🕉 మన గుడి : నెం 249
⚜ గుజరాత్ : పొరుబందర్
⚜ శ్రీ జాంబవంతుడి గుహ
💠 పోర్‌బందర్ జిల్లాలోని రణవావ్‌లో ఉన్న అత్యంత పవిత్రమైన జాంబవంత్ గుహ లేదా జంబువంత్ కి గుఫా గుజరాత్‌లోని అత్యంత చారిత్రక ప్రదేశాలలో ఒకటి.
💠 జాంబవంతుడు - పరశురాముడు మరియు హనుమంతునితో కలిసి, రామచంద్రుడి త్రేతా-యుగంలో మరియు శ్రీకృష్ణుడు ద్వాపర-యుగంలో కనిపించిన అతికొద్దిమందిలో ఒకరు.
💠 శ్రీ కృష్ణుడు శమంతకమనిని వెతుకుంటు వచ్చి జాంబవంతుడుతో యుద్ధం చేసి ఓడించి, అతడి కూతుర్ని (జాంబవతీ)వివాహం చేసుకున్న ప్రదేశం ఇదే అని భక్తుల నమ్మకం
💠 జాంబవంతుడు సముద్ర మంథన (పాల సముద్ర మథనం) సమయంలో విష్ణువు యొక్క దివ్య కూర్మావతారాన్ని చూసే అరుదైన అవకాశాన్ని కలిగి ఉన్న చిరంజీవి.
వామన అవతారంలో విష్ణుమూర్తికి ప్రదక్షిణలు చేసినాడు.
హనుమంతునికి తన అపారమైన సామర్థ్యాల సత్యాన్ని తెలియజేసి, తల్లి సీతను వెతుకుతూ లంకకు వెళ్ళడానికి అతనిలో విశ్వాసాన్ని నింపిన వ్యక్తి జాంబవంతుడు.
అలాగే తాజా లక్ష్మణుడు ఇంద్రజిత్ చేత అపస్మారక స్థితికి చేరుకున్నప్పుడు హనుమంతుడికి విశల్యకర్ణి గురించి మరియూ వనస్పతి శాస్త్రం (అరుదైన ఔషధ మూలికల జ్ఞానం) గురించి జాంబవంతుడే చెప్పాడు.
💠 తెలివైన జాంబవంతుడు సుగ్రీవుని మంత్రులలో ఒకడు మరియు శ్రీరాముని పట్ల అతని భక్తి అసమానమైనది.
శ్రీరాముడు అతనికి దీర్ఘాయువు, అపారమైన బలం మరియు ద్వాపుర యుగంలో శ్రీకృష్ణుని దర్శనం పొందే అవకాశాన్ని అనుగ్రహించాడు.
💠 సత్రాజిత్తు కు ఆధ్యాత్మిక శక్తులు కలిగిన శమంతకమణి అనే విలువైన రత్నాన్ని కలిగి ఉన్నాడని పురాణాలు చెబుతున్నాయి. ఒకసారి అతని సోదరుడు ప్రసేనుడు ఆ రత్నాన్ని ధరించి వేట కోసం అడవులకు బయలుదేరాడు .
💠 ఎర్రని ఆ మణిని చూసి మాంసపు ముక్క అనుకున్న సింహం అతనిపై దాడి చేసింది. సింహం జాంబవంతుడి చేత చంపబడుతుంది.
💠 మరోవైపు, సత్రాజిత్తు రత్నాన్ని పొందడం కోసమే శ్రీకృష్ణుడు తన సోదరుడిని చంపాడని నిందించాడు.
ఇది విన్న శ్రీకృష్ణుడు అసలు హంతకుడి కోసం వెతుకుతూ వెళ్లి చివరకు 28 రోజుల పాటు యుద్ధం చేసిన జాంబవంతుడుని కనుగొంటాడు.
💠 ఆ సమయంలో జాంబవంతుడు అత్యంత బలమైన జీవి, కాబట్టి అతను కృష్ణుడిని ఓడించాలని అనుకున్నాడు.
28 రోజుల తర్వాత జాంబవంతుడుకు శరీరమంతా చెమటలు పట్టాయి మరియు విపరీతంగా అలసిపోయాడు.
తాను పోరాడుతున్న వ్యక్తి సర్వశక్తికి మరియు అన్ని రకాల ఐశ్వర్యానికి మూలమైన పరమేశ్వరుడే అని అతను గ్రహించాడు. కృష్ణుడు మరెవరో కాదు, తన ప్రియమైన శ్రీరాముడు అని తెలుసుకున్నప్పుడు, అతను క్షమించమని కోరాడు మరియు తన కుమార్తె జాంబవతిని శ్రీ కృష్ణుడికి ఇచ్చి వివాహం చేస్తాడు.
అప్పుడు శ్రీకృష్ణుడు తన ప్రియ భక్తుని పట్ల తన కారణం లేని దయతో తన రామచంద్రుని రూపాన్ని చూపించాడు.
💠 జాంబవంతుడు గుహలో సహజంగా ఏర్పడిన 50 శివలింగాలు ఉన్నాయి.
ప్రధాన శివలింగం సహజమైన గుహలోపల ఉంది.
గుహ పైకప్పు నుండి నీటి బిందువులు నిరంతరం లింగంపైకి జాలువారుతాయి, ఇది ఒక ఆసక్తికరమైన దృశ్యం.
💠 గుహ లోపల జాంబవంతుడు శమంతకమణి రత్నాన్ని ఇచ్చి, తన కుమార్తె జాంబవతిని శ్రీకృష్ణునికి ఇచ్చి వివాహం చేసిన ఖచ్చితమైన ప్రదేశం ఉంది.
అలాగే, గుహ లోపల రెండు సొరంగాలు ఉన్నాయి, ఇక్కడ ఒకటి ద్వారకకు మరియు మరొకటి జునాగఢ్‌కు దారి తీస్తుంది.
💠 గుహ వెలుపల శ్రీరాముని ఆలయాన్ని మరియు గురు రాందాస్ జీ సమాధిని కూడా చూడవచ్చు.
ప్రతి సంవత్సరం ఈ ప్రదేశంలో పెద్ద జాతర జరుగుతుంది.
💠 రైలు మార్గం: పోర్బందర్ రైల్వే స్టేషన్ నుండి 17 కి.మీ.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి