🌸1. పాడ్యమి నాడు
శ్రాద్ధ కర్మ చేయటం వల్ల ధన సంపద లభిస్తుంది.
🌿2. ద్వితీయనాడు
శ్రాద్ధ కర్మ చేయటం వల్ల రాజయోగం, సంపద లభిస్తుంది.
🌸3. తృతీయనాడు
శ్రాద్ధ కర్మ చేయటం వల్ల శత్రువులు నశిస్తారు.
🌿4. చతుర్దినాడు
శ్రాద్ధ కర్మ చేయటం వల్ల ధర్మగుణం, ఇష్టకామ్య ప్రాప్తి కలుగుతుంది, అంతే కాకుండా శత్రువుల వ్యూహాలు ముందుగా పసిగట్టగలరు.
🌸5. పంచమి నాడు
శ్రాద్ధ కర్మ చేయటం వాళ్ళ ఉత్తమ లక్ష్మీ ప్రాప్తి కలుగుతుంది. పుత్రకామన గలవారికి ఫలం లభిస్తుంది.
🌿6. షష్ఠి నాడు
శ్రాద్ధ కర్మ వల్ల దేవతలు పితరులు ప్రసన్నులవుతారు, ఆ వ్యక్తి కి సమాజం లో శ్రేష్ఠ గౌరవం లభిస్తుంది.
🌸7. సప్తమి నాడు
శ్రాద్ధ కర్మ వల్ల యజ్ఞం చేసిన పుణ్య ఫలం లభిస్తుంది.
🌿8. అష్టమి తిథి నాడు
శ్రాద్ధ కర్మ వాళ్ళ చేస్తే సంపూర్ణ సమృద్ధి, ధనం, బుద్ది ప్రాప్తిస్తాయి.
🌸9. నవమి నాడు
శ్రాద్ధ కర్మ చేస్తే విస్తారం గా సంపద, అనుకూలవతి అయిన భార్య లభిస్తుంది.
🌿10. దశమి నాడు
శ్రాద్ధ కర్మ చేస్తే లక్ష్మీ ప్రాప్తి, పశు సంపద వృద్ది చెందుతుంది.
🌸11. ఏకాదశి నాడు
శ్రాద్ధ కర్మ చేస్తే సర్వ శ్రేష్ఠ దాన ఫలం లభిస్తుంది, అన్ని పాపాలు నశిస్తాయి, వేద జ్ఞానం ప్రాప్తిస్తుంది , కుటుంబం వృద్ది చెందుతుంది.
🌿12. ద్వాదశి నాడు
శ్రాద్ధ కర్మ చేస్తే దేశం అబివృద్ది చెందుతుంది. శ్రాద్ధ కర్త కు అన్నానికి లోటుండదు, అలాగే పుత్ర, పశు, మెధా బుద్ధి, జయ సంపత్తి కలుగుతుంది.
🌸13. త్రయోదశి నాడు
శ్రద్ద కర్మ చేస్తే ధనం, సంతతి, ఐశ్వర్యం, దీర్ఘాయువు, ఆరోగ్యం , బంధుమిత్రులలో గౌరవం లభిస్తాయి.
🌿14. చతుర్దశి నాడు
శ్రాద్ధ కర్మ చేస్తే ఆయుధాల నుండి రక్షణ లభిస్తుంది.
🌸15. అమావాస్య నాడు
శ్రాద్ధ కర్మ చేస్తే వ్యక్తి కి సమస్త లాభాలు కలుగుతాయి, అన్ని కోరికలు నెరవేరుతాయి.
🌿ప్రతి సంవత్సరం చేసే శ్రాద్ధం కన్నా అతి ముఖ్యమైన శ్రాద్దాలు ఈ మహాలయపక్షం పదిహేను రోజులు చేయలేనివారు ఒక్క మహాలయమైన చేసి తీరాలి.
🌸ఆర్దిక భావం వలన విద్యుక్తంగా శ్రాద్ధ కర్మలు చేయలేక పొతే, పితృ పక్షం లో కేవలం శాకంతో శ్రాద్ధం చేయవచ్చు. అది కూడా వీలు కాక పొతే గోవుకు గ్రాసం పెట్టవచ్చు.
🌿అదీ చేయలేని వారు ఒక నిర్జన ప్రదేశం లో నిల్చొని అపరాన్న సమయం లో రెండు చేతులు ఆకాశం వైపు పైకి ఎత్తి, పితృ దేవతలకు నమస్కరించవచ్చు. శ్రాద్ధ కర్మ చేత పితృ దేవతలకు సంతృప్తి కలిగించిన వ్యక్తికి భౌతికంగా సుఖ సంతోషాలు, పరలోకం లో ఉత్తమ గతులు లభిస్తాయని శాస్త్రాల ద్వారా తెలుస్తోంది...స్వస్తి...🚩🌞🙏🌹🎻
🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి