27, సెప్టెంబర్ 2021, సోమవారం

బ్రాహ్మణుల ఇంటి పేర్లు వాటి వివరణ*

 *బ్రాహ్మణుల ఇంటి పేర్లు వాటి వివరణ*

*తెలంగాణ_ఆంధ్రప్రదేశ్*

**********************

శర్మ - SHARMA

శాస్త్రి - SASTRI                       

సోమయాజులు - SOMAYAJUL

దేష్ ముఖ్ - DESH MHUK, 

దేష్ పాండె.- DESHPANDEY. 

కులకర్ణి - KULKARNI 

జ్యోషి - JYOSHI 

బెహరా - BEHARA

ఆచార్యులు - ACHARYA


*రాజస్థాన్_RAJASTHAN*

**************************                                               

తివారీ -THIVARI 

బెంగాల్ - BENGAL 

బెనర్జి - BANARJEE

భట్టాచార్య - BHATTACHARYA

ఛటర్జీ - CHATTERJEE

గంగూలి - GANGULI

ముఖర్జీ - MUKHERJEE

   

*బీహార్_BIHAR*

*************** 

ఝా - JHA

మిశ్రా - MISHRA

   

*గుజరాత్_GUJARAT*

**********************

భట్నాగర్ - BHATNAGAR

పాండ్య - PANDYA

త్రివేది - TRIVEDI

తివారి - TIWARI

   

*జమ్ము_కాశ్మీర్_JAMMU&KASHMIR*

**************************************

కర్ - KAR

పండిత్ - PANDIT

శర్మ - SHARMA

   

*కర్నాటక_KARNATAKA*

************************* 

ఆడిగ - ADIGA

ఐథల్ - AITHAL

భట్ - BHAT

దేశ్ పాండె - DESHPANDE

హెబ్బార్ - HEBBAR

అయ్యర్ - IYER

అయ్యంగార్ - IYENGAR

కరంథ్ - KARANTH

సోమయాజులు - SOMAYAJI

శర్మ - SHARMA

శాస్త్రి - SHASTRI

బింద్రె - BENDRE

   

*కేరళ_KERALA*

***************** 

నంబూద్రి - NAMBOODARI


*మహారాష్ట్ర_MAHARASTRA*

***************************

అథవాలె - ATHAVALE

భట్ - BHAT

భావే - BHAVE

దతర్ - DATAR

దాతయ్ - DATEY

దేశ్ పాండె - DESHPANDE,         

దేష్ ముఖ్ - DESH MHUK,                               

దీక్షిత్ - DIXIT

గోఖలే - GOKHALE

జోషి - JOSHI

పండిత్ - PANDIT

పట్వర్దన్ - PATWARDHAN

కులకర్ణి - KULKARNI,   


*ఒడిషా_ODISHA*

*******************

కనుంగొ - KANUNGO

కర్ - KAR

మిశ్రా - MISHRA

సత్పతి - SATPATI

   

*పంజాబ్_PUNJAB*

**********************

శర్మ - SHARMA

   

*రాజస్థాన్_RAJASTHAN*

**************************

శర్మ SHARMA

వ్యాస్ VYAS


*తమిళనాడుTAMILNADU*

******************************* 

అయ్యర్ - IYER

అయ్యంగార్ - IYENGAR

   

*ఉత్తరప్రదేశ్_UTTAR_PRADESH*

*********************************

చతుర్వేది - CHATURVEDI

ద్వివేది - DWIVEDI

జోషి - JOSHI

మిశ్రా - MISHRA

శర్మ - SHARMA

త్రిపాఠి - TRIPATHI

వాజపేయి - VAJAPAYEE


ఇవి ఎక్కువగా నోళ్ళల్లో నిత్యం మెదిలేవీ మాత్రమే ఇక్కడ అందించాను భావించకండి ఇంకా ఇన్నో ఇంటిపేర్లతో కూడినవి కూడా ఉన్నాయి ...ఆవి


Trivedi, Dubey, Chaubey, Tripathi, Tiwari,, Joshi, Pandey, Shukla, Deekshit, Pathak, Agnihotri, Tyagi, Ojha, Bharadwaj,Sharma, Dutt,Kaul, Mattoo, Haksar / Hak, Tikkoo, Labroo, Bindroo, Raina, Razdan,Joshi, Trivedi, Pathak, Vyas, Bhat / Bhatt, Desai,Apte, Gokhale, Ranade, Lele, Nene, Kulkarni, Joshi, Shukla, Chitale, Vaidya, Deekshit, Deshpande,Mukherjee, Banerjee, Chatterjee, Ganguly, Bhattacharjee, Chakrabarti, Sanyal, Lahiri, Bagchi, Bhaduri, Maitra, Ray Chaudhuri, Ghoshal, Tagore / Thakur, Rath, Kar, Dash, Mahapatra, Satapathy, Acharya, Panda,Goswami, Borthakur, Barua, Gayen, Bhattacharjee, Chakrabarti.Iyer, Iyengar,Shastry, Chari, Adiga, Joshi, Kulkarni, Hegde, Desai,Shenoy, Bhat, Pai, Prabhu, Kamath, Benegal, Shanbhag, Shirali, Padukone, Dixitulu, Bhattu ..లాంటివి.


*వాటి పుట్టు పూర్వోత్తరాలు:*

ఒకతను అలా పనుండి పాట్నా లో ఉన్న వేదపారశాల కాంపౌండ్ లో ఉన్న SBI కి వెళ్లాను లింకు ఫెయిల్ అవడంతో అలా బయటపడి వేదం వల్లే వేస్తున్న పిల్లల్ని గమనిస్తూ అక్కడ ఉన్న గురువుగారైన సదానంద్ ద్వివేది గారిని "ఎందుకండీ ఇలా బట్టి వేయిస్తున్నారు చేతికి పుస్తకం ఇస్తే చూసి జాగ్రత్తగా చదువుతారు కదా అని అడిగారు.


దానికి ఆయనిచ్చిన సమాధానం..


"నలంద, తక్షశిల,విక్రమశిల విశ్వవిద్యాలయాలలో ఉన్న అమూల్యమైన గ్రంధాలను భక్తియార్ ఖిల్జీ అనే ఉన్మాదుడైన మహమ్మదీయ రాజు కాలంలో కాల్చివేయ్యబడ్డాయి - తరువాతి కాలంలో మళ్ళి ఆ వేదం విద్యనూ గ్రంధాలను తిరిగి రాయడానికి ప్రయత్నం చేసిన ఎంతో మంది భారతీయ విద్యావేత్తలను అత్యంత క్రూరంగా హింసించి చంపేయ్యడం జరిగింది!

ఇది ముందే గమనించిన మనవిద్యావేత్తలు వేదాన్ని ఏనాటినుండే కంటస్తం చెయ్యడం అలాగే మరికొంత మందికి కంఠోపాఠం గా నేర్పడం మొదలు పెట్టారు - అలా చాలా వరకు వేదాధ్యయనం ముఖత గానే కొనసాగింది అందువల్లే వేదాన్ని కంఠస్థం చెయ్యడం అలవాటుగా మారింది

4 వేదాలు నోటికి వచ్చిన వాడిని *చతుర్వేది* అని

3 వేదాలు వచ్చినవాడిని *త్రివేది* అని

2 వేదాలు వచ్చిన వాడిని *ద్వివేది* అని

1 వేదం నేర్చినవాడిని *ఉపాధ్యాయ* అని

శాస్త్రాలు తెలిసినవాడిని శాస్త్రి అని

మిశ్రమంగా కొన్ని విషయాలు నేర్చుకున్న వాడిని *మిశ్రా* అని

శాస్త్రీయ కర్మ విధి విధానాలను నేర్చిన వాడిని *శర్మ* అని ఇలా రకరకాలుగా విభజించి నేర్పించడం జరిగింది!"

"మరి.. ఇప్పుడు రాయచ్చు కదండీ.. ఇప్పుడు మనం స్వతంత్రులం కదా?" అని అడిగారు.

ఆయన నవ్వేసి.."ఎవరు చెప్పారు మనం స్వతంత్రులమని? గత 70 ఏళ్లుగా గమనిస్తున్నాను.. ఒక్కడంటే ఒక్క మంత్రి లేదా ప్రభుత్వ అధికారి ఈ వేదాలను తిరిగి రాయించడం మిద దృష్టి పెట్టనేలేదు! - ఇప్పటికీ మనం మొఘల్ రాజుల పాలనలోనే ఉన్నాం - హిందుమత గ్రంధాలను అవహేళన చేస్తూనే ఇతర మత గ్రంధాలకు ఎనలేని గౌరవం ఇస్తున్నాం లేదా ఇతరులకు ఇంకా భయపడుతూనే ఉన్నాం!" అన్నారు.


ఇక బ్రాహ్మణుల పుట్టుపూర్వోత్తరాలు అలా ఉన్నా వేదాలను, శాస్త్రాలను రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిదీ ఇప్పటికీ మనం ఎన్నో *గ్రంథాలను* దక్కించుకోలేకపోయాము. 🙏🏽🇮🇳😢🙏

సంస్కృత మహాభాగవతం

 *27.09.2021 సాయం కాల సందేశము*


*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*


*ఏకాదశస్కంధము - ఎనిమిదవ అధ్యాయము*


*అవధూతోపాఖ్యానము - అజగరము మొదలుకొని పింగళము వరకు గల తొమ్మిదిమంది గురువుల కథలు*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*8.39 (ముప్పది తొమ్మిదవ శ్లోకము)*


*తేనోపకృతమాదాయ శిరసా గ్రామ్యసంగతాః|*


*త్యక్త్వా దురాశాః శరణం వ్రజామి తమధీశ్వరమ్॥12538॥*


భగవదను గ్రహముతో నాకు ఈ వైరాగ్యము కలిగినది. ఆ స్వామి చేసిన ఉపకారమును సాదరముగా శిరసు వంచి, వినమ్రతతో స్వీకరించుచున్నాను. అందువలన విషయసుఖముల యందలి దురాశలను పరిత్యజించి, ఆ సర్వేశ్వరుని త్రికరణశుద్ధిగా శరణుజొచ్చుచున్నాను.


*8.40 (నలుబదియవ శ్లోకము)*


*సంతుష్టా శ్రద్దధత్యేతద్యథా లాభేన జీవతీ|*


*విహరామ్యమునైవాహమాత్మనా రమణేన వై॥12539॥*


ఇకమీదట ఏ పరపురుషునివైపు కన్నెత్తియైనను చూడను. ఆత్మారాముడైన ఆ పరమపురుషునితో భక్తిశ్రద్ధాపూర్వకముగా విహరింతును. ప్రారబ్ధానుసారముగా లభించిన దానితో తృప్తిపడుచు సంతోషముగా జీవింతును.


*8.41 (నలుబది ఒకటవ శ్లోకము)*


*సంసారకూపే పతితం విషయైర్ముషితేక్షణమ్|*


*గ్రస్తం కాలాహినాఽఽత్మానం కోఽన్యస్త్రాతుమధీశ్వరః॥12540॥*


సంసారకూపములోబడి, విషయసుఖములలో మునిగి వివేకమును కోల్పోయినవానిని, కాలసర్పము నోటిలో పడినవానిని ఆ భగవంతుడు తప్ప మరియెవ్వడును రక్షింపజాలడు.


*8.42 (నలుబది రెండవ శ్లోకము)*


*ఆత్మైవ హ్యాత్మనో గోప్తా నిర్విద్యేత యదాఖిలాత్|*


*అప్రమత్త ఇదం పశ్యేద్గ్రస్తం కాలాహినా జగత్॥12541॥*


సకల విషయ సుఖముల నుండి విరక్తుడై, జగత్తంతయును కాలసర్పముచే గ్రహింప బడుచుండునని ఎరిగినవాడు, అప్రమత్తుడై (మిగుల జాగరూకుడై) తనను రక్షించువాడు పరమాత్ముడు మాత్రమే అని గ్రహింపవలెను.


*బ్రాహ్మణ ఉవాచ*


*8.43 (నలుబది మూడవ శ్లోకము)*


*ఏవం వ్యవసితమతిర్దురాశాం కాంతతర్షజామ్|*


*ఛిత్త్వోపశమమాస్థాయ శయ్యాముపవివేశ సా॥12542॥*


*అవధూతయైన దత్తాత్రేయుడు ఇట్లు పలికెను* "యదుమహారాజా! ఆ పింగళయను వేశ్య ఇట్లు నిశ్చయించుకొనినదై, విటులను సంతృప్తిపఱచుచు ధనమును సంపాదింపవలెననెడి దురాశను ఫూర్తిగా వీడి, ప్రశాంతచిత్తయయ్యెను. పిమ్మట ఆమె ఎట్టి చీకూచింతా లేక కంటి నిండా నిద్రపోయెను.


*8.44 (నలుబది నాలుగవ శ్లోకము)*


*ఆశా హి పరమం దుఃఖం నైరాశ్యం పరమం సుఖమ్|*


*యథా సంఛిద్య కాంతాశాం సుఖం సుష్వాప పింగళా॥12543॥*


పింగళ పురుషులపై ఆశను వదలుకొనుటతో హాయిగా నిదురింపగలిగెను. *ఆశయే పరమదుఃఖము. వైరాగ్యమే పరమసుఖము' అనునది పింగళ వృత్తాంతమువలన గ్రహింపదగిన నీతి*.


*ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం ఏకాదశస్కంధే అష్టమోఽధ్యాయః (8)*


ఇది భాగవత మహాపురాణమునందలి ఏకాదశస్కంధము నందలి *అవధూతోపాఖ్యానము - అజగరము మొదలుకొని పింగళ వరకు గల తొమ్మిదిమంది గురువుల కథలు* అను ఎనిమిదవ అధ్యాయము (8)


(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి ఏకాదశ స్కంధములోని ఎనిమిదవ అధ్యాయము ఇంకను కొనసాగును)


🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుi🙏🙏


*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319, 9505813235

బ్రాహ్మణులు చేసిన పాపం ఏమిటి?*

 *బ్రాహ్మణులు చేసిన పాపం ఏమిటి?* 


చరిత్రలో హత్యలు, దోపిడీలు, అత్యాచారాలు, మారణహోమాలూ సాగించినవారిని ఆధునిక భారతం గతం గతః అనుకుని క్షమించి వదిలివేసింది 


అంతకుమించి...

మన సాంస్కృతిక వారసత్వ సంపదను, జ్ఞానసంపదను పంచిపెట్టిన విశ్వ విద్యాలయాలను, సమున్నతమైన చారిత్రక కట్టడాలనూ విధ్వంసం చేసిన వారికి విలాసవంతమైన జీవితాన్ననుభవించేందుకు కావలసిన వసతులు సమకూరుతున్నాయి. 


కానీ... 

ధర్మ పరిరక్షణకు, సమాజ సంక్షేమానికి కట్టుబడిన బ్రాహ్మణులు మాత్రం ఆధునిక భారతావనిలో పీడనకు గురవుతూనే ఉన్నారు. 


గత రెండు శతాబ్దాలుగా ఈ విధమైన బ్రాహ్మణ వ్యతిరేకవాదం సమాజంలో వేళ్లూనుకుపోయింది. 


ఇతరులెవరికీ విద్యాబుద్ధులు నేర్చుకునే అవకాశాన్ని బ్రాహ్మణులు ఇవ్వలేదనేది వారు చేసే వితండవాదం. 


సమాజంలో తమదే ఉన్నత స్థానమని చాటుకునేందుకే బ్రాహ్మణులు హిందూ ధర్మశాస్త్రాలను స్వయంగా రూపొందించుకున్నారని సమాజంలో తలెత్తిన వైపరీత్యాలకు ఈ ధోరణే కారణమైందనేది చాలామంది మేధావుల అభిప్రాయం కూడా. 


అయితే ఈ రకమైన వాదనల్లో హేతుబద్ధతగానీ వాటికి చారిత్రక ఆధారాలుగానీ లేవు. 


ఒక అబద్ధాన్ని పదేపదే చెబితే అదే నిజమవుతుందనే నానుడికి ఇలాంటి వాదనలు అద్దం పడతాయి. 


బ్రాహ్మణులు ఎప్పుడూ పేదలే. వారెప్పుడూ భారతదేశాన్ని పాలించలేదు 


చరిత్రలో బ్రాహ్మణులెవరైనా ఏదైనా భూభాగాన్ని పాలించారనడానికి చారిత్రక ఆధారమేదైనా ఉందా? 


సమైక్య భారతావనికోసం చంద్రగుప్త మౌర్యుడికి చాణక్యుడు సహకరించాడు. 


చంద్రగుప్తుడు చక్రవర్తి అయ్యాక చాణక్యుడి కాళ్లపై పడి రాజగురువుగా కొనసాగుతూ తన ఆస్థానంలోనే ఉండిపొమ్మని వేడుకున్నాడు. 


అప్పుడు చాణక్యుడు ‘నేను బ్రాహ్మణుడిని. పిల్లలకు విద్యా బుద్ధులు గరపడం నా ధర్మం. వారు భిక్షమెత్తుకుని తెచ్చిందే నాకు జీవనాధారం.  కాబట్టి నేను నా గ్రామానికి వెళ్లిపోవడమే ధర్మం’ అని జవాబిచ్చాడు. 


పురాణాల్లోగాని, చరిత్రలోగానీ ధనవంతులైన బ్రాహ్మణులు ఉన్న ఉదంతాన్ని ఒక్కటైనా చెప్పగలరా? 


కృష్ణ భగవానుడి జీవితగాథలో సుధాముడి (కుచేలుడు)కి ప్రత్యేక స్థానం ఉంది. 


సుధాముడు పేద బ్రాహ్మణుడు కాగా కృష్ణుడు యాదవుడు. 


ప్రస్తుతం యాదవులు ఇతర వెనుకబడిన కులాల (ఓబిసి) జాబితాలో ఉన్నారన్నది గమనార్హం. 


బ్రాహ్మణులు అహంభావానికి ప్రతీకలే అయితే తమకంటే తక్కువ కులాలకు చెందిన దేవుళ్ళని వారెందుకు పూజిస్తారు? భోళా శంకరుణ్నే తీసుకోండి. ఆయన కిరాతుడని పురాణాలు చెబుతున్నాయి. కిరాతులు ఇప్పుడు ఎస్టీలుగా కొనసాగుతున్నారు. 


మతపరమైన ఆచారాల నిర్వహణ బాధ్యతలు చేపట్టే పౌరోహిత్యం-బ్రాహ్మణుల సాంప్రదాయకమైన వృత్తి. 


భూస్వాములు (బ్రాహ్మణేతరులు) ఇచ్చే భిక్షతో వారు జీవితం గడిపేవారు. 


బ్రాహ్మణుల్లోనే మరో శాఖకు చెందినవారు వేతనమేమీ లేకుండానే ఆచార్యులు (ఉపాధ్యాయులు)గా కొనసాగేవారు. 


మరి..

ఇవే సమాజంలో అత్యున్నతమైన పదవులా? 


వాస్తవానికి దళితులను అణగదొక్కింది భూస్వాములే తప్ప బ్రాహ్మణులు కారు. కానీ నింద పడింది మాత్రం బ్రాహ్మణులపైన. 


బ్రాహ్మణుల్లో పౌరోహిత్యం చేసేవారు 20శాతానికి మించరన్న నిజం ఎంతమందికి తెలుసు? 


చదువుకోవద్దని బ్రాహ్మణులు ఎవరినీ ఆదేశించలేదే? 


ఆ మాటకొస్తే జ్ఞాన సముపార్జనే వారి ఆశయం. 


ఇదే వారిని శక్తిమంతుల్ని చేసింది. 


ఇతరులు అసూయ చెందడానికీ ఇదే కారణం. 


ఇందులో తప్పెవరది? చదువు సంధ్యలనేవి బ్రాహ్మణులకు మాత్రమే పరిమితమైనవైతే, వాల్మీకి మహర్షి రామాయణాన్ని ఎలా రాయగలిగాడు? 


తిరువళ్లువార్ తిరుక్కురళ్‌ను ఎలా లిఖించగలిగాడు? 


ఇతర కులాలకు చెందిన ఎందరో సాధుసంతులు భక్తిపరమైన రచనలెన్నో చేశారుకదా? 


మహాభారతాన్ని రాసిన వేద వ్యాసుడు ఓ మత్స్య కన్యకు జన్మించినవాడుకాదా? 


వశిష్టుడు

వాల్మీకి

కృష్ణుడు

రాముడు

బుద్ధుడు

మహావీరుడు

తులసీదాసు

కబీర్

వివేకానంద...

వీరంతా బ్రాహ్మణేతరులే 


వీరు చేసిన బోధనలను మనమంతా శిరోధార్యంగా భావించడం లేదా? 


అలాంటప్పుడు ఇతరులు విద్యార్జన చేసేందుకు బ్రాహ్మణులు అంగీకరించేవారు కారన్న వాదనకు హేతువెక్కడ? 


*మనుస్మృతిని రచించిన మనువు బ్రాహ్మణుడు కాడే!*

*ఆయన ఓ క్షత్రియుడు.* 


కుల వ్యవస్థను వివరించి చెప్పిన భగవద్గీతను రచించినది వ్యాసుడు. 


ప్రాచీన గ్రంథాలన్నీ బ్రాహ్మణులకే ఉన్నత స్థానమిచ్చాయి. 


అందుకు కారణం వారు ధర్మాన్నీ, విలువలనూ పాటించడమే. 


అరేబియానుంచి వచ్చిన ఆక్రమణదారులు బ్రాహ్మణుల తలలు నరికారు. 


గోవాను దురాక్రమించిన పోర్చుగీసువారు బ్రాహ్మణులను శిలువ వేశారు. 


బ్రిటిష్ మిషనరీలు అనేక వేధింపులకు గురిచేశాయి. 


ఇప్పుడు సోదర సమానులైన స్వదేశీయులే వారిని మానసిక క్షోభకు గురిచేస్తున్నారు. 


ఇంత జరుగుతున్నా ఎవరైనా తిరగబడ్డారా? 


వారణాసి

గంగాఘాట్

హరిద్వార్ ప్రాంతాల్లో నివసించే 1,50,000 మంది బ్రాహ్మణులను ఔరంగజేబు ఊచకోత కోశాడు. 


పది మైళ్ళ దూరంనుంచి చూస్తే కూడా కనబడే విధంగా వారి తలలను తెగ్గొట్టి గుట్టగా పోశాడు. 


ఇస్లాం మతం స్వీకరించనందుకు ఔరంగజేబు బ్రాహ్మణుల తలలు తెగనరికి వారి జంధ్యాలను తెంచి వాటిని ఒకచోట చేర్చి నిప్పంటించి చలి కాచుకున్నాడు. 


కొంకణ్-గోవా ప్రాంతంలో మతం మారేందుకు నిరాకరించినందుకు పోర్చుగీసు దురాక్రమణదారులు లక్షలాది కొంకణ్ బ్రాహ్మణుల్ని ఊచకోత కోశారు. 


ఒక్క బ్రాహ్మణుడైనా తిరగబడి పోర్చుగీసువారిని చంపిన దృష్టాంతముందా? 


ఎందుకంటే వారు హింసను వదిలి అహింసా జీవనాన్ని గడిపేవారు. 


(భారత్‌కు పోర్చుగీసువారు వచ్చినపుడు సెయింట్ జేవియర్.. పోర్చుగీస్ రాజుకు ఓ ఉత్తరం రాశాడు

దాని సారాంశమేమిటంటే... ‘ఇక్కడ బ్రాహ్మణులెవరూ లేకపోతే అందర్నీ సునాయాసంగా మన మతంలోకి మార్చేయవచ్చు’ అని) 


సెయింట్ జేవియర్ బ్రాహ్మణులను విపరీతంగా ద్వేషించేవాడు. 


జేవియర్ వేధింపులు భరించలేక వేలాది కొంకణ బ్రాహ్మణులు సర్వస్వం వదలుకుని కట్టుబట్టలతో గోవాను వదలి వెళ్లిపోయారు. 


కాశ్మీర

గాంధార దేశాల్లో

(ఇప్పటి అఫ్గానిస్తాన్, పాకిస్తాన్ దేశాల్లోని భాగాలు)

సారస్వత బ్రాహ్మణులను విదేశీ ఆక్రమణదారులు ఊచకోత కోశారు. 


ఇప్పుడు ఈ ప్రాంతాల్లో సారస్వత బ్రాహ్మలు మచ్చుకైనా కనిపించరు. 


ఇంతలా మారణహోమం జరుగుతున్నప్పుడు ఏ ఒక్క సారస్వత బ్రాహ్మడైనా తిరగబడిన దాఖలాలు ఉన్నాయా? 


ఎందుకంటే వారు తాపస జీవనాన్ని వృత్తిగా ఎంచుకున్న వారు. 


పాకిస్తానీ మిలిటెంట్ల దురాగతాలకు తాళలేక కాశ్మీరీ పండిట్లు తమ స్వస్థలాలను వదిలి వెళ్లిపోయారు.

ఉగ్రవాదులు చేపట్టిన కాశ్మీరీ లోయ ‘ప్రక్షాళన’ కార్యక్రమానికి తాళలేక కాశ్మీరీ పండిట్లు విలువైన తమ ఆస్తిపాస్తులనే కాదు...ప్రాణాలనూ కోల్పోయారు. 


ఐదు లక్షలమందికి పైగా పండిట్లు కాశ్మీర్ లోయను వదలిపెట్టి వలస పోయారు. 


వీరిలో 50వేలమందికి పైగా ఇప్పటికీ శరణార్థి శిబిరాల్లోనే కాలం గడుపుతున్నారు. 


కాశ్మీరీ పండిట్లు ఇంత పీడనకూ, వేదనకూ గురైనా ఎన్నడైనా తిరగబడిన ఉదంతాలు ఉన్నాయా? 


ఎందుకంటే వారు వారు ద్వేషాన్ని వదిలి శాంతి జీవనాన్ని గడిపేవారు. 


భారత్‌పైకి అరబ్బు దేశంనుంచి దండెత్తి వచ్చిన

మహమ్మద్ బిన్ ఖాసిం బ్రాహ్మణులంతా

సున్తీ చేయించుకోవాలని షరతు విధించాడట. 


వారు నిరాకరించినందుకు పదిహేడేళ్ల వయసు పైబడిన బ్రాహ్మణులకు మరణ శిక్ష విధించే వాడట. 


ముస్లిం చరిత్రకారులను ఉటంకిస్తూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ చెప్పిన వాస్తవమిది. 


భారత్‌పై దండయాత్రలు జరిగిన సమయాల్లోనూ, మొఘలుల కాలంలోనూ వందలు, వేలమంది బ్రాహ్మణులు ఊచకోతకు గురయ్యారు.

కానీ...బ్రాహ్మణులు తిరగబడిన ఉదంతాలు ఒక్కటీ కనబడవు. 


ఎందుకంటే వారు సాత్విక జీవనాన్నీ - సాత్విక గుణాలనే సంపదగా భావించేవారు. 


19వ శతాబ్దం తొలినాళ్లలో ఓ దీపావళి రోజున టిప్పు సుల్తాన్ సైన్యం మేల్కోటే ప్రాంతంపైకి దండెత్తివచ్చి 800 మందిని ఊచకోత కోసింది. 


మృతుల్లో అత్యధికులు మాండ్యం అయ్యంగార్లే. సంస్కృతంలో ప్రవీణులు వారు.

ఇప్పటికీ మేల్కోటేలు దీపావళి పండుగ జరుపుకోరు. 


*వారణాసిలో రిక్షా తొక్కేవారిలో చాలామంది బ్రాహ్మణులనే విషయం ఎంతమందికి తెలుసు?* 


*ఢిల్లీ రైల్వే స్టేషన్లలో బ్రాహ్మణులు కూలీలుగా పనిచేస్తున్నారనే సంగతి తెలిస్తే చాలామందికి ఆశ్చర్యం కలుగుతుంది.* 


కానీ ఇది నిజం

న్యూ ఢిల్లీలోని పటేల్‌నగర్‌లో నివసించే రిక్షా కార్మికుల్లో 50శాతం మంది బ్రాహ్మణులే 


ఆంధ్రప్రదేశ్‌లో ఇళ్లలో పనిచేసేవారు వంటవాళ్లలో 75శాతం మంది బ్రాహ్మణులే. 


మన దేశంలో 60శాతం మంది బ్రాహ్మణులు పేదరికంలో మగ్గుతున్నారు. 


వేలాది బ్రాహ్మణుల పిల్లలు ఉద్యోగాల వేటలో అమెరికాకు వలస పోతున్నారు. 


అక్కడ సైంటిస్టులుగా, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లుగా స్థిరపడుతున్నారు. 


మన దేశంలో నిపుణుల కొరత ఉన్నప్పుడు ప్రభుత్వాలు వారిగురించి ఎందుకు ఆలోచించడం లేదు? 


గత కాలపు బ్రాహ్మణ సమాజం మొత్తం కడిగిన ముత్యం కాకపోవచ్చు. 


వారిలో ఏ కొద్దిమంది చేతులకో రక్తం అంటి ఉండవచ్చు. 


వారు చేసిన తప్పులను మొత్తం బ్రాహ్మణులందరికీ అంటగట్టడం సబబేనా? 


సమాజానికి బ్రాహ్మణులు చేసిన మేలును ఈ ప్రపంచం ఏనాడో మరచిపోయింది. 


బ్రాహ్మణులు కేవలం

వేదాలు గణిత ఖగోళ శాస్త్రాల అధ్యయనానికి మాత్రమే పరిమితం కాలేదు. 


ఆయుర్వేద ప్రాణాయామ కామసూత్ర యోగ నాట్య శాస్త్రాలను అభివృద్ధి చేసి మానవాళికి అందించిన ఘనత నిస్సందేహంగా వారిదే. 


బ్రాహ్మణులు స్వార్ధపరులే అయితే విలువైన ఈ శాస్త్రాలన్నిటి మీద హక్కు తమదే అని చాటుకునేవారు. 


అతి ప్రాచీనమైన శాస్త్రాలపై తమ పేర్లు లిఖించుకుని ఉండేవారు. 


‘లోకాస్సమస్తాస్సుఖినోభవన్తు’ అనే ఒకే ఒక్క ఆశయంతో మానవాళి సంక్షేమంకోసం తమ జీవితాలను త్యాగం చేశారు. 


అందుకు ప్రతిఫలంగా బ్రాహ్మణుల్ని శిలువపైకి ఎక్కించేందుకు ఈ లోకం ప్రయత్నిస్తోంది. 


ఎంత విచారకరం! 


"చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణస్య శుభం భవతు

లోకాసమస్తా సుఖినోభవంతు"

అనేది తరతరాలుగా వస్తున్న ప్రార్థన. 


అంటే నాలుగు సముద్రాల వరకు వ్యాపించిన ఈ భూమిపై నివసించే ఆవులూ -బ్రాహ్మణులు శుభకరంగా ఉండు గాక ! 


అప్పుడే ఈ లోకం లో కూడా ధర్మం వృద్ధి చెంది సుభిక్షంగా ఉంటుందని అర్థం. 


ఇప్పుడు ఆవులకూ విలువ ఇవ్వడం లేదు బ్రాహ్మణులనూ ఉద్దేశపూర్వకంగా అణిచి వేస్తున్నారు.

మధుమేహం గురించి సంపూర్ణ వివరణ -

 మధుమేహం గురించి సంపూర్ణ వివరణ - 


        మధుమేహము మహారోగములలో ఒకటిగా పేర్కొనబడినది . అధిక ప్రమాణమున మాటిమాటికి మూత్రము ఈ వ్యాధి నందు వెడలుటచే ఇది మేహరోగం అనబడును. ఈ రోగం జనించుటకు ప్రధానకారణాలు గురించి ప్రాచీన ఆయుర్వేద వైద్యులు అనేక కారణాలు తెలియజేసారు. 


              సుఖముగా ఉండు ఆసనము పైన ఆసీనుడై యుండి ఏ పనిచేయక సోమరిగా ఉండుట , ఎక్కువసేపు సుఖముగా నిద్రించుట , పెరుగు , జలచరమాంసాదులు , పాలు , బెల్లం , తీపివస్తువులు , కఫవర్ధక పదార్థాలు ఎక్కువుగా సేవించుట , కొవ్వుపదార్ధాలు అధికంగా తీసుకొనుట , శరీరానికి శ్రమ లేకపోవుట , పగటినిద్ర మరియు శీతల , మధుర , స్నిగ్ధ ద్రవముగా ఉండు అన్నపానాదులు అధికంగా సేవించుట వలన ప్రమేహము వచ్చును. 


              ఆరోగ్యవంతుని యందు ఒక పగలు , రాత్రి అంటే 24 గంటల కాలమున విసర్జించబడు మూత్రము యొక్క ప్రమాణము 800 - 2500 మీ.లీ గా ఉండును. పైన పేర్కొనబడిన సాధారణ ప్రమాణము కన్నా అధికముగా మూత్రవిసర్జన జరిగినచో అది ప్రమేహం అనబడును. ఉదాహరణకు ఉదకమేహము ( Daibetes insipidus ) అను సమస్య నందు 5 - 10 లీటర్లు మూత్రము 24 గంటల కాలంలో విసర్జించబడును. ప్రమేహము నందు మూత్రము నిర్మలముగా ఉండక కలుషితమై కలకపరి ఉండును. 


     

         మధుమేహము కారణములను ఆధారం చేసుకుని రెండు విధములుగా పేర్కొనబడినది . 


      1 - సహజము .


      2 - అపథ్య నిమిత్తజము . 


 * సహజము - 


        సహజముగా కలుగు ప్రమేహము తల్లితండ్రుల బీజదోషము వలన కలుగును. శిశువు జన్మకు కారణం అయిన బీజము , శుక్రము యొక్క దోషములు సామాన్యముగా సహజ వ్యాధులకు కారణము. కావున మధుమేహము కూడా బీజదోషముల వలనే జనించును. 


 * అపథ్య నిమిత్తజము - 


        ఇది బీజదోష రహితముగా , జన్మించిన తరువాత అపథ్య ఆహార అలవాట్ల వలన జనియించును. ప్రమేహవ్యాధి జనియించినప్పుడు సరైన చికిత్స చేయక ఉపేక్షించిన యడల ప్రమేహములు ( 20 రకాలు ) అన్నియు మధుమేహములుగా మారును. 


                         మధుమేహము నందు మూత్రము కషాయ , మధుర రసములు కలిగి తెలుపుగా ఉండును. ఈ వ్యాధిని నిర్ధారించుటలో మూత్రపరీక్ష మరియు రక్తపరీక్షలు దోహదపడును. ఈ పరీక్షల ఆధారముగా వ్యాధితీవ్రత మరియు చికిత్సా ఫలితములను అంచనా వేయుట సాధ్యపడును. 


       కడుపులో చిన్నపేగు మొదటి భాగమునకు ( Duodenum) , పిత్తాశయం ( Gallblader ) నకు మధ్యభాగములో పైత్యనాళము (Bileduct ) పక్కగా క్లోమము ( Pancrease ) అను వినాళగ్రంధి ఉండును. ఇందులో ఎంజైములు మరియు హార్మోనులు ఉండును. ఎంజైములు ఆహార జీర్ణక్రియలో పాల్గొనును. ఇన్సులిన్ మరియు గ్లూకాగాన్ అను రెండు హార్మోనులు ఈ క్లోమగ్రంధి యందు ఉండి రక్తములోని గ్లూకోజ్ ప్రమాణమును నియంత్రించుతూ శరీర అవసరాలకు అనుగుణంగా ఉండేలా చూడును . మధుమేహ రోగికి పలుకారణాల వలన ఇన్సులిన్ అనే హార్మోన్ చురుకుగా లేకపోవడం , కావలిసినంత ప్రమాణముగా అందుబాటులో లేకపోవటం వలన రక్తములో గ్లూకోజ్ స్థాయులు పెరుగును . రక్తములో అధికంగా ఉన్న గ్లూకోజ్ మూత్రపిండాల ద్వారా మూత్రములో బయటకు వెళ్ళును. ఈ విధముగా శరీరంలో పలు జీవక్రియలకు ఆధారమైన మరియు శక్తిని సమకూర్చే గ్లూకోజ్ నిలువలు క్రమేణా తరిగిపోవడం మరియు శరీర అవయవాలు ఉపయోగించుటకు వీలులేని వాతావరణము నెలకొనుట మూలముగా క్రమముగా మధుమేహరోగి కండరాలు క్షీణించి నరముల బలహీనత , కంటిచూపు తగ్గుట మరియు మూత్రపిండముల సామర్ధ్యము తగ్గుట మొదలగు ఉపద్రవములతో మరణించును . సక్రమమైన ఆహారవిహారాలు , క్రమం తప్పకుండా ఔషధసేవన పాటించడం వలన రోగికి వ్యాధి లొంగుబాటులో ఉండి ఆయువును పెంపొందించును. 


                  మధుమేహా సమస్య నివారణలో ఔషధ సేవనతోపాటు ఆహార నియమాలు కూడా ప్రధానపాత్ర పోషిస్తాయి. ఇప్పుడు మీకు తినవలసిన మరియు తినకూడని ఆహారనియమాల గురించి వివరిస్తాను. 


   తినవలసిన ఆహారపదార్ధాలు - 


       యవలు , గోధుమలు , కొర్రలు , రాగులు , పాతబియ్యపు అన్నం , పెసలు , చేదు గల కాయగూరలు , మరియు ఆకుకూరలు , చేదుపోట్ల , కాకరకాయ , మెంతులు , దొండకాయ , వెలగపండు , మారేడు , నేరేడు విత్తనాలు , ఉసిరిక పండు , పసుపు , అడివిమాంస రసములు ఎక్కువుగా వాడవచ్చు . 


  తినకూడని ఆహార పదార్దాలు - 


      కొత్త బియ్యపు అన్నం , అధిక నూనె కలిగిన ఆహారాలు , బెల్లపు పదార్దాలు , నెయ్యి వంటకములు , మద్యము , గంజి , చెరుకు రసము , పుల్లటి పదార్థాలు , చింతపండు , పెరుగు , వెన్న , జున్ను , దుంప కూరలు , కొవ్వులు అధికంగా ఉండు పదార్దాలు వాడకూడదు. అదేవిధముగా పగలు నిద్రించరాదు , ధూమపానం , రాత్రి సమయములో మేల్కొని ఉండటం నిషిద్దం . మలమూత్ర వేగాలను నియంత్రించరాదు.   


        పైన చెప్పిన నియమాలు పాటిస్తూ మధ్యాహ్న సమయంలో మజ్జిగ అన్నంలో 50 గ్రాముల ఉల్లిపాయని నంజుకొని తినండి. పలుచటి మజ్జిగని మాత్రమే వాడవలెను. శరీరం నందు వేడిమి పెరగకుండా జాగ్రత్తవహించండి. నేను రాసిన గ్రంధాల నందు పెద్ద పెద్ద అనారోగ్యాలకు కూడా చిన్నచిన్న చిట్కాల సహాయంతో తగ్గించుకునే విధముగా అత్యంత సులభయోగాలు ఇచ్చాను . ప్రతి ఇంటి నందు ఉండవలసిన గ్రంధములు . తప్పక చదవగలరు.


                       * సంపూర్ణం *

  

 మధుమేహ నివారణా చూర్ణం నాదగ్గర లభ్యం అగును . నన్ను సంప్రదించగలరు . ఈ చూర్ణం వాడటం వలన మధుమేహం త్వరగా అదుపులోకి వచ్చును . మరియు మధుమేహం ద్వారా వచ్చు సైడ్ ఎఫక్ట్స్ నివారణ అగును .

పులిహోర

 *పులిహోర* 


ముంగిట మామిడాకులు వంటింట పులిహోర గుబాళింపులు చాలు..పండగో, శుభకార్యమో ! వచ్చిందంటానికి గుర్తుగా.


మొన్న శ్రావణ మాసం అయిపోగానే దిగులు. మళ్ళీ ప్రసాదాల రూపంలో పులిహోర కోసం శరన్నవరాత్రులు దాకా ఆగాలి కదా అని!!


ఆంధ్రులు గర్వించే వంటకం పులిహోర..అన్నిహక్కులూ ఆంధ్రులవే. పేటెంట్ తీసుకున్నారో?? లేదో తెలియదు.


ఇప్పుడంటే ఈ పులిహోర "వేరియెంట్స్" మార్చుకుంటూ రకరకాలుగా వచ్చాయి కానీ నా చిన్నప్పుడు రెండే రకాలు.. అవి నిమ్మ పులిహోర, చింతపండు పులిహోర. 

చింతపండు పులిహోరతో పోలిస్తే నిమ్మ పులిహోర లో హడావుడి తక్కువ. 


రవ్వపులిహోర అని ఉంటుంది గానీ! వీటి సరసన నిలబడే స్థాయి కాదు. దానికి ఆదరణ కూడా తక్కువనే చెప్పాలి 


"ఏదో మైనారిటీ స్టేటస్ ఇవ్వచ్చు!"😊


ఇక రాత్రి అన్నం మిగిలితే పొద్దున మతలబు చేసి నిమ్మ పులిహోరగా మార్చి టిఫిన్ గా పిల్లలకి పెట్టి చేతులు దులుపుకునే తల్లులు కోకొల్లలు. అలా చేసింది వాసి, రాశి లో నాసి అనే చెప్పాలి.


అదే అప్పటికప్పుడు వేడి వేడి అన్నం వండి పులిహోర చేసి చూడండి..అ మజా వేరు.

నిమ్మ పులిహోర లో ఆ పలచని పసుపు కాంతి నీరెండలా మెరిస్తూ లేత యవ్వన కన్య లా ఉంటే చింతపండు పులిహోర ఇంత పసుపు పట్టించి స్నానం చేసి గుప్త గాంభీర్యాన్ని పోగేసుకున్న పూర్ణ ముత్తయిదువులా ఉంటుంది.☺️


నాకు బాగా గుర్తు...ఓరోజు స్కూల్ నుంచి రాగానే వాకిట్లోకి తిరగమాత గుబాళింపు వచ్చింది.


 " *అమ్మ* *నీ* *చేతి* *తాలింపు* *కమ్మదనము* *భరత* *దేశమున* *గుమ* *గుమ* *పరిమళించె* ... " అని కరుణశ్రీ గారి పద్యం మా అమ్మ పాడుతోంది. అవిడో సాహితీ పిపాసి.


 పరిగెత్తుకుంటూ వంటింట్లోకి వెళితే అమ్మ చీర కొంగుకి పసుపు ఆంటి ఉంది. కొత్త చీర కొనుక్కున్నావా?? అని కొంగు ని పట్టుకు అడిగితే అమ్మ నవ్వి పులిహోర చేస్తున్నా రా!! పసుపు చేతుల్తో చెంగు తుడిచా !!అంటింది కాబోలు!! అంది.

ఆ పసుపు కొంగునిండా తిరగమాత సువాసనే..అది మొహాన కప్పుకున్నప్పుడు నాకు *తిరుమల* *శ్రీవారి* *మేల్* *చాట్* వస్త్రం కప్పుకున్న అనుభూతి.


సాధారణంగా మిగిలిన టిఫిన్లన్నీ ఒక దారి అయితే

పులిహోర ఒకటీ వేరే. ఇంట్లో వారినే కాకుండా పనిమనిషి, చాకలి వంటి వారిని కూడా తినే సభ్యుల్లో లెక్కచేర్చాలి. లేదంటే ఆనక ఇబ్బందులు.


మూడుపూట్లా ఇదే తినే కడుపులు

మూడ్రోజులూ తినే గడపలు కూడా ఉన్నాయి.

టిఫిన్గా తిన్నదే కాక కారేజ్ బాక్స్ లోకి, నాన్నగారు ట్రైన్ లోకి..ఇలా అందరి మోజు తీరాలంటే భారీ మొత్తంలో చేయాల్సి ఉంటుంది.


పులిహోరలో కేవలం తిరగమాత ఉంటే అధమశ్రేణి , పల్లీలుంటే మధ్యమశ్రేణి, జీడిపప్పు ఉంటే ఉన్నత శ్రేణి

జీడిపప్పు గుళ్లు ఉంటే ఎగువ ఉన్నతశ్రేణి కింద ఆదాయపు పన్ను శాఖ వారు గుర్తించవచ్చు. 

ఇంట్లో బాచిపీటవేసుకుని లుంగీ కట్టి అరిటాకులో తిన్న తృప్తి తో ఏదీ పోల్చలేము. ఒక పంటికింద చింతపండు లో ఊరిన పచ్చిమిర్చి, మరో పంటికింద తాలింపు చేరిన ఎండుమిర్చి నములుతుంటే మనసు " *ద్విపద* " కావ్యం రాస్తున్నట్టే!! 


పులిహోర అంటే పులకరించని మనసుంటుందా?? అనుమానమే!!


రేపు పులిహోర అనగా నిద్ర పట్టని రాత్రులున్నాయి

పులిహోర లో నూనె బాగా పడాలి..చూస్తుంటే అది మెరవాలి.. తిన్న మన కళ్ళు అంతే మెరవాలి.

అలా పెద్ద బేసిన్ నిండా పులిహోర తయారు చేసి పరిస్తే చూడండీ!!!.


అసలు శ్రావణ శుక్రవారం పులిహోర బాగా కుదరటమే మన భక్తికి పరీక్ష అని జెప్పచ్చు.


శ్రావణం, దసరా రోజుల్లో ఈ పులిహోర నాలుగైదు గృహాలనుంచి ప్రసాదాల రూపంలో వస్తూ ఉంటుంది. 

ఇక్కడే సాంకేతిక సమస్య నాకు!!


ఎవరిది ఏపులిహోర?? అని గుర్తుంచుకోవడం వాళ్ళ బాక్స్ మళ్ళీ వాళ్ళకి అందచెయ్యడం, పులిహోర పై అభిప్రాయాన్ని సదరు గృహిణికి message పెట్టడం..ఇత్యాది బాధ్యతలు చాలా ఉంటాయి. ఈ విషయంలో మా అబ్బాయి రాటు దేలాడు. నాకు అందరి పులిహోర్లూ ఒకేలా ఉన్నా మా అబ్బాయి ఠక్కున చెప్పగలడు.!! 

ఆవులన్నీ ఒకేలా ఉన్నా యజమాని విడివిడిగా గుర్తించినట్టు అన్ని పులిహోరలూ ఒకేలా ఉన్నా ఇది ఫలానా ఆంటీది!!అంటూ వాడు చెప్పగలగడం నాకు పెద్ద ఊరట. కొన్ని పులిహోరలు మనసు కి చివుక్కనిపించినా అది అభిప్రాయం గా మారకుండా నోరు జారకుండా జాగ్రత్తపడతా.

 ఏమాత్రం తేడా వచ్చినా మళ్ళీ పండక్కి పులిహోర హుళక్కే. ఇప్పటికే అలా ఒకరిద్దరు పులిహోరదాతల్ని పోగొట్టుకున్నా కూడా!😢 


ఇక స్థల ప్రభావం అంటారే!! 


అలా పులిహోర తినే ప్రదేశాలు కూడా పులిహోర రుచికి సమన్వయమై ఒక్కో అనుభూతిని ప్రసాదిస్తాయి.ఉదాహరణకి ట్రైన్లో వింధ్య గుహల్లోనుంచి ఏ ఢిల్లీ నో వెళ్తు మాంచి జోరు మీదుండగా ఊగుతూ పులిహోర తినడం ఒక అనుభవమయితే, కార్తీకంలో పంచారామాల దర్శనం అప్పుడు మంచు పడుతుండగా పొలాల మధ్య ఏ చిన్న ఆలయంలోనో తినడం మరో అనుభూతి.

స్థల ప్రభావం వల్ల రుచి ఇబ్బడిముబ్బడి గా పెరిగే ఏకైక వంటకం ఇదొక్కటే అనుకుంటా!


ఆలయం అంటే గుర్తొచ్చింది..చిన్నప్పుడు ముత్యాలంపాడు రామాలయం రాజుల అజమాయిషీ. పులిహోర ప్రసాదంఘాటుగా ఉండేది..దాన్ని నేను "క్షాత్ర పులిహోర" అనేవాడిని. అక్కడ రాజులు అరికాలు మంట నెత్తి కెక్కేట్లుగా పచ్చిమిర్చి వేసేవారు..తెలియక ఆబగా నోట్లో పెట్టా ఒకసారి. అంతే వెక్కిళ్ళు తమన్ డ్రం బీట్ లా కన్నీళ్లు జోగ్ జలపాతాల్లా ఉబికిరాగా కుక్కపిల్ల నాలిక బైటపెట్టినట్లు అంగలార్చుకుంటూ ఇంటికొచ్చా. విషయం తెలిసిన అమ్మ పంచదార పెట్టడం తో ఆ ఘాటు స్మృతి కి 

స్వీటు ముగింపు. 


ఇక తిరుమలలో దర్శనం అయ్యి వస్తుంటే ఉచిత ప్రసాదం ఏమిపెడతారో!! అని టెన్షన్. లడ్డూ , పరమాన్నం అయితే ok.. 


పులిహోర అయితే మాత్రం! ...ఆ దొన్నె ఏమూలకి? దొన్నె సైజ్ పెంచరు సరికదా!! రెండో దొన్నె ఇవ్వరు. 

దద్ధోజనం, కట్టెపొంగలి లాంటివి దొన్నెల్లో పెట్టినా, 

పులిహోరకుమాత్రం దొన్నె బదులు గిన్నె ఇవ్వాలి అని నా అభిప్రాయం. ఇక ఖాళీ అయిన గంగాళాల గోడలకు అతుక్కుపోయిన జీడిపప్పులు వేలాడే చంద్రవంకల్లా అగుపిస్తుంటే..అన్ని జీడిపప్పులు వృథాయేనా!! అని బాధ.


ఏది ఏమైనా అరసవిల్లి నుంచి అయినవిల్లి వరకు 

అన్ని పులిహోరలూ ఒక ఎత్తైతే తిరుమల పులిహోర మరో ఎత్తు.నేతి పులిహోర బహుశా నాకు తెలిసి చేసే ఆలయం తిరుమలే అనుకుంటా!!

ఆరుచి అందరకూ నచ్ఛకపోవచ్చు. ఆ మిరియాలు, ఘాటైన ఆవ ముఖ్యంగా ఆంధ్రులకు!! 


కవిత్వాన్ని ఎందరు ఆస్వాదించగలరు?? దాని విలువదానిదే!! అలాగే తిరుమల పులిహోర కూడా.

అసలు స్వామి వారికి నచ్చింది అండీ..అది చాలు!!


ఇంతకీ పులిహోర, భోజనమా!! ఫలహారమా!! అన్నది నన్ను చాలా కాలం గా వేధిస్తున్న ప్రశ్న?? 


కొందరు పరగడుపున ఇంత పెరుగేసి కలిపి భోజనంలాగా స్వీకరించి ఇక ఆరోజుకి ఇంకేమీ ముట్టని వారుంటారు. అదేమిటంటే!! పులిహోర, పెరుగు కలయిక మామూలనుకుంటున్నారా?? రెండు అగ్రరాజ్యాల భేటీ ... మోదీజీ, బైడెన్ కలయిక లాంటిది..కడుపులో దండిగా పడుంటుంది అంటారు.


కొందరు మాఇంట్లో ఉదయం పులిహోర టిఫిన్ అంటూండగా

మరికొందరు ఇవ్వాళ ఉపవాసం , ఫలహారం మాత్రమే అని "పులిహోర తప్ప" అని షరతు పెడతారు. 

అంటే పులిహోర ప్రభావం చూడండి!!...కొందరి దృష్టిలో ఫలహారం మరికొందరి దృష్టిలో అది భోజన సమానం.

ఇడ్లీ/ దోసెలకు కానీ పూరీ/వడ మరే ఇతర టిఫిన్ కానీ పులిహోరకి లభించిన ఆధ్యాత్మిక స్థాయి లేదు. 


నాకు తెలిసి మిగిలిన టిఫిన్స్ మాట ఎలా ఉన్నా పులిహోర మాత్రం స్నానం చేసి కలిపే మహిళలే ఇప్పటికీ మెజారిటీ. అలాగే అది సాధారణ టిఫిన్ గా తీసుకొచ్చినప్పటికీ అప్రయత్నంగా కళ్లకద్దుకొని తినడం సహజ ప్రవృత్తి . అంటే ఆ పులిహోర పట్ల ఏదో తెలియని ఒక

 " *అసంకల్పిత* *పవిత్ర* *భావన* " అలా పురిగొల్పుతుందేమో!!


అందుకే నేను


" అన్నం పర బ్రహ్మమయితే " 

   పులిహోర "ఇహ బ్రహ్మం" అంటాను.!!😊

యోగ మార్గము

 యోగ మార్గము :-


ప్రాచీన సనాతన ధర్మం లో యోగ మార్గం అంటే ఒంటి కాలుపై నిలబడటం, మేకుల పై పడుకోవడం,నీటి పై నడవడం,గాల్లోకి ఎగరడం , కఠోరమైన ఉపవాసాలతో శరీరాలను హింసించడం ఏమీ కాదు! ఇది స్పష్టంగా గీతలో వివరించారు శ్రీకృష్ణ పరమాత్మ. 


| కర్మయంతః శరీరస్థం, భూతగ్రామ మచేతసః

మాంచైవ అంత శ్శరీరస్తం....! |


భగవద్గీత 17. 6.


బుద్దిహీనుడైనవాడు ( అచేతన) శరీరాన్ని ఉపవాసాది హింసల ద్వారా కృశింపచేయడం వలన అంతర్యామిగా ఉన్న అతడి శరీరంలోని నన్ను కూడా హింసిస్తున్నాడు! అంటారు గీతలో శ్రీకృష్ణుడు.


అంటే ఇక్కడ ముఖ్యమైన అంశం "యోగం అంటే శరీరాన్ని శుష్కింపచేయడం కాదు! అతిగా సుఖాలతో విశృంఖలంగా శరీరాన్ని మేపడం కూడా కాదు. యక్తాహరం, తగినంత నిద్ర, తగినంత విశ్రాంతి తగినంత వ్యాయామం, నిరంతరంగా నడిచే సాధన, ఆలోచనా వంతుడై చేయాలి. అప్పుడే గత కర్మలను , వాటి వలన కలిగే కష్టసుఖాలను పూర్తిగా భస్మం చేయగలిగే యోగ సిద్ది లభిస్తుంది. దీనినే గౌతమ బుద్ధుడు కూడా "మధ్యే మార్గం " అని చెప్పారు. 


ఈ యోగంలో ముఖ్యమైన అంశం మనోనిల్చలత ! చంచలమైన మనసును నిశ్చలం చేయాలి. దాని ద్వారా ఏకాగ్రత సాధించాలి. అయితే మనసును కంట్రోల్ చేయడానికి బలాత్కారంగా ప్రయత్నించడం మాత్రం సబబు కాదు .. రకరకాలుగా పరిగేత్తే మనసును శ్వాస ద్వారా ఏకస్థం చేయాలి. ఇదే క్రియాయోగం గా చెబుతారు. 


ప్రశాంత మనసు గల వ్యక్తికి శ్వాస కూడా ప్రశాంతంగా సౌమ్యంగా నడుస్తుంది. భ్రూమధ్య దృష్టిని అనుసంధానం చేస్తూ శ్వాసను సుషుమ్నా నాడి ద్వారా భ్రూ మద్యానికి చేర్చి, ఎలాంటి ఆలోచనలు చేయకుండా నకించిదపి , చింతమేత్ తాను అనే ప్రజ్ఞ యందు దృడ నిష్టుడు కావాలి.ఈ విధంగా శ్వాస ద్వారా మనసును , మనసు ద్వారా బుద్దిలోకి ప్రవేశించి ఆ బుద్దిని తన ఆత్మ యందు ప్రవేశపెట్టి దాని ద్వారా యోగి సమాధి స్థితుడు అవుతాడు. 


ఇలా అంతర్దృష్టితో సర్వప్రంపంచాన్ని తానుగా భావించిన దివ్యదృష్టి భగవంతుని అనుగ్రహం తో లభిస్తుంది. ఇటువంటి దివ్యదృష్టి శాశ్వతంగా ఉంటుంది. సర్వజీవుల యందు కదలాడే చైతన్యమే పరమాత్మగా దర్శించగలుగుతాఢు. కోరికలు విడిచి ఆత్మ పరిశుద్ది కోసమే నిత్య కర్మలను చేస్తూ లభించిన దానితోనే సంతృప్తి పొంది జీవిస్తాడు యోగి! ఈ విధంగా ప్రారబ్ద కర్మ క్షయం అవగా ఆ యోగి చేయవలసిన కర్తవ్యం ఏం మిగలదు. విశ్వవ్యాపియైన విశ్వాత్మకు తన కర్మల ద్వారా శరణాగతి చేసి అంతర్దృష్టి తో సర్వస్వాన్ని చూస్తూ అందరి జీవులలో వెలిగే ఆ జగదీశ్వరుడిని దర్శిస్తాడు. అలాంటి యోగికి బయటి విశ్వమే పరమాత్మగా సాక్షాత్కరిస్తుంది. ఈ విధమైన సాధన మన నిత్యజీవితాన్ని విడిచి పారిపోయే సన్యాసం కాదు. సహజంగానే పండు పండి ఫలంగా మిగిలి, మిగతా కర్మఫలాలను అన్నింటినీ త్యాగం చేయగలుగుతారు. 


నిర్వాణ పరమాం మత్సంస్థాం అదిగఛ్ఛతి " సంగ్రహంగా ఇది ఉపదేశ సారం. 


ఈ పరిపూర్ణ లక్ష్యాన్ని చేరేలోగా మనిషి శరీరం, మనసు పవిత్రం కావడం కోసం ,కష్టనివారణ కోసం "యజ్ఞదాన తపస్సు" అనే కర్మలను వేదాలు ఏర్పాటు చేశాయి. 


మనిషి జీవన విధానంలో అవసరమైన అనేక ప్రయోజనాల కోసం కూడా అనేక శాస్త్రాలను ఋషులు ప్రసాదించారు. అవి అన్ని కూడా సనాతన ధర్మం లో భాగమే! ఆరోగ్యం కోసం ఆయుర్వేదం. దేవత అనుగ్రహం కోసం, దుష్ట గ్రహ నివారణ కోసం మంత్రశాస్త్రం, సుఖదుఃఖాలను నియమించుకోవడం కోసం మంచి చెడు కాలాలను తెలిపే జ్యోతిష్యం శరీరంలోని నాదానుసంధానం ద్వారా విశ్వంలోని ఓంకారం తో లయం చేసే సంగీత శాస్త్రం సామవేదం , గాంధర్వవేదం అలాగే నిత్యజీవితంలో కావాల్సినవి సంపాదించుకునే అర్థ శాస్త్రం ... సమాజాన్ని అన్ని వర్గాలనూ సుఖవంతంగా నడిపే సామాజిక ధర్మం, భార్యా భర్తలను వారి ప్రవృత్తులను అనుసరించి కావాల్సిన స్వేచ్చను ఇచ్చే గార్హస్థ్యధర్మము ( కామశాస్త్రం) , గృహ నిర్మాణానికి వాస్తు, భగవంతుని ఆరాధన కోసం ఆగమ శాస్త్రం...ఇలా అనేక విద్యలను ప్రసాదించింది సనాతన వేధం. వీటిని అన్నింటినీ సమన్వయ దృష్టితో అద్యయనం చేయాలి. 


సశేషం

9542552784


గమనిక :- ఇది కేవలం ఒక అవగాహన కోసం మాత్రమే పోస్ట్ చెయ్యబడింది. ప్రత్యక్షంగా గానీ పరోక్షంగా గాని ఎవరిని ఉద్దేశించి కాదు

సంస్కృత మహాభాగవతం*

 *27.09.2021 ప్రాతః కాల సందేశము*


*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*


*ఏకాదశస్కంధము - ఎనిమిదవ అధ్యాయము*


*అవధూతోపాఖ్యానము - అజగరము మొదలుకొని పింగళము వరకు గల తొమ్మిదిమంది గురువుల కథలు*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*8.33 (ముప్పది మూడవ శ్లోకము)*


*యదస్థిభిర్నిర్మితవంశవంశ్యస్థూణం త్వచా రోమనఖైః పినద్ధమ్|*.


*క్షరన్నవద్వారమగారమేతద్ విణ్మూత్రపూర్ణం మదుపైతి కాన్యా॥12532॥*


వెదురు కర్రలతోగూడి, వాసములపై, స్థంభములపై నిలిచియున్న గృహమువలె ఈ శరీరము ఎముకలతో నిర్మితమైయున్నది. చర్మముతో, రోమనఖములతో ఇది కప్పబడియున్నది. నశ్వరమైనది, నవద్వారములతో ఒప్పుచుండునది. మలమూత్రములతో నిండియున్నది. హేయమైన ఇట్టి శరీరమును నేను తప్ప మఱియొక ఏ స్త్రీ కోరుకొనును? సేవించును?


*8.34 (ముప్పది మూడవ శ్లోకము)*


*విదేహానాం పురే హ్యస్మిన్నహమేకైవ మూఢధీః|*


*యాన్యమిచ్ఛంత్యసత్యస్మాదాత్మదాత్కామమచ్యుతాత్॥12533॥*


జీవన్ముక్తులకు నిలయమైనది ఈ విదేహనగరము. ఈ నగరములోని వారందరిలోను నేనే పరమ మూర్ఖురాలను, దుష్టురాలను. ఏలయన, ఆత్మానందప్రదాతయు, శాశ్వతుడైన పరమాత్మను కాదని, ఇతర పురుషులను వాఛించుచున్నది నేను ఒక్కతెనే.


*8.35 (ముప్పది ఐదవ శ్లోకము)*


*సుహృత్ప్రేష్ఠతమో నాథ ఆత్మా చాఽయం శరీరిణామ్|*


*తం విక్రీయాత్మనైవాహం రమేఽనేన యథా రమా॥12534॥*


సకలప్రాణుల యందును అంతర్యామియై వెలుగొందుచుండుట వలన ఆ పరమాత్ముడు ఎల్లరకును మిగుల ప్రియతముడు *(ఆత్మాహి నిరతిశయ ప్రియః)*, హితైషి, ప్రభువు. కనుక ఆ పరమపురుషునకు నా ఆత్మను సమర్పించి (ఆత్మార్పణ గావించి) ఆ స్వామిని వశపరచుకొందును. లక్ష్మీదేవివలె ఆయనతోగూడి పరమానందమును పొందెదను.


*8.36 (ముప్పది ఆరవ శ్లోకము)*


*కియత్ప్రియం తే వ్యభజన్ కామా యే కామదా నరాః|*


*ఆద్యంతవంతో భార్యాయా దేవా వా కాలవిద్రుతాః॥12535॥*


విషయభోగములు అశాశ్వతములు. వాటిని కలిగించువారు మానవులైనను, దేవతలైనను కాలగర్భములో కలిసిపోయెడివారే. వారిని సేవించెడి భార్యలకు వారు ఏ మాత్రము సుఖములను పంచి ఇయ్యగలిగిరి? వాస్తవముగా ఎవ్వరునూ సుఖభోగముల వలన తృప్తిని పొందజాలరు.


*8.37 (ముప్పది ఏడవ శ్లోకము)*


*నూనం మే భగవాన్ ప్రీతో విష్ణుః కేనాపి కర్మణా|*


*నిర్వేదోఽయం దురాశాయా యన్మే జాతః సుఖావహః॥12536॥*


పూర్వజన్మలో నేను తప్పక ఏదో ఒక సుకృతమును చేసికొనియే యుండవచ్చును. అందువలననే సర్వేశ్వరుడైన శ్రీమహావిష్ణువు నాయెడ ప్రసన్నుడైనాడు. నా దురాశా ఫలితముగనే ఈ వైరాగ్యము కలిగినను ఇది వాస్తవముగా నాకు సుఖావహమే ఐనది.


*8.38 (ముప్పది ఎనిమిదవ శ్లొకము)*


*మైవం స్యుర్మందభాగ్యాయాః క్లేశా నిర్వేదహేతవః|*


*యేనానుబంధం నిర్హృత్య పురుషః శమమృచ్ఛతి॥12537॥*


నిజముగా నేను దురదృష్టవంతురాలనే ఐనచో నా ఈ క్లేశములవలన వైరాగ్యము కలిగియుండెడిదికాదు. నేను అదృష్టవంతురాలను కావుననే నాకు ఈ వైరాగ్యము కలిగినది. వైరాగ్యము కలుగుటవలననే మానవుడు సంసారబంధములను ఛేదించికొని, పరమశాంతిని పొందగలడు.


(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి ఏకాదశ స్కంధములోని ఎనిమిదవ అధ్యాయము ఇంకను కొనసాగును)


🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుi🙏🙏


*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319, 9505813235

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

 *శ్రీమాత్రేనమః*


*శ్రీలలితా సహస్రనామ భాష్యము*


*419వ నామ మంత్రము* 27.9.2021


*ఓం జడాత్మికాయై నమః*


నామరూపాత్మక జగత్తే తన స్వరూపమై అలరారే పరమేశ్వరికి నమస్కారము.


శ్రీలలితా సహస్ర నామావళి యందలి *జడాత్మికా* యను నాలుగక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును *ఓం జడాత్మికాయై నమః* అని ఉచ్చరించుచూ, ఆ జగన్మాతను భక్తిశ్రద్ధలతో ఆరాధించు భక్తజనులను ఆ తల్లి వారిని భౌతికముగా సిరిసంపదలతోను, శాంతిసౌఖ్యములతోను జీవనము కొనసాగింపజేయును. మరియు పరమపదసోపానములకు మార్గము సుగమము చేయును.


జగన్మాత నామరూపాత్మకమైన ఈ దృశ్యజగత్తంతయును తనస్వరూపమై, తనను ఆరాధించు భక్తజనుల మనోనేత్రములందు సుస్ఫష్టముగా గోచరించుచూ, తన మందస్మితవదనారవిందమునుండి కరుణాకటాక్షవీక్షణములను ప్రసరింపజేయును. ఈ నామరూపాత్మకమైన జగత్తునందలి వస్తుసముదాయమంతయునూ (పదార్థములన్నియునూ) తన ఆత్మగా అలరారుచూ *జడాత్మికా* యని అనబడుచున్నది. చిచ్ఛక్తిః చేతనారూపా (చైతన్యమే తన స్వరూపము) ఎలా అయినదో, జడశక్తిః జడాత్మికగా (జడశక్తియే తనస్వరూపమై) తేజరిల్లుచున్నది. నామరూపాత్మకమైన జగత్తుకు చేతనాచేతనములు (చైతన్య శక్తి, జడశక్తులు) రెండునూ అవసరమే. అప్పుడు ఆ సృష్టి పరిపూర్ణమైన సృష్టియని అనిపించుకుంటుంది. ఈ సంగతి పరమేశ్వరికి తెలియును గనుకనే ఆ తల్లి చేతనా రూపిణిగాను, జడాత్మికగాను అలరారుచున్నది. వ్యక్తము, అవ్యక్తము ఏవిధముగా తనస్వరూపములయినవో, చేతనాచేతన రూపములుకూడా తనవే అయినవి. గనుకనే ఈ నామ మంత్రములో ఆ పరమేశ్వరి *జడాత్మికా* యని అనబడుచున్నది. అమ్మ సచ్చిదానంద స్వరూపిణి. అది పరబ్రహ్మతత్త్వము. అటువంటి జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం జడాత్మికాయై నమః* అని యనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 *పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

తొలి తెలుగు పుస్తకం

 తెలుగు భాషలో ముద్రించబడిన తొలి తెలుగు పుస్తకం ?

..........................................................


(1) చార్లెస్ ఫిలిఫ్ బ్రౌన్ కాలానికంటే ముందుగా తెలుగును జెంటూ (Gentoo) అని పిలిచేవారు. మనదేశానికి వర్తకానికై వచ్చిన పోర్చుగీసువారు మొదటగా భారతీయులను జెంటియోలని సంబోధించేవారు. అప్పట్లో తెలుగువారి ప్రాముఖ్యత ప్రముఖంగా వుండటంవలన తెలుగువారిని జెంటియోలని పిలిచేవారు. వారు తరువాతి క్రమంలో తెలుగుభాషను జెంటూ అని పిలిచారు. ఆ తరువాత వచ్చిన ఆంగ్లేయులు కూడా తెలుగుభాషను జెంటు అనియే పిలిచారు.


(2) తెలుగువారు పోర్చుగీసు వారిని బుడతకీచులని

డచ్చి (హాలెండ్) దేశస్తులను ఒలందులని

ఫ్రెంచివారిని ఫరాసు, ఫరంగీవారని

ఆంగ్లేయులను యింగిలీసు వారని పిలిచేవారు.

పోర్చుగీసువారు భారతీయ ముస్లీంలను మౌరోలని పిలిచేవారు. క్రమంగా మౌరోపదం మూరుగా మార్పుచెందింది. తదుపరి భారతీయ సాహిత్యంలో వీరిని మూరులుగానే పెర్కొనడం జరిగింది.


(3) ప్రస్తుతం మనకు స్వంతమైన బత్తాయి పండుమనదికాదు. ఐరోపాలోని బటేవియా ప్రాంతానికి చెందింది. డచ్చివారు దీనితోపాటుగా పంపరపనసను ఆంధ్రదేశానికి పరిచయం చేశారు.


(4) ప్రళయకావేరికే పులికాట్ అని పేరు. ప్రాచీనకాలంలో నేటి గుజరాతు ప్రాంతాన్ని గూర్జర/ గుజ్జరగా పిలిచేవారు.


(5) తెలుగులో ముద్రించబడిన మొదటిపుస్తకమేదంటే నూరు జ్ఞాన వచనాలు.షుల్జ్ 1746 లో ఐరోపాలో అచ్చువత్తించాడు.


॥సేకరణ॥

................................................................జిబి.విశ్వనాథ.9441245857. అనంతపురం.

make India a better Country .Narendra Modi's sole aim

 👉 *Breaking News* 👇👌😄 *Check New York Times  view about PM Modi :*


Joseph Hope, Editor-in-Chief of the New York Times:


Narendra Modi's sole aim is to make India a better Country. If he is not stopped, in the future, India will become the most Powerful Nation in the World.. It will surprise even  the USA, the United Kingdom, and Russia..Japan.


Narendra Modi is moving towards a specific goal. No one knows what he wants to do....and his intentions, strategy, cannot be predicted.


Behind the Smiling face, he is a dangerous Patriot. He uses all the Countries of the world for the benefit of his Nation......India.


First he destroyed US ties with Pakistan and Afghanistan.


Next Narendra Modi has created an alliance with Vietnam, shattered China’s Superpower dream and made use of the three Countries.


The long-running dispute over oil extraction overseas between Vietnam and China has benefited India. With India's support, Vietnam began producing Oil in China's Southern Seas.


Vietnam now supplies all of its Oil to India. The United States has different support for this. He made Pakistan a poor Country without going into a war.


He brought the Port of Iran under his control.


He has set up an Indian Military base on the border with Afghanistan, very close to the area that divides Pakistan.


In order to increase Indian trade, he has also built a route through Iran (leaving Pakistan) to Afghanistan.


Narendra Modi’s desires are going Up one by one. Sections 370 and 35A have been repealed.


One day he will completely capture Pakistan occupied Kashmir. Pakistan will fall into 4 pieces in the coming seasons. This will happen on the warning of Narendra Modi.


Saudi Arabia, Pakistan's traditional ally, will also play a Key role in the Partition of Pakistan..


In Asia, this man who finished China and the United States, has  canceled the SAARC Summit and shown his power to the World.. Narendra Modi has succeeded in maintaining India's superiority over Asia..


He made UAE fine the Foreign minister of Pakistan on landing in UAE & sent the minister back. Malaysia took over a Pakistan airplane to recover debts owed by Pakistan.


Russia and Japan, 2 of Asia's Major Powers, have done nothing to say.


He held both Countries in his hands with great precision. In the case of China's Vietnam Oil issue, China will ask for Oil... Then he will ask Pakistan Occupied Kashmir. 🤟


What he would ask was, "I'll take it.. You have Hair in your Mouth," and tease China's Vietnam issue..


Nothing can be done by China. This person is taking Indian Politics to a totally different level.


Many Countries think and act as if each Country has many Enemies.. But India has no Enemies other than Pakistan. India is almost certain to be a friend to all Countries of the World.


This man is doing more harm to Pakistan than the real War.. By using Muslim Countries against Pakistan, Narendra Modi has proven himself to be one of the Best leaders in the World.


Even if Pakistan goes for War with India, there will not be so much loss.. But now Pakistan is suffering more than that.


In all negotiations with all Countries, this person's Honesty must be taken into account.


India's progress will be difficult for the rest of the World.


With the current astounding growth of India, all the Countries in the United Nations will experience the consequences..! 


✨✨✨✨✨✨✨✨



*Great article, tells you what NO media in India will speak about the achievement of Modi and his foriegn policy.*

అంతా మన భ్రమ!

 🌹🌹🌹🌹🌷🌷🌹🌹🌹🌹

అంతా మన భ్రమ!


💁🏻‍♂️ *కర్మ_కర్మణా_నశ్యతి*🙏


గంగా హారతి రోజున *గంగ* లో స్నానమాచరిస్తున్న లక్షలాది మందిని చూసిన ఒక *ఋషి* కి ఒక సందేహం వచ్చింది!

*వెంటనే గంగానదినే అడిగాడట!*


*"అమ్మా! ఎందరో ఎన్నో పాపాలు చేసి నదిలో మునకలేస్తున్నారు. వారి వారి పాపం వదిలేస్తున్నారు. మరి ఇందరి, ఇంత పాప భారం ఎలా మోస్తున్నావు? తల్లీ!* అని. 


అందుకా తల్లి *"నాయనా నేనెక్కడ ఆ పాపభారం మోస్తున్నాను? అవి అన్నీ తీసుకెళ్ళి ఎప్పటికప్పుడు సముద్రంలో కలిపేస్తున్నాను"* 

అని బదులిచ్చిందట. 


*అయ్యో అన్ని పుణ్య నదులు ఇంతేకదా! పాపా లన్నీ సముద్రంలోనే కలిపేస్తే ఆ సముద్రుడు ఎలా భరిస్తున్నాడో?*

అనుకొని!


సముద్రాన్నే అడిగాడు!

*ఎలా మోస్తున్నావు? ఈ పాపభారాన్ని!?!* అని!


దానికా సముద్రుడు 


*నేనెక్కడ భరిస్తున్నాను?! ఆ పాపాలను వెంట వెంటనే ఆవిరిగా మార్చి, పైకి మేఘాల లోనికి పంపిస్తున్నాను'* 

అని బదులిచ్చాడట. 


అరే!!! *ఎంతో తేలికగా కదిలి పోయే మేఘాలకు ఎంత కష్టం వచ్చింది!* 

అని అనుకుంటూ! 

*ఓ మేఘ మాలికల్లారా ఎలా భరిస్తున్నారు? ఈ పాప భారాన్ని!*  

అని అడగగా!!!


అవి పకపకా నవ్వి!  

*'మేమెక్కడ భరిస్తున్నాం? ఎప్పటి కప్పుడే మీ మీదే కురిపించేస్తున్నాం వర్ష రూపేణా'!*

అని బదులివ్వగా...


ఓహో!!! 

*ఆ పాపాలన్నీ మన మీద పడి మనమే అనుభవిస్తున్నా మన్నమాట!*


అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా! ఎవరూ కూడా! *కర్మ ఫలితాలు వదిలించు కోలేమని!!!!* గ్రహించాడు అక్కడ స్నాన మాచరిస్తున్న ఋషి!

                 

*ఇదం తీర్ధమిదం తీర్ధం భ్రమన్తి తామసా జనాః*

*ఆత్మతీర్ధం నజానన్తి కధం మోక్షః శృణు ప్రియే*


*పరమశివుడు పార్వతీ దేవికి ఉపదేశించిన శ్లోకమిది!.*


*ఈ తీర్ధంలో స్నానమాచరించిన పుణ్యం కలుగును! ఆ తీర్ధంలో స్నానమాచరించిన మోక్షం కలుగును! అని... తీర్ధ స్నానమునకై పరుగు లెత్తెడు మానవులు "భ్రమకు లోబడిన వారు"!*


*ఆత్మ జ్ఞాన తీర్ధంలో స్నాన మాచరించని వారికి మోక్ష మెటుల కలుగును?!?*

అని ఈ శ్లోకం అర్థం.


*కర్మ కర్మణా నశ్యతి కర్మ!*

అంటే *కర్మ అనేది కర్మతోనే నశిస్తుంది*

🙏

పెళ్లి విందు తయారీ :

 🛎 పెళ్లి విందు తయారీ : 


👉స్వామివారి కల్యాణం చదివితే కలియుగంలో మధ్యతరగతి కుటుంబాలలో కల్యాణం చెయ్యడమెంత కష్టమో తెలుస్తుంది . 

 

👉 కుబేరుడు నుండి అప్పు దొరికి, అన్నీ పెళ్లి సరుకులు తెచ్చాక ఇవన్నీ తెచ్చుకోవడం ఒక ఎత్తు , వచ్చేవాడు మనఇంటికి భోజనానికి లేక వస్తాడా ? ఇప్పటి కిప్పుడు ముహూర్తం పెట్టుకుంటే వంట బ్రాహ్మణుడు ఎక్కడ దొరుకుతాడు ? అనుకున్నారు . 

స్వామి అగ్నిహోత్రుని వంక చూస్తే “ నేను చేస్తాను స్వామి ! ” అన్నాడు . కానీ వంటపాత్ర సామానులేవి ? అన్నాడు అగ్నిదేవుడు. 


👉 అగ్నిదేవుడు, వంట చేయడానికి పాత్రలు కావాలనడంతో వేంకటాచలం మీదనున్న తీర్ధాలలో వంట వండండి అంటాడు శ్రీనివాసుడు.


👉నిజమే జనాన్ని బట్టి పాత్రలు వాడతాం. వందల్లో వస్తే పెద్దపెద్ద పాత్రలు వాడవలసి వస్తుంది. కానీ ఈయన పెళ్ళికి సమస్త బ్రహ్మాండం అంతా దిగివస్తుంది. కొన్ని కోట్ల మంది వస్తారు. అంతమందికి వండడానికి పాత్రలు ఏం సరిపోతాయి. పైగా సృష్టిలో ఉన్న సమస్త పుణ్యతీర్ధాలు తిరుమలలో కొలువై ఉన్నాయి.


👉అగ్నిహోత్రుడు పాపనాశనంలో పైన చింతపండు పిసికి పోసేయండి . కింద నేను పులుసు చేసేస్తాను అన్నాడు . 


👉ఒక్కో తీర్ధంలో / సరోవరంలో ఒక్కో వంటకం వండుతారు. 


👉స్వామి పుష్కరిణిలో @ అన్నం, 

👉పాపనాశనంలో @ పప్పు, 

👉ఆకాశగంగలో @ బెల్లం పరమాన్నం,

👉 దేవతీర్థంలో @ కూరలు,

👉తుబురతీర్ధంలో @ పులిహోర, 

👉కుమార తీర్ధంలో @ భక్ష్యాలు (బూరెలు, పూర్ణాలు, బొబ్బట్లు వంటివి), 

👉పాండుతీర్ధంలో @ పులుసు, 

👉ఇతర తీర్ధాల్లో @ లేహ్యాలు మొదలైని తయారు చేయమని స్వయంగా శ్రీనివాసుడే అగ్నిదేవుడిని ఆజ్ఞాపిస్తాడు. 


👉అలన్నిటిలోనూ పప్పులు , పులుసులు , చక్కెర పొంగళ్లు , కట్టు పొంగళ్లు , జీలకర్ర పొంగళ్లు , ఎన్నో రకాల పొంగళ్ళు , పులిహోర పొంగళ్ళు చేసారు .

వడ్డన చేయాలి కూర్చోమని అన్నారు .  


👉భోజనాల బంతులు వేంకటాచలం నుండి శ్రీశైలంవరకు వేశారు .


👉భోజనాలు సిద్ధం అయిన తరువాత నివేదనకు ఏర్పాట్లు చేస్తాడు బ్రహ్మదేవుడు.


👉"నైవేద్యం పెట్టిన తరువాతే అతిథులందరీకి వడ్డన.

 "నా ఇంట్లో శుభకార్యానికి వచ్చిన అతిధులకు భోజనం పెట్టకుండా నేను భోజనం చేయడం తగదు, అది సంప్రదాయం కాదు" అంటాడు స్వామి. 

మన ఇంట్లో శుభకార్యం జరిగినప్పుడు అందరూ భోజనం చేశాక మనం భోజనం చేయడం విధి. మనకు అది ఎప్పుడు గుర్తుండడం కోసం స్వామి పలికిన మాటలవి. 

మరి నివేదన చేయని పదార్ధాలను అతిధులెవ్వరూ ముట్టుకోరు, మరి నివేదన ఎవరికి చేయాలి? అంటాడు బ్రహ్మ.   

 

👉ఇదే కొండ (శేషాచలం) మీద, అహోబలంలో (ఈనాడు అహోబిలం) నరసింహస్వామికి నివేదన చేసి అందరీకి నైవేద్యం వడ్డించండి అంటాడు శ్రీనివాసుడు. 

సాక్షాత్తు బ్రహ్మ అహోబల నరసింహస్వామికి నివేదన చేస్తారు.


👉 (తిరుమల కొండ శేషాచలం పర్వతం మీద ఉంది. శేషాచలం అంటే సాక్షాత్తు ఆదిశేషుడు. వీటిని ఆకాశం నుంచి చూసిన పాము ఆకారంలో ఈ కొండలు దట్టమైన అడవులతో కనిప్సితాయి. శేషాచలం కొండలు చిత్తూరు జిల్లా నుంచి కర్నూలు జిల్లావరకు వ్యాపించి ఉన్నాయి. 


👉ఆదిశేషుడి తలపై శ్రీనివాసుడి,

నడుమ భాగాన అహోబిల నృసింహుడు, తోక భాగాన శ్రీశైలంలో మల్లిఖార్జునుడు భ్రమరాంభ సమేతంగా వెలసి ఉన్నారు. 


👉చక్కగా శివుడు అతిధులందరినీ కూర్చోబెట్టే బాధ్యత శివుడు తీసుకున్నాడు. పాండు తీర్ధం (గోగర్భం డ్యాము నుంచి దక్షిణగా కొద్ది రూరంలో ఉంది. ఇప్పటికి చూడవచ్చు) నుంచి శ్రీశైలం వరకు విస్తళ్ళను (ఆకులను) ఆశీసులు చేశాక అందరికి ఒకేసారి వడ్డించారు.


🛎 భోజనాలు వడ్డన :


 👉ముందు విస్తళ్ళపై నీరు చల్లి, తుడిచి, పాత్రశుద్ధికి కొంత నెయ్యి వడ్డించి, సంస్కారపూర్వకంగా ఉప్పు, శాస్త్రం ప్రకారం ఇతర పదార్ధాలు వడ్డించారు.

 వడ్డన పూర్తి అయ్యాక అగ్నిదేవుడు వడ్డన పూర్తయ్యిందన్న విషయం శ్రీనివాసుడికి చెప్పగా, అందరిని ఉన్నంతలో ఏర్పాట్లు చేసాను, లోటుపాట్లు ఉంటే మన్నించి అందరూ భోజనాలు చేయండి అని వేడుకున్నాడు.


 👉అందరి భోజనాలు ముగిశాకా, అందరికి దక్షిణతామ్మూలాలు శ్రీనివాసుడు ఇచ్చాడని పురాణ వచనం.


👉అందరూ భోజనాలు చేసి , బ్రేవుమని త్రేన్చి కూర్చున్నారు . అందరినీ భోజనమైందా అని పేరు పేరునా అడిగిన తరువాత శ్రీనివాసుడు,వకులమాత, మన్మథుడు, లక్ష్మీదేవి, శివుడు, బ్రహ్మ, గరుత్మంతుడు, ఆదిశేషుడు కలిసి భోజనం చేశారు. వీరి భొజనాలు మిగిసేసరికి సూర్యాస్తమయం అయిందని పురాణంలో కనిపిస్తుంది.


👉అందరి భోజనాలు పూర్తయ్యాక, రాత్రికి అక్కడే గడిపేసి,తెల్లవారుఝామునే మంగళవాయిద్యాల నడుమ మగ పెళ్ళివారి బృందం ఆకాశరాజు ఇంటికి నారాయణవనం బయలుదేరింది. ...!


సేకరణ 

🙏🙏🙏గోవిందా గోవిందా 🙏🙏🙏

*ప్రసాద సుధాకరం

 *ప్రసాద సుధాకరం..*


దాదాపు పన్నెండు పదమూడు సంవత్సరాల క్రిందట... అప్పుడప్పుడే..మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరంలో ఒక్కొక్క వ్యవస్థా రూపుదిద్దుకుంటోంది..


ఆదివారం నాడు, శ్రీ స్వామి వారికి ప్రభాత పూజ, హారతి అయిన తరువాత, భక్తులకు ప్రసాద వితరణ చేస్తే బాగుంటుంది అనే ఆలోచన తో ఉన్నాము..ప్రసాదంగా చేయించిన పదార్ధాన్ని, అందరికీ అందే విధంగా పంచే వ్యక్తి ఎవరు? ఇదొక ప్రశ్న మా ముందు నిలిచింది..ఎందుకంటే, ఆనాటికి ఆలయ సిబ్బంది గా ఉన్నది ముగ్గురే..టిక్కెట్లు, క్యూ లైన్, ఆలయ పరిశుభ్రత, అన్నీ వాళ్లే చూసుకోవాలి..


అప్పుడు వచ్చాడు సుధాకర్!..18, 19 ఏళ్ల వయసు, చిరునవ్వు..ప్రతి శుక్రవారం, సాయంత్రానికి మొగలిచెర్ల వచ్చి..రాత్రికి మాలకొండ చేరి, శనివారం ఉదయం నుంచీ, సాయంత్రం దాకా ఆ మాలకొండ లో వెలసిన శ్రీ లక్ష్మీ నృసింహుడి సన్నిధిలో ప్రసాద వితరణ లో,అన్నదాన సత్రంలో స్వచ్ఛందంగా సేవ చేసి, తిరిగి రాత్రికి మొగలిచెర్ల చేరుతున్నాడు.. 


అతనిని గమనించిన నాకు ఆదివారం పూట ప్రసాదం వితరణకు మాకు పరిష్కారం దొరికింది అని అనిపించింది...ఆమాటే అడిగాను..సంతోషంగా ఒప్పుకున్నాడు..సహజంగా ఆదివారం ఉదయం పూట భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది..ఎవ్వరినీ విసుక్కోకుండా ప్రసాద వితరణ చేయాలి..ఈ సుధాకర్ లో ఉన్న సుగుణం ఏమిటంటే..ఎంత మంది వచ్చినా , ముఖంలో అదే చిరునవ్వు!..ఎవరైనా ప్రసాదం కోసం రెండు మూడు సార్లు వచ్చినా..విసుక్కోకుండా పెడతాడు..మా సిబ్బంది లో ఎవరైనా.."అలా పెడితే, ప్రసాదం అయిపోయి చివరలో కొంతమందికి అందదు కదా? " అంటే.."పోనీలే, ఆకలితో ఉన్నట్టున్నాడు!" అంటూ నవ్వేస్తాడు..భక్తులకు పెట్టె ప్రసాదాన్ని తానే దగ్గరుండి ఆలయం లోకి తెప్పించుకుంటాడు..అర్చక స్వామి ఆ ప్రసాదాన్ని శ్రీ స్వామివారికి నివేదన చేసిన తరువాత..ముందుగా అర్చకస్వాముల కొరకు భక్తి పూర్వకంగా ప్రత్యేకంగా కేటాయించి ఇస్తాడు..ఆ తరువాత భక్తులకు పంచిపెడతాడు..


ఆ దత్తుడు చూపిన మార్గం వీడు అనుకున్నాన్నేను..ఆరోజు నుంచీ నేటి వరకూ.. ఆదివారమే కాదు, వేలాదిమంది భక్తులోచ్చే మహాశివరాత్రి రోజు కానీ..స్వామి వారి ఆరాధానోత్సవాల్లో కానీ..సుధాకర్ దే ప్రసాదవితరణ బాధ్యత!..


వారంలో ఐదు రోజులు తల్లిదండ్రులతో కలిసి వ్యవసాయప్పనులు, రెండు రోజులు దైవ సేవ..ఇదీ స్థూలంగా సుధాకర్ దినచర్య..శ్రీ మాల్యాద్రి లక్ష్మీనృసింహ స్వామికి పరమ భక్తుడు..ఇప్పటికీ వివాహం చేసుకోలేదు.. పెళ్లి గురించి అడిగితే.."ఆ నరసింహ స్వామి గుడి, ఇక్కడే..ఈ దత్తాత్రేయుడి ప్రాంగణం లోనే కట్టించి, ఆ స్వామి కళ్యాణం ఆ గుడిలో చేయించి, తరువాత చేసుకుంటాను!" అంటాడీ ముప్పైఒక్క ఏళ్ల సుధాకర్!..


ప్రకాశం జిల్లా, పొన్నలూరు మండలం, విప్పగుంట లో నివాసం ఉండే ఈ సుధాకర్....తక్కువలో తక్కువ... ఓ ఐదారు కోట్ల రూపాయల ఆస్తికి ఏకైక వారసుడు!..


ఏ కార్యక్రమానికి ఎవరు సరిగ్గా సరిపోతారో..అటువంటి వ్యక్తులనే ఎంపిక చేసుకోవాలనే విషయం..మాకంటే బాగా ఆ సమాధి లో కూర్చున్న అవధూత దత్తాత్రేయుడి కే చక్కగా తెలుసు!! 


సర్వం..

శ్రీ దత్త కృప!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం.. మొగలిచెర్ల గ్రామం.. లింగసముద్రం మండలం.. ప్రకాశం జిల్లా..పిన్ : 523114..సెల్..94402 66380 & 99089 73699).

హిందూ ధర్మం వర్ధిల్లాలి.*

 🌹🌹🌹🌹🌷🌷🌹🌹🌹🌹

*చాలా మంది భక్తుల అభిప్రాయం ఇదే*

                   🌷🌷🌷

అయ్యా TTD అపహాస్య పాలక మండలి సభ్యులారా !!!


మీరు ఎవరండీ భగవంతుని సర్వ దర్శనాన్ని ఆపటానికి ??? ఎవరు ఇచ్చారు మీకు ఆ హాక్కు ??? మీరు అసలు హిందువులేనా ??? దేవుడి చుట్టూ ఒక కంచె కట్టి, ఇనుప కడ్డీలు పెట్టి దైవ దర్శనానికి డబ్బులు దండుకుంటారా ??? సర్వ దర్శనానికి ఆన్లైన్ టికెట్లు !!!! కూలి నాలి చేసుకునేవారు, కమ్మరి, కుమ్మరి, నారుమడి పనులు చేసుకునేవారు, బుట్టలు అల్లుకొని బతికేవారు ఇత్యాది నిరుపేదలు ఎక్కడనుండి ఆన్లైన్ సర్వ దర్శనం టికెట్లు కొంటారు ??? మీరు పెట్టిన సర్వ దర్శనం ఆన్లైన్ కౌంటర్లలో మీ దళారీలు ఒక్కొక్క సర్వ దర్శనం టికెట్ ఎంతకు అమ్ముకుంటున్నారో తెలుసా ???


ఐనా దేవుని దర్శనానికి డబ్బులు ఎందుకండీ ??? పర మతస్తుల చర్చీలో కానీ మస్జీద్ లో కానీ ఎప్పుడైనా చూసారా ??? మీలాంటి వారి దౌర్భాగ్యపు చర్యల వల్లే హిందూ ధర్మాన్ని ఇతర మతస్తులు హేళన చేస్తున్నారు !!! మరి డబ్బులు కడితేగాని దైవ దర్శనం చేసుకునే ఈ దరిద్రం మన హిందూ సాంప్రదాయంలోనే ఎందుకు ??? మీలాంటి పాలక వర్గాన్ని పోషించటానికా ??? మీ జీతభత్యాలు , మీ ఖర్చులు ఇవ్వటానికా ??? వేల, లక్షల కోట్ల ఆస్తి కల కలియుగ శ్రీ వేంకటేశ్వర స్వామి మిమ్మలిని డబ్బులు పెడితే కానీ భక్తులను లోనికి పంపించవద్దు అని చెప్పారా ??? ఇది సర్వ హిందూ ధర్మానికి , హిందూ సంస్కృతికి సిగ్గు చేటు. ఛీ !!! ఛీ !!! తొండమాన్ చక్రవర్తి గారు కానీ శ్రీమాన్ అన్నమయ్య గారు బతికి ఉంటే, మీ లాంటి పాలక వర్గాన్ని చూసి ఈపాటికి ఎన్ని సార్లు ఆత్మ హత్యలు చేసుకునేవారో ???


మీలాంటి వారు పాలక వర్గంలో ఉండి హిందూ ధర్మాన్ని అపహాస్యం చేస్తున్నారు. తిరుమల తిరుపతి లో కొలువై ఉన్న శ్రీ వేంకటేశ్వర స్వామి కేవలం భారత దేశంలోనే కాదు యావత్ ప్రపంచ మానవాళికి సాక్షాత్తు భువి పై వెలసి, భక్తుల కోరిన కోరికలు తీర్చే ఆపధబాంధవుడు. అంతటి మహత్తు అంతటి తేజో మూర్తి సాన్నిధ్యంలో, దైవ హితం, దైవ చింతన, హిందుత్వ భావజాలం లేని హిందూ సంస్కృతి, పద్దతి కి వ్యతిరేకులైన మీరందరు ఎలా దాపురించారండి ???


సర్వ దర్శనం వలన కరోనా ప్రబలుతుందా ??? డబ్బులు పెట్టి అదే క్యూ లో నిలుచున్నవారి వల్ల కానీ, ఆర్జిత సేవ , ఏకాంత సేవ అని వేలకు వేలు పెట్టి ఏకంగా గర్భగుడిలోకి ప్రవేశించేవారి వల్ల కరోనా రాదా ??? అంటే డబ్బులు చూపిస్తే కరోనా పోతుంది ??? డబ్బులేని నిరుపేదల వల్ల కరోనా వస్తుంది !!! ఆహా ఏమి లాజిక్కు అంది మీది ???


టీటీడీ పాలక మండలి సభ్యులారా ఇకనైనా కళ్ళు తెరవండి. కేవలం భారత దేశమే కాదు యావత్ ప్రపంచములో ఉన్న హిందువులు అందరు మీరు చేసే హిందూ సంస్కృతీ వ్యతిరేక తత్వాలను గమనిస్తున్నారు. టీటీడీ పాలక మండలి సభ్యులను హేవహించుకుంటున్నారు. సర్వ దర్శనం ప్రతీ హిందువు యొక్క ప్రాథమిక హక్కు. దీనిని ఏదో పేరు చెప్పి ఆపాలని చూడకండి. కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారి సర్వ దర్శనం వెంటనే ప్రారభించకపోతే - భారత దేశ సర్వ సంతు జనులు , సాధువులు, ప్రతీ హిందువు మీ చర్యలను వ్యతిరేకించటానికి, తిరుమలలో నిరసన కార్యక్రమాలు తెలపటానికి, మీ టీటీడీ పాలకవర్గానికి వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధంగా ఉన్నారు .


వినా వెంకటేశం ననాతో ననాతః  

సదా వెంకటేశం స్మరామి స్మరామి 


        *ధర్మో రక్షతి రక్షితః* 

 *హిందూ ధర్మం వర్ధిల్లాలి.*

నేరము - శిక్ష'

 🌹🌹🌹🌹🌷🌷🌹🌹🌹🌹

Madabhushi Sridhar

SSpds1remd · 

Shared with Public

గుంటూరు మురళీ కృష్ణ గారు గొప్ప వాస్తవాన్ని కథరూపంలో వ్రాసారు. చదివి తీరవలసిన కథ. వారికి అభినందనలు.

'నేరము - శిక్ష'

*

కోర్టులో ముద్దాయి నిలబడి ఉన్నాడు. అప్పటికే అనేక సంవత్సరాలనుండి విచారణ జరుగుతోంది. వాయిదాల మీద వాయిదాలు పడుతూ చివరకు వాదనలు ముగిసి తీర్పు చెప్పే రోజు వచ్చింది.

అప్పటికే పది మంది మారి పదకొండో పి.పి. గారు, పోలీసులు కోర్టు హాలులో కూర్చుని ఉన్నారు.

ఇంతలో జడ్జి గారు వచ్చే సూచనగా "సాయ్_లెన్స్" అని అరిచాడు కోర్టు బంట్రోతు.

అందరూ లేచి నిలబడ్డారు జడ్జి గారికి గౌరవ సూచకంగా, ముద్దాయి తప్ప. (ఎందుకంటే అతడు ఆల్రెడీ నిలబడే ఉన్నాడు కాబట్టి).

కాల్ వర్క్ అయ్యేసరికి పదకొండున్నర అయింది. బెంచి గుమాస్తా "C.C.196 of 98 .... రాములు వర్సెస్ టూ టౌన్ పోలీస్ ఫర్ జడ్జ్ మెంట్" అన్నాడు.

ముద్దాయి రాములు నిబ్బరంగా జేబులు చేతిలో పెట్టుకుని నిలబడ్డాడు.

జడ్జి గారు గొంతు సవరించుకున్నారు ....

"ప్రాసిక్యూషన్ వారి వాదనలు, ముద్దాయి తరఫున ఎవరూ లేకపోవడంతో ప్రభుత్వం వారు నియమించిన లాయరు గారి వాదనలు విన్న తరువాత ముద్దాయిని దోషిగా నిర్ణయిస్తూ రెండేళ్ళ కఠిన కారాగార శిక్ష విధించడమైనది" అన్నారు.

అప్పుడు ముద్దాయినుండి దోషి పాత్రలోకి మారిన రాములు "అయ్యా, నాదొక మనవి .... ఆలకిస్తారా?" అనడిగాడు.

"ఏంటదీ?" అని అడిగారు జడ్జి గారు.

"నేరం జరిగి 23 సంవత్సరాలు అయింది. అసలు నేను చేసిన నేరం ఏమిటో కూడా గుర్తు లేదు. బహుశా రాంగ్ రూట్ లో వస్తున్న ఒక మోటార్ సైకిల్ని గుద్దిన సంఘటనే అయుంటుంది" అని ఆగాడు రాములు.

"ఔను, అదే .... అతను చనిపోయాడు. అందుకే రెండేళ్ళ కఠిన కారాగార శిక్ష విధిస్తున్నాను. ఫైను వెయ్యలేదు, సంతోషించు" అన్నారు జడ్జి గారు.

"తమరు మహానుభావులండయ్యా, నా మీద దయ చూపించారు. అలాగే మరికొంత దయ చూపిస్తే .... " అంటూ నసిగాడు రాములు.

"ఏఁవిటదీ?" అన్నారు జడ్జి గారు కుతూహలంగా.

"నేను ఆ రోజునుండి ఈ రోజు వరకు జైల్లోనే ఉన్నాను. అంటే 1998 నుండి నేటివరకు అంటే 23 సంవత్సరాలు జైలులోనే ఉన్నాను. మీరు వేసింది రెండేళ్ళ జైలు శిక్ష .... " అంటూ ఆగాడు రాములు.

"నువ్వు ఇప్పటికే శిక్ష అనుభవించావు కాబట్టి ఈ రెండేళ్ళ శిక్ష కూడా పూర్తయినట్లే. నీవు విడుదల అవడానికి కావలసిన ఉత్తర్వులు జారీ చేస్తాను" అన్నారు జడ్జి గారు.

"సంతోషం బాబు గారు, కానీ నన్ను అనవసరంగా 21 సంవత్సరాలు జైల్లో ఉంచేసారు .... "

"నీ తరఫున బెయిల్ ఇప్పించడానికి ఎవరూ ముందుకు రాలేదు. అందుకే అలా ఉండిపోయావు" అన్నారు జడ్జి గారు.

"ఔనయ్యా, నాకు బెయిలు ఇప్పించడానికి సూరిటీలు అడిగారు. ఒక్కొక్కరు యాభైవేలు పూచీకత్తు కట్టాలన్నారు. అంత సొమ్ము ఉన్నవాళ్ళెవరు నాకు తెలియదు. అందుకే బెయిలు రాలేదు" అన్నాడు రాములు.

"దానికి కోర్టు ఏం చేస్తుంది?" అన్నారు జడ్జి గారు.

"నిజమేనయ్యా, అది కోర్టు తప్పు అని నేను అనడం లేదు. నా బీదరికమే కారణం. కానీ అయ్యా, ఒక్క మాట. రాంగ్ రూట్ లో ఒక వ్యక్తి అనుకోకుండా వస్తే లోడు లారీ ఆపడం ఎవరి వల్లా కాదు. అందుకే లారీ ఆపలేకపోయాను. ఒక వేళ సడన్ బ్రేక్ వేస్తే లోడు లారీ తల్లకిందులై నేను చనిపోయేవాడిని. అందుకే బ్రేకు వెయ్యలేదు .... "

"కానీ నీ వల్ల ఒక నిండు ప్రాణం పోయింది. ఒక కుటుంబం వీధిన పడింది" అన్నారు జడ్జి గారు.

"నిజమేనయ్యా, ఒక నిండు ప్రాణం కాపాడటానికి, ఒక కుటుంబం వీధిన పడకుండా ఉండటం కోసమే నేను బ్రేకులు వెయ్యలేదు. నేనే కనుక సడన్ బ్రేక్ వేసుంటే లోడు లారీ తల్లకిందులై నేను చనిపోయేవాడిని. నేను పోతే నా కుటుంబం వీధిన పడేది. ఆ చనిపోయిన కుఱ్ఱాడికి ఇన్సూరెన్సు డబ్బులు వచ్చాయి. కుటుంబం వీధిన పడలేదు. కానీ ఇరవై మూడేళ్ళుగా లాయరుని పెట్టుకునే స్థోమతు లేక, ప్రభుత్వం నియమించిన లాయరు సరిగ్గా పట్టించుకోక, ఉన్న ఒకే ఒక ఆధారం అయిన లారీని కోర్టు కస్టడీలో ఉండిపోయింది. అప్పటినుండి అది కోర్టు ఆవరణలో వానకు తడుస్తూ, ఎండకు ఎండుతూ, స్పేరు పార్టులు, సీట్లు, స్టీరింగుతో సహా మాయమైనాయి. చేసిన నేరానికి రెండేళ్ళ శిక్ష వేసారు. కానీ రాంగ్ రూట్ లో వచ్చి ప్రమాదానికి కారణమైన వ్యక్తికి ఇన్సూరెన్సు వచ్చింది. ఏ తప్పు లేని నాకు రెండేళ్ళ శిక్ష కోసం ఇరవై మూడేళ్ళు జైల్లోనే ఉన్నాను. ఇప్పుడు బైటకు వెళ్తే నా కుటుంబానికి తిండి దొరికేదెలా? లారీ కోర్టు కస్టడీలోనే ఉన్నది ఇంత కాలం. మరి దాని బాగోగులు చూసుకోవలసిన బాధ్యత కోర్టు వారికి లేదా? నేరం చేసింది నేను, నా లారీ కాదు కదా? మరి దాన్నెందుకు పాడు పెట్టారు అయ్యగారు? కనుక జడ్జి గారిని నేను కోరుకునేదేమిటంటే ఇరవై మూడేళ్ళలోనుండి శిక్షా కాలం అయిన రెండేళ్ళు మినహాయించి మిగతా ఇరవై ఒక్క సంవత్సరాలకు నేను జైలుకి వెళ్ళకుంటే ఎంత సంపాదించేవాడినో అంత నష్ట పరిహారం, ఒక కొత్త లారీ ఇప్పిస్తే ఇరువైపులా న్యాయం జరిగినట్లు ఉంటుంది" అంటూ చేతులు జోడించాడు రాములు.

ఒక్క నిముషం కోర్టు హాలు అంతా మౌనంగా ఉండిపోయింది.

ఆ తరువాత కూడా కోర్టు మౌనంగానే ఉండిపోయింది ....

(ఎందరో అండర్ ట్రయల్స్ విచారణకు నోచుకోక శిక్షా కాలంకంటే రెండు రెట్లు, మూడు రెట్ల కాలం జైల్లో పడి ఉంటూ వాళ్ళ కుటుంబాల సంగతి గాలికి వదిలేసిన న్యాయ వ్యవస్థ, ప్రభుత్వం దీనికి సమాధానం చెప్పదు).

రచన : అధరాపురపు మురళీ కృష్ణ, గుంటూరు

తేది : 25-09-2021