4, మార్చి 2024, సోమవారం

మహాభారతం

 శ్రీమదాంధ్ర మహాభారతం లోని కొన్ని అద్భుతవిషయాలు -  118      .            .    

అరణ్యపర్వం -  పంచమాశ్వాసం. 


‘ మానవశరీరంలో ధాతువుల వలన అగ్ని యెలా ప్రజ్వరిల్లుతుందో దయచేసి చెప్పగలవా ? '  అని అడిగిన కౌశికునికి  ధర్మవ్యాధుడు చెబుతున్నాడు : 


" ఓ మునీశ్వరా !  ధాతువులు అనగా మనిషి జీవించడానికి ఆధారమైన పదార్ధాలు.   అవి ఏడువిధాలు.   వస, అసృక్కు, మాంసము, ఆస్థి, స్నాయువు,  మజ్జ, శుక్రము. 


పంచప్రాణాలు అనగా ప్రాణ, అపాన, ఉదాన, వ్యాన,  సమాన వాయువులు.  ఇవి  వాయురూపంలో ఉంటాయి.   ఆత్మాగ్ని మనిషి నాభినుండి శిరస్సు వరకూ వ్యాపించి వుంటుంది.  అన్నిప్రాణులకూ జీవత్వాన్ని  ప్రసాదించేది ఆ అగ్నియే.  అపానవాయువు ప్రాణికి తోడుగా  పొత్తికడుపు- మలద్వారం మధ్య అగ్నిని ప్రజ్వరిల్లిస్తూ వుంటాడు.    ఇక ఉదానవాయువు కంఠం వద్దవుండి పదార్ధాలు తేలికగా శరీరం లోనికి  ప్రవేశించడానికి దోహద పడుతుంది.  వ్యానవాయువు కండరాల మధ్యలోవుండి వాటి కదలికకు సహకరిస్తుంది. 


సమానవాయువు నాభిప్రదేశంలో వుండి ఆహార పదార్ధాలు జీర్ణమయ్యేటట్లు చేసి, ధాతువులను వృద్ధిపరుస్తూ ఉంటుంది.   సమానవాయువు పాత్ర ఆత్మాగ్నికి  ప్రాణ అపాన వాయువులకు సహకరించడం లో అతి ముఖ్యమైనది.   ఈ ప్రాణాగ్నియే జీవాత్మ.   జీవాత్మ తామరాకుమీద నీటిబొట్టులాగా దేహంలో నిర్లిప్తమై వుంటుంది. .అచేతనమైన దేహానికి చైతన్యాన్ని యిచ్చే  ఈ జీవాత్మయే అద్వైత సిద్ధాంతంలో పరమాత్మ.  


అందువలననే జ్ఞానాన్ని సంపాదించిన మహానుభావులు అన్ని విషయాలలో నిర్లిప్తులుగా వుంటారు.  అలాంటి మహానుభావులు యోగసాధన చేస్తూ మితాహారులై  ఇంద్రియాలను నిగ్రహించి ఆత్మలో పరమాత్మను దర్శించి నిశ్చలమైన జ్యోతిలాగా ప్రకాశిస్తూ వుంటారు. 


కాబట్టి మునీంద్రా !  అలాంటి దశకి చేరుకోవాలంటే, కామక్రోధాలను పూర్తిగా విడిచిపెట్టాలి.   మానవుడు  కర్మలను చేస్తూ కర్మఫలాన్ని కోరుకోకుండా భగవదర్పణ చేస్తూ  వేదాంతివలే జీవించాలి.   


అని చెబుతూ ధర్మవ్యాధుడు తనకు తెలిసినంతవరకూ చెప్పాననీ, ఇంకాఏమైనా తెలుసుకోవాలని ఉన్నదా ! అని అడిగాడు.  దానికి కౌశికుడు  తాను విన్న విషయాలతో తృప్తి చెందానని చెబుతూ, ధర్మవ్యాధుని సర్వజ్ఞత్వాన్ని ప్రశంశించాడు.


ధర్మవ్యాధుడు కౌశికుడు చెప్పిన దానికి పొంగిపోకుండా,  ' మహర్షీ !  నేను ఏకొంచెము తెలుసుకున్నా దానికి కారణం ఒకటి వున్నది.  అదేదో మీరే కళ్లారా చూద్దురుగాని రండి. ' అని కౌశికుని తన గృహం అంతర్భాగం లోని  తల్లిదండ్రుల  గదిలోకి తీసుకువెళ్ళాడు. 


ఆ గదిలో గాలీ వెలుతురూ పుష్కలంగా వస్తున్నది.  అతని తల్లిదండ్రులు ఆ సమయంలో తృప్తిగా భోజనం చేసి భుక్తాయాసంతో విశ్రమిస్తూ వున్నారు.  ధర్మవ్యాధుడు వారికి నమస్కరించి వాళ్ళ యోగక్షేమాలను విచారించాడు.   అతని తల్లిదండ్రులు, '  నాయనా ! నీలాంటి కుమారుడు వుండగా మాకేమిలోటు ?  నువ్వు ధర్మమూర్తి అవతారం లాగా మమ్మల్ని  రక్షిస్తున్నావు.  నీకు ఆ ధర్మమే రక్షణ యిస్తుంది.   మాతాపితరుల సేవలో నువ్వు పరశురాముడినే మి౦చిపోయావు.  '  అని వాత్సల్యంగా ధర్మవ్యాధుని దగ్గరకు తీసుకున్నారు. 


ఆ తరువాత ధర్మవ్యాధుడు కౌశికునికి తన తల్లిదండ్రులను పరిచయం చేస్తూ,  ' ఓ కౌశికమునీంద్రా ! నేను నా తల్లిదండ్రులకు సేవలు చెయ్యడం వలననే నాకీ జ్ఞానం అబ్బింది.  అందరూ కోరికలు తీర్చమని దేవతలను పూజిస్తే, నేను మాత్రం నా తల్లిదండ్రులని పూజిస్తాను. వారే నాకు ప్రత్యక్ష దైవాలు.  నా భార్యాపిల్లలూ, అందరమూ మా తల్లిదండ్రులకు ప్రీతితో సేవలుచేస్తూ వుంటాము.  అదే మాకు యజ్ఞం. అదే మాకు వేదసూక్తి.   పుణ్యం ఆర్జించడానికి ప్రతి గృహస్థూ, తల్లిదండ్రులను, గురువును, అగ్నిని, ఆత్మ అనే అయిదుగురిని సంతోషపెట్టాలి.  


' మునీంద్రా !  ఆ పతివ్రత పంపగా నువ్వు నా దగ్గరకు జిజ్ఞాసువుగా వచ్చావు.  నాకు తెలిసిన విషయాలు చెప్పాను. అయినా నీలో ఏదో అసంతృప్తి కనబడుతున్నది.  దానికి కారణం యేమిటో కూడా నేను తెలుసుకోగలిగాను.  నువ్వు నీ తల్లిదండ్రులకు ఒక్కడివే కుమారుడవు.  వారు ఇప్పుడు మిక్కిలి వృద్ధులై వున్నారు.  వారి అనుమతి తీసుకోకుండా నువ్వు  వేదాధ్యయనం చేసి తరించాలని అనుకున్నావు.   వారు నీకోసం ఏడ్చి ఏడ్చి అంధులైనారు.   వారి వద్దకువెళ్లి వారి సేవలుచేసి తరించు.  తల్లిదండ్రులను దుఃఖపెట్టి నువ్వు ఎన్నిచదువులు చదివినా అవి వ్యర్థం . '  అని నిర్ద్వందంగా చెప్పాడు ధర్మవ్యాధుడు కౌశికునికి . 


కౌశికుడు ఆ మాటలకు ఏమాత్రం నొచ్చుకోకుండా, అహంకార వర్జితుడై, '  ధర్మవ్యాధా !  నీవు చెప్పినవన్నీ యదార్ధాలు.  నా కళ్ళు తెరిపించావు. నా శేషజీవితాన్ని తల్లిదండ్రుల సేవలో గడిపి నా జన్మధన్యం చేసుకుంటాను.  ఇప్పుడు నా మనసెంతో సంతోషంగా వున్నది.  అయితే, నీ మాటలు వింటుంటే నాకు ఆశ్చర్యం వేస్తున్నది.  ఇంతటిజ్ఞానివి నువ్వు యే కారణం చేత ఈ బోయకులములో జన్మించావు ?  తెలుసుకోవాలని వున్నది. దయచేసి వివరించు. '   అని ధర్మవ్యాధుడు అడిగాడు. 


ధర్మవ్యాధుడు తన పూర్వజన్మ వృత్తాంతాన్ని చెప్పసాగాడు.


స్వస్తి  .  

కవిత్రయం  అనుగ్రహంతో, మరికొంత రేపు. 

ప్రేమతో,

గండవరపు  ప్రభాకర్.

బ్రాహ్మణుల ఇళ్లకు

 *బ్రాహ్మణుల ఇళ్లకు ఉచితంగా భోజనము ఏర్పాటు*  



గమనిక : ఉదయం 7 లోపు మీరు మెసేజి పెట్టాలి .. . ఉదయం 11 నుండి అన్నదానం మొదలు అవుతుంది. 



 మా సంస్థ నుండి మీ ఇంటికి టూ వీలర్ బుక్ చేసుకోవాలి , లేదా వచ్చి తీసుకు వెళ్ళవచ్చు. 


పేరు గోత్రము, చిరునామా, వృత్తి మరియు ఏ కారణం చేత మీరు భోజనం అడుగుతున్నారు అనేది తెలియ చెయ్యాలి. 


*మా వాట్సాప్ నంబర్ : 9701609689*



చట్నీ, చారు, పప్పు, కూర , అన్నం పంపబడును ... ఇంట్లో చేసుకునే వసతి లేనపుడు, ఇబ్బంది పడే పరిస్థితి ఉన్నపుడు దయచేసి మాకు తెలియ చెయ్యండి .. పెరుగు మీరు అక్కడే తీసుకుంటే సరిపోతుంది. 


*గ్లోబల్ బ్రాహ్మిణ్స్ వెల్ఫేర్ అసోసియేషన్* 

బర్కత్ పురా, హైదరాబాద్...

మహాశివరాత్రి పూజలు*

 *మహాశివరాత్రి పూజలు*


ఇంకొక వారమే ఉన్నది మహాశివరాత్రి పర్వదినాన్న ఈశ్వరుని పూజించడానికి. అంటే శోభకృత్ సంవత్సర మాఘ మాసంలో అనగా ఈ నెల మార్చి 8 న మహాశివరాత్రి వ్రతపూజను జరుపుకోబోతున్నాం. అసలు మహాశివరాత్రి ఎందుకు ఎలా ఏ సమయంలో ఆచరించాలన్నదాన్ని క్షుణ్ణంగా తెలుసుకొందాం. 


మీ అందరికి నేను చెప్పబోయే పురాణ కథ తెలిసేయుండగలదు. పూర్వము బ్రహ్మ విష్ణువుల మధ్యలో దేవతల్లో ఎవరు గొప్ప అని ఓ పెద్ద వాగ్వివాదం జరిగింది, నువ్వు నేను అని ఎడతెగక సాగింది. ఆ సమయాన్న భూమి నుండి దేద్దీప్యమానమైన ఓ వెలుగు పైకి విరజిమ్మింది. అది ఒక కోటి సూర్యకాంతులను మించి తన కిరణాలను ప్రసరింపజేసింది. తన ఆద్యంతమును వీక్షించినవారే సర్వశ్రేష్ఠమైన భగవంతుడిగా పరిగణింపబడతారు అన్న ఓ సవాలును విసిరింది. 


బ్రహ్మదేవుడు శిఖరాగ్రమును దర్శించుటకు ఉపక్రమించగా విష్ణువు అతల పాతాళమునకు చొచ్చుకొంటూ వెళ్ళి ఆ వెలుగు యొక్క అంతాన్ని చేధించడానికి బయలుదేరారు. కాని ఎంత ప్రయత్నించినా వాళ్ళిద్దరికీ అంతు చిక్కని అయోమయ పరిస్థితి, ఇక చేసేదిలేక వెనుదిరిగారు. నా ఆద్యంతాల్ని కనుక్కున్నారా అని ఆ కాంతి కిరణం ప్రశ్నించడంతో విష్ణువు తన అసమర్థ్యాన్ని బహిరంగంగా అంగీకరించారు. కాని బ్రహ్మదేవుడు తన అశక్తతతను వెలిబుచ్చడానికి అహం అడ్డురావడంతో తను శిఖరాగ్రం దాకా వెళ్ళి కనుక్కోగలిగానని ప్రగల్భాలు పలికారు. 


వెనువెంటనే ఆ ప్రజ్వలించే వెలుగు నుండి ఈశ్వరుడు ఓ పెద్ద విస్ఫోటనంతో అండపిండ బ్రహ్మాండాలన్నీ దద్దరిల్లే విధంగా అర్ధరాత్రి సమయాన్న బయటకు విచ్చేసి (ఇదే మొట్టమొదటి లింగోద్భవం) తను అబద్ధాలు పలకడంతో పంచముఖ బ్రహ్మదేవుడి ఒక శిరస్సును ఖండించి చతుర్ముఖోన్నుడిగా గావించారు. విష్ణువు నిజాయితీకి సన్మానించారు. బ్రహ్మ విష్ణువులు ఈశ్వరుడికి ప్రణమిల్లి తానొక్కడే జగమంతటికి పరమాత్మయని అంగీకరించారు. 


ఇలాంటి లింగోద్భవం మాఘ మాస కృష్ణ చతుర్దశి నాడు అవిర్బవించడంతో ఆ మహా పర్వదినాన్ని జగత్తంతా మహాశివరాత్రిగా జరుపుకొను ఆనవాయితీ. ఈ మహాశివరాత్రి రోజునే ఈశ్వరుడు ఓ కోట్ల సూర్యుల కాంతులతో వెలుగుచిమ్మి అందరికీ తన దర్శన భాగ్యం కలిగించారు. అందువల్ల శివరాత్రి నాడు ఈశ్వరుడు మొట్టమొదటి సారిగా లింగాకారం నుండి ఆవిర్భవించి తన అసలు రూపాన్ని లోకానికి తెలియజేసారు. అదియును కాకుండా ఎవరైతే తనను ఇలాంటి పర్వదిన నడిరేయిన అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారో వారినందరిని తప్పక అనుగ్రహించి వారి కోర్కెలెల్ల తీరుస్తానని దీవించారు. ఇప్పుడు మనం మహాశివరాత్రి పర్వదినాన్ని ఏ విధంగా ఆచరించి ఈశ్వరుడికి ప్రీతిపాత్రులగుదుమో తెలుసుకొందాం. 


ఈ సంవత్సరం మహాశివరాత్రి మార్చి 8 న అంటే రాబోవు శుక్రవారమున రానున్నది. ఆ రోజు ఒక్క పూటనే అంటే మధ్యాహ్నం వేళ మాత్రమే భోజనం గావించి ఉపవాసానికి ఉపక్రమించాలి. ఆ నాటి సూర్యాస్తమన సమయాన్న స్నానమాచరించి పట్టు వస్త్రాలు ధరించి శివపూజకు కావలసిన సరంజామాను క్రోడీకరించుకొని అంటే శివలింగం లేదా ఈశ్వరుడి చిత్రపటము, పుష్పాలు, దీపాలు, పండ్లు, అగరబత్తులు, చందనకుంకుమ అక్షింతలు, కర్పూరాలను సమకూర్చుకొని పూజను మొదలుపెట్టవలెను. శివలింగం ఉన్నట్లయితే ఓ పీఠంపై ఉంచి అభిషేకానికి సన్నద్ధం కావలె. చిత్రపటము మాత్రమే ఉన్నట్లయితే అభిషేకం చేయలేము. కనుక తగురీతిన పుష్పాలతో అలంకరించవలె. 


మార్చి 8 న సూర్యాస్తమన కాలం నుండి మార్చి 9 ఉదయాన్న సూర్యుడు ఉదయించే సమయం దాకా ఈ శివరాత్రి పూజలు 4 మార్లు కొనసాగవలెను. దీనినే ప్రహర పూజ మరియు యమ పూజ అని అందురు. అది ఏంటో చూద్దాం. మార్చి 8 న సూర్యుడు 6.30 కు అస్తమించి మార్చి 9 న పెందరాళే 6.30 కు ఉదయించిన యెడల ఈ పండ్రెండు గంటల సమయం శివ పూజ చేయవలయును. ఈ 12 గంటలను 4 ప్రహరాలుగా విభజించినచో ఒక్కొక్క ప్రహరానికి 3 గంటల సమయం కేటాయించినట్టే కదా. ఒక్కొక్క ప్రహరంలో శివ పూజ కావించి తదుపరి ప్రహరంలో మరల పునఃప్రారంభించవలెను. అంటే మార్చి 8 న సాయంత్రం 6.30 నుండి 9.30 దాకా మొదటి ప్రహర పూజ గావించి రెండవ ప్రహర పూజ రాత్రి 9.30 నుండి 12.30 దాకా చేయవలెను. అలాగే 12.30 నుండి 3.30 దాకా మరియు 3.30 నుండి ఉదయం 6.30 దాకా. ఒక్కొక్క ప్రహరంలో పూజాభిషేకాదులు పూర్తిచేసి తదుపరి ప్రహర పూజను అలాగే కొనసాగించడానికి పూనుకోవలెను. అలా వేకువజామున 6.30 దాకా 4 సార్లు. గంధపు తైలం, పంచగవ్యం (అనగా పాలు, పెరుగు, నెయ్యి, గోమూత్రం, ఆవుపేడలతో తయారయినది), పంచామృతం, నెయ్యి, పాలు, పెరుగు, చెరకు రసాలు, పళ్ళరసాలు (అంటే ఆరెంజు, మౌసాంబి, నిమ్మకాయలతో తయారయినది), కొబ్బరి నీళ్ళు, చందనపూత, విభూతి మరియు స్వచ్ఛమైన జలాలతో అభిషేకాన్ని కొనసాగించవలెను. ఇవన్నియు సమకూరని పక్షంలో లభ్యమైన సామగ్రీలతో అభిషేకం చేయవలెను. 


ఒకవేళ శివలింగం కాకుండ ఈశ్వర చిత్రపటమే ఉన్నట్లయితే అభిషేకం చేయలేము కదా. అలాంటి సమయంలో ఈ సామగ్రీలనంతటిని చిత్రపటము ముందుంచి ఒక్కొక్క పుష్పముతో ఆయా సామాగ్రిన ముంచి దేవుని పటము ముందు ఉంచవలెను. పూజాభిషేకములు చేస్తున్నప్పుడు రుద్రచమకాలను పటించడం కాని లేదా ఏదైనా ఈశ్వర తత్త్వాలను బోధించే మంత్రాలు గాని పటించవచ్చు. ఇవన్నియు వీలుకాని యెడల కేవలం ఈశ్వర పంచాక్షరి అయినటువంటి ఓం నమశ్శివాయతో 108 సార్లు పూజచేయొచ్చు. లేదా ఇతరత్రా శివ అష్టోత్తరం శతనామావళి గాని సహస్ర నామావళిని గూడా పటించగలం. ప్రతి నామానికి బిల్వ దళాలతో గాని ఇతర పుష్పాలతో గాని పూజలు చేయగలం. ఆ తరువాత ధూపదీపనైవేద్యాలతో కొబ్బరి ఫలాలను సమర్పించి పూజను ముగించి ప్రసాదాన్ని అక్షింతలను సమర్పించగలం. ఇది మొత్తం ఒక్క సారి ఒక్క ప్రహర పూజ గురించి. ఇలా 4 సార్లు పొద్దున దాకా.


ఒక వేళ ఇలా నాలుగు ప్రహరాలలో పూజలు వీలుకాని యెడల కనీసం ఒక సారి అంటే లింగోద్భవ కాలంలో చేయగలం. లింగోద్భవ కాలం యన్నది ఈశ్వరుడు ఆ ప్రజ్వల కాంతి నుండి దర్శనం ఒసంగిన కాలమన్నట్టు. శివరాత్రి పర్వదినాన్న లింగోద్భవ కాలమన్నది అర్ధరాత్రము, ఆ సమయం ఆయా ఊర్లలో ఆసన్నమయ్యే సమయాన్ని గూగుల్ సౌజన్యంతో గాని దృక్పంచాంగం ద్వారా గాని తెలుసుకోగలం. ఈ సమయాన్నే ఈశ్వరుడు పృథ్వీన ప్రతి శివలింగం నందు ప్రతి చిత్రపటము నందు రూపందుకలడని ప్రతీతి. 

   

ఇది కూడా వీలుకాని పరిస్థితుల్లో ఆ సమయంలో ఈశ్వర దేవాలయాన్ని సందర్శించి వారి పూజల్లో పాలుపంచుకొని రాత్రంతయు జాగారం చేసి ప్రొద్దునే తమతమ స్వగృహాలకు వెనుదిరగగలం.


ఇలా కూడా వీలు కాని యెడల ఇంట్లోనే జాగారం చేసి రాత్రంతయు ఈశ్వర నామాలను గాని లింగాష్టక బిల్వాష్టకాలను గాని పటించవలెను. లేదా ఓం నమశ్శివాయ మంత్రం ఒక్కటే చాలన్నట్టు, శివరాత్రి వ్రత పూజను పూర్తిగా చేసి ఫలితాలను పొందినట్టే. 


మార్చి 9 న ఉదయాన్నే సూర్యోదయమైన తర్వాత ఉపవాసాన్ని విరమించగలం. రాత్రంతయు జాగారం చేయడం మాత్రం అత్యవసరం. మరుసటి రోజు అంటే మార్చి 9 న రాత్రి దాకా మరల కునుకు తీయరాదు. ఒకవేళ ఆరోజు కార్యాలయాలకు వెళ్ళవలసినట్లయితే మీరు సొంత వాహనాన్ని నడుపకుండా ప్రభుత్వ వాహనాలలో పయనించి తగు జాగ్రత్తలు తీసుకోవలెను. 

 

ఇవన్నియు పాటించి మహాశివరాత్రి పర్వదినాన్ని ఈశ్వర పూజలతోను జాగారంతోను గడిపి ఈశ్వరానుగ్రహం పొందగలరని ఆకాంక్షిస్తున్నాను.

Panchaag


 

అలమటించేవాడు

 💎🌅  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 *_𝕝𝕝ॐ𝕝𝕝 సుభాషితమ్ 𝕝𝕝卐𝕝𝕝_* 💎


శ్లో𝕝𝕝.      

*పూర్ణే తటాకే తృషితః సదైవ*

*భూతేపి గేహే క్షుధితః స మూఢః౹*

*కల్పద్రుమే సత్యపి వై దరిద్రః*

*గుర్వాదియోగేేఽపి హి యః ప్రమాదీ॥*


భావము - 


*సద్గురువును కలుసుకున్నప్పటికీ తిరిగి తప్పులు చేసే మూఢుడు* ఎలాంటి వాడంటే, నిండు చెరువు దగ్గర ఉన్నా దాహంతో ఉండేవాడు, సొంత ఇల్లు ఆస్తిపాస్తులు ఉన్నప్పటికీ ఆకలితో అలమటించేవాడు, మరియు కల్పవృక్షం తన వద్ద ఉన్నప్పటికీ పేదవాడు.....

పాఠకులకు

 

మనబ్లాగు అనేక దేశాల తెలుగు వారు చూస్తున్నారని తెలుపుటకు సంతోషితున్నాను. ఒక్కొక్క రోజు భారత దేశంలో వీక్షకులకన్నా ఎక్కువగా అమెరికా, కెనడా, ఫ్రాన్సు దేశంల నుండి ఉండటం ముదావహం. కాగా నిత్యం అనేక విషయాలను గురించి నేను పోస్టులు పెడుతున్న సంగతి పాఠకులకు విదితమే బ్లాగు మనమందరిదిమీరు కూడా బ్లాగులో చక్కటి విషయాలను పంపి భాగస్వాములు కావచ్చుమీరు చేయవలసినది ఏమంటే మీరు తెలుపదలచుకున్న విషయాన్నీ తెలుగులో కానీ, ఇంగ్లీషులో లేక హిందీలో పంపండిఎలా అంటే రోజునుంచి నేను కొత్త కవులు పేజీ అని ఒక పేజీ వున్నది .  మీరు పేజీ లో కామెంటు రూపంలో మీ పోస్టులను పంపండిఅందరకు ఆమోదకరం, ఉపయుక్తకరం అని తలచినవి నేను కామెంట్ల రూపంలో పబ్లిష్ చేస్తాను

పంచాంగం గురించి 

మన బ్లాగులో నిత్యం పంచాంగం రెండు మూడు రకాలుగా పెడుతున్నాముకానీ పంచాంగం విషయంలో ఇతరదేశాలలో వుంటున్నవారు గమనించాల్సినది ఏమిటంటే పంచాంగం ఒక ప్రాంతంలోని సూర్యోదయ, సూర్యాస్తమయ కాలాలను గణనలోకి తీసుకొని లెక్కిస్తారు.కాబట్టి ఇక్కడి (హైదరాబాదు) తిథి వార నక్షత్రాదులు మీరు ఉండే ప్రాంతానికి సమన్వయము కావటం జరగదుఅటువంటప్పుడు ఏమి చేయాలి

పంచాంగ సవరణ: మీరు హైదరాబాదు సూర్యోదయకాలం మీ ప్రాంతపు సూర్యోదయకాలంకు వున్నా వేత్యాసాన్ని కలిపి లేక తీసివేస్తే మీకు మీ ప్రాంత పంచాంగం వస్తుంది. అదే సమయం ఇతరత్రా విషయాలకు సమన్వయము చేసుకోవాలిఅంటే ఉదాహరణకు మీరు హైదరాబాదు నుంచి వున్నా ప్రదేశం హైదరాబాదు సూర్యోదయానికన్నా 5 నిముషాలు ముందుగా వున్నారనుకోండి అప్పుడు హైదరావాడు సమయానికి 5 నిముషాలు కలుపుకుంటే మీ రోజు పంచాంగం వస్తుంది

 ప్రకటనల గురించి 

మనబ్లాగులో అమెరికా వారు కెనడా వారు విశేషంగా చూస్తున్నారుదీనిని ఎందుకు ఇతరులకు అంటే అక్కడ  వుంటూ అక్కడి  మన తెలుగువారితో వ్యాపారం చేసుకోవాలనుకునేవారికి దోహదకారిగా ఉండకూడదు అని తలంచి   ఒక వ్యాపార ప్రకటన విభాగాన్ని మన బ్లాగులో తెరువ తలచాముఅది ఎలావుంటే బాగుండునది అనే విషయాన్ని పాఠకులు కామెంటులో పెట్టి  తెలుపగలరు. అదే విషంగా ఎంత రుసుము తీసుకుంటే బాగుంటుంది తెలుపగలరు

ఇట్లు 

మీ భార్గవ శర్మ