రామాయణమ్ 339
...
అతడు పరాక్రమవంతుడు
అతడు ధర్మమూర్తి
అతని బాణమునకు ఎదురులేదు
అతనితో మనకేల వైరము
ఆతని భార్యను ఆతనికిచ్చివేయుము!
.
నీవే స్వయముగా తీసుకొని వెళ్ళి ఆయన భార్యను ఆయనకు అప్పగించుము అదే మనకు శ్రేయస్కరము!
.
నేను నీ బంధువు అగుట చేత బ్రతిమిలాడుచున్నాను ,నా మాట వినుము ..నీకు హితమును గూర్చు సత్యమునే పలుకుచున్నాను.
.
రామ శరము నీ శిరములను ఎగురగొట్టకముందే అతని ప్రియసతిని అతనికి తిరిగి ఇచ్చివేయుము!
.
అన్నా ! ధర్మమును నశింపచేయు కోపమును విడిచిపెట్టుము..ధర్మమార్గములో ప్రయాణము నీకు కీర్తిని ,యశస్సును పెంపొందింపగలదు.
.
నీవు, మేము, మనము అందరమూ సుఖముగా జీవించగలము !
.
అని పలికిన విభీషణుని పలుకుల విని మారుమాటాడక అందరినీ పంపి వేసి తన ఇంటిలోనికి వెడలిపోయినాడు రావణుడు.
.
అది ప్రాతః కాలము మరల విభీషణుడు రావణునుని గృహమునకు వెళ్ళెను.
.
NB
.
కామందక నీతి.
.
ఏ శత్రువు పై విజయము సాధించవచ్చు ..(తరువాయి భాగము)..ఏ partyని ఓడించవచ్చు
.
ప్రజల విశ్వాసము కోల్పోయినవాడు
.
ఇంద్రియ లోలుడై విషయభోగాల పట్ల అతిగా ఆసక్తి కలవాడు.
.
భిన్నాభిప్రాయాలతో ఒకరంటే ఒకరికి పడని మంత్రిమండలి కలవాడు.( ఏకతాటిమీద తన ministers లేని పాలక పార్టీలు)
.
విద్యావంతులను ,మేధావులను అవమానించువాడు. ( intellectuals ను insult చేసే పార్టీలు)
.
దైవ బలము లేనివాడు
.
కరువు కాటకాలతో అల్లలాడుచున్న దేశమును పాలించువాడు
.
సైన్యములో కలతలు ఉన్నవాడు (తన కాడర్ లో కలతలు ).
.
తన దేశములోతానుండని వాడు.
.
ఒకేసారి అనేకమంది చుట్టుముట్టినప్పుడు..(.united political fronts.).
.
మరణము ఆసన్నమైనవాడు (వృద్ధుడైనప్పుడు).
.
ఈ విధమైన పరిస్థితులు ఉన్నప్పుడు శత్రువుమీద విజయము సాధించవచ్చు.
.
వూటుకూరు జానకిరామారావు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి