25, నవంబర్ 2023, శనివారం

 🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

.    *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*

.   *ఓం నమో భగవతే రామకృష్ణాయ*


.       *🚩శ్రీ వివేకానందస్వామి🚩*

.                *🚩జీవిత గాథ🚩*   

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

.                      *భాగం 97*


ఆ రోజుల గురించి కాలాంతరంలో స్వామి వివేకానంద ఇలా చెప్పారు:


"శ్రీరామకృష్ణుల నిర్యాణానంతరం మేం వరాహ నగర మఠంలో ఎన్నో పారమార్థిక సాధనలు చేశాము. వేకువజామున మూడు గంటలకే లేచే వాళ్లం. దంతధావనం మొదలైన కాలకృత్యాలు తీర్చుకొని స్నానం చేసి కొందరు, చేయ కుండా కొందరు - ప్రార్థనా మందిరంలో చేరి జపధ్యానాలలో మునిగిపోయే వాళ్లం. ఆహా! ఆ రోజుల్లో ఎటువంటి వైరాగ్యం ఉన్నదో! ప్రపంచం ఉందా లేదా అనే ధ్యాసే మాకు ఉండేది కాదు. 


ఇంట్లో గృహిణి ఏ ప్రకారంగా ఉంటుందో ఆ ప్రకారంగా శశి (స్వామి రామకృష్ణానంద) రాత్రింబవళ్లు శ్రీరామకృష్ణుల సేవ, అర్చన మొదలైన కార్యాలలో నిమగ్నుడై ఉండేవాడు. శ్రీరామకృష్ణుల పూజకు, మా భోజనానికి కావలసిన వాటి నన్నిటిని అతడే చాలావరకు బిచ్చమెత్తి తెచ్చే వాడు..... ఉదయం నుండి సాయంత్రం నాలుగు, ఐదు గంటల దాకా జప ధ్యానాలు సాగిన రోజులున్నాయి..... ఆహా! ఏం అద్భుతమైన రోజులవి.


 మే మా రోజుల్లో గడిపిన జీవిత విధానాన్ని చూసి భూతాలే భయపడేవి అంటే, ఇక మనుష్యుల మాట చెప్పాలా! .


"డబ్బు లేని కారణంగా కొన్నిసార్లు మఠాన్ని మూసివేద్దామనుకొన్నాను. కాని శశిని అందుకు ఒప్పించలేకపోయాను. అతడే ఈ మఠానికి మూలస్తంభం. మఠంలో అన్నం మెతుకులైనా లేని రోజులు ఉన్నాయి. భిక్షాటన వలన అన్నం లభిస్తే, ఉప్పు ఉండేది కాదు. కొన్ని రోజులు కేవలం అన్నం, ఉప్పు మాత్రమే ఉండేవి. కాని ఎవ్వరూ ఏమాత్రం లక్ష్యపెట్టలేదు...... 


ఒక్కోసారి నెల పొడవునా అన్నం, ఉప్పు, ఉడికించిన దొండాకుకూర మాత్రమే మా భోజనం శశి భోజనం సిద్ధం చేసి మా కోసం వేచి ఉండి, చివరికి జపధ్యానాల నుండి బల వంతాన మమ్మల్ని ఇవతలకు లాగేవాడు. అతడి ప్రేమ ఎంత అద్భుతమయింది. "


దుస్తుల విషయంలోనూ అంతే. అందరికీ ఉమ్మడిగా ఒక పంచె, ఒక తువ్వాలు మాత్రమే ఉన్నాయి. బయటికి వెళ్లేవారు వాటిని ధరించాలి. ఇకపోతే ఒక కౌపీనం, ఒక తువ్వాలు మాత్రమే అందరి దుస్తులు🙏


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

👉 *రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

కామెంట్‌లు లేవు: