28, జూన్ 2024, శుక్రవారం

*శ్రీ హోయసలేశ్వర ఆలయం*

 🕉 *మన గుడి : నెం 362*


⚜ *కర్నాటక  : హాలిబీడు*


⚜ *శ్రీ హోయసలేశ్వర ఆలయం*



💠 హళేబీడు, హళేబీడు, దొరసముద్ర అని కూడా పిలువబడే హోయసలేశ్వర దేవాలయం హళేబీడులో ఉంది. 

నిజానికి, హళేబీడు అంటే "పాత ఇల్లు/ పాత శిథిలాలు".  

అయితే, హళేబీడులో ఉన్నటువంటి కొన్ని దేవాలయాలు ఈ విధ్వంసం నుండి బయటపడాయి మరియు ఈ రోజు మీరు వాటిని చూసినప్పుడు, రాతితో చెక్కబడిన కొన్ని అద్భుతమైన వ్యక్తీకరణలను చూసి మీరు మంత్రముగ్ధులౌతారు. 


💠 హళేబీడు దేవాలయం అని కూడా పిలువబడే హోయసలేశ్వర ఆలయం, 12వ శతాబ్దపు శివునికి అంకితం చేయబడిన దేవాలయం, ఇది హోయసలేశ్వర మరియు శాంతాలేశ్వర శివ లింగాలకు అంకితం చేయబడిన జంట-దేవాలయం, పురుష మరియు స్త్రీ లింగాల పేర్లతో సమానంగా మరియు వాటి మధ్య భాగానికి చెందినవి.  .  ప్రపంచ వారసత్వ స్మారక చిహ్నం కూడా. 


💠 హళేబీడు నిజానికి దాని శాసనాలలో దొరసముద్ర అని పిలువబడింది, బహుశా ద్వారసముద్రం (సంస్కృత పదాలు "ద్వార" (తలుపు) మరియు సముద్రం నుండి ఉద్భవించింది. 

దొరసముద్ర రాజు విష్ణువర్ధన ఆధ్వర్యంలో స్థాపించబడిన రాజధానిగా మారింది మరియు దాదాపు 300 సంవత్సరాలు హొయసల సామ్రాజ్యానికి రాజధానిగా పనిచేసింది. 


💠 ఈ దేవాలయం నిర్మాణం 1121లో ప్రారంభమైంది మరియు 1160 లో పూర్తయింది. 

 14వ శతాబ్దం ప్రారంభంలో, హళేబీడు ఉత్తర భారతదేశం నుండి ఢిల్లీ సుల్తానేట్ యొక్క ముస్లిం సైన్యాలచే రెండుసార్లు కొల్లగొట్టబడింది మరియు దోచుకోబడింది మరియు ఆలయం మరియు రాజధాని శిధిలమైన మరియు నిర్లక్ష్య స్థితిలో పడిపోయింది.


💠 హొయసలేశ్వర దేవాలయంలాగా దేశంలోని మరే ఇతర దేవాలయం భారతీయ ఇతిహాసాలను అద్భుతంగా సంగ్రహించలేదని నమ్ముతారు.  

నందిమంటపం ఆలయానికి ఎదురుగా ఉంది, ఇందులో రాతి ఆభరణాలతో అలంకరించబడిన భారీ నంది ఉంది.  

దీని వెనుక 2 మీటర్ల ఎత్తైన సూర్యునికి అంకితం చేయబడిన మందిరం ఉంది.


💠 నవరంగ హొయసల వాస్తుశిల్పంలోని ఒక ప్రత్యేక అంశం.  

కన్నడలో, నవ అంటే తొమ్మిది, మరియు రంగ అంటే వేదిక.

నవరంగ అంటే తొమ్మిది రంగాలు.  సాధారణంగా చెప్పాలంటే, నవరంగ అనేది గర్బగృహానికి సమీపంలో ఉన్న దేవత దర్శనానికి ముందు ప్రజలు గుమిగూడే మండపం.  

హొయసల వాస్తుశిల్పంలో, ప్రధాన మండపాన్ని నవరంగ రూపకల్పన ద్వారా నిర్మించారు, మండపం యొక్క మధ్య ప్రాంతంలోని నాలుగు స్తంభాల ద్వారా మొత్తం స్థలాన్ని తొమ్మిది విభాగాలుగా విభజించారు (అందుకే నవరంగ అని పేరు వచ్చింది).


🔆 ఆలయ శిల్ప సంపద


💠 ఉత్తర శివాలయం యొక్క ఈశాన్య వెలుపలి గోడపై: 

సముద్ర మథనం, 12వ శతాబ్దపు సంగీత వాయిద్యాలతో సంగీతకారులు, శుక్రాచార్య, కచ-దేవయాని పురాణం, లక్ష్మీ, ఉమామహేశ్వర, వామన-బలి-త్రివిక్రమ పురాణం, ఇంద్ర పురాణం. , వీరభద్రుడు, యోగాలో శివుడు.


💠 ఉత్తర శివాలయం యొక్క ఆగ్నేయ వెలుపలి గోడపై: 

నృత్యకారులు, భైరవ, భైరవి, ఉమామహేశ్వరుడు. 


💠 దక్షిణ శివాలయం యొక్క ఈశాన్య బయటి గోడపై: 

భాగవతం నుండి కృష్ణుడి లీల, యమున మీదుగా నవజాత కృష్ణుడిని మోసుకెళ్ళి జైలులో ఉన్న వాసుదేవుడు, కృష్ణుడు పూతన మరియు ఇతర అసురులను వధించడం, కృష్ణుడు వెన్నను దొంగిలించడం, కృష్ణుడు గోవర్ధనను ఎత్తడం.


💠 దక్షిణ శివాలయం యొక్క ఆగ్నేయ వెలుపలి గోడపై: 

మహాభారతంలోని భీష్మ పర్వ మరియు ద్రోణ పర్వము.


💠 దక్షిణ శివాలయం యొక్క వాయువ్య వెలుపలి గోడపై: 

భాగవత పురాణం నుండి ప్రహ్లాద-హిరణ్యకశిపు-నరసింహ పురాణం; రావణుడితో రాముడు యుద్ధం చేయడం; సరస్వతితో బ్రహ్మ; మహాభారతం నుండి కర్ణ-అర్జునుడు 


💠 ఉత్తర శివాలయం యొక్క నైరుతి వెలుపలి గోడపై: 

బ్రహ్మ, శివుడు, విష్ణువు, దుర్గ, సరస్వతి, కామదేవుడు మరియు రతి, పార్వతిదేవి చిత్రాలు; పార్వతి యోగా చేయడం; శివుడు మోహినితో మోహింపబడ్డాడు; బంగారు జింకతో సహా రామాయణ కథలు, హనుమంతుడు మరియు సుగ్రీవునితో మొదటి సమావేశం, హనుమంతుడు రాముని ఉంగరాన్ని సీతకు ఇవ్వడం; విశ్వ చక్రానికి జన్మనిచ్చిన శేషునిపై విష్ణువు శయనించడం; వామన పురాణం; విష్ణువు అవతారాలు; శివుడు మరియు వినాయకుడు కలిసి నృత్యం చేస్తున్నారు; వేదాల నుండి పన్నెండు ఆదిత్యులు.


💠 ఉత్తర శివాలయం యొక్క వాయువ్య వెలుపలి గోడపై: 

తాండవ నృత్యంలో నటరాజు; దుర్గ మరియు సప్తమాత్రిక; మహాభారతంలో అర్జునుడితో అభిమన్యు, ద్రోణ, కృష్ణుడి పురాణాలు; నటరాజ; రుద్రుని ఎనిమిది రూపాలు; మోహినీ నృత్యం; భారవి; సరస్వతి నృత్యం, శివుడు మరియు గణేశ నృత్యం, కోపంతో ఉన్న నరసింహ, విష్ణువు యొక్క వివిధ రూపాలు, గజాసురమర్దన శివునితో నృత్యం చేస్తున్న వినాయకుడు; కార్తికేయ; పార్వతి; నృత్యకారులు మరియు సంగీతకారులు.


💠 ఇది హాసన్  కు 30 కిమీ, బెంగళూరుకు 

  210 కిమీ దూరం

నగ్న సత్యాలు

 నగ్న సత్యాలు


* గుడికి వెళ్లే మగవాళ్ల సంఖ్య,జిమ్ కు వెళ్లే ఆడవాళ్ల సంఖ్య క్రమంగా పెరుగుతుంది..


* చచ్చిపోతున్నా కూడా వైద్యం చేయనివి గవర్నమెంటు ఆసుపత్రులు.. చచ్చాక కూడా వైద్యం చేసేవి కార్పొరేట్ ఆసుపత్రులు..


* మనం సంతోషంలో ఉన్నపుడు పాటలను వినాలి.. బాధలో ఉన్నపుడు ఆపాటలను అర్ధం చేసుకోవాలి..


* అనాధ ఆశ్రమంలో పేదవారి చిన్నపిల్లలు ఉంటారు! వృద్ధాశ్రమంలో ధనికుల తల్లిదండ్రులు ఉంటారు..


* చిరునవ్వు చాలావరకు సమస్యలు పరిష్కరిస్తుంది! మౌనం అసలు సమస్యలు రాకుండా నివారిస్తుంది..


* పూజలు చేసి దేవుడికోసం మనం వెతుకుతాం దానంచేస్తే ఆయన మనకోసం వెతుక్కుంటూ వస్తాడు..


* తినటానికి భోజనం లేని స్థాయి నుంచి, తినటానికి సమయంలేని స్థాయివరకు ఎదగటమే విజయం..

గొప్ప స్నేహితులు

 కర్ణుడిని, దుర్యోధనుడిని గొప్ప స్నేహితులు అనుకుంటారు. ఇలాంటి స్నేహాలు ఎంత ప్రమాదకరమో నిజంగా తెలుసుకోవాలి. స్నేహ లక్షణాలు ఇద్దరిలోనూ లేవు. స్నేహమంటే చెట్టాపట్టాలేసుకొని తిరిగేవాళ్ళు కాదు. 


పాపాన్నివారయతి యోజయతే హితాయ 

గుహ్యన్నిగూహయతి గుణాన్ ప్రకటీకరోతి 

ఆపద్గతంచ న జహాతి దదాతి కాలే 

సన్మిత్ర లక్షణమిదం ప్రవదంతి సంతః!!(భర్తృహరి)


స్నేహం అంటే మిత్రుడు పాపం చేయకుండా ఆపాలి. వాడికి హితమైనది చెప్పాలి. ఆపదలలో విడిచిపెట్టకూడదు, అవసరమైన సంపదలు ఇవ్వాలి. చివరి రెండూ మాత్రం పాటించారు ఇద్దరూ. మొదటి రెండూ లేవు. 


స్వార్థపూరితమైన స్నేహానికి ఉదాహరణ చెప్పాలంటే దుర్యోధన, కర్ణులే. కుమారాస్త్రవిద్యా ప్రదర్శన సన్నివేశంలో వీళ్ళిద్దరికీ స్నేహం ఏర్పడింది. ఆ స్నేహం ఎటువంటి పరిస్థితులలో ఏర్పడింది? అక్కడ అర్జునుడు చూపించిన అద్భుతమైన ప్రతాప ప్రదర్శనకి మొత్తం అందరూ చకితులై నిశ్చేష్ఠులై చూస్తూ ఉంటే దుర్యోధనుడికి బెంగపట్టుకుంది. భీముడు, నేను గదావిద్యలో పోటాపోటీ. అర్జునుడితో పోటీ ఏమిటి అని ఆలోచిస్తూ ఉంటే నేను అని వచ్చాడు కర్ణుడు. ఇప్పుడు దుర్యోధనుడికి పాండవులను దెబ్బతీయడానికి ఒకడు దొరికాడు గనుక వీడి స్నేహం నాకు కావాలి అనుకున్నాడు. అంటే వీడి స్నేహం ఎందుకోసం? పాండవులకోసం. 


కర్ణుడు ఎందుకు దుర్యోధనుడితో కలిశాడు? అంటే -

కర్ణుడికి మహాస్పర్థ అర్జునుడితోనే. ఎలాగోలా అర్జునుని దెబ్బతీయాలి అని. అర్జునుడిని దెబ్బతీయాలంటే తనకి ఒక అండ ఉండాలి. అందుకని దుర్యోధనుని ప్రక్కకి చేరాడు. ఎంత అర్జునుడి మీద పగ లేకపోతే తన గురించి తెలిసినా వాళ్ళ అమ్మకి ఇచ్చిన మాట అర్జునుడిని తప్ప అందరినీ విడిచిపెడతాను అన్నాడు. అందుకే ద్రోణుడి దగ్గరికి వెళ్ళి బ్రహ్మాస్త్రం ఇమ్మని అడిగాడు. అప్పుడు ఆయన నువ్వు యోగ్యుడివి కాదు అన్నారు. నువ్వు ఇవ్వకపోతే నీ గురువు దగ్గరికి వెళ్తాను అని పరశురాముడి దగ్గరికి వెళ్ళాడు. ఇక్కడ గురుధిక్కారం. అటువంటి వాడికి మంత్రము, అస్త్రము వచ్చినా పనిచేయవు అని తెలుసుకోవాలి. 


కర్ణుడు పరశురాముని దగ్గరికి కూడా వంచనతో వెళ్ళాడు. ఉపనయన సంస్కారం లేనివాళ్ళకి మంత్రోపదేశం చేయరాదు గనుక తనకి తత్ సంస్కారములు లేవు గనుక బ్రహ్మాస్త్రం మంత్రం గనుక తాను విప్రుడు అని అబద్ధం ఆడాడు. అసత్యంతో గురువును ఆశ్రయించాడు. పోనీ ప్రయోజనం ఏమైనా గొప్పదా? ప్రయోజనం గొప్పదైతే దానిని ధర్మంగా స్వీకరించవచ్చు. అర్జునుడితో సమ ఉజ్జీ కావాలి అని మాత్రమే. ఆ సమయంలో అక్కడ పొరపాటున అయినా గోహత్య చేశాడు. ఆ గోవు కలిగిన బ్రాహ్మణుడు శపించాడు – నువ్వు ఏ విద్య నేర్చుకున్నా వ్యర్థమైపోతుంది అని. అటుతర్వాత పరశురాముడికి కర్ణుడి మోసం తెలిసి ఆయనా శపించాడు. ఉద్దేశ్యం మంచిది కానప్పుడు విద్యనేర్చుకునేటప్పుడు వంచన ఎంత ప్రమాదకారియో తెలుసుకోవాలి. 


విద్యను ఒక వస్తువుగా చూస్తున్న నేటి నాగరికతలో ఈవిషయం తెలుసుకోవాలి. గురుదక్షిణ పారేశాం, వాళ్ళు విద్య నేర్పారు, అని అనుకోకూడదు. గురువును కేవలం ఒక మంత్రం ఇచ్చినటువంటి ఒకానొక వస్తువు అనుకోకూడదు. ఆ మంత్రము, ఆ దైవము గురురూపంలో ఉన్నారనే భావన ఉండాలి. అందుకే సృష్టిలో గురువును విడిచిపెడితే పరమేశ్వరుడు కూడా కాపాడడు. గురువును విడిచిపెట్టి ఎన్ని మంత్రాలు, జపాలు, తపాలు చేసినా వాడిని ఏ దేవతా రక్షించదు. సర్వనాశనం అవుతాడు అని చెప్తున్నారు. అర్జునుడు గురుభక్తికి ఒక ఉదాహరణ, కర్ణుడు గురుతిరస్కారానికి ఒక ఉదాహరణ.


పైగా తన అస్త్రాలన్నీ శాపగ్రస్తాలు అని కర్ణుడికి తెలుసు. తన అస్త్రాల మీద తనకే నమ్మకం లేదు. అర్జునుడి దగ్గర ఆ దోషం లేదు. అటువంటప్పుడు ఏం చూసుకొని దుర్యోధనుడికి ధైర్యం చెప్పాడు. ఇంతకంటే దుర్మార్గం, మిత్రద్రోహం మరొకటి ఉంటుందా? తన అస్త్రములు శాపోపహతములు అని తెలిసినప్పుడు, తన విజయం మీద తనకే నమ్మకం లేనప్పుడు నేనున్నాను ఫరవాలేదు అని చెప్తాడా?


అంటే ఒకవిధంగా దుర్యోధనుడిని వంచనచేసి ముంచాడు. 

నన్ను వంచన చేశావు మిత్రద్రోహి అనడానికి దుర్యోధనుడికి అర్హత లేదు. స్వార్థ స్నేహాలు ఇలాగే ఉంటాయి. ఇది తెలియక మనవాళ్ళు గొప్ప మిత్రుడిలాగా చూపిస్తూ ఉంటారు. 

కురుక్షేత్ర యుద్ధంలో దుర్యోధనుడి పక్షాన పోరాడి నశించిన అసురాంశ కలవాళ్ళు ఇంక ఏ లోకాలకూ వెళ్ళక భూలోకంలో మానవులుగా పుట్టి భారతంలో కృష్ణుడినీ, ద్రౌపదినీ, విమర్శిస్తూ నవలలు, నాటకాలు, వ్యాసలు వ్రాస్తూ అవార్డులు తెచ్చుకుంటూ ఉన్నారు.

రామభక్తుడు

 రామభక్తుడు, భయనివారకుడు, అభయప్రదాయకుడు అయిన హనుమంతుని విగ్రహం లేని ఊరు ఈ భారతదేశంలోనే లేదు. గదను పట్టుకున్న వీరాంజనేయునిగా, చేతులు జోడించివున్న దాసాంజనేయునిగా, అభయముద్రతో అభయాంజనేయునిగా, రామనామస్మరణాసక్తుడైన ప్రసన్నాంజనేయునిగా, లక్ష్మణప్రాణదాయకుడైన సంజీవనగిరిధారిగా వివిధ రూపాలలో దర్శనమిస్తాడు ఆంజనేయుడు. అయితే, వీటన్నింటికంటే విశిష్టమైన రూపం – తోకలో గంటను ధరించిన హనుమ రూపం అని పెద్దలు చెబుతారు.

హనుమంతుని తోకలో ఉండే గంట వెనుక ఉన్న ఆసక్తికరమైన పురాణ కథను తెలుసుకున్నవారికి కొండంత పుణ్యం, సముద్రమంత ఆనందం.

రండి….హనుమంతుని వాలా ఘంట కథను తెలుసుకుందాం!

అది శ్రీరామ వనవాస ఘట్టం.

తండ్రి దశరథుడు పినతల్లి కైకకు ఇచ్చిన మాట ప్రకారం తమ్ముడు భరతుని పట్టాభిషేకం కోసం అడవులకు వచ్చాడు రాముడు. తోడుగా సీతమ్మ తల్లి. నీడగా లక్ష్మణుడు. మునుల దర్శనాలతో, ఋషిపుంగవుల దివ్యోపదేశాలతో, పచ్చపచ్చని పరిసరాల్లో సాగుతున్న వనవాసంలో అనుకోని ఘటన – సీతమ్మ అపహరణ. ప్రాణప్రదురాలైన భార్యను వెదుకుతూ బయల్దేరిన రామచంద్రునికి వానరులైన సుగ్రీవుడు, హనుమంతునితో స్నేహం కుదిరింది. వానర రాజుగా అన్న స్థానంలో కూర్చున్న సుగ్రీవుడు సీతమ్మ జాడ కనిపెట్టడానికి నలుదిక్కులకూ వానరుల్ని పంపాడు. రావణ లంకలో ఉన్న అమ్మ జాడను హనుమన్న కనిపెట్టాడు. యుద్ధం తప్ప వేరే మార్గం లేదని నిర్ణయించిన రాముడు కపిసైన్యాన్ని, భల్లూక పటాలంతో జతకూర్చాడు. ఇద్దరు మానవుల కోసం యుద్ధానికి సిద్ధపడ్డాయి కోతులు, ఎలుగుబంట్లు.

*****

యుద్ధమంటే విహార యాత్ర కాదు కదా!

హోరాహోరీ పోరాటంలో నెగ్గేదెవరో? నేల కూలేదెవరో? ఎవరికి తెలుసు? ఒక్క భగవంతునికి తప్ప!

రాక్షసులతో రణానికి తరలివెళుతున్న తమవాళ్ళను కడసారిగా కన్నుల నిండుగా చూసుకుంటున్నాయి వానర కుటుంబాలు. ఒకవైపు స్వామికార్యం, మరొకవైపు పేగుబంధం – ఈ రెండిటికి నడుమ జరుగుతున్న ఘర్షణలో స్వామికార్యానికే పూనుకున్నారు వానర వీరులు. కన్నీళ్ళు కారుతున్నా “విజయోస్తు…దిగ్విజయోస్తు” అని అంటున్నారు కుటుంబ సభ్యులు.

ఈ దృశ్యాన్ని చూసిన రాముడు కదలిపోయాడు. కరిగిపోయాడు. తన కన్నులలోని చెమ్మను కనిపించనీయకుండా జాగ్రత్తపడ్డాడు. తుది వీడ్కోళ్ళు ముగిసాయి. సైన్యం సర్వసన్నద్ధంగా ఉంది. అప్పుడు లేచాడు రాముడు – “ఓ వానరులారా! ప్రాణాస్పదులైన మీ బిడ్డలను, భర్తలను, సోదరులను, బంధువులను నా కోసం, నా స్వార్థం కోసం జరగబోయే యుద్ధానికి పంపిస్తున్నారు. మీ నిస్వార్థతకు నా నమోవాకాలు. నేను అఋణిని. ఎవరీ ఋణాన్ని ఉంచుకోకూడదన్న వ్రతం కలిగినవాణ్ణి. కనుక, ఇదే నా వాగ్దానం. యుద్ధానికి ఎంతమందిని తీసుకువెళ్తున్నానో, అంతమందితోనే వెనక్కు తిరిగి వస్తాను.” అని అన్నాడు.

జనన-మరణాల చక్రాన్ని ఛేదించగలిగే ఏకైక శక్తి చక్రధారి. ఆ చక్రధారే నేడు కోదండధారియై వాగ్దానం చేసాడు. రామన్న అన్న మాట ఎన్నటికీ పొల్లుపోదు. తమవారు తప్పక తిరిగివస్తారన్న ఆనందంతో జయఘోషను చేసింది వానర జాతి.

*****

రామ సేవ కోసం కదలిన కపిసైన్యంలో సుగ్రీవుడు, ఆంజనేయుడు, అంగదుడు వంటి మహోన్నత కాయులతో బాటు “సింగిలీకలు” అని పిలువబడే పొట్టి పొట్టి…మరుగుజ్జు కోతులు కూడా ఉన్నాయి. ఈ సింగిలీక కోతులు కేవలం ఒక్క అడుగు ఎత్తు మాత్రమే ఉంటాయి. వాటికి ఎలాంటి ఆయుధాలు ఉండవు. పదునైన పళ్ళు, వాడియైన గోళ్ళు – ఇవే వాటి ఆయుధాలు. కొన్ని వందల సింగిలీకలు గుంపుగా కలిసి ఒక శత్రువుపై దాడి చేస్తాయి. పళ్ళతో కొరికి, గోళ్ళతో రక్కి చంపుతాయి. ఇదే వాటి యుద్ధతంత్రం.

*****

రామ-రావణ యుద్ధం ఘోరంగా సాగుతోంది.

రామలక్ష్మణుల బాణధాటికి, కపివీరుల ప్రతాపానికి ఎందరో రాక్షస వీరులు రాలిపోయారు. రావణాసురుని కుమారులు కూడ ఎందరో ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఇక మిగిలింది ఇద్దరే. రావణుడు – కుంభకర్ణుడు. హాయిగా నిద్రపోతున్న కుంభకర్ణుడు అన్న కోసం యుద్ధరంగానికి వచ్చాడు.

కుంభకర్ణుడు మహాకాయుడు. నేలపై నిలబడితే, తల ఆకాశంలోకి వెళ్ళిపోతుంది. అంతటి భారీ దేహం వాడిది. విశాలమైన, ఎత్తైన మహారథంలో కూర్చుని యుద్ధానికి వచ్చాడు. ఆ రథం పైభాగంలో ఉన్న గొడుగుకు చిన్ని చిన్ని గంటలు కట్టివున్నాయి. అవి గలగలా శబ్దం చేస్తుండగా, వికటాట్టహాసంతో వానరులపై విరుచుకుపడ్డాడు కుంభకర్ణుడు. ఘోరమైన పోరు తర్వాత రామబాణం దెబ్బకు నేలకూలాడు.

రథం నుండి కిందకు పడుతున్న సమయంలో కుంభకర్ణుడి చెయ్యి తగిలి ఒక గంట క్రింద పడింది.

అదే సమయంలో క్రింద యుద్ధరంగంలో వెయ్యిమంది సింగిలీక కోతులు గుంపుగా వెళుతున్నాయి. కుంభకర్ణుని రథం నుండి తెగిన గంట వేగంగా వచ్చి, నేరుగా ఈ కోతుల పైన పడింది. గంటదేమో భారీ ఆకారం. కోతులేమో మరుగుజ్జులు. ఇంకేముంది…ఆ వెయ్యి కోతులూ గంట కింద ఇరుక్కుపోయాయి. ఉన్నట్టుండి చీకటి కమ్ముకుంది. ఏ చప్పుడూ వినబడకుండా పోయింది. అంతే, ఆ బుల్లి కోతులకు భయం పట్టుకుంది.

*****

అలా కొద్దిసేపు గడిచాక, ఎవరూ తమ కోసం రాకపోవడంతో  ఒక్కొక్క కోతి ఒక్కొక్క విధంగా మాట్లాడ సాగింది. “మనల్ని కాపాడ్డానికి ఎవరూ రాలేదు. ఇక్కడే చచ్చిపోతామేమో?” అని ఒక కోతి అంది. “మనం తప్పు చేసాం!” అని మరొక కోతి అంది. “అవును, మన రాజు, మంత్రి – ఇద్దరూ మూర్ఖులే! వాళ్ళని నమ్మి మోసపోయాం” అని ఇంకొక కోతి అంది. “అసలా రాముడు ఎవడు? అతనికి, మనకి సంబంధమేముంది? అయినా వచ్చాం కదా! కనీసం మన గురించి పట్టించుకున్నాడా? మోసగాడు. నమ్మకద్రోహి” అని ఫలాన ఒక కోతి వదరింది. “అవునవును…” అన్నాయి ఎన్నో కోతులు.

అప్పుడు ఒక ముసలి కోతి ముందుకొచ్చి – “అనవసరంగా ఆడిపోసుకోవడం వల్ల ప్రయోజనం లేదు. సహనంతో ఉందాం. రామ నామ స్మరణ చేద్దాం.” అంది. ఆ మాటలకు మిగతా కోతులు కిచకిచా నవ్వాయి. అవహేళన చేసాయి. అయినా సరే, ఆ పెద్ద కోతి కళ్ళు మూసుకుని రామ తారక మంత్రాన్ని జపించడం మొదలుపెట్టింది.

ఇంకొంతసేపు గడిచాక, తిట్టి తిట్టి అలసిపోయిన కొన్ని కోతులు ఆ పెద్ద కోతితో చేరి రామ నామాన్ని చేయసాగాయి. అలా అలా కొద్ది కాలంలోనే, అన్ని కోతులు రామ నామ సంకీర్తనలో మునిగిపోయాయి.

*****

ఈలోపు, గంట బైట ఏం జరిగిందో చూద్దాం!

రాముడు రావణున్ని సంహరించాడు. సీతమ్మను చేపట్టాడు. విభీషణుడికి పట్టాభిషేకం చేసాడు. ఇక అయోధ్యకు బయల్దేరాలి. అప్పుడు సుగ్రీవుణ్ణి పిలిచి, తన వాగ్దానాన్ని గుర్తు చేసాడు. కపిసైన్యాన్ని లెక్కించి రమ్మన్నాడు. లెక్కలు వేసిన సుగ్రీవుడు రాముడి దగ్గరకు వచ్చి “ఒక వెయ్యి కోతులు తక్కువగా ఉన్నా”యని చెప్పాడు. మళ్ళీ లెక్కవేయమన్నాడు రాముడు. మళ్ళీ వెయ్యి తక్కువగా ఉందన్నాడు సుగ్రీవుడు. అప్పుడు సాక్షాత్తు రామచంద్రుడే బయల్దేరాడు.

ముందు హనుమ దారి చేస్తుండగా, యుద్ధరంగంలోకి వచ్చాడు రాముడు. ఎటు చూసిన రాక్షసుల శవాలు, విరిగిన రథాలు, కత్తులు, పగిలిన డాళ్ళు. వాటన్నింటి మధ్యా ఎక్కడైనా వానరులు పడివున్నారేమో స్వయంగా వెదుకుతున్నాడు రాముడు.

అంతలో, స్వామి దృష్టి ఒక గంటపై పడింది.

“హనుమా…” అన్నాడు.

పవనసుతునికి తన స్వామి అంతరంగం ఇట్టే అర్థమయింది. వెంటనే తోకను పెంచి…గంటను పైకి లేపాడు.

అక్కడ….

ఆ గంట క్రింద….

పెదవులపై రామనామం తాండవిస్తుండగా, మూసిన కళ్ళతో, రామభక్తితో వికసించిన మనసులతో కూర్చునివున్న కోతులు.

సుగ్రీవుడు చకచకా లెక్కవేసాడు.

వెయ్యి సింగిలీక కోతులు. లెక్కసరిపోయింది.

చుట్టూవున్న వానర సైన్యం ఒకపెట్టున “జయ జయ రామ….జయ జయ రఘురామా” అంటూ జయఘోషను చేసింది.

అప్పటి వరకూ చీమ చిటుకుమన్న శబ్దం కూడ వినని మరుగుజ్జు కోతులు అపార పారావార ఘనఘోర తరంగ ఘోషలా వినబడిన జయజయధ్వానాలకు ఉలిక్కిపడ్డాయి. చటక్కున కళ్ళు తెరిచాయి.

చీకటికే అలవాటు పడినపోయిన కళ్ళతో ధగధగా మెరుస్తున్న సూర్యకాంతిని చూడలేక, కళ్ళకు చేతుల్ని అడ్డుపెట్టుకుని, నెమ్మదిగా చూడసాగాయి.

అదిగో…ఎదురుగా….

ఆజానుబాహుడు…అరవిందదళాయతాక్షుడు…నిశాచరవినాశకరుడు, భక్తకోటికి శీతకరుడు అయిన రాముడు నిలబడివున్నాడు.

అంతే….సింగిలీక కోతులకు దిగ్భ్రమ కలిగింది. దిక్కులు తోచలేదు. ఏం చెయ్యాలన్న ఆలోచన రాలేదు.

వానరసైన్యం మరొక్కమారు జయఘోషను చేసింది. “జై శ్రీరామ…జై శ్రీరామా”

అప్పుడు తెలిసింది ఏం చేయాలో…వెంటనే రామపాదారవిందాలపై పడ్డాయి ఆ బుల్లి కోతులు.

“రాముడు మోసగాడు” అన్న ఈ కోతిని, “హనుమంతుడు బుద్ధిహీనుడు” అన్న ఆ కోతిని తాకాయి రామస్వామి మృదు హస్తాలు.

ఎవరి వీక్షణం భవసాగరాన్ని తారణం చేయిస్తుందో అటువంటి రామ వీక్షణం “తారక మంత్రమే త్రోవ” అన్న పండుకోతిపై ప్రసరించాయి.

అలా సింగిలీక కోతుల జన్మలు ధన్యమయ్యాయి.

*****

ఇప్పుడు రాముని దృష్టి హనుమ వైపుకు మళ్ళింది.

“సుందరే సుందరం కపిః” – ముద్దైన కోతి తోకకు ముచ్చటైన గంట.

మురిపెంగా చూసాడు ముగ్ధమోహనుడైన రాముడు.

“హనుమా! రాముడు మాట తప్పడు అనడానికి ఉదాహరణగా నిలిచే ఈ సింగిలీక కోతుల కథకు గుర్తుగా, తోకతో గంటను కలిగిన నీ రూపాన్ని ఎవరు చేతులారా అర్చిస్తారో, మనసారా ప్రార్థిస్తారో – వారికి నా అనుగ్రహం రెండింతలుగా లభిస్తుంద”ని వరమిచ్చాడు శ్రీరాముడు.

*****

వాలంలో ఘంటను కలిగిన వానరశ్రేష్టుణ్ణి దర్శించేప్పుడు, పూజించేప్పుడు ఈ సింగిలీక కథను గుర్తుచేసుకోండి. “సింగిలీక వరదా…శ్రీరామచంద్రా” అని ప్రార్థించండి.

||జయ జయ ఆంజనేయ…జయ జయ శ్రీరామ||

సహాయం చేయాలనే

 *ఇతరులకు సహాయం చేయాలనే దయను ప్రతీఒక్కరూ కలిగిఉండాలి* 


మనం జీవితంలో పెంపొందించుకోవాల్సిన ముఖ్యమైన లక్షణాలలో దయ ఒకటి.  ప్రతి ఒక్కరి జీవితంలో సంతోషం, దుఃఖం మారుతూ ఉంటాయి కాబట్టి బాధలో ఉన్నవారికి మనం సహాయం చేయడం చాలా ముఖ్యం.  ఇతరులకు సహాయం చేయాలనే కోరికను పెంపొందించు కోవడానికి మనలో దయ అనే గుణం కలిగి ఉండాలి.

 భగవంతుని కరుణ అనంతమైనది కావున ఆయనను కరుణా సాగరుడిగా అభివర్ణించారు.  లోకసంరక్షణ నిమిత్తం భగవంతుడు అనేక అవతారాలు ధరించేలా ప్రేరేపించేలా  చేసిందే ఆయనలోని ఈ దాయాగుణం.

 ఒకరు దయతో మరొకరికి సహాయం చేసినప్పుడు ప్రతిఫలంగా ఏమీ ఆశించకూడదు.  అప్పుడే సత్పురుషుడు అని అనిపించుకోగలరు.

 శ్రీ ఆదిశంకర భగవత్పాదులవారు తన శిష్యునికి గురువుగా ఉపదేశించడం ఆ శిష్యునిపై ఉన్న దయతో అని చెప్పారు.  శిష్యుడు భక్తితో గురువుకు చేరువకాగలగాలి. ఎందుకంటే గురువు కరుణా సాగరుడు. పరబ్రహ్మం అంటే ఋషులలో ఉత్తముడు అని అర్థం.

 ప్రతి ఒక్కరూ దైనందిన జీవితంలో సద్గుణ దయను అలవర్చుకోవాలి.  ఇతరులకు చేసే చిన్న సహాయం కూడా పుణ్యం.  ఎదుటివారి గురించి మంచి మాటలు చెప్పడం మంచి పని.  శ్రీ ఆదిశంకరులవారు తనకు హాని చేయడానికి వచ్చిన  కబాలికపై దయ చూపాడు.  ఇది మహోన్నతమైన దయ.

చిన్నతనం నుంచే పిల్లల్లో దాయాగుణం పెంపొందించాలి.  పాఠశాలలో చదువుకునేటప్పుడే తోటి విద్యార్థులకు ఏ చిన్న సహాయం చేసేలా నేర్పించాలి.  ఇద్దరు వ్యక్తులు పోట్లాడుకోవడం చూస్తే వారిని శాంతింపజేసి పోరాటాన్ని ఆపడానికి ప్రయత్నించడం మన కర్తవ్యం.  కరుణ, దయ అనే ఈ రెండు లక్షణాలు తమలో ఉన్నవారు మాత్రమే ఈ ప్రయత్నంలో నిమగ్నమవ్వగలరు.

 మంచి స్థానంలో ఉన్న వ్యక్తి తననుంచి మంచి యోగ్యత కోరుకునే వారికి సహేతుకమైన ఉపకారం చేయాలి.  ఇతరులకు సహాయం చేయడానికి మన జీవితంలో చాలా అవకాశాలు ఉన్నాయి.  మీరు వాటిని కోల్పోతే, చింతించవచ్చు.  అది కూడా అజ్ఞానమే.

 కాబట్టి ప్రతి ఒక్కరూ ఇతరులకు సహాయం చేయడానికి  భగవధానుగ్రహాన్ని సాధించడానికి తమ వంతు కృషి చేద్దాం


-- *జగద్గురు శ్రీశ్రీశ్రీ భారతీ తీర్ధ* 

 *మహాస్వామి వారు*

భక్తికి,ప్రేమకు

 *భక్తికి,ప్రేమకు వెలకట్టకూడదు...*

కుచేలుడు భగవాన్ శ్రీకృష్ణ సన్నిధికి వెళ్ళినప్పుడు "నాకు అది కావాలి, నాకు ఇది కావాలి" అని చెప్పలేదు.. "తన మిత్రుడైన శ్రీకృష్ణుడు తను ఏది ఇచ్చినా, ఇవ్వకున్నా, లేదా పెట్టినదానితో సంతోషిస్తాడని" ఒకే ఒక ఆలోచనతో శ్రీ కృష్ణ భగవాన్‌కు పిడికెడు అటుకులు తెచ్చి వాటిని భగవాన్ కి తన స్వహస్తాలతో నోటిలో పెట్టాడు. తన మిత్రుని అపారమైన ప్రేమకు "అతను తృప్తి చెందాడు". కాబట్టి మనం చేసే మంచి పని లేదా పూజ లేదా దానం ప్రచారం కోసం చెయ్యకూడదు.అది ఏమిటి? ఎంత విలువైనది? అనేది కాదు..మనం చేసిన కార్యానికి భగవంతుడు తృప్తి చెందాడా?లేదా అనేదే ముఖ్యం.అందుకే భీష్ముడు ఇలా అన్నాడు...

*"యత్భక్త్యా పుండరీకాక్షం స్తవైరర్సేన్నర: సదా"*

 అంటూ భక్తితో భగవంతుని నామాన్ని జపిస్తే అదే గొప్ప దానమని,అదే గొప్ప పుణ్యఫలమని సూచించారు. ..


-- *జగద్గురు శ్రీశ్రీ భారతీతీర్ధ మహాస్వామి వారు*

నీటిలో పడవ

 నీటిలో పడవ ఉండాలే కానీ పడవలో నీరు ఉండకూడదు. జీవితంలో జ్ఞాపకాలు ఉండాలే కానీ జ్ఞాపకాలే జీవితం కాకూడదు...........

శుభాకాంక్షలతో..........

🙏🏻ప్రశాంతమైన శుభోదయం🙏Goodmorning

ముమ్మాటికీ మీరే

 జై శ్రీ రామ్ 


*మీ అమ్మాయిలకు వారసత్వ సంపదగా మణులు, మణిహారాలు ఇవ్వకండి... చీర బహుకరించండి! అదే జీవిత గమనాన్ని మారుస్తుంది!!* (బండారు శైలజా ప్రసాద్) 🙏🙏🙏🙏🙏🙏🙏"పెళ్లి కూతురు ఎంత అందంగా ఉంది...చీర లో మెరిసి పోతుంది అని మీ బంధువులు అంటుంటే మీకు ఆకాశంలో విహరిస్తున్న అనుభూతి కలుగుతుంది...కానీ ఒక్క సారి మీరు వెనిక్కి తిరిగి గత జ్ఞాపకాలు నెమరేసుకుంటూ పోతే, ఒక రోజన్నా కాలేజీ కి మీ అమ్మాయిని చీర కట్టులో పంపారా? వెస్ట్రన్ దుస్తులు వేసుకుంటున్నప్పుడు దిష్టి తీసి బయట పడేశారు..కానీ కనీసం ఆఫ్ సారీ లో అయినా కాలేజీ కి పంపాలని అనుకున్నారా? వంద మంది మగ పిల్లలు మీ అమ్మాయిని పొట్టి దుస్తుల్లో చూస్తుంటే ఎంత మంది మగ జాతి కళ్ళను తప్పించుకొని తిరిగి ఇంటికి వచ్చి మీ అమ్మాయి కుమిలి కుమిలి ఏడిచింది మీరు గమనించారా? పక్కింటి పిల్ల జీన్స్ వేసుకుంది కదా అని మీ అమ్మాయి పై రుద్ది ఆమె మైండ్ సెట్ ను ప్రాశ్చాత్య సంస్కృతి పై మోజు పడేలా చేసింది ముమ్మాటికీ మీరే! నిజానికి ప్రాశ్చాత్య దేశాల్లో నివసిస్తున్న భారతీయులు చీర తప్పా వాళ్ళు పొట్టి దుస్తులు ధరించడం లేదు! తొమ్మిది గజాల స్త్రీ తత్త్వం చీర లో తప్పా మరే దాంట్లో కనబడదు! చీర దయ, శైలి, మన వారసత్వ సంపద!! నిజానికి రంగుల మనస్తత్వ శాస్త్రం చీర గురించి వివరిస్తే ఆ చీరలో ఇంత అద్భుతమైన అలంకరణ తో కూడిన నీతి ఉందా అనిపిస్తుంది...ఎందుకంటే మీరు ఇల్లు వదిలి బయట ప్రపంచంలోకి వెళితే చీర కున్న గౌరవ ప్రదమైన స్థానం మరి దేంట్లో లేదని ముమ్మాటికీ మీ మనసుకు తెలుసు! ఒక పెళ్లి రోజే మీ అమ్మాయిని సాక్షాత్తూ లక్ష్మి దేవీ లా ఉందని పొగుడుతున్న మీ బంధువులు రోజు సాంప్రదాయ దుస్తుల్లో వెళితే ఆమెకు మంచి మొగుడు రావడం ఖాయం!! ఎందుకంటే మన మనసే మనకు సాక్ష్యం...మన బెహేవియర్ ఎలా ఉంటే మనసు మాట వినక ఉంటుందా?! అసలు ఈ రంగుల ప్రపంచంలో చీర విశిష్టత గురించి వివరిస్తే మీకు చాలా నిజాలు అర్థం అవుతాయి!!🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏చీరలలో రంగు మనస్తత్వశాస్త్రం యొక్క సింబాలిజం, అర్థం ఇమిడి ఉంది..

రంగు మన జీవితంలో అపారమైన శక్తిని ఇస్తుంది..కొత్త భావోద్వేగాలను రేకెత్తిస్తుంది, జ్ఞాపకాలను పదిల పరుస్తుంది. ఈ  ఫ్యాషన్ ప్రపంచంలో, వ్యక్తిత్వం మరియు సాంస్కృతిక ప్రతీకలను వ్యక్తీకరించడంలో *రంగు* కీలక పాత్ర పోషిస్తుంది!   వివిధ రంగుల వెనుక ఉన్న ప్రతీకవాదం మరియు అర్థాన్ని తెలుసుకుంటే... మహిమ గల చీర లో ఇంత పరమార్థం ఉందా అనుకుంటారు..

*ఎరుపు రంగు చీర* ఇదీ విప్లవ స్త్రీలకి ఆపాదించారు...కానీ ఇది ఒక ఉద్వేగభరితమైన ఆకర్షణ గల రంగు

ఎరుపు, అభిరుచి, ఆత్మవిశ్వాసం ఉట్టి పడేలా చేస్తుంది..  ఎర్రటి చీరను ధరించినప్పుడు , ఒక స్త్రీ విశ్వాసం తో పాటు  చైతన్యాన్ని వెదజల్లుతుంది. స్త్రీ ధైర్యానికి కూడా ఇదీ  ప్రతీక!   

*నీలం రంగు చీర* 

నీలం రంగు చీర  ప్రశాంతతకి మరోపేరు...ఈ చీర ఆధ్యాత్మికతతో ముడిపడి ఉంటుంది!  ఇది చీరలలో కనిపించే బహుముఖ రంగు...చాలామంది లేడీ బ్యూరో క్రాట్స్, లేదా మహిళ కలెక్టర్లు అధికారిక కార్యక్రమాలలో ఈ చీర ధరిస్తారు... నీలం రంగు ప్రశాంతత భావాన్ని ఇస్తుంది. ఇది మహిళ  ఆలోచన యొక్క స్పష్టతను పెంచుతుందని నమ్ముతారు...చూపరులకు కూడా స్త్రీ ప్రశాంతత కనబడుతుంది! 

*నలుపు చీర* నిజానికి నలుపు విషాదానికి చిహ్నం అనుకుంటారు..అది ముమ్మాటికీ తప్పు...ఈ చీర చక్కదనం అనే పదానికి కేరాఫ్ అడ్రస్.. *శోకం* అనే పదం వల్ల ఈ నలుపు రంగు కు స్త్రీలు దూరంగా ఉంటారు.  ..ఇప్పుడు సెలబ్రెటీ మహిళలు సాయంత్రం వెళ్ళే పంక్షన్లలో నలుపు చీరలు ప్రత్యేకంగా ధరిస్తున్నారు!!  

*పసుపు చీర*: 

పసుపు చీరలు సానుకూల స్త్రీ తత్వానికి మచ్చు తునక...ప్రతి పండుగలు, శుభ కార్యాల్లో అడవారు ఇష్టపడే ఈ చీర  కొత్త ప్రారంభాలను, శుభాలను సూచిస్తుంది. మృదువైన పాస్టెల్ పసుపు రంగుల నుండి శక్తివంతమైన షేడ్స్ వరకు, ఈ చీరలు పండుగలు ఆనందకరమైన వేడుకలకు ప్రసిద్ధ ఎంపికలుగా స్ర్తీలు ధరిస్తున్నారు. పసుపు ఆశావాదంతో సంబంధం కలిగి ఉంటుందనీ మనస్తత్వ శాస్త్ర వేత్తలు అంటుంటారు..  

*ది రీగల్ చరిష్మా ఆఫ్ పర్పుల్ సారీ* గురించి చెప్పాలి అంటే...

పర్పుల్, రాయల్టీ మరియు లగ్జరీతో స్త్రీ కనిపించే వస్త్ర ధారణ!! 

*ఆకుపచ్చ చీర* సామరస్యం మరియు శ్రేయస్సు కు ప్రతిబింబం

ఆకుపచ్చ చీర ప్రకృతి రంగు కూడా! స్త్రీ మానసిక సమతుల్యత తో ఉంటుందని, జీవశక్తి, సమృద్ధి, జ్ఞాపక శక్తికి నిదర్శనమని అంటారు.. ఈ ఆకుపచ్చ చీర ప్రకృతితో సమకాలీకరించబడిన అనుభూతిని కలిగిస్తాయి!

*తెలుపు రంగు చీర* నిజానికి ఈ రంగును విధవలకు ఆపాదించారు... మన పూర్వీకులు!

తెల్ల చీరలు అపారమైన సాంస్కృతిక వార సత్వ  సంపద ఇమిడి ఉంది..అవి స్వచ్ఛత, అమాయకత్వం, ఆధ్యాత్మికతను సూచిస్తాయి. తెలుపు అనేది స్వచ్ఛత మరియు సరళతను సూచించే రంగు! ఇక

*పింక్* యొక్క భావోద్వేగ అభిరుచి

ఈ పింక్ కలర్.. లేత గులాబీ స్త్రీత్వం, సున్నితత్వం  సూచిస్తుంది...ఇలా రంగుల చీరల మనస్తత్వ సున్నితత్వం గురించి హ్యూమన్ సైకాలజీ లో ఎన్నో విశేషాలు ఉన్నాయి...!!


జై శ్రీ రామ్ 

కంచెర్ల వేంకట రమణ

*శ్రీ లక్ష్మీదేవి నివాస స్థానాలు.*🪷

 🙏🌹🌷🪷🛕🪷🌷🌹🙏

      *శుక్రవారం 28 జూన్, 2024*

🪷 *శ్రీ లక్ష్మీదేవి నివాస స్థానాలు.*🪷

               

*సర్వ సంపదలకు అధినేత్రి అయిన శ్రీ మహాలక్ష్మి యొక్క కరుణా కటాక్ష వీక్షణాల కోసం ఎదురు చూడని వాళ్ళు ఎవరు ఉండరు?  ఆమె దృష్టి మన మీద పడడం కోసం మనం ఎన్నో పూజలు, వ్రతాలూ చేస్తూ ఉంటాము. కానీ, శ్రీ లక్ష్మీదేవి యొక్క నివాస స్థానాలు, ఆమె ప్రీతి కొరకు ఏమి చేయాలి అనేది మనం సూక్ష్మంగ తెలుసుకొందాము.  పూజలు, వ్రతాలూ చేయలేని వాళ్ళు జీవన విధానంలో కొద్ది మార్పులు చేసుకోవడం ద్వార లక్ష్మి అనుగ్రహాన్ని పొందవచ్చు.*



*1. సింహ ద్వారం గడప దగ్గర చెప్పులు చిందర వందరగా పడేయకూడదు.  గడప లక్ష్మి స్వరూపం కనుక గడప తొక్కి ఇంట్లోకి రావడం, గడప మీద కాలు వేయడం, గడపకు అటు ఇటు చెరో కాలు వేసి నుంచోవడం వంటి పనులు చేయరాదు. పసుపు, కుంకుమ ఉన్న గడపలు లక్ష్మి దేవికి ఆహ్వానం పలుకుతాయి. అందువల్ల ప్రతి శుక్రవారం గడపకు పసుపు, కుంకుమతో అలంకరించాలి.*


*2. ప్రధాన ద్వారం తలుపు మీద ఎర్రని కుంకుమతో స్వస్తిక్ గుర్తు వేసిన మంచిదే.*


*3. శుచి, శుభ్రత ఉన్న ఇళ్లు లక్ష్మి దేవికి ఆలవాలం. కనుక, ఇంట్లోని పనికిరాని వస్తువులు, విరిగి పోయిన, చెడిపోయిన వస్తువులు ఎప్పటికప్పుడు బయట పారేయాలి.*


*4. చెడిపోయిన గడియారాలు, విరిగిపోయిన అద్దాలు, చిరిగి, వాడని వస్త్రాలు ఇంట్లో అస్సలు ఉండకూడదు.*


*5. ముగ్గు వేసిన వాకిలి గుండా లక్ష్మి దేవి ఇంట్లోకి ప్రవేశిస్తుంది. అందుకే తెల్లవారే వాకిలి ఉడ్చి ముగ్గులు వేసుకోవాలి.*


*6. ఇంటి ఇల్లాలు గట్టిగ గొంతు పెట్టి మాట్లాడడం, నట్టింట్లో చెడు మాటలు, చెడు తిట్లు తిట్టడం వంటివి చేయకూడదు.*


*7. ఎక్కడైతే భార్య భర్తలు నిరంతరం కోట్లడుకుంటారో, ఏ ఇంట్లో ఇల్లాలు ఎప్పుడూ అసంతృప్తి గా ఉంటుందో, ఆ ఇంట్లో లక్ష్మి దేవి ప్రవేశించదు.*


*8. అబద్ధాలు చెప్పేవాళ్ళు, ఇరు సంధ్యలలో భుజించేవారు, నిద్రించే వారు, బద్దకస్తులు ఎక్కడ ఉంటారో, అక్కడ లక్ష్మి దేవి ఉండదు.*


*9. ఇరు సంధ్యలలో దీపారాధన చేసే ఇంట్లో లక్ష్మి దేవి కొలువై ఉంటుంది.*


*10. సాయం సంధ్య వేళల్లో సాంబ్రాణి ధూపం ఇంట్లో వేసినచో మంచిదే.*


*11. సత్యవాదులు, ధార్మిక , నైతిక ప్రవర్తన ఉన్న వారి పట్ల లక్ష్మి దేవి ప్రసన్నురాలై ఉంటుంది.*


*12. వెండి, బంగారు వంటి లోహల్లో, రత్నాలు, ముత్యాలులో లక్ష్మిదేవి కొలువై ఉంటుంది.*


*13. అతిగా మాట్లాడే వారు, గురువులను, పెద్దలను అగౌరవ పరిచేవారు, జూదరులు, అతి నిద్రాలోలురు, అపరిశుభ్రంగా ఉండే వారు ఉన్న చోట లక్ష్మి దేవి ఉండలేదు.*


*14. ప్రతి శుక్రవారం తలస్నానం చేసి, ఎర్రని వస్త్రాలు, పువ్వులు ధరించి, లక్ష్మి పూజ చేసేవారు ఆమె అనుగ్రహం పొందుతారు.*


*15. చిల్లర పైసలను, పువ్వులను, అన్నాన్ని నిర్లక్ష్యంగా పడేసేవారు ఆమె అనుగ్రహం పొందలేరు*


.                  *సర్వం*    

          *శ్రీకృష్ణార్పణమస్తు*

                 🌷🙏🌷


                 *సేకరణ*

        🪷 *న్యాయపతి*🪷

     🌹 *నరసింహారావు* 🌹

బ్రాహ్మీ మూర్తి! విశ్వనాధ!!

 బ్రాహ్మీ మూర్తి! విశ్వనాధ!!


శ్రీ వాడపల్లి రామమోహనరావుగారు.సాహితి సౌజన్యంతో.


విశ్వనాథవారిని బ్రాహ్మీమూర్తి అని పండిత లోకం కీర్తించింది. ఈ బ్రాహ్మీమూర్తిమత్వం విశ్వనాథకు కేవలం సంస్కృతాంధ్ర సారస్వతాలలో ఆయనకున్న గొప్ప అభినివేశానికి సంబంధించినది మాత్రమే కాదు.ఆయనలోని ఆలోచనావిధానం పరిపక్వస్థితిని గాంచి రసాలూరుతూ పరిమళాలు వెదజల్లే, భావసమాహారంగా వెలువడిన ఆయన రచనలలో కనబడే తానెంచుకున్న వస్తువు యొక్క ఔన్నత్యం,భావౌన్నత్యం,భాషా ప్రౌఢిమ ఇవన్నీ కలిసిన ఒకానొక మేలుకలయికగా నిలచిన ఒక మహాతత్త్వం అనిపిస్తుంది. ఇంకా ఆలోచించి చూస్తే అది మాత్రమే కాదేమో అని మళ్ళీ! ఇదంతా ఆయన పూర్వజులనుంచి వచ్చిన మహాసంస్కార ఫలం. ఆయన గురువుల నుంచి నేర్చిన 'సదసద్వివేక చతురత.' తన తండ్రిగారు శోభనాద్రిస్వామి పిలిచి అబ్బాయీ!

  "వ్రాసిన రామచంద్రు కధ వ్రాసితివం చనిపించుకో..."

అన్న తండ్రి యాజ్ఞ యును, జీవుని వేదన - ఈ రెండూ కలిసి ఆయనకు సారస్వతాభినివేశమూ,భావౌన్నత్యమూ ఇచ్చేయి. రామాయణ కల్పవృక్ష రచనకు పురికొల్పాయి సరే. కాని ఇక్కడ జీవుని వేదన అన్నది ఇంకా పరిశీలన చేయాల్సి ఉందేమో. ఈ జీవుని వేదన ఇంతటితో ఆగిందా!లేదనిపిస్తుంది. వేదవర్గీకరణ,అష్ఠాదశ పురాణాలు,మహాభారత రచన ఇన్ని చేసిన వ్యాస మహర్షికి జీవుని వేదన శాంతించలేదు. నారదుణ్ణి రప్పించుకుంది.నారదుని సలహా మీద శ్రీమద్భాగవత రచన చేసినప్పుడు గాని ఆయన జీవుడు శాంతించ లేదు. ఎన్నో చారిత్రక ఇతివృత్తాలను తీసుకుని వాటి ద్వారమున ఉజ్వల ప్రాచీనభారత చరిత్రకు సంబంధించిన వాస్తవాలు పురాణవైరగ్రంథమాల రూపంలో తెచ్చే బృహత్ప్రయత్నం చేశారు విశ్వనాథ. తన కిష్టమైన వైదిక జీవనవిధానానికి సంబంధించిన ఎన్నో ఇతివృత్తాలను చేపట్టి తత్త్వం,తర్కం అనే రెండు పంచకళ్యాణులను పూన్చిన తన రచనారధాన్ని నడిపారు.జీవితంలోని గహనమైన దుఃఖాలను తవ్వుకుని తవ్వుకుని రచనలు చేశారు. వీటివల్ల జీవుని వేదన పెరిగిందే గాని తరుగ లేదు. ఓ పక్క రామాయణ రచన సాగుతూనే ఉంది. మరో పక్క ఆ జీవుని వేదన పెరుగుతూనే ఉంది.


    మొన్నటి వ్యాసంలో తన కావ్యానంద ప్రధమ ముద్రణ 1972 లో జరిగిందని వ్రాశాను. అంటే అప్పటికి కావ్యానందము రచన ప్రారంభించి సంవత్సరం పై మాటే. నిజానికి ఈ కావ్యవిమర్శనా రచనలు నాలుగు భాగాలు. 

కావ్యానందము

కావ్యపరీమళము

సాహిత్య సురభి

సాహిత్యోపన్యాసములు.


ఈ నాలిగింటిలో కావ్యానందము మకుటాయమానమైన రచన. ఇతర రచనలన్నీ తన జీవితంలో ముందు సాగగా కావ్యానందము తన జీవుని వేదన పరాకాష్టనొందిన సమయానమ్మవారు తనలో చేరి రాయించినదనిపిస్తుంది.


    ఆయన తన కల్పవృక్ష అవతారికలో నన్నయతిక్కనలు తనను ఆవేశించారని రాశారు.కాదేమో!

     ఆయన వచనంలో కాని పద్యంలో కాని వాక్య విన్యాసం,పదాలను తన భావనలకనుగుణంగా సరిపోయేవి - అంటే తన భావనను యధాతధంగా దింపే పదాలను పొందుపరచి చెప్పదలుచుకున్న విషయం సూటిగా చెప్పేతీరు,ఆ భాష చూస్తుంటే - భాష మళ్ళీ గొప్ప గ్రాంధీకమో,వ్యాకరణపరిష్కృత శిష్టవ్యావహారికమో కూడా పూర్తిగా కాదు.చాలా మామూలు వ్యవహారశైలిలో ఉంటుంది. చెప్తున్నది ఆయన కాదేమో,ఆయన్ను ఆవేశించిన సరస్వతీదేవి చెప్తూంది అనిపిస్తుంది.ఇందులో ఏదో అతిశయోక్తిగా చెప్పాలన్న ఉద్దేశమేమీ లేదు. ఈ గ్రంథం, కావ్యానందం ఒక కథావస్తు సహితమైనది కాదు. కథాబలం వల్ల ఇష్టంగా చదవటానికి కావలసిన అంశాలిందులో లేనే లేవు.రాసిన ప్రతి వాక్యంలోనూ ఒక చంటిపిల్లవాణ్ణి కూర్చోపెట్టి అమ్మ ప్రేమ మీరగా చెప్పిన తీరు ద్యోతకమౌతుంది.కొన్ని కొన్ని వాక్యప్రయోగాలు ఆయనవి ఆనందం వల్లనా,దుఃఖం వల్లనా? ఎందుకు వస్తున్నాయి అన్నది తెలియనీయకుండా కన్నీళ్ళు తెప్పిస్తాయి.ఇది నిజం! ఆయన చేపట్టిన ఏ విషయాన్నైనా దాని మూలభావన నిరూపణకు ఆయన కొనసాగించే భావనాక్రమం,దానికోసం వాడే భాష - ఒకదానికోసం ఒకటి అన్నట్టు దర్శనం అవుతుంది. అది ఎంత ప్రేమాస్పదంగా ఉంది అనిపిస్తుంది.


   నిన్నటి వ్యాసంలో ఆఖరి పేరాలో ఆయన మాటలు చూడండి.."రెండువందల యేండ్లనుండి....పరిమిత సంఖ్యాకులయందైనా దాని యచ్చత్వం అది నిలబెట్టుకొనుచునే యున్నది...ఈ కొత్తమార్పును కూడ తట్టుకొన గలదు. కాని దైవమనుకూలించక...😢 ఈ వాక్యాలలో సారస్వతం ఒకదేవతామూర్తిగా ఆవిర్భవించిన వైనం కనబడుతుంది.ఆ దేవత కన్నీళ్ళు కారుస్తున్నట్టు...


      పోతనగారు. "కాటుక కంటినీరు చనుకట్టుపయిన్ బడ ఏల యేడ్చెదో..."అని ఓదారుస్తున్నప్పుడు శోకమూర్తియైన అమ్మవారు ఇక్కడ గోచరిస్తుంది. అక్కడ. "ఇమ్మనుజేశ్వరాధములకమ్మా" లని అనుకుంటున్నాడేమో అని ఆవిడ ఏడ్చింది.

ఇక్కడ నేరుగా తనను హత్య చేస్తారేమో అని ఏడుస్తూన్నట్టు అనిపిస్తుంది. ఐతే ఇక్కడ ఆవిడ దుఃఖ స్వరూపం వేరు. తను హత్యకు గురైతే తనను నమ్ముకున్న తన బిడ్డలగతేంటనే ఈవిడ దుఃఖం.నేను లేకపోతే మీరెలా బ్రతుకుతార్రా అబ్బాయీ! అన్న తల్లి వేదన. విశ్వ నాథవారి జీవుని వేదన పరాకాష్ట పొందినవేళ స్వయంగా అమ్మవారే వచ్చి తన జీవుని ఆవేశించి పలికించిన పలుకులు కావ్యానందం అనిపిస్తుంది. ఈ గ్రంథంలో ఆఖరు

 వ్యాసం "స్వయంభువు" అన్న శీర్షికన వ్రాసినది. ఇది చాలా ఉత్కంఠ కలిగించే చర్చ. దీనిగురించి మరోసారి వ్రాస్తాను. కాని ఈ వ్యాసం చివర శ్లోకం చూస్తే జీవుని వేదన పరాకాష్ట పొందిన మీదట అమ్మవారు జోకొడితే పొందిన శాంతి వల్ల చిన్నపిల్లవాడి నోటినుంచి వచ్చే '...ఊఊఊ...'అనే శబ్దాలవంటిదనిపిస్తుంది.

 "అర్చామీతి ధియా యదేవకుసుమం భిత్త్వాజనో ముచ్చతే

నధ్యామీతి.ధియా తదేవ వికిరన్ భస్మీకృతో మన్మథః

యశ్చాభ్యాంతర వృత్తి మాత్ర రసికో సాక్షాత్స్వయంభూ పుమాన్

సస్స్వామీ మమదైవతం తదితరో నామ్నా పినామ్నాయతే.


 అమ్మవారు జీవుని ఆవేశించి కొనిపోయి వృత్తి వృత్తిమాత్ర రసికుడైన పరమేశ్వర విభూతి స్వయంభువుగా ఇక్కడ ఆత్మలో ప్రతిష్ఠించుకున్న స్వామి ఎదుట నిలబెట్టింది. పరమశాంతిని పొందిన భావన!


అందుకే విశ్వనాథ బ్రాహ్మీమూర్తి!


                 🌺🙏🌺

వసుచరిత్రలోని శబ్దచమత్కారాలు!!

 శు భో ద యం🙏


వసుచరిత్రలోని

     శబ్దచమత్కారాలు!!


      శుక్తిమతీ వర్ణనం!


శబ్ద చమత్కారాలకు పుట్టినిల్లు 'వసుచరిత్ర' శుక్తిమతిని నదిగా, స్త్రీగా వర్ణించే పద్యం 

లో చక్కటి శ్లేష వైచిత్రి గోచరిస్తుంది.


జీవనమెల్ల సత్కవి నిషేవిత మాశయమెల్ల నచ్ఛతా 

పావనతా, గభీరతల పట్టు ప్రచారములెల్ల విశ్వ ధా

త్రీ వలయ త్రికాల ఫల దేశిక ముల్నవ కంబు లెల్ల ము 

క్తావళి విభ్రమాస్పదము, లానది పెంపు నుతియింప శక్యమే     

 


అర్థము:--ఆమె జీవితమంతా కవుల పొగడ్తలతో నిండింది. ఆశయాలన్నీ 


స్వచ్ఛత,పావనత,గాంభీర్యానికి నిలయం.ఆమె నడవడిక,భూమండలానికి మూడు లోకాలలోనూ శుభఫల సూచకం.ఆమె అందం 

జీవన్ముక్తుల్ని కూడా మోహ విభ్రాంతుల్ని చేసేది. ఇది స్త్రీ పరమైన అన్వయం.


    నదీపరంగా చూస్తే నీటిపక్షులతో(జీవనమంటే జలమనీ,కవులంటే నీటి పక్షులని 

అర్థం వుంది.)

జల పక్షులు స్వచ్చమైన,పవిత్రమైన, లోతైన,జలాశయాలతో కూడినవి.ముత్యాల 

సమూహానికి ఆధారభూతమైన శంఖాలతో ప్రవేశించేవి. ఇందులో సమాసోక్త అలంకారం వుంది. సంస్కృత,తెలుగు భాషా శ్లేషలు,మిశ్రమ భాషా శ్లేషలు,సంధిలో శ్లేషలు,జాతీయాల్లో శ్లేషలు యిలా ఎన్నో విధాల శ్లేషలు ప్రయోగించాడు భట్టుమూర్తి.

-------------------        స్వస్తి--🙏🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

నీరు పరిశుభ్రంగా

 పంచభూతాత్మకమైన ఈ ప్రకృతిలో నీటికి అత్యంత ప్రాధాన్యం ఉంది. ప్రాణికోటికి జీవనాధారమైనది కనుక నీటిని దైవస్వరూపంగా భావిస్తాం. ఆకాశం నుంచి వాయువు, వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి నీరు, నీటి నుంచి భూమి, భూమి నుంచి ఓషధులు, వాటినుంచి అన్నం, అన్నం వల్ల ప్రాణులు ఉత్పన్నమైనట్లు శృతులు చెబుతున్నాయి. మన శరీరం కూడా పంచభూతాల తత్వంతో ఏర్పడిందే. అందుకే దీన్ని పాంచభౌతిక దేహం అంటున్నాం.

సకల చరాచరాలను సృష్టించేది నీరే. 'నారాయణుడు' అంటే నీరే స్థానంగా కలవాడని అర్థం. నీటి నుంచే నారాయణుడు ఆవిర్భవించినట్లు రుగ్వేదం చెబుతోంది. ఉదకంలో భగవంతుడు, భగవంతుడిలో ఉదకం ఉందనీ, దాని విశేషం తెలుసుకున్నవారే ముక్తికి అర్హులనీ 'మంత్రపుష్పం' చెబుతోంది. 'జీవితమివ్వడానికి, దీర్ఘాయువు కలిగించేందుకు, తేజస్సు పెంచేందుకు ఈ జలాలు కదులుతూ మమ్మల్ని తడుపుతుండాలి' అన్న వేదార్థం కూడా ఉంది.

నీటితో చేసే అయిదు రకాల స్నానాల వివరణ పద్మపురాణంలో ఉంది. శరీరానికి విభూతి పూసుకొంటూ జలస్మరణం చేయటం ఆగ్నేయస్నానం. శుద్ధజలంతో స్నానం చేస్తే అది వారుణస్నానం. శిరస్సుమీద జలాన్ని ప్రోక్షణ చేసుకుంటే బ్రహ్మస్నానం. గోధూళిలో సంచరిస్తే వాయవ్యస్నానం. ఎండకాస్తుండగా కురిసేవానలో తడిస్తే దివ్యస్నానంగా చెబుతారు. తడిగుడ్డతో శరీరాన్ని తుడుచుకోవడం కపిలస్నానం. ఏనుగులా చాలాసేపు స్నానం చేయడం శ్రేష్ఠమని నీతిశాస్త్రకారుడు చెప్పాడు.

మన ఆరోగ్యవృద్ధి కోసం సనాతనులు పలు సందర్భాల్లో పలువిధాలుగా నీటిని స్వీకరించాలని చెప్పారు. ఆధునిక విజ్ఞానశాస్త్రమూ దీన్నే సమర్థిస్తోంది. సంధ్యావందనంలో పెట్టిన ఆచమన విధి అందులో ఒక భాగమే. అరచేతిని ఆవుచెవిలా చేసుకొని అందులో ఒక ఉద్ధిరణ శుద్ధోదకం పోసుకుని మూడుసార్లుగా ఆచమనం చెయ్యమన్నారు. సంధ్యావందనం ముగిసేలోగా ఇలా చాలాసార్లు చేయవలసి వస్తుంది. అంటే, రోజూ మనం నీరు తరచూ తాగాలన్న సంకేతమిది. పూజలో కూడా 'మధ్యేమధ్యే పానీయం సమర్పయామి' అంటున్నాం. ఎలాంటి జలం అంటే, 'శుద్ధాచమనీయం' అంటున్నది వేదం. నీరు పరిశుభ్రంగా లేకుంటే వ్యాధులు వస్తాయన్న హెచ్చరిక ఉంది అందులో.

మాజీ ప్రధాని పీవీ నరసింహారావు 104 వ జయంతి నేడు..*

 జై శ్రీమన్నారాయణ 




 *మన తెలుగు ముద్దు బిడ్డ భారతరత్న మాజీ ప్రధాని  పీవీ నరసింహారావు 104 వ జయంతి నేడు..* 


నిరంతరం నిశ్శబ్దాన్ని కప్పుకుని ప్రశాంతంగా సాగిపోయే గోదారమ్మలా కనిపించే పీవీ జీవితం ఎత్తుపల్లాల జలపాతం. రాజకీయంగా ఎలాంటి బలం, బలగం లేకపోయినా ఆలోచనా విధానంలో నూతనత్వం, ఆర్థిక వ్యవహారాల్లో చాణక్యతత్వం దేశాన్ని అభివృద్ధి బాటలో నడిపే ధీరత్వం సాహతోపేత నిర్ణయాలు తీసుకోవడంలో తెగింపుతత్వమే ఆయన్ని దేశ ప్రధాని పీఠంపై కూర్చోబెట్టింది. బహుశా స్వాతంత్ర్య భారత చరిత్రలో ఇలాంటి అద్భుతంతో పోల్చే అద్భుతం ఇంకొకటి ఉండదేమో!


పాములపర్తి వెంకట నరసింహారావు ఈ పేరు నేటితరం వారికి పెద్దగా పరిచయం ఉండకపోవచ్చు! కానీ పీవీ నరసింహారావు అంటే తెలియనోళ్లు ఉండరు. నిరంతరం నిశ్శబ్దాన్ని కప్పుకుని పైకి గంభీరంగా కనిపించే పీవీ, దేశ ప్రగతికి దార్శనికుడు. తన మేథస్సుతో, ఆర్థిక సంస్కరణలతో గాడి తప్పిన ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి పట్టాలపై ఎక్కించి అపర చాణక్యుడిగా కీర్తిగడించారు. మారుమూల ప్రాతం నుంచి రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.

తపస్సు

 💎🌅  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 ॐ卐  *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎


శ్లో𝕝𝕝    *యే పాపాని న కుర్వంతి*

        *మనోవాక్కర్మబుద్ధిభిః* l

        *తే తపన్తి మహాత్మానః*

        *న శరీరస్య శోషణమ్* ll


తా𝕝𝕝 "*మనోవాక్కర్మచేత పాపాలు చేయనివారే మహాత్ములు.... వారే తపస్వులు.... శరీరాన్ని శుష్కింపజేయడం తపస్సు కాదు*"

ఏకాగ్రత అనే గుణం

 శ్లోకం:☝️

*న కోకిలానామివ మంజు గుఞ్జితం*

*న లబ్ధలాస్యాని గతాని హంసవత్ ।*

*న బర్హిణానామివ చిత్రపక్షతా*

*గుణస్తథాప్యస్తి బకే బకవ్రతం ॥*


భావం: స్వరం కోకిల అంత మధురంగా ​​ఉండదు. హంసలాంటి రమణీయమైన నడక లేదు, నెమలిలా రంగురంగుల పింఛాలు లేవు. కానీ ఏకాగ్రత అనే గుణం కలదు కొంగకి. (బకవ్రతం = కొంగ ధ్యానం)

పంచాంగం 28.06.2024

 ఈ రోజు పంచాంగం 28.06.2024  Friday.


స్వస్తి  శ్రీ చాన్ద్రమాన క్రోధి నామసంవత్సర: ఉత్తరాయణం గ్రీష్మ ఋతు జ్యేష్ఠ మాస కృష్ణ పక్ష సప్తమి తిధి భృగు వాసర: పూర్వాభాద్ర నక్షత్రం సౌభాగ్య యోగ: బవ తదుపరి బాలవ కరణం. ఇది ఈరోజు పంచాంగం.


సప్తమి సాయంత్రం 04:27 వరకు.

పూర్వాభాద్ర పగలు 10:10 వరకు.


సూర్యోదయం : 05:48

సూర్యాస్తమయం : 06:50


వర్జ్యం : రాత్రి 07:14 నుండి 08:44 వరకు.


దుర్ముహూర్తం : పగలు 08:24 నుండి 09:17 వరకు తిరిగి మధ్యాహ్నం 12:45 నుండి 01:37 వరకు. 


అమృతఘడియలు : రా.తె 04:17 నుండి 05:48 చరకు. 


రాహుకాలం : పగలు 10:30 నుండి 12:00 వరకు.


యమగండం: మధ్యాహ్నం 03:00 నుండి 04:30 వరకు.



శుభోదయ:, నమస్కార: