5, జూన్ 2023, సోమవారం

రామాయణం *21 వ భాగం

 

రామాయణం...

ఒకసారి చదివినంత మాత్రాన మన సమస్త పాపాలని తీసేస్తుంది...


          *వాల్మీకి రామాయణం:*

                *21 వ  భాగం:*

                 ➖➖➖✍️


*అలాగే లక్ష్మణుడికి ఊర్మిళతోను, భరతుడికి మాండవిక తోను, శత్రుఘ్నుడికి శృతకీర్తితోను వివాహం జరిపించారు.*


*అలా వివాహం జరగగానే, దివ్యదుందుభిలు మ్రోగాయి, పైనుండి పుష్పాలు పడ్డాయి. దేవతలందరూ సంతోషించారు.                               ఆ రోజ జరిగిన సీతారాముల కల్యాణానికి సమస్త లోకాలు సంతోషించాయి.*


*మరునాడు ఉదయం విశ్వామిత్రుడు అందరిని ఆశీర్వదించి ఉత్తర దిక్కుకి వెళ్ళిపోయారు. జనక మహారాజు కానుకగా ఏనుగులు, గుర్రాలు, వస్త్రాలు, ముత్యాలు, పగడాలు మొదలైనవి ఇచ్చాడు. అందరూ కలిసి అయోధ్య నగరం వైపుకి పయనమయ్యారు.*


*అప్పుడు అనుకోకుండా ఆకాశంలో పక్షులు భయంకరంగా కూస్తున్నాయి, నిష్కారణంగా దిక్కులలో చీకటి కమ్ముతోంది, మంగళ ప్రదమైన వృక్షాలు నేలమీద పడుతున్నాయి, కాని మృగాలు మాత్రం ప్రదక్షిణంగా తిరుగుతున్నాయి.*


*ఇదంతా చూసిన దశరథుడికి భయం వేసి, ఏమి జరుగుతోందని వశిష్ఠుడిని అడిగాడు.*


*ఆ శకునములను గమనించిన వశిష్ఠుడు, “ఏదో దైవీసంబంధమైన విపత్తు వస్తోంది, కాని మృగములు ప్రదక్షిణగా తిరుగుతున్నాయి కనుక నువ్వు ఆ విపత్తుని అధిగమిస్తావ”న్నారు.*


*ఇంతలోపే ప్రళయకాల రుద్రుడు వచ్చినట్టు విష్ణు చాపాన్ని పట్టుకొని పరశురాముడు వచ్చి, “నేను ఈ రోజే విన్నాను, శివ ధనుస్సుని విరిచావంట, నీ గురించి విన్నాను రామా, ఏమిటి నీ గొప్పతనం, నువ్వు అంతటివాడివైతే ఈ విష్ణు చాపాన్ని ఎక్కుపెట్టి బాణాన్ని నారిలో సంధించు!” అన్నారు.* 


*ఈ మాటలు విన్న దశరథుడు హడలిపోయి, పరుగెత్తుకుంటూ పరశురాముడి దగ్గరికి వచ్చి....“మహానుభావా! ఈ భూమండలం మీద ఉన్న క్షత్రియులపై 21 సార్లు దండయాత్ర చేశావు, క్షత్రియులందరినీ సంహరించావు. ఇవ్వాళ  హిమాలయాల మీద తపస్సు చేసుకుంటున్నావు. లేకలేక నాకు పిల్లలు పుట్టారు. వివాహాలు చేసుకొని ఇంటికి వెళుతున్నారు. నన్ను క్షమించు” అని దశరథుడు ప్రాధేయపడ్డా పరశురాముడు రాముడినే పిలిచి విష్ణు చాపాన్ని ఎక్కుపెట్టమన్నాడు.* 


*అప్పుడు రాముడు ఇలా అన్నాడు… "పరశురామా! నువ్వు విష్ణు చాపం ఎక్కుపెట్టు, ఎక్కుపెట్టు అని నన్ను ఒక పనికిమాలినవాడిగా ఇందాకటి నుంచి మాట్లాడుతున్నా ఎందుకు ఊరుకున్నానో తెలుసా, తండ్రిగారు పక్కనుండగా కొడుకు ఎక్కువ మాట్లాడకూడదు కనుక. నేను తప్పకుండా ఎక్కుపెడతాను” అని ఆ విష్ణు చాపాన్ని ఎక్కుపెట్టి, ఆ నారిలోకి బాణాన్ని పెట్టారు. "నీ మీదే ఈ బాణ ప్రయోగం చేసి సంహరించగలను, కాని నువ్వు బ్రాహ్మణుడివి మరియు నా గురువైన విశ్వామిత్రుడికి, నీకు చుట్టరికం ఉండడం చేత నేను నిన్ను సంహరించను. కాని ఒకసారి బాణం సంధించిన తరువాత విడిచిపెట్టకుండా ఉండను, అందుకని నేను నీ గమన శక్తిని కొట్టేస్తాను" అన్నాడు.*


*అప్పుడు పరశురాముడు ఇలా అన్నాడు "రామా! నేను క్షత్రియులని ఓడించి సంపాదించిన భూమిని కశ్యపుడికి దానం చేశాను, అప్పుడాయన నన్ను రాత్రి పూట                          ఈ భూమండలం మీద ఉండద్దు అన్నాడు. ఇప్పుడు చీకటి పడుతోంది, కావున నేను తొందరగా మహేంద్రగిరి పర్వతం మీదకి వెళ్ళాలి. నువ్వు నా గమన శక్తిని కొట్టేస్తే నేను వెళ్ళలేను, మాట తప్పిన వాడినవుతాను" అని అన్నాడు.* 


*”అయితే నీ తపఃశక్తితో సంపాదించిన తపోలోకాలు (తపస్సు) ఉన్నాయి, వాటిని కొట్టేస్తాను” అన్నాడు రాముడు.* 


*పరశురాముడు “సరే” అన్నాడు. అప్పుడు పరశురాముడు తపస్సు చేసి సంపాదించుకున్న లోకాలని రాముడు కొట్టేసాడు.*


*వెంటనే పరశురాముడు అక్కడినుంచి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతూ ఆయన, “నువ్వెవరో నేను గుర్తుపట్టాను రామా, నువ్వు ఆ శ్రీమహావిష్ణువే, ఇక ఈ భూలోకంలో నా అవసరంలే”దని మహేంద్రగిరి పర్వతాలవైపు వెళ్ళిపోయాడు పరశురాముడు.*


*దశరథుడు సంతోషంగా వాళ్ళని అయోధ్యకి తీసుకెళ్ళాడు, కౌసల్య, సుమిత్ర, కైకేయి ఎదురొచ్చి హారతులిచ్చారు. తమ కోడళ్ళని చూసుకొని మురిసిపోయారు. అప్పుడు వాళ్ళని ఆ వంశ కులదైవాలున్న దేవతాగృహాలకి తీసుకెళ్ళి ఇక్కడ పూజ చెయ్యాలని చూపించారు. అలా ఆ నూతన దంపతులు హాయిగా క్రీడిస్తూ కాలం గడిపారు.*


సీతారాముల అలా ఆనందంగా ఉండడానికి కారణాన్ని వాల్మీకి మహర్షి ఈ క్రింది శ్లోకంలో చెప్పారు..........


```ప్రియా తు సీతా రామస్య దారాః పితృ కృతా ఇతి।

గుణాత్ రూప గుణాత్ చ అపి ప్రీతిః భూయో అభివర్ధతే॥```


*రాముడికి సీతమ్మ అంటే చాలా ఇష్టమంట, ఎందుకు ఇష్టమంటే, మా తండ్రిగారు నాకు తగిన భార్య అని నిర్ణయం చేశారు, అందుకు ఇష్టమట. అలాగే అపారమైన సౌందర్యంతో ఆకట్టుకుంది, అలాగే అపారమైన సంస్కారము, గుణములు ఉన్నాయట. సీతారాములు కొంతకాలం సంసారం చేశాక, సీతమ్మ తాను ఏమి అనుకుంటుందో నోరు విప్పి చెప్పేది కాదట, అలాగే రాముడు ఏమనుకుంటున్నాడో సీతమ్మకి నోరు విప్పి చెప్పేవాడు కాదట, హృదయాలతో నిశబ్ధంగా మాట్లాడుకునేవాళ్ళట. తన తండ్రిగారు నిర్ణయించిన భార్య అని రాముడు సీతమ్మని ప్రేమించాడంట, కాని సీతమ్మ మాత్రం ఈయన నాకు భర్త అని ప్రేమించిందంట. అలా ఆనందంగా కాలం గడిచిపోతుంది...*✍️

రేపు...22వ భాగం...

           *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

                     ➖▪️➖


అష్టైశ్వర్యాలు

 

             *అష్టైశ్వర్యాలు అంటే…*

                   ➖➖➖✍️


*పిల్లలను ఆశీర్వదించేటప్పుడు పెద్దలు ‘అష్టైశ్వర్య ప్రాప్తిరస్తు’ అని దీవించడం వింటూనే ఉంటాం. ఐశ్వర్యం అంటే సంపద. అది ఉన్న చోట దేనికీ ఎలాంటి లోటు ఉండదు. అయితే ఆ ఐశ్వర్యమొక్కటే ఉంటే మనిషి గొప్పవాడు కాలేడు. అవి కేవలం ఐహిక భోగాలు మాత్రమే. ఒక వ్యక్తికి సంఘంలో నిజమైన పేరు, ఆనందమయ జీవితం కలిగేది అతనికి అష్టైశ్వర్యాలు సిద్ధించినప్పుడే. మరి అంతటి ప్రాముఖ్యం ఉన్న అష్టైశ్వర్యాలు ఏంటో మీరే చదవండి…*


*రాజ్యమే రాజసం!*

*పూర్వం రాజ్యమంటే రాజు పాలించే ప్రాంతం. కానీ అష్టైశ్వర్యాల్లో రాజ్యమంటే ఆధీనంలో ఉన్న ప్రాంతం కాదు.  ఈ భూమండలంపై వ్యక్తి పేరు, యశస్సు, కీర్తి ఎంతవరకు విస్తరిస్తే ఆ ప్రాంతమంతా అతని రాజ్యమని అర్థం. ఈ రాజ్యమే అతనికి రాజసం తెచ్చి పెడుతుంది. అంటే మనిషి గొప్పతనం నలుమూలలా విస్తరిస్తే అది తనకు కలిగిన ఒక ఐశ్వర్యమన్నమాట.*


*ధనమే మూలం!*

*ధనం ఉంటేనే ఎవరికైనా విలువ. అదే ధనం  మీదగ్గర లేనప్పుడు సంఘంలో గౌరవమర్యాదలు దక్కడం కష్టం. జీవితంలో అతి ముఖ్యమైన కూడు, గూడు, బట్ట ఉండాలంటే ధనం తప్పనిసరి. డబ్బే లేని నాడు ఇవేవీ మీ చెంతకు రావు. అంటే ధనమే అన్నింటికి మూలమన్న సత్యాన్ని గ్రహించాలి. జేబులో పైసా లేని నాడు మనిషికి జీవితం కష్టాల్లో ఉంటుంది. కాబట్టి అష్టైశ్వర్యాల్లో ధనానిది ప్రత్యేక స్థానమని గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.*


*ఇల్లాలే దీపం!*

*సంసార జీవితంలో భర్తకు చేదోడు వాదోడుగా నిలుస్తూ.. కష్టసుఖాలు పాలుపంచుకొంటూ భర్తకు కొండంత ధైర్యాన్నిచ్చేది ఆ ఇంటి ఇల్లాలు మాత్రమే.   అందుకే పెద్దలు ఇల్లాలే ఇంటికి దీపం అన్నారు. అర్థం చేసుకునే ఇల్లాలు ఉంటే జీవితం ఆనందంగా, ఉల్లాసంగా సాగిపోతుంది. ఒకవైపు సంతానాన్ని ప్రయోజకుల్ని చేయటం, మరోవైపు అత్తమామల్ని ఆప్యాయతతో చూసుకోవడం, భర్తతో సమానంగా ఇంటి వ్యవహారాలు నిర్వహించడంలో ఇల్లాలి పాత్ర అద్వితీయం.*


*సగం బలం!*

*కొండంత సంపద ఉండి చివరి రోజుల్లో బాగోగులను చూసుకోవడానికి సంతానం లేకపోతే     జీవితానికి సంపూర్ణత చేకూరదు. పిల్లలు చేతికొచ్చారంటే తల్లిదండ్రులకు వెయ్యి ఏనుగుల బలం వస్తుంది. సంతానం ప్రయోజకులయ్యారంటే ఆ తల్లిదండ్రుల ఆనందానికి అవధులు ఉండవు.*


*ధైర్యే సాహసే లక్ష్మీ!*

*జీవితంలో కొందరు సాధించిన దాన్ని మరికొందరు సాధించలేరు. అలా జరగడానికి ఒక కారణం మీలోని ధైర్యసాహసాలు. జీవితంలో కొన్ని క్లిష్ట పరిస్థితులను అధిగమించలేక కొందరు మధ్యలోనే వెనుకంజ వేస్తారు. మరి కొందరు ధైర్యం కూడదీసుకుని ముందడుగు వేసి విజయం సాధిస్తారు. సరైన సమయంలో ధైర్యసాహసాలు ప్రదర్శించినప్పుడు డబ్బు కూడా మీ దరికి చేరుతుంది. కష్టపడినప్పుడే కదా విజయం విలువ తెలిసేది. అలాంటి ధైర్యసాహసాలు కలిగి ఉండడమూ  అష్టైశ్వర్యాల్లో ఒక భాగమే.*


*ఆత్మస్థైర్యం ఉంటేనే మనుగడ!*

*మన కర్మలకు అనుగుణంగానే ఫలితం ఉంటుంది. ఆ ఫలితం ఒకానొకసారి మిమ్మల్ని బలవంతుల్ని చేస్తే, మరొకసారి బలహీనుల్ని చేస్తోంది. బలహీనమైన సందర్భంలో మీలో ఆత్మస్థైర్యం ఎంత ఉందనేదే మీ మనుగడను నిర్దేశిస్తుంది. కొందరు గెలుపోటములను లెక్కచేయకుండా జీవన ప్రయాణాన్ని కొనసాగిస్తుంటారు. అదే సందర్భంలో మరికొందరు ఓటమి కలిగినప్పుడు కుంగుబాటుకు లోనవుతారు.  ఓటమి, కష్టాలు, బాధలు కలిగినప్పుడు కుంగిపోకుండా ధీమాతో ముందుకు సాగేవారే నిజమైన ఐశ్వర్యవంతులు.*


*విద్యే విజ్ఞాన జ్యోతి!*

*విద్య కలిగిన వాడు విద్యావంతుడు అవుతాడు. సమస్త విషయాలపై జ్ఞానాన్ని సంపాదిస్తాడు. చదువు సరిగా రాకపోతే ఇతరులకు మీరు సరిగా దిశానిర్దేశం చేయలేరు. ఉద్యోగం రావాలన్నా, ఆధునిక సమాజంలో బతుకు బండిని నెట్టుకు రావాలన్నా... విషయ పరిజ్ఞానం తప్పనిసరి. సంపాదనను దొంగిలించొచ్చు.. పేరు, ప్రఖ్యాతులు నాశనం చేయవచ్చు. కానీ మీ దగ్గర ఉండే విద్యను ఎవరూ దొంగిలించలేరు. అందుకే విద్య అనేది దొంగిలించలేని ఐశ్వర్యం. ‘విద్వాన్‌ సర్వత్ర పూజ్యతే’ అని అంటారు.*


*వినయమే ప్రధానం!*

*మానవుడు జీవితంలో విజయం సాధించాలంటే వినయం కూడా అవసరం. వినయాన్ని పరిస్థితులకు తగ్గట్టుగా ప్రదర్శించినప్పుడే జీవితం సాఫీగా సాగిపోతుంది. వినయం లోపించినప్పుడు అది పతనానికి కారణమవుతుంది. వినయంగా వినడం, మాట్లాడటం, ప్రవర్తించడం, నేర్చుకోవడం వంటివి మిమ్మల్ని బలవంతులను చేస్తాయి. పెద్దవారి ముందు వినయం ప్రదర్శించకుండా ప్రవర్తిస్తే నష్టపోక తప్పదు. కాబట్టి వినయమనే ఐశ్వర్యాన్ని కోల్పోకుండా చూసుకోవడం మీ చేతుల్లోనే ఉందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి.*✍️

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

                     ➖▪️➖


ప్రారబ్దం

 


        ప్రారబ్దం ఎందుకు మారదు?

                 ➖➖➖✍️


“అవశ్యం భావిభావానాం ప్రతీకారో భవేద్యది!

తదా దుఃఖై ర్న సీదేరన్ నల రామ యుధిష్ఠిరాః!!”


 భావం:-

 ప్రారబ్ద కర్మఫల భోగాలను నివారించే పద్ధతి వుండి వుంటే, నల మహారాజు, రాముడు, ధర్మరాజు ముగ్గురూ అరణ్యంలో వుండి అనేక దుఖాలను అనుభవించి వుండేవారు కారు.


 కష్టాలను తొలగించుకునే పరిహార పద్ధతులు ఉండి ఉంటే…, 

భార్యని అడవుల పాలు చేసిన నలుడు, 

భార్యని మరొకడు ఎత్తుకుపోగా రాముడు,                 

భార్యా వస్త్రాపహరణాన్ని, అదీ తమ సమక్షంలో నిండు సభలో జరగగా నిస్సహాయంగా చూసిన ధర్మరాజు వంటి మహానుభావులంతా తగిన పరిహారాలు చేసి వాటి లోంచి బయటపడి ఉండేవారు కదా. 

పరీక్షిత్ రాబోయే మృత్యువుని దాటాలని, పాము కాటు పడకుండా ఎన్నో కట్టుదిట్టాలని చేసుకున్నాడు. కాని చివరికి పాము కాటుతోనే మరణించాడు కదా!!


 అంతటి మహానుభావులే ప్రారబ్ద కర్మ ఫలాన్ని తోసివేయలేక పోయినప్పుడు, ఇక సామాన్యుల విషయం చెప్పగలమా? 


కాబట్టి పూర్వ జన్మల్లో మనం చేసిన చెడు పనులకి ఫలితంగా ఈ జన్మలో వచ్చే కష్టాలని అనుభవించి క్షయం చేసుకోవడం తప్ప పరిహారాలు అంటూ ఉండవు, అని,  ధర్మసేతువు అనే గ్రంధంలోని పై శ్లోకానికి  భావం.


ఏ జీవికి అయినా భూత కాలంలో చేసిన కర్మలని బట్టి ఈ రోజు నిర్మాణమై ఉంటుంది. 

సూక్ష్మంగా చెప్పాలంటే, ప్రతి జీవి పూర్వ కర్మల తయారీ సరుకు. 

పూర్వం అతను నీచపు పనులు, అశుద్ధమైన కర్మలు చేసి ఉంటే ఇప్పుడు అతడు నీచ జన్మని పొందుతాడు. పూర్వం ఉన్నతమైన పనులు, శుద్ధ కర్మలు చేసి ఉంటే ఇప్పుడతను ఉన్నతమైన జన్మని పొందుతాడు.


 *ప్రారబ్దం పూర్వకాలానికి సంబంధించినది. వెనకటి కర్మల వల్ల ఏర్పడింది. 

ఓ సారి చేసేసిన కర్మలని మనం మళ్ళీ వెనక్కి వెళ్ళి మార్చుకోలేం. దాంతో వాటిని అనుసరించి వచ్చిన నేటి ప్రారబ్దాన్ని కూడా మనం మార్చలేం. ప్రారబ్ద కర్మ ఎంత శక్తివంతమైందో వివరించడానికి నిజంగా జరిగిన ఈ సంఘటనని కధగా ఉత్తర భారతదేశంలోని సత్సంగాల్లో చెప్తారు….


ఓ నాస్తికుడు ఓ రాత్రి తన దుకాణంలోనే కూర్చుని బట్టలు కుడుతూ, పక్కనే గుళ్ళో హరిదాసు చెప్పే హరికధని విన్నాడు.


 “విధిని ఎవరూ తప్పించుకోలేరు. చెడైనా, మంచైనా సరే దానికి మనం తల ఒగ్గి అనుభవించి తీరాలి.” చెప్పాడా హరిదాసు.


ఆ నాస్తిక దర్జీ వెంటనే లేచి వెళ్ళి హరిదాసుతో గట్టిగా చెప్పాడు… “మనిషి తన స్వప్రయత్నంతో విధిని ఎదిరించ గలడు."  కొంత ఆథ్యాత్మిక పరిపక్వత గల ఆ హరిదాసు ఇలా బదులు చెప్పాడు…


“సరే. ఈ రాత్రికి నీకు కర కర ఆకలి వేస్తున్నా ఎవరో బలవంతంగా తినిపించడం వల్లే నువ్వు తినాలని నీకు రాసి పెట్టి వుంది. దాన్ని తప్పించుకోగలవేమో చూడు. అప్పుడు నీకే తెలుస్తుంది.”


 “తినాలా తినకూడదా అన్న స్వతంత్రం నాకుంది కాబట్టి నేను దాన్ని వుపయోగించుకుని వస్తే తినను. రేపు ఉదయం మీ దగ్గరకి వచ్చి మీరు తప్పని చెప్పి తీరతాను.” 


హరిదాసు నవ్వి ఊరుకున్నాడు.


 ఇంతలో ఇంటినించి దర్జీవాడి భార్య తన భర్త కోసం అన్నం తీసుకువచ్చింది.


ఆకలి లేదంటే 'నేను కలిపి పెడతాను. రెండు ముద్దలు తినండి. రాత్రంతా పని చేయాలిగా' అని బతిమాలసాగింది. 


దర్జీవాడు వెంటనే భార్యకి చెప్పా పెట్టకుండా దగ్గరలో వున్న అడవికి వెళ్ళాడు.


విశాలమైన ఓ చెట్టెక్కి దాని గుబురు కొమ్మల్లో దాక్కున్నాడు. తెల్లారేదాకా అతను చెట్టు దిగదలచు కోలేదు. కొద్ది సేపటికి ముగ్గురు బాటసారులు ఆ చెట్టు కింద ఆగి, అన్నం మూటలు విప్పారు.


 రాత్రికి ఆ చెట్టు కింద విశ్రమించి మర్నాడు వుదయం తమ ప్రయాణాన్ని కొనసాగించ దలచుకున్నారు. విస్తళ్ళలో అన్నం వడ్డించుకుని తినబోతూండగా దగ్గర నించి పెద్ద పులి గాండ్రింపు వినిపించింది. భయంతో వాళ్ళు ముగ్గురూ లేచి పరుగు లంకించుకున్నారు.


 వాళ్ళు వదిలి వెళ్ళిన ఆహార పదార్ధాలు ఆకర్షణీయంగా కనిపించడమే కాక, వాటి నించి కమ్మటి వాసనలు వేయసాగాయి. అది విధి తనకి పెట్టే పరీక్షగా తలచి, పట్టుదలగా ఉన్న దర్జీవాడు చెట్టు దిగి వచ్చి ఆహారాన్ని ముట్టలేదు. నిద్రకి ఉపక్రమించాడు.


కొద్ది సేపటికి దర్జీకి అలికిడి వినబడటంతో కిందకి చూస్తే ముగ్గురు కొత్త వ్యక్తులు కనిపించారు. గ్రామంలోంచి వాళ్ళు దొంగిలించి తెచ్చిన నగల మూటల్లోని నగలని పంచుకున్నారు. "ఆహా! దేవుడు ఎంత దయామయుడో కదా! మన ఆకలిని గుర్తించి మనకోసం అన్నం సిద్ధం చేసాడు.” ఆహారాన్ని చూసి చెప్పాడు ఒక దొంగ.


 వెంటనే రెండో దొంగ దాన్ని ఖండిస్తూ చెప్పాడు. “మూర్ఖుడా! ఇది దేవుడి పని కాదు. ఎవడో మనం దొంగిలించాక ఇక్కడికే వస్తామని కనిపెట్టి, ఈ భోజనాన్ని అమర్చాడు. దీంట్లో ఏ విషమో కలిపి మనం తిని చావగానే ఈ నగలని కాజేయాలని వాడు ఎత్తు వేసి వుంటాడు.” 


“అవును. ఈ భోజనం ఏర్పాటు చేసినవాడు ఈ చుట్టుపక్కలే ఎక్కడో దాక్కుని ఉంటాడు. వాడ్ని వెదుకుదాం పదండి.” మూడో దొంగ చెప్పాడు. 


దొంగలు ముగ్గురూ తమ దగ్గరున్న కాగడాలతో ఆట్టే సేపు వెదక్కుండానే చెట్టు కొమ్మల్లో దాక్కుని వున్న దర్జీ వాడ్ని చూసి కిందకి దింపారు.


“దీంట్లో ఏం కలిపావు? అసలు మేం ఇక్కడికి వస్తామని నీకెలా తెలుసు?” గద్దించారు దొంగలు.


 ఆ ఆహారం అక్కడికి ఎలా వచ్చిందో చెప్పాడు. వాళ్ళు  దర్జీవాడి మాటలు విశ్వసించలేదు.


 “సరే. నువ్వు చెప్పింది నిజమైతే ఈ అన్నం తిను.” ఆజ్ఞాపించారు. 


“ఇప్పుడు కాదు. సూర్యోదయం అయాక తింటాను.”


దర్జీవాడు వెంటనే అన్నం తినడానికి అంగీకరించక పోవడంతో దొంగలు ముగ్గురికీ అన్నంలో విషం కలిపాడన్న అనుమానం బలపడింది. దాంతో వెంటనే ఆ అన్నం తినకపోతే చంపుతామని బెదిరించారు.


 “చంపండి. అప్పుడు నేను విధిని జయించినవాడ్ని అవుతాను. కాని తినను.” మొండిగా చెప్పాడు వాడు.


 ఆ “వీడి చేత ఈ విషం కలిపిన అన్నం తినిపించి చంపుదాం.” ఓ దొంగ, వాడ్ని కదలకుండా పట్టుకున్నాడు.


రెండో దొంగ దర్జీవాడి నోరు పగలదీస్తే మూడోవాడు బలవంతంగా వాడి నోట్లో అన్నం కుక్కి నీళ్ళు తాగించి ఆ అన్నం మొత్తం వాడి కడుపులోకి దిగేలా చేసాడు. ఎంత సేపటికీ వాడు చావకపోవడంతో ఆ దొంగలకి అతను నిజమే చెప్పాడనుకున్నారు.


 “అందులో విషం కలపకపోతే మరి చావడానికి కూడా సిద్ధ పడ్డావు కాని ఎందకు తిననన్నావు?”ఆశ్చర్యంగా అడిగారు దొంగలు.


తను ఆ చెట్టు మీద ఎందుకు దాక్కున్నాడో దొంగలకి వివరించాడు దర్జీవాడు. మర్నాడు వాడు హరిదాసు దగ్గరకి వెళ్ళి జరిగింది చెప్పాడు. “ప్రతీది మన ప్రారబ్ద కర్మ ప్రకారమే జరుగుతుంది అని నీకు ఇప్పుడు అర్ధమైందా?


నా మాటలకి నీకు రోషం వచ్చి ఆ అడవికి వెళ్ళి అక్కడ దాక్కోవడం, ముగ్గురు బాటసారులు అన్నం తేవడం, పులి అరవడం, వాళ్ళు పారిపోయాక దొంగలు రావడం, వాళ్ళల్లో ఒకరికి అది విషం కలిపిన అన్నం అని అనుమానం కలగడం మొదలైనవన్నీ నీ ప్రారబ్ద కర్మని తీర్చడానికి సహకరించడానికి ఆ విధాత రాసిన సహాయ కర్మలే తప్ప వేరు కావు.


ప్రతీ ప్రారబ్ద కర్మ తీరడానికి ఇలా మనతో ప్రమేయం వున్న లేదా లేని అనేక సంఘటనలు, వస్తువులు, మనుషులు అందుకు సహాయకారులుగా వుంటారు.” వివరించాడు హరిదాసు.


 ఆ దర్జీవాడి పేరు మాలుకా దాస్. ఇప్పటి అలహాబాద్ దగ్గర్లో వున్న….                'కడే కి మాయి' అనే గుడి దగ్గర ఆ తర్వాత అతను తపస్సు చేసుకుని ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితికి చేరుకున్నాడు.✍️

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

                     ➖▪️➖


యశోద కృష్ణ*

 

                  *యశోద కృష్ణ*

                  ➖➖➖✍️


*”ఏమైంది... వాకిట నిలబడ్డావు....?"*


*"నా కన్నయ్య ఇంటికి రాలేదు.…!"*


*"అవునా ... ఎక్కడో ఏదో అల్లరి పనిచేస్తూ ఉండి ఉంటాడు....!"*


*"తనేమి అల్లరి కృష్ణయ్య కాదు..!"*


*"అయితే ఎవరి మనసులోకో... చెప్పకుండా  దొంగలా దూరి ఉండి ఉంటాడు...!"*


*"తనేమి దొంగ కృష్ణుడు కాదు...!"*


*"మరైతే రాధమ్మ ఇంటిలోకి చేరి ఉంటాడు...!"*


*"తనేమి రాధా కృష్ణుడు కాదు....!"*


*”మురళి వాయిస్తో... ఎవరికో జోల పాట పాడుతూ ఉండి ఉంటాడు.....!"*


*"తనేమీ ..మురళి కృష్ణుడు కాదు..!"*


*"అయితే చిన్నపిల్లలను పోగేసి ఆడుకుంటూ ఉండి ఉంటాడు....!"*


*"తనేమి చిన్ని కృష్ణుడు కాదు...!"*


*"తన చూపులతో ఏ గోపిక నో... మోహంలో ముంచేస్తూ ఉండి ఉంటాడు.....!"*


*"తనేమీ మోహన కృష్ణుడు కాదు...!"*


*"అయితే గోకులంలో గుంపులతో ముచ్చటిస్తూ ఉండి ఉంటాడు...!"*


*"తనేమి గోపాలకృష్ణుడు కాదు...!"*


*"చీకటి పడింది గా.... అందులో కలిసిపోయి కనపడటం లేదేమో....!"*


*"నా కన్నయ్య శ్యామకృష్ణుడు ....కానేకాదు...!"*


*"అమ్మా.....!" ఎవరో.... పిలిచినట్లు ...... చీర పట్టుకుని ఊపుతున్నట్లు.... అనిపించి పడబోయి... ఆపు కుంది .*


*అలజడిగా చూసేంత లో .....*


*"ఇందాకట్నుంచి పిలుస్తూనే ఉన్నాను..! నువ్వేమో వినిపించుకో హూ .....! ఎంత ఆకలిగా ఉందో తెలుసా.....?   ఇంకా చూడమ్మా ......నన్ను ఎన్ని మాటలు అంటున్నారు.......వీళ్ళు....!" అంటూ  ఆమె కుచ్చిళ్ళలో ....మొహాన్ని దాచుకుని ....నందనకృష్ణుడు...*


*"కన్నయ్య ..... నేను చూడలేదు ....!        నీ పిలుపు వినలేదు ......! ఎంత ఆకలేసింది ....! దా ..!... వెన్నతో అన్నం పెడతాను ....!" అంటూ లోనికి పరుగుతీసింది ఆమె.... తన... యశోదా కృష్ణుడుతో....!*


*కృష్ణం వందే జగద్గురుం ....!*


                             ….సేకరణ.

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

                     ➖▪️➖


ప్రబోధం

 


                      *ప్రబోధం*

                   ➖➖➖✍️


*ఎంతటి జటిలమైన విషయాన్నైనా ఎంతటి పామరుడికైనా అర్థం అయ్యేలా చెప్పగల నేర్పరి గౌతమ బుద్ధుడు.* 


*పండితులకు పండితుల స్థాయిలో, పామరులకు పామరుల స్థాయిలో చెప్పగల మహా ప్రబోధకుడు.*


*విషయాన్ని పూర్తిగా అవగతం చేయడం కోసం నిత్యజీవితంలోని ఎన్నో సంఘటనలను ఆయన ఉపమానాలుగా చెప్పేవాడు. ఆ ఉపమానంతో వినగానే విషయం హృదయానికి చేరేది. మనసుపై ముద్ర వేసేది.*


*ఒక రోజు బుద్ధుడు జేతవన విహారంలో ఉన్నప్పుడు, జైన మతానికి చెందిన ఒక సాధువు వచ్చాడు. బుద్ధుడికి వినయంగా నమస్కరించి- “భగవాన్‌! నేను ఇంతకాలం అజ్ఞానంలో గడిపాను. నాగురువులు అజ్ఞానులు, స్వార్థపరులు” అంటూ తన గురువులను నిందించడం మొదలుపెట్టాడు. చివరకు వారిని ఏకవచనంతో కూడా సంబోధించాడు. “అందరిలో నేను మాత్రమే సుగుణశీలిని” అని గొప్పలు చెప్పుకొని... “భగవాన్‌! తమరు అనుమతిస్తే నేను మీ శిష్యుడిగా ఉండగలను”  అని వేడుకున్నాడు.* 


*ముందుగా నీవు నీ పూర్వ గురువులను గౌరవించడం నేర్చుకో. వారు చెప్పేది నీకు ఇప్పుడు నచ్చినా, నచ్చకపోయినా... ఒకప్పుడు వారు నీకు గురువులే! వారిపట్ల సంస్కారంతో జీవించు. ఆ తరువాత నా దగ్గరకు రా!” అని చెప్పి పంపాడు.* 


*అతను వెళ్ళిపోయాక అక్కడున్న భిక్షువులతో- “భిక్షువులారా! గురువు పట్ల ప్రతి వారికీ అణకువ చాలా అవసరం.   గురువు పట్లే కాదు...         మనతో ఉండే ప్రతివారి పట్లా ఆ అణకువ ఉండాలి. మన మాటతీరే మన ప్రవర్తనకు అద్దం. మన నిజ స్వరూపాన్ని చక్కగా చూపిస్తుంది.* *ఎదుటివారి దోషాలను అడగకపోయినా ఎవరు చెబుతారో వారు చెడ్డవారు. అలాగే ఎదుటివారి సుగుణాలను మనం అడిగినా చెప్పకుండా ఎవరు దాస్తారో వారూ అలాంటివారే! *


*మనం అడగకపోయినా తమ గొప్పలు చెప్పుకొని, తప్పులు చెప్పరో వారూ చెడ్డబుద్ధి కలవారే!*


*మనం అడగకపోయినా ఎదుటివారి సుగుణాలను చెప్పి, దోషాల గురించి చెప్పనివారు మంచివారు.*


*తమ గొప్పలు తాను చెప్పుకోకుండా... తమ తప్పులను తాము గుర్తించి ఎవరు చెప్పగలరో వారే సజ్జనులు.* *అలాంటివారు నిరంతరం అణకువగా ఉంటారు. ఒక వ్యక్తి కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు, కొత్త పదవి స్వీకరించినప్పుడు... మొదట్లో చాలా జాగ్రత్తగా ఉంటాడు. పెళ్ళయి అత్తవారింటికి కొత్తగా వచ్చిన అమ్మాయి... అత్తమామల పట్లా, భర్త విషయంలోనే కాదు... పనివారి పట్లా, ఇరుగుపొరుగుల పట్లా బిడియాన్ని ప్రదర్శిస్తుంది. అందరితో నెమ్మదిగా, మంచిగా నడచుకుంటుంది. ఆ తరువాత కొన్నాళ్ళకు... ‘‘అవతలకు వెళ్ళండి! మీకేం తెలుసు?’’ అంటుంది.*


*అలాగే మీలో కూడా కొందరు మీ గురువుల పట్లా, మీ తోటివారి పట్లా, మీకన్నా చిన్నవారి పట్లా మొదట్లో నెమ్మదిగానే ఉంటారు. రానురానూ రాటుదేలిపోతారు. అదే మీ పతనానికి ప్రథమ సోపానం. ఎవరు నిరంతరం నవ వధువులా నైతిక బిడియాన్ని పాటిస్తారో, వారే యోగ్యులవుతారు.*


* భిక్షువులారా! మరువకండి. మీరు నవవధువు మనసులాంటి మనసుతో ఉండాలి’’ అని చెప్పాడు.*


*ఈ ప్రబోధం ఈనాటికీ అందరికీ పనికివచ్చేదే! ఒక విద్యార్థి, రాజకీయ నాయకుడు, ఒక ఉపాధ్యాయుడు, ఒక ఉద్యోగి... అందరూ ఈ మనసుతో ఉంటే -అందరి కర్తవ్య పాలన సక్రమంగా ఉంటుంది. అలక్షం, అరాచకం, అవినీతి మటుమాయమవుతాయి.*✍️

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

                     ➖▪️➖


ఆరోగ్యం

 

*మన ఆరోగ్యం…!


                  

దేవుడు మనలో ఉంచిన శరీర భాగాల సంఖ్య

                ➖➖➖✍️


 1: ఎముకల సంఖ్య: 206

 2: కండరాల సంఖ్య: 639

 3: కిడ్నీల సంఖ్య: 2

 4: పాల దంతాల సంఖ్య: 20

 5: పక్కటెముకల సంఖ్య: 24 (12 జత)

 6: గుండె గది సంఖ్య: 4

 7: అతి పెద్ద ధమని: బృహద్ధమని

 8: సాధారణ రక్తపోటు: 120/80 Mmhg

 9: రక్తం Ph: 7.4

 10: వెన్నెముక కాలమ్‌లోని వెన్నుపూసల సంఖ్య: 33

 11: మెడలోని వెన్నుపూసల సంఖ్య: 7

 12: మధ్య చెవిలో ఎముకల సంఖ్య: 6

 13: ముఖంలోని ఎముకల సంఖ్య: 14

 14: పుర్రెలోని ఎముకల సంఖ్య: 22

 15: ఛాతీలోని ఎముకల సంఖ్య: 25

 16: చేతుల్లోని ఎముకల సంఖ్య: 6

 17: మానవ చేతిలోని కండరాల సంఖ్య: 72

 18: గుండెలోని పంపుల సంఖ్య: 2

 19: అతి పెద్ద అవయవం: చర్మం

 20: అతి పెద్ద గ్రంథి: కాలేయం

 21: అతి పెద్ద కణం: స్త్రీ అండం

 22: అతి చిన్న కణం: స్పెర్మ్

 23: అతి చిన్న ఎముక: స్టేప్స్ మధ్య చెవి

 24: మొదటి మార్పిడి చేసిన అవయవం: కిడ్నీ

 25: చిన్న ప్రేగు యొక్క సగటు పొడవు: 7మీ

 26: పెద్ద ప్రేగు యొక్క సగటు పొడవు: 1.5 మీ

 27: నవజాత శిశువు యొక్క సగటు బరువు: 3 కిలోలు

 28: ఒక నిమిషంలో పల్స్ రేటు: 72 సార్లు

 29: సాధారణ శరీర ఉష్ణోగ్రత: 37 C ° (98.4 f °)

 30: సగటు రక్త పరిమాణం: 4 నుండి 5 లీటర్లు

 31: జీవితకాలం ఎర్ర రక్త కణాలు: 120 రోజులు

 32: జీవితకాలం తెల్ల రక్త కణాలు: 10 నుండి 15 రోజులు

 33: గర్భధారణ కాలం: 280 రోజులు (40 వారాలు)

 34: మానవ పాదంలోని ఎముకల సంఖ్య: 33

 35: ప్రతి మణికట్టులోని ఎముకల సంఖ్య: 8

 36: చేతిలో ఉన్న ఎముకల సంఖ్య: 27

 37: అతి పెద్ద ఎండోక్రైన్ గ్రంథి: థైరాయిడ్

 38: అతి పెద్ద శోషరస అవయవం: ప్లీహము

 40: అతిపెద్ద మరియు బలమైన ఎముక: తొడ ఎముక

 41: అతి చిన్న కండరం: స్టెపిడియస్ (మధ్య చెవి)

 41: క్రోమోజోమ్ సంఖ్య: 46 (23 జత)

 42: నవజాత శిశువు ఎముకల సంఖ్య: 306

 43: రక్త స్నిగ్ధత: 4.5 నుండి 5.5

 44: యూనివర్సల్ డోనర్ బ్లడ్ గ్రూప్: ఓ

 45: యూనివర్సల్ గ్రహీత రక్త సమూహం: AB

 46: అతి పెద్ద తెల్ల రక్త కణం: మోనోసైట్

 47: అతి చిన్న తెల్ల రక్త కణం: లింఫోసైట్

 48: పెరిగిన ఎర్ర రక్త కణాల సంఖ్యను అంటారు: పాలీసైథెమియా

 49: శరీరంలోని బ్లడ్ బ్యాంక్: ప్లీహము

 50: జీవ నది అంటారు: రక్తం

 51: సాధారణ రక్త కొలెస్ట్రాల్ స్థాయి: 100 mg / dl

 52: రక్తంలోని ద్రవ భాగం: ప్లాస్మా.


English

THE HUMAN BODY:


1: Number of bones: 206

2: Number of muscles: 639

3: Number of kidneys: 2

4: Number of milk teeth: 20

5: Number of ribs: 24 (12 pair)

6: Heart chamber number: 4

7: Largest artery: Aorta

8: Normal blood pressure: 120/80 Mmhg

9: Blood Ph: 7.4

10: Number of vertebrae in spinal column: 33

11: Number of vertebrae in the neck: 7

12: Number of bones in middle ear: 6

13: Number of bones in face: 14

14: Number of bones in skull: 22

15: Number of bones in chest: 25

16: Number of bones in arms: 6

17: Number of muscles in the human arm: 72

18: Number of pumps in the heart: 2

19: Largest organ: Skin

20: Largest gland: Liver

21: Largest cell: female ovum

22: Smallest cell: Sperm

23: Smallest bone: Stapes middle ear

24: First transplanted organ: Kidney

25: Average length of small intestine: 7m

26: Average length of large intestine: 1.5 m

27: Average weight of newborn baby: 3 kg

28: Pulse rate in one minute: 72 times

29: Normal body temperature: 37 C ° (98.4 f °)

30: Average blood volume: 4 to 5 LITERS

31: LIFETIME Red blood cells: 120 days

32: LIFETIME White blood cells: 10 to 15 days

33: Pregnancy period: 280 days (40 weeks)

34: Number of bones in human foot: 33

35: Number of bones in each wrist: 8

36: Number of bones in hand: 27

37: Largest endocrine gland: Thyroid

38: Largest lymphatic organ: Spleen

40: Largest and strongest bone: Femur

41: Smallest muscle: Stapedius (middle ear)

41: Chromosome number: 46 (23 pair)

42: Number of newborn baby bones: 306

43: Blood viscosity: 4.5 to 5.5

44: Universal donor blood group: O

45: Universal recipient blood group: AB

46: Largest white blood cell: Monocyte

47: Smallest white blood cell: Lymphocyte

48: The increased red blood cell count is called: Polycythemia

49: Blood bank in the body is: Spleen

50: River of Life is called: Blood

51: Normal blood cholesterol level: 100 mg / dl

52: Fluid part of blood is: Plasma.



ఇలాంటి మరిన్ని పోస్ట్‌లను చూడటానికి మరియు Akhila Bharatiya Vishwakarma Yuvajana Sangam (ABVYS) చేరడానికి, ఇక్కడ క్లిక్ చేయండి


https://kutumbapp.page.link/HKYQdG5DoFLLDNdN9


.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

ఆచార్య సద్బోధన:*

 


             *ఆచార్య సద్బోధన:*

                  ➖➖➖✍️


```ఎవరికీ అన్యాయం చేయకుండా, నిజాయితీగా కష్టపడి సంపాదించిన డబ్బుతో జీవించేవారికి కష్టాలు ఎక్కువగా వస్తాయి.


కానీ, ఆ కష్టాలనే వారు ఆనందంగా భావిస్తారు.


ఎప్పటికైనా కష్టపడే వారికి, కష్టాలను అనుభవించేవారికి తప్పక సుఖం అనేది పొందుతారు. 


అన్యాయంగా, అక్రమంగా, దోపిడీ చేసిన డబ్బుతో జీవించేవారు ప్రస్తుతం సుఖంగా ఉండవచ్చు, 


కానీ తర్వాత ఆ పాప ఫలితం, వారికి గానీ లేదా వారి ముందు తరాల వారికి గానీ అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొనేలా చేస్తుంది.✍️ ```

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

                     ➖▪️➖


శ్రీ దాసాంజనేయ స్వామి దేవాలయం

 🕉  మన గుడి : 🕉️





🔆 కృష్ణా జిల్లా : " మాచవరం"


👉 శ్రీ దాసాంజనేయ స్వామి దేవాలయం 



💠 విజయవాడలోనే కాక రాష్ట్రంలోని నలుమూలల నుండి భక్తులు అమితంగా కొలిచే దేవాలయాల్లో మాచవరంలోని దాసాంజనేయ స్వామి ఆలయం ప్రముఖంగా పేర్కొనవచ్చు. 


💠 700 ఏళ్ళ చరిత్ర కలిగిన గొప్ప దేవాలయం .

విజయ నగర సామ్రాజ్యాన్ని పాలించిన సాలువ ,తులువ వంశ రాజులకు పూజనీయ, గురు స్థానంలో ఉన్న వ్యాస రాయలవారు (వ్యాస తీర్ధులు )ప్రతిష్ట చేసి,నిర్మించిన ప్రసిద్ధ దేవాలయం.


💠 పూర్వం వ్యాసరాయలనే హనుమద్భక్తుడు పాదచారిగా పర్యటిస్తూ తాను బసచేసిన ఊళ్ళలో హనుమంతుని విగ్రహాలను ప్రతిష్టించే వాడని, ఆ పర్యటనలో విజయవాడ చేరుకొని ఆంజనేయ స్వామి ప్రేరణపై ప్రస్తుతం వున్న ఆంజనేయస్వామి ఆలయ ప్రాంతానికి వచ్చి అక్కడ శంఖు - చక్రాదులతో తనకి లభించిన స్వామివారి విగ్రహాన్ని ప్రతిష్టించి శ్రీ దాసాంజనేయ స్వామి ఆలయాన్ని నిర్మించారని చరిత్రకారులు చెబుతున్నారు.



💠 క్రీ.శ. 1509 లో వ్యాస తీర్ధ మహాశయులు పాద చారియై దేశాటనం సాగిస్తూ భగవద్ భక్తీని ప్రబోధించారు .ఆ యాత్రలో విజయవాడ వేంచేసి ఇంద్ర కీలాద్రి వేంచేసి ఉన్న శ్రీ కనక దుర్గమ్మ అమ్మ వారిని దర్శించారు .

అప్పుడు ఒక వింత సంఘటన జరిగింది  అంటారు.. 

ఆంజనేయస్వామి  ఒక వానర వేషంలో తీర్ధుల వద్దకు వచ్చి ,సౌజ్నలతో తన వెంట రమ్మని కోరింది .

అలా ఆ వానరం కొండలు గుట్టలు దాటించి ఇప్పుడున్న మాచవరం వద్దకు తీసుకు వెళ్ళింది .అప్పుడు వానర రూపం లోని ఆంజనేయస్వామి తీర్ధుల వారిని శంఖ చక్రాలతో ఉన్న తన విగ్ర హాన్ని ప్రతిష్టించి ,ఆలయ నిర్మాణం చేయమని కోరారు .

వ్యాస తీర్ధుల వారు స్వామి ఆనతిచ్చినట్లే విగ్రహ ప్రతిష్టచేసి దేవాలయ నిర్మాణం పూర్తి చేశారు .



💠 విజయ నగర సామ్రాజ్య పతనం తర్వాత ఈ అలయం ముస్లిముల పాలనలో ధ్వంసం అయ్యింది.

తదననంతరం సుమారు 150సంవత్స రాల క్రితం శ్రీ దున్న వీరాస్వామి అనే కాంట్రాక్టర్ విజయవాడ –ఏలూరురోడ్డు మార్గాన్ని నిర్మిస్తుండగా ఒక రోజు శ్రీ ఆంజనేయస్వామి వారు ఆయన స్వప్నంలో సాక్షాత్కరించి తన విగ్రహం ఉన్న చోటు ను చూపించి ,అక్కడ త్రవ్వి విగ్రహాన్ని బయటకు తీసి గుడి కట్టించమని ఆదేశించారు .


💠 వీరయ్య గారు అత్యంత భక్తీ శ్రద్ధలతో ఆ ప్రదేశానికి కూలీలను తీసుకొని వెళ్ళి త్రవ్వించారు .అక్కడ భూమిలో గంధ సింధూరం తో పూర్తి గా అలంకరింప బడ్డ శ్రీ మారుతి స్వామి విగ్రహం కనిపించింది .

ఆయన ఆ విగ్రహాన్ని బయటికి తీయించి ,ఇప్పుడు దేవాలయం ఉన్న చోట ఒక రావి చెట్టు కింద పాక వేసి అందులో స్వామిని ప్రతిష్టించి పూజాదికాలు నిర్వహించి భక్తులకు స్వామి దర్శనానికి వీలు కల్పించారు 


💠 అదే నేడు అత్యంత వైభవం గా విలసిల్లుతున్న మాచవరం శ్రీ దాసాంజనేయ స్వామి ఆలయం.


💠 శ్రీ దాస ఆంజనేయస్వామి విగ్రహం మూడు అడుగుల పొడవు ఉండి శ్రీ రాముడి ముందు మోకాళ్లపై కూర్చుని అతని రెండు చేతులు అంజలి గటించి  స్వామికి నమస్కరించినట్లు ఉంటుంది. 

ఇక్కడ ప్రతిరోజు అనేక మంది తాము కొత్తగా కొన్న వాహనాలకు పూజలు చేయిస్తారు 



💠 శ్రీ దాస ఆంజనేయుడు ఇక్కడ శ్రీరాముని ముందు మోకాళ్లపై కూర్చున్న దాసు (విద్యార్థిగా) కనిపిస్తాడు. 

అతని రెండు చేతులు అరచేతులతో ముడుచుకున్న అంజలిలో అతని ప్రభువుకు ప్రణామాలు సమర్పించడం కనిపిస్తుంది. 

అతని ప్రకాశవంతమైన కుండలం పరిమాణంలో పెద్దది మరియు మిరుమిట్లు గొలిపేది.


💠 ఈ ఆలయంలో పూజలు నిర్వహిస్తే భక్తుల కోర్కెలు నెరవేరుతాయని విద్యా, ఉద్యోగ, వ్యాపారాల్లో అన్నింటా కూడా విజయం చేకూరుతుందని భక్తుల నమ్మకం. 

నగరంలో ఏ చోట కొత్త వాహనాలు కొనుగోలు చేసినా ఈ ఆలయం వద్ద వాహన పూజను జరిపించటం కూడా ఆనవాయితీగా వుంది. 



💠 హనుమత్ జయంతి ఈ ఆలయంలో జరుపుకునే ప్రదాన పండుగ. 

ఆకు (తమలపాకు) పూజను ఎంతో గౌరవప్రదంగా నిర్వహిస్తారు.



💠 ఆలయం దర్శనం ఉదయం 6:00 గంటలు నుండి రాత్రి 9:30 గంటలు వరకు


     

💠 మాచవరం శ్రీ దాసాంజనేయ స్వామి దేవాలయం విజయవాడ పండిట్ నెహ్రు బస్‌స్టేషన్ నుండి 3 కి.మీ దూరంలో ఏలూరు రోడ్డులో ఉంది .

ఆపస్తంబుడు

 ఆపస్తంబుడు

ఆపస్తంబుడు శాకల్య మహాముని శిష్యుడు. యజుర్వేద విహితకర్మలను సూత్రములుగా చేసిన మహానుభావుడు. ఈ సూత్రములకే ఆపస్తంబ సూత్రములని పేరు. ఆపస్తంబుడను నామము అతనికి ఆపాదించిన వైనము కడు విచిత్రమైనది. ఒకానొకమారు ఒక బ్రహ్మణుడు తన పిత్రుదేవతల శ్రాద్ధకర్మ కొరకు భోక్తగా ఒక బ్రాహ్మణుని కొరకు వెదకుచుండినాడు. ఆ విప్రుడు వైశ్వదేవులను, మహావిష్ణువును ప్రార్ధించగా ఆపస్తంబుడు ప్రత్యక్షమైనాడు. పరమానంద భరితుడైన బ్రహ్మణుడు పిండప్రదానము పిమ్మట ఆపస్తంబునకు తృప్తిచెందునటుల భోజనము వడ్డించినాడు. కానీ ఆపస్తంబుడు తృప్తి చెందలేదు. ఎంత వడ్డించినా తృప్తినొందక పోవుట చూచి కోపావేశభరితుడైన ఆ బ్రాహ్మణుడు ఆపస్తంబుని శపించుటకై కమండలములోని జలమును చేతిలో తీసుకొని ఆతనిపై చల్లగా, మహామహిమాన్వితుడైన ఆ ఋషి ఆ నీటి బిందువులను గాలిలోనే ఆపివేశినాడు. ఆపమును (నీటిని) గాలిలో స్తంబింప చేసిన వాడు కనుక ఆ ఋషి ఆపస్తంబుడుగా ప్రసిద్ధి కెక్కినాడు.

 వేరొక సమయమున ఆపస్తంబుడు ఆగస్త్యమునిని కలిసి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులలో (త్రిమూర్తులలో) అధికులెవరని అడుగగా ఆగస్త్యుడు శివుడు గొప్పయని తెలిపి, ఆ పరమేశ్వరుని మెప్పించుటకు తగు సూచనలు ఇచ్చినాడు. ఆపస్తంబుడు అగస్త్యుని సూచనమేరకు గౌతమీనది సమీపమున శివుని గూర్చి ఘోర తప మాచరించి నాడు. శివుడు ప్రసన్నుడై ప్రత్యక్షముకాగా ఆపస్తంబుడు ఆ క్షేత్రమును దివ్యక్షేత్రముగా ఆశీర్వదించమని కోరినాడు. శివుడు ప్రసన్నుడై ఆ క్షేత్రమున స్నానమాచరించువారు దివ్యజ్ఞాన సంపన్నులు అగుదురని ఆ క్షేత్రమునకు ఆపస్తంబుని పేర ఆపస్తంబ తీర్థముగా ప్రసిద్ధి గాంచునని ఆశీర్వదించినాడు.

 ఆపస్తంబుని భార్యయగు అక్షసూత్ర మహా పతివ్రత. ఆపస్తంబునకు గర్కి అను కుమారుడు కలడు. గృహ్యసూత్ర సంగ్రహ మను విశేష సూత్రములు ఆపస్తంబుడు అందించిన అపూర్వ వరములు మహర్షుల, మహాత్ముల సంఖ్య గణనీయముగా తగ్గుటకు మనుష్యులలో ఇంద్రియ నిగ్రహము, ధర్మపరాయణత్వము తగ్గి, మోహం పుట్టటమే అని ఆపస్తంబుడు సూచించినాడు.

 ద్యుమత్సేను డను రాజు సాల్వదేశ అధిపతిగా వెలుగొందుచుండినాడు. ఈతని భార్య శైబ్య ఈతని కుమారుడు సత్యవనుడు. కారణంతరమువల్ల ద్యుమత్సేనుని చూపు మందగించి అంధత్వము దాపురించినది. శత్రురాజులు రాజ్యమును జయించగా భార్య పుత్రులతో అరణ్యమునకు పోగా ఆపస్తంబుడు ఓదార్చి ధైర్యమును ఒనగూర్చినటుల గూడా తెలియుచున్నది.  — భారతము – వనపర్వము

 ఇట్టి మహానుభావుడు ఆపస్తంబ సూత్ర కర్త.

సింధువు



బిందువులన్నీ కూడితేనే

సింధువు....

విడిగా వుంటే విలువే లేదు.... 

కలిసిపోతే వేరు కాదు...


చినుకులన్నీ చేరి

చిటపటగా కురిసి

చిన్ని వంకలై

వాగులాగా సాగి...


ఏరులా సెలయేరులా

నదితో కలిసి...

కడలివైపు ఆడుగులేసి

కలిసిపోయాక....


అస్తిత్వమే లేదు

అద్వైతమే ఇక

అనంతమైన సాగరం

అపురూప సంగమం...



సెలయేరు లాంటి మనసు,  

సాగరం లాంటి పరమాత్మ వైపు అడుగులు వేశాక, స్థితిని, గతిని వదిలేసి, 

అస్థిత్వం లేని ఆత్మలో లీనమై పోయినప్పుడు.. 

ఇక 

*అంతా అద్వైతమే..*

*అద్భుతమైన సదానందమే.* *చిదానందమే..*

*పరమానందమే...*. 


🙏🙏🙏🙏🙏🙏

అర్ధ నారీశ్వర తత్వం

 *

ఈ సృష్టి మొత్తం అర్ధ నారీశ్వర తత్వంతో నిండి ఉన్నది.. 


అందుకే వారు ఈ సృష్టికే ఆది దంపతులు, తల్లిదండ్రులు. 

ఏ ఒక్కరు లేకున్నా, ఈ సృష్టి లేదు. 


అమ్మ శక్తి స్వరూపిణి అయితే ఆ శక్తికి చైతన్యము, కదలిక ఇచ్చేది అయ్యవారు. 


ఇది ప్రతి విషయంలో అన్వయించవచ్చు.. 


ఉదా.. మాట అయ్యవారైతే మాటలోని శబ్దం అమ్మవారు..


అలాగే దృష్టి, దృశ్యము... [చూపు (చూసే శక్తి), చూసే వస్తువు]


గమనము .. చలనము.. (నడక, నడిచే శక్తి)


ధ్యాని, ధ్యేయ వస్తువు... 


ఇలా ప్రాకృతికమైన బంధంతో  ఈశ్వరుడు అంతటా వ్యాపించి ఉన్నాడన్న సత్యమును గ్రహించడం మనం చేసే ధ్యానము...  


ఆ రెండూ ఒకటే అన్న సత్యాన్ని గ్రహించి, అనుభూతి చెంది, తానే ఈశ్వరుడుగా మారడం అఖండ సమాధి స్థితి... 


🙏🙏🙏🙏🙏🙏

ఓం అరుణాచల శివ

కేదారము

 కేదారము

               

ఒకసారి పాండవులు అయిదుగురు కలిసి కేదారేశ్వర దర్శనమునకు వెళ్ళారు.


అప్పటికి ఆలయంలో చిన్న శివలింగం ఉంది. పాండవులు ఏమి చేస్తారో చూడాలని శివునికి ఒక ముచ్చట. ఒక చిన్న దున్నపోతు రూపంలో పరుగెత్తాడు. పాండవులు దానిని గమనించారు. వారు అది కచ్చితంగా ఆదిశంకరుడే అయి ఉంటాడని భావించారు. 


మహిషరూపంలో వెడుతున్నా అంతటా ఈశ్వర దర్శనం చేశారు పాండవులు. శివుడు అనుకోలేదు. దాని కాళ్ళు పట్టుకోవాలని వారు ఆ మహిషం దగ్గరికి వెళ్ళారు. వాళ్లకి దాని కాళ్ళు అందలేదు. తోక అందింది. ఈశ్వర స్వరూపంగా దాని తోక పట్టుకున్నారు. 


వాళ్ళ భక్తికి మెచ్చుకున్నవాడై పరమేశ్వరుడు తన పృచ్ఛభాగమును అక్కడ విడిచి పెట్టి దానిని శివలింగంగా మార్చివేశాడు. అదే ఇప్పుడు మనందరం దర్శనం చేస్తున్న కేదారలింగం.


కేదారక్షేత్రం వెళ్ళినవారు తెలియక ఒక పొరపాటు చేస్తూ ఉంటారు. కేదార లింగమును తిన్నగా కంటితో చూడకూడదు. వలయమును పట్టుకు వెళ్ళాలి. వలయము అంటే చేతికి వేసుకునే కంకణం వంటి గుండ్రని వస్తువును తీసుకువెళ్ళాలి. అంతరాలయంలో ప్రవేశించగానే కంటిముందు ఆ వలయమును పెట్టుకుని అందులోంచి చూడాలి.


కేదారము దర్శనము చేతనే మోక్ష మీయగలిగిన క్షేత్రం గనుక సమస్త బ్రహ్మాండము నిండినవాడు వీడే అని తెలుసుకోవడానికి కంటికి అడ్డంగా ఒక వలయాకరమును పెట్టుకుని అందులోంచి కేదార లింగమును చూడాలి. 


అలా చూసిన వలయ కంకణమును అక్కడ వదిలి పెట్టి వచ్చెయ్యాలి.


మన చేతికి వున్న ఏ బంగారమో ఉపయోగించినట్లయితే దానిని అక్కడ వదిలిపెట్టేయడానికి మనసొప్పదు. 


కాబట్టి ముందే ఒక రాగి కంకణమును పట్టుకుని వెడితే రాగి చాలా ప్రశస్తము కనుక, ఆ కంకణములోంచి కేదార లింగమును దర్శనం చేసి దానిని అక్కడ వదిలి పెట్టి రావచ్చు.


ఇకముందు వెళ్ళేవారు ఒక వలయంలోంచి కేదారలింగమును దర్శనం చేసే ప్రయత్నం చేస్తే మంచిది.

                            ~చాగంటి.

.

అహంకారం వినాశహేతువు

 అహంకారం వినాశహేతువు

[ఈ కథ మహాభారతంలోని ఉద్యోగపర్వం లోనిది]

🪷🌹🪷🌹🪷🌹🪷🌹🪷🌹🪷


🪷 యుద్ధాన్ని ఆపడానికి కృష్ణుడు చివరి ప్రయత్నంగా రాయబారానికి వచ్చి తను చెప్పదలచిన హితవు చెప్పాడు♪. అనంతరం అదే సభలో ఉన్న మహర్షి పరశురాముడు దుర్యోధనుడికి చేసిన హితబోధ సందర్భంలో వచ్చే కథ ఇది). 


🪷 "నాయనా! దుర్యోధనా! నీకూ, నీ వారికీ సర్వప్రపంచానికీ మేలు కలిగే విషయం చెబుతున్నాను♪. ఆవేశపడకుండా సావధానంగా విను♪. 


🪷 చాలా రోజుల క్రితం మాట♪. దంభోద్భవుడు అనే పేరు గల రాజు ఉండేవాడు♪. ఆయన ఈ భూమండలం అంతటినీ పాలించేవాడు. భుజబలంలో, పరాక్రమంలో ఆయనకు సాటి వచ్చే వారు లేరు ఆ రోజుల్లో♪. అంతటి మహా యోధుడాయన♪. ఆయన రోజూ ఉదయం లేచి, కాలకృత్యాలు పూర్తి కాగానే బాగా అలంకరించుకుని రత్నకిరీటం ధరించి, కోడెత్రాచు వంటి కరవాలం చేతబట్టి సభాభవనానికి వచ్చి బంగారు సింహాసనాన్ని అధిష్టించేవాడు♪. వంది మాగధులు ఆయన బల పరాక్రమాలను గానం చేస్తుంటే, కోరమీసం మెలితిప్పుతూ ఆనందించేవాడు♪.


🪷 అనంతరం, తన కొలువులో ఉన్న వారందరినీ చూస్తూ భూలోకంలో నాతో ఎవడైనా యుద్ధం చేయగల మహావీరుడు ఉన్నాడా? గద, ఖడ్గ, ప్రాసాది ఆయుధాలతో కానీ, ఆగ్నేయ, వారుణ, వాయవ్యాది అస్త్రాలతో కానీ నన్ను ఎదుర్కోగల వీరుడుంటే చెప్పండి♪. అంతేకాదు.. మల్లయుద్ధం చేయగల వీరుడు కూడా ఉంటే చెప్పండి♪. వాడినీ క్షణంలో కడతేరుస్తాను♪.' అని గర్వంగా నవ్వుతూ భుజాలు ఎగుర వేసేవాడు. ఆయన బలపరాక్రమాలు ఎరిగిన వారెవరూ ఆయనతో యుద్ధానికి దిగే వారు కాదు.


🪷 అలా, ఆ రాజు అహంకారం నానాటికీ పెరుగుతూ వచ్చింది. నా అంత వాడు లేడనే గర్వంతో ఆయన విర్రవీగుతూ తిరుగుతుండే వాడు. అటువంటి అహంకారం ఉన్న రాజుకు ఆయన అనుచరులు కూడా అటువంటి అవివేకులే దొరుకుతారు కదా♪! వారు రోజూ ఆయన బలపరాక్రమాలను పొగుడుతూ ఉండేవారు♪.


🪷 అలా ఉండగా, ఒకనాడు, ఆయనను చూడటానికి సభా భవనానికి వచ్చిన దూరదేశీయులైన విప్రులు 'మహారాజా! మీరు నిజంగా మహావీరులే. బలపరాక్రమ సంపన్నులే. అయితే, గంధమాదన పర్వతం మీద నర-నారాయణులని ఇద్దరు తీవ్ర నిష్టతో తపస్సు చేస్తున్నారు. వారిని జయించగల వీరులు మూడు లోకాలలో లేరని విన్నాము♪. తమకు కోరిక ఉంటే వారితో యుద్ధం చేయవచ్చు' అన్నారు♪.


🪷 ఆ మాట వినడంతోనే ఆయన ఆగ్రహంతో మండిపడ్డాడు. కత్తి ఝుళిపించి, నేల మీద పాదంతో గట్టినా తన్ని, 'ఎంత కావరం? నన్ను మించిన యోధులా.. వారు?' అంటూ సేనల్ని సన్నద్ధం చేసి ధనుర్బాణాలు తీసుకుని బయల్దేరాడు♪. అలా గంధమాదన పర్వతం చేరాడు.


🪷 ప్రశాంతంగా ఉన్న వనంలో వారు తపస్సు చేసుకుంటున్నారు. వారిని చూస్తూనే రాజు గారు తొడగొట్టి, యుద్ధానికి పిలిచి, నవ్వుతూ కోరమీసం మెలితిప్పాడు♪. నర, నారాయణులు తమ ఆశ్రమానికి వచ్చిన మహారాజుకు అతిథి సత్కారాలు జరపబోయారు. మహారాజు ఆ అతిథి సత్కారాలను తిప్పికొట్టాడు.


🪷 'ఇవన్నీ అనవసరం. యుద్ధం.. యుద్ధం మాత్రమే కావాలి' అని అట్టహాసం చేశాడు. అప్పుడు నర-నారాయణులు, 'ఎవరితోనూ సంబంధం లేకుండా కళ్లు మూసుకుని ఈ ప్రశాంత ప్రదేశంలో తపస్సు చేసుకునే మునులం మేం. మాతో యుద్ధం చేయాలనే కోరిక ఎందుకు కలిగింది మీకు¿' అని ప్రశ్నించారు♪. వారి మాటలు వినిపించుకోలేదు మహారాజు. 'ఈ రోజు నాతో మీరు యుద్ధం చేయాల్సిందే' అని పట్టుబట్టాడు. అలా అంటూనే బాణం తొడుగుతుండగా, అది చూసిన నరుడు నవ్వుతూ, ఒక దర్బపుల్ల తీసి, 'ఇదిగో! ఈ గడ్డిపరక నీ సేనను నిలువరిస్తుంది' అని ఆ దర్భను వదిలాడు.


🪷 ఆ రాజు బాణ వర్షం కురిపించాడు. ఆ గడ్డిపరక అన్ని బాణాలనూ ముక్కలు ముక్కలు చేసింది♪. ఈలోగా రాజు సైన్యంలోని వారందరూ ముక్కులూ, చెవులూ ఊడిపోయి రోదనలు చేయడం మొదలుపెట్టారు♪. రాజుకి ఇదంతా చూసి తల తిరిగిపోయింది♪. సేనలు పలాయనం చేస్తున్నాయి♪. అది చూసి రాజుకు గుండె జారింది♪. ఆయుధాలన్నీ కిందపెట్టి, తల వంచి నర-నారాయణుల పాదాల మీద వాలాడు రాజు♪. 


🪷 'ఆర్యా! నన్ను క్షమించి అనుగ్రహించండి. నా గర్వానికి ప్రాయశ్చిత్తం అయింది' అని దీనంగా ప్రార్థించాడు.


🪷 అప్పుడు, నర-నారాయణులు నవ్వుతూ, 'మహారాజా! సిరిసంపదలు కలవారు పేదసాదలకు దాన ధర్మాలు చేసి గొప్పవారు కావాలి♪. అలాగే, బల పరాక్రమాలు ఉన్న వారు దుర్మార్గుల బారి నుంచి సజ్జనులను రక్షించడానికి తమ శక్తియుక్తులను వినియోగించాలి♪. అంతేగానీ, అహంకారంతో ఇలా తిరగరాదు♪. ఇరుగు పొరుగులకు ఉపకారం చేయని వాడి జన్మ వ్యర్థం' అన్నారు♪.


🪷 మహారాజు వారి బోధ విని, ఆనాటి నుంచి అహంకారం విడిచి, అందరి శ్రేయస్సునూ దృష్టిలో ఉంచుకుని తన సంపదలను బీదలకు దానం చేస్తూ, తన బలంతో దుర్మార్గులనూ, క్రూరులనూ శిక్షించి, న్యాయమార్గాన సజ్జన సేవ చేసి పేరు ప్రఖ్యాతులు పొందాడు♪. 


🪷 కనుక దుర్యోధనా! అహంకారం, బల గర్వం ఎప్పుడూ పనికిరావు♪. అవి ఎవరికి ఉంటాయో వారినే నాశనం చేస్తాయి' అని చెప్పడం ముగించాడు పరశురాముడు.


🙏 సర్వే జనాః సుఖినోభవంతు.

చారిత్రాత్మక కథాస్రవంతి🌹* . ♦️ *ఆర్య చాణక్య*♦️ *పార్ట్ - 81*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

.    *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*

.           ♦️ *ఆర్య చాణక్య*♦️


*పార్ట్ - 81*


చాణక్య చంద్రగుప్తులు విడిది భవనంలో రహస్య చర్చలలో నిమగ్నులయ్యారు. 


చంద్రగుప్తుడు అసంతృప్తిగా చూస్తూ "సుగాంగ ప్రాంగణంలో ప్రవేశానికి ఇప్పుడు మంచి రోజులు కావంటూ రాక్షసామాత్యుడు చెప్పిన మాటలు అసత్యాలని తెలిసింది. మనల్ని రాజభవనంలోకి అడుగుపెట్టనియ్యకుండా రాక్షసుడే ఏదో ఎత్తు వేస్తున్నాడని నాకు అనుమానంగా ఉంది. మీరు దీనికి ఏదైనా ప్రతిక్రియ ఆలోచించాలి" అన్నాడు. 


చాణక్యుడు నవ్వి "పురోహితుల చేత రాక్షసునికి ఆ మాటలు చెప్పించింది నేనే... ఆ సంగతి తెలుసుకోలేక అతడే చిలకపలుకులు పలికాడు" అని చెప్పాడు. 


చంద్రుడు చకితుడవుతూ "మీరా ? ఎందుకలా చెప్పించారు ?" అనడిగాడు. 


చాణక్యుడు సాలోచనగా తలపంకిస్తూ "కోట మన వశమైన మాట నిజం. కానీ శత్రునిశ్శేషం కాలేదు. శత్రువర్గం పూర్తిగా నశించిన తర్వాతనే నీ సుగాంగ ప్రవేశమూ, పట్టాభిషేకమున్నూ... అంతవరకూ జరిగేదంతా చూస్తూ ఉండు. ఏమైనా, చంద్రగుప్తుడొక్కడే మగధ సింహాసనాన్ని అధిష్ఠిస్తాడు..." అని చెప్పాడు గంభీరంగా. 


చంద్రుడు తృళ్లీపడి "అదేమిటి ? పర్వతకుడికి అర్థరాజ్యం ఇస్తామని మాట యిచ్చాంగదా ?" ప్రశ్నించాడు. 


"మాట ఇచ్చింది మేము. దాని పాపం, ఫలితం మాదే... నువ్వు నిశ్చింతగా ఉండు..." అని చెప్పాడు గంభీరంగా. 


అదే సమయంలో మందిర ద్వారం బయట కాపలదార్లతో ఎవరో గొడవపడడం వినిపించింది. 'చాణుక్యుల వారిని అత్యవసరంగా కలుసుకోవాలనీ, లోపలికి వెళ్ళనివ్వమని' ఎవరో అడుగుతుంటే భటుడు వీలు కాదంటున్నాడు. చాణక్యుడు ఆ గొంతుని గుర్తుపట్టి "శార్జరవా ! రారా లోపలికి" ఆదేశించాడు బిగ్గరగా. మరుక్షణం మారువేషంలో ఉన్న శార్జరవుడు లోపలికి వచ్చి ఆర్యునికి అభివాదం చేశాడు. 


అతడిని ఎగాదిగా చూసి "నిన్ను రాక్షసగృహంలో భృత్యునిగా నియమించాను కదా ... ! ఏమిటి విశేషాలు ?" అడిగాడు చాణక్యుడు. 


శార్జరవుడు రాక్షసుడి ప్రతిజ్ఞ గురించి చెప్పి "రాత్రికి రాత్రే ఆమాత్రుడు రహస్యంగా, ఒంటరిగా ఎవరినో కలుసుకోవడానికి బయలుదేరాడు. నేను నీడలా ఆయన్ని వెంటాడాను. ఆయన సందులు గొందుల వెంట నడుస్తూ చివరికి శోణనదీ తీరానికి చేరుకున్నాడు. నేనూ అక్కడికి చేరాను. అక్కడ తెప్ప ఒకటి సిద్ధంగా ఉంది. అమాత్యుడు దానిలో ఎక్కి అవతలి తీరానికి బయలుదేరాడు. నేను వెంటనే ఇక్కడికి వచ్చేసాను" అని చెప్పాడు. 


"మరి నువ్వెందుకు నదిని దాటలేదు ?" విసుగ్గా ప్రశ్నించాడు చాణక్యుడు. 


"అక్కడ ఇంకొక పడవేది లేదు. నాకా ఈతరాదు ... అందుకని..." నసిగాడు శార్జరవుడు.  


చాణక్యుడు విసుక్కుంటూ "చీ ఛీ ... ఏం చెప్పినా నువ్విలాగే చేస్తావ్... ఎప్పుడూ అర్థసత్యాలే మోసుకొస్తావు.... నీకసలు బుద్ధిలేదురా... నీకంటే సిద్ధార్థకుడే వెయ్యిరెట్లు నయం" అన్నాడు. 


శార్జరవుడు వుక్రోషపడిపోతూ "ఆ సిద్ధార్థకుడికి ఈత వచ్చుగదా... అందుకే అతడిని అమాత్యుడి వెనుక అనుసరింపజేసి నేనిలా వచ్చాను..." అన్నాడు. 


చాణక్యుడు వచ్చే నవ్వుని బలవంతంగా పెదాల మధ్య బిగబట్టుకుంటూ "ఆ ఏడుపేదో ముందే ఏడవొచ్చుగదా...?" అన్నాడు. 


"ఏదీ... తమరు నన్ను సాంతం ఏడవనిస్తే గదా..." అంటూ శార్జరవుడు మొహం మాడ్చుకుని "రాక్షసుని అంతరంగ మదనంలోంచి పెల్లుబికిన దాన్నిబట్టి అతడు శోణనది అవతలి తీరాన వానప్రస్థాశ్రమ దీక్షలో ఉన్న సర్వార్ధ సిద్ధిని కలుసుకోవడానికి వెళ్లాడని తెలుస్తోంది" అని చెప్పాడు. 


"భేష్ ! ఇప్పుడు నిజంగా చాణక్యుడి శిష్యుడివనిపించుకున్నావురా !" అన్నాడు చాణక్యుడు అభినందనగా. 


శార్జరవుడు బుంగమూతి పెట్టి "మీరు నాకన్నీ నేర్పారుకానీ ఈత మాత్రం నేర్పలేదు. అది కూడా నేర్పించి వుంటే..." అన్నాడు అర్థోక్తిగా.


"ఆ నెపం నామీద వేస్తున్నావా ? సరే..." చాణక్యుడు తలపంకించి "ఎవరక్కడ ?" పిలిచాడు బిగ్గరగా. మరుక్షణం ఇద్దరు భటులు లోపలికి వచ్చారు. 


చాణక్యుడు వాళ్ళవైపు అదోలా చూస్తూ "ఈ శార్జరవుడిని తీసుకువెళ్లి పడవ ఎక్కించి శోణనదీ మధ్య భాగానికి చేర్చి... అక్కడ వీడిని ఎత్తి నదిలోకి విసిరి పారేయ్యండి" ఆజ్ఞాపించాడు. 


"అన్యాయం గురుదేవా ! అన్యాయం... అర్ధరాత్రి పూట చీకటిలో చలిలో నన్ను నదిలో పారేయించడం అన్యాయం..." అని వాపోతుంటే భటులు బర బర అతని రెక్కలు పట్టుకొని బయటికి లాక్కుపోయారు. 

(ఇంకా ఉంది)...🙏


*సేకరణ:- శ్రీ రమణమూర్తి గారి వాట్సాప్ పోస్ట్.*


🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

మన వేదములు – శాస్త్రములు

 మన వేదములు – శాస్త్రములు


వ్యాకరణము


షడంగాలలోని శిక్ష వేదభగవానునికి నాసికాస్థానం. వ్యాకరణం ముఖం. అనగావాక్కు. వ్యాకరణా లెన్నోవున్నా, ప్రధానమైనది పాణినీయం. పాణినీయానికి వరరుచివార్తికమూ పతంజలిమహరి భాష్యము వ్రాశారు. వ్యాకరణానికీ, ఇతర శాస్త్రాలకూ భేదమేమిటంటే ఇతరశాస్త్రాల భాష్యాలకన్నా సూత్రాలకేగౌరవం. వ్యాకరణవిషయం అట్లాకాదు. సూత్రాల కన్నా వార్తికానికీ, వార్తికానికన్న భాష్యానికీ గౌరవం అధికం. 


''సూచనాత్ సూత్రమ్'' పాణిని వ్యాకరణం సూత్రరూపంలోవున్నది. అన్నిశాస్త్రాలకూ భాష్యాలున్నా వ్యాకరణ భాష్యానికే మహాభాష్యమన్న గౌరవం. 


చోళమండలంలో శివాలయాలు ఎక్కువ. శివాలయాలలో 'వ్యాకరణదాన మంటపాలు' అని మంటపాలుంటవి. శివాలయానికిన్నీ, వ్యాకరణానికిన్నీ ఏమి సంబంధం? 


నృత్తావసానే నటరాజరాజో 

ననాద ఢక్కాం నవపంచ వారమ్. 

ఉద్ధర్తుకామః సనకాదిసిద్ధా 

నేతద్విమర్శే శివసూత్రజాలమ్ || 


పరమేశ్వరుడు మహానటుడు. ఆయన ఢక్క నుండి సూత్రాలేర్పడినవి. వానికి మాహేశ్వరసూత్రాలని పేరు. 


బొంబాయిలో నిర్ణయసాగర ప్రెస్ అనే ముద్రణాలయం ఒకటివుంది. వారు కావ్యమాల అని పేరుపెట్టి వరుసగా ప్రాచీనకావ్యాలను ప్రకటించేవారు. ఆ గ్రంథాలలో కొన్ని వెనుకటి సంస్కృతి శాసనాలనుగూర్చి వేంగినాటికి చెందిన తామ్రశాసనాన్నిగూర్చి, ప్రకటించినగ్రంథం చదవటం తటస్థించింది, కృష్ణా కావేరీ మధ్యప్రదేశమే వేంగినాడు. తెనుగు చోళులకున్నూ, తంజావూరు చోళులకున్నూ వియ్యమూ నెయ్యమూ ఉండేది. బృహదీశ్వరాలయం నిర్మించిన రాజరాజ నరేంద్రుడు చోళుడే. వేంగినాటికి చెందిన కులోత్తుంగచోళుడు చోళరాజ్యానికి వచ్చినప్పుడు ఆంధ్రదేశంలో వేదాన్ని మరింత ప్రచారంలోనికి తేదలచి చోళదేశపు ద్రావిడ బ్రాహ్మణులలో 500 కుటుంబాలను తనతోపాటు వేంగినాటికి తీసుకొనిపోయి కాపురం పెట్టించాడట. ఆంధ్రదేశంలో ద్రావిడశాఖకు చెందిన బ్రాహ్మణులు ఈ కుటుంబపరంపరలోనివారే. 


నిర్ణయసాగరంవారు ప్రచురించిన గ్రంథంలోని శాసనం ఈ ఐదువందల బ్రాహ్మణకుటుంబాలవారి గోత్రాలేమిటో ఆ కుటుంబాలలోనివారు ఏఏ శాస్త్రాలలో నిపుణులో వారు ఏ ఏ కార్యాలు చేయవలసియుండిరో వారికి ఏ ఏ చోట భూవసతులు కల్పింపబడెనో విశదీకరించినది. కోరినవారికి వేదములూ, శాస్త్రములూ చెప్పడమే వారి పని. ''రూపావతారవక్తుః ఏకో భాగః'' అన్న వాక్యం ఆ శాసనంలో కనిపించింది. ''రూపావతారం'' చెప్పేవారికి ఒకభాగం అని దీని అర్థం. రూపావతారం అనేది ఒక వ్యాకారణశాస్త్రం. 


ప్రస్తుతం వ్యాకరణగ్రంథాలలో అధికప్రచారం కలది 'సిద్ధాంతకౌముది'. అప్పయదీక్షితులవారి శిష్యుడైన భట్టోజీ దీక్షితులు దీనిని వ్రాసినవారు. ఇదిపాణినిసూత్రాలకు వ్యాఖ్యానం. భట్టోజీదీక్షితులు అద్వైతమతానుసారియైన 'తత్వకౌస్తుభం' అనేమరొక గ్రంథం, అప్పయదీక్షితులవారి ఆజ్ఞానుసారం మధ్వమతం ఖండిస్తూ 'మధ్వమత విధ్వంసన' మన్న ఇంకొక గ్రంథమున్నూ వ్రాశారు. 


సిద్ధాంతకౌముది వ్యాప్తికికాకముందు రూపావతారమే ప్రచారంలోవున్న వ్యాకరణం. రూప మనగా శబ్దంయొక్క మూలస్వరూపమే. రూపావతారమనగా శబ్దముయొక్కమూలస్వరూపవ్యక్తీకరణం. నిర్ణయసాగరంవారుప్రచురించిన తామ్ర శాసనం వేగినాటిలో రూపావతార వైయాకరణులకు కల్పించిన భూవసతులను పేర్కొన్నది. ఆరోజులలో వ్యాకరణానికి అంత ప్రాధాన్యం. వేగినాటికి వలసవెళ్ళిన బ్రాహ్మణులలో కొందరికి 'షడంగవిదు' లన్న బిరుదులున్నవి. వారిపేళ్ళుసహితము అరవపేర్లే. 'అంబలకూత్తాడువన్ భట్టన్' ''తిరువరంగముడై యాన్ భట్టన్' అన్న ద్రావిడనామములను ఇందు చూడవచ్చును. 


వీరందరూ స్మార్తులే. కాని పైన చెప్పిన పేళ్ళలో మొదటిది శివనామం, రెండవది వైష్ణవం. తిరువంగముడై యార్ పేరు వైష్ణవమేగాని నామధారి స్మార్తుడే. ఆ పేరుకు సంస్కృతము రంగస్వామి. తిరువంబల కూత్తాడువన్ అన్న పేరు నటరాజ శబ్దానికి తమిళం. కుత్తాడుట అనగా నాట్యంచేయటం. మనం చేయవలసిన నాట్యాలన్నీ ఈనటరాజేచేస్తున్నట్లున్నది. నటరాజునృత్యం అందరూ చూడలేరు. తపోధనులైన సనకాదులు పతంజలి, వ్యాఘ్రపాదులు దైనీసంపద కలవారు కనుక, దివ్యచక్షువులతో దానిని విలోకిస్తున్నారు. ఒక్కజ్ఞానచక్షువు లున్నవారే, ఆనటరాజతాండవాన్ని దర్శించగలరు. కృష్ణభగవానుల విశ్వరూపాన్ని ఒక్క అర్జునుడు, సంజయుడుమాత్రం చూడగలిగినవారు. సంజయునకు వ్యాసభగవానుల ప్రసాదం, అర్జునునకు ''దివ్యం దదామి తే చక్షుః పశ్య మే యోగ మైశ్వరమ్'' అని కృష్ణపరమాత్మయే దివ్యచక్షువు ప్రసాదించాడు. 


మనకండ్లలో లెన్సువంటి సాధన మొకటివున్నదనిన్నీ, దానిసాయంచేతనే మనంచూడగల్గుచున్నామనిన్నీ శాస్త్రజ్ఞులు చెప్పుతున్నారు. వస్తువులన్నీ ఒక నిర్ణీతపరిమాణంలో మనకు కనబడటానికి ఆ కళ్ళలోని లెన్సే కారణం అన్నమాట. ఈ దృశ్యప్రపంచంలోని వస్తువులను మరింత ఘనపరిమాణంలో చూడాలని మనం తలచుకొంటే దానికి తగ్గ లెన్సు మన చక్షువులకు అమర్చుకోవాలి. అందుచే మనము చూచేదంతా సత్యమే అని చెప్పగలమా? రూపంయొక్క ఘనపరిమాణం మనదృష్టిని అనుసరించి ఉంది. దీనినే వేదాంతం దృష్టి, సృష్టివాదమని అంటున్నది. 


సనకాదులది సత్యదృష్టి, అందుచేతనే నటరాజునాట్యం చూచి ఆనందిస్తున్నారు. ఆనృత్యంలో ఉదయించిన శబ్దాలు, శివస్వరూపాన్ని ఏకభోగంగా అనుభవించడానికి వీలుగా ఉన్నవి. వానిభక్తిసూత్రాలుగా నందికేశ్వరుడు గ్రహించి భాష్యం చేశాడు. ఆనృత్య సందర్భంలో పాణిని కూడా ఉన్నాడట. 


పాణినికథ బృహత్కథలో ఉన్నది. ప్రాకృతభాషలు ఆరు. వానిలో పైశాచి ఒక్కటి. బృహత్కథ పైశాచిలో గుణాఢ్యుడు వ్రాశాడు. 


'చిత్రార్థాం న బృహత్కథా మచకథమ్'కువలయానందము. ఈబృహత్కధను క్షేమేంద్రుడు సంస్కృతములో సంక్షిప్తంగా రచించాడు. దీని ననుసరించి సోమదేవభట్టు కథాసరిత్సాగరం సంతరించాడు. 


మగధదేశంలో పాటలీపుత్రంలో (ప్రస్తుతం పాట్నా) వరోపాధ్యాయులు, ఉపవరోపాధ్యాయులని ఇరువురు పండితులుండేవారు. వీరిలో ఉపవరోపాధ్యాయులు చిన్న. అతని కొమారై ఉపకోసల. వరోపాధ్యాయులవారిశిష్యులే వరరుచి, పాణిని, ఈశిష్యద్వయంలో పాణిని మందబుద్ధి. చదు వెక్కలేదు. వరోపాధ్యాయు లాతని జూచి'నాయనా నీవు హిమాలయాలకు వెళ్ళి తపస్సు చేసి, ఈశ్వరానుగ్రహం పొందితేకాని, నీకు చదువు ఎక్కేటట్టు లేదు. అందుచే వెళ్ళి తపస్సుచెయ్యి' అని ఆదేశించారు. అంతటితో హిమాలయాలకు వెళ్లి పాణిని ఉగ్రతపస్సుచేత ఈశ్వరునిమెప్పించిఈశ్వరప్రసాదం పొందాడు. పై పెచ్చు నటరాజు తాండవాన్ని చూడగల పుణ్యంకూడా సంపాదించుకొన్నాడు. నృత్తావసానసమయంలో పుట్టిన శబ్దాలను పదునాలుగు సూత్రాలుగా గ్రహించి అష్టాధ్యాయి. 


'అఇఉణ్, ఋఈక్, ఏఓజ్, ఐఔచ్, హయవరట్, లణ్, ఞమఞణనమ్, ఝభఞ్, ఘఢధష్, జబగడదశ్, ఖఫఛఠధ, చటతవ్, కపయ్, శషసర్, హల్-' అనేవి ఈపద్నాల్గు సూత్రాలు. 


అచ్చులకు ఆకారము ఆది. ఈ మాహేశ్వర సూత్రాలలో 'అ' అనేది మొదటవది. 'హల్' చివరిది. వీనిమధ్యలో ఇమిడిఉన్న అచ్చులనూ, హల్లులనూ 'అల్' అ్సనేది సూచిస్తుంది. 'అలోంత్యస్య' అనేదొక పాణినిసూత్రం. లోకములో శబ్దశాస్త్రాలను ఏర్పరచినది పరమేశ్వరుడుకనుక శివాలయాలలో వ్యాకరణదానమంటపాలు నిర్మించే వాడుక ఏర్పడినది. 


దాదాపు నాలుగువందల సంవత్సరములకు పూర్వం తంజావూరు రఘునాథుడనే నాయకవంశమునకు చేరిన రాజు పాలించేవాడు. అతనికాలములో యజ్ఞనారాయణదీక్షితులు అన్న శివభక్తులొక రున్నారు. వారు 'సాహిత్యరత్నాకరం' అనే గ్రంథం వ్రాశారు. అందలి శివస్తోత్రమిది. 


అజ్ఞాతప్రభవై ర్వచోభి రఖిలై రాలంబి ధర్మప్రభా(థా) 

హేతుత్వం వివిధాధ్వరక్రమకృతి ష్వేకాయన శ్చోదనైః. 

తేషా మధ్వరకర్మణా మధిపతిం త్వా మీశ నారాధయన్ 

ధర్మా నర్జయితుం న శ క్ష్యతి జనో దక్షో ప్యదక్షోఽథవా|| 


మనం ధర్మాన్ని అనుష్ఠించాలన్నా, చేసిన కర్మలు ఫలించాలన్నా భగవంతుని కృప అవసరం. వేదవాక్కుఎక్కడ ప్రభవమైనదో ఎవరికీ తెలీదు. ఆవేదం 'ధర్మం ఇది' అని నిర్ధారిస్తున్నది. అనేక అధ్వరాలనూ, నానావిధకర్మలనూచేయుమని ఆజ్ఞ ఇస్తున్నది. యజ్ఞకర్మాధిపతివి నీవు. యజ్ఞేశ్వరుడవు నీవు. నిన్ను ఆరాధించకపోతే ఇవన్నీ ఇట్లా ఫలితాన్ని ఇస్తవి? 


''ఆవో రాజాన మధ్వరస్య రుద్రం హోతారం'' అని తైత్తిరీయ సంహిత. ఎవడు ఎంత కుశలుడైనా, దక్షుడైనా పరమేశ్వరుని ఆరాధన లేకపోతే వానికౌశలం నిరుపయోగమై పోతుంది. వానికి ఏ కార్యమూ సిద్ధించదు. దీనికి దక్షుడే సాక్ష్యం. 


ఈ శ్లోకానికి ముందున్నది వ్యాకరణమును గూర్చి. 

అదౌ పాణినినా(వా) దతొఽక్షర సమామ్నాయోపదేశేనయః 

శబ్నానా మనుశాసనం వ్యకలయ చ్ఛాస్త్రేణ సూత్రాత్మనా, 

భాష్యంతస్యచ పాదహంసకరవైః ఫ్రౌఢాశయం తం గురుం 

శబ్దార్థప్రతిపత్తిహేతు మనిశం చంద్రార్థచూడంభజే|| 


అక్షర సమామ్నాయము వ్యాకరణము. వేదములు ఈశ్వరనిశ్వాసాలు. ఈశ్వరునిచేతిలోని ఢక్కానాదమేశబ్దాను శాసనం. 


నీవు చేయి ఆడించావు; సూత్రా లేర్పడినవి. పాదవిన్యాసం చేశావో లేదో భాష్య మేర్పడినది. 


వ్యాకరణభాష్యం వ్రాసిన పతంజలి ఆదిశేషుని అవతారం. ఆయన పరమేశ్వరుని మ్రోల పాదాక్రాంతుడైయున్నందున ఆయన వ్రాసిన భాష్యం మహేశ్వర పాదవిన్యాసములో నుంచి పుట్టింది. ఇట్లా శబ్దార్థాలు రెండున్నూ పరమేశ్వరునిచే సృష్టింపబడినవి. వ్యాకరణం పరమేశ్వరుని సృష్టి, ''శబ్దార్థ ప్రతిపత్తిహేతు మనిశం చంద్రార్థచూడం భజే.''                        


--- “జగద్గురు బోధలు” నుండి


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।


టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.


t.me/KPDSTrust


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

*గతం*

 .

                           *గతం*


            ప్రపంచంలో  అన్నింటికంటే  బరువైనది  గతాన్ని  మొయ్యడం. దానికన్నా  రోడ్  రోలర్  తేలికగా  ఉంటుంది.  మనిషికి  దుఃఖమనేది  లేదు.  గతాన్ని  తలపెట్టు  కోవడమే  దుఃఖం.


            కష్టపడి  పనిచేసుకునే  వాడికి  గతం  గుర్తుకు  రాదు.  సోమరితనంతో  ఉన్నవాడికే  గతం  గుర్తుకు  వస్తుంది.  సోమరితనమే  దుబారా.  జీవితసారాన్ని  పిండి  చెప్పిన  అందమైన  మాటలివి.


            నీ  ఆలోచనే  మనస్సులో  ముద్ర  వేస్తుంది.  కాబట్టి  అజాగ్రత్త  పనికిరాదు.  


            ఒక  బెంగ  తరువాత  ఒక  బెంగ,  ఒక  పరాభవం  తరువాత  ఇంకో  పరాభవం,  ఒక  భూకంపం  తరువాత  మరో  భూకంపం.  అవి  ఏమీ  లేకుండా  కుటుంబం  అంతా సుఖంగా  ఉన్నాము  అనుకోండి,  ఎవరో  ఒకరు కుటుంబంలోంచి  జారిపోతాారు.  


            "ఇది  అంతా  ప్రకృతి  పని.  అధిష్ఠానం  ఈశ్వరుడు  అని  మరిచి  పోకండి.  మీ  ముఖం  ఆయన  వైపు  తిప్పండి".

ధనమునకు దాయాదులు

 .

                 _*సుభాషితమ్*_


 𝕝𝕝శ్లోకం𝕝𝕝


*చత్వారో ధన దాయాదాః*

*ధర్మాగ్నినృప తస్కరాః*

*తేషామ్ జ్యేష్ఠావమానేన* 

*త్రయః కుప్యంతి సోదరాః||*


అర్థము:- 

ధర్మము, అగ్ని, రాజు, దొంగ ; ఈనలుగురు ధనమునకు దాయాదులు. వీరిలో జ్యేష్ఠు డయిన ధర్మము నవమానించిన అంటే ధర్మము మీరి ప్రవర్తించిన మిగతా ముగ్గురూ కోపిస్తారు. అనగా ధర్మముగా ప్రవర్తించని వాని ధనము అగ్గిపాలో, పన్నుల రూపంలో రాజులపాలో, దొంగలపాలో అవుతుందని భావము.

చారిత్రాత్మక కథాస్రవంతి🌹* . ♦️ *ఆర్య చాణక్య*♦️ *పార్ట్ - 81*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

.    *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*

.           ♦️ *ఆర్య చాణక్య*♦️


*పార్ట్ - 81*


చాణక్య చంద్రగుప్తులు విడిది భవనంలో రహస్య చర్చలలో నిమగ్నులయ్యారు. 


చంద్రగుప్తుడు అసంతృప్తిగా చూస్తూ "సుగాంగ ప్రాంగణంలో ప్రవేశానికి ఇప్పుడు మంచి రోజులు కావంటూ రాక్షసామాత్యుడు చెప్పిన మాటలు అసత్యాలని తెలిసింది. మనల్ని రాజభవనంలోకి అడుగుపెట్టనియ్యకుండా రాక్షసుడే ఏదో ఎత్తు వేస్తున్నాడని నాకు అనుమానంగా ఉంది. మీరు దీనికి ఏదైనా ప్రతిక్రియ ఆలోచించాలి" అన్నాడు. 


చాణక్యుడు నవ్వి "పురోహితుల చేత రాక్షసునికి ఆ మాటలు చెప్పించింది నేనే... ఆ సంగతి తెలుసుకోలేక అతడే చిలకపలుకులు పలికాడు" అని చెప్పాడు. 


చంద్రుడు చకితుడవుతూ "మీరా ? ఎందుకలా చెప్పించారు ?" అనడిగాడు. 


చాణక్యుడు సాలోచనగా తలపంకిస్తూ "కోట మన వశమైన మాట నిజం. కానీ శత్రునిశ్శేషం కాలేదు. శత్రువర్గం పూర్తిగా నశించిన తర్వాతనే నీ సుగాంగ ప్రవేశమూ, పట్టాభిషేకమున్నూ... అంతవరకూ జరిగేదంతా చూస్తూ ఉండు. ఏమైనా, చంద్రగుప్తుడొక్కడే మగధ సింహాసనాన్ని అధిష్ఠిస్తాడు..." అని చెప్పాడు గంభీరంగా. 


చంద్రుడు తృళ్లీపడి "అదేమిటి ? పర్వతకుడికి అర్థరాజ్యం ఇస్తామని మాట యిచ్చాంగదా ?" ప్రశ్నించాడు. 


"మాట ఇచ్చింది మేము. దాని పాపం, ఫలితం మాదే... నువ్వు నిశ్చింతగా ఉండు..." అని చెప్పాడు గంభీరంగా. 


అదే సమయంలో మందిర ద్వారం బయట కాపలదార్లతో ఎవరో గొడవపడడం వినిపించింది. 'చాణుక్యుల వారిని అత్యవసరంగా కలుసుకోవాలనీ, లోపలికి వెళ్ళనివ్వమని' ఎవరో అడుగుతుంటే భటుడు వీలు కాదంటున్నాడు. చాణక్యుడు ఆ గొంతుని గుర్తుపట్టి "శార్జరవా ! రారా లోపలికి" ఆదేశించాడు బిగ్గరగా. మరుక్షణం మారువేషంలో ఉన్న శార్జరవుడు లోపలికి వచ్చి ఆర్యునికి అభివాదం చేశాడు. 


అతడిని ఎగాదిగా చూసి "నిన్ను రాక్షసగృహంలో భృత్యునిగా నియమించాను కదా ... ! ఏమిటి విశేషాలు ?" అడిగాడు చాణక్యుడు. 


శార్జరవుడు రాక్షసుడి ప్రతిజ్ఞ గురించి చెప్పి "రాత్రికి రాత్రే ఆమాత్రుడు రహస్యంగా, ఒంటరిగా ఎవరినో కలుసుకోవడానికి బయలుదేరాడు. నేను నీడలా ఆయన్ని వెంటాడాను. ఆయన సందులు గొందుల వెంట నడుస్తూ చివరికి శోణనదీ తీరానికి చేరుకున్నాడు. నేనూ అక్కడికి చేరాను. అక్కడ తెప్ప ఒకటి సిద్ధంగా ఉంది. అమాత్యుడు దానిలో ఎక్కి అవతలి తీరానికి బయలుదేరాడు. నేను వెంటనే ఇక్కడికి వచ్చేసాను" అని చెప్పాడు. 


"మరి నువ్వెందుకు నదిని దాటలేదు ?" విసుగ్గా ప్రశ్నించాడు చాణక్యుడు. 


"అక్కడ ఇంకొక పడవేది లేదు. నాకా ఈతరాదు ... అందుకని..." నసిగాడు శార్జరవుడు.  


చాణక్యుడు విసుక్కుంటూ "చీ ఛీ ... ఏం చెప్పినా నువ్విలాగే చేస్తావ్... ఎప్పుడూ అర్థసత్యాలే మోసుకొస్తావు.... నీకసలు బుద్ధిలేదురా... నీకంటే సిద్ధార్థకుడే వెయ్యిరెట్లు నయం" అన్నాడు. 


శార్జరవుడు వుక్రోషపడిపోతూ "ఆ సిద్ధార్థకుడికి ఈత వచ్చుగదా... అందుకే అతడిని అమాత్యుడి వెనుక అనుసరింపజేసి నేనిలా వచ్చాను..." అన్నాడు. 


చాణక్యుడు వచ్చే నవ్వుని బలవంతంగా పెదాల మధ్య బిగబట్టుకుంటూ "ఆ ఏడుపేదో ముందే ఏడవొచ్చుగదా...?" అన్నాడు. 


"ఏదీ... తమరు నన్ను సాంతం ఏడవనిస్తే గదా..." అంటూ శార్జరవుడు మొహం మాడ్చుకుని "రాక్షసుని అంతరంగ మదనంలోంచి పెల్లుబికిన దాన్నిబట్టి అతడు శోణనది అవతలి తీరాన వానప్రస్థాశ్రమ దీక్షలో ఉన్న సర్వార్ధ సిద్ధిని కలుసుకోవడానికి వెళ్లాడని తెలుస్తోంది" అని చెప్పాడు. 


"భేష్ ! ఇప్పుడు నిజంగా చాణక్యుడి శిష్యుడివనిపించుకున్నావురా !" అన్నాడు చాణక్యుడు అభినందనగా. 


శార్జరవుడు బుంగమూతి పెట్టి "మీరు నాకన్నీ నేర్పారుకానీ ఈత మాత్రం నేర్పలేదు. అది కూడా నేర్పించి వుంటే..." అన్నాడు అర్థోక్తిగా.


"ఆ నెపం నామీద వేస్తున్నావా ? సరే..." చాణక్యుడు తలపంకించి "ఎవరక్కడ ?" పిలిచాడు బిగ్గరగా. మరుక్షణం ఇద్దరు భటులు లోపలికి వచ్చారు. 


చాణక్యుడు వాళ్ళవైపు అదోలా చూస్తూ "ఈ శార్జరవుడిని తీసుకువెళ్లి పడవ ఎక్కించి శోణనదీ మధ్య భాగానికి చేర్చి... అక్కడ వీడిని ఎత్తి నదిలోకి విసిరి పారేయ్యండి" ఆజ్ఞాపించాడు. 


"అన్యాయం గురుదేవా ! అన్యాయం... అర్ధరాత్రి పూట చీకటిలో చలిలో నన్ను నదిలో పారేయించడం అన్యాయం..." అని వాపోతుంటే భటులు బర బర అతని రెక్కలు పట్టుకొని బయటికి లాక్కుపోయారు. 

(ఇంకా ఉంది)...🙏


*సేకరణ:- శ్రీ రమణమూర్తి గారి వాట్సాప్ పోస్ట్.*


🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

గోత్రం అంటే ఏమిటి?*

 *గోత్రం అంటే ఏమిటి?* 

సైన్సు ప్రకారము 

మన పూర్వీకులు

గోత్ర విధానాన్ని ఎలా 

ఏర్పాటు చేశారో గమనించండి!!


(వేదంలో యేముంది?ఎందుకీగోత్రాలు?సగోత్రం వివాహాలకెందుకు పనికిరాదు?అనివాదించే వారికిది విజ్ఞానసమ్మతమైన సమాధానం!కాదనేవారున్నారా?వృధావాదంవద్దు!!,)


మీరు పూజలో కూర్చున్న 

ప్రతిసారీ, పూజారి మీ గోత్రం గురించి ఎందుకు అడుగుతారో మీకు తెలుసా? 

మీకు తెలీదు కాబట్టి అది చాదస్తం అనుకుంటున్నారు??


గోత్రం  వెనుక ఉన్న శాస్త్రం మరేమిటో కాదు- 

*జీన్-మ్యాపింగ్* అని ఈమధ్య కాలంలో బాగా ప్రాచుర్యం 

పొందిన అధునాతన శాస్త్రమే!


గోత్రం వ్యవస్థ అంటే ఏమిటి ?


మనకు ఈ వ్యవస్థ ఎందుకు ఉంది? 


వివాహాలకు ఇది చాలా ముఖ్యమైనదిగా మనము ఎందుకు భావిస్తాము? 


కొడుకులకు ఈ గోత్రం  ఎందుకు వారసత్వంగా వస్తుంది మరి కుమార్తెలు ఎందుకు రాదు?


వివాహం తర్వాత కుమార్తె గోత్రం ఎలా / ఎందుకు మారాలి? 

తర్కం ఏమిటి?


ఇది మనము అనుసరించే అద్భుతమైన జన్యు శాస్త్రం.  

మన గోత్ర వ్యవస్థ వెనుక 

జన్యుశాస్త్ర వ్యవస్థ ఎలా పనిచేస్తుందో చూద్దాం!


గోత్రమ్ అనే పదం రెండు సంస్కృత పదాల నుండి ఏర్పడింది.  

మొదటి పదం 'గౌ'- అంటే ఆవు, రెండవ పదం 'త్రాహి' అంటే కొట్టం


గోత్రం అంటే 'గోశాల' అని అర్ధం.


జీవశాస్త్రపరంగా, మానవ శరీరంలో  23 జతల క్రోమోజోములు ఉన్నాయి, 

వీటిల్లో సెక్స్ క్రోమోజోములు

 (తండ్రి నుండి ఒకటి మరియు తల్లి నుండి ఒకటి) అని పిలువబడే ఒక జత ఉంది. 

ఇది వ్యక్తి(ఫలిత కణం) యొక్క లింగాన్ని ( gender) నిర్ణయిస్తుంది.


గర్భధారణ సమయంలో ఫలిత కణం XX క్రోమోజోములు అయితే  అమ్మాయి అవుతుంది, అదే XY అయితే  అబ్బాయి అవుతాడు.


XY లో - X తల్లి నుండి 

మరియు Y తండ్రి నుండి తీసుకుంటుంది.


ఈ Y ప్రత్యేకమైనది మరియు 

అది X లో కలవదు. 

కాబట్టి XY లో, Y X ని అణచివేస్తుంది , అందుకే కొడుకు Y క్రోమోజోమ్‌లను పొందుతాడు. 

ఇది మగ వంశం మధ్య మాత్రమే వెళుతుంది. (తండ్రి నుండి కొడుకు మరియు మనవడు ముని మనవడు ... అలా..).


మహిళలు ఎప్పటికీ Y ను పొందరు. అందువల్ల వంశవృక్షాన్ని గుర్తించడంలో జన్యుశాస్త్రంలో Y కీలక పాత్ర పోషిస్తుంది. స్త్రీలు ఎప్పటికీ Y ను పొందరు కాబట్టి స్త్రీ గోత్రం తన భర్తకు చెందినది అవుతుంది. అలా తన కూతురి గోత్రం వివాహం తరువాత మార్పు చెందుతుంది. 


ఒకే గోత్రీకుల మధ్య వివాహాలు జన్యుపరమైన రుగ్మతలను కలిగించే ప్రమాదాన్ని పెంచుతాయి...

గోత్రం ప్రకారం సంక్రమించిన Y క్రోమోజోమ్‌లు ఒకటిగా  ఉండకూడదు 

ఎందుకంటే అది లోపభూయిష్టమైన ఫలిత కణాలను సక్రియం చేస్తుంది.....


ఇదే కొనసాగితే, ఇది పురుషుల సృష్టికి కీలకమైన Y క్రోమోజోమ్  పరిమాణం మరియు బలాన్ని తగ్గిస్తుంది..... కొన్ని సందర్భాలలో నశింపజేస్తాయి.


ఈ ప్రపంచంలో Y క్రోమోజోమ్ లేనట్లయితే, మగజాతే అంతరించిపోయేలా చేస్తుంది.


కాబట్టి గోత్రవ్యవస్థ జన్యుపరమైన 

లోపాలను నివారించడానికి మరియు Y క్రోమోజోమ్‌ను రక్షించడానికి ప్రయత్నించే ఒక పద్ధతే స్వగోత్రం. అందుకనే స్వగోత్రీకుల మధ్య వివాహం నిషేధించారు...


మన మహాఋషులచే సృష్టించబడ్డ అద్భుతమైన బయో సైన్స్ గోత్రం. ఇది

మన భారతీయ వారసత్వ సంపద అని నిస్సందేహంగా చెప్పవచ్చు..


మన ఋషులు వేలాది సంవత్సరాల క్రితమే _ "GENE MAPPING" _ క్రమబద్ధీకరించారు.


అందుకనే ఈసారి ఎవరైనా గోత్రమని అంటే చాదస్తం అని కొట్టి పడేయకండి ...... ప్రవర తో సహా చెప్పండి.🙏🙏

రామచరిత మానస్..!!

 రామచరిత మానస్..!!


శ్రీరామ జయరామ జయ జయరామ..!!


శ్రీరామనామం సుధామధురం అంటారు. 

భక్తులు భక్తి పూర్వకంగా రామరసాన్ని ఆస్వాదించాలని సదాశివ బ్రహ్మేంద్రులు చెబుతారు. 


కదళి, ఖర్జూర ఫలాల కన్నా రామనామం ఎంతో రుచి 

అని కీర్తించాడు రామదాసు. 

రామభక్తి మనోజ్ఞమే కాక భవ సాగరాన్ని దాటించే తారక మంత్రమనీ భావిస్తారు సాధకులు. 

అనంత రామభక్తితో సుందర సాహిత్యాన్ని, 

మధుర సంగీతాన్ని సృజించిన మహానుభావులు 

ఎందరో ఉన్నారు.

                              

శ్రీరాముడికి ప్రథమ భక్తుడు భరతుడు అని ఆధ్యాత్మిక రామాయణం చెబుతోంది. 

మరో సోదరుడు లక్ష్మణుడు ఎప్పుడూ శ్రీరాముడి 

వెన్నంటి ఉన్నాడు. 

రామబంటుగా పేరొందిన మహావీరుడు హనుమ. వారందరూ సదా రాముణ్నే ధ్యానించి తరించారు. 


అదే బాటలో మరెందరో రామభక్తితో చరించారు. 

వారు రసవత్తర రీతిలో రామాయణం రచించారు. కబీరుదాసు 

తులసీదాసు 

సూరదాసు 

సుందరదాసు 

వంటి సాధకులు ఎన్నో గీతాలు, వచనాలు వెలయించారు. 


తులసీదాసు రాసిన రామచరిత మానసం, 

జానకీ మంగళం, 

హనుమాన్ చాలీసా 

వంటివి ఎంతో ప్రాచుర్యాన్ని పొందాయి.

                                   

వాల్మీకి రామాయణం తరవాత తిరిగి అంతటి ప్రాచుర్యం పొంది, భక్తులకు పారవశ్యం కలిగించే గ్రంథం 

రామచరిత మానస్. 

ఈ గ్రంథ రచయిత తులసీదాసు. 

ఆయన ఇప్పటి ఉత్తరప్రదేశ్ లోని రాజపూర్ గ్రామంలో జన్మించాడు. 

ప్రాచీన హిందీకి రుపాంతరమైన ఆవధ్ ఆ ప్రాంతపు సామాన్య ప్రజల వాడుకభాష. 

అందులో భారతదేశ సంస్కృతి నిండిన సంప్రదాయ సాహిత్యాన్ని వెలయించాడు తులసీదాసు.

                                   

ఆయన రామచరిత మానస్ నాలుగు పాదాల కవిత (చౌపాయి) గా సాగింది. 

రామాయణాన్ని హిందీ మూలంలో అందించిన తొలికవి ఆయనే! 

రామాయణం ఓ మహాగ్రంథం. 

దాని రచనా కార్యక్రమాన్ని రామరాజ్య రాజధాని అయోధ్యలో చేపట్టాడు తులసీదాసు. 


భగవంతుడి సగుణ సాకార తత్వాలు, 

గుణ ప్రభావ విశేషాలు, 

భక్తితత్వ రహస్యాలు అన్నింటినీ సుందరమైన సరళ శైలిలో అందించాడాయన. 

రామచరిత మానసంలోని ప్రతి అక్షరమూ దివ్యమంత్ర సదృశమంటారు భక్తులు. 

                             

ఆ గ్రంథాన్ని ఆశీర్వాత్మకం గా వర్ణిస్తారు శ్రీరాముడి 

కృపకు పాత్రుడైన మహాభక్తుడు తులసీదాసు. 

భగవంతుడి లీలల్ని తన గ్రంథంలో ఆయన అనుభవ పూర్వకంగా వర్ణించాడు. 

పరమేశ్వరుడి ఆజ్ఞానుసారం ఆ పుస్తకం రాశానని వెల్లడించాడు. 

మొదట సీతమ్మకు నమస్కరించి, 

గ్రంథరచన ప్రారంభించాడు. 

ఆమెను మహాశక్తి స్వరూపిణిగా భావించి, 

ఉద్భవ స్ధితి కారిణి అని స్తుతించాడు. 

శివధనుర్భంగం గురించి తులసీదాసు విలక్షణంగా అభివర్ణిస్తాడు.

                          

ఆ ధనస్సులో ఇతర రాజుల దురభిమానం, పరశురాముడి అహంకారం కలగలిపి ఉన్నాయని; అటువంటిదాన్ని రాముడు అవలీలగా విరిచాడని విలక్షణమైన రీతిలో వ్యాఖ్యానిస్తాడు. 

వాల్మీకి రామాయణానికి రామచరిత మానసం యథాతథ అనువాదం కాదు. 

మూల కథను ఏ మాత్రం మార్చకుండా, 

భక్తితత్వాన్ని రంగరించి రాసిన గ్రంథం అది. 

తులసీదాసు అద్భుత రచనాశైలికి అదొక నిదర్శనం. రామచరిత మానసం రాసిన తరువాత, 

హనుమ దర్శనం పొందిన ఆనందంతో తులసీదాసు హనుమాన్ చాలీసా రచించినట్లు చెబుతారు.

                             

హనుమను స్మరించడం  వల్ల బుద్ధి, బలం, యశస్సు, థైర్యం, నిర్భయత్వం, ఆరోగ్యం కలుగుతాయన్నది 

ఆ కవి వాక్కు. 

భక్తి కావ్యరచన, తాదాత్మ్యత తులసీదాసులోని విలక్షణతలు. 

ఆయన వారణాసిలో సంకట మోచన్ దేవాలయాన్ని కట్టించాడంటారు. 

ఒక సంఘటన ఆయన జీవితాన్ని మలుపు తిప్పింది. సన్యాసిగా మారి, 

అంతటా విస్తృతంగా పర్యటించాడు. 

చిత్రకూటములో కొన్నాళ్ళు ఉన్నాడు. 

జీవితాంతం అయోధ్యలో నివసించాడు. 

అక్కడే ఆయన రామచరిత మానసం సహా పలు రచనలు చేశాడని ప్రతీతి. 

శివుణ్ని సదా పూజించే తులసీదాసు, 

తన అవసాన దశలో రుద్రాష్టకం రాశాడని పలువురు గాఢంగా విశ్వసిస్తారు.

స్వస్తి..!!


*సర్వే జనా సుఖినోభవంతు..!!*

*శ్రీ రుద్రాధ్యాయము - నమకమ్*_

 శుభోదయం🙏


_*శ్రీ రుద్రాధ్యాయము - నమకమ్*_


*శ్రీ రుద్రం 1వ అనువాకం*


 ఓం నమో భగవతే’ రుద్రాయ ||

రుద్ర భగవానునికి నమస్కారము. (ధుఃఖములను, పాపములను నశింపజేయు వానికి నా నమస్కారము.)


ఓం నమ’స్తే రుద్ర మన్యవ’ ఉతోత ఇష’వే నమః’ | నమ’స్తే అస్తు ధన్వ’నే బాహుభ్యా’ముత తే నమః’ ||

ఓ రుద్రా! నీ కోపమునకు (నా) నమస్కారము. నీ బాణములకు (నా) నమస్కారము. నీ ధనస్సుకు (నా) నమస్కారము. నీ యొక్క రెండు బాహువులకూ కూడా (నా) నమస్కారము. 


యాత ఇషుః’ శివత’మా శివం బభూవ’ తే ధనుః’ | శివా శ’రవ్యా’ యా తవ తయా’ నో రుద్ర మృడయ ||

పరమ మంగళకరమైన నీ బాణము ఏదైతే ఉన్నదో, మంగళకరమైన నీ ధనస్సు ఏదైతే ఉన్నదో, మంగళకరమైన నీ అమ్ములపొది ఏదైతే ఉన్నదో, వాటన్నింటితోనూ, ఓ రుద్రా, మాకు ఆనందాన్ని ప్రసాదించుము.


యాతే’ రుద్ర శివా తనూరఘోరా‌உపా’పకాశినీ | తయా’ నస్తనువా శన్త’మయా గిరి’శంతాభిచా’కశీహి ||

ఓ రుద్రా, మంగళకరమైన నీ శరీరం ఏదైతే ఉన్నదో, అఘోర రూపమైన (అహింసాత్మకమైన) మరియు ధుఃఖాన్ని కలిగించని నీ శరీరం ఏదైతే ఉన్నదో,  ఆ అనందాన్ని ప్రసాదించే శరీరంతో మమ్ములను ఆశీర్వదించుము.


యామిషుం’ గిరిశంత హస్తే బిభర్ష్యస్త’వే | శివాం గి’రిత్ర  తాం కు’రు మా హిగ్‍మ్’సీః పురు’షం జగ’త్||

ఓ రుద్రా! నీ చేతిలో ఉపయోగించడానికి (సిద్ధంగా) ఏదైతే బాణాన్ని ధరించియున్నావో, దానిని (కేవలం) మాకు శుభములను కలుగజేయుటకు ఉపయోగించుము. మనుష్యలకును, ఇతర జీవులకునూ కష్టములను కలిగించకుము.


శివేన వచ’సా త్వా గిరిశాచ్ఛా’వదామసి | యథా’ నః  సర్వమిజ్జగ’దయక్ష్మగ్‍మ్ సుమనా అస’త్ ||

ఓ రుద్రా! నిన్ను పొందుటకు, మంగళకరమైన వాక్కులతో నిన్ను ప్రార్ధించుచున్నాము. (నీ వలన) ఈ జగత్తు అంతయూ రోగ  రహితముగనూ, మంచి మనస్సుతో కూడినదియునూ అగుగాక.


అధ్య’వోచదధివక్తా ప్ర’థమో దైవ్యో’ భిషక్ | అహీగ్’‍శ్చ సర్వాం”జమ్భయన్త్సర్వా”శ్చ యాతుధాన్యః’ ||

అందరిలో ప్రథముడవైన దైవము, వైద్యుడవు అయిన నీవు మా తరఫున ఉదారముగా మాట్లాడుము. సర్పములు, రాక్షసులు మొదలగు వానిని నశింపజేయుము.


అసౌ యస్తామ్రో అ’రుణ ఉత బభ్రుః సు’మఙ్గళః’ | యే చేమాగ్‍మ్ రుద్రా అభితో’ దిక్షు శ్రితాః స’హస్రశో‌உవైషాగ్ం హేడ’ ఈమహే ||

 ఏ రుద్రుడు, ఉదయ కాలమున తామ్ర వర్ణముతోనూ, ఆపై అరుణ వర్ణముతోనూ, ఆ తరువాత పింగళ వర్ణముతోనూ  ఉన్న సూర్యునిగా ప్రకాశిస్తూ సర్వ మంగళములను కలిగించుచున్నాడో; సహస్ర సంఖ్యాకులైన  ఏ రుద్రులు భూమండలముయొక్క అన్ని దిక్కులయందునూ వ్యాపించియున్నారో,  వారు తమ తీక్షణతను (మాయందు) ఉపసంహరించుకోమని ప్రార్ధించుచున్నాను.


అసౌ యో’‌உవసర్ప’తి నీల’గ్రీవో విలో’హితః | ఉతైనం’ గోపా అ’దృశన్-నదృ’శన్-నుదహార్యః’ | ఉతైనం  విశ్వా’ భూతాని స దృష్టో మృ’డయాతి నః | 

నీలకంఠుడు అయిన రుద్రుడు రక్త వర్ణాన్ని కలిగిన కాల స్వరూపుడైన సూర్యునిగా ప్రకటమగుచున్నాడు. అలా వ్యక్తమైన రుద్రుడు పశువులను కాచుకొను గోపాలులచే, నదులనుండి నీటిని గొనివచ్చు స్త్రీలచే,  మరియు సర్వ జీవులచే చూడబడుతున్నాడు.  ఆ రుద్రుడు మమ్ములనందరినీ సుఖవంతులను గావించుగాక.


నమో’ అస్తు నీల’గ్రీవాయ సహస్రాక్షాయ మీఢుషే” | అథో  యే అ’స్య సత్వా’నో‌உహం తేభ్యో’‌உకరన్నమః’ ||

నీలకంఠుడూ, (ఇంద్ర రూప ధారణముచే) సహస్రాక్షుడూ, ప్రార్ధనలను నిరంతరమూ మన్నించువాడునూ అగు ఆ రుద్రునకు మా నమస్కారములు అందుగాక. అంతేగాక, రుద్రుని సేవకులందరందరకీ నేను నమస్కరించుచున్నాను.


ప్రముం’చ ధన్వ’నస్-త్వముభయోరార్త్ని’ యోర్జ్యామ్ | యాశ్చ తే హస్త ఇష’వః పరా తా భ’గవో వప | |

హే భగవాన్, మీ ధనస్సునకు రెండు వైపులా కట్టి ఉన్న ఆ వింటి త్రాటిని విప్పివేయుము. నీ చేతిలో (ప్రయోగించుటకు సిద్ధముగానున్న ఆ) బాణములను దూరముగా ఉంచుము.


అవతత్య ధనుస్త్వగ్‍మ్ సహ’స్రాక్ష శతే’షుధే | నిశీర్య’ శల్యానాం ముఖా’ శివో నః’ సుమనా’ భవ ||

సహస్రాక్షములను, వందలాది అమ్ములపొదులను కలిగియున్న ఓ రుద్రా! నీ యొక్క ధనస్సును క్రిందకు దించి, నీ బాణములయొక్క మొనలను మొద్దుబారినవిగా చేయుము. మాపట్ల మంగళకరుడవు, అనుగ్రహయుక్తుడవు కమ్ము.


విజ్యం ధనుః’ కపర్దినో విశ’ల్యో బాణ’వాగ్మ్ ఉత | అనే’శన్-నస్యేష’వ ఆభుర’స్య నిషఙ్గథిః’ ||

జటాజూటధారివగు ఓ రుద్రా, నీ దనస్సును వింటి త్రాడు లేనిదిగా చేయుము. అంతేగాక,  నీ అమ్ములపొదిని బాణములు లేనిదానిగా చేయుము. బాణములను అసమర్ధములైన వానిగా చేయుము. నీ ఖడ్గపు ఒర కేవలము ఖడ్గమును మోయుటకు మాత్రమే పనికివచ్చునట్లు (కేవల అలంకార ప్రాయమైనదానిగా) చేయుము.


యా తే’ హేతిర్-మీ’డుష్టమ హస్తే’ బభూవ’ తే ధనుః’ | తయా‌உస్మాన్, విశ్వతస్-త్వమ’యక్ష్మయా  పరి’బ్భుజ ||

అందరి కోర్కెలను విశేషముగా తీర్చువాడవగు ఓ రుద్రా!  నీ చేతులయందుగల ధనస్సు మొదలైన ఏ ఆయుధములైతే కలవో, వాని  సహాయముతో మమ్ములను అన్నివిధములుగా, ఎట్టి ఉపద్రవములు వాటిల్లకుండా పరిరక్షించుము.


నమ’స్తే అస్త్వాయుధాయానా’తతాయ ధృష్ణవే” | ఉభాభ్యా’ముత తే నమో’ బాహుభ్యాం తవ ధన్వ’నే ||

స్వరూపముచేత చంప సమర్ధమైనట్టివి, (కానీ ఇప్పుడు) ధనస్సునందు సంధింపబడనివియగు నీ ఆయుధములకు నమస్కారములు. నీయొక్క బాహు ద్వయమునకు, మరియు నీ ధనస్సునకు సైతము నమస్కారము.


పరి’ తే ధన్వ’నో హేతిరస్మాన్-వృ’ణక్తు విశ్వతః’ | అథో య ఇ’షుధిస్తవారే అస్మన్నిధే’హి తమ్||

నీయొక్క ధనుర్భాణములు మమ్ములను అన్ని దిక్కులనుండి రక్షించుగాక, మరియు నీయొక్క అమ్ములపొదిని మానుండి దూరముగా ఉంచుము.


నమ’స్తే అస్తు భగవన్-విశ్వేశ్వరాయ’ మహాదేవాయ’ త్ర్యమ్బకాయ’ త్రిపురాన్తకాయ’ త్రికాగ్నికాలాయ’ కాలాగ్నిరుద్రాయ’ నీలకణ్ఠాయ’ మృత్యుంజయాయ’ సర్వేశ్వ’రాయ’ సదాశివాయ’ శ్రీమన్-మహాదేవాయ  నమః’ ||

విశ్వమంతటికీ ప్రభువు, దేవాధిదేవుడు, ముక్కంటి,  మూడు పురములను నాశనము చేయువాడు, ప్రళయములో మూడు లోకాలను నశింపజేయు అగ్నిని హరించువాడు, కాలము అనే అగ్నినికూడా నశింపజేయువాడు, నీలకంఠుడు, మృత్యుంజయుడు, సర్వులకు ప్రభువు, ఎల్లప్పుడూ మంగళములనే కలిగించువాడు అగు ఆ మహాదేవునకు నమస్కారము!!