3, ఏప్రిల్ 2021, శనివారం

Covid home remedy

 Forwarded

Received in a Health Group posted by a Qualifed Doctor

Sharing an Incident that happened with Mr. Pramod Malkan. His daughter-in-law was tested positive for Covid and oxygen level went down to 80-85 and immediate hospitalization was recommended.

Being skeptical abt the treatments at hospitals, Mr. Pramod decided to use a home remedy instead. 

He mixed a cube of camphor with a spoon of carom seeds and tied it in a piece of cotton cloth. He then made her smell it 10-15 times with deep breaths and repeat the same action every two hours.

Within 24 hrs her oxygen level went to 98-99 without any hospitalization. 

After this, he helped one of his friends who was hospitalized for covid with the same remedy and as a result, his friend was released from the hospital. 

The only reason for sharing this is to help as many people as possible.


Carom seeds is  -  వాము

ఎదురు దుశ్శకునం కాదు

 *#ఒంటి బ్రాహ్మణుని #ఎదురు దుశ్శకునం కాదు*


#ఆమధ్య ఒక పెద్దమనిషి ఇంటిలోంచి బయటకు వెల్తున్నాడు, ఒక బ్రాహ్మణ కులస్థుడు ఎదురు పడ్డాడు. "బ్రాహ్మణుడి ఎదురేంటిరా బాబూ ఇయ్యేల" అంటూ మళ్లీ వెనక్కి ఇంటిలోకి వెళ్లిపోయాడు. ఊరి పెద్ద అక్కడే ఉండడం తటస్థించింది. ఆయన మామూలుగా ఆ ఎదురు శంక లేకుండా హాయిగా బయటకు వెళ్లేరు. తరువాత ఆ పెద్దమనిషి అదేంటండీ బ్రాహ్మణుని ఎదురు మంచి శకునం కాదు అంటారు కదా. మీరేమిటి గమనించలేదా అని అడిగాడు.  అప్పుడు ఆయనను స్థిమితంగా కూర్చోబెట్టి ఊరి పెద్ద ఆయనకు ఏం చెప్పేరంటే...


చాలామందికి ఈ అపోహ ఉంది. ఇదే విషయాన్ని నేను లోగడ ఒక వైష్ణవ పండితుని అడిగేను. అప్పుడు ఆయన ఇచ్చిన సమాధానం నాకు సముచితంగా తోచింది.  


ఒంటి బ్రాహ్మణుడు కాదు. ఒంటి బ్రహ్మచారికి మాత్రమే ఇది వర్తిస్తుంది. పూర్వం గురుకులాలలో ప్రతీ రోజు గురువుగారు తనవద్ద విద్యనభ్యసిస్తున్న బ్రహ్మచారుల ను బిక్షాటనకు పంపేవారు. ఒక్కొక్క బ్రహ్మచారి ఒక్కొక్క వీధిలోని గృహాల నుండి బిక్ష సేకరించేవారు.  అటువంటి బ్రహ్మచారి ఎదురయితే ఆయనను సాదరంగా ఆహ్వానించి బిక్షవేసి సాగనంపాలి. అటువంటి ఒంటి బ్రహ్మచారి ఎదురయి నప్పుడు ఆయనను నిర్లక్ష్యంచేసి బిక్ష వెయ్యకుండా ఇంటినుండి బయటకు వెళ్లడం మంచి పనికాదు అని దాని పరమార్థము.


ఒకరు కాకుండా ఇద్దరు లేక ఆపైన ఎంతమంది ఎదురయినా వారు ఏదో సమావేశానికో, చర్చలకో వెళ్తూన్నారని అర్ధం.    


ఈ రోజులలో బిక్షాటన చేసే బ్రహ్మచారులూ లేరు. గురుకులాలు అంతకన్నా లేవు. అందుచే ఒంటి లేక జంట బ్రాహ్మణులు ఎంతమంది ఎదురయినా అది మంచి శకునమే గాని దుశ్శకునం ఎంత మాత్రమూ కాదు. 


ధర్మ ము అంటూ ఎవరయినా ఎదురయితే అతను బ్రాహ్మణుడవనీయండి, బ్రాహ్మణేతరుడవనీయండి వీలయితే అతనికి మీకు చేతనైన సహయము  చేసి కదలండి. మీరనుకున్న కార్యం దిగ్విజయంగా నెరవేరుతుంది. సాటి మానవుడి ఎదురు, సాటి జీవాల ఎదురు మంచిది కాదని చెప్పడానికి మన జ్ఞానమెంత. 


ఒకవేళ ఏదైనా కారణం ఉన్నప్పటికి అది ఆసమయంలో అప్పుడున్న పరిస్థితులకు అనువుగా పెట్టుకున్నవి అయి ఉంటాయి. అది ఈ రోజులలో వర్తించదు." అని ముగించారు. 


*ఇటువంటి అప-ఊహలను (అపోహలను) సమాజంలో దూరం చెయ్యడం ప్రతి ఒక్కరి విధి👨🍃

మొదటి పూజ

 *నిత్యపూజలో మొదటి పూజ ఎవరికి చేయాలి ? ఎందుకు చేయాలి ?*

      🌸🌸🌸


వైష్ణవ ధర్మంలో కూడా విష్వక్సేనుల వారి ఆరాధన చేస్తే ఆయనకున్న పద్దెనిమిది శిరస్సులలో తొమ్మిదవ శిరస్సు గణపతి. వైష్ణవమైనా, శైవమైనా, మధ్వమైనా యే ధర్మమైనా, యే మార్గమైనా అన్నింటికీ మూలము గణపతి. “గణానాం పతిః – గణపతి!” ఈ దేహంలో ఉండేటటువంటి ఎనిమిది అష్టకములకు పురీఅష్టకములని పేరు. సంక్షిప్తంగా జ్ఞాపకం పెట్టుకుంటే మన దేహం పైన మనకు నియంత్రణను కలిగించేవాడు గణపతి. దేహంపైన నియంత్రణ లేకపోతే మనస్సు చంచలమౌతుంది. గణపతి అనుగ్రహం లేని స్థితి అది. మానసిక స్థితిగతులన్నింటినీ నియంత్రించేవాడు గణపతి కనుక ఆయనను స్తోత్రం చేస్తే కూర్చునే బుద్దినిస్తాడు. శరీరం కూర్చోవడం కాదు మనస్సును కూర్చోబెట్టడం. చంచలమైన మనస్సును ఏదైనా ఒక విషయంపట్ల స్థిరంగా కూర్చోబెట్టగల నేర్పు గణపతికే ఉంది.


కనుక యే దేవతారాధన చేసినా, నిత్య దేవతారాధనలో కూడా గణపతి పూజకంటే పూర్వం “శ్రీగురుభ్యోనమః” అనాలి. గణపతిని, పూజావిధానాలను మనచేత ఆచరింపజేస్తున్నటువంటి వారు గురుదేవులు గనుక శ్రీగురుభ్యోనమః అని ప్రారంభం చేసి శ్రీమహాగణాధిపతయే నమః అనగానే మన శరీరం మీద ఒక ఆధిపత్యం మనకు వచ్చేస్తుంది. ఆధునిక భాషలో Command లేదా శరీరాన్ని Tune చేసుకోవడం అంటారు. నిత్యపూజలో గణపతికే మొదటి పూజ చేయాలి. గణపతి పూజ లఘువుగా చేసుకొని ఇష్టదేవతారాధన చేసుకోవచ్చు. గణపతికి కుంకుమ, గంధము, గరిక పెట్టి గణపతిని నైరుతి దిక్బాగంలోకి జరిపి ఆ పిమ్మట మిగతా పూజంతా చేస్తే మనకు కూర్చునేటటువంటి ఓపిక, లక్ష్యశుద్ధి, లక్షణ శుద్ధి ఏర్పడతాయి. కనుక నిత్యపూజలోనైనా గణపతిని సూక్ష్మంగానైనా పూజ చేయాలి.

       🌸🌸🌸

*మీ... శివలోకం ప్రాజెక్ట్*

క్రూర కర్మలు

 ఏవి క్రూర కర్మలు?


మనిషికి నడక కన్నా నడత అందంగా ఉండాలి. అందమైన నడత కలిగిన వారికి గౌరవం దక్కుతుంది. చిరకీర్తి కలుగుతుంది. నడత అనేది మనిషి ప్రవర్తనకు ప్రతిబింబం. ఈ ప్రవర్తన కులం, జాతి, మతం, ప్రాంతం, పుట్టుక లాంటి వాటి వల్ల రాదు. అది వారి శీలగుణ సంపద మాత్రమే! ఎవరైతే గుణశీలురుగా జీవిస్తారో వారికి అది సహజంగానే సంక్రమిస్తుంది. కాబట్టి మన నడతకు మూలం శీలగుణం మాత్రమే! కానీ సమాజంలో పుట్టుక, కులాలను బట్టి గుణశీలాలు ఉంటాయనే అపోహ ఉంది. దానివల్ల కొందరిలో అహంభావమూ ఉంది. అలాంటి అహంభావుల్లో అగ్ని భరద్వాజుడు ఒకడు.

 ఒక రోజు బుద్ధుడు తన శిష్యులతో కలసి శ్రావస్తి నగరంలోని ఒక వీధిలో ప్రవేశించాడు. ఆ వీధిలో అగ్ని ఆరాధకుడైన భరద్వాజుడు ఉంటున్నాడు. ఆయన అప్పుడే అగ్నిహోత్రాన్ని ప్రజ్వలింపజేస్తున్నాడు. ఇంతలో వాకిటి తలుపులో నుంచీ బుద్ధుణ్ణి చూశాడు. తన ఇంటికే భిక్ష కోసం వస్తున్నాడని అనుకున్నాడు. గబగబా వీధి గుమ్మం దగ్గరకు వెళ్ళి ‘‘ఓ శ్రమణకా! ఆగవయ్యా ఆగు! ఓయీ! చండాలా (వసలా)! ఎక్కడకి వస్తున్నావు?’’ అని గద్దించాడు. అతని దృష్టిలో క్రూర కర్మలు చేసేవాడు చండాలుడు. కులభేదాలు చూడకుండా అందరి ఇళ్ళల్లో ఒకే రీతిగా అంటూసొంటూ లేకుండా భిక్ష స్వీకరిస్తాడు కాబట్టి బుద్ధుడూ చండాలుడే అనేది ఆ భరద్వాజుని అభిప్రాయం. 

అతని మాటలకు బుద్దుడు ఆగి - ‘‘భరద్వాజా! నీకు ఏది చండాలత్వమో తెలుసా?’’ అని అడిగాడు. ‘‘క్రూరకర్మల ఆచరణ’’ అన్నాడు భరద్వాజుడు.  ‘‘ఏవి క్రూరకర్మలు?’’ ‘‘హింసించేవి క్రూరకర్మలు.’’ ‘‘ఔను భరద్వాజా! ఏ పనులైతే మనిషినీ, సమాజాన్నీ హింసిస్తాయో అవి మాత్రమే క్రూరకర్మలు. కోపం క్రూరకర్మ. నిష్కారణంగా ఇతరులను నిందించడం క్రూరకర్మ. పాపాలు చేయడం, ద్వేషాలు చూపడం, అసత్యాలు పలకడం, మోసం చేయడం... ఇవి క్రూరకర్మలు. అలాగే ఇతరుల ఆస్తిని బలవంతంగా లాక్కోవడం, దొంగతనం, అప్పు తీసుకొని, తీసుకోలేదని మాట మార్చడం, అధిక వడ్డీలు గుంజడం... ఇవన్నీ క్రూరకర్మలే! అలాగే డబ్బుకు ఆశపడి దొంగ సాక్ష్యాలు చెప్పడం... ఇదీ క్రూరకర్మే! 

వృద్ధాప్యంలో తల్లితండ్రుల్ని చూడకపోవడం, కోపావేశంలో తల్లితండ్రుల్నీ, అత్తమామలనూ, అక్కాచెల్లెళ్ళనూ, అన్నదమ్ములనూ, భార్యనూ కొట్టడం కూడా క్రూరకర్మలే! భరద్వాజా! ఒక పండితుడు ప్రజలకు గంభీర శబ్దాలతో, అర్థంకాని పదాలతో చెబుతాడో, ప్రబోధిస్తాడో అది క్రూరకర్మే! చేసిన మేలు మరచిపోవడం, ‘ఎవరూ చూడలేదు కదా!’ అని తప్పు చేయడం, తననుతాను గొప్పగా పొగుడుకోవడం, ఇతరులను తెగడడం, విమర్శించడం, విజ్ఞత మరువడం... ఇవి కూడా క్రూరకర్మలే! పిసినారితనం, పశ్చాత్తాపం చెందకపోవడం, ఆమె అనుమతించినా, అనుమతించకపోయినా మిత్రుని భార్యతో సంబంధం పెట్టుకోవడం, తనకు జ్ఞానం లేదని తెలిసి కూడా జ్ఞానిలా నటించడం, శాస్త్రం తెలియకపోయినా పండితునిగా ప్రచారం చేసుకోవడం... ఇవిగో, ఇవన్నీ క్రూరకర్మలే! ఇలాంటి పనులు చేసేవారు ఏ కులం వారైనా, ఏ ప్రాంతం వారైనా వారే చండాలురు. అంతేకాని నీవనుకున్నట్టు కులభేదాలు పాటించని వారు కాదు!’’ అన్నాడు బుద్ధుడు. అగ్ని భరద్వాజునికి అజ్ఞానం కరిగింది. అహం దిగింది. ‘‘భగవాన్‌! క్షమించండి! నా ఇంటికి దయచేయండి. భిక్ష స్వీకరించండి’’ అని ప్రాధేయపడ్డాడు. ఆనాటి నుంచి మంచిగా నడుచుకున్నాడు.

సంకల్పబలం

 *🐧సంకల్పబలం💥* 

🕉️🌞🌎🏵️🌼🚩


టిట్టిభం అనేది చాలా చిన్నపక్షిజాతి. దీన్నే లకుముకి పిట్ట అంటాం. టిట్టిభ జాతికి చెందిన ఓ ఆడ పక్షి ఓ సారి సముద్రతీరంలో గుడ్లు పెట్టింది... అవి బిడ్డలుగా మారాలని ఎదురుచూస్తోంది...ఓ రోజున ఆహారం కోసం బయటకు వెళ్లింది. ఇంతలో ఉద్ధృతంగా వచ్చిన సముద్రపు అల ఆ గుడ్లను సముద్రంలోకి తీసుకెళ్లిపోయింది. ఇంతలో ఆ పక్షి తిరిగొచ్చింది... చూస్తే గుడ్లు లేవు. కట్టుకున్న కలలన్నీ ఛిన్నాభిన్నమయ్యాయి...తీవ్రంగా ఆవేదన చెందిందా పక్షి...తాను చూస్తే ఇంత... ఆ జలరాశేమో అనంతం... తన బిడ్డలకు ఎలాగైనా లోకం వెలుగు చూపించాలి. సముద్రం నుంచి తన గుడ్లు బయటకు తీసుకురావాలనుకుందా పక్షి. తన ముక్కుతో సముద్రపు నీటిని పీల్చి ఒడ్డున వదిలిపెట్టింది. ఇలా సముద్రంలో ఉన్న నీళ్ళన్నీ తోడేస్తే తన గుడ్లు బయటకు వస్తాయని ఆ పిట్ట ఆలోచన. ఓ బుల్లి పిట్టకు సముద్రపు నీరంతా తోడటం సాధ్యమయ్యే పనేనా? పిట్టకు మాత్రం ఈ సందేహం రాలేదు. దాని మనసులో ఉంది ఒకే లక్ష్యం. నీరు తోడుతూనే ఉంది.

సాటి పక్షులు ఇదంతా చూశాయి. కొన్ని పక్షులు నిరాశపరిచాయి. మరికొన్ని తోటి పిట్టకు సాయం చెయ్యాలని తామూ నీరు తోడటం ప్రారంభించాయి. క్రమంగా  వేలాది పక్షులు ఈ పనికి జతకూడాయి. క్రమంగా ఈ విషయం పక్షిరాజు గరుత్మంతుడి వరకూ వెళ్ళింది. రాజాజ్ఞతో లక్షలాది పక్షులు సముద్రపు నీరు తోడటం ప్రారంభించాయి. తన తీరంలో జరుగుతున్న ఈ అల్లకల్లోలాన్ని సముద్రుడు గుర్తించాడు. విషయం తెలుసుకుని, తన గర్భంలో ఉన్న గుడ్లను తీసుకువచ్చి లకుముకి పిట్టకు అందించాడు. పిట్ట చిన్నదే. కానీ దాని సంకల్ప బలానికి సముద్రుడే తలవంచాడు.

మహాప్రళయం ముగిసింది...తిరిగి సర్వలోకాలనూ సృష్టించాలి...విశ్వాన్ని జవజీవాలతో నింపాలి.భగవత్‌శక్తితో సమస్తాన్నీ తేజోమయం చేయాలి...కానీ ఎలా?ఎటు చూసినా శూన్యం.అనంతమైన గాఢాంధకారం...చేతిలో పూచిక పుల్ల లేదు...ఉన్నదొకటే తీవ్రమైన కోరిక.ఎలాగైనా సకల ప్రాణకోటినీ సృజించాలనే ఆలోచన..ఆ ఆలోచన బలపడింది. సంకల్పంగా మారింది.అనంతాకాశం నుంచి ‘తప’..‘తప’ అనే శబ్దం వినిపించింది. ఆ ప్రచోదన ఆధారం చేసుకుని బ్రహ్మ తపస్సు చేశాడు.ఫలితంగా విరాట్పురుషుడైన నారాయణుడు ప్రత్యక్షమై బ్రహ్మకు వేదాలను అందించాడు. వాటి సాయంతో ఆయన సృష్టి కార్యక్రమాన్ని కొనసాగించాడు. బ్రహ్మ ముఖం నుంచి రుద్రుడు ఆవిర్భవించాడు. అక్కడ నుంచి మిగిలిన సృష్టి అంతా ఆవిష్కృతమైంది. మొత్తంగా మనం చూస్తున్న ఈ చరాచర జగత్తు మొత్తం వచ్చింది. బ్రహ్మ మనస్సులో జనించిన మహోన్నత సంకల్పం శూన్యం నుంచి సృష్టికి నాంది పలికింది.  సంకల్పానికి ఉన్న సర్వోన్నతమైనశక్తికి ఇది నిదర్శనం.

ఆ మూడు శక్తులూ...

సంకల్పమంటే... పట్టుదల. ఓ గట్టి నిర్ణయం. మొక్కవోని దీక్ష.  ప్రతి మనిషిలో ఇచ్ఛ, జ్ఞాన, క్రియలనే మూడు సహజ శక్తులు ఉంటాయి. అవి తనలో ఉన్నాయన్న ఎరుక కొద్దిమందికి మాత్రమే ఉంటుంది. వీటిలో మొదటిదైన ఇఛ్చాశక్తే సంకల్పం. మనలో ఉండే అతి గొప్ప శక్తి వనరు ఇది. సంకల్పం మనలో ఉద్భవించిననాడు జ్ఞాన, క్రియా శక్తులు ఏకమై ఆ కార్యాన్ని నెరవేర్చుతాయి. సంకల్పం మనసుకు సంబంధించిందే అయినా దాన్ని ఆవలి ఒడ్డుకు చేర్చడానికి బుద్ధి అనే ఓడ కావాలి. ఓర్పుగా నడిపించగల జ్ఞానం కావాలి. ఇది చాలా అవసరం. ఇలా ఓ పథకం ప్రకారం ముందుకు సాగితే గెలుపు అనివార్యం.

పరిశుద్ధమైన ఆలోచన...

సమ్యక్‌ అంటే పరిశుద్ధత... కల్పన అంటే ఆలోచనల సమూహం. సమ్యక్‌ కల్పనే సంకల్పం. పరిశుద్ధమైన ఆలోచనల సమాహారమే సంకల్పంగా మారాలని చెబుతుంది శాస్త్రం. పవిత్రమైన సంకల్పాలతో శక్తి ఉత్పన్నమవుతుంది. అపవిత్రమైనవాటిËతో ఉన్న శక్తి నాశనమవుతుంది. మన ఆధ్యాత్మిక వ్యక్తిత్వాన్ని వ్యక్తపరిచేే పవిత్ర ఆలోచనలను పోగు చేసుకోవడమే జీవిత పరమార్థం. సంకల్పం అనే వాహనం మనల్ని అజ్ఞానం నుంచి సత్యం వైపు తీసుకెళితేనే జీవితానికి సార్థకత.

ఎలా ఉండాలి?

మనిషికి ఎలాంటి సంకల్పం ఉండాలన్న విషయాన్ని వేదాలు విస్పష్టంగా ప్రకటిస్తున్నాయి. రుగ్వేదంలో ‘ఓం వాజ్ఞ్మ మనసి ప్రతిష్ఠితా! మనోవాచి ప్రతిష్ఠితా. మాలిరావీర్మ ఏధి! శ్రుతం మే మా ప్రహసీర సేనాధితే నా హోరాత్రాన్‌ సందధామృతం వదిష్యామి! సత్యం వదిష్యామి! తన్మామవతు! తద్వక్తార మవతు! మావమవతు వక్తారమవతు వక్తారమ్‌!’

నా వాక్కు మనస్సులో ప్రతిష్ఠితం అవ్వాలి. నేను నేర్చుకున్నదీ, విన్నదీ నన్ను వీడిపోకూడదు. నేర్చుకున్న మంచిని సదా మననం చేస్తాను. నేను పారమార్థిక సత్యాన్ని పలుకుతాను... అంటూ ఈ మంత్రం సాగుతుంది. మనసు ఎప్పుడూ మంచి భావాలతో నిండి ఉండాలని చెబుతుంది.

శుభం అని తలచు...

యుజుర్వేదంలో అంతర్భాగంగా ఉన్న మహన్యాసంలోని శివసంకల్ప సూక్తంలో ‘యే వేదం భూతం భువనం భవిష్యతి...’ అంటూ సాగే 39 మంత్రాలు ఉంటాయి. ప్రతి మంత్రంలో ‘తన్మే మనశ్శివ సంకల్పమస్తు’ అనే వాక్యం కనిపిస్తుంది.

‘నా మనస్సులో ఎప్పుడూ మంగళకరమైన, పవిత్రమైన సంకల్పాలు కలుగుగాక’ అని దీని అర్థం. మన మనస్సు ఎప్పుడూ శుభాన్ని కోరుకోవాలి. అటువంటి ఆలోచనలే చెయ్యాలి. అప్పుడు మనకే కాదు... మన చుట్టూ ఉన్న సమాజానికి, అంతిమంగా లోకానికి క్షేమం కలుగుతుంది. వేదం ఆశించిన లోకక్షేమం ఇది.

వికల్పాలుంటాయి:

మనం సాధించే విజయానికి మూలకారణం మనలో కలిగే సంకల్పం. అది ఆలోచన రూపాన్ని దాటి ఆచరణలోకి రావడం అంత సులభమేమీ కాదు. అందుకు ఎన్నో అవరోధాలు ఏర్పడతాయి.  వ్యతిరేక ఆలోచనలను వికల్పం అంటారు. సంకల్ప, వికల్పాల మధ్య మన మనస్సు ఎప్పుడూ కొట్టుమిట్టాడుతుంటుంది. ఈ సంఘర్షణలో విజయం సాధించటంలోనే మన నేర్పు ఆధారపడి ఉంటుంది. సాధన ద్వారా వికల్పాన్ని మనస్సు నుంచి దూరం చేస్తే ఆలోచనలు కార్యరూపం దాల్చి, అంతిమంగా సంకల్పసిద్ధి కలుగుతుంది.


🕉️🌞🌎🏵️🌼🚩

సాధనకు సమయం?

 , 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

చివరి (చివరిగా)కనువిప్పు


             సాధనకు సమయం?

                  ➖➖➖✍️


పడకగదిలో తన మంచంపై పడుకుని ఉన్న రాధాకృష్ణ ఏదో అలికిడి కావడంతో ఉలిక్కిపడి కళ్ళు తెరిచి చూశాడు. అతని ఎదురుగా ఒక దివ్యకాంతి ప్రకాశిస్తూ కనబడింది. చూస్తూండగా ఆ కాంతి ఒక స్త్రీ రూపాన్ని దాల్చింది. దేదీప్యమైన కాంతులను వెదజల్లుతున్న ఆ స్త్రీమూర్తి సాక్షాత్తు ఆ జగన్మాతేనని గ్రహించిన రాధాకృష్ణ, "అమ్మా!" అంటూ ఆ తల్లి పాదాలపై పడాలని అనుకున్నాడు. కాని, మంచంపై అతనిని ఎవరో కట్టేసినట్లు అనిపించడంతో ఒక్క అంగుళం కూడా కదలలేకపోయాడు. 'ఏమైంది నాకు?' అనుకుంటూ రాధాకృష్ణ తన వంక తాను ఒకసారి చూసుకుని ఆశ్చర్యపోయాడు. అతని శరీరం బక్కచిక్కిపోయి, చర్మం ముడతలు పడిపోయి ఉంది. లేచేందుకు ఏమాత్రం ఓపిక తనలో మిగలలేదని, తన అంత్యకాలం సమీపించిందని అర్థం చేసుకున్న రాధాకృష్ణ ఆ పరమేశ్వరి వంక చూస్తూ, "తల్లీ! నన్ను నువ్వే కాపాడాలి... నాకు నీ వద్దకు రావాలని ఉంది" అన్నాడు.


“అవును, కుమారా! నాకూ నిన్ను నాతో తీసుకెళ్లాలని ఉంది కానీ, నీవు ఈ జన్మలో చేసిన పుణ్యం అందుకు సరిపోయేటట్టు లేదు. అదే నా బాధ", అంది జగన్మాత విచారంగా.  


"అమ్మా! నేను ఇప్పటివరకూ ఎవ్వరికీ కష్టం కలిగించకుండా ఉన్నానే... అది సరిపోదా?" అడిగాడు రాధాకృష్ణ. 


“సరిపోదు, నాయనా! నువ్వు నాతో రాగలిగేందుకు కావలసిన అర్హతను పొందాలంటే నీకు లభించిన మానవ జన్మను భగవత్సేవకు అంకితం చెయ్యాలి. నేను నీకిచ్చిన ఈ తొంబై అయిదు సంవత్సరాలలో నువ్వు ఏనాడూ నా సన్నిధిలో దీపం కూడా వెలిగించినట్టు లేవు" అంది పరమేశ్వరి. 


"నిజమేనమ్మా! నువ్విచ్చిన సుఖాలను అనుభవించానే తప్ప ఇన్నాళ్లు నిన్నెలా సేవించాలో నేనసలు ఆలోచించలేదు. నన్ను మన్నించమ్మా... నాకు ముక్తిని ప్రసాదించు" అని అమ్మను వేడుకున్నాడు రాధాకృష్ణ.


"సరే నాయనా! నా బిడ్డవు కాబట్టి నీకొక చివరి అవకాశం... నీకు కచ్చితంగా పది నిమిషాల వ్యవధి ఇస్తున్నాను. ఈ పది నిమిషాలలో నీకు తోచిన విధంగా నన్ను సేవించి, నాతో వచ్చేందుకు అర్హతను సంపాదించు, నాయనా!" అంది పరమేశ్వరి. 


“ఆహా... అమ్మా! నువ్వు కరుణామయివి. నేను ఈ అవకాశాన్ని తప్పకుండా సద్వినియోగం చేసుకుంటాను" అని అమ్మను ఎలా సేవించాలా అని, ఆలోచనలో పడ్డాడు రాధాకృష్ణ. 'పత్రం, పుష్పం, ఫలం, తోయం' అన్నారు కాబట్టి పెరటిలో ఉన్న నాలుగు పుష్పాలు కోసుకుని వచ్చి అమ్మ పాదాలపై వేద్దామనుకున్నాడు రాధాకృష్ణ. లేచే ప్రయత్నం చేసినప్పుడు కానీ రాధాకృష్ణకి అతడు లేవలేని స్థితిలో ఉన్నాడని గుర్తుకు రాలేదు. చేతులు జోడించి అమ్మనుగూర్చి ప్రార్థన చేద్దామని రాధాకృష్ణ తన రెండు చేతులను ఒక దగ్గరకు అతికష్టం మీద తీసుకుని వచ్చాడు. నరాల బలహీనతవల్ల చేతులు వణికిపోయాయి. రెండు నిమిషాలన్నా నమస్కార ముద్రను నిలపలేకపోయాడు రాధాకృష్ణ. తనకు తెలిసిన పాటను సంగీత సేవగా భావిస్తూ శ్రావ్యంగా పాడదామని రాధాకృష్ణ అనుకున్నాడు. కానీ, వృద్ధాప్యం వల్ల గొంతులో కఫం అడ్డుపడి పాడలేకపోయాడు.


'ఇక నావల్ల కాదమ్మా! నువ్వే దారి చూపించు' అని అమ్మవంక దీనంగా చూశాడు రాధాకృష్ణ. 


"అయ్యో నాయనా! నువ్వు పడుతున్న అవస్థను చూడలేకపోతున్నాను. పోనీ నీకు వచ్చిన స్తోత్రంతో నన్ను స్తుతించు." అడిగింది జగజ్జనని.


 "అలాగేనమ్మా!" అంటూ రాధాకృష్ణ తను చిన్నప్పటినుండీ విన్న శ్లోకం ఒకటి టకాటకా చెప్పేశాడు కానీ అతని పళ్ళన్నీ ఊడిపోవడంవల్ల ఆ శ్లోకంలో చాలా పదాలు స్పష్టంగా పలకలేకపోయాడు. అందువల్ల కొన్ని పదాల అర్థాలు కూడా మారిపోయాయి.


 "పోనీలే నాయనా! నన్ను చూసి నా రూపాన్ని వర్ణించు... తృప్తి చెందుతాను" అంది ఆ తల్లి. 


రాధాకృష్ణకు వయసు వల్ల చూపు బాగా మందగించింది. తన కళ్ళను ఎంత చిట్లించి చూసినా అమ్మ రూపు స్పష్టంగా కనబడలేదు. 


"నాయనా! నా చుట్టూ ఉన్న తరంగాలు నా బీజాక్షరాన్ని నిరంతరం ప్రతిధ్వనించేలా చేస్తాయి. జాగ్రత్తగా విను" అంది జగన్మాత. రాధాకృష్ణ తన డెబ్భైయ్యవ ఏటనే వినికిడి శక్తిని కోల్పోవడంతో చెవులు రిక్కించి విన్నప్పటికీ తనకు ఎటువంటి శబ్దమూ వినబడలేదు. 


'అమ్మా! ఇప్పుడేం చెయ్యనూ?' అన్నట్టు అమ్మవంక చూశాడు రాధాకృష్ణ.


"ఇక ఆఖరి ప్రయత్నంగా నీ మనసు ఒక రెండు నిమిషాలపాటు నాపై లగ్నం చెయ్!" అంది తల్లి. 


రెండు నిమిషాలు ప్రయత్నించిన తర్వాత, "మహానీయులకు సైతం మనసును ఏకాగ్రచిత్తముతో నీపై నిలపడం సులభం కాదు. నావంటి అల్పునికి అదెలా సాధ్యపడుతుందమ్మా? నావల్ల కాదు" అని అన్నాడు రాధాకృష్ణ దీనంగా. 


జగన్మాత రాధాకృష్ణకు ఇచ్చిన పది నిమిషాల గడువు ముగిసింది. 


"అమ్మా నిన్ను ఏ విధంగానూ సేవించలేకపోయాను" అని  కడు దుఃఖంతో అన్నాడు రాధాకృష్ణ. పశ్చాత్తాపంతో అతని కళ్ళ వెంట నీళ్లు ధారాపాతంగా కారిపోతున్నాయి. 


"ఇదంతా నీ స్వయంకృతం, నాయనా! నువ్వు తరించడానికే నికీ మానవజన్మ లభించిందన్న విషయం నువ్వు విస్మరించావు. నీ పేరు చెప్పినప్పుడల్లా నా నామాన్ని స్మరించావు కనుకనే ఈ విధంగానైనా నీకు నా దర్శన భాగ్యం కలిగింది. భగవద్విషయాలను జీవిత చరమాంకంలో తెలుసుకోవచ్చులే అని అనుకోవడం అవివేకం. నీకు మానవజన్మ లభించిన దగ్గరినుండి ప్రతి నిమిషం అమూల్యమే, నాయనా! భగవద్భక్తికి బాల్యంలోనే బీజం పడాలి. జీవితం చివర్లో సత్యాన్ని గ్రహించినా, చేసేందుకు శరీరం సహకరించకపోయే ప్రమాదం ఉంది. సమయం విలువను తెలుసుకో... ఇకనైనా మేలుకో అని చెప్పి ఆ దివ్యకాంతి అంతర్థానమయ్యింది. 


"అమ్మా... అమ్మా! నాకు నువ్వు కావాలి" అని ఏడుస్తూ నేలపై పడ్డాడు రాధాకృష్ణ.


అంతలో, "నాయనా రాధా! నేనురా నీ అమ్మను. కలేమైనా కన్నావా? లే నాయనా లే" అంటూ, నిద్రపోతూ మంచంపై నుండి కిందపడ్డ రాధాకృష్ణను అతని తల్లి లేవదీసింది.


రాధాకృష్ణ కళ్ళు నులుముకుంటూ తనకొచ్చినది కల అని తెలిసి ఆశ్చర్యపోయాడు. కలలో జగన్మాత చేసిన బోధను గుర్తుచేసుకుంటే రాధాకృష్ణకు తను చేస్తున్న తప్పులన్నీ తెలియవచ్చాయి. తనకు పాతకాలంనాటి పేరు పెట్టినందుకు పెద్దలను నిందించిన సందర్భాలూ గుర్తుకు వచ్చాయి. 


రోజు ఇంట్లోని పెద్దవాళ్ళు వెంటపడితే కానీ స్నానం చెయ్యని రాధాకృష్ణ ఆ రోజు పూర్తిగా తెల్లవారకమునుపే స్నానం ముగించి, ఇంట్లోని దేవుని మందిరం దగ్గరకు వెళ్లి, భగవంతునికి భక్తిగా నమస్కరించి, ఆ తర్వాత తన బామ్మవద్దకు వెళ్లి, "బామ్మా! ప్రతిరోజూ నీతో గుడికి రమ్మని నన్ను అడుగుతూ ఉంటావుగా... ఇవాళ నువ్వు గుడికెళ్లేటప్పుడు చెప్పు నేను కూడా వస్తాను" అని అన్నాడు రాధాకృష్ణ. 


ఎప్పుడూ - నేనింకా చిన్నవాడిని! నాకప్పుడే గుళ్ళూ, గోపురాలూ, భగవంతుడూ, భక్తి ఎందుకే బామ్మా?" అంటూ చిరాకుపడే తన పన్నెండేళ్ల మనవడు రాధాకృష్ణలో అకస్మాత్తుగా వచ్చిన మార్పును చూసి ఆశ్చర్యపోతూ, 'అమ్మా పరమేశ్వరీ! ఇన్నాళ్ల నా ప్రార్థనను విన్నావా తల్లీ' అని అనుకుంటూ ఆనందపడిపోయింది రాధాకృష్ణ బామ్మ.✍️


                    🌷🙏🌷


   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺

నమ్మకానికి

 *నమ్మకానికి మరో రూపమే దేవుడు*                          

ఒకప్పుడు ఒక రాష్ట్రంలో కర్ఫ్యూ నిర్వహిస్తున్నప్పుడు,

ఒక పేద ముసలావిడ పది ఇళ్ళల్లో పాచిపని చేసుకుంటూ తలిదండ్రులు లేని తన మనవడి ఆకలితీర్చేది!.


ఆ కర్ఫ్యూ వల్ల ఇంటి తలుపు కూడా తీయడానికి వీలులేని పరిస్థితుల్లో, ఆ ముసలావిడ తన మనవడి ఆకలి తీర్చలేక తన బాధను దేవునికి మొర పెట్టు కోవడానికి మొకరిల్లి ప్రార్థన చేస్తోంది.

            

ప్రార్థనలో ఆవిడ దేవునితో 

" దేవా ..! ఆకలితో ఉన్న ఒక మనిషికి ఒకప్పుడు కాకితో ఆహారాన్ని సమకూర్చావు. అలాగే నా మనవడి ఆకలి కూడా తీర్చగలవని ప్రాధేయ పడుతున్నాను" అన్నది.


ఆ మాట విన్న తన మనవడు కాకి ఆహారాన్ని తెస్తుందని నమ్మి , కాకి లోపలికి రావాలంటే తలుపులు తెరిచి లేవని, వెంటనే కిటికీ తలుపులు తెరిచాడు.  అయితే            కిటికీ పక్కనే కాపాలాగా నిలబడి ఉన్న ఒక పోలీస్ వెంటనే కిటికీ తలుపుమీద కొట్టి లోపలికి తొంగిచూశాడు. లోపల ఓ పసి పిల్లవాడు బిక్క మోహం వేసుకుని అతనివంక బెదురుగా చూస్తుంటే ..!


ఆ పోలీసు  "ఏరా? తలుపెందుకు తీశావ్ ..!?" అన్నాడు.


ఆ పిల్లవాడు "మా బామ్మ దేవునికి ప్రార్థన చేసింది. దేవుడు కాకితో ఆహారం పంపుతాడని అంటుంది" అన్నాడు. అందుకే కిటికీ తలుపు తీసాను అన్నాడు.


అప్పుడా పోలీసు లోపల గదిలో మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తున్న ఓ ముసలావిడని చూసి ఆ పిల్ల వాడితో "ఆకలి వేస్తుందా " అని అడిగి 


"మీ బామ్మ చెప్పిన కాకిని నేనే ..! నువ్వు కిటికీ తలుపులు వేసుకుని లోపలే ఉండు. నేను మళ్ళీ వచ్చి తలుపు కొట్టినప్పుడు తియ్యి" అని చెప్పాడు.


అతను ఒక మూసి ఉన్న పచారి కొట్టు తీయించి పప్పులు, ఉప్పులు, బియ్యం అన్నీ తీసుకుని ఆ రోజుకి తనకిచ్చిన భోజనాన్ని కూడా తీసుకెళ్ళి ఆ పిల్లవాడి ఇంటి కిటికీ దగ్గరికి వెళ్ళి తలుపుకొట్టి అందించాడు.


ఆ ముసలావిడ ప్రార్థన విన్న దేవుడు ఆ *ఖాకీ* ద్వారా ఆకలి తీర్చాడు. 


ఒకరిది ప్రార్థన ..!

ఇంకొకరిది విశ్వాసం ..!

మరొకరిది ప్రేమ పూరిత సహాయం ..!


*దిక్కు లేని వారికి దేవుడే దిక్కు*  ముసలావిడ ఆ సమయంలో ఏ విధంగానూ అవకాశం లేకపోయినా దేవుడు చేసిన మహా అద్భుతాలను గుర్తు చేసుకుంటూ స్తుతిస్తూ చేసిన ప్రార్థన ..!


*నమ్మకం* ఆ చిన్న పిల్ల వాడు తన మామ్మ చేసిన ప్రార్థనకు దేవుడు సమాధానమిస్తాడని నమ్మి కిటికీ తెరిచి మరీ వెతకడం ..!


*నమ్మకానికి మరో రూపమే* ఆ పిల్లవాడికి దేవుడు మీద ఉన్న నమ్మకానికి ఆశ్చర్యపోయిన ఒక పోలీసు ఆ పిల్లవాడి ఆకలిని గుర్తించి తన వంతు సహాయం చేయడం ..!


నిష్కల్మషమైన మన ప్రార్థనకు దేవుడు తప్పక  సమాధానమిస్తాడు అని చెప్పడానికి ఈ చిన్న యదార్థ సంఘటన...!


పాలలో పెరుగు, వెన్న, నెయ్యి దాగి ఉన్నట్లు నీ నమ్మకం లో ఎన్నో మహా అద్భుతాలు దాగి ఉన్నాయి అవి చూడాలంటే 

కాస్తంత ఓపిక, మనోధైర్యం కష్టపడే తత్వం ఉంటే చాలు.


 ఈ ప్రపంచమే నిన్ను ఏదో ఒక రోజు ఒక గొప్ప వ్యక్తిగా మహా అద్భుతాలు సృష్టించే మహాత్మునిగా కీర్తిస్తుంది. *నమ్మకమే నీ విజయానికి పెట్టుబడి* 

నమ్మకం వున్నవారు

ఓడిపోయినట్టు చరిత్ర లో 

ఎక్కడా లేదు.


లే పోరాడు గెలిచి చూపించు నిన్ను నీవు ఈ ప్రపంచానికి పరిచయం చేసుకో.

మొదటగా నిన్ను నీవు ప్రేమించడంం అలవాటు చేసుకో, నిన్ను నీవు గౌరవించు కో, నీ గెలుపును నీవు నమ్ము, ఆ తర్వాత ఈ ప్రపంచం 

నిన్ను గౌరవిస్తోంది నీవు గెలిచిన తర్వాత నిన్ను మెచ్చుకుంటుంది, నీ నుండి నేర్చుకుంటుంది.

రేపటి తరానికి నీ గురించి గొప్పగా చెప్పుకుంటోంది.


*అదే నమ్మకం అదే మన జీవితం అది  మనలను ఎప్పుడు ఓడిపోనివ్వదు* అందుకు చక్కని ఉదాహరణ ఈ చిన్న కథ.

దుర్యోధనుడు

 *📖 మన ఇతిహాసాలు 📓*



*దుర్యోధనుడు*

(మహాభారతంలో పాత్ర)


మహాభారతంలో ధృతరాష్ట్రుని నూర్గురు పుత్రులలో ధుర్యోధనుడు ప్రథముడు, కౌరవాగ్రజుడు. సుయోధనుడు అని ఇతనికి మరొక పేరు.


*జననం*


ఇతడు గాంధారీ ధృతరాష్ట్రుల పుత్రుడు. గాంధారి గర్భవతిగా ఉన్న సమయంలో కుంతీదేవి, ధర్మరాజుని ప్రసవించిన విషయం వినిన తరువాత 12 మాసముల తన గర్భాన్ని ఆతురత వలన తన చేతులతో గుద్దుకొని బలవంతంగా మృత శిశువుని ప్రసవించినది. ఈ విషయం విన్న వ్యాసుడు హస్తినకు వచ్చి కోడలిని మందలించి ఆ పిండం వృధా కాకుండా నూటొక్క ముక్కలుగాచేసి నేతి కుండలలో భద్రపరచాడు. వ్యాసుడు వాటిని చల్లని నీటితో తడుపుతూ ఉండమని వాటిలో పిండము వృద్ధిచెందిన తరువాత నూరుగురు పుత్రులు ఒక పుత్రిక జన్మిస్తారని చెప్పి వెళ్ళాడు. గాంధారి వ్యాసుని ఆదేశానుసారం చేయగా ముందుగా వాటిలో పెద్ద పిండం పరిపక్వమై అందునుండి దుర్యోధనుడు జన్మించాడు. తరువాత క్రమంగా తొంభై తొమ్మిదిమంది పుత్రులు ఒక పుత్రిక, దుస్సల జన్మించారు. ఈ విధంగా గాంధారీ దృతరాష్ట్రులు దుర్యోధనాదులను సంతానంగా పొందారు.


*దుశ్శకునములు,పెద్దల సూచన*

దుర్యోధనుని జననకాలములో రాక్షసులు మిక్కుటముగా అరచారు, నక్కలు ఊళలు పెట్టాయి, గాడిదలు ఓండ్ర పెట్టాయి, భూమి కంపించింది, మేఘములు రక్త వర్షాన్ని కురిపించాయి. ఇవి కాక అనేక దుశ్శకునములు సంభవించినట్లు భారతంలో వర్ణించబడింది. ఇవి గమనించిన భీష్ముడు, విదురుడు ధృతరాష్ట్రునికి "రాజా! దుర్యోధనుడు వంశనాశకుడు కాగలడని శకునములు సూచిస్తున్నాయి. ఇతనివలన కులనాశనం కాగలదు. ఈ పాపాత్ముని విడిచి కులమును రక్షింపుము " అని సూచించారు. ధృతరాష్ట్రుడు పుత్రవ్యామోహంతో వాటిని పెడచెవిన పెట్టినట్లు భారత వర్ణన.


*భారతంలో దుర్యోధనుని పాత్ర*


దుర్యోధనుడు అసూయకు మారుపేరు. అతడు పాండవులపై అకారణ శతృత్వాన్ని పెంచుకున్నాడు. ముందుగా భీముని బలము అతనికి భయాన్ని కలిగించింది. అతణ్ణి ఎలాగైనా తుదముట్టించాలనుకున్నాడు. భీముని ఒకసారి లతలతో కట్టి నదిలో పారవేయించాడు, ఒకసారి సారధిచే విష్నాగులతో కాటు వేయించాడు, మరి ఒకసారి విషాన్నాన్ని తినిపించాడు. భీముడు వీటన్నిటిని అధిగమించి అధిక బలాన్ని సంపాదించాడు. అలా అంతఃపుర కుట్రలకు చిన్నతనంలోనే పాల్పడ్డాడు.


అర్జునునికి ప్రతిగా తన పక్షంలో ధనుర్విద్యాయోధుడు ఉండాలని దుర్యోధనుడు భావించాడు. యుద్ధ విద్యా ప్రదర్శన సమయంలో ప్రవేశించిన కర్ణుని అర్జునునికి ప్రతిగా తనకు బలం చేకూర్చుకొనే విధంగా కర్ణునికి అంగ రాజ్యం ఇచ్చి అతడి మైత్రిని సంపాదించుకున్నాడు. ధర్మరాజుకి పెరుగుతున్న ప్రజాదరణ చూసి సహించలేక తండ్రిని ఒప్పించి వారణావతానికి పాండవులను పంపించి, వారిని అక్కడే హతమార్చాలని పథకం వేసాడు. శకునితో కుట్ర జరిపి పాండవులను వారణావతములో లక్క ఇంట్లో ఉంచి వారిని దహించివేయాలని పధకం వేశాడు. కానీ విదురుని సహాయంతో వారు తప్పించుకున్నారు.


ద్రౌపది స్వయంవర సమయంలో హాజరైన రాజులలో దుర్యోధనుడు ఒకడు. ద్రౌపది అర్జునుని వరించినందుకు కోపించి ద్రుపదునితో యుద్ధానికి దిగి భీమార్జునుల చేతిలో పరాజితుడై వెనుదిరిగాడు. ద్రుపదుని ఆశ్రయంలో ఉన్న పాండవుల మధ్య పొరపొచ్చాలు సృష్టించి పాండవులను తుదముట్టించాలని తలపెట్టి, కర్ణుని సలహాతో వారిని తిరిగి హస్తినకు రప్పించాడు. భీష్ముని సలహా, కృష్ణుని ప్రోద్బలంతో రాజ్యవిభజన జరిగింది. ఖాండవ ప్రస్థాన్ని ఇంద్రప్రస్థంగా మార్చుకుని కృష్ణుని సహాయ సలహాలతో రాజ్యవిస్తరణచేసుకొన్న పాండవుల వైభవాన్ని చూసి ఓర్వలేక పోయాడు. మేనమామ శకుని కుతంత్రంతో పాండవులను మాయాజూదంలో ఓడించి వారిని అవమానించాడు. ద్రౌపదిని నిండు సభకు పిలిపించి ఆమె వస్త్రాపహరణానికి ప్రయత్నించాడు.


ధృతరాష్ట్రుని నుండి పాండవులు తమ రాజ్యాన్ని తిరిగి వరంగా పొందారు. ఆ రాజ్యాన్ని తిరిగి మాయాజూదంలో అపహరించి వారిని అరణ్యవాసానికి, తరువాత అజ్ఞాతవాసానికి పంపి వారిని కష్టాలకు గురిచేసాడు. మైత్రేయుని హితవచనాలను అలక్ష్యం చేసినందుకు భీముని చేతిలో తొడ పగుల కలదని అతడి శాపానికి గురయ్యాడు. దుర్యోధనుని మరణం భీముని చేతిలో ఉన్నదన్న విషయం దానితో మరింత బలపడింది. సంజయుని ద్వారా కిమ్మీరుని వధ వృత్తాంతం విని, భీముని పరాక్రమానికి వెరచి, అరణ్యవాస సమయంలో పాండవుల మీదకు దండయాత్రకు వెళ్ళాలన్న ప్రయత్నాన్ని కొంతకాలం విరమించుకున్నాడు. పాండవులను పరిహసించి అవమాన పరచాలన్న దురుద్దేశంతో వచ్చి గంధర్వరాజు చిత్రసేనుని చేతిలో సకుంటుంబంగా బందీ అయ్యాడు. తుదకు ధర్మరాజు సౌజన్యంతో, భీముడి పరాక్రమంతో ఆ గంధర్వుని నుండి విడుదల పొందాడు. ధర్మరాజు సౌజన్యాన్నికూడా అవమానంగా ఎంచి ఆత్మహత్య తలపెట్టాడు. కానీ, రాక్షసుల సలహాననుసరించి ఆత్మహత్యను విరమించుకున్నాడు.


అజ్ఞాతవాసంలో ఉన్న పాండవులను కనిపెట్టి వారిని తిరిగి అరణ్యవాసానికి పంపాలన్న దురుద్దేశంతో విరాటరాజ్యం పై దండెత్తి అర్జునిని చేతిలో ఘోరపరాజయాన్ని చవిచూశాడు. యుద్దకాలంలో సంధికి వ్యతిరేకంగా వ్యవహరించి యుద్ధానికి కాలుదువ్వాడు. దురహంకారంతో కృష్ణుని సహాయాన్ని వదులుకుని దైవబలాన్ని జారవిడుచుకున్నాడు. మాయోపాయంతో శల్యుని తనవైపు యుద్ధం చేసేలా చేసుకున్నాడు. తద్వారా కర్ణుని పరాజయానికి పరోక్షంగా కారణమైనాడు. పద్మవ్యూహంలో ఒంటరిగా చిక్కిన అభిమన్యుని అధర్మ మరణానికి కారకుల్లో ఒకడైనాడు. యుద్ధాంతంలో మరణభయంతో సరస్సులో జలస్తంభన చేసిన దుర్యోధనుడు భీముని చేతిలో నిస్సహాయంగా మరణించాడు.


ఈ విధంగా కౌరవకుల నాశనానికి దుర్యోధనుడు కారణమయ్యాడు.


*ప్రవృత్తి*


శ్రీకృష్ణుడు రాయబారం కోసం హస్తినకు వెళ్ళినపుడు దుర్యోధనుడు స్వయంగా తానే చెప్పుకున్న మాట, అతడి ప్రకృతిని తెలియజేస్తుంది.


*జానామి ధర్మం న చ మే ప్రవృత్తిః*


*జానామి అధర్మం న చ మే నివృత్తిః*


నాకు ధర్మం ఏమిటో తెలుసు, కానీ నాకది చెయ్యాలనిపించదు...


అధర్మం ఏమిటో కూడా తెలుసు, నాకు అదే చెయ్యాలనిపిస్తుంది.


*వివాహం*


దుర్యోధనుడు భానుమతిని వివాహమాడాడు

నలుగురు మూర్ఖులు*

 *✍🏼  కథ ✍🏼*



*నలుగురు మూర్ఖులు*




ఒక ఊరిలో ఒక యజమాని ఉండేవాడు ఆయనకు మూర్ఖులుగా వున్నవాళ్ళని పనిలో పెట్టుకోవాలంటే ఇష్టము . ఆయన ఒకరోజు దారిలో పోతుండగా నలుగురు మూర్ఖులు కనపడినారు. ఆయనచాలా సంతోషముగా వద్దకు వెళ్ళి "మీరు మా ఇంటిలో పనివాళ్ళుగా ఉంటారా" అని అడిగాడు. ఆమూర్ఖులు "సరే" అన్నారు. యజమాని "మీరు రేపు పొద్దున మా ఇంటికి రండి" అని చెప్పాడు. అలాగే వారు వచ్చారు


యజమాని ఒక మూర్ఖుడిని అడవిలో మేకలను మేతకు తీసుకోని పొమ్మన్నాడు. రెండవ వానిని అడవిలో కట్టెలు కొట్టుకొని రమ్మన్నాడు. మూడవ వానిని ప్రక్క ఊరికి వెళ్ల్ నెయ్యి తెమ్మన్నాడు. నాలుగవ వానిని ఇంటిలోనే ఉండి తన తల్లి సంరక్షణ చూసుకొమ్మని చెప్పాడు.


ఒక మూర్ఖుడిని మేకలు మేపడానికి పొమ్మన్నాడు కదూ? అతడు బావి దగ్గర కూర్చొని ఎదో తింటున్నాడు. ఆ బావిలోని కప్పలు బెక, బెక, బెక, బెక అంటున్నాయి. ఈ మూర్ఖుడు ఏమి అనుకున్నాడంటే; ఈ కప్పలకు కూడా చాలా ఆకలి వేస్తోంది అని. అలా అనుకొని వాడు ఒక మేకను బావిలోకి వేశాడు. ఆ కప్పలు ఇంకా అరుస్తూనే ఉన్నాయి. వాడు ఒకదాని తరువాత ఒకటిగా అన్ని మేకల్నీ బావిలోకి వేసి ఉత్త చేతులతో ఇంటికి వచ్చాడు.


ఇంకొక మూర్ఖుడిని కట్టెలు కొట్టుకొని రమ్మన్నాడు కదూ! ఆ మూర్ఖుడు కట్టెలు కొట్టుకొని బండిలో వేసుకొని వస్తున్నాడు. ఎత్తులో వెళ్తున్నాడు. బండి చక్రాలు ’పర్ పర్’ అంటున్నాయి. ఆ మూర్ఖుడు ఏమనుకున్నాడంటే "పాపం చక్రాలు బరువు మోయలేక పోరున్నాయి’ అని. అలా అనుకొని వాడు కొన్ని కట్టెలు దింపేశాడు. అయినా అట్లే శబ్దం వస్తున్నది. అలా ఒక్కటొక్కటిగా కట్టెలన్నింటినీ తీసివేసి ఖాళీ బండిని ఇంటికి తీసుక వచ్చాడు వాడు..


ఇంకొక మూర్ఖుడిని పక్కనున్న ఊరికిపోయి నెయ్యి తీసుకొని రమ్మని చెప్పాడు కదూ? వాడు మొదట నెయ్యి డబ్బా తీసుకొని బయలుదేరినప్పుడు అది బరువని అనిపించలేదు. తేలికగానే ఉండింది. అయితే కొంతదూరం వచ్చాక డబ్బా చాలా బరువు అనిపించింది. ఇంకొంత దూరము నడిచాక వాడు ఏమనుకున్నాడంటే, "ఈ డబ్బాలో దయ్యం వుంది, లేకపోతే ఎందుకు బరువెక్కుతుంది?’ అనుకొన్నాడు. డబ్బాను దించి చూశాడు అందులో అతని ప్రతిబింబము కనిపించింది. అది దయ్యమే అనుకున్నాడు వాడు. పక్కనే ఒక బావి కనబడింది. ఆబావిలో వాడు నెయ్యి డబ్బాను పారవేశాడు. "అమ్మయ్య! దయ్యం పీడ వదిలింది" అనుకున్నాడు.


నాలుగోవాడిని తన రోగిష్టి అమ్మ సంరక్షణని చూసుకొమ్మన్నాడుకదూ? ఆ మూర్ఖుడు యజమాని గారి అమ్మ ప్రక్కన కూర్చున్నాడు. అంతలో ఒక ఈగ అమె మూతిపై వాలింది. ఆమూర్ఖుడు చూసి "మా అమ్మగారిమీద వాలుతావా, నీకెంత ధైర్యం, మా అమ్మగారి మీద వాలద్దు" అన్నాడు. ఆ ఈగేమో, పక్కకు పోయినట్టేపోయి మళ్లా వచ్చి వాలింది. పట్టరాని కోపం వచ్చిన ఆ మూర్ఖుడు రోకలి తీసుకొనివచ్చి, చూపించి, "చూడు ఈసారి మా అమ్మగారి మీద వాలావంటే దీనితో కొడతానన్నాడు. దానికేం తెలుసు, అది మళ్లా వచ్చి వాలింది. దాంతో విసుగెత్తిన ఆమూర్ఖుడు రోకలి బండ తీసుకొని ఆమె ముక్కుమీద ఒక్కదెబ్బ కొట్టాడు. ఆదెబ్బకు ముసలామె చచ్చి హరీమన్నది. ఈగ మాత్రం చనిపోలేదు. యజమాని ఇంటికి వచ్చిచూస్తే ’కట్టెలు పోయే, మేకలు పోయే, నెయ్యి పోయే, అమ్మా పోయే’ అన్నట్లయ్యింది. ’ఈమూర్ఖులను పనిలో పెట్టుకున్నందుకు నాకు మంచి శాస్తి జరిగింది’ అని చెంపలు వాయించుకున్నాడు యజమాని.

ఆణిముత్యం

 *💎 ఆణిముత్యం 💎*



తనయూరి తపసి తనమును

తన పుత్రుని విద్య పెంపు దన సతి రూపున్

తన పెరటిచెట్టు మందును

మనసున వర్ణింపరెట్టి మనుజులు సుమతీ!31


*భావం :* ఎంత వివేకం ఉన్న మనుష్యులయినప్పటికీ సొంత ఊరికి చెందిన తపశ్శక్తి సంపన్నుడినీ, కన్న కొడుకు ప్రదర్శించే తెలివితేటలను, సొంత భార్య అందచందాలను, ఇంటి పెరడులో ఉన్న చెట్టుయొక్క ఔషధగుణాలను మనస్సులో కూడా మెచ్చుకోరు.


*ప్రతిపదార్థం :* తన + ఊరి అంటే తను నివసించే గ్రామానికి చెందిన. తపసి అంటే తపస్సు చేసే వాని యొక్క. తపమును అంటే తపస్సును. తన పుత్రుని అంటే తన సొంత కుమారుని యొక్క. విద్య పెంపున్ అంటే చదువులో గల తెలివితేటలను. తన సతి అంటే తన భార్య యొక్క. రూపున్ అంటే సౌందర్యాన్ని. తన పెరటి అంటే తన ఇంటి పెరడులో ఉన్న. చెట్టుమందును అంటే ఔషధ వృక్షాలను. ఎట్టి అంటే ఎంత వివేకం ఉన్న. మనుజులున్ అంటే మనుష్యులు అయినప్పటికీ. మనసునన్ అంటే చిత్తంలో. వర్ణింపరు అంటే ప్రశంసించరు లేదా మెచ్చుకోరు.


పొరుగింటి పుల్లకూర రుచిగా ఉంటుంది... అని సామెత ఉండనే ఉంది. తమ కుమారుడు ఎంత తెలివిగలవాడైనప్పటికీ, పక్కింటి అబ్బాయిని మెచ్చుకుంటారు. తమ గ్రామంలోనే ఎంతో పండితుడు ఉన్నప్పటికీ అతడిని గుర్తించరు. తన భార్య ఎంత అందంగా ఉన్నా కూడా పక్కింటి భార్య అందాన్నే పొగుడుతారు. అలాగే తమ ఇంట్లోనే ఔషధవృక్షం ఉన్నా కూడా దానిని ఔషధంగా అంగీకరించరు. అందుకే పెరటిచెట్టు వైద్యానికి పనికిరాదు అని, దూరపుకొండలు నునుపు అని అంటారు. అందుబాబులో ఉన్నవాటిని నిర్లక్ష్యం చేసి అందని ద్రాక్షల కోసం ప్రయత్నించడం మానవ లక్షణం. ఈ పద్యంలో కవి ఆ విషయాన్ని వివరించాడు.


*🎣సేకరణ:సొంటేల ధనుంజయ🎣*

జ్ఞాపకాల దొంతర

 వందేమాతరం 👌👍🙏🌹


 *ఆనాటి మధుర జ్ఞాపకాలు* 


_యాభై దాటిన మేము ఒక ప్రత్యేక తరానికి చెందిన వాళ్ళం. చాలా సాధారణ స్థాయి బళ్ళో చదువుకున్నా, దాదాపు మా తరం వాళ్ళు అన్ని విషయాలలో నిష్ణాతులుగా కనిపిస్తారు._ 


_ఆంగ్ల మాధ్యమంలో  చదువుకోకున్నా, మాకు ఆ భాష మీద ఉండే పట్టు అమోఘం. ఒక్క ఆంగ్లమే కాదు మేము చదువుకొన్న ప్రతి విషయంలో ఎంతో ప్రతిభ చూపించేవాళ్ళము.  లెక్కలు [విడివిడిగా.. కాంపోజిట్, జనరల్], సామాన్య శాస్త్రం, సాంఘిక శాస్త్రం, ప్రధానంగా తెలుగు ఇంకా అనేక విషయాలు ఎంతో శ్రద్ధతో నేర్చుకునేవాళ్ళము._


_పోటీ చాలా ఎక్కువ ఉన్న ఈ రోజుల్లో అదేమంత గొప్ప విషయంగా కనపడకపోవచ్చు, కానీ ఆనాడు ఉన్న *సామాజిక -ఆర్థిక* పరిస్థితులకు మేము సాధించింది చాలా ఎక్కువ అనే చెప్పుకోవాలి._ 


_దాదాపు ప్రతీ కుటుంబంలో కనీసం ముగ్గురు నుండి ఆరుగురు పైబడిన పిల్లలు ఉండేవాళ్ళు. *ఇంత పెద్ద కుటుంబం కేవలం తండ్రి సంపాదన పైనే ఆధార పడేది...* అంటే అందరికీ కడుపునిండా తిండి దొరకటమే కష్టం అయ్యేది._


_*పొద్దున్నే చద్దన్నం, [టిఫిన్ అనేది లేనేలేదు, ఎప్పుడైనా హోటల్ కు వెళితేతప్ప] మధ్యాహ్నం మామూలు భోజనం ఉండేది. రాత్రికి కూడా అంతే.*_


_పండగ రోజుల్లో మాత్రం కాస్త ప్రత్యేకంగా ఉండేది. బొగ్గుల కుంపటిలోనో, కట్టెల పొయ్యిలోనో, పొట్టు పొయ్యిలోనో వంటలు చేస్తూ, కళ్ళవెంట నీళ్ళు కారుతున్నా వంటలు ఎంతో రుచిగా చేస్తూ, ఇంత మంది పిల్లలను పెంచిన *ఆ నాటి తల్లుల ఋణం ఎంత ఇచ్చినా తీర్చుకోలేము.*_ 


_దాదాపు అందరం ప్రభుత్వ ఉచిత పాఠశాలలో చదువుకొన్న వాళ్ళమే. మాలో చాలా మంది డిగ్రీ చదువులకు వెళ్లేవరకూ చెప్పులు లేకుండా నడిచిన వాళ్ళమే ! కేవలం రెండుజతల బట్టలతో, అవి చిరిగే వరకు వాడినవాళ్ళమే. పదవ తరగతి వరకు నిక్కర్లతో బడికి వెళ్ళినవాళ్ళం. సరిగా చదవక పాఠాలు అప్పగించలేనప్పుడు బెత్తం, చెక్కస్కేళ్ళతో, చెక్కడస్టర్లతో మాష్టర్ల చేతిలో ఎన్నోసార్లు దెబ్బలు తిని, తిరిగి కంఠోపాఠం చేసినవాళ్ళం._  


_ఆ రోజులు చాలా సాధారణంగా ఉండేవి. కరెంట్ లేని ఇళ్ళలో కిరసనాయిల్ దీపాల వెలుగులో చదువుకున్న వాళ్ళం. బడి చదువులు అయిన వెంటనే తల్లి-దండ్రులు తమ బిడ్డలకు ఏదో ఒక ప్రభుత్వ ఉద్యోగం వస్తే చాలు అనుకునేవాళ్ళు._


_ఆ రోజులల్లో ప్రభుత్వ డిగ్రీ చేసి PG చేసిన వాళ్ళు తక్కువే._


_*మా తరం వాళ్లకి సినిమా, రేడియో తప్ప వేరే వినోదం ఉండేది కాదు. మూడు అణాలు, పావులా, ముప్పయి పైసలు, నలభై పైసలు, యాభై పైసలు ఇచ్చి తెరకు దగ్గరగా కూర్చొని [నేలపై కూడా] చూసిన సినిమాలు ఎన్నో.*_


_అదీ కాకుండా, రేడియోలో పాత కొత్త పాటలు వినటం ఎంతో ఇష్టంగా ఉండేది. ఘంటసాల వెంకటేశ్వరరావు, పిఠాపురం నాగేశ్వరరావు, మాధవపెద్ది సత్యం, సుశీల, లీల, జిక్కీ గార్లు పాడిన తెలుగు పాటలు అంటే పడి చచ్చేవాళ్ళం ఇక హిందీ పాటల విషయానికొస్తే, పాటల ట్యూన్ ని బట్టి సంగీత దర్శకులెవరో చెప్పే వాళ్ళం. SD బర్మన్, నౌషాద్, మదన్ మోహన్, శంకర్ జైకిషన్, లక్ష్మీ కాంత్ ప్యారేలాల్, కళ్యాణ్ జీ ఆనంద్ జీ... మహ్మద్ రఫీ ఒకరేమిటి, ఎన్ని పేర్లు చెప్పుకోవాలో తెలియదు. ఈ సంగీత సామ్రాట్టులు అందించిన పాటలు ఈనాటికీ శ్రోతల హృదయాలలో చిరస్థాయిగా నిలిచి ఉన్నాయి._


_మాకు ఉన్న మరో వినోదం పగలు గూటిబైళ్ల గోళీలాట, ఏడుపెంకులాట, కోతి కొమ్మచ్చి, బిళ్ళంగోడు, బచ్చాలాట, సిగరెట్ ఖాళీ పెట్టెలతో పత్తాలాట, ఇసుకతో పిచ్చుక గూళ్ళు కట్టటం, పాడైన సైకిల్ టైర్లు, రిమ్ములతో చక్రాలాట, అష్టాచెమ్మ, పచ్చీస్, దాడి, రాముడు-సీత ఆట, పులీ-మేక రాత్రికి హరికథలు, బుర్ర కథలు, నాటకాలు చూడటం, పురాణాలు వినటం. ఇక మహిళలైతే కొన్ని ఈ ఆటలతోపాటు అచ్చెనగిల్లలు, తొక్కుడుబిళ్ళ, వాన గుంటలు, కాళ్ళాగజ్జ.., ఐస్, దాగుడుమూతలు ఇదే వినోద, విజ్ఞాన కాలక్షేపం.._


_ఈ నాటికీ దాదాపు అందరం 50-57 సంవత్సరాలు పూర్తి చేసుకున్నవాళ్ళమే. జీవితంలో ఉన్నత ఉద్యోగాలు చేసుకున్నవాళ్ళమే. పిల్లలను పైచదువులు చదివించి ప్రయోజకుల్ని చేసినవాళ్ళమే !_


_అయినా ఉత్సాహం ఏమాత్రం తగ్గక ఇంకా యువకుల్లా కనిపిస్తున్నవాళ్ళమే. ఈ వయసులో కూడా మన చిన్నప్పటి స్నేహితులను పేరు పేరునా గుర్తుంచుకొని పిలుస్తున్న వాళ్ళమే !_  


_*ఇక మాకన్నా అదృష్టవంతు లెవరుంటారు ?*_

_*ఆహా ! జ్ఞాపకాల దొంతర అంటే ఇదీ !!*_

_*అచ్చంగా మన బాల్యాన్ని మనమే రాసుకున్నట్టుగానే వుంది కదా !!!*_


🙏🇮🇳😷🥦🌷🌐🤺🥀

సిద్ధర్ సిద్ధులు

 సిద్ధర్ సిద్ధులు


శ్రీహరిః శరణం

ఈ సంఘటన నాకు కాశి నుండి వచ్చిన ఒక వేదపండితుడు చెప్పాడు. అతను మహాస్వామి వారి దర్శనార్థమై కంచి శ్రీమఠానికి వెళ్ళాడు. దేవుడిని, గురువుని, రాజుని దర్శించేప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళరాదు అనే నియమాన్ని అనుసరించి తనతో పాటు కొన్ని టెంకాయలు, పళ్ళు పట్టుకుని వెళ్ళాడు. మహాస్వామి వారికి సాష్టాంగం చేసేప్పుడు వారి ముందు ఉంచడానికి. 


అక్కడ ఉన్న వరుసలో ఒక “సిద్ధర్” (సిద్ధులు పొందినవాడు) కూడా ఉన్నాడు. అతను వొట్టి చేతులతో నిలబడి ఉన్నాడు. ఈ వేదపండితుడు అతణ్ణి, స్వామివారికి సమర్పించడానికి ఏమి తీసుకురాలేదేమని అడిగాడు. అతడు ఆ పండితునితో “వేచి చూడు” అని అన్నాడు. అతని వంతు రాగానే పరమాచార్య స్వామివారికి నమస్కరించి గాల్లో చేతులని ఆడించి ఒక బుట్ట పళ్ళు తీసాడు. 


స్వామివారు చిన్నగా నవ్వి, ఎన్ని సంవత్సరాలుగా ఈ సిద్ధులను అభ్యసిస్తున్నావు అని అడిగారు. చాలా సంవత్సరాలుగా చేస్తున్నాను అని చెప్పి గాలిలోనుండి పూలు కూడా తీసాడు. మహాస్వామి వారు నవ్వి ఆ పూలు, పళ్ళ వంక చూసారు. వేంటనే అవి వాటి స్వరూపాన్ని కోల్పోయి, చెత్తగా మారిపోయాయి. 


స్వామివారి లాగా చేయుటకు ప్రయత్నించి ఆ సిద్ధుడు విఫలుడయ్యాడు. స్వామి వారు అతనితో, ఇటువంటి లోకవిహితమైన సిద్ధులను వదిలి ప్రజలకు సమాజానికి ఉపయోగపడే వాటిని చెయ్యమని సలహా ఇచ్చి పంపించారు. 


[అష్టసిద్ధులు(అణిమ, మహిమ, లఘిమ, గరిమ, ప్రాప్తి, ప్రాకామ్య, వశిత్వ, ఈశిత్వ) లభించడం సాధకులకు తొలిమెట్టు. చాలామంది వాటితోనే ఆగిపోతారు. అక్కడితో ఆగకుండా సాధన కొనసాగించాలి. జ్ఞానులకు ఆ సిద్ధులన్నీ వశవర్తులైనా వాటిని ఎన్నడూ ప్రదర్శించరు. ఒకవేళ ప్రదర్శిస్తే అది మరొకరి శ్రేయస్సుకే చేస్తారు. రామకృష్ణ పరమహంస, రమణమహర్షి మొదలుగువారికి ఇవన్నీ కరతలామలకం. కాని అనవసరంగా వాటిని ప్రదర్శించినట్టు ఎక్కడా లేదు]


--- డాక్టర్ యస్. కళ్యాణరామన్, న్యూరోసర్జన్, చెన్నై

_ఈ తీర్పును ఎలా తీసుకుందాం_*

 *_ఈ తీర్పును ఎలా తీసుకుందాం_*


అమెరికా దేశం లో .. 

ఓ పదిహేనేళ్ళ కుర్రవాడు ఓ షాప్ లో బ్రెడ్-బటర్ ప్యాకెట్ దొంగిలిస్తూ పట్టుబడ్డాడు. కాపలాదారు పట్టుకున్నాడు. ఆ కుర్రవాడు వదిలించుకుని పారిపోయే క్రమంలో షాప్ కు సంబంధించిన షెల్ఫ్ పగిలిపోయింది. 

కుర్రవాన్ని న్యాయాధికారి ముందుకు ప్రవేశపెట్టారు. 

“నువ్వు బ్రెడ్-బటర్ ప్యాకెట్ దొంగిలిస్తూ పట్టుబడ్డావా?” ప్రశ్నించాడు జడ్జ్. 

“అవును” నేల చూపులు చూస్తూ చెప్పాడు కుర్రవాడు. 

“ఎందుకు?”

“అవసరం పడింది”

“కొనుక్కోవచ్చుగా”

“డబ్బులు లేవు”

“మీ ఇంట్లోంచి తెచ్చుకోవాల్సింది” అన్నాడు జడ్జ్. 

“ఇంట్లో అమ్మ ఒక్కతే ఉంటుంది. ఏ పనీ చేయలేదు. జబ్బు మనిషి. ఈ బ్రెడ్-బటర్ ప్యాకెట్ ఆమె కోసమే” నిదానంగా చెప్పాడు. 

“నువ్వేం పనిచేయవా?

“కార్లు కడిగి ఏ రోజు కా రోజు డబ్బు సంపాదించేవాడిని. నిన్న అమ్మ ఆరోగ్యం అసలేమీ బాగా లేకపోతే ఆమెను చూసుకుంటూ ఇంట్లో ఉన్నందుకు పని లోంచి తీసేశారు.” బదులిచ్చాడు కుర్రవాడు. 

“ఎవరి సహాయమైనా తీసుకోకపోయావా” జడ్జ్ స్వరం లో జాలి కనిపించింది. 

“పొద్దున్నే ఇంట్లోంచి బయలుదేరి కనీసం ఓ యాభై మందిని సహాయం కోసం అర్థించాను. ఎవరూ కనికరించలేదు. చివరికి బ్రెడ్-బటర్ ప్యాకెట్ దొంగతనం చేయవలసి వచ్చింది. 

జడ్జ్ దీర్ఘంగా నిట్టూర్చాడు. తన తీర్పు వెల్లడించాడు. 

“కేవలం ఒక బ్రెడ్-బటర్ కోసం దొంగతనం చేయవలసి రావడం చాలా సిగ్గు పడాల్సిన నేరం. దీనికి ఆ కుర్రవాడు ఏమాత్రం బాధ్యుడు కాడు. ఈ కోర్టు లో ఉన్న నాతో సహా మిగిలినవారందరూ బాధ్యులే.. నేరస్తులే. అందుకే నాతో సహా ఈ కోర్టు లో ఉన్న ప్రతి ఒక్కరికీ తలా పది డాలర్ల చొప్పున జరిమానా చెల్లించాల్సిందిగా తీర్పు వెలువరిస్తున్నాను. పది డాలర్లు చెల్లించకుండా ఎవరూ బయటికి వెళ్ళడానికి వీల్లేదు.”

జడ్జ్ తన తీర్పు చదవడం ఆపాడు. తన పర్స్ లోంచి పది డాలర్ల తీసి టేబల్ పై ఉంచాడు. మళ్ళీ తన తీర్పును కొనసాగించాడు.

“అంతేకాకుండా ఆకలితో ఉన్న కుర్రవాడి మీద కనీస దయ చూపకుండా పోలీసులకు పట్టించినందుకు షాప్ యాజమాన్యానికి వెయ్యి డాలర్ల జరిమానా విధిస్తున్నాను. ఇరవై నాలుగు గంటల్లో జరిమానా కోర్టు కు చెల్లించక పోతే షాప్ మూసివేసి తాళం వేయవలసిందిగా కోర్టు ఆదేశాలిస్తుంది.”

కోర్టు లో జరిమానా గా వసూలు చేసిన డబ్బును కుర్రవాడికి అందించారు. 

ఆకలితో బాధపడే పరిస్తితి కుర్రవాడికి కలిగించినందుకు సమాజాన్ని మన్నించవలసిందిగా అతడిని కోరుతూ తీర్పును ముగించాడు న్యాయాధికారి. 

ఈ తీర్పు విన్న కోర్టు లోని ప్రతి ఒక్కరూ కంటతడి పెట్టారు. కుర్రవాడు వెక్కి వెక్కి ఏడుస్తూ జడ్జ్ వంక చూశాడు. ఆయన కూడా ఉబికి వచ్చే తన కన్నీటిని అదుపు చేసుకుంటూ లోపలికి వెళ్ళాడు. 

మన సమాజం, వ్యవస్థ, కోర్టు లు ఈ తరహా తీర్పులకు /నిర్ణయాలకు సిద్ధంగా ఉన్నాయా???

“ఆకలి తో ఉన్న వ్యక్తి తిండికోసం దొంగతనానికి వొడిగడితే ఆ సమాజం, దేశం, ప్రజలు సిగ్గు పడాలి” అని చాణక్యుడు ఏనాడో చెప్పాడు. 

ఒకవేళ ఈ కథనం మీ హృదయాన్ని తాకి చెమరింప జేస్తే.. మ Rరి కొందరికి కూడా పంచండి.

నేను మళ్ళీ ఆలయానికి రాను"*

 *"నేను మళ్ళీ ఆలయానికి  రాను"*


ఒక 11 సంవత్సరాల కుమార్తె తన తండ్రి తో కలిసి దేవాలయానికి వెళ్లింది. భగవంతునికి నమస్కరించి వచ్చి ఓ ప్రక్కన కూర్చున్న సమయంలో, తన తండ్రితో ఆమె ఇలా అంది.  "నేను ఇకపై ఆలయానికి రాను"


తండ్రి ఇలా అడిగాడు: "ఎందుకో నేను తెలుసుకోవచ్చా?"


ఆమె ఇలా అన్నది: " భగవంతునికి సేవ చేయడం మరియు భజనలో సమయం గడపటం కోసం మనం ఇక్కడకు వస్తున్నాము, కానీ ఇక్కడ నాకు అందరూ కపట భక్తులే గోచరిస్తున్నారు. దేవాలయానికి వచ్చిన తరువాత కూడా వారు తమ  మొబైల్ ఫోన్లతోనే గడుపుతున్నారు. వారి మనసు, దృష్టి మొత్తం సెల్ ఫోన్ మీదనే నిమగ్నమై ఉంటున్నాయి. చెడు మాటలు వినిపిస్తున్నాయి , వీరు కేవలం కపటులు మాత్రమే. వీరందరినీ చూసి చూసి నేను కూడా అలానే అవుతానేమో అనే భయం కలుగుతున్నది. అందుకే నేను ఇకపై ఆలయానికి రాదలచుకోవడం లేదు" అని చెప్పింది కుమార్తె


తండ్రి నిశ్శబ్దంగా విన్నాడు, ఆపై ఇలా అన్నాడు: "సరే ... నీ తుది నిర్ణయం తీసుకునే ముందుగా నాకోసం చిన్న పని చేయగలవా?" అన్నాడు  తండ్రి


ఆమె అన్నది: "చెప్పండి .. నాన్నగారు, ఏమిటది?"


తండ్రి ఇలా చెప్పాడు: "దయచేసి ఒక గాజు గ్లాసు నిండా నీరు తీసుకొని ఆలయం చుట్టూ 2 సార్లు నడిచి రావాలి ముఖ్యంగా వీళ్లందరి మధ్యలో నుండి నడచి వచ్చినా కూడా నీళ్ళు  ఏమాత్రం క్రింద పడకుండా రావాలి."  రాగలవా? అన్నాడు తండ్రి


కుమార్తె చెప్పింది: "ఓ ... తప్పకుండా నేను చేయగలను."

 

అప్పుడు ఆమె తండ్రి చెప్పినట్లు తిరిగి వచ్చి ఇలా చెప్పింది:


"చూశారా! ఈ గ్లాసు నిండుగా ఉంది. ఒక్క చుక్క నీరు కూడా క్రింద పడలేదు. మీరు చెప్పిన పనిని నేను విజయవంతంగా పూర్తి చేయగలిగాను"


అప్పుడు తండ్రి పాపను అభినందించి, ఆమెను 3 ప్రశ్నలు అడిగాడు:


1. ఈసారి వెళ్లినప్పుడు వారిలో ఎవరినైనా ఫోన్ తో ఉండగా నీవు  చూశావా?


2.  ఎవరైనా చెడు మాటలు, ఇతర గాసిప్స్  చెప్పుకుంటూ కాలక్షేపం చేయడం ఈసారి నీవు చూశావా?


3. ఎవరైనా యథార్థత లేకుండా కపటంగా జీవిస్తున్నారా?


ఆమె ఇలా చెప్పింది: "నేను ఏమీ చూడలేదు. నేను నా దృష్టి  గ్లాసు మరియు దానిలోని నీటిపైనే నిలిపాను, నీళ్ళు ఒక్క చుక్క కూడా పోలేదు. మిగతావారిని నేను గమనించలేదు "


అతను ఆమెతో చెప్పాడు: "నీవు దేవాలయానికి వెళ్ళినప్పుడు సరిగ్గా చేయవలసినదిదే. నీవు కేవలం భగవంతునిపై దృష్టి నిలిపి, ఆయనగురించే ఆలోచిస్తూ, ఆయనతో మమేకం అవడానికి ప్రయత్నించాలి. అలా కనుక నీవు చేయగలిగితే వీరెవరూ నీ దృష్టికి రారు, పైగా నీవంటి వారిని చూసి వారుకూడా క్రమంగా మారవచ్చు. అచంచలమైన భక్తి, నిరంతర ఏకాగ్రతా సాధనా మాత్రమే మనల్ని భగవంతునికి చేరువ చేస్తాయి. జీవితంలో ఉన్నతపథంలో నడిపిస్తాయి" .....


దేవాలయంలో గడప వలసిన విధానం గురించి తెలిపినందుకు తండ్రికి ఆమె ధన్యవాదాలు తెలిపింది .....🙏 ఏకాగ్రత.....🙏సాధన ముఖ్యం ....🙏

శ్రీరమణీయం* *-(134)*_

 _*శ్రీరమణీయం* *-(134)*_

🕉🌞🌎🌙🌟🚩


_*"శరీరభావన ఉంటేనే నేను అనే అహంభావన ఉంటుందా ?"*_


_*శరీరం ఉన్నంతవరకు ఎవరైనా 'నేను' అని అనవలసిందే ! మన ఉనికిని తెలిపే అహంభావన లేకపోతే మన మనుగడ కష్టం. 'అహంభావన-నేను'లు ఒకేభావాన్ని స్ఫురింపజేస్తాయి. శరీరం తెలియటం అహంభావన. అయితే శరీర అవసరాలు తీర్చటానికి మనం ఉపయోగించే పదం 'నేను'. గంపలో విడిగావున్న మిఠాయిని ఉండగా చేయటంతో దానికి పరిధి ఏర్పడి లడ్డు అవుతుంది. అలాగే విశ్వమంతా విస్తరించివున్న చైతన్యం, మనలో చేరటం ద్వారా పరిమితమైన 'నేను'గా మారింది. అహంభావన ఏదోక భాగానికి పరిమితం కాకుండా శరీరమంతా వ్యాపించి ఉంటుంది. మనసు నిమ్మళం అయ్యేకొద్ది మనోమూలమే ఆత్మగా స్పష్టం అవుతుంది !*_


_*{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}*_

_*'అనవసరమైన ఆలోచనలే ఆటంకం !'*- 


🕉🌞🌎🌙🌟🚩