

పంచాంగము

 🕉️ శ్రీ గురుభ్యోనమః🙏🏻

శుక్రవారం,మే.29,2026

శ్రీ పరాభవ నామ సంవత్సరం

ఉత్తరాయణం - గ్రీష్మ ఋతువు

అధిక జ్యేష్ఠ మాసం -శుక్ల పక్షం

తిథి:త్రయోదశి ఉ9.34 వరకు

వారం:శుక్రవారం(భృగువాసరే)

నక్షత్రం:స్వాతి ఉ10.46 వరకు 

యోగం:పరిఘము తె4.46 వరకు

కరణం:తైతుల ఉ9.34 వరకు తదుపరి గరజి రా10.20 వరకు

వర్జ్యం:సా4.52 - 6.36

దుర్ముహూర్తము:ఉ8.04 - 8.56

మరల మ12.23 - 1.15

అమృతకాలం:రా3.19 - 5.04

రాహుకాలం:ఉ10.30 - 12.00

యమగండ/కేతుకాలం:మ3.00 - 4.30

సూర్యరాశి:వృషభం

చంద్రరాశి:తుల    

సూర్యోదయం:5.29

సూర్యాస్తమయం:6.25

సర్వేజనా సుఖినోభవంతు

శుభమస్తు

గోమాతను పూజించండి

గోమాతను సంరక్షించండి

ధర్మమొక్కటే

 🔔*సుభాషితమ్*🔔


        శ్లో 𝕝𝕝 *ఏకో ధర్మః పరం శ్రేయః*

                  *క్షమైకా శాన్తిరుత్తమా|*

                  *విద్యైకా పరమా తృప్తిః*

                  *అహింసైకా సుఖావహా||*


  తా 𝕝𝕝 *"ధర్మమొక్కటే పరమశ్రేయస్సును కలిగించును. ఓర్పు ఒక్కటే ఉత్తమమైన శాంతినిస్తుంది. చదువొక్కటే మిక్కిలి తృప్తిని ప్రసాదించును. అహింస ఒక్కటే సుఖాన్ని చేకూర్చును"......*



   


శ్రీమహావిష్ణుపురాణం* *102వ భాగం*

 🌹🌷🪷🐚🛕🐚🪷🌷🌹

       *గురువారం 28 మే 2026*   


     *శ్రీమహావిష్ణుపురాణం*                              

           *102వ భాగం*


        *శ్రీకృష్ణావతారము-5*


*బాలకృష్ణుని లీలలు*


*మద్దిచెట్ల రూపంలో పెరటిలోవున్న యక్షులకు శాప విమోచనం*```


నందుడు గోకులవాసులతో సమావేశం జరిపాడు. బాల కృష్ణుని కోసం కంసుడు పంపే రాక్షసులు, వారు చనిపోవడం గురించి చర్చించారు. మరొక్కసారి జరిగితే గోకులం వదిలి సురక్షిత ప్రాంతానికి నివాసం మార్చుతానని నందుడుచెప్పగా, గోకులవాసులు కూడా నందుని వెంట గోకులం వదలి వస్తామని అన్నారు.


బాల కృష్ణుడు వయస్సుపెరగటం తో పాటు అల్లరి పెరగసాగింది. గోకుల వాసులు పాలు, పెరుగు, వెన్న, నెయ్యి తమ పిల్లలకు కూడా పెట్టకుండా మధురలో అమ్మేటందుకు పంపడం గమనించాడు. గోకులవాసులు తమ పిల్లలకు వెన్న పెరుగు పాలు పెట్టకపోతే ఏం చేస్తారో వారికి బుద్ధి చెప్పాలని గోపబాలురతో ఒక బృందం ఏర్పాటు చేశాడు.


గోపాలుర, గోపికల ఇళ్లల్లోకి పగలు ఇంట్లో లేనప్పుడు, రాత్రి నిదుర పోయినప్పుడు తన బృందంతో దూరేవాడు. వారు అందకుండా పైన ఉట్టి మీద పెట్టిన వెన్నముంతలు, పాలు పెరుగు కుండలు అన్నీ గోపబాలుర భుజాల పైకి ఎక్కి కిందకు దించేవాడు. తను తిని బలరాముడికి, గోపబాలురు, గోపబాలికలకు సంతృప్తిగా తినిపించేవాడు. రోజుకో ఇల్లు నిశ్చయించుకుని వెన్న దొంగతనాలు చేసేవాడు.


పడుకున్న భార్యభర్తలను, తల్లి కూతుళ్ళను వారి వస్త్రాలతో కట్టేసేవాడు. పొరపాటున శబ్దానికి లేచినా, వారు కట్లు విప్పుకునేలోపు తన బృందంతో పారిపోయేవాడు. క్రమంగా ఒక్కరి ఇంట్లో కూడా అమ్మడానికి వెన్న నెయ్యి పెరుగు పాలు మిగలటం లేదు. ఎవరైనా పట్టుకోవాలని ప్రయత్నిస్తే దొరకకుండా పారిపోయేవాడు. గోపాలుడు గాని, గోపిక గాని గట్టిగా బంధిస్తే, వారి బుగ్గల మీద ముద్దు పెట్టి నవ్వేవాడు. కన్నయ్య ముద్దుకి, చిరునవ్వుకి తన్మయులై వారు పట్టుసడలించేవారు. క్షణంలో చటుక్కున పారిపోయేవాడు.


రోజురోజుకి బాలకృష్ణుని ఆగడాలు, అల్లరి ఎక్కువ అవ్వడంతో గోపికలందరూ యశోద వద్దకు వెళ్లి చెప్పి కృష్ణుని కట్టడి చేయమని గట్టిగా అడిగారు. 


యశోద నమ్మలేదు. “మా ఇంట్లో కావలసినంత వెన్న ఉంటే వాడికి దొంగతనం చేసే అవసరం ఏముంది" అని కృష్ణుని వెనకేసుకొచ్చేది.


కృష్ణుడు కూడా “అడిగితే ముద్దు పెట్టలేదని గోపికలు చాడీలు చెబుతున్నారు. నేను ఎవరింటికీ వెళ్లలేదు. దొంగతనం చేయలేదు. నీ వద్దనే పడుకున్నా కదమ్మా" అని 

అమాయకంగా అనేవాడు.


యశోద గోపికలను తిట్టి పంపేసేది. ఇలాకాదని గోపికలందరూ కూడబలుక్కుని వాళ్ళింట్లో వెన్న తింటూ మూతికి అంటిన కృష్ణుని బంధించి కుండతో సహా యశోద ముందుకు తెచ్చారు. 


నలుగురి మందు తన పరువుతీసిన కన్నయ్య పై యశోదకు మొదటిసారి కోపం వచ్చింది. "ఇక ముందు ఇలా చేయకుండా కన్నయ్యను గట్టిగా దండిస్తాను" అని పెరటిలోకి తీసుకెళ్లి నడుముకి గట్టిగా త్రాడు బిగించి, ఆ త్రాడును అక్కడి రోలుకి కట్టివేసి కోపంగా లోపలికి వెళ్లింది.


బాలకృష్ణుడు గోపికలవంక దిగులు గా జాలిగా అమాయకంగా చూడటంతో వారి మనస్సులు కదలిపోయాయి. “మీ వలనే కదా మా అమ్మ కట్టేసింది” అన్నట్టు కన్నయ్య చూసే చూపు వారి హృదయాల్లో సూటిగా గ్రచ్చుకుంది. అందరూ కృష్ణుని ప్రేమించేవారే. మా ఇంట్లో వెన్న కన్నయ్య తినాలి అని తలుపులు గడియ వేయకుండా ఉంచేవారే. వారి భర్తలు, తండ్రులు, కొడుకులు అమ్మకానికి వెన్న లేకుండా చేస్తున్నారని తిట్టడం వలన యశోదకు ఫిర్యాదు చేయడానికి వచ్చారుతప్ప కన్నయ్య మీద కోపంతో కాదు.


కన్నీరు ఉబుకుతున్న కళ్ళతో తమ వంక జాలిగా చూస్తున్న కృష్ణుని వంక చూడలేక పోయారు. వారి మనస్సులు ద్రవించిపోతున్నాయి.“ఛీ!పాపిష్టివాళ్ళం. సదా చిరునవ్వు తో ఉండే కన్నయ్యను బాధపెట్టాము" అని తమని తాము తిట్టుకుంటూ యశోద దగ్గరకు వెళ్లి కృష్ణుని కట్లు విప్పి వదిలేయమని ప్రార్ధించారు. 


యశోద తల్లి మనస్సు కూడా కన్నయ్యను అలా శిక్షించినందుకు తల్లడిల్లి పోతోంది.


బింకంగా గోపికల వంక చూసి "మీరే నా కన్నయ్య వెన్న దొంగిలిస్తున్నాడు, శిక్షించి బుద్ది చెప్పమని అడిగారు కదా! ఇప్పుడేమో వదిలేయ మంటున్నారు! మా కన్నయ్య రేపటి నుండి మీ ఇంటి ఛాయలకు కూడా రాడు. వెళ్లండి. సుఖంగా ఉండండి" అని గదమాయిస్తూ వెళ్లమంది. 


గోపికలు కృష్ణుని క్షమించమని దండాలు పెడుతూ మనస్సులో మాత్రం "మా ఇంటికి తప్పక రా కన్నయ్యా! నీకోసం కొత్తవెన్న తీసి పెడతాం" అనుకుంటూ దిగాలుగా వెళ్లారు.


అంతవరకు బుంగమూతి పెట్టి జాలిగా చూస్తున్న బాలకృష్ణుడు చిరునవ్వు నవ్వసాగాడు. అటూ ఇటూ చూసాడు. రోలుకు కట్టేసిన యశోద ఇంటి పనిలో నిమగ్నమై ఉంది. పెరటిలోకి కొద్ది దూరంలో రెండు మద్ది చెట్లు పక్కపక్కనే కనిపించాయి. వాటి మధ్యకు వెళ్లితే రోలుకి కట్టిన త్రాడుని తెంచుకోవచ్చును అనుకున్నాడు. ముందుకు పాకసాగాడు. రోలు నేలపై పడింది.


కృష్ణుడు ముందుకు పాకుతూ వెళుతుంటే వెనుక రోలు దొర్లుతూ రాసాగింది. తనను పరిహసించిన ఇద్దరు యక్షులను మద్దిచెట్లగా మారి అక్కడ ఉండ మని శపించిన నారద మహర్షి అక్కడకు వచ్చాడు. శాప విమోచనం చెప్పమని బతిమాలిన యక్షులకు నారాయణుని బాల రూపంతో విమోచనం కలుగుతుందని అప్పుడు చెప్పాడు. ఇప్పుడు ఆ దృశ్యం చూడటానికి వచ్చాడు.


అలాగే కంసుడు పంపిన ఇందీవరుడు అనే రాక్షసుడు కూడా అదృశ్యరూపంలో వచ్చి రోలుని లాగుతున్న కృష్ణుని చూశాడు. తాను రోలుని ఆవహించి లాగుతున్న బాలుడి పై బలంగా పడేసి చంపవచ్చును అనుకుని రోలుని ఆవహించాడు. లీలామానుష వేషధారి అయిన బాలకృష్ణుడు గమనించి నవ్వుతూ వేగంగా రోలు లాగుతూ మద్దిచెట్ల వైపు వెళ్లసాగాడు. బాలుడి బలానికి రాక్షసుడు ఆశ్చర్యపడుతుంటే, బాలకృష్ణుడు బలంగా రోలు ఈడ్చుకుంటూ మద్దిచెట్ల మధ్యకు వెళ్లిపోయాడు. రోలు బలంగా మద్దిచెట్ల మొదలు లో తాకి ఇరుక్కుని ఆగిపోయింది.


కన్నయ్య ఒక్కసారి వెనక్కు చూసి త్రాడును బలంగా నడుముతో లాగాడు. దేవదేవుని బలానికి రెండు మద్ది చెట్లు ఫెళఫెళమని భయంకర శబ్దం చేస్తూ విరిగి నేలపై పడిపోయాయి. రోలుని ఆవహించి ఉన్న రాక్షసుడు చెట్ల కింద పడి భూమిలోపలకి కూరుకుపోయి మరణించాడు. 

శాపవిమోచనం పొందిన యక్షులు చెట్ల నుండి బయటకు వచ్చి కృష్ణునికి నమస్కరించి "జగన్నాథా! ఈ క్షణం కోసం యుగాలుగా వేచి చూస్తున్నాం. మీ దయ వలన శాపవిమోచనం లభించింది" అని ధన్యవాదాలు తెలిపి యక్షలోకం వెళ్లి పోయారు.


చెట్లు విరిగిన శబ్దానికి నంద యశోదలు, గోప గోపాలికలు పెరటిలోకి వచ్చి కనిపించిన దృశ్యం చూసి ఆశ్చర్యపోయారు, భయపడి పోయారు."తరతరాలు గా బలంగా ఉన్న రెండు మహా వృక్షాలు కృష్ణుడి రోలు తాకిడికి కూలిపోవటమేమిటి? కన్నయ్య వాటి మధ్య ఏ దెబ్బతగలకుండా చిరునవ్వు నవ్వుతూ ఉండట మేమిటి?". అక్కడకు వచ్చివున్న నారద మహర్షి "నారాయణుడి దయ కృప ఉండటం చేత బాలునికి ఏమి జరగలేదు, జరగబోదు" అని చెప్పి వారి భయం దూరం చేసే ప్రయత్నం చేసాడు.


యశోద "కఠిన హృదయంతో రోలుకి కట్టేసి కన్నయ్యను అపాయానికి గురి చేసాను" అనుకుంటూ, తనను తాను తిట్టుకుంటూ, కన్నీళ్లు కారుస్తూ కన్నయ్య కట్లు విప్పి గుండెలకు హత్తుకుంది. "ఎవరు ఏమి నీ గురించి చెప్పినా వినను. నిన్ను శిక్షించను. కన్నా నన్నుక్షమించు!" అని కన్నయ్యను గట్టిగా కౌగిలించు కుంది.  


"అమ్మా! నాకు ఏమీ కాలేదు! చూడూ! చిన్న దెబ్బ కూడా తగలలేదు. ఈ ఆట బావుంది. కావాలంటే రోజూ నన్ను ఇలా కట్టేయి" అని కన్నీళ్లు తుడుస్తూ అమాయకంగా నవ్వుతూ అంటూన్న కన్నయ్యను చూసి యశోదకు మాతృప్రేమ ముంచుకు వచ్చింది. నా కన్నయ్య ఎంత మంచివాడో అని హృదయానికి హత్తుకుంది. కన్నయ్య ఒదిగి పోయాడు.


నందుడు మాత్రం ఆలోచనలో పడ్డాడు. ఆపద ఇప్పుడు ఇంటి పెరటిలోకి వచ్చేసింది. కంసుడి రాక్షసులు చెట్ల రూపంలో దాడి చేసారు. వీరి నుండి తప్పించుకో వడానికి త్వరగా గోకులం వదలి వెళ్లాలి అని నిర్ణయించుకున్నాడు. ఊరివాళ్ళతో మాట్లాడి తగిన ఏర్పాట్లు చేసుకోవాలి అనుకుని సేవకులను పిలిచి పడిన చెట్లను తొలగించమని ఆదేశించాడు. నారద మహర్షి నందుని ఆలోచనలు గమనించి దగ్గరకు వచ్చి "నందా! యమునా తీరానికి సమీపంలో ఉన్న బృందావనం మీకు సురక్షితంగా ఉంటుంది" అని మార్గదర్శనం చేసి ఆశీర్వదించి వెళ్లి పోయాడు.


*తరువాత కథ రేపటి భాగంలో చదువుదాం*

*శ్రీకాంత్ గంజికుంట కరణంగారి సౌజన్యంతో*


*ఆధ్యాత్మిక బృందం* నుండి వచ్చింది                     

                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏

సత్సంగం

 ♦️*సత్సంగం --దాని వలన కలిగే ప్రయోజనాలు...*


♦️ 1. దైవ సాన్నిహిత్యం పెరుగుతుంది.

♦️ 2. జీవన దృక్పథం మారుతుంది.

♦️ 3. హృదయం దృఢమవుతుంది.

♦️ 4. శక్తి పెరుగుతుంది.

♦️ 5. రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

♦️ 6. స్థితప్రజ్ఞత అలబడుతుంది.

♦️ 7. మెదడు చురుకుగా ఉంటుంది.

♦️ 8. మనస్సు ప్రశాంతంగా ఉంటుంది.

♦️ 9. కష్టకాలంలో మార్పు వస్తుంది.

♦️ 10. ఒత్తిడి తగ్గుతుంది.

♦️ 11. కోపం తగ్గుతుంది.

♦️ 12. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.

♦️ 13. సమస్యలు తగ్గుతాయి.

♦️ 14. అంగీకార భావం పెరుగుతుంది.

♦️ 15. మనశ్శాంతి లభిస్తుంది.

♦️ 16. ఓర్పు పెరుగుతుంది.

♦️ 17. సంబంధాలు మెరుగుపడతాయి.

♦️ 18. నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి.

♦️ 19. మంచి నిద్ర వస్తుంది.

♦️ 20. సంస్కారం పెరుగుతుంది.

♦️ 21. ఆనందం పెరుగుతుంది.

♦️ 22. కర్మలు నశిస్తాయి.

♦️ 23. పాపాలు తొలగిపోతాయి.

♦️ 24. బలం పెరుగుతుంది.

♦️ 25. దురలవాట్లు తగ్గుతాయి.

♦️ 26. మనసు అలజడి తగ్గుతుంది.

♦️ 27. మనస్సు చురుకుగా ఉంటుంది.

♦️ 28. అహంకారం తగ్గుతుంది.

♦️ 29. సృజనాత్మకత పెరుగుతుంది.

♦️ 30. విలువలు పెరుగుతాయి.

♦️ 31. ఆధ్యాత్మిక శక్తి మేల్కొంటుంది.

♦️ 32. భయం పోతుంది.

♦️ 33. అనుబంధాలు పెరుగుతాయి.

♦️ 34. ఆరోగ్యం మెరుగుపడుతుంది.

♦️ 35. తృప్తి లభిస్తుంది.

♦️ 36. నిర్ణయాల్లో స్పష్టత వస్తుంది.

♦️ 37. ధనాత్మక శక్తి పెరుగుతుంది.

♦️ 38. వాతావరణం శుద్ధి అవుతుంది.

♦️ 39. ప్రతికూలతలు తగ్గుతాయి.

♦️ 40. దైవిక తరంగాలు ఏర్పడతాయి.

♦️ 41. కల్మషాలు తొలగిపోతాయి.

♦️ 42. తగాదాలు తగ్గుతాయి.

♦️ 43. భేదాలు తొలగిపోతాయి.

♦️ 44. ప్రశాంతత లభిస్తుంది.

♦️ 45. డిప్రెషన్ తగ్గుతుంది.

♦️ 46. ఆలోచనలు మారుతాయి.

♦️ 47. విశ్రాంతి లభిస్తుంది.

♦️ 48. పరమాత్మ అనుభవం కలుగుతుంది.

♦️ 49. సుఖం, శాంతి, ఆనందం లభిస్తాయి.

♦️ 50. ప్రాణశక్తి పెరుగుతుంది.

♦️ 51. శరీర బలం పెరుగుతుంది.

♦️ 52. ఎరుక పెరుగుతుంది.

♦️ 53. మానవ విలువలు పెరుగుతాయి.

♦️ 54. కోరికలు తగ్గుతాయి.

♦️ 55. జ్ఞానం పెరుగుతుంది.

♦️ 56. సృష్టి రహస్యాలు తెలుస్తాయి.

♦️ 57. వ్యామోహాలు తగ్గుతాయి.

♦️ 58. శరణాగతి భావం పెరుగుతుంది.

♦️ 59. జీవనశైలి మారుతుంది.

♦️ 60. బలహీనత తొలగిపోతుంది.

♦️ 61. ప్రవర్తన మెరుగుపడుతుంది.

♦️ 62. తత్వజ్ఞానం పెరుగుతుంది.

♦️ 63. ధార్మిక స్పృహ పెరుగుతుంది.

♦️ 64. సంప్రదాయం పాటించగలుగుతాం.

♦️ 65. భక్తి పెరుగుతుంది.

♦️ 66. భక్తిమార్గం సులభమవుతుంది.

♦️ 67. సాంస్కృతిక వికాసం కలుగుతుంది.

♦️ 68.సజ్జన సాంగత్యం ఏర్పడుతుంది.

♦️ 69. దైవ దర్శనం కలుగుతుంది.

♦️ 70. జీవిత పరమార్ధం తెలుస్తుంది.

♦️ 71. గురు కరుణ లభిస్తుంది.

♦️ 72. భయాలు తొలగిపోతాయి.

♦️ 73. కామ, క్రోధాలు తొలుగుతాయి.

♦️ 74. కృతజ్ఞత పెరుగుతుంది.

♦️ 75. భవరోగం నశిస్తుంది.

♦️ 76. అంతఃకరణ శుద్ధి జరుగుతుంది.

♦️ 77. వివేకం,విచక్షణ మేల్కొంటుంది.

♦️ 78. పీడకలలు తగ్గుతాయి.

♦️ 79. ఇష్టార్థాలు సిద్ధిస్తాయి.

♦️ 80. జ్ఞాన వైరాగ్యం పెరుగుతుంది.

♦️ 81. వాంఛలు తగ్గుతాయి.

♦️ 82. బ్రహ్మజ్ఞానం కలుగుతుంది.

♦️ 83. సంసార మోహం తగ్గుతుంది.

♦️ 84. ఏకాంత భావం పెరుగుతుంది.

♦️ 85. మనసు స్థిరమవుతుంది.

♦️ 86. సత్కర్మలపై ఆసక్తి పెరుగుతుంది.

♦️ 87. భగవంతునిపై ప్రేమ పెరుగుతుంది.

♦️ 88. ప్రశాంతత అలబడుతుంది.

♦️ 89. అసూయ భావం తగ్గుతుంది.

♦️ 90. అమరత్వ భావం కలుగుతుంది.

♦️ 91. జనన మరణ బంధం తోలుగుతుంది.

♦️ 92. ఆరోగ్యం, ఆయుష్షు పెరుగుతుంది.

♦️ 93. సమృద్ధి పెరుగుతుంది.

♦️ 94. మానసిక వికాసం కలుగుతుంది.

♦️ 95. ఐశ్వర్యం పెరుగుతుంది.

♦️ 96. శుభఫలాలు కలుగుతాయి.

♦️ 97. అజ్ఞానం తొలగిపోతుంది.

♦️ 98. దుష్కర్మలు నశిస్తాయి.

♦️ 99. సేవాభావం పెరుగుతుంది.

♦️ 100. భగవంతుని సాక్షాత్కారం లభిస్తుంది.

♦️ 101. నాడులు సమతుల్యం అవుతాయి.

♦️ 102. శ్వాస సక్రమమవుతుంది.

♦️ 103. హృదయం స్థిరమవుతుంది.

♦️ 104. మెదడు ప్రశాంతమవుతుంది.

♦️ 105. ఆత్మజ్ఞానం యోగ్యత పెరుగుతుంది.

♦️ 106. దైవ కృప లభిస్తుంది.

*

ఓం శ్రీ గురు రాఘవేంద్ర సార్వభౌమనే నమః🌻🌹

 🌹🌻ఓం శ్రీ గురు రాఘవేంద్ర సార్వభౌమనే నమః🌻🌹

🌺కలియుగ కల్పవృక్షం మంత్రాలయంలో వెలసిన శ్రీ రాఘవేంద్రతీర్థులు.🌺

👉 భక్తకోటికి కష్టాలు కడ తేరుస్తూ మంత్రాలయం మహర్షిగా భక్తుల పూజలు అందుకుంటున్నారు. మంత్రాలయ ఋషి రాఘవేంద్రులు మానవ కళ్యాణంకోసం వెలిసిన మహిమాన్విత మహనీయుడు శ్రీరాయలు. భక్తులు రాఘవేంద్రస్వామిని శ్రీరాయలు అని పిలుచుకుంటారు. 


బృందావనం నుంచే సజీవుడిగా వుండి భక్తుల మొర ఆలకిస్తున్న దేవుడు రాఘవేంద్రస్వామి. ‘‘నేను, దేవుడు ఒకటికాము మేమిరువురము వేరువేరు. అతడు ఈశుడు, నేనాతని దాసుడను మాత్రమే’’ అని చెప్పే ద్వైత సిద్ధాంతంను ప్రవచించిన మాద్వచార్యుల బోధనల వ్యాప్తికోసం ప్రచారంచేసిన వారే శ్రీ రాఘవేంద్రస్వామి. మద్వా సిద్ధాంతం ప్రకారం మంత్రాలయం రాఘవేంద్రస్వామి మఠంలో పూజలు సాగుతున్నాయి. మద్వ ప్రచారం సాగిస్తూ మానవ కళ్యాణంకోసం యోగిగా మారిన మహానుభావుడు శ్రీ రాయలు.


👉అలాంటి మహనీయుడైన శ్రీ రాఘవేంద్రులు క్రీ.శ.1595 సంవత్సరం, మన్మథ నామ సంవత్సరం ఫాల్గుణ శుద్ధ సప్తమి మృగశిరా నక్షత్రంలో తిమ్మన్నభట్టు, గోపాంబ దంపతులకు కలిగిన సంతానమే సన్యాసం తీసుకున్న తరువాత రాఘవేంద్రునిగా మారిన రాజయోగి. తల్లిదండ్రులు వెంకటనాధుడుగా నామకరణం చేసారు. 

🌷🌻భక్తుల కోర్కెలు తీర్చే స్వామిగా, సాహితీవేత్తగా, మహిమలు చూపే మహనీయుడుగా పూజలు అందుకున్న రాఘవేంద్రులు భక్తుల హృదయాలలో కొలువై వున్నాడు. కలియుగ కల్పవృక్షంగా భక్తులు కొలుస్తారు.

🌸‘‘పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మరతేయచ!

భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేననే’’🌸

అంటూ నిత్యం భక్తుల పూజలు అందుకుంటూ భక్తుల హృదయాలలో కొలువై వున్నాడు శ్రీ రాఘవేంద్రులు.🌻🌷

🌺🍃🌸శుభమస్తు🌸🍃🌺

పంచాంగం 28.05.2026 Thursday,

 ఈ రోజు పంచాంగం 28.05.2026 Thursday,


స్వస్తి శ్రీ చాంద్రమాన పరాభవ నామ సంవత్సరః ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు అధికజ్యేష్ఠ మాస శుక్ల పక్ష ద్వాదశి తిథి బృహస్పతి వాసర చిత్ర నక్షత్రం వరీయాన్ యోగః బాలవ తదుపరి కౌలవ కరణం.


రాహుకాలం : మధ్యాహ్నం 01:30 నుండి 03:00 వరకు.

 

యమగండం: ఉదయం 06:00 నుండి 07:30 వరకు.

  


శ్రాద్ధ తిథి: త్రయోదశి


 

నమస్కారః , శుభోదయం

భగవద్గీత

  --------------------------భగవద్గీత. ------------------------

                       చతుర్దోధ్యాయః

               జ్ఞాన కర్మ సన్యాస యోగము




ద్రవ్యయజ్ఞాస్తపోయజ్ఞా యోగయజ్ఞాస్తథాపరే ।

స్వాధ్యాయజ్ఞానయజ్ఞాశ్చ యతయః సంశితవ్రతాః ।। 28 ।।


ప్రతిపదార్థ:



ద్రవ్య-యజ్ఞాః — తన సంపదను యజ్ఞంగా సమర్పించి; తపః-యజ్ఞాః — కఠినమైన నిష్ఠలను యజ్ఞముగా సమర్పించి; యోగ-యజ్ఞాః — ఎనిమిది అంచెల యోగాభ్యాసమును యజ్ఞముగా చేసి; తథా — ఈ విధముగా; అపరే — ఇతరులు; స్వాధ్యాయ — వేద శాస్త్రాలను అధ్యయనం ద్వారా జ్ఞానాన్ని వృద్ధి చేసుకుని; జ్ఞాన-యజ్ఞాః — ఆధ్యాత్మిక జ్ఞానాన్ని వృద్ది చేసుకోవటాన్ని యజ్ఞంలా సమర్పించి; చ — మరియు; యతయః — ఈ యొక్క సాధువులు; సంశిత-వ్రతాః — నియమబద్ధమైన వ్రతములను ఆచరిస్తూ.



తాత్పర్యము : 


కొందరు తమ సంపదని యజ్ఞంలా సమర్పిస్తారు, మరికొందరు కఠినమైన నిష్ఠలను యజ్ఞంలా సమర్పిస్తారు. కొందరు ఎనిమిదంచెల యోగాభ్యాసాన్ని ఆచరిస్తారు, మరికొందరు, కఠినమైన నిష్ఠలను ఆచరిస్తూ వేద శాస్త్రాలని చదువుతూ జ్ఞానాన్ని పెంచుకోవటమే యజ్ఞంలా చేస్తారు.

   


వివరణ:



మనుష్యులు తమ తమ స్వభావాలలో, ప్రేరణలో, క్రియాకలాపాలలో, వృత్తులలో, ఆశయాలలో, మరియు సంస్కారాలలో (పూర్వజన్మల నుండి వచ్చే ప్రవృత్తులు) వేర్వేరుగా ఉంటారు. యజ్ఞములు అనేవి కొన్ని వందల రకాలుగా ఉంటాయని అర్జునుడికి శ్రీకృష్ణుడు బోధపరుస్తున్నాడు. అవి భగవంతునికి అర్పించినప్పుడు అంతఃకరణ శుద్ధికి, ఆత్మ ఉద్ధరణకి ఉపయోగపడుతాయి. ఈ శ్లోకంలో ఆచరణయోగ్యమైన ఇటువంటి మూడు యజ్ఞాల గురించి పేర్కొంటున్నాడు.


ద్రవ్య యజ్ఞం. కొందరు ధనమును సంపాదించి దాన్ని భగవత్ కార్యాల కోసం దానం చేయటం వైపు మొగ్గు చూపుతారు. వారు అత్యంత క్లిష్టమైన వ్యాపార లావాదేవీలలో నిమగ్నమై ఉన్నా, తాము సంపాదించే ధనంతో భగవత్ సేవ చేయాలనే అంతర్గత దృఢ సంకల్పంతో ఉంటారు. ఈ విధంగా, వారు తమకు డబ్బు సంపాదించాలనే ఉన్న స్వభావాన్ని భక్తితో భగవత్ అర్పితముగా సమర్పణ చేస్తారు. జాన్ వెస్లీ అనే ఆంగ్ల ప్రబోధకుడు మరియు మెథడిస్ట్ చర్చి స్థాపకర్త , తన అనుయాయులకు ‘సాధ్యమైనంత సంపాదించండి. సాధ్యమైనంత పొదుపు చేయండి. సాధ్యమైనంత దానమివ్వండి’ (Make all you can. Save all you can. Give all you can.) అని చెప్పేవాడు.


యోగ యజ్ఞం. భారత తత్త్వశాస్త్రములో యోగ దర్శనమనేది, ఆరుగురు మహోన్నత మునులచే వ్రాయబడ్డ ఆరు తత్త్వ సిద్ధాంతాలలో ఒకటి; జైమిని మీమాంస దర్శనం వ్రాసాడు. వేద వ్యాసుడు వేదాంత దర్శనం వ్రాసాడు. గౌతముడు న్యాయ దర్శనం వ్రాసాడు. కణాదుడు వైశేషిక దర్శనం వ్రాసాడు, కపిలుడు సాంఖ్య దర్శనం, మరియు పతంజలి యోగ దర్శనం వ్రాసాడు. పతంజలి యోగ దర్శనం లో ఆధ్యాత్మిక పురోగతి కోసం, శారీరక ప్రక్రియలతో మొదలుపెట్టి, మనస్సుని జయించటం వరకు, 'అష్టాంగ యోగము' అనే ఎనిమిది అంచెల యోగ మార్గం వివరించబడింది. కొంతమంది ఈ మార్గానికి ఆకర్షితులై దీనిని ఒక యజ్ఞంలా ఆచరిస్తారు. కానీ, పతంజలి యోగ దర్శనం స్పష్టంగా ఏమి చెపుతుందంటే:


సమాధిసిద్ధిరీశ్వర ప్రణిధానాత్ (2.45)


‘యోగంలో సంపూర్ణత(సిద్ధి) సాధించాలంటే, నీవు ఖచ్చితంగా భగవంతునికి శరణాగతి చేయాల్సిందే’. ఈ అష్టాంగ యోగం వైపు మొగ్గు చూపేవారు భగవంతుడిని ప్రేమించటం నేర్చుకున్నప్పుడు, వారి యోగాభ్యాసమును యజ్ఞముగా, భక్తి అనే అగ్నిలో సమర్పిస్తారు. ‘జగద్గురు కృపాలుజీ యోగ్’ ఇలాంటి యోగ విధానానికి ఒక ఉదాహరణ. దీనిలో అష్టాంగ యోగ యొక్క శారీరక ఆసనాలు భగవత్ యజ్ఞంలా చేయటంతో పాటు, భగవన్నామములను కూడా జపిస్తారు. ఇటువంటి యోగాసనాల, భక్తి సమ్మేళనము సాధకుని యొక్క శారీరక, మానసిక, మరియు ఆధ్యాత్మిక పరిశుద్ధతకి దారి తీస్తుంది.


జ్ఞాన యజ్ఞం. కొంతమంది మనుష్యులు జ్ఞాన సముపార్జన వైపు మొగ్గు చూపుతారు. వేద శాస్త్ర అధ్యయనం చేస్తూ జ్ఞానాన్ని మరియు భగవంతుని పై ప్రేమని పెంపొందించుకోవటానికి ఈ స్వభావం చక్కగా సరిపోతుంది. సా విద్యా తన్మతిర్యయా (భాగవతం 4.29.49) ‘భగవంతునిపై భక్తిని పెంపొందించేదే నిజమైన జ్ఞానం.’ ఈ విధంగా అధ్యయన పరంగా మొగ్గు చూపే సాధకులు జ్ఞాన యజ్ఞంలో నిమగ్నమౌతారు. దీనిని భక్తి భావంతో పెనవేసినప్పుడు అది ప్రేమపూర్వక భగవత్ ఐక్యతకు దారితీస్తుంది.

28-05-2026 గురువారం రాశి ఫలితాలు

 శ్రీ గురుభ్యోనమః 🙏

28-05-2026 గురువారం రాశి ఫలితాలు


మేషం


వృత్తి ఉద్యోగాలలో ఒక సంఘటన ఆశ్చర్యం కలిగిస్తుంది. సంతానానికి విద్యా, ఉద్యోగావకాశాలు లభిస్తాయి. నూతన మిత్రుల పరిచయాలు పెరుగుతాయి. సోదరుల నుండి శుభవార్తలు అందుకుంటారు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. వ్యాపారాలు, సాఫీగా సాగుతాయి.  

---------------------------------------


వృషభం


ఆర్థిక ఇబ్బందులు కొంత ఇబ్బంది కలిగిస్తాయి. నూతన ఋణయత్నాలు చేయవలసి వస్తుంది. దూర ప్రయాణాలలో అవాంతరాలు కలుగుతాయి. దైవ కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. గృహ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. ఉద్యోగమున అదనపు పనిభారం ఉంటుంది.

---------------------------------------


మిధునం


ముఖ్యమైన వ్యవహారాలలో వ్యయప్రయాసలు తప్పవు. మిత్రులతో కలహా సూచనలు ఉన్నవి. వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి పెరిగి సమయానికి నిద్రాహారాలు ఉండవు. ఇంటా బయట పరిస్థితులు అనుకూలించవు. దూర ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది. వ్యాపారాలు నిరాశ పరుస్తాయి.

---------------------------------------


కర్కాటకం


ఆప్తుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుకుంటారు. దీర్ఘకాలిక వివాదాలు పరిష్కారమవుతాయి. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. చాలాకాలంగా పడుతున్న శ్రమ ఫలిస్తుంది. నూతన వ్యక్తుల పరిచయాలు కలుగుతాయి. వ్యాపార, ఉద్యోగాలు కొంత సామాన్యంగా సాగుతాయి. 

---------------------------------------


సింహం


బంధుమిత్రులతో మాటపట్టింపులు ఉంటాయి.ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. ఉద్యోగమున సహోద్యోగులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. నిరుద్యోగులు శ్రమ ఫలించదు.

---------------------------------------


కన్య


ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. దీర్ఘకాలిక ఋణదాతల ఒత్తిడులు తొలగుతాయి. ఉద్యోగాలు సజావుగా సాగుతాయి. నూతన వ్యాపారాలు ప్రారంభించి లాభాలు అందుకుంటారు.

---------------------------------------


తుల


అనుకోని ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఆలయ దర్శనాలు చేసుకుంటారు. కుటుంబ సభ్యులతో స్వల్ప విభేదాలు కలుగుతాయి. పాత ఋణాలు తీర్చడానికి నూతన ఋణయత్నాలు చేస్తారు. నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపార, ఉద్యోగములు నిరుత్సాహ పరుస్తాయి.

---------------------------------------


వృశ్చికం


కుటుంబ వాతావరణం ఉత్సాహంగా ఉంటుంది. మిత్రులతో ఆలయ దర్శనాలు చేసుకుంటారు. వ్యాపారాలలో విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. చేపట్టిన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆప్తుల నుంచి కీలక సమాచారం సేకరిస్తారు. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. 

---------------------------------------


ధనస్సు


ఆర్థికంగా పురోగతి కలుగుతుంది. గృహమున కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. నిరుద్యోగ యత్నాలు ఫలిస్తాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. సన్నిహితుల నుండి ధన సాయం అందుతుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో స్థానచలన సూచనలు ఉన్నవి.

---------------------------------------


మకరం


కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు. సోదరులతో స్థిరాస్తి వివాదాలు శిరో బాధను కలిగిస్తాయి. వ్యాపారాలు కొంత మందగిస్తాయి. చేపట్టిన పనుల్లో ప్రతిష్ఠంభనలు కలుగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు చెయ్యవలసి వస్తుంది. ఉద్యోగాలలో సమస్యల పరిష్కారానికి అధికారులు సహాయ సహకారాలు అందుతాయి.

---------------------------------------


కుంభం


చేపట్టిన పనులు ముందుకు సాగవు. స్వల్ప అనారోగ్య సమస్యలు చికాకు పరుస్తాయి. ముఖ్యమైన పనులలో శ్రమపడ్డా ఫలితం కనిపించదు. భూ సంబంధిత క్రయవిక్రయాలలో ఒప్పందాలు వాయిదా పడతాయి. వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ఉద్యోగాలలో ఇతరులతో తొందరపడి మాట్లాడటం మంచిది కాదు.

---------------------------------------


మీనం

 

గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. గృహమున ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి.

---------------------------------------

*శ్రీ మహావిష్ణు పురాణం*

 

     *శ్రీ మహావిష్ణు పురాణం*

              ➖➖➖✍️

            201 వ భాగం 


*శ్రీకృష్ణావతారము4.*

*బాల కృష్ణుని లీలలు - 

*పూతన, శకటాసుర సంహారం:

      

```

గోకులంలో యశోద నందుల పుత్రుడి జన్మోత్సవం రంగ రంగ వైభవంగా జరిగింది. గర్గ మహర్షి నీలమేఘ శ్యామ స్వరూపం కాబట్టి యశోదా నందనునికి ‘శ్రీకృష్ణుడు’ అని నామకరణం చేశాడు. 

బాల కృష్ణుడి బోసి నవ్వులకి గోకులం అంతా మైమరచి పోయింది. ఆ నవ్వులు చూడటానికి అందరూ నందుని ఇంటి దగ్గరే ఉండసాగారు.


యశోద నందనుని దివ్య సుందర రూపం, బోసి నవ్వు, చూసి తన్మయత్వం పొందినవారి వలన గోకులం చుట్టు పక్కల గ్రామాలకు తెలిసి పోయింది. అందరూ బాల కృష్ణుని దర్శనం కోసం గోకులం రాసాగారు. కంసుడి ఆదేశంతో మధుర రాజ్యమంతా తిరుగుతూ గ్రామాలలో పసిపిల్లలను విషము స్తన్యపు పాల ద్వారా ఇచ్చి చంపుతున్న పూతన అనే రాక్షసికి ఈ విషయం తెలిసింది.


కృష్ణుడి జన్మ వివరాలు తెలుసుకుంది. కంసుడు చెప్పిన బాలుడు కృష్ణుడే అని అర్ధమయ్యింది. నందుని ఇంటిలో అందరూ మైమరచి నిద్రపోతున్న అర్ధరాత్రి వేళ ప్రవేశించింది. బాల కృష్ణుడి దుష్టశిక్షణ ఆరంభమైంది. చిరునవ్వులు చిందిస్తూ పూతన కోసం ఎదురు చూడసాగాడు. ఉయ్యాల దగ్గరకు అందమైన గోపిక రూపంలో పూతన వచ్చింది.


బాల కృష్ణుడు పూతనను చూడగానే నవ్వుతూ ఎత్తుకోమన్నట్టు బుల్లి చేతులు చాచాడు. పూతన "నీ మరణం నా చేతిలోనే కన్నయ్యా" అంటూ ఎత్తుకుని బయటకు తీసుకెళ్లింది. రాత్రి సమయంలో రాక్షస మాయ చేత పూతన స్తన్యం ద్వారా త్రాగించే పాలు విషపూరితం అవుతాయి. పాలు త్రాగిన పసి పాపలు క్షణాలలో ప్రాణాలు విడుస్తారు.


పక్కకు తీసుకెళ్లి పూతన బాల కృష్ణుడిని హృదయానికి హత్తుకుని తన పాలు త్రాగించ సాగింది. బాల కృష్ణుడు కళ్ళతోనే నవ్వులు చిందిస్తూ పూతన చనుబాలు త్రాగసాగాడు. క్షణం బాగానే ఉంది. కృష్ణుడు చావడానికి బదులు పూతన ప్రాణాలు పాలతో పాటు త్రాగసాగాడు. పూతన పాదాల నుంచి పంచ ప్రాణాలు పైపైకి వెళుతుంటే ఊపిరాడక పూతన గిలగిలా కొట్టుకోసాగింది. కృష్ణుడి నోటి నుంచి తనను దూరం చేసే ప్రయత్నం చేసింది. కృష్ణుడి నోరు ఉడుము పట్టులా పూతన రొమ్ముని పట్టుకొని ఉంది.


ఆర్తనాదాలు బిగ్గరగా చేస్తూ రాక్షసి రూపంలోకి వచ్చి నేలపై పడి కొట్టుకుంటూ ప్రాణాలు వదిలేసింది. 


పూతన అరచిన అరుపులకి నందుని ఇంటిలోని వారంతా మేల్కోని బయటకు వచ్చారు. భయంకరమైన ఆకారంతో మరణించి పడి ఉన్న పూతన రాక్షసిని, ఆమె వక్షస్థలం పై కేరింతలు కొడుతున్న బాల కృష్ణుని చూశారు. భయంతో నిశ్చేష్ఠులు అయ్యారు. 


అంత పెద్ద రాక్షసాకారాన్ని గోకుల వాసులు మొదటిసారి చూశారు. ఎవ్వరూ దగ్గరకు వెళ్ళడానికి సాహసించలేదు. యశోద తేరుకుని దగ్గరకు వెళ్లి బాలకృష్ణుని ఎత్తుకుని దూరంగా వచ్చేసింది. “నారాయణుడి దయ వలన నీవు క్షేమంగా ఉన్నావు. అంతే చాలు” అనిముద్దులుపెట్టు కుంది. దిష్టి తీసింది. నందుడు నారాయణ రక్షాకవచం తెప్పించి బాలకృష్ణుని చేతికి కట్టాడు.


నందుడు పూతన భారి దేహాన్ని ఊరి బయటకు తీసుకెళ్లిదహనం చేయమని ఆదేశించడంతో గోకుల వాసులు అతి ప్రయత్నం మీద ఊరి బయటకు తీసుకెళ్ల గలిగారు. దహనం చేస్తున్న పూతన దేహం నుంచి సుగంధ పరిమళాలు రాసాగాయి. బాల కృష్ణుడు ఆమెలోని విషముతో పాటు చెడును కూడా శుద్ధి చేసాడు. అందుకే సుగంధ పరిమళాలు దహనమయ్యే శరీరం నుంచి వచ్చాయి. గోకుల వాసులు అంతా నారాయణుడి మహిమ అనుకున్నారు.


గోకులంలో పూతన చనిపోయిన వార్త చారుల ద్వారా విన్న కంసుడు తనను చంపేవాడు గోకులంలోనే ఉన్నాడు అని నిర్ధారించుకున్నాడు. మిగిలిన రాక్షసులను కూడా గోకులం వెళ్లమని ఆదేశించాడు. పూతన వంటి మహారాక్షసి చనిపోవడంతో మిగిలిన వారు జాగ్రత్తగా గోకులం లో కంసుని చంపే బాలుని వెతకాలి అనుకున్నారు.


బాలకృష్ణుడు మూడేళ్ల వాడు అయ్యాడు. గోకులంలో ఇళ్ళన్నీ తిరుగుతూ ఆడుకుంటుంటే గోకుల వాసులు మురిపెంగా చూసి ఆనందిస్తున్నారు. "కన్నయ్య ఈరోజు మా ఇంటికి వస్తాడు, మాఇంటికి వస్తాడు" అని తలుపులు తీసి ఉదయాన్నే గోపికలు,గోపాలురు ఎదురు చూసేవారు. కృష్ణుడు వచ్చిన ఇళ్ళవారు అదృష్టవంతులు అనుకుని, మిగతావారు తమ ఇంటికి మరుసటి రోజు రమ్మని కృష్ణుని బతిమాలుతూ పిలిచేవారు.


రోహిణి కుమారుడైన బలరాముడు కృష్ణుడి వెంట రక్షణగా ఉండే వాడు. కృష్ణుడు చేసే అల్లరి పనులన్ని యశోదకు చెప్పేవాడు. గోపబాలురుతో పాటు పెద్దలు కూడా బాలకృష్ణుని అల్లరికి ఆనందించేవారు.


కంసుడి అనుచరుడైన శకటాసురుడు బాలకృష్ణుని లీలలు విని నందుని ఇంటి ముందు శకటరూపం (బండి రూపం) దాల్చి కృష్ణుని చంపడానికి తగిన సమయం కోసం ఎదురు చూస్తున్నాడు. బాలకృష్ణుడు చూసి వీడికి మోక్షం ఇవ్వాల్సిన సమయం వచ్చింది అనుకున్నాడు. గోపబాలురతో ఇంటిముందు ఆడుకుంటూ శకటాసురుడి బండి మీదకు ఎక్కాడు.


సమయం దొరికిందని శకటాసురుడు బండిని వేగంగా గిరగిరా తిప్పుతూ గాలిలోకి లేచాడు. చుట్టూ ఆడుతున్న గోపబాలురు భయపడి అరవసాగారు. కొంతమంది నంద యశోదలకు చెప్పడానికి పరిగెత్తుకుంటూ వెళ్లారు. చూస్తుండగానే బండి ఆకాశంలో దూరంగా వెళ్లి పోయింది.


కనపడనంత దూరం వెళ్లిన తరువాత ఆకాశంలో బాల కృష్ణుడు కాలెత్తి బండిని గట్టిగా తన్నాడు. ఆ పాదపు దెబ్బ శకటాసురుడి గుండెల మీద పడింది. పెద్దగా ఆర్తనాదం చేస్తూ శకటాసురుడు ప్రాణాలు వదిలేశాడు. రాక్షస రూపంతో నేలపై పడ్డాడు. వాడి దేహం పై నుండి పక్కకు వచ్చి బాలకృష్ణుడు ఏమీ తెలియనట్టు చిరునవ్వుతో అందరి వంక చూస్తూ నిలబడ్డాడు.


గోపబాలురు చెప్పడంతో నందుడు, యశోద, ఇతర గోపికలు గోపాలురు పరుగున వచ్చి చూసి ఆశ్చర్యపడ్డారు. విరిగిన బండి, మరణించిన రాక్షసుడు, చిరునవ్వుతో చూసే కృష్ణుడు వారిని బిత్తరపోయేలా చేసింది. ఈ బాలునిలో ఏదో తెలియని గొప్పతనం, మహిమ ఉంది. పెద్ద పెద్దరాక్షసులితనిని చంపాలని వచ్చి చనిపోతున్నారు. నారాయణుడి కృప ఈ బాలునిపై పూర్తిగా ఉంది. నారాయణుడు తమను అన్ని విధాల కాపాడు తాడు అనే విశ్వాసం గోకులవాసులలో కలిగింది.


అందరూ నారాయణ స్మరణ చేసుకుంటూ తమ తమ ఇళ్లకు వెళ్లారు. నందుడు మాత్రం తన కుమారుడి రక్షణ కోసం గోకులం వదలి వెళ్లాలని అనుకున్నాడు. గోకుల వాసులతో చర్చించాలి అనుకుని సమావేశం ఏర్పాటు చేసాడు.✍️

*రేపటి భాగంలో ఆ కధ చదువుదాం..

*శ్రీకాంత్ గంజికుంట కరణంగారి సౌజన్యంతో..

-సేకరణ:పెండ్యాల ఉపేంద్రరావు```

. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                    🌷🙏🌷```

 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🍀🌺🍀🌺🍀🕉️🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి.

          ➖▪️➖

సుందరకాండ-హనుమ*

 

```

      *సుందరకాండ-హనుమ*

                ➖➖➖✍️

                5 వ భాగం 


*నమోస్తు రామాయ సలక్ష్మణాయ*

*దేవ్యైచ తస్యై జనకాత్మజాయై*

*నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో*

*నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్యః*

```

*బాలభానుని లేత కిరణాలు పుఢమిని పలకరిస్తున్న శుభోదయ ఘడియల్లో ఒక మహా ఉపాసకుడు, ధైర్యశాలి, సాధకుడు అయినటువంటి హనుమ సర్వశక్తులను పుంజుకుని ఒక్క ఉదుటున ఆకాశంలోకి ఎగిరి ప్రయాణం చేయనారంభించారు. సకలదేవతలు ఇంద్రుడు, తండ్రి వాయుదేవుడు స్వామి చేపట్టిన రామకార్యంలో సఫలీకృతుడవ్వాలని ఆశీర్వదించారు. శరవేగంతో హనుమ ఆకాశమార్గాన దక్షిణాదికి పయనిస్తున్నారు.```

*ఊరు వేగోద్ధతా వృక్షా ముహూర్తం కపి మన్వయుః|*

*ప్రస్థితం దీర్ఘమధ్వానం స్వబన్ధుమివ బాన్ధవాః||47||*```

*అలా ఆకాశంలోకి ఎగిరిన హనుమతో పాటు ఆ మహేంద్రగిరి పర్వతంపై కొన్ని వందల సంవత్సరాల క్రితమునుండి పెరిగిన మహా వృక్షములు కూకటి వేళ్లతో పెకలింపబడి స్వామితో సమానంగా కొంతదూరం ప్రయాణించి సముద్రంలో పడిపోయాయి, ఆ చెట్లపై వున్న అనేకమైన రంగుల పుష్పాలు తమకు దక్కిన మహద్భాగ్యానికి అమితానందంతో స్వామి శరీరంపై అలంకృతమయిపోయాయి. ఆ సమయమున స్వామి ఆకాశములో పుష్పాలతో నిండిన మేఘములా కనిపిస్తున్నారు. శరవేగంతో పయనిస్తున్న స్వామి శరీరంపై వున్న పుష్పాలు సముద్రంలోకి జారిపడుతున్నాయి ఆ సుందర దృశ్యం చూస్తే ఆకాశం నుండి పూలవాన కురుస్తున్నట్లుగా వుంది.


*యధేచ్ఛగా స్వామి ఎగురుతూ వుండగా స్వామి బాహుమూలముల మధ్యనుండి వస్తున్న గాలి విచిత్రమైన రవం చేస్తోంది. సముద్రంపై అలలు ఉవ్వెత్తున పైకి లేచి స్వామిని అందుకోవడానికి ప్రయత్నించి విఫలమై కిందకు జారిపడుతున్నాయి. ఆ తాకిడికి సముద్రంలో వున్న జీవరాసులు ఉలిక్కిపడి తమ సహజమైనటువంటి గమనాన్ని మరచి ఏం జరుగుతోందో తెలియక అలల తాకిడి తమ శరీరానికి తాకడం వలన ఏర్పడిన బాధవలన వికృతంగా అరుస్తున్నాయి. మేఘమండలాన్ని చీల్చుకు వెడుతూ బయటకు వస్తూ శరవేగంతో, దివ్యకాంతులతో ప్రకాశిస్తూ వెళుతుండగా పౌర్ణమి చంద్రుడు వెన్నెల వెలుగులు చిందిస్తూ అతివేగంతో ఆకాశాన పయనిస్తున్నట్లుగా వుంది.```

*సన్ధ్యయా సమభిస్పృష్టం యథా తత్సూర్యమండలమ్ |*

*లాఙ్గూలం చ సమావిద్ధమ్ ప్లవమానస్య శోభతే ||61||*```

*అతివేగంతో పయనిస్తున్న స్వామి సౌందర్యాన్ని వర్ణిస్తున్నారు మహర్షి. ముందునుంచి చూస్తే ముఖం ఎర్రగా, పగడాల గుంపుపోసినట్లు వున్న నాశికం, మధ్యమధ్యలో తన తోకను ఝుళిపిస్తున్నారు. మళ్ళి తోకను తన శిరస్సుపై వుంచుతున్నారు. ఆ సమయంలో ఆకాశంలో ఇంద్రధనుస్సు ఏర్పడినట్లుగా వుంది. స్వామి యొక్క గమన శక్తికి అలలు ఉవ్వెత్తున పైకి లేచి కిందకు పడుతున్నప్పుడు ఎప్పుడూ ఎవ్వరికీ కనిపించని సముద్రంలో నివసించే జీవరాశులు అన్నీ కనిపిస్తున్నాయి. అల్లకల్లోలంగా వుంది సముద్రం.


*ఆవిధముగా ప్రయాణిస్తున్న హనుమను సముద్రుడు చూసి తనలో వున్న మైనాకుడిని పిలిచి, “ఓ మైనాకుడా అటుచూసావా రామ కార్యము చేపట్టిన హనుమ శరవేగంతో పయనిస్తున్నాడు, అసలు నేను, మిగిలిన సముద్రములు ఏర్పడడానికి కారణభూతులు ఇక్ష్వాకుల వంశానికి చెందిన సగరచక్రవర్తి. అదే ఇక్ష్వాకుల వంశానికి చెందిన శ్రీరామచంద్రమూర్తి భార్య సీతమ్మతల్లిని వెదకడం కోసం హనుమ లంకకు పయనమయ్యారు. నాకు ఇన్నాళ్ళకు ఆ ఇక్ష్వాకుల వంశీకులకు సహాయం చేసే మహద్భాగ్యం కలిగింది, నీవు నాయందె వున్నావు, నీలో అనేకమైన వృక్షములు తేనెపట్లు, సుమధురమైన ఫలములు వున్నాయి, కావున నీవు పైకి లేచి స్వామి హనుమ ముందు సాష్టాంగపడి తమ ఆతిథ్యం స్వీకరించమని ప్రార్థించు, స్వామి నీ పై కాసేపు విశ్రమించి నీ ఆతిథ్యం స్వీకరించి రెట్టించిన వుత్సాహంతో పయనమవుతారు, మహాత్ముడు హనుమ రాకముందే నీవు పైకి లే! అంజలి ఘటించు. స్వామి విశ్రాంతి తీసుకోవడాని సముచితమైన స్థానం కల్పించు”, అని పలుకగా మైనాకుడు సముద్రం నుండి పైకి లేచి స్వామికి ఎదురుగా వస్తున్న తేజోవంతుని చూసారు, శుభోదయ సమయాన సూర్యుని కిరణాలు మైనాకుడిని తాకగా స్వర్ణమయమైన మైనాకుడు బంగారు వెలుగులు జిమ్ముతూ అత్యంత సుందరముగా ప్రకాశిస్తున్నాడు.``` *“సుందరే కిం న సుందరం”* ``` సుందరకాండలో సుందరము కాని దేముంది అణువణువు సుందరమే. అకస్మాత్తుగా సముద్రం నుండి బంగారు పర్వతం పైకి లేవడం చూసి ఇటువంటి విఘ్నం కలిగిందేమిటి, నా ప్రయాణం ఆగకూడదు నా గమనాన్ని నేను వీడకూడదని శరవేగంతో తన గుండెలతో మైనాకుడ్ని బలంగా ఢీకొన్నారు హనుమ. ఆ తాకిడికి ఆ పర్వతం చూర్ణమయిపోయి సముద్రంలో రాలిపోగా నీలిరంగులో వున్నటువంటి సముద్రమంతా బంగారు రంగులోకి మారిపోయింది, బంగారంతో నిండిపోయిన సముద్రం ధగధగమని మెరిసిపోతూ ఎంతో సౌందర్యంగా కనిపిస్తోంది. ఇన్ని సౌందర్యాలతో కూడిన కాండకు ‘సుందరకాండ’కన్నా మరొక పేరు సముచితమా కానే కాదు!.✍️```(సశేషం)

. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                    🌷🙏🌷```

 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🍀🌺🍀🌺🍀🕉️🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి.

          ➖▪️➖

మన ఆరోగ్యం…

  

*మన ఆరోగ్యం…



 *40 సంవత్సరాల వయస్సు లో ప్రతి మహిళ తప్పనిసరిగా చేయించుకోవలసిన 5 ఆరోగ్య పరీక్షలు*

             ➖➖➖✍️```


*వయసు పెరిగే కొద్దీ మన శరీరం సూక్ష్మమైన మార్పులకు లోనవుతుంది. శారీరక స్వరూపం అందరికీ కనిపిస్తుంది, హార్మోన్లు మరియు ఒత్తిడి స్థాయి మన అంతర్గత వ్యవస్థపై తీవ్రంగా ప్రభావం కలిగిస్తాయి. 40 ఏళ్ల వయస్సు లో మహిళలకు, పెరిమెనోపాజ్ దశ ప్రారంభం వల్ల వారు వ్యాధుల బారిన పడతారు. గుండె జబ్బులు, రొమ్ము క్యాన్సర్ మరియు బోలు ఎముకల వ్యాధి అనేవి చాలా మంది మహిళలు ఎదుర్కొనే కొన్ని సాధారణ సమస్యలు. రెగ్యులర్ హెల్త్ స్క్రీనింగ్ తీవ్రమైన ఇన్ఫెక్షన్ ప్రమాదాన్ని తగ్గించగలదు మరియు వ్యాధిని ముందుగానే గుర్తించగలదు. ప్రాణహాని నిరోధించవచ్చు.


*40 ఏళ్ల వయస్సు లో ప్రతి మహిళ తప్పక చేయించుకోవలసిన 5 సాధారణ ఆరోగ్య పరీక్షలు :

 

*1.బ్లడ్ ప్రెజర్ స్క్రీనింగ్/BLOOD PRESSURE SCREENING:


*అధిక రక్తపోటు అనేది తరువాత జీవితంలో సాధారణం. మధ్య వయస్కులైన మహిళలు తరచూ రక్తపోటు స్థాయి పెరుగుదలకు లోనవుతారు., దీనికి చికిత్స చేయకపోతే గుండెపోటు మరియు స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుంది. ఆహారం మరియు జీవనశైలిలో కొద్ది సర్దుబాటుతో రక్తపోటును తగ్గించడం సులభం. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం కూడా సహాయపడుతుంది. తీవ్రమైన సందర్భాల్లో మాత్రమే మందులు సిఫార్సు చేయబడతాయి.


*2. "బ్రెస్ట్ క్యాన్సర్/BREAST CANCER ":


*అన్ని వయసుల మహిళలకు రెగ్యులర్ రొమ్ము పరీక్ష సిఫార్సు చేయబడింది. రొమ్ము మరియు గర్భాశయ క్యాన్సర్ అన్ని వయసుల మహిళలను ప్రభావితం చేసే రెండు సాధారణ క్యాన్సర్లు మరియు వయస్సుతో ప్రమాదం పెరుగుతుంది. రెండు వారాలకు ఒకసారి ఇంట్లో స్వీయ-రొమ్ముల పరీక్ష, ప్రారంభ దశలో ఏదైనా ముద్ద ఏర్పడటానికి మరియు ఎక్కువ కణజాలాలకు నష్టం జరగకుండా నిరోధించడానికి సహాయపడుతుంది. సంవత్సరానికి ఒకసారి ‘పాప్ స్మెర్’ మరియు ‘మామోగ్రామ్’ పరీక్షను చేయించండి.


*3. ఆస్టియోపొరోసిస్/OSTEO POROSIS:


*వయస్సుతోపాటు ఎముక సాంద్రత మరియు బలాన్ని కోల్పోవడం సాధారణం, ఇది ఎముక లేదా బోలు ఎముకల వ్యాధికి దారి తీస్తుంది. ఎముకలు మరింత బలహీనంగా, పెళుసుగా మారుతాయి, ఇది గాయం లేదా పగులు ప్రమాదాన్ని పెంచుతుంది. బోలు ఎముకల వ్యాధి పురుషులతో పోలిస్తే మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఎముకల సాంద్రతను గుర్తించడానికి DEXA స్కాన్ సహాయపడుతుంది.


*4.రక్తంలో చక్కెర స్థాయి/BLOOD SUGAR LEVEL:


*20 మరియు 30 ఏళ్ళలో వారి ఆహారపు అలవాట్ల గురించి జాగ్రత్తగా ఉండని వ్యక్తులు 40 ఏళ్ళలో మధుమేహంతో బాధపడే అవకాశం ఉంది. దశాబ్దాలుగా తప్పుడు ఆహారం తినడం మరియు బరువు పెరగడం ప్యాంక్రియాస్‌పై ఒత్తిడి తెస్తుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిని సులభంగా పెంచుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలను పరగడుపున/fasting పరీక్షించుకోవడం మధుమేహాన్ని ప్రారంభంలో నియంత్రించడంలో సహాయపడుతుంది.


*5.కొలెస్ట్రాల్ ప్రొఫైల్ CHOLESTEROL PROFILE:


*ఈ రక్త పరీక్ష చేయడం వల్ల తీవ్రమైన గుండె జబ్బులు మరియు స్ట్రోక్ వచ్చే ప్రమాదం తగ్గుతుంది. అధిక కొలెస్ట్రాల్ స్థాయిలు గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతాయి. అధిక కొలెస్ట్రాల్ ఉంటే, డైట్ మార్చడం మరియు కొన్ని మందులు తీసుకోవడం కొలెస్ట్రాల్ తగ్గించడానికి సహాయపడుతుంది. 30సంవత్సరముల తరువాత ప్రతి ఒక్కరూ ప్రతి ఐదేళ్ళకు ఒకసారి కొలెస్ట్రాల్ స్థాయిని తనిఖీ చేయాలి. మొత్తం కొలెస్ట్రాల్ స్థాయిలు డెసిలీటర్ (mg / dl) కు 200 మిల్లీగ్రాముల కంటే తక్కువగా ఉండాలి.✍️```- సేకరణ.

. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                    🌷🙏🌷```

 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🍀🌺🍀🌺🍀🕉️🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి.

          ➖▪️➖

*సంపూర్ణ మహాభారతము

 *సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*

*755 వ రోజు*

ఆశ్రమవాస పర్వము ప్రథమాశ్వాసము

ధర్మరాజు చేసిన అశ్వమేధయాగము గురించి విన్న జనమేజయుడు వైశంపాయనుడిని " మహర్షీ ! అ విధముగా పితృపితామహుల నుండి సంక్రమించిన రాజ్యసంపదను స్వీకరించిన పాండవులు ధృతరాష్ట్రుని పట్ల ఏవిధముగా ప్రవర్తించారు. కుమారులు, మిత్రులు, అమాత్యులను పోగొట్టుకున్న ధృతరాష్ట్రుడు, అష్టైశ్వర్యాలు పోగొట్టుకున్న ధృతరాష్ట్రుడు ఆయన భార్య గాంధారి ఏ విధంగా ప్రవర్తించారు వివరించండి " అని అడిగాడు.

ధర్మరాజు ధృతరాష్ట్రుడి పట్ల వహించిన శ్రద్ధ

వైశంపాయనుడు " జనమేజయమహారాజా ! ధర్మరాజు అతడి తమ్ములు ధృతరాష్ట్ర గాంధారులను ఏ లోపము లేకుండా గౌరవప్రదంగా చూసుకుంటున్నారు. పాండవులు రోజూ ధృతరాష్ట్రుడిని కలుసుకుని ఆయన ఆదేశాలను స్వీకరిస్తున్నారు. విదురుడు, యుయుత్సుడు ఆయనను ఏమరక సేవిస్తూ అతడికి కావలసినవి అడిగి అందిస్తున్నారు. ధృతరాష్ట్రుడు గాంధారి కూడా పాండవుల పట్ల ప్రేమాభిమానాలతో ప్రవర్తిస్తున్నారు. కుంతీదేవి కూడా అక్క గాంధారిని ప్రతి రోజూ వచ్చి పలకరిస్తూ ఉంది. ద్రౌపది, సుభద్ర అత్తగారైన గాంధారిని సేవిస్తున్నారు. ఆమెకు విలువైన కానుకలను సమర్పిస్తున్నారు. ఉలూపి, చిత్రాంగదలు కూడా గాంధారిని సేవిస్తున్నారు. ధర్మరాజు అనుమతితో ధృతరాష్ట్రుడు ఎన్నో ధర్మకార్యాలు చేస్తున్నాడు. దేవాలయములు కట్టించాడు, సత్రములు నిర్మించాడు, చెరువులు తవ్వించాడు, బ్రాహ్మణులకు అగ్రహారాలు, మిగిలిన జాతుల వారికి గ్రామములు నిర్మించాడు. చక్రవర్తి ధర్మరాజును చూడవచ్చే సామంతరాజులు ముందుగా ధృతరాష్ట్రుడిని చూసి తరువాత ధర్మరాజును చూసే వారు. ధర్మరాజు కూడా అందుకు ఎంతో సంతోషించేవాడు. పెదనాన్నకు కుమారులు లేని కొరత లేకుండా ధర్మరాజు ఎంతో జాగ్రత్తవహించ సాగాడు. అది కాక ధర్మరాజు తన తమ్ములకు, అమాత్యులకు, సైన్యాధిపతులకు ఇలా ఆదేశాలు ఇచ్చాడు. " పెదనాన్న, పెదతల్లి గారు పుత్రులను పోగొట్టుకుని దుఃఖంతో ఉన్నారు. వారికి ఏ లోటు రాకుండా చూడండి. నాకు ఏవిధమైన గౌరవ మర్యాదలు ఇస్తారో అదే విధమైన గౌరవ మర్యాదలు వారికి ఇవ్వండి " అని ఆదేశించాడు. ధర్మరాజు మాటలను తమ్ములు, అమాత్యులు, సేవకులు పాటించారు.

ధృతరాష్ట్రుడి పట్ల భీముడి ప్రవర్తన

ధర్మరాజు మీద ఉన్న గౌరవంతో భీముడు ధృతరాష్ట్రుని మీద గౌరవము ఉన్నట్లు నటించినా మనసుమాత్రము ధృతరాష్ట్రుని చూడగానే ఉడికిపోయేది. ధృతరాష్ట్రుడిని చూడగానే భీముడికి మాయాజూదము వలన తాము పడిన బాధలు, అరణ్య అజ్ఞాత వాసముల వలన తాము అనుభవించిన బాధలు గుర్తుకు వచ్చేవి. మనసు మండి పోయేది. భీముడు మాత్రము ధృతరాష్ట్రుడిని చూడగానే మండిపడే వాడు. ధర్మరాజు మాత్రము అందుకు భిన్నంగా ఉండేవాడు. సుయోధనుడు అతడి తమ్ములకు శ్రాద్ధకర్మలు ఆచరించే సమయములో ధృతరాష్ట్రుడి చేత అనేక దానధర్మములు చేయించే వాడు. ధృతరాష్ట్రుడికి తనకుమారులు ఉన్నప్పటికంటే ఇప్పుడు రాచమర్యాదలు అధికంగా జరిగేవి. ధర్మరాజు ధృతరాష్ట్రుడి వలన అతడి కుమారుల వలన తాము అనుభవించిన కష్టాలను, వారి తమకు చేసిన అపకారాలను మనసులోకి రానిచ్చేవాడు కాదు. ధర్మరాజు మనసెరిగి మిగిలిన వారు ధృతరాష్ట్రుడి గురించి కాని, అతడి కుమారుల గురించి కాని, వారి దుష్ప్రవర్తన గురించి కాని చెడ్డగా చెప్పేవారు కాదు. ప్రజలు కూడా ధృతరాష్ట్రుడికి ధర్మరాజుకు బేధము చూపక ఇరువురిని సమానంగా గౌరవించే వారు. ధృతరాష్ట్రుడు కూడా క్రమముగా తన కుమారులను మర్చిపోయి ధర్మరాజు మీద ప్రేమాభిమానాలు కురిపించే వాడు. కాని భీముడిని చూసినప్పుడు ధృతరాష్ట్రుడి గుండె మండిపోయేది. కారణము భీముడు తన కుమారులను చంపాడని అతడు మరచి పోలేకపోవడమే. వారిరువురు ఒకరి మీద ఒకరు మండి పోతున్నా పైకి మాత్రము మర్యాదగా మాట్లాడుకునే వాళ్ళు. అయినా భీముడు మాత్రము ఒక్కోసారి ధృతరాష్ట్ర గాంధారులు వింటూ ఉండగా " ఈ గుడ్డివాడి కొడుకులందరిని చంపేశాను. నా పాలబడ్డ వాడు ఎవడైనా చావకుండా బయట పడ్డాడా. ఆ కౌరవులు బుద్ధిలేక మాతో యుద్ధానికి వచ్చారు కాని నా సంగతి తెసినవారు ఎవరైనా మాతో పెట్టుకుంటాడా ! సుయోధన, దుశ్శాసనులను మట్టు పెట్టిన ఈ భుజాలను నేను పూజచేస్తాను. కౌరవులను సమూలంగా నాశనము చేయడానికి అనుకూలించిన ఆదైవానికి శతకోటి వందనాలు " అని అంటూ ఉండేవాడు. భీముడు అలా అంటూ ఉండేవాడని ధర్మరాజుకు, అర్జునుడికి, కుంతీదేవికి, ద్రౌపదికి తెలియదు. నకులసహదేవులు మాత్రము భీముని మాటలకు సంతోషించే వారే కాని ధర్మరాజుకు భయపడి బదులు చెప్పేవారు కాదు. ధృతరాష్ట్ర, గాంధారులు మాత్రము ఏమీ అనలేక మనసులో బాధపడుతూ ఊరుకుండే వారు.


*రేపు *

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*

*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*

మహాబలిపురం

 🕉 మన గుడి : నెం 1491


⚜  తమిళనాడు : మహాబలిపురం


⚜  శ్రీ షోర్ టెంపుల్ 



💠 మహాబలిపురం/మామల్లపురం (చెన్నై) లోని షోర్ టెంపుల్ భారతదేశంలోని అత్యంత అందమైన పురాతన స్మారక కట్టడాలలో ఒకటి,

మహాబలిపురంలో సముద్రతీరం లో ఈ దేవాలయం ఉంది. 


💠 మార్కో పోలో మరియు అతని తర్వాత ఆసియాకు వచ్చిన యూరోపియన్ వ్యాపారులు ఈ ప్రదేశాన్ని ఏడు పగోడాలు అని పిలిచారు . 

వీటిలో ఒకటి షోర్ టెంపుల్ అని నమ్ముతారు. 

ఈ ఆలయం బహుశా నావికులకు ఒక ల్యాండ్‌మార్క్‌గా పనిచేసింది. ఇది పగోడా లాగా కనిపించడం వల్ల , ఈ పేరు నావికులకు సుపరిచితం అయింది.


💠 ఇది పల్లవ కాలంలో (7వ - 8వ శతాబ్దం) నిర్మించబడింది. 

ఈ ప్రదేశంలోని ఇతర రాతి స్మారక కట్టడాల మాదిరిగా కాకుండా, ఇది ఒక నిర్మాణాత్మక స్మారక కట్టడం. మహాబలిపురంలోని ఇతర స్మారక కట్టడాలతో పాటు (అదే కాలానికి చెందినవి), రాతి ఆలయాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రకటించారు.


💠 మహాబలిపురంలోని అత్యంత ప్రసిద్ధ షోర్ టెంపుల్ 2004 సునామీ సమయంలో అత్యంత దెబ్బతిన్నది


💠 ఇచ్చట అనేక దేవాలయాలు శిలలలో చెక్కబడ్డాయి. 

ఇవే ఇచ్చటి గుహాలయాలు. 

1200 సంవత్సరాలకు పూర్వం తమిళనాడును పాలించిన పల్లవ రాజులు వీటిని నిర్మించారు.

పల్లవ రాజైన మహేంద్రవర్మకు ఈ గుహాలయాలు అంటే ఎంతో అభిమానం. 

తన రాజ్యంలో విష్ణుకుండి రాజులులాగ గుహాలయాలు నిర్మించదలచుకున్నాడు.


💠 మహాబలిపురం దళవానూరు, మామండూరు, తిరుచిరాపల్లి మొదలైన చోట్ల కొండ సానువులను తొలిపించి దేవాలయాలను కట్టించాడు. 

600-750 సంవత్సరాల మధ్య మహాబలిపురంలో పల్లవ రాజుల ప్రావుతో శిల్పులు పెద్ద పెద్ద శిలలకు హస్త కళా నైపుణ్యంతో జీవంపోసి సర్వాంగ సుందరంగా తీర్చి దిద్దారు. 


💠 ఏకశిలలో చెక్కబడిన ఇచ్చటి రథాలు దేవాలయపు రథాలు, రథాల పైభాగాలు, లోపలి భాగాలు అతి చాకచక్యంగా చెక్కబడ్డాయి. 

ఇక్కడ ఒకటిగా ఉన్న ఐదు ఆలయాలు పంచపాండవులకు అంకితమైనాయి. . ఈ మండపంలో మహిషాసురుడికి మండపం ఉంది


💠 ఈ ఆలయం మూడు ఆలయాల కలయిక. ప్రధాన ఆలయం శివుడికి అంకితం చేయబడింది , అలాగే చిన్న రెండవ ఆలయం కూడా శివుడికి అంకితం చేయబడింది. 

రెండింటి మధ్య ఉన్న ఒక చిన్న మూడవ ఆలయం శయన విష్ణువుకు అంకితం చేయబడింది మరియు ఆలయంలోకి నీరు ప్రవహించి ఉండవచ్చు, విష్ణు మందిరంలోకి ప్రవేశించి ఉండవచ్చు. 

రెండు శివ మందిరాలు లంబకోణ ఆకృతీకరణలో ఉన్నాయి.


💠 షోర్ టెంపుల్ కాంప్లెక్స్‌లోని మూడు ఆలయాలు ఒకే వేదికపై నిర్మించబడ్డాయి. 

ఉత్తర చివర నుండి చూస్తే, ఈ ఆలయాలు ధర్మరాజ రథానికి ప్రతిరూపంగా కనిపిస్తాయి .


💠 తూర్పు ముఖంగా ఉన్న ప్రధాన షోర్ టెంపుల్, ఆలయంలోని శివలింగం యొక్క ప్రధాన దేవతపై సూర్యకిరణాలు ప్రకాశించేలా, ఈ ప్రదేశంలోని ఇతర స్మారక చిహ్నాల మాదిరిగానే రాతితో కత్తిరించబడకుండా ఐదు అంతస్తుల నిర్మాణాత్మక హిందూ ఆలయం .


💠 గ్రానైట్ రాళ్లతో నిర్మించబడిన ఇది దక్షిణ భారతదేశంలోని తొలి ముఖ్యమైన నిర్మాణ ఆలయం . 

దీని పిరమిడ్ నిర్మాణం 60 అడుగుల (18 మీ) ఎత్తు మరియు 50 అడుగుల (15 మీ) చదరపు వేదికపై ఉంది. 

ముందు భాగంలో ఒక చిన్న ఆలయం ఉంది, ఇది అసలు వాకిలి .


💠 నల్లరాతిలో చెక్కబడిన  నంది, సింహం, ఏనుగు నిజ రూపాలతో అతి గంభీరంగా సజీవంగా కనిపిస్తాయి. 



💠 మద్రాసుకు సుమారు 60 కి.మీ.ల దక్షిణం🕉 మన గుడి : నెం 1491


⚜  తమిళనాడు : మహాబలిపురం


⚜  శ్రీ షోర్ టెంపుల్ 



💠 మహాబలిపురం/మామల్లపురం (చెన్నై) లోని షోర్ టెంపుల్ భారతదేశంలోని అత్యంత అందమైన పురాతన స్మారక కట్టడాలలో ఒకటి,

మహాబలిపురంలో సముద్రతీరం లో ఈ దేవాలయం ఉంది. 


💠 మార్కో పోలో మరియు అతని తర్వాత ఆసియాకు వచ్చిన యూరోపియన్ వ్యాపారులు ఈ ప్రదేశాన్ని ఏడు పగోడాలు అని పిలిచారు . 

వీటిలో ఒకటి షోర్ టెంపుల్ అని నమ్ముతారు. 

ఈ ఆలయం బహుశా నావికులకు ఒక ల్యాండ్‌మార్క్‌గా పనిచేసింది. ఇది పగోడా లాగా కనిపించడం వల్ల , ఈ పేరు నావికులకు సుపరిచితం అయింది.


💠 ఇది పల్లవ కాలంలో (7వ - 8వ శతాబ్దం) నిర్మించబడింది. 

ఈ ప్రదేశంలోని ఇతర రాతి స్మారక కట్టడాల మాదిరిగా కాకుండా, ఇది ఒక నిర్మాణాత్మక స్మారక కట్టడం. మహాబలిపురంలోని ఇతర స్మారక కట్టడాలతో పాటు (అదే కాలానికి చెందినవి), రాతి ఆలయాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రకటించారు.


💠 మహాబలిపురంలోని అత్యంత ప్రసిద్ధ షోర్ టెంపుల్ 2004 సునామీ సమయంలో అత్యంత దెబ్బతిన్నది


💠 ఇచ్చట అనేక దేవాలయాలు శిలలలో చెక్కబడ్డాయి. 

ఇవే ఇచ్చటి గుహాలయాలు. 

1200 సంవత్సరాలకు పూర్వం తమిళనాడును పాలించిన పల్లవ రాజులు వీటిని నిర్మించారు.

పల్లవ రాజైన మహేంద్రవర్మకు ఈ గుహాలయాలు అంటే ఎంతో అభిమానం. 

తన రాజ్యంలో విష్ణుకుండి రాజులులాగ గుహాలయాలు నిర్మించదలచుకున్నాడు.


💠 మహాబలిపురం దళవానూరు, మామండూరు, తిరుచిరాపల్లి మొదలైన చోట్ల కొండ సానువులను తొలిపించి దేవాలయాలను కట్టించాడు. 

600-750 సంవత్సరాల మధ్య మహాబలిపురంలో పల్లవ రాజుల ప్రావుతో శిల్పులు పెద్ద పెద్ద శిలలకు హస్త కళా నైపుణ్యంతో జీవంపోసి సర్వాంగ సుందరంగా తీర్చి దిద్దారు. 


💠 ఏకశిలలో చెక్కబడిన ఇచ్చటి రథాలు దేవాలయపు రథాలు, రథాల పైభాగాలు, లోపలి భాగాలు అతి చాకచక్యంగా చెక్కబడ్డాయి. 

ఇక్కడ ఒకటిగా ఉన్న ఐదు ఆలయాలు పంచపాండవులకు అంకితమైనాయి. . ఈ మండపంలో మహిషాసురుడికి మండపం ఉంది


💠 ఈ ఆలయం మూడు ఆలయాల కలయిక. ప్రధాన ఆలయం శివుడికి అంకితం చేయబడింది , అలాగే చిన్న రెండవ ఆలయం కూడా శివుడికి అంకితం చేయబడింది. 

రెండింటి మధ్య ఉన్న ఒక చిన్న మూడవ ఆలయం శయన విష్ణువుకు అంకితం చేయబడింది మరియు ఆలయంలోకి నీరు ప్రవహించి ఉండవచ్చు, విష్ణు మందిరంలోకి ప్రవేశించి ఉండవచ్చు. 

రెండు శివ మందిరాలు లంబకోణ ఆకృతీకరణలో ఉన్నాయి.


💠 షోర్ టెంపుల్ కాంప్లెక్స్‌లోని మూడు ఆలయాలు ఒకే వేదికపై నిర్మించబడ్డాయి. 

ఉత్తర చివర నుండి చూస్తే, ఈ ఆలయాలు ధర్మరాజ రథానికి ప్రతిరూపంగా కనిపిస్తాయి .


💠 తూర్పు ముఖంగా ఉన్న ప్రధాన షోర్ టెంపుల్, ఆలయంలోని శివలింగం యొక్క ప్రధాన దేవతపై సూర్యకిరణాలు ప్రకాశించేలా, ఈ ప్రదేశంలోని ఇతర స్మారక చిహ్నాల మాదిరిగానే రాతితో కత్తిరించబడకుండా ఐదు అంతస్తుల నిర్మాణాత్మక హిందూ ఆలయం .


💠 గ్రానైట్ రాళ్లతో నిర్మించబడిన ఇది దక్షిణ భారతదేశంలోని తొలి ముఖ్యమైన నిర్మాణ ఆలయం . 

దీని పిరమిడ్ నిర్మాణం 60 అడుగుల (18 మీ) ఎత్తు మరియు 50 అడుగుల (15 మీ) చదరపు వేదికపై ఉంది. 

ముందు భాగంలో ఒక చిన్న ఆలయం ఉంది, ఇది అసలు వాకిలి .


💠 నల్లరాతిలో చెక్కబడిన  నంది, సింహం, ఏనుగు నిజ రూపాలతో అతి గంభీరంగా సజీవంగా కనిపిస్తాయి. 



💠 మద్రాసుకు సుమారు 60 కి.మీ.ల దక్షిణంగా మహాబలిపురం ఉంది.


Rachana


©️ Santosh Kumarగా మహాబలిపురం ఉంది.


Rachana


©️ Santosh Kumar

28-05-2026 గురువారం రాశి ఫలితాలు

 శ్రీ గురుభ్యోనమః 🙏

28-05-2026 గురువారం రాశి ఫలితాలు


మేషం


వృత్తి ఉద్యోగాలలో ఒక సంఘటన ఆశ్చర్యం కలిగిస్తుంది. సంతానానికి విద్యా, ఉద్యోగావకాశాలు లభిస్తాయి. నూతన మిత్రుల పరిచయాలు పెరుగుతాయి. సోదరుల నుండి శుభవార్తలు అందుకుంటారు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. వ్యాపారాలు, సాఫీగా సాగుతాయి.  

---------------------------------------


వృషభం


ఆర్థిక ఇబ్బందులు కొంత ఇబ్బంది కలిగిస్తాయి. నూతన ఋణయత్నాలు చేయవలసి వస్తుంది. దూర ప్రయాణాలలో అవాంతరాలు కలుగుతాయి. దైవ కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. గృహ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. ఉద్యోగమున అదనపు పనిభారం ఉంటుంది.

---------------------------------------


మిధునం


ముఖ్యమైన వ్యవహారాలలో వ్యయప్రయాసలు తప్పవు. మిత్రులతో కలహా సూచనలు ఉన్నవి. వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి పెరిగి సమయానికి నిద్రాహారాలు ఉండవు. ఇంటా బయట పరిస్థితులు అనుకూలించవు. దూర ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది. వ్యాపారాలు నిరాశ పరుస్తాయి.

---------------------------------------


కర్కాటకం


ఆప్తుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుకుంటారు. దీర్ఘకాలిక వివాదాలు పరిష్కారమవుతాయి. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. చాలాకాలంగా పడుతున్న శ్రమ ఫలిస్తుంది. నూతన వ్యక్తుల పరిచయాలు కలుగుతాయి. వ్యాపార, ఉద్యోగాలు కొంత సామాన్యంగా సాగుతాయి. 

---------------------------------------


సింహం


బంధుమిత్రులతో మాటపట్టింపులు ఉంటాయి.ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. ఉద్యోగమున సహోద్యోగులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. నిరుద్యోగులు శ్రమ ఫలించదు.

---------------------------------------


కన్య


ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. దీర్ఘకాలిక ఋణదాతల ఒత్తిడులు తొలగుతాయి. ఉద్యోగాలు సజావుగా సాగుతాయి. నూతన వ్యాపారాలు ప్రారంభించి లాభాలు అందుకుంటారు.

---------------------------------------


తుల


అనుకోని ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఆలయ దర్శనాలు చేసుకుంటారు. కుటుంబ సభ్యులతో స్వల్ప విభేదాలు కలుగుతాయి. పాత ఋణాలు తీర్చడానికి నూతన ఋణయత్నాలు చేస్తారు. నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపార, ఉద్యోగములు నిరుత్సాహ పరుస్తాయి.  

---------------------------------------


వృశ్చికం


కుటుంబ వాతావరణం ఉత్సాహంగా ఉంటుంది. మిత్రులతో ఆలయ దర్శనాలు చేసుకుంటారు. వ్యాపారాలలో విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. చేపట్టిన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆప్తుల నుంచి కీలక సమాచారం సేకరిస్తారు. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. 

---------------------------------------


ధనస్సు


ఆర్థికంగా పురోగతి కలుగుతుంది. గృహమున కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. నిరుద్యోగ యత్నాలు ఫలిస్తాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. సన్నిహితుల నుండి ధన సాయం అందుతుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో స్థానచలన సూచనలు ఉన్నవి.

---------------------------------------


మకరం


కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు. సోదరులతో స్థిరాస్తి వివాదాలు శిరో బాధను కలిగిస్తాయి. వ్యాపారాలు కొంత మందగిస్తాయి. చేపట్టిన పనుల్లో ప్రతిష్ఠంభనలు కలుగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు చెయ్యవలసి వస్తుంది. ఉద్యోగాలలో సమస్యల పరిష్కారానికి అధికారులు సహాయ సహకారాలు అందుతాయి.

---------------------------------------


కుంభం


చేపట్టిన పనులు ముందుకు సాగవు. స్వల్ప అనారోగ్య సమస్యలు చికాకు పరుస్తాయి. ముఖ్యమైన పనులలో శ్రమపడ్డా ఫలితం కనిపించదు. భూ సంబంధిత క్రయవిక్రయాలలో ఒప్పందాలు వాయిదా పడతాయి. వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ఉద్యోగాలలో ఇతరులతో తొందరపడి మాట్లాడటం మంచిది కాదు.

---------------------------------------


మీనం

 

గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. గృహమున ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి.

---------------------------------------

Mantra - 53

 Mantra - 53 ARUNAM 7 anuvaakam


అరుణ ప్రశ్నలో ఈ చిన్న మంత్రం అత్యంత కీలకమైనది. నిన్నటి మంత్రంలో పేర్కొన్న ఏడుగురు సూర్యుల తర్వాత ఎనిమిదవ సూర్యుడైన కశ్యపుని గురించి ఇది వివరిస్తుంది. బాహ్యంగా ఇది పౌరాణిక రహస్యంగా అనిపించినా, వేదాంతపరంగా ఇది మన ఉనికికి మూలమైన సత్యాన్ని బోధిస్తుంది. ఇది సృష్టికర్త మరియు బ్రహ్మాండ కేంద్రం మధ్య ఉన్న సంబంధాన్ని తెలుపుతుంది.


“కశ్యపోsష్టమః | 

స మహామేరుం న జహాతి | 

తస్యైషా భవతి॥”


‘కశ్యపోఽష్టమః’ - ఎనిమిదవ సూర్యుని పేరు 'కశ్యపుడు'. మిగిలిన ఏడుగురు సూర్యులు లోకాన్ని ప్రకాశింపజేయడానికి ఉదయిస్తూ, అస్తమిస్తూ (స్థూల దృష్టిలో) ఉంటారు. కానీ ఈ ఎనిమిదవ సూర్యుడు ప్రత్యక్షంగా మనకు కనిపించడు.


‘స మహామేరుం న జహాతి’ - ఆయన మహామేరు పర్వతాన్ని వదిలిపెట్టి ఎక్కడికీ వెళ్లడు. అంటే, బ్రహ్మాండానికి కేంద్రబిందువు (Axis Mundi) అయిన మేరు పర్వతంపైనే ఆయన ఎల్లప్పుడూ కొలువై ఉంటాడు. ఆయన వెలుగు వల్లే మిగిలిన ఏడుగురు సూర్యులు ప్రకాశిస్తారు.


‘తస్యైషా భవతి’ - అట్టి కశ్యపుని గురించి వర్ణించే మంత్రం ఇది అని అర్థం.


ఈ మంత్రం సాక్షి చైతన్యాన్ని లేదా కూటస్థ బ్రహ్మమును సూచిస్తుంది.


‘కశ్యపోఽష్టమః’ - మనం బయట వెతికే వెలుగు లన్నింటికీ మూలమైన ఒక స్థిరమైన వెలుగు మన లోపలే ఉంది. బాహ్య సూర్యులు మారుతున్న కాలానికి చిహ్నమైతే, కశ్యపుడు మార్పు లేని శాశ్వత సత్యానికి చిహ్నం.

‘కశ్యపః’ - 'కశ్యప' అనే పదాన్ని అక్షరాలు మార్చి చూస్తే 'పశ్యక' అవుతుంది. ‘పశ్యకః' అంటే ద్రష్ట - చూసేవాడు, The Seer. అంటే మన లోపల ఉండి అన్నింటినీ గమనించే సాక్షి చైతన్యమే కశ్యపుడు.

‘అష్టమః’ - మన దేహంలోని ఏడు ఇంద్రియ శక్తులకు (రెండు కళ్లు, రెండు చెవులు, రెండు నాసికా రంధ్రాలు, నోరు) అతీతంగా ఉండి, వాటన్నింటినీ వెలిగించే ఎనిమిదవ తత్త్వం ఆత్మ.


‘స మహామేరుం న జహాతి’:

‘సః’ - ఆ పరమాత్మ, 'మహామేరు' అంటే ఇక్కడ మన వెన్నెముక (Spinal Column/Merudanda) లేదా మన 'హృదయ ఆకాశం'. ఆత్మ ఎప్పుడూ తన స్వస్థానాన్ని (తన ఉనికిని) వదిలిపెట్టదు. బుద్ధి మారవచ్చు, మనస్సు మారవచ్చు, కానీ ఆత్మ చైతన్యం ఎప్పుడూ స్థిరంగా, నిర్వికారంగా ఉంటుంది. ఇతర సూర్యులు (బాహ్య వృత్తులు) ఉదయించి అస్తమిస్తాయి, కానీ కశ్యపుడు (ఆత్మ) ఎప్పుడూ ప్రకాశిస్తూనే ఉంటుంది. ముండకోపనిషత్ - ‘ద్వా సుపర్ణా సయుజా సఖాయా’ (3.1.1) మంత్రములో చెప్పినట్లు దేహమనే వృక్షం (మేరువు) పై రెండు పక్షులు (జీవాత్మ, పరమాత్మ) ఉంటాయి. అందులో పరమాత్మ ఏమీ తినకుండా కేవలం సాక్షిగా (పశ్యక/కశ్యప) చూస్తూ ఉంటుంది. ఆ పక్షి ఆ చెట్టును ఎన్నడూ విడిచిపెట్టదు.


‘తస్యైషా భవతి’ - ఎవరైతే ఆత్మ చైతన్యంలో నిలిచి ఉంటారో, వారికి ఈ జగత్తు యొక్క తత్త్వం బోధపడుతుంది. 'తస్యైషా' అంటే ఆత్మజ్ఞానికి మాత్రమే ఈ విశ్వ రహస్యం (ఇది అంతా బ్రహ్మమేనన్న సత్యం) ప్రత్యక్షమవుతుంది. ఇది ఒక జ్ఞాని యొక్క 'బ్రహ్మ సాక్షాత్కార' స్థితిని తెలియజేస్తుంది.


బాహ్య ప్రపంచంలో సూర్యుడు ఎలాగైతే సమస్తాన్ని ప్రకాశింపజేస్తాడో, అలాగే మీ లోపల ఉన్న కశ్యపుడు (సాక్షి చైతన్యం) మీ బుద్ధిని, ప్రాణాన్ని, ఇంద్రియాలను ప్రకాశింపజేస్తున్నాడు. ఆయన మీ దేహమనే మహామేరుని విడిచి ఎక్కడో లేడు, మీలోనే ఉన్నాడు. “అసావాऽదిత్యో బ్రహ్మ” - ఆ సూర్యుడే బ్రహ్మ, “సోఽహమస్మి” - ఆ బ్రహ్మ ఎవరో కాదు, నేనే , అని తెలుసుకోవడమే నిజమైన అద్వైత సాక్షాత్కారం. 


అరుణ ప్రశ్నలో ఈ భాగం చదువుతున్నప్పుడు మనస్సును అంతర్ముఖం చేసి, మనలోని ఆ స్థిరమైన చైతన్యాన్ని దర్శించడానికి ప్రయత్నించడం ఉత్తమమైన ఉపాసన.

శ్రీమద్భగవద్గీత

 శ్రీమద్భగవద్గీత: ఒకటవ అధ్యాయం 

అర్జునవిషాద యోగం: అర్జున ఉవాచ


యోత్స్యమానా నవేక్షే௨హం

య ఏతే௨త్ర సమాగతాః |

ధార్తరాష్ట్రస్య దుర్భుద్ధేః

యుద్ధే ప్రియచికీర్షవః || (23)


అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికెను: దుష్టుడైన దుర్యోధనుడి సంక్షేమం కోసం వారి పక్షాన యుద్ధానికి సిద్ధమైన వారందరినీ చూడాలనుకుంటున్నాను.


కృష్ణం వందే జగద్గురుమ్..🙏

జగద్గురు బోధలు-73

  

జగద్గురు బోధలు-73

(Jagathguru Bhodalu Vol-4)

భక్తి-దాని ఆవశ్యకత

మనమతంలో అద్వైతమనీ, ద్వైతమనీ, విశిష్టాద్వైతమనీ మూడు తెరగులు ఉన్నప్పటికీ, ఈ మూడుమార్గాలనూ అనుసరిస్తున్నా; భక్తియెడల, దానికిగల ప్రాముఖ్యమునెడల ఎవరికీ భేదాభిప్రాయం లేదు. వీరందరూ భక్తియొక్క ఆవశ్యకతను గుర్తించియే ఉన్నారు. ప్రపంచంలో ఎంతో వైవిధ్యంతో కూడిన ప్రాణికోటిలో ఒక్క మానవుడుమాత్రం నిలువుగా పెరుగుతున్నాడు. తక్కినవన్నీ అడ్డంగా పెరుగుతున్నవి. అందుచే మానవునికి భౌతికంగానేకాక, పారమార్ధికంగా కూడా ఎత్తుగా పెరుగవలసిన ఆవశ్యకత ఎంతైనాఉన్నది. అట్టిఔన్నత్యం వానికి ఒక్కజ్ఞానమూలంగానే కల్గుతున్నది. ఆ జ్ఞానమే వానికి శాంతినిస్తున్నది. మృగములకంటె మనిషి ఎన్నోవిధాల బాధపడుతున్నా, కష్టాలలో ఈదుతున్నా వానికి జ్ఞానమనే ఒక్క పవిత్రవస్తువు వుండటంవల్ల, తక్కిన జీవకోటికంటే వానికొక ఔన్నత్యం సహజంగా కల్గుతున్నది. మనము సత్యస్వరూపం తెలుసుకోవాలంటే దానికి సాధనం జ్ఞానమే. అందుచేత అందానికీ, శాంతికీ మూలకందం జ్ఞానమే. ఆనందకారకం జ్ఞానం. జ్ఞానమే ఆనందం. ఆనందమే పరమమంగళం. ఈ జ్ఞానానంద స్వరూపమే ఈశ్వరస్వరూపము, ఐశ్వర్యమూ, ఆయన పరమాత్ముడు. ఆయనలో విశిష్టమైన గుణాలు అన్నీ అణగిఉన్నవి. జలములకంతా జటధి ఎట్లు పరమావధియో, అట్లే పరిపూర్ణతకు ఈశ్వరుడొక్కడే నిధి. ఆయనకు ఇతరములేదు. ''ఏకమేవాద్వితీయం బ్రహ్మ'' అనుటయే అద్వైతం. ''ఇదమ్‌ సర్వమ్‌ పురుష ఏవ'' అని శ్రుతి చెప్పుచున్నది. శ్రీశంకరభగవత్పాదులవారు దీనినే యుక్తిచేతా, అనుభవంచేతా నిరూపించారు.


ఐతే ఈఅద్వైత సత్యాన్ని మనం బుద్ధితో గ్రహిస్తేచాలదు. అనుభవంలోకి తెచ్చుకోవాలి. అది అనుభవానికి రావాలంటే ఈశ్వరానుగ్రహం అవసరం. 'ఈశ్వరానుగ్రహాదేవ పుంసా మద్వైతవాసనా' మొదట ఈశ్వరుడు వేరు, మనంవేరు అన్న ద్వైతభావనతో భజన ప్రారంభమవుతుంది. ఐనప్పటికీ సాధకుని మనోభావం - పరమాత్మ తనకు వెలిగా ఉన్నాడనికానీ, మరోప్రపంచంలో ఉన్నాడనికానీ ఉండదు. పరమాత్మ తనలో అంతర్యామిగా ఉన్నాడనీ, ప్రపంచంలో ప్రతిఅణువులోనూ ఆ పరమాత్మచైతన్యం ఉద్దీపితమై ఉంటున్నదనీ, ఆయన అణువులో అణువై, మేరువులో మేరువై ఉన్నాడనీ సాధకుని మనోభావానికి తట్టుతుంటుంది. గీతలో కృష్ణ పరమాత్మ ''భక్త్యా మా మభిజానాతి యావాన్‌ యశ్చాస్మి తత్త్వతః'' అని సెలవిచ్చినారు.


ఇందు 'భక్త్యా' అన్న పదప్రమోగంవల్ల జ్ఞానలక్షణమైన భక్తిచేతనే పరమాత్మ నిజతత్త్వం తెలుసుకోగలమని గ్రహించాలి. అందుచేత అన్ని మతాలవారూ, భక్తి ఆవశ్యకతను గుర్తించి ఈశ్వరానుగ్రహంకోసం పాటుపడితేకాని, పరమాత్మతత్త్వం అవగతంకాదు. అందుచేతనే ఆచార్యులందరూ 'భక్తి, భక్తి' అని బోధిస్తారు. భక్తియెడల భేదాభిప్రాయం ఎవరికీ లేదు.


భక్తి మనకు శైశవంనుంచే అభ్యాసం కావాలి. విద్యాభ్యాసకాలంలో సారస్వత సముద్ర తరణానికి భక్తినావను వదలరాదు. బడికిపోయే పిల్లలు విద్యాభివృద్ధికోసం అనుదినమూ సరస్వతిని ఉపాసించడం మంచిది. ఒక పదినిమిషాలైనా సరస్వతిముందు మౌనంగా ధ్యానం చేయడం అత్యవసరం. ప్రతిదినమూ పాఠాలు చదువుకోడానికి ముందు ఈ ధ్యానం చేయడం మంచిది. ఏదో పదిశ్లోకాలు వల్లించినాము కదా. ఇక పూజ ఐనట్లే అన్న మనోభావం ఉండరాదు. ధ్యానంలో భావశుద్ధి ప్రధానం. భావము గాఢతయేప్రార్థన కీలకం. నిశ్చలమైన భక్తితో సరస్వతిముందు మౌనంగా కూర్చుండి పది నిమిషాలపాటు గురుధ్యానమూ, దైవతధ్యానమూ, ప్రగాఢమైనభావంతో చేయడమే ప్రార్థనారహస్యం. ఇట్టి అలవాటు ముదిరేకొద్దీ మనలో దైవికమైన భావాలుత్పన్నమై, దుష్టాలోచనలు మనోరంగంనుంచి క్రమక్రమంగా తొలగిపోతవి. అందుచే చిన్నపిల్లలు తమ పెద్దలనుండి ప్రార్థనారీతులను తెలిసికొని వైదిక సత్యాలను జీవితంలో నెలకొల్పుకోడానికి చిన్నతనంనుంచే ప్రయత్నించాలి.


ఐతే మనకు భక్తి ఉన్నదా లేదా అనడానికి సాక్ష్యం దైవాజ్ఞలను మీరి నడవకుండా ఉండటం. 'వేదో నిత్య మధీయతాం తదుదితం కర్మ స్వనుష్ఠీయతాం' 'నాకు భక్తిఉన్నది. కాని నేను భగవదాజ్ఞాప్రకారం మాత్రం నడుచుకోవటంలేదు' అని అంటే అర్థంలేని మాట. నిజమైన భక్తికి చిహ్నం విహితకర్మానుష్ఠానం. వారి వారి కర్మలను వారు చక్కగా ఆచరించి పరమాత్మకు అర్పించడం అలవరచుకోవాలి. ప్రతియొక్కరూ నిత్య నైమిత్తిక కర్మలను ఆచరించడం విధి. వైష్ణవులు వీనిని ఎంతో అర్థవంతంగా ఆజ్ఞాకైంకర్యములని వ్యవహరిస్తూ ఉంటారు. వైదిక కర్మాచరణకంటే వేరు ఈశ్వరారాధనలేదు. అది వ్యక్తిపరంగా మోక్షాన్ని ఇచ్చి లోకానికంతా సౌఖ్యాన్ని కలుగజేస్తుంది. ఇట్లు మోక్షమార్గంలో కర్మ, భక్తి, జ్ఞానముల ఆవశ్యకతను మనం గుర్తించి, ''మోక్షకారణ సామగ్ర్యాం భక్తి రేవ గరీయసీ'' అన్న ఆచార్యుల వాక్యం స్మరిస్తూ, భక్తి ప్రాధాన్యం మనం మరువకుండా ఉందాము.

--- “జగద్గురు బోధలు” నుండి

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।

శ్రీ మహాపెరియవ శరణం పరమాచార్యా రక్ష రక్ష

జయ జయ శంకర | హర హర శంకర 

జయ జయ శంకర | హర హర శంకర

*సర్వే జనాః సుఖినోభవంతు 

కంచి కామకోటి పీఠం (JAGATHGURU BHODALU VOL-4)నుండి.


✡️🍀✡️🍀✡️🍀✡️🍀✡️🍀✡️🍀

*శ్రీ కుప్పా విశ్వనాథ శాస్త్రి గారు*

  *శ్రీ కుప్పా విశ్వనాథ శాస్త్రి గారు* 


మీరు ఈ మహానుభావుడి పేరు విన్నారా? మీరు ఆయన పేరు వినకుంటే అది ఆయన ఔన్నత్యమే తప్ప వేరే ఏమీ కాదు. అదేమిటి అంటారా? ఆయనకి కీర్తి కండూతి, వ్యక్తిగత ప్రచార ఆర్భాటాలు లేవు అని నా భావం.

ముందుగా ఆయన ఎవరు , ఆయన ఏమి చేస్తుంటారో చెబుతాను.

ఈయన శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానెల్‍లో శ్రీమద్భగద్గీత ప్రవచనం చేశారు. వీరు వృత్తి రిత్యా తిరుపతి లో సంస్కృత విశ్వవిద్యాలయంలో న్యాయ తర్క విభాగంలో ప్రొఫెసర్‍గా ఉన్నారు.

ఈయన గూర్చి గూగుల్ లో ఎంత వెదకినా నాకు కనపడలేదు. అది ఆయన సింప్లిసిటీ కావచ్చు కానీ మంచికి ప్రచారం జరగాలి. ఇలాంటి మహానుభావుల గూర్చి అందరికీ తెలియాలి.

10 సెప్టెంబర్ 2020 లో మొదలు పెట్టి 13 జనవరి 2022 వరకు భగవద్గీత పారాయణ, ప్రవచనం అనె యఙ్జాన్ని చేపట్టి విజయవంతంగా నిర్వహించారు ఈయన. ఈ కార్యక్రమం ఎస్వీబీసీ భక్తి ఛానెల్‍లో లైవ్ టెలికాస్ట్ గా ప్రసారం అయ్యి అందర్నీ ఆకట్టుకున్నాయి.

ఎంతో మంది ఈ కార్యక్రమము చాలా బాగుంది అని చెప్పటం జరిగింది. తప్పక చూడండి అని నాకు ఎందరో చెప్పారు. నా పని వత్తిళ్ళవల్ల ఈ లైవ్ కార్యక్రమం టీవీలో చూసే అవకాశం నాకు కలగలేదు. కానీ నా అదృష్టం బాగుండి యూట్యూబ్ లో ఈ కార్యక్రమం 491 ఎపిసోడ్స్ రూపంలో అందుబాటులో ఉండటం వల్ల గత పదిహేను రోజులుగా క్రమం తప్పకుండా వింటున్నాను. ఈ కార్యక్రమం గూర్చి మాటల్లో చెప్పలేము. అది ఒక అమృతతుల్యమైన భాషణం. అది వినడం పూర్వ జన్మ సుకృతం. 

చిన్నప్పటి నుంచి సినిమాలు చూసి ధర్మరాజు గూర్చి, దుర్యోధనుడి గూర్చి, ఏకలవ్యుడి గూర్చి, కర్ణుడి గూర్చి కొన్ని అభిప్రాయాలు ఏర్పడి పోయాయి. 

ఈ ప్రవచనం వింటుంటే మహా భారతపాత్రలు వాటి అంతరంగాలు, నిజానిజాలు ఏమిటి అనేది తెలుస్తోంది. ముఖ్యంగా భీష్ముడి గూర్చి, కర్ణుడి గూర్చి వారు చెప్పిన మాటలు వింటే మన అంతరంగాలు ఎంతో ఙ్జానాన్ని పొందుతాయి.

ఇంతాచేసి నేను వినింది కేవలం ఈ రోజు దాకా 17 ఎపిసోడ్లు మాత్రమే.నేను ఇంకా ప్రధమాధ్యాయం లో 16వ శ్లోకంలోనే ఉన్నాను.

ఆయన చెప్పే వివరణ వింటుంటే హృదయం ఆనందంతో ఉప్పొంగి పోతుంది. మనసులో చీకట్లు తొలగిపోయి ఙ్జాన జ్యోతులు వెలిగిన అనుభూతి కలుగుతోంది.

పాశ్యాత్య మెధావులుఅందరూ టన్నులు టన్నులు పర్సనాలిటి డెవలెప్‍మెంట్ బుక్స్ వ్రాస్తూ ఈ గీత ద్వారానే ఇన్‍స్పైర్ అయ్యాం, మా ఙ్జానం అంతా గీత దయనే అంటూంటే ఏమిటో అనుకునే వాడిని.

నా ప్రయాణం అటు నుంచి ప్రారంభం అయ్యింది కదా. అంటే పాశ్చాత్య మేధావులు వ్రాసిన వ్యక్తిత్వ వికాస గ్రంధాలు చదివి, వారి శిక్షణా కార్యక్రమాలలో చేరి నేను పొందిన ఙ్జానం యొక్క మూలాలు ఎక్కడున్నాయో బేరీజు వేసుకుని చూసేదానికి ఇప్పుడు నాకు అవకాశం లభించింది.

శ్రీ కుప్పా విశ్వనాథ వారిలో నేను గమనించిన కొన్ని అంశాలు.

** వారు అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినంత సులభంగా విషయాన్ని చెబుతారు

** ఎక్కడా కూడా సంక్లిష్టమైన (కాంప్లికేటెడ్ ) పదాలు కానీ, ఉదాహరణలు కానీ ఉండవు

** ఏ పాత్ర పట్ల అనుకూల ధోరణి (బయాస్డ్ అప్రొచ్) లేదు

** ముఖ్యంగా స్వాతిశయం లేదు. తనను తాను గురువుని అని పొగుడుకుంటూ, తన అనుభవాలని ఏకరువు పెట్టుకుంటూ మాట్లాడటం ఉండదు

** ఆయన ప్రవచనంలో ఎవ్వర్నీ కించపరచడం ఉండదు

** తనను తాను పొగుడుకోవడం ఉండదు

** అనవసరమైన ఆవేశం, ఆక్రోశం, ఆగ్రహం ఉండవు

** ఇతర మతాల్ని, మతావలంబకుల్ని విమర్శించటం ఉండదు 

** మరీ ముఖ్యంగా ’నేను’ అనే పదమే ఆయన వాడలేదు ఇప్పటిదాక

** నేటి వ్యవస్థని, సినిమాలని, రాజకీయాలని విమర్శించాల్సిన సందర్భాలు ఎన్నో వచ్చినా ఆయన పని కట్టుకుని వాటిని విమర్శించాలనే కార్యక్రమం పెట్టుకోలెదు. ఆయన ఏకాగ్రత అంతా భారతంలోని పాత్రల నుంచి మనం ఏమి నేర్చుకోవాలి, ఏమి వదిలి వేయాలి. ఎవ్వర్ని ఆదర్శంగా పెట్టుకోవాలి, ఎవ్వర్నీ త్యజించాలి అన్న ధోరణిలో సాగుతోంది.

** తాను ఎవరూ అని కానీ, తన వృత్తి వ్యాసంగాలు కానీ, తాను పొందిన సన్మానాలు కానీ ఆయన అసలు చెప్పుకోడు.

** అత్మ స్థుతి లేదు, పరనింద అసలు లెదు. స్వోత్కర్ష లేనే లేదు. ఆయన నోట ఇంతవరకు ’నేను’ అన్నమాటనే నేను వినలేదు.

** అలా అన్చెప్పి ఏదో చాదస్తంగా చెబుతున్నాడు అనుకుంటే పప్పులో కాలు వేసినట్టే. ఆయనకి ఇంగ్లీష్ భాషమీద సాధికారత ఉంది. ఆయన సరదాగా వాడే ఉపమానాలు, పదాలు మనల్ని ఆలోచింపజేస్తాయి. 

** అలాంటి ప్రవచనకారుడు మన మధ్య ఉండటం, ఆయన ప్రవచనాన్ని వినే అదృష్టానికి నేను నోచుకోవడం నా పూర్వజన్మ సుకృతం. 

టెక్నాలజీ వల్ల ఇది సాధ్యమయింది. టెక్నాలజీ ని ఇలా సద్వినియోగం చేసుకోవటానికి అవసరమైన వనరులు టీటీడికి ఉండటం ఎంతో మంచిది అయింది.

***

 నేను చిన్నప్పటి నుంచి చూసిన సినిమాలు నాకు చెడుని ఎక్కువ బోధించాయి.విశ్వ విఖ్యాత నట సార్వభౌముడు ఆయన అని చెప్పి పెద్దలు ఆ రోజుల్లో ఒక పెద్ద హీరో సినిమాలకి తీస్కువెళ్ళారు. ఆయన సినిమాల ప్రభావం వల్ల 

అర్జునుడు అంటే కోపం, 

ఏకలవ్యుడంటే సానుభూతి, 

కర్ణుడు అంటే జాలి

ధర్మరాజు అంటే హేళన

భీష్ముడు అంటే ఎగతాళీ

బ్రాహ్మణులు అంటే కోపం


తదితర భావజాలం నాకు ఏర్పడింది.

*బ్రాహ్మణ ద్వేషంతో, హిందు మతగ్రంధాల పట్ల లోతైన అవగాహన లేకుండా, పురాణ పురుషులపై ద్వెషంతో , రోల్ మోడల్స్‌గా మనం ఎంచుకోవాల్సిన పాత్రలని కించపరుస్తూ , మనకు ఏది నేర్పియ్యకూడదో అవి నేర్పిస్తూ ఉగ్గుపాలప్పటి నుంచి నేను చూసిన సినిమాల వల్ల ఏర్పడిన అఙ్జానాన్ని శ్రీ కుప్పా విశ్వనాధ శాస్త్రి గారు కూకటివేళ్ళతో సహా పీకివేసి, కొత్తగా నాకు ఙ్జానబోధ చేయబోతున్నారు అన్న నమ్మకం నాకు ఏర్పడింది.

కురుక్షేత్రం అంటె ఎక్కడో జరిగింది మాత్రమే కాదని, మన మనస్సులలో నిత్యమూ మంచికి చెడుకి జరిగే సంఘర్షణ అని,

మన శరీరం అంటే ఒక రధంతో ఎలా సమానమో చెపుతూ, శ్రీ కృష్ణుడు మన శరీరం అనే రధం లో మనసు రూపంలో ఎలా ఉన్నాడో చెబుతూ, *అయిదు కర్మేంద్రియాలను, అయిదు ఙ్జానేంద్రియాలని శ్వేతాశ్వలతో పోలుస్తూ, మన బుద్దిని ఆ రధంలో ఉన్న వీరుడితో పోలుస్తాడు. చెడు వైపు నీవు నీ గుర్రాలని నడిపిస్తే నీవు దుర్యోధనుడివి అవుతావు, మంచివైపు నడిపిస్తే అర్జునుడివి అవుతావు అని చెప్పిన ఎపిసోడ్ నన్ను దిగ్భ్రమకి గురి చేసింది. అయన కొనా మొదలు ’నువ్వు దుర్యోధనుడివి అవొద్దు, అర్జునుడివి కావాలి’ అంటూ మనల్ని మంచివైపుకి నడిపిస్తాడు.*

ఆయన చెప్పిన దాంట్లో నేను చెప్పినది ఆవగింజలో వెయ్యవవంతుకూడా లేదు సుమా.


✍🏻 🚩 *సుధాకర్ నాంబేటి సర్వే హిందూ జనాః సుఖినోభవంతు గ్రూపు అడ్మిన్* 🚩

మన ఆరోగ్యం…

 

*మన ఆరోగ్యం…



 *40 సంవత్సరాల వయస్సు లో ప్రతి మహిళ తప్పనిసరిగా చేయించుకోవలసిన 5 ఆరోగ్య పరీక్షలు*

             ➖➖➖✍️```


*వయసు పెరిగే కొద్దీ మన శరీరం సూక్ష్మమైన మార్పులకు లోనవుతుంది. శారీరక స్వరూపం అందరికీ కనిపిస్తుంది, హార్మోన్లు మరియు ఒత్తిడి స్థాయి మన అంతర్గత వ్యవస్థపై తీవ్రంగా ప్రభావం కలిగిస్తాయి. 40 ఏళ్ల వయస్సు లో మహిళలకు, పెరిమెనోపాజ్ దశ ప్రారంభం వల్ల వారు వ్యాధుల బారిన పడతారు. గుండె జబ్బులు, రొమ్ము క్యాన్సర్ మరియు బోలు ఎముకల వ్యాధి అనేవి చాలా మంది మహిళలు ఎదుర్కొనే కొన్ని సాధారణ సమస్యలు. రెగ్యులర్ హెల్త్ స్క్రీనింగ్ తీవ్రమైన ఇన్ఫెక్షన్ ప్రమాదాన్ని తగ్గించగలదు మరియు వ్యాధిని ముందుగానే గుర్తించగలదు. ప్రాణహాని నిరోధించవచ్చు.


*40 ఏళ్ల వయస్సు లో ప్రతి మహిళ తప్పక చేయించుకోవలసిన 5 సాధారణ ఆరోగ్య పరీక్షలు :

 

*1.బ్లడ్ ప్రెజర్ స్క్రీనింగ్/BLOOD PRESSURE SCREENING:


*అధిక రక్తపోటు అనేది తరువాత జీవితంలో సాధారణం. మధ్య వయస్కులైన మహిళలు తరచూ రక్తపోటు స్థాయి పెరుగుదలకు లోనవుతారు., దీనికి చికిత్స చేయకపోతే గుండెపోటు మరియు స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుంది. ఆహారం మరియు జీవనశైలిలో కొద్ది సర్దుబాటుతో రక్తపోటును తగ్గించడం సులభం. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం కూడా సహాయపడుతుంది. తీవ్రమైన సందర్భాల్లో మాత్రమే మందులు సిఫార్సు చేయబడతాయి.


*2. "బ్రెస్ట్ క్యాన్సర్/BREAST CANCER ":


*అన్ని వయసుల మహిళలకు రెగ్యులర్ రొమ్ము పరీక్ష సిఫార్సు చేయబడింది. రొమ్ము మరియు గర్భాశయ క్యాన్సర్ అన్ని వయసుల మహిళలను ప్రభావితం చేసే రెండు సాధారణ క్యాన్సర్లు మరియు వయస్సుతో ప్రమాదం పెరుగుతుంది. రెండు వారాలకు ఒకసారి ఇంట్లో స్వీయ-రొమ్ముల పరీక్ష, ప్రారంభ దశలో ఏదైనా ముద్ద ఏర్పడటానికి మరియు ఎక్కువ కణజాలాలకు నష్టం జరగకుండా నిరోధించడానికి సహాయపడుతుంది. సంవత్సరానికి ఒకసారి ‘పాప్ స్మెర్’ మరియు ‘మామోగ్రామ్’ పరీక్షను చేయించండి.


*3. ఆస్టియోపొరోసిస్/OSTEO POROSIS:


*వయస్సుతోపాటు ఎముక సాంద్రత మరియు బలాన్ని కోల్పోవడం సాధారణం, ఇది ఎముక లేదా బోలు ఎముకల వ్యాధికి దారి తీస్తుంది. ఎముకలు మరింత బలహీనంగా, పెళుసుగా మారుతాయి, ఇది గాయం లేదా పగులు ప్రమాదాన్ని పెంచుతుంది. బోలు ఎముకల వ్యాధి పురుషులతో పోలిస్తే మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఎముకల సాంద్రతను గుర్తించడానికి DEXA స్కాన్ సహాయపడుతుంది.


*4.రక్తంలో చక్కెర స్థాయి/BLOOD SUGAR LEVEL:


*20 మరియు 30 ఏళ్ళలో వారి ఆహారపు అలవాట్ల గురించి జాగ్రత్తగా ఉండని వ్యక్తులు 40 ఏళ్ళలో మధుమేహంతో బాధపడే అవకాశం ఉంది. దశాబ్దాలుగా తప్పుడు ఆహారం తినడం మరియు బరువు పెరగడం ప్యాంక్రియాస్‌పై ఒత్తిడి తెస్తుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిని సులభంగా పెంచుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలను పరగడుపున/fasting పరీక్షించుకోవడం మధుమేహాన్ని ప్రారంభంలో నియంత్రించడంలో సహాయపడుతుంది.


*5.కొలెస్ట్రాల్ ప్రొఫైల్ CHOLESTEROL PROFILE:


*ఈ రక్త పరీక్ష చేయడం వల్ల తీవ్రమైన గుండె జబ్బులు మరియు స్ట్రోక్ వచ్చే ప్రమాదం తగ్గుతుంది. అధిక కొలెస్ట్రాల్ స్థాయిలు గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతాయి. అధిక కొలెస్ట్రాల్ ఉంటే, డైట్ మార్చడం మరియు కొన్ని మందులు తీసుకోవడం కొలెస్ట్రాల్ తగ్గించడానికి సహాయపడుతుంది. 30సంవత్సరముల తరువాత ప్రతి ఒక్కరూ ప్రతి ఐదేళ్ళకు ఒకసారి కొలెస్ట్రాల్ స్థాయిని తనిఖీ చేయాలి. మొత్తం కొలెస్ట్రాల్ స్థాయిలు డెసిలీటర్ (mg / dl) కు 200 మిల్లీగ్రాముల కంటే తక్కువగా ఉండాలి.✍️```- సేకరణ.

. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                    🌷🙏🌷```

 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🍀🌺🍀🌺🍀🕉️🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి.

          ➖▪️➖

ఇలాంటి మంచి విషయాలకోసం…

“భగవంతుని విషయాలు గ్రూప్”లో చేర్చమని ఈక్రింది నెంబరుకి వాట్సప్ లో మాత్రమే మెసేజ్ పెట్టండి... 8712184465. లింక్ పంపుతాము. దయచేసి ఫోన్ కాల్స్ చేయవద్దు.🙏```

ఆశీర్వచనములు


            *ఆశీర్వచనములు!*

                 ➖➖➖✍️

```

శ్రీరామపట్టాభిషేకం మహావైభవంగా జరిగిన తరువాత, కొంతకాలానికి అష్టావక్రమహర్షి సీతారాములను చూసేందుకు అయోధ్యకు విచ్చేశాడు.  


సీతారాముల హార్దికమైన స్వాగతసత్కారాలను అందుకున్నాడు.  


తనకు నమస్కరించిన సీతమ్మను దీవించాడు…  


“వీరప్రసవా భూయాః”(వీరులను కనుదానివి కావలసినది)  


ఆ దీవెన శ్రీరామునికి ఎంతగానో నచ్చింది…```


*భగవాన్, అనుగృహీతాః స్మః।*``` {మహాత్మా, మేము(అంటే మా వంశస్థులము)అనుగ్రహింపబడ్డాము.}  

```

*లౌకికానాం హి సాధూనామ్ అర్థం వాగనువర్తతే।*

*ఋషీణాం పునరాద్యానాం వాచమర్థోఽనుధావతి॥*```

(లౌకికులు కార్యశూరులైన సత్పురుషులు తాము ఒక ఘనకార్యాన్ని చేసిన తరువాతనే అలా చేశామని అంటారు.  

కాని, ఆద్యులైన ఋషులు ఒక మాటను పలికితే, ఆ మాట యథాతథంగా వెనువెంటనే జరిగిపోతుంది)  అంటూ శ్రీరాముడు ఎంతగానో సంబరపడిపోయాడు.    


ఇది భవభూతిమహాకవి తన ఉత్తర రామచరితంలో దర్శించి చెప్పిన ముచ్చట.  

అమోఘమైన ఆ ఋషివాక్కు కాలాంతరంలో ఫలించింది.  

ఒకరిని కాదు, ఇద్దరు మహావీరులను కని సీతమ్మవారు వీరమాతగా ప్రఖ్యాతిగాంచింది.  


ఈ దీవెన నేడు ప్రతి భారతీయ స్త్రీ పొందాలి.```  


*“దీర్ఘసుమంగళీ భవ, సౌభాగ్యవతీ భవ”*  ```అనే దీవెనల తరువాత, అష్టావక్రమహర్షి సీతమ్మకు ఇచ్చిన ఈ దీవెనను ఈనాటి పెద్దలు కూడా తమ కుమార్తెలకు, తమ కోడండ్లకు, ఇంకా తమ ఆశీర్వాదం కోరే నవవధువులకు అవశ్యకర్తవ్యంగా ఇవ్వవలసిన తరుణం ఆసన్నమైంది.  కారణాలు అందరికీ తెలిసినవే, శ్రీరామ నవమి అందరమూ

చేసుకుని శ్రీరాముని పవిత్రపూజాక్షతలు నేడు భారతదేశమంతటా ఇంటింటికి చేరినట్లుగానే, సీతమ్మకు అందిన దీవెన మన ఇంట వెలసిన, మన ఇంటికి తరలి వచ్చిన.. లక్ష్మీస్వరూపిణులందరికీ తప్పక అందాలి. పెద్దలందరూ పిన్నలకు మంచి దీవెనలు ఇవ్వాలి.✍️

   —సరస్వతులనరసింహమూర్తి.    

             శ్రీరామబంటు.``` 

          🙏🚩 జై శ్రీరామ్🚩🙏

.      *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                    🌷🙏🌷```

 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🍀🌺🍀🌺🍀🕉️🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి.

          ➖▪️➖

ఇలాంటి మంచి విషయాలకోసం…

“భగవంతుని విషయాలు గ్రూప్”లో చేర్చమని ఈక్రింది నెంబరుకి వాట్సప్ లో మాత్రమే మెసేజ్ పెట్టండి...                  8712184465. లింక్ పంపుతాము. దయచేసి ఫోన్ కాల్స్ చేయవద్దు.🙏```