29, సెప్టెంబర్ 2023, శుక్రవారం

మూత్రం బిగించి

 మూత్రం బిగించి మృత్యువుకి దగ్గర్లో ఉన్న రోగిని కాపాడే సిద్ద యోగం  - 

    కొండపిండి మొక్క సమూల చూర్ణం , చిన్న యాలుకల పొడి , శుద్ది చేసిన కర్పూర శిలాజిత్ పొడి , దోరగా వేయించిన పిప్పిళ్ళ పొడి సమభాగాలు గా కలిపి ఉంచి  రెండు పూటలా పూటకు అర టీ స్పూన్ పొడి అర గ్లాస్ బియ్యం కడిగిన నీటిలో కలిపి తాగుతూ ఉంటే మూత్రం వెంటనే బయటకు వచ్చి చావుకి దగ్గరగా వెళ్లిన రోగి కూడా జీవించే అవకాశం ఉంది.

     తమలపాకులు కి ఆముదం రాసి మంట దగ్గర కొంచం వేడి చూపించి పొత్తి కడుపు మీద వేస్తే కొంచం సేపట్లో పొత్తికడుపు ఉబ్బు పోయి బంధించిన మూత్రం బయటకి వచ్చి రోగి ప్రాణాపాయం నుంచి బయటపడతాడు. ఇది నా అనుభవపూర్వకం .

    మరింత విలువైన అనుభవపూర్వక ఆయుర్వేద ఔషధ  సమాచారం కొరకు నా గ్రంథములు చదవగలరు . 

   గమనిక  -

      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 

            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 

   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 

                ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .

        ఈ గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా ఫొన్ చేయండి  . సంప్రదించవలసిన నెంబర్ 

                           9885030034  

         మెస్సేజిస్ , కామెంట్ల రూపంలో పెట్టవద్దు .

        కాళహస్తి వేంకటేశ్వరరావు 

   అనువంశిక ఆయుర్వేద వైద్యులు 

           9885030034

సమర్పయామి

 భావం:- "అహం సమర్పయామి" అంటూ దేవుడికి మనం సమర్పించే పూజా ద్రవ్యాలను , నైవేద్యాలను  గురించి విభిన్నమైన కోణంలో దర్శిస్తాడు కవి. 

"స్వామీ ! నీ వస్తువులు నీకే సమర్పిస్తున్నాను అంటాడు .

హే లక్ష్మీ వల్లభ ! నేను నిన్ను పూజించే  ఈ ద్రవ్యాలను సమర్పిస్తున్నాను కానీ , ఇవేవీ నావి కాదు . నీవి నీకే సమర్పిస్తున్నాను ! పరిమళ భరితమైన గంధ పుష్పములు , దీపపు నూనె , ఫలములు , అన్నము , పప్పు , పానకము , నేతి గారెలు , తీయని బూరెలు , మంచినీరు , వింజామరలు , తాంబూలం మొదలైన వస్తువులు అంటూ ... మనం సమర్పించే శోడషోపచార వస్తువులను ' నీవి నీకే సమర్పిస్తున్నాను ' అంటూ పలుకుతాడు . వీటిలో చూడడానికి ఒక్కటి కూడా నా తాత సొమ్ము లేదు . నావల్ల నీకు ఎలాంటి ఉపకారం కూడా లేదు . అంటూ చిత్రమైన భావనలతో వాపోతాడు శేషప్ప ! 

ఆలోచనాత్మకమైన , వైవిద్య భరితమైన ఇలాంటి పద్యాలు శేషప్ప శైలిని హిమాలయంపై కూర్చోబెడతాయి !

Hindu

శ్రాద్ధ కర్మ చేయటం

 🌸1. పాడ్యమి నాడు

శ్రాద్ధ కర్మ చేయటం వల్ల ధన సంపద లభిస్తుంది. 

🌿2. ద్వితీయనాడు 

శ్రాద్ధ కర్మ చేయటం వల్ల రాజయోగం, సంపద లభిస్తుంది.

🌸3. తృతీయనాడు 

శ్రాద్ధ కర్మ చేయటం వల్ల శత్రువులు నశిస్తారు.

🌿4. చతుర్దినాడు 

శ్రాద్ధ కర్మ చేయటం వల్ల ధర్మగుణం, ఇష్టకామ్య ప్రాప్తి కలుగుతుంది, అంతే కాకుండా శత్రువుల వ్యూహాలు ముందుగా పసిగట్టగలరు.

🌸5. పంచమి నాడు 

శ్రాద్ధ కర్మ చేయటం వాళ్ళ ఉత్తమ లక్ష్మీ ప్రాప్తి కలుగుతుంది. పుత్రకామన గలవారికి ఫలం లభిస్తుంది. 

🌿6. షష్ఠి నాడు

శ్రాద్ధ కర్మ వల్ల దేవతలు పితరులు ప్రసన్నులవుతారు, ఆ వ్యక్తి కి సమాజం లో శ్రేష్ఠ గౌరవం లభిస్తుంది. 

🌸7. సప్తమి నాడు

శ్రాద్ధ కర్మ వల్ల యజ్ఞం చేసిన పుణ్య ఫలం లభిస్తుంది. 

🌿8. అష్టమి తిథి నాడు

శ్రాద్ధ కర్మ వాళ్ళ చేస్తే సంపూర్ణ సమృద్ధి, ధనం, బుద్ది ప్రాప్తిస్తాయి.

🌸9. నవమి నాడు

శ్రాద్ధ కర్మ చేస్తే విస్తారం గా సంపద, అనుకూలవతి అయిన భార్య లభిస్తుంది.

🌿10. దశమి నాడు

శ్రాద్ధ కర్మ చేస్తే లక్ష్మీ ప్రాప్తి, పశు సంపద వృద్ది చెందుతుంది.

🌸11. ఏకాదశి నాడు

శ్రాద్ధ కర్మ చేస్తే సర్వ శ్రేష్ఠ దాన ఫలం లభిస్తుంది, అన్ని పాపాలు నశిస్తాయి, వేద జ్ఞానం ప్రాప్తిస్తుంది , కుటుంబం వృద్ది చెందుతుంది.

🌿12. ద్వాదశి నాడు

శ్రాద్ధ కర్మ చేస్తే దేశం అబివృద్ది చెందుతుంది. శ్రాద్ధ కర్త కు అన్నానికి లోటుండదు, అలాగే పుత్ర, పశు, మెధా బుద్ధి, జయ సంపత్తి కలుగుతుంది.

🌸13. త్రయోదశి నాడు

శ్రద్ద కర్మ చేస్తే ధనం, సంతతి, ఐశ్వర్యం, దీర్ఘాయువు, ఆరోగ్యం , బంధుమిత్రులలో గౌరవం లభిస్తాయి.

🌿14. చతుర్దశి నాడు

శ్రాద్ధ కర్మ చేస్తే ఆయుధాల నుండి రక్షణ లభిస్తుంది.

🌸15. అమావాస్య నాడు

శ్రాద్ధ కర్మ చేస్తే వ్యక్తి కి సమస్త లాభాలు కలుగుతాయి, అన్ని కోరికలు నెరవేరుతాయి.

🌿ప్రతి సంవత్సరం చేసే శ్రాద్ధం కన్నా అతి ముఖ్యమైన శ్రాద్దాలు ఈ మహాలయపక్షం పదిహేను రోజులు చేయలేనివారు ఒక్క మహాలయమైన చేసి తీరాలి. 

🌸ఆర్దిక భావం వలన విద్యుక్తంగా శ్రాద్ధ కర్మలు చేయలేక పొతే,  పితృ పక్షం లో కేవలం శాకంతో శ్రాద్ధం చేయవచ్చు. అది కూడా వీలు కాక పొతే గోవుకు గ్రాసం పెట్టవచ్చు. 

🌿అదీ చేయలేని వారు ఒక నిర్జన ప్రదేశం లో నిల్చొని అపరాన్న సమయం లో రెండు చేతులు ఆకాశం వైపు పైకి ఎత్తి, పితృ దేవతలకు నమస్కరించవచ్చు. శ్రాద్ధ కర్మ చేత పితృ దేవతలకు సంతృప్తి కలిగించిన వ్యక్తికి భౌతికంగా సుఖ సంతోషాలు, పరలోకం లో ఉత్తమ గతులు లభిస్తాయని శాస్త్రాల ద్వారా తెలుస్తోంది...స్వస్తి...🚩🌞🙏🌹🎻

🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

మహాలయ పక్ష తర్పణం*

 మహాలయ పక్ష తర్పణం*

ఆచమ్య.... పవిత్రం ధృత్వా.(పవిత్రవంతః....తథ్సమాశత)..పునరాచమ్య........... గోవింద.. గోవింద.. గోవింద.. మహావిష్ణోరాజ్ణయా........పుణ్యతిథౌ..(ప్రాచీనావీతి)అస్మత్ పితౄణాం అక్షయ పుణ్య లోక ఫలావాప్త్యర్థం. కన్యాగతే సవితరి ఆషాఢ్యాది పంచమాపరపక్షే సకృన్మహాలయాఖ్యాన్న శ్రాధ్ధ ప్రతినిధి తిల తర్పణాని (సవ్యం)కరిష్యే.....(ప్రాచీనావీతి)  దక్షిణాభిముఖో భూత్వా1) పితరం..(తండ్రి) గోత్రం....శర్మాణం..వసురూపం..స్వధానమస్తర్పయామి..3 మారులు

2) పితామహం..(తాత) గోత్రం... శర్మాణం.. రుద్రరూపం.. స్వధానమస్తర్పయామి

3 మారులు

3)ప్రపితామహం.(ముత్తాత) గోత్రం...శర్మాణం... ఆదిత్య రూపం..స్వధానమస్తర్పయామి 3మారులు

4) మాతరం (తల్లి) గోత్రాం...దాయీం..వసురూపాం స్వధానమస్తర్పయామి 3 మారులు

5) పితామహీం (నానమ్మ) గోత్రాం..దాయీం..రుద్రరూపాం స్వధానమస్తర్పయామి

3 మారులు

6) ప్రపితామహీం (నానమ్మ గారి అత్త) గోత్రాం.. దాయీం..ఆదిత్యరూపాం

స్వధానమస్తర్పయామి

3 మారులు

7) సాపత్నిమాతరం ( సవితి తల్లి) గోత్రాం....దాయీం...వసురూపాం స్వధానమస్తర్పయామి 3 మారులు

8)మాతామహం (తాత . అనగా తల్లి గారి తండ్రి)

గోత్రం..శర్మాణం..

వసురూపం.. స్వధానమస్తర్పయామి 3 మారులు

9) మాతుః పితామహం (తల్లి గారి తాత)

గోత్రం..శర్మాణం... రుద్రరూపంవసురూపం.. స్వధానమస్తర్పయామి 3 మారులు

10) మాతుఃప్రపితామహం

(తల్లి యొక్క తాతగారి తండ్రి)  గోత్రం...శర్మాణం.. ఆదిత్య రూపం వసురూపం.. స్వధానమస్తర్పయామి ...3 మారులు

11) మాతామహీం.(అమ్మ మ్మ) గోత్రాం..దాయీం. వసురూపాం స్వధానమస్తర్పయామి...3 మారులు

12) మాతుః పితామహీం.(తల్లి యొక్క నానమ్మ)

గోత్రాం.. దాయీం.. రుద్రరూపాం వసురూపం.. స్వధానమస్తర్పయామి ...3 మారులు

13)మాతుః ప్రపితామహీం (తల్లి యొక్క నానమ్మ గారి అత్త) గోత్రాం... దాయీం.. ఆదిత్య రూపాం..వసురూపం.. స్వధానమస్తర్పయామి.. 3 మారులు

14) ఆత్మ పత్నీం ( భార్య) గోత్రాం.. దాయీం.. వసురూపాం.. వసురూపం.. స్వధానమస్తర్పయామి.. 3 మారులు

15) సుతం (కుమారుడు)

గోత్రం..శర్మాణం.. వసురూపం  

వసురూపం.. స్వధానమస్తర్పయామి ....3 మారులు

16) జ్యేష్ఠ భ్రాతరం (స్వంత సోదరుడు) గోత్రం..శర్మాణం.. వసురూపం  

వసురూపం.. స్వధానమస్తర్పయామి ....3 మారులు

17) కనిష్ఠ భ్రాతరం ( స్వంత చిన్నసోదరుడు)

గోత్రం..శర్మాణం.. వసురూపం  

వసురూపం.. స్వధానమస్తర్పయామి ....3 మారులు

18)తత్పత్నీం (సోదరుని భార్య.. వదిన)గోత్రాం..దాయీం వసురూపాం  . స్వధానమస్తర్పయామి ....3 మారులు

19) పితృవ్యం (పెదనాన్న/చిన్నాన్న) గోత్రం..శర్మాణం..

వసురూపం.. స్వధానమస్తర్పయామి ....3 మారులు

20)తత్పత్నీం.. (పెద్దమ్మ/ చిన్న మ్మ లు) గోత్రాం..దాయీం

వసురూపాం.. స్వధానమస్తర్పయామి ....3 మారులు

21)తత్ పుత్రం (పెదనాన్న & చిన్నాన్న కుమారుడు.. గోత్రం... శర్మాణం..

వసురూపం.. స్వధానమస్తర్పయామి ....3 మారులు

22) తత్పత్నీం (పెదనాన్న చిన్నాన్న కుమారుని భార్య) గోత్రాం..దాయీం..

వసురూపాం.. స్వధానమస్తర్పయామి ....3 మారులు

23)మాతులం (మేనమామ.. తల్లి సోదరుడు) గోత్రం..శర్మాణం..

వసురూపం.. స్వధానమస్తర్పయామి ....3 మారులు

24) తత్పత్నీం (మేనమామ భార్య) గోత్రాం..దాయీం..

వసురూపాం.. స్వధానమస్తర్పయామి ....3 మారులు

25) దుహితరం (కూతురు) గోత్రాం..దాయీం.

వసురూపాం.. స్వధానమస్తర్పయామి ....3 మారులు

25) ఆత్మ భగినీం ( సోదరి. అక్క&చెల్లెలు) గోత్రాం.. దాయీం

వసురూపాం.. స్వధానమస్తర్పయామి ....3 మారులు

26)తద్భర్తారం (కూతురి భర్త & అల్లుడు) గోత్రం..శర్మాణం..

వసురూపం.. స్వధానమస్తర్పయామి ....3 మారులు

27)దౌహిత్రం (కూతురి కొడుకు & మనుమడు) గోత్రం..శర్మాణం..

వసురూపం.. స్వధానమస్తర్పయామి ....3 మారులు

28) తత్పత్నీం (కూతురు యొక్క కొడుకు భార్య) గోత్రాం..దాయీం.

వసురూపాం.. స్వధానమస్తర్పయామి ....3 మారులు

29)భాగినేయకం ( మేనల్లుడు) గోత్రం..శర్మాణం..

వసురూపం.. స్వధానమస్తర్పయామి ....3 మారులు

30) తత్పత్నీం (మేనల్లుడి భార్య) గోత్రాం.దాయీం..

వసురూపాం.. స్వధానమస్తర్పయామి ....3 మారులు

31) పితృ భగినీం ( మేనత్త & తండ్రి సోదరి) గోత్రాం..దాయీం..

వసురూపాం.. స్వధానమస్తర్పయామి ....3 మారులు

32) తద్భర్తారం (మేనత్త భర్త) గోత్రం..శర్మాణం..

వసురూపం.. స్వధానమస్తర్పయామి ....3 మారులు

33)మాతృ భగినీం ( తల్లి సోదరి . చిన్న మ్మ. పెద్దమ్మ)  గోత్రాం..దాయీం..

వసురూపాం.. స్వధానమస్తర్పయామి ....3 మారులు

34) తద్భర్తారం ( తల్లి సోదరి యొక్క భర్త) గోత్రం..శర్మాణం..

వసురూపం.. స్వధానమస్తర్పయామి ....3 మారులు

35) జామాతరం ( అల్లుడు కూతురి భర్త) గోత్రం..శర్మాణం..

వసురూపం.. స్వధానమస్తర్పయామి ....3 మారులు

36)స్నుషాం ( కోడలు)  గోత్రాం.దాయీం..

వసురూపాం. స్వధానమస్తర్పయామి ....3 మారులు

37)శ్వశురం ( పిల్లనిచ్చిన మామ)

 గోత్రం..శర్మాణం..

వసురూపం.. స్వధానమస్తర్పయామి ....3 మారులు

38)శ్వశ్రూం ( పిల్లనిచ్చిన మామ భార్య.. అత్త) గోత్రాం..దాయీం..

వసురూపాం స్వధానమస్తర్పయామి ....3 మారులు

39)శ్యాలకం (బావమరిది) గోత్రం..శర్మాణం..

వసురూపం.. స్వధానమస్తర్పయామి ....3 మారులు

40) తత్పత్నీం (బావమరిది భార్య) గోత్రాం..దాయీం.

వసురూపాం స్వధానమస్తర్పయామి ....3 మారులు

41) ఆత్మ పత్నీం (భార్య)

 గోత్రాం...దాయీం

వసురూపాం.. స్వధానమస్తర్పయామి ....3 మారులు

42)గురుం ..  గోత్రం..శర్మాణం..

వసురూపం.. స్వధానమస్తర్పయామి ....3 మారులు

43)రిక్థినం ..

 గోత్రం..శర్మాణం..

వసురూపం.. స్వధానమస్తర్పయామి ....3 మారులు

........

1)యే బాంధవాః యే బాంధవాః . యేయే అన్య జన్మని  బాంధవాః|

తే సర్వే తృప్తి మాయాన్తు మయా దత్తేన. వారిణా||

2)ఆ బ్రాహ్మ స్తంబ పర్యన్తం దేవర్షి పితృ మానవాః|

తృప్యంతు పితర స్సర్వే‌ మాతృ  మతామహాదయః||

3)అతీత కుల కోటీనాం  సప్త ద్వీప నివాసినాం|

ఆ బ్రహ్మ భువనాల్లోకా దిదమస్తు తిలోదకం||

(యజ్ణోపవీత నిష్పీడనం)

యే కే చాస్మత్కులే జాతాః

అ పుత్రా గోత్రిణో మృతాః|

తేగృహ్ణంతు మయా దత్తం

సూత్ర నిష్పీడనోదకం|| (సవ్యం)

శ్రీ రామ రామ రామ రామ

సందేహాలు-- సమాదానాలు

 ప్ర : పూజంతా చేసి “పాపోహం పాపకర్మాహం" అని దేవుని ముందు ప్రదక్షిణం చేయడం తప్పుకదా! పూజించాక ఇంకా ఎక్కడ పాపముంటుంది? కాబట్టి "పుణ్యోహం-పుణ్య కర్మాహం” అనుకోవడం మంచిదికదా! 

జ: ప్రదక్షిణల వల్ల పాపాలు పోతాయనేది నిజమే. అయితే మనం మనసారా మన  తప్పుల్ని ఒప్పుకోవాల్సిందే. మన పాపాలను దాపరికం లేకుండా దేవుని ముందు ఒప్పుకోవడానికే పెద్దలు ఆ శ్లోకం ఉంచారు. సంప్రదాయంగా వస్తున్న సదాచారాలలో చాలా గంభీరార్థం ఉంటుంది. ఆవేశపడి వెంటనే మార్చేయకూడదు.

పైగా-జీవుడికి కర్మసంచితాలు ఎన్నో అతడే నిర్ణయించలేడు. ఒక్క పూజతోనే పోయేవికావుగా. కొన్ని కొన్ని క్రమ క్రమంగా నశిస్తుంటాయి. ఇంకా చేయబోయేవీ ఉంటాయి కదా! "పుణ్యోహం” అని చెప్పాక, ఇంక “త్రాహిమాం” ఎందుకు? తప్పులు ఒప్పుకొనే నిజాయతీలో శరణు వేడడం ఆ శ్లోకంలో భావం.

*ప్ర* :  *'రాముడు'  ఏకపత్నీవ్రతుడు' కావచ్చు. కానీ కృష్ణుడు, విష్ణువు, శివుడు వీళ్ళంతా కారుకదా! మరి*  *'బహుభార్యాత్వంఉన్నప్పుడు ఎలా 'ధర్మం' అనగలం?* 

 *జ* : రాముడు 'ఏకపత్నీ' అనే వ్రతాన్ని పట్టినవాడు. తద్వారా కుటుంబ వ్యవస్థ పటిష్టతకు సరియైన ఆదర్శాన్ని చూపించాడు. 'ఒక భర్తకు ఒక భార్య' అనేది ఉత్తమ ధర్మం.

దీనికి భిన్నంగా వెళ్ళడానికి ధర్మంగా సమర్ధించరాదు. అయితే దశరథుడు ధర్మమయుడే. అందులో సందేహం లేదు. రాజ ధర్మంలో కొన్ని సందర్భాల్లో బహుభార్యాత్వం తప్పదు. అది సమర్ధనీయం కాకపోవచ్చు. కానీ అప్పటి పరిస్థితుల్లో గర్వనీయమూ కాదు. వాటికి రాజకీయపరమైన కారణాలు ఉంటాయి. కొన్ని దేశకాల పరిస్థితుల్లో అప్పటి సామాజిక అవసరాలూ వాటికి హేతువౌతాయి. అనాదిగా ఈ దేశంలో గౌరవస్థానం పొందినది ఏకపత్నీ ధర్మమే. అత్రిఅనసూయ, వశిష్ఠఅరుంధతులు -  వంటి కుటుంబీకులు అందరూ - 'ఒక భర్తకు ఒక భార్య' అనే ధర్మాన్ని అవలంబించినవారే. 'సుందరకాండ'లో సీత -సనాతన దాంపత్య ధర్మానికి ప్రతీకలుగా చెప్పిన పరంపర అంతా ఆ ధర్మావలంబకులే.

ఇక -శ్రీ కృష్ణుడు సాక్షాత్తు దైవంగానే ప్రవర్తించాడు. ఆయన పత్నులందరికీ పతిగా వివిధ రూపాలు ధరించాడు. కృష్ణునిలో దైవలక్షణం, మానుష ధర్మం కలగలిసి కనిపిస్తాయి. మానుషాతీతమైన కృష్ణలీల అనుకరణకు అసాధ్యం. వాటిని కృష్ణుడు ఆయా జీవులను అనుగ్రహించిన పరమాత్మ విధానంగా గుర్తించాలి. అతిమానుషమైన

కృష్ణ ధర్మం -ఆదర్శం. యోగీశ్వరేశ్వరుడైన కృష్ణుని కథ ఏకాగ్రబుద్ధితో అధ్యయనం

చేయవలసినది.

విష్ణువు, శివుడు దేవతలు. గంగ, గౌరీ దేవతలు ఒకే పరాశక్తి యొక్క రూపాలు. అలాగే ఒకే మహాలక్ష్మీ దేవత శ్రీ లక్ష్మీ భూలక్ష్ములుగానున్నది. వారు ఉపాస్య దైవాలు. వాటికి మానుషపరమైన అన్వయాన్ని ఇవ్వలేం. ఇంకా - వాటి వెనుక మంత్ర, ఉపాసనా పరమైన అంతరార్థాలూ ఉన్నాయి. ఎప్పటికైనా మానవ సమాజానికి అత్యంత ఆవశ్యక ధర్మం మాత్రం 'ఒక భర్తకు ఒక భార్య' అనే ఉన్నతాదర్శమే.

మహాలయ పక్ష తర్పణం*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

*మహాలయ పక్ష తర్పణం*

ఆచమ్య.... పవిత్రం ధృత్వా.(పవిత్రవంతః....తథ్సమాశత)..పునరాచమ్య........... గోవింద.. గోవింద.. గోవింద.. మహావిష్ణోరాజ్ణయా........పుణ్యతిథౌ..(ప్రాచీనావీతి)అస్మత్ పితౄణాం అక్షయ పుణ్య లోక ఫలావాప్త్యర్థం. కన్యాగతే సవితరి ఆషాఢ్యాది పంచమాపరపక్షే సకృన్మహాలయాఖ్యాన్న శ్రాధ్ధ ప్రతినిధి తిల తర్పణాని (సవ్యం)కరిష్యే.....(ప్రాచీనావీతి)  దక్షిణాభిముఖో భూత్వా1) పితరం..(తండ్రి) గోత్రం....శర్మాణం..వసురూపం..స్వధానమస్తర్పయామి..3 మారులు

2) పితామహం..(తాత) గోత్రం... శర్మాణం.. రుద్రరూపం.. స్వధానమస్తర్పయామి

3 మారులు

3)ప్రపితామహం.(ముత్తాత) గోత్రం...శర్మాణం... ఆదిత్య రూపం..స్వధానమస్తర్పయామి 3మారులు

4) మాతరం (తల్లి) గోత్రాం...దాయీం..వసురూపాం స్వధానమస్తర్పయామి 3 మారులు

5) పితామహీం (నానమ్మ) గోత్రాం..దాయీం..రుద్రరూపాం స్వధానమస్తర్పయామి

3 మారులు

6) ప్రపితామహీం (నానమ్మ గారి అత్త) గోత్రాం.. దాయీం..ఆదిత్యరూపాం

స్వధానమస్తర్పయామి

3 మారులు

7) సాపత్నిమాతరం ( సవితి తల్లి) గోత్రాం....దాయీం...వసురూపాం స్వధానమస్తర్పయామి 3 మారులు

8)మాతామహం (తాత . అనగా తల్లి గారి తండ్రి)

గోత్రం..శర్మాణం..

వసురూపం.. స్వధానమస్తర్పయామి 3 మారులు

9) మాతుః పితామహం (తల్లి గారి తాత)

గోత్రం..శర్మాణం... రుద్రరూపంవసురూపం.. స్వధానమస్తర్పయామి 3 మారులు

10) మాతుఃప్రపితామహం

(తల్లి యొక్క తాతగారి తండ్రి)  గోత్రం...శర్మాణం.. ఆదిత్య రూపం వసురూపం.. స్వధానమస్తర్పయామి ...3 మారులు

11) మాతామహీం.(అమ్మ మ్మ) గోత్రాం..దాయీం. వసురూపాం స్వధానమస్తర్పయామి...3 మారులు

12) మాతుః పితామహీం.(తల్లి యొక్క నానమ్మ)

గోత్రాం.. దాయీం.. రుద్రరూపాం వసురూపం.. స్వధానమస్తర్పయామి ...3 మారులు

13)మాతుః ప్రపితామహీం (తల్లి యొక్క నానమ్మ గారి అత్త) గోత్రాం... దాయీం.. ఆదిత్య రూపాం..వసురూపం.. స్వధానమస్తర్పయామి.. 3 మారులు

14) ఆత్మ పత్నీం ( భార్య) గోత్రాం.. దాయీం.. వసురూపాం.. వసురూపం.. స్వధానమస్తర్పయామి.. 3 మారులు

15) సుతం (కుమారుడు)

గోత్రం..శర్మాణం.. వసురూపం  

వసురూపం.. స్వధానమస్తర్పయామి ....3 మారులు

16) జ్యేష్ఠ భ్రాతరం (స్వంత సోదరుడు) గోత్రం..శర్మాణం.. వసురూపం  

వసురూపం.. స్వధానమస్తర్పయామి ....3 మారులు

17) కనిష్ఠ భ్రాతరం ( స్వంత చిన్నసోదరుడు)

గోత్రం..శర్మాణం.. వసురూపం  

వసురూపం.. స్వధానమస్తర్పయామి ....3 మారులు

18)తత్పత్నీం (సోదరుని భార్య.. వదిన)గోత్రాం..దాయీం వసురూపాం  . స్వధానమస్తర్పయామి ....3 మారులు

19) పితృవ్యం (పెదనాన్న/చిన్నాన్న) గోత్రం..శర్మాణం..

వసురూపం.. స్వధానమస్తర్పయామి ....3 మారులు

20)తత్పత్నీం.. (పెద్దమ్మ/ చిన్న మ్మ లు) గోత్రాం..దాయీం

వసురూపాం.. స్వధానమస్తర్పయామి ....3 మారులు

21)తత్ పుత్రం (పెదనాన్న & చిన్నాన్న కుమారుడు.. గోత్రం... శర్మాణం..

వసురూపం.. స్వధానమస్తర్పయామి ....3 మారులు

22) తత్పత్నీం (పెదనాన్న చిన్నాన్న కుమారుని భార్య) గోత్రాం..దాయీం..

వసురూపాం.. స్వధానమస్తర్పయామి ....3 మారులు

23)మాతులం (మేనమామ.. తల్లి సోదరుడు) గోత్రం..శర్మాణం..

వసురూపం.. స్వధానమస్తర్పయామి ....3 మారులు

24) తత్పత్నీం (మేనమామ భార్య) గోత్రాం..దాయీం..

వసురూపాం.. స్వధానమస్తర్పయామి ....3 మారులు

25) దుహితరం (కూతురు) గోత్రాం..దాయీం.

వసురూపాం.. స్వధానమస్తర్పయామి ....3 మారులు

25) ఆత్మ భగినీం ( సోదరి. అక్క&చెల్లెలు) గోత్రాం.. దాయీం

వసురూపాం.. స్వధానమస్తర్పయామి ....3 మారులు

26)తద్భర్తారం (కూతురి భర్త & అల్లుడు) గోత్రం..శర్మాణం..

వసురూపం.. స్వధానమస్తర్పయామి ....3 మారులు

27)దౌహిత్రం (కూతురి కొడుకు & మనుమడు) గోత్రం..శర్మాణం..

వసురూపం.. స్వధానమస్తర్పయామి ....3 మారులు

28) తత్పత్నీం (కూతురు యొక్క కొడుకు భార్య) గోత్రాం..దాయీం.

వసురూపాం.. స్వధానమస్తర్పయామి ....3 మారులు

29)భాగినేయకం ( మేనల్లుడు) గోత్రం..శర్మాణం..

వసురూపం.. స్వధానమస్తర్పయామి ....3 మారులు

30) తత్పత్నీం (మేనల్లుడి భార్య) గోత్రాం.దాయీం..

వసురూపాం.. స్వధానమస్తర్పయామి ....3 మారులు

31) పితృ భగినీం ( మేనత్త & తండ్రి సోదరి) గోత్రాం..దాయీం..

వసురూపాం.. స్వధానమస్తర్పయామి ....3 మారులు

32) తద్భర్తారం (మేనత్త భర్త) గోత్రం..శర్మాణం..

వసురూపం.. స్వధానమస్తర్పయామి ....3 మారులు

33)మాతృ భగినీం ( తల్లి సోదరి . చిన్న మ్మ. పెద్దమ్మ)  గోత్రాం..దాయీం..

వసురూపాం.. స్వధానమస్తర్పయామి ....3 మారులు

34) తద్భర్తారం ( తల్లి సోదరి యొక్క భర్త) గోత్రం..శర్మాణం..

వసురూపం.. స్వధానమస్తర్పయామి ....3 మారులు

35) జామాతరం ( అల్లుడు కూతురి భర్త) గోత్రం..శర్మాణం..

వసురూపం.. స్వధానమస్తర్పయామి ....3 మారులు

36)స్నుషాం ( కోడలు)  గోత్రాం.దాయీం..

వసురూపాం. స్వధానమస్తర్పయామి ....3 మారులు

37)శ్వశురం ( పిల్లనిచ్చిన మామ)

 గోత్రం..శర్మాణం..

వసురూపం.. స్వధానమస్తర్పయామి ....3 మారులు

38)శ్వశ్రూం ( పిల్లనిచ్చిన మామ భార్య.. అత్త) గోత్రాం..దాయీం..

వసురూపాం స్వధానమస్తర్పయామి ....3 మారులు

39)శ్యాలకం (బావమరిది) గోత్రం..శర్మాణం..

వసురూపం.. స్వధానమస్తర్పయామి ....3 మారులు

40) తత్పత్నీం (బావమరిది భార్య) గోత్రాం..దాయీం.

వసురూపాం స్వధానమస్తర్పయామి ....3 మారులు

41) ఆత్మ పత్నీం (భార్య)

 గోత్రాం...దాయీం

వసురూపాం.. స్వధానమస్తర్పయామి ....3 మారులు

42)గురుం ..  గోత్రం..శర్మాణం..

వసురూపం.. స్వధానమస్తర్పయామి ....3 మారులు

43)రిక్థినం ..

 గోత్రం..శర్మాణం..

వసురూపం.. స్వధానమస్తర్పయామి ....3 మారులు

........

1)యే బాంధవాః యే బాంధవాః . యేయే అన్య జన్మని  బాంధవాః|

తే సర్వే తృప్తి మాయాన్తు మయా దత్తేన. వారిణా||

2)ఆ బ్రాహ్మ స్తంబ పర్యన్తం దేవర్షి పితృ మానవాః|

తృప్యంతు పితర స్సర్వే‌ మాతృ  మతామహాదయః||

3)అతీత కుల కోటీనాం  సప్త ద్వీప నివాసినాం|

ఆ బ్రహ్మ భువనాల్లోకా దిదమస్తు తిలోదకం||

(యజ్ణోపవీత నిష్పీడనం)

యే కే చాస్మత్కులే జాతాః

అ పుత్రా గోత్రిణో మృతాః|

తేగృహ్ణంతు మయా దత్తం

సూత్ర నిష్పీడనోదకం|| (సవ్యం)

శ్రీ రామ రామ రామ రామ

మంగళసూత్రం

 *మంగళసూత్రం*...

దౌర్భాగ్య పరిస్థితి ఏమిటంటే మన హిందూ సోదరీమణుల నవీనత పరాకాష్టకి వెళ్లి మంగళసూత్రాన్ని త్యజించడం / లేదా పక్కనపెట్టడం పరిపాటిగా మారింది. అంతేకాక ఈ  సినిమాలు టీవీల పుణ్యమా అని అది ఒక ఆట వస్తువుగా మారిపోయింది. 

మన ఖర్మ కొద్దీ మన బంధు మిత్ర గణాల నుండి వచ్చే వాట్సాప్ లు ఫేస్బుక్ లలో వచ్చే ఫోటోలు కూడా,  ఎక్కువ శాతం మంగళసూత్రాలు, బొట్టు, గాజులు లేకుండా ఉన్నవే. 

ఇది చాలా అరిష్టం.

*క్షీరసాగరమధన సందర్భంలో మాంగళ్యవివరణ*

“మ్రింగెడివాడు విభుండని మ్రింగెడిదియు గరళమనియు మేలని ప్రజకున్ మ్రింగుమనే సర్వమంగళ మంగళసూత్రంబు నెంత మదినమ్మినదో !

పరమశివుడు భయంకరమైన హాలాహలాన్ని త్రాగికూడా చిరంజీవిగా ఉన్నడంటే అది ఆయన గొప్ప కాదట. అమ్మ పార్వతీ దేవి కంఠాన ఉన్న మాంగల్యాభరణం గొప్పదనమట.

*“మాంగల్యం తంతునానేనా*

*మమజీవన హేతునా !*

*కంఠే భద్నామి సుభగే*

*త్వం జీవ శరదాంశతం”*

ఓ సుభగా ! నా జీవనానికి ఆధారమైన ఈ మంగళ సూత్రాన్ని నీ కంఠానికి కడుతున్నాను. నువ్వు దీనిని ధరించి నా జీవితాన్ని నిలుపుతావు. అటువంటి నువ్వు నూరేళ్ళు జీవించు. అంటే పుణ్యస్త్రీగా, ముత్తయిదువుగా సకల సౌభాగ్యాలతో జీవించు అని స్పష్టముగా తెలుస్తున్నది.

పూర్వం భారతదేశం మాతృస్వామ్య వ్యవస్థతో విరాజిల్లినపుడు ఎటువంటి ఆచారాలు, కట్టుబాట్లు ఉండేవి కాదు. బలవంతుడిదే రాజ్యం అన్న రోజులవి. భారతావనిలో పిండారీలు, థగ్గులు వంటి కిరాత జాతులవారు వలస వచ్చారు. ఒక తెగకు చెందిన స్త్రీలను మరొక తెగకు చెందిన పురుషులు ఎత్తుకొనిపోయేవారు. 

మహిళ మెడలో మంగళసూత్రం కనిపిస్తే చాలు ఏ హాని చేయకుండా విడిచిపెట్టేవారు. కిరాతకులు కూడా ఈ మంగళ సూత్రాన్ని గౌరవించారు. అలా కోట్లాది మగువల మాన ప్రాణాలను కాపాడిందీ మంగళసూత్రం. అందుకే అప్పటి నుండీ ఆడపిల్ల పుడితే బాల్యంలోనే పెళ్ళి చేసి మాంగల్యం వేసేవారు.

ఆదిశంకరాచార్యుల వారు వ్రాసిన సౌందర్యలహరి పుస్తకములో కూడా మంగళ సూత్రానికి విశేష విశిష్టత కల్పించారు.

మంగళసూత్రంలో ముత్యం, పగడం ధరింపజేసే సాంప్రదాయం మనది. ఎందుకంటే ముత్యం చంద్ర గ్రహానికి ప్రతీక. చంద్రుడు దేహ సౌఖ్యం, సౌందర్యం, మనస్సు, శాంతి, ఆనందములకు, అన్యోన్య దాంపత్యములకు కారకుడు. శారీరకంగా నేత్రములు, క్రొవ్వు, గ్రంథులు, సిరలు, ధమనులు, స్తనములు, స్త్రీల గుహ్యావయములు, నరములు, ఇంద్రియములు, గర్భధారణ, ప్రసవములకు కారకుడు.

పగడం కుజ గ్రహనికి ప్రతీక. కుజ గ్రహ దోషాల వలన అతి కోపం, కలహాలు, మూర్ఖత్వం, సామర్ధ్యము, రోగము, ఋణపీడలు, అగ్ని, పరదూషణ, విద్యుత్భయములు,  కామవాంఛలు, దీర్ఘసౌమాంగల్యము, దృష్టి దోషము యిత్యాదులు మరియు శారీరకంగా ఉదరము, రక్తస్రావము, గర్భస్రావము, ఋతుదోషములు మొదలగునవి.

ఖగోళంలో ముఖ్యమైన నక్షత్రాలు 27.

ఆ 27 నక్షత్రాలలో చంద్రుడు 27 రోజులు సంచారం గావించి 28వ రోజున కుజునితో కలిసే రోజే స్త్రీకి ఋతుసమయం. అంటే అర్ధం, ఆరోగ్యమైన స్త్రీకి 28 రోజులకు ఋతుదర్శనమవాలి. 

భారతీయ సాంప్రదాయ స్త్రీలకు మంగళసూత్రములో ముత్యం మించిన విలువైనది లేనేలేదు. దానికి తోడు జాతి పగడం ధరించడం మన మహర్షులు చెప్పటంలో విశేష గూడార్ధమున్నది. అదేమిటంటే ముత్యం, పగడం ధరించిన పాతతరం స్త్రీలలో ఆపరేషన్ అనేది చాలా అరుదైన విషయం. కాని నేటితరం స్త్రీలలో కానుపు ఆపరేషన్తోనే జరగటం సర్వసాధారణమైపోయింది.

ముత్యం, పగడం సూర్యుని నుండి వచ్చే కిరణాలలో ఉండే ఎరుపు (కుజుడు), తెలుపు (చంద్రుడు) స్వీకరించి స్త్రీ భాగంలోని అన్ని నాడీకేంద్రములను ఉత్తేజపరచి శారీరకంగా, భౌతికంగా ఆ జంట గ్రహాలు స్త్రీలలో వచ్చే నష్టాలను, దోషాలను తొలగిస్తాయనటంలో ఎటువంటి సందేహం వలదు.

కనుక చంద్ర కుజుల కలయిక ప్రతి స్త్రీ జీవితంలో ఎంత ప్రాముఖ్యం వహిస్తాయో అలాగే ముత్యం, పగడం రెండూ కూడా కలిపిన మంగళసూత్రం స్త్రీకి అత్యంత శుభఫలితాలు సమకూర్చగలవు.

పాశ్చాత్య అనుకరణ వెర్రిలో ఊగుతున్న మన ఆడకూతుర్లను మందలించైనా తిరిగి మన ధర్మం వైపు తీసుకుని వద్దాం. దీని విశిష్టతని అర్ధం అయ్యే వరకు తెలియపరుద్దాం. 

🌷*లోకాసమస్తాః సుఖినోభవంతు*🌷

🙏శుభరాత్రి .🙏

From WhatsApp.

Laxmi

గుర్రం జాషువా గారి పుట్టిన రోజు.!!

 *ఈరోజు గుర్రం జాషువా గారి పుట్టిన రోజు.!!

జాషువా గారు ఓ వ్యక్తి కాదు..ఓ  ఆలోచనా

స్రవంతి. జాషువా గారిని  ఓ పక్క.. అంటరాని

వాడంటారు.మరోపక్క ఆయన   అక్షరాలను 

మాత్రం  అక్కున చేర్చుకుంటారు...!!

అంటరానిది అక్షరమైతే...?

అది రాసినవాడెలా అంటరానివాడవు

తాడు?

అంటరాని అక్షర వసంతముంటుందా?

"కులము చెప్పమనుచు కొంటెవారలడుగ

పేరులోనె కలదు పేర్మికులమ-

టంచు చెప్పినట్టి హాస్యకవియతండు

జా షువాకులేవు భేషజాలు".!!

             *గుడిసేవ విష్ణు ప్రసాద్..!!

ఈ చిన్న లాజిక్ ను అర్థం చేసుకోలేక జాషువా 

గారిని చిన్నచూపు చూసిన వారుఇప్పటికైనా

కళ్ళు తెరుస్తారా?  ఈ మహాకవిని అక్కున 

చేర్చుకుంటారా?

*కులమతాలు గీసుకున్న గీతలు జొచ్చి

 పంజరాన గట్టు పడను నేను

 నిఖిల లోక మెట్లు నిర్ణయించిన నాకు

 తిరుగు లేదు విశ్వ నరుడ నేను."!!

*జాషువాగారికి పుట్టినరోజు శుభాకాంక్షలు!!

*ఎ.రజాహుస్సేన్..!!

స్మరించిన మాత్రమునే

 🚩🔯🌸🌄⚛🌅🌸🔯🚩

🌸🌼ಬೆಳಗಿನ 🌅 ಸೂಳ್ನುಡಿ🌼🌸 

*ವಿಷಸ್ಯ ವಿಷಯಾಣಾಂ ಚ*

*ದೂರಮತ್ಯಂತಮಂತರಮ್ |*

*ಉಪಭುಕ್ತಂ ವಿಷಂ ಹಂತಿ*

*ವಿಷಯಾಃ ಸ್ಮರಣಾದಪಿ ||*

(ಸುಭಾಷಿತಾವಲಿ)

ವಿಷಕ್ಕೂ ವಿಷಯಕ್ಕೂ ಬಹಳ ಅಂತರವಿದೆ. ವಿಷ ಸೇವಿಸಿದಾಗ ಕೊಲ್ಲುತ್ತದೆ. ವಿಷಯಸುಖಗಳು ನೆನಸಿಕೊಂಡ ಮಾತ್ರಕ್ಕೇ ಕೊಲ್ಲುತ್ತವೆ.

విషానికి విషయములకి చాలా అంతరముంది. విషాన్ని సేవించి నప్పుడే కీడు చేస్తుంది. విషయ సుఖములు స్మరించిన మాత్రమునే కీడు చేస్తాయి.

*🌷🌺🙏 ಶುಭದಿನವಾಗಲಿ! 🙏🌺🌷*

నవగ్రహా పురాణం🪐* . *39వ అధ్యాయం*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

.        *🪐నవగ్రహా పురాణం🪐*  

.               *39వ అధ్యాయం*

*పురాణ పఠనం ప్రారంభం*

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐

*బుధగ్రహ జననం - 2*

చల్లటి గాలి ఒక్కసారిగా తార ముంగురుల్ని పలకరించింది. ఒక్కసారిగా ఆమె పైటను లాగి , దానితో ఆడుకుంటూ ఉండిపోయింది.

తార చేతులు కదలలేదు. వక్షభాగం మీంచి జారిపోయి , పతాకంలా ఎగురుతున్న పైటని పట్టుకుని , ఆమె కప్పుకో లేదు ! పైట అలా వదిలేసి , తార నెమ్మదిగా అడుగులు వేస్తోంది. కొంగు లాగుతూ కవ్వించే ప్రణయ నాయకుడిలా గాలి ఆమె పైటను విచ్చలవిడిగా ఊపుతోంది. దుస్తుల్ని ఆమె శరీరానికి రెండవ చర్మంలా తాపడం చేస్తోంది.

తోటలో నడయాడుతున్న తారలో ఏవో ఆలోచనలు నిశాకుసుమాలలాగా వికసిస్తున్నాయి. ఏవేవో వాంఛా సుగంధాల్ని వెదజల్లుతున్నాయి. ఎందుకో నిద్ర రావడం లేదంది భర్తతో ఆమె.

అయితే తనకు ఎందుకు నిద్ర పట్టడం లేదో తారకు తెలుసు ! నూతన శిష్యుడిగా వచ్చిన ఆ అందాల చంద్రుడు - అతనికీ , తనకు తెలియకుండానే తనకు దగ్గరవుతూ , నిద్రను దూరం చేస్తున్నాడు.

*"నీకు కోరిన పురుషుడు భర్తగా లభిస్తాడు !"* అంటూ వరమిచ్చినాడు బ్రహ్మ. ఆ పురుషుడు బృహస్పతే అని కూడా చెప్పాడు. కానీ , తనకు భర్తగా రావాలని కోరుకున్న పురుషుడు బృహస్పతి కాదనీ , చంద్రుడనీ అనిపిస్తోంది తారకు. బ్రహ్మ అనుశాసనాన్ని నమ్మి బృహస్పతి కోసం అన్వేషిస్తూ తిరిగి తను తప్పు చేసిందా ?

ఆలోచిస్తూ అడుగులు వేస్తున్న తార తటాలున ఆగింది. ఎవరో వెనక నుంచి తన పైటను పట్టి లాగుతున్నారు ! ఒక వేళ... అతనా ? తార తలతిప్పి , ఆశగా , సిగ్గుగా చూసింది. ఆమె పైటను రెమ్మ చేతుల్తో పట్టుకున్న పూలమొక్క గాలికి కదుల్తోంది. ఆమెను రమ్మని సైగ చేస్తున్నట్లు. తార విసుగ్గా పైటను లాగి , అయిష్టంగా యధాస్థానంలో వేసుకుంది.

తనలో అర్థం లేకుండా పుట్టుకొస్తూ , కల్లోల పరుస్తున్న ఆలోచనల దాడిని తప్పించుకునే ప్రయత్నంలో తార చకచకా అడుగులు వేసి , మలుపు తిరిగి అప్రయత్నంగా ఆగింది.

ఎదురుగా విద్యార్థుల విడిది , పర్ణశాలలు కనిపిస్తున్నాయి. ఆ పర్ణశాలల్లో ఎక్కడో నిద్రపోతూ ఉంటాడు చంద్రుడు ! తార అప్రయత్నంగా నిట్టూర్చి , వెనుదిరిగి ఆశ్రమం వైపు అడుగులు వేయసాగింది.

తన చుట్టూ వ్యాపిస్తూ , తన మీద దండయాత్ర సాగిస్తున్న పిల్లగాలుల్నీ , మత్తెక్కిస్తున్న పూల వాసనల్నీ తట్టుకుని , భరించే శక్తి లేని తార ఆశ్రమంలోకి వెళ్లి తలుపు మూసింది. శయనాగారం వైపు మెల్లగా అడుగులు వేసింది. లోపల్నుంచి బృహస్పతి గురక ఆమెని రమ్మని పిలుస్తోంది.

విద్యార్థులందరూ రెండు వరుసలుగా భోజనాలకు కూర్చున్నారు. ఎదురెదురుగా ఉన్న విద్యార్థుల వరుసలకు అభిముఖంగా బృహస్పతి కూర్చున్నాడు. అందరి ముందూ అరిటాకులు ఉన్నాయి. బృహస్పతి విద్యార్థుల్ని పరిశీలనగా చూస్తున్నాడు. తార వడ్డన ప్రారంభించబోతూ , బృహస్పతి వద్దకు వచ్చింది.

*"సనాతనా ! చంద్రుడేడీ ?"* బృహస్పతి ఒక విద్యార్థిని అడిగాడు.

*"ఇంకా రాలేదు గురువుగారూ..."* సనాతనుడు అన్నాడు.

*"ఎవరూ ? చంద్రుడా ?"* అందరి ముందూ ఉన్న పాత్రల్లో నీళ్ళు పోస్తున్న తార అంది. *“ఇందాకా , నీళ్ళు వొలికి పోయాయి. నదికి వెళ్ళి నీళ్ళు తీసుకురమ్మన్నాను..."* 

*"భోజన సమయం కదా..."* బృహస్పతి విద్యార్థుల పాత్రల్లో నీళ్ళు పోస్తూ ఆ చివరికి వెళుతున్న తారతో అన్నాడు.

*"భోజనం చేసి వెళ్ళమన్నాను స్వామీ ! అయితే , నీళ్ళు తెచ్చాక , నెమ్మదిగా భోజనం చేస్తానన్నాడు ! మీరు కానివ్వండి ! వచ్చాక. చంద్రుడూ , నేనూ భోజనం చేస్తాం !"* అంది. తార...

భోజనశాల గుమ్మంలో ఆగి , చంద్రుడు తటపటాయిస్తూ చూశాడు. ఎదురెదురుగా , దగ్గరగా రెండు విస్తర్లు వేసి ఉన్నాయి. ఒక విస్తరిలో పదార్థాలున్నాయి. *"రా ! చంద్రా ! ఆ విస్తరి నీదే ! నీ కోసమే వడ్డించి ఉంచాను !"*

గురుపత్ని కంఠం వినిపించి , చంద్రుడు తల తిప్పి చూశాడు. ఒక చేత్తో పాత్రా , మరో చేత్తో గరిటా పట్టుకుని వస్తోంది తార. విస్తర్ల దగ్గర ఆగి , తార తలతిప్పి చూసింది. చంద్రుడు గుమ్మం వద్దే ఉన్నాడు.

తార నవ్వు అతని చెవుల్ని తాకింది. *“ఏమిటి అలా చూస్తున్నావ్ ? నన్నా ! విస్తరినా !”*

*"మీరు... మీరు...మొదట..."* చంద్రుడు విస్తర్ల వైపు చూస్తూ అన్నాడు. *“మనిద్దరం కలిసి భోజనం చేస్తున్నట్టు మీ గురువుగారికి చెప్పాను. రా ! చంద్రా !”* తార కంఠంలో ఆజ్ఞ ధ్వనించింది.

చంద్రుడు విస్తర్ల వద్దకు అడుగులు వేశాడు. తార అతని వైపు చిరునవ్వుతో చూసింది. 

*"ఏమిటి చంద్రా , అడుగులో అడుగు వేస్తూ నడుస్తున్నావు ? అకలిగా లేదా ? నేనెంత ఆకలిగా ఉన్నానో తెలుసా ?"* తార నవ్వుతూ అడిగింది. *"కూర్చో”* చంద్రుడు కూర్చున్నాడు. తార అతని వైపే చూస్తోంది. *"ఒక్కక్షణం ! నేను కూడా వడ్డించుకుంటానేం ?"* అంటూ విస్తరి వైపు వంగింది.

ఎవరో లాగినట్లు ఆమె పైట భుజం మీంచి జారి ఆమె విస్తర్లో పడింది.

చంద్రుడు అప్రయత్నంగా తల ఎత్తి చూశాడు.

*"అరెరె... చూశావా... పైట ఎలా జారిపోయిందో. కొంచెం తీసి భుజం మీద వేయ్ చంద్రా !"* రెండు చేతుల్లోనూ ఉన్న పాత్రల్ని చూపుతూ అంది తార చిరునవ్వుతో.

*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐

సౌందర్యలహరి🌹* *శ్లోకం - 39*

 🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹

.          *🌹సౌందర్యలహరి🌹*

*శ్లోకం - 39*

🌷🪷🌷🪷🌷🪷🌷🪷🌷🪷

*తవ స్వాధిష్ఠానే హుతవహమధిష్ఠాయ నిరతం*

 *తమీడే సంవర్తం జనని మహతీం తాం చ సమయామ్ |*

 *యదాలోకే లోకాన్ దహతి మహసి క్రోధకలితే*

 *దయార్ద్రా యా దృష్టి శ్శిశిరముపచారం రచయతి ‖*

ఆజ్ఞా, విశుద్ధ, అనాహత చక్రములలో శివ శక్తుల స్వరూపం వివరించాక

 ఇప్పుడు స్వాధిష్ఠాన చక్రం వద్దకు వస్తున్నారు. నిజానికి షట్చక్రముల వరుసలో స్వాధిష్ఠానము కన్నా ముందు మణిపూర చక్రం గురించి చెప్పాలి. అయితే ప్రకృతి తత్త్వాల క్రమంలో "ఆకాశాత్ వాయుః  వాయోరగ్నిః అగ్నోరాపః   ఆపః పృధివీ" అన్నారు కాబట్టి జలతత్త్వమైన మణిపూర చక్రం కంటే ముందు అగ్నితత్త్వ స్థానమైన స్వాధిష్టాన చక్రములో వారు ఎలా కనబడతారో చెప్తున్నారు. 

ఇక్కడ ఒక ముఖ్య గమనిక ఏమంటే ఆది శంకరులు స్వాధిష్ఠాన చక్రము అగ్ని తత్త్వమనీ, మణిపూర చక్రము జలతత్త్వమనీ అభిప్రాయపడ్డారు. మహాయోగులు శ్రీ కాంచీ పరమాచార్య స్వామివారు కూడా ఈ భావనను సమర్ధించారు. అయితే, కొందరు యోగుల అభ్యాసము, అనుభవములో, స్వాధిష్ఠానము జలతత్త్వమనీ, మణిపూరము అగ్నితత్త్వమనీ భావించారు. అందుకు అనుగుణంగానే, అర్థనారీశ్వర స్వరూపంలో కుడివైపున సంవర్తరేశ్వరునీ, వామభాగాన సమయాంబనూ వారు దర్శించారు.

ఇక్కడ శివుడు సంవర్తుడు (తీవ్రమైన అగ్ని సంవర్తః ప్రళయః కల్పః క్షయః కల్పాన్తః ఇత్యతి అని 'అమరకోశం') గాను,అమ్మవారు సమయ అనీ పిలువబడతారు. శివుడు లోకాలన్నీ దహిస్తే, అమ్మవారు చల్లబరుస్తూ ఉంటుంది. చూడండి పగలు అంతా వేడిగా ఉంటే, రాత్రి చల్లబడుతుంది. పగలు, రాత్రి కలిస్తేనే రోజు. పగలు రుద్రుడు, రాత్రి అమ్మ. శివపార్వతులు కలిస్తేనే ప్రపంచం. ప్రపంచానికి వేడి, చల్లదనం, రెండూ కావాలి. లేకపోతే భూమిపై ఒక్క జీవీ మనలేదు. స్వామి అగ్నినేత్రంతో మన్మధుడిని కాల్చివేస్తే ప్రపంచ నిర్వహణ కోసం అమ్మవారు కరుణతో తిరిగి బ్రతికించింది కదా! అలాగే ప్రళయ కాలంలో రుద్రుడు అన్నిటినీ దహించివేస్తే, అమ్మవారు ఆయా చరాచర వస్తువుల బీజములను దాచివుంచి, చల్లబరిచి పునః సృష్టి చేస్తుందట. అది ఆమె కారుణ్యం.

*హర నేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవనౌషధి* *స్వాధిష్ఠానాంబు జగతా* అనే అమ్మవారి నామాలను స్మరించుదాము.

ఇక్కడ చదువరులకోసం ఈ చక్రాల భౌతిక స్థానములు, వాటి గుణములు ప్రస్తావిస్తాను.

*ఆజ్ఞా* 

నుదుటి పై, కనుబొమల మధ్య(మనో తత్త్వం) మనసును నియంత్రించేది.

*విశుద్ధి*

మెడ వెనుక ఊపిరితిత్తులకు ప్రాణవాయువును, అన్నవాహిక ద్వారా ఆహారమును, ద్రవములను, ఉదరములోకి పంపే నాడులను నియంత్రించేది. (ఆకాశ తత్త్వం)

అనాహత 

హృదయ మధ్యంలో, గుండె, ఊపిరితిత్తుల పని తీరును సమన్వయించేది. (వాయు తత్త్వం)

*మణిపూర*

నాభి వెనుక (జల తత్త్వం) ఉదర భాగములను, మూత్రపిండముల క్రియను నిర్వహించేది.

*స్వాధిష్ఠాన*

 పొత్తికడుపులో, పునరోత్పత్తికి, జననేంద్రియములకు సంబంధించిన నాడులను నియంత్రించి ఉత్తేజపరచేది. (అగ్ని తత్త్వం)

*మూలాధార*

 వెన్నెముక అడుగున. అడ్రినల్ గ్రంథి, మూత్రపిండములు, కండరములు, ఎముకలు, రక్తప్రసరణను నియంత్రించేది. (పృధివీ-భూ తత్త్వం).

రామకృష్ణ పరమహంస ఈ చక్రములను మూలాధారం నుండి సహస్రార కమలం వరకు వరుసగా భూః  భువః  సువః  మహః  జనః  తపః  సత్య లోకాలుగా వర్ణించారు.

           🙏🏻 *శ్రీమాత్రే నమః*🙏🏻

*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

*🚩శ్రీ వివేకానందస్వామి🚩* . *🚩జీవిత గాథ🚩* *భాగం 51*

 🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

.    *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*

.   *ఓం నమో భగవతే రామకృష్ణాయ*

.       *🚩శ్రీ వివేకానందస్వామి🚩*

.                *🚩జీవిత గాథ🚩*   

*భాగం 51*

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

ఎన్ని గ్రంథాలు చదవమన్నా నరేంద్రుడు అద్వైతతత్వాన్ని అంగీకరించడని గ్రహించిన శ్రీరామకృష్ణులు ఆ  అనుభవాన్ని అతడికి అందించగోరారు.భావపారవశ్య స్థితిలో  ఆప్యాయంగా  నరేంద్రుణ్ణి స్పృశించి, సమాధిమగ్నులయ్యారు.

దీనిని గురించి నరేంద్రుడు తరువాత ఇలా చెప్పాడు.... 

"ఆ రోజు గురుదేవులు నన్ను స్పృశించిన క్షణంలో నా మనస్సులో ఒక విప్లవమే చెలరేగింది. ఈ లోకంలో చైతన్యం తప్ప మరేదీ లేదని నాకు అవగతమయింది. ఎంతసేపు ఈ స్థితి కొనసాగుతుందోనని ప్రశాంతంగా గమనించసాగాను. ఆ రోజంతా ఆ  అనుభూతి నా నుంచి తొలగిపోలేదు. ఇంటికి తిరిగివచ్చాను. అక్కడా అదే అనుభూతి! చూస్తున్న చోటంతా చైతన్యమే సంపూర్ణంగా నిండివుంది. 

భోజనానికి కూర్చున్నాను. అన్నం, కంచం, వడ్డించే వ్యక్తి. అన్నం తింటున్న నేను, అంతా అదే తప్ప మరేదీ కాదు! ఒకటి రెండు ముద్దలు తిని స్తంభించిపోయి కూర్చుండి పోయాను; 'ఎందుకిలా ఉన్నావు? తిను' అని అమ్మ చెప్పిన తరువాతే మళ్లీ తినసాగాను. ఈ విధంగా తింటున్నప్పుడు, విశ్రాంతి సమయంలో, కళాశాలకు పోతున్నప్పుడు సదా సర్వవేళల్లో అదే దృశ్యం! వర్ణనాతీతమైన ఏదో ఒక పారవశ్యం నన్ను ఆవరించింది. వీధిలో వెళుతున్నాను. బళ్లు వస్తున్నాయి. కాని వాటిని తప్పుకొని నడవాలి అనిపించలేదు;

ఆ బండి ఏదో, నేనూ అదే అనిపించింది. నా కాళ్లూచేతులూ మొద్దుబారిపోయాయి. అన్నం కించిత్తు కూడా రుచించ లేదు. ఎవరో తింటున్నట్లు అనిపించింది. కొన్ని సమయాలలో అన్నం తింటున్నప్పుడే నేలమీదికి ఒరిగిపోయేవాణ్ణి. లేచి కూర్చుని మళ్లీ తినేవాణ్ణి. కొన్ని సమయాలలో అతిగా తినేవాణ్ణి. అలా తినడం వలన నా కెలాంటి కీడు వాటిల్లక పోయినా అమ్మ భయపడిపోయింది. 'నీ కేదో భయంకరమైన వ్యాధి దాపురించి నట్లుంది' అనేది. 'ఇక ఇతడు బ్రతకడు' అని కూడా కొన్ని సమయాల్లో అనేది.

"ఆ అనుభూతి కాస్త ఉపశమించినప్పుడు లోకం ఒక కలలా తోచింది. హేతువా చెరువు తీరాన నడిచిపోతూ ఆ చెరువు నాలుగు వైపులా ఏర్పాటుచేసిన ఇనుప కంచె నిజమా లేక కలా అని తెలుసుకోగోరి వాటిపై తలను ఢీకొట్టి చూశాను! కాళ్లూచేతుల్లో ఎలాంటి స్పందనా లేదు; పక్షవాతం వచ్చినట్లు అనిపించింది. ఇలా కొన్ని రోజులపాటు ఆ అనుభూతి ప్రభావం నుండి విడివడలేక పోయాను. సహజ స్థితిని చేరుకున్నప్పుడు ఇదే అద్వైతానుభూతి అని గ్రహించ గలిగాను. అలా అయితే శాస్త్ర వచనాలు అసత్యాలు కావనే నమ్మకం కలిగింది. ఆ తరువాత అద్వైత తత్త్వ తీర్మానాలను నేను సందేహించలేకపోయాను.”

ఈ విధంగా ఆప్యాయతానురాగాలతో, పరీక్షలతో, ఉన్నత అనుభూతులతో ఆ అద్భుత గురువూ, అనుంగు శిష్యుడూ తమ జీవితాలను గడపసాగారు.🙏

*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

👉 *రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

పరివారంలో కుటుంబ సభ్యులు ఎవరు?

 బత్తాయి లు అని పిలవబడే నాలాంటి మీలాంటి  కార్యకర్తలు పూర్తిగా చదవవలసిన పోస్ట్..

**************************************

ఏదైనా టాపిక్ మాట్లాడండి వెంటనే మన సెక్యూలర్ మేధావులు సంఘ్ పరివార్ ని అంటే సంఘ్ కుటుంబాన్ని విమర్శిస్తారు. అసలు ఈ పరివారం అంటే దేశంలో మిగతా పరివారాలు వంటిదేనా ?

ఈ పరివారంలో కుటుంబ సభ్యులు ఎవరు?

ఇన్ని కోట్ల మందిని ఇన్ని దశాబ్దాలుగా కలిపి ఉంచుతున్న బంధం ఏమిటి? 

అబ్బో ...

ఈ సంఘ కుటుంబంలో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న వారు చాలా మంది సభ్యులు వున్నారు. క్లుప్తంగా కొన్నే చెప్ప దలచుకుంటే...

రాష్తీయ స్వయం సేవక్ సంఘ్(మాతృ సంస్థ)

ఆర్.యస్.యస్., మరియు దీని అనుభంధ సంస్థలన్నింటినీ కలిపి సంఘ్ పరివార్ అని పిలుస్తారు. భారతీయ మజ్దూర్ సంఘ్, భారతీయ కిసాన్ సంఘ్, అఖిల భారతీయ విద్యార్ధి పరిషత్, వనవాసి కళ్యాణ ఆశ్రమం, స్వదేశీ జాగరణ మంచ్,ప్రజ్ఞా ప్రవాహ్, ఇతిహాస సంకలన సమితి, విద్యా భారతి, సంస్కార భారతి, సంస్కృత భారతి, అధివక్తా పరిషత్, పూర్వ సైనిక పరిషత్, విశ్వ హిందూ పరిషత్ వీటిలో ముఖ్యమైనవి. భారతీయ జనతా పార్టీ నేరుగా కాకపోయినా కొన్ని ఆ సిద్ధాంతాల ఆధారంగా పనిచేస్తుంది.  ఆర్.యస్.యస్. తోపాటు ఈ సంస్థలన్నింటికి చాలా పెద్ద సంఖ్యలో సభ్యులున్నారు.

సరే ఒక కుటుంబం ఉంది అంటే ఆ కుటుంబ సభ్యుల మధ్య ఉండే బంధుత్వాలు లేదా బంధాలు వల్ల వారందరూ ఒక కుటుంబంగా పిలువబడతారు.

మరి ఇన్ని కోట్ల RSS సభ్యులను కలిపి ఉంచుతున్న అంత బలమైన బంధుత్వం కానీ బంధం కానీ ఏమిటి?

" దేశభక్తి "

అవును. దేశభక్తి అనే స్ఫూర్తే వీరందరినీ కలిపి ఉంచుతోంది. నా దేశం ప్రపంచంలో అగ్రగామిగా నిలబడాలి. నా దేశ సంస్కృతిని, పురాణ పురుషులను, మహనీయులను ప్రపంచం అంతా గుర్తించాలి. ఎప్పటికి అయినా నా భారత్ "విశ్వ గురువు" కావాలి అనే బలమైన కాంక్ష వీరందరినీ ఎంత కష్ట సాధ్యమైన పనికి అయినా పురికొల్పుతుంది.

మరి ఈ సంఘ పరివార్ అంటే కొందరు మేధావులకు ఎందుకు కోపం?

ఎందుకంటే భారత్ అధికారం ఈ పరివార్ వాళ్ళ చేతుల్లోకి వెళితే ఇన్నాళ్లూ మేం భజన చేస్తూ రక్షిస్తూ వచ్చిన కుటుంబ కుల పార్టీల అస్తిత్వానికి ముప్పు వస్తుంది అని భయం.

స్వాతంత్రం వచ్చాక సెక్యూలరిజం పేరుతో కుల కుటుంబ పార్టీలు కాక వేటిని ప్రోత్సహించారు ఈ మేధావులు?

ఆర్ ఎస్ ఎస్ మీద ద్వేషంతో ఇప్పటికి ఈ మేధావులు భుజాన్న మోసే పరివారాలు చూడండి. నిజంగా నిజాయితీగా చెప్పండి ఈ పార్టీలకు ముందు ప్రాధాన్యత దేనికి ఉంటుంది? వారి కుటుంబ అభివృద్ధా? లేదా  దేశ అభివృద్ధా ?

నెహ్రు పరివారం

పవార్ పరివారం

థాక్రే పరివారం

కరుణానిధి పరివారం

దేవెగౌడ పరివారం

కేసీఆర్ పరివారం

బాబు పరివారం

వైస్సార్ పరివారం

పట్నాయక్ పరివారం

ములాయం పరివారం

మాయావతి పరివారం

లాలూ పరివారం

మమతా పరివారం

అబ్దుల్లా పరివారం

ముఫ్తి పరివారం

సోరేన్ పరివారం

ఏ రంగంలో అయినా కుటుంబ సభ్యులను ప్రోత్సహించడం అనేది ఉంటుంది.

అందుకే అన్ని రాజకీయ నాయకులు తమ కుటుంబ సభ్యులను రాజకీయాలలోకి రావడానికి ప్రోత్సహిస్తారు. అది తప్పు కాదు. ప్రజాస్వామ్య బద్దంగా పార్టీలు నడిస్తే అక్కడ టాలెంట్ ఉంటే ఎదుగుతారు లేదా మరుగున  పడిపోతారు.  కానీ మనం పైన చెప్పుకున్న పరివారాలు అన్ని ఆ రాజకీయ పార్టీలను ఒక కుటుంబ ఆస్తిగా భావించి ఆ సభ్యులే పార్టీ అధ్యక్షులు లేదా ముఖ్యమంత్రి అవుతారు.

ఈ పరివారాలు అన్నిటికి అధికారం తమ కుటుంబ సభ్యుల చేతిలోనే తరతరాలుగా ఉండాలి అని ప్రగాఢమైన కోరిక. దానికోసం అంటే  తమ కుటుంబ సభ్యుల ఎదుగుదల కోసం వారి పార్టీలలోనే మంచి అర్హత కలిగి దేశానికి వారి సేవలు భవిష్యత్ లో ఉపయోగపడతాయి అనుకుంటున్నవారిని తొక్కేస్తారు, ఎదగనివ్వరు. 

ప్రజాస్వామ్యం పేరుతో కుల కుటుంబ పార్టీలకు వారి కుటుంబ హితం ముఖ్య, ఆ కుటుంబాలను నమ్ముకున్న వంది మాగధుల ప్రయోజనాలు ముఖ్యంగా ఉంటుంది కానీ రాష్ట్ర/ జాతీయ హితం ఎందుకు ఉంటుంది?

సంఘ పరివార్ నుండి వచ్చిన బీజేపీలో ఎవడు తరువాత అధ్యక్షుడు అవుతాడో తెలీదు, ఎవరు ప్రధాని ఆవుతారో తెలియదు, ఏ రాష్ట్రంలో ఎవరు రాష్ట్ర అధ్యక్షుడు గా లేక ముఖ్యమంత్రి గా వస్తారో తెలియదు. అది బిజెపికి మిగతా కుటుంబ పార్టీలకు తేడా!

ఇక్కడ నిజమైన ప్రజాస్వామ్యం ఉంది. ఇక్కడ క్రిందనుండి వచ్చిన వర్కర్స్ కూడా  పై దాకా మెట్లు ఎక్కడానికి ఛాన్స్ ఉంది. కానీ పైన చెప్పుకున్న కుటుంబ పార్టీలలో అటువంటిది కలలో కూడా ఊహించలేము.

అందుకే బిజెపి ఏ నిర్ణయం తీసుకున్నా ఏ ఒక్క కుటుంబ బాగుకోసమో తీసుకోదు. ఎక్కడ అయినా తమ కొడుకుని ముఖ్యమంత్రి చేయడానికో ప్రధానిని చేయడానికో కాంప్రమైజ్ అవ్వదు.

సోనమ్మ రాజ్యం

పవరయ్య రాజ్యం

థాకరయ్య రాజ్యం

యాదవయ్య రాజ్యం

మాయమ్మ రాజ్యం

లాలయ్య రాజ్యం 

మమతమ్మ రాజ్యం

చంద్రన్న రాజ్యం

జగనన్న రాజ్యం

చంద్రయ్య రాజ్యం

దేవయ్య రాజ్యం

కరుణయ్య రాజ్యం.

గతంలో చిన్న రాజ్యాలు, సంస్థనాలు కొన్ని కుటుంబాల చేతుల్లో ఉండేవి. ఇప్పుడు రాష్ట్రాలు కుటుంబాల చేతుల్లో ఉన్నాయి. అంతే తేడా.. దీనికే మనం ప్రజాస్వామ్యం అనే పేరు పెట్టి పిలుచుకుంటున్నాం.  తమ సిద్దాంత అవసరాల కోసం మరియు RSS మీద పట్టలేనంత ద్వేషంతో దేశం ఎం అయిపోయినా ఫరవాలేదు అనే రీతిలో మేధావులు ఈ అవినీతి కుటుంబాల పాలనలనే నిర్లజ్జగా సమర్ధిస్తున్నారు.

మహాభారతములో - ఆది పర్వము*

 *మహాభారతములో - ఆది పర్వము*

         *ప్రథమాశ్వాసము*

                      *9*

*నాగులకు కద్రువ శాపం సవరించు*

ఈ కథ వింటున్న శౌనకాది మునులు " మహాత్మా ! నాగలోకం యాగాగ్నిలో పడి భస్మం కావడానికి వేరు కారణం ఏదైనా ఉందా ! " అని అడిగారు. అందుకు సూతుడు " మహామపనపలోరా ! పూర్వం కద్రువ తన కుమారులైన నాగులకు ఇచ్చిన శాపం కూడా ఇందుకు ఒక కారణం. జనమేజయుడు చేయబోతున్న యాగంలో కద్రువ శాపకారణంగా సర్ప కులమంతా నశిస్తున్న సమయంలో పూర్వం రూరుడు సర్ప కులాన్ని అంతా నాశనం చేస్తున్న తరుణంలో సహస్రపాదుడు ఆపిన సర్పయాగంలో పడి మరణిస్తున్న నాగులను జరత్కారుని కహమారుడైన ఆస్తీకుడు ఆపివేసాడు. ఆ వృత్తాంతం వివరిస్తాను వినండి" అని చెప్పాడు.

నవగ్రహ పురాణం - 66 వ అధ్యాయం*_ *చంద్రగ్రహ చరిత్ర - 4*

 _*నవగ్రహ పురాణం - 66 వ అధ్యాయం*_

*చంద్రగ్రహ చరిత్ర - 4*

అందరూ మౌనంగా ఆయననే చూస్తున్నారు. మళ్ళీ నారదుడే అన్నాడు.

*"మీ తండ్రి దక్షప్రజాపతి బ్రహ్మ మానస పుత్రుడు. నేను కూడా బ్రహ్మ మానస పుత్రుడినే ! మీకు పితృ సమానుడిని. మీరు నవ వధువుల్లా లేరు. కారణం చెప్పండి."* 

అందరూ చెప్పమన్నట్టు అశ్విని వైపు చూశారు. ఆ చూపును అర్థం చేసుకున్న నారదుడు *"అశ్వినీ , చెప్పు తల్లీ"* అన్నాడు.

అశ్విని ప్రయత్నించి నోరు పెగుల్చుకుంది. భర్త మందిరంలో తమకు ఎదురైన అనుభూతినీ , రోహిణీ చంద్రుల మూలంగా తమకు జరుగుతున్న అన్యాయాన్నీ తడబడుతూ వివరించింది.

*“అదన్నమాట , సంగతి !”* అంతా విన్న నారదుడు అన్నాడు. *“మీరందరూ అమాయక వధువులు. మీ భర్త దృష్టినీ , ప్రేమనూ ఆ రోహిణి లాగే ఆకర్షించే ప్రయత్నం చేయాలి.”* 

*"ఆ ఉపాయమేదో మీరే చెప్పండి."* భరణి ధైర్యంగా అడిగింది.

*"మీరు చాలా సాత్వికంగా ఉన్నారు. భర్తను వశ పరుచుకోడానికి రాజసగుణ స్పర్శ అవసరం. భర్త ఆదరించలేదన్న నిరాశతో ఇలా దీనంగా , నీరసంగా నిరలంకారంగా ఉండకూడదు. ఆ రోహిణిని మించి అలంకరించుకోండి. గలగలా నవ్వండి. ఉల్లాసంగా సల్లాపాలాడుతూ చంద్రుణ్ణి చుట్టుముట్టి ఉక్కిరి బిక్కిరి చేయండి"* నారదుడు నవ్వుతూ అన్నాడు.

దక్షపుత్రికలు ముఖాలు చూసుకున్నారు.

*“భర్త అనురాగం కోసం చేసే ప్రయత్నంలో భక్తి , భయం ఉండకూడదమ్మా , రక్తీ , రసికతా ఉండాలి. అర్థమైంది కదా”* నారదుడు చిరునవ్వుతో అడిగాడు.

అశ్విని తల ఊపింది. అందరూ చిరునవ్వులు నవ్వారు.

*"నారాయణ !"* నారదుడు పైకి లేస్తూ అన్నాడు. *"మళ్ళీ నాలుగు రోజుల్లో వస్తాను.. మీ ముఖాలలో ఆనందం వెల్లివిరుస్తూ కనిపించాలి నాకు."*

ఒంటరిగా రాబోయే చంద్రుడి కోసం అశ్వినీ , ఆమె చెల్లెళ్ళు ఇరవై ఐదుగురు వేచి చూస్తున్నారు. అందరూ చక్కగా అలంకరించుకున్నారు. అందరికీ మళ్ళీ నూతన వధువులు కళ వచ్చేసింది. పూలమాలలతో , విడి పూలతో , పతిదేవుడి పాదాలు కడగటానికి. బంగారు పళ్ళెంతో , బంగారు గిండితో సిద్ధంగా ఉన్నారు. 

చంద్రుడు వచ్చాడు. ద్వారాన్ని దాటిన అతని పాదాల ముందు బంగారు పళ్ళెం పెట్టబడింది. ముందుగా పథకం వేసినట్టు ఇద్దరు దక్షపుత్రికలు ఆశ్లేష , మఖ చెరొక చెయ్యి పట్టుకొని పళ్ళెంలో నిలచేలా చేశారు.

భరణి నీళ్ళు పోస్తుంటే అశ్విని చంద్రుడి పాదాలు కడిగింది. పళ్ళెంలోని నీళ్ళను తన తల మీద చల్లుకుని , సోదరీమణుల తలల మీద ప్రోక్షించింది.

అశ్విని భర్త మెడలో పూలదండ వేసింది. చంద్రుడు అర్ధం కానట్టు చూస్తున్నాడు. ఎడమచేతితో అశ్విని వేసిన మాలను తీసి వేశాడు. వెంటనే భరణి చేతుల్లోని దండ అతని మెడలో వాలింది. చంద్రుడు నడుస్తున్నాడు. దక్షపుత్రికల చేతుల్లోంచి పువ్వులు వర్షిస్తున్నాయి.

చంద్రుడి కళ్ళు ఆత్రుతగా చుట్టూ అన్వేషించాయి. *"రోహిణి ఏది ?"* అన్నాడు దగ్గరగా ఉన్న అశ్వినితో.

అశ్విని సమాధానం చెప్పేలోగా , తలుపును భళ్ళున తెరిచి , రోహిణి ఎదురుగా నిలబడింది. చంద్రుడి ముఖం మీద మెరుపులా చిరునవ్వు మెరిసింది. అతను రోహిణిని ఎగాదిగా చూశాడు. అప్పుడే మంచం దిగిన రోహిణి పువ్వులు లేకుండా , తగ్గిన ఆకర్షణతో కనిపిస్తోంది.

చంద్రుడు ఆక్షేపణగా అశ్వినినీ , ఆమె చెల్లెళ్ళనీ కొరకొర చూశాడు. *"మీరు స్త్రీలేనా ? రోహిణికి ఇవ్వకుండా అన్ని పువ్వులూ మీరే అలంకరించుకున్నారా ? ఛీఛీ !”* 

అశ్వినీ , ఆమె చెల్లెళ్ళు నిర్ఘాంతపోయారు. వాళ్ళు తేరుకునేలోగా చంద్రుడు తన కంఠంలోని హారం తీసి ప్రేమగా రోహిణి మెడలో వేశాడు. భుజాల చుట్టూ చేతిని వేసి ఆమెను శయనాగారంలోకి నడిపించుకెళ్ళి విసురుగా తలుపు మూసి బంధించాడు.

నిన్నటి దాకా నీరు కార్చిన అశ్విని కళ్ళు ఇప్పుడు నిప్పులు కక్కుతున్నాయి. మూర్తీభవించిన ఆగ్రహంలా ఉన్న అశ్వినిని చెల్లెళ్ళు ఆందోళనగా చూశారు. ఉలుకూ , పలుకు లేకుండా ఉగ్రరూపంలో ఉన్న అశ్వినిని సోదరీ బృందం  పలకరించింది. అశ్విని పెదవులు అదిరాయి కానీ , మాట వెలువడలేదు.

క్రితం రాత్రి జరిగిన ఘోరమైన అవమానం ఆమె హృదయాన్ని కాల్చివేస్తోంది. చంద్రుడి మీద కోపం రోహిణి మీద ఆగ్రహం.

*"అక్కా..."* విగ్రహంలా చలనం లేకుండా కూర్చున్న అశ్విని చేతిని తాకుతూ పిలిచింది కృత్తిక.

*"ఈ అన్యాయాన్ని ఇక క్షమించను , సహించను !"* అశ్విని తటాలున పైకి లేచి అంది.

ఆవేశంగా అడుగులు వేస్తూ చంద్రుడి శయనాగారం వైపు వెళ్ళింది. చెల్లెళ్ళందరూ తీగను అంటిపెట్టుకుని కదిలే మొగ్గల్లా అశ్విని వెంట వెళ్ళారు. అశ్విని శయనాగార ద్వారం ముందు నిలబడింది. తలుపులు మూసి ఉన్నాయి.

అశ్విని కంఠం మందిరంలో ప్రతిధ్వనించింది. *“రోహిణీ !"* అశ్విని అలాగే బిగ్గరగా పిలుస్తూ ఉండిపోయింది. చెల్లెళ్ళు ముఖాలు చూసుకున్నారు.

శయనాగారం తలుపు తెరుచుకుంది. తలుపు తెరిచిన రోహిణి కోపంగా చూసింది. *"ఏమిటి ? ఏమిటా అరుపులు ? పతిదేవులు నిద్రలో ఉన్నారు... తెలుసా ?”*

*"తెలుసు ! మేలుకొలపడానికే వచ్చాను. నువ్వు చేస్తున్న నేరం ఏమిటో , మా అందరికీ కలిగిస్తున్న నష్టం ఏమిటో నీకు తెలుసు. ఈ మందిరంలో మాకు జరుగుతున్న అవమానమేమిటో నీకు తెలుసు. కళ్ళు తెరుచుకో , రోహిణీ ! ఆత్రేయ చంద్రుడు నీ ఒక్కతికే భర్త కాదు. ఆయన అనుబంధంతో మా అందరికీ భాగస్వామ్యం ఉంది. తోబుట్టువులకు అన్యాయం చేస్తున్నావ్. తప్పు తెలుసుకొని తప్పుకో !”* అశ్విని ఆవేశంతో అంది.

రోహిణి పెదవులు మెల్లిగా కదిలి వెటకారానికి రూపం ఇచ్చాయి. *“నేను ఆయనను కొంగున ముడివేయలేదు. మిమ్మల్ని కన్నెత్తి చూడవద్దని కట్టడి చేయలేదు. ఆయనే నా చుట్టూ తిరుగుతున్నారు. చేతనైతే మీ చుట్టూ తిప్పుకోండి !"*

*“నీ అక్కచెల్లెళ్ళని , ధర్మపత్నుల్ని ఆదరించమని ఆయనకు గుర్తు చేయడం నీ విధి !

రోహిణి అశ్విని వైపు గర్వంగా చూసింది. *“నీకో నిజం తెలుసా అశ్వినీ ! ఆనాడు ఆయనను మీకు దూరంగా , నాకు దగ్గరగా ఉండిపొమ్మని నేను అడగలేదు. నేడు నాకు దూరంగా , మీకు దగ్గరగా వెళ్ళమని అనలేను. ఇది నా భాగ్యం. అది మీ దౌర్భాగ్యం !"*

*🪷 శ్రీ మద్భగవద్గీత🪷* *🌸 అథ ద్వితీయోధ్యాయః 🌸* *🌸 సాంఖ్య యోగః 🌸*

 *🕉️🪷 ఓం శ్రీ కృష్ణపరబ్రహ్మణే నమః 🪷🕉️*

*🪷 శ్రీ మద్భగవద్గీత🪷*

*🌸 అథ ద్వితీయోధ్యాయః 🌸*

*🌸 సాంఖ్య యోగః 🌸*

*2-అధ్యాయం,41 వ శ్లోకం*

 *వ్యవసాయాత్మికా బుద్ధిః ఏకేహ కూరునందన |* 

 *బహుశాఖా హ్యనంతాశ్చ బుద్ధయో వ్యవసాయినామ్ || 41* 

 *ప్రతిపదార్థం* 

కురునందన = ఓ అర్జునా! ; ఇహ = ఈ ( నిష్కామ ) కర్మ యోగము నందు ; వ్యవసాయాత్మికా బుద్ధిః = నిశ్చిమాత్మకమైన బుద్ధి; ఏకా ( భవతి ) =ఒకటిగా ఉండును. ; అవ్యవ సాయినామ్ = ( కాని ) స్థిర బుద్ధి లేని వివేకహీనులైన సకామ మనుష్యుల యొక్క ; బుద్ధయః = బుద్ధులు ;హి = నిశ్చియముగా;బహుశాఖాః = అనేక భేదములు గలిగిన వై ( చంచలములై ); చ = మరియు; అనంతాః = అంతులేని (కోరికలు గల ) వై ( ఉండును.);

 *తాత్పర్యము* 

 ఓ అర్జునా! ఈ (నిష్కామ ) కర్మయోగమునందు నిశ్చయాత్మక బుద్ధి ఒక్కటియే యుండును. కానీ భోగాసక్తులైన వివేక హీనుల బుద్దులు చంచలములై, ఒక దారి తెన్ను లేక కోరికలవెంట నలువైపులా పరుగలు తీయుచూ అనంతములుగా నుండును.

 *సర్వేజనాః సుఖినోభవంతు* 

 *హరిః ఓం 🙏🙏*

గుడిలో

 *"గుడిలో మనం ఏం సేవ చేయొచ్చు?"*

భగవంతుడికి మనం చేసే గొప్ప సేవలలో ఒకటి మన శరీరంతో ఒక సామాన్యుడిలా సేవ చేయడం. ఆ సేవ ఒక దేవాలయంలో చేస్తే ఇంకా గొప్ప పుణ్యం. 

భగవంతుడి ముందు అందరం సమానమే. అందరూ సామాన్యులమే అనే భావం మనస్సులో నింపుకొని, ఎటువంటి ఫలితాన్ని ఆశించకుండా దేవాలయంలో సేవ చేస్తే, భగవంతుడు తప్పక మనల్ని అనుగ్రహిస్తాడు. 

దేవాలయంలో మనం చేసే సేవ, ఆ భగవంతుడి పూజ కన్నా ఎక్కువైనదే అనటంలో సందేహం లేదు. దేవాలయంలో మనం చాలా సేవలు చేయవచ్చు. అవి..... 

*దేవాలయం బండలు తుడవడం, 

*భగవంతుడు (విగ్రహం) ధరించిన వస్త్రాలు ఉతకడం, 

*దేవుడి పల్లకి మోయడం, 

*దేవుడి పూజ సామాగ్రిని శుభ్రం చేయడం, 

*దేవాలయ ప్రాంగణం శుభ్రం చేయడం, 

*దేవుని విగ్రహాల అలంకరణ కోసం పూలమాలలు కట్టడం, 

*దేవుడి అలంకరణలో సహాయం చేయడం, 

*దేవుడి పూజకు సామాన్లు సర్దడం, 

*దేవుడి అభిషేకం కోసం పదార్థాలను వండటం / సర్దడం దేవుడి తీర్థ ప్రసాదాలు పంచడం, *దేవాలయం గోడలు / గోపురాల మీద బూజు దులపడం, 

*అన్నదాన కార్యక్రమంలో వంటకు సహాయం చేయడం, 

*దేవుడి పూజ యొక్క నిర్మాల్యం శుభ్రం చేయడం, 

*అభిషేకం తర్వాత గర్భాలయం శుభ్రం చేయడం, 

*దేవుడి కళ్యాణంలో సహాయం చేయడం.

సంస్కృత భారతీ* *13*

 *సంస్కృత భారతీ*

         *13*

*త్రయోదశపాఠః*

*సంస్కృతే ఫలాని*

ఆమ్రఫలం/చూత ఫలం = మామిడి పండు,

తింత్రిణీఫలం = చింత పండు,

కదళీఫలం = అరటిపండు,

జంబూ ఫలం = నేరేడు పండు,

బదరీ ఫలం = రేగు పండు,

ఖర్జూరఫలం = ఈతపండు,

సేవఫలం/ అమృతఫలం = ఆపిల్ పండు,

దాడిమీఫలం = దానిమ్మ పండు,

ఇక్షుఖండం = చెరుకుముక్క,

బీజాపూరఫలం = జామ పండు,

మధుకర్కటీ = బొప్పాయి పండు,

ఆమలకం = ఉసిరి,

నింబఫలం = నిమ్మపండు,

జంభీర/కమలాఫలం = కమలా పండు,

కపిత్థ ఫలం = వెలగ పండు,

ద్రాక్ష ఫలం = ద్రాక్ష పండు,

నారింగ ఫలం = నారింజ పండు,

శుష్క ద్రాక్ష = ఎండు ద్రాక్ష, హరీతకీ = కరక్కాయ,

శ్రీ ఫలం = మారేడు పండు...

*** కొన్ని ఫలాల పేరు లు తెలియనప్పుడు అమృత ఫలం అని ప్రయోగిస్తాము.ఉదాహరణకు జామ,ఆపిల్ వీటికి అమృతఫలం అనే పర్యాయపదం కూడా వాడుకలో గలదు.

*ప్రయోగ విభాగః*

*౧* ప్రతి దినం ఏకం సేవఫలం వా ఆమలకం ఖాదన్తిచేత్ అనారోగ్యం న వర్తతే (ప్రతి రోజు ఒక ఆపిల్ పండు లేదా ఉసిరి తింటూ ఉంటే అనారోగ్యం ఉండదు.)

*౨*. కదళీఫలం సర్వదా రోగదాయకం భవతి (అరటిపండు ఎల్లప్పుడూ రోగ ములు కలిగించేది అగును.)

*౩*. నింబఫలరసం సోదకం శర్కరామధు సమ్మిళితం స్వాదుర్భవతి తథా ఆరోగ్యకరం చ(అపి) భవతి.(నిమ్మ రసం నీటితో కలిపి(సోదకం) చక్కెర, తేనె(మధు)లతో కలిపినది రుచికరంగా ఉంటుంది, అలాగే ఆరోగ్య కరంగా కూడా ఉంటుంది.

*౪* . ఇక్షురసం ఆర్ద్రకరసయుతం స్వాదుః తథా పైత్యహరకరం భవతి. (చెరకు రసం అల్లం(ఆర్ద్రకం) తో కలిసియున్నది రుచిగా అలాగే పైత్యమును హరించేదిగా ఉంటుంది.).

*౫*. ద్రాక్ష రసం తక్షణ శక్తి దాయకం భవతి (ద్రాక్ష రసం వెంటనే శక్తి ని ఇచ్చేది అగును.).

*౬*. ప్రతి దినం ఖర్జూరఫల ఖాదనేన హృద్రోగభయం న వర్తతే, తథా నాడీబలహీనం న పీడతి.(ప్రతి రోజు ఖర్జూరఫలాలు తినుటచే గుండె జబ్బుల భయం ఉండదు, అలాగే నరాల బలహీనత బాధించదు.

*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*

శ్రీరాముడి కృప

 🚩శ్రీరాముడి కృప ఎంతటిదో  తెలియజెప్పే కథ!🙏

భారతీయ సత్పురుషులు, మహాత్ముల గురించి అనేక గాథలు ప్రచారంలో ఉన్నాయి. 

అలాంటి కథల్లో తులసీదాసు చెప్పిన కథ గమనిస్తే....

అప్పుడు తులసీదాసు కాశీలో నివసిస్తున్నారు. ప్రతి ఇంటా ఆయనకూ, ఆయనతో ప్రణీతమైన రామాయణ గ్రంథానికి సన్మాన సత్కారాలు లభించేవి. రామనామాన్ని భ్రమరంలాగా జపించేవారి ముందు ఆయన పవిత్రమైన తులసి మొక్కలా గొచరించేవాడు. అలాంటి పరమ భక్తుడైన తులసీదాసు భక్తుల సందేహాలను తీర్చేవాడు.

ఒకనాడు ధనపాలుడనే ధనికుడు, తులసీదాసు వద్దకు వచ్చాడు. అతడు పరమలోభి. 

అతడు ఒక ఆశ్చర్యకరమైన ప్రతిపాదన చేశాడు. 

ఇంటింటా శ్రీరామచంద్రుడు అనేక ఉపచారాలతో అర్చింపబడుతున్నాడని ఆయన ఎరుగును. 'మహాత్మా! నాకు కూడా శ్రీరామచంద్రుణ్ణి సకలోపచారాలతో అర్చించాలని ఉంది' అన్నాడు. 'అలాగే చేయి నిన్ను అడ్డుకొన్నదెవరు?” అన్నాడు తులసీదాసు. 'అది కాదు స్వామీ! అర్చనకు పూలు, పళ్ళు, ధూప, దీపాదులు అవసరం కదా? వీటికి దమ్మిడీ వ్యయం చేయకుండా అర్చన జరిగే ఉపాయం చెప్పండి' అన్నాడు ధనపాలుడు.

అమితాశ్చర్యంతో ఆ లోభిని ఆపాదమస్తకం తిలకించాడు తులసీదాసు. అతడి పిసినారితనం చూసి, ఆయనకు జాలి కలిగింది. చాలాసేపు మౌనంగా ఉన్నాడు.

 చివరకు, 'మానసపూజ తప్పించి నాకు అన్యమార్గం కనిపించడం లేదు. మానసపూజ అంటే, అన్ని ఉపచారాలూ కాల్పనికాలు. నీవు అన్నీ చేస్తున్నట్లు మనస్సులో ఊహించాలి. నీవు కావలసినన్ని ఉపచారాలతో ఆ విధంగా చేయవచ్చు. చిల్లిగవ్వ ఖర్చుకాదు' అన్నాడు తులసీదాసు.

ధనపాలుని ఆనందానికి అవధులు లేవు. ఇంతకాలం ఇలాంటి ప్రణాళిక కోసమే తాను ఎదురుచూశాడు. అయితే కాల్పనికమైనా ఎక్కువ పదార్థాలు నివేదింపదలచలేదు. అందువల్ల 'ఏ విధంగా మానసపూజ చేయాలో సవివరంగా చెప్పండి' అని తులసీదాసును అడిగాడు ధనపాలుడు.

శ్రీరామచంద్రుణ్ణి ఒక్క నిమిషం ధ్యానం చేసి, 'ఆయన ప్రతిమను బంగారు సింహాసనంపై ప్రతిష్ఠించు. రకరకాల పుష్పాలతో అలంకరించు. ఆపైన వేడి చేసిన ఆవు పాలల్లో కాస్తంత పంచదార కలిపి నివేదన చేయి. పంచదార కలపడం మాత్రం మరువకు సుమా! నా రాముడు పంచదార లేని పాలు త్రాగలేడు. అనుదినం ఈ విధంగా మానసపూజ చేయి, దమ్మిడీ వ్యయం కాదు' అన్నాడు తులసీదాసు.

ధనపాలుని లోభగుణం అటుంచి, అతడికి నిష్ఠ మెండు. తులసీదాసునే గురువుగా ఎంచి ధనవ్యయం లేని మానసపూజ మొదలుపెట్టాడు. పంచదార ఎక్కువ వాడకం జరుగరాదని, ఒక చిన్న డబ్బా, ఒక చెమ్చా కొన్నాడు. (అంతా ఊహలోనే, నిజంగా అవిలేవు).

 ఈ విధంగా కొన్ని ఏళ్ళు గడిచాయి. ఒకనాడు పాలు నివేదన వేళకు మనస్సులో చెమ్చా కనపడలేదు. చేసేది లేక, డబ్బా నుండి పంచదారను. పాలల్లోకి ఒంపాడు. పంచదార ఎక్కువ పడింది. వెంటనే మనస్సులో ఉన్న పాలగిన్నెలో చేయి పెట్టి, కరగని పంచదార తీసివేయ సాగాడు.

పదిహేను సంవత్సరాలుగా ఈ లోభి మానసిక పూజను స్వీకరిస్తున్నాడు శ్రీరామచంద్రుడు. అయినా, అతడి పిసినారితనం కించిత్తయినా తగ్గలేదు.

 ప్రభువుకు అమితమైన అనుకంపన కలిగింది. భక్తుని చేయి గట్టిగా పట్టుకుని 'ధనపాలా! పాలూ కాల్పనికమే, పంచదారా కాల్పనికమే. కాల్పనిక పంచదార కొంచెం ఎక్కువగా పడితే ఏమిటయ్యా! ఉండనీయరాదూ!' అన్నాడు.

శ్రీరామచంద్రుని కరస్పర్శ మూలంగా ధనపాలునిలో పరమ వైరాగ్యం కలిగింది. వెంటనే అతడు నిజమైన భక్తి. ప్రపత్తులతో శ్రీరాముణ్ణి ధ్యానించి తరించాలని తపోభూమికి వెళ్ళిపోయాడు. 

ఇది నిజంగా జరిగిన సంఘటన.

 దీన్ని బట్టి ఆ రాముడి కృప ఎలాంటిదో అర్థమవుతుంది.

గౌరవప్రదమైన యాత్ర

 🫢 *ఆశ్చర్యపరిచే ఆత్మ & సంకల్పం. సనాతన ధర్మంలో మెరిసే వజ్రాలు ఉన్నాయి, అవి అనేక సహస్రాబ్దాల నుండి ధర్మాన్ని మెరుస్తూ ఉంటాయి. తమిళనాడుకు చెందిన శ్రీ గోపాలకృష్ణ అయ్యర్ అనే బ్రాహ్మణుడు కన్యాకుమారి నుండి బద్రీనాథ్ వరకు సైకిల్‌పై వందలాది హిందూ దేవాలయాలను సందర్శించారు. అతను తన ప్రత్యేకమైన, గౌరవప్రదమైన యాత్రను పూర్తి చేయడానికి అమర్‌నాథ్‌కు మరింత వెళ్లాలని కోరుకుంటున్నాడు. ఆయన భక్తికి వందనాలు. పూర్తి వీడియో తప్పక చూడండి.*

Shiv

Laxmi puja

Good old song

Mudda pappu

దేవాలయంలో

 🚩Beautiful......🚩🚩🚩🚩🚩

అన్ని  ఉత్సవాల్లో...ప్రతీ  దేవాలయంలో....ప్రతీ  సామూహిక, సామాజిక... కార్యక్రమాలలో.....ప్రతీ...... సందర్భంలో... సమావేశం లో..... ప్రతీ... ఇంట్లో...  ప్రతీ   హృదయానికి హత్తుకునేలా.... ప్రతీ   ఒక్కరికీ   అన్ని వయసుల వారికీ.......

వీడియో....లేదా.... ఆడియో.... మాధ్యమం  గా   వినగలిగే.....మంచి..... సదవకాశాన్ని.....జారవిడవకండి......🚩 అందరికీ.....వినిపిద్దాం...... ప్రయోజనం.... ప్రతీ ఒక్కరికీ.... ప్రతీ.... ఇంటి కి......చేరవేద్దామా......

చేర్చుదాం......

🚩🚩

🚩బోలో..... భారత మాతా....కీ.......జై.....

జై శ్రీరామ్   ...  🚩🚩🚩

వన్ లైనర్ గీత -

 Dr.(శ్రీమతి) శశి తివారీ, సంస్కృత శాఖ ఛైర్మన్ (రిటైర్డ్)

ఆగ్రా కళాశాల, భగవద్గీతలోని మొత్తం 18 అధ్యాయాల సారాంశాన్ని కేవలం 18 వాక్యాలలో సంగ్రహించింది.

వన్ లైనర్ గీత -

దీన్ని అందరికి ఫార్వార్డ్ చేసి సర్క్యులేట్ చేస్తారా? ప్రతి ఒక్కరూ దీన్ని 4 రోజుల్లో ఎక్కువ మంది వ్యక్తులకు ఫార్వార్డ్ చేయాలని అభ్యర్థించారు. ఇది మీ రాష్ట్రంలోనే కాకుండా మొత్తం భారతదేశానికి ఫార్వార్డ్ చేయాలి.

వన్ లైనర్ గీత

*అధ్యాయం 1 - తప్పుడు ఆలోచన మాత్రమే జీవితంలో సమస్య .*

*అధ్యాయం 2 - సరైన జ్ఞానం మన సమస్యలన్నింటికీ అంతిమ పరిష్కారం.*

*అధ్యాయం 3 - నిస్వార్థం అనేది ప్రగతికి మరియు శ్రేయస్సుకు ఏకైక మార్గం.*

*అధ్యాయం 4 - ప్రతి చర్య ప్రార్థన యొక్క చర్య కావచ్చు .*

*అధ్యాయం 5 - వ్యక్తిత్వం యొక్క అహంకారాన్ని త్యజించండి మరియు అనంతం యొక్క ఆనందాన్ని ఆనందించండి .*

*అధ్యాయం 6 - ప్రతిరోజూ ఉన్నత చైతన్యానికి కనెక్ట్ అవ్వండి.*

*అధ్యాయం 7 - మీరు నేర్చుకున్న వాటిని జీవించండి .*

*అధ్యాయం 8 - మిమ్మల్ని మీరు ఎప్పటికీ వదులుకోకండి.*

*9వ అధ్యాయం - మీ ఆశీర్వాదాలకు విలువనివ్వండి .*

*అధ్యాయం 10 - చుట్టూ ఉన్న దైవత్వాన్ని చూడండి .*

*అధ్యాయం 11 - సత్యాన్ని యథాతథంగా చూడడానికి తగినంత శరణాగతి కలిగి ఉండండి.*

*అధ్యాయం 12 - మీ మనస్సును ఉన్నతంగా గ్రహించండి.*

*అధ్యాయం 13 - మాయ నుండి విడిపోయి దైవానికి అనుబంధం.*

*అధ్యాయం 14 - మీ దృష్టికి సరిపోయే జీవన శైలిని గడపండి.*

*అధ్యాయం 15 - దైవత్వానికి ప్రాధాన్యత ఇవ్వండి .*

*అధ్యాయం 16 - మంచిగా ఉండటమే ప్రతిఫలం.*

*అధ్యాయం 17 - ఆహ్లాదకరమైన వాటిపై హక్కును ఎంచుకోవడం శక్తికి సంకేతం .*

*అధ్యాయం 18 - విడువండి, దేవునితో ఐక్యతకు వెళ్దాం.*

(ఈ సూత్రంలో ప్రతి ఒక్కదానిపై ఆత్మపరిశీలన)

                   ॐ తత్సత్

P. S. - దీన్ని చాలా మందికి ఫార్వార్డ్ చేసి భగవద్గీత ప్రాముఖ్యతను వివరించవలసిందిగా నేను మిమ్మల్ని పదే పదే కోరుతున్నాను

గుండె చప్పుడు..

 కాఫీ కబుర్లు సంఖ్య 414 (సెప్టెంబర్ 29)..

  గుండె చప్పుడు.. --  

ఊపిరి పోసుకున్న మరుక్షణం మొదలు ఊపిరి పోయినంత వరకు మానవుల దేహంలో జీవింపజేసేది గుండె.  అంటే‌ గుండె చప్పుడు ఆగకుండా గుండే నిరంతరం పనిచేస్తూనే ఉంటుంది.  అంతటి అతిముఖ్యమైన గుండెను ఎంతలా ఎంతగా మనం కేర్ తీసుకుంటూ కాపాడుకోవాలి.  ఈ విషయం మనల్ని గుర్తుచేసిందుకు, మరిన్ని జాగ్రత్తలు తీసుకోవడంలో అవగాహన కల్పించేందుకు WHO అనుబంధ సంస్థ వరల్డ్ హెల్త్ ఫెడరేషన్.. ప్రపంచ వ్యాప్తంగా ఏటా సెప్టెంబర్ 29న (ఈరోజే) వరల్డ్ హార్ట్ డే  2000వ సంవత్సరం నుంచి నిర్వహిస్తోంది.  మన బిజీ దినచర్యలో ఈ విషయాన్ని మనం అంతగా పట్టించుకోక పోవచ్చు.  ఫలితంగా గుండెకు ముప్పు ఏర్పడి వ్యాధులు రావచ్చు.. మరణాలు సంభవించవచ్చు.  ఈ కారణంగా ఏటా విశ్వవ్యాప్తంగా రెండు కోట్ల మంది చనిపోతున్నట్లు లెక్కలు తేలాయి.  ఇందులో 40 శాతం మంది 60 నుంచి 70 సంవత్సరాల వయసు లోపు వారే ఉండటం అలార్మింగ్ ఫ్యాక్టర్.  30 శాతం మందికి ఈ గుండె జబ్బుల పట్ల సరియైన అవగాహన లేకపోవడం, జాగ్రత్తలు తీసుకోకపోవడం వంటి కారణాలు ఉన్నాయి.  ఇటువంటి మరణాలు తగ్గే అవకాశాలు ఉండటంతో ఫెడరేషన్ మెంబర్లు ప్రజల్ని ఎడ్యుకేట్ చేయడంలో తమ వంతు పాత్ర సమర్ధవంతంగా పోషిస్తున్నారు.  అన్ని వయసుల వారికి అవగాహన కల్పించేందుకు కృషి చేస్తున్నారు.  ఒక్కో సంవత్సరం ఒక్కో థిమ్ తో ముందుకొస్తున్నారు.  ఈ 2023 థీమ్ ను..  use heart  know heart (హృదయం ఉపయోగించుకో హృదయం తెలుసుకో) గా నిర్ణయించారు.  మన గుండె గురించి తెలుసుకోవాలి..  ఎలా  సక్రమంగా పనిచేయడానికి ఉపయోగించుకోవాలో తెలుసుకోవాలి.  ఇటువంటి అవగాహనా కార్యక్రమాలు చేపడితే కొంతవరకు మరణాలు కొంత వరకు తగ్గించవచ్చు.  హార్ట్ కేర్ విషయంలో 50 దాటినవారు జాగ్రత్త పడాలి.  60 దాటినవారు మరింత జాగ్రత్త పడాలి.  70 దాటినవారు ఇంకా ఎక్కువ జాగ్రత్త తీసుకోవాలి.  తీసుకోవలసిన ముఖ్యమైన జాగ్రత్తలు ఇవి.‌.  1) నడక వ్యాయామం యోగా వంటివి ప్రతిరోజూ కనీసం 30 నిమిషాల పాటు చేయాలి..  2) అలసట ఆయాసం లేకపోతే మెట్లు ఎక్కడం దిగడం చేస్తుండాలి కనీసం ఓ 40 మెట్లు..  3) వైద్యుల సలహాల మేరకు క్రమం తప్పకుండా గుండెకి సంబంధింత పరీక్షలు చేయించుకోవాలి.  అవసరమైతే సూచించిన మందులు వాడాలి..  4) కొలెస్ట్రాల్, షుగర్ స్థాయిలను అదుపులో ఉంచుకోవాలి..  5) ఒబెసిటీ రాకుండా చూసుకోవాలి..  6) ఆవేశాలకు ఒత్తిళ్ళకు లోనుకాకూడదు.  బీపి హై లో కాకుండా చూసుకోవాలి..  7) ఆహారం విషయంలో శ్రద్ధ చాలా అవసరం.  ఉప్పు పంచదార బాగా తగ్గించాలి..  ఆహారం మితంగా మంచినీరు ఎక్కువగా తీసుకోవాలి..  8) శారీరక మానసిక ప్రశాంతత చాలా అవసరం..  9) మంచి మాట  మంచి మార్గం  మంచి నడవడిక అలవాటు చేసుకోవాలి..  10) పాజిటివ్ దృక్పథం తోనే ఉండాలి..  --  చివరిగా  ఓ సందేశం..  కళ్ళు కాళ్ళు చేతులు కిడ్నీలు రెండేసి ఉంటాయి..  గుండె మాత్రం ఒక్కటే ..  ఆలోచించే మెదడు ఒక్కటే.‌ ఒక్క హృదయం లేకపోతే జీవితమే లేదు.  ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా ఈ పోస్ట్ మన మిత్రులందరికీ షేర్ చేద్దాం.  అవగాహన పెంచుకుందాం ఆరోగ్యంగా ఉందాం..  అవగాహన పెంపొందించే దిశగా అడుగులు వేద్దాం.. V గుండె జర పదిలం..  ------ అడ్మిన్ బ్రాహ్మణ సమాఖ్య

Vinayak

 దేవుని పల్లి - కామారెడ్డి

https://youtu.be/aI_aaEMwGsQ?si=sMSTSPjeU0M68qLz

వెంట తీసుకువస్తాడో

 శ్లోకం:☝️

*తాదృశీ జాయతే బుద్ధిర్-*

 *వ్యవసాయోఽపి తాదృశః ।*

*సహాయాస్తాదృశా ఏవ*

  *యాదృశీ భవితవ్యతా ॥*

భావం: మానవుడు ఏ అదృష్టం (పారబ్ధం) వెంట తీసుకువస్తాడో, అందుకు అనుగుణమైన తెలివితేటలు అబ్బి, దానికి తగ్గ కృషి - ఇతరుల సహాయం మరియు ఫలితం పొందుతాడు.🙏

పంచాంగం 29.09.2023 Friday,

 ఈ రోజు పంచాంగం 29.09.2023  Friday,

స్వస్తి  శ్రీ చాన్ద్రమాన శోభకృన్నామ సంవత్సర: దక్షిణాయనం వర్ష ఋతు భాద్రపద మాస శుక్ల పక్ష: పౌర్ణమి తిధి భృగు వాసర: ఉత్తరాభాద్ర నక్షత్రం వృద్ధి యోగ: బవ తదుపరి బాలవ కరణం ఇది ఈరోజు పంచాంగం.

పౌర్ణమి మధ్యాహ్నం 03:29 వరకు.

ఉత్తరాభాద్ర రాత్రి 11:19 వరకు.

సూర్యోదయం : 06:09

సూర్యాస్తమయం : 06:03

వర్జ్యం : పగలు 10:24 నుండి 11:51 వరకు.

దుర్ముహూర్తం : పగలు 08:32 నుండి 09:19 వరకు తిరిగి మధ్యాహ్నం 12:30 నుండి 01:17 వరకు.

రాహుకాలం : పగలు 10:30 నుండి 12:00 వరకు.

యమగండం : మద్యాహ్నం 03:00 నుండి 04:30 వరకు.  

శుభోదయ:, నమస్కార:

శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర-61🌹*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

*🌹శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర-61🌹*

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

*కొల్హాపూర్ మహాలక్ష్మి దేవాలయం:*

కొల్హాపూర్ ఉత్తర మహారాష్ట్రలో ఒక పట్టణం మరియు జిల్లా ప్రధానకేంద్రం. ఈ పట్టణం భారతదేశంలోని అత్యంత పురాతనమైన నగరాలలో ఒకటి. దీని ప్రస్తుత జనాభా ఇంచుమించుగా 419,000 ఉంటుంది. ఇక్కడి ప్రధాన భాష మరాఠీ. ఇది పంచగంగ నది ఒడ్డున ఉంది. 

ఇక్కడి మహాలక్ష్మి దేవాలయం బాగా ప్రసిద్ధిచెందినది. ఈ పట్టణం కొల్హాపూర్ చెప్పులకు కూడా ప్రసిద్ధి

మహాలక్ష్మి దేవాలయం 'హేమాడ్ పంతి' నిర్మాణశైలిలో కట్టబడింది. ఇది చాలా విశాలమైన ప్రాంగణంలో చుట్టూ ఎత్తైన ప్రహారీ గోడతో ఉంటుంది. ప్రాంగణం మధ్యలో ఉన్న అమ్మవారి ఆలయం ఒక అద్భుత కళాసృష్టి అని చెప్పవచ్చు.

 ఆలయమంతా మనోహరమైన శిల్పాలతో నిండి ఉంటుంది. పశ్చిమాభిముఖంగా ఉండే గర్భగుడి ముందుగా సుమారు వందడుగుల పొడవు గల విశాలమైన మండపం ఉంటుంది. గర్భగుడి చుట్టూ సన్నని ప్రదక్షిణ మార్గం ఉంది.

*కొల్హాపూర్ మహాలక్ష్మి:*

గర్భగుడిలో సుమారు ఆరడుగుల చదరంగా ఉన్నr~Q&A ఎత్తైన వేదిక మీద రెండడుగుల పీఠం, దానిమీద మహాలక్ష్మి విగ్రహం కూర్చొని ఉన్న భంగిమలో ఉంటుంది.

 మూడడుగుల ఎత్తున్న మూర్తి చాలా అందంగా ఆకర్షణీయంగా ఉంటుంది. మహారాష్ట్రీయులకు కొల్హాపూర్ మహాలక్ష్మి అత్యంత పవిత్ర యాత్రాస్థలం. వీరు అమ్మవారిని 'అంబాబాయి' అని పిలుస్తారు. ఇక్కడ జరిగే ప్రధాన ఉత్సవం నవరాత్రి ఉత్సవం. 

ముఖ్యంగా ఆశ్వయుజ శుద్ధ పంచమి నాడు విశేషంగా గొప్ప ఉత్సవం జరుగుతుంది. ఆ రోజున అమ్మవారి ఉత్సవమూర్తిని నగరానికి తూర్పుగా ఐదు కి.మీ. దూరంలో ఉన్నతెంబ్లాయి అమ్మవారి ఆలయం దగ్గరికి ఊరేగింపుగా తీసుకొని వెళ్తారు. ఇదిగాక చైత్ర పూర్ణిమ రోజున జరిగే ఉత్సవంలో అమ్మవారిని నగరమంతా ఊరేగిస్తారు. గుడి ప్రాంగణంలో ఉన్న అనేక ఆలయాలలో విఠోబా ఆలయం కూడా చాలా పురాతనమైనది.

ఇక మహారాజ భవనం సుమారు రెండు వందల గదులతో మూడు అంతస్తులతో చక్కగా విశాలమైన మైదానం మధ్యలో ఉంటుంది. ఆనాటి రాజుల ఆయుధాలు, రాజరికపు సామగ్రి మొదలైనవి ఇందులో పొందుపరిచారు.

పురాణాలలో పేర్కొన్న ప్రకారం ఈ ఆలయం భారతదేశంలో శక్తి నివాసముండే 108 శక్తి పీఠాలలో ఒకటిగా విరాజిల్లుతోంది.మహాలక్ష్మిని ప్రేమగా అంబా బాయి అనికూడా పిలుస్తారు, 

ప్రతి సంవత్సరం లక్షల మంది భక్తులు ఈ చారిత్రక దేవాలయాన్ని సందర్శించి ఆమె దీవెనలను కోరుకుంటారు. ఈ మహాలక్ష్మి దేవాలయం కారణంగా, కొల్హాపూర్, భారతదేశంలోని ఒక ప్రసిద్ధ ఆధ్యాత్మిక కేంద్రంగా భావించబడుతుంది.7 వ శతాబ్దం లోని ఈ దేవాలయాన్ని చాళుక్య వంశ రాజైన కరన్దేవ్ తిరిగి చాలాకాలం తరువాత దీని నిర్మాణాన్ని చేపట్టారు.]

ఈ పవిత్ర స్థల నిర్మాణ శైలి హేమండ్ పతి ప్రేరణతో చేయబడింది. ఈ ఆలయాన్ని యాదవ వంశీయులు 8 వ శతాబ్దంలో మరింత అందంగా తీర్చిదిద్దారని నమ్మబడింది. 

ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, సూర్యకిరణాలు ప్రతిరోజూ దేవతా విగ్రహానికి బంగారు సొగసులు అందిస్తూ తాకే విధంగా ఈ ఆలయం నిర్మించబడింది. నవరాత్రి వంటి పండుగల సమయంలో స్థానికులు, భారతదేశం అంతటా ఉన్న భక్తులు అంబాదేవి దర్శనం కోసం కొల్హాపూర్ కి తండోపతండాలుగా వస్తారు. ఈ సమయంలో ఈ ప్రాంతం ప్రకాశవంతమైన రంగులతో, సంగీతంతో ప్రతిధ్వనిస్తుంది.

ఒక రాతి పీఠం మీద నాలుగు చేతులతోనూ, 40 కిలోగ్రాముల వజ్రాలతో తయారైన కిరీటంతోనూ మహాలక్ష్మీ కొలువై ఉంటుంది. 3 అడుగుల ఎత్తుగల నల్లరాతిపై మహాలక్ష్మీ ప్రతిమను చెక్కడం జరిగింది. ఆలయంలోని ఒక గోడపై శ్రీ యంత్రం చెక్కబడి ఉంది. దేవత యొక్క వాహనం రాతితో చేయబడిన సింహం ప్రతిమ వెనుక భాగంలో ఉంటుంది. 

కిరీటంపై విష్ణువు తల్పం అయిన శేషనాగు యొక్క చిత్రం ఉంటుంది. ఆమె నాలుగు చేతులలో గుర్తింపు కలిగిన నాలుగు వస్తువులు ఉంటాయి. కుడివైపు క్రింది చేతిలో మాలుంగ (సిట్రస్ జాతి ఫలం), ఎడమవైపు కింది చేతిలో పాత్ర ఉంటుంది. 

హిందూ పవిత్ర చిత్రాలలో ముఖం ఉత్తరవైపు లేదా తూర్పు వైపు చూసే విధంగా ఉంటుంది. ఈ దేవతా విగ్రహం పశ్చిమవైపు చూసే విధంగా ఉంటుంది. చిన్న తెరిచిఉన్న కిటికీ పశ్చిమవైపు గోడకు ఉంటుంది. 

సూర్యాస్తమయం అయినపుడు సూర్యుని కిరణాలు ఈ కిటికీ గుండా ప్రతి సంవత్సరం 21 మార్చి మరియు 21 సెప్టెంబరు లలో మూడురోజులపాటు విగ్రహంపై పడతాయి. ఆలయ పరిసరాల్లో నవగ్రహాల, సూర్యుని, మహిసాసుర మర్థని, విఠల్-రఖ్మయి, 

శివుడు, విష్ణువు, తుల్జా భవాని మరియు యితర విగ్రహాలు ఉంటాయి. వీటిలోకొన్ని విగ్రహాలు 11వ శతాబ్దానికి ముందువి కొన్ని కొత్తగా ప్రతిష్ఠించినవి. ఆలయం వద్ద మణికర్ణికా కుండం అనే కొలను ఉంది. ఆ కొలను ఒడ్దున విశ్వేశ్వర మహాదేవ్ విగ్రహం ఉంది.

అమ్మవారికి రోజూ అయిదు సార్లు అర్చన జరుగుతుంది .ఉదయం అయిదు గంటలకు శ్రీ మహా లక్ష్మీ దేవికి సుప్రభాత సేవ చేస్తారు. కాకడ  హారతి ఇస్తారు. ఉదయం ఎనిమిది గంటలకు షోడశోపచార పూజ నిర్వహిస్తారు. మధ్యాహ్నం, సాయంత్రాలలో పూజ, శేజ్ హారతి జరుపుతారు. 

అమ్మవారికి ప్రతి శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. చైత్రమాసంలో వచ్చే పౌర్ణమితో పాటుగా నవరాత్రులపుడు అమ్మవారికి వేడుకలు జరుపుతారు. ప్రతి శుక్రవారం సాయంత్రాలలో, పౌర్ణమి నాడు, అమ్మవారిని ఆలయం వెలుపల ఊరేగిస్తారు.

 అగస్త్య మహాముని అచంచల శివభక్తుడు. ఏటా కాశీ వెళ్లి విశ్వనాథుణ్ణి దర్శించుకునేవాడు. అయితే వృద్ధాప్యంలో అగస్త్యుడికి సుదూరంలో ఉన్న కాశీనగరాన్ని దర్శించుకోవడం కష్టమనిపించి, శివుడి గురించి తపస్సు చేశాడు. శివుడు ప్రత్యక్షమై, వరం కోరుకోమన్నాడు.

 అగస్త్యుడు తాను వయోభారంతో ఏటా కాశీలో ఉన్న విశ్వనాథుణ్ణి దర్శించుకోలేకపోతున్నానని, కాశీకి ప్రత్యామ్నాయంగా తనకో క్షేత్రాన్ని చూపిస్తే, అక్కడే తాను శివుణ్ణి దర్శిస్తానని కోరాడు. 

కాశీతో సమానమైన ప్రాశస్త్యం గల నగరం కొల్హాపురమని, అక్కడ శ్రీ మహాలక్ష్మి అమ్మవారు కొలువై ఉన్న క్షేత్ర సందర్శనం తనను కాశీలో దర్శించుకున్నంత పుణ్యఫలాలనిస్తుందని చెప్పాడట.

శివుని ఆనతిమేరకు అగస్త్యుడు కొల్హాపూర్లో మహాలక్ష్మిని, అతిబలేశ్వరస్వామిని దర్శించి పునీతుడయ్యాడని ఇక్కడి స్థలపురాణాల ద్వారా అవగతమవుతోంది. అమ్మవారు వెలసిన తర్వాత ఈ నగరానికి కరవీరపురమనే పేరు సార్థకమైంది.

 ఈ నగరాన్ని కోల్పూర్ అని కోల్గిరి అని, కొలదిగిరి పట్టణ్ అని పిలిచేవారు. ‘కొల్లా’ అంటే ‘లోయ’అని, ‘పూర్’ అంటే పట్టణమనే అర్థంలో ఈ క్షేత్రం విలసిల్లిందని చెబుతారు. కొల్హాపూర్ క్షేత్రాన్ని 1359వ సంవత్సరం వరకు శివాజీ మహారాజు పూర్వికులు పాలించగా, 17వ శతాబ్దంలో ఛత్రపతి శివాజీ ఏలుబడిలో దినదిన ప్రవర్థమానమైందని తెలుస్తోంది.

*నిర్మాణ శైలి:*

మహాలక్ష్మి దేవాలయం 'హేమాడ్ పంతి' నిర్మాణశైలిలో కట్టబడింది. ఇది చాలా విశాలమైన ప్రాంగణంలో చుట్టూ ఎత్తైన ప్రహారీ గోడతో ఉంటుంది. ప్రాంగణం మధ్యలో ఉన్న అమ్మవారి ఆలయం ఒక అద్భుత కళాసృష్టి అని చెప్పవచ్చు. ఆలయమంతా మనోహరమైన శిల్పాలతో నిండి ఉంటుంది.

 పశ్చిమాభిముఖంగా ఉండే గర్భగుడి ముందుగా సుమారు వందడుగుల పొడవు గల విశాలమైన మండపం ఉంటుంది. గర్భగుడి చుట్టూ సన్నని ప్రదక్షిణ మార్గం వుంది. గర్భగుడిలో సుమారు ఆరడుగుల చదరంగా ఉన్న ఎత్తైన వేదిక మీద రెండడుగుల పీఠం, దానిమీద మహాలక్ష్మి విగ్రహం కూర్చొని ఉన్న భంగిమలో ఉంటుంది. మూడడుగుల ఎత్తున్న మూర్తి చాలా అందంగా ఆకర్షణీయంగా ఉంటుంది. మహారాష్ట్రీయులకు కొల్హాపూర్ మహాలక్ష్మి అత్యంత పవిత్ర యాత్రాస్థలం. వీరు అమ్మవారిని 'అంబాబాయి' అని పిలుస్తారు.

 ఇక్కడ జరిగే ప్రధాన ఉత్సవం నవరాత్రి ఉత్సవం. ముఖ్యంగా ఆశ్వయుజ శుద్ధ పంచమి నాడు విశేషంగా గొప్ప ఉత్సవం జరుగుతుంది. ఆ రోజున అమ్మవారి ఉత్సవమూర్తిని నగరానికి తూర్పుగా ఐదు కి.మీ. దూరంలో ఉన్నతెంబ్లాయి అమ్మవారి ఆలయం దగ్గరికి ఊరేగింపుగా తీసుకొని వెళ్తారు. ఇదిగాక చైత్ర పూర్ణిమ రోజున జరిగే ఉత్సవంలో అమ్మవారిని నగరమంతా ఊరేగిస్తారు. గుడి ప్రాంగణంలో ఉన్న అనేక ఆలయాలలో విఠోబా ఆలయం కూడా చాలా పురాతనమైనది.

*శ్రీ వేంకటేశ్వరుని దివ్య లీలల లో మరికొన్ని తదుపరి సంపుటిలో తెలుసుకుందాం.*

*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

నవగ్రహా పురాణం🪐* . *39వ అధ్యాయం*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

.        *🪐నవగ్రహా పురాణం🪐*  

.               *39వ అధ్యాయం*

*పురాణ పఠనం ప్రారంభం*

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐

*బుధగ్రహ జననం - 2*

చల్లటి గాలి ఒక్కసారిగా తార ముంగురుల్ని పలకరించింది. ఒక్కసారిగా ఆమె పైటను లాగి , దానితో ఆడుకుంటూ ఉండిపోయింది.

తార చేతులు కదలలేదు. వక్షభాగం మీంచి జారిపోయి , పతాకంలా ఎగురుతున్న పైటని పట్టుకుని , ఆమె కప్పుకో లేదు ! పైట అలా వదిలేసి , తార నెమ్మదిగా అడుగులు వేస్తోంది. కొంగు లాగుతూ కవ్వించే ప్రణయ నాయకుడిలా గాలి ఆమె పైటను విచ్చలవిడిగా ఊపుతోంది. దుస్తుల్ని ఆమె శరీరానికి రెండవ చర్మంలా తాపడం చేస్తోంది.

తోటలో నడయాడుతున్న తారలో ఏవో ఆలోచనలు నిశాకుసుమాలలాగా వికసిస్తున్నాయి. ఏవేవో వాంఛా సుగంధాల్ని వెదజల్లుతున్నాయి. ఎందుకో నిద్ర రావడం లేదంది భర్తతో ఆమె.

అయితే తనకు ఎందుకు నిద్ర పట్టడం లేదో తారకు తెలుసు ! నూతన శిష్యుడిగా వచ్చిన ఆ అందాల చంద్రుడు - అతనికీ , తనకు తెలియకుండానే తనకు దగ్గరవుతూ , నిద్రను దూరం చేస్తున్నాడు.

*"నీకు కోరిన పురుషుడు భర్తగా లభిస్తాడు !"* అంటూ వరమిచ్చినాడు బ్రహ్మ. ఆ పురుషుడు బృహస్పతే అని కూడా చెప్పాడు. కానీ , తనకు భర్తగా రావాలని కోరుకున్న పురుషుడు బృహస్పతి కాదనీ , చంద్రుడనీ అనిపిస్తోంది తారకు. బ్రహ్మ అనుశాసనాన్ని నమ్మి బృహస్పతి కోసం అన్వేషిస్తూ తిరిగి తను తప్పు చేసిందా ?

ఆలోచిస్తూ అడుగులు వేస్తున్న తార తటాలున ఆగింది. ఎవరో వెనక నుంచి తన పైటను పట్టి లాగుతున్నారు ! ఒక వేళ... అతనా ? తార తలతిప్పి , ఆశగా , సిగ్గుగా చూసింది. ఆమె పైటను రెమ్మ చేతుల్తో పట్టుకున్న పూలమొక్క గాలికి కదుల్తోంది. ఆమెను రమ్మని సైగ చేస్తున్నట్లు. తార విసుగ్గా పైటను లాగి , అయిష్టంగా యధాస్థానంలో వేసుకుంది.

తనలో అర్థం లేకుండా పుట్టుకొస్తూ , కల్లోల పరుస్తున్న ఆలోచనల దాడిని తప్పించుకునే ప్రయత్నంలో తార చకచకా అడుగులు వేసి , మలుపు తిరిగి అప్రయత్నంగా ఆగింది.

ఎదురుగా విద్యార్థుల విడిది , పర్ణశాలలు కనిపిస్తున్నాయి. ఆ పర్ణశాలల్లో ఎక్కడో నిద్రపోతూ ఉంటాడు చంద్రుడు ! తార అప్రయత్నంగా నిట్టూర్చి , వెనుదిరిగి ఆశ్రమం వైపు అడుగులు వేయసాగింది.

తన చుట్టూ వ్యాపిస్తూ , తన మీద దండయాత్ర సాగిస్తున్న పిల్లగాలుల్నీ , మత్తెక్కిస్తున్న పూల వాసనల్నీ తట్టుకుని , భరించే శక్తి లేని తార ఆశ్రమంలోకి వెళ్లి తలుపు మూసింది. శయనాగారం వైపు మెల్లగా అడుగులు వేసింది. లోపల్నుంచి బృహస్పతి గురక ఆమెని రమ్మని పిలుస్తోంది.

విద్యార్థులందరూ రెండు వరుసలుగా భోజనాలకు కూర్చున్నారు. ఎదురెదురుగా ఉన్న విద్యార్థుల వరుసలకు అభిముఖంగా బృహస్పతి కూర్చున్నాడు. అందరి ముందూ అరిటాకులు ఉన్నాయి. బృహస్పతి విద్యార్థుల్ని పరిశీలనగా చూస్తున్నాడు. తార వడ్డన ప్రారంభించబోతూ , బృహస్పతి వద్దకు వచ్చింది.

*"సనాతనా ! చంద్రుడేడీ ?"* బృహస్పతి ఒక విద్యార్థిని అడిగాడు.

*"ఇంకా రాలేదు గురువుగారూ..."* సనాతనుడు అన్నాడు.

*"ఎవరూ ? చంద్రుడా ?"* అందరి ముందూ ఉన్న పాత్రల్లో నీళ్ళు పోస్తున్న తార అంది. *“ఇందాకా , నీళ్ళు వొలికి పోయాయి. నదికి వెళ్ళి నీళ్ళు తీసుకురమ్మన్నాను..."* 

*"భోజన సమయం కదా..."* బృహస్పతి విద్యార్థుల పాత్రల్లో నీళ్ళు పోస్తూ ఆ చివరికి వెళుతున్న తారతో అన్నాడు.

*"భోజనం చేసి వెళ్ళమన్నాను స్వామీ ! అయితే , నీళ్ళు తెచ్చాక , నెమ్మదిగా భోజనం చేస్తానన్నాడు ! మీరు కానివ్వండి ! వచ్చాక. చంద్రుడూ , నేనూ భోజనం చేస్తాం !"* అంది. తార...

భోజనశాల గుమ్మంలో ఆగి , చంద్రుడు తటపటాయిస్తూ చూశాడు. ఎదురెదురుగా , దగ్గరగా రెండు విస్తర్లు వేసి ఉన్నాయి. ఒక విస్తరిలో పదార్థాలున్నాయి. *"రా ! చంద్రా ! ఆ విస్తరి నీదే ! నీ కోసమే వడ్డించి ఉంచాను !"*

గురుపత్ని కంఠం వినిపించి , చంద్రుడు తల తిప్పి చూశాడు. ఒక చేత్తో పాత్రా , మరో చేత్తో గరిటా పట్టుకుని వస్తోంది తార. విస్తర్ల దగ్గర ఆగి , తార తలతిప్పి చూసింది. చంద్రుడు గుమ్మం వద్దే ఉన్నాడు.

తార నవ్వు అతని చెవుల్ని తాకింది. *“ఏమిటి అలా చూస్తున్నావ్ ? నన్నా ! విస్తరినా !”*

*"మీరు... మీరు...మొదట..."* చంద్రుడు విస్తర్ల వైపు చూస్తూ అన్నాడు. *“మనిద్దరం కలిసి భోజనం చేస్తున్నట్టు మీ గురువుగారికి చెప్పాను. రా ! చంద్రా !”* తార కంఠంలో ఆజ్ఞ ధ్వనించింది.

చంద్రుడు విస్తర్ల వద్దకు అడుగులు వేశాడు. తార అతని వైపు చిరునవ్వుతో చూసింది. 

*"ఏమిటి చంద్రా , అడుగులో అడుగు వేస్తూ నడుస్తున్నావు ? అకలిగా లేదా ? నేనెంత ఆకలిగా ఉన్నానో తెలుసా ?"* తార నవ్వుతూ అడిగింది. *"కూర్చో”* చంద్రుడు కూర్చున్నాడు. తార అతని వైపే చూస్తోంది. *"ఒక్కక్షణం ! నేను కూడా వడ్డించుకుంటానేం ?"* అంటూ విస్తరి వైపు వంగింది.

ఎవరో లాగినట్లు ఆమె పైట భుజం మీంచి జారి ఆమె విస్తర్లో పడింది.

చంద్రుడు అప్రయత్నంగా తల ఎత్తి చూశాడు.

*"అరెరె... చూశావా... పైట ఎలా జారిపోయిందో. కొంచెం తీసి భుజం మీద వేయ్ చంద్రా !"* రెండు చేతుల్లోనూ ఉన్న పాత్రల్ని చూపుతూ అంది తార చిరునవ్వుతో.

*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐

సౌందర్యలహరి🌹* *శ్లోకం - 39*

 🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹

.          *🌹సౌందర్యలహరి🌹*

*శ్లోకం - 39*

🌷🪷🌷🪷🌷🪷🌷🪷🌷🪷

*తవ స్వాధిష్ఠానే హుతవహమధిష్ఠాయ నిరతం*

 *తమీడే సంవర్తం జనని మహతీం తాం చ సమయామ్ |*

 *యదాలోకే లోకాన్ దహతి మహసి క్రోధకలితే*

 *దయార్ద్రా యా దృష్టి శ్శిశిరముపచారం రచయతి ‖*

ఆజ్ఞా, విశుద్ధ, అనాహత చక్రములలో శివ శక్తుల స్వరూపం వివరించాక

 ఇప్పుడు స్వాధిష్ఠాన చక్రం వద్దకు వస్తున్నారు. నిజానికి షట్చక్రముల వరుసలో స్వాధిష్ఠానము కన్నా ముందు మణిపూర చక్రం గురించి చెప్పాలి. అయితే ప్రకృతి తత్త్వాల క్రమంలో "ఆకాశాత్ వాయుః  వాయోరగ్నిః అగ్నోరాపః   ఆపః పృధివీ" అన్నారు కాబట్టి జలతత్త్వమైన మణిపూర చక్రం కంటే ముందు అగ్నితత్త్వ స్థానమైన స్వాధిష్టాన చక్రములో వారు ఎలా కనబడతారో చెప్తున్నారు. 

ఇక్కడ ఒక ముఖ్య గమనిక ఏమంటే ఆది శంకరులు స్వాధిష్ఠాన చక్రము అగ్ని తత్త్వమనీ, మణిపూర చక్రము జలతత్త్వమనీ అభిప్రాయపడ్డారు. మహాయోగులు శ్రీ కాంచీ పరమాచార్య స్వామివారు కూడా ఈ భావనను సమర్ధించారు. అయితే, కొందరు యోగుల అభ్యాసము, అనుభవములో, స్వాధిష్ఠానము జలతత్త్వమనీ, మణిపూరము అగ్నితత్త్వమనీ భావించారు. అందుకు అనుగుణంగానే, అర్థనారీశ్వర స్వరూపంలో కుడివైపున సంవర్తరేశ్వరునీ, వామభాగాన సమయాంబనూ వారు దర్శించారు.

ఇక్కడ శివుడు సంవర్తుడు (తీవ్రమైన అగ్ని సంవర్తః ప్రళయః కల్పః క్షయః కల్పాన్తః ఇత్యతి అని 'అమరకోశం') గాను,అమ్మవారు సమయ అనీ పిలువబడతారు. శివుడు లోకాలన్నీ దహిస్తే, అమ్మవారు చల్లబరుస్తూ ఉంటుంది. చూడండి పగలు అంతా వేడిగా ఉంటే, రాత్రి చల్లబడుతుంది. పగలు, రాత్రి కలిస్తేనే రోజు. పగలు రుద్రుడు, రాత్రి అమ్మ. శివపార్వతులు కలిస్తేనే ప్రపంచం. ప్రపంచానికి వేడి, చల్లదనం, రెండూ కావాలి. లేకపోతే భూమిపై ఒక్క జీవీ మనలేదు. స్వామి అగ్నినేత్రంతో మన్మధుడిని కాల్చివేస్తే ప్రపంచ నిర్వహణ కోసం అమ్మవారు కరుణతో తిరిగి బ్రతికించింది కదా! అలాగే ప్రళయ కాలంలో రుద్రుడు అన్నిటినీ దహించివేస్తే, అమ్మవారు ఆయా చరాచర వస్తువుల బీజములను దాచివుంచి, చల్లబరిచి పునః సృష్టి చేస్తుందట. అది ఆమె కారుణ్యం.

*హర నేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవనౌషధి* *స్వాధిష్ఠానాంబు జగతా* అనే అమ్మవారి నామాలను స్మరించుదాము.

ఇక్కడ చదువరులకోసం ఈ చక్రాల భౌతిక స్థానములు, వాటి గుణములు ప్రస్తావిస్తాను.

*ఆజ్ఞా* 

నుదుటి పై, కనుబొమల మధ్య(మనో తత్త్వం) మనసును నియంత్రించేది.

*విశుద్ధి*

మెడ వెనుక ఊపిరితిత్తులకు ప్రాణవాయువును, అన్నవాహిక ద్వారా ఆహారమును, ద్రవములను, ఉదరములోకి పంపే నాడులను నియంత్రించేది. (ఆకాశ తత్త్వం)

అనాహత 

హృదయ మధ్యంలో, గుండె, ఊపిరితిత్తుల పని తీరును సమన్వయించేది. (వాయు తత్త్వం)

*మణిపూర*

నాభి వెనుక (జల తత్త్వం) ఉదర భాగములను, మూత్రపిండముల క్రియను నిర్వహించేది.

*స్వాధిష్ఠాన*

 పొత్తికడుపులో, పునరోత్పత్తికి, జననేంద్రియములకు సంబంధించిన నాడులను నియంత్రించి ఉత్తేజపరచేది. (అగ్ని తత్త్వం)

*మూలాధార*

 వెన్నెముక అడుగున. అడ్రినల్ గ్రంథి, మూత్రపిండములు, కండరములు, ఎముకలు, రక్తప్రసరణను నియంత్రించేది. (పృధివీ-భూ తత్త్వం).

రామకృష్ణ పరమహంస ఈ చక్రములను మూలాధారం నుండి సహస్రార కమలం వరకు వరుసగా భూః  భువః  సువః  మహః  జనః  తపః  సత్య లోకాలుగా వర్ణించారు.

           🙏🏻 *శ్రీమాత్రే నమః*🙏🏻

*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

సౌందర్యలహరి🌹* *శ్లోకం - 38*

 🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹

.          *🌹సౌందర్యలహరి🌹*

*శ్లోకం - 38*

🌷🪷🌷🪷🌷🪷🌷🪷🌷🪷

*సమున్మీల త్సంవిత్కమల మకరందైకరసికం*

*భజే హంసద్వంద్వం కిమపి మహతాం మానసచరం |*

*యదాలాపా  దష్టాదశగుణిత విద్యాపరిణతిః*

*యదాదత్తే దోషా ద్గుణ  మఖిల మద్భ్యః పయ ఇవ ‖*

ఈ శ్లోకంలో అనాహత చక్రంలో (హృదయ స్థానం వాయు తత్త్వం) శివ, శక్తులు ఎలా వున్నారో చెప్తున్నారు.

వీరు ఇక్కడ హంస, హంసిగా ఉన్నారట. హంసలు మానస సరోవరంలో ఉంటాయి.

కిమపి మహతాం మానసచరం = ఎవరో కొద్దిమంది మహాత్ముల మానసముల యందు హంస జంట వలే చరిస్తారట.

హంసలకు విచ్చుకున్న కమలములలోని మకరందం ఇష్టమట. అందుకని

సమున్మీలత్ సంవిత్కమల మకరందైకరసికం = బాగా వికసించిన జ్ఞానమనే కమలంలోని మకరందాన్ని ఆస్వాదిస్తుంది ఈ హంసద్వయం. అది జ్ఞానానందము. దానిని పొందాలంటే, ఈ హంస ద్వంద్వముతో తాదాత్మ్యం చెందినవారికే సాధ్యమవుతుంది.

యదాలాపా దష్టాదశగుణిత విద్యాపరిణతిః = అష్టాదశ విద్యలు అంటే వేదములు, వేదాంగములు. నాలుగు వేదములు, నాలుగు ఉపవేదములు, షడంగములు, పురాణ, న్యాయ, మీమాంస, ధర్మ శాస్త్రములు.

నాదం సంపూర్ణంగా వికసించి రూపుదిద్దుకొనే స్థానం అనాహతం. ఆహతం అంటే శబ్దం స్ఫుటంగా వినబడనిది. ఇంతకుముందు చెప్పుకున్నాము. పరమాత్మ  ప్రాణశక్తిగా ముందు జీవుడి మూలాధారంలో అతి సూక్ష్మమైన నాద రూపంగా ప్రవేశిస్తాడనీ, అక్కడ నుండి నాభియందున్న మణిపూర చక్రాన్ని చేరి అప్పుడు కొంత దిటవై ఆ నాదము "పశ్యంతి" గా మారుతుందని, ఆ తరువాత అనాహత కమలాన్ని చేరి 'మధ్యమం' గా, 'వైఖరి' గా మారి వర్ణరూపాన్ని(అక్షర రూపాన్ని) ధరిస్తుందనీ.

యదాదత్తే దోషాద్ గుణ మఖిల మద్భ్యః పయ ఇవ = హంస పాలు మాత్రమే తీసుకొని నీటిని వదిలేస్తుందట. అట్టి హంసద్వంద్వాన్ని భజిస్తున్నాను అని ఇక్కడ అంటున్నారు.

అలాగ ఆ హంస మిధునమును ధ్యానించి వారికి వారి గత జన్మల పాపములను ప్రక్కన పెట్టి వారి సద్గుణములను మాత్రమే స్వీకరించి మోక్షమును అనుగ్రహిస్తారట పరమేశ్వరుడు పరమేశ్వరి.   

వేదములు

ఋక్, యజుః, సామ, అథర్వ వేదాంగములు .

శీక్షా

శబ్దాలంకారములు, వ్యాకరణము, ఛందస్సు  నిరుక్తము 

మాటల/పదముల పుట్టుక, పరిణామక్రమము

జ్యోతిషము 

కల్పము 

వైదిక కార్యక్రమముల నిర్వహణకు  మార్గదర్శకములు.

ఉప వేదములు: ఆయుర్వేదము (ఋగ్వేదం)  ధనుర్వేదము (యజుర్వేదము)

గాంధర్వ వేదము (సామ) 

అర్థశాస్త్రము, శిల్ప శాస్త్రము (అథర్వ వేదము)

           🙏🏻 *శ్రీమాత్రే నమః*🙏🏻

*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

*🚩శ్రీ వివేకానందస్వామి🚩* . *🚩జీవిత గాథ🚩* *భాగం 51*

 🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

.    *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*

.   *ఓం నమో భగవతే రామకృష్ణాయ*

.       *🚩శ్రీ వివేకానందస్వామి🚩*

.                *🚩జీవిత గాథ🚩*   

*భాగం 51*

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

ఎన్ని గ్రంథాలు చదవమన్నా నరేంద్రుడు అద్వైతతత్వాన్ని అంగీకరించడని గ్రహించిన శ్రీరామకృష్ణులు ఆ  అనుభవాన్ని అతడికి అందించగోరారు.భావపారవశ్య స్థితిలో  ఆప్యాయంగా  నరేంద్రుణ్ణి స్పృశించి, సమాధిమగ్నులయ్యారు.

దీనిని గురించి నరేంద్రుడు తరువాత ఇలా చెప్పాడు.... 

"ఆ రోజు గురుదేవులు నన్ను స్పృశించిన క్షణంలో నా మనస్సులో ఒక విప్లవమే చెలరేగింది. ఈ లోకంలో చైతన్యం తప్ప మరేదీ లేదని నాకు అవగతమయింది. ఎంతసేపు ఈ స్థితి కొనసాగుతుందోనని ప్రశాంతంగా గమనించసాగాను. ఆ రోజంతా ఆ  అనుభూతి నా నుంచి తొలగిపోలేదు. ఇంటికి తిరిగివచ్చాను. అక్కడా అదే అనుభూతి! చూస్తున్న చోటంతా చైతన్యమే సంపూర్ణంగా నిండివుంది. 

భోజనానికి కూర్చున్నాను. అన్నం, కంచం, వడ్డించే వ్యక్తి. అన్నం తింటున్న నేను, అంతా అదే తప్ప మరేదీ కాదు! ఒకటి రెండు ముద్దలు తిని స్తంభించిపోయి కూర్చుండి పోయాను; 'ఎందుకిలా ఉన్నావు? తిను' అని అమ్మ చెప్పిన తరువాతే మళ్లీ తినసాగాను. ఈ విధంగా తింటున్నప్పుడు, విశ్రాంతి సమయంలో, కళాశాలకు పోతున్నప్పుడు సదా సర్వవేళల్లో అదే దృశ్యం! వర్ణనాతీతమైన ఏదో ఒక పారవశ్యం నన్ను ఆవరించింది. వీధిలో వెళుతున్నాను. బళ్లు వస్తున్నాయి. కాని వాటిని తప్పుకొని నడవాలి అనిపించలేదు;

ఆ బండి ఏదో, నేనూ అదే అనిపించింది. నా కాళ్లూచేతులూ మొద్దుబారిపోయాయి. అన్నం కించిత్తు కూడా రుచించ లేదు. ఎవరో తింటున్నట్లు అనిపించింది. కొన్ని సమయాలలో అన్నం తింటున్నప్పుడే నేలమీదికి ఒరిగిపోయేవాణ్ణి. లేచి కూర్చుని మళ్లీ తినేవాణ్ణి. కొన్ని సమయాలలో అతిగా తినేవాణ్ణి. అలా తినడం వలన నా కెలాంటి కీడు వాటిల్లక పోయినా అమ్మ భయపడిపోయింది. 'నీ కేదో భయంకరమైన వ్యాధి దాపురించి నట్లుంది' అనేది. 'ఇక ఇతడు బ్రతకడు' అని కూడా కొన్ని సమయాల్లో అనేది.

"ఆ అనుభూతి కాస్త ఉపశమించినప్పుడు లోకం ఒక కలలా తోచింది. హేతువా చెరువు తీరాన నడిచిపోతూ ఆ చెరువు నాలుగు వైపులా ఏర్పాటుచేసిన ఇనుప కంచె నిజమా లేక కలా అని తెలుసుకోగోరి వాటిపై తలను ఢీకొట్టి చూశాను! కాళ్లూచేతుల్లో ఎలాంటి స్పందనా లేదు; పక్షవాతం వచ్చినట్లు అనిపించింది. ఇలా కొన్ని రోజులపాటు ఆ అనుభూతి ప్రభావం నుండి విడివడలేక పోయాను. సహజ స్థితిని చేరుకున్నప్పుడు ఇదే అద్వైతానుభూతి అని గ్రహించ గలిగాను. అలా అయితే శాస్త్ర వచనాలు అసత్యాలు కావనే నమ్మకం కలిగింది. ఆ తరువాత అద్వైత తత్త్వ తీర్మానాలను నేను సందేహించలేకపోయాను.”

ఈ విధంగా ఆప్యాయతానురాగాలతో, పరీక్షలతో, ఉన్నత అనుభూతులతో ఆ అద్భుత గురువూ, అనుంగు శిష్యుడూ తమ జీవితాలను గడపసాగారు.🙏

*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

👉 *రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

వేద ఆశీర్వచనం.

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే!*

                🌷🌷🌷

*కలియుగాబ్ది 5124* *శ్రీ శాలివాహన శకం 1944 స్వస్తి శ్రీ    చాంద్రమాన శోభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం - వర్ష ఋతువు -  భాద్రపద మాసం - శుక్ల పక్షం  - పూర్ణిమ -  ఉత్తరాభాద్ర -  భృగువాసరే* *(29-09-2023)* 

ప్రముఖ వేదపండితులు,  *బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* గారి నేటి వేద ఆశీర్వచనం.

https://youtu.be/VQV3tnXxVNM?si=I2TnI2MgOnkDgL_I

🙏🙏

Amma stuti

Photo

Pilustaavaa

వనజ వివాహం..*

 *వనజ వివాహం..*

"ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలి..అని పెద్దలు చెప్పేవారు..రాను రాను రోజులు మారిపోయాయి..ఆడ మగా తేడాలేకుండా వుద్యోగాలు చేస్తున్నారు..ఎవరి సంపాదన వాళ్లకు వస్తున్నది..అందుకని పెళ్లి మీద ధ్యాస లేకుండా పోతోంది..పెద్దలం మేమెంత మొత్తుకున్నా...మామాట వినేవారు లేరు..పైగా చాదస్తం అంటున్నారు..ఇప్పుడు దీనికి ఇరవైతొమ్మిదేళ్లు వచ్చాయి..ఇప్పటికీ పెళ్లి కాలేదు..అవుతుందో లేదో కూడా తెలీదు..ఇప్పుడు మీరిద్దరూ దిగులుపడి చేసేదేమీలేదు..నేను ఆరేడేళ్ల క్రితం చెప్పాను..త్వరగా సంబంధాలు చూడండి అని..ఉద్యోగం చేస్తోంది..కొన్నాళ్ళు ఆగుదాం అన్నారు..బాంక్ లో దీని సంపాదన ఎంతుందో చూశారుగానీ..దీనికి మొగుడు ఎక్కడున్నాడో చూసారా..?" అని ఆ పెద్దావిడ తన కూతురిని అల్లుడిని నిలదీసి అడుగుతున్నది..వాళ్లిద్దరూ తలవంచుకొని నిలబడివున్నారు..

ఆవిడ నా వైపు తిరిగి.."నాయనా ప్రసాదూ..నీకు వీళ్ళిద్దరూ తెలుసుకదా..నాకూతురు, అల్లుడు..అది నా మనుమరాలు..ఈరోజు ఇక్కడికి ఎందుకొచ్చామో నీకు అర్ధమైంది కదా..ఈ పిల్లకు వివాహం చేయాలి..ఒకసారి ఈ స్వామివద్ద నిద్ర చేసి వెళదాము రమ్మన్నాను..ఇప్పటికి ఒప్పుకొని వచ్చారు..నావరకూ ఈ మంటపం లోనే పడుకుంటాను..వీళ్లకు ఏదైనా ఒక రూము ఉంటే చూడు..ఈ పిల్లను కూడా నాతో బాటు ఇక్కడే నిద్ర చేయమని చెపుతున్నాను.." అన్నది.."అలాగే నమ్మా..ఈరోజు సోమవారం..రూములు కూడా ఖాళీగా ఉన్నాయి..వాళ్లకు రూము కేటాయిస్తాను.." అని చెప్పాను..మా సిబ్బందికి చెప్పి వాళ్లకు రూము ఇప్పించాను..

ఆరోజు సాయంత్రం నాలుగు గంటల వేళ..ఆ పెద్దావిడ..తన మనుమరాలికి తలారా స్నానం చేయించి..ఆ తడిబట్టలతోనే..స్వామివారి మందిరం లో నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేయించింది..ఆ అమ్మాయి కూడా అమ్మమ్మ చెప్పిన మాటను బుద్దిగా విన్నది..ఆ పిల్ల తల్లిదండ్రులు ఈ తతంగమంతా మంటపం లో కూర్చుని చూస్తున్నారు..ప్రదక్షిణాలు పూర్తయ్యేసరికి..స్వామివారికి సాయంత్రం హారతి ఇచ్చే వేళ అయింది..మందిరం లో భక్తులందరూ..బావి వద్దకు చేరారు..అర్చకస్వాములు స్వామివారి వెండి పాదుకలు భక్తులకు అందచేశారు..ఆ పాదుకులకు స్వామివారు తమ అవసరాలకు వాడుకున్న బావి లోని నీటితో శుభ్రం చేసి..ఆ పాదుకుల మీదుగా జాలువారే నీటిని తీర్ధం గా తీసుకోసాగారు..అప్పటిదాకా ఇదంతా చూస్తున్న ఆ అమ్మాయి..గబ గబా బావి వద్దకు వెళ్లి..తాను కూడా ఆ పాదుకుల తాలూకు నీళ్లను దోసిలితో పట్టుకొని..మూడు సార్లు తీర్ధం లాగా తాగింది..మిగిలిన నీళ్లను తన అమ్మమ్మ చేతిలో పోసింది..ఆవిడా భక్తిగా కళ్లకద్దుకొని మరీ తీసుకున్నది..

ఆరోజు రాత్రి ఆ పెద్దావిడ, ఆ మనుమరాలు ఇద్దరూ స్వామివారి మంటపం లోనే పడుకున్నారు..తెల్లవారుజామున ఇద్దరూ నిద్రలేచారు..ఈసారి ఆ అమ్మాయి తనంతట తానే స్నానం చేసివచ్చి..స్వామివారి మందిరం లో నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేయసాగింది..స్వామివారికి ప్రభాతసేవ లో హారతి ఇచ్చే సమయానికి ఆ అమ్మాయి ప్రదక్షిణాలు పూర్తి అయ్యాయి..స్వామివారి హారతి తీసుకున్న తరువాత..అమ్మమ్మ తో కలిసి నా వద్దకు వచ్చింది.."అమ్మమ్మ చాలా రోజుల నుంచీ ఈ క్షేత్రం గురించి మాతో చెపుతున్నది అంకుల్..పెద్దగా పట్టించుకోలేదు..కానీ ఇక్కడ చాలా వైబ్రేషన్స్ ఉన్నాయి..ఇలా వుంటుంది అని తెలియక నేను జాబ్ కు రెండు రోజులే లీవ్ పెట్టాను..నేను ఈరోజు వెళ్లి..మళ్లీ లీవ్ అప్లై చేసుకొని వచ్చేవారం వచ్చి మరో ఐదు రోజులు ఇక్కడే ఉంటాను.." అన్నది.."అలాగేనమ్మా.." అన్నాను..ఆరోజు మధ్యాహ్నం వాళ్ళు ఊరెళ్లిపోయారు..ఆ అమ్మాయి ఆవేశం లో ఏదో చెప్పిందిలే అని అనుకున్నాను..ఆ విషయమే మర్చిపోయాను కూడా..కానీ సరిగ్గా వారం తరువాత..మళ్లీ సోమవారం ఉదయానికి తన అమ్మమ్మ ను తీసుకొని స్వామివారి మందిరానికి వచ్చింది..ఆ వారం అంతా అమిత నిష్ఠగా రోజూ రెండుపూటలా..స్వామివారి నామాన్ని పలుకుతూ..నూటఎనిమిది ప్రదక్షిణాలు చేయడం..ప్రతిరోజూ సాయంత్రం స్వామివారి పాదుకలు కడిగిన నీటిని తీర్ధంగా తీసుకోవడం..రాత్రికి మంటపం లో పడుకోవడం చేసింది..ఆ తరువాతి ఆదివారం సాయంత్రం తిరిగి ఊరెళ్లి పోయింది..

పదిహేనురోజులు గడిచిపోయాయి..ఒక ఆదివారం సాయంత్రం ఏడుగంటలకు..నాకు ఫోన్ వచ్చింది.."అంకుల్ నేను వనజను మాట్లాడుతున్నాను.." అన్నది..నాకు గుర్తురావడం కోసం..పెద్దావిడ పేరును చెప్పి..ఆవిడ మనుమరాలిని అనికూడా చెప్పి.."ఈరోజే నా వివాహం నిశ్చయం అయింది..అంతా స్వామివారి దయ..అమ్మమ్మ చూపిన మార్గం ఇది..వచ్చే నెలలోనే పెళ్లి..అమ్మమ్మ ను తీసుకొని ఈ వారం లో స్వామివారి వద్దకు వచ్చి..ఒకరోజు నిద్రచేసి వెళతాను..మాకు మీరందించిన సహకారం మర్చిపోలేము.." అని ఉద్వేగంతో చెప్పింది.."చాలా శుభవార్త చెప్పావు తల్లీ.." అన్నాను..అనుకున్న ప్రకారమే తన అమ్మమ్మ తోపాటు తల్లీదండ్రుల ను కూడా వెంటబెట్టుకొని వచ్చి..స్వామివద్ద ఆరోజుకూడా నూటయేనిమిది ప్రదక్షిణలు చేసి..ఆ రాత్రికి నిద్రచేసి స్వామివారి సమాధికి నమస్కారం చేసుకొని వెళ్లిపోయింది..

ఈ సంఘటన జరిగి ఏడేళ్లు అవుతోంది..ఇప్పుడు ఆ వనజ ఇద్దరు బిడ్డల తల్లి..తన వివాహం జరిగిన నెలలోపే భర్తతో సహా ఒక శనివారం నాడు మొగిలిచెర్ల వచ్చి..ఆరోజు పల్లకీసేవ లో పాల్గొని..ప్రక్కరోజు ఆదివారం ఉదయం నూటఎనిమిది ప్రదక్షిణాలు చేసి..స్వామివారి సమాధి కి నమస్కారం చేసుకొని..ఆరోజు అన్నదానానికి  అయిన ఖర్చు పెట్టుకొని.."అంకుల్..ఇకనుంచీ ప్రతియేడూ మా పెళ్లిరోజు నాడు ఇక్కడ అన్నదానం చేయిస్తాము..ఆ అవకాశం మాకు ఇవ్వండి.." అన్నది.."అమ్మా ప్రతిఏడూ ఒక శనివారం రాత్రికి అన్నదానానికి అయ్యే వ్యయం నువ్వు భరించు..మీ పెళ్లిరోజు శనివారం నాడు వస్తే ఇబ్బంది లేదు..ఒకవేళ అలా రాకుంటే..ఆ ప్రక్క శనివారం రాత్రికి మీ దంపతుల పేరు తో అన్నదానానికి ఖర్చు పెట్టు..ఎందుకంటే..నువ్వే కళ్లారా చూశావు..ప్రతి శనివారం సుమారు ఒక వేయి మంది పైనే భోజనం చేస్తారు.." అన్నాను..సంతోషంగా ఒప్పుకున్నది..అప్పటి నుంచీ అదే నియమం పాటిస్తోంది..

"దీని తల్లీదండ్రీ మనసు మార్చడం కన్నా..ఈ పిల్ల మనసు మార్చాడు నాయనా స్వామివారు..నా నమ్మకం వమ్ముకాలేదు..మహానుభావుడి ముందు మొక్కుకున్న మొక్కులు వృధాగా పోవు.." అంటుంటారు ఆ పెద్దావిడ ఇప్పటికీ..

సర్వం..

శ్రీ దత్తకృప!

(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..వయా కందుకూరు..లింగసముద్రం మండలం..SPSR నెల్లూరు జిల్లా..పిన్ : 523114..సెల్..94402 66380 & 99089 73699).