2, అక్టోబర్ 2024, బుధవారం

*03, అక్టోబర్, 2024*🌹 *దృగ్గణిత పంచాంగం*

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*

       🌷 *గురువారం*🌷

🌹 *03, అక్టోబర్, 2024*🌹

      *దృగ్గణిత పంచాంగం*                 


          *ఈనాటి పర్వం*    

    *దేవీ శరన్నవరాత్రులు*  

            *ప్రారంభం*


*స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం* 

*దక్షిణాయణం - శరత్ఋతౌః*

*ఆశ్వీయుజ మాసం - శుక్లపక్షం*


*తిథి : పాడ్యమి* రా 02.58 వరకు ఉపరి *విదియ* 

*వారం : గురువారం* ( బృహస్పతివాసరే)

*నక్షత్రం : హస్త* మ 03.22 వరకు ఉపరి *చిత్త*


*యోగం  : ఐంద్ర* రా 04.24 తె వరకు ఉపరి *వైధృతి*

*కరణం : కింస్తుఘ్న* మ 01.38 *బవ* రా 02.58 ఉపరి *బాలువ*


*సాధారణ శుభ సమయాలు* 

*ఉ 06.00-09.30 & 11.00-12.00 సా 04.00 - 06.00*

అమృత కాలం  :*ఉ 08.45 - 10.33*

అభిజిత్ కాలం  : *ప 11.32 - 12.20*


*వర్జ్యం : రా 12.34 - 02.22*

*దుర్ముహూర్తం : ఉ 09.57 - 10.44 మ 02.43 - 03.31*

*రాహు కాలం: మ 01.26 - 02.55*

గుళికకాళం : *ఉ 08.57 - 10.27*

యమగండం : *ఉ 05.58 - 07.27*

సూర్యరాశి : *కన్య* 

చంద్రరాశి : *కన్య*

సూర్యోదయం :*ఉ 05.58* 

సూర్యాస్తమయం :*సా 05.55*

*ప్రయాణశూల : దక్షిణం దిక్కుకు పనికిరాదు*


*వైదిక విషయాలు*

ప్రాతః కాలం    :  *ఉ 05.58 - 08.21*

సంగవ కాలం   :*08.21 - 10.44*

మధ్యాహ్న కాలం :*10.44 - 01.08*

అపరాహ్న కాలం:*మ 01.08 - 03.31*

*ఆబ్ధికం తిధి : ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి*

సాయంకాలం :  *సా 03.31 - 05.55*

ప్రదోష కాలం    :  *సా 05.55 - 08.19*

రాత్రి కాలం : *రా 08.19 - 11.32*

నిశీధి కాలం     :*రా 11.32 - 12.20*

బ్రాహ్మీ ముహూర్తం :   *తె 04.21 - 05.10*

________________________________

           🌷 *ప్రతినిత్యం*🌷

         *_గోమాతను 🐄 పూజించండి_* 

          *_గోమాతను 🐄 సంరక్షించండి_*


⚜️🚩 *ఓం శ్రీ దత్తాయ నమః*🌹🙏


*స్థావరం జంగమం వ్యాప్తం యత్కించిత్సచరాచరమ్* |

*తత్పదం దర్శితం యేన తస్మై శ్రీగురవే నమః* 


    *ఓం శ్రీ దత్తాత్రేయాయ నమః* 


🌷🪷🌹🛕🌹🌷🪷🌷🪷

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><><><>


         🌷 *సేకరణ*🌷

      🌹🌿🌹🌹🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🌷🌷🍃🌷

🌹🌷🌷🌹🌹🌷🌷🌹

బెజవాడ ఆలయంలో రాజద్వారం పై ఉండే పద్యం గురించి

 జై శ్రీ రామ్ శ్రీ మాత్ర నమః బెజవాడ ఆలయంలో రాజద్వారం పై ఉండే

పద్యం గురించి మీకు తెలుసా


అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాల బెద్దమ్మ, సురారులమ్మ కడుపారడి బుచ్చినయమ్మ* *దన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి యమ్మ దుర్గ, మాయమ్మ, కృపాబ్ధి యిచ్చుత మహత్త్వ కవిత్వ పటుత్వ సంపదల్


విజయవాడ కనకదుర్గమ్మ తల్లి కోవెలలో ఇప్పటికీ రాజద్వారం మీద ఈ పద్యం రాసి ఉంటుంది. ఈ పద్యం పైకి ఒకలా కనపడుతుంది. మీరు తెలిసికాని, తెలియకకాని పోతనగారు వ్రాసిన పద్యములు *కొన్ని నోటికి వచ్చినవి మీరు చదివినట్లయితే అవి సత్ఫలితాలనే ఇచ్చేస్తాయి


ఎందుకు అంటే మీరు కొన్ని కొన్ని చదవకూడదు. కొన్ని కొన్ని చేయకూడదు. పక్కన గురువు వుంటే తప్ప మేరువుని, శ్రీచక్రమును ఇంట్లోపెట్టి పూజ చెయ్యలేరు. అది మనవల్ల కాదు. మీరు బీజాక్షరములను ఉపాసన చెయ్యలేరు. అది కష్టం. 


కానీ పోతనగారు ఈ దేశమునకు బహూకరించిన గొప్ప కానుక ఆయన రచించిన భాగవత పద్యములు.


అమ్మలనుకన్న దేవతా స్త్రీలయిన వారి మనస్సులయందు ఏ అమ్మవారు ఉన్నదో అటువంటి అమ్మని మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ – ఈ నాలుగింటికోసము నమస్కరిస్తున్నాను. 


అటువంటి దుర్గమ్మ మాయమ్మ. ’ఇవీ ఆయన ఈ పద్యంలో చెప్పిన విషయములు, మీరు చెయ్యలేని ఒక చాలా కష్టమయిన పనిని పోతనగారు చాలా తేలికగా మీకు ప్రమాదం లేని రీతిలో మీతో చేయించేయడాని కని ఇటువంటి ప్రయోగం చేశారు


అమ్మలగన్నయమ్మ’ – అమ్మలని చెప్పబడ్డవారు ఎవరు? మనకి లలితాసహస్రం ’శ్రీమాతా’ అనే నామంతో ప్రారంభమవుతుంది. ’శ్రీమాతా’ అంటే ’శ’కార ’ర’కార ’ఈ’కారముల చేత సత్వరజస్తమోగుణాధీశులయిన బ్రహ్మశక్తి, విష్ణుశక్తి రుద్రశక్తులయిన రుద్రాణి, లక్ష్మీదేవి, సరస్వతీదేవి – ఈ ముగ్గురికీ అమ్మ – ఈ మూడు శక్తులను త్రిమూర్తులకు ఇచ్చినటువంటి పెద్దమ్మ అమ్మ ఎవరు వున్నదో ఆయమ్మ – అంటే ’లలితాపరాభట్టారికా స్వరూపం’ – ఆ అమ్మవారికీ దుర్గాస్వరూపమునకు భేదం లేదు – అందుకని ’అమ్మలగన్నయమ్మ’ ’ముగ్గురమ్మల మూలపుటమ్మ’ – ఆ ముగ్గురు అమ్మలే మనం మహాకాళి, మహాలక్ష్మి, మహా సరస్వతి స్వరూపములుగా కొలిచే తల్లులు. ఈ ముగురమ్మల మూలపుటమ్మ. ’చాల పెద్దమ్మ’ – ఇది చాలా గమ్మత్తయిన మాట. చాల పెద్దమ్మ అనే మాటను సంస్కృతంలోకి తీసుకువెడితే మహాశక్తి – అండపిండ బ్రహ్మాండములనంతటా నిండిపోయిన బ్రహ్మాండమయిన శక్తిస్వరూపం. ఈ శక్తి స్వరూపిణి చిన్నపెద్దా భేదంలేకుండా సమస్త జీవరాశులలోను ఇమిడి ఉంది. అలా ఉండడం అనేదే మాతృత్వం.ఇది దయ. దీనిని సౌందర్యం అంటారు. దయకు సౌందర్యం అని పేరు. అది ప్రవహిస్తే సౌందర్యలహరి.


అండపిండ బ్రహ్మాండములనన్నిటినీ నిండిపోయి ఈ భూమిని తిప్పుతూ, లోకములనన్నిటినీ తిప్పుతూ ఇవన్నీ తిరగడానికి కారణమయిన అమ్మవారు ఎవరో ఆ అమ్మ.


సురారులమ్మ కడుపారడి పుచ్చినయమ్మ’ – సురారి అనగా దేవతలకు శత్రువయిన వాళ్ళ అమ్మ. అనగా దితి. దితి అయ్యో అని ఏడిచేటట్టుగా ఆవిడకు కడుపుశోకమును మిగిల్చింది. అనగా రాక్షసులు నశించడానికి కారణమయిన అమ్మ. దేవతలలో శక్తిగా ఈమె ఉండబట్టే రాక్షసులు మరణించారు.


తన్నులోనమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడియమ్మ’ – ఇదొక గొప్పమాట. అమ్మవారిని మనస్సులో నమ్ముకుని శక్తితో తిరుగుతున్న వారెవరు?


బ్రాహ్మి – మాహేశ్వరి – వైష్ణవి – మహేంద్రి


చాముండ – కౌమారి – వారాహి – మహాలక్ష్మి


మనకి సంప్రదాయంలో ’అష్టమాతృకలు’ అని ఉన్నారు. వాళ్ళని మనం ఎనిమిది పేర్లతో పిలుస్తూ ఉంటాము. బ్రాహ్మి, మహేశ్వరి, వైష్ణవి, మహేంద్రి, చాముండ, కౌమారి, వారాహి, మహాలక్ష్మి.


ఇలా ఎనమండుగురు దేవతలు ఉన్నారు. వీరిని ’అష్టమాతృకలు’ అని పిలుస్తారు. ఈ అష్టమాతృకలు శ్రీచక్రంలో దేవతలుగా ఉంటారు. వీరు నిరంతరము అమ్మవారిని లోపల కొలుస్తూ, అమ్మవారి వలన శక్తిని పొంది మనని ఉద్ధరిస్తూ ఉంటారు. ఈ ఎనమండుగురునే మనం కొలుస్తూ వుంటాము.


రక్తాంబరాం రక్తవర్ణాం రక్త సౌభాగ్యసుందరాం వైష్ణవీం శక్తిమద్భుతాం’


అంటారు దేవీభాగవతంలో వ్యాసభగవానుడు. ఈ ఎనమండుగురికీ శక్తినిచ్చిన అమ్మవారెవరో ఆవిడే వేల్పుటమ్మల మనమ్ముల నుండెడియమ్మ – దుర్గమాయమ్మ – ఈ దుర్గమ్మ ఉన్నదే లలితాపరాభట్టారిక – ఆవిడ లలితా పరాభట్టారిక – ఆ అమ్మ మాయమ్మ.


మహత్త్వ కవిత్వ పటుత్వ సంపదల్’ – ఇప్పుడు ఆవిడ నాకు దయతో మహత్త్వ కవిత్వ పటుత్వ సంపదలను ఇవ్వాలి. నాకు అర్హత ఉన్నదని ఇవ్వనక్కరలేదు. దయతో ఇచ్చేయ్యాలి.


అమ్మవారికి ’శాక్తేయప్రణవములు’ అని కొన్ని బీజాక్షరములు ఉన్నాయి. ఓం ఐంహ్రీంశ్రీంక్లీంసౌః – ఈ ఆరింటిని శాక్తేయ ప్రణవములు అని పిలుస్తారు. దానిని ఎలాబడితే అలా ఉపాసన చెయ్యకూడదు. కాబట్టి బీజాక్షరములను అన్నివేళలా ఉపాసన చేయలేము. కానీ ఇప్పుడు పోతనగారు ఒక గొప్ప ప్రయోగం చేశారు. మహత్వమునకు బీజాక్షరము ’ఓం’, కవిత్వమునకు బీజాక్షరము ’ఐం’, పటుత్వమునకు భువనేశ్వరీ బీజాక్షరము ’హ్రీం”, ఆ తర్వాత్ సంపదల్ – లక్ష్మీదేవి – ’శ్రీం’.


ఇపుడు ’ఓంఐంహ్రీంశ్రీం’ – అమ్మలగన్నయమ్మ ’శ్రీమాత్రేనమః’...మీరు బీజాక్షరములతో అస్తమానూ అలా అనడానికి వీలులేదు. కానీ మీరు రైలులో కూర్చున్నా, బస్సులో కూర్చున్నా స్నానం చెయ్యకుండా కూడా ఎక్కడ ఉన్నా కూడా – అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ – అంటున్నారనుకోండి అపుడు మీరు మరోరూపంలో ’ఓంఐంహ్రీంశ్రీం శ్రీమాత్రేనమః’ – ఓంఐంహ్రీంశ్రీం శ్రీమాత్రేనమః’ అనేస్తున్నారు.


మీరు అస్తమానూ అమ్మను తలచుకున్నట్లు అవుతుంది. అపుడు అమ్మవారు చాలా తొందరగా మీకు పలుకుతుంది. అందుకే లలితా సహస్రం ’శ్రీమాతా’ అంటూ అమ్మతనంతో ప్రారంభమవుతుంది.


ఆవిడ రాజరాజేశ్వరి. అయినా ఆవిడముందు అమ్మా అమ్మా అనేసరికి ఆవిడి పొంగిపోతుంది. ఇన్నిమార్లు ఆ పద్యంద్వారా అటూ ఇటూ అమ్మని మీరు పిలుస్తుంటే విసుక్కోవడం చేతకాని దయాస్వరూపిణి అయిన అమ్మ మీకోరికను తీరుస్తుంది. ఇప్పుడు మీరు ’ఓంఐంహ్రీంశ్రీం శ్రీమాత్రే నమః’ అనలేకపోవచ్చు.


కానీ ’అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాల పెద్దమ్మ ’ అనడానికి కష్టం ఏమిటి


ఈవిధంగా పోతనగారు శ్రీవిద్యా రహస్యములన్నిటిని ఔపోసనపట్టి తెలుగు వారందరికీ ఒక మహత్తరమయిన కానుకను బహూకరించిన మహాపురుషుడు ఆయన ఒక ఋషి. అందుకని ఆ పద్యమును అనుగ్రహించినారు.


ఆ తల్లి అనుగ్రహం అందరికీ లభించాలని ప్రార్థిస్తూ


సర్వేజనా సుఖినోభవంతు

జై శ్రీ రామ్ జై జై హనుమాన్ కంచెర్ల వెంకట రమణ

హైందవం వర్ధిల్లాలి 18*

 *హైందవం వర్ధిల్లాలి 18*


సభ్యులకు నమస్కారములు.


ఐకమత్యం(i):- అహంకారాలతోనో, ఆధిపత్య ధోరణితోనో  లేక  తీరికగా ఉండలేని ఉన్మాదంతోనో ప్రస్తుత దేశ మరియు ప్రాంతీయ రాజాకీయాలు రెచ్చగొట్టబడుతున్నాయి. ఎవరో  నాయకులు, ఏదో పార్టీ ఇచ్చిన పిలుపు నందుకుని కొన్ని  మాతాలలోనో, కులాలలోనో, వర్గాలలోనో అందులోని వ్యక్తులనో ఇప్పటికీ శత్రువులుగా భావిస్తూ పరస్పరం ద్వేషించుకునే  పరిస్థితులు మనచుట్టూ కల్పించ బడుతున్నాయి. 


ఇట్టి విచ్ఛిన్నకర శక్తుల ఆగడాలకు అడ్డుగోడ కట్టి దేశం యావత్తు శాంతి భద్రతలతో నెలకొనాలంటే అన్ని మతాలవారు 

(హిందు, ముస్లిమ్, క్రిస్టియన్, సిక్కులు, బౌద్ధ, జైన, పార్సీ, యూదులు, జోరాష్టియన్లు, బహాయీలు), అన్ని కులాల వారు , అన్ని వర్గాలవారు అంటే సామాన్య ప్రజలు, మేధావులు,  ఉద్యోగస్తులు, వ్యవసాయదారులు, పారిశ్రామికులు,  వ్యాపార వాణిజ్య వర్గాలు, వైజ్ఞానికులు, వైద్యవర్గము, సాంకేతిక వర్గము మున్నగు వారందరు సమైక్యంగా, సంఘటితంగా, ఐకమత్యంతో వీరిని (దుష్ట శక్తులను) ప్రతిఘటించాల్సిఉంటుంది. *ఐకమత్యం ద్వారా మాత్రమే* ఒకరికొకరు సన్నిహితులవుతారు.  *మన దేశానికి స్వాతంత్రం వచ్చినది ఐకమత్యం ద్వారానే అని జ్ఞాపకం చేసుకుందాము*.


ఐకమత్యం అంటే ఏమిటో వివరంగా పరిశీలిద్దాము. ఒకటిగా, కల్సికట్టుగా, ఏకమతిత్వము, సమైక్యము, ఏక భావన, సంఘటితం గా  కలిసి ఒక లక్ష్యం కొసం మనసా వాచా కర్మణా *అనుబంధము* ఇత్యాది అర్థాలు చెప్పుకొనవచ్చును. *అవుతే "నిష్కపటమైన అసమ్మతి" తొలగిన తదుపరి మాత్రమే ఐకమత్యము సాధ్యము*. ఐకమత్యం ప్రయోజనాలు గూడా నెమరు వేసుకుందాము. 


ఐదు వ్రేళ్ళు బిగిస్తే *పిడికిలి*. ఆ పిడికిలే *శక్తివంతమైనది*. ఆ పిడికిలికి ఉన్న బలం మరియు శక్తి, విడి విడి వ్రేళ్లకు ఉండదు. ఆలాగే అన్నదమ్ములు, తోటి బంధు మిత్రులు, స్థానికులు, గ్రామాలు ,రాష్ట్రాలు అన్ని  *ఒక త్రాటిపై ఉంటే* సాధించలేనిది ఏముంటుంది. ఐకమత్యాన్ని ఒక సత్యారాధనగా అదే సత్యంగా భావిద్దాము. *ఐకమత్యమేమహా బలం, అనైక్యతనే  బలహీనత అని గుర్తుంచుకుందాము*. 


ఐకమత్యంతో ఉంటే ఎంత పెద్ద విజయాన్నైనా సాధించవచ్చును. *ఏకాకితనం వద్దు ఐకమత్యమే ముద్దు*. మనమందరం మన హిందూ బంధువులంతా అన్ని పండుగలు సామూహికంగా జరుపు కుందాము. *సామూహికము ఐకమత్యానికి  పరస్పర సహకారానికి దోహదం చేస్తుంది.*


అన్ని కులాల కలయికనే హైందవం. హైందవం వర్ధిల్లాలి, హిందువులందరూ సుఖ శాంతులతో ఉండాలి అంటే, అన్ని కులాలు, వర్గాలు కల్సిమెల్సి ఒకరికొకరు తోడుగా *ఒకరి కోసం అందరు, అందరి కోసం ఒకరు* అన్న చందాన ప్రజలందరూ సమైక్యంగా, అవిభక్తంగా ఉండి సమస్యలను, అడ్డంకులను తొలగించుకోవాలి.


ఇటువంటి ప్రేమ, మమతానురాగాలు, అభిమాన ఆప్యాయతలు, శాంతిపూర్వక  సోదరీ సోదర తత్వాలు, శాంతి భద్రతా సామరస్యాలు, ఆత్మ గౌరవం గల ఐకమత్యం దేశ మంతటా విస్తరించాలి. *కావున మన హిందూ ధర్మానికి,  సంస్కృతికి ఊపిరులూదడానికి ప్రతి పౌరుడు కంకణం కట్టుకోవాలి*


ధన్యవాదములు.

*(సశేషం)*

ఆయుర్వేదం లో జ్యోతిష్యం యొక్క పాత్ర -

 ఆయుర్వేదం లో జ్యోతిష్యం యొక్క పాత్ర -


 ఆయుర్వేదంలో జ్యోతిషం కూడా ప్రధాన పాత్ర వహిస్తుంది. ఆయుర్వేదం అంటే కేవలం చెట్ల మందులు , పసర్లు అని మాత్రమే అనుకుంటారు . జ్యోతిష్యం కూడా ఒక భాగమే . అందుకే "వైద్యజ్యోతీష్యం " అనే పేరు కూడా ఉంది. నేను ఔషధాలు తయారీకి అవసరం అయిన మొక్కల్ని సేకరించేప్పుడు కాని , ఔషధం  తయారుచేసేప్పుడు కాని ఈ జ్యోతిష్య సంబంధ నియమాలు తప్పకుండా ఆచరిస్తాను. ఇప్పుడు మీకు ఆయుర్వేదంలో జ్యోతీష్యం ప్రధానపాత్ర ఎలా ఉంటుందో మీకు తెలియచేస్తాను.


 *  అమృతగడియాల యందు క్రొత్తగా చేయు మందులు అనగా లేహ్యములు, చూర్ణములు , రోగిచే సేవించబడు ఔషధం అమృతతుల్యమై వాతపిత్త శ్లేష్మజ్వరాది రోగములను హరింపచేసి ఆరోగ్యంబును అవయవాలకు బలమును ఆయుర్వృద్దిని చేయును . అమృతఘడియల్లోనే నూతన ఔషధాలను తయారుచేయవలెను అని శ్రీ ధన్వంతరి తెలియచేశారు. మందు ఇచ్చినప్పుడు కూడా అమృత ఘటికలలోనే తయారుచేయవలెను.


 *  "ఔషదారంభే గురుశ్రేష్ఠహా " అనే ఆర్యోక్తి ప్రకారం గురువారం నూతనౌషధములను అమృతగడియాలలో సేవించిన అది అమృతం వలే తప్పక పనిచేయును .


 *  నవౌషధం బుధసోమాయోహ "  అనగా బుధసోమవారాలు అమృతగడియాలలోనైనా మందు సేవించరాదు . అటుల సేవించిన గుణం ఇవ్వదు.


 *  అశ్వని, మృగశిర, పునర్వసు, పుష్యమి, హస్త, చిత్త, స్వాతి , అనురాధ, మూల, శ్రవణం, ధనిష్ఠ, శతభిషం, రేవతి ఈ నక్షత్రములు, అదివారం, సోమవారం, బుధవారం, గురువారం , శుక్రవారం లు వీటితో చేరిన శుభతిథుల యందు మిధున, కన్యా, ధనుస్సు , మీన లగ్నముల యందు ఏ గ్రహములు లేకుండా ఉండటం , ఆయుష్మన్నమ యోగము నందు మందులు సేవించుటకు , మందులు చేయుటకు యోగ్యముగా ఉండును. మంగళవారం, శుక్రవారం విరేచనములకు మందు తీసుకుంటా మంచిది .


 *  అశ్వని, మృగశిర, పునర్వసు, పుష్యమి, హస్త, చిత్త, స్వాతి , అనురాధ, శ్రవణము, ధనిష్ట , శతబిషం, రేవతి ఈ నక్షత్రములు మరియు అదివారం , బుదవారం, శనివారం , తదియ , పంచమి, సప్తమి తిధుల యందు తైలములు సేవించుటకు చాలా మంచి సమయం.


 *  అశ్వని, కృత్తికా, ఆరుద్ర, ఆశ్లేష, చిత్త, విశాఖ, జేష్ఠ, మూల , శతబిషం ఈ నక్షత్రాలతో కూడిన అదివారం, మంగళవారం యందు క్రూర లగ్నములు అగు మేష,వృశ్చిక , మకర, కుంభ లగ్నముల యందు శరీరమునకు రక్షా రేకులు అనగా తాయత్తులు కట్టించుకొనుట మంచిది . ఈ ముహుర్తాలు శస్త్ర చికిత్స చేయుటకు పాటించవలెను .


 *  అశ్వని, మృగశిర, పునర్వసు , పుష్యమి, హస్త, చిత్త, స్వాతి , అనురాధ, శ్రవణం, ధనిష్ట, శతబిషం , రేవతి నక్షత్రములు, అదివారం, మంగళవారం, గురువారములతో కలిసినపుడు పాదరసం , రసకర్పూరాది రసములు కలిసిన మందులు సేవించవలెను .


 *  పంచాంగ శుద్ది నందు క్షేమతార  గురువు మరియు చంద్రబలం కలిగి ఉండినప్పుడు రోగము శీఘ్రముగా నశించును.


        ఇంకా స్వప్నములను బట్టి ఏ వ్యాధి కలుగునో , మరణానికి ముందు ఎటువంటి సూచనలు కనిపిస్తాయో కూడా వివరణ ఉంది .వాటిని తరువాతి పోస్టులలో వివరిస్తాను.


      మరిన్ని అనుభవపూర్వక ఆయుర్వేద ఔషధ చిట్కాల కొరకు మరియు సంపూర్ణ సమాచారం కొరకు నేను రచించిన గ్రంధాలు చదవగలరు . .


  

  గమనిక  -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు .  


  


                ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


      ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .


     కాళహస్తి వేంకటేశ్వరరావు  


 అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


         9885030034

బతుకమ్మ పండుగ

 


శ్రీభారత్ వీక్షకులకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు 🌹 ఇది సంబరాల నెల. ఒకవంక బతుకమ్మ పండుగ, అదే సమయంలో శరన్నవరాత్రులు, ఇళ్లు, గుళ్లలో పూజల హోరు, మరోవంక తిరుమలేశుని బ్రహ్మోత్సవాలు.. సంబరాలు, సంతోషాలు.. ఒకటి కాదు, చెప్పలేనన్ని. మహిళలు, పిల్లలు మనసంతా సంతోషంతో జరుపుకునే బతుకమ్మ సంబురాలు, పురాణ కాలం నుంచి వస్తున్న బతుకమ్మ నేపథ్యం గురించి ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త డా.తిరుమల నీరజ గారు ఎంత హృద్యంగా చెప్పారో వినండి. బతుకమ్మ ఇంటింటి ఆడపడుచు. కనువిందు చేసే పూజలు తెలుసుకోండి. ఇటువంటి విశిష్టమైన ఎపిసోడ్స్ ఉచితంగా వీక్షించడానికి వెంటనే చానల్ ను subscribe చేయండి, శ్రీభారత్ కుటుంబ సభ్యులు కండి.🙏

ఈ రోజు (అది పర్వము-1)

 డి🙏 ఈ రోజు (అది పర్వము-1)

 03 పుస్తకాలు(PDF) ఒకేచోట ఉచితంగా తెలుగులో. ఈ క్రింది లింక్స్ పై క్లిక్ చేసి Read/Download చేసుకోగలరు* Install play store 

--------------------------------------

https://play.google.com/store/apps/details?id=com.infinity.sanatanadharm

బట్టలు మసిపోతే

 🙏🕉️శ్రీ మాత్రేనమః శుభోదయం 🕉️🙏                🏵️ఒకసారి బట్టలు మసిపోతే ఎక్కడ పడితే అక్కడ కూర్చోడానికి సందేహించదు మనిషి.. అలాగే ఒకసారి నడక చెడిందంటే ఎటువంటి దారుణనికి అయినా దిగజారతాడు మనిషి 🏵️మనిషి బతకడానికి పెద్దగా ఖర్చు ఉండదు.. కాని ఎదుటి వారిలా బ్రతకాలి ఆలోచన వచ్చిందో, ఆశ పడ్డాడో అప్పుడే ఖర్చు పెరుగుతుంది.. వక్రబుద్ది ఎర్పుడుతుంది మనిషికి🏵️అవసరం లేని వాటి గురించి ఆలోచిస్తూ ఉంటే అనందం అదృశ్యమవుతుంది.. మనసును గందరగోళం చేసే వాటిని తలపై వేసుకుని మనశ్శాంతి  లేదని బాధ పడటంలో అర్ధం లేదు.. జీవితం అన్నాక అనేక రాకమైన అటుపోటులు వస్తుంటాయి.. జీవన ప్రయాణం చేయాలి కానీ ఎదుటి వారిని చూసి అసూయ చెండకూడదు..మనశాంతి అనందం మనలోనే ఉందని అర్ధం చేసుకుని మనసులో పనికిమాలిన ఆలోచనలు విషయాలను ఉంచకుండా జాగ్రత్త  తీసికోవాలి..తప్పు దారి పట్టించే ఆలోచనల కంటే పెద్ద శత్రువు లేదు మనిషికి🏵️ *అందుకే పరమాత్మని మనసులో ప్రతిష్ట చేసుకుని అందోళన, ఆవేశం, ఒత్తిడి, ఆశ అనే శక్తులు దారిచేరాకుండా చేసుకుని మంచి మనసుతో మంచి ఆలోచనతో ముందుకు సాగుదాం* 🏵️🏵️🏵️మీ కుమారి భాస్కరరావు రేలంగి 🙏🙏🙏🙏

అలంకార ప్రియో విష్ణు

 " అలంకార ప్రియో విష్ణు

 అభిషేక ప్రియః శివ

 నమస్కార ప్రియః  భాను

 బ్రాహ్మణ బహుజన ప్రియః "


సాక్షాత్తూ పార్వతి దేవి చెప్పిన శ్లోకమిది. దీని అర్థము


ఏమిటంటే "విష్ణువుకు అలంకారమంటే ఇష్టం, మరేమో


శివునికి అభిషేకమంటే ఇష్టము. సూర్యనారాయణుడికి


నమస్కారం ప్రీతి. బ్రాహ్మణునికి బహు జన (నాలుగు


వర్ణముల శ్రేయస్సే) ఇష్టమని. అందుకే అందరి శ్రేయస్సు


కోరే "గో బ్రహ్మణేభ్యా" అంటారు. బ్రాహ్మణుడు, గోవు తృప్తి


చెందితే సమస్త దేవతలు సంతుష్టులౌతారట! అందుకే


బ్రాహ్మణుడికి నాలుగు రుచికరమైన వంటకాలు వడ్డిస్తే


ఆరగించి తృప్తిగా ' అన్నదాతా సుఖీ భవ' అని


దీవిస్తాడు. భక్తులు శంకరుడిని కొలిస్తే, శంకరుడు


నారాయణుడిని ధ్యానిస్తాడట. నారాయణుడు శివారాధన


చేస్తాడట. హరిహరాదులు ఇరువురూ కలిసి


'బ్రాహ్మణుడిని' గోవుని పూజిస్తారట! ఎందుకంటే


బ్రాహ్మణులు గాయత్రి దేవి సత్పాత్ర బిడ్డలని,


ముప్పూటలా వెయ్యి గాయత్రి జపం చేసి ఆ గాయత్రి


మాతకు పరమాప్తులౌతారని"


కాబట్టి బ్రాహ్మణులకు భోజనం పెడితే హరి హరాదులు సంతుష్టులై సకల కార్యాలు నెరవేరుతాయన్న మాట.

02, అక్టోబర్, 2024*🌷 *దృగ్గణిత పంచాంగం*

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*

       🪷 *బుధవారం*🪷

🌷 *02, అక్టోబర్, 2024*🌷  

     *దృగ్గణిత పంచాంగం*                   


         *ఈనాటి పర్వం*  

 *మహాలయ అమావాస్య*  

  🙏 *పిణ్డపితృయజ్ఞః*🙏


*స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం* 

*దక్షిణాయణం - వర్షఋతౌః*

*భాద్రపద మాసం - కృష్ణపక్షం*


*తిథి  : అమావాస్య* రా 12.08 ఉపరి *ఆశ్వయుజ*  

*మాసారంభః*

*వారం: బుధవారం* (సౌమ్యవాసరే)

*నక్షత్రం  : ఉత్తర* మ 12.23 వరకు ఉపరి *హస్త*


*యోగం  : బ్రహ్మ* రా 03.22 వరకు ఉపరి *ఐంద్ర*

*కరణం: చతుష్పాద* ఉ 10.58 *నాగ* రా 12.18 ఉపరి *కింస్తుఘ్న*


*సాధారణ శుభ సమయాలు* 

                 *ఈరోజు లేవు*

అమృత కాలం  :*శేషం ఉ 06.03 వరకు*

అభిజిత్ కాలం  : *ఈరోజు] లేదు*


*వర్జ్యం          : రా 09.53 - 11.42*

*దుర్ముహూర్తం : ప 11.33 - 12.20*

*రాహు కాలం : మ 11.56 - 01.26*

గుళికకాళం      : *మ 10.27 - 11.56*

యమగండం    :  *ఉ 07.27 - 08.57*

సూర్యరాశి : *కన్య* 

చంద్రరాశి : *కన్య*

సూర్యోదయం :*ఉ 05.58* 

సూర్యాస్తమయం :*సా 05.55* 

*ప్రయాణశూల   : ఉత్తరం దిక్కుకు పనికిరాదు*


*వైదిక విషయాలు*

ప్రాతః కాలం   :  *ఉ 05.58 - 08.21*

సంగవ కాలం  :      *08.21 - 10.45*

మధ్యాహ్న కాలం :*10.45 - 01.08*

అపరాహ్న కాలం:*మ 01.08 - 03.32*

*ఆబ్ధికం తిధి: భాద్రపద అమావాస్య*

సాయంకాలం :  *సా 03.32 - 05.55*

ప్రదోష కాలం   :  *సా 05.55 - 08.20*

రాత్రి కాలం      :  *రా 08.20 - 11.32*

నిశీధి కాలం        :*రా 11.32 - 12.21*

బ్రాహ్మీ ముహూర్తం :   *తె 04.21 - 05.10*

________________________________

           🌷 *ప్రతినిత్యం*🌷

 *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


🪷 *శ్రీ సరస్వతీ స్తోత్రం*🪷


*సురాసురైస్సేవిత పాదపంకజా కరే విరాజత్కమనీయపుస్తకా |*

*విరించిపత్నీ కమలాసనస్థితా సరస్వతీ నృత్యతు*


🌷 *ఓం సరస్వత్యై  నమః* 🌷


🌷🪷🌹🛕🌹🌷🪷🌷🪷

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><><><>


         🌷 *సేకరణ*🌷

      🌹🌿🌹🌹🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🌹🌹🍃🌷

🌹🌷🌹🌷🌹🌷🌷🌹

వేద ఆశీర్వచనం.

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*

*కలియుగాబ్ది 5125*

*శ్రీ శాలివాహన శకం 1946 స్వస్తి శ్రీ    చాంద్రమాన క్రోధి నామ సంవత్సరం దక్షిణాయణం  - వర్ష ఋతువు - భాద్రపద మాసం - కృష్ణ పక్షం  - అమావాస్య - ఉత్తరాఫల్గుణి -‌‌ భౌమ వాసరే* (02.10.2024)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.





.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

-----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*

జాతిపితకు జన్మదిన నివాళి

 🌹జాతిపితకు జన్మదిన నివాళి🌹


సౌరాష్ట్ర దేశాన సాగర తీరాన

          పోరుబందరు లోన పుట్టె గాంధి

పసితన మందునే పాటించి సత్యమ్ము

           జీవితయానమ్ము చేసె గాంధి

అనయ మహింసనే నాచరించియు తాను

           మార్గదర్శకుడైన మనిషి గాంధి

సత్యదీక్షను బూని  స్వాతంత్ర్యమును దెచ్చి

           జాతి కిచ్చినయట్టి నేత గాంధి

ఆచరించి చూపి యన్నింట తానుగా

మార్గదర్శి యైన మనిషి గాంధి 

భరతభూమియందు  ప్రభ వించి నట్టి యా 

జాతిపితకు  నేడు చేతు నతులు


✍️గోపాలుని మధుసూదన రావు 🙏

Pandla Bandi పండ్ల బండి