14, ఫిబ్రవరి 2025, శుక్రవారం

స్పాండిలైటిస్ మరియు సయాటిక గురించి వివరణ -

 స్పాండిలైటిస్ మరియు సయాటిక గురించి వివరణ - 


          ఈ రెండు సమస్యలు నేడు సర్వసాధారణం అయినవి . దీనికి ప్రధానకారణం మన ఆహారపు అలవాట్లు మరియు మనం చేయు ఒత్తిడితో కూడుకొనిన పనులు కూడా కారణమే . ఇవి శరీరము నందు పెరుగు వాతదోషము వలన కలుగును. 


       ఈ స్పాండిలైటిస్ లో మెడ వెనుక భాగములో గల C 2 , C 3 , C 4 డిస్క్ ల మధ్య ఖాళి ఏర్పడటం వలన నరం ఒత్తుకుపోయి ఈ సమస్య ప్రారంభం అగును. కొందరు తల పైకి ఎత్తలేరు . కొందరు తలను పక్కలకు సరిగా తిప్పలేరు . దీనికి కారణం వారి మెడ నరాలు , కండరాలు బిగుసుకొని పోతాయి . ఇంతకు ముందు చెప్పిన విధముగా నరము నొక్కుకొని పోయినప్పుడు నొప్పి మెడ నుంచి భుజాలకు మరియు చేతులకు కూడా పాకును . 


          సయాటిక నందు వెన్నుపాము చివర నొప్పి మొదలయ్యి కుడికాలు నందు గాని ఎడమకాలి చివర వరకు గాని నొప్పి ఉండును. ఈ నొప్పి తీవ్రత చాలా అధికంగా ఉండును. కదిలినప్పుడల్లా సూదులతో పొడుస్తున్నట్లు ఉంటుంది. వెన్నపాము నందలి L4 , L5 , S1 డిస్క్ ల మధ్య ఖాళి ఏర్పడి ఆ ఖాళి నందు నరం పడి నలగడం వలన ఈ సమస్య ఏర్పడును . 


              నేను ఈ రెండు సమస్యలకు చికిత్స చేస్తున్నప్పుడు గమనించిన విషయాలు ఏమిటంటే స్పాండిలైటిస్ వచ్చిన వారికి చిన్నగా కొంతకాలానికి సయాటిక కూడా వస్తుంది. సయాటిక వచ్చిన వారికి కొంతకాలానికి స్పాండిలైటిస్ వస్తుంది. సమస్య మొదలైనప్పుడు సరైన చికిత్స తీసుకోకున్న రెండు సమస్యలు చుట్టుముట్టును . మరొక్క ముఖ్యవిషయం ఈ రెండు సమస్యలు మొదలు ఒకవైపు మాత్రమే మొదలై చివరికి రెండోవైపు కూడా సమస్య మొదలగును . ఉదాహరణకు సయాటిక వెన్నుపాము చివర నుంచి మొదలు అయ్యి కుడికాలుకు వచ్చింది అనుకుందాం మనం మన శరీర బరువును ఎడమకాలి మీద వేసి నడవటం కాని నిలబడటం కాని చేస్తాము . ఇలా కొంతకాలానికి ఎడమ కాలికి కూడా నొప్పి ప్రారంభం అగును. ఇది అత్యంత తీవ్రమైన సమస్య . 


       అల్లోపతి వైద్యము నందు వైద్యులు దీనికి సర్జరి పరిష్కారంగా చెప్తారు. కాని కొంతకాలానికి మరలా సమస్య తిరగబెట్టడం నేను గమనించాను . ఆయుర్వేద వైద్య విధానంలో దీనికి అత్యంత అద్బుతమైన చికిత్సలు కలవు. 


      ఈ రెండు సమస్యలతో బాధపడుతున్నవారు నన్ను సంప్రదించగలరు.  మీరు సంప్రదించవలసిన ఫొన్ నంబర్ 9885030034 . ముఖ్యముగా ఆయుర్వేద చికిత్స యందు పథ్యం  ప్రధానపాత్ర పోషిస్తుంది . ఇక్కడ పాటించవలసిన ఆహార పథ్యాలు మీకు వచ్చిన ఆనారోగ్య సమస్యకు మాత్రమే తప్ప ఔషధాలుకు కావు . నేను తయారుచేసి ఇచ్చు ఔషధాలకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.  


                కాళహస్తి వేంకటేశ్వరరావు 


            అనువంశిక ఆయుర్వేద వైద్యం 


                      9885030034

ధర్మ సందేహాలు

 🌹 *ధర్మ సందేహాలు* 🌹


🙏🌹 *ఏకదండి, ద్విదండి, త్రిదండి...స్వాముల చేతిలో కర్రలెందుకు ఉంటాయో తెలుసా?*🌹🙏


ఆది శంకరాచార్యుల నుంచి నేటి అందరు స్వాముల వరకూ చేతిలో కర్ర ఉండటాన్ని అందరూ గమనించే ఉంటారు. 


స్వామీజీ అంటే కర్ర పట్టుకోవాలనుకుంటే పొరపాటే..

దాని వెనుక ఎంత ఆంతర్యం ఉందో తెలుసా...


ఆదిశంకరాచార్యులు, మధ్వాచార్యులు, రామానుజచార్యులు, జీయర్ స్వాములు మరికొందరు..వీళ్లందరి చేతిలో పొడవాటి కర్ర ఉంటుంది గమనించారా?


ఏ సమయంలో చూసినా వాళ్ల చేతిలో ఉంటాయి. 

అదేమైనా ఊతకోసమా అంటే కానేకాదు. 

మరి ఎప్పుడూ చేత్తో పట్టుకుని ఉంటారెందుకు అంటారా..


అవి వైరాగ్యానికి, తాత్వికతకు, ద్వైత, అద్వైత భావానికి గుర్తు.  


ఈ (దండాలు) కర్రలు వివిధ ఆకారాల్లో ఉంటాయి. 


అయితే ప్రతి ఆకారానికి ఓ అర్థం ఉంది.  

గాలి, నీరు, భూమి, అగ్ని, ఆకాశం పంచభూతాల సమ్మేళనమే మనిషి, 

కాబట్టి సన్యాసులు ఐదడుగుల కర్రను చేతపట్టుకుని తిరుగుతారని చెబుతారు.  


ఈ కర్రల్లో  మూడు రకాలున్నాయి అవే ఏకదండి, ద్విదండి, త్రిదండి. 


*ఏకదండి:-*


ఒక కర్రను (ఏకదండి ) ధరించేవారు అద్వైత సిద్ధాంతాన్ని విశ్వసిస్తారు. 

అందుకు ఉదాహరణ *ఆదిశంకరాచార్యులు*

అద్వైతం అంటే జీవుడు, దేవుడు ఒక్కటేననే సిద్ధాంతం. 


అంతరాత్మకు విరుద్ధంగా అక్రమ, అన్యాయ మార్గాన సంచరించినా, ప్రవర్తించినా ఆ పాపఫలితాన్ని బతికి ఉండగానే ఏదో ఒక రూపంలో ఇక్కడే తప్పకుండా అనుభవించక తప్పదనే  సిద్ధాంతాన్ని వారు బోధిస్తారు. 

వీరి చేతిలో జ్ఞానానికి సంకేతమైన రావిచెట్టు నుంచి సేకరించిన  కర్ర ఉంటుంది.


*ద్విదండి:*


రెండు కర్రలు కలిపి ఒక్కటిగా కట్టి (ద్విదండి)ధరించి బోధనలు చేసేవారు ద్వైత సిద్ధాంతాన్ని అవలంబించేవారు.  

ఇందుకు ఉదాహరణ *మధ్వాచార్యులు*

వీరిని *ద్విదండి స్వాములు* అంటారు. దేవుడు వేరు– జీవుడు వేరు అని బోధిస్తారు. 

జీవాత్మ, పరమాత్మ వేరువేరన్నది వీరి ఉద్దేశం. 

జీయర్ లు అందరూ ఈ సిద్ధాంతం కిందకు వస్తారు.


*త్రిదండి:-*


మూడు కర్రలను ఒకే కట్టగా కట్టి (త్రిదండి) భుజాన పెట్టుకునేవారిని తత్వత్రయం అంటారు. 

ఇలా ధరించే వారు విశిష్ఠాద్వైతాన్ని బోధిస్తారు. 

వీరిది

 *రామానుజాచార్యుల పరంపర*

శరీరంలో జీవుడున్నట్లే, 

జీవునిలో అంతర్యామిగా శ్రీమన్నారాయణుడు ఉంటాడని విశ్వసిస్తారు. 

జీవాత్మ, పరమాత్మ, ప్రకృతి సత్యాలని, ఈ మూడింటిని నారాయణ తత్వంగా నమ్ముతూ, 

జీవుడు ఆజ్ఞానంతో సంసార బంధాన చిక్కుకుంటాడని, 

నారాయణుని శరణు వేడిన వారు భగవదనుగ్రహం వలన అజ్ఞానం నుంచి విముక్తులై, 

మరణానంతరం నారాయణ సాన్నిధ్యం, మోక్షం పొందుతారని, 

వారికి మరుజన్మ ఉండదని విశిష్ఠాద్వైతపు సిద్ధాంతాన్ని బోధిస్తారు.


ఇది ఏకదండి, ద్విదండి, త్రిదండి అనే వాటి గురించిన వివరణ!


*(శ్రీమతే రామానుజాయనమ:)*🙏


          🌹🌹🌹🌹🌹

స్నేహాలతో జీవితాన్ని

 


శ్రీభారత్ వీక్షకులకు శుభాకాంక్షలు 🌹 స్నేహం చాలా విలువైనదే కాదు.. ఎంతో పవిత్రమైనది కూడా. స్నేహం లో ఉండవలసింది నిజాయితీయే గాని కల్మషం కాదు. అది తెలుసుకొని చక్కటి స్నేహాలతో జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలని సూచిస్తున్నారు ప్రముఖ రచయిత్రి శ్రీమతి చెంగల్వల కామేశ్వరి గారు. స్నేహం ఎంత గొప్పదో, నిజమైన స్నేహితులు లేనివారి జీవితం ఎలా నిస్సారమవుతుందో వివరించారు. అదే సమయంలో మంచి స్నేహితులను ఎంచుకోవడం కూడా కష్టమేనని  అంటున్నారు..

 వినండి. ఇటువంటి విశిష్టమైన ఎపిసోడ్స్ ఉచితంగా వీక్షించడానికి వెంటనే చానల్ ను subscribe చేయండి, శ్రీభారత్ కుటుంబ సభ్యులు కండి.🙏

తిరుమల సర్వస్వం -149*

 *తిరుమల సర్వస్వం -149*

*తొండమాన్ చక్రవర్తి -4*



 *శ్రీనివాసుడెటు వైపు?* 


 తొండమానుడు, వసుదానుడు ఇరువురికీ ఆత్మీయుడైన శ్రీనివాసుడి సహాయాన్ని ఇద్దరూ అర్థిస్తారు. ఇద్దరూ శ్రీనివాసునితో తమకున్న అనుబంధాన్ని గుర్తుకు తెచ్చి, శ్రీనివాసుని సహాయాన్ని పొందే హక్కు తమకే ఉన్నదని విన్నవించుకుంటారు. ఇద్దరూ తనకు ఆప్తులవ్వడంతో, ఎటూ పాలుపోని శ్రీనివాసుడు, పద్మావతీదేవిని తగిన పరిష్కారం సూచించ వలసిందిగా సంప్రదిస్తాడు. తాను ఒంటరి వాడినని, ఇద్దరికీ సహాయపడ లేనని, ఇరువురూ పద్మావతీదేవికి అత్యంత సన్నిహితులే కనుక ఆమె చెప్పిన ప్రకారమే నడుచుకుంటానని తుది నిర్ణయం ఆమెకే వదిలేశాడు. 


 పద్మావతి అమ్మవారు, అటు పితృతుల్యుడైన పినతండ్రి ఇటు పుత్రసమానుడైన ముద్దుల తమ్ముడు, ఎవరిపక్షం వహించాలో తెలియక సందిగ్ధంలో పడుతుంది. సుదీర్ఘంగా, ధర్మసమ్మతంగా ఆలోచించి ఈ విధంగా తన అభిప్రాయం వ్యక్త పరుస్తుంది: 


 *"పెద్దవయస్కుడైన తొండమానుడు పరాక్రమవంతుడు. తనను తాను రక్షించుకో గలిగిన సమర్థుడు. ఇటు తండ్రిని కోల్పోయి, చిన్నవయసులో ఉన్న వసుదానుడు తనను తాను కాపాడుకోలేని నిర్భలుడు. యుగయుగాలుగా అనాథలు, బలహీనులను అక్కున జేర్చుకున్న శ్రీనివాసుడు వసుదానునికే సాయమందించటం ఉచితం."* అని ధర్మాధర్మ విచక్షణ చేసి తమ్ముని పక్షాన్ని వహించమని శ్రీనివాసునిణ్ణి వేడుకుంటుంది.


 *ధర్మసంకటంలో పడ్డ శ్రీనివాసుడేం నిర్ణయించుకున్నాడు? శరణాగతులెవ్వరినీ నిరాకరించని శ్రీవేంకటేశ్వరుడు వైరిపక్షాలలో ఉన్న ఇద్దరినీ ఎలా అనుగ్రహించాడు?*


 పద్మావతీదేవి శెలవిచ్చినట్లు, యుద్ధరంగంలో పిన్న వయస్కుడైన తన బావమరిది వసుదానుని పక్షం వహించడమే శ్రీనివాసునికి సమంజసంగా తోచింది. 


 *అయితే,,, తొండమానుడు ఏ ధైర్యంతో ముల్లోకాలలో ఎదురులేని శ్రీనివాసుణ్ణి ఎదుర్కోవడానికి తలపడ్డాడు?*


 *తానొకవైపు - శంఖుచక్రాలు మరోవైపు* 


 అయితే తన పరమభక్తుడు, పద్మావతీదేవితో తన కళ్యాణాన్ని సుగమం చేసిన వాడు అయిన తొండమానుణ్ణి ఉపేక్షించడం ఎలా? ఇలా తర్జన భర్జన పడిన అనంతరం, ఉభయతారకంగా ఉండేట్లు ఒక నిర్ణయానికి వచ్చాడు. తాను మాత్రం వసుదానుని తరఫున యుద్ధం చేస్తూ, తన ఆయుధాలైన శంఖుచక్రాలను తొండమానుని సహాయార్థం పంపించాడు. శ్రీకృష్ణపరమాత్ముడు తాను పాండవపక్షం వహించి తన సమస్తసైన్యాలను కౌరవులకు బాసటగా నిలిపిన మహాభారత యుద్ధం జ్ఞప్తికి వచ్చేలా; అత్యంత భీకరంగా జరిగిన వసుదానుడు తొండమానుల యుద్ధంలో, శ్రీనివాసుడు రౌద్రరూపం దాల్చి తొండమానుని సేనలను కకావికలం చేశాడు. తొండమానుడు ఉక్రోషంతో వసుదానునిపై సుదర్శనచక్రాన్ని ప్రయోగించగా, వసుదానుణ్ణి రక్షించబోయిన శ్రీనివాసుడు చక్రం దెబ్బకు మూర్ఛిల్లాడు. ఇరుపక్షాల వారు శ్రీనివాసుని శ్రేయోభిలాషులు కావడంతో జోరుగా సాగుతున్న యుద్ధానికి కొంత విరామమిచ్చి స్వామివారికి సపర్యలు చేయసాగారు. -



 *ఉభయతారకమైన  ఒప్పందం* 


 శ్రీనివాసుడు గాయపడ్డ విషయం తెలుసుకున్న పద్మావతీదేవి అగస్త్యునితో సహా యుద్ధరంగానికేతెంచి, తగిన ఉపచారాలు చేసి, శ్రీనివాసుణ్ణి తెప్పరిల్ల జేసింది.


 అప్పటికే ఇరుప్రక్కలా జరిగిన విశేష జననష్టానికి కలత చెందిన పద్మావతి వైరిపక్షాల మధ్య 'సంధి' చేయవలసిందిగా శ్రీనివాసుణ్ణి వేడుకొంటుంది. మొదట్లో కొంచెం వెనుకాడినప్పటికీ అగస్త్యముని కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేయడంతో, శ్రీనివాసుడు ఇరువురికి ఆమోద యోగ్యమైన ఒడంబడికను ప్రతిపాదిస్తాడు. ఆ ఒప్పందం ప్రకారం ఆకాశరాజు సామ్రాజ్యం రెండు భాగాలుగా విభజింప బడుతుంది. నారాయణవనం రాజధానిగా గల భాగం వసుదానునికి దక్కగా, తొండమనాడు రాజధానిగా గల మరొక భాగం తొండమానుని వశవుతుంది. ఆ విధంగా, సుధర్మమహారాజు తన భార్యయైన నాగకన్యకు ఇచ్చిన వాగ్దానం శ్రీనివాసుని ద్వారా సాకార మవుతుంది. తానే దగ్గరుండి సైన్యాన్ని, ధనాగారాన్ని సమభాగాలుగా విభజింపజేసిన శ్రీనివాసుడు, ఇరువురూ సంతుష్టులైన తరువాత పద్మావతీ సమేతంగా తిరిగి అగస్త్యాశ్రమాన్ని చేరుకుంటాడు.


*శ్రీనివాసుని శ్రీచరణాలను సేవిద్దాం, సకల శుభాలనూ పొందుదాం* 


*రచన* 

*పల్లపోతు కృష్ణ బాలాజీ గారు- వాణి శ్రీ దంపతులు*

ఫోన్ నెంబర్

99490 98406

మహాభారతము

 *సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*

*ద్రోణ పర్వము ప్రథమాశ్వాసము*


*288వ రోజు*

*సుప్రీతకంను ఆపాలని వెళుతున్న అర్జునుని సంశక్తులు అడ్డగించుట*


దూరం నుండి సుప్రీతకం చేస్తున్న విధ్వసాన్ని చూసిన అర్జునుడు కృష్ణునితో " కృష్ణా ! భగదత్తుని గజము సుప్రీతకం పాండవ సేనను చిన్నాభిన్నం చేస్తుంది. ఎవరూ ఎదుర్కోలేక పోతున్నాడు. మనం లేక పోవడంతో ధర్మరాజాదులు ఎన్ని కష్టాలు పడుతున్నారో కదా ! మన రధమును వెంటనే భగదత్తుని వైపు మళ్ళింపుము " అన్నాడు. కృష్ణుడు రథమును భగదత్తుని వైపు మళ్ళించాడు. ఇంతలో సంశక్తులు వీరాలాపములు పలుకుతూ పదునాలుగు వందలమంది కృష్ణార్జునులను చుట్టుముట్టి శరవర్షం కురిపించారు. అర్జునుడు " కృష్ణా ! మన బలమును తరువాత చూసుకోవచ్చు ముందు సంశక్తులను వధించాలి " అన్నాడు. శ్రీకృష్ణుడు రథమును సంశక్తుల వైపు మళ్ళించాడు. అర్జునుడు గాండీవం సంధించి దేవదత్తము పూరించి దివ్యమైన బాణములను సంశక్తులపై ప్రయోగించాడు. అర్జునుడి అస్త్రధాటికి రథ, గజ, తురగములు నాశనం ఔతున్నాయి. పదాతి దళముల తలలు ఎగిరి పడుతున్నాయి. కాళ్ళు చేతులు తెగిపడుతున్నాయి. అర్జునుడి విజృంభణ చూసి కృష్ణుడు ప్రశంసించాడు. కృష్ణుని ప్రంశలకు పొంగి పోయిన అర్జునుడు మరింత ఉత్సాహంతో విజృంభించి సంశక్తుల సేనను సర్వ నాశనం చేసాడు. అర్జునుడు కృష్ణునితో " ఇక్కడ సంహారం పూర్తి అయింది. రధమును మనసేన వైపు మళ్ళించు " అన్నాడు. కృష్ణుడు రథమును మళ్ళించగానే సంశక్తులు వెనుక నుండి " అదేమిటయ్యా ! మేము యుద్ధానికి పిలుస్తుంటే పారిపోతున్నావు " అని అరిచారు. " కృష్ణా ! యుద్ధానికి పిలుస్తుంటే మరలి పోవడం వీరుల లక్షణం కాదు. మన సైన్యం దైన్య స్థిలో ఉంది. నాకు సరి అయిన మార్గం తోచడం లేదు. నీవే తగు నిర్ణయం తీసుకో " అన్నాడు. కృష్ణుడు మారు మాటాడక సంశక్తుల వైపు రథాన్ని మళ్ళించాడు. అర్జునుడు మహోగ్రంతో త్రిగర్తుని విల్లు త్రుంచి కేతనము విరిచాడు. త్రిగర్తుని సోదరులను చంపాడు త్రిగర్తుడు మూర్చపోయాడు.


*అర్జునుడు సుప్రీతకమును భగదత్తును ఖండించుట*


ఇంతలో పాండవ సేనలు పారిపోవడం చూసిన అర్జునుడు " కృష్ణా ! అటు చూడు సుప్రీతకం ధాటికి ఆగలేని మన సేనలు పారిపోతున్నాయి . రధమును అటు మళ్ళించు " అన్నాడు. శ్రీకృష్ణుడు అమిత వేగంతో రథమును పాండవ సేన వైపు పరుగెత్తించాడు. అర్జునుడు దేవదత్తము పూరించి భగదత్తుని మీద కరకుటమ్ములు ప్రయోగించి సుప్రీతకముకు ఎదురుగా నిలిచాడు. భగదత్తుడు అర్జునుడిపై ఉగ్రమైన బాణములు ప్రయోగించాడు. అర్జునుడు చిరునవ్వుతో వాటిని ముక్కలు చేసి భగదత్తుని మీద సుప్రీతకం మీద అతి దృఢమైన బాణ ప్రయోగం చేసాడు. ఆ బాణములు సుప్రీతకమును నొప్పించడంతో కృష్ణార్జునుల వైపు అతి వేగంగా దూకింది. సుప్రీతము ధాటికి కృష్ణార్జునులు ప్రాణాలు కోల్పోయారన్న వార్తతో పాండవ సేనలో హాహాకారాలు చెలరేగాయి. అప్పుడు కృష్ణుడు రథమును పక్కకు తప్పించంతో అది సేనలో దూసుకు పోయి వందల కొద్ది సైనికులను కాళ్ళతో తొక్కి చంపింది. ఇది చూసిన అర్జునుడికి కోపం వచ్చినా మనసులోనే అణచుకుని " కృష్ణా ! మన రధమును సుప్రీకం ఎదురుగా నిలుపుము " అన్నాడు


*రేపు *

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*

*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*

మాఘ పురాణం - 17 వ అధ్యాయము*_

 _*మాఘ పురాణం - 17 వ అధ్యాయము*_


🌅🏞️🌅🌊🌅🏞️🌅

*🙏ఓం నమో భగవతే నారాయణాయ*


*ఇంద్రునికి కలిగిన శాపము*

*🌅🛕📚TVBC📚🛕🌅*

**************************

🕉️📚🕉️📚🕉️📚🕉️📚


వశిష్ఠ మహర్షి దిలీపునితో మరల ఇట్లనెను. రాజా ! మాఘమాస మహిమను వివరించు మరియొక కథను చెప్పెదను వినుము. పూర్వము గృత్నృమదుడను మహర్షి గంగాతీరమున నివసించుచు మాఘమాస స్నానము పూజాదికము చేయుచు తన శిష్యులకు మాఘమాస మహిమను శ్రీ మహా విష్ణువు మహత్మ్యమును వివరించుచుండెను. జహ్నువనుమహాముని మాఘమాసస్నాన మహిమను వివరింప కోరగా గృత్నృమదమహర్షి యిట్లు పలికెను. సూర్యుడు మకరరాశిలో నున్నప్పుడు మాఘమాసము ప్రారంభమగును. అట్టి  మాఘమాసమున చేసిన స్నానము అత్యంత పుణ్యప్రదమే కాక పాపనాశము కూడ అగుచున్నది. మాఘమాసమున ప్రాతఃకాలమున నదీస్నానము చేసిన వారు ఇంద్రుడు మహా పాతక విముక్తుడైనట్లుగా పాప విముక్తులగుదురు ఆ విషయమును వినుడు.


పూర్వము తుంగభద్రా నదీతీరమున అన్ని వేదములను చదివిన మిత్రవిందుడను ముని యొకడు ఆశ్రమమును నిర్మించుకొని యుండెను. మిత్రవిందుని భార్య అతిలోకసుందరి , ఆమె యొకనాడు తుంగభద్రా నదిలో స్నానము చేసి పొడిబట్టలు కట్టుకొని కేశములనారబెట్టు కొనుచుండెను. రాక్షస సంహారమునకై దేవతలతో గలసి ఆకాశ మార్గమున పోవుచున్న ఇంద్రుడామెను చూచి మోహపరవశుడయ్యెను. అమెనెట్లైన పొందవలయునని నిశ్చయించుకొనెను. రాక్షసులను జయించి తిరిగివచ్చుచు ఇంద్రుడు ఆ ఆశ్రమముపై భాగమున నుండి మిత్రవిందముని భార్య అందమును , ఆమె చేష్టలను గమనించుచుండెను.


మిత్రవిందముని తెల్లవారుజామున శిష్యులను మేలుకొలిపి వేదపఠనము చేయింపవలయునని తనున్న పర్ణశాల నుండి బయటకు వెళ్లెను. ఇంద్రుడును ఆశ్రమములోనికి రహస్యముగ ప్రవేశించి మిత్రవిందను పట్టుకొనెను , విడిపించుకొని పోవుచున్న ఆమెకు తానెవరో చెప్పి తన కోరికను తీర్చమని ప్రార్థించెను. ఆమె సౌందర్యమును మెచ్చెను. ఆమెయును కామ పరవశయై ఇంద్రునిపొందు అంగీకరించెను , కోరిక తీరిన ఇంద్రుడు ఆశ్రమము నుండి వెళ్ల యత్నించుచుండెను. అప్పుడే వచ్చిన ముని వానిని పట్టుకొని నీవెవడవని యడిగెను. నేనింద్రుడనని సమాధానమిచ్చెను. మిత్రవిందుడును జరిగిన దానిని గ్రహించెను. నీవు గాడిద ముఖము కలవాడవై  స్వర్గమునకుపోలేక భూలోకముననే యుండుమని శపించెను. తప్పు చేసిన తన భార్యను రాయిపై పడియుండుమని శపించెను. ఆ చోటును విడిచి గంగాతీరమును చేరి అచట తపమాచరించి యోగశక్తిచే దేహమునువిడిచి పరమాత్మలో లీనమయ్యెను.


*🪀📖courtesy by📲🙏*.

*🛕卐ॐ•TVBC•ॐ卐🪔*•••••••••••••••••••••••••••


ముని శాపమువలన ఇంద్రుని ముఖము మాత్రమే గాడిద మిగిలిన శరీరము మామూలుగనేయుండును. అచటనుండుటకు సిగ్గుపడి పద్మగిరియను పర్వతమును చేరి అచటి గుహలోనుండి అచటనున్న గడ్డిని తిని కాలమును గడుపుచుండెను. అతడట్లు పన్నెండు సంవత్సరములు గడిపెను. రాజులేని స్వర్గముపై రాక్షసులు దండెత్తి వచ్చి దేవతలతో యుద్ధము చేయుచుండిరి. దేవతలు రాక్షసులతో యుద్ధము చేయలేకపోయిరి. తమ ప్రభువగు ఇంద్రుని వెదుకసాగిరి. ఇంద్రుని కనుగొనలేక వారు స్వర్గమునకు తిరిగి వచ్చిరి. రాక్షసులు మరల వారిని తరిమి కొట్టిరి. దేవతలు ఇంద్రుని వెదకుచు నదీతీరములయందు సముద్రతీరము నందు తిరుగుచుండిరి. అప్పుడు మాఘమాసమగుటచే మాఘమాసమున నదీస్నానము చేసి తీరిగి వచ్చు మునులను చూచిరి. మాఘమాస మహిమను ముచ్చటించుకొనుచున్న మునులకు నమస్కరించి మీరు చేయు వ్రతమేమి దాని వలన వచ్చు ఫలమేమి అని ప్రశ్నించిరి, మునులు వారిట్లనిరి.


దేవతలారా వినుడు మేము చేయువ్రతము మాఘమాసవ్రతము సూర్యుడు మకర రాశి యందుండగా ప్రాతఃకాలమున తటాకాదులందు స్నానము చేయుట శ్రీమహావిష్ణుపూజ , పురాణ పఠనము , యధాశక్తి దానము. దీనివలన దుర్లభమైన మోక్షము కూడ సులభమగును. మాఘమాసమున చేసిన మాధవస్మరణ సర్వపాపములను నశింపచేయును. మాఘమాస స్నానము పూజ మున్నగునవి చేయు వారి అదృష్టమనంతము. మాఘశుద్ధ చతుర్దశియందు గోదానము , వృషోత్పర్జనము , తిలదానము ఆవూప దానము , పాయసదానము , వస్త్రకంబళములదానము , విష్ణులోక ప్రాప్తిని కలిగించును. శ్రీమహావిష్ణువు దయవలన సర్వలోకములు సులభములైయుండును అనుచు మునులు దేవతలకు మాఘమాస మహిమను వివరించిరి. దేవతలును దివ్యమునులు మాటలను విని మాఘస్నానమును సముద్రమున చేసి శ్రీమహ విష్ణువు నర్చించిరి. వారికి శ్రీమహావిష్ణువు సాక్షాత్కరించెను. మొట్టమొదటి జగద్గురువు అగు శ్రీమహా విష్ణువు మృదువైన శరీరము చతుర్భుజములు కలిగియుండెను. శంఖుచక్ర గదాపద్మములను నాలుగు చేతులయందు పట్టెను. పచ్చని వస్త్రమును ధరించి కిరీటముతో మరింత మనోహరముగ నుండెను. కంకణములు వారములు వైజయంతీమాల మున్నగు అలంకారములను ధరించి గంభీర మనోహర రూపముతో నుండెను. ఇట్లు సాక్షాత్కరించిన శ్రీమహావిష్ణువును డేవతలిట్లు స్తుతించిరి.


*స్వామీ:* నీవు జగములకే గురువువు వేదవేద్యుడవు నీయనుగ్రహము లేనిదే యెవరును నిన్నెంతటి వారైనను యెరుగజాలరు. చతుర్ముఖములు కల బ్రహ్మ వ్యాస మహర్షిని పాదముల మహిమను స్తుతించి కృతార్థులైరి. అట్టి నీకు మా నమస్కారములు స్వామీ ! నీవు ఆనంద సముద్రమును పెంపొందించు చంద్రుడవు. నీకు నచ్చిన ఉత్తములైన వారికి స్వర్గమును మోక్షమును అనుగ్రహింతువు సమస్తమును నీవే వ్యాప్తమైయున్నది. నీవు సచ్చిద్రూపుడవు సత్యవాక్కువు స్వామీ ! యిట్టి నీకు నమస్కారము నీవు త్రిమూర్తి స్వరూపుడవై సృష్టి స్థితిలయముల నిర్వహించుచున్నావు. సర్వసృష్టి నశించి జలమయ మైనప్పుడు మఱ్ఱి ఆకుపై పరుండి చిదానంద స్వరూపడువైయుందువు. పరమాత్మ స్వరూపుడవైన నిన్ను నీవు తప్పమరెవరును యెరుగజాలరు. కర్మప్రకృతి గుణభేదముల ననుసరించి సృష్టించి  వాని యాందాసక్తుడవై యున్నట్లుండి నిరాసక్తుడవై అద్వితీయరూపమున నున్న నీకు నమస్కారము. సర్వవ్యాప్తుడవైన నిన్నెవరును యెరుగజాలరు. బ్రహ్మ , ఇంద్రుడు మొదలైన దేవతలు , పంచభూతములు అన్నింటిని సృష్టించిన వాడవు నీవే ధ్రువుడు , నారదుడు , ప్రహ్లాదుడు , ఉర్దవుడు మొదలగు ఉత్తమపురుషులు మాత్రమే నన్నెరిగి సేవింపగలరు. నీవు జగములకు గురువువు. జగములును నీవే మాట మనస్సు మున్నగువానికి అందని నీరూపమును నిన్ను స్తుతించుట తప్పయేమియు చేయజాలని వారము. నాయకుడగు ఇంద్రుని గోల్పోయి రాక్షసులచే అవమానింపబడిన మమ్ము రక్షింపుము. అని దేవతలు పలు రీతుల శ్రీమహావిష్ణువును స్తుతించిరి.


దేవతలయందు జాలిపడిన శ్రీమన్నారాయణుడు వారికి ప్రసన్నుడై యిట్లనెను. దేవతలారా ఇంద్రుడు ముని శాపముచే దివ్యశక్తులను కోల్పోయి గాడిద మొగము కలవాడై పద్మగిరి గుహలలో సిగ్గుపడి దాగియున్నాడు. అతడు ముని భార్యను మోహించి ఆమెననుభవించి దోషము చేసి మునిశాపమునొందెను. పద్మగిరి దోకర్ణ సమీపముననున్నది. పరమ పవిత్రమైన మాఘమాసమున అరుణోదయ పుణ్యకాలమున గార్దభ ముఖుడైన ఇంద్రునిచే నదీస్నానమును చేయింపుడు. అందువలన ఇంద్రుడు గాడిద ముఖమును విడిచి మంచి ముఖముకలవాడై , పూర్వమువలె దివ్య శక్తులను పొంది మమ్ము రక్షింపగలడు , కావున మీరు వానిచే మాఘమాస అరుణోదయపుణ్యకాలమున నదీస్నానము చేయింపుడని చెప్పెను.


🌅🏞️🌅🌊🌅🏞️🌅

*⛳🛕ॐ•TVBC•卐🛕⛳*

•••••••••••••••••••••••••••••

దేవతలు శ్రీమహావిష్ణువు మాటలనువిని విస్మితులైరి. స్వామి ముని శాపపీడితుడైన ఇంద్రుడు కేవలం మాఘస్నానముచే స్వగ్ధుడగునా ? విచిత్రముగ నున్నదని పలికిరి. అప్పుడు శ్రీమన్నారాయణుడు , దేవతలారా ! మాఘమాసస్నాన మహిమను మీరెరుగకపోవుటచే ఇట్లంటిరి. నేను చెప్పినట్లు చేసినచో ఇంద్రుడు యధా పూర్వరూపమును పొందుటలో ఆశ్చర్యము , సందేహము అక్కరలేదు. పూర్వము విశ్వామిత్ర మహర్షి ఇంద్రుని వలె పాపమును చేసి కపిముఖుడై మాఘస్నానము చేసి పూర్వ స్థితి నొందెనని చెప్పెను. ఆ మాటలకు దేవతలు మరింత ఆశ్చర్యపడిరి. ఆ వృత్తాంతమును చెప్పుమని శ్రీమన్నారాయణుని కోరిరి. అప్పుడు విష్ణువిట్లు పలికెను. వినుడు పూర్వము విశ్వామిత్ర మహర్షి భూప్రదక్షిణము చేయుచు గంగాతీరమునకు వచ్చెను. మాఘమాసకాలమగుటచే గంధర్వులు తమ భార్యలతో కలిసి గంగా స్నానము చేయవచ్చిరి. అట్లు వచ్చిన దంపతులులలో ఒక గంధర్వుడు మాఘమాసమున నదీస్నానము చేయుచు భార్యను కూడ నదీస్నానము చేయుటకు రమ్మని పిలిచెను. భర్తతో భూలోకమునకు వచ్చి గంగాతీరమును చేరిన ఆమె ఈ చలిలో నాకీచన్నీటి స్నానము బాదాకరము నేను స్నానము చేయజాలను. మీకు ఆశక్తి ఇష్టము ఉన్నచో మీరు చేయుడని గంగా స్నానమును నిరాకరించెను. గంధర్వుడెంత చెప్పినను వాని భార్య భర్త మాట వినలేదు. స్నానము చేయలేదు. గంధర్వుడు మిగిలిన వారితో కలసి స్నానము చేసెను. గంధర్వును భార్య మాఘస్నానమును ధూషించి నిరాకరించుటచే ఆమె దివ్య శక్తులను కోల్పోయెను. స్నానము చేసి తిరిగి వచ్చి తమ లోకమునకు తిరిగి వెళ్లుసందడిలో గంధర్వుని భార్యను మిగిలినవారు గమనించలేదు. దివ్యశక్తులతో గంధర్వులు తమ లోకములకు వెళ్ళిరి. గంధర్వుని భార్య గంగాతీరమున దివ్యశక్తులను కోల్పోయి అసహాయురాలై తిరుగుచుండెను.


ఆమె అడవిలో తిరుగుచూ విశ్వామిత్రుడు ఉన్నచోటుకు వెళ్ళి వయ్యారముగా క్రీగంటచూసెను. ఆమె అందానికి , యవ్వనానికి విశ్వామిత్రుడు తన్మయుడై ఆమెను ప్రేమించుటచే ఇద్దరూ  కామక్రీడలలో తెలియాడుచుండగా , మరల ఆ గంధర్వుడు తన భార్యను వెదుకుచూ వచ్చి చూడగా , విశ్వామిత్రుడు గంధర్వస్త్రీ క్రీడించుచుండిరి. ఆ దృస్యమును చూచి మండిపడుచు తపస్వివై యుండి కూడా ఇలా కామతృష్ణ కలవాడవైనందున , నీకు కోతి ముఖము కలుగుగాకయని విశ్వామిత్రుని , పాషాణమై పడియుండమని భార్యను శపించి వెళ్ళిపోయినాడు. విశ్వామిత్రుడు చేయునది లేక వానర ముఖం కలిగియుండగా నారదుడు ఆ విషయము తెలుసుకొని విశ్వామిత్రుని కడకు వచ్చి , *" విశ్వామిత్రా ! క్షణభంగురమైన తుచ్ఛకామ వాంఛకులోనై నీ తపశ్శక్తినంతా వదులుకున్నావు. సరేలెమ్ము గంగానదిలో స్నానము చేసి , నీ కమండలములో గంగా జలము తెచ్చి ఈ పాషాణముపై చల్లుము",* అని వివరించగా విశ్వామిత్రుడు గంగాస్నానముచేసి , విష్ణువును ధ్యానించి , కమండలముతో నీరు తెచ్చి , పాషాణముపై చల్లగా ఆ రాయి పూర్వం గంధర్వ స్త్రీ రూపమును పొంది , గంధర్వలోకమునకు వెళ్ళిపోయెను. పూర్వరూపము నొందిన విశ్వామిత్రుడు తపస్సునకు వెళ్ళిపోయెను.


దేవతలారా ! మాఘస్నానము మహిమ మాటలకు అందదు చాలా గొప్పది. కావున మీరు గాడిద ముఖము కలిగి సిగ్గుపడి పద్మగిరిలో నున్న ఇంద్రునిచే మాఘస్నానమును చేయింపుడు. అప్పుడు అతనికి శాపవిముక్తి యగునని శ్రీమన్నారాయణుడు దేవతలకు ఇంద్రుని శాపవిముక్తికి ఉపాయమును సూచించెను.

*-❀꧁❀-TVBC❀-꧂❀-*


🟨🟥🟨🟥🟨🟥🟨🟥

*🙏స్వస్తి 🙏*

📚🕉️📚🕉️📚🕉️

*FOR MORE DAILY "DEVOTIONAL UPDATES"  & SPIRITUAL INFORMATION 📖 WATCH 🪀 AND SUBSCRIBE TO TVBC ON YOUTUBE.🤳*

🟨🟥🟨🟥🟨🟥🟨🟥

సుభాషితమ్

 💎🌅  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 *_𝕝𝕝ॐ𝕝𝕝 సుభాషితమ్ 𝕝𝕝卐𝕝𝕝_* 💎


                𝕝𝕝 *శ్లోకం* 𝕝𝕝 


శ్లో𝕝𝕝 *బుధైస్త్యక్తే రాజ్యే నహి భవతి నిర్గుణవతీ।*

       *విపన్నాయాం నీతౌ సకలమవశం సీదతి జగత్॥*


*తా|| "పండితులచే విడువబడిన రాజ్యమందు నీతి, ధర్మము నశించును... నీతి చెడినచోట మిగిలినవన్నీ నశించును.... దేశమే చెడిపోతుంది.... అందుచే దేశసౌభాగ్యమునకై నీతిని నిలుపుటకు పండితులను గౌరవించి, రాజ్యమునందు నిలుపవలెను"....*


 ✍️🪷🌸💐🙏

భవిష్యపురాణము

 *భవిష్యపురాణము*


*విప్రో వృక్ష స్తస్య మూలం హి సంధ్యా వేదాశ్శాఖా ధర్మకర్మాణి పర్ణాః తస్మాన్మూలం యత్నతో రక్షణీయం మూలేచ్ఛిన్నే నైవ శాఖా న పర్ణాః ॥* 


భావం:


బ్రాహ్మణుడు వృక్షము, దానికి కూకటివేరు సంధ్యోపాసనము. వేదములు కొమ్మలు. ధర్మకర్మలు ఆకులు.  కావుననిట్టి బ్రాహ్మణుడను చెట్టుయొక్క కూకటి వేరును (సంధ్యావందనమును) మిక్కిలి ప్రయత్నముతో రక్షింపవలెను, లేని యెడల కూకటివేరునే నఱకి వేసిన యెడల (సంధ్యావందనమును చేయని యెడల) చెట్టు చచ్చిపోవును. అనగా బ్రాహ్మణుని బ్రాహ్మణ్యము పోవును. కాగా కొమ్మలగు వేదములుండవు, ఆకులగు ధర్మకార్యము లుండవు. అనగా సంధ్యోపాసనను చేయని యెడల వాని బ్రాహ్మణ్యము పోయి వేదములు చదువుటకును, ధర్మకార్యములు చేయుటకును అర్హుడుకాడని భావము. 


అందువలన ఎన్ని పనులున్నను, సంధ్యోపాసన చేయుటకొరకు మిక్కిలి ప్రయత్నముతో నెటులైనను సమయమును (ఇరువది యైదు లేక ఇరువది నిమిషములైనను) చేసికొని సంధ్యా వందనమునకు లోపము కాకుండ కాపాడుకొనవలెనని భావము. 


బ్రాహ్మణుని బ్రాహ్మణ్యమునకును,  వేదములకును, వైదిక కర్మలకును సంధ్యోపాసనమే జీవనదాయియై యత్యంత ముఖ్యమైనదని తేటతెల్లముగ జెప్పబడినది. 


ఆహా! ఎంత అమూల్యార్థము గల శ్లోకము !

అనుబంధం

 🔔 *అనుబంధం* 🔔


*మన చుట్టూ అద్భుతాలతో పయనిస్తూ ఇంకెక్కడో ప్రాణం లేని వాటిని చూసి.ఇది చాలా అద్భుతమని  ఆశ్చర్యపోతుంటాం!!*


*మన చుట్టూ ఉన్న 7 అద్భుతాలు*


1. *తల్లి*

మనల్ని ఈలోకానికి  పరిచయం చేసిన వ్యక్తి,మనకు జననం ఇవ్వడానికి మరణం దాకా వెళ్లివచ్చిన తల్లి  1వ అద్భుతం!


2. *తండ్రి*

మన కళ్ళల్లో  ఆనందాన్ని చూడాలని  తన కన్నీళ్లను దాచేస్తాడు.మన పెదవులపై  చిరునవ్వును చూడాలని తన కష్టాలను దాచేస్తాడు.దుఃఖాన్ని  తాను అనుభవిస్తూ,సంతోషాన్ని మాత్రమే మనకు ఇచ్చే తండ్రి 2వ అద్భుతం!


3. *తోడబుట్టిన వాళ్ళు*

మన తప్పులను వెనకేసుకురావాడానికి,మనతో పోట్లాడడానికి,మనకు నేను ఉన్నా అనే ధైర్యం ఇవ్వడానికి వచ్చే బంధమే వీళ్ళు.తోడబుట్టినవాళ్లు 3వ అద్భుతం!


4..*స్నేహితులు*

మన భావాలను పంచుకోవడానికి,మంచి చెడు అర్థం అయ్యేలా చెప్పడానికి, ఏది ఆశించకుండామనకు దొరికిన స్నేహితులు. 4వ  అద్భుతం!


5. *భార్య / భర్త*

ఈ ఒక్క బంధం కోసం అన్ని బంధాలనుఎదిరించేలా  చేస్తుంది. కలకాలం తోడు ఉంటూ ఇన్నిరోజులు తోడు ఉన్న అన్ని బంధాలకంటే,ఈ బంధం ఇంకా గొప్పదని నిరూపిస్తుంది.భార్య/భర్త అర్థం చేసుకునేవారు దొరికితే  5వ అద్భుతం మన సొంతం!


6. *పిల్లలు*

మనలో స్వార్థం మొదలవుతుంది.మన పిల్లలు బావుండాలని పదే పదే మనసు ఆరాటపడుతుంది.వారి ఆలోచనలే  ఎప్పుడూ చుట్టూ ఉంటాయి. వారికోసం మాత్రమే గుండె  కొట్టుకుంటూ ఉంటుంది.వారి కోసం ఏదో ఒకటి త్యాగం చేయని తల్లి తండ్రులు  అసలు ఉండరు...

పిల్లలు..6వ అద్భుతం!


_*అన్ని అయిపోయాయి..

ఇంకా 7 అద్భుతం ఏంటా అని అనుకుంటున్నారా?*_


7. *మనవళ్ళు..మనవరాళ్లు*

వీరికోసం ఇంకా కొన్నిరోజులు  బతకాలనే ఆశపుడుతుంది.వీరితో కలిసి ఆడుకోవడానికి వయసును మరిచి, అద్భుతంగా మళ్ళీ పసిపిల్లలం..అయిపోతాం.వీరు మన జీవితానికి  దొరికిన.. 7వ అద్భుతం!


*ఇన్ని అద్భుతాలమధ్య తిరుగుతూ,వీటి విలువలు మరిచి బ్రతుకుతున్న మనం మహా అద్భుతం..! కాసింత ప్రేమ చాలు,ఇంకెన్నో అద్భుతాలు  మన సొంతం అవుతాయి.చిన్న పలకరింపు  చాలుమనల్ని ఆ అద్భుతంగా  చూడడానికి.అందుకే అందరిని చిరునవ్వుతో స్వాగతించి  

మరో అద్భుతాన్ని  సృష్టించేద్దాం*




🙏🏻🙏🏻🙏🏻🔔🔔🔔🙏🏻🙏🏻🙏🏻

Panchang



 

మాఘ పురాణం - 16

 🕉️🌹🌷🪔🛕🪔🌷🌹🕉️


*🌷శుక్రవారం 14 ఫిబ్రవరి 2025🌷*

_*మాఘ పురాణం - 16 వ*_ 

        _*అధ్యాయము*_


🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉


      *విద్యాధర పుత్రిక కథ*


☘☘☘☘☘☘☘☘☘


రాజా ! మాఘమాసస్నాన మహిమను తెలుపు మరియొక కథను వినుమని మరల యిట్లు పలికెను. పూర్వమొక విద్యాధరుడు సంతానము కావలయునని బ్రహ్మనుద్దేశించి గంగాతీరమున తపము చేయుచుండెను. నియమవంతుడై భక్తి శ్రద్దలతో చిరకాలము తపమాచరించెను. అతడిట్లు చిరకాలము తపము చేయగా బ్రహ్మ సంతుష్టుడై వానికి ప్రత్యక్షమయ్యెను , వరములనిత్తును కోరుకొమ్మనెను. పుత్రునిమ్మని విద్యాధరుడు బ్రహ్మను కోరెను. అప్పుడు బ్రహ్మ *"నాయనా ! నీకు పుత్ర సంతానయోగము లేదు. అయినను నీ తపముకై మెచ్చి పుత్రిక ననుగ్రహించుచున్నానని"* అంతర్దానమునందెను. ఆమె పెరిగి పెద్దదయ్యెను , మిక్కిలి సుందరమై సద్గుణాన్వితయై కన్నవారికిని , తనను చూచినవారికిని , సంతోషమును కలిగించుచుండెను. విద్యాధరుడును ఆనందమును కలిగించు నీమెను యెవరికోయిచ్చి అత్తవారింటికి పంపజాలను. వివాహము చేసినను అల్లుని కూడ నా యింటనే యుంచుకొందునని నిశ్చయించుకొనెను. ఒకనాడొక రాక్షసుడామెను చూచెను , ఆ రాక్షసుడు, దేవీ భక్తుడు ఎన్నియో దివ్యశక్తులను సంపాదించెను , కోరిన రూపము ధరింపగల శక్తిని కూడ సంపాదించెను. ఆ రాక్షసుడు విద్యాధర పుత్రికను చూచినంతనే ఆమెపై మరులుకొనెను. ఆమె నెట్లైన వివాహము చేసికొనవలయునని తలచెను. ఆ రాక్షసుడు మిక్కిలి శక్తిమంతుదు , శివుని తపముచే మెప్పించి శివుని శూలమును కోరి పొందెను. శివుడును వానికి శూలమునిచ్చుచు *"ఓయీ ! ఇది నీ శత్రువునకు అధీనమైనచో నీవు మరణింతువని"* చెప్పి యిచ్చెను. వరగర్వితుడైన రాక్షసుడు నన్ను మించిన శత్రువెవ్వడు నా ఆయుధము శత్రువునెట్లు చేరును అని తలచి వర గర్వితుడై యెవరిని లెక్కచేయక ప్రవర్తించుచుండెను.


అట్టి రాక్షసుడు విద్యాధర పుత్రికను చూచి *"సుందరీ ! నన్ను వరించుమని యడిగెను , ఆమెయు నా తండ్రినడుగుమని చెప్పెను. రాక్షసుడును విద్యాధరుని వద్దకు పోయి వాని కుమార్తె నిచ్చి వివాహము చేయమని కోరెను. విద్యాధరుడు వానికి తన కుమార్తె నిచ్చి వివాహము చేయుటకు తిరస్కరించెను. రాక్షసుడు చేయునది లేక మరల వచ్చెను , విద్యాధరుని పుత్రికను హరించి సురక్షితముగ సముద్రము క్రిందనున్న తన యింట ఉంచెను. శుభముహూర్తమున ఆమెను వివాహమాడదలచెను , విద్యాధరుడును తన పుత్రికయేమైనదో యని విచారించుచుండెను. ఆ రాక్షసుడు బ్రహ్మ వద్దకు పోయి తన వివాహమునకు మంచి ముహూర్తమును చెప్పమని యడుగగా బ్రహ్మ యెనిమిది మాసముల తరువాత మంచి ముహూర్తమున్నది అంతవరకు ఆగమని చెప్పెను. రాక్షసుడు అందుకు అంగీకరించెను. అతడు విద్యాధర పుత్రికతో ఎనిమిది మాసముల తరువాత శుభముహూర్తమున నిన్ను వివాహమాడుదును , ఈ లోపున నిన్నేమియు భాధింపను. నీవు కోరిన వస్తువులను తెచ్చి యిత్తుననగా నామెయేమియు మాటలాడలేదు , రాక్షసుడు మరల మరల నడుగగా *'నాకిప్పుడేమి అక్కరలేదు , ప్రతి సోమవారము సాయంకాలమున శివుని దర్శించు వ్రతమున్నది , దర్శించి పూజించుటకు శివలింగమెచటనున్నదో చూపూ మని అడిగెను. ఆ రాక్షసుడు పాతాళములో వున్న హటకేశ్వరుని చూపెను. విద్యాధర పుత్రికయు రాక్షసుని అనుమతితో శివ సందర్శనమునకై ప్రతి సోమవారము పాతాళమునకు పోయి వచ్చుచుండెను. ఒకనాడామె పాతాళలోకమున నున్న హటకేశ్వర స్వామిని దర్శింప వెళ్లెను. అప్పుడఛటకు త్రిలోకసంచారియగు నారద మహర్షియు హటకేశ్వరుని దర్శింప వచ్చి యామెను జూచెను. ఆశ్చర్యపడి *'అమ్మాయి ! నీవిచటనున్నావేమని అడిగెను. ఆమెయు తన వృత్తాంతమును చెప్పెను. రాక్షసుడు తనను సముద్రము క్రింద నున్న గృహమున నిర్భంధించెననియు చెప్పెను.*


నారదుడామె చెప్పినదంతయును వినెను. అమ్మాయీ ! భయపడకుము విష్ణుభక్తుడై నీకు భర్తయగు వానిని నీ వద్దకు పంపుదును. అతడే నీ భర్త విచారింపకుము. నా మాటను నమ్ముము. నీకొక ఉపాయమును చెప్పెదను వినుము. ఇచట శివునకెదురుగ మానస సరోవరము కలదు. మాఘమాసమున నీవీ సరస్సున స్నానమాచరింపుము. గంధపుష్పాదులతో శ్రీమన్నారాయణుని పూజించి ప్రదక్షిణ నమస్కారములను చేయుము. మాఘమాసమంతయు ఇట్లు చేయుము. ఇట్లు చేసిన వారు కోరినది లభించును. శ్రీమన్నారాయణుడు నిన్ను కాపాడును. మాఘస్నానము పూజాధికము సద్యఫలమునిచ్చును. నా మాటను నమ్ముమని చెప్పి నారదుదు తన దారిన పోయెను.


విద్యాధర పుత్రికయు నారదుని మాటలను మనస్ఫూర్తిగ నమ్మెను. మాఘమాసమంతయు హటకేశ్వరపురమందున్న మానస సరోవరము వద్దకు వెళ్లి స్నానము చేసి పూజ మున్నగు వానిని చేయుచుండెను. నారదుని మాట యధార్థమగుటకై ఎదురు చూచుచుండెను. మాఘమాసమును వ్రతముతో గడపెను. నారదుడును లోకసంచారము చేయుచు సౌరాష్ట్ర దేశమును పాలించుచున్న శ్రీమహావిష్ణు భక్తుడగు హరిద్రధుడను మహారాజును జూచెను. ఆరాజు సర్వకాల సర్వా వస్థలయందును శ్రీమహావిష్ణువును స్మరించుచుండును. అందరియందును శ్రీమన్నారాయణునే దర్శించును. వారిని హరీయని ఆహ్వానించును. విష్ణువాయని పిలుచును. గోవిందాయని మాటలాడును. శ్రీకృష్ణాయనుచు వస్తువును స్వీకరించును. దామోదరాయనుచు భుజించును , కేశవాయనుచు నిద్రించును. నరసింహాయని స్మరించును , హృషీకేశాయని మేల్కొనును , వామనాయనుచు తిరుగును , ఏపని చేయుచున్నను యెవరితో మాటలాడుచున్నను యేదో ఒక విధముగ శ్రీమన్నారాయణుని తలుచును. ఇట్లు విష్ణు భావనాతన్మయుడైన హరిద్రధుని వద్దకు నారదమహర్షి వెళ్లెను.


హరిద్రధుడును నారదమహర్షిని జూచి యెదురువచ్చి గౌరవించెను. తగిన ఆసనమున కూర్చుండబెట్టి అనేక ఉపచారములతో పూజించెను. నారదుడును రాజా విద్యాధర కన్యనొక దానిని వరగర్వితుడైన రాక్షసుడొకడు బలాత్కారముగ నపహరించి సముద్ర గర్భమున దాచియుంచినాడు. ఆ విద్యాధర కన్యక త్రిలోకసుందరి , సద్గుణశీల నీవామెను భార్యగా స్వీకరింపవలెను. ఆ రాక్షసుని వాని శూలముతోనే సంహరింపవలయును. అని వానికి తగినరీతిలో వివరించి నారదుడచట నుండి లోక సంచారార్థముపోయెను. హరిద్రధుడును సముద్రము వద్దకు పోయెను , నారదుడు చెప్పినట్లుగ సముద్రము వానికి తన లోనికి వచ్చుటకు మార్గము నొసగెను. హరిద్రధుడును ఆ రాక్షస గృహమును చేరెను. ఆ సమయమున రాక్షసుడింట లేడు. అతడు వివాహ ముహూర్తమునకై బ్రహ్మ వద్దకు పోయెను. అతడు పోవుచు శూలము ఇంటిలో వుంచి వెళ్లెను. రాజు రాక్షసుని యింట నున్న శివుని శూలమును గ్రహించియుండెను. రాక్షసుడింటికి వచ్చునప్పటికి తన శూలము పరహస్తగతమగుటను గమనించెను. ఆ రాజును చూచి యిట్టివానితో యుద్ధము చేసి మరణించినను మంచిదేయని తలచి హరిద్రధునితో యుద్ధము చేయసిద్ధపడెను. రాక్షసుడు హరిద్రధుడు చాలా కాలము యుద్ధము చేసిరి , హరిద్రధుడు శివుని శూలమును ప్రయోగించి రాక్షసుని సంహరించెను. ఆ రాజు రాక్షసుని సంహరించి విద్యాధర పుత్రిక వద్దకు పోయెను. ఆమెయు నారదుని మాటను స్మృతికి తెచ్చుకొనెను , వానిని భర్తగా వరించెను. హరిద్రధుడును ఆమెను వివాహమాడెను. ఆ దంపతులును విష్ణుభక్తులై విష్ణుపూజను మాఘమాస స్నానమును మానక చేయుచుండిరి. చిరకాలము సుఖశాంతులతో శుభలాభములతో జీవితమును గడిపి శ్రీహరి సాన్నిధ్యమును చేరిరి , అని వశిష్టుడు మాఘస్నాన మహిమను దిలీపునకు వివరించెను.


*మాఘపురాణం పదహారవ* 

 *అధ్యాయము సంపూర్ణము*


         *🌷సేకరణ🌷*

*న్యాయపతి నరసింహారావు*

🪷14, ఫిబ్రవరి, 2025🪷* *ధృగ్గణిత పంచాంగం*

 *卐ॐ ఓం శ్రీ 🌹 గురుభ్యోనమః ॐ卐*

        *🌹శుక్రవారం🌹*

*🪷14, ఫిబ్రవరి, 2025🪷*   

     *ధృగ్గణిత పంచాంగం*


  *స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం*

*ఉత్తరాయణం - శిశిరఋతౌః* *మాఘమాసం - కృష్ణపక్షం*

*తిథి : విదియ* రా 09.52 వరకు ఉపరి *తదియ*

*వారం    : శుక్రవారం* ( భృగువాసరే )

*నక్షత్రం : పుబ్బ* రా 11.09 ఉపరి *ఉత్తర ఫల్గుణి ( ఉత్తర )*

*యోగం  : అతిగండ* ఉ 07.30 వరకు ఉపరి *సుకర్మ*

*కరణం : తైతుల* ఉ 09.02 గరజి రా 09.52 ఉపరి *వణజి*

*సాధారణ శుభ సమయాలు* 

       *ఉ 09.30 - 10.30 & 05.00 - 06.00*

అమృత కాలం  : *సా 04.13 - 05.57*

అభిజిత్ కాలం  : *ప 11.58 - 12.45*

*వర్జ్యం : శేషం ఉ 07.32 వరకు*

*దుర్ముహూర్తం : ఉ 08.53 - 09.39 మ 12.45 - 01.31*

*రాహు కాలం : ఉ 10.55 - 12.22*

గుళికకాళం : *ఉ 08.01 - 09.28*

యమగండం : *మ 03.16 - 04.43*

సూర్యరాశి : *కుంభం*   

చంద్రరాశి : *సింహం/కన్య*

సూర్యోదయం :*ఉ 06.34* 

సూర్యాస్తమయం :*సా 06.10*

*ప్రయాణశూల : పడమర దిక్కుకు పనికిరాదు*

*వైదిక విషయాలు*

ప్రాతః కాలం          :  *ఉ 06.34 - 08.53*

సంగవ కాలం         :      *08.53 - 11.12*

మధ్యాహ్న కాలం  :      *11.12 - 01.31*

అపరాహ్న కాలం   : *మ 01.31 - 03.50*

*ఆబ్ధికం తిధి        : మాఘ బహుళ విదియ*

సాయంకాలం        :  *సా 03.50 - 06.10*

ప్రదోష కాలం         :  *సా 06.10 - 08.38*

రాత్రి కాలం : *రా 08.38 - 11.57*

నిశీధి కాలం          :*రా 11.57 - 12.46*

బ్రాహ్మీ ముహూర్తం :   *తె 04.54 - 05.44*

_______________________________

        *🌷ప్రతినిత్యం🌷*

       *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


   *🪷శ్రీ లక్ష్మీదేవి కవచం🪷*


*ఇందీవరేక్షణాం కామ కోదండ భ్రువ మీశ్వరీం*

*తిల ప్రసవ సంస్పర్ధి నాసికాలంకృతాం శ్రియమ్*


  *🪷ఓం శ్రీ మహాలక్ష్మీయై నమః🪷*


🌹🪷🌹🌷🛕🌹🪷🌷🌹

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><>


        🌷 *సేకరణ*🌷

      🌹🌿🌹🌹🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🌹🌹🍃🌷

🌹🌷🌹🌷🌹🌷🌷🌹

మాఘ పురాణం - 15 వ

 🕉️🌹🌷🪔🛕🪔🌷🌹🕉️


_*మాఘ పురాణం - 15 వ*_ 

       _*అధ్యాయము*_


🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉


          *జ్ఞాన శర్మ కథ* 

  *🌷(మాఘపూర్ణిమ)🌷*


☘☘☘☘☘☘☘☘☘


గృత్నృమదుడు జహ్నువుతో నిట్లనెను. తపమాచరించు బ్రాహ్మణునకు శ్రీహరి ప్రత్యక్షమయ్యెను , బ్రాహ్మణుడు శ్రీహరికి నమస్కరించి నిలిచి యుండెను. అప్పుడు శ్రీహరి ఓయీ నీవు మరల నారాకను గోరి తపమాచరించితివి యెందులకు ? నీ మనస్సులో నేమియున్నది చెప్పుమని యడిగెను. అప్పుడా విప్రుడు *'స్వామీ ! నాకు పుత్రవరము నిచ్చి సంతోషము కలిగించితివి , నీ మాట ప్రకారము పుత్రుడు కలిగెను , కాని నారదమహర్షి వచ్చి యీ బాలుడు పండ్రెండు సంవత్సరముల తరువాత మరణించునని చెప్పి వెళ్ళెను. నీవిచ్చిన వరమిట్లయినది , నా దుఃఖమును పోగొట్టుకొనగోరి తపమాచరించితినని శ్రీహరికి విన్నవించెను.*


అప్పుడు శ్రీహరి *'ఓయీ ! ఉత్తముడైన నీ పుత్రునకు పండ్రెండవ సంవత్సరమున గండము కలుగుటకు కారణమును వినుము. నీ భార్య పూర్వ జన్మమున చేసిన దోషమే ఇప్పుడీ గండమునకు కారణము. పూర్వజన్మమున గూడ మీరిద్దరును భార్యాభర్తలే అప్పటి నీ పేరు జ్ఞానశర్మ. ఈమె అప్పుడును నీ భార్యయే. ఆమె ఉత్తమశీలము , గుణములు కలిగియుండినది. ఆమె భర్తయగు జ్ఞానశర్మ ఆమెను మాఘమాస వ్రతమును చేయమని చెప్పెను. ఆమెయు అట్లేయని అంగీకరించెను. వ్రతము నారంభించెను. మాఘపూర్ణిమ యందు వ్రతమాచరించి పాయసదానము చేయలేదు. ఆ దోషము వలన నీ భార్యపుత్రవతి కాలేదు. నీవు నిశ్చల భక్తితో మాఘ వ్రతము నాచరించినందున యీ జన్మయందును విష్ణుభక్తి కలిగెను. నేను నీ తపమునకు వరమిచ్చినను గత జన్మలో నీ భార్య మాఘపూర్ణిమనాడు చేయవలసిన పాయసదానము చేయకపోవుట , భర్త చెప్పినను చేయకపోవుటయును రెండు దోషముల వలన పండ్రెండు సంవత్సరముల తరువాత గండమున్నదని నారదుడు చెప్పెను. కావున మాఘమాస వ్రతమునందలి గంగోదక బిందువులతో నీ పుత్రుని తడుపుము. ఇందువలన గండదోషముపోయి నీ పుత్రుడు చిరంజీవియగును.


ఓయీ ! మాఘ స్నానము ఆయువును , ఆరోగ్యమును , ఐశ్వర్యమును యిచ్చును. మాఘస్నానము చేయని వారికి , వారి సంతానమునకు ఆపదలు కల్గును , అధిక పుణ్యములని గత జన్మలలో చేసిన వారికి మాఘమాస వ్రతము నాచరింపవలయునని సంకల్పము కలుగును. మాఘస్నానము సర్వపాపదోషహరము. నేను(శ్రీ హరి) మాఘ మాస ప్రియుడను. మాఘస్నాన మాచరించిన వారు దీర్ఘాయువులు , బుద్దిమంతులు , ఆరోగ్యవంతులు అయి ముక్తినందుదురు. మాఘమాసస్నాన వ్రతము కోరిన కోరికల నిచ్చును. మాఘ వ్రత బ్రహ్మ , శివుడు , లక్ష్మి , పార్వతి , సరస్వతి , ఇంద్రుడు , వశిష్టుడు , జనకుడు , దిలీపుడు , నారదుడు వీరు మాత్రమే బాగుగ తెలిసినవారు. ఇతరులు దాని మహిమను పూర్తిగా నెరుగరు , మాఘవ్రత మహిమ కొంతయే తెలిసినవారు పూర్తిగా తెలియువారు కలరు. దీని మహిమ అందరికిని తెలియదు. నా భక్తులు , మాఘవ్రత పారాయణులు మాత్రమే మాఘవ్రత మహిమనెరుగుదురు. ఎన్నో జన్మల పూర్వ పుణ్యమున్న వారికే మాఘవ్రతము ఆచరింప వలయునను బుద్ధి కలుగును , నీ పుత్రుని మాఘమాస ప్రాతఃకాలమున గంగాజలముతో తడుపుము. వాని గండ దోషము తొలగునని చెప్పి శ్రీహరి అంతర్హితుడయ్యెను.


బ్రాహ్మణుడును శ్రీహరి యనుగ్రహమునకు సంతోష పరవశుడయ్యెను. బాలుని శ్రీహరి చెప్పినట్లుగా మాఘవ్రత గంగాజలముచే తడిపెను , బాలునకును శ్రీహరి దయ వలన గండదోషము తొలగి చిరంజీవి అయ్యెను. మృత్యుభయము తొలగెను. బ్రాహ్మణుడును ఆ బాలునకు మూడవ సంవత్సరమున చూడాకర్మను చేసెను. ఆయా సంవత్సరములయందు చేయదగిన సంస్కారములను చేసి విద్యాభ్యాసమునకై గురుకులమునకు పంపెను. పండ్రెండవ సంవత్సరమున మృత్యుదోషము శ్రీహరి కృపచే మాఘవ్రత మహిమ వలన పరిహారమయ్యెను. ఆ బ్రాహ్మణుడు వాని భార్యా , పుత్రుడు అందరును సుఖ సంతోషములతో కాలము గడిపిరి. ఆ బ్రాహ్మణుడు పుత్రుని గృహస్థుని చేసి యోగ మహిమచే శరీరమును విడిచి శ్రీహరి సాన్నిధ్యమును చేరెను.


జహ్ను మునివర్యా ! మాఘవ్రతమునకు సాటియైనది మరొకటిలేదు. అది శ్రీమన్నారాయణునికి ప్రీతికరము. పాపములను పోగొట్టి పుణ్యమును కలిగించును. మాఘవ్రతము మోక్షమును గూడనిచ్చును. ఈ వ్రతమును అన్ని వర్గముల వారును ఆచరించి యిహలోక సౌఖ్యములను , నిశ్చలమగు హరి భక్తిని పొంది సంసార సముద్రమును తరించి పరలోక సౌఖమును గూడ పొందవచ్చును. ఈ వ్రతము సర్వజన సులభము , సర్వజన సమాచరణీయము అని గృత్నృమద మహర్షి జహ్నుమునికి వివరించెను.


*మాఘపురాణం పదిహేనవ* 

  *అధ్యాయము సంపూర్ణము*


         *🌷సేకరణ🌷*

*న్యాయపతి నరసింహారావు*

వరమై జాతికి మేలొసంగును

 మ.వరమై జాతికి మేలొసంగును సదా పల్గాకులన్ గాంచి దు

ర్భరమౌ వారల నీతి మార్చి సుమతిన్ వర్తింప విజ్ఞానులై,

పరపీడా రతి దుర్గుణాస్పద మసంభావ్యమ్ము నౌనంచు నం

దరి మేలుం గనునట్లు ధర్మ గతి నొందంజే యగా భారతీ!౹౹ 45


ఉ.ఏమని చెప్పినన్ జనులకేమగు? సత్యమటంచు నమ్మ నా

కే మరియాద దక్కునని యీల్గుచు నుందు రసత్య వాదనో

ద్దామముతో నమాయకుల దైన్యములన్ కనిపెట్టి దుర్మదుల్

తామొనరించు ద్రోహము నధర్మము నెన్నగ లేరు భారతీ!౹౹46

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*

*కలియుగాబ్ది 5125*

*శ్రీ శాలివాహన శకం 1946 స్వస్తి శ్రీ    చాంద్రమాన క్రోధి నామ సంవత్సరం ఉత్తరాయణం  - శిశిర ఋతువు - మాఘ మాసం - కృష్ణ పక్షం  - ద్వితీయ - పూర్వాఫల్గుణి -‌‌  భృగు వాసరే* (14.02.2025)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.





.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*

అహోబలపండితీయము

 అహోబలపండితీయము


అహోబలపండితీయము, ఈ గ్రంథాన్ని రాసినకవి గాలి ఓబళయ్య.విచిత్రం ఏమిటంటే ఈయన తన తెలుగు పేరును సంస్కృతీకరించుకొని ప్రభజనం (గాలి )అహోబలుడు (ఓబళయ్య ) గా మార్చుకున్నాడు.ప్రభజనం అహోబలుడు అయ్యాడు ఇతను గుంటూరు జిల్లా బాపట్ల తాలూకా సంతరాపూరు వాస్తవ్యుడును, ఆగ్రామ కరణములలో ఒక్కడై ఉండెను. చిన్నతనమున విద్యావాసనలేక హాలిక వృత్తి (పొలము దున్నువాడు) నుండెను. నియోగి బ్రాహ్మణుడు. భరద్వాజ గోత్రుడు. తండ్రి నరసింహయ్య, తల్లి లక్ష్మీదేవమ్మ. తన ఇంటిపేరు ప్రభంజనవంశ మని అహోబలపండితీయమున ఈతడు వ్రాసుకొనెను. తనతండ్రి మొదలగు కరణములు గ్రామముపై వసూలయిన సర్కారుసొమ్మును హరించి జమీందారుల ఒత్తిడికి పరారుకాగా రాజభటులు ఈతనిని పట్టుకుపోయి ప్రభువు ఆజ్ఞమేరకు కారాగృహమున పెట్టిరి. ఈతడు చదువరి కాకపోయినను పాటలు శ్రావ్యముగా పాడగలవాడైయుండెను. కారాగృహమున ఒకనాడు పాడుచుండగా ప్రభువు మొదలగువారు విని అతనిని పిలిపించి పుట్టుపూర్వోత్తరాలు తెలుసుకొనగా, తనను విడిపించినచో తన మేనమామాగు పోలూరి మాధవసోమయాజులు గారియొద్దకు బోయెదననియు మనవిచేసి వేడికొనెను. మాధవసోమయాజులు గారు జగద్విదుతులు అగుటచే ప్రభువువిని సంతసించి అతనిని విడిపించెను. అంతనాతడు తనతల్లితోగూడ వినుకొండ తాలూకా గోకనకొండ (గోకర్ఞగిరి) గ్రామమునకు మేనమామ ఇంటికి చేరెను. మామగారింట స్త్రీలతోసహా అందరూ సహజ విద్వాంసులగుటచే వారందరు ఈతనితో పరిహాసమాడుటచే, రోషపడి ఇంటినుండి దేశాటనకేగుదనని మామగారికి చెప్పగా వారు వలదని వారించి "నీకొక మంత్రము చెప్పెదను" దానిని జపించుకొను. మని నృసింహ మంత్రమునుపదేశించెను. అంతట నీతడచటగల ఒక కొండ గుహయందు చేరి తపము సేయగా స్వామియొక్క మనుజాకృతిని వచ్చి యేమో నాలుకపై రాసి ఇంటికి బోదమురమ్మని ఒకరాత్రికి ఆతనిని తీసుకువచ్చి, ఇంటివారు తలుపు తీయగా ఆతడు అదృశ్యమాయెను. ఓబళయ్య నాటినుంచి కుశాగ్రబుద్ధికలిగి మామగారి వద్ద విద్యనభ్యసించి పండితుడై నవద్వీపము మొదలగు చోట్ల మిక్కిలి విద్యాభ్యాసము చేసెను. మేనమామనే తనగురువని అహోబలపండితీయములో పేర్కొనెను. శ్రీరామ భక్తుడై "అహోబలపండితీయము" , ' "కవిశిరోభూషణము" అనుపేర నన్నయ భట్టీయం నకు వ్యాఖ్యానం "అభినవ నన్నయసూరి" అని బిరిదుగాంచెను. పిదప ' "కాళిందీపరిణయము" అను ఆరు ఆశ్వాసముల పద్యకావ్యమును వ్రాసెను. ఇది ఆంధ్రసాహిత్యపరిషత్ పత్రికయందు ప్రకటింపబడింది. కాని గ్రంథ అన్యగతహస్తమై గ్రంథపాతమేరపడి మొదటి భాగము పెల్లగింపబడి మగుటంచేసి పీఠిక వృత్తాంతములు తెలియకున్నవి. ' "కాళిందీపరిణయము" మొకటి పద్యకావ్యము 1895 సం. శ్రీ రా.బ.పనప్పాకం అనంతాచార్యులు గారి వలన వైజయంతీ పత్రిక యందు ప్రచురితమయినది.


ఈ కవి తరువాత రాజాశ్రయమున మైదవోలు, నారాయణపురం అను అగ్రహారములు సంపాదించినట్లు తెలియుచున్నది. ఇందు నారాయణపురము వినుకొండ తాలూకా గోకనకొండ సమీపమున గుండ్లకమ్మ ఒడ్డుననుండి ఏటిపోటునకు కొట్టుకుపోయినట్లు చెప్పెదరు. ఈరెండు గ్రామములగూర్చి ఈ కవి తన కావ్యములలో ఉదహరించెను. ఈతడు గోకనకొండ కొండగుహయందు తాను తపస్సు చేసినచోట నృసింహాలయము కట్టించి ప్రతిష్ఠించెను. ఇది ఇప్పటికి ఉంది.

ఈ కవి కాలమును నిర్ణయించుటకు సరైన ఆధారములు లభించలేదు. కాని ఈతని కుమారుడు రామభద్రప్పశాస్త్రులు శా.శ 1670 శుక్లనామ సం. శ్రావణ శు. 15లున శ్రీ రాజా మల్రాజు రామారాయుణుడు గారి వలన వినుకొండ తాలూక ముమ్మడివరము అగ్రహారమును పొందెను. ఇందును బట్టి అహోబిలపండితుడు రమారమి 300 క్రిందటి వాడయి ఉండవచ్చును. ఈ కవి వంశస్థులు ఇప్పటికిని ముమ్మడివరము అగ్రహారమందునారు. ఈ వంశమువారు ముమ్మడివరము, నర్సరావుపేట తాలూక కొణిదెనమజరా మర్లాయపాలెము సంతరావూరు గ్రామమందుకలరు.

సమర్పణ 

మారేపల్లి ఉదయ భాస్కర శర్మ

ఉపవాసం

 సేకరణ 👇

ఉపవాసం మన పూర్వీకులు మనకు ఇచ్చిన ఒక ఆనవాయితీ.. ప్రతిదీ భక్తికి ముడి పెట్టీ మనకు తెలియకుండానే శాస్త్రీయ ఫలితాలను పొందేలా చేసారు..

వివేకానందుడు అన్నట్టు సైన్స్ పెరిగినా కొద్ది హిందుత్వ  లోని గొప్పతనం ప్రపంచానికి తెలుస్తుంది.. 

అందుకు ఈ కింది ఉదాహరణ సరిపోతుంది..


జపనీస్ సెల్ బయాలజిస్ట్ యోషినోరి ఒహ్సుమీ 2016లో మెడిసిన్‌లో నోబెల్ బహుమతిని గెలుచుకున్నారు, కణాలు వాటి కంటెంట్‌ను ఎలా రీసైకిల్ చేస్తాయి మరియు పునరుద్ధరిస్తాయి, ఈ ప్రక్రియను ఆటోఫాగి అని పిలుస్తారు. ఉపవాసం ఆటోఫాగీని సక్రియం చేస్తుంది, ఇది వృద్ధాప్య ప్రక్రియను నెమ్మదిస్తుంది మరియు కణాల పునరుద్ధరణపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది.


కొందరు వ్యక్తులు 24 గంటల కంటే ఎక్కువ కాలం ఉపవాసం ఉంటారు.⌛ఆటోఫాగి అనేది ఒక సహజ ప్రక్రియ, దీనిలో కణాలు విచ్ఛిన్నమై దెబ్బతిన్న లేదా పాత భాగాలను రీసైకిల్ చేస్తాయి. ఇది సెల్యులార్ రీసైక్లింగ్ సిస్టమ్, ఇది కణాలు తమ ఆరోగ్యాన్ని మరియు పనితీరును నిర్వహించడానికి సహాయపడుతుంది.


ఆటోఫాగి కణాలు తమ ఆరోగ్యాన్ని మరియు పనితీరును నిర్వహించడానికి సహాయపడుతుంది. ఇది కణాలు క్యాన్సర్‌గా మారకుండా నిరోధించడంలో సహాయపడుతుంది. ఇది టైప్ 2 డయాబెటిస్ మరియు అల్జీమర్స్ వ్యాధి వంటి పరిస్థితుల నుండి రక్షించడంలో సహాయపడవచ్చు!


ఆటోఫాగి అనేది మీ శరీరంలో అన్ని సమయాలలో జరుగుతుంది కానీ మీరు ఒక్కోసారి అడపాదడపా ఉపవాసం చేసినప్పుడు, ప్రక్రియ త్వరగా జరుగుతుంది - కాబట్టి గుర్తింపు పొందిన వైద్యుడిని సంప్రదించండి. వ్యాయామం లేదా కీటోజెనిక్ ఆహారం ద్వారా కూడా ఆటోఫాగిని ప్రేరేపించవచ్చు

Copy paste

పూర్వజన్మలో

 పూర్వజన్మలో మనకు గల ఋణాను బంధాలు...!

ఇతరులతో పూర్వజన్మలో మనకు గల ఋణాను బంధాలు తీర్చుకోవడానికే ఈ జన్మలో భార్యగా, భర్తగా, సంతానంగా, తల్లిదండ్రులుగా, మిత్రులుగా, నౌకర్లుగా, ఆవులు, గేదెలు, కుక్కలు ఇలా ఏదో ఒక రకమైన సంబంధంతో మనకి తారస పడుతుంటారు...

ఆ ఇచ్చి పుచ్చుకునే ఋణాలు తీరగానే దూరమవడమో, మరణించడమో జరుగుతుంది. ఈ విషయాన్ని మనం చక్కగా అర్థం చేసుకో గలిగితే మన జీవిత కాలంలో మనకి ఏర్పడే సంబంధాల మీద మోజు కలుగదు. 

ఇతర జీవులతో మన ఋణాలు ఎలా ఉంటాయి అంటే...

మనం పూర్వ జన్మలో ఒకరి నుంచి ఉచితంగా ధనం కానీ, వస్తువులు కానీ తీసుకున్నా, లేదా ఉచితంగా సేవ చేయించుకున్నా ఆ ఋణం తీర్చుకోవడానికి ఈ జన్మలో మన సంపాదనతో పోషించబడే భార్యగా, సంతానంగా, మనతో సేవ చేయించుకునే వారి గాను తారసపడతారు.

ద్వేషం కూడా బంధమే, పూర్వజన్మలో మన మీద గల పగ తీర్చుకోవడానికి మనల్ని హింసించే యజమానిగా లేదా సంతానంగా ఈ జన్మలో మనకి వారు తారసపడవచ్చు...

మనం చేసిన అపకారానికి ప్రతీకారం తీర్చుకోవడానికి ఈ జన్మలో శత్రువులుగానో, దాయాదులుగానో, ఏదో ఒక రకంగా మనకు అపకారం చేసే వారిగా ఎదురవుతారు.

మనం చేసిన ఉపకారానికి బదులుగా ఉపకారం చేయడానికి ఈ జన్మలో మిత్రులుగానో, సహాయకులు గానో ఎదురవుతారు...


ఉదాహరణకు ఒక జరిగిన కథ...

కొల్లూరు లోని మూకాంబికా తల్లి ఆలయం దగ్గర అడుక్కునే ఒక కుంటి బిచ్చగాడు ఉదయం ఆరు నుంచి రాత్రి పది గంటల దాకా గుడి పక్కన బిచ్చం అడుక్కుంటూ ఉండేవాడు. ఆ వృత్తిలో నెలకి పదివేలకు పైనే సంపాదించేవాడు. కానీ తను సౌకర్యవంతమైన జీవితం గడిపితే బిచ్చం వేయరని సాధారణ జీవితం గడుపుతూ, రోడ్డు పక్కన ఎవరి పంచలోనో పడుకుంటూ, మూకాంబికా తల్లి ఆలయంలో పెట్టే ఉచిత భోజనాన్ని తింటూ, చిరిగిన దుస్తులు ధరిస్తూ ఉండేవాడు.

తన సంపాదనతో ఇద్దరి కొడుకులను ఎం.బీ.బీ.ఎస్ చదివిస్తున్నాడు.


ఒకసారి మూకాంబికా తల్లి దర్శనానికి వచ్చిన ఒక మహానుభావుడు ఆ బిచ్చగాడిని చూసి ఇలా చెప్పాడు. 

పూర్వజన్మలో ఇతను ఇద్దరు వ్యక్తుల దగ్గర డబ్బులు తీసుకుని, వాళ్లు చాలా బాధలో ఉన్నప్పుడు ఇతను, ఇవ్వగలిగే స్థితిలో ఉండి కూడా ఇవ్వలేదు.అందుకే ఈ జన్మలో తాను కష్టపడి సంపాదిస్తూ వున్నా, తాను బాధలు పడుతూ, వాళ్లను చదివిస్తూ వాళ్ల రుణాన్ని తీర్చుకుంటున్నాడు. అని.. 

అంతే కాక మనకు తెలిసి తెలియక చేస్తున్న చిన్న చిన్న తప్పులు కూడా మనకు బంధాలు అవుతాయని నిరూపించే ఒక కథ...

ఒకసారి మహర్షి బస చేసిన అతిథిగృహం బయట ఉన్న చెత్తకుండీలో తిని పారేసిన విస్తరాకులు కోసం అనాథ బాలలు వీధి కుక్కలతో పోట్లాడుతున్నారు. అది చూసిన కొందరు భక్తులు బాధగా స్వామిని అడిగారు, స్వామి ఈ దారుణ పరిస్థితికి కారణం ఏమిటి అని. 

ఈ పిల్లలంతా వారి గత జన్మలో ఆహార పదార్థాలను అధికంగా దుర్వినియోగం చేశారు, అందుకని వారు ఈ జన్మలో ఆహారం కోసం పరితపిస్తున్నారు, అని స్వామి జవాబు చెప్పారు.

నీటిని దుర్వినియోగం చేస్తే ఎడారిలో పుడతారు. ఏ వనరులను దుర్వినియోగం చేసినా దాని ఫలితాన్ని తప్పక అనుభవించాల్సి ఉంటుంది అన్నారు మహర్షి...

ఒకమారు శ్రీ విద్యా ప్రకాశానందగిరి స్వామి వారు బందరుకి వెళ్తూ గురువైన శ్రీ మలయాళ స్వామి వారి అనుమతి తీసుకుని వెళుతూ ఉంటే, ఆయన వెనక్కి పిలిచి నీ చేతి సంచి ఏది అని అడుగుతే, పక్కనున్న మిత్రుడి చేతిలో ఉంది అని చెబుతారు. అప్పుడు మలయాళ స్వామి వారు నువ్వు మోయగలిగి ఉండి, ఈ జన్మలో నీ మిత్రుడు చేత సంచీని మోయిస్తే వచ్చే జన్మలో నువ్వు అతని బియ్యం బస్తాను మోయాల్సి ఉంటుంది అన్నారు.

ఇలాంటివి మనము తెలిసి తెలియక చాలా చేస్తూ ఉంటాం, మనం ఇతరుల నుంచి మొహమాటం చేతనో, మర్యాదకో, కృతజ్ఞత గానో, గౌరవంతోనో లేదా మరే ఇతర కారణాల ద్వారానో ఉచితంగా స్వీకరించిన వన్నీ కర్మ బంధాలై జనన మరణ చక్రంలో మనల్ని బంధిస్తాయి...

కొత్త వాళ్ల నుంచి పెన్ను లాంటి వస్తువులను తీసుకోవడం, మన పెట్టె లాంటివి మోయించడం, పక్క వాళ్ళు షాప్ కి వెళ్తుంటే నాకు ఫలానాది తీసుకురా అని చెప్పడం, ఇలాంటివి అనేక సందర్భాల్లో ఇతరుల సేవలను ఉచితంగా తీసుకుంటాం.

అవి కర్మ బంధాలవుతాయి అని తెలియక మన జీవితకాలంలో చేసే ఇలాంటి వేలకొద్దీ కర్మబంధాల్లో చిక్కుకుపోతుంటాము... 

ఆరడుగుల తాచుపాము విషం ఎంత ప్రమాదకరమో, అలాగే అంగుళం తాచుపాము విషం కూడా అంతే ప్రమాదకరం,అలాగే కర్మ ఎంత పెద్దదైనా, చిన్నదైనా దాని ఫలితం దానికి ఉండి తీరుతుంది తప్ప మాయం కాదు.