25, నవంబర్ 2023, శనివారం

Panchaag


 

 🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔

            *రేపు కార్తికపూర్ణిమ*

            🪔🪔🪔🪔🪔🪔


కార్తీక పౌర్ణమి విశిష్టత..!


కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి హిందువులకు పరమ పవిత్రమైన రోజు. 

ఇది మహా శివరాత్రితో సమానమైన పుణ్యదినం. 

ఈ పర్వదినాన్ని ''త్రిపురి పూర్ణిమ'', ''దేవ దీపావళి'' అని కూడా అంటారు. 


ఆశ్వయుజ అమావాస్య అంటే దీపావళి వెళ్ళిన మర్నాడు కార్తీకమాసం ప్రారంభమౌతుంది. 

ఇక ఆరోజు నుండి కార్తీకమాసం ముగిసేవరకూ ప్రతిరోజూ సాయంవేళ దీపాలు వెలిగించి సంరంభం చేస్తారు. ముఖ్యంగా కార్తీక సోమవారాలు, కార్తీక పౌర్ణమి పర్వదినాల్లో విశేష పూజలు నిర్వహిస్తారు. 

ఈ నెల అంతా కార్తీక మహా పూరాణాన్ని పారాయణం చేస్తారు. దేవాలయాల్లో కార్తీక పురాణ శ్రవణం ఏర్పాటు చేస్తారు.


మహాభారత కథనాన్ని అనుసరించి కార్తికేయుడు తారకాసురుని సంహరించిన రోజే కార్తీక పౌర్ణమి. 

ప్రజలను నానారకాలుగా హింసిస్తున్న తారకాసురుడు 

ఇక లేడన్న ఆనందంతో దీపాలు వెలిగించి సంబరం చేసుకున్నారు. 

వెయ్యేళ్ళ రాక్షసుల పాలన అంతరించిన శుభసందర్భంగా మహాశివుడు తాండవం చేశాడని పురాణాలు చెప్తున్నాయి.


కార్తీక పౌర్ణమి అటు శివునికి, ఇటు విష్ణుమూర్తికి కూడా ప్రియమైన రోజు. 

ఈరోజున దీపం వెలిగిస్తే మనం తెలిసీ తెలీక చేసే పాపాలన్నీ హరించుకుపోతాయి. 

కార్తీక సోమవారాల్లో, కార్తీక పౌర్ణమి రోజున రుద్రాభిషేకం చేయిస్తారు. 

ఈ విశిష్ట దినాన సత్యన్నారాయణ వ్రతం చేసుకోవడం చాలా శ్రేష్ఠం. 


ప్రధానంగా కార్తీక పౌర్ణమి నాడు తెల్లవారు జామున సముద్రంలో లేదా నదిలో స్నానం చేయడం శుభప్రదం. నదిలో స్నానం చేసే అవకాశం లేనివారు ఉదయానే లేచి స్నాన జపాలు ముగించి ఆలయానికి వెళ్ళి దేవుని దర్శించుకుంటారు. ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు.


రోజంతా ఉపవాసం ఉండి, సాయంత్రం 365 వత్తులతో కూడిన దీపాన్ని వెలిగిస్తారు. 

రోజుకు ఒక ఒత్తి చొప్పున ఏడాది మొత్తాన్ని సూచిస్తాయి ఈ ఒత్తులు. 

కొందరు దీపాలను అరటిదొన్నెపై ఉంచి నదిలో లేదా కొలనులో వదులుతారు. 

ఇంకొందరు శివాలయంలో దీపాలు వెలిగిస్తారు. 

ఆ వీలు లేనివారు ఇంట్లోనే దేవునిముందు లేదా తులసికోట ఎదుట దీపం వెలిగిస్తారు.


కార్తీక పౌర్ణమి నాడు శివాలయంలో దీపారాధన చేయడం అంటే ముక్కోటి దేవతలనూ పూజించడమే. 

సకల పుణ్యనదుల్లో స్నానం చేసిన ఫలం దక్కుతుంది. కార్తీక పౌర్ణమినాడు చేసే దీపారాధనతో ఇహలోకంలో సుఖసౌఖ్యాలు, పరలోకంలో ముక్తి లభిస్తాయి.


కార్తీక పౌర్ణమి జైనులకు, పంజాబీలకు కూడా విశిష్ట పర్వదినం. 

గురునానక్ జయంతి కూడా ఈరోజే. 

ఈ విశేష పర్వదినాన గంగా మహోత్సవం కూడా నిర్వహిస్తారు.


పౌర్ణమినాడు చేసే దీపారాధన చాలా విశిష్టమైంది, సాదారణంగా కృత్తిక నక్షత్రం కార్తీక పౌర్ణమి కలసి వస్తుంటాయి. 

ఆనక్షత్రంలో దీపారాధన చేయడం శ్రేష్టం. 

ఈ నక్షత్రంలో చేసే దీపారాధనకు కృత్తిక దీపం అనే పేరుకూడా ఉంది. 


కార్తీక పౌర్ణమి విశిష్టత, ఏం చేస్తే ఎలాంటి ఫలితాలు పొందవచ్చో తెలుసుకుందాం..


*సర్వపాపాలు.*

కార్తీకపౌర్ణమి రోజు దీపం వెలిగిస్తే మనం తెలిసీ తెలియక చేసిన పాపాలన్నీతొలగిపోతాయి. 

ముఖ్యంగా కార్తీక పౌర్ణమి నాడు తెల్లవారుజామున సముద్రంలో లేదా నదిలో స్నానం చేయడం శుభప్రదం. నదిలో స్నానం చేసే అవకాశం లేనివారు ఉదయాన్నే లేచి స్నానం చేసి ఆలయానికి వెళ్లి దీపం వెలిగించి, పూజలు నిర్వహించాలి.....


*ఉసిరిదీపం.*

పౌర్ణమినాడు ఉదయాన్నే లేచి తలస్నానం చేసి గుడికి వెళ్లి దేవుని దర్శించిన అనంతరం, సాయంత్రం శుచిగా ఉసిరికాయతో దీపాలు వెలిగించాలి. 

బియ్యపిండితో ప్రమిదలు చేసి ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించాలి. 

అనంతరం బ్రాహ్మణులకు దానం ఇవ్వాలి. 

దీపారాధనకు ఆవు నెయ్యి దొరకకపోతే నువ్వుల నూనే కూడా వాడవచ్చు.


*365వత్తుల దీపం.*

కార్తీక పౌర్ణమిన రోజంతా ఉపవాసం ఉండి, 

సాయంత్రం 365 వత్తులతో దీపాన్ని వెలిగించాలి. 

రోజుకు ఒక ఒత్తి చొప్పున ఏడాది మొత్తాన్ని సూచిస్తాయి. కార్తీక పౌర్ణమి రోజు శివాలయంలో దీపారాధన చేయడం అంటే ముక్కోటి దేవతలనూ పూజించడమే. 

సకల పుణ్యనదుల్లో స్నానం చేసిన ఫలం దక్కుతుంది.


*శివుడి దర్శనం.*

పౌర్ణమి రోజు శివాలయంలో పెట్టే ఆకాశదీపాన్ని దర్శించుకుంటే.. సాక్షాత్తు ఆ పరమశివుడినే దర్శించుకున్న ఫలితం లభిస్తుంది. 

కార్తీక పౌర్ణమి రోజు విష్ణువు మత్య్సఅవతారంలో దర్శనిమిస్తాడు.


*పాయసం నైవేద్యం.*

కార్తీక పౌర్ణమి రోజు శివుడికి రాత్రి పాయసం నైవేద్యంగా సమర్పించాలి. 

కొంతమీరు తీసుకోవాలి. 

ఇలా చేయడం వల్ల మానసిక ప్రశాంతత, సంపద జీవితంలో పొందుతారు.....


*నరాలకు మంచిది.*

కార్తీక పౌర్ణమి రోజు 4 నుంచి 5 నిమిషాలు చంద్రుడు కిరణాలు మీమీద పడటం వల్ల నరాలు, కళ్ళు రిలాక్స్ అవుతాయి.

కార్తీక పౌర్ణమి రోజు నాలుగు వైపులు ఉండే దీపాన్ని వెలిగించాలి. 

ఉత్తర, దక్షిణ, తూర్పు, పడమర వైపులుగా ఉండే 

ఈ దీపాన్ని ఆంజనేయుడి విగ్రహం ముందు వెలిగిస్తే మంచిది....హనుమంతుడి అనుగ్రహం కలుగుతుంది.


కార్తీకేయుడికి

కార్తీక మాసం కార్తీకేయుడికి ప్రత్యేకమైనది. 

అలాగే తులసి మాత పుట్టినరోజు కూడా. 

అలాగే తులసి వివాహం లేదా తులసి పూజ చేయడానికి ఇది ఆఖరి రోజు.


*మహామృత్యుంజయ మంత్రం.*

కార్తీక పౌర్ణమి రోజు మహా మృత్యుంజయ మంత్రం జపించాలి.

"ఓం త్రియంభకం యజామయే సుగంధిమ్ పుష్టివర్ధం ఊర్వరుకమివి బంధానాం మృత్యోర్ ముక్షియ మమ్రితాత్"

అనే ఈ మంత్రాన్ని 108సార్లు జపించాలి.


సాయంకాల దీపం.💐

కార్తీక పౌర్ణమి రోజు సాయంత్రం ఇంట్లో దీపాలు వెలిగిస్తే చాలా మంచిది. 

ముఖ్యంగా ఇంటి ముందు, తులసికోట దగ్గర దీపాలు వెలిగిస్తే సర్వపాపాలు తొలగి శుభం కలుగుతుంది. 

దీపం వెలిగించే అవకాశం లేనివాళ్లు శివాలయంలో ఆవు నెయ్యి సమర్పించినా,మంచి ఫలితం కలుగుతుంది.


ఆశ్వమేధ యాగం ఫలితం.💐

ఈ కార్తీక పౌర్ణమి రోజు స్నానం చేసి దీపం వెలిగించడం వల్ల అశ్వమేధ యాగం చేసినంత ఫలితం దక్కుతుంది. ఇలా ఇవాళ దీపం వెలిగించడం వల్ల అన్ని కోరికలు తీరుతాయి.


కార్తీక పౌర్ణమినాడు నమక, చమక, మహాన్యాస ఏకాదశ రుద్రాభిషేకం చేస్తే శివుడు ప్రసన్నుడౌతాడని పురాణాలు చెబుతున్నాయి. 

కార్తీకపౌర్ణమి రోజు తులసికోటలో తులసి మొక్కతోపాటు ఉసిరికొమ్మ(కాయలతో) పెట్టి తులసి చెట్టుపక్కన రాధాకృష్ణుని విగ్రహాన్ని వుంచి పూజిస్తే యువతులు కోరుతున్న వ్యక్తి భర్తగా వస్తాడని ప్రతీతి. 


ఈ కార్తీకపౌర్ణమి రోజున ఉసిరికదానం చేయడం వల్ల దారిద్యం తొలగిపోతుంది. 

ఈ రోజు లలితాదేవిని సహస్రనామాలతో పూజిస్తే 

ఆ దేవి మనకు సకల ఐశ్వర్యాలు కలిగిస్తుంది. 

ఈ కార్తీకపౌర్ణమి రోజున దీపారాధన చేయడంవల్ల శివుని అనుగ్రహం కలుగుతుందని, 

ఆరిపోయిన దీపాన్ని వెలిగించినా పుణ్యం కలుగుతుందని పూర్వీకులు చెబుతుంటారు.


పఠించవలిసిన శ్లోకం.💐

కీటాః పతంగాః మశకాశ్చ వృక్షాః

జలే స్థలే  యే నివసంతి జీవాః!

దృష్ట్వా ప్రదీపం నచ జన్మ భాగినః

భవంతి టైం శ్వవచాహి విప్రాః!!


దీపం వెలిగించి దీప శిఖలో దామోదరుణ్ణి కానీ, త్రయంబకుడిని కానీ ఆవాహన చేసి పసుపో, కుంకుమో, అక్షతలో వేయాలి. 

అది కార్తీక దీపం దానికి నమస్కారం చేయాలి. 

ఆరోజు దీపం చాలా గొప్పది. 

ఆ దీపపు వెలుతురు మనమీద పడినా చాలు. 


కీటాశ్చ - పురుగులు; మశకాశ్చ - దోమలు, ఈగలు మొదలైనవి, అంతే కాదు చెరువు ఉంది అనుకోండి అందులో రకరకాలైన పురుగులు ఉంటాయి. 

అవి జ్యోతి చూడగానే ఎగిరి వస్తాయి. 

నీటిలో ఉన్న పురుగులు, భూమ్మిద ఉన్నటువంటి పురుగులు ఇవన్నీ దీపం ఎక్కడ ఉందో అక్కడికి వచ్చేస్తాయి. 

ఇవన్నీ కూడా ఈ దీపం వెలుతురు ఎంత దూరం పడుతోందో ఈ దీపాన్ని ఏవేవి చూస్తున్నాయో 

ఆఖరికి చెట్లు కూడా అవన్నీ కూడా భగవంతుణ్ణి పొందుగాక! వాటికి ఉత్తరోత్తర జన్మలు తగ్గిపోవుగాక! 

అవి తొందరలో మనుష్య జన్మ పొంది ఈశ్వరుని అనుగ్రహాన్ని పొంది ఈశ్వర కర్మానుష్ఠానము చేసి భగవంతుణ్ణి చేరుగాక! 

అని శ్లోకం చెప్పి దీపం వెలిగించి నమస్కరిస్తారు. 

ఇది మనుష్యులు మాత్రమే చేయగలిగినటువంటి గొప్ప విశేషం. 


దీపపు కాంతి పడితేనే అవి అంత గొప్ప ప్రయోజనాన్ని పొందితే ఇక ఆ దీపం పెట్టిన వాడు ఎంత ప్రయోజనాన్ని పొందాలి?


ఈ పవిత్ర దినాన విష్ణువాలయంలో స్థంబదీపం పెట్టిన వారు శ్రీమహవిష్ణువుకి ప్రీతివంతులవుతారు. 

ఈ దీపాన్ని చూసినవారి పాపాలుపటాపంచాలవుతాయని విశ్వసిస్తారు. 

స్థంబ దీపం పెట్టని వారి పితృదేవతలకు నరక విముక్తి కలగదంటారు. 


ఈ రోజున ధ్వజస్థంభం పైన నందా దీపం వెలిగిస్తారు.

జ్వాలాతోరణం అనే ప్రత్యేక ఉత్సవం కూడా ఇవాళ జరుపుతారు. 

శివ కేశవ బేదం లేని పరమ పవిత్రమైన మాసం లో కార్తీక పౌర్ణమి రోజున జరిగే జ్వాలతోరణ దర్శనం చేస్తే సర్వపాపాలు తొలగుతాయి. 

జ్వాల తోరణ భస్మం ధరిస్తే భూత ప్రేత పిశాచ బాధలన్ని నివారణవుతాయి. 

కార్తీక జ్వాలా దర్శనం వలన మానవులకు, పశుపక్షాదులకు, క్రిమికీటకాలకు సైతం పునర్జన్మ ఉండదని ప్రతీతి.


 


లోకాః సమస్తాః సుఖినోభవంతు..!

 *మెల్లగా చంపేస్తున్న మైదా*    


మైదా పిండి ఆరోగ్యానికి  హానికరం అని అందరికీ తెలుసు. అయినా పిల్లలు పెద్దలు ఎవరూ మైదా పిండి తో తయారయ్యే స్నాక్స్, టిఫిన్, బిస్కెట్లు తినటం మానటం లేదు. రెస్టారెంట్ల లలో పూరిలు, మైసూర్ బొండాలు,ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లలో పానీపూరీలు, సమోసాలు లాగించేస్తూ ఆరోగ్యాన్ని ఫాస్ట్ గా తగలేసుకుంటున్నాము.అయినా ఆరోగ్య స్పృహ లేదు .. 


ఇటీవల కేరళలోని ప్రజల్లో వచ్చిన మైదా మీద  వ్యతిరేకత తో వచ్చిన alertness తో ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్న ఈ write up ని సేకరించి పోస్టు చేస్తున్నాను.


*మృత్యువు వెంటాడుతుంది.....మైదా రూపంలో!*


 గత నాలుగు నెలల్లో చెన్నైలో మరణించిన వారి వయస్సు 33/31/34/35/37/39/41/43/46

 వీరిలో ఎక్కువ మంది గుండెపోటుతో మృతి చెందడం ఆందోళన కలిగిస్తోంది..

 

దయచేసి మైదాతో చేసిన పదార్థాలను   తినవద్దు.

 

 పెద్దల నుంచి చిన్నపిల్లల వరకు అందరూ ఇష్టపడే చవకైన విషపూరితమైన ఆహారం మైదాతో చేసిన పదార్థాలు. 

  

పరోటా దుకాణాలు తమిళనాడు అంతటా విస్తృతంగా కనిపిస్తాయి.

 ఈ పరోటాలలో  ఎన్నిరకాలో?

 అంతులేదు. 

 

  యువతను తనవైపు తిప్పుకునే అసంఖ్యాకమైన పరోటాలు ఉన్నాయి .... దీని అమ్మకాలు రోజురోజుకు దూసుకుపోతున్నాయి.

 అయితే ఈ ప్రొటీన్ శరీరానికి హాని కలిగిస్తుందని డైటీషియన్లు చెబుతున్నారు.


 మైదా వల్ల కలిగే నష్టాలపై కేరళలో అవగాహన సమావేశాలు నిర్వహిస్తున్నారు.  ఐరోపా, బ్రిటన్, చైనా వంటి దేశాలు మైదా ఉత్పత్తులను నిషేధించాయి.  


రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో గోధుమల కొరత కారణంగా, పిండితో చేసిన ఆహారాన్ని పంపిణీ చేయడం ప్రారంభమైంది.  పరోటా కూడా ప్రాచుర్యం పొందింది.పరోటా లో  ఫైబర్ లేదు.  కాబట్టి మన జీర్ణశక్తి తగ్గిపోతుంది.  ముఖ్యంగా (రాత్రిపూట) పరోటా తినడం మానేయండి.  *దీంతోపాటు మైదా పిండితో చేసిన రొట్టెలు, కేకులు,బిస్కెట్లు  తినడం మానేయాలి.* 

 లేకుంటే మనం అనారోగ్యం పీడితులమై  చంపబడతాము. 


 మెత్తగా రుబ్బిన గోధుమ పిండి లేత పసుపు రంగులో ఉంటుంది. కానీ దాన్నుంచి మైదా తయారు చేసేందుకు *బెంజాయిల్ పెరాక్సైడ్* అనే రసాయనాన్ని(Chemical) గోధుమ పిండిలో కలుపుతారు.

 ఈ రసాయనమే మనం జుట్టుకు వేసుకునే రంగులోని రసాయనం.  ఈ విష రసాయనం, మైదాలోని ప్రొటీన్లతో కలిసి క్లోమగ్రంధిని దెబ్బతీసి మధుమేహాన్ని కలిగిస్తుంది.

 అదనంగా, పిండిని మెత్తగా చేయడానికి మరియు సింథటిక్ పిగ్మెంట్‌గా చేయడానికి  *అలోకాన్*  అనే రసాయనాన్ని ఉపయోగిస్తారు.

 భారతదేశంలో మైదా ఎక్కువగా తింటారు.

 ప్రపంచవ్యాప్తంగా మధుమేహం మన దేశంలోనే ఎక్కువగా ఉండడానికి కారణం ఇదే అంటున్నారు నిపుణులు. 


 మైదా కిడ్నీ, గుండె జబ్బులకు కూడా కారణమవుతుందని చెబుతున్నారు.


 కృష్ణకుమార్ అనే స్వచ్ఛంద సేవకుడు నేతృత్వంలోని *మైదా విసర్జన సమితి* కేరళలో ఈ విషయంపై అవగాహన కల్పించడంలో ఈ  స్వచ్ఛంద సంస్థ కీలక పాత్ర పోషిస్తోంది.

 మైదా దుష్ప్రవర్తనపై పాలక్కాడ్ జిల్లా వ్యాప్తంగా అవగాహన కల్పిస్తున్నారు.  పలు జిల్లాల్లో ప్రచారం కొనసాగుతోంది.  "ఇక నుండి మన సంప్రదాయ ఆహారాలు జీడిపప్పు, రైస్, మొక్కజొన్నతో _విదేశీ ఆహారమైన మైదా అనే ప్రోటా మిక్స్‌డ్ కెమికల్‌ని ఏరి పారేయ్యాలని మా కేరళ వాసులం  డిసైడ్ అయ్యాము. అందుకై కృషి చేస్తున్నాము." అంటున్నారు కేరళ ప్రజలు. 

మరి మన సంగతేమిటి?

 మనిషి జీవితం రాగబంధాలతో కూడింది. రజోగుణమే రాగం. స్థూలంగా చెప్పాలంటే- ఇది నాది, వీరు నా వారు, ఇది నా ఆస్తి మొదలైన మమకారాలతో కూడిన భావమే రాగం. అది ఉన్నచోట ద్వేషం కూడా ఉంటుంది. సమాజంలో కొందరిని తనవారిగా భావించినప్పుడు, మరికొందరు పరాయివాళ్లుగా మారతారు. తనవాళ్ల కోసం పాటుపడే సమయంలో పరులను పక్కన పెట్టడం వల్ల సమాన దృష్టి కొరవడుతుంది. ఇలా తనవాళ్ల పట్ల పెరిగిపోయే అనురాగాలు మనిషిని బంధిస్తాయి. ఎప్పుడూ తనకోసం, తనవాళ్ల కోసం తపించడంలోనే శక్తియుక్తులన్నీ కర్పూరంలా హరించుకుపోతాయి. ఇలాంటి భావబంధాలను, భవబంధాలను తొలగించుకొమ్మని చెబుతుంది వేదాంతం.


అసలు మనిషి ఆయుర్దాయమే అతి స్వల్పం. నిండు నూరేళ్లు బతకడమే ఎంతో కష్టం. ఆ నూరేళ్లలోనూ బాల్యక్రీడలతో బాల్యం హరించుకుపోతుంది. చదువుసంధ్యలతో కౌమారదశ ముగిసిపోతుంది. విషయసౌఖ్యాలతో యౌవనం మాయమవుతుంది. నిరంతర చింతతో వృద్ధాప్యం గడుస్తుంది. అర్ధభాగం నిద్రకు, అర్ధభాగం ఇతర వ్యవహారాలకు ఆహుతి కాగా మనిషి ఆత్మానందం కోసం ఎంత కాలాన్ని వెచ్చిస్తున్నాడనేది ప్రశ్నార్థకమే. అందుకే శంకర భగవత్పాదులు చర్పటపంజరికా స్తోత్రంలో ‘ఓ మూఢమతీ! గోవిందుణ్ని భజించు! నీ కాలం మూడినప్పుడు నిన్ను ఆ గోవిందుడు తప్ప ఎవరూ కాపాడలేరు. నీవు చదివిన వ్యాకరణ శాస్త్రం నిన్ను అంత్యకాలంలో కాపాడదు. కనుక శాస్త్రాలు వల్లెవేయడం కాదు, సాధనతో భగవంతుడికి సమీపంగా ఉండటానికి ప్రయత్నించు’ అన్నారు.


మనిషి జన్మించే సమయంలో ప్రసవవేదనను కలిగించి తల్లిని కష్టపెడతాడు. పుట్టిన తరవాత పెరిగేదాకా తల్లితో సేవలు చేయించుకుంటాడు. పెరిగి పెద్దవాడైన నాటినుంచి సాంసారిక బంధాల్లో అష్టకష్టాలు అనుభవిస్తాడు. అనారోగ్యాలతో, ఆపదలతో దుర్భరంగా కాలాన్ని వెళ్ళదీస్తాడు. అందుకే శంకరభగవత్పాదులు- ఈ సంసారం ‘దుస్తారం’ (అతికష్టంతో దాటదగిన సముద్రం). కనుక ఓ మురారీ! నన్ను కాపాడు!’ అని ప్రార్థించారు.


చీకటిలో నడుస్తున్నవాడికి దారి తెలియదు. అజ్ఞానాంధకారంలో తిరిగేవాడికి జ్ఞానోదయం కానే కాదు. జ్ఞానకాంతికోసం వెదకాలి. చీకటిలో చిరుదివ్వెను వెలిగించాలి. మృత్యువు నుంచి అమృతత్వాన్ని తోడుకోవాలి. అదే మనిషి చేయవలసిన పని. నేనెవరు, నీవెవరు... అందరిలోనూ ఉన్న ఆత్మ ఎవరు, లోకంలో శాశ్వతంగా నిలిచేదేమిటి? ఏది నశించేది, ఏది శాశ్వతం, ఏది అశాశ్వతం? ఈ ప్రశ్నలు ఉదయించాలి. వాటికి సమాధానాల కోసం అన్వేషించాలి. అదే నిజమైన జీవితం!


ఈ ప్రపంచంలో మనిషి జీవితం ఒక కల వంటిది. ‘కల’ ఎలా కొంతసేపు మురిపించి, నిద్ర మేల్కొన్న తరవాత కనబడకుండా పోతుందో అలాగే ఈ ప్రపంచం కూడా కొన్ని యుగాల వరకే పరిమితం. ఇది ఎల్లకాలం ఇలాగే ఉండదు. అదే వేదాంత భావన.

ప్రపంచమే అశాశ్వతమైనప్పుడు ప్రపంచంలో కొంతకాలమే బతికి ఉండే మనిషి అశాశ్వతుడే కదా! అశాశ్వతమైన ఈ మానవజన్మను శాశ్వతానందాన్ని కలిగించే విషయాల కోసం ఉపయోగించాలే కానీ, క్షణిక సౌఖ్యాల కోసం వినియోగిస్తే ఇక సార్థకత ఎలా ఉంటుంది?.. ఆదిత్యయోగీ..


ఒక మనిషి చనిపోయాడు. దేహంలోంచి ఆత్మ బయటకు వచ్చింది. చుట్టూ చూశాడు. చేతిలో పెట్టెతో దేవుడు తన దగ్గరకు వచ్చాడు. చనిపోయిన మనిషికీ భగవంతుడుకి మధ్య సంభాషణ ఇలా సాగింది. 

దేవుడు: మానవా..నీ శరీరం పడిపోయింది. ఇక ఈ జన్మ ముగిసింది. నాతో పద.

మనిషి: అయ్యో ఇంత త్వరగానా? నేను భవిష్యత్తు గురించి ఎన్నో కలలు కన్నాను స్వామీ!

దేవుడు: తప్పదు నాయనా! నీవు నాతో రావాల్సిన సమయం వచ్చింది. నడు.


మనిషి: నాకోసం తెచ్చిన ఆ పెట్టె ఇటివ్వండి. ఏం తెచ్చారో చూస్తాను

దేవుడు: నీకు చెందినవి ఉన్నాయి.

మనిషి: నావా? అంటే నా బట్టలు, డబ్బులు, భూమి పత్రాలు అవా?

దేవుడు: అవెప్పటికీ నీవి కావు. అవన్నీ భూమివే. అక్కడే ఉంటాయి

మనిషి: పోనీ నా జ్ఞాపకాలున్నాయా దాన్లో?

దేవుడు: కాదు. జ్ఞాపకాలనేవి కాలానికి చెందినవి. కాలగర్భంలోకి వెళ్లిపోతాయి

మనిషి: అయితే నా ప్రతిభ, ప్రజ్ఞ ఉండి ఉంటాయి!

దేవుడు: అవి పరిస్థితులవి నీవి కావు 


మనిషి: నా స్నేహితులున్నారా అందులో?

దేవుడు: వారు కేవలం నీతో కొద్ది దూరం కలిసి వచ్చే తోటి ప్రయాణికులు మాత్రమే

మనిషి: హూం..నా భార్య, బిడ్డలునా?

దేవుడు: వారు నీతో కలిసి ఒక నాటకంలో పాల్గొన్న పాత్రధారులు

మనిషి: అయితే నీవద్ద ఉన్న శరీరం ఉండుండాలి!

దేవుడు: తప్పు. నీ శరీరం థూళికి చెందినది. మట్టిలో పడుతుంది.

మనిషి: స్వామీ అయితే నా ఆత్మా?


దేవుడు: ఆత్మ నీదెలా అవుతుంది. అది నాది.

మనిషి: ఆ పెట్టె ఇటివ్వు స్వామి అని తీసుకుని తెరిచి చూశాడు. కళ్లలో నీళ్లు సుడులు తిరిగాయి. ఆపెట్టె ఖాళీగా ఉంది.

మనిషి కాలం చెస్తే తనతో తీసుకువచ్చేది ఏదీ ఉండదు అని చెప్పేందుకే దేవుడు ఈ ఖాళీ పెట్టె తెచ్చాడని అర్థం అయింది. బతికున్నంత కాలం నా వాళ్లు, అవన్నీ నావే, ఇవన్నీ నాకే అని ఆశతో, ఆరాటంతో పరుగుతు పెడుతూ పరమాత్మ స్మరణ మరిచాను అని దుఖిఃతుడయ్యాడు.


మనిషి: స్వామీ చివరగా అడుగుతున్నాను. నాది అనేది ఏమైనా ఉందా అసలు?

దేవుడు: ఉంది. నీవు జీవించినంతకాలం ప్రతి క్షణం నీదే.

 ఆ క్షణాల్లో నీవు ఆర్జించే మంచి, చెడు యొక్క పర్యవసానాలు నీకే చెందుతాయి.

అందుకే ప్రతిక్షణం మంచిని పంచాలి, పెంచాలి, భగవన్మామం స్మరించాలి. 

పశ్చాతాపులను క్షమించాలి.  తోటివారి నుంచి మనకి సంక్రమించే చెడును విసర్జించాలి, మానవసేవ-మాధవసేవలను గుర్తించి జీవించాలి...


ఇప్పుడైతే ఈ మొత్తం ప్రపంచానికి తెలుసు, పరమాత్మ ఒక్కరే, ఆ పరమాత్మను కొందరు శక్తి అని నమ్ముతారు, కొందరు ప్రకృతి అని అంటారు కావున ఏదో ఒక రూపంలో తప్పకుండా వారిని నమ్ముతారు. ఏ వస్తువునైతే నమ్ముతారో, తప్పకుండా ఆ వస్తువు ఏదో ఉంటుంది, అప్పుడే దానికి పేరు ఉంటుంది కానీ ఆ ఒక్క వస్తువు గురించి ఈ ప్రపంచంలో ఎంతమంది మనుష్యులైతే ఉన్నారో అన్ని మతాలు ఉన్నాయి, కానీ వస్తువైతే ఒక్కటే ఉంటుంది. అందులో ముఖ్యంగా నాలుగు అభిప్రాయాలను వినిపిస్తారు - కొందరు ఈశ్వరుడు సర్వత్రా ఉన్నారని అంటారు, మరికొందరు బ్రహ్మమే సర్వత్రా ఉంది అని అంటారు, సర్వత్రా బ్రహ్మమే బ్రహ్మము అని అంటారు. కొందరు ఈశ్వరుడు సత్యము, మాయ మిథ్య అని అంటారు, మరికొందరు ఈశ్వరుడు లేనే లేరు, అంతా ప్రకృతేప్రకృతి అని అంటారు. వారు ఈశ్వరుడిని నమ్మరు. ఇప్పుడు ఇన్ని అభిప్రాయాలు ఉన్నాయి. జగత్తు అంటే ప్రకృతి, అంతేకానీ, ఇంకేమీ లేదు అని వారు భావిస్తారు. ఇప్పుడు చూడండి, జగత్తును నమ్ముతారు కానీ ఏ పరమాత్మ అయితే జగత్తును రచించారో, ఆ జగత్తు యొక్క యజమానిని నమ్మరు! ప్రపంచంలో ఎంతమంది మనుష్యులైతే ఉన్నారో, వారివి అన్ని మతాలు ఉన్నాయి, చివరికి ఈ మతాలన్నింటి యొక్క నిర్ణయం స్వయం పరమాత్మ వచ్చి తీసుకుంటారు. ఈ మొత్తం జగత్తు గురించి పరమాత్మ వచ్చి నిర్ణయము తీసుకుంటారు లేక ఎవరైతే సర్వోత్తమునిగా, శక్తివంతునిగా ఉంటారో, వారే తమ రచన యొక్క నిర్ణయాన్ని విస్తారపూర్వకంగా అర్థం చేయిస్తారు, వారే మనకు రచయిత యొక్క పరిచయాన్ని కూడా ఇస్తారు మరియు తమ రచన యొక్క పరిచయాన్ని కూడా ఇస్తారు... ఆదిత్యయోగీ...


చాలామంది మనుష్యులు ఇటువంటి ప్రశ్నలు అడుగుతారు, మనము ఆత్మలము అని మనకు ఋజువు ఏమిటి. ఇప్పుడు దీనిపై అర్థం చేయించడం జరుగుతుంది, మనం ఎప్పుడైతే, ఆత్మనైన నేను ఆ పరమాత్ముని సంతానాన్ని అని అంటామో, ఇప్పుడు ఇది తమను తాము ప్రశ్నించుకునే విషయము. మనం రోజంతా ఏదైతే నేను, నేను అని అంటూ ఉంటామో, అది ఏ శక్తి మరియు ఎవరినైతే మనం స్మృతి చేస్తామో వారు మనకు ఏమవుతారు? ఎప్పుడైనా ఎవరినైనా స్మృతి చేసేటప్పుడు తప్పకుండా ఆత్మలమైన మనకు వారి ద్వారా ఏదో కావాలి, అన్ని వేళలా వారి స్మృతి ఉండడం ద్వారానే మనకు వారి ద్వారా ప్రాప్తి కలుగుతుంది. చూడండి, మనుష్యులు ఏదైతే చేస్తారో తప్పకుండా మనసులో ఏదో ఒక శుభమైన కోరిక ఉంటుంది, కొందరికి సుఖం యొక్క, కొందరికి శాంతి యొక్క కోరిక ఉంటుంది కావున ఎప్పుడైతే కోరిక ఉత్పన్నమవుతుందో, తప్పకుండా అప్పుడు తీసుకునేవారు ఎవరో ఉంటారు మరియు ఎవరి ద్వారా ఆ కోరిక పూర్తవుతుందో తప్పకుండా ఇచ్చేవారు ఎవరో ఉంటారు, కావుననే వారిని స్మృతి చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ రహస్యాన్ని పూర్తి రీతిలో అర్థం చేసుకోవాలి, వారు ఎవరు? ఈ మాట్లాడే శక్తి స్వయం నేను ఆత్మను, దాని ఆకారము జ్యోతిర్బిందువు వలె ఉంటుంది, మనుష్యులు స్థూల శరీరాన్ని వదిలినప్పుడు ఆత్మ వెళ్ళిపోతుంది. అది ఈ కనులకు కనిపించదు, ఇప్పుడు దీని ద్వారా నిరూపించబడుతుంది, ఆత్మకు స్థూల ఆకారం లేదు కానీ మనుష్యులు ఆత్మ వెళ్ళిపోయిందని తప్పకుండా అనుభవం చేసుకుంటారు. మనం దానిని ఆత్మ అనే అంటాము, ఆత్మ జ్యోతి స్వరూపము, మరి తప్పకుండా ఆ ఆత్మకు జన్మనిచ్చేటువంటి పరమాత్మ రూపం కూడా ఆత్మ రూపం వలె ఉంటుంది, ఎవరు ఎలా ఉంటారో వారి సంతానము కూడా అలాగే ఉంటుంది. మరి ఆత్మలమైన మనం ఆ పరమాత్మను, వారు ఆత్మలమైన మనందరి కన్నా శ్రేష్ఠమైనవారు అని ఎందుకంటాము. ఎందుకంటే వారిపై మాయ యొక్క ఎటువంటి ప్రభావం ఉండదు. ఇకపోతే, ఆత్మలమైన మనపై మాయ యొక్క ప్రభావం తప్పకుండా ఉంటుంది ఎందుకంటే మనం జనన మరణాల చక్రంలోకి వస్తాము. ఇప్పుడు ఇదే ఆత్మ మరియు పరమాత్మకు మధ్యనున్న వ్యత్యాసము...


ఎవరు ఉన్నా లేకపోయినా మన దారి మనం సాగిస్తూనే ఉండాలి గమ్యం చేరేదాకా....

గమ్యం కోసం పయనిస్తూ ఉంటాను... 

ఎదురుపడిన కొందరు ఆత్మీయులను 

చీమల బారులా నాతో పాటు కలుపుకుంటాను.. 

నా త్రోవలో నాతో పాటే నడిచే బంధాలు కొన్ని ... 

మధ్యలో వేరే చీమల బారులో కలిసిపోయే బంధాలు కొన్ని..

పుట్టినపుడు ఏకాకినే 

పోయేటపుడు ఏకాకినే 

మద్యలో నేను అల్లుకున్న పూల పొదరిల్లు 

ఎంతగా పరిమళిస్తుందో

ఎదుటి వారి హృదయాలను దోచుకుంటుందో 

అదే నేను సద్వినియోగపరచుకున్న నా జీవితపు విలువ...


"మనసు శూన్యస్థితికి చేరాలంటే ఏమి చెయ్యాలి ?"

"ఏకాగ్రతను అలవర్చుకోవాలి. మనసుకు కుదురు రావటం అంటే మనకు కుదురు రావటమే. మనమూ మనమనస్సు విడివిడిగా లేవు. నేను కదలకుండా ఉన్నానంటే నా మనసు కదలకుండా ఉందని అర్ధం. నేను కదులుతున్నానంటే నా మనస్సు చంచలంగా ఉందని అర్ధం. మనసు అంటే మనకి ఏర్పడిన జ్ఞాపకాల సమూహం. ఆ జ్ఞాపకాలు గుర్తుకురావటమే మనం నిరంతరం చేస్తున్న ఆలోచన. నిజానికి మనం కళ్ళు ముసుకున్నా కనిపించేవన్నీ బయట చూసినవే. మనకి చూడటం, వినటం ప్రవృత్తిగా ఉంది. జ్ఞాని మనసు నివృత్తిలో ఉంటుంది. కాబట్టే జ్ఞాని కళ్ళు మూసుకుంటే శూన్యం ఉంటుంది. అలాంటి శూన్యస్థితి కలిగే వరకూ మనసుకు ఏకాగ్రత అలవరుస్తూ వెళ్ళటమే సాధన. మనశ్శాంతి కోసం మొదలైన సాధన పరిణామంలో దైవం కోసం పడే తపనగా మారుతుంది !..

.


శరీరము, మనసుతో బాటు ఆత్మను కూడా ఆరాధించే వ్యక్తి యొక్క దృష్టి శరీరమూ, మనస్సు పైననే గాక, ఆత్మపై కూడా ఉంటుంది. కానీ ఆత్మ యొక్క ప్రయోజనం అతడికి తెలియదు. అతడు జాగ్రత్తదావస్థ, స్వప్న, సుషుప్తి అనే ఈ మూడు అవస్థల్లో చేసే పనులన్నీ చేస్తుంటాడు. అలా చేస్తున్నప్పటికీ, ఆత్మ తత్వమూ, ఆత్మను గురించిన పరమసత్యమూ అతడికి తెలియదు. అందువల్లనే అతడు అజ్ఞాని, అతడి స్థితి అటువంటిది.....

 🎻🌹🙏 కార్తికమాసంలో నెలరోజులూ దీపాలు వెలిగించలేని వారికి ప్రత్యామ్నాయం ఏమిటి?


🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿


🌿నిత్యం తులసికోట వద్ద, పూజగదిలో దీపారాధన చేయవచ్చు. ఏదైనా కారణం వల్ల కొన్నిరోజులపాటు దీపారాధన చేసే అవకాశం లభించకపోవచ్చు. దానికి చింత పడనవసరం లేదు.


🌸ప్రత్యేకించి కార్తికమాసంలో దీపోత్సవాలు విశిష్టమైన ఫలితాలు కలిగిస్తాయి. అందరూ కలిసి సామూహికంగా నిర్వహించుకునే దీపారాధన కార్తికమాసంలో మాత్రమే చేయడం చూస్తుంటాం.


🌿అటువంటి దీపోత్సవాల్లో పాల్గొనవచ్చు. కనీసం కార్తిక పౌర్ణమినాడు లేదా ఆ మాసంలో ఏదైనా ఒక రోజున 'ఆలయంలో, నదీతీరంలో, పూజగదిలో, తులసికోటవద్ద దీపారాధన చేయడం మంచిది.


🌸కార్తిక పౌర్ణమినాడు సంవత్సరం మొత్తానికి గాను 366 వత్తులను వెలిగించే సంప్రదాయం ఉంది. ఆనాడు దీపారాధన చేస్తే ఏడాది మొత్తం దీపారాధన చేసిన ఫలితం లభిస్తుంది.

              

కార్తికమాసంలో ఉసిరికాయపై దీపం ఎందుకు వెలిగిస్తారు?



వైరాగ్య తైల సంపూర్ణే భక్తివర్తి సమన్వితే.


🌿దీపం వెలిగించడానికి ఓ ప్రమిద కావాలి. అదే మానవ దేహం. పృధివీతత్త్వం. వైరాగ్యంతో కూడిన తైలం, నూనె కావాలి. ఇది జలతత్త్వం. భక్తి అనే వత్తి అందులో ఉంచాలి. అది ఆకాశ తత్త్వం . వెలిగించడానికి అగ్ని కావాలి. వెలిగించిన తర్వాత దీపం అఖండంగా వెలగడానికి గాలి కావాలి. అది ఆ వాయుతత్త్వం. ఇలా పంచతత్వాలతో కూడినదే దీపం.


🌸మానవునిలో ఉండే ఈ పంచతత్వాలకు ఊపిరిపోసే ఉసిరికను దీపశిఖకు ఆధారంగా చేస్తాం. దేహంపై మమకారం వదలిపెట్టడానికి, అజ్ఞానం తొలగి జ్ఞానం పొందడానికి కార్తిక దీపదానం చేస్తాం.

            

కార్తికమాసంలో దేవుని దగ్గర పెట్టిన దీపం ఎంతసేపు వెలగాలి


🌿దీపం వెలగవలసిన సమయం తక్కువ కాకుండా చూసుకోవడం అవసరం. 


🌸దీపం కనీసం గోదోహన కాలంపాటు వెలగాలన్నారు.


🌿అంటే ఆవుపాలు పితికేందుకు పట్టేంత కాలమైన దీపం వెలగాలని అర్ధం. సామాన్య పరిభాషలో అరగంట దాకా వెలిగేంత చమురుపోసి దీపారాధన చేయాలి అలాగే పూజా పూర్తయ్యాక మనంతట మనమే దీపం కొండ ఎక్కేలాగా చెయ్యకూడదు  దానంతట అది  కొండ ఎక్కేవరకు వరకు అలా ఉంచాలి. పూజమధ్యలో దీపం కొండ ఎక్కకుండా  చూసుకోవాలి. 


🌸దీపం ఆరింది అనడం కూడా అపశకునంగా భావిస్తారు. దీపం కొండెక్కింది లేదా ఘనమయ్యింది అంటూ ఉంటారు...🚩🌞🙏🌹🎻


🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

 🌹🌹🌹🌹🌷🌷🌷🌷🌹🌹🌹🌹

.        *🪐నవగ్రహా పురాణం🪐*  

.               *87వ అధ్యాయం*


*పురాణ పఠనం ప్రారంభం*

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐

*గురుగ్రహ చరిత్ర - 3*


బృహస్పతి చేయి అంగవస్త్రం చాటు నుంచి ఇవతలకి వచ్చింది. ఆ చేతిలో ఏదో పుష్పం... నవరత్నాలతో పొదిగినట్టు రకరకాల రంగుల్లో మెరుస్తోందది. *"ఇది ఇంద్రపత్ని శచీదేవి గురుపత్ని తారాదేవికి కానుకగా పంపింది !"*


బృహస్పతి నవ్వుతూ పుష్పాన్ని అందించాడు. తార అందుకోలేదు. ఆమె మెల్లగా ముందుకు వంగింది. సున్నితంగా ఆ దివ్యపుష్పాన్ని ఆఘ్రాణించింది. తల పైకెత్తి , పరవశంగా చూసింది. ఆమె ఎర్రటి తడి పెదవుల్ని చిరునవ్వు అందంగా విడదీసింది. తార మెల్లగా , వీపుని భర్త వైపు తిప్పింది. పుష్పాన్ని శిరోజాలలో అలంకరించమన్న సూచనను అందిస్తూ.


బృహస్పతి పువ్వును తార శిరోజాలలో అలంకరించాడు. శిరోజాల నేపథ్యంలో దివ్య కుసుమం ధగధగలాడుతోంది. తార శిరోజాల ఆశ్రయం పొందేక పుష్ప సౌరభం హెచ్చినట్టనిపిస్తోంది బృహస్పతికి , తల వాల్చి సువాసనను గాఢంగా ఆఘ్రాణించాడు. రెండు చేతుల్నీ తార భుజాల మీద వేశాడు. సున్నితంగా ఆమెను తన వైపు తిప్పుకున్నాడు.


తార ఆయన ముఖంలోకి తన్మయత్వంతో చూస్తోంది. ఆమె కళ్ళు తారల్లా మెరుస్తున్నాయి.


*"తారా ! వాతాయనం మూసివేశావెందుకు ?"* బృహస్పతి ఉన్నట్టుండి అడిగాడు.


తార కనురెప్పలు కిందికి వాలాయి. 


*"ఎందుకు తారా ?"* బృహస్పతి మళ్ళీ అన్నాడు. *"తెరిచి ఉంచితే చల్లటి మలయమారుతం వీవనలు వీస్తుంది కదా!* 


*"... వాతాయనం లోంచి అతను... కనిపిస్తూ , చూస్తున్నాడు..."* తార కంఠం బలహీనంగా ధ్వనించింది.


*"ఎవరు ? ఎవరతను ?"* బృహస్పతి ఆశ్చర్యంతో అడిగాడు.


*"... అతనే... ఆ బుధుడి తండ్రి..."*  తార బలవంతం మీద ఆగి , ఆగి... పలికింది. 


*"తారా!"*


*"నాకు... అది... ఇష్టం లేదు..."* తార నెమ్మదిగా అంది.


*"తారా !"* బృహస్పతి కదిలిపోతూ అన్నాడు. ఆయన చేతులు ఆమెను అనురాగలతికల్లా అల్లుకున్నాయి. మెరిసే కళ్ళతో తన ముఖంలోకి చూస్తున్న తార ముఖంలోకి ఆప్యాయంగా చూశాడాయన.


*"నీ నిబద్ధత నన్ను అలరిస్తోంది... వరం కోరుకో !"* బృహస్పతి ఉద్వేగంతో అన్నాడు... *"కోరుకో , తారా !”*


తార ఆయన వక్షస్థలం మీద రెండు చేతుల్నీ బోర్లించింది. *"స్వామీ... నాకు... నాకు.... సౌందర్యవంతుడూ , మేధావీ అయిన పుత్రుణ్ణి ప్రసాదించండి !"*


బృహస్పతి చిన్నగా నవ్వాడు. *"ఆ వరం నీ ఒక్కదానిదే అనుకుంటున్నావా ? కాదు , అది మన ఇద్దరిదీ !”*


*“స్వామీ...”*


*"వరం అనుగ్రహిస్తున్నాను. మనోహరాకారంతో , మహా మేధస్సుతో పుత్రుడు జన్మిస్తాడు నీకు !"* బృహస్పతి చిరునవ్వుతో అన్నాడు. ఆయన మాటలను మళ్ళీ నొక్కి వక్కాణిస్తున్నట్టు ఆయన చేతులు తార చుట్టూ బిగుసుకున్నాయి.


తార పారవశ్యంతో తన తలని ఆయన మెడ కింద దాచుకుంది. ఎక్కడి నుంచో చొరబడిన మలయమారుత వీచిక ప్రమిదలో దీపకళికను కబళించింది.



********************


బృహస్పతి తారకు ఇచ్చిన వరం వృధా కాలేదు. తార గర్భవతి అయ్యింది.


తార చెట్టు కింద ఉన్న అరుగు మీద కూర్చుంది. ఆమె దగ్గరగా రకరకాల ఆహారాలున్న వెదురు బుట్ట ఉంది. ఆమె ముందు , నేల మీద ఆశ్రమంలో పెరుగుతున్న జంతువులూ , పక్షులూ వరసగా కూర్చున్నాయి. గర్భంతో ఉన్న కుందేళ్ళు ! తల్లి కాబోతున్న లేడి ! నేడో రేపో ఈనబోతున్న దుప్పి , గర్భిణి పావురాలు , గర్భాలతో బొద్దుగా ఉన్న చిలుకలు ! అన్నింటికీ వాటి ఆహారం అందిస్తోంది తార. 


*"ఏమిటి ? గర్భవతులంతా సమావేశమయ్యారు ?”* దగ్గరగా వచ్చిన బృహస్పతి నవ్వుతూ అన్నాడు..


*"ఇవన్నీ... నేను గర్భవతినని ఎలా తెలుసుకున్నాయో అర్ధం కావడం లేదు , స్వామీ ! ప్రతీ పూటా , ఉదయమూ , సాయంత్రమూ క్రమం తప్పకుండా నన్ను చూడడానికి వస్తున్నాయి. నేరుగా ఆశ్రమంలోకే ! అందుకే నేనే వచ్చేస్తున్నాను , వాటికి ఇష్టమైన ఆహారపదార్ధాలతో !"* తార నవ్వుతూ అంది.


*"బాగుంది ! నీ స్థితిలో ఉన్న ఈ గర్భవతులందరూ సహ - అనుభూతులతో నీతో జతకట్టారు !"* బృహస్పతి చిరునవ్వు నవ్వాడు.


తార చిన్నగా నవ్వింది, చిలుకకు జామపండు అందిస్తూ. 


*"నిండుగర్భిణులు కలిసి కూర్చున్న ఈ దృశ్యం నిండుగా , చూడముచ్చటగా ఉంది. సుమా !"* బృహస్పతి అన్నాడు.. 


*“త్వరలో పుట్టబోయే మా అందరి శిశువులూ ఇలాగే ఒకచోట చేరితే ఇంకెంత ముచ్చటగా , ఇంకెంత ముద్దుగా ఉంటుందో !"* తార ఉత్సాహంగా అంది.


***********************


తార అన్నట్టుగానే అచిరకాలంలో ఆశ్రమానికి చిన్ని చిన్ని శిశువులు వచ్చాయి ! ఆ పక్షుల , జంతువుల పిల్లలతో జట్టుకట్టి ఆడుకోవడానికి అన్నట్టు తారకు బాలుడు జన్మించాడు.


ఎర్రటి దేహవర్ణం. ఒత్తుగా , నల్లగా ఉన్న జుత్తు. దేనికోసమో అన్వేషిస్తున్నట్టు తదేకంగా , లోతుగా చూసే చారడేసి కళ్ళు , నిర్విరామంగా , బోసినవ్వులు వొలకబోసే ఎర్రటి పెదవులు... ఎక్కడినుంచో తెచ్చుకున్న అమూల్యమైన వస్తువులను దాచుకున్నట్లుగా బిగుసుకునే వున్న పిడికిళ్ళు ! అమ్మ పెట్టే ముద్దులను అందుకోడానికా అన్నట్టు కొద్దిగా ఉబ్బిన బుగలు !


*"స్వామీ ! నా బిడ్డడు ఎంత అందగాడో చూశారా ?"* తార ఆనందంగా అంది బృహస్పతితో.


*"తల్లిని పోలిన తనయుడు ! ముద్దులు మూటకట్టుతున్న నీ పుత్రుడు ముందు ముందు చూడచక్కని సుందరాంగుడవుతాడు !"* బృహస్పతి చిరునవ్వుతో అన్నాడు , తామరరేకుల్లా ఎర్రగా ఉన్న బాలుడి అరికాళ్ళను సున్నితంగా స్పృశిస్తూ.


************************


*"దేవరాజా ! నా పుత్రుడికి 'కచుడు' అనే నామధేయం నిర్ణయించాను !”* నామకరణ మహోత్సవానికి సతీసమేతంగా , పరివార సమేతంగా విచ్చేసిన ఇంద్రుడితో అన్నాడు. బృహస్పతి.



*"మీ నిర్ణయం అర్థరహితంగా ఉండదు. శుభం !"* ఇంద్రుడు నవ్వుతూ అన్నాడు. 


బాలుడికి నామకరణం జరిగింది.  ఇంద్రుడూ , శచీదేవీ కానుకలు ఇచ్చి దీవించారు.


*"గురుదేవా ! మీ సుపుత్రుడు మా దేవలోకవాసుల తలదన్నే అందగాడవుతాడు ! గురుపుత్రుణ్ణి మా శ్రేయోభిలాషిగా , దేవగురువుకి తగిన వారసుడిగా తీర్చిదిద్దండి ! ఇది మా అభిమతం.".*


*"తథాస్తు !"* బృహస్పతి చిరునవ్వుతో అన్నాడు. కాలం గడుస్తోంది. కచుడు మాతృస్తన్యంతో పుష్టిగా ఎదుగుతున్నాడు. తార ఊహించినట్టుగానే ఆశ్రమంలో జంతువులు , పక్షుల సంతానం కచుడితో ఆడుకోవడం ప్రారంభించాయి. కచుడి కిలకిల నవ్వులతో , అతని స్నేహితుల' అరుపులతో ఆశ్రమ వాతావరణం ఆహ్లాదకరంగా మారింది.


బృహస్పతి కచుడికి విద్యాభ్యాసం ప్రారంభించాడు.

 

*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐

 🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱

.          *⚜️పెరియ పురాణం⚜️*

.           *నాయనార్ల చరిత్ర - 10*

🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱

 *10. గుంగులియ క్కలయ నాయనారు*


చోళదేశంలో 'తిరుక్కడవూరు' అనే గ్రామం ఒకటి ఉంది. ఆ గ్రామంలో కలయనార్ అనే ఒక వైదిక బ్రాహ్మణుడు నివసిస్తున్నాడు. 

అతడు పరమేశ్వరునికి నిత్యమూ పరిమళ భరితమైన గుగ్గులిని (గుంగులి) ధూపం

వేసే పనిలో నిమగ్నమై ఉండడం వలన ప్రజలందరూ ఇతనిని గుంగులియ

కలయనారు అని పిలవడం ప్రారంభించారు. శివుడు ఒక పర్యాయం

కలయనారు భక్తిని పరీక్షించదలచుకొన్నాడు. పరమేశ్వరుని లీలా విలాసాల

 కారణంగా అతనికి దారిద్ర్యం సంక్రమించింది. 


అయినప్పటికీ కలయనారు

ధూపం వేసే పవిత్ర కైంకర్యాన్ని కొనసాగిస్తూ వచ్చాడు. కొంత కాలానికి అతడు తన సంపదలన్నీ కోల్పోయాడు. బంధువులతో, భార్యాబిడ్డలతో

ఆహారంలేక ఆకలితో బాధపడవలసి వచ్చింది ఇంట్లో తినడానికి ఏ

పదార్ధమూ లేదు. 


రెండు రోజులు వరుసగా ఆహారం లేకుండా సొమ్మసిల్లి

పోయిన పిల్లలను చూసి కలయనాయరు భార్య తన బంగారు

మంగళసూత్రాన్ని తీసి భర్తచేతికి ఇచ్చి “దీనికి వడ్లు తీసుకురండి" అని

కోరింది.

కలయనారు ఆ బంగారు తాళిబొట్టును తీసుకొని వడ్లు కొనడానికై

బయలుదేరాడు. అప్పుడు అతని కెదురుగా ఒక వర్తకుడు గుగ్గిలపు మూటతో

వచ్చాడు. కలయనారు ఆ వర్తకుని చూసి “నేను బంగారు ఇస్తాను. మీరు

దానికి ఈ గుగ్గిలాన్ని ఇవ్వండి” అని అడిగాడు. 


వర్తకుడు దానికి

అంగీకరించగా కలయనారు తన భార్య బంగారు తాళిబొట్టును అతని

చేతిలో పెట్టాడు. వర్తకుడు దానిని తీసుకొని గుగ్గులిమూట ఇచ్చాడు.

కలయనారు ఆ మూటను తీసుకొని పరమేశ్వరుని దేవాలయానికి వేగంగా

వెళ్లాడు. 


స్వామి భండారంలో ఆ గుగ్గులిమూటను భద్రపరచి పరమేశ్వరుని

తిరుచరణాలను అర్చిస్తూ అక్కడే ఉండిపోయాడు. కలయనారు ఈ విధంగా

దేవాలయంలో ఉండగా పరమేశ్వరుని కరుణాకటాక్షాలచే అతని గృహం

ధనధాన్యాలతో, సువర్ణ రత్నాభరణాలతో, అపూర్వమైన సంపదలతో

నిండిపోయింది. 


వడ్లకోసం కాచుకొని ఉన్న కలయనారు భార్యబిడ్డలు

ఆకలితో సొమ్మసిల్లి నిద్రపోయారు. అప్పుడు తపోనిధి అయిన కలయనారు

భార్య కలలో పరమేశ్వరుడు ప్రత్యక్షమై గృహమంతటా నిండి ఉన్న సంపదను

తెలియజేశాడు. ఆమె నిద్రనుండి లేచి "పరమేశ్వరుడే మనకు దీనిని అనుగ్రహించాడు" అని రెండు చేతులూ మోడ్చి భగవంతునికి

నమస్కరించింది. 


తరువాత తనభర్తకు, పిల్లలకు భోజనం తయారు

చేయసాగింది. అక్కడ దేవాలయంలో ఉన్న కలయనారుకు స్వామి కలలో

కనిపించి "నీవు ఆకలితో ఉన్నావు. ఇంటికి వెళ్లి నీ ఆకలిని తీర్చుకో” అని

చెప్పాడు. పరమేశ్వరుని ఆజ్ఞను శిరసావహించి కలయనారు తన ఇల్లు

చేరుకున్నాడు. 


ఇంటిలోపల ధనధాన్య రాశులు చూసి “ఇవన్నీ ఎలా

వచ్చాయి” అని భార్యను ప్రశ్నించగా ఆమె “పరమేశ్వరుని అనుగ్రహంతో

లభించింది” అని జవాబు చెప్పింది. గుంగులి కలయనారు పరమేశ్వరుని

కరుణాకటాక్షాలను తలచుకొని చేతులను శిరసుమీద మోడ్చి స్తుతించాడు.

యథాప్రకారం పరమేశ్వరునికి గుగ్గులిధూపాన్ని సమర్పించే కైంకర్యాన్ని

చేస్తూ వచ్చాడు. 


     *పదవ చరిత్ర సంపూర్ణం*

🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱

 🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

.    *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*

.   *ఓం నమో భగవతే రామకృష్ణాయ*


.       *🚩శ్రీ వివేకానందస్వామి🚩*

.                *🚩జీవిత గాథ🚩*   

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

.                      *భాగం 97*


ఆ రోజుల గురించి కాలాంతరంలో స్వామి వివేకానంద ఇలా చెప్పారు:


"శ్రీరామకృష్ణుల నిర్యాణానంతరం మేం వరాహ నగర మఠంలో ఎన్నో పారమార్థిక సాధనలు చేశాము. వేకువజామున మూడు గంటలకే లేచే వాళ్లం. దంతధావనం మొదలైన కాలకృత్యాలు తీర్చుకొని స్నానం చేసి కొందరు, చేయ కుండా కొందరు - ప్రార్థనా మందిరంలో చేరి జపధ్యానాలలో మునిగిపోయే వాళ్లం. ఆహా! ఆ రోజుల్లో ఎటువంటి వైరాగ్యం ఉన్నదో! ప్రపంచం ఉందా లేదా అనే ధ్యాసే మాకు ఉండేది కాదు. 


ఇంట్లో గృహిణి ఏ ప్రకారంగా ఉంటుందో ఆ ప్రకారంగా శశి (స్వామి రామకృష్ణానంద) రాత్రింబవళ్లు శ్రీరామకృష్ణుల సేవ, అర్చన మొదలైన కార్యాలలో నిమగ్నుడై ఉండేవాడు. శ్రీరామకృష్ణుల పూజకు, మా భోజనానికి కావలసిన వాటి నన్నిటిని అతడే చాలావరకు బిచ్చమెత్తి తెచ్చే వాడు..... ఉదయం నుండి సాయంత్రం నాలుగు, ఐదు గంటల దాకా జప ధ్యానాలు సాగిన రోజులున్నాయి..... ఆహా! ఏం అద్భుతమైన రోజులవి.


 మే మా రోజుల్లో గడిపిన జీవిత విధానాన్ని చూసి భూతాలే భయపడేవి అంటే, ఇక మనుష్యుల మాట చెప్పాలా! .


"డబ్బు లేని కారణంగా కొన్నిసార్లు మఠాన్ని మూసివేద్దామనుకొన్నాను. కాని శశిని అందుకు ఒప్పించలేకపోయాను. అతడే ఈ మఠానికి మూలస్తంభం. మఠంలో అన్నం మెతుకులైనా లేని రోజులు ఉన్నాయి. భిక్షాటన వలన అన్నం లభిస్తే, ఉప్పు ఉండేది కాదు. కొన్ని రోజులు కేవలం అన్నం, ఉప్పు మాత్రమే ఉండేవి. కాని ఎవ్వరూ ఏమాత్రం లక్ష్యపెట్టలేదు...... 


ఒక్కోసారి నెల పొడవునా అన్నం, ఉప్పు, ఉడికించిన దొండాకుకూర మాత్రమే మా భోజనం శశి భోజనం సిద్ధం చేసి మా కోసం వేచి ఉండి, చివరికి జపధ్యానాల నుండి బల వంతాన మమ్మల్ని ఇవతలకు లాగేవాడు. అతడి ప్రేమ ఎంత అద్భుతమయింది. "


దుస్తుల విషయంలోనూ అంతే. అందరికీ ఉమ్మడిగా ఒక పంచె, ఒక తువ్వాలు మాత్రమే ఉన్నాయి. బయటికి వెళ్లేవారు వాటిని ధరించాలి. ఇకపోతే ఒక కౌపీనం, ఒక తువ్వాలు మాత్రమే అందరి దుస్తులు🙏


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

👉 *రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

శివానందలహరీ – శ్లోకం – 10*

 🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱

.      *శివానందలహరీ – శ్లోకం – 10*

.        శ్రీ ఆదిశంకరాచార్య విరచితం

🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱


*నరత్వం దేవత్వం నగవనమృగత్వం మశకతా*

*పశుత్వం కీటత్వం భవతు విహగత్వాదిజననమ్ |*

*సదా త్వత్పాదాబ్జస్మరణపరమానందలహరీ*

*విహారాసక్తం చేద్ధృదయమిహ కిం తేన వపుషా ?  10*


మనుష్యుడుగాగానీ, దేవుడుగాగానీ, పర్వతముగాగానీ, అడవిగాగానీ, మృగముగాగానీ, దోమగాగానీ, పశువుగాగానీ, పురుగుగాగానీ, పక్షులుమొదలగువానిగా ఎలా పుట్టినా ఫరవాలేదు. కానీ ఎల్లప్పుడూ నా మనస్సు నీ పాదపద్మముల స్మరణలో పరమానందముగా విహరించుటయందు ఆసక్తి కలిగిఉన్నచో ఇంక ఏ జన్మ వచ్చినా బాధ లేదు.


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱

శ్రీ దేవీ భాగవతం

 శ్రీ దేవీ భాగవతం


.శ్రీగణేశాయనమః.శ్రీసరస్వత్యైనమః శ్రీగురుదత్తాత్రేయపరబ్రహ్మణేనమః

శ్లో)వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయవిష్ణవే|

నమోవైబ్రహ్మనిధయే వాసిష్ఠాయనమోనమః||

శ్లో)నారాయణంనమస్కృత్య నరంచైవ నరోత్తమం|

దేవీంసరస్వతీం వ్యాసం తతోజయముదీరయేత్||


శ్లో)సృష్టౌ యా సర్గరూపా జగదవనవిధౌ పాలినీ యా చ రౌద్రీ

సంహారే చాపి యస్యా జగదిదమఖిలం క్రీడనం యా పరాఖ్యా |

పశ్యంతీ మధ్యమాథో తదను భగవతీ వైఖరీవర్ణరూపా

సాస్మద్వాచం ప్రసన్నా విధి హరి గిరిశారాధితాలంకరోతు||


శ్లో)కాత్యాయనిమహామాయే భవాని భువనేశ్వరి |

సంసారసాగరోమగ్నం మాముద్ధరకృపామయే||

బ్రహ్మ విష్ణు శివారాధ్యే ప్రసీదజగదంబికే|

మనోఽభిలషితందేవివరందేహినమోఽస్తుతే||


ఆ తరువాత అరుణుడు - వంశోద్ధారకుడు లేకపోయాడే అని విచారించి, రాజ్యం వదిలిపెట్టేసి

తపస్పులకు వెళ్ళిపోయాడు. ఆ కాలాన పన్నెండు సంవత్సరాలపాటు ఆ దేశంలో వానలు కురవలేదు.

సత్యవ్రతుడు చేసిన అధర్మానికి ఇంద్రుడు విధించిన శిక్ష ఇది.

అదే సమయంలో విశ్వామిత్రుడు (కౌశికుడు) తన భార్యాపుత్రులను ఆశ్రమంలో విడిచిపెట్టి

కౌశికీతీరానికి తపస్సుకోసం వెళ్ళాడు. పన్నెండేళ్ళ కరువు రావడంతో కౌశికుడిభార్య బిడ్డలను పోషించలేక

చాలా అగచాట్లు పడింది. పిల్లలు ఆకలో అని ఏడుస్తుంటే ఓదార్చలేక సతమతమయ్యింది. తల్లి పేగు

తల్లడిల్లింది. పెద్ద పిల్లలు నీవారధాన్యం ముష్టత్తుతూంటే విలవిలలాడింది. రాజధానిలో రాజులేడు.

మగడేమో తపస్సుకి వెళ్ళాడు. తనకా పోషించే శక్తి లేదు. ఎవరిని యాచించాలి, ఏమి చెయ్యాలి ? పిల్లలుచూస్తే మాడిపోతున్నారు. ఛీ ! ఎందుకువచ్చిన జీవితం ఇది. కౌశికుడు ఇంటిలో ఉంటే ఈ పరిస్థితి వచ్చేది

కాదుగదా ! ఎక్కడో ముక్కుమూసుకుని హాయిగా నిశ్చలంగా తపస్సు చేసుకుంటున్న విశ్వామిత్రుడికి చా

నిర్ధనత, నా అశక్తత ఎలా తెలుస్తాయి సమర్థుడే. కానీ పరిస్థితి ఇది అని తెలిసేదెలా ?

ఇలా ఆలోచిస్తూ కూచుంటే ప్రయోజనంలేదు. ఏదో ఒకటి చెయ్యాలి. పిల్లల్ని అందరినీ

ఆకలితో మార్చి చంపుకునేకంటే ఒకడిని అమ్మేసి మిగతావారినైనా బతికించుకోవడం తెలివైనపని. నాకిక

మిగిలింది ఇదొక్కటే దారి. ప్రాణాలు నిలుపుకోడానికి, కాలం గడపడానికి మరో మార్గంలేదు ఇలా

ఆలోచించి విశ్వామిత్రుడి భార్య గుండెను రాయిచేసుకుని, దర్భలు తాడుగా పేని నడిమి కొడుకు

మెడకు పలుపుతాడులా కట్టి, వాడిని తీసుకుని తమ ఆశ్రమ పర్ణశాలనుంచి బయటకు వచ్చింది.

అడవిదారివెంట రాజధానికి నడక సాగించింది.

శ్వపచులతో కలిసి అడవుల్లో జీవిస్తున్న సత్యవ్రతుడు (అరుణుడి కొడుకు) ఎదురయ్యాడు.

ఏమిటమ్మా ఇది? ఎందుకు ఏడుస్తున్నావ్ ? ఈ పిల్లవాడినేమిటి పశువులా తాడుకట్టి లాక్కువెడుతున్నావ్?

ఎవరి బిడ్డడు ? ఎక్కి ఎక్కి ఏడుస్తున్నాడు? నిజం చెప్పు. నేను చెయ్యగలిగిన సహాయం ఏమన్నా ఉంటే చేస్తాము.

అయ్యా ! నువ్వు ఎవరో నాకు తెలియదు. అయినా అడుగుతున్నావు కాబట్టి చెబుతున్నాను

Auto


 

Hand glyder

 


Double collered knots


 

Working principale of sewing machine


 

Detergent cake


 

Plastering technology


 

Slippers making


 

Crazy train


 

Zip sticking


 

 *కార్తిక పురాణము - 13*

🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔

*కార్తిక పురాణము - పదమూడవ అధ్యాయము*


వశిష్టుడిట్లు చెప్పెను.జనకరాజా! కార్తీకమాసమందు చేయదగిన ఆవశ్యకములైన కార్తీక ధర్మములను మా తండ్రియైన బ్రహ్మచేత నాకు చెప్పబడినవి.అవన్నియు చేయదగినవి. చేయనియెడల పాపము సంభవించును.ఇది నిజము.సంసార సముద్రమునుండి దాటగోరువారును, నరకభయముల వారును ఈధర్మములను తప్పక చేయవలెను.కార్తీకమాసమందు కన్యాదానము, ప్రాతఃస్నానము, శిష్టుడైన బ్రాహ్మణుని పుత్రునకు ఉపనయనము చేయించుటకు ధనమిచ్చుట, విద్యాదానము, వస్త్ర దానము, అన్నదానము, ఇవి ముఖ్యములు.


కార్తీకమాసమందు ద్రవ్య హీనుడైన బ్రాహ్మణపుత్రునకు ఉపనయనమును చేయించ దక్షిణనిచ్చిన యెడల అనేక జన్మములలోని పాపములు నశించును.తన ద్రవ్యమిచ్చి ఉపనయనము చేయించినప్పుడు ఆ వటువుచే చేయబడిన గాయత్రీ జపఫలము వలన పంచమహాపాతకములు భస్మమగును.


గాయత్రీ జపము, హరిపూజ, వేదవిద్యాదానము వీటిఫలమును చెప్పుటకు నాకు శక్యముగాదు. పదివేలు తటాకములను త్రవ్వించు పుణ్యమును, నూరు రావిచెట్లు పాతించిన పుణ్యమును, నూతులు దిగుడుబావులు, నూరు బావులు త్రవ్వించిన పుణ్యమును, నూరు తోటలు వేయించిన పుణ్యమును ఒక బ్రాహ్మణునకు ఉపనయనము చేయించిన పుణ్యములో పదియారవవంతుకు కూడ సరిపోవు.


కార్తీకమాసమందు ఉపనయన దానమును చేసి తరువాత మాఘమాసమందుగాని, వైశాఖమాసమందుగాని, ఉపనయనమును చేయించవలయును.సాధువులు శ్రోత్రియులును అగు బ్రాహ్మణుల కుమారులకు ఉపనయనము చేయించిన యెడల అనంతఫలము గలదని ధర్మవేత్తలైన మునులు చెప్పిరి.ఆ ఉపనయనములకు సంకల్పము కార్తీకమాసమందు చేయవలెను.అట్లు చేసిన యెడల గలిగెడి ఫలమును చెప్పుటకు భూమియందు గాని, స్వర్గమందుగాని ఎవ్వనికి సామర్ధ్యము లేదు.పరద్రవ్యము వలన తీర్థయాత్రయు, దేవబ్రాహ్మణ సంతర్పణము చేసిన యెడల ఆ పుణ్యము ద్రవ్యదాతకు గలుగును.


కార్తీక మాసమందు ధనమిచ్చియొక బ్రాహ్మణునకు ఉపనయనమును, వివాహమును చేయించిన యెడల అనంత ఫలము గలుగును. కార్తీకమాసమందు కన్యాదాన మాచరించువాడు తాను పాపవిముక్తుడగును.తన పితరులకు బ్రహ్మలోక ప్రాప్తి కలిగించినవాడగును.


ఓ జనకరాజా! ఈవిషయమై పురాతన కథ ఒకటి గలదు, ఆ కథ చెప్పెదను సావధానుడవై వినుము.


ద్వాపరయుగమున వంగదేశమున సువీరుడను రాజుకలడు.మిక్కిలి వీర్య శౌర్యములు కలవాడు.అతడు దురాత్ముడు.ఆరాజు కొంతకాలమునకు దైవయోగము వలన దాయాదులచేత జయించబడిన వాడై రాజ్యభ్రష్టుడై 'అర్థోవా ఏషా ఆత్మనోయత్పత్నీ' అను శ్రుత్యుక్త ప్రకారముగా భార్య అర్ధాంగి కనుక ఆమెను కూడా తీసుకొని అరణ్యమునకుబోయి ధనము లేక జీవించుటకై చాలా దుఃఖపడుచుండెను.


ఆ అరణ్యమందు రాజును, భార్యయు కందమూలాదులు భక్షించుచు కాలమును గడుపుచుండిరి.అట్లుండగా భార్య గర్భవతియాయెను.నర్మదాతీరమందు రాజు పర్ణశాలను నిర్మించెను.ఆ పర్ణశాలయందామె సుందరియైన ఒక కన్యను కనెను. రాజు అరణ్య నివాసము, వన్యాహారము, అందు సంతాన సంభవము, సంతాన పోషణకు ధనము లేకుండుట మొదలైన వాటిని తలచుకొని తన పురాకృత పాపమును స్మరించుచు బాలికను కాపాడుచుండెను.తరువాత పూర్వ పుణ్యవశముచేత ఆ కన్యక వృద్ధినొంది సౌందర్యముతోను, లావణ్యముతోను ఒప్పియున్నదై చూచువారికి నేత్రానందకారిణియై యుండెను.


ఆ చిన్నదానికి ఎనిమిది సంవత్సరముల వయస్సు వచ్చినది.మనస్సుకు బహురమ్యముగా ఉన్నది.ఇట్లున్న కన్యకను చూసి ఒక ముని కుమారుడు సువీరా! నీకూతురుని నాకిచ్చి వివాహము చేయుమని యాచించెను.


ఆమాటవిని రాజు "మునికుమారా! నేను దరిద్రుడను గనుక నేను కోరినంత ధనమును నీవిచ్చితివేని ఈకన్యను నీకిచ్చెదను" అనెను.


ఈమాటను విని మునికుమారుడు ఆ కన్యయందు కోరికతో రాజుతో, "ఓరాజా! నేను తపస్సు చేసి సంపాదించి బహుధనమును నీకిచ్చెదను.దానితో నీవు సుఖములను బొందగలవు" అని మునికుమారుడు చెప్పెను.


ఆమాటలను విని రాజు సంతోషించి అలాగుననే చేసెదను అనెను.తరువాత మునికుమారుడు ఆ నర్మదాతీరమందే తపము ఆచరించి బహుధనమును సంపాదించి ఆ ధనమంతయు రాజునకిచ్చెను.రాజు ఆ ధనమంతయు గ్రహించి, ఆనందించి తృప్తినొంది ఆ మునికుమారునకు తన కూతురునిచ్చి తనయొక్క గృహ్యసూత్రమందు చెప్పబడిన ప్రకారము వివాహము అరణ్యమునందే చేసెను.


ఆ కన్యయు వివాహము కాగానే భర్త వద్దకు చేరెను.రాజు కన్యావిక్రయ ద్రవ్యముతో తాను భార్యయు జీవించుచుండిరి.రాజు భార్య తిరిగియొక కుమార్తెను కనెను. రాజు దానిని జూచి సంతోషించి ఈసారి ఈ కన్యకను విక్రయించిన యెడల చాలా ద్రవ్యము రావచ్చును,దానితో నాజన్మమంతయు గడుచునని సంతోషించుచుండెను.


రాజు ఇట్లు తలచుచుండగా పూర్వపుణ్యవశముచేత ఒక యతీశ్వరుడు స్నానార్థము నర్మదానదికివచ్చి పర్ణశాలముందు ఉన్న రాజును, రాజుభార్యను, రాజుకూతురుని జూచెను.కౌండిన్య గోత్రుడైన ఆ యతీశ్వరుడు దయతో, "ఓయీ! నీవెవ్వడవు?ఈ అరణ్యమందు ఇప్పుడు ఎందుకు ఇట్లున్నావు?చెప్పము" అని అడిగెను.


"దారిద్ర్యముతో సమానమైన దుఃఖము, పుత్రమృతితో సమానమైన శోకము, భార్యావియోగముతో సమానమయిన వియోగదుఃఖములు లేవు.దారిద్ర్య దుఃఖముతో శాకమూల ఫలాదులను భుజింపుచు ఈ వనమందు నివాసము చేయుచు కాలము గడుపుచున్నాను.ఈ అరణ్యమునందే పర్ణశాలలో నాకు కుమార్తె కలిగినది.ఆ చిన్నదానిని యౌవనము రాగానే ఒక మునికుమారుని వలన బహుధనమును గ్రహించి వానికిచ్చి వివాహముచేసి ఆ ధనముతో సుఖముగా జీవించుచున్నాను.ఇంక ఏమి వినగోరితివో చెప్పుము".


ఇట్లు రాజు వాక్యమును విని యతి, "రాజా! ఎంత పనిచేసితివి?మూఢునివలె పాపములను సంపాదించుకొంటివి.కన్యాద్రవ్యముచేత జీవించువాడు యమలోకమందు అసిపత్రవనమను నరకమందు నివసించును. న్యాద్రవ్యము చేత దేవఋషి పితరులను తృప్తి చేయుచున్న వానికి పితృదేవతలు ప్రతిజన్మమందును ఇతనికి పుత్రులు కలుగకుండుగాక అని శాపమునిత్తురు. కన్యాద్రవ్యముతో వృత్తిని సంపాదించి ఆవృత్తివల్ల జీవనము చేయు పాపాత్ముడు రౌరవనరకమును పొందును. సమస్తమయిన పాపములకు ప్రాయశ్చిత్తము చెప్పబడియున్నది కాని కన్యావిక్రయ పాపమునకు ప్రాయశ్చిత్తము ఎచ్చటా చెప్పబడియుండలేదు.కాబట్టి ఈకార్తీకమాసమందు శుక్లపక్షమందు ఈ రెండవ కూతురికి బంగారు ఆభరణములతో అలంకరించి కన్యకను దానము ఇచ్చి వివాహము చేయుము.కార్తీకమాసమందు విద్యాతేజశ్శీలయుక్తుడయిన వరునకు కన్యాదానము చేసిన వాడు గంగాది సమస్త తీర్థములందు స్నానదానములు చేసెడివాడు పొందెడి ఫలమును, యధోక్త దక్షిణాయుతముగా అశ్వమేధాది యాగములను చేసిన వాడు పొందెడి ఫలమును పొందును".


ఇట్లు యతి చెప్పగా విని రాజు సకల ధర్మవేత్తయయిన యతీశ్వరునితో, నీచుడై ధనాశతో, "బ్రాహ్మణుడా !ఇదియేమి మాట? పుత్రదారాదులు, గృహక్షేత్రాదులు, వస్త్రాలంకారాదులు ఉన్నందుకు దేహమును సుఖపెట్టి భోగించవలెను గాని ధర్మమనగా ఏమిటి? పుణ్యలోకమనగా ఏమిటి? దానమనగా ఏమిటి?నా ఈ రెండవ కూతురుని పూర్తిగా ద్రవ్యమిచ్చువానికిచ్చి ఆ ద్రవ్యముతో సుఖభోగములను పొందెదను.నీకెందుకు నీ దారిని నీవుపొమ్ము" అనెను.


ఆ మాటవిని యతి స్నానముకొరకు నర్మదానదికి పోయెను.తరువాత కొంతకాలమునకు ఆయరణ్యమందే సువీరుడు మృతినొందగా యమదూతలు పాశములతో వచ్చి రాజును కట్టి యమలోకమునకు తీసుకొనిపోయిరి.


అచ్చట యముడు వానిని జూసి కళ్ళెర్రజేసి అనేక నరకములందు యాతనలనుబొందించి అసిపత్రవనమందు రాజును, రాజు పితరులను గూడ పడవేయించెను.అసిపత్రమనగా కత్తులే ఆకులుగా గల వృక్షములతోగూడిన చిక్కనివనము.


ఈ సువీరుని వంశమందు శ్రుతకీర్తి యనువాడొకడు సమస్త ధర్మములను నూరు యజ్ఞములు చేసి ధర్మముగా రాజ్యపాలనము కావించెను.స్వర్గమునకుబోయి ఇంద్రాదులచేత సేవించబడుచుండెను.ఈ శ్రుతకీర్తి, సువీరుని పాపశేషముచేత స్వర్గమునుండి తాను నరకమున పడి యమయాతనలనొందుచు ఒకనాడు, 'ఇది ఏమి అన్యాయము? పుణ్యము చేసిన నన్ను యమలోకమందుంచినారని' విచారించుకుని ధైర్యముతో యమునితో, "సర్వమును తెలిసిన ధర్మరాజా! నా మనవి వినుము.ఎంతమాత్రమును పాపమును చేయని నాకు ఈ నరకమెందుకు వచ్చినది? అయ్యో ఋషీశ్వరులు చెప్పిన ధర్మములన్నియు వృధాగా పోయినవే. ఇదిగాక స్వర్గమందున్న నాకు నరకమున పడుట ఎందుకు గలిగినది?" అని శ్రుతకీర్తి చెప్పిన మాటలను విని యముడు పల్కెను.


"శ్రుతకీర్తీ! నీవన్న మాట సత్యమే గానీ,నీవంశస్థుడు సువీరుడనువాడు ఒకడు దురాచారుడై కన్యాద్రవ్యముచేత జీవించినాడు.ఆ పాపముచేత వాని పితరులైన మీరు స్వర్తస్థులైనను నరకమందు ఉన్నారు.తరువాత భూమియందు దుష్టయోనులందు జన్మించెదరు.శ్రుతకీర్తీ! సువీరుని యొక్క రెండవ కుమార్తె ఉన్నది.నర్మదా నదీతీరమందు పర్ణశాలలో తల్లివద్ద ఉన్నది.దానికింకను వివాహము కాలేదు.కాబట్టి నీవు నాప్రసాదము వలన ఈ దేహముతో అచ్చటికి వెళ్ళి అచ్చట ఉన్న మునులతో ఈమాటను చెప్పి కార్తీకమాసమందు ఆకన్యను యోగ్యుడైన వరునికిచ్చి కన్యాదానము పెండ్లి చేయుము.కార్తీకమాసమందు సర్వాలంకార యుక్తమయిన కన్యను వరునకిచ్చువాడు లోకాధిపతి యగును. శాస్త్రప్రకారము కన్యాదానము ప్రశస్తము.అట్లు కన్యాదానము చేయుటకు కన్యా సంతాము లేనివాడు ఒక బ్రాహ్మణునకు ధనమిచ్చిన యెడల ధనదాతయును, లోకాధిపతియు అగును.కన్యలు లేనివాడు రెండు పాడియావులనిచ్చి కన్యకను దీసికొని వరునికిచ్చి వివాహము చేసిన యెడల కన్యాదాన ఫలమును పొందును. నీవు శీఘ్రముగా పోయి బ్రాహ్మణునకు కన్యామూల్యము ఇమ్ము.దానిచేత నీపితరులందరు తృప్తినొంది నిత్యము సంతోషింతురు" అని పలికెను.


శ్రుతకీర్తి యముని మాటవిని అట్లేనని యమునకు వందనమాచరించి నర్మదాతీరమందున్న కన్యను సువర్ణాభరణములతో కార్తీక శుక్లపక్షమందు ఈశ్వర ప్రీతిగా విద్యుక్తముగా కన్యాదానము చేసెను.


ఆ పుణ్యమహిమచేత సువీరుడు యమపాశ విముక్తుడై స్వర్గమునకు పోయి సుఖముగా ఉండెను.తరువాత శ్రుతకీర్తి పదిమంది బ్రాహ్మణ బ్రహ్మచారులకు కన్యామూల్యమును ఇచ్చెను.దానిచేత వాని పితరులందరు విగతపాపులై స్వర్గమునకు పోయిరి.తానును యథాగతముగా స్వర్గమును చేరెను.


కార్తీకమాసమందు కన్యాదాన మాచరించువాడు విగతపాపుడగును.ఇందుకు సందేహములేదు.కన్యామూల్యము ఇవ్వలేని వారు మాటతోనయినా వివాహమునకు సహాయము చేసిన వారి పుణ్యమునకు అంతములేదు.కార్తీకమాసమందు కార్తీకవ్రతమాచరించువాడు హరి సాయుజ్యమును పొందును.ఇది నిజము. నామాట నమ్ముము.


ఈ ప్రకారముగా కార్తీక వ్రతమాచరించని వారు రౌరవనరకమును బొందుదురు.


*ఇతి శ్రీస్కాందపురాణే కార్తీహాత్మ్యే త్రయోదశోధ్యాయసమాప్తః*

 ఆరోగ్యపరముగా గుర్తు ఉంచుకొనవలసిన ముఖ్య నియమాలు  - 


 *  శరీరములో లోటు భర్తీ అగుటకు , శరీరం పెరుగుటకు మాంసకృత్తులు అవసరము. ఈ మాంసకృత్తులు పాలు , మాంసం , గుడ్లు , పప్పులు మొదలైన పదార్దములు తీసికొనవలెను. 


 *  కొవ్వుపదార్ధాలు , కార్బోహైడ్రేట్లు శరీరము నందు తాపమును పెంచును. వాటిపైన మనము ఆధారపడి జీవించలేము. చక్కెర , గంజి (పిండి) ముఖ్యమైన కార్బోహైడ్రేట్స్ కలవు. గింజల చమురులో విటమిన్స్ లేవు . 


 *  చేపనూనె , పాలు , వెన్న , నెయ్యి , ఆకుకూరలు , దుంపలు , మామిడిలో విటమిన్ A ఎక్కువుగా లభ్యం అగును. కండ్లు మరియు చర్మము సరైన స్థితిలో ఉంచుటకు కూడా విటమిన్ A అవసరం.


 *  గోధుమ , బియ్యపు తవుడు , తృణధాన్యాలు , పప్పు దినుసుల యందు B1 విటమిన్ కలదు. ఈ విటమిన్ సరిగ్గా ఉన్నచో నంజు వ్యాధి రాదు . మన శరీరం పెరుగుదలకు మరియు ఆరోగ్యానికి B1 విటమిన్ అత్యంత ముఖ్యం అయినది.  


 *  పాలు , కాలేయము , మాంసం , గుడ్లు , చేపల యందు B2 విటమిన్ ఎక్కువుగా ఉండును . ఈ విటమిన్ శరీరం పెరుగుదలకు , ఆరోగ్యమునకు అత్యంత అవసరం. కండ్లకు సంబంధించిన , పెదవులు , నోటికి సంబంధించిన జబ్బులు రాకుండా ఈ విటమిన్ కలిగిన పదార్ధాలను ఎక్కువుగా తీసికొనవలెను. 


 *  తాజాపండ్లు , కూరగాయలు , మొలకెత్తిన ధాన్యములో C విటమిన్ ఎక్కువ లభ్యం అగును. ఇది స్కర్వీ వ్యాధి రాకుండా చేయును . 


 *  పాలు , వెన్న , నెయ్యి , చేపలు , చేపనూనె యందు D విటమిన్ లభ్యం అగును. ప్రకృతిసిద్ధముగా సూర్యరశ్మి తగులుట వలన కూడా D విటమిన్ లభ్యం అగును. ఈ విటమిన్ ఎముకలు పెరుగును. ఈ విటమిన్ లోపము వలెనే రికెట్స్ అను వ్యాధి వచ్చును. 


 *  పాలలో క్యాల్షియం ఎక్కువుగా లభ్యం అగును. పచ్చని ఆకుకూరలలో కూడా క్యాల్షియం ఉన్నది . ఎముకలు బలంగా ఉండుటకు , మంచి పెరుగుదల , ఆరోగ్యముగా ఉండుటకు క్యాల్షియం అవసరం.


 *  శరీరము నందు రక్తం వృద్ది అగుటకు ఇనుము అవసరం. రక్తహీనత వలన కలుగు జబ్బుల వలన భాధపడువారికి ఎక్కువ ఇనుము అవసరం. ధాన్యములలో , పప్పులలో , ఆకుకూరలలో ఇనుము ఎక్కువుగా ఉండును. 


 *  బాగా మరపట్టిన తెల్లటి బియ్యము కంటే దంపుడు బియ్యము లేక ఒక్కసారి పట్టు పట్టిన మరబియ్యం చాలా మంచివి. తెల్ల గోధుమ రొట్టె కంటే చపాతీలుగా కాని , బ్రౌన్ రొట్టె కాని మంచివి. 


 *  మన శరీరానికి అవసరం అయిన పదార్ధాలు బియ్యము నందు కాని గోధుమల యందు కాని లేవు . ఆహారములో వీటితో పాటు పాలు , పప్పులు , పండ్లు , కాయగూరలు , ఆకుకూరలు తగినంత ప్రమాణములో ఉండవలెను. 


 *  తీపి వస్తువులను గాని , తీపి చిరుతిండ్లును గాని ఎక్కువ తీసుకోవడం మంచిది కాదు. అవి మనకు మాంసకృత్తులును గాని , విటమిన్లు కాని , ఖనిజాలు ను గాని ఇవ్వవు. అంతేకాకుండా ఆకలిని కూడా చంపివేయును 


 *  అన్ని ఆహారపదార్ధాల కంటే ఉత్తమమైన ఆహారం పాలు .  బియ్యము వంటి   ధాన్యములలో లోటుగా ఉన్న అన్నిరకములైన పోషక పదార్దాలను పాలు భర్తీ చేయును . 


    మరింత విలువైన సులభ ఔషధ చికిత్సల కొరకు నేను రచించిన గ్రంథాలు చదవగలరు . 


     గమనిక  -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


       ఈ గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా ఫొన్ చేయండి  . సంప్రదించవలసిన నెంబర్ 

                   

                        9885030034 


         మెస్సేజిస్ , కామెంట్ల రూపంలో పెట్టవద్దు .


                  కాళహస్తి వేంకటేశ్వరరావు .


              అనువంశిక ఆయుర్వేద వైద్యులు .


                          9885030034

సాధన సంబంధ 56 పుస్తకాలు(PDF) ఒకేచోట ఉచితంగా

 *జ్ఞాన యోగం/బ్రహ్మవిద్య/సాధన  సంబంధ 56 పుస్తకాలు(PDF) ఒకేచోట ఉచితంగా తెలుగులో. ఈ క్రింది లింక్స్ పై క్లిక్ చేసి Read/Download చేసుకోగలరు*

------------------------------------------------

నన్ను నేను తెలుసుకోవటం ఎలా? https://www.freegurukul.org/z/AthmaJnanam-Through-Pictures.pdf


బ్రహ్మవిద్యా రత్నాకరము-1 నుంచి 2 భాగాలు www.freegurukul.org/g/JnanaYogam-1


జీవిత పరమార్ధము - వేదాంత శాస్త్రము www.freegurukul.org/g/JnanaYogam-2


అద్వైత సిద్ధి www.freegurukul.org/g/JnanaYogam-3


ఆత్మానాత్మ వివేక దర్శిని www.freegurukul.org/g/JnanaYogam-4


బ్రహ్మ విద్యాసుధార్ణవము www.freegurukul.org/g/JnanaYogam-5


శ్రీ బ్రహ్మ విద్య www.freegurukul.org/g/JnanaYogam-6


విశ్వ వేదన www.freegurukul.org/g/JnanaYogam-7


సత్య ధర్మ విచారణ - ధర్మ చర్చ www.freegurukul.org/g/JnanaYogam-8


ఆత్మ అనగా ఏమిటి www.freegurukul.org/g/JnanaYogam-9


ఆత్మబోధ www.freegurukul.org/g/JnanaYogam-10


బ్రహ్మ జిజ్ఞాస-1 www.freegurukul.org/g/JnanaYogam-11


బ్రహ్మ జిజ్ఞాస-2 www.freegurukul.org/g/JnanaYogam-12


బ్రహ్మ జిజ్ఞాస-3 www.freegurukul.org/g/JnanaYogam-13


బ్రహ్మ జిజ్ఞాస-4 www.freegurukul.org/g/JnanaYogam-14


త్రిపురా రహస్య దీపిక-జ్ఞాన ఖండము www.freegurukul.org/g/JnanaYogam-15


ఆత్మ సాక్షాత్కారము www.freegurukul.org/g/JnanaYogam-16


బ్రహ్మవిద్య www.freegurukul.org/g/JnanaYogam-17


వేదాంత విద్యాసారధి www.freegurukul.org/g/JnanaYogam-18


బ్రహ్మవిద్యానుసంధాన దర్పణం www.freegurukul.org/g/JnanaYogam-19


జ్ఞానామృత సారము www.freegurukul.org/g/JnanaYogam-20


బ్రహ్మ విద్యా దర్పణము www.freegurukul.org/g/JnanaYogam-21


శంకరాద్వైత వ్యాసమాల-1 www.freegurukul.org/g/JnanaYogam-22


శంకరాద్వైత వ్యాసమాల-3 www.freegurukul.org/g/JnanaYogam-23


శ్రీ బ్రహ్మ విద్య www.freegurukul.org/g/JnanaYogam-24


పరిపూర్ణ బ్రహ్మ విద్య www.freegurukul.org/g/JnanaYogam-25


ఆత్మ తత్వ వివేకము www.freegurukul.org/g/JnanaYogam-26


వివర్త వాద వివేకము www.freegurukul.org/g/JnanaYogam-27


బ్రహ్మ విద్యా వైభవము www.freegurukul.org/g/JnanaYogam-28


ఆత్మ తత్వము www.freegurukul.org/g/JnanaYogam-29


అద్వైత బోధిని www.freegurukul.org/g/JnanaYogam-30


బ్రహ్మవిద్య ప్రాధమిక సూత్రములు www.freegurukul.org/g/JnanaYogam-31


సత్యార్ధ ప్రకాశము www.freegurukul.org/g/JnanaYogam-32


మానవ జన్మ సాఫల్యము-ముక్తి మార్గము www.freegurukul.org/g/JnanaYogam-33


జీవన్ముక్తి వివేకః www.freegurukul.org/g/JnanaYogam-34


భగవదన్వేషణ-కొన్ని మంచి మాటలు www.freegurukul.org/g/JnanaYogam-35


సర్వ వేదాంత శిరోభూషణం www.freegurukul.org/g/JnanaYogam-36


మోక్షస్వరూప నిర్ణయము www.freegurukul.org/g/JnanaYogam-37


ఆత్మ దర్శనము www.freegurukul.org/g/JnanaYogam-38


సర్వోపనిషత్ సార సంగ్రహము www.freegurukul.org/g/JnanaYogam-39


ముముక్షు ధర్మము www.freegurukul.org/g/JnanaYogam-40


విజ్ఞాన వీచికలు-ఆధ్యాత్మికతరంగాలు www.freegurukul.org/g/JnanaYogam-41


సాధన www.freegurukul.org/g/JnanaYogam-42


ఆత్మా- చిత్ ప్రవచనములు www.freegurukul.org/g/JnanaYogam-43


ఒకటి సాధిస్తే అన్ని సాధించినట్లే www.freegurukul.org/g/JnanaYogam-44


సాధన సోపానాలు www.freegurukul.org/g/JnanaYogam-45


తత్వబోధ www.freegurukul.org/g/JnanaYogam-46


వివేక చింతామణి www.freegurukul.org/g/JnanaYogam-47


సనత్సు జాతీయము www.freegurukul.org/g/JnanaYogam-48


వేదాంతపు కథలు www.freegurukul.org/g/JnanaYogam-49


గురుప్రభోద తారావళి www.freegurukul.org/g/JnanaYogam-50


జగన్మిధ్యా - తత్వ పరిశీలనము www.freegurukul.org/g/JnanaYogam-51


అద్వైతం www.freegurukul.org/g/JnanaYogam-52


అధ్యాత్మ జడ్జిమెంట్ www.freegurukul.org/g/JnanaYogam-53


మోక్ష సాధన www.freegurukul.org/g/JnanaYogam-54


జ్ఞానదీపిక www.freegurukul.org/g/JnanaYogam-55


సద్గురు తత్త్వభోధ www.freegurukul.org/g/JnanaYogam-56


బ్రహ్మవిద్య/జ్ఞాన యోగం పై అధ్యయనం, పరిశోధన చేయడానికి కావలిసిన పుస్తకాలు ఒకేచోట దొరకక తెలుగువారు ఇబ్బంది పడుతున్నారు. కావున ప్రతి ఒక్కరికి చేరేలా సహాయం చేయండి 🙏.


ఇటువంటి ప్రేరణ, స్ఫూర్తినిచ్చే సందేశాలను  ప్రతి రోజు పొందుటకు:

Telegram Channel లో join అగుటకు  https://t.me/freegurukul

Whatsapp Group లో join అగుటకు  www.freegurukul.org/join

 *_లోకం తీర్పు కు నీ బ్రతుకును బలి పెట్టకు,_*

*_మంచిగా ఉంటే ముంచుతుంది.._*

*_డబ్బు ఉంటే తోడై వస్తుంది.._*

*_ఆస్తి లేకుంటే ప్రాణాలు తోడేస్తుంది,_*

*_నవ్వితే సహించదు,_*

*_ఏడిస్తే హేళనగా చూస్తుంది,_*

*_ఉద్యోగం ఉంటే మహారాజు అంటుంది,_*

*_ఉద్యోగం లేకుంటే మహాదరిద్రుడు అంటుంది,_*

*_లోకం తీరే ఇంతే!_*

*_సూటిగా మాట్లాడే వాడిని,_*

*_సమాజం ఎప్పుడూ ఒప్పుకోదు._*

*_దొంగ చాటుగా మాట్లాడి,_*

*_మోసం చేసే వాళ్ళ మాటలు భళే వింటారు..._*

*_ఎవరి గురించో ఎవరి మెప్పు కోసమో,_*

*_నీకు "మంచోడు" అన్పించుకోవాలనే ఆరాటం ఉంటే,_*

*_జీవితాంతం నిన్ను నువ్వు కోల్పోయి ఇతరుల స్వార్థాన్ని తీరుస్తూ ఉండాలి.!_*

*_నువ్వు ఎవరికి నచ్చావు, నీ మాటలు ఎవరికి నచ్చాయి అనే ఆలోచన చేస్తూ ఉంటే,_*

*_నువ్వు నీలా ఉండడం నీకు తెలియకుండానే మర్చిపోయి, ఎదుటివారికి నచ్చేలా ఉండాలని తాపత్రయ పడతావు!_*

*_అందుకే నీలో సహజత్వాన్ని చంపే ఏ ఆలోచనకీ ఆయువు పోసి బ్రతికించకు☝️._*


*_✍మీ.. డా,, తుకారాం జాదవ్.🙏_*

 🕉️ ఆలోచనాలోచనాలు 🕉️( అక్షరరూపం దాల్చిన ఒక సిరాచుక్క; లక్ష మెదళ్ళకు కదలిక)                  ***** నీ తోటి ప్రజలతో సద్భావనలతో జీవించు. అదే నీవు ఈ లోకానికి ఇచ్చిపోగల అద్భుతమైన, అత్యంత విలువైన "" వీలునామా.""                             ***** మీరు వద్దన్నా మీ వయసు పెరుగుతూనే ఉంటుంది. వరుసగా రోజులు, నెలలు ఆపై సంవత్సరాలు. మీరేమో వయస్సును దాచడానికి జుట్టుకు రంగులు, కట్టుడు పళ్ళు, సౌందర్యసాధనాలైన లిప్ స్టిక్స్, ఆపై ప్లాస్టిక్ సర్జరీలు మరియు విగ్గులతో ప్రయత్నం చేస్తుంటారు. విచిత్రంగా ఉంది కదూ!            ***** ఆ రెండు (౼) మైనస్ లు. ఒకదానికి, ఒక అడ్డుపడితే ఒక (+) ప్లస్ అయికూర్చుంటుంది. మీ వద్దనున్న వ్యతిరేక భావనలను ఒకదానిని రెండవ దానితో ఖండించుకోనివ్వండి. మీరు అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నట్లు లెక్క.                                     ***** మనం రోజువారీ రంగు,రంగుల అధునాతన ఫ్యాషన్ దుస్తులను జనం గుర్తుంచుకోవడం కష్టం. కానీ మీ మనస్సు ధరించే మేలైన, అద్భుతమైన గుణశీలాలను జనాలు వద్దన్నా ఎక్కువ కాలం అప్రయత్నంగా గుర్తుంచుకొంటారు.               ***** తమాషా ఏమిటంటే ఎల్లప్పుడూ, ఎవరినో ఒకరిని లక్ష్యంగా తప్పులెన్నుకుంటూ బ్రతుకుతున్నావంటే, నీకు నువ్వే నేను మిగిలిన వారికంటే ""ఉత్తముడను"" అని కారెక్టర్ సర్టిఫికెట్ ఇచ్చుకొంటున్నానని అర్థం. కాకపోతే ఈ" ధృవీకరణ పత్రాని"కి దిగువన ఎవరి సంతకం ఉండదు. ఆపనేదో నీవే చేసుకొని ఆత్మతృప్తిని పొందాలి.           ***** పందొమ్మిది పర్యాయాలు ఓటమిపాలైనా, ఇరువదవ పర్యాయం ప్రయత్నించి గెలుపు గుఱ్ఱాన్ని అధిరోహించడానికి ప్రయత్నించు. చివరిదానినే లోకం గుర్తుంచుకొంటుంది.     ***** అందరం ఒకే ఆకాశం క్రింద బ్రతుకుతున్నాం. అందరి ఆలోచనా ఉన్నతి మాత్రం ఒకే ఎత్తులో (Horizon) ఉండదు. అదే ఈ లోకంలోని విచిత్రం.                ***** ఉన్నది తక్కువ భూమి. చల్లింది తక్కువ గింజలు. ఎక్కువ పంటను ఆశించడం దురాశ మాత్రమే కాదు. కపట వ్యవహారం కూడా!                      ***** ఒక పని కాకూడదని మన మనస్సులో నిశ్చయం ఉంటే, వెంటనే మనం చెయ్యవలసిన తెలివైన పని ఏమిటంటే దానికొక కమిటీ వేసి, నిర్ణీత కాలాన్ని ప్రకటించకపోవడం.                ***** ఈ విశ్వంలో మరేవ్యక్తి ప్రవేశించని విధంగా ఎవరూ ఊహించని నూతన పథంలో అడుగులు ముందుకు వెయ్యడమే జీవితవిజయరహస్యం.        ***** ఒక సమస్య వచ్చిందని నీవెందుకు కంగారు చెందుతున్నావ్! సోదరా! అది నిన్ను నీవు లోకానికి అద్భుతంగా ప్రదర్శించుకొనే మేలైన అవకాశం.( A problem is a chance for you to do your best.).                       ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~                                       తెలుగు నుడికారం ( సామెతలు మరియు జాతీయాలు)                         1* అమ్మ పెట్టదు; అడుక్కుతిననియ్యదు.          2* తోచీతోచనమ్మ తోడికోడలు పుట్టింటికి ప్రయాణం అయ్యిందట!        3* అయ్యవారు ఏంచేస్తున్నారంటే; చేసిన తప్పులను తీరుబడిగ దిద్దుకొంటున్నారు.                 4* అయిపోయిన పెళ్ళికి బాజాలెందుకు?                     5* ఊళ్ళో పెళ్ళికి కుక్కల హడావుడి అధికం.                6* ఉట్టికెక్కలేనమ్మ ఏకంగా స్వర్గానికి పాకుతానందిట!       7* ఒక్క రోజు బాగోతానికి మూతి మీసాలు గొరిగించుకొన్నట్లు.               8* పిచ్చి కుదిరింది, తలకు రోకలి చుట్టమన్నాడుట!         9* దరిద్రానికి ఆకలి ఎక్కువ! తద్దినానికి కూరలెక్కువ.                         10* ఆ మాల్( సరుకు) మంచిదైతే ఆ అంగట్లో( సంతలో) నే అమ్ముడు పొయ్యేది.              తేది 25--11--2023, శనివారం, శుభోదయం.

 శు భో ద యం🙏


శివుని  మెడలో  తాళి !


               సీ:  చిన్ని వెన్నెల  ఱేఁడు  చెన్నైన  సికపూవు ,


                                         పసమించు  పులితోలు  పట్టుసాలు ,


                  " చిలువల యెకిమీడు  బలుమానికపుఁ  దాళి",


                                                      వాటంపు తెలిగిబ్బ  వారువంబు ;


                     గఱికి  పూజలు మెచ్చు  గారాబు కొమరుండు ,


                                                            వలిగొండ  కూతురు వలపు టింతి ;


                   జే జే  తుటుము లెల్ల ఁ జేరి కొల్చెడు బంట్లు ,


                                                 నును వెండి గుబ్బలి  యునికి  పట్టు ;


       గీ:       లగుచుఁ  జెలువొంద  భువనంబు  లనుదినంబు 


                 రమణఁ   బాలించు  నిన్ను   నేఁ బ్రస్తుతింతు 


                బుధనుత  విలాస !  పీఠికాపుర నివాస!


                   కుముదహిత  రహిత  కోటి సంకాశ!  కుక్కుటేశ!


                                     రుక్మిణీకళ్యాణం-- కావ్యావతారిక--కూచిమంచి తిమ్మకవి .


                       కవులు  ఘటనాఘటన  సమర్ధులు. వారేమైనా కనగలరు. అనగలరు. కాక పోతే  సదాశివుని  కంఠసీమ నలంకరించిన

సర్పరాజును తాళిగా చెప్పగలరా? ఎగతాళిగాదిది,  అక్షర సత్యం!  తిమ్మకవి దానిని తాళిగా పేర్కొనినాఁడు. అదోకవితా విచిత్రం!


                                       తిమ్మకవి విరచిత " రుక్మిణీ కళ్యాణ కావ్యావతారికలో నిపద్యమిది. పిఠాపురంలో నెలకొనిన కుక్కుటేశ్వర స్వామిని  ప్రస్తుతిస్తూ , ఇలా  అన్నాడాయన. "చందమామే నీకుశిరోభూషణం. పులిచర్మమే పట్టువస్త్రాలు. తెల్లటి ఎద్దే  అశ్వం.పన్నగ ప్రభువే  నీకంఠహారం .(చిలువల యెకిమీడు బలుమానికపుఁ దాళి) అంటూ వర్ణించు కొచ్చాడు కవి. అంటే పామే తాళిగామారిందని 

భావం. ఈ  తాళి  యనేపదానికి  ఉన్న పతకం, హారం  ఇత్యాది నానార్ధములను బట్టి తిమ్మకవి యిలాప్రయోగించాడు.


                             చంద్రభాను చరిత్రం లో చరిగొండ మల్లన , ఉత్తర రామాయణంలో  కంకంటి పాపరాజు కూడా హారాన్ని తాళిగా వర్ణిచారు. అన్నట్టు మనం యీమధ్య చూచిన  గౌతమీపుత్ర శాతకర్ణి  చిత్రంతో ప్రాచుర్యంలోకివచ్చిన  ఒకప్రాచీన పదంకూడా  యీపద్యంలో కనిపిస్తోంధి. అదే  'ఎకిమీడు' అనేపదం.దీనితోఁబాటు 'వెన్నెలఱేడు (చంద్రుడు ) పస (కాంతి )  తెలిగిబ్బ (తెల్లనియెద్దు)

వారువం (గుఱ్ఱము) వలిగొండ  (మంచుపర్వతం)  తుటుము (సమూహము )  వెండిగుబ్బలి(వెండికొండ)లాంటి  అచ్చతెలుగు పదాలతోశివుడికి తిమ్మన అక్షరాభిషేకం చేశాడు. 


                                                                       తిమ్మకవి ప్రతిభ  అపారం!


                                                                                  స్వస్తి!


🙏🙏🌷🌷🌷🌷👌👌🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే!*

                🌷🌷🌷

*కలియుగాబ్ది 5124* *శ్రీ శాలివాహన శకం 1944 స్వస్తి శ్రీ    చాంద్రమాన శోభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం - శరదృతువు - కార్తీక మాసం - శుక్ల పక్షం  -‌ త్రయోదశి - అశ్విని -‌  స్థిర వాసరే* *(25-11-2023)* 


ప్రముఖ వేదపండితులు,  *బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* గారి నేటి వేద ఆశీర్వచనం.


https://youtu.be/JjdmPHDoLgM?si=y7VU6lTfnbi8yC5E


🙏🙏

 **********

*శుభోదయం*

*********

సంధ్యా వందన మరియు

ఇతర 

పూజాకార్యక్రమాల సంకల్పము. 

పూర్వ పద్ధతి పంచాంగం.

తేదీ.25.11..2023

శని వారం (స్థిర వాసరే

*************

గమనిక:-ఇక్కడ నేను ఇచ్చే సంకల్పం మా పెద్దలు మరియు గురువుల ద్వారా నేర్చుకున్న నిష్కామ సంకల్పం.  దీనిని మీరు ఉన్న ప్రదేశం మరియు మీరు మీ గురువు ద్వారా నేర్చుకున్న విధంగా మార్చుకో  వచ్చును. 

__________________

శుభాభ్యుదయార్ధంచ, శుభే శోభనే ముహూర్తే శ్రీ  మహావిష్ణోరాజ్నేయా  ప్రవర్తమానస్య అద్యబ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేత వరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రధమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే

మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీ శైలస్య వాయువ్య దిగ్భాగే (హైదరాబాద్ లో వారికి మాత్రమే)గంగా కావేర్యోర్మధ్య ప్రదేశే  శ్రీలక్ష్మీ నివాస గృహే సమస్థ దేవతా హరిహర గురు గో బ్రాహ్మణ చరణ సన్నిధౌ  అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన

శ్రీ శోభకృత్ నామ సంవత్సరే దక్షిణాయనే

శరదృతౌ

కార్తీక మాసే శుక్ల పక్షే త్రయోదశ్యాం (సూర్యోదయానికి ఉన్న తిథే  చెప్పుకోవాలి సంధ్యావందనాలకు మాత్రమే)

స్థిర వాసరే 

శుభ నక్షత్రే

శుభ యోగే,

శుభకరణ,  

ఏవంగుణ విశేషణ విశిష్ఠాయాం శుభ తిధౌ 

శ్రీమాన్_______గోత్రః_____నామధేయః  

శ్రీమతః ______గోత్రస్య_______ నామధేయస్య మమ ఉపాత్త దురిత క్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం ప్రాతః/మాధ్యాహ్నిక/సాయం 

సంధ్యాముపాసిష్యే. 

సంధ్యా వందనం కొరకు మాత్రమే.

ఇతర పూజలకు శ్రీ శోభకృత్  నామ సంవత్సరే దక్షిణాయనే

శరత్ ఋతౌ  కార్తీక మాసే  శుక్ల పక్షే త్రయోదశ్యాం

స్థిర వాసరే అని చెప్పుకోవాలి.

ఇతర ఉపయుక్త విషయాలు

సూ.ఉ.6.14

సూ.అ.5.20

శాలివాహనశకం 1945 వ సంవత్సరం.  

విక్రమార్క శతాబ్దం లో 2080 వ సంవత్సరం. 

కల్యబ్దాః 5124 వ సంవత్సరం. 

శ్రీ శోభకృత్ నామ సంవత్సరం 

దక్షిణాయన పుణ్యకాలం శరత్ ఋతువు

కార్తీక మాసం 

శుక్ల పక్షం త్రయోదశి సా.4.35 వరకు. 

శని వారం. 

నక్షత్రం అశ్వని మ.2.58 వరకు. 

అమృతం ఉ.8.06 ల 9.38  వరకు. 

దుర్ముహూర్తం ఉ.6.14 ల 7.43 వరకు.  

వర్జ్యం ప. 11.08 ల 12.40 వరకు. 

వర్జ్యం రా.12.14 ల 1.47 వరకు. 

యోగం వ్యతీపాత ఉ.7.09 వరకు. 

యోగం వరీయాన్ తె.4.35 వరకు. 

కరణం తైతుల సా.4.35 వరకు.  

సూర్యోదయము  ఉ.6.00 గంటలకు అయితే.

రాహు కాలం ఉ.9.00 ల 10.30 వరకు. 

గుళిక కాలం ఉ.6.00 ల 7.30 వరకు. 

యమగండ కాలం మ.1.30 ల 3.00  వరకు. 

***********

పుణ్యతిధి కార్తీక శు. త్రయోదశి. 

.**********

*శ్రీ పద్మావతీ శ్రీనివాస వివాహ సమాచార సంస్థ*,

(స్థాపితము 11/08/2000 రి.జి.నెం.556/2013)

S2,/C92, 6 -3 -1599/92,బి 

M3 66579.

.**********

*బ్రాహ్మణ వధూవరుల సమాచార కేంద్రం*

                           వారి

*బ్రాహ్మణ వధూవరుల ద్వై మాసవపత్రిక*

*పత్రికలో రిజిస్ట్రేషన్*ఉచితం, పుస్తకం కావలసిన వారు ₹100/- చెల్లించిన చో పుస్తకం వారి చిరునామాకు పంపబడును* 

*రిజిస్ట్రేషన్ మరియు ఇతర వివరాలకై*

*సంప్రదించండి*

ఫోన్(చరవాణి) నెం లను 

*9030293127/9959599505

*.**************

ఈ రోజు పుట్టినరోజు మరియు పెళ్ళి రోజు జరుపు కుంటున్న   అందరికీ గాయిత్రి మాత ఆయురారోగ్యాలు సర్వదా ప్రసాదించాలని  కోరుకుంటూ మీ  శ్రేయోభిలాషి.

**************

మాస్క్ ధరిస్తూ సామాజిక దూరం పాటిస్తూ ఆరోగ్యం గాను క్షేమంగాను ఉండాలని ఆకాంక్షిస్తూ మీ శ్రేయోభిలాషి.

🙏🙏🙏

 *25-11-2023*

*స్థిర వాసరః శని వారం*

*రాశి ఫలితాలు*

*మేషం*

చేపట్టిన పనులు అప్రయత్నంగా పూర్తి అవుతాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా సాగుతాయి. దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.

*వృషభం*

ఇంటా బయట పరిస్థితులు కొంత నిరుత్సాహ పరుస్తాయి. శ్రమధిక్యతతో పనులు పూర్తికావు. బంధుమిత్రుల నుండి అందిన సమాచారం ఆశ్చర్య పరుస్తుంది. అనారోగ్య సమస్యలు భాధిస్తాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు తప్పవు.

*మిధునం*

చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. సంతాన వివాహ విషయంలో చర్చలు సఫలం అవుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ప్రముఖులతో పరిచయాలు విస్తృతం అవుతాయి. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. వ్యాపారాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు.

*కర్కాటకం*

నిరుద్యోగులకు అధికారుల అనుగ్రహం కలుగుతుంది. సోదరులతో స్థిరాస్తి వివాదాలు తొలుగుతాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. వృత్తి వ్యాపారాలలో నూతన ప్రోత్సహకాలు అందుతాయి.

*సింహం*

కొన్ని వ్యవహారాలు మందగిస్తాయి. ఆర్థిక పరిస్థితి ఒడిదుడుకులుగా ఉంటుంది. దూరప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో అకారణ వివాదాలు కలుగుతాయి. 

*కన్య*

దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. కీలక వ్యవహారాలలో రెండు రకాలయిన ఆలోచన వలన ఇబ్బందులు తప్పవు. బంధువులు, మిత్రులు మీ మాటతో విభేదిస్తారు. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. వ్యాపారాలలో నూతన పెట్టుబడులు సకాలంలో అందక ఇబ్బందులు ఎదుర్కొంటారు.

*తుల*

చేపట్టిన పనులు వేగవంతంగా పూర్తిచేస్తారు. చిన్ననాటి మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. సంఘంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యత నుండి ఉపశమనం పొందుతారు. వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి.

*వృశ్చికం*

కీలక వ్యవహారాలలో శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. అనుకున్న సమయానికి  అనుకున్న విధంగా పనులు పూర్తి చేస్తారు. బంధుమిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. కుటుంబ సభ్యులతో ఆలయ దర్శనాలు చేసుకుంటారు. వ్యాపారాలలో సమస్యలను అధిగమించి ముందుకు సాగుతారు.  వృత్తి ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి.

*ధనస్సు*

ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహ పరుస్తాయి. వృధా ప్రయాణాలు చెయ్యవలసి వస్తుంది. ఇంటాబయట బాధ్యతలు మరింత చికాకు పరుస్తాయి. స్వల్ప అనారోగ్య సూచనలు ఉన్నాయి. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగస్తులకు స్దాన చలన సూచనలు ఉన్నవి.

*మకరం*

ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది. సొంత నిర్ణయాలు తీసుకోవడం మానుకోవాలి. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి అధికమై విశ్రాంతి లభించదు. వ్యాపారాలు కొంత నిదానంగా సాగుతాయి.

*కుంభం*

అనుకున్న పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. ఇంటా బయట మీ మాటకి విలువ పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగవుతుంది. ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలలో ఆశించిన ఫలితాలు పొందుతారు.

*మీనం*

చేపట్టిన పనులలో వ్యయప్రయాసలు అధికమవుతాయి. ఆర్ధిక పరిస్థితి అనుకూలించక నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు. దూరప్రయాణాలు వలన శారీరక శ్రమ అధికమవుతుంది. వృధా ఖర్చుల విషయంలో పునరాలోచన చెయ్యాలి. ఉద్యోగమున సహోద్యోగుల ప్రవర్తన  కొంత చికాకు పరుస్తుంది.

🕉️

భక్తిసుధ

 🕉️🪔  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🪔🕉️

🪔 ॐ卐  *_-|¦¦|భక్తిసుధ|¦¦|-_* ॐ卐 🪔


*శ్లోకం*


*బ్రహ్మేంద్ర రుద్ర మరుదర్క కిరీటకోటి* 

*సంఘట్టి తాంఘ్రికమలామల కాంతికాంత*!

*లక్ష్మీలసత్ కుచనరోరుహ రాజహంస* 

*లక్ష్మీ నృసింహ మమదేహి కరావలమ్బమ్* ||


_ *_శ్రీ లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం - 02_* _


తా: 

బ్రహ్మ, దేవేంద్రుడు, శివుడు, వాయుదేవుడు, సూర్యుడు అను దేవతల కిరీటముల అంచులచే తాకబడిన పాదపద్మముల కాంతిచే ప్రకాశించు వాడా! లక్ష్మీ దేవి యొక్క అందమైన స్తనములనెడి తామర మొగ్గలకు రాజహంస యైన లక్ష్మీదేవి తో కూడిన నృసింహమూర్తీ! నాకు చేయూత నిమ్ము.

 *శ్రీమ‌తే రామానుజాయ‌ న‌మ:*


*శ్రీశ్రీశ్రీ త్రిదండి  శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయరు స్వామివారి మంగళాశాసనాలతో*


*ఆప‌దామ‌ప‌హ‌ర్తారం దాతారం స‌ర్వ‌ సంపదాం*

*లోకాభిరామం శ్రీరామం భూయో భూయో* *న‌మామ్య‍హం*


శనివారం, నవంబరు 25, 2023

శ్రీ శోభకృత్ నామ సంవత్సరం

దక్షిణాయనం - శరదృతువు

కార్తీక మాసం - శుక్ల పక్షం

తిథి:త్రయోదశి సా4.36 వరకు

వారం:శనివారం (స్థిరవాసరే)

నక్షత్రం:అశ్విని మ2.58 వరకు  

యోగం:వ్యతీపాతం ఉ7.04 వరకు

కరణం:తైతుల సా4.36 వరకు తదుపరి గరజి మ3.53 వరకు

వర్జ్యం:ఉ11.09 - 12.40 & రా12.15 - 1.48

దుర్ముహూర్తము:ఉ6.13 - 7.41

అమృతకాలం:ఉ8.06 - 9.37

రాహుకాలం:ఉ9.00 - 10.30

యమగండ/కేతుకాలం:మ1.30 - 3.00

సూర్యరాశి;  వృశ్చికం

చంద్రరాశి : మేషం 

సూర్యోదయం:6.13

సూర్యాస్తమయం:5.20


*శ్రీమ‌తే రామానుజాయ‌ న‌మ:*

*మఱ్ఱిపల్లి శ్రీధరాచార్యులు*

*మిట్టాపల్లి*

 డబ్బు కేవలం

అవసరాలు తీర్చుకోవటం

కోసం మాత్రమే..


వంద కోట్లున్నా..

ఆరోగ్యాన్ని కొనలేవు

వెయ్యి కోట్లున్నా..

ముసలితనాన్ని ఆపలేవు

లక్షకోట్లున్నా..

ప్రాణాన్ని నిలపలేవు


డబ్బు..

అవసరాలు తీర్చుకోవటానికి

ఇచ్చి పుచ్చుకోవడానికి

మనిషి ఏర్పాటు చేసుకున్న

ఒక సాధనం అంతే..


అది మార్పిడి సాధనమే కాని

మనిషి కంటే గొప్పది కాదు


మనిషికి విలువిస్తూ

డబ్బును వాడండి

డబ్బుకి విలువిస్తూ

మనిషిని వాడకండి

             .......నానా

 🪔ఆలోచనాలోచనాలు🔦( అక్షరరూపం దాల్చిన ఒక సిరాచుక్క, లక్షమెదళ్ళకు కదలిక)             ***** బాల్యంలో బిగ్గరగా ఏడ్చాం, కోరుకున్న వస్తువు చేతికందలేదని; పెద్దవారమయినాం. లోలోపల ఏడుస్తున్నాం, ఆశించిన వస్తువు చేతికందడం లేదని; మొత్తం మీద ఏడుపే జీవితంలో ప్రధానాంశం.-- ఇదీ మన జీవితం.                ***** బాంధవ్యాలు గాజు వస్తువుల్లాంటివి. పగిలిపోతే విడచిపెట్టడమే మేలు; ఏదో విధంగా అతుకు పెట్టేబదులు. ఒక వేళ ప్రయత్నించినా వికారంగానే కనబడతాయి.     ***** ప్రేమ అంటే ఏమిటి? నీ ఆనందానికి మరొకరి ఆనందాన్ని కలుపుకొని ,ఆపై ఇద్దరూ కలిసి ఆస్వాదించే మధుర పదార్థం.                                ***** జీవితంలో పెద్ద సవాలు , నిన్ను నీవు విశ్లేషించుకోవడం-- ఘనవిజయం అంటారా? కలిగివున్న వస్తువులతో సంతృప్తిని పొందడం---              ***** మేథావులు, విజేతలు పడక కుర్చీలు ( ఈజీ ఛైర్స్) లలో కూర్చొనో, డన్లప్ మెత్తని పరుపులపై దొర్లుతూ విజయాలను సాధించలేదు. వారు శ్రమించడంలోనే విశ్రాంతిని పొందుతారు. వారు కలలలోనే నిద్రించి, స్థిరనిర్ణయపు, అంకిత భావపు ఉషోదయాలలోనే మేల్కొంటారు.                      ***** స్త్రీ నిజాయితీని ఆమె పురుషుని దారిద్ర్యంలో పరిశీలించాలి; పురుషుని నిజాయితీని ఆతడి సౌభాగ్యంలో గమనించాలి!                        ***** ఎవరినో సంతృప్తిపరచడానికి బ్రతకడం ఎట్లాంటిది అంటే అద్దె ఇంటికి, రంగులద్ది అలంకరణలు గావించి తృప్తి చెందడంలాంటిది. ఎంతబాగా తీర్చిదిద్దినా, అది నీ స్వంతం అయితే కాదు. ఏదో ఒక రోజు దాని యజమానికి నీవు అప్పగించి నీవు నీదారి నీవ్వు చూసుకోవాలి. అది పరాయి ఇల్లే! నీ సంతృప్తి కొరకు నీవు జీవించు. అది నీ స్వంత ఇంటిని నీవు అలంకరించుకొన్నట్లు!           ***** జీవితసాఫల్యానికి కనీస అవసరాలు.                మొట్టమొదటిది పరిపూర్ణ ఆరోగ్యం.                              ఆ తరువాతది సంపదల సందోహం.                             శీలమా! అది శిరస్సుపై స్వర్ణ కిరీటం.                          గౌరవమా? అది నీ ఉనికిపై కప్పబడిన విలువైన చీనాంబరం.                            మలుపులా? నీ బ్రతుకు గెలుపులకు ఎలుగెత్తిన పిలుపులు.                          ఇక భగవానుని ఆశీస్సులా? అవి నీ భవిష్యత్తు అనే స్వర్ణపేటికలోని మణులరాశులు.                     ప్రేమ, ఉప్పొంగిన మకరందపు మాధుర్యం.       అన్వేషణాపధంలో కరదీపిక నీవు ఆదర్శంగా నిలుపుకొన్న సత్యం.            మరణం జీవితనాటకరంగంలో "చరమాంకం."                        తరువాత ఏముంటుంది? తెర క్రిందకు; శుభం కార్డు పైకి.                                         - - - - - - - - - - - - - - - - - - - - - - - -                                   Sharpen your mind!            1* Before Mount Everest was discovered, what was the tallest mountain?     2* When you need it you throw it away, when you don't need it  you take it in. What is it?                                      3* What kind of table has no legs?                     4* What is the first thing you do every morning?                           5* As long as I eat, I live. When I drink, I die. Who am I?                  {For proper answers you have to wait 24 hours only.}.                     Dt. 23-- 11 --2023, Thursday, Good morning.

పంచాంగం 25.11.2023 Saturday,

 ఈ రోజు పంచాంగం 25.11.2023  Saturday,

 

స్వస్తి  శ్రీ చాన్ద్రమాన శోభకృన్నామ సంవత్సర: దక్షిణాయనం శరదృతు  కార్తీక మాస శుక్ల పక్ష: త్రయోదశి తిధి స్థిర వాసర: అశ్విని నక్షత్రం వరీయాన్ యోగ: తైతుల తదుపరి గరజి కరణం ఇది ఈరోజు పంచాంగం.


త్రయోదశి సాయంత్రం 05:24 వరకు.

అశ్విని మధ్యాహ్నం 02:57 వరకు.

సూర్యోదయం : 06:30

సూర్యాస్తమయం : 05:35

వర్జ్యం : పగలు 11:07 నుండి మధ్యాహ్నం 12:39 వరకు తిరిగి రాత్రి 12:13 నుండి 01:45 వరకు.

దుర్ముహూర్తం : ఉదయం 06:30 నుండి 07:59 వరకు.


రాహుకాలం : పగలు 09:00  నుండి 10:30 వరకు.


యమగండం : మధ్యాహ్నం  01:30 నుండి 03:00 వరకు


శుభోదయ:, నమస్కార:

 Telugu Translation


సాధారణంగా కైలాస శిఖరాన్ని ప్రదక్షిణ చేయడమనేది చాలా గొప్ప విషయం...

సుమారు 6000 అడుగుల ఎత్తులో, ఆ చలి గాలులలో, కైలాస శిఖరం చుట్టూ ఉన్న 

53km ప్రదక్షిణ చేసి వచ్చేందుకు, 3 రోజులు పడుతుంది...

కానీ, టిబెట్టు దేశస్థులు చేసే ప్రదక్షిణ ని, మనం కలలో కూడా ఊహించలేము..

ఆడ,మగ తేడా లేకుండా, అడుగుకి ఒక సాష్టాంగ నమస్కారం చేస్తూ, ఆ 53km ను తిరిగి వస్తారు ట. సుమారు, 2, 3 వారాలు జరుగుతుంది వారి ఆ ప్రయాణం...ఇలా చేస్తే, పునర్జన్మ ఉండదని వారి నమ్మకం ట.

ఇలా చేసేందుకు కావలసిన మనోధైర్యం, ఆరోగ్యం, ప్రాణబలం, వైరాగ్యం ఉండాలి.

నాకు దొరికిన అటువంటి ఈ చిన్న video  ను మీ ముందర ఉంచుతున్నాను...

🕉️  ఓం నమః శివాయ🕉️

Pradushan


 

⚜ శ్రీ జాంబవంతుడి గుహ

 🕉 మన గుడి : నెం 249


⚜ గుజరాత్ : పొరుబందర్






⚜ శ్రీ జాంబవంతుడి గుహ 


💠 పోర్‌బందర్ జిల్లాలోని రణవావ్‌లో ఉన్న అత్యంత పవిత్రమైన జాంబవంత్ గుహ లేదా జంబువంత్ కి గుఫా గుజరాత్‌లోని అత్యంత చారిత్రక ప్రదేశాలలో ఒకటి.


💠 జాంబవంతుడు - పరశురాముడు మరియు హనుమంతునితో కలిసి, రామచంద్రుడి త్రేతా-యుగంలో మరియు శ్రీకృష్ణుడు ద్వాపర-యుగంలో కనిపించిన అతికొద్దిమందిలో ఒకరు. 


💠 శ్రీ కృష్ణుడు శమంతకమనిని వెతుకుంటు వచ్చి జాంబవంతుడుతో యుద్ధం చేసి ఓడించి, అతడి కూతుర్ని (జాంబవతీ)వివాహం చేసుకున్న ప్రదేశం ఇదే అని భక్తుల నమ్మకం


💠 జాంబవంతుడు సముద్ర మంథన (పాల సముద్ర మథనం) సమయంలో విష్ణువు యొక్క దివ్య కూర్మావతారాన్ని చూసే అరుదైన అవకాశాన్ని కలిగి ఉన్న చిరంజీవి. 

వామన అవతారంలో విష్ణుమూర్తికి ప్రదక్షిణలు చేసినాడు.

 హనుమంతునికి తన అపారమైన సామర్థ్యాల సత్యాన్ని తెలియజేసి, తల్లి సీతను వెతుకుతూ లంకకు వెళ్ళడానికి  అతనిలో విశ్వాసాన్ని నింపిన వ్యక్తి జాంబవంతుడు.

అలాగే తాజా లక్ష్మణుడు ఇంద్రజిత్ చేత అపస్మారక స్థితికి చేరుకున్నప్పుడు హనుమంతుడికి విశల్యకర్ణి గురించి మరియూ వనస్పతి శాస్త్రం (అరుదైన ఔషధ మూలికల జ్ఞానం) గురించి జాంబవంతుడే చెప్పాడు.


💠 తెలివైన జాంబవంతుడు సుగ్రీవుని మంత్రులలో ఒకడు మరియు శ్రీరాముని పట్ల అతని భక్తి అసమానమైనది. 

శ్రీరాముడు అతనికి దీర్ఘాయువు, అపారమైన బలం మరియు ద్వాపుర యుగంలో శ్రీకృష్ణుని దర్శనం పొందే అవకాశాన్ని అనుగ్రహించాడు.


💠 సత్రాజిత్తు కు ఆధ్యాత్మిక శక్తులు కలిగిన శమంతకమణి   అనే విలువైన రత్నాన్ని కలిగి ఉన్నాడని పురాణాలు చెబుతున్నాయి. ఒకసారి అతని సోదరుడు ప్రసేనుడు ఆ రత్నాన్ని ధరించి వేట కోసం అడవులకు బయలుదేరాడు .


💠 ఎర్రని ఆ మణిని చూసి మాంసపు ముక్క అనుకున్న సింహం అతనిపై  దాడి చేసింది. సింహం  జాంబవంతుడి చేత చంపబడుతుంది. 


💠 మరోవైపు, సత్రాజిత్తు రత్నాన్ని పొందడం కోసమే శ్రీకృష్ణుడు తన సోదరుడిని చంపాడని నిందించాడు. 

ఇది విన్న శ్రీకృష్ణుడు అసలు హంతకుడి కోసం వెతుకుతూ వెళ్లి చివరకు 28 రోజుల పాటు యుద్ధం చేసిన జాంబవంతుడుని కనుగొంటాడు.


💠 ఆ సమయంలో జాంబవంతుడు అత్యంత బలమైన జీవి, కాబట్టి అతను కృష్ణుడిని ఓడించాలని అనుకున్నాడు.  

28 రోజుల తర్వాత జాంబవంతుడుకు శరీరమంతా చెమటలు పట్టాయి మరియు విపరీతంగా అలసిపోయాడు.  

తాను పోరాడుతున్న వ్యక్తి సర్వశక్తికి మరియు అన్ని రకాల ఐశ్వర్యానికి మూలమైన పరమేశ్వరుడే అని అతను గ్రహించాడు.   కృష్ణుడు మరెవరో కాదు, తన ప్రియమైన శ్రీరాముడు అని తెలుసుకున్నప్పుడు, అతను క్షమించమని కోరాడు మరియు తన కుమార్తె జాంబవతిని శ్రీ కృష్ణుడికి ఇచ్చి వివాహం చేస్తాడు.

అప్పుడు శ్రీకృష్ణుడు తన ప్రియ భక్తుని పట్ల తన కారణం లేని దయతో తన రామచంద్రుని రూపాన్ని చూపించాడు.


💠 జాంబవంతుడు గుహలో సహజంగా ఏర్పడిన 50 శివలింగాలు ఉన్నాయి. 

ప్రధాన శివలింగం సహజమైన గుహలోపల ఉంది. 

గుహ పైకప్పు నుండి నీటి బిందువులు నిరంతరం లింగంపైకి జాలువారుతాయి, ఇది ఒక ఆసక్తికరమైన దృశ్యం. 


💠 గుహ లోపల జాంబవంతుడు శమంతకమణి రత్నాన్ని ఇచ్చి, తన కుమార్తె జాంబవతిని శ్రీకృష్ణునికి ఇచ్చి వివాహం చేసిన ఖచ్చితమైన ప్రదేశం ఉంది. 

అలాగే, గుహ లోపల రెండు సొరంగాలు ఉన్నాయి, ఇక్కడ ఒకటి ద్వారకకు మరియు మరొకటి జునాగఢ్‌కు దారి తీస్తుంది. 


💠 గుహ వెలుపల శ్రీరాముని ఆలయాన్ని మరియు గురు రాందాస్ జీ సమాధిని కూడా చూడవచ్చు. 

ప్రతి సంవత్సరం ఈ ప్రదేశంలో పెద్ద జాతర జరుగుతుంది.


💠 రైలు మార్గం: పోర్బందర్ రైల్వే స్టేషన్ నుండి  17 కి.మీ.