ప్రపంచ కవులకు స్వగతం. మీ కవితలను ఇక్కడ పబ్లిష్ చేయవచ్చు. మీరు ముందుగా follow by Email బాక్సులో మీ మెయిల్ అడ్రసుని నింపి submit చేయండి. తరువాత followers ని click చేసి follower అవ్వండి. తరువాత మీ రచనను కొత్త కవులు పేజీలో అక్కడ సూచించిన విధంగా పంపండి. .
10, సెప్టెంబర్ 2023, ఆదివారం
గర్భగుడిలోకి ఎందుకు వెళ్లకూడదు?
ॐశ్రీవేంకటేశాయ నమః*
💝*ఆలయాలలో గర్భగుడిలోకి ఎందుకు వెళ్లకూడదు?*
💖*కొన్ని ఆలయాల గర్భగుళ్లల్లోకి కొందరిని అనుమతిస్తున్నారు. ముఖ్యంగా జ్యోతిర్లింగాలను అందరూ స్పర్శించవచ్చునని కొందరంటారు.*
💓*కానీ కొన్ని ఆలయాలలో గర్భగుడిలోనికి వెళ్ళక పోవడం నియమం. అది శాస్త్రాలు ఏర్పరచింది. ఏ వర్ణంవారు కూడా గర్భగుడిలోనికి రారు. దానికంటూ నియమించిన అర్చకులు తప్ప.*
❤️ *దీని వెనుక భౌతిక, ధార్మిక కారణాలున్నాయి. మూర్తిని తాకాలన్నా, అర్చించాలన్నా సదాచారం, శాస్త్ర నియమాలు అవసరం. అవి అందరికీ సాధ్యం కావు. “సదాచారం లేనివారు, రజస్వలయైన వారు గుడిలోకి ప్రవేశిస్తే విగ్రహం/లింగంలోని దైవశక్తి ఇంక ఉండదు. వెంటనే ప్రోక్షణాదులు జరపాలి. లేకపోతే క్రమంగా ఆ విగ్రహాదుల్లోకి పిశాచాలు ప్రవేశిస్తాయి. ఆ గ్రామ, నగరాలలో ఉపద్రవాలు వస్తాయి. వ్యాధులతో , శోకాలతో ప్రేతాలు భయాన్ని కలిగిస్తాయి" - అని శాస్త్రం స్పష్టంగా చెప్తోంది.*
💖 *సంప్రోక్షణం ప్రకుర్వీత తద్దోషస్యోపశాంతయే దోషైరుపహతం జ్ఞాత్వా ప్రాసాద ప్రతి మాదికం|| (ఈశ్వర సంహిత)*
💖*విలంబనే తు నిష్కృత్యా వినశ్యేద్దేవ సన్నిధిః| తత్స్థాః ప్రేతా భయం కుర్యుః వ్యాధి శోకాదిభిర్నృణామ్|| (విష్ణు సంహిత)*
*ॐశ్రీవేంకటేశాయ నమః*
💞*ఆలయంలోని విగ్రహంలో దేవుడున్నాడని విశ్వసిస్తే, వీటినీ విశ్వసించాలి. విగ్రహాన్ని దేవతా శక్తిగా మార్చడం ఒక మహా ప్రక్రియ. ప్రతిమాశోధన - అనేది మంత్ర, యజ్ఞాదులతో చేసి, యంత్రాది, ప్రతిష్టాది విధానాలతో ఆ బింబంలో కళాన్యాసం చేసి దేవతని ప్రతిష్ఠిస్తారు. వాటిని స్పర్శించాలన్నా, అర్చించాలన్నా ఆయా నియమాలను అనుష్టించే వారికే అర్హత ఉంటుంది.*
💖*నిజానికి దేవాలయంలోని మూర్తిని తాకవలసిన అవసరమేముంది? నమస్కరిస్తేచాలు. ఆ మూర్తినుండి శక్తి తరంగాలు ప్రసరిస్తాయి.*
💓*ధ్యానిస్తే చాలు. తరించిపోతాం. అందుకే గర్భగుడి, అంతరాలయం, ముఖమండపం-వంటివి అందరూ దర్శించి అనుగ్రహం పొందడానికై ఏర్పాటు చేశారు.*
💓*యుగాలనుండి అందరూ ఆలయానికి వెళ్ళి స్వామిదయను పొందుతున్నారు. భౌతికంగా ఆలోచించినా…గర్భాలయంలోకి జనం ఎక్కు వైనా, అందరూ తాకుతున్నా ప్రశాంతత దెబ్బతినడం, విగ్రహ శిల అరిగిపోవడం వంటివి జరుగుతాయి. కొద్దిమంది నియమితంగా సేవిస్తేనే పదిలంగా ఉంటాయి.*
💞*స్థూలంగా ఆలోచిస్తే అసమంజసంగా అనిపించేవి, సూక్ష్మంగా గమనిస్తే సముచితంగా అనిపిస్తాయి. ఆ సూక్ష్మదృష్టి, తెలివిలేని మూర్ఖులు మన మతాన్ని విపరీత దృష్టితో చూస్తున్నారు. వైద్యచికిత్సా కేంద్రాలలో శస్త్రచికిత్సవంటివి జరిగేచోట వైద్యుడు, రోగి తప్ప ఎవరూ ఉండరు. ఎందుకు? అది ఒక సూక్ష్మ విజ్ఞానం.*
💓*అలాగే దేవతా వ్యవస్థది మరొక సూక్ష్మవిజ్ఞానమే. నమ్మితే ఈ విజ్ఞానాన్నీ నమ్మాలి. సర్వవ్యాపకుడైన పరమేశ్వరునికి ఏ పరిమితులు, నియమాలు ఉండవు. ఎవరైనా, ఎక్కడైనా, ఎలాగైనా స్మరించి, ధ్యానించి, కీర్తించి ధన్యులు కావచ్చు.కానీ ఒక విగ్రహంగా దివ్యశక్తిని కేంద్రీకరించినప్పుడు మాత్రం నియమాలు వర్తించడం తప్పనిసరి అని గ్రహించాలి.
Forwarded message
కెర్లెపల్లి బాలసుబ్రమణ్యం
సంఘమే చెడి పోతుంది
*1899*
*కం*
సజ్జ నులను వేధించగ
సజ్జ నుల కన్న మిన్న సంఘమ్ము చెడున్.
ఎజ్జగములనైన నెపుడు
సజ్జన సౌఖ్యమ్మె శాంతి సారణి సుజనా.
*భావం*:-- ఓ సుజనా! మంచి వారి ని బాధపెడితే వారి కన్నా వారున్న సంఘమే చెడి పోతుంది. ఏ జగములో నైనా ఎల్లప్పుడూ మంచి వారి సౌఖ్యమే శాంతి మార్గము.
*సందేశం*:-- మంచి వారి ని వేధిస్తే సంఘం చెడి పోతుంది.
*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*
శ్రీ హనుమాన్ చాలీసా
ప్రతి ఒక్కరికి రావాల్సిన ప్రతి ఇంట్లో ఉండాల్సిన రెండు స్తోత్రాలు.. శ్రీ హనుమాన్ చాలీసా
శ్రీ గురు చరణ సరోజ రజ నిజమన ముకుర సుధారి | వరణా రఘువర విమలయశ జో దాయక ఫలచారి । బుద్ధిహీన తనుజానికై సుమిరౌ పవన కుమార | బల బుద్ధి విద్యా దేహు మోహి హరహు కలేశ వికార ||
జయ హనుమాన జ్ఞాన గుణ సాగర | రామదూత అతులిత బలధామా
మహావీర విక్రమ బజరంగీ
కంచన వరణ విరాజ సువేశా హాథవజ్ర ఔ ధ్వజా విరాజై
శంకర సువన కేసరీ నందన విద్యావాన గుణీ అతి చాతుర
ప్రభు చరిత్ర సునివే కో రసియా సూక్ష్మ రూపధరి సియహి దిఖావా
భీమ రూపధరి అసుర సంహారే లాయ సంజీవన లఖన జియాయే !
రఘుపతి కీన్హీ బహుత బడాయీ T సహస్ర వదన తుమ్హరో యశగావై |
సనకాదిక బ్రహ్మాది మునీశా యమ కుబేర దిగపాల జహాం తే
తుమ ఉపకార సుగ్రీవహి కీన్హా తుమ్హరో మంత్ర విభీషణ మానా
యుగ సహస్ర యోజన పర భానూ |
ప్రభు ముద్రికా మేలి ముఖ మాహీ | దుర్గమ కాజ జగత కే జేతే
రామ దుఆరే తుమ రఖవారే సబ సుఖ లహై తుమ్హారీ శరణా
ఆపన తేజ సమ్హారో ఆపై భూత పిశాచ నికట నహి ఆవై
నాసై రోగ హరై సబ పీరా సంకట సే హనుమాన ఛుడావై
సబ పర రామ తపస్వీ రాజా ఔర మనోరధ జో కోయి లావై
చారో యుగ ప్రతాప తుమ్హారా
సాధు సంత కే తుమ రఖవారే అష్ఠసిద్ధి నవ నిధి కే దాతా
రామ రసాయన తుమ్హారే పాసా తుమ్హరే భజన రామకో పావై
అంత కాల రఘుపతి పురజాయీ ఔర దేవతా చిత్త న ధరయీ
సంకట క(హ) టై మిటై సబ పీరా జై జై జై హనుమాన గోసాయీ
జో శత వార పాఠ కర కోయీ
జో యహ పడై హనుమాన చాలీసా | తులసీదాస సదా హరి చేరా 39.
జయ కపీశ తిహు లోక ఉజాగర || అంజని పుత్ర పవనసుత నామా ॥
కుమతి నివార సుమతి కే సంగీ ॥
కానన కుండల కుంచిత కేశా |
కాంథే మూంజ జనేవూ సాజై ||
తేజ ప్రతాప మహాజగ వందన ॥ రామ కాజ కరివే కో ఆతుర |
రామలఖన సీతా మన బసియా ॥
వికట రూపధరి లంక జలావా ॥
రామచంద్ర కే కాజ సంవారే | శ్రీ రఘువీర హరషి ఉరలాయే |
తుమ మమ ప్రియ భరత సమ భాయీ ॥
అస కహి శ్రీపతి కంఠ లగావై |॥
నారద శారద సహిత అహీశా ॥ కవి కోవిద కహి సకే కహాం తే ॥
రామ మిలాయ రాజపద దీనా ॥
లంకేశ్వర భయే సబ జగ జానా ॥
లీల్యో తాహి మధుర ఫల జానూ |
జలధి లాంఘి గయే అచరజ నాహీ ॥
సుగమ అనుగ్రహ తుమ్హరే తేతే |॥
హోత న ఆజ్ఞా బిను పైసారే ॥ తుమ రక్షక కాహూ కో డర నా |
తీనోం లోక హాంక తే కాంపై |
మహవీర జబ నామ సునావై |॥
జపత నిరంతర హనుమత వీరా |
మన క్రమ వచన ధ్యాన జో లావై ||
తినకే కాజ సకల తుమ సాజా |
తాసు అమిత జీవన ఫల పావై |
హై ప్రసిద్ధ జగత ఉజియారా ||
అసుర నికందన రామ దులారే |
అస వర దీన్హ జానకీ మాతా |
సదా రహో రఘుపతి కే దాసా ॥
జన్మ జన్మ కే దుఖ బిసరావై ||
జహాం జన్మ హరిభక్త కహాయీ ॥
హనుమత సేయి సర్వ సుఖ కరయీ ॥
జో సుమిరై హనుమత బల వీరా ॥
కృపా కరహు గురుదేవ కీ నాయీ ॥
ఛూటహి బంది మహా సుఖ హెూయీ ॥
హెూయ సిద్ధి సాఖీ గౌరీశా ||
కీజై నాథ హృదయ మహ డేరా ||
పవన తనయ సంకట హరణ మంగళ మూరతి రూప్ | రామ లఖన సీతా సహిత హృదయ బసహు సురభూప్ ॥
బసవ పురాణం - 27 వ భాగము .
🎻🌹🙏 బసవ పురాణం - 27 వ భాగము ....!!
🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿
🌸జంగమ వేషం ధరించి వచ్చాడు. సిరియాలుడు తపసిని అర్చించి తన గృహానికి రమ్మన్నాడు. నాకు నరమాంసం కావాలి అని తపసి అడిగాడు. అంతే కదా! రండి.
🌿మీకు ఎట్టి నియమాలున్నా నెరవేరుస్తాను అని సిరియాలుడు పిలిచాడు. తపసి సిరియాలుని ఇంటికి వచ్చాడు. ఈలోపల సిరియాలుడు లోపలికి వెళ్లి తన భార్యకీ సంగతి చెప్పాడు.
🌸సంగళవ్వ ఏమీ విచారపడకుండా చదువుకోవడానికి పోయిన తన కొడుకును పిలిచింది. కొడుకు వచ్చాడు. ‘ఇవ్వాళ మన ఇంట్లో పండుగ’ అని చెప్పి కొడుకుకు వధ్య శృంగారం చేసి తల్లీ దండ్రీ ఇద్దరూ కలిసి కొడుకును చంపారు.
🌿ఆ మాంసం వండి ఇతరులెరుగకుండా తపసికి పెట్టారు.
ఏమయ్యా ఇందులో తలను వండినట్లు లేదు అని అడిగాడు తపసి.వెంట్రుకలు వస్తాయని వండలేదు.
🌸ఇదుగో క్షణంలో వండి తెస్తాము అని వెళ్లి వారు తల కూడా వండి తెచ్చి వడ్డించారు. బాగుంది. ఇప్పుడు సహపంక్తి లేకుండా నేను భుజించను, రమ్మన్నాడు.
🌿సంగళవ్వ భయభ్రాంతురాలైంది.
సిరియాళుడు మాత్రం ధైర్యంగా పదమన్నాడు. అంతా భోజనానికి కూర్చున్నాడు. తపసి ‘సెట్టీ! నీ కొడుకును కూడా పిలువు, భోజనానికి!’ అన్నాడు.
🌸వాడెక్కడికో ఆడుకోవడానికి పోయి వుంటాడు’ అని మాట తప్పించాడు సిరియాళుడు. ‘అదెట్లా! నీ కొడుకు సరసన లేకుంటే నేను భుజించను పిలువు’ అన్నాడు.
🌿సంగళవ్వ ‘నాయనా! రమ్మని పిలిచింది దుఃఖంతో. వెంటనే చిన్న కూకటి జుట్టుతో చెవులకు కుండలాలతో పరుగెత్తుకుంటూ కొడుకు వచ్చాడు. శివుడు సిరియాళ దంపతులకు సాక్షాత్కరించాడు.
🌸సెట్టి కుటుంబం పార్వతీ పరమేశ్వరులకు శరణు చేసింది. శివుడు వారిని తన వెంట కైలాసానికి తీసుకొనిపోయాడు.
🌷నిమ్మవ్వ కథ
🌸(చతుర్థ- మాచయ్య బసవనికి చెప్పినది)పూర్వం నిమ్మవ్వ అనే భక్తురాలుండేది.
🌿ఆమె భక్తిని పరీక్షింపదలచి, సిరియాలునికి ‘నన్ను మించిన త్యాగిలేడు’ అనేగర్వం తగ్గించదలచీ, శివుడు సిరియాలుని వెంటబెట్టుకొని మారువేషంలో నిమ్మవ్వ ఇంటికి వచ్చాడు.
🌸నిమ్మవ్వ జంగమయ్యలకు వంట మొదలుపెట్టింది. ఇంతలో నిమ్మవ్వ కొడుకు వచ్చాడు. అతడు శివశరణుల ఇండ్లలోని గొడ్లు కాయడం కాయకంగా స్వీకరించిన వాడు.
🌿అలసిపోయి ఆకలితో వచ్చిన నిమ్మవ్వ కొడుకు బూరెలు సిద్ధం కావడం చూచి ఒక బూరెను తిన్నాడు. నిమ్మవ్వ అది చూచి కుక్కా! శివ నైవేద్యం కాకుండానే నీవు ఎంగిలి చేశావా?’
🌸కట్టెతో తల పగలగొట్టి చంపింది. మరుక్షణమే ఆ శవాన్ని ఆవతలకి లాగి గడ్డిలో దాచి ఏ మాత్రం మోహం లేకుండా వచ్చి అయ్యలను అర్చనకు పిలిచింది.
🌿చూచావా! చిరుతొండనంబీ! నిమ్మవ్వ భక్తి’ అని శివుడు చిరుతొండనికి ప్రత్యక్షంగా ఇది చూపాడు. తర్వాత ‘నిమ్మవ్వా! నీ కొడుకును కూడా భోజనానికి పిలు’ అన్నాడు శివుడు.
🌸అప్పుడు నిమ్మవ్వ ఇలా అన్నది.
ఏమయ్యా! శివుడా! నీ మాయలు నా దగ్గర సాగవు. జాగ్రత్త. చచ్చిన కొడుకు సహపంక్తికి ఎలా వస్తాడు? వాడు శివద్రోహి, చంపాను.
🌿అంతే. నాకేదో కైలాసం ఆశ జూపి సిరియాలుణ్ణి చేసినట్లు నన్ను చేద్దామనుకుంటున్నావేమో. నాకు నీ కైలాసం అక్కర్లేదు. ఏమీ అక్కర్లేదు. భోంచేయకుండా కదిలావో చూసుకో ఏం చేస్తానో’ అని బెదిరించింది.
🌸అది చూచి శివుడు సిగ్గుపడ్డాడు. శివుడు తన నిజరూపం చూపించాడు. నిమ్మవ్వ నవ్వి ‘గుండయ్య ఇంటికీ, భోగయ్య ఇంటికీ, దాసయ్య ఇంటికీ ఏ నిజ స్వరూపంతో వెళ్లావు?
🌿మానకంజారుని ఇంటికీ, చిరుతొండని ఇంటికీ నిజరూపంతో వెళ్లావా? అప్పుడు లేని చమత్కారం ఇప్పుడెందుకు చూపుతున్నావయ్యా స్వామీ!’ అన్నది.
🌸శివుడు మారు మాట్లాడలేక సిరియాలునితో సహా నిమ్మవ్వ పెట్టిన విందు ఆరగించాడు. తర్వాత నిమ్మవ్వ కొడుకును బతికించి కైలాసాన్ని ఇచ్చాడు.
🌿నిమ్మవ్వ మాత్రం ‘మోక్షంకన్నా నాకు జంగమ లింగ పూజనమే’ ఇష్టమని కైలాసాన్ని కూడా తిరస్కరించింది.
🌷నరసింగ నాయనారు కథ
🌸(శివుడు సిరియాలునికి చెప్పిన కథ)
పూర్వం నరసింగ మొన్నయనారు అనే చోళరాజు ఉండేవాడు. ఆయన పట్టమహిషి శివపూజకు పోయింది.
🌿దోవలో పూజా పుష్పాలలో ఒకదాన్ని వాసన చూచింది. పూజారి చూచాడు. పట్టమహిషి రాగానే పూజారి పిల్లవాడు ఆమె ముక్కును కోసివేశాడు.
🌸ఈ విషయం చోళరాజుకు తెలిసింది. ఆయన పరుగు పరుగున వచ్చి పూజారిని పట్టుకున్నాడు.నేనేం తప్పు చేశాను?...సశేషం...🚩🌞🙏🌹🎻
🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸
Valmiki Ramayana in Hindi
रामायण प्राचीन भारत का एक अतिलोकप्रिय महाकाव्य हैं। रामायण का मतलब है
अयोध्या के राजा दशरथ के ज्येष्ठ पुत्र राम की सम्पूर्ण जीवनगाथा। रामायण
की मूल रचना महर्षि वाल्मीकि ने संस्कृत भाषा में की थी, बाद में तुलसीदास
ने इन छन्दों की रचना हिन्दी में रामचरितमानस के रूप में की।
रामायण में मर्यादा पुरुषोत्तम भगवान श्रीराम के चारित्रिक गुणों और बुराई
पर अच्छाई की जीत की विस्तारपूर्वक चर्चा की गयी है। रामायण में लिखे गये
मानवीय मूल्यों को पढ़कर भारतवासी इसे श्रद्धा और आदर की दृष्टि से देखते
हैं। आप यहां महर्षि वाल्मीकि द्वारा रचित Valmiki Ramayan PDF को अपनी सुविधा के अनुसार संपूर्ण कांडों को एक साथ या अलग-अलग download कर सकते हैं-
108 Upanishads
List of 108 Upanishads
1. Isa*
2. Kena*
3. Katha*
4. Prasna*
5. Munda*
6. Mandukya*
7. Taittiri*
8. Aitareya*
9. Chandogya*
10. Brihadaranyaka*
11. Brahma
12. Kaivalya
13. Jabala
14. Svetasva
15. Hamsa
16. Aruni
17. Garbha
18. Narayana
19. Paramahamsa
20. Amritabindu
21. Amritanada
22. Atahrvasirah
23. Atharvasikha
24. Maitrayini
25. Kaushitakibrahmana
26. Brihajjabala
27. Nrisimhatapini
28. Kalagnirudra
29. Maitreya
30. Subala
31. Kshurika
32. Mantrika
33. Sarvasara
34. Niralamba
35. Sukarahasya
36. Vajrasuchika
37. Tejobindu
38. Nadabindu
39. Dhyanabindu
40. Brahmavidya
41. Yogatattva
42. Atmabodha
43. Naradaparivrajaka
44. Trisikhi
45. Sita
46. Yogachudamani
47. Nirvana
48. Mandalabrahmana
49. Dakshinamurti
50. Sarabha
51. Skanda
52. Tripadvibhuti-Mahanarayana
53. Advayataraka
54. Ramarahasya
55. Ramatapani
56. Vasudeva
57. Mudgala
58. Sandilya
59. Paingala
60. Bhiksu
61. Mahat
62. Sariraka
63. Yogasikha
64. Turiyatita
65. Sannyasa
66. Paramahamsaparivrajaka
67. Akshamalika
68. Avyakta
69. Ekakshara
70. Annapurna
71. Surya
72. Akshi
73. Adhyatma
74. Kundika
75. Savitri
76. Atma
77. Pasupata
78. Parabrahma
79. Avadhutaka
80. Tripuratapini
81. Devi
82. Tripura
83. Katharudra
84. Bhavana
85. Rudrahridaya
86. Yoga-kundali
87. Bhasma
88. Rudraksha
89. Ganapati
90. Darsana
91. Tarasara
92. Mahavakya
93. Panchabrahma
94. Pranagnihotra
95. Gopalatapini
96. Krishna
97. Yajnavalkya
98. Varaha
99. Satyayani
100. Hayagriva
101. Dattatreya
102. Garuda
103. Kalisamtarana
104. Jabali
105. Saubhagyalakshmi
106. Sarasvatirahasya
107. Bahvricha
108. Muktika
Telugu books free downlowed
https://templeinformationpics.blogspot.com/2020/01/25-free-download-25-telugu-e-books-pdf.html
https://templeinformationpics.blogspot.com/2020/01/25-free-download-25-telugu-e-books-pdf.html
బ్రతుకు తెరువు
బ్రతుకు తెరువు
సత్కర్మలు ప్రతి దినం
:
ಸುಭಾಷಿತ . 619 .
ಅಂಜನಸ್ಯ ಕ್ಷಯಂ ದೃಷ್ಟ್ವಾ ವಲ್ಮೀಕಸ್ಯ ಚ ಸಂಚಯಂ | ಅವಂಧ್ಯಂ ದಿವಸಂ ಕುರ್ಯಾತ್ ದಾನಾಧ್ಯಯನಕರ್ಮಸು ||
ಕಾಡಿಗೆಯು ಕರಗಿಹೋಗುವುದನ್ನೂ ಹುತ್ತ ಬೆಳೆಯುವುದನ್ನೂ ಕಂಡು ಮನುಷ್ಯನಾದವನು ದಾನ , ಅಧ್ಯಯನ ಮೊದಲಾದ ಕೆಲಸಗಳಲ್ಲಿ ದಿನವನ್ನು ಸಾರ್ಥಕವಾಗಿ ಕಳೆಯಬೇಕು .
ಸುಭಾಷಿತರತ್ನಭಂಡಾರ .
: అంజనం, మరియు పాము పుట్ట ఎలా కరిగి పోతాయో అలాగే జీవితం కూడా. అందుచేత దానం, అధ్యయనం వంటి సత్కర్మలు ప్రతి దినం తప్పక ఆచరించాలి
సనాతన ధర్మం యెుక్క గొప్పతనం.
హిందూ ధర్మం జ్ఞానం మీద ఆధారపడి నడిచింది. జన్మం మీద కాదు.
(వజ్రసూచికోపనిషత్తు ప్రకారం ..)
1. ఋష్యశృంగుడు .. జింకలు పట్టుకునే జాతులకు పుట్టినవాడు.
2. కౌశికుడు .. గడ్డి కోసుకునే జాతికి చెందినవాడు.
3. జంబూక మహర్షి .. నక్కలు పట్టుకునే జాతివారు ..
4. వాల్మీకి .. ఓ కిరాతకుల జాతికి చెందిన వాడు. ఈతను రచించిన రామాయణం .. హిందువులకు పరమ పవిత్రమైన గ్రంథం. ఈయన్ని ఆదికవిని చేసి పూజిస్తారు.
5. వ్యాసుడు .. ఓ చేపలుపట్టే బెస్తజాతికి చెందినవాడు. హిందువులకు పరమపవిత్రమైన వేదములు .. ఈయన చేత విభజన చేయబడ్డవే. అందుకే ఇతణ్ణి వేదవ్యాసుడు .. అని పూజిస్తారు.
6. గౌతముడు .. కుందేళ్లు పట్టేజాతికి చెందినవాడు.
7. వశిష్టుడు .. ఓ వేశ్యకు పుట్టినవాడు. కనీసం తండ్రి ఎవరో కూడా తెలియదు. ఈతని భార్య మాదిగ స్త్రీ అయిన అరుంధతీదేవి. ఈరోజుకు కూడా నూతన దంపతులచేత అరుంధతీవశిష్టులకు నమస్కారం చేసే సాంప్రదాయాన్ని పాటిస్తున్నారు. ప్రతి పూజలోనూ హిందువులచేత .. అరుంధతీవశిష్ఠాభ్యాం నమః .. అని పూజలందుకుంటున్నారు.
వీరి కుమారుడు శక్తి. ఇతని భార్య ఓ మాదిగ వనిత .. ఛండాలాంగని. వీరికుమారుడే పరాశరుడు. ఈతను ఓ బెస్తవనిత మత్స్యగంధిని వివాహమాడి వ్యాసుణ్ణి కన్నారు.
8. అగస్త్యుడు .. మట్టి కుండల్లో పుట్టినవాడు.
9. మతంగ మహర్షి.. ఒక మాదిగవాని కుమారుడు. బ్రాహ్మణుడయ్యాడు. ఈతని కూతురే .. మాతంగకన్య .. ఓ శక్తి దేవత. కాళిదాసుతో సహా ఎందరో మహానుభావులు ఈ మాతను ఉపాసించారు. ఉపాసిస్తూ ఉన్నారు. ఈమే శ్యామలాదేవి.
ఇంకా
1.ఐతరేయ మహర్షి ఒక దస్యుడి మరియు కిరాతకుడి కుమారుడు .. అంటే నేటి లెక్కల ప్రకారం SC or ST. జన్మ బ్రాహ్మణుడు కాదు. కానీ అత్యున్నతమైన బ్రాహ్మణుడు అయ్యాడు. అతను వ్రాసినవే ఐతరేయ బ్రాహ్మణం మరియు ఐతరేయోపనిషత్తు. ఐతరేయ బ్రాహ్మణం చాలా కష్టమైనది. ఇది ఋగ్వేదాన్ని అర్థం చేసుకోవడానికి ఉపయోగిస్తారు.
2.ఐలుష ఋషి ఒక దాసీ కుమారుడు. అతను ఋగ్వేదంమీద రిసెర్చ్ చేసి చాలా విషయాలు కనిపెట్టాడు. అతన్ని ఋషులందరూ ఆహ్వానించి తమకు ఆచార్యుణ్ణి చేసుకున్నారు ( ఐతరేయ. బ్రా. 2.19)
3. సత్యకామ జాబాల మహర్షి ఒక వేశ్య కుమారుడు. తండ్రి పేరే కాదు.. కనీసం తండ్రి ఎవరో కూడా తెలియదు. కానీ జ్ఞానం చేత బ్రాహ్మణుడు అయ్యాడు.
ఉన్నతవంశాలలో పుట్టినవారిని కూడా వారిధర్మం నిర్వర్తించకపోతే .. వారిని నిర్మొహమాటంగా బహిష్కరించారు ... వారిలో కొందరు
1. భూదేవి కుమారుడు .. క్షత్రియుడైన నరకుడు .. రాక్షసుడైనాడు.
2. బ్రహ్మవంశజులైన హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు, రావణుడు,.. బ్రాహ్మణులైనా .. రాక్షసులయ్యారు ..
3. రఘువంశ మూలపురుషుడైన రఘుమహారాజు కుమారులలో ఒకడు అయిన ప్రవిద్ధుడు .. రాక్షసుడైనాడు.
4. త్రిశంకుడు క్షత్రియుడు. కానీ చండాలడు అయ్యాడు.
5. విశ్వామిత్రుడు క్షత్రియుడు.. బ్రాహ్మణుడైనాడు .. వీరి వంశస్తులే .. కౌశికస గోత్ర బ్రాహ్మణులయ్యారు. విశ్వామిత్రుని కుమారులు కొందరు శూద్రులయ్యారు.
6. నవ బ్రహ్మలలో ఒకడైన దక్ష ప్రజాపతి కుమారుడు పృషధుడు. బ్రహ్మ జ్ఞానం లేని కారణాన శూద్రుడిగా మారిపోయాడు ( విష్ణుపురాణం 4.1.14)
7. నేదిష్టుడు అనే మహరాజు కుమారుడు .. నాభుడు. ఇతనికి క్షాత్ర జ్ఞానం లేని కారణాన, వర్తక జ్ఞానం కారణాన వైశ్యుడిగా మారవలసి వచ్చింది ( విష్ణుపురాణం 4.1.13).
8. క్షత్రియులైన రథోతరుడు, అగ్నివేశ్యుడు, హరితుడు .. బ్రహ్మ జ్ఞానం వలన బ్రాహ్మణులైనారు. హరితుని పేరుమీదే .. ఇతని వంశబ్రాహ్మణులకు హరితస గోత్రం వచ్చింది (విష్ణుపురాణం 4.3.5).
9. శౌనక మహర్షి కుమారులు .. నాలుగు వర్ణాలకు చెందినవారుగా మారారు (విష్ణుపురాణం 4.8.1).
10. అలాగే గృత్సమదుడు, వీతవ్యుడు, వృత్సమతి ... వీరి కుమారులు కూడా నాలుగు వర్ణాలకు చెందినవారు అయ్యారు.
ఇదే సనాతన ధర్మం యెుక్క గొప్పతనం.
వృద్ధాచలక్షేత్రం
🙏 *ఓం నమఃశివాయ హరహర మహాదేవ శంభో శంకర* 🙏
👉 కాశీకంటే పురాతనమైన పుణ్యక్షేత్రం వృద్ధాచలక్షేత్రం
తమిళనాడులోని ఓ పుణ్యక్షేత్రం కాశీ క్షేత్రం కంటే పురాతనమైనది. అందువల్లే ఇక్కడ స్వామివారిని పూజిస్తే కాశీలో విశ్వనాధుడిని సేవించిన దానికంటే ఎక్కువ పుణ్యం వస్తుందని నమ్ముతారు. *అంతేకాకుండా ఇక్కడ పుట్టినా, చనిపోయినా అప్పటి వరకూ చేసిన తప్పులు సమిసిపోయి తప్పక కైలాసానికి వెళ్తామని ప్రతీతి. అందుకే కాశీలో జీవిత చరమాంకం గడపడానికి వీలుకుదరని వారు ఇక్కడికి వచ్చి దైవ సన్నిదిలో తమ శేష జీవితాన్ని ముగిస్తారు*. ఈ నేపథ్యంలో ఆ దేవాలయానికి సంబంధించిన కథనం.
*వృద్దాచలాన్ని వృద్ధ కాశి అని కూడా పిలుస్తారు. ఇందుకు కారణం లేకపోలేదు. కాశీలో మరణిస్తే మోక్షం లభిస్తుందని చెబుతారు. ఇక్కడి స్థల పురాణం ప్రకారం వృద్ధ కాశి అని పిలువబడే ఈ విరుదాచలంలో మరణిస్తే కాశీలో మరణించిన వారికంటే ఎక్కువ పుణ్యమే లభిస్తుందని చెబుతారు*. మహిళలు తమ పసుపు కుంకుమలు చల్లగా ఉండాలని ఈ దేవతను పూజిస్తారు
కాశీలో చెప్పినట్టే ఇక్కడ కూడా చనిపోతున్నవారి శిరస్సును తన ఒడిలో ఉంచుకొని ఇక్కడ కొలువై ఉన్న వృధ్ధాంబిక తన చీర కొంగుతో విసురుతూ ఉండగా వారి చెవిలో పరమేశ్వరుడు తారక మంత్రాన్ని ఉపదేశించి వారికి మోక్షం ప్రసాదిస్తాడని చెబుతారు.
అదే విధంగా పరమశివుడు నటరాజ రూపంలో నాట్యానికి ప్రసిద్ధి ఈయన చిదంబరంలో కాళీతో పోటిపడి నాట్యం చేస్తే ఈ విరుదాలచలం లేదా వృద్దాచలంలో తన సంతోషం కోసం నాట్యం చేశాడని చెబుతారు. అంతే స్వామి సంతోష తరంగాల్లో తేలిపోతూ నాట్యం చేసిన ప్రదేశం ఇదే.
*ఆనంద తాండవం*
చిదంబరంలో పరమశివుడు కాళీ మాతతో పోటీ పడి నృత్యం చేస్తే ఇక్కడ ఆనంద తాండవం చేశాడని చెబుతారు.
అందువల్ల ఈ క్షేత్రంలో పుట్టినా, గిట్టినా, నివసించినా భగవంతుడిని ప్రార్థించినా మోక్షం లభిస్తుందని చెబుతారు.
శివుడు మొదట ఇక్కడ కొండరూపంలో వెలిశాడని చెబుతారు.
అందువల్లే ఈ క్షేత్రాన్ని మొదట పఝుమలై అని పిలచేవారు.
అటు పై విరదాచలంగా ఖ్యాతి పొందింది.
*స్వామివారిని సేవిస్తే*.....
పూర్వం ఇక్కడ ప్రజలు కరువు కాటకాల వల్ల నిత్యం అష్టకష్టాలు పడేవారు. దీంతో స్థానికంగా ఉండే విభాసిత మహర్షి, స్వామివారికి సేవ చేస్తే ఫలితం ఉంటుందని చెప్పాడు.దీంతో ఆ ఊరిపెద్దలంతా కలిసి స్వామి వారికి దేవాలయం నిర్మించాలని తీర్మానించారు. అయితే ఆ సమయంలో వారి జీవనం ఎలా అన్న అనుమానం మొదలయ్యింది.దీనికి విభాసిత మహర్షి , వృద్దేశ్వర స్వామి వారిపై నమ్మకంతో పనిచేయండి చేసుకొన్నవారికి చేసుకొన్నంతంగా లాభం చేకూరుతుందని చెప్పారు.
దీంతో ప్రజలు అయిష్టంగానే ఆ పనికి పూనుకొన్నారు.
ఇక ఉదయం నుంచి సాయంత్రం వరకూ పనిచేసిన వారికి విభాసిత మహర్షి స్థానికంగా ఉంటున్న చెట్టు నుంచి కొన్ని ఆకులు తీసుకొని పనిచేసిన వారికి ఇచ్చేవాడు.
ఆశ్చర్యం ఆకులు నాణ్యాలుగా
ఎవరు ఎంత పని చేసారో అంతకు సమానంగా ఆ ఆకులు నాణ్యాలుగా మారేవి. అప్పటి నుంచే చేసిన వారికి " చేసినంత, చేసుకున్నవారికి చేసుకొన్నంత " అనే నానుడి మొదలయ్యిందని చెబుతారు.
మణిముత్తా నదిలో వేసిన నాణేలు తిరువారూరు కొలనులో ...
ఒకసారి ఈ క్షేత్రం గుండా సుందరర్ అనే గాయకుడైన శివభక్తుడు ఈ దారి గుండా వెడుతూ ఇక్కడి స్వామివారిని స్తుతించాడు.
దీంతో స్వామి వారు స్వయంగా 12 వేల బంగారు నాణ్యాలను అందజేస్తాడు.తాను తిరువారూర్ వెళ్లాల్సి ఉందని అయితే తోవలో దొంగల భయం ఉందని సుందరార్ భయపడుతాడు.
ఇదే విషయాన్ని శివుడికి చెబుతాడు. దీంతో శివుడు తాను ఈ నాణ్యాలను ఇక్కడే ఉన్న మణిముత్తా నదిలో వేస్తానని నీవు తిరువారూర్ వెళ్లిన తర్వాత అక్కడి కొలనులో తీసుకోవచ్చని చెబుతాడు.ఇందుకు అంగీకరించిన సుందరార్ తిరువారూర్ వెళ్లి అక్కడ కొలనులో నుంచి 12వేల బంగారు నాణ్యాలను తీసుకొన్నాడని కథనం.అదే విధంగా ఆ నాణ్యాల నాణ్యతను సాక్షాత్తు వినాయకుడు పరీక్షించి అటు పై ఆ భక్తాగ్రేసరుడికి ఇచ్చారని చెబుతారు.
5 సంఖ్యకు ప్రత్యేక ప్రాధాన్యత
*ఈ ఆలయంలో 5 అంకెకు విశిష్ట స్థానం ఉంది*
*ఈ ప్రాంగణంలో పూజలందుకొనే మూర్తులు 5* 5.
*వినాయకుడు, సుబ్రహ్మణ్యేశ్వరుడు, శివుడు, శక్తి, భైరవుడు*.
ఇక్కడ స్వామివారికి 5 పేర్లు ఉన్నాయి. అవి విరుధ గిరీశ్వరుడు, పఝమలైనాధార్, విరుద్ధాచలేశ్వర్, ముద్దుకుండ్రీశ్వరుడు, వృధ్ధ గిరీశ్వరుడు.
ఆలయానికి 5 గోపురాలు ఉన్నాయి.
అదే విధంగా 5 ప్రాకారాలు, 5 మండపాలు, 5 నందులు ఉన్నాయి.
వేకువజాము నుంచి రాత్రిదాకా స్వామికి నిర్ణీత సమయంలో 5 సార్లు పూజలు చేస్తారు.
ఇక్కడ 5 రథాలు ఉన్నాయి.
ఇక్కడ స్వామివారు స్వయంభువుడు. ఇక్కడ శివుడిని ప్రార్థించిన వారికి మన:శ్శాంతి కలగడమే కాకుండా అన్ని రకాల శరీర రుగ్మతల నుంచి వెంటనే విముక్తి కలుగుతుందని చెబుతారు.
ఇక్కడ ఉన్న దుర్గాదేవిని పూజిస్తే వివాహం, సంతానం కలగడం వంటి కోరికలు నెరవేరుతాయని చెబుతారు.
*పాతాళ వినాయకుడు*
శ్రీ కాళహస్తిలో ఉన్నట్లు ఇక్కడ విఘ్నేశ్వరుడు భూతలం నుంచి కిందికి ఉన్న ఆలయంలో ఉంటాడు. ఈ ఆలయంలోని స్వామివారిని సందర్శించడానికి 18 మెట్లు దిగి కిందికి వెళ్లాల్సి ఉంటుంది. చనిపోయిన వారి చితా భస్మాన్ని ఇక్కడున్న మణిముత్తా నదిలో నిమజ్జనం చేస్తే అవి చిన్న రాళ్లుగా మారి నది అడుగున చేరుతాయని చెబుతారు.
ఈ విరుదాచలంలోని నదిలో వేసిన నాణాలు తిరువారూరు కోవెల పుష్కరిణిలో తేలుతాయని చెబుతారు. ఈ విషయానికి సంబంధించి ఎన్ని పరిశోధనలు జరిగినా ఫలితం మాత్రం శూన్యం. అరుణాచలంలో చేసినట్లుగానే ప్రతి పౌర్ణమికి ఇక్కడ భక్తులు గిరి ప్రదక్షిణ చేస్తారు.
*వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యుడు* :
ఇక్కడ వల్లీ దేవసేనలతో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరుడు కొలువుతీరి ఉన్నాడు. ఆయన ఆలయంలో పైన చక్రాలు ఉంటాయి. అవి శ్రీ చక్రం, సుబ్రహ్మణ్య చక్రం, అమ్మవారి చక్రం. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ఇలాంటి చక్రాలు చాలా తక్కువ శివాలయంలో చూస్తాం. అందులో ఇది ఒకటి. అందుకే ఇక్కడ స్వామివారికి విన్నించుకొన్న కోరికలు త్వరగా తీరుతాయని చెబతారు.
*సుబ్రహ్మణ్యుడు ప్రతిష్ట చేసిన 28 శివలింగాలు*
శైవ సిద్దాంతం ప్రకారం ఇక్కడ 28 ఆగమ శాఖలు ఉన్నాయి. సుబ్రహ్మణ్యేశ్వరుడు ఈ 28 సిద్ధాంతాలకు ప్రతీకగా 28 శివలింగాలను ఇక్కడ ప్రతిష్టించి పూజించాడని నమ్ముతారు.
ఈ సిద్ధాంతాల వల్లే ఈ ఆలయానికి ఆగమ ఆలయమని పేరు. ఈ విశేషం ఉన్న ఆలయం ఇదొక్కటే. ఈ ఆలయం ఉదయం 6 గంటల నుంచి 12 గంటల వరకూ అదే విధంగా సాయంకాలం 3.30 గంటల నుంచి 9 గంటల వరకూ భక్తుల కోసం అందుబాటులో ఉంటుంది.
ఇక్కడ కూడా గిరి ప్రదక్షిణ అరుణాచలం అంటే తిరువణ్ణామలైలో చేసినట్లుగానే
*ప్రతి పౌర్ణమికీ ఇక్కడ భక్తులు గిరి ప్రదక్షిణ చేస్తారు*.
దీని వల్ల వారికి స్వర్గ ప్రాప్తి కలుగుతుందని నమ్మకం.
*చెన్నై నుంచి 230 కిలోమీటర్ల దూరంలో కడలూర్ జిల్లాలో ఉన్న ఈ క్షేత్రానికి చేరుకోవడానికి నిత్యం బస్సులు, రైళ్లు అందుబాటులో ఉన్నాయి*
సేకరణ
మోహముద్గరము
మోహముద్గరము
బాలస్తావ త్క్రీడాసక్త
స్తరుణస్తావ త్తరుణీసక్తః
వృద్ధస్తావ చ్చిన్తాసక్తః
పరే బ్రాహ్మణి కో౽పి న సక్తః
ఆరయ బాల్యంబు నందున న్నాటలందు
తరుణవయసున సక్తత తరుణు లందు
చివరవయసున సక్తత చింతలందు
సమయమెపుడుండు పరమాత్ము స్మరణ సేయ ? 7*
కా తే కాన్తా కస్తే పుత్ర
స్సంసారో ౽ య మతీవ విచిత్రః
కస్య త్వం వా కుత ఆయాతః
తత్త్వం చిన్తయ తదిహ భ్రాతః
ఎవరు నీ భార్య ? పరికించ నెవరు సుతుడు ?
చిత్రమరయగ సంసార జీవనంబు
వచ్చి రెటునుండి వారలు వసుధ పైకి ?
చింతసేయుమ యొక్కింత చిత్తమందు 8*
సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్త్వే జీవన్ముక్తిః
జగతి సత్సంగముననె నిత్సంగ మొదవు
ఉర్వి నిత్సంగముననె నిర్మోహ మొదవు
నుండు నిశ్చల మ్మదియు నిర్మోహమునను
మోహరహితంబునను గల్గు ముక్తితుదకు 9*
✍️గోపాలుని మధుసూదన రావు శర్మ 🙏
*లక్ష్మీ కటాక్షం
లక్ష్మీలలితా వాస్తు జ్యోతిషాలయం
*లక్ష్మీ కటాక్షం-ఉసిరికాయదీపం*
శ్రీ మహాలక్ష్మీదేవికి ఉసిరికాయ అత్యంత ప్రీతికరమైనది. శుక్రవారం సాయంత్రం ఉత్తర భారతదేశంలో శీమహాలక్ష్మీదేవికి ఉసిరికాయ దీపాలను వెలిగిస్తారు. దీనివల్ల శ్రీ మహాలక్ష్మీదేవి కరుణాకటాక్షాలు,
అనుగ్రహం కలుగుతుంది అని వారి ప్రగాఢ విశ్వాసం.9494550355
శంకరాచార్యులవారు విరచించిన కనకధారా స్తోత్రం పఠించిన తరువాత ఉసిరికాయ బొబ్బట్టు లేదా గుజ్జును శ్రీ మహాలక్ష్మీదేవికి నివేదించడం వల్ల శ్రీమహాలక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రులు అవుతారు.
ఉసిరికాయ దీపంతో శ్రీమహాలక్ష్మీదేవికి హారతి సమర్పిస్తే ఇంట్లో ఉన్న దారిద్ర్యం నివారింపబడుతుంది.
అష్టనిధి ప్రాప్తి కోసం కార్తీకమాసంలో ధాత్రి హవనం తరువాత ఉసిరికాయను హోమం పూర్ణాహుతికి సమర్పించండి.
అప్పుల బాధనుండి బయటపడాలంటే ఉసిరికాయ దీపాన్ని శ్రీమహాలక్ష్మీదేవి చక్రానికి ఎనిమిది దిక్కులలో పెట్టి చక్రపూజ చేయాలి.
ఉసిరికాయ గుజ్జు, ఉసిరికాయ పచ్చడి శ్రీమహాలక్ష్మీదేవికి నైవేద్యంగా నివేదించిన తరువాత ముత్తైదువులకు వాయనం ఇస్తే మొండి బకాయిలు వసూలు అవుతాయి.
ఉసిరికాయను శ్రీలక్ష్మీదేవి 'శ్రీ' చక్రానికి నైవేద్యంగా నివేదించిన తరువాత దాన్ని అందరికీ పంచితే ఇంట్లో సిరిసంపదలు వృద్ధి చెందుతాయి.
శ్రీమహాలక్ష్మీదేవి కవచం లేదా లక్ష్మీదేవి హృదయ స్తోత్రాన్ని పఠించిన తరువాత ఉసిరికాయను దానం చేస్తే
నిత్య దారిద్ర్యం నుండి విముక్తి పొంది లక్ష్మీ కటాక్షానికి నోచుకుంటారు.
శ్రీసూక్తం పఠించిన తరువాత శ్రీమహాలక్ష్మీదేవికి ఉసిరికాయ, పాలు నైవేద్యంగా నివేదిస్తే ఇంట్లో ఖర్చు తగ్గిపోయి ఆదాయం వృద్ధి చెందుతుంది.
ఉసిరి చెట్టుకి ప్రతిరోజూ పూజ చేసిన తరువాత నీళ్ళు పోస్తూ నమస్కరిస్తే ఆ ఇంట్లో ఎప్పుడూ శ్రీమహాలక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రులు అవుతారు.
ప్రతిరోజూ రోజూ పూజచేసే ప్రదేశంలో శంఖం ప్రక్కన ఈశాన్య దిశగా ఉసిరికాయని పెట్టినట్లయితే
కుటుంబంలో ప్రశాంతత, శాంతి కలిగిస్తుంది.
ఉసిరికాయ ఊరగాయ... పక్కన నివశిస్తున్నవారికి
లేదా బంధువుల ఇళ్ళకి పంచితే ఇంట్లోని కలహాలు తొలగిపోయి ఇంట్లో సుఖసంతోషాలు, శాంతి చేకూరి ప్రశాంతవంతమైన జీవనాన్ని సాగిస్తారు.
ఉసిరికాయను చేతపట్టుకుని సంగమ తీరాలలో రెండు లేదా ఎక్కువ నదులు సంగమించే స్థలంలో ప్రాయశ్చిత్త సంకల్పం చెప్పుకున్న తరువాత శివాలయంలో అర్చకులకు దానం ఇస్తే గత కర్మదోషాల నుండి విముక్తి పొందుతారు.
ఉసిరికాయను కాలితో తొక్కిన వారు నిత్య దారిద్ర్యం అనుభవిస్తారు.
ఉసిరికాయను డబ్బులు భద్రపరిచే స్థలంలో ఉంచినట్లయితే ధనం స్థిరనివాసం ఏర్పరచుకుంటుంది.
ఉసిరికాయ దీపాలను తులసికోట ముందు వెలిగించినట్లయితే దైవ భక్తి వృద్ధి చెందడంతో పాటు అపమృత్యువు నివారింపబడి సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుంది.
కన్యలు ఉసిరికాయను శుక్రవారం ముత్తైదువులకు పంచిపెట్టినట్లయితే ఇష్టమైన కోరుకున్న కోరికలు ఫలిస్తాయి.
శ్రీ గణపతి హోమంలో శక్తిగణపతిని ధ్యానించి ఉసిరికాయను హోమగుండంలో వేస్తె అన్ని కార్యాలలో జయం మరియు వ్యాపారాలలో అధిక లాభాలు సిద్ధిస్తాయి.
తామరమాల తో శ్రీమహాలక్ష్మీదేవి జపాన్ని చేసిన తరువాత ముత్తైదువుకి తాంబూలంలో పెట్టి దానం చేస్తే శ్రీమహాలక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రులు అవుతారు.!!
నవగ్రహా పురాణం🪐* . *21వ అధ్యాయం*
🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹
. *🪐నవగ్రహా పురాణం🪐*
. *21వ అధ్యాయం*
🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐
*పురాణ పఠనం ప్రారంభం*
*చంద్రగ్రహ జననం - 3*
*"అదేమిటి స్వామీ , అలా అంటారు. నా సర్వస్వమూ మీరే. అది మీకు తెలుసుగా. పైగా ఇది వెన్నెల రాత్రి కాదు స్వామీ !”*
*“సరే... ఈరోజు ఒక మేడ ముందు ఆగి , భిక్ష అడగకుండా వచ్చేశావ్ ! ఎందుకు ?"* ఉగ్రశ్రవుడు శీలవతి మాటను వినిపించుకోనట్లు అన్నాడు.
*"ఆ ఇంట్లో భిక్ష తీసుకోవడం నాకు ఇష్టం లేదు స్వామీ...”*
*"కారణం !"* ఉగ్రుడు రెట్టించాడు. *"అది కలిగిన వారి ఇల్లులా కనిపించింది !".*
*"అవును...అయినా , ఆ ఇంట భిక్ష తీసుకోవడం దోషమని అనిపించింది ! నిజంగా అది దోషమే స్వామీ !"* అంది శీలవతి.
*"కారణం చెప్తావా లేదా ?"* ఉగ్రశ్రవుడు గద్దించాడు.
*"ఆ ఇల్లు ఒక వేశ్యది స్వామీ..."* శీలవతి మెల్లగా అంది. *"ఓహ్ ! మేడ మీద చందమామలా కనిపించింది , ఆ వేశ్య ముఖమన్నమాట !"* ఉగ్రశ్రవుడి కంఠం ఉత్సాహంగా ధ్వనించింది.
*"ఔను..."*
*"ఓహ్ ! చంద్రబింబంలాంటి ముఖం ! మెరుపు తీగలాంటి శరీరం ! అప్సరస కాబోలనిపించింది , చూస్తుంటే..."* ఉగ్రశ్రవుడు చెప్పుకుపోతున్నాడు.
*"పోనివ్వండి , స్వామీ ! ఆమె అందంతో మనకు అవసరమేమిటి ?"* శీలవతి సౌమ్యంగా అంది. *"హాయిగా నిద్రపోండి !"*
*"నాకు నిద్ర పట్టదు !"* ఉగ్రశ్రవుడు ఎటో చూస్తూ అన్నాడు. *"కంటికి కట్టిన ఆ వేశ్య సౌందర్యానుభవం వొంటికి పట్టేదాకా... నాకు నిద్ర పట్టదు !"*
*"స్వామీ... !"* శీలవతి కంఠంలో ఆశ్చర్యం పలికింది.
*"ఏం ? అంత ఆశ్చర్యపోతున్నావేమిటే ! వేశ్యా సంగమం అంత కానిపనైతే... వేశ్యలు ఎందుకుంటారే ! నన్ను ఆ వేశ్య ఇంటికి తీసుకెళ్ళు !"* ఉగ్రశ్రవుడు ఆజ్ఞాపించాడు.
*"స్వామి..."*
*"ఏం ? తీసుకెళ్ళలేవా ?"* ఉగ్రశ్రవుడు హూంకరించాడు. *"పతి ఆజ్ఞను ధిక్కరిస్తావా ?"*
*"చివరిసారిగా చెప్తున్నాను ! నన్ను ఈ క్షణంలోనే ఆ వేశ్య వద్దకు తీసుకెళ్ళాల్సిందే ! మోసుకెళ్ళాల్సిందే !"*
*"స్వామీ... దయచేసి శాంతంగా వినండి..."* శీలవతి దీనంగా అంది. *"వేశ్యలు ధనం లేని వారిని గడప తొక్కనివ్వరు... మన వద్ద ధనం...".*
*"లేదు - అది నాకు తెలుసు !"* ఉగ్రశ్రవుడు గర్జించాడు. *"మన వద్ద ధనమే కాదు. ధాన్యం కూడా లేదు ! అలాగని పస్తులుంటున్నామా ? ఏం చేస్తున్నావ్ ? నన్ను ఆ బుట్టలో కూలవేసి , ఎండలో ఎండిస్తూ , వానలో తడిపేస్తూ , కష్టపెడుతూ అడుక్కుతెస్తున్నావా లేదా ? అందర్నీ ధాన్య భిక్ష అడుగుతున్నావు ! ఆ వేశ్యను కూడా అడుగు ! ధనభిక్ష కాదు. ధాన్య భిక్ష కాదు. 'ప్రణయభిక్ష' అడుగు ! నీ పతి దేవుడికి ఇంత ప్రణయభిక్ష పెట్టమని ప్రార్ధించు !"*
*"స్వామీ...!"* శీలవతి నివ్వెరపోతూ అంది.
*"ఏమే ? స్వామి స్వామి అంటూ జపం చేస్తూ కూర్చుంటే మన కోరిక తీరదే పిచ్చిదానా ! నన్ను ఆ సౌందర్యరాశి ఇంటిముందుకు తీసుకెళ్ళు. దాని కాళ్ళు పట్టుకో. కన్నీళ్ళు పెట్టుకో. 'భిక్షం' సంపాదించు. లే ! బుట్ట తే !!"*
*"నా... ఆలోచన వినండి స్వామీ..."* శీలవతి ప్రాధేయపడుతూ అంది. *"మీ ఆరోగ్యం బాగాలేదు. లేవలేని స్థితిలో ఉన్నారు...".*
*"నోర్ముయ్ ! నిన్ను చూస్తూ ఇలా ఉండచుట్టుకుని పడి ఉన్నాను ! అంతే ! ఆ వేశ్య ముందుకెళ్ళగానే లేచి గంతులేస్తాను లేవే !"* అంటూ ఉగ్రశ్రవుడు తీక్షణంగా శీలవతి. మొహంలోకి చూశాడు. *"నేను రోగిష్టినయితేనేం ? చెప్పానుగా ! కాళ్ళు పట్టుకో ! కన్నీళ్లు పెట్టుకో ! కావాలంటే రేపూ మాపూ బిచ్చమెత్తి దానికి చెల్లిస్తానని మాట ఇచ్చుకో ! పద !"*
మంచం అంచుకి ఆవేశంగా జరుగుతున్న భర్తను నిస్సహాయంగా చూస్తూ , శీలవతి బుట్ట అందుకుంది. ఉగ్రశ్రవుణ్ణి బుట్టలోకి చేర్చి , ఆ బుట్టను తలమీదకి ఎత్తుకుంది. ఇంట్లోంచి అవతలకి నడిచింది...
శీలవతి భర్తను మోసుకుంటూ , చీకట్లో ఊరివైపు నడుస్తోంది. ఉగ్రశ్రవుడు బుట్టలో విలాసంగా వాలి కాళ్ళు ఆడిస్తూ , వేశ్య గురించి ఉత్సాహంగా ఏమిటేమిటో
చెప్తున్నాడు.
చీకట్లో శీలవతి నడకసాగుతోంది.
బుట్టలోంచి వెలికి సాగిన ఉగ్రశ్రవుడి పాదం ఆ చీకటి దారిలో ఎవరికో తాకింది.
*"అబ్బా !" అంది తీరని బాధతో ఒక పురుష కంఠం.
శీలవతి అప్రయత్నంగా ఆగింది. పరిశీలనగా చూసింది. కటిక చీకటిలో కొంచెం ఎత్తులో ఏదో ఆకారం లీలగా కనిపిస్తోంది.
*"నరకయాతన అనుభవిస్తున్న నన్ను తాకి , కదిలించి ఆ బాధను ఇనుమడింపచేసిన వారు ఎవరో - సూర్యోదయం కాగానే మరణిస్తారు ! ఇది ఈ మాండవ్య మహర్షి శాపం !”* ఏదో పురుష కంఠం ఏడో కఠోర బాధను ఓర్చుకుంటూ కర్కశంగా పలికింది.
*"నా కాలు ఎవరికో తాకింది !" ఉగ్రశ్రవుడు వణికే గొంతుతో అన్నాడు. శీలవతి గుండె దడదడ కొట్టుకుంది ! ఎవరా శపించింది సూర్యోదయమైతే తన భర్త మరణిస్తాడా ?...*
*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*
🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐
*🌹శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర-40🌹*
🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹
*🌹శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర-40🌹*
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
*అన్నమయ్య-1*
అన్నమయ్య లేదా తాళ్ళపాక అన్నమాచార్యులు (మే 9, 1408 - ఫిబ్రవరి 23, 1503) తెలుగు సాహితీ చరిత్రలో లభించిన ఆధారాల ప్రకారం మొదటి వాగ్గేయకారుడు(సాధారణ భాషలో గేయాలను కూర్చేవారు). అన్నమయ్యకు పదకవితా పితామహుడు అని బిరుదు ఉంది. దక్షిణాపథంలో భజన సంప్రదాయానికి, పదకవితాశైలికి ఆద్యుడు. గొప్ప వైష్ణవ భక్తుడు.
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ని, అహోబిలము లోని నరసింహ స్వామి ని, ఇతర వైష్ణవ సంప్రదాయ దేవతలను కీర్తిస్తూ 32వేలకు పైగా కీర్తనలు రచించాడు . అన్నమయ్య పాటలు, పదాలు, పద్యాలలో భక్తి, సాహిత్యం, సంగీతం, శృంగారం, భావలాలిత్యం పెనవేసికొని ఉంటాయి.
కన్నడ వాగ్గేయకారుడు పురందరదాసు అన్నమయ్యను శ్రీనివాసుని అవతారంగా ప్రశంసించాడంటారు.
(సాక్షాత్తు శ్రీమహావిష్ణువు ఖడ్గమైన నందకం అంశతో అన్నమయ్య జన్మించాడని శ్రీవైష్ణవసంప్రదాయంలో నమ్మకం ఉంది. ప్రధాన మందిరంలో ఘంట అవతారమని కూడా అంటారు). త్యాగయ్య, క్షేత్రయ్య, రామదాసు వంటి సంకీర్తనాచార్యులకు అన్నమయ్య మార్గదర్శకుడు.
చందమామ రావే జాబిల్లి రావే అంటే వేంకటేశుడు ముద్దలు తిన్నాడో తినలేదో కానీ, తెలుగు పిల్లలు మాత్రము గబుక్కున తింటారు.
జోఅచ్యుతానంద జో జో ముకుందాఅంటే ముకుందుడు నిద్ర పోతాడో లేదో కానీ తెలుగు పిల్లలు మాత్రము హాయిగా నిద్ర పోతారు.
అన్నమయ్య పాటలు తెలుగు సంస్కృతికి ప్రతిరూపాలు. అవి తెలుగు సంస్కృతిలో ఒక భాగమై పోయినాయి; జనాల నోళ్ళలో నాటుకొని పోయినాయి. తుమ్మెద పాటలు, గొబ్బిళ్ళ పాటలు, శృంగార గీతాలు, ఆధ్యాత్మిక పదాలు - ఇలా మొత్తము ముప్పై రెండు వేల పాటలు వ్రాసాడు.
అన్నమయ్య మనుమడు తాళ్ళపాక చిన్నన్న అన్నమాచార్య చరితము అన్న ద్విపద కావ్యములో అన్నమయ్య జీవిత విశేషాలను పొందుపరచాడు. ఈ గ్రంథం 1948లో లభ్యమై ముద్రింపబడింది.
అన్నమయ్య జీవితం గురించి మనకు తెలిసిన వివరాలకు ఈ రచనే మౌలికాధారం. కాని బహువిధాలైన నమ్మకాలూ, అనుభవాలూ, ఘటనలూ, కథలూ ఈ వివరాలలో పెనవేసుకొని ఉన్నాయి.
నందవరీకులు క్రీ.శ. 10వ శతాబ్దంలో కాశినుండి ఆంధ్ర దేశానికి వలస వచ్చిన శుద్ధవైదిక బ్రాహ్మణులని పరంపరాయాత ప్రతీత. క్రీ.శ. 10వ శతాబ్దంలో నేటి కర్నూలు జిల్లాలోని "నందవరం" అనే గ్రామాన్ని నందుడనే రాజు పాలించేవాడు.
ఈ రాజు కాశియాత్రకు వెళ్ళినప్పుడు అక్కడ కొందరు వైదిక బ్రాహ్మణులుచాముండేశ్వరీ ఉపాసకులు పరిచయం అయ్యారని, ఆ సమయంలో వారణాసిలో క్షామం రాగా ఆ బ్రాహ్మణ కుటుంబాలు కొన్ని ఆంధ్రదేశానికి వలసివచ్చి నంద రాజు ఆశ్రయంలో స్ధిరపడ్డారనీ, నందరాజుచే తీసుకొని రాబడిన వైదికిలు కావడంచే నందవైదికులుగా ప్రచారం పొందారని జనవాక్యం. కాలక్రమాన వీరు నేటి కర్నూలు, కడప జిల్లాలో స్ధిరపడ్డారని పరిశోధకులు అభిప్రాయం. తాళ్ళపాక గ్రామ నామం అన్నమయ్య వంశస్ధులకు ఇంటిపేరుగా నిలిచింది. అన్నమయ్య కూడా నందవరీకుడే. ద్విపద కావ్యం ప్రకారం అన్నమయ్య తాత నారాయణయ్య. చదువు అబ్బక, గురువులు పెట్టే హింసలు భరించలేక నారాయణయ్య చనిపోవాలని అనుకొన్నాడట. వూరిలో గ్రామ దేవత చింతలమ్మ గుడివద్ద విషసర్పం పుట్టలో చేయి పెట్టాడట. అప్పుడు అమ్మవారు ప్రత్యక్షమై అతని వంశంలో మూడవతరంలో హరి అంశతో ఒకబాలుడు జన్మిస్తాడని చెప్పిందట.
*అన్నమయ్య తాతయ్య - నారాయణయ్య*
కడప జిల్లా రాజంపేట తాలూకా పొత్తిపి నాడు మండలం నడిబొద్దున తాళ్లపాక గ్రామం విరాజిల్లుతుండేది. ఆ గ్రామంలో వెలసిన చెన్నకేశవస్వామి, సిద్ధేశ్వరస్వామి కరుణాకటాక్షములతో ఆ గ్రామజనులు సుఖవంతులై జీవనం సాగించేవారు. ఇచ్చట చెన్నకేశవస్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠ చేసాడు.
సస్యశ్యామలమై విరాజిల్లే ఈ గ్రామం సన్మునులకు, అఖిల దేవతలకు నిజవాసమై వుండేదని అంటారు స్థలగ్యులు.ఈ చెన్నకేశవస్వామిని దేవతలు, ఋషులు, సిద్దులు ప్రతి రోజు పూజిస్తారు. ఈ చెన్నకేశవస్వామి గుడిని ఆశ్రయించుకొని కొన్ని బ్రాహ్మణ కుటుంబాలు జీవించేవి. ఆ గ్రామ వాసులు తలపక ఇందిరారమణపదైక మానసులుగా జీవనం సాగించేవారు. వాళ్లల్లో నారాయణయ్య చాల ప్రసిద్దుడు. ఇతని నాలుగోతరంలో మరో నారాయణయ్య వుండేవాడు. అన్నమయ్య పిత్రు పితామహులు నారాయణయ్య, విఠలయ్యలు విష్నుభక్తిరతులై తాళ్ళపాక చెన్న కేశవస్వామిని సేవించుకొంటు జేవితం గడిపేవారు.
ఈ నారాయణయ్య కథ తోనే మన అన్నమయ్య కథ మొదలౌతుంది.
నారాయణయ్యకు చిన్నతనంలో ఎంతకీ చదువు రాలేదు. తండ్రి విఠలయ్య నయాన భయాన చెప్పి చూశాడు. లాభం లేక పోయింది. తన వద్ద ప్రయోజనం లేదని ప్రక్కనే వున్న ఊటుకూరులో తన బంధువుల వద్ద వుంచాడు. ఊటుకూరు నేడు కడపజిల్ల రాజంపేట తాలూకాలో ఉంది. అన్నమయ్య మనవడు చినతిరుమలయ్య ఊటుకూరి చెన్నరాయని మీద కొన్ని సంకీర్తనలు కూడా రచించాడు. అక్కడ బళ్ళో ఉపాధ్యాయులు శతవిధాల ప్రయత్నించారు.
గురువులు నారాయణయ్యను చతుర్విధ ఉపాయాలకు గురి చేశారు. అయినా బాలునికి చదువుపట్ల శ్రద్ధకలుగలేదు. నారాయుణిని కళ్లల్లో నీళ్లే తప్ప నోట సరస్వతి పలకలేదు. వాళ్లు విసిగిపోయి బాలుని రకరకాల శిక్షలకు గురిచేసారు. చివరకు గురువు నారాయణయ్యను కోదండమున వ్రేలాడదీశారు. కోలగగ్గెర విధించారు. గుంజిళ్లు తీయించారు. కోదండం అంటే దూలానికి తాడు కట్టి వ్రేలాడతీయడం. కోలగగ్గెర అంటే కాళ్ళుచేర్చికట్టి కూలద్రోయడం.
నారాయాణయ్యను అయ్యవార్లు ఇంతటి కఠిన పరీక్షలకు గురిచెసినప్పటికి నారాయణయ్య లేత మనస్సు గాయపడింది. నలుగురూ అవహేళన చేస్తున్నారు. సిగ్గుతో, అవమానంతో క్రుంగిపోయాడు. ఇంతకంటె చావు మేలను కున్నాడు. నారాయాణయ్య ఊటుకూరు గ్రామశక్తి అయిన చింతలమ్మగుడి సమీపాన పుట్టలో పాముందని ఎవరో చెబుతుండగా విన్నాడు.
నారాయాణుడు ఒంటరిగ గుడి చేరి పుట్టలో చేయి పెట్టాడు. నేడు ఊటుకూరునందు చింతలమ్మ ఆలయం కనిపించదు. కాని ఊటుకూరు శివాలయంలో ఒకగదిలో వున్న స్త్రీమూర్తి విగ్రహం "చింతలమ్మ" అని స్ధానికుల అభిప్రాయం. పాము కరవలేదు సరికదా ! నారాయాణయ్యకు త్రికాల వేదినియైన చింతలమ్మ ప్రత్యక్షమైంది. నారాయాణయ్య ఏడుస్తూ ఆమె పాదాల మీద పడ్డాడు. చింతలమ్మ ఆ బాలుని ఓళ్ళో చేర్చుకొని వూరడించింది."ఎందుకు బాబు ఈ అఘ్హాయిత్యం. నీ మూడోతరంలో గొప్ప హరి భక్తుడు జన్మిస్తాడు. అతని వల్ల మీ వంశమే తరిస్తుంది. నీకు చదువు రాకపోవడమేమిటి వెళ్ళు,తాళ్ళపాక చెన్నకేశవస్వామే నీకు అన్నీ అనుగ్రహిస్తాడు" అని నారాయాణయ్యను అనుగ్రహించి అంతర్ధానమైనది. అమ్మవారి ఆదేశం ప్రకారం నారాయాణయ్య తాళ్ళపాకచేరి ఆశ్రితక్లేశనాశకుడైన చెన్నకేశవస్వామిని సేవించి స్వామి అనుగ్రహించే వేదవేదాంగ పారంగతుడై సకలవిద్యలు పొందగలుగుతాడు. సర్వజ్ఞుడని కీర్తి పొందుతాడు. ఈ నారాయాణయ్య కుమారుడే నారాయణసూరి.
అన్నమయ్య తండ్రి - నారాయణసూరి.
అన్నమయ్య తండ్రి అయిన నారాయణసూరి గొప్ప కవి, పండితుడు, సకల విద్యాధురంధరుడుగా ప్రసిద్ధికెక్కినవాడు. అన్నమయ్య తండ్రి పేరు ’నారాయణసూరి’గా చిన్నన్న పేర్కొనడాన్నిబట్టి తాళ్ళపాకవారు అన్నమయ్య జననానికి ముందే పండిత వంశస్ధులుగా కీర్తించబడేవారని భావించవచ్చును. నారాయణసూరి ధర్మపత్ని లక్కమాంబ, మహా భక్తురాలు. మధురంగా పాడుతుంది. ఈమె స్వగ్రామం మాడువూరు, కడప జిల్లా సిద్దపట్నంతాలూకాలో వున్నది. అక్కడ చెన్నకేశవస్వామి ఈమెతో ప్రత్యక్షంగా మాట్లాడేవాడట.
*అన్నమయ్య తండ్రి - తిరుమల పయనం*
భాగవతసేవా పరాయణులైన నారాయణసూరి, లక్కమాంబ లకు సంతానం లేకపోవడం తీవ్రవ్యధకు గురిఅయినారు. ఈ పుణ్య దంపతులు సంతానం కోసం చేయని వ్రతం లేదు, కొలవని దేవుడు లేడు. "మాకు మంచి కొడుకును ప్రసాదించు స్వామీ" అని ఏడుకొండలస్వామికి మ్రొక్కుకున్నారు. ముడుపులు కట్టుకున్నారు. ఒక మంచిరోజు చూసి ఇద్దరూ వేంకటేశ్వరస్వామి దర్శనం కోసం ప్రయాణమయ్యారు. లక్కమాంబ, నారాయణసూరి తిరుమలచేరారు. స్వామి మందిరం ప్రవేశించారు. గరుడగంభం వద్ద సాగిలి మ్రొక్కారు. వాళ్ళకేదో మైకం కమ్మినట్లైంది. కళ్లు మిరుమిట్లు గొలిపే తేజస్సు కనిపించి ధగధగ మెరిసే ఖడ్గాన్ని వాళ్ల చేతుల్లో పెట్టి అద్రుశ్యమైంది. వేంకటేశ్వరస్వామితన నిజ ఖడ్గమైన నందకాన్ని ఆ పుణ్య దంపతులకు ప్రసాదించాడు. వాళ్ళు పరమానంద భరితులయ్యారు. వేంకటపతిని దర్శించి స్తుతించారు. సంతోషంతో తాళ్లపాకకు తిరిగి వచ్చారు.
*నారాయణాచ్యుత గోవిందా, గోవింద నామా గోవిందా, శ్రీ* *విష్ణు దేవా గోవిందా, శ్రీ దామోదర గోవిందా; |*
*గోవిందా హరి గోవిందా, వేంకట* *రమణా గోవిందా, గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా. ||40||*
*శ్రీ వేంకటేశ్వరుని దివ్య లీలల లో మరికొన్ని తదుపరి సంపుటిలో తెలుసుకుందాం.*🙏
*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*
🌹🪷🌹🪷🌹🪷🌹🪷🌹🪷
శ్రీ వివేకానందస్వామి🚩* . *🚩జీవిత గాథ🚩* *భాగం 34*
🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹
. *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*
. *ఓం నమో భగవతే రామకృష్ణాయ*
. *🚩శ్రీ వివేకానందస్వామి🚩*
. *🚩జీవిత గాథ🚩*
*భాగం 34*
*నరేంద్రుడు కాలాంతరంలో ఇలా చెప్పాడు*
రెండోసారి శ్రీరామకృష్ణుల దగ్గరికి వెళ్లాను. అప్పుడు ఆయన తన్మయులై కూర్చుని ఉన్నారు. అక్కడ ఎవరూ లేరు. నన్ను చూడగానే పట్టరాని ఆనందంతో నన్ను పిలిచి మంచం మీద ఒక ప్రక్కన వచ్చి కూర్చోమన్నారు. నేను కూర్చొన్నాను. ఆయన ఏదో తెలియరాని వింతైన మనోభావంలో మునిగివున్నారు. అస్పష్టంగా గుసగుసగా ఏదో చెబుతూ నన్ను తదేకంగా చూస్తూ నాకేసి మెల్లగా జరగసాగారు. 'పిచ్చి మొదలయింది. ఆ రోజు మాదిరి నేడు కూడా ఏదో విపరీతం చేయనున్నారు' అని అనుకొన్నాను. ఇంతలో ఆయన నన్ను సమీపించి తన కుడిపాదాన్ని నా మీద ఉంచారు. ఆ క్షణంలోనే నాకు ఒక అద్భుత అనుభవం కలిగింది. నా కళ్లు తెరచుకొనే ఉన్నాయి. కాని నేను చూసిందేమిటో తెలుసా?
"గదిలోని వస్తువులన్నీ గోడలతోసహా గిర్రున తిరుగుతూ అదృశ్యమయి పోయాయి. చరాచర ప్రపంచమూ, దానితోబాటు 'నేను' అనే భావనా సమస్తం మహాశూన్యంలో లయించిపోతున్నట్లు తోచింది! చెప్పనలవిగాని మహాభయం నన్ను ఆవరించింది; నేను - అనే భావన నాశనమే మరణం, ఆ మరణం ఇదుగో నిలబడివుంది, నా కళ్లు ముందు నిలబడివుంది' అని అనిపించింది! నేను భరించలేకపోయాను. 'హా! నన్ను మీరు ఏం చేస్తున్నారు! నాకు తల్లితండ్రులున్నారు' అని కేకపెట్టాను. అది విని ఆ అద్భుతమైన పిచ్చివాడు పెద్దగా నవ్వి తన చేతులతో నా ఛాతీని స్పృశిస్తూ, 'అలా అయితే ఇక చాలు. ఒకేసారిగా వద్దులే, సకాలంలో అంతా జరుగుతుంది' అని అన్నారు. ఆయన అలా పలికిన మరుక్షణమే నా అద్భుత అనుభవం అదృశ్యమయింది! నేను సహజ స్థితిలోకి వచ్చాను. గది లోపల, వెలుపల ఉన్న వస్తువులన్నీ మునుపటిలా ఉన్నట్లే కని పించాయి.
"ఈ సంఘటనను వివరించడానికి ఇంతసేపు పట్టింది. కాని ఇవన్నీ ఒకటి రెండు క్షణాల్లో జరిగిపోయాయి. ఈ సంఘటన నా మనస్సులో గొప్ప విప్లవం కలిగించింది. ఏం జరిగిందోనని విస్తుబోతూ యోచించాను. ఈ వింత వ్యక్తి వలన క్షణంలో ఈ అనుభవం కలిగి, అంతే వేగంతో మాయమయిపోయింది.
*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
👉 *రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹
సాంఖ్య యోగః
🕉️🪷 *ఓం శ్రీ కృష్ణపరబ్రహ్మణే నమః* 🪷🕉️
🪷 *శ్రీ మద్భగవద్గీత🪷*
🌸 *అథ ద్వితీయోధ్యాయః 🌸*
🌸 *సాంఖ్య యోగః 🌸*
*2-అధ్యాయం, 23వ శ్లోకం*
*నైనం ఛిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః ।*
*న చైనం క్లేదయంత్యాపో న శోషయతి మారుతః ।। 23*
*ప్రతిపదార్థం*
న =కాదు; ఏనం = ఈ ఆత్మ; ఛిందంతి = ముక్కలుచేయబడుట; శస్త్రాణి = ఆయుధములు; న = కాదు; ఏనం =ఈ ఆత్మ; దహతి = కాల్చుట; పావకః = అగ్ని; న = కాదు; చ = మరియు; ఏనం = ఈ ఆత్మ; క్లేదయంతి = తడుపుట; అపః = నీరు; న = కాదు; శోషయతి = ఎండగొట్టుట; మారుతః = గాలి.
*తాత్పర్యము*
ఈ ఆత్మను, (శస్త్రములు ) ఆయుధములు ఛేదింపలేవు, అగ్ని కాల్చలేదు, నీరు తడపలేదు, గాలి అరిపోవునట్లు చేయలేదు.
*సర్వేజనాసుఖినోభవంతు*
*హరిః ఓం🙏🙏*
నవగ్రహ పురాణం - 51 వ అధ్యాయం*
*నవగ్రహ పురాణం - 51 వ అధ్యాయం*
🪷🪻🌿🪷🪻🌿🪷🪻🌿🪷🪻🌿🪷
*శనిగ్రహ జననం - 2*
భర్తకు చెప్పిన విధంగా సంజ్ఞ పుట్టినింటికి వెళ్ళలేదు. వెళ్ళే ఆలోచన లేదామెకు. ఆరణ్యం వైపు నడుస్తోంది. సంజ్ఞ తన భవిష్యత్తు గురించి ఆలోచించుకుంటూ.
భర్తకు చెప్పిందిగానీ , చెప్పిన విధంగా మారిపోయి , ఆయన అతి ప్రకాశాన్నీ , అత్యుష్టాన్నీ భరించడానికి సిద్ధమైపోయి , ఆయనను తిరిగి చేరడం సంభవం కాదని ఆమెకు అప్పుడే తెలుసు.
ఇప్పుడు ఏం చేయాలి తను ? తన రాక కోసం కొన్నాళ్ళు చూశాక , తన భర్త తన కోసం అత్తగారింటికి వెళ్తారు. తాను అక్కడికి వెళ్ళలేదన్న సంగతి తెలిసి పోతుంది.
భర్తకు భార్యగా తను అవసరం. దానికి వెయ్యింతలుగా తన బిడ్డలకు తల్లిగా తను అవసరం. అంటే సూర్య మందిరంలో తన ఉనికి అత్యవసరం.
తన సమస్యకు పరిష్కారం కోసం తనలోనే అన్వేషిస్తూ అరణ్యంలో ఒక చెట్టు నీడన కూర్చున్న సంజ్ఞ , ఆలోచనలను కొనసాగిస్తూ అప్రయత్నంగా ధ్యానంలోకి జారుకుంది.
సంజ్ఞలో నెలకొంటున్న ఏకాగ్రత ఆమె సమస్యకు పరిష్కారాన్ని వెదుకుతోంది. గంటలు గడుస్తున్నాయి. సంజ్ఞలో ఒక ఆలోచన మెరిసింది.
ముమ్ముర్తులా తనలాంటి స్త్రీ మరొకతె ఉంటే ! ముమ్మూర్తులా , రూపంలో , మాటలో , నడకలో , నవ్వులో , అన్నింటా తనను పోలిన ఒక స్త్రీ తనకు లభిస్తే ! తన ప్రతిబింబంలా ఉండే అలాంటి స్త్రీని , తన స్థానంలో సూర్య పత్నిగా , తన సంతానానికి తల్లిగా నటిస్తూ ఉండమని నియోగించి , పంపిస్తే ! భరించలేని సూర్యుడి వేడిమికి , తట్టుకోలేని ఆ అమిత కాంతికీ దూరంగా శాశ్వతంగా దూరంగా - చల్లగా , హాయిగా ఉండిపోవచ్చు !
ధ్యానంలో మునిగి , అరమోడ్పు కళ్ళతో ఉన్న సంజ్ఞ తటాలున కళ్ళు పూర్తిగా తెరిచింది. తన ప్రతిబింబంలాంటి స్త్రీ ఉంటే , అన్న ఆలోచన ఆమెలో నరనరానా ఉధృతమైన వేగంతో ప్రవహిస్తోంది. సంజ్ఞ ఇంక అక్కడ కూర్చోలేక పైకి లేచింది.
ఆలోచనల దండయాత్రను తట్టుకోలేని సంజ్ఞ అరణ్యంలో అటూ ఇటూ తిరుగుతూ ఉండిపోయింది. చీకట్లు ముసురుకుంటున్నాయి - వెలుపల చీకట్లు ముసురు కుంటున్నాయి. ఆమె లోపల ఏదో వెలుగు మెల్లగా , చాలా మెల్లగా విస్తరిస్తోంది. ఆ వెలుగు పూర్తిగా తనను ఆవరిస్తూ విస్తరిల్లేదాకా తను ధ్యాన నిష్ఠలో ఉండాలి. ఎలాగో తను చల్లటి ప్రకృతిలో తపస్సు చేస్తూ జీవితాన్ని ప్రశాంతంగా గడిపివేయాలనుకుంటోంది. సమస్య పరిష్కారం కోసం చేసే సాధన - భవిష్యత్తులో తపస్సుకు పునాది అవుతుంది !
రోజులు గడుస్తున్నాయి. తనకు కావాల్సిన సమాధానం కోసం , అంది రావాల్సిన పరిష్కారం కోసం ధ్యాన కాంతిలో వెదుకుతూ ఉండిపోయింది సంజ్ఞ.
ప్రాతఃకాలం... సంజ్ఞ ధ్యానం ఆపి , సరోవరం వైపు బయలుదేరింది. ఆమెలో సర్వకాలాలలో , సర్వావస్థల్లో మెదులుతూ ఉండే అంశం ఒక్కటే - తనకు ఇప్పుడు అత్యవసరంగా తనలాంటి స్త్రీ ఒకతె కావాలి !
సంజ్ఞ సరస్సు గట్టున నిలుచుని , అందంగా వికసిస్తున్న కన్నెతామరలను చూస్తూ ఉండిపోయింది. సరస్సులో నీరు నిర్మలంగా , నిశ్చలంగా ఉంది. తామర ప్రక్కనే తన ప్రతిబింబం నీటిలోంచి తన వైపు చూస్తోంది.
సంజ్ఞ అప్రయత్నంగా చిరునవ్వు నవ్వింది.
నీటిలో ప్రతిబింబం చిరునవ్వు నవ్వింది.
గాలికి కదిలిపోతూ , స్థాన భ్రంశం చెందుతున్న పైటను సర్దుకుంది సంజ్ఞ.
సరస్సులో ప్రతిబింబం పైట సర్దుకుంది. తనలాగే ఉన్న 'నీటిలో నీడ' తాను ఏం చేస్తే , అది చేస్తోంది ! ఉన్నట్టుండి సంజ్ఞ గుండె వేగంగా స్పందించడం ప్రారంభించింది.
తనలాగే , ముమ్మూర్తులా తనలాగే ఉన్న స్త్రీ తన ముందే ఉంది ! తనతోనే ఉంది ! అయితే దానికి - తన ప్రతిబింబానికి వ్యక్తిత్వం లేదు. తను ఉంటే అది ఉంటుంది ; తను కదిలితే కదుల్తుంది. అంతే !
అంతేనా ?! ఆ ప్రతిబింబానికి ప్రాణం పోస్తే ? ప్రత్యేకమైన ఉనికినీ , వ్యక్తిత్వాన్నీ దానికి ఆపాదింపచేస్తే ! తనలోని అన్ని లక్షణాలనూ , గుణగణాలనూ , అందులోకి ఆవాహనం చేస్తే !
సంజ్ఞలో ఏదో ఉత్సాహం ఉప్పెనలా పొంగుతోంది. ఔను ! సమస్యకు సమాధానం దొరికింది ! తన శక్తితో తన నీడకు ప్రతిబింబానికి ప్రాణం పోస్తుంది ! దానికో - పరిపూర్ణ వ్యక్తిత్వాన్ని ఆపాదిస్తుంది ! దానిలో జ్ఞానేంద్రియాలూ , కర్మేంద్రియాలూ తమ 'వ్యాపారాలు', క్రియలు నిర్వర్తించేలా చేస్తుంది !
తనకు ఆ శక్తి ఉంది. విశ్వకర్మ పుత్రికగా తనకు కొన్ని అపూర్వ శక్తులు జన్మసిద్ధంగా లభించాయి. అవసరం వస్తే , తాను కోరిన రూపాన్ని ధరించగలదు. తన ఛాయా రూపాన్ని నిజరూపంగా ఆవిష్కరించగలదు. నీడలోకి సర్వ ఇంద్రియాలనూ , మనస్సునూ , వాక్కునూ , ఆవాహనం చేయగలదు. ఆ సర్వేంద్రియాలకూ ప్రాణప్రతిష్ఠ చేయగలదు !
సంజ్ఞ ఆవేశంగా సరస్సులోకి దిగి , స్నానం చేసింది. వెలికి వచ్చి , తాను తపసు చేసిన చోటికి బయలుదేరింది. సరోవరం వద్దకు వచ్చినప్పుడు తన వెనక వైపున ఉంటూ తనను అనుసరించిన నీడ , ఇప్పుడు ముందు నడుస్తూ , తనకు దారి చూపుతోంది !
సంజ్ఞ ఆగింది. ఆలోచిస్తూ , సరోవరంలోని నీటిని చేతిలోకి తీసుకుంది. వెను దిరిగింది. తనలాగా నిలుచున్న నీడను చూస్తూ ఏదో సంకల్పించింది. చేతిలోని నీటిని నీడ మీద చల్లింది.
మరుక్షణం ఆ నీడ తన రూపంతో , తనలాగా రక్తమాంసాలతో నిలుచుంది ! తనను తాను నిలువుటద్దంలో చూసుకుంటున్న అనుభూతి కలుగుతోంది సంజ్ఞకు ! ప్రశ్నార్థకంగా తననే చూస్తున్న ఆ ప్రతిరూపాన్ని సంజ్ఞ చిరునవ్వుతో చూసింది.
*"నువ్వు నా ప్రతిరూపానివి !"* సంజ్ఞ అంది. ఆమెను సరస్సు వద్దకు లాగుతూ. *"నీటిలో మన ప్రతిబింబాలను చూడు !"* అంది.
*"ఓహ్ ! ఇద్దరం ఒక్కలాగే ఉన్నాం !"* ప్రతిరూపం ఉత్సాహంగా అంది. సంజ్ఞ చిరునవ్వుతో తల ఊపింది.
*"నా పేరు ?"* ప్రతిరూపం అడిగింది. తన కంఠస్వరాన్ని విన్న సంజ్ఞ అబ్బురపడకుండా ఉండలేకపోయింది.
*"నువ్వు నా ప్రతిబింబానివి ! నా నీడవు ! అంటే , నా ఛాయ అయిన కారణంగా నీకు 'ఛాయ' అని పేరు పెడుతున్నాను. నా పేరు సంజ్ఞ !”*
*"నాకు ప్రాణప్రతిష్ఠ చేశావు ! ఎందుకు ?"* ఛాయ ప్రశ్నించింది.
*"నువ్వు నా ప్రతిరూపానివి. నా స్థానంలో , నా భర్త అయిన సూర్యుడి పత్నిగా , నా బిడ్డలైన వైవస్వతుడికీ , యముడికీ , యమికీ తల్లిగా నటించాలి ; ఆ నటనలో జీవించాలి. నేను ఈ అరణ్యంలో తపస్సులో మునిగిపోతాను.”*
ఛాయ నవ్వింది. *"నేను నీలాగా ఉన్నాను ! నీ భర్త వద్దా , సంతానం ముందూ నీలాగే ఉంటాను ! అలా ఎంతకాలం ఉండాలి ?"*
*"శాశ్వతంగా !"* సంజ్ఞ అంది. *"శాశ్వతంగా నా భర్తతో సుఖిస్తూ , శారీరక , మానసిక ఆనందాలు పొందుతూ ఉండిపోవచ్చు నువ్వు. అయితే ఒక నిబంధన...”*
*“ఏమిటది ?”* ఛాయ అడిగింది.
*"నా భర్తను నీ భర్తగా స్వీకరించినట్టే , నా బిడ్డలను నీ బిడ్డలుగా స్వీకరించి ప్రేమాభిమానాలతో పెంచాలి !”*
*"నువ్వు నా ప్రాణదాత్రి సంజ్ఞా ! ఈ శరీరం , ఈ మనస్సు - అన్నీ నీవే ! నీ మాట జవదాటను. నీ భర్తకు భార్యగా , నీ బిడ్డలకు తల్లిగా , నటించడం కాదు - జీవిస్తాను !”* ఛాయ నవ్వుతూ అంది.
సంజ్ఞ ఛాయ వైపు ప్రేమగా చూసింది. *"నిన్ను చూస్తుంటే నాకు ముచ్చట వేస్తోంది , ఛాయా ! నా పోలికలతో , నా కవలగా జన్మించిన నా చెల్లెలివేమో అనిపిస్తోంది !'*
*"నాకూ అలాగే అనిపిస్తోంది సంజ్ఞా ! నువ్వు నా అక్కవి ! నేను నీ చెల్లిని ! ఇద్దరం ఒకే పోలికతో పుట్టాం అని... నాకు నిజంగా అనుభూతి కలుగుతోంది...”* ఛాయ చిరునవ్వుతో అంది.
సంజ్ఞ ప్రేమగా ఛాయ చేతిని పట్టుకుంది. *"రా , ఛాయా , వెళ్దాం ! నేను తపస్సు చేసే ప్రశాంత స్థలంలో కూర్చుని మాట్లాడుకుందా !”*
ఇద్దరూ అన్యోన్యంగా నడుస్తున్నారూ...
సంజ్ఞ , ఛాయా ఎదురెదురుగా కూర్చున్నారు.
బ్రాహ్మణ విద్యార్థులకి
*ఫ్లాష్... ఫ్లాష్... ఫ్లాష్....*
*ఇది చాలా ముఖ్యమైన విషయం దయచేసి ఓపికగా చివరివరకు చదవండి, మీకు ఉపయోగం లేకపోతే దీనిని మరొక బ్రహ్మణునికి పంపించండి*
*బ్రాహ్మణ విద్యార్థులకి శుభవార్త*
*ప్రస్తుత కాలమాన పరిస్థితులలో రిజర్వేషన్లు విధానం అమలువల్ల బ్రాహ్మణ విద్యార్థులు ఎంత కష్టపడి చదివినా ఎంసెట్ లో ర్యాన్క్ తెచ్చుకున్న మనకి ఒక గుర్తింపు ఉన్న విశ్వవిద్యాలయం లో ఇంజనీరింగ్ సీటు రాకపోవడంతో విద్యార్థులు తల్లిదండ్రులు ఎంతో మానసికంగా కృంగిపోతుంటారు.*
*ఈ విషయాన్ని సవివరంగా పరిశీలించిన జగద్గురువులు శ్రీ కంచి కామకోటి పీఠ మహాసంస్థానం పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ శంకర విజయేంద్ర సరస్వతీ మహాస్వామి వారు బ్రాహ్మణ్యమునకు సముచిత ప్రాధాన్యత ఇచ్చి వారికి కంచి యూనివర్సిటీ లో సీటు ఇప్పించడమే కాకుండా బ్రాహ్మణ విద్యార్థులు కి ప్రత్యేక హాస్టల్ ఏర్పాటు చేసి అక్కడ కూడా సాయంత్రం సమయంలో, యూనివర్సిటీ సెలవుల్లో వేదం, స్మార్తము, జ్యోతిష్యం, వైదికధర్మంలో అనేక అంశాలపై అవగాహన పెంపొందిస్తూ విద్యార్థులు కి చక్కని మార్గం చూపించాలని నిండు మనస్సుతో నిర్ణయం తీసుకున్నారు.*
*యూనివర్సిటీ లో హాస్టల్ లో నామమాత్రంగా ఫీజుల తీసుకొని హాస్టల్ నుండి యూనివర్సిటీ వరకు కూడా ఉచితంగా బస్ ఏర్పాట్లు కూడా చెయ్యాలని సంకల్పం చేశారు. IT, EEE, CSE, MECHANICAL, వంటి అన్ని కోర్సులు యూనివర్సిటీ లో ఉన్నాయి.*
*ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులు ఇంజనీరింగ్, డిగ్రీ కోర్సులలో, డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులు పోస్టు గ్రాడ్యుయేషన్ కోర్సులకు అర్హులు. యూనివర్సిటీ ఫీజులు నామమాత్రంగా వుండును.
యూనివర్సిటీ లో 60% పైన మార్కులు సాధించినవారికి 60,000 రూపాయలు పైన పారితోషకం కూడా ఇచ్చే ఏర్పాట్లు కలవు*
*కచ్చితంగా విద్యార్థులు సాంప్రదాయ పాఠశాల హాస్టల్లో మాత్రమే ఉండవలెను, సాంప్రదాయ వైదికధర్మంలో క్లాసులకు కచ్చితంగా సాంప్రదాయ దుస్తులతో హాజరు కావలెను, యూనివర్సిటీ కి వెళ్ళినపుడు వారి ఇష్టానుసారంగా ఫాంట్ షర్ట్ వెసుకోవచ్చు. హాస్టల్ ఫీజు కూడా బ్రాహ్మణ విద్యార్థులకి నామమాత్రంగా వుండును. ఈ అవకాశం అంతయూ కేవలము కంచిలో మాత్రమే అని తెలియచేస్తున్నాము.*
*ఆసక్తి ఉన్న విద్యార్థులు వారి ఇంటిపేరు గోత్రము, వూరు, సెల్ నెంబరు పాఠశాల ప్రతినిధి వారికి ఫోన్ ద్వారా 9866765439 *రవిచంద్ర గారు* *నెంబరుకి తెలియచేయవలెను.*
*ఉపనయనం అయిన విద్యార్థులు కు ప్రాధాన్యత కలదు, లేదా పీఠం వారు ఉపనయనం చేయుదురు దానికి అంగీకారాన్ని తెలియజేయాలి. ఇది కేవలం 100 మంది తెలుగు బ్రాహ్మణ విద్యార్థులు కి మాత్రమే అవకాశం కావున ఇంజనీరింగ్ లో సీటు పొందలేని వైదికధర్మం అనుసరించడానికి అంగీకారం కలవారు మాత్రమే పై నెంబరుకి ఫోన్ చెయ్యండి. 100 మంది విద్యార్థులు వివరాలు అందగానే శ్రీశ్రీశ్రీ శంకర విజయేంద్ర సరస్వతీ స్వామీజీ వారి ఆశీస్సులతో విద్యార్థులకు గోదావరి జిల్లాలలో ఒక నగరంలో ఒక సెమినార్ నిర్వహించి సెలెక్ట్ అయిన విద్యార్థులకు అడ్మిషన్లు ఇవ్వడం జరుగుతుంది. పేర్లు నమోదు చేసుకోవడానికి చివరితేదీ 14-9-22.*
*ఇది బ్రాహ్మణులకు మంచి అవకాశం కావున ఇది అన్ని బ్రాహ్మణ గ్రూపులకు, బ్రాహ్మణ విద్యార్థులకి షేర్ చెయ్యండి.*
*సర్వసాధారణంగా ఇటువంటివి అనేక ఫెక్ మెసేజ్ లు వాఁట్సాప్ లో చక్కర్లు కొడుతూఉంటాయి, అందువల్ల మీకు ఏమైనా సందేహాలు ఉంటే ఈ క్రింది నెంబరు కి కూడా ఫోన్ చేయవచ్చు.*
*సదా భరతమాత సేవలో*
*తూములూరి శ్రీకృష్ణచైతన్య శర్మ*
9491755938
*🌹శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర-40🌹*
🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹
*🌹శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర-40🌹*
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
*అన్నమయ్య-1*
అన్నమయ్య లేదా తాళ్ళపాక అన్నమాచార్యులు (మే 9, 1408 - ఫిబ్రవరి 23, 1503) తెలుగు సాహితీ చరిత్రలో లభించిన ఆధారాల ప్రకారం మొదటి వాగ్గేయకారుడు(సాధారణ భాషలో గేయాలను కూర్చేవారు). అన్నమయ్యకు పదకవితా పితామహుడు అని బిరుదు ఉంది. దక్షిణాపథంలో భజన సంప్రదాయానికి, పదకవితాశైలికి ఆద్యుడు. గొప్ప వైష్ణవ భక్తుడు.
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ని, అహోబిలము లోని నరసింహ స్వామి ని, ఇతర వైష్ణవ సంప్రదాయ దేవతలను కీర్తిస్తూ 32వేలకు పైగా కీర్తనలు రచించాడు . అన్నమయ్య పాటలు, పదాలు, పద్యాలలో భక్తి, సాహిత్యం, సంగీతం, శృంగారం, భావలాలిత్యం పెనవేసికొని ఉంటాయి.
కన్నడ వాగ్గేయకారుడు పురందరదాసు అన్నమయ్యను శ్రీనివాసుని అవతారంగా ప్రశంసించాడంటారు.
(సాక్షాత్తు శ్రీమహావిష్ణువు ఖడ్గమైన నందకం అంశతో అన్నమయ్య జన్మించాడని శ్రీవైష్ణవసంప్రదాయంలో నమ్మకం ఉంది. ప్రధాన మందిరంలో ఘంట అవతారమని కూడా అంటారు). త్యాగయ్య, క్షేత్రయ్య, రామదాసు వంటి సంకీర్తనాచార్యులకు అన్నమయ్య మార్గదర్శకుడు.
చందమామ రావే జాబిల్లి రావే అంటే వేంకటేశుడు ముద్దలు తిన్నాడో తినలేదో కానీ, తెలుగు పిల్లలు మాత్రము గబుక్కున తింటారు.
జోఅచ్యుతానంద జో జో ముకుందాఅంటే ముకుందుడు నిద్ర పోతాడో లేదో కానీ తెలుగు పిల్లలు మాత్రము హాయిగా నిద్ర పోతారు.
అన్నమయ్య పాటలు తెలుగు సంస్కృతికి ప్రతిరూపాలు. అవి తెలుగు సంస్కృతిలో ఒక భాగమై పోయినాయి; జనాల నోళ్ళలో నాటుకొని పోయినాయి. తుమ్మెద పాటలు, గొబ్బిళ్ళ పాటలు, శృంగార గీతాలు, ఆధ్యాత్మిక పదాలు - ఇలా మొత్తము ముప్పై రెండు వేల పాటలు వ్రాసాడు.
అన్నమయ్య మనుమడు తాళ్ళపాక చిన్నన్న అన్నమాచార్య చరితము అన్న ద్విపద కావ్యములో అన్నమయ్య జీవిత విశేషాలను పొందుపరచాడు. ఈ గ్రంథం 1948లో లభ్యమై ముద్రింపబడింది.
అన్నమయ్య జీవితం గురించి మనకు తెలిసిన వివరాలకు ఈ రచనే మౌలికాధారం. కాని బహువిధాలైన నమ్మకాలూ, అనుభవాలూ, ఘటనలూ, కథలూ ఈ వివరాలలో పెనవేసుకొని ఉన్నాయి.
నందవరీకులు క్రీ.శ. 10వ శతాబ్దంలో కాశినుండి ఆంధ్ర దేశానికి వలస వచ్చిన శుద్ధవైదిక బ్రాహ్మణులని పరంపరాయాత ప్రతీత. క్రీ.శ. 10వ శతాబ్దంలో నేటి కర్నూలు జిల్లాలోని "నందవరం" అనే గ్రామాన్ని నందుడనే రాజు పాలించేవాడు.
ఈ రాజు కాశియాత్రకు వెళ్ళినప్పుడు అక్కడ కొందరు వైదిక బ్రాహ్మణులుచాముండేశ్వరీ ఉపాసకులు పరిచయం అయ్యారని, ఆ సమయంలో వారణాసిలో క్షామం రాగా ఆ బ్రాహ్మణ కుటుంబాలు కొన్ని ఆంధ్రదేశానికి వలసివచ్చి నంద రాజు ఆశ్రయంలో స్ధిరపడ్డారనీ, నందరాజుచే తీసుకొని రాబడిన వైదికిలు కావడంచే నందవైదికులుగా ప్రచారం పొందారని జనవాక్యం. కాలక్రమాన వీరు నేటి కర్నూలు, కడప జిల్లాలో స్ధిరపడ్డారని పరిశోధకులు అభిప్రాయం. తాళ్ళపాక గ్రామ నామం అన్నమయ్య వంశస్ధులకు ఇంటిపేరుగా నిలిచింది. అన్నమయ్య కూడా నందవరీకుడే. ద్విపద కావ్యం ప్రకారం అన్నమయ్య తాత నారాయణయ్య. చదువు అబ్బక, గురువులు పెట్టే హింసలు భరించలేక నారాయణయ్య చనిపోవాలని అనుకొన్నాడట. వూరిలో గ్రామ దేవత చింతలమ్మ గుడివద్ద విషసర్పం పుట్టలో చేయి పెట్టాడట. అప్పుడు అమ్మవారు ప్రత్యక్షమై అతని వంశంలో మూడవతరంలో హరి అంశతో ఒకబాలుడు జన్మిస్తాడని చెప్పిందట.
*అన్నమయ్య తాతయ్య - నారాయణయ్య*
కడప జిల్లా రాజంపేట తాలూకా పొత్తిపి నాడు మండలం నడిబొద్దున తాళ్లపాక గ్రామం విరాజిల్లుతుండేది. ఆ గ్రామంలో వెలసిన చెన్నకేశవస్వామి, సిద్ధేశ్వరస్వామి కరుణాకటాక్షములతో ఆ గ్రామజనులు సుఖవంతులై జీవనం సాగించేవారు. ఇచ్చట చెన్నకేశవస్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠ చేసాడు.
సస్యశ్యామలమై విరాజిల్లే ఈ గ్రామం సన్మునులకు, అఖిల దేవతలకు నిజవాసమై వుండేదని అంటారు స్థలగ్యులు.ఈ చెన్నకేశవస్వామిని దేవతలు, ఋషులు, సిద్దులు ప్రతి రోజు పూజిస్తారు. ఈ చెన్నకేశవస్వామి గుడిని ఆశ్రయించుకొని కొన్ని బ్రాహ్మణ కుటుంబాలు జీవించేవి. ఆ గ్రామ వాసులు తలపక ఇందిరారమణపదైక మానసులుగా జీవనం సాగించేవారు. వాళ్లల్లో నారాయణయ్య చాల ప్రసిద్దుడు. ఇతని నాలుగోతరంలో మరో నారాయణయ్య వుండేవాడు. అన్నమయ్య పిత్రు పితామహులు నారాయణయ్య, విఠలయ్యలు విష్నుభక్తిరతులై తాళ్ళపాక చెన్న కేశవస్వామిని సేవించుకొంటు జేవితం గడిపేవారు.
ఈ నారాయణయ్య కథ తోనే మన అన్నమయ్య కథ మొదలౌతుంది.
నారాయణయ్యకు చిన్నతనంలో ఎంతకీ చదువు రాలేదు. తండ్రి విఠలయ్య నయాన భయాన చెప్పి చూశాడు. లాభం లేక పోయింది. తన వద్ద ప్రయోజనం లేదని ప్రక్కనే వున్న ఊటుకూరులో తన బంధువుల వద్ద వుంచాడు. ఊటుకూరు నేడు కడపజిల్ల రాజంపేట తాలూకాలో ఉంది. అన్నమయ్య మనవడు చినతిరుమలయ్య ఊటుకూరి చెన్నరాయని మీద కొన్ని సంకీర్తనలు కూడా రచించాడు. అక్కడ బళ్ళో ఉపాధ్యాయులు శతవిధాల ప్రయత్నించారు.
గురువులు నారాయణయ్యను చతుర్విధ ఉపాయాలకు గురి చేశారు. అయినా బాలునికి చదువుపట్ల శ్రద్ధకలుగలేదు. నారాయుణిని కళ్లల్లో నీళ్లే తప్ప నోట సరస్వతి పలకలేదు. వాళ్లు విసిగిపోయి బాలుని రకరకాల శిక్షలకు గురిచేసారు. చివరకు గురువు నారాయణయ్యను కోదండమున వ్రేలాడదీశారు. కోలగగ్గెర విధించారు. గుంజిళ్లు తీయించారు. కోదండం అంటే దూలానికి తాడు కట్టి వ్రేలాడతీయడం. కోలగగ్గెర అంటే కాళ్ళుచేర్చికట్టి కూలద్రోయడం.
నారాయాణయ్యను అయ్యవార్లు ఇంతటి కఠిన పరీక్షలకు గురిచెసినప్పటికి నారాయణయ్య లేత మనస్సు గాయపడింది. నలుగురూ అవహేళన చేస్తున్నారు. సిగ్గుతో, అవమానంతో క్రుంగిపోయాడు. ఇంతకంటె చావు మేలను కున్నాడు. నారాయాణయ్య ఊటుకూరు గ్రామశక్తి అయిన చింతలమ్మగుడి సమీపాన పుట్టలో పాముందని ఎవరో చెబుతుండగా విన్నాడు.
నారాయాణుడు ఒంటరిగ గుడి చేరి పుట్టలో చేయి పెట్టాడు. నేడు ఊటుకూరునందు చింతలమ్మ ఆలయం కనిపించదు. కాని ఊటుకూరు శివాలయంలో ఒకగదిలో వున్న స్త్రీమూర్తి విగ్రహం "చింతలమ్మ" అని స్ధానికుల అభిప్రాయం. పాము కరవలేదు సరికదా ! నారాయాణయ్యకు త్రికాల వేదినియైన చింతలమ్మ ప్రత్యక్షమైంది. నారాయాణయ్య ఏడుస్తూ ఆమె పాదాల మీద పడ్డాడు. చింతలమ్మ ఆ బాలుని ఓళ్ళో చేర్చుకొని వూరడించింది."ఎందుకు బాబు ఈ అఘ్హాయిత్యం. నీ మూడోతరంలో గొప్ప హరి భక్తుడు జన్మిస్తాడు. అతని వల్ల మీ వంశమే తరిస్తుంది. నీకు చదువు రాకపోవడమేమిటి వెళ్ళు,తాళ్ళపాక చెన్నకేశవస్వామే నీకు అన్నీ అనుగ్రహిస్తాడు" అని నారాయాణయ్యను అనుగ్రహించి అంతర్ధానమైనది. అమ్మవారి ఆదేశం ప్రకారం నారాయాణయ్య తాళ్ళపాకచేరి ఆశ్రితక్లేశనాశకుడైన చెన్నకేశవస్వామిని సేవించి స్వామి అనుగ్రహించే వేదవేదాంగ పారంగతుడై సకలవిద్యలు పొందగలుగుతాడు. సర్వజ్ఞుడని కీర్తి పొందుతాడు. ఈ నారాయాణయ్య కుమారుడే నారాయణసూరి.
అన్నమయ్య తండ్రి - నారాయణసూరి.
అన్నమయ్య తండ్రి అయిన నారాయణసూరి గొప్ప కవి, పండితుడు, సకల విద్యాధురంధరుడుగా ప్రసిద్ధికెక్కినవాడు. అన్నమయ్య తండ్రి పేరు ’నారాయణసూరి’గా చిన్నన్న పేర్కొనడాన్నిబట్టి తాళ్ళపాకవారు అన్నమయ్య జననానికి ముందే పండిత వంశస్ధులుగా కీర్తించబడేవారని భావించవచ్చును. నారాయణసూరి ధర్మపత్ని లక్కమాంబ, మహా భక్తురాలు. మధురంగా పాడుతుంది. ఈమె స్వగ్రామం మాడువూరు, కడప జిల్లా సిద్దపట్నంతాలూకాలో వున్నది. అక్కడ చెన్నకేశవస్వామి ఈమెతో ప్రత్యక్షంగా మాట్లాడేవాడట.
*అన్నమయ్య తండ్రి - తిరుమల పయనం*
భాగవతసేవా పరాయణులైన నారాయణసూరి, లక్కమాంబ లకు సంతానం లేకపోవడం తీవ్రవ్యధకు గురిఅయినారు. ఈ పుణ్య దంపతులు సంతానం కోసం చేయని వ్రతం లేదు, కొలవని దేవుడు లేడు. "మాకు మంచి కొడుకును ప్రసాదించు స్వామీ" అని ఏడుకొండలస్వామికి మ్రొక్కుకున్నారు. ముడుపులు కట్టుకున్నారు. ఒక మంచిరోజు చూసి ఇద్దరూ వేంకటేశ్వరస్వామి దర్శనం కోసం ప్రయాణమయ్యారు. లక్కమాంబ, నారాయణసూరి తిరుమలచేరారు. స్వామి మందిరం ప్రవేశించారు. గరుడగంభం వద్ద సాగిలి మ్రొక్కారు. వాళ్ళకేదో మైకం కమ్మినట్లైంది. కళ్లు మిరుమిట్లు గొలిపే తేజస్సు కనిపించి ధగధగ మెరిసే ఖడ్గాన్ని వాళ్ల చేతుల్లో పెట్టి అద్రుశ్యమైంది. వేంకటేశ్వరస్వామితన నిజ ఖడ్గమైన నందకాన్ని ఆ పుణ్య దంపతులకు ప్రసాదించాడు. వాళ్ళు పరమానంద భరితులయ్యారు. వేంకటపతిని దర్శించి స్తుతించారు. సంతోషంతో తాళ్లపాకకు తిరిగి వచ్చారు.
*నారాయణాచ్యుత గోవిందా, గోవింద నామా గోవిందా, శ్రీ* *విష్ణు దేవా గోవిందా, శ్రీ దామోదర గోవిందా; |*
*గోవిందా హరి గోవిందా, వేంకట* *రమణా గోవిందా, గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా. ||40||*
*శ్రీ వేంకటేశ్వరుని దివ్య లీలల లో మరికొన్ని తదుపరి సంపుటిలో తెలుసుకుందాం.*🙏
*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*
🌹🪷🌹🪷🌹🪷🌹🪷🌹🪷
నవగ్రహా పురాణం🪐* . *21వ అధ్యాయం*
🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹
. *🪐నవగ్రహా పురాణం🪐*
. *21వ అధ్యాయం*
🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐
*పురాణ పఠనం ప్రారంభం*
*చంద్రగ్రహ జననం - 3*
*"అదేమిటి స్వామీ , అలా అంటారు. నా సర్వస్వమూ మీరే. అది మీకు తెలుసుగా. పైగా ఇది వెన్నెల రాత్రి కాదు స్వామీ !”*
*“సరే... ఈరోజు ఒక మేడ ముందు ఆగి , భిక్ష అడగకుండా వచ్చేశావ్ ! ఎందుకు ?"* ఉగ్రశ్రవుడు శీలవతి మాటను వినిపించుకోనట్లు అన్నాడు.
*"ఆ ఇంట్లో భిక్ష తీసుకోవడం నాకు ఇష్టం లేదు స్వామీ...”*
*"కారణం !"* ఉగ్రుడు రెట్టించాడు. *"అది కలిగిన వారి ఇల్లులా కనిపించింది !".*
*"అవును...అయినా , ఆ ఇంట భిక్ష తీసుకోవడం దోషమని అనిపించింది ! నిజంగా అది దోషమే స్వామీ !"* అంది శీలవతి.
*"కారణం చెప్తావా లేదా ?"* ఉగ్రశ్రవుడు గద్దించాడు.
*"ఆ ఇల్లు ఒక వేశ్యది స్వామీ..."* శీలవతి మెల్లగా అంది. *"ఓహ్ ! మేడ మీద చందమామలా కనిపించింది , ఆ వేశ్య ముఖమన్నమాట !"* ఉగ్రశ్రవుడి కంఠం ఉత్సాహంగా ధ్వనించింది.
*"ఔను..."*
*"ఓహ్ ! చంద్రబింబంలాంటి ముఖం ! మెరుపు తీగలాంటి శరీరం ! అప్సరస కాబోలనిపించింది , చూస్తుంటే..."* ఉగ్రశ్రవుడు చెప్పుకుపోతున్నాడు.
*"పోనివ్వండి , స్వామీ ! ఆమె అందంతో మనకు అవసరమేమిటి ?"* శీలవతి సౌమ్యంగా అంది. *"హాయిగా నిద్రపోండి !"*
*"నాకు నిద్ర పట్టదు !"* ఉగ్రశ్రవుడు ఎటో చూస్తూ అన్నాడు. *"కంటికి కట్టిన ఆ వేశ్య సౌందర్యానుభవం వొంటికి పట్టేదాకా... నాకు నిద్ర పట్టదు !"*
*"స్వామీ... !"* శీలవతి కంఠంలో ఆశ్చర్యం పలికింది.
*"ఏం ? అంత ఆశ్చర్యపోతున్నావేమిటే ! వేశ్యా సంగమం అంత కానిపనైతే... వేశ్యలు ఎందుకుంటారే ! నన్ను ఆ వేశ్య ఇంటికి తీసుకెళ్ళు !"* ఉగ్రశ్రవుడు ఆజ్ఞాపించాడు.
*"స్వామి..."*
*"ఏం ? తీసుకెళ్ళలేవా ?"* ఉగ్రశ్రవుడు హూంకరించాడు. *"పతి ఆజ్ఞను ధిక్కరిస్తావా ?"*
*"చివరిసారిగా చెప్తున్నాను ! నన్ను ఈ క్షణంలోనే ఆ వేశ్య వద్దకు తీసుకెళ్ళాల్సిందే ! మోసుకెళ్ళాల్సిందే !"*
*"స్వామీ... దయచేసి శాంతంగా వినండి..."* శీలవతి దీనంగా అంది. *"వేశ్యలు ధనం లేని వారిని గడప తొక్కనివ్వరు... మన వద్ద ధనం...".*
*"లేదు - అది నాకు తెలుసు !"* ఉగ్రశ్రవుడు గర్జించాడు. *"మన వద్ద ధనమే కాదు. ధాన్యం కూడా లేదు ! అలాగని పస్తులుంటున్నామా ? ఏం చేస్తున్నావ్ ? నన్ను ఆ బుట్టలో కూలవేసి , ఎండలో ఎండిస్తూ , వానలో తడిపేస్తూ , కష్టపెడుతూ అడుక్కుతెస్తున్నావా లేదా ? అందర్నీ ధాన్య భిక్ష అడుగుతున్నావు ! ఆ వేశ్యను కూడా అడుగు ! ధనభిక్ష కాదు. ధాన్య భిక్ష కాదు. 'ప్రణయభిక్ష' అడుగు ! నీ పతి దేవుడికి ఇంత ప్రణయభిక్ష పెట్టమని ప్రార్ధించు !"*
*"స్వామీ...!"* శీలవతి నివ్వెరపోతూ అంది.
*"ఏమే ? స్వామి స్వామి అంటూ జపం చేస్తూ కూర్చుంటే మన కోరిక తీరదే పిచ్చిదానా ! నన్ను ఆ సౌందర్యరాశి ఇంటిముందుకు తీసుకెళ్ళు. దాని కాళ్ళు పట్టుకో. కన్నీళ్ళు పెట్టుకో. 'భిక్షం' సంపాదించు. లే ! బుట్ట తే !!"*
*"నా... ఆలోచన వినండి స్వామీ..."* శీలవతి ప్రాధేయపడుతూ అంది. *"మీ ఆరోగ్యం బాగాలేదు. లేవలేని స్థితిలో ఉన్నారు...".*
*"నోర్ముయ్ ! నిన్ను చూస్తూ ఇలా ఉండచుట్టుకుని పడి ఉన్నాను ! అంతే ! ఆ వేశ్య ముందుకెళ్ళగానే లేచి గంతులేస్తాను లేవే !"* అంటూ ఉగ్రశ్రవుడు తీక్షణంగా శీలవతి. మొహంలోకి చూశాడు. *"నేను రోగిష్టినయితేనేం ? చెప్పానుగా ! కాళ్ళు పట్టుకో ! కన్నీళ్లు పెట్టుకో ! కావాలంటే రేపూ మాపూ బిచ్చమెత్తి దానికి చెల్లిస్తానని మాట ఇచ్చుకో ! పద !"*
మంచం అంచుకి ఆవేశంగా జరుగుతున్న భర్తను నిస్సహాయంగా చూస్తూ , శీలవతి బుట్ట అందుకుంది. ఉగ్రశ్రవుణ్ణి బుట్టలోకి చేర్చి , ఆ బుట్టను తలమీదకి ఎత్తుకుంది. ఇంట్లోంచి అవతలకి నడిచింది...
శీలవతి భర్తను మోసుకుంటూ , చీకట్లో ఊరివైపు నడుస్తోంది. ఉగ్రశ్రవుడు బుట్టలో విలాసంగా వాలి కాళ్ళు ఆడిస్తూ , వేశ్య గురించి ఉత్సాహంగా ఏమిటేమిటో
చెప్తున్నాడు.
చీకట్లో శీలవతి నడకసాగుతోంది.
బుట్టలోంచి వెలికి సాగిన ఉగ్రశ్రవుడి పాదం ఆ చీకటి దారిలో ఎవరికో తాకింది.
*"అబ్బా !" అంది తీరని బాధతో ఒక పురుష కంఠం.
శీలవతి అప్రయత్నంగా ఆగింది. పరిశీలనగా చూసింది. కటిక చీకటిలో కొంచెం ఎత్తులో ఏదో ఆకారం లీలగా కనిపిస్తోంది.
*"నరకయాతన అనుభవిస్తున్న నన్ను తాకి , కదిలించి ఆ బాధను ఇనుమడింపచేసిన వారు ఎవరో - సూర్యోదయం కాగానే మరణిస్తారు ! ఇది ఈ మాండవ్య మహర్షి శాపం !”* ఏదో పురుష కంఠం ఏడో కఠోర బాధను ఓర్చుకుంటూ కర్కశంగా పలికింది.
*"నా కాలు ఎవరికో తాకింది !" ఉగ్రశ్రవుడు వణికే గొంతుతో అన్నాడు. శీలవతి గుండె దడదడ కొట్టుకుంది ! ఎవరా శపించింది సూర్యోదయమైతే తన భర్త మరణిస్తాడా ?...*
*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*
🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐
సౌందర్యలహరి🌹* *శ్లోకం - 18*
🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹
🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹
. *🌹సౌందర్యలహరి🌹*
*శ్లోకం - 18*
🌷🪷🌷🪷🌷🪷🌷🪷🌷🪷
*తనుచ్ఛాయాభిస్తే తరుణ తరణి శ్రీ సరణిభిః*
*దివం సర్వాముర్వీ మరుణిమనిమగ్నాం స్మరతి యః |*
*భవన్త్యస్య త్రస్యద్వనహరిణ శాలీన నయనాః*
*సహోర్వశ్యా వశ్యాః కతికతి న గీర్వాణ గణికాః ||*
తరుణ తరణి = ఉదయించే సూర్యుని యొక్క
శ్రీసరణిభి = యెర్రని కాంతుల ప్రవాహం వలె వున్న
తనుచ్ఛాయాభిస్తే = నీ శరీర కాంతిని
దివం సర్వాముర్వీ మరుణిమనిమగ్నాం స్మరతి యః = ఆ కాంతిలో ఈ ప్రపంచమంతా మునకలు వేస్తున్నట్లు ధ్యానంలో స్మరిస్తున్నారో అట్టివారికి
భవంత్యస్య త్రస్యద్వనహరిణ శాలీన నయనాః = ఈ లోకంలోని వారే కాక లేడికన్నుల వంటి కన్నులు కల
కతికతి న గీర్వాణ గణికాః = దివ్యలోకాలలోని అప్సరసలు అంటే వివిధ దేవతాశక్తులు
సహోర్వశ్యా వశ్యాః = వశమవుతారు.
ఇలా చెప్పారని ఉపాసకులు ఆ దేవతా శక్తులకు అప్సరసలకు లొంగిపోతారని కాదు. వీరు మాత్రం దేనికీ అధీనులు కారు అని అర్థం చేసుకోవాలి.
🙏🏻 *శ్రీమాత్రే నమః*🙏🏻
*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*
🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹
జంబుద్వీపం_అంటే_ఏమిటి?
#జంబుద్వీపం_అంటే_ఏమిటి?
జంబుద్వీపే భరతవర్షే భరతఖండే సంకల్ప మంత్రంలో వచ్చే పదాలు "జంబుద్వీపే భరతవర్షే భరతఖండే" అనేవి మనమందరం వినే ఉంటాము. మన హిందు ఆచారాలలో ఈ సంకల్ప మంత్రం ఒక అంతర్భాగం.
అసలు జంబుద్వీపం అంటే ఏమిటి?
జంబుద్వీపం అంటే కేవలం భారత ఉపఖండమే కాదు. జంబుద్వీపంలో ఆసియా, ఐరొపా,ఆఫ్రికా, ఉత్తర అమెరికా ఉండేవి. జంబుద్వీపాన్ని 9 వర్షాములుగా(భౌగోళిక ప్రాంతాలు) విభజించారు. వాటిలో మన భరతవర్షం ఒకటి. మిగిలిన 8 వర్షములు ఇవి:
1) కేతుముల వర్ష
2) హరి వర్ష
3) ఇలవ్రిత వర్ష
4) కురు వర్ష
5) హిరణ్యక వర్ష
6) రమ్యక వర్ష
7) కింపురుష వర్ష
8 ) భద్రస్వ వర్ష
పూర్వం భరతవర్షంగా పిలవబడిన మన భారతదేశం ఈజిప్టు, ఆఫ్ఘనిస్తాన్, బలుచిస్తాన్, ఇరాన్, సుమేరియా, క్యాస్పియన్ సముద్రం(ఒకప్పుడు కష్యప సముద్రం) వరకు వ్యాపించి ఉండేది. ఈ భరతవర్షంలో ఉండే భరత ఖండం(ప్రస్తుతం కోట్ల మంది భారతీయులు నివసిస్తున్న దేశం) వైదిక సంస్కృతి/నాగరికత కు ఆత్మ వంటిది. పాశ్చాత్యులు సృష్టించిన ఆర్యుల దండయాత్ర సిద్ధాంతం అబద్ధం అనడానికి ఇలాంటివి లెక్కలేనన్ని ఆధారాలు ఉన్నాయి. మనల్ని తక్కువ చేయడానికి ఈ సిద్ధాంతాన్ని సృష్టించారు. ఈ సిద్ధాంతంలో చెప్పిన అన్నీ ప్రాంతాలు భరత వర్షంలో ఉన్నాయి. కాబట్టి ఆర్యులనే వారు ఎవరు దండయాత్ర చేయలేదు.
ఇంకొక అద్భుతమైన విషయం ఏమిటంటే మన పూర్వీకులకు ప్రపంచ భూగోళ శాస్త్రం గురించి బాగా తెలుసు.
మనం గమనించాల్సింది ఇంకొకటి ఉంది. అప్పుడు చాలా వరకు దక్షిణ అమెరికా ఖండం, ఆఫ్రికా ఖండంలొ దక్షిణ భాగంలో సగం, మరియూ ఆస్ట్రేలియా మొత్తం నీటి కింద ఉండేవి. ఇంకొకవైపు ఇప్పుడు అట్లాంటిక్ మహా సముద్రం, పసిఫిక్ మహాసముద్రం, ఆర్కిటిక్ మహాసముద్రం గా పిలవబడేవి సముద్ర మట్టానికి పైన ఉండేవి.
దీన్ని బట్టి నిరూపితమైనది ఏమిటంటే వైదిక సంస్కృతి కేవలం 5000 సంవత్సరాల క్రితమే పుట్టిందని, కురుక్షేత్రం కేవలం కొన్ని సంవత్సరాల క్రితం జరిగిందని చెప్పేవారివి తప్పుడు ప్రచారాలు మరియు పచ్చి అబద్ధాలు. ఆస్ట్రేలియా నీటి కింద ఉన్నపుడే వైదిక నాగరికత ఉంది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మనది ఎంత పురాతనమైన నాగరికత అని !
మనల్ని దిగ్బ్రాంతికి గురిచేసే విషయం ఏమిటంటే మన ప్రభుత్వం ఇంకా మన పాఠ్య పుస్తకాలలో ఇటువంతి అబద్ధపు సిద్ధాంతాలను, భారత దేశానికి వ్యతిరేకంగా, భారత దేశాన్ని/భారతీయులను తక్కువచేసి చూపించే తప్పుడు చరిత్రను భోదిస్తుంది. మన ప్రభుత్వం దేశ యువతకు మన పూర్వికులు పామరులు/ఏమి తెలియని వాళ్ళు అని భోదిస్తుంది. దేశ భక్తులు కనుగొన్న నిజమైన చరిత్రను భోదించడం లేదు.
మన పాఠ్య పుస్తకాలలో మన ఋషుల గురించి పెట్టాలి అనే ప్రతిపాదన తెచ్చినపుడు విద్యావ్యవస్థను కాషాయమయం(Saffronisation) చేయొద్దని తిరస్కరించాయి. తమ సొంత దేశం యొక్క గొప్పతనాన్ని తిరస్కరించి మన పూర్వీకులను మనమే చిన్నచూపు చూసే దేశం ఎదైనా ఉంటుందా? ఏం మన ఋషులు భారతీయులు కాదా? వారి గురించి మన పాఠ్య పుస్తకాలలో ఎందుకు ఉండకూడదు?
ఇప్పటికైనా భారతీయులు మేలుకోవాలి. మనం ఎంత గొప్ప సంస్కృతికి వారసులమో గ్రహించి మన సంస్కృతిని కాపాడుటకు మనవంతు కృషి చేయాలి.
🚩సర్వేజనాః సుఖినోభవంతు🚩సే క ర ణ: మీ గుంటూరి వేంకట శివ రామ కృష్ణ శర్మ సిద్ధాంతి
శివపార్వతులమధ్య
శు భో ద యం 🙏🙏
శివపార్వతులమధ్య వ్యత్యాసము!
కవిసామ్రాట్ విశ్వనాధ!
11. నీవో యౌవనమూర్తి వౌదు వసురానికంబు మ్రదించు శి
క్షావైశద్యము పొల్చు నీతనువు నీశా! అన్నపూర్ణాంబికా
దేవిం జూచిన వృద్ధవోలె మదికిన్ దీపించు దాంపత్య మీ
భావం బెవ్వఁ డెఱుంగు శైలతనయా ప్రాణేశ! విశ్వేశ్వరా
ఓ విశ్వేశ్వరా! పార్వతీప్రాణనాథా!
ఈశా!
నీవా- అసురసమూహములను శిక్షించు స్పష్టతగల యౌవనము
గల శరీరముగలవాడవు.
అన్నపూర్ణమ్మతల్లియో- తలపండినవృద్ధ!అనిపించును.
మీదాంపత్య రహస్యంబెరిగినవాడెవ్వరయ్యా?!
దేవదేవుడవు.
సదాత్రిదశులకు ఆదిదేవుడవు.
యౌవనముగూడుగట్టినదొరవి.
రాక్షసశిక్షా దక‌్షుడవు. వారినిమ్రందించుబలశాలివి.
కనుక యౌవనము రూపుగట్టిన దార్ఢ్యమునీది!
ఇక అన్నపూర్ణమ్మ --
శ్రీనాథుడనినట్లు---
"వేదపురాణశాస్త్రపదవీనదవీయసియైన పెద్దముత్తైదువ!"
యుగయుగాలుగాఎందరు జీవులకో ప్రాణదాత్రియై తలపండిన వృద్ధ!
తిలతండులన్యాయమునచెప్పదగు కేశపాశమనినాడు కవిసార్వభౌముడు!
కాశీ క్షేత్రంలో శివునికేఅన్నభిక్ష ఇడిన మహామాత- అన్నపూర్ణాదేవి!
ఎంత వింత దంపతులుమీరు!
విశ్వేశ్వర శతకము-🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🙏🙏🌷🌷🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷
ఆదివారం, సెప్టెంబరు 10, 2023
*శ్రీమతే రామానుజాయ నమ:*
*శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయరు స్వామివారి మంగళాశాసనాలతో*
*ఆపదామపహర్తారం దాతారం సర్వ సంపదాం*
*లోకాభిరామం శ్రీరామం భూయో భూయో* *నమామ్యహం*
ఆదివారం, సెప్టెంబరు 10, 2023
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయనం - వర్ష ఋతువు
నిజ శ్రావణ మాసం - బహుళ పక్షం
తిథి:ఏకాదశి రా10.25 వరకు
వారం:ఆదివారం (భానువాసరే)
నక్షత్రం:పునర్వసు రా7.18 వరకు
యోగం:వరీయాన్ రా2.18 వరకు
కరణం:బవ ఉ9.46 వరకు తదుపరి బాలువ రా10.25 వరకు
వర్జ్యం:ఉ6.22 - 8.06 & తె4.02 - 5.47
దుర్ముహూర్తము:ఉ4.26 - 5.15
అమృతకాలం:సా4.43 - 6.26
రాహుకాలం:సా4.30 - 6.00
యమగండ/కేతుకాలం:మ12.00 - 1.30
సూర్యరాశి సింహం చంద్ర రాశి మిథునం
సూర్యోదయం:5.50
సూర్యాస్తమయం:6.05
*ఏకాదశి*
*శ్రీమతే రామానుజాయ నమ:*
*మఱ్ఱిపల్లి శ్రీధరాచార్యులు*
*మిట్టాపల్లి*
సుభాషితమ్
🕉️ *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🕉️
ॐ卐 *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐
𝕝𝕝శ్లోకం𝕝𝕝
*గుణః కుర్వన్తి దూతత్వం దూర్యపి వసతాం సతామ్౹*
*కేతకీ గంధ మాఘ్రాయ స్వయమాయాన్తి షట్పదః॥*
𝕝𝕝తా𝕝𝕝
సత్పురుషులు మరియు ప్రతిభావంతులైన వ్యక్తులు దూరంగా నివసిస్తున్నప్పటికీ, వారి ప్రతిభ ఒక దూత వలె పని చేస్తుంది మరియు వారి ఉనికిని తెలియజేస్తుంది. మరియు కేతకి పుష్పం దాని మధురమైన వాసనకు ఆకర్షింపబడి దాని వద్దకు వచ్చే తుమ్మెదల వలె ప్రజలు వారి వద్దకు వస్తారు.
లక్ష్య సిద్ధి!*
*లక్ష్య సిద్ధి!*
➖➖➖✍️
వేద వాంఙ్మయంలో హోమ పక్షి ప్రస్తావన ఉంది. ఆ పక్షి ఎప్పుడూ ఆకాశంలోనే ఎగురుతూ ఉంటుంది. దానికి ఆహారం ఆకాశంలో దొరకదు కాబట్టి, భూమి మీద ఆహారాన్ని స్వీకరిస్తుంది. కానీ, కాళ్లు భూమిపై మోపదు. అది గుడ్లు కూడా భూమిమీద పెట్టదు. ఆకాశంలో ఎగురుతూనే గుడ్డు జారవిడుస్తుంది. గుడ్డు భూమిపైకి జారేలోగానే దాన్నుంచి పక్షిపిల్ల బయటకు వస్తుంది.
పిల్ల అలా కిందికి జారుతున్న సమయంలోనే రెక్కలు మొలుచుకొస్తాయి. పక్షిపిల్ల లక్ష్యం తన తల్లిని చేరటమే! రెక్కలు అల్లాడించి పైకి ఎగిరే ప్రయత్నం చేస్తుంది. నెమ్మదిగా తల్లిని కలుసుకోవడమనే లక్ష్యాన్ని సాధిస్తుంది.
భగవంతుని చేరాలనే లక్ష్యాన్ని భక్తుడు అలా సాధించుకోవాలంటారు రామకృష్ణ పరమహంస.
సంసారికైనా, సన్యాసికైనా ఆశించదగ్గ ఏకైక బ్రహ్మపదార్థం- భగవంతుడే!
ఆధునిక ప్రపంచంలో లౌకిక జీవనం చేసే మానవులకు కర్మ, జ్ఞాన యోగాలు అనుష్ఠించడం ఎంతవరకు ఆచరణ సాధ్యం?
కర్మయోగం నిష్కామకర్మను(చేసిన కర్మకు ఫలితాన్ని ఆశించకపోవడం) ప్రతిపాదిస్తుంది.
నిష్కామకర్మ ఆధునిక జీవితంలో సాధ్యమా అని యోచిస్తే, సమాధానం ఆశాజనకంగా ఉండదు.
జీతమే లక్ష్యంగా ఉద్యోగం, లాభమే లక్ష్యంగా వ్యాపారం, ఆదాయమే లక్ష్యంగా పెట్టుబడి- మనం చేసే అలాంటి వ్యాపకాలేవీ నిష్కామకర్మలు కావు.
జ్ఞానయోగం నేను, నాది అనే భ్రమను వీడమంటుంది. స్థితప్రజ్ఞతను ప్రతిపాదిస్తుంది. సుఖాల్లో పొంగిపోతాం. కష్టాల్లో కుంగిపోతాం. రోగాలకు చలించిపోతాం. చావంటే వణికిపోతాం. మరి స్థితప్రజ్ఞత సాధించేదెన్నడు?
ఓ దేహధారిగా స్థితప్రజ్ఞుడికీ దేహావసరాలుంటాయి. ఆ అవసరాలు తీర్చుకోకుండా బతుకు బండి సాగదు. బాహ్యసంరక్షకులుగా ఎవరున్నప్పటికీ ఎవరికైనా దేహభారం వహించేది నిజానికి దైవమే. ఆ ఎరుకే ఆయన పట్ల మనిషి చూపగల నిజమైన కృతజ్ఞత!
సంపద, పలుకుబడి, అందం, అధికారం, హోదా, కళాభినివేశం వంటి ప్రలోభాలకు దాసుడుకాని వ్యక్తి ఆత్మసాధన పట్ల నిజాయతీ కలిగి ఉంటాడు.
కలియుగంలో భక్తిమార్గం ద్వారానే దైవాన్ని సాకారం చేసుకోవాలనే కల నిజం చేసుకోవచ్చంటాయి శాస్త్రాలు. లక్ష్యాన్ని సాధించగలనన్న సాధకుడి బలమైన విశ్వాసం అతడికి సత్ఫలితాలను అందిస్తుంది.
ఒకప్పుడు ఓ ప్రాంతంలో అనావృష్టి విలయతాండవం చేసింది. వరుణదేవుడి కరుణ కోసం గ్రామస్థులంతా దేవాలయంలో జప తపాలు, ప్రత్యేక పూజలు చేయాలని సంకల్పించారు.
నిర్ణయించిన ముహూర్తానికి వైదిక కర్మలు ప్రారంభమయ్యాయి. ఆలయ ప్రాంగణానికి ఓ బాలుడు గొడుగుతో వచ్చాడు. పూజాఫలంగా వర్షం కురుస్తుందనీ, అప్పడు ఛత్రం ఉపయోగించవచ్చనీ బాలుడి బలమైన విశ్వాసం.
అటువంటి నమ్మకం అవసరం. లక్ష్యాన్ని సాధించగలనన్న దృఢ విశ్వాసం సాధకుడికి ఉండటం అత్యంత ఆవశ్యకం!
లక్ష్యశుద్ధి లేకుండా లక్ష్యసిద్ధి జరగదన్నది పెద్దల మాట!✍️
*సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🌷🙏🌷
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
➖▪️➖