3, నవంబర్ 2020, మంగళవారం

భగవంతుడు

 భగవంతుడు కావాలి అనుకున్న వాడు లోకం వైపు చూడదు, లోకంలో తప్పొప్పులు ఎంచడంలో సతమతం అయ్యేవాడు, భగవంతుడి చేరుకోవడంలో ఆసక్తి చూపించలేదు,శ్రీమద్ వేదాంత దేశికుల వంటి మహానుభావులను ఆదర్శంగా తీసుకుంటే భగవంతుని సాన్నిధ్యం మనకు చేరువలోనే ఉంటుంది.


కవితార్కిక కేసరి వేదాంత దేశికుల వారి అంతటి పండితులు ఆనాడు లేరు. వారు హయగ్రీవుని ఆరాధనలో తరించి హయగ్రీవుని అపార కరుణకు పాత్రుడు అయ్యారు. అప్పటిలో పండితులు ఏ రాజాస్థానముకో వెళ్లి వారిఅనుగ్రహం సంపాదించేవారు. వేదాంత దేశికులు వారు శ్రీవారి ఘంటావతారం. అయన సేవలన్నీ శ్రీవారికే. పేదరికం తాండవిస్తున్నా అయన ఏనాడూ పాలకుల ఆశ్రయము కోరలేదు. వందల రచనలు చేసినా అన్నీ భగవద్ కైంకర్యమే . ఆయన ఎన్నో స్తోత్రాలు రచించారు హరిని కీర్తిస్తూ. వారు రచించిన శ్రీమద్రహస్య త్రయ సారం ప్రతీ ఒక్కరు చదివి తరించాల్సిన గ్రంథ రాజం . దేశికుల వారు ప్రతీ రోజు సమీప గ్రామములోకి వెళ్లి ఉపాదానం స్వీకరించి అది తన ఇల్లాలికి ఇచ్చి ఆమె వండి శ్రీవారికి నైవేద్యం పెట్టగా అదే వారున్నూ భుజించేవారు . ఒకనాడు దేశికులవారు యథావిధిగా సమీప గ్రామంలోకి వెళ్లగా అక్కడ ధార్మికురాలైన ఓ ఇల్లాలు దేశికులవారికి బియ్యం, కూరగాయలతోబాటు అందులో కొన్ని బంగారు నాణాలు కూడా వేసింది . అవి ఆయన గమనించలేదు. తీసుకు వెళ్లి ఆయన తన ఇల్లాలు కి ఇవ్వగా ఆమె వాటిని చేట లో పోయగా అందులో మిలమిల మెరిసే నాణాలు కనిపించాయి. అవేమిటో ఆ ఇల్లాలికి తెలియదు.భర్తను పిలిచి అవి చూపించగా.. పూజాగదిలో ఉన్న కొన్ని దర్భలు తీసుకు వచ్చి వాటిని తొలగించి మట్టిబెడ్డలు ధాన్యములో సామాన్యమే అని చెప్పారు. అదీ దేశికుల వారికీ ధనధాన్యాలు పట్ల ఉన్న విముఖత . హరి అభ్యాగతుల సేవయే ఆయనకు పరమావధి . ఇరువది ఏళ్లలోనే సకల శాస్త్రాలలో పారంగతుడైన ఆయన ఎందరినో తన వాదనలతో ఓడించారు. అమిత వాక్పటిమ గలిగిన గరుడ మంత్రాన్ని తన గురువు నుండి పొందిన ధీశాలి .


శ్రీమతే రామానుజాయ నమః

ఓం నమో నారాయణాయ.

రుగ్వేదంలోని మన్యు సూక్తం

 



మహ అద్భుతం.ఇది వినాలంటే ఎన్నో కోట్ల జన్మలు పుణ్యం ఉండాలని చెబుతారు. ఇది డిలీట్ చెయ్యకండి.వీలయినంత ఎక్కువసార్లు ప్రతినిత్యం వినడానికి ప్రయత్నం చెయ్యండి. ఇది రుగ్వేదంలోని మన్యు సూక్తం. దీనిని రోజుకొకసారి వింటే చాలు మీ ఆరోగ్యంలో ఉన్న ఎటువంటి లోపాలనైన నయం చేయగలదని రుగ్వేదంలో రాయబడింది. సో మీరు వినండి మరియు మీ మిత్రులకు కూడ పంపండి .

విద్య సంబంధ 39 పుస్తకాలు

 *పిల్లల పెంపకం,పిల్లల విద్య  సంబంధ 39  పుస్తకాలు(PDF) ఒకేచోట ఉచితంగా తెలుగులో. ఈ క్రింది లింక్స్ పై క్లిక్ చేసి Read/Download చేసుకోగలరు*

------------------------------------------------


39 పుస్తకాలు ఒకేచోట!   https://www.freegurukul.org/blog/pillalu-pdf


               (OR)


గౌరు పెద్ద బాల శిక్ష www.freegurukul.org/g/Pillalu-1


మిమ్మల్ని మీ పిల్లలు ప్రేమించాలంటే www.freegurukul.org/g/Pillalu-2


పిల్లల పెంపకం www.freegurukul.org/g/Pillalu-3


అలవాట్లు పొరపాట్లు www.freegurukul.org/g/Pillalu-4


మీ ఒడిలో www.freegurukul.org/g/Pillalu-5


పూల పొట్లాలు www.freegurukul.org/g/Pillalu-6


పద్య మంజరి www.freegurukul.org/g/Pillalu-7


బాల విజ్ఞాన కోశము www.freegurukul.org/g/Pillalu-8


శిశు ఆరోగ్య విద్యా కార్యక్రమము www.freegurukul.org/g/Pillalu-9


పిల్లల కథలు-1 www.freegurukul.org/g/Pillalu-10


తెలుగు తల్లి-ఆంధ్ర బాల సర్వస్వము www.freegurukul.org/g/Pillalu-11


పిల్లల శిక్షణా సమస్యలు www.freegurukul.org/g/Pillalu-12


పిల్లలూ బొమ్మలు వేయడం ఎలా www.freegurukul.org/g/Pillalu-13


పాటల్లో పాఠాలు www.freegurukul.org/g/Pillalu-14


పిల్లల పాటలు-2 www.freegurukul.org/g/Pillalu-15


బాల గీతాంజలి www.freegurukul.org/g/Pillalu-16


పిల్లలకే నా హృదయం అంకితం www.freegurukul.org/g/Pillalu-17


ఆనంద వాచక పుస్తకము-4 www.freegurukul.org/g/Pillalu-18


పుష్పాంజలి-బాలలకు నీతిబోధ www.freegurukul.org/g/Pillalu-19


పద్య కథలు www.freegurukul.org/g/Pillalu-20


నాటక కథా వాచకము www.freegurukul.org/g/Pillalu-21


తెలుగు బాల గేయ సాహిత్యం www.freegurukul.org/g/Pillalu-22


పిల్లల పాటల కథలు www.freegurukul.org/g/Pillalu-23


సింహం పెళ్లి www.freegurukul.org/g/Pillalu-24


బాలుర ప్రవర్తన www.freegurukul.org/g/Pillalu-25


బాల గేయాలు www.freegurukul.org/g/Pillalu-26


బాలలోకం www.freegurukul.org/g/Pillalu-27


శిశు తత్వ దీపిక www.freegurukul.org/g/Pillalu-28


దృవుడు www.freegurukul.org/g/Pillalu-29


బాల గీతావళి-1 www.freegurukul.org/g/Pillalu-30


పాలబుగ్గలు - పసిడి మొగ్గలు www.freegurukul.org/g/Pillalu-31


విద్యా విజ్ఞాన బాలగీతావళి www.freegurukul.org/g/Pillalu-32


బాల వికాసిని www.freegurukul.org/g/Pillalu-33


బాల సాహితి తెలుగులో పిల్లల పుస్తకాలు www.freegurukul.org/g/Pillalu-34


కంచే చేను మేస్తే www.freegurukul.org/g/Pillalu-35


బాల గీతావళి-4 www.freegurukul.org/g/Pillalu-36


అనియత విద్య సమస్యారంగములు www.freegurukul.org/g/Pillalu-37


బాల వాంగ్మయం www.freegurukul.org/g/Pillalu-38


పొట్టి బావ www.freegurukul.org/g/Pillalu-39


పిల్లల పెంపకం,పిల్లల విద్య  గురించి తెలుసుకోవడానికి  కావలిసిన పుస్తకాలు ఒకేచోట దొరకక తెలుగువారు ఇబ్బంది పడుతున్నారు. కావున ప్రతి ఒక్కరికి చేరేలా సహాయం చేయండి 🙏.


మరింత సమాచారం కోసం:

ఉచిత గురుకుల విద్య ఫౌండేషన్

Website: www.freegurukul.org

Android App: FreeGurukul 

iOS App: Gurukul Education  

Helpline: 9042020123

*To Join In WhatsApp Group*: To get this type of Spiritual, Inspirational, PersonalityDevelopment messages daily, join in group by this link  www.freegurukul.org/join

పారాయణ శ్లోకాలు

 *💢నిత్య పారాయణ శ్లోకాలు💢*


మనలో చాలామందికి తెలియని శ్లోకాలు

ఏ దైవ సన్నిధిలో ఏ శ్లోకం జపించాలో తెలుసుకోండి...

 

🌷ప్రభాత శ్లోకం :🌷

కరాగ్రే వసతే లక్ష్మీ: కరమధ్యే సరస్వతీ !

కరమూలే స్థితా గౌరీ ప్రభాతే కరదర్శనమ్ !!

 

☘ప్రభాత భూమి శ్లోకం : ☘

సముద్ర వసనే దేవీ పర్వత స్తవ మండలే !

విష్ణుపత్ని సమస్తుభ్యం, పాదస్పర్శం క్షమస్వమే !!

 

🌝సూర్యోదయ శ్లోకం : 🌝

బ్రహ్మస్వరూప ముదయే మధ్యాహ్నేతు మహేశ్వరమ్ !

సాహం ధ్యాయేత్సదా విష్ణుం త్రిమూర్తించ దివాకరమ్ !!

 

🍀స్నాన శ్లోకం : ☘

గంగే చ యమునే చైవ గోదావరీ సరస్వతీ !

నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు !!

 

♨భస్మ ధారణ శ్లోకం : ♨

శ్రీకరం చ పవిత్రం చ శోక నివారణమ్ !

లోకే వశీకరం పుంసాం భస్మం త్ర్యైలోక్య పావనమ్ !!

 

🍀భోజనపూర్వ శ్లోకం : 🍀

బ్రహ్మార్పణం బ్రహ్మ హవి: బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతమ్ !

బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధిన: !!

 

అహం వైశ్యానరో భూత్వా ప్రాణినాం దేహ - మాశ్రిత: !

ప్రాణాపాన సమాయుక్త: పచామ్యన్నం చతుర్విధమ్ !!

 

త్వదీయం వస్తు గోవింద తుభ్యమేవ సమర్పయే !

గృమాణ సుముఖో భూత్వా ప్రసీద పరమేశ్వర !!

 

💢 భోజనానంతర శ్లోకం : 💢

అగస్త్యం వైనతేయం చ శమీం చ బడబాలనమ్ !

ఆహార పరిణామార్థం స్మరామి చ వృకోదరమ్ !!


🌷సంధ్యా దీప దర్శన శ్లోకం :🌷

దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వతమోపహమ్ !

దీపేన సాధ్యతే సర్వం సంధ్యా దీపం నమోఁస్తుతే !!

 

😔నిద్రా శ్లోకం :😔

రామం స్కంధం హనుమంతం వైనతేయం వృకోదరమ్ !

శయనే య: స్మరేన్నిత్యమ్ దుస్వప్న - స్తస్యనశ్యతి !!

 

🌹కార్య ప్రారంభ శ్లోకం : 🌹

వక్రుతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ: !

నిర్విఘ్నం కురు మే దేవ సర్వ కార్యేషు సర్వదా !!

 

🌷హనుమ స్తోత్రం : 🌷

మనోజవం మారుత తుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం పరిష్టమ్ !

వాతాత్మజం వానరయూధ ముఖ్యం శ్రీరామదూతం శిరసా సమామి !!

 

బుద్ధిర్భలం యశొధైర్యం నిర్భయత్వ - మరోగతా !

అజాడ్యం వాక్పటుత్వం హనుమత్ - స్మరణాద్ - భవేత్ !!

 

💢శ్రీరామ స్తోత్రం : 💢

శ్రీ రామ రామ రామేతీ రమే రామే మనోరమే 

సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే 

 

♨గణేశ స్తోత్రం : ♨

శుక్లాం బరధరం విష్ణుం శశివర్ణమ్ చతుర్భుజమ్ !

ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే !!

అగజానన పద్మార్కం గజానన మహర్ణిశమ్ !

అనేకదంతం భక్తానా - మేకదంత - ముపాస్మహే !!

 

🔯శివ స్తోత్రం : 🔯

త్ర్యం’బకం యజామహే సుగంధిం పు’ష్టివర్ధినమ్ !

ఉర్వారుకమి’ వ బంధ’ నాన్ - మృత్యో’ర్ - ముక్షీయమాఁ మృతా’’త్ !!

 

🕉గురు శ్లోకం : 🕉

గురుబ్రహ్మా గురుర్విష్ణు: గురుర్దేవో మహేశ్వర: !

గురు: సాక్షాత్ పరబ్రహ్మా తస్మై శ్రీ గురువే నమ: !!

 

☸సరస్వతీ శ్లోకం :☸

సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణీ !

విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా !!

 

 యా కుందేందు తుషార హార ధవళా, యా శుభ్ర వస్త్రావృతా !

యా వీణా వరదండ మండిత కరా, యా శ్వేత పద్మాసనా !!

యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిర్ - దేవై: సదా పూజితా !

సా మామ్ పాతు సరస్వతీ భగవతీ నిశ్శేషజాడ్యాపహా !!

 

🌷లక్ష్మీ శ్లోకం 🌷: 

లక్ష్మీం క్షీరసముద్ర రాజ తనయాం శ్రీరంగ ధామేశ్వరీమ్ !

దాసీభూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురామ్ !

శ్రీమన్మంధ కటాక్ష లబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరమ్ !

త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియామ్ !!


☘వెంకటేశ్వర శ్లోకం ☘: 

శ్రియ: కాంతాయ కళ్యాణనిధయే నిధయేఁర్థినామ్ !

శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళమ్ !!

 

♨దేవీ శ్లోకమ్♨ : 

సర్వ మంగల మాంగల్యే శివే సర్వార్థ సాధికే !

శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే !!

 

💢దక్షినామూర్తి శ్లోకం💢 : 

గురువే సర్వలోకానాం భిషజే భివరోగినామ్ !

నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమ: !!

 

☸అపరాధ క్షమాపణ స్తోత్రం☸ : 

అపరాధ సహస్రాణి, క్రియంతేఁహర్నిశం మయా !

దాసోఁయ మితి మాం మత్వా, క్షమస్వ పరమేశ్వర !!

 

కరచరణ కృతం వా కర్మ వాక్కాయజం వా 

శ్రవణ నయనజం వా మానసం వాపరాధమ్ !

విహిత మవిహితం వా సర్వమేతత్ క్షమస్వ 

శివ శివ కరుణాబ్దే శ్రీ మహాదేవ శంభో !!

 

కాయేన వాచా మనసేంద్రియైర్వా 

బుద్ధ్యాత్మనా వా ప్రకృతే: స్వభావాత్ !

కరోమి యద్యత్సకలం పరస్మై 

నారాయణాయేతి సమర్పయామి !!

 

 

🔯 విశేష మంత్రా: 🔯

💢పంచాక్షరి - 

ఓం నమశ్శివాయ

☘అష్టాక్షరి - 

ఓం నమో నారాయణాయ 

🌷ద్వాదశాక్షరి -

 ఓం నమో భగవతే వాసుదేవాయ.

............,,,,,,,,,............☸

*ఆవు నెయ్యి

 👉👉👉 *ఆవు నెయ్యి* 👈👈👈



       _*🐄*ఈరోజు మనం ఆవు నెయ్యి మనకు ఎంతటి ఆరోగ్యాన్ని అందిస్తుందో ఒకసారి పరిశీలిద్దాం. నిజానికి ఆవు నుండి వచ్చే ప్రతీదీ అంటే ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు మజ్జిగ, గోమయం, గోమూత్రం ఇలా ప్రతి ఒక్కటీ ఔషధ గుణాలను కలిగి ఉంటుంది.*_ 🐄


_*🐄ఆవు నెయ్యి రెండు ముక్కు రంధ్రాలలో వేసుకుంటే మెదడు బాగా పని చేస్తుంది  మతిభ్రమణం తగ్గుతుంది.*_


_*2.ఆవు నెయ్యి రెండు ముక్కు రంధ్రాలలో వేసుకుంటే ఎలర్జీ తగ్గుతుంది.*_


_*3.ఆవు నెయ్యి రెండు ముక్కు రంధ్రాలలో వేసుకుంటే పక్షవాతం తగ్గుతుంది.*_


_*4.సెరిబ్రల్ పాలసీ లలో ఎంతో లాభం కనిపిస్తుంది.*_


_*5.ఆవు నెయ్యి రెండు ముక్కు రంధ్రాలలో వేసుకుంటే మంచి నిద్ర పడుతుంది.*_


_*6.ఆవు నెయ్యి రెండు ముక్కు రంధ్రాలలో వేసుకుంటే మైగ్రేన్ తల నొప్పి మాయమవుతుంది.*_


_*7.ఆవు నెయ్యి రెండు ముక్కు రంధ్రాలలో వేసుకుంటే మెదడు శక్తివంతం గా పనిచేస్తుంది.*_


_*8.ఆవు నెయ్యి రెండు ముక్కు రంధ్రాలలో వేసుకుంటే జుట్టు ఊడడం తగ్గి కొత్త జుట్టు వస్తుంది.*_


_*9.ఆవు నెయ్యి రెండు ముక్కు రంధ్రాలలో వేసుకుంటే జ్ఞాపక శక్తి పెరుగుతుంది.*_


_*10.20–25 గ్రాముల ఆవు నెయ్యితో కొంచెం పాతి బెల్లం కలిపి తినిపిస్తే భంగు, గంజాయి, మత్తు పదార్ధాల మత్తు వదులుతుంది.*_


_*11.అరచేతులు, అరికాళ్ళు మంటలకు ఆవునేయ్యితో ఆ భాగాలను మాలిష్ చేస్తే మంటలు తగ్గుతాయి.*_


_*12.ఎక్కిళ్ళు తగ్గాలంటే అరచెంచా నెయ్యి తినండి.*_


_*13.ప్రతిరోజూ నెయ్యి తినేవారికి ఎసిడిటీ, మల బద్ధకం రావు. ఉంటె పోతాయి.*_


_*14. ఆవు నెయ్యి బల వర్ధకము, వీర్య వర్ధకము. మానసిక బలాన్ని పెంచుతుంది.*_


_*15.పిల్లలలో కఫం, శ్లేష్మం ఎక్కువగా ఉంటె ఆవునెయ్యి పాతది ఛాతీకి వీపుకీ మాలిష్ చెయ్యండి.*_


_*16.మీరు బలహీనంగా, సన్నగా ఉంటె ఒక గ్లాసు పాలల్లో ఒక చెంచా ఆవునెయ్యి , పటిక బెల్లం పొడి ఒక చెంచా వేసుకుని రోజూ తాగండి. బలం వస్తుంది. బరువు పెరుగుతారు.*_


_*17.ఆవునెయ్యి కేన్సర్ రాకుండా చెయ్యడమే కాదు, వచ్చిన వారికి వ్యాప్తి చెందకుండా చూస్తుంది.*_


_*18.హృద్రోగులకు గుండె సంబంధిత అనారోగ్యాలు రాకుండా నిలువరించడానికి ఆవునెయ్యి వరం.*_


_*19.రాత్రి పడుకునే ముందు గ్లాసుడు పాలలో చెంచాడు నెయ్యి వేసుకుని తాగితే అలసట పోయి బలం గా ఉంటారు.*_


_*20.ఆవు నెయ్యి వలన కొలెస్ట్రాల్ తగ్గుతుంది. బరువు తక్కువగా ఉన్నవారి బరువు పెరుగుతుంది. బరువు ఎక్కువగా ఉన్నవారి బరువు తగ్గుతుంది . ఆవు నెయ్యి సంతుల స్థితిని తెస్తుంది.*_


_*21.ఆవునెయ్యి కేన్సర్ రాకుండా చేస్తుంది. బ్రెస్ట్ కేన్సర్, పేగుల కేన్సర్ లను ఇది నిరోధిస్తుంది.*_


_*22.ఆవు నెయ్యి రెండు ముక్కు రంధ్రాలలో వేసుకుంటే కోమా నుండి బయట పడవచ్చు.*_


_*23.ఆవు పాలు గ్లాసుడు తీసుకుని అందులో పంచదార పొడి ( దీనిని బూరా అంటారు ) మిరియాల పొడి వేసుకుని తాగితే మీ కంటి సమస్యలు తగ్గుతాయి. ఇలా ఎన్నో లాభాలను ఇస్తున్న గోవులను రక్షించుకుని వాటి పాలూ , పెరుగూ , నెయ్యి , మూత్రం, పేడల ద్వారా లాభాలను పొందుతారని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ..*_


_**మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది.**_


👆👆👆👆👆👆👆👆👆👆

గోమహత్యం

 *గోమహత్యం :-*


గోమాత జననం:

  ఆవు పుట్టుక గురించి శతపథ బ్రాహ్మణంలో ఉంది.

దక్ష ప్రజాపతి ప్రాణి సృష్టి చేసిన పిమ్మట కొంచెము అమృతమును త్రాగారు.

త్రాగిన తరువాత వారు ప్రసన్నమయ్యారు.

ఆ సమయములో వారి శ్వాస ద్వారా సుగంధము వెలువడి అంతటా ప్రసరించినది.

ఆ శ్వాస నుండి ఒక్క ఆవు జన్మించినది.

సుగంధము ద్వారా జన్మించుట వలన దక్షప్రజాపతి దానికి ‘సురభి’అని పేరు పెట్టారు.


సురభి నుండి అనేక ఆవులు జన్మించాయి.

అందుకనే సురభిని గోవంశమునకు మాతగా, జననిగా పరిగణిస్తారు.


ఋగ్వేదంలో వేదంలో 4వ కాండలో 12వ సూక్తం గోసూక్తంగా గోమాత యొక్క మహత్యం వివరించబడింది.

శ్రీసూక్తం, పురుష సూక్తం, మన్యు సూక్తం లాంటి పవిత్ర సూక్తాలతోపాటు ,

గోసూక్తం కూడా చెప్పబడింది.

గోవు రుద్రులకు తల్లిగా, వసువులకు పుత్రికగా, ఆదిత్యులకు సోదరిగా, నెయ్యి రూపాన అమృతంగా చెప్పబడింది.


 ఋగ్వేదంలో ఆవును ‘‘అఘణ్య’’ అన్నారు.

సముద్ర మధనము నుండి దేవతల కార్యసిద్ధికై, సాక్షాత్తు సురభి బయల్వెడలినది.

సంతోషముగా ఉన్నది, కపిల వర్ణముగలది, పొదుగు బరువు చేత నెమ్మది, నెమ్మదిగా అలలపై నడుస్తూ వచ్చుచున్న కామధేనువును చూచిన దేవతలంతా గొప్పకాంతిగల ఆ ఆవుపై పుష్పములు కురిపించిరి.

అపుడు అనేక విధములు వాధ్యములు, తూర్యములు మ్రోగింపబడినవి.

లోకములో గోసంతతి వ్యాపించడానికి ఆమెయే ఆధారం.


ఆ సురభిరోమకూపాల నుంచి కొన్ని లక్షల సంఖ్యలో గోవులు పుట్టాయి.

వాటి మగ సంతతి వృషభాలు.


*‘‘గావః విశ్వస్య మాతరః గవా మాంగేషు తిష్ఠంతి భువనాని చతుర్దశ’’*

ఆవు విశ్వజనులందరికీ తల్లి వంటిది.

గోవు నందు చతుర్దశ భువనాలున్నాయని వేదం చెబుతుంది.

అంటే గోవు పృథ్వీ రూపమని అర్థం.


క్షీర సాగరమధన సమయంలో నంది, శుభద్ర, సురభి, సుశీల, బహుళ అనే అయిదు గోవులు ఉద్భవించాయని భవిష్యపురాణం తెలియజేస్తుంది.

వీటినే కామధేనువులు అంటారు.


వంద గోవుల చేత కూడివున్న ఆ ధేనువు, సురభిని నీటి మధ్య నుండి తీసుకొని వచ్చిరి.

ఆ గోవులు దట్టమైన నీలిరంగులోనూ, నలుపు రంగులోనూ, ధూమ్రవర్ణములోను,

బభ్రు వర్ణములోను,

శ్యామ వర్ణములోనూ, ఎరుపు రంగు,

పింగళ (చిత్ర) వర్ణములోనూ ఉండినవి.  స్కాంద పురాణము.


గోశబ్దము స్వర్గమునకు, బాణమునకు, పశువునకు, వాక్కునకును, వజ్రాయుధమునకును, దిక్కునకును, నేత్రమునకును, కిరణమునకును, భూమికిని, నీళ్ళకును పేరు.

‘‘ధేనునా మస్మి కామధుక్" అని గీతలో శ్రీకృష్ణుడు నేనే గోవునని చెప్పుకున్నాడు.

గోవు లక్ష్మీ స్వరూపం.

దీనికి ఒక పురాణ గాధ ఉంది.

దేవతలందరూ వచ్చి గోవుతో తల్లీ మేమందరం నీ శరీరంలో నివసించడానికి కొంచెం భాగం ఇవ్వమని ప్రార్థిస్తే గోవు దేవతలందరికి భాగం ఇవ్వడం జరిగింది.


సురభి ఒక్కసారి తపస్సునారంభించనది.

బ్రహ్మ దేవుడు ఆ తపస్సునకు మెచ్చి సంతుష్టుడయ్యారు.

సురభికి అమరత్వమును ప్రసాదించారు.

త్రిలోకముల కన్నా పైన ఉండే స్వర్గమును వరముగా ఇచ్చారు.

దీనిని స్వర్గ గోలోకమనే పేరుతొ పిలుస్తారు.


గోలోకములో సురభి నిత్యమూ నివసిస్తుంది, ఈమె కన్యలు, సుకన్యలు భూలోకములో నివసిస్తారు.


ఈ గోలోకమునకు అధిపతి గోవిందుడు అనగా శ్రీ కృష్ణుడు.

శ్రీకృష్ణ పరమాత్ముడు ‘గోప్రేమికుడు’ అని అంతటా ప్రాచుర్యమైనదే!

స్పర్శ మాత్రము చేత గోవులు సర్వ పాపముల నుండి మానవులను విముక్తులను చేస్తాయి.

ప్రతి దినమూ స్నానం చేసి గోవును స్పృశించినవాడు సర్వపాపాల నుండి విముక్తుడౌతాడు.


గోమయములో లక్ష్మీ దేవి, 

గోమూత్రములో గంగాదేవి నివాసముంటారు.

గోమూత్రము, గోమయాలతో నేల పరిశుద్ధము, పరిపుష్ఠము అవుతుంది.

గోమయమును అగ్నితో శుద్ధి చేసిన యెడల ఆ భస్మమే విభూతి యగును.

ప్రతిదినము ఆవులకు నీరు త్రాగించి గడ్డిని మేతగా తినిపించేవారికి అశ్వమేధ యజ్ఞం చేసినంత చేసిన పుణ్యం వస్తుంది.

‘‘ఒక గోవు తన జీవితకాలంలో సగటున 25వేల మందికి ఆకలి తీరుస్తుందని చెబుతూ గోవును వధిస్తే ఆ రాజ్యంలో అరాచకం పెరిగి ప్రజలు నశిస్తారని చెప్పారు.


మనం తల్లిగా భావించే ఈ గోవుతో రోజు కొన్ని క్షణాలు వాటికి మేత పెట్టడం, వాటితోపాటు కొంత సమయం గడపటంవల్ల, మన శరీరంలో వున్న అనారోగ్యాన్ని, ఆ గోవు ముక్కులోవున్న ఒక గ్రంథి ద్వారా గ్రహిస్తుంది, తరువాత మేతకు వెళ్ళినప్పుడు మన రోగ నివారణకు కావలసిన మూలికలను, గడ్డిని తిని, అందుకు తగిన విధంగా పాలు ఇస్తుంది, ఆ పాలు తాగడంవల్ల మన వ్యాధి నయం అవుతుంది.


గోమాత  కీర్తనం శ్రవణం - దానం, ధర్మం, గోరక్షణం, గోరక్షణ ప్రోత్సాహం, 

గోరక్షణ ప్రోత్సాహక ప్రేరణం… 

అన్నీ పుణ్యప్రదమైనవే.


       జై గోమాత జైజై గోమాత


గోమాత పాదాలకు శతకోటి వందనాలు

విన్నవారికి, చదివిన వారికి -

 విష్ణు శివ లోక ప్రాప్తి

పంపిన వారికి - పుణ్యలోక ప్రాప్తి.

చైత్రమాసం- పుష్యమీ నక్షత్రం

 ఆంజనేయుని పూజకు శుభ దినాలు..!!💐💐💐


చైత్రమాసం- పుష్యమీ నక్షత్రం


వైశాఖమాసం - ఆశ్లేషా నక్షత్రం

వైశాఖమాసం- కృష్ణపక్ష దశమీ హనుమజ్జయంతి


జ్యేష్ఠమాసం- మఖా నక్షత్రం

జ్యేష్ఠశుద్ధ విదియ- దశమి దినములు


ఆషాఢ మాసం - రోహిణి నక్షత్రం


శ్రావణ మాసం - పూర్ణిమ


భాద్రపద మాసం - అశ్వనీ నక్షత్రం


ఆశ్వీయుజ మాసం - మృగశీర్షా నక్షత్రం


కార్తీక మాసం - ద్వాదశి


మార్గశీర్ష మాసం - శుద్ధ త్రయోదశి


పుష్య మాసం - ఉత్తరా నక్షత్రం


మాఘ మాసం - ఆర్ధ్రా నక్షత్రం


ఫాల్గుణ మాసం - పునర్వసు నక్షత్రం


హస్త, మృగశీర్షా నక్షత్రములతో కూడిన ఆదివారములు స్వామి వారికి ప్రీతిదాయకములు. 


పూర్వాభద్ర నక్షత్రం స్వామివారి జన్మ నక్షత్రం. అదియును పర్వదినము. 


ప్రతి శనివారము స్వామివారికి పూజలు చేయుట విధి. అమావాస్యతో కూడిన సోమవారము, 

ప్రతి మంగ ళవారం స్వామి వారి పూజకు ప్రీతి దినములు. 


వైధృతియోగయు నందు (అనగా ఉత్తమము, అపూర్వము అగు గ్రహయోగకాలము, విష్కం భాది 27 యోగాలలో చివరిది వైధృతి యోగము) స్వామిని పూజించిన విశిష్ట ఫలసిద్ధి ప్రాప్తించును. 


ఆంజనేయస్వామి సప్తపదనుడనియు, ఏకాదశ శీర్షుడనియు తెలియుచున్నది.


శ్రీహనుమత్స్యామికి అరటి తోటలంటే మిక్కిలి ఇష్టము. కావున స్వామిని కదళీవనములందు పూజించిన శుభము చేకూరును. 


మంగళకరుడగు స్వామికి తమలపాకుల పూజ పరమ ప్రీతికరము. అటులే పారిజాతములు, మందారములు, నందివర్ధనము, మల్లెలు, గన్నేరుమున్నగు పుష్పములు స్వామికి ఆనందము కలిగించును. 


తులసీ, మారేడు, మామిడి, మాచీపత్రము, ఉత్తరేణి పత్రములు ప్రీతికరములు. అరటి, మామిడి, నిమ్మ, కొబ్బరి, పనస, నేరేడు మున్నగు ఫలములు స్వామి వారికి మిక్కిలి ఇష్టము.


సింధూరము, సింధూరాక్షతలు, పసుపు లక్షతలు, కుంకుమ, సాంబ్రాణి, గుగ్గిలము, కర్జూరము మొదలగు పూజాద్రవ్యములు, పాయసము, పొంగలి, అప్పములు, వడలు, వడపప్పు, పానకము, పాలు మొదలగు నివేదన ద్రవ్యములు స్వామికి నివేదించిన, స్వామి సంతుష్టుడగును. ఆవు నేతితో చేసిన దీపారాధన శ్రేష్టము. 


ప్రభాకరాత్మజాం సుమేరు చారువర్ణ శోబితాం

విరాజమాన పంకజద్వయాత్తహస్తవైభవాం

ధరాత్మజాపతి ప్రసాదప్రాప్త ధన్యజీవితాం

నమామితాంవరప్రదాంరమాకళాం సువర్చలాం


ఇలా స్వామిని నిత్యం ధాన్యం చేయాలి.

*🚩🚩🚩జై శ్రీరామ్🚩🚩🚩*

కార్తీక మాసంలో

 కార్తీక మాసంలో పత్తిని చక్కగా తీసుకొని వత్తి చేసి వరిపిండితోగానీ, గోధుమపిండితోగానీ చేసిన ప్రమిదలో నెయ్యి పోసి దీపం వెలిగించి ఆ దీపాన్ని పురోహితునికి దానం చెయ్యాలి. ఇదేవిధంగా నెలంతా దానం ఇచ్చి నెలాఖరున వెండి ప్రమిదలో బంగారపు రంగుతో అంటే… పసుపునుపూసిన వత్తితో దీపం వెలిగించి దానిని బ్రాహ్మణునికి దానం చేయండి. ఆపై బ్రాహ్మణునిని అన్నదానం కూడా చేయండి. దీపాన్ని దానం చేసేటప్పుడు…


“సర్వజ్ఞానప్రదం దీపం సర్వసంప త్సుఖావహం”

“దీపదానం ప్రదాస్వామి శాంతిరస్తు సదామమ”-

అనే మంత్రాన్ని మనస్సులో ధ్యానించి దానం చేయాలి. ఇలా స్త్రీలుగాని, పురుషులు గానీ దీపదానం చేస్తే విద్య, దీర్ఘాయువు, అష్టైశ్వర్యాలు, స్వర్గప్రాప్తి లభిస్తుంది. కార్తీకమాసంలో దీపదానం చేస్తే.. తెలిసిగానీ, తెలియకగానీ చేసిన పాపాలు తొలగిపోతాయి.


“దీపదానం మహిమను గురించి వివరించే కథ”

పూర్వం ద్రవిడ దేశంలో పరమలోభిగా ఓ స్త్రీ జీవించేది. తమకంటూ ఎవ్వరూ లేని స్థితిలో ఉన్నఆ మహిళ బిచ్చమెత్తుకుంటూ… తనకని వంట చేసుకోక ఇతరుల ఇళ్లల్లో తింటూ బతికేది. అంతేకాకుండా ఎవరికి దాన ధర్మాలు చేయదు. ప్రతి పైసాను కూడబెట్టుకునేది. పుణ్యక్షేత్రాలకు వెళ్లేదికాదు. పరమలోభి.


శుచిశుభ్రత లేకుండా జీవితాన్నిగడుపుతూ ఏదో ఒక మార్గంలో వెళ్తున్నఆమెకు ఓరోజు ఉత్తముడైన బ్రాహ్మణుడు ఉపదేశం చేస్తాడు. ఆ ఉపదేశం మేరకు కార్తీక మాసం పూర్తిగా చల్లటినీటిలో స్నానం చేసి దీపదానం చేసింది. కొద్ది రోజుల తర్వాత ఆమె ఆరోగ్యం క్షీణించి మరణించింది.


అయితే ఇతరులకు దానం, పుణ్యక్షేత్రాల సందర్శన చేయని ఆమెకు దీపదానం చేయడం ద్వారా స్వర్గప్రాప్తి లభించింది. ఈ కథను వసిష్ఠుడు జనక మహారాజుకు మోక్షమార్గాలను ఉపదేశించే సమయంలో పేర్కొన్నట్లు పురాణాలు చెబుతున్నాయి.

మనో గమనము

*🌛మనో గమనము🌝*

🕉🌞🌏🌙🌟🚩

                   *వ్యవహారికం లో సర్వమూ మనస్సే. మనసు అనేది తడిసిన వస్త్రం లాంటిది. దానికి ఎరుపురంగు అద్దితే ఎరుపుగాను, నీలం రంగు అద్దితే నీలం గాను మారుతుంది. ఏ రంగు అద్దితే ఆ రంగు సంతరించు కుంటుంది.  జ్ఞానము, అజ్ఞానము మనస్సు లోనిదే.*  

            


          *ఫలానా వ్యక్తి మంచివాడు కాదు  అన్నావంటే అతని మనసుకు నీచత్వం అనే రంగు వేయబడినది అని  అర్థము.*  



*ఫలానా వ్యక్తి మంచివాడు అని అన్నాము అంటే అతని మనస్సు కు మంచితనం అనే రంగు వేయబడింది అని అర్థము.*



 *అందుకే మంచి మనసు ఉన్న మనుషులతో సత్సంగం చేస్తే మంచి మనుషులు గా మారుతారు. అందుకే అంటారు పెద్దలు ఈ విధంగా.....*

        


             *సత్సంగత్వే నిస్సంగత్వం!*  

          

           *నిస్సంగత్వే నిర్మోహత్వం!*

     

              *నిర్మోహత్వే నిశ్చలతత్వం!*

           

           *నిశ్చలతత్త్వే జీవన్ముక్తిః!!*


 

         *మనస్సు పాల వంటిది ఈ మనసును సంసారమనే నీటిలో లో కలిపితే పాలు నీరు కలిసిపోతాయి.     అంటే మనసు సంసారం తో ఐక్యమైపోతుంది.  ప్రపంచమనడి  సంసారంలో లీనమై పోతుంది.*



*అందుచేత పాలను ఒక పక్కన ఉంచి పెరుగు తోడుకున్నాక చిలికి వెన్న తీయాలి. ఏకాంతవాసం లో సాధనలు చేసి  మనసు అనే పాల నుంచి జ్ఞానం ,   భక్తి అనే వెన్నను  తీసినప్పుడు  ఆ వెన్నను సంసారమనే నీటిలో ఉంచిన ఎప్పటికీ కలిసి పోదు. సంసార జలధిపై నిర్లిప్తంగా తేలుతుంది.*



 *జీవన్ముక్తులు ఇదేవిధంగా ప్రపంచములో ఉన్నా "తామరాకు మీద నీటి బిందువు" లాగ వారికి ఏమీ అంటకుండా  బ్రహ్మములో రమిస్తూ ఉంటారు.*


 

          *అందుచేత మనస్సును గమనిస్తూ మనో లయము చేసి  ఋషులు చెప్పిన మార్గంలో పయనించి బ్రహ్మమును పొందుదాము.*


🕉🌞🌏🌙🌟🚩

శ్రీవారి ఆలయ నిర్మాణం.

 శ్రీవారి ఆలయ నిర్మాణం..





క్రీ.పూ.12వ శతాబ్దంలో 2.2 ఎకరాల విస్తీర్ణంలో 415 అడుగుల పొడవు, 263 అడుగుల వెడల్పుతో శ్రీవారి ఆలయం నిర్మితమైంది.

శ్రీవారి ఆలయంలో మొత్తం మూడు  ప్రాకారాలున్నాయి. ఆలయం గోడలు వెయ్యేళ్ల క్రితం నాటివిగా తెలుస్తోంది. ఆలయంలో ఆభరణాలు, పవిత్రమైన వస్త్రాలు, తాజా పూలమాలలు, చందనం తదితరాలను భద్రపరుచు కోవడానికి వేర్వేరుగా గదులున్నాయి. వీటితోపాటు లడ్డూ ప్రసాదం తయారీకి పోటు, శ్రీవారి నైవేద్యం తయారీకి ప్రత్యేక వంట గదులున్నాయి.

ఆలయంలోని నిర్మాణాలు ఇలా ఉంటాయి

1 వ ప్రాకారం :-
మహాద్వార గోపురం  :- (ఇత్తడి వాకిలి)*

శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని దర్శించడానికి శ్రీవారి ఆలయంలో ప్రవేశించే .... ప్రధాన ప్రవేశద్వార గోపురమే ఈ మహాద్వార గోపురం.
*పడికావలి, సింహద్వారం, ముఖద్వారం*
అని ఈ ద్వారానికి వేర్వేరు పేర్లు ఉన్నాయి. 
దీనినే తమిళంలో *”పెరియ తిరువాశల్‌”* అని కూడా అంటారు. *అనగా *పెద్దవాకిలి అని అర్థం.*

ఈ ప్రధాన ద్వార గోపురంతో అనుసంధింపబడుతూ నిర్మించిన ప్రాకారమే మహాప్రాకారం. వైకుంఠం క్యూకాంప్లెక్సుల ద్వారా వచ్చిన భక్తులు ఈ మహాద్వార మార్గంలో మాత్రమే వెళ్లి స్వామివారిని దర్శించవలసి ఉంటుంది.

ఇక్కడే మనం క్రింద ఉన్న పైపుకు గల రంధ్రాల ద్వారా వచ్చే నీటితో కాళ్ళు  కడుగుకొని లోపలికి ప్రవేశిస్తాం.

ఈ వాకిలి దక్షిణవైపున గోడపై అనంతాళ్వారులు ఉపయోగించిన గుణపం  ఉంటుంది.

*శంఖనిధి - పద్మనిధి*
మహాద్వారానికి ఇరుప్రక్కల ద్వారపాలకులవలె సుమారు రెండడుగుల ఎత్తు పంచలోహ విగ్రహాలు ఉంటాయి. వీరే శ్రీవేంకటేశ్వరుని సంపదలకు నవనిధులను రక్షించే దేవతలు.  దక్షిణదిక్కున ఉన్న రక్షక దేవత రెండుచేతుల్లోనూ రెండు శంఖాలు ఉంటాయి ఈయన పేరు శంఖనిధి, కుడివైపున ఉన్న రక్షకదేవత చేతుల్లో రెండు పద్మాలు ఉంటాయి ఈయన పేరు పద్మనిధి.

*కృష్ణదేవరాయమండపం :-

మహాద్వారానికి ఆనుకొని లోపలి వైపు 16 స్తంభాలతో 27' ×25' కొలతలు ఉన్న ఎతైన మండపమే కృష్ణరాయ మండపం. దీనినే *ప్రతిమా మండపం* అని కూడా అంటారు. 

ఈ మండపం లోపలికి ప్రవేశిస్తున్నపుడు కుడివైపున రాణులు తిరుమల దేవి, చిన్నాదేవులతో  కూడిన శ్రీకృష్ణదేవరాయల నిలువెత్తు రాగి ప్రతిమలు ఉన్నాయి.

అలాగే ఎడమవైపు చంద్రగిరి రాజైన వెంకటపతిరాయల రాగి ప్రతిమ, ఆ ప్రక్కన విజయనగర ప్రభువైన అచ్యుతరాయలు, ఆయన రాణి వరదాజి అమ్మాణ్ణి వీరి నిలువెత్తు నల్లరాతి ప్రతిమలు నమస్కార భంగిమలో ఉన్నాయి. శ్రీకృష్ణదేవరాయలు ఏడుసార్లు తిరుమల యాత్ర చేసి శ్రీ స్వామికి ఎన్నో కానుకలు సమర్పించాడు. అచ్యుతరాయలు తనపేరిట *అచ్యుతరాయ బ్రహ్మోత్సవాన్ని* నిర్వహించాడు.

*అద్దాలమండపం*

ప్రతిమా మండపానికి 12 అడుగుల దూరంలో, ఎతైన అధిష్టానంమీద నిర్మింపబడి ఉన్న దీన్నే అద్దాలమండపమని
అయినామహల్ అని అంటారు. 43'×43' కొలతలున్న ముఖమండపంలో శ్రీవారి అన్నప్రసాదాలు అమ్మే అరలు ఉండేవి. ఈ అరల్లో అర్చకులు తమవంతుకు వచ్చే శ్రీవారి ప్రసాదాలను భక్తులకు తగిన వెలకు విక్రయించేవారు ఒకప్పుడు. ఈ అరల ప్రాంతాన్నే *ప్రసాదం పట్టెడ* అంటారు.

తులాభారం :-

శ్రీకృష్ణదేవరాయలు మండపానికి ఎదురుగా ఉంటుంది. ఇక్కడ భక్తులు తమ పిల్లల బరువుకు సరిసమానంగా ధనం, బెల్లం, కలకండ, కర్పూరం రూపేణ గాని తులాభారంగా శ్రీస్వామివారికి సమర్పిస్తారు.

రంగనాయక మండపం  :-

కృష్ణరాయమండపానికి దక్షిణం వైపుగా 108 అడుగుల పొడవు, 60 అడుగుల వెడల్పు కలిగి ఎతైన రాతి స్తంభాలతో అనల్ప శిల్ప శోభితమై విరాజిల్లుతూ ఉన్నదే ”రంగనాయకమండపం”. శ్రీరంగంలోని శ్రీరంగనాథుని ఉత్సవమూర్తులు కొంతకాలం పాటు ఈ మండపంలో భద్రపరిచారు. అందువల్లే దీన్ని రంగనాయక మండపమని పిలుస్తున్నారు. ఒకప్పుడు నిత్యకల్యాణోత్సవాలు జరిగిన ఈ మండపంలో ప్రస్తుతం ఆర్జితసేవలయిన వసంతోత్సవం, బ్రహ్మోత్సవం, వాహనసేవలు జరుగుతున్నాయి.

రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి తదితర ప్రముఖులకు శ్రీవారి దర్శనానంతరం ఈ మండపంలోనే వేదాశీర్వచనంతో పాటు శ్రీవారి ప్రసాదాలను అందజేస్తారు.

తిరుమలరాయమండపం:-

రంగనాయక మండపాన్ని అనుకుని పడమర వైపునకు ఉన్న ఎత్తయిన స్తంభాలు, తిరుమలేశుడు భక్తులపై చూపుతున్న తరగని ఉదారత్వానికి మచ్చుతునక ఈ తిరుమలరాయ మండపం. 
ఈ మండపంలోని వేదిక భాగాన్ని తొలుత సాళువ నరసింహరాయలు నిర్మించాడు (సాళ్వ నరసింహ మండపం). శ్రీస్వామి వారికి *"అన్నా ఊయల తిరునాళ్ళ"* అనే ఉత్సవాన్ని నిర్వహించే నిమిత్తం క్రీ.శ. 1473 లో ఈ మండపం నిర్మించాడు. ఆ తర్వాతి కాలంలో సభాప్రాంగణ మండపాన్ని తిరుమలరాయలు నిర్మించాడు.
అణ్ణై అనగా తమిళంలో *హంస*.🕊 బ్రహ్మోత్సవ సమయంలో ధ్వజారోహణం నాడు శ్రీస్వామివారు ఈ మండపంలోనికి వేంచేసి పూజలందుకుంటారు.

*రాజ తోడరమల్లు:-

ధ్వజస్తంభం మండపానికి 10 అడుగుల దూరంలో స్వామి వారికి నమస్కరిస్తున్నట్లు 3 విగ్రహాలు ఉంటాయి. సహజంగా కళ్యాణం ముగించుకున్న భక్తులు సాధారణ భక్తులతో కలిసే మార్గంలో ఉంటాయి.
అవి రాజా  తోడరమల్లు
అతని తల్లి మోహనాదేవి
అతని భార్య పితాబీబీ విగ్రహాలు. 
ఈయన అనేక సంవత్సరాలు తిరుమలను దుండగుల బారినుండి రక్షించారు.

*ధ్వజస్తంభ మండపం :-

ధ్వజస్తంభ మండపంలో ధ్వజస్తంభం, బలిపీఠం ఉంటాయి. వెండివాకిలికి ఎదురుగా బంగారు ధ్వజస్తంభం ఉంది. ప్రతి ఏటా బ్రహ్మోత్సవంలో తొలిరోజు ఈ ధ్వజస్తంభంపై గరుడకేతనం ఎగురవేస్తారు. దీన్నే ధ్వజారోహణం  అంటారు. 

ధ్వజస్తంభం:-*

వెండివాకిలి ఎదురుగా సుమారు15 అడుగుల దూరంలో చెక్కడపు రాతి పీఠంపై ధ్వజదండంవలెనున్న ఎతైన దారుస్తంభం నాటబడింది. అదే ధ్వజస్తంభం.

బలిపీఠము :-

ధ్వజస్తంభానికి తూర్పు దిక్కున అనుకొని ఉన్న ఎతైన పీఠమే బలిపీఠం. దీనికి కూడా బంగారు రేకు తాపబడింది. శ్రీవారి ఆలయంలో నివేదన అనంతరం అర్చకులు *బలిని (అన్నాన్ని )* ఆయా దిక్కుల్లో ఉన్న దేవతలకు మంత్రపూర్వకంగా సమర్పిస్తారు.

క్షేత్రపాలక శిల (గుండు) :-

ధ్వజస్తంభం కు ఈశాన్య (north - east)  మూలలో అడుగున్నర ఎత్తుగల చిన్న శిలాపీఠం ఉంది. దీనినే *క్షేత్రపాలక శిల* అంటారు.
ఇది రాత్రిపూట ఆలయానికి రక్ష. అర్చకులు ఇంటికి వెళ్ళేటప్పుడు గుడికితాళం వేసి తర్వాత ఈ శిలపై ఉంచి నమస్కరించి మరలా ఉదయం ఇక్కడి నుండే శిలకు నమస్కరించి తాళం చెవులను తీసుకువెళతారు.

సంపంగి ప్రాకారం  :-

మహాద్వార గోపుర ప్రాకారానికి, నడిమి పడికావలి (వెండివాకిలి) ప్రాకారానికి మధ్యలో ఉన్న ప్రదక్షిణ మార్గమే సంపంగి ప్రాకారం. ప్రతి ఆలయానికి స్థల వృక్షాలనేవి ఉండడం పరిపాటి. తిరుమల ఆలయం *స్థలవృక్షం సంపంగి*.  ఒకప్పుడు ఈ ప్రాంతం అంతటా సంపంగి చెట్లు ఉన్నందువల్ల ఇలా పిలవబడుతోంది.

కళ్యాణ మండపం  :-

సంపంగి ప్రదక్షిణం దక్షిణంవైపు మార్గంలో రేకులతో దీర్ఘచతురస్రాకారంగా కల్యాణమండపం నిర్మించబడింది. ఇందులో తూర్పుముఖంగా ఏర్పాటు చేయబడిన కల్యాణవేదికపై శ్రీమలయప్పస్వామి వారికి, శ్రీదేవి భూదేవులకు ప్రతినిత్యం ఉదయం కల్యాణోత్సవం జరుగుతుంది.

*ఉగ్రాణం :-

స్వామివారి పూజా సంభారాలు నిల్వ ఉంచేగది.
సంపంగి ప్రదక్షిణకు  (north west)  వాయువ్య మూలగా ఉంటుంది.

విరజానది :-

వైకుంఠంలోని పరమ పవిత్రమైన నది శ్రీవారి పాదాలక్రిందగా ప్రవహిస్తూ ఉంటుందని నమ్మకం.

ఆలయం లోపలి బావులలో ఈనది నీరు ప్రవహిస్తుందని అందుకే ఆలయ బావులలోని నీరు పరమ పవిత్రమైనవిగా భావించి స్వామివారి అభిషేకాదులకు మాత్రమే వాడతారు.

నాలుగు స్థంభాల మండపం :-

సంపంగి ప్రదక్షిణానికి నాలుగు మూలలా సాళ్వ నరసింహ రాయలు ఆయన భార్య , ఇద్దరు కుమారులు పేర స్థంభాలు కట్టించాడు.

పూలబావి :-

పూలగదికి ఉత్తరంగా ఉంటుంది. స్వామి వారికి ఉపయోగించిన పూల నిర్మాల్యాలన్నీ ఇందులో వేస్తారు.
దర్శనానంతరం ప్రసాదం తీసుకుని ముందుకు వెళ్ళేటపుడు ఎత్తైన రాతికట్టడం మాదిరిగా ఉంటుంది.

వగపడి :-

భక్తులు సమర్పించిన ప్రసాదాలు స్వీకరించే గది.

ముఖ మండపం :-

అద్దాల మండపంనకు ముందుభాగంలో ఉంటుంది.
కళ్యాణం చేయుచుకున్న భక్తులకు ప్రసాదాలు దీని ప్రక్కమార్గంలో అందచేస్తారు.

2 వ ప్రాకారం :-

వెండి వాకిలి – నడిమి పడికావలి...

ధ్వజస్తంభానికి ముందు ఉన్న ప్రవేశద్వారమే వెండివాకిలి నడిమి పడికావలి అని పిలువబడే ఈ వెండివాకిలి గుండా వెళ్లి శ్రీస్వామి వారిని భక్తులు దర్శిస్తారు. ప్రవేశ ద్వారమంతటా వెండి రేకు తాపబడినందువల్ల దీన్ని వెండివాకిలి అని అంటారు. 
ఈ ద్వారంలో మహంతు బావాజీ, శ్రీ వేంకటేశ్వరస్వామి పాచికలాడుతున్న  శిల్పం ఉంది.

విమాన ప్రదక్షిణం :-

వెండివాకిలి లోపల ఆనంద నిలయం చుట్టూ చేసే ప్రదక్షిణం. దీనినే అంగప్రదక్షిణం అనికూడా అంటారు. సుప్రభాత సేవ జరిగేటపుడు వెలుపల అంగప్రదక్షిణం చేసే భక్తులు కూడా ఉంటారు.

ఈ ప్రదక్షిణ మార్గంలో  వెండివాకిలికి ఎదురుగా శ్రీరంగనాధ స్వామి, వరదరాజస్వామి, ప్రధానవంటశాల,
పూలబావి,
అంకురార్పణ మండపం,
యాగశాల,
నాణాల పరకామణి,
నోట్ల పరకామణి,
చందనపు అర
విమాన వేంకటేశ్వర స్వామి,
రికార్డుల గది,
భాష్యకారుల సన్నిధి,
యోగనరసింహస్వామి సన్నిధి,
ప్రధాన హుండి
విష్వక్సేనుల వారి ఆలయం
మొదలగు ఉప ఆలయాలను దర్శించవచ్చు. వీటినే చుట్టుగుళ్ళుగా పేర్కొంటున్నారు.

శ్రీరంగనాథుడు :-

వెండి వాకిలి గుండా లోపలకు ప్రవేశించగానే ఎదురుగా ఆదిశేషునిపైన కనిపించేది శ్రీరంగనాథుడు. ఈయనకు పైన వరదరాజస్వామి క్రింద వెంకటేశ్వరస్వామి మూర్తులు చిన్న బంగారు ఫలకాలపై ఉంటాయి.
అంగప్రదక్షిణం ఇక్కడి నుంచే మొదలవుతుంది.
వీనినే పొర్లుదండాలు అంటారు.

శ్రీ వరదరాజస్వామి ఆలయం :-

విమాన ప్రదక్షిణ మార్గంలో ఆగ్నేయమూలన శ్రీ వరదరాజస్వామి ఆలయం ఉంది. ఈ గుడిలో (సుమారు 4 అడుగుల) నిలువెత్తు శ్రీ వరదరాజస్వామి వారి శిలామూర్తి ప్రతిష్ఠింపబడింది.

బంగారు బావి :-

దర్శనానంతరం వెలుపలకు రాగానే అద్దాల గదిలో బంగారు తాపడంతో ఉంటుంది. ఇందులోని నీటినే స్వామి వారి అభిషేకాలకు ప్రసాదాలకు వాడతారు. ఇందులో వైకుంఠం లోని విరజానది నీరు చేరుతుంది అని అత్యంత పవిత్రమైనది గా చెపుతారు.

వకుళాదేవి :-

బంగారుబావి ప్రక్కన మెట్లు ఎక్కి ఎడమవైపు పశ్చిమ అభిముఖంగా ఉంటుంది.
శ్రీవారి తల్లి (పెంచిన). ద్వాపరయుగంలో యశోదయే ఈ కలియుగంలో స్వామి వారి కళ్యాణం చూడడానికి వకుళాదేవిగా అవతరించింది.

అంకురార్పణ మండపం :-

బంగారుబావికి దక్షిణం వైపు ఉంటుంది. ప్రతి ఉత్సవాలకు నవధాన్యాలను భద్రపరుస్తారు.
ఇంకా గరుడ, విష్వక్సేనుల, అంగద, సుగ్రీవ, హనుమంత విగ్రహాలను భద్రపరుస్తారు.

యాగశాల :-

హోమాది క్రతువులు నిర్వహించే ప్రదేశం. కాని ఇప్పడు సంపంగి ప్రాకారంలోని  కళ్యాణ వేదిక వద్ద చేస్తున్నారు. బ్రహ్మోత్సవాల సమయంలో ఇక్కడే యజ్ఞ యాగాదులు చేస్తారు.

సభ అర :-

కైంకర్యాలకై ఉపయోగించే బంగారు వెండి పాత్రలు కంచాలు గొడుగులు ఉంచే ప్రదేశం.

ఏకాంత సేవలో ఉపయోగించే బంగారు మంచం, పరుపు, విశనకర్రలను కూడా ఇక్కడే భద్రపరుస్తారు.

సంకీర్తన భాండాగారం :-

సభ అర ప్రక్కనే ఉన్న గది. దీనికి ఇరువైపులా తాళ్ళపాక అన్నమాచార్యులు ఆయన పెద్ద కుమారుడైన పెద తిరుమలాచార్యుల విగ్రహాలు ఉంటాయి. ఇందులో తాళ్ళపాక వంశం వారు రచించిన దాదాపు 32000 సంకీర్తనలను భద్రపరిచారు.

సాధుసుబ్రమణ్యశాస్త్రి* గారి విశేష కృషి వలన ఈనాడు మనం వాటిని మననం చేసుకోగలుగుతున్నాము.

భాష్యకార్ల సన్నిధి :-

ఇందులో శ్రీమద్ రామానుజాచార్యులు గారి విగ్రహం ఉంటుంది. శ్రీవారికి ఏం ఏం కైంకర్యాలు ఏవిధంగా చేయాలో మానవాళికి అందించిన గొప్ప వ్యక్తి.

తన 120 సం.ల కాలంలో 3 పర్యాయాలు తిరుమలకు మోకాళ్ళ మీద వచ్చాడు. అలా వస్తున్నపుడు ఆయన ఆగిన ప్రదేశమే మోకాళ్ళ పర్వతం.

ఈనాటికి కాలినడకన వచ్చే భక్తులు ఈ పర్వతాన్ని మోకాళ్ళతో ఎక్కడం గమనించవచ్చు.

ప్రధాన వంటశాల (పోటు) :-

విమాన ప్రదక్షిణంలో ఉన్న ప్రధాన వంటశాలను పోటు అంటారు. ఈ వంటశాలలో దద్దోజనం, చక్కెరపొంగలి, పులిహోర, ముళహోర, కదంబం, పొంగలి, సీరా, మాత్రాలతో పాటు కల్యాణోత్సవ దోశ, చిన్నదోశ, తోమాల దోశ, జిలేబి, పోలి, పాల్‌ పాయసం, అప్పం మొదలైనవాటిని తయారు చేస్తారు. ఆయా నియమాలను అనుసరించి వీటిని స్వామివారికి నివేదన చేస్తారు.

పరకామణి :-

స్వామి వారికి భక్తులు సమర్పించిన నగదు లెక్కించే ప్రదేశం.

చందనపు అర :-

స్వామి వారికి సమర్పించే చందనాన్ని భద్రపరిచే ప్రదేశం.

ఆనందనిలయ విమానం :-

ఆనందనిలయం పైన ఉన్న బంగారు గోపురాన్ని ఆనందనిలయ విమానం అంటారు.

గరుత్ముంతులవారే ఈ గోపురాన్ని వైకుంఠం నుండి భూమిమీదకు తీసుకు వచ్చారని చెప్తారు. దీనిమీద దాదాపు 64 మంది దేవతా ప్రతిమలు ఉన్నట్లు చెపుతారు.

విమాన వెంకటేశ్వరస్వామి :-

గోపురంపై  వెండిద్వారంతో ప్రత్యేకంగా ఉండే స్వామివారు. 

రికార్డు గది :-

స్వామి వారి ఆభరణాలు వివరాలు, జమ ఖర్చులు భద్రపరచు గది.

వేదశాల :-

రికార్డు గది ప్రక్కనే వేద పఠనం చేసే పండితులు ఉండేగది. ఇక్కడే మనం వారి ఆశీర్వచనం తీసుకోవచ్చు.
  

శ్రీ యోగనరసింహస్వామి సన్నిధి :-

రామానుజాచార్యులుచే ప్రతిష్టితం చేయబడింది.

శ్రీ నరసింహాలయం క్రీ.శ 1330-1360 మధ్య నిర్మించబడిందని పరిశోధకుల అభిప్రాయం. క్రీ.శ 1469లోని కందాడై రామానుజయ్యంగారి శాసనంలో ఈ యోగనరసింహుని ప్రస్తావన ఉంది. 
*'అళగియ సింగర్‌' (అందమైన సింహం)* అని, *వేంకటాత్తరి (వేంకటశైలంపై ఉన్న సింహం)* అని ప్రస్తావన ఉంది.

చాలాచోట్ల ఈ విగ్రహం ఉగ్రరూపంలో ఉంటుంది. కానీ ఇక్కడ ధ్యాన ముద్రలో ఉండడం ప్రత్యేకం.
ఇక్కడ అన్నమాచార్యులు కొన్ని సంకీర్తనలు చేశారు.

శంకుస్థాపన స్థంభం :-

రాజా తోడరమల్లు ఆనందనిలయం విమాన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ప్రాంతం.

పరిమళ అర :-

శంకుస్థాపన స్థంభంకు వెళ్ళే దారిలో ఉంటుంది. స్వామి వారి సేవకు ఉపయోగించే వివిధ సుగంధ పరిమళాలను భద్రపరిచే అర. ఈ గది గోడపై రాసిన భక్తుల కోరికలను స్వామి తీరుస్తాడని నమ్మకం.

శ్రీవారి హుండి :-

భక్తులు కానుకలు వేసే ప్రాంతం.
శ్రీవారి ఆలయ ప్రాంగణంలో చాలా మార్పులు జరిగిననూ మార్పు చెందని ఒకేఒక స్థలం. దీని క్రింద శ్రీచక్రయంత్రం ధనాకర్షణ యంత్రం ఉందని నమ్మకం.

బంగారు వరలక్ష్మి :-

హుండి ఎడమగోడపై బంగారు లక్ష్మీ దేవి విగ్రహం కలదు. ఈవిడ భక్తులకు అష్టైశ్వర్యాలు ప్రసాదిస్తుందని నమ్మకం.

కటహ తీర్థం :-

అన్నమయ్య సంకీర్తన భాండాగారం ఎదురుగా హుండీకి ఎడమవైపు ఉన్న చిన్న తొట్టి లాంటి నిర్మాణం. ఇందులో స్వామి వారి పాదాల అభిషేక జలాలు సంగ్రహిస్తారు.

విష్వక్సేన :-

హుండి ప్రాంగణం నుండి వెలుపలికి వచ్చాక ఎడమవైపు ఉండే చిన్న ఆలయం. ఈయన విష్ణు సేనాధ్యక్షుడు. ప్రస్తుతం ఈ విగ్రహం అంకురార్పణ మండపంలో ఉంది.

ఘంట మండపం :-

బంగారు వాకిలికి గరుడ సన్నిధికి మధ్యగల ప్రదేశం. బ్రహ్మది సకల దేవతాగణాలు స్వామి వారి సందర్శనకు వేచిఉండే ప్రదేశం. దీనినే మహామణి మండపం అంటారు.

పూర్వం జయవిజయులకు ఇరువైపులా రెండు పెద్ద గంటలు ఉండేవి. హారతి సమయాలలో వీనిని మ్రోగించేవారు. దీనిని *ఘంటపని* అనేవారట. ఈ గంటలననుసరించే స్వామి వారి ఆహారసేవనలు పూర్తి అయ్యాయని భావించి తదనంతరం చంద్రగిరి రాజులు ఆహారం సేవించేవారట.

ఇప్పుడు రెండూ ఒకేచోటికి చేర్చారు. దర్శనానంతరం వెలుపలకు వచ్చే ద్వారం ప్రక్కనే ఉంటాయి.

గరుడ సన్నిధి :-

మూలవిరాట్ కు ఎదురుగా జయ విజయులకు వెలుపలగా గరుడాళ్వారులు గారు ఉన్న మండపం. బంగారు వాకిలి ఎదురుగా, గరుడాళ్వార్‌ మందిరం ఉంది. శ్రీస్వామివారికి అభిముఖంగా, నమస్కార భంగిమలో సుమారు 5 అడుగుల ఎత్తు ఉన్న గరుడాళ్వారు శిలాప్రతిమ ప్రతిష్టించబడింది. ఈ మందిరానికి వెలుపల అంతటా  బంగారం రేకు తాపబడింది. ఈ శిలామూర్తి గాక శ్రీవారి ఆలయంలో గరుడాళ్వార్‌ చిన్న పంచలోహ ప్రతిమ, బంగారు గరుడ వాహనం కూడా ఉన్నాయి.

ద్వారపాలకులు :-

బంగారు వాకిలికి వెలుపలగా ఇరువైపులా ఉండే జయ విజయులు.
మహాలఘుదర్శనం ఇక్కడే చేసుకొంటారు.

3 వ మూడవ ప్రాకారం :-

బంగారువాకిలి :-

శ్రీ వేంకటేశ్వరస్వామి వారి సన్నిధికి వెళ్లడానికి అత్యంత ప్రధానమైన ఏకైకద్వారం బంగారువాకిలి. వాకిలికి, గడపకు అంతటా బంగారు రేకు తాపబడినందువల్ల ఈ ప్రవేశద్వారానికి బంగారు వాకిలి అనే ప్రసిద్ధి ఏర్పడింది. ప్రతిరోజూ ఈ బంగారువాకిలి ముందు తెల్లవారుజామున సుప్రభాతం పఠనం జరుగుతుంది. ప్రతి బుధవారం భోగ శ్రీనివాసమూర్తికి, శ్రీ మలయప్పస్వామి వారికి ఇక్కడే సహస్ర కలశాభిషేకం జరుగుతుంది.

స్నపన మండపం :-

బంగారువాకిలి దాటి లోపలికి వెళ్లిన వెంటనే ఉండేదే ‘స్నపనమంపం’. క్రీ.శ. 614 లో పల్లవరాణి రామవై ఈ మండపాన్ని నిర్మించి, భోగ శ్రీనివాసమూర్తి వెండి విగ్రహాన్ని సమర్పించిందట. ఈ స్నపనమండపాన్నే *తిరువిలాన్‌కోయిల్‌* అంటారు. ఆనందనిలయం జీర్ణోర్ధరణ సమయంలో ఈ మండపం నిర్మించబడిందని చెబుతారు.

ప్రతిరోజూ తోమాలసేవ అనంతరం కొలువు శ్రీనివాసునకు ఆరోజు పంచాంగం, చేయవలసిన పూజాదికాలు, క్రితంరోజు హుండీ ఆదాయాది జమ ఖర్చులు వివరిస్తారు.

దీనిలో కుడివైపున అనగా దక్షిణ దిక్కున హుండీ మరియు ఎడమవైపున అనగా ఉత్తర దిక్కున శ్రీవారి ఆభరణాలు భద్రపరిచే గది ఉంటాయి.

రాములవారి మేడ :-

స్నపనమండపం దాటగానే ఇరుకైన దారికి ఇరువైపుల  ఎత్తుగా కనిపించే గద్దెలు. *”రాములవారిమేడ”*. తమిళంలో మేడు అంటే ఎత్తయిన ప్రదేశం అని అర్థం. 
ఇక్కడ రాములవారి పరివారమైన అంగద, హనుమంత, సుగ్రీవుల విగ్రహాలున్నాయి. ప్రస్తుతం ఆనందనిలయంలో ఉన్న శ్రీ సీతారామలక్ష్మణుల విగ్రహాలు ఇక్కడ ఉండేవని, అందువల్లే ఇది రాములవారి మేడ అని పిలువబడుతోంది.

శయనమండపం  :-

రాములవారి మేడ దాటి లోపల ప్రవేశించిన వెంటనే ఉన్న గదే శయనమండపం. శ్రీవేంకటేశ్వరస్వామివారు వెలసిన గర్భాలయానికి ముందున్న అంతరాళమే శయనమండపం. ప్రతిరోజూ ఏకాంత సేవ ఈ మండపంలో వెండి గొలుసులతో వేలాడదీసిన బంగారు పట్టె మంచంమీద శ్రీ భోగ శ్రీనివాసమూర్తి  శయనిస్తారు.

కులశేఖరపడి :-

శయనమండపానికి, శ్రీవారి గర్భాలయానికి మధ్యన రాతితో నిర్మించిన ద్వారబంధం ఉంది. అదే కులశేఖరప్పడి. 

పడి అనగా మెట్టు, గడప అని అర్థం.

ఆనందనియం  :-

కులశేఖరపడి అనే బంగారు గడపను దాటితే ఉన్నదే శ్రీవారి గర్భాలయం. శ్రీవేంకటేశ్వర స్వామివారు స్వయంభువుగా సాలగ్రామ శిలామూర్తిగా ఆవిర్భవించి ఉన్నచోటే గర్భాలయం. దీనినే ” *గర్భాలయం* ”  అనికూడా అంటారు. ఈ ఆనంద నిలయంపై ఒక బంగారు గోపురం నిర్మించబడింది. దీనినే ఆనందనిలయ విమానం అంటారు.

శ్రీ వేంకటేశ్వరస్వామి (మూలవిరాట్టు) :-

గర్భాలయంలో స్వయంవ్యక్తమూర్తిగా నిలిచివున్న పవిత్ర శిలా దివ్యమూర్తి శ్రీ వేంకటేశ్వరస్వామి. నిలబబడివున్నందున ఈ ఆర్చామూర్తిని *”స్థానకమూర్తి”* అంటారు.
అంతేగాక స్థిరంగా ఉన్నందువల్ల ”.... *ధ్రువమూర్తి* ....” అని, *”ధ్రువబేరం”* అని కూడా అంటారు.

శ్రీ స్వామివారి మూర్తి అత్యంత విలక్షణమైన పద్ధతిలో దర్శనమిస్తూ భక్తులను ఆనందింపజేస్తున్నది. సుమారు 8 అడుగుల ఎత్తుగల స్వయంభూమూర్తి. 

ఈ మూలమూర్తికి ప్రతినిధులు గా 
కొలువు శ్రీనివాస మూర్తి
భోగ శ్రీనివాస మూర్తి
ఉగ్ర శ్రీనివాస మూర్తి
మలయప్ప స్వామి

అను ఉత్సవ విగ్రహాలు కూడా ఉన్నాయి.

ఇంకా 
సీతారామలక్ష్మణులు
శ్రీకృష్ణ రుక్మిణి లు
చక్రతాళ్వారులు
శాలిగ్రామ శిలలు ఉన్నాయి.
(స్వామికి ప్రతిరుపాలుగా వీనికి నిత్య అభిషేకాలు జరుగుతాయి.)

ముక్కోటి ప్రదక్షిణం :-

రాములవారి మేడ చుట్టూ చేసే ప్రదక్షిణం.
వైకుంఠ ఏకాదశి మరియు ద్వాదశినాడు ఈ ద్వారం గుండా దర్శనం ఉంటుంది... 

ఓం నమో వేంకటేశాయ... 

అట్ల తద్ది శాస్త్రీయత

 మహిళామణులందరికీ ......

                            అట్లతద్ది  శుభాకాంక్షలు.


అట్ల తద్ది శాస్త్రీయత ..


గౌరీదేవి శివుని భర్తగా పొందాలనే కృత నిశ్చయంతో ఉందని త్రిలోక సంచారి అయిన నారదుడు తెలుసుకున్నాడు. ఆమె కోరిక ఫలించాలంటే అట్లతద్ది వ్రతం చేయమని నారదుడు సూచించాడు. ఆయన ప్రోద్బలంతో పార్వతీదేవి చేసిన వ్రతమే అట్లతద్ది. ఇది స్త్రీలు సౌభాగ్యం కోసం చేసుకునే వ్రతం. కన్నెపిల్లలు పడచువాణ్ణి పతిగా పొందాలనుకుంటే తప్పక ఆచరించవలసిన వ్రతమిది.చంద్రోదయం తరువాత చేస్తారు కనుకనూ, సాక్షాత్తూ గౌరీదేవే స్వయంగా నోచుకున్నది కనుకనూ, ఈ వ్రతానికి `చంద్రోదయ గౌరీవ్రతం' అనే పేరు కూడా వుంది.


అట్ల తద్ది లేదా అట్ల తదియ తెలుగువారి ముఖ్యమైన పండుగలలో ఒకటి. ఇది ఆశ్వయుజ బహుళ తదియ నాడు జరుపుకొంటారు. "అట్లతద్దె ఆరట్లు ముద్దపప్పు మూడట్లు" అంటూ ఆడ పడుచులకు బంధువులకు ఇరుగు పొరుగులకు వాయినాలివ్వటం పరిపాటి. సాయం సమయమందు వాయినలు, నైవేద్యాలు పూర్తి చేసుకొని గోపూజకు వెళ్ళి, అటునుండి చెరువులలో కాలువలలో దీపాలను వదలి, చెట్లకు ఊయలలు కట్టి ఊగటం చేస్తుంటారు.


త్రిలోక సంచారి అయిన నారదుని ప్రోద్బలముతో గౌరీదేవి శివుని పతిగా పొందగోరి తొలుతగ చేసిన విశిస్టమైన వ్రతమే ఈ అట్లతద్ది. స్రీలు సౌభాగ్యము కోసం చేసుకొనే వ్రతమిది. చంద్రారాధన ప్రధానమైన పూజ, చంద్రకళల్లో కొలువైవున్నశక్తి అనుగ్రహం చేత స్రీసౌభాగ్యము పెరుగుతుంది. కుటుంబములో సుఖశాంతులు వర్దిల్లుతాయని శాస్త్రవచనం. ఈ పండగలో అమ్మవారికి అట్లు నైవేద్యముగా పెట్టడములో ఒక అంతర్ధానముంది. నవగ్రహాలలోని కుజుడుకీ అట్లంటే మహాప్రీతి, అట్లను ఆయనకు నైవేద్యముగాపెడితే కుజదోషపరిహారమై సంసారసుఖములో ఎటువంటి అడ్డంకులు రావని నమ్మకము. రజోదయమునకు కారకుడు కనుక ఋతుచక్రం సరిగావుంచి ఋతుసమస్యలు రానివ్వకుండా కాపాడుతాడు. అందువలన గర్భదారణలోఎటువంటిసమస్యలుండవు. మినుములు పిండి, బియ్యము పిండి కలిపి అట్లను తయారుచేస్తారు. మినుములు రాహువునకు, బియ్యము చంద్రునకు సంభందంచిన దాన్యాలు. గర్భదోషాలు తొలగిపోవాలంటే ఈ అట్లనే వాయనముగా ఇవ్వాలి. గర్భస్రావమురాకుండా, సుఖప్రసవం అయ్యేందుకు దోహదపడుతుందికూడా. అందుకే ముత్తయిదువులకు అట్లను వాయనముగా ఇస్తారు. అట్లతద్దిలోని 'అట్ల'కు ఇంతటి వైద్యవిజ్ఞానము నిక్షిప్తం చేయబడివుంది.అట్లతద్ది పండుగను ఉత్తభారత దేశంలో 'కర్వా ఛౌత్' అనే పేరుతో జరుపుకుంటారు.


పదిమంది ముత్తయిదువులకు, ఒక్కొక్కరికీ, ఒక నల్లపూసల గొలుసు, లక్క జోళ్లు, రవికెల బట్ట, దక్షిణ, తాంబూలంతో పాటు పది అట్ల చొప్పున వాయనం ఇవ్వాలి. వారికి విందు భోజనం పెట్టి, సంతృప్తి పరచి, వారి దీవెనలు అందుకున్న తరువాతే, వ్రతం చేసినవారు భోజనం చేయాలి.


మన పెద్దలు ఏర్పరచిన ప్రతి నియమమూ, ప్రతి నోమూ, వ్రతాల వెనుక ఎంతో చక్కని శాస్త్రీయత వున్నది. అందుకనే ఆయా వ్రతాలకు విశిష్టతా కలిగింది. కుజదోషం గల స్త్రీపురుషులకు త్వరగా వివాహాలు కావు. కుజదోషం గల యువతులు, అట్ల తద్దె నోము నోచుకోవటం వల్ల, వారికున్న కుజదోషం పోవటమే కాకుండా, సాంసారి జీవితం కూడా సాఫీగా గడిచిపోతుంది.


ఈ వ్రతంలో ఒక కథ చదువుతుంటారు. పూర్వం ఒక రాజుకు కావేరి అనే అందమైన కూతురు ఉండేది. ఆమె స్నేహితులతో కలిసి ఈ అట్లతద్ది నోమును ఎంతో భక్తితో ఆచరించింది. అందరికీ అందమైన భర్తలు లభించారు. కావేరికి మాత్రం కురూపులు, వృద్ధులైన పెండ్లికుమారులు తారసిల్లేవారు. కావేరి ఎంతో కలతచెంది అడవికి వెళ్ళి తీవ్రంగా తపస్సు చేసింది. పార్వతీపరమేశ్వరులు ప్రత్యక్షమయ్యారు. వారికి తన బాధ చెప్పుకొంది.


అప్పుడు వ్రతంలో ఆమె చేసిన దోషం వలన అలా జరిగిందని ఆదిదంపతులు వివరించారు. ఆమె నోము నోచే సమయంలో ఉపవాసం వలన నీరసించిపోయింది. ఆమె అన్నలు అది తెలిసి, గడ్డితో మంటపెట్టి అది అద్దంలో చూపించి చంద్రుడని భ్రమింపజేసి ఉపవాసాన్ని విరమింపజేశారు. ఫలితంగా ఆమెకు సరియైన వరుడు దొరకలేదు. ఈ వ్రతాన్ని జాగ్రత్తగా మరొకసారి ఆచరించమని చెప్పి అంతర్థానమయ్యారు పార్వతీ పరమేశ్వరులు. కావేరి మళ్లీ శ్రద్ధా భక్తులతో వ్రతమాచరించింది. ఫలితంగా అందమైన, శౌర్యపరాక్రమాలు కలిగినవాడు భర్తగా లభించాడు- ఈ కథను చదువుకుని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజ ముగిస్తారు.


అట్లతద్దిలో పార్వతీ పరమేశ్వరుల్ని పూజించటానికి కారణం అర్ధనారీశ్వరత్వం. సాక్షాత్తూ భగవంతుడే రెండుగా వీడి ప్రకృతి పురుషుడిగా మారాడనీ, ఆ అర్ధ నారీశ్వరంలో నుంచి సమస్త సృష్టి జరిగిందనీ ఇతిహాసాలు చెబుతున్నాయి. అన్యమతాల్లోనూ ఇదే పద్ధతిలో ఉపవాసం ఉండి చంద్రోదయం తరవాత ఉపవాసాన్ని విరమించడం మనం చూడవచ్చు. మతాలు వేరైనా అభిమతం ఒక్కటే అని తెలియజెప్పే ఈ అట్లతదియ నోము మతసామరస్యానికి పెద్దపీట వేస్తుంది.

ఆలోచనలు

 *టీవీలు చూస్తూ, కబుర్లు చెప్పుకుంటూ, చాడీలు మాట్లాడుకుంటూ తింటే నెగెటివ్ ఆలోచనలు వృద్ధిచెందుతాయి*


1.భగద్భక్తితో, మనసులోకి ఎటువంటి ఆలోచనల్నీ రానీయకుండా, పద్దతిని పాటిస్తూ భుజిస్తే పాజిటివ్ ఆలోచనలు వృద్ధిచెందుతాయి. మనసు ప్రశాంతంగా ఉండి చేసే అన్ని పనులు విజయవంతంగా ముందుకు సాగుతాయి.


2. ఎవరైనా భోజనం చేసి వెళ్ళమని ఒకటికి రెండు సార్లు అడిగితే తిరస్కరించకూడదు. వండి వడ్డించిన వారిని లోపాలు ఎంచకూడదు.


3. ఇంట్లో పెద్దవారు, పిల్లలు ఉంటే, ముందుగా వారికి భోజనం పెట్టాలి. అందువల్ల ఆకలితో వేచివున్న వారి ఆత్మ శాంతిస్తుంది


అన్నదానాన్ని ఒక యజ్ఞంలా భావించి చేసేవారిని కూడా చూడవచ్చు. అన్నదానం చేయలేకయినా అన్నం పెట్టే ఇంటినన్నా చూపించమని పెద్దలు చెప్తారు. దీనికి సంబంధించి ఒక కథనాన్ని కూడా చెప్తారు.


మహాభారత యుద్ధంలో కర్ణుడు మరణించిన తరువాత స్వర్గానికి వెళ్ళాడు. అక్కడ కర్ణునికి అన్ని సౌకర్యాలు లభించాయి. స్వాగత

సత్కారాలు లభించాయి. ఏది కావాలంటే అది పొందే అవకాశం ఉంది. అన్నీ అందుబాట్లో ఉన్నాయి. ఏంలాభం...! కర్ణుడికి ఏదో అసంతృప్తి. ఏదో వెలితి. ఎంత తిన్నా కడుపు నిండినట్టుండడంలేదు. సంతృప్తినేది లేదు. ఎందుకు ఈ విధంగా ఉంటుందో అతనికర్థం కావడంలేదు. ఇదే మాట దేవేంద్రుడిని అడిగాడు కర్ణుడు.


అప్పుడు దేవేంద్రుడు చిరునవ్వుతో, నీవు అనేక దానాలు చేసావని, అడిగినవాడికి లేదనకుండా ఇచ్చే దానకర్ణుడివని చెప్తారు. మరి.. ఎప్పుడైనా అన్నదానం చేసావా?’’ అనడిగాడు. దానికి సమాధానంగా


' లేదు..నేనెన్నో దానాలు చేసాను గాని అన్నదానం మాత్రం చేయలేదు '. అన్నాడు కర్ణుడు.


పోనీ అన్నం పెట్టే ఇల్లయినా చూపించావా? అనడిగాడు దేవేంద్రుడు.


కాస్త ఆలోచించిన కర్ణుడు చెప్పాడు- అవును. ఓ బీద బ్రాహ్మణుడు నా దగ్గరకు వచ్చి అన్నం పెట్టించమని అడిగాడు. అపుడు

నేను ఏదో ధ్యాసలో ఉండి, నాకు అవకాశం లేదు గానీ... అక్కడ ఆ ఇంటికి వెళ్ళు అని ఒక ఇంటిని చూపించాను. అని చెప్పాడు

కర్ణుడు.


నీవుఅన్నదానం చేసిన ఇంటిని చూపించిన వేలిను నోట్లో పెట్టుకో అన్నాడు ఇంద్రుడు.


సరేనని ఆ వేలిని నోట్లో పెట్టుకున్నాడు కర్ణుడు. ఒక్క గుటక వేసాడు. ఆ క్షణంలోనే అతని కడుపు నిండిపోయింది. అంతవరకున్న అసంతృప్తి మటుమాయమైంది. ఎనలేని తృప్తి కలిగింది.


ఈ కథనం ద్వారా అన్నదానం యొక్క మహత్మ్యం, దాని ప్రాశస్త్యం తెలుస్తోంది. నిత్య జీవితంలో మనం ఎదుర్కొనే అనేక ఇబ్బందులనుండి, ఇక్కట్ల నుండి బయటపడడానికి చక్కటి రెమిడీగా పనిచేస్తుంది అన్నదానం అని చెప్తారు పండితులు.


అన్నదానం విశిష్టత ...💐


1. అన్నదానం వలన ఎన్ని సమస్యలున్నా పరిష్కారమవుతాయని చెప్తారు. అన్నదానం చేసేటప్పుడు దైవభక్తులకు తాంబూలంతో పాటు దక్షిణ ఉంచి దానం ఇస్తేఅద్భుతమైన ఫలితాలు పొందవచ్చని ప్రతీతి.


2. కొందరు ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతుంటారు. ఎంత ప్రయత్నించినా సరైన రాబడి లేకపోవడం, దానికితోడు విపరీతమైన ఖర్చులతో సతమతమవడం జరుగుతుంది. అలాంటివారు అన్నంతో లడ్డు పెట్టి, తాంబూల సహితంగా దానం ఇస్తే అధిక ఆదాయం పొందడంతో పాటు శ్రీమంతులయే అవకాశం ఉందని శాస్త్రాలు చెప్తున్నాయి.


3. ఇక అనారోగ్యంతో బాధపడుతున్నవారు, దీర్ఘ రోగాలతో సతమతమవుతున్నవారు అన్ని రోగాలు తొలగి సంపూర్ణ ఆరోగ్యవంతులవుతారు. కొన్నిసార్లు ఇంటిపై మాంత్రిక దోషాలు కూడా కలుగుతుంటాయి. అటువంటప్పుడు చిత్రాన్నంతోపాటు వడ దానం చేస్తే గృహంపై జరిగే ఏ విధమైన మంత్ర, తంత్ర సంబంధమైన దోషాలైనా తొలగిపోతాయి.


4. బెల్లం అన్నం దానం చేస్తే శ్రీమంతులవుతారు.


5. భోజనం చేసేముందు మొదటి ముద్దను పరమేశ్వరార్పణం చేసి దానిని కాకులకో, ఇతర పక్షులతో ప్రాణులకో పెడతారు. ఇలా చేయడంవలన భగవంతునికి సమర్పించినట్లు అవుతుంది. ఇక అన్నం తినేముందు కొద్దిగా అన్నాన్ని కాకులకు వేయడం వలన శని దోషాలనుంచి బయటపడవచ్చని కూడా చెప్తారు..


ఇలా చిన్న చిన్న విషయాలు పాటిస్తుంటే మనకి, ఇంటిల్లిపాదికీ ఆయురా రోగ్యాలకి ఎటువంటిలోటూవుండదు. అందరి ఆలోచనలు సన్మార్గంలో నడుస్తాయి. తినే పదార్ధాలని వృధాచేయకుండా, సద్వినియోగం చేస్తూవుంటే ఆ అన్నపూర్ణమ్మ తల్లి నిత్యం మనింట్లో ధాన్యరాసుల్ని కురిపిస్తుంది. అలక్ష్యం చేస్తే భుక్తికోసం వెంపర్లాడక తప్పని పరిస్థితిని చవిచూడవలసి వస్తుంది. కనుక అన్నాన్ని గౌరవిద్దాం..నలుగురిని ఆదరిద్దాం...తృప్తిగా జీవిద్దాం..ఓం శనైచ్చరాయనమః


ఇష్టకామ్యార్థ సిద్ధిరస్తు💐💐

హిందూ ధర్మం - 30

 **దశిక రాము**


హిందూ ధర్మం - 30


ఉదాహరణకు ఒక విదార్ధికి పరీక్షలు దగ్గర పడుతున్నాయని ఆందోళన మొదలైందనుకుందాం. ఆ క్షణమే అతని మనసులోకి ప్రకృతిలో ఇంతకుముందు అనేక మంది విద్యార్ధులు ఆందోళన పడినప్పుడు ఉత్పన్నమైన తరంగాలు అతడిని బంధిస్తాయి. వెంటనే అతని ఆందోళన ఇంకా పెరుగుతుంది. అది తీవ్రమైనప్పుడు, అతడి మనసు అదుపుతప్పి, చదివింది గుర్తురానివ్వకుండా చేసి, పరీక్షలో ఫెయిల్ అయ్యేలా చెయ్యచ్చు.రోగి విషయంలోనూ అంతే.


మన గురించి మనం అల్పంగా, నీచంగా భావించడమే పాపం. నేను ఎందుకు పనికిరాను, నేను బలహీనుడిని, నాకు ఏమీ రావు అని అనుకోవడం, ఆత్మనూన్యతకు లొనవడమే పాపం. అటువంటి ఆలోచనలను నిరోధించడమే దమము.


పాపం అన్నది చేయనవసరంలేదు, మనసులో భావించినా చాలు, పాపం చేసినట్టే అంటుంది ధర్మం. ఉదాహరణకు ఒకరి గురించి చెడుగా మాట్లాడటం, ఒకరిపై నిందలు వేయడం నేరం, పాపం. మీరు ఒకరి గురించి చెడుగా మాట్లాడవలసిన అవరసంలేదు, వాళ్ళ గురించి మీ మనసులో చెడుగా భావించినా, అది కూడా పాపమే అంటుంది ధర్మం. ఎందుకంటే ఆలోచనలే ప్రవర్తనకు ఆధారం. మీరు ఏ విధంగా ఆలోచిస్తారో, అదే విధంగా ప్రవర్తిస్తారు. వెళ్ళకూడని ప్రదేశాలకు బాహ్యంగా వెళ్ళకున్నా, మనసులో వెళ్ళినట్టు భావన చేస్తే, అక్కడ కూడా పాపం పడుతుంది. మంచికి కూడా ఇది అన్వయం అవుతుంది. మీరు దేవాలయానికి నడుచుకుంటూ వెళ్ళలేకపోయినా, మనసులో దేవాలయానికి వెళ్ళినట్టు భావన చేస్తే, అప్పుడు కూడా పుణ్యం పడుతుంది.


తరువాయి భాగం రేపు......

🙏🙏🙏

సేకరణ


**హిందూ సాంప్రదాయాలను పాటిద్దాం**

*మన ధర్మాన్ని రక్షిద్దాం**


**ధర్మో రక్షతి రక్షితః**

🙏🙏🙏

https://t.me/SANAATANA


**ధర్మము - సంస్కృతి**

🙏🙏🙏

https://t.me/Dharmamu

శ్రీమద్భాగవతము

 **దశిక రాము**


**శ్రీమద్భాగవతము**


 చతుర్థ స్కంధం -11


.ధ్రువ యక్షుల యుద్ధము 


ధ్రువుడు ప్రతాపాతిశయంతో సర్వదిక్కులు, ఆకాశం మారుమ్రోగే విధంగా శంఖాన్ని పూరించాడు. ఆ శంఖధ్వనిని విని యక్షకాంతలు భయపడ్డారు. యక్షవీరులు భయంకరాలైన ఆయుధాలను ధరించి ఉత్సాహంతో పురంనుండి బయటికి వచ్చారు.యక్షులు అలా వచ్చి ధ్రువుణ్ణి ఎదుర్కొనగా…మహారథుడు, వీరాధివీరుడు, ధనుర్ధారి, శూరుడు అయిన ధ్రువుడు తనను ఎదిరించిన పదమూడు వేల యక్షవీరులనూ లెక్కచేయకుండా భయకరంగా మూడు వాడి బాణాలతో గాయపరిచాడు.ఆ యక్షులు నొసళ్ళు పగిలి, మూర్ఛపోయి, తిరిగి తేరుకొని ఆ మహావీరుని పరాక్రమాన్ని ధైర్యాన్ని హస్తలాఘవాన్ని పలుమార్లు మెచ్చుకొంటూ కాళ్ళచేత త్రొక్కబడ్డ కాలసర్పాలవలె పట్టరాని రోషంతో భయంకరాకారాలు కలవారై…ఆ మహాయోధుడైన ధ్రువుణ్ణి యక్షులందరు ఒక్కసారిగా చుట్టుముట్టి ఆరేసి బాణాలతో అతని అవయవాలను భేదించారు. పెద్ద పద్ద గదలను, బాణాలను, చురకత్తులను, పట్టిసాలను, చిల్లకోలలను, శూలాలను, ఖడ్గాలను ధ్రువునిపైన, అతని సారథిపైన ఎడతెగకుండా కురిపించారు.ఆ విధంగా యక్షులు బాణాలను కురిపించగా ఆ ధ్రువుడు …(ధ్రువుడు) ఎడతెగని వర్షధారలతో కప్పబడిన కొండవలె యక్షుల ఆయుధ వర్షంలో మునిగిపోయాడు. అది చూచి ఆకాశంలోని సిద్ధులు వణికిపోతూ…హాహాకారాలు చేస్తూ “అయ్యో! ధ్రువుడు అనే సూర్యుడు రాక్షస సమూహం అనే సముద్రంలో మునిగిపోయాడు కదా!”అని చింతించే సమయంలో…తాము ఆ ధ్రువుణ్ణి జయించామని అనుకుంటూ గంతులు వేస్తూ రాక్షసులు చెప్పుకొంటుండగా దట్టమైన మంచును పటాపంచలు చేస్తూ బయటపడిన సూర్యునివలె ధ్రువుడు కనిపించాడు. అలా కనిపించి…(ధువుడు) శత్రువుల మనస్సులకు సంతాపాన్ని కలిగించే ధనుస్సును చేపట్టి, భయంకరంగా బాణపరంపరను కురిపించి, పెనుగాలి మేఘాలను పారద్రోలే విధంగా భుజబలంతో శత్రువీరుల శస్త్రాస్త్రాలను చెల్లాచెదరు చేసాడు.మహాత్ముడు, సాటిలేని మేటి వీరుడు అయిన ధ్రువుడు భయంకరాలైన బాణాలను ప్రయోగించి శత్రువుల జీవ స్థానములను బద్దలుకొట్టాడు;వారి అవయవాలను తునాతునకలు కావించాడు; పర్వతాలను బ్రద్దలు కొట్టే ఇంద్రునివలె ధ్రువుడు శత్రువులను చుట్టుముట్టి క్షణంలో మట్టుబెట్టాడు. ఆ సమయంలో…మహనీయుడు మనువంశంలో శ్రేష్ఠుడు అయిన ధ్రువునిచేత వికలాంగులైనవారి కిరీటాలతో కుండలాలతో ప్రకాశించే శిరస్సులు, మణికంకణాలతో భుజకీర్తులతో ప్రకాశించే బాహువులు నిండి ఉన్న ఆ యుద్ధభూమి వీర మనోహరంగా విరాజిల్లింది.అప్పుడు చావగా మిగిలినవారు…వరబలం కలవాడు, స్వాయంభువ మనువు మనుమడు అయిన ధ్రువుని బాణాలచేత శరీరాలు తూట్లు పడగా యుద్ధం మానుకొని సింహాన్ని చూచిన ఏనుగులవలె భయపడి పారిపోయారు. అప్పుడు రాక్షసుల మాయలు ధ్రువుణ్ణి కప్పివేశాయి. రాక్షసుల మాయాకృత్యాలను అతడు తెలిసికొనలేకపోయాడు. వాళ్ళు అతని కంటికి కనిపించలేదు. అందువల్ల ధ్రువుడు తన సారథిని చూచి …ఆలోచించి చూస్తే ఈ భూమిమీద మాయావుల మాయలను తెలిసికొనడం ఎవరికీ సాధ్యం కాదు.” అంటూ శత్రునగరంలోకి ప్రవేశించాలని ఉత్సాహపడ్డాడు. కాని శత్రువుల పట్టణం ధ్రువుని కంటికి కనిపించలేదు.

అందువల్ల ధ్రువుడు మహా ప్రయత్నశాలి అయినా శత్రువుల ప్రతిక్రియలు అంతుపట్టక, పట్టణంలోకి ప్రవేశించే ప్రయత్నాన్ని మానుకున్నాడు. అప్పుడు మహాసముద్రఘోష వంటి ధ్వని వినిపించినట్లు. దిక్కులన్నీ పెనుగాలి రేపిన ధూళితో కప్పబడ్డట్లు. ఆకాశంలో మెరుపులు తళతళ మెరిసినట్లు. మేఘాలు భయంకరంగా గర్జించినట్లు తోచసాగింది. రాక్షసులు ఎడతెరపి లేకుండా ప్రయోగించిన మాయాజాలాలు ధ్రువుని మీద మెదడు, మలము, మూత్రము, మాంసము, క్రుళ్ళిన ఎముకలు, క్రొవ్వు కురిపించాయి; విండ్లు, కత్తులు, బాణాలు, కటారులు, చిల్లకోలలు, గదలు, చక్రాలు, త్రిశూలాలు మొదలైన ఆయుధాలు, కొండలు, సర్పాలు వర్షింపించాయి. ఇంకా మదపుటేనుగులు, సింహాలు, పెద్దపులులు చుట్టుముట్టినట్లు. కెరటాలతో సముద్రం భయంకరంగా పొంగిపొరలుతున్నట్లు కనిపించింది. ప్రళయకాలంలో వలె భయంకరమైన గొప్ప మడుగు కనిపించింది. ఈ విధంగా క్రూరులైన ఆ యక్షలు అనేక విధాలైన భీకరమైన మాయలను సృజించారు. అప్పుడు…విరామం లేని యక్షుల మాయలను గ్రహించిన మునులందరూ మనువు మనుమడైన ధ్రువుణ్ణి “మనుము!... మనుము!” అని దీవిస్తూ అతని ముందుకు వచ్చి…వచ్చి ఆ ధువుణ్ణి చూచి ఇలా అన్నారు.“ఓ పుణ్యాత్ముడా! లోకులు ఎవ్వని దివ్యనామాన్ని విన్నా, స్మరించినా దాటరాని మృత్యువును కూడా దాటగలరో అటువంటి ఈశ్వరుడు, పరాత్పరుడు, భగవంతుడు, శార్ఙ్గపాణి, భక్తజనుల బాధలను తొలగించేవాడు అయిన ఆ జగన్నాథుడు నీ శత్రువులను సంహరించుగాక!” అన్నారు. ఆ మాటలు విని ధ్రువుడు ఆచమించి శ్రీహరి పాదపద్మాలను స్మరించి శత్రు భయంకరమైన నారాయణాస్త్రాన్ని వింట సంధించాడు. ఆ విధంగా ధ్రువుడు నారాయణాస్త్రాన్ని సంధించగానే అచ్చమైన జ్ఞానం ఉదయించగానే అజ్ఞానం సమసిపోయినట్లు యక్షుల మాయలు అనే కారుచీకట్లు క్షణంలో చెదరిపోయాయి. వారింప శక్యం కాని ఆ నారాయణాస్త్రం నుండి బంగారు అంచులు, రాయంచ రెక్కలవంటి రెక్కలు కల వాడి బాణాలు వేలకొలది పుట్టి, అడవిని చుట్టుముట్టిన అగ్నిజ్వాలల వలె భయంకరమైన ధ్వనితో శత్రుసైనికుల పైన ఎడతెగకుండా వచ్చి 

పడ్డాయి.ఆ విధంగా నారాయణాస్త్రం ప్రయోగించగా…

నారాయణాస్త్రం నుండి ఉద్భవించిన వాడి బాణాలు తళతళ మెరుస్తూ రాక్షసులను వికలాంగులను చేశాయి. వారు రెచ్చిపోయి పెద్ద పెద్ద కత్తులను చేతుల్లో ధరించి గరుత్మంతుణ్ణి సర్ప సమూహాలు ఎదిరించినట్లు ధ్రువుణ్ణి ఎదుర్కొన్నారు.అప్పుడు ధ్రువుడు పదునైన భయంకర బాణాలను ప్రయోగించి యక్షుల పాదాలను, పిక్కలను, తొడలను, మెడలను, చేతులను, చెవులను ఖండించాడు; కన్నులను పెకలించాడు; పొట్టలను చీల్చాడు; సూర్యమండలాన్ని భేదించుకొని యోగులు పొందే ఉత్తమ లోకానికి వారిని పంపించాడు.ఈ విధంగా చిత్రరథుడైన ధ్రువుడు సంహరిస్తున్న నిరపరాధులైన యక్షులను చూచి ధ్రువుని తాత అయిన స్వాయంభువ మనువు ఋషులతో కూడి వచ్చి ధువునితో ఇలా అన్నాడు “నాయనా! తప్పు చేయని యక్ష రాక్షసులను కోపంతో వధించావు. నరక కారణమైన క్రోధాన్ని చాలించు. తమ్ముని చావునకు పరితపించి నీవు చేస్తున్న ఈ ప్రయత్నాన్ని విరమించు.పుణ్యాత్ముడవైన ఓ ధ్రువకుమారా! మనుకులానికి ఇది తగని పని. ఒక్కనికోసం పెక్కుమందిని వధించావు. ఇట్టి కార్యం నీవు చేయరాదు. దీనిని విరమించు.

అంతేకాక దేహం మీది అభిమానంతో పశువులవలె ప్రాణి హింస చేయడం శ్రీహరి భక్తులైన సజ్జనులకు తగదు. నీవు సర్వప్రాణులను నీవలె భావించి సర్వప్రాణి స్వరూపుడైన శ్రీహరిని కొలిచి ఆయన స్థానాన్ని సాధించావు. ఆయన మనస్సుకు ఎక్కావు. హరిభక్తులను మెప్పించావు. నీవు మంచి నడవడి కలవాడవు. తనకంటే గొప్పవారియందు సహనభావం, తనతో సమానులయందు స్నేహభావం, తనకంటే తక్కువ వారియందు దయ, మిగిలిన సమస్త ప్రాణులయందు సమభావం కలిగి వర్తించే వానిని సర్వాంతర్యామి అయిన భగవంతుడు కరుణిస్తాడు. భగవంతుడు కరుణిస్తే మానవుడు ప్రాకృత గుణాలనుండి విముక్తుడై లింగ శరీరాన్ని విడిచి బ్రహ్మానందాన్ని పొందుతాడు. అయస్కాంతం సన్నిధిలో లోహం భ్రమించినట్లు పరమాత్ముని సన్నిధిలో కార్యకారణ స్వరూపమైన ప్రపంచం భ్రమిస్తుంది. సర్వేశ్వరుడు నిమిత్తమాత్రంగా ఉంటాడు. అటువంటి భగవంతుని మాయాగుణ సంబంధంవల్ల పంచభూతాల వల్ల దేహాది ఆకారాలను పొందిన స్త్రీ పురుషుల కలయిక చేత స్త్రీపురుషుల ఉత్పత్తి జరుగుతుంది. ఈ విధంగా సృష్టి, స్థితి, నాశము జరుగుతూ ఉంటాయి. ఊహింప శక్యం కాని కాలశక్తి ద్వారా జనములనుండి జనములను పుట్టించడం వల్ల ఆద్యుడు, నశింపజేయటం వల్ల అంతకుడు, అనాది కావటం వల్ల అవ్యయుడు అయి భగవంతుడు జగత్తుకు కారణం అవుతాడు. అందువల్ల సృష్టి స్థితి లయాలను చేయనట్లే ఉండి చేస్తుంటాడు. ఈ విధంగా మృత్యుస్వరూపుడు, పరుడు, సమవర్తి అయిన భగవంతునకు తనవారనీ, పరులనీ భేదం లేదు. కర్మలకు లోబడిన జీవులు స్వతంత్రత లేనివారై ధూళికణాలు గాలిని అనుసరించిన విధంగా భగవంతుని అనుసరిస్తారు. ఉపచయం, అపచయం కలిగిస్తాడు. సర్వేశ్వరుడు కర్మసాక్షి.

కొందరు ఆయనను స్వభావం అంటారు. మరికొందరు కర్మం అంటారు. ఇంకా కొందరు కాలం అంటారు. కొందరు దైవం అంటారు. మరికొందరు కామం అనికూడ అంటారు.

ఈ విధంగా నిర్గుణుడు, అప్రమేయుడు, అనేక శక్తులకు హేతుభూతుడు అయిన భగవంతుడు చేసే పనులను బ్రహ్మ రుద్రాదులు సైతం తెలుసుకోలేరు. ఇక అతని తత్త్వాన్ని ఎవరు తెలుసుకోగలరు? కాబట్టి నాయనా! పుట్టుకకు, మరణానికి దైవమే కారణం. అందుచేత ఈ కుబేరుని భటులు నీ తమ్ముణ్ణి చంపారని భావించవద్దు. భూతాత్మకుడు, భూతేశుడు, భూతభావనుడు, సర్వేశ్వరుడు, పరాత్పరుడు అయిన భగవంతుడు తన మాయచేత సృష్టి స్థితి లయాలను చేస్తూ ఉంటాడు. అయినా అహంకార రాహిత్యం వల్ల గుణకర్మలకు అంటరానివాడై ఉంటాదు. ముక్కుత్రాళ్ళతో కట్టబడిన పశువుల వలె ఈ ప్రజాపతులు భగవంతుని ఆజ్ఞలను పాటించి ప్రవర్తిస్తారు. కాబట్టి దుష్టులకు మృత్యుస్వరూపుడు, శిష్టులకు అమృతస్వరూపుడు, సర్వాత్మకుడు, జగత్పరాయణుడు అయిన భగవంతుణ్ణి అన్ని విధాల శరణు పొందు. అంతేకాక నాయనా! నీవు అయిదేండ్ల వయస్సులో పినతల్లి నిన్నాడిన మర్మాంతకాలైన మాటలచేత లోలోపల ఎంతో నొచ్చుకొని, కన్నతల్లిని విడిచి, అడవికి పోయి తపస్సు చేశావు. అచ్చమైన భక్తితో భగవంతుణ్ణి పూజించి మూడు లోకాలకూ మీదిదైన ధ్రువపదాన్ని పొందావు. భేదరూపమైన ఈ ప్రపంచం ఏ మహాత్మునియందు ప్రతీతమై ఉంటుందో అటువంటి త్రిగుణాతీతుడు, అద్వితీయుడు, శాశ్వతుడు అయిన ఆ భగవంతుని కోసం ప్రతిదినం….పవిత్రమైన, పగను వీడిన నిష్కల్మషమైన మనస్సుతో అలుపు లేకుండా అన్వేషించు. ఈ విధంగా ప్రత్యగాత్ముడు, భగవంతుడు, పరబ్రహ్మ, ఆనందస్వరూపుడు, అనంతుడు, సమస్త శక్తిమంతుడు, సగుణుడు, అజుడు అయిన ఆ సర్వేశ్వరుణ్ణి పూజిస్తే వాడు, నేను, నాది అనే అవిద్యారూపమైన పీటముడిని త్రెంచుకొన్నావు. కావున ధీశాలీ! సర్వశుభాలను హరించే కోపాన్ని విడిచిపెట్టు.

మహాత్మా! మందులవల్ల రోగాలు నశించినట్లు కోపం కలవాని వలన లోకం నశిస్తుంది. కాబట్టి కోపాన్ని అణచివేసుకో.పుణ్యాత్మా! నీ తమ్ముని చంపినవాళ్ళు అని ఈ యక్షులను చంపావు. ఇది శివుని సోదరుడైన కుబేరుని పట్ల నీవు చేసిన అపరాధం. కావున…నమస్కారాల చేత, స్తోత్రాల చేత కుబేరుని ప్రసనుని చేసుకో” అని చెప్పి ధ్రువునిచేత పూజ లందుకొని స్వాయంభువ మనువు ఋషులతో కలిసి వెళ్ళిపోయాడు. అప్పుడు…కోపాన్ని తగ్గించుకొని, యక్షులను సంహరించడం మానుకొన్న ధ్రువుని దగ్గరకు యక్షులు, చారణులు, సిద్ధులు, విద్యాధరులు మొదలైనవారు స్తుతిస్తుండగా కుబేరుడు వచ్చాడు.

వచ్చి తనకు నమస్కరించిన ధ్రువునితో ఇలా అన్నాడు “రాకుమారా! నీ తాత ఆదేశించగా విడువరాని పగను విడిచావు. అందువల్ల నీపట్ల నేను ప్రసన్నుడనైనాను. జీవుల జనన మరణాలకు కాలమే కారణం. కావున ఓ సుగుణాత్మా! వేయి మాట లెందుకు? నీ తమ్ముణ్ణి చంపినవాడు యక్షుడు కాడు. యక్షులను చంపినది నీవు కాదు.అంతేకాక కర్మ సంబంధాలైన దుఃఖం మొదలైనవి దేహాభిమానం కారణంగా మానవునికి కలుగుతూ ఉంటాయి. స్వప్నంలో వలె ‘నేను, నీవు’ అనే భేదబుద్ధి అజ్ఞానం వల్ల కలుగుతుంది. సర్వభూత స్వరూపుడు, అధోక్షజుడు, సంసార బంధ విమోచకుడు, పూజింపదగిన పాదపద్మాలు కలవాడు, అంతము లేని అపరిమితమైన శక్తి కలవాడు, త్రిగుణాలతో నిండిన మాయ లేనివాడు అయిన భగవంతుని సేవించు. నీకు మేలు కలుగుతుంది. నీ మనస్సులో ఉన్న కోరికను కోరుకో. నీవు విష్ణుదేవుని పాదపద్మాలను స్థిరంగా పూజించేవాడవని నాకు తెలుసు” అని కుబేరుడు బుద్ధిమంతుడు, భాగవతోత్తముడు అయిన ధ్రువుణ్ణి ప్రోత్సహించాడు. ధ్రువుడు “ఏ హరి స్మరణం వల్ల దురంతమూ దుస్తరమూ అయిన అజ్ఞానాన్ని అవలీలగా తరింపగలమో ఆ శ్రీహరి స్మరణం నా మనస్సులో సుస్థిరంగా ఉండేటట్లు అనుగ్రహించు” అని కోరుకొన్నాడు. కుబేరుడు సంతోషించి ధ్రువునికి ఆ వరాన్ని అనుగ్రహించి అంతర్ధానమయ్యాడు. ఆ తరువాత ధ్రువుడు యక్షులు, కిన్నరులు, కింపురుషులు తన వైభవాన్ని కీర్తిస్తుండగా నిజ రాజధానికి మరలి వచ్చి…ధ్రువుడు ఎంతో అధికమైన దక్షిణ లిస్తూ లెక్కలేనన్ని యజ్ఞాలు చేసాడు. యజ్ఞవిభుడు, కర్మఫలప్రదాత అయిన పురుషోత్తముణ్ణి పూజించాడు. జాతి గుణ క్రియా సంజ్ఞా రూపాలైన సమస్త ఉపాధులను వదలినవాడు, ఉత్తముడు, సర్వాత్మకుడు, కమలనయనుడు అయిన భగవంతునిపై తీవ్రమైన భక్తిని ప్రవాహరూపంగా ప్రసరింప జేశాడు. తనలోని మహాత్ముడు, చరాచరములన్నింట ఉండేవాడు, లక్ష్మీపతి, పరాత్పరుడు, దేవదేవుడు అయిన హరిని సర్వజీవులయందు సందర్శించాడు.

🙏🙏🙏

సేకరణ

సౌందర్య లహరి*

 **దశిక రాము**


**సౌందర్య లహరి**


**శ్రీశ్రీశ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి వారి భాష్యం**


పన్నెండవ శ్లోక ఉపోద్ఘాతం - నాలుగవ భాగం


అందంగా లేకపోయినా మనపై అపారమైన ప్రేమను, ఆదరాన్ని వ్యక్తపరిచే వారి వంక అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. దీనిని బట్టి ప్రేమ అందంగా మారుతున్న విషయం అవగతమవుతుంది. ఒక తల్లి నల్లగా ఎత్తుపళ్ళతో చూడటానికి వికారంగా ఉండవచ్చు. కానీ అందమైన పక్కింటి ఆమె మచ్చిక చేసుకోవడానికి ప్రయత్నించినా ఆమె బిడ్డ ఆమెనే హత్తుకుపోతుంది. పక్కింటి ఆమె అందం తల్లి నుండి ఆమెను ఆకర్షించడానికి సమర్ధం కాదు.


దీనికి కారణం ఏమయి ఉండాలి. ఆ బిడ్డ తన తల్లికి తనపై గల ప్రేమను గుర్తించింది. అష్టావక్రుడు ఎనిమిది వంకరలతో నడుస్తుంటే నవ్వు జనించేట్లుంటాడు. అయితే మునులు పండితులందరూ ఆయన చుట్టూ మూగుతూ వుంటారు. కొంతమంది మహాపురుషులు గడ్డాలు, మీసాలతో శరీర ధ్యాసే లేకుండ అందవికారంగా ఉండవచ్చు. కానీ ప్రజలందరికి వారి సన్నిధిలో అలానే ఉండిపోవాలనిపిస్తుంది. వారిని పదే పదే చూడాలనిపించడమే అందమనే నిర్వచనాన్ననుసరించి వీరిదే మరి నిజమైన అందం. వారి అంతరంగంలో కరుణా భావం వారి శరీరమంతా భాసిస్తు వారిని స్ఫురద్రూపులుగా చేస్తోంది.


మొత్తం మీద చూస్తే ప్రేమ లేక కరుణ ఒకరి అందాన్ని ఇనుమడింప చేస్తుంది. అటువంటి ప్రేమ ఒకస్థాయిని దాటినప్పుడు ఆ ఆకృతి అందం యొక్క ప్రాధాన్యత నష్టమై ప్రేమే అందంగా పరిణమిస్తుంది.

ఒక వస్తువును మనం మరల మరల చూస్తూన్నామంటే దాని మూలాన మనకు కలిగే ఆనందమే కారణం. ఆనందం కలిగించే వాటిలో ప్రధానమైనది ప్రేమ. ప్రేమ వలన కలిగే ఆనందానికి సమమైనది ఏదీ లేదు. కాబట్టి ఆనందాన్ని ప్రసాదించే ప్రేమే అందం అవుతుంది. అందమైన వారిని వారిలోనున్న ప్రేమించే ప్రకృతి మనచే తిరిగి తిరిగి చూసేలా చేస్తుంది. 


అంబిక మూర్తీభవించిన సౌందర్యం. మూర్తీభవించిన ప్రేమ. అందమే తానయిన ప్రేమ. పంచదార అన్ని వంటకాలను తీపిని ఇస్తుంది. అలగే ఎక్కడెక్కడ అందమైన వస్తువులను చూస్తామో ఆ వస్తువులు ఆ అందాన్ని పొందింది అంబిక నుండే! ఆమె అందములన్నిటికీ మాతృక. పరబ్రహ్మ శక్తి అయిన ఆమె ఇక్కడ మొత్తమైన సంపూర్ణమైన అందం. అంబిక సౌందర్య ప్రవాహం. ఆ ప్రవాహము నుండి చిందిన బిందువులంటిన వస్తువులు ఎంతో సౌందర్యమైనవిగా భాసిస్తున్నాయి. అంబిక యొక్క అంతరంగికమైన కరుణ సౌందర్య ప్రవాహంగా రూపుదిద్దుకొంది.


ప్రేమకు రూపం లేదు. బయట చూపులకు అనాహ్లాదంగా కనిపించేవారు ఎంతో ఆపేక్ష కలిగి ఉండటం లోకంలో మనం చూస్తాము. అందమైన వారికి ఆపేక్షే లేకపోయి వుండవచ్చు. అయితే భౌతికమైన లక్షణాల మీద విజయం సాధించే ప్రేమ ఒక వ్యక్తిలో అందంగా మెరిసిపోతుంది. అంటే రూపంలేని ప్రేమలో ఎలాగోలా ఆ వ్యక్తిపై రూపిస్తుందన్నమాట. అంబికపై అటువంటి ప్రేమ ప్రతిస్పందించడం కాదు – ఆమె మొత్తంగా ప్రేమైకమూర్తి. రూపం లేని ప్రేమ ఆమె అందంగా అవుతుందన్నమాట. సంపూర్ణమైన ఆమె ప్రేమ సంపూర్ణమైన అందంగా మారుతుంది.


రూపంలేని పరబ్రహ్మ శక్తి తనను గుర్తించలేని పిల్లల (మానవాళి) కోసం అంబికగా రూపం ధరించింది కదా! కరుణ చేత ప్రేమ వలన ధరించిన రూపం మరి మూర్తీభవించిన ప్రేమే కదా! అంబిక ఇంత అందమైన రూపమును ధరించడానికి కారణం ఏమిటి ? వివేకం లేని పరిణితి చెందనివారితో సహా తన పిల్లలందరూ అల్పమైన అందాల జోలికి పోకుండా తనవైపు తిరుగుతారని కాదూ!!


(సశేషం)


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

#ParamacharyaSoundaryaLahariBhashyam

🙏🙏🙏

సేకరణ

త్రిపురారహస్య

 **దశిక రాము**


**త్రిపురారహస్య జ్ఞానఖండసారము**


అమ్మదయ గలవారు మాత్రమే దీనిని చదవగలరు 


PART-11


తనతండ్రినొక్కరిని కొందఱు రాజుపుత్రులు సంహరించి రని భార్గవుఁడు లక్షలకొలఁది క్షత్రియులను వధించుట తగునా? శ్రీరాముఁడు సైతము దానిని ఆక్షేపింపక పోఁగా అంగీకరించుచున్నా నని చెప్పుట గమనింపఁదగియున్నది. అనఁగా అది ధర్మమే యన్నమాట. తక్షకుఁడు పరీక్షిత్తును ఒక్కనిని వధించినప్పుడు కూడ జనమేజయుఁడు సర్పయాగమునుజేసి అసంఖ్యాకములైన పాములను అగ్నికి ఆహుతిఁగావించెను. ఆసందర్బమున ఉదంకుఁడు ''ప్రల్లదుఁడైన యొక్క కులపాంసను చేసినదానఁ దత్కులంబెల్లను దూషితంబగుట యేటియపూర్వము...'' అని జనమేజయునకు బోధించెను. ఇట్లే సీతవిషయమునందును తప్పుచేసినవాఁడు రావణుఁ డొక్కఁడే. అయినను శ్రీరాముఁడు రాక్షసకులము నంతను సంహరింపక తప్పలేదు. ఒకఁడు తప్పుచేయుచున్నప్పుడు వానిని అదుపులో పెట్టవలసినబాధ్యత కులములో ఎల్లరకును ఉండును. అపరాధి బలవంతుఁడైనచో ధర్మజ్ఞులైనవారు వానిదోషమును నిరసించి తొలఁగిపోవలెను. విభీషణుఁడు అట్లు తొలఁగివచ్చి రక్షింపఁబడెను. మఱి కార్తవీర్యుఁడు ఆతని పుత్రులు కావించినయకృత్యములను ఆకాలమున శ్రీరామునివలె ఒక్క క్షత్రియుఁడైనను ఖండింపలేదు. వారందఱును ''ఒకబ్రాహ్మణుఁడు మహారాజులైన క్షత్రియులపై తిరుగఁబడుటయా! ఇది సిహింపరాదు'' అను భావముతో క్షత్రియప్రతిష్ఠను కాపాడవలయు నను నుద్రేకముతో శమంతపంచకమునకు సన్నద్ధులై చనిరి. ఆపరాధిని ఎవరు సమర్థింతురో వారును అపరాధులే అగుదురు. కావుననే భార్గవుఁడు కావించిన క్షత్రియ సంహారమును శ్రీరాముఁ డామోదించెను.

భార్గవుఁడు నైష్ఠికబ్రహ్మచారి. అయినను ఆయన పట్టాభిషిక్తుఁడై ప్రజాపాలనము గావించి షోడశమహారాజులలో ఒకఁడుగా ప్రసిద్ధుఁడయ్యెను. అంతేకాదు. ఆయన పెక్కుయజ్ఞములను గావించి భూమి యంతయు కశ్యపాదిమహర్షులకు యజ్ఞదక్షిణగా నొసంగెను. మఱి బ్రహ్మచారికి పట్టాభిషేకమునకుఁ గాని యజ్ఞములు చేయుటకుఁ గాని అధికార మున్నదా? ధర్మపత్నీసమేతునకే పట్టాభిషేకము చేయుదురు. వానికే యజ్ఞము చేయుటకును అధికారముండును. అట్లయినచో భార్గవునిచే యజ్ఞమును చేయించిన కశ్యపాదిమహర్షులకు ధర్మము తెలియదా? శ్రౌతస్మార్తకర్మలయందు యజమానుఁడు పత్నీసమేతుఁడైయుండవలయు ననుటకు కర్మసమృద్ధిని చెప్పటయందే తాత్పర్యము కాని పత్నీరహితునకు బ్రహ్మచారికి యజ్ఞాధికారము లేదని చెప్పుట యందు తాత్పర్యము కాదు. ఆపస్తంబశ్రౌత సూత్రమున సూ|| యోవా కశ్చి దవిద్యమానాయామ్‌||

(ప్రథమప్రశ్నే-వింశఖండే-త్రయోదశసూత్రమ్‌) అనుసూత్రమును వ్యాఖ్యానించుచు భట్టరుద్రదత్తుఁడు ఇట్లు నిష్కర్ష గావించెను. ''భార్య లేకున్నను ఒకానొకఁడు అగ్నులను సంపాదించుకొనవచ్చును; అనఁగా యజ్ఞ మొనరింపవచ్చును. వయస్సు ఆజ్యము మొదలగు వానివలె యజమానునకు యజ్ఞకర్మయందు భార్యయు ఒకయంగము మాత్రమే అగును. ఏవేని కొన్ని యంగములు లోపించినప్పుడు ప్రతినిధిద్రవ్యములతో యజ్ఞమును కొనసాగింపవలసియే యుండును. అట్లే భార్య లోపించినప్పుడును యజ్ఞాధికారము లోపింపదు. ధర్మవిగ్రహుఁడైన శ్రీరామచంద్రుఁడు సీత లోకాంతరమునకు చేరినతరువాత కూడ పెక్కు అశ్వమేధములను గావించెను. అంతే కాదు శిష్టులలో శ్రేష్ఠులైన భీష్ముఁడు, కణ్వుఁడు మొదలగువారు యజ్ఞములు చేసినట్లు ప్రసిద్ధముగా నున్నది. కావున అపత్నీకునకు యజ్ఞాధికారము లోపింపదు''.

 PART-11

🙏🙏🙏

సేకరణ

మహాభారతము

 **దశిక రాము**


**మహాభారతము** 


నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమమ్ /

దేవీం సరస్వతీమ్ వ్యాసం( చైవ ) తతో జయముదీరయేత్.//


116 - విరాటపర్వం.


గోగ్రహణఘట్టానికి పధకం రచించాడు దుర్యోధనుడు.  ' దుశ్శాసనా !  మన కౌరవసేనలో పెద్దలందరికీ యీవార్త తెలియజేసి యుద్ధానికి సన్నద్ధులను చెయ్యి.  మన ఆత్మీయుడు, అమిత పరాక్రమవంతుడు అయిన సుశర్మ,  మత్స్యదేశంపై  దండెత్తాలని వువ్విళ్లూరు తున్నాడు.  ముందుగా అతనిని మత్స్యదేశంపై రణం ప్రకటించమని ప్రేరేపిద్దాం.  మత్స్యదేశంలోని యోధులంతా సుశర్మ పైకి యుద్దానికి వెళ్ళగానే, మనం ఆ మరునాడు, ఉత్తర దిక్కుగా విరాటనగరంమీదికి వెళ్లి, గోగ్రహణ క్రీడతో, వారిని వుక్కిరిబిక్కిరి చేద్దాం.  రెండుప్రక్కల నుండి శత్రువులను ఎదుర్కోవాలంటే, సామాన్య విషయం కాదు. విరాటరాజు కుందేలుపిల్లలాగా మనకుచిక్కి, పశువులను స్వయంగా ఆయనే, మనకు  అప్పగించే పరిస్థితి తెప్పిద్దాం. '  అని అమితమైన వుత్సాహంతో అన్నాడు.


అదే విధంగా, సుశర్మ ఆగ్నేయదిక్కు నుండి బయలుదేరి కృష్ణపక్ష సప్తమినాడు గోవులను ముట్టడించి, భయోత్పాతం సృష్టించాడు మత్స్యదేశరాజు, విరటునకు.  మరునాడు అనగా అష్టమినాడు, కౌరవులు  ఉత్తరదిక్కుగా గోగ్రహణానికి బయలు దేరారు.  


చతురంగ బలగాలతో దండెత్తి వచ్చిన సుశర్మకు,  గోపాలురను బాధించకూడదనే జ్ఞానం లేకుండా, మొదటగా వారిని బాధించ సాగాడు.  గోవులమీద వున్న ప్రేమతో, గోపాలురు రణరంగ పరాక్రమం లేకపోయినా, సుశర్మ సేనలను యెదిరించి, రక్తసిక్తు లగుతున్నారు.  కొందరు పదునైన బాణాలకు మరణిస్తున్నారు.  ఇంతలో వేగులవారు విరాటరాజుకు  ఆగ్నేయ సరిహద్దులలో   గోవులపై ముట్టడి విన్నవించారు.  తక్షణం విరాటరాజు, గోపాలురపై హింసతగదని, వీరుడైతే తమ బలగాలను ఎదుర్కోవాలని సుశర్మకు కబురు చేసాడు.  


8000  రధాలతో, 1000 ఏనుగులతో,  60000  మేలుజాతి గుర్రాలతో,  సేనను సిద్ధం చేయించాడు.  విరాటుని సోదరులైన శతానికుడు, మధిరాక్షుడు  కూడా ఆయనను అనుసరించారు.  ఆ సమయంలో, కంకుభట్టు విరాటునితో,  మహారాజా !  నేనుకూడా ధనుర్విద్యలో మెళుకువలు తెలిసినవాడనే.  నాకు మునుల అనుగ్రహం వున్నది.  అదే విధంగా మన పాకశాలలోని వల్లవుడు,  అశ్వగ్రందీ, తంత్రీపాలుడు కూడా అస్త్రవిద్యా పారంగతులని విన్నాను.  వారి కౌశలాన్ని కూడా వినియోగించుకొమ్మని మనవి. '  అని వినయంగా అన్నాడు.   కొద్దిగా ఆశ్చర్యపోయిన విరాటుడు, సమయం మించి పోతున్నదని, యెక్కువ తర్కించకుండా, వారికికూడా కవచములు, రథాలు యేర్పాటు  చేసి, తమతో బయలు దేరదీసాడు.  


హుటాహుటిన గోసమూహాలు వున్న చోటికి చేరారు.  మత్స్య,  త్రిగర్త సైన్యాల మధ్య భీకరపోరు సాగింది.  పరిస్థితి అదుపుతున్న సమయంలో   ధర్మరాజు యుద్ధకౌశలం ఆ సంగ్రామంలో బాగా ద్యోతకమైంది.  ధర్మరాజు గరుడవ్యూహాన్ని రచించి,  శత్రు సైన్యాన్ని, అయోమయానికి గురిచేశాడు. నాసికా స్థానంలో ధర్మరాజు స్వయంగా పర్యవేక్షిస్తూ, నకుల సహదేవులను  విహంగానికి రెండువైపులా రెక్కల ప్రదేశంలో,  భీముని చివరవైపు తోకదగ్గర నియమించి, వేయిమంది సుశర్మ సైన్యాన్ని ఒకేసారి మట్టుపెడుతూ, ముందుకు సాగుతున్నాడు.  వందలమందిని నకుల సహదేవులు, వేలమందిని భీమసేనుడూ చంపుతూ అప్రతిహతంగా యుద్ధం సాగిస్తున్నారు. 


ధర్మరాజు నేర్పరితనాన్ని విరాటుడు ప్రశంసిస్తూ, తానుకూడా సమరోత్సాహంతో, 500  రథాలను, 800  అశ్వాలను కూల్చివేశాడు.   ఆవిధంగా త్రిగర్తవీరులను విరాటుడు ఎదుర్కుంటూ, సరాసరి సుశర్మతో యుద్ధానికి తలపడ్డాడు.  వారిరువురికీ జరిగిన ప్రచండ యుద్ధంలో యెట్టకేలకు సుశర్మ, విరాటుని బంధించాడు.  


ధర్మరాజు భీమసేనునితో, '  మనం విరాటరాజును విడిపించాలి.  అతని ఋణం తీర్చుకునే అవకాశం వచ్చింది.  త్వరగా ఆకార్యం చక్కబెట్టు ' అన్నాడు.  ఏకకాలంలో, విరాటుని, అగ్రజుని మెప్పు పొందవచ్చని, ఉత్సాహంతో భీముడు,  సుశర్మను సమీపించాడు.  సుశర్మకు భీముడు యముడిలాగా కనిపించాడు భీముడు సుశర్మ చూస్తూ వుండగానే,  అతని సేనలను నాశనం చేస్తున్నాడు.  సమయం చూసుకుని బందీగా వున్న విరాటుడు,  రధంపై నుండి ఒక్కదూకు దూకి, సుశర్మ చేతిలోని గదను  లాగివేసుకుని, అదే గదతో, సుశర్మను కొట్టడానికి వెంబడించాడు.  పరుగుపెడుతున్న సుశర్మ వేపు వెళ్తున్న విరాటుడు,  ఆ సమయంలో  వయసుమళ్ళిన యువకుడిలాగా వున్నాడు.  


సుశర్మ పారిపోతూ వుంటే, ' అంత భయస్తుడవు.  నాగోవులపై యెందుకు కన్నువేశావు ? దుష్టుడా నిలు, నిలు ' అంటూ గదపట్టుకుని,  సుశర్మను  రణరంగమంతా పరుగులు పెట్టించాడు, విరాటుడు.  భీముడు అతని వెన్నంటే వున్నాడు, రక్షణగా.   కొద్దిసేపటి తరువాత, విరాటునికి విశ్రాంతిని యిస్తూ, భీమసేనుడు, సుశర్మ జుట్టుపట్టుకుని లాగి నేలపై పడవేసి, కాలితో తన్ని, పిడిగుద్దులు గుద్దుతూ హింసించి మూర్ఛపోయేటట్లు చేసాడు.


సుశర్మను మెడలువంచి ధర్మరాజు వద్దకు తీసుకుని వచ్చాడు భీముడు.  ధర్మరాజు సుశర్మను మందలించి, అతనికి క్షమాభిక్ష పెట్టాడు.  పాండవుల పరాక్రమము, దయాగుణం, క్షమాగుణం చూసి సుశర్మ చలించిపోయాడు.  విరాటుడు నోటిమాట రాక చిత్తరువువలే వుండిపోయాడు.  నెమ్మదిగా తేరుకుని, ' కంకుభట్టూ !  నీ దాక్షిణ్యం వలననే నేను బంధ విముక్తుడను అయ్యాను.  నీవు పంపిన వల్లవుడు, నాకు స్వేచ్ఛావాయువులు  ప్రసాదించాడు. ఈ నాటినుండీ విరాటరాజ్యానికి ప్రభువులు మీరే ! ' అంటూ ధర్మరాజును పరిపరివిధాలా స్తుతించాడు.  


' మహారాజా !  మీరు కృతజ్ఞతా పూర్వకంగా మాట్లాడిన మాటలు మా హృదయాలు కదిలించాయి.  ఎల్లప్పుడూ, ఇలాగేదయాశీలులై మెలగండి. మీరాజ్యాన్ని మీరే ఏలుకోండి.' అంటూ ధర్మరాజు బదులిచ్చాడు.   విరాటుని విజయవార్త, స్వయంగా కంకుభట్టే రాజ్యానికి తెలియచేయమని దూతలను పంపించాడు.  నగరమంతా ఆనందంతో కోలాహలంగా తయారయ్యింది. 


సరిగ్గా, ఇక్కడ విరాటసేనలకూ, సుశర్మసేనలకూ, యుధ్ధం జరుగుతుండగా, ఉత్తర దిక్కునుండి,  దుర్యోధనుడు విరాటనగరాన్ని ముట్టడించి,  భీష్ముడు, ద్రోణుడు, కృపుడు, కర్ణుడు, అశ్వద్ధామ, శకుని, దుశ్శాసనుడు మొదలగు వారిని యుద్ధభూమిలో నిలబెట్టి,  తన అనుచరగణంచేత 60,000 గోవులను విరాటుని గోశాల నుండి తస్కరింప జేసి, హస్తినమార్గం పట్టించాడు.  


విరాటుని గోశాలలో గోపాలురు హాహాకారాలు చేస్తూ, విరాటుని కుమారుడు, యువరాజు అయినా భూమింజయుని,  ఉత్తరుడు అనికూడా  పిలువబడే, ఉత్తమకుమారుడిని కలిసి విన్నవించారు.  


స్వస్తి.


వ్యాసానుగ్రహంతో మరికొంత రేపు

🙏🙏🙏

సేకరణ