🙏 *మనుషుల్లో దేవుళ్ళు*🙏
➖➖➖
*ఆయన ఆ అర్ధరాత్రి పడుకుని పది నిమిషాలు కూడా కాలేదు, ఒక యువకుడు వచ్చి తలుపు తట్టాడు… 'సార్, ఒక గర్భిణి ప్రసవవేదన పడుతోంది, దయచేసి రండి. ఆమెను మీరే కాపాడాలి.”*
*'70 ఏళ్ళ క్రిందటి రోజుల్లో మహరాష్ట్రలో మారుమూల గ్రామంలో ఒక డాక్టరు ఆయన. వెంటనే వెళ్ళాడు. ఆ యువతికి 19 లేదా 20 ఏళ్ళుంటాయంతే. ప్రసవం చాలా కష్టమయ్యింది. కొన్ని గంటలపాటు ఆయన వైద్యం చేశాడు. ఆ రాత్రి తెలవారుతుండగా, ఆమె డాక్టరు చెయ్యిపట్టుకొని ఇలా అనింది దీనంగా.. 'డాక్టరు గారూ నన్ను బ్రతికించవద్దండి, చంపేయండి. నేను పేదరాలిని, భర్త వదిలేసాడు, పుట్టబోయే బిడ్డను సాకలేను'.*
*ఆయన కదిలిపోయాడు… 'అమ్మా!మేమున్నది బ్రతికించడానికి, చంపటానికి కాదు.’*
*'ప్రసవం జరిగింది, ఆడపిల్ల పుట్టింది. ఆనందించాలో, బాధపడాలో ఆ యువతికి అర్థం కాలేదు. ఆయన అన్నాడు… 'అమ్మాయీ, భయపడవద్దు. నేను నీ దగ్గర ఫీజు ఏమీ తీసుకోను, నేనే నీకు వంద రూపాయలిస్తున్నా. దగ్గర్లో వున్న పూణే కి వెళ్ళి అక్కడ Nursing college లో ఒక గుమాస్తాను కలువు. నేను పంపానని చెప్పు.'*
*ఆమె వెళ్ళింది. ఫలనా డాక్టరు పంపారు అని చెప్పగానే, వాళ్ళు ఆమెను చేర్చుకుని Training ఇప్పించి, 8 నెలల తరువాత ఉద్యోగం కూడా ఇచ్చారు.*
*25 ఏళ్ళు గడచిపోయాయి. ఆ డాక్టరు Senior Professor అయ్యాడు. ఒక University వాళ్ళు విద్యార్థులకు పట్టాలు, బంగారు పతకాలు ప్రధానం చేసే కార్యక్రమానికి డాక్టరు గారిని ఆహ్వానించారు. అది పూర్తి అయ్యింది. 'చంద్రా' అనే ఒక యువతి వచ్చి డాక్టరును కలిసి తన ఇంటికి రావాల్సిందేనని పట్టుబట్టింది.*
*స్వతహాగా సున్నిత మనసున్న ఆయన వెళ్ళాడు. అక్కడ నడివయసులో వున్న ఒకామె డాక్టరుకు 'టీ' ఇస్తూ తమది ఒక పల్లె అని, తమ కుటుంబానికి సంబంధిన వివరాలు చెపుతుండగా, ఆయన ఆలోచనలు వెనక్కి వెళ్ళాయి. ఇంతలో హఠాత్తుగా ఆమె, ఆ యువతి డాక్టరు కాళ్ళకు నమస్కారం చేసారు.*
*'ఏమిటమ్మా ఇది ?' అని ఆయన అడిగితే 25 ఏళ్ళక్రితం ఓ అర్ధరాత్రి మీరే నన్ను కాపాడారు, దిక్కు లేని నా పేద జీవితానికి దారి చూపారు. ఆ ఆర్ధరాత్రి పుట్టిన ఆడపిల్లనే ఈ అమ్మాయి,' అని ఆమె కన్నీళ్ళు కారుతుండగా ఆయనతో చెపుతూ, మీరే మాకు దేవుడు. మీ పేరునే ఈ పాపకు పెట్టాను 'చంద్ర’ అని. అంతేకాదు, త్వరలో మేము పేదలకోసమని ఉచిత ఆసుపత్రి ప్రారంభించబోతున్నామని దానికి కూడా మీ పేరునే పెడ్తున్నాం.' అని చెప్పారు.*
*అది విన్నాక, ఈసారి కన్నీరు పెట్టడం డాక్టరు వంతు అయ్యింది.*
*ఇంతకీ ఆ డాక్టరు ఎవరో తెలుసా ?*
*ఇన్ఫోసిస్ కు చెందిన శ్రీమతి సుధా మూర్తి గారి తండ్రి అయిన Dr రామచంద్ర కులకర్ణి గారు*
🙏🌹🙏🌹🙏🌹
👉*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*