10, సెప్టెంబర్ 2023, ఆదివారం

శ్రీ వివేకానందస్వామి🚩* . *🚩జీవిత గాథ🚩* *భాగం 34*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

.    *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*

.   *ఓం నమో భగవతే రామకృష్ణాయ*


.       *🚩శ్రీ వివేకానందస్వామి🚩*

.                *🚩జీవిత గాథ🚩*   


*భాగం 34*


*నరేంద్రుడు కాలాంతరంలో ఇలా చెప్పాడు* 


రెండోసారి శ్రీరామకృష్ణుల దగ్గరికి వెళ్లాను. అప్పుడు ఆయన  తన్మయులై కూర్చుని ఉన్నారు. అక్కడ ఎవరూ లేరు. నన్ను చూడగానే పట్టరాని ఆనందంతో నన్ను పిలిచి మంచం మీద ఒక ప్రక్కన వచ్చి కూర్చోమన్నారు. నేను కూర్చొన్నాను. ఆయన ఏదో తెలియరాని వింతైన మనోభావంలో మునిగివున్నారు. అస్పష్టంగా గుసగుసగా ఏదో చెబుతూ నన్ను తదేకంగా చూస్తూ నాకేసి మెల్లగా జరగసాగారు. 'పిచ్చి మొదలయింది. ఆ రోజు మాదిరి నేడు కూడా ఏదో విపరీతం చేయనున్నారు' అని అనుకొన్నాను. ఇంతలో ఆయన నన్ను సమీపించి తన కుడిపాదాన్ని నా మీద ఉంచారు. ఆ క్షణంలోనే నాకు ఒక అద్భుత అనుభవం కలిగింది. నా కళ్లు తెరచుకొనే ఉన్నాయి. కాని నేను చూసిందేమిటో తెలుసా?


"గదిలోని వస్తువులన్నీ గోడలతోసహా గిర్రున తిరుగుతూ అదృశ్యమయి పోయాయి. చరాచర ప్రపంచమూ, దానితోబాటు 'నేను' అనే భావనా సమస్తం మహాశూన్యంలో లయించిపోతున్నట్లు తోచింది! చెప్పనలవిగాని మహాభయం నన్ను ఆవరించింది; నేను - అనే భావన నాశనమే మరణం, ఆ మరణం ఇదుగో నిలబడివుంది, నా కళ్లు ముందు నిలబడివుంది' అని అనిపించింది! నేను భరించలేకపోయాను. 'హా! నన్ను మీరు ఏం చేస్తున్నారు! నాకు తల్లితండ్రులున్నారు' అని కేకపెట్టాను. అది విని ఆ అద్భుతమైన పిచ్చివాడు పెద్దగా నవ్వి తన చేతులతో నా ఛాతీని స్పృశిస్తూ, 'అలా అయితే ఇక చాలు. ఒకేసారిగా వద్దులే, సకాలంలో అంతా జరుగుతుంది' అని అన్నారు. ఆయన అలా పలికిన మరుక్షణమే నా అద్భుత అనుభవం అదృశ్యమయింది! నేను సహజ స్థితిలోకి వచ్చాను. గది లోపల, వెలుపల ఉన్న వస్తువులన్నీ మునుపటిలా ఉన్నట్లే కని పించాయి.


"ఈ సంఘటనను వివరించడానికి ఇంతసేపు పట్టింది. కాని ఇవన్నీ ఒకటి రెండు క్షణాల్లో జరిగిపోయాయి. ఈ సంఘటన నా మనస్సులో గొప్ప విప్లవం కలిగించింది. ఏం జరిగిందోనని విస్తుబోతూ యోచించాను. ఈ వింత వ్యక్తి వలన క్షణంలో ఈ అనుభవం కలిగి, అంతే వేగంతో మాయమయిపోయింది.


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

👉 *రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

కామెంట్‌లు లేవు: