29, సెప్టెంబర్ 2023, శుక్రవారం

సందేశాల ప్రాముఖ్యత.

 *WhatsApp సందేశాల ప్రాముఖ్యత.*


వార్తాపత్రిక డెలివరీ బాయ్ చెప్పిన హృదయాన్ని హత్తుకునే కథ.

 *"సౌండ్ ఆఫ్ నాకింగ్"* 


  ప్రతిరోజు నేను వార్తాపత్రికను  వేసే ఇంట్లో ఒకదానిలో మెయిల్‌బాక్స్ బ్లాక్ చేయబడింది.


 నేను వారి తలుపు తట్టగా , ఒక వృద్ధుడు  తడబడే అడుగులతో , తలుపులు తీసి బయటకు వచ్చాడు .


  నేను అడిగాను, 

*సార్, మెయిల్ బాక్స్ ఎంట్రన్స్ ఎందుకు బ్లాక్ చేయబడింది?*


 ఆయన చిరునవ్వుతో బదులిచ్చాడు.

*దయచేసి మీరే ప్రతిరోజు ఉదయం  నా ఇంటి తలుపు తట్టండి లేదా కాలింగ్ బెల్ కొట్టి పేపర్ ని నాకు వ్యక్తిగతంగా అందించండి.*

*ఆ ఉద్దేశంతోనే  మెయిల్ బాక్స్ ని బ్లాక్ చేశాను."*


 నాకు ఏమీ అర్థం కాక -

*తప్పకుండా, కానీ అది  మన ఇద్దరికీ అసౌకర్యంగా మరియు సమయం వృధాగా అనిపిస్తుంది*

 అని జవాబిచ్చాను.


  *అది ఫర్వాలేదు... ప్రతి నెలా రూ. 500/- అదనంగా ఇస్తాను* అన్నాడు, ప్రాధేయపడే భావంతో.

 

నేను షాక్ అయ్యి *ఎందుకు?* అన్నాను.


*నా భార్య చనిపోయింది, నా కొడుకు విదేశాల్లో ఉన్నాడు, నేను ఇక్కడ ఒంటరిగా జీవిస్తున్నాను, నా సమయం ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలుసు?*


ఆ సమయంలో, నేను తేమతో కూడిన ఆయన కళ్ళు చూశాను. 


 *నేను వార్తాపత్రికను ఎప్పుడూ చదవను. తట్టడం లేదా డోర్‌బెల్ మోగడం వంటి శబ్దం వినడానికి -  ప్రతిరోజు తెలిసిన వ్యక్తితో సంతోషంగా కొద్దిసేపు మాట్లాడటానికి వీలుగా , పేపర్ చందా కట్టాను .*


 అతను చేతులు జోడించి, 🙏🏻

*యువకుడా, దయచేసి నాకు సహాయం చేయండి!* 


*ఏదో ఒకరోజు మీరు తలుపు తట్టినా లేక  కాలింగ్ బెల్ కొట్టినా - నేను  సమాధానం చెప్పకపోయినా , బయటకు రాలేకపోయినా , దయచేసి పోలీసులను పిలవండి!"*


*ఇదిగో నా కొడుకు ఓవర్సీస్ ఫోన్ నంబర్. దయచేసి అతనికి తెలియచేయండి* అన్నాడు.


ఇది చదివిన తరువాత, మా స్నేహితుల సర్కిల్‌లో  ఉన్న చాలా మంది వృద్ధ  మిత్రులు  గుర్తుకొచ్చారు . 


కొన్నిసార్లు, వారు తమ వృద్ధాప్యంలో - వారు ఇప్పటికీ పని చేస్తున్నట్లే , వాట్సాప్‌లో ఎందుకు సందేశాలు పంపుతారని  అనుకునేవాడిని. 


వాస్తవానికి, ఈ ఉదయం మరియు  రాత్రి  శుభాకాంక్షల యొక్క ప్రాముఖ్యత -

డోర్‌బెల్ కొట్టడం లేదా మోగించడం అనే అర్థాన్ని పోలి ఉంటుంది.


ఇది ఒకరికొకరు భద్రతను కోరుకునే మరియు సంరక్షణను తెలియజేయడానికి ఒక మార్గం. 


ఈ రోజుల్లో, WhatsApp చాలా సౌకర్యవంతంగా ఉంది .


ఒకరోజు, మీరు వారి మార్నింగ్ గ్రీటింగ్‌లు లేదా షేర్ చేసిన కథనాలను అందుకోకపోతే, వారు అనారోగ్యంతో ఉండవచ్చు లేదా వారికి ఏదైనా జరిగి ఉండవచ్చు. 🥺


దయచేసి మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యుల పట్ల శ్రద్ధ వహించండి. 


ఇది చదివాక నా కళ్లలో నీళ్లు తిరిగాయి !😢

కామెంట్‌లు లేవు: