*సంస్కృత భారతీ*
*13*
*త్రయోదశపాఠః*
*సంస్కృతే ఫలాని*
ఆమ్రఫలం/చూత ఫలం = మామిడి పండు,
తింత్రిణీఫలం = చింత పండు,
కదళీఫలం = అరటిపండు,
జంబూ ఫలం = నేరేడు పండు,
బదరీ ఫలం = రేగు పండు,
ఖర్జూరఫలం = ఈతపండు,
సేవఫలం/ అమృతఫలం = ఆపిల్ పండు,
దాడిమీఫలం = దానిమ్మ పండు,
ఇక్షుఖండం = చెరుకుముక్క,
బీజాపూరఫలం = జామ పండు,
మధుకర్కటీ = బొప్పాయి పండు,
ఆమలకం = ఉసిరి,
నింబఫలం = నిమ్మపండు,
జంభీర/కమలాఫలం = కమలా పండు,
కపిత్థ ఫలం = వెలగ పండు,
ద్రాక్ష ఫలం = ద్రాక్ష పండు,
నారింగ ఫలం = నారింజ పండు,
శుష్క ద్రాక్ష = ఎండు ద్రాక్ష, హరీతకీ = కరక్కాయ,
శ్రీ ఫలం = మారేడు పండు...
*** కొన్ని ఫలాల పేరు లు తెలియనప్పుడు అమృత ఫలం అని ప్రయోగిస్తాము.ఉదాహరణకు జామ,ఆపిల్ వీటికి అమృతఫలం అనే పర్యాయపదం కూడా వాడుకలో గలదు.
*ప్రయోగ విభాగః*
*౧* ప్రతి దినం ఏకం సేవఫలం వా ఆమలకం ఖాదన్తిచేత్ అనారోగ్యం న వర్తతే (ప్రతి రోజు ఒక ఆపిల్ పండు లేదా ఉసిరి తింటూ ఉంటే అనారోగ్యం ఉండదు.)
*౨*. కదళీఫలం సర్వదా రోగదాయకం భవతి (అరటిపండు ఎల్లప్పుడూ రోగ ములు కలిగించేది అగును.)
*౩*. నింబఫలరసం సోదకం శర్కరామధు సమ్మిళితం స్వాదుర్భవతి తథా ఆరోగ్యకరం చ(అపి) భవతి.(నిమ్మ రసం నీటితో కలిపి(సోదకం) చక్కెర, తేనె(మధు)లతో కలిపినది రుచికరంగా ఉంటుంది, అలాగే ఆరోగ్య కరంగా కూడా ఉంటుంది.
*౪* . ఇక్షురసం ఆర్ద్రకరసయుతం స్వాదుః తథా పైత్యహరకరం భవతి. (చెరకు రసం అల్లం(ఆర్ద్రకం) తో కలిసియున్నది రుచిగా అలాగే పైత్యమును హరించేదిగా ఉంటుంది.).
*౫*. ద్రాక్ష రసం తక్షణ శక్తి దాయకం భవతి (ద్రాక్ష రసం వెంటనే శక్తి ని ఇచ్చేది అగును.).
*౬*. ప్రతి దినం ఖర్జూరఫల ఖాదనేన హృద్రోగభయం న వర్తతే, తథా నాడీబలహీనం న పీడతి.(ప్రతి రోజు ఖర్జూరఫలాలు తినుటచే గుండె జబ్బుల భయం ఉండదు, అలాగే నరాల బలహీనత బాధించదు.
*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి