28, జూన్ 2024, శుక్రవారం

మాజీ ప్రధాని పీవీ నరసింహారావు 104 వ జయంతి నేడు..*

 జై శ్రీమన్నారాయణ 




 *మన తెలుగు ముద్దు బిడ్డ భారతరత్న మాజీ ప్రధాని  పీవీ నరసింహారావు 104 వ జయంతి నేడు..* 


నిరంతరం నిశ్శబ్దాన్ని కప్పుకుని ప్రశాంతంగా సాగిపోయే గోదారమ్మలా కనిపించే పీవీ జీవితం ఎత్తుపల్లాల జలపాతం. రాజకీయంగా ఎలాంటి బలం, బలగం లేకపోయినా ఆలోచనా విధానంలో నూతనత్వం, ఆర్థిక వ్యవహారాల్లో చాణక్యతత్వం దేశాన్ని అభివృద్ధి బాటలో నడిపే ధీరత్వం సాహతోపేత నిర్ణయాలు తీసుకోవడంలో తెగింపుతత్వమే ఆయన్ని దేశ ప్రధాని పీఠంపై కూర్చోబెట్టింది. బహుశా స్వాతంత్ర్య భారత చరిత్రలో ఇలాంటి అద్భుతంతో పోల్చే అద్భుతం ఇంకొకటి ఉండదేమో!


పాములపర్తి వెంకట నరసింహారావు ఈ పేరు నేటితరం వారికి పెద్దగా పరిచయం ఉండకపోవచ్చు! కానీ పీవీ నరసింహారావు అంటే తెలియనోళ్లు ఉండరు. నిరంతరం నిశ్శబ్దాన్ని కప్పుకుని పైకి గంభీరంగా కనిపించే పీవీ, దేశ ప్రగతికి దార్శనికుడు. తన మేథస్సుతో, ఆర్థిక సంస్కరణలతో గాడి తప్పిన ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి పట్టాలపై ఎక్కించి అపర చాణక్యుడిగా కీర్తిగడించారు. మారుమూల ప్రాతం నుంచి రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.

కామెంట్‌లు లేవు: