25, నవంబర్ 2023, శనివారం

శ్రీ దేవీ భాగవతం

 శ్రీ దేవీ భాగవతం


.శ్రీగణేశాయనమః.శ్రీసరస్వత్యైనమః శ్రీగురుదత్తాత్రేయపరబ్రహ్మణేనమః

శ్లో)వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయవిష్ణవే|

నమోవైబ్రహ్మనిధయే వాసిష్ఠాయనమోనమః||

శ్లో)నారాయణంనమస్కృత్య నరంచైవ నరోత్తమం|

దేవీంసరస్వతీం వ్యాసం తతోజయముదీరయేత్||


శ్లో)సృష్టౌ యా సర్గరూపా జగదవనవిధౌ పాలినీ యా చ రౌద్రీ

సంహారే చాపి యస్యా జగదిదమఖిలం క్రీడనం యా పరాఖ్యా |

పశ్యంతీ మధ్యమాథో తదను భగవతీ వైఖరీవర్ణరూపా

సాస్మద్వాచం ప్రసన్నా విధి హరి గిరిశారాధితాలంకరోతు||


శ్లో)కాత్యాయనిమహామాయే భవాని భువనేశ్వరి |

సంసారసాగరోమగ్నం మాముద్ధరకృపామయే||

బ్రహ్మ విష్ణు శివారాధ్యే ప్రసీదజగదంబికే|

మనోఽభిలషితందేవివరందేహినమోఽస్తుతే||


ఆ తరువాత అరుణుడు - వంశోద్ధారకుడు లేకపోయాడే అని విచారించి, రాజ్యం వదిలిపెట్టేసి

తపస్పులకు వెళ్ళిపోయాడు. ఆ కాలాన పన్నెండు సంవత్సరాలపాటు ఆ దేశంలో వానలు కురవలేదు.

సత్యవ్రతుడు చేసిన అధర్మానికి ఇంద్రుడు విధించిన శిక్ష ఇది.

అదే సమయంలో విశ్వామిత్రుడు (కౌశికుడు) తన భార్యాపుత్రులను ఆశ్రమంలో విడిచిపెట్టి

కౌశికీతీరానికి తపస్సుకోసం వెళ్ళాడు. పన్నెండేళ్ళ కరువు రావడంతో కౌశికుడిభార్య బిడ్డలను పోషించలేక

చాలా అగచాట్లు పడింది. పిల్లలు ఆకలో అని ఏడుస్తుంటే ఓదార్చలేక సతమతమయ్యింది. తల్లి పేగు

తల్లడిల్లింది. పెద్ద పిల్లలు నీవారధాన్యం ముష్టత్తుతూంటే విలవిలలాడింది. రాజధానిలో రాజులేడు.

మగడేమో తపస్సుకి వెళ్ళాడు. తనకా పోషించే శక్తి లేదు. ఎవరిని యాచించాలి, ఏమి చెయ్యాలి ? పిల్లలుచూస్తే మాడిపోతున్నారు. ఛీ ! ఎందుకువచ్చిన జీవితం ఇది. కౌశికుడు ఇంటిలో ఉంటే ఈ పరిస్థితి వచ్చేది

కాదుగదా ! ఎక్కడో ముక్కుమూసుకుని హాయిగా నిశ్చలంగా తపస్సు చేసుకుంటున్న విశ్వామిత్రుడికి చా

నిర్ధనత, నా అశక్తత ఎలా తెలుస్తాయి సమర్థుడే. కానీ పరిస్థితి ఇది అని తెలిసేదెలా ?

ఇలా ఆలోచిస్తూ కూచుంటే ప్రయోజనంలేదు. ఏదో ఒకటి చెయ్యాలి. పిల్లల్ని అందరినీ

ఆకలితో మార్చి చంపుకునేకంటే ఒకడిని అమ్మేసి మిగతావారినైనా బతికించుకోవడం తెలివైనపని. నాకిక

మిగిలింది ఇదొక్కటే దారి. ప్రాణాలు నిలుపుకోడానికి, కాలం గడపడానికి మరో మార్గంలేదు ఇలా

ఆలోచించి విశ్వామిత్రుడి భార్య గుండెను రాయిచేసుకుని, దర్భలు తాడుగా పేని నడిమి కొడుకు

మెడకు పలుపుతాడులా కట్టి, వాడిని తీసుకుని తమ ఆశ్రమ పర్ణశాలనుంచి బయటకు వచ్చింది.

అడవిదారివెంట రాజధానికి నడక సాగించింది.

శ్వపచులతో కలిసి అడవుల్లో జీవిస్తున్న సత్యవ్రతుడు (అరుణుడి కొడుకు) ఎదురయ్యాడు.

ఏమిటమ్మా ఇది? ఎందుకు ఏడుస్తున్నావ్ ? ఈ పిల్లవాడినేమిటి పశువులా తాడుకట్టి లాక్కువెడుతున్నావ్?

ఎవరి బిడ్డడు ? ఎక్కి ఎక్కి ఏడుస్తున్నాడు? నిజం చెప్పు. నేను చెయ్యగలిగిన సహాయం ఏమన్నా ఉంటే చేస్తాము.

అయ్యా ! నువ్వు ఎవరో నాకు తెలియదు. అయినా అడుగుతున్నావు కాబట్టి చెబుతున్నాను

కామెంట్‌లు లేవు: