3, సెప్టెంబర్ 2020, గురువారం

*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం


*అష్టమ స్కంధము - ఇరువది ఒకటవ అధ్యాయము*


*శ్రీమహావిష్ణువు బలిని పాశములచే బంధించుట*


*ఓం నమో భగవతే వాసుదేవాయ*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉


*21.18 (పదునెనిమిదవ శ్లోకము)*


*హన్యమానాన్ స్వకాన్ దృష్ట్వా పురుషానుచరైర్బలిః|*


*వారయామాస సంరబ్ధాన్ కావ్యశాపమనుస్మరన్॥7112॥*


విష్ణుభగవానుని పార్షదులు తన సైనికులను వధించుచుండుటను బలిచక్రవర్తి చూచెను. అప్పుడు అతడు శుక్రాచార్యుని శాపమును స్మరించి, వెంటనే అతడు యుద్ధోన్ముఖులైన తన సైనికులను వారించెను.


*21.19 (పందొమ్మిదవ శ్లోకము)*


*హే విప్రచిత్తే హే రాహో హే నేమే శ్రూయతాం వచః|*


*మా యుధ్యత నివర్తధ్వం న నః కాలోఽయమర్థకృత్॥7113॥*


విప్రచిత్తి, రాహువు, నేమి మున్నగు దైత్యులను సంబోధించుచు అతడు ఇట్లు పలికెను - "సోదరులారా! నామాట వినుడు. యుద్ధము చేయవలదు. మరలిరండు. మన ప్రయత్నములకు ఇది అనుకూల సమయము గాదు.


*21.20 (ఇరువదియవ శ్లోకము)*


*యః ప్రభుః సర్వభూతానాం సుఖదుఃఖోపపత్తయే|*


*తం నాతివర్తితుం దైత్యాః పౌరుషైరీశ్వరః పుమాన్॥7114॥*


దైత్యయోధులారా! సకల ప్రాణుల సుఖదుంఖములను నిర్ణయించునది కాలమే. మానవులు తమ ప్రయత్నములచే కాలపురుషుని అతిక్రమించలేరు.


*21.21 (ఇరువది ఒకటవ శ్లోకము)*


*యో నో భవాయ ప్రాగాసీదభవాయ దివౌకసామ్|*


*స ఏవ భగవానద్య వర్తతే తద్విపర్యయమ్॥7115॥*


కాలపురుషుడు ఇంతకుముందు మన ఉన్నతికి, దేవతల పతనమునకు కారణమైయుండెను. అతడే ఇప్పుడు వారి అనుకూల్యమునకు, మన ప్రతికూలమునకును, హేతువు అగుచున్నాడు.


*21.22 (ఇరువది రెండవ శ్లోకము)*


*బలేన సచివైర్బుద్ధ్యా దుర్గైర్మంత్రౌషధాదిభిః|*


*సామాదిభిరుపాయైశ్చ కాలం నాత్యేతి వై జనః॥7116॥*


సైన్యము, సచివులు, తెలివితేటలు, దుర్గములు, మంత్రములు, ఔషధులు, సామదానాది ఉపాయములు మొదలగు ఏ సాధనముల ద్వారాను మానవుడు కాలముపై విజయమును సాధింపజాలడు.


*21.23 (ఇరువది మూడవ శ్లోకము)*


*భవద్భిర్నిర్జితా హ్యేతే బహుశోఽనుచరా హరేః|*


*దైవేనర్ద్ధైస్త ఏవాద్య యుధి జిత్వా నదంతి నః॥7117॥*


దైవము మీకు అనుకూలముగా ఉన్నప్పుడు మీరు దేవతల అనుచరులను పెక్కు పర్యాయములు జయించితిరి. కాని, వారే ఇప్పుడు యుద్ధములో కాలము కలసిరాని మనలను ఓడించి, సింహనాదములను చేయుచున్నారు.


*21.24 (ఇరువది నాలుగవ శ్లోకము)*


*ఏతాన్ వయం విజేష్యామో యది దైవం ప్రసీదతి|*


*తస్మాత్కాలం ప్రతీక్షధ్వం యో నోఽర్థత్వాయ కల్పతే॥7118॥*


దైవము మనకు అనుకూలమైనచో, మనమే వీరిని జయింపగలము. కావున మన కార్యము సఫలమగుటకు అనుకూలమైన సమయము కొరకు నిరీక్షింపుడు".


*శ్రీశుక ఉవాచ*


*21.25 (ఇరువది ఐదవ శ్లోకము)*


*పత్యుర్నిగదితం శ్రుత్వా దైత్యదానవయూథపాః|*


*రసాం నిర్వివిశూ రాజన్ విష్ణుపార్షదతాడితాః॥7119॥*


*శ్రీశుకుడు వచించెను* శ్రీహరి పార్షదులచే జయింపబడి దైత్య, దానవ సేనాపతులు తమ ప్రభువైన బలిచక్రవర్తి ఆదేశములను విని యుద్ధమును మాని రసాతలమునకు వెళ్ళిపోయిరి.


*21.26 (ఇరువది ఆరవ శ్లోకము)*


*అథ తార్క్ష్యసుతో జ్ఞాత్వా విరాట్ ప్రభుచికీర్షితమ్|*


*బబంధ వారుణైః పాశైర్బలిం సౌత్యేఽహని క్రతౌ॥7120॥*


దైత్యులు వెళ్ళిపోయిన పిదప శ్రీహరి అభిప్రాయము గమనించి, సుత్యాహస్సు (సోమరసమును) దంచురోజున పక్షిరాజైన గరుత్ముంతుడు బలిచక్రర్తిని వరుణపాశములచే బంధించెను.


*బమ్మెర పోతనామాత్యుల వారి పద్యము*


*ఆటవెలది*


నొడివినంత పట్టు నుసలక యిచ్చుచో

నేల కట్టు విష్ణుఁ డేటి మాట?

గట్టెనేనిఁ దాన కరుణించి విడుచును

విడువకుండ నిమ్ము విమలచరిత! "


*తాత్పర్యము*


నిర్మల ప్రవర్తన గల శుక్రాచార్యా! అదేం మాట, అన్నమాట ప్రకారం ఆలస్యం చేయకుండా దానం ఇస్తే విష్ణువు ఎందుకు బంధిస్తాడు. ఒకవేళ బంధించాడే అనుకో అతడే దయతో విడిచి పెడతాడు. విడిచి పెట్టకపోతే పోనీ ఇబ్బందేం ఉంది?”


(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి అష్టమస్కంధములోని ఇరువది ఒకటవ అధ్యాయము ఇంకను కొనసాగును)


🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుఫ🙏🙏


*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319

అనంతమైన అనుభవాలు

 

కేరళ నుండి ఒక జ్యోతిష్కుడు పరమాచార్య స్వామివారి దర్శనానికి వచ్చాడు. ఆరోజు స్వామివారు కాష్టమౌనంలో వున్నారు. ఆ జ్యోతిష్కునితో ఏమీ మాట్లాడలేదు కానీ, చిరునవ్వుతో ఒక పండును అతనికి అనుగ్రహించారు.


జ్యోతిష్కుడు బయటకు వచ్చాడు. శ్రీమఠం సిబ్బంది అతణ్ణి చుట్టుముట్టారు. ప్రతి ఒక్కరికీ సమస్యలు ఉండడం సహజం కదా? ఆ సమస్యలు ఎప్పుడు అంతం అవుతాయో అని తెలుసుకోవడం అందరికీ ఇష్టమే కదా.


వెంటనే ఆ జ్యోతిష్కుడు, “ఇక్కడ నేను జోస్యం చెప్పలేను. ఇక్కడ, ఈ స్థలంలో పరమాచార్య స్వామి పరిపూర్ణ సాన్నిధ్యం ఉంటుంది. స్వామివారు ఉన్న చోటునుండి మూడువందల అడుగుల లోపల ఏ గ్రహమూ మాట్లాడాదు; ఏ దేవతా బదులివ్వదు. మీరు నేను బస చేస్తున్న చోటుకు రండి; మీ ప్రశ్నలకు సమాధానం ఇస్తాను” అని చెప్పారు.


ఒక్క దర్శనంతోనే ఆ జ్యోతిష్కుడు స్వామివారిని అర్థం చేసుకున్నాడు.


**********************************************************


ఒక భక్తుడు కాశీ క్షేత్రంలో రుద్రైకాదశి జప హోమం చేసి, అక్కడి నుండి గంగాజలం తీసుకునివచ్చి పరమాచార్య స్వామివారికి సమర్పించాడు.


“నీవు రుద్రైకాదశి కోసం ఎక్కడి నుండి గంగాజలాన్ని సేకరించావు?” అని అడిగారు స్వామివారు.


“వైదికులు ఆ జలాన్ని కాశీలోని కేదార్ ఘాట్ గంగా నుండి తీసుకునివచ్చారు”.


“కాశీ పరమేశ్వరుని సొంతం. గంగ నీరు, గంగ మన్ను వంటివి అక్కడినుండి తీసుకునిరాకూడదు. నువ్వు అక్కడినుండి తెచ్చిన తీర్థాన్ని ఏదైనా బిల్వ చెట్టు మొదట్లో వెయ్యి” అని ఆదేశించారు స్వామివారు.


“గంగ ఎక్కడైతే శుద్ధ గంగగా ఉంటుందో అక్కడి నుండి గంగాజలాన్ని తీసుకునిరావాలి. యమునా నది తనలో కలవడానికి ముందు ఉన్నదే శుద్ధ గంగ” అని చెప్పారు స్వామివారు.


********************************************


పరమాచార్య స్వామివారు విడిదిచేసిన ఆ పల్లెటూరిలో కొన్ని గుడిసెలు వున్నాయి. సాయంత్రం పూట ఆ పిల్లలందరూ ఎందరో ఎంతో ఉత్సాహంగా, ఆనందంగా, ఎంతో అల్లరితో ఒకర్నొకరు కొట్టుకుంటూ, పెద్దగా అరుస్తూ ఆడుకుంటున్నారు. (అటువంటి సందర్భంలో తాము కూడా ఆ పిల్లలతో పాటు చేరిపోయి ఆడుకోవాలన్న భావం స్వామివారి కళ్ళల్లో కనిపిస్తుంది)


అలా ఆ పిల్లల ఆటలను, అల్లరిని చూస్తున్న స్వామివారి దగ్గరికి ఒకామె గిన్నె నిండుగా పాలకోవా తీసుకునివచ్చి, స్వామివారి ముందర ఉంచి, పంచాంగ నమస్కారం చేసింది.


“ఏమిటిది? పాలను మరిగించి తీసుకునివచ్చావా?” అని అడిగారు.


“అవును”


“తియ్యగా ఉంటుందా?”


“అవును ఉంటుంది”


“వాసన?”


ఆమె బదులు చెప్పేలోగానే, స్వామివారే బదులిచ్చారు. “అవును, అది ముక్కుపుటాలను చీల్చుకుని వెళ్తోంది”


“నేను చాలా మడితో తయారుచేశాను. పుల్లగా అవ్వదు. నాలుగు రోజుల దాకా పాడవ్వడు. రోజూ, స్వామివారు కొంచం, కొంచంగా . . .”


స్వామివారు ఆమె మాటలను ఏమాత్రం వింటునట్టులేదు. కానీ ఎంతో కుతూహలంతో, “నువ్వు ఏమి చేస్తావంటే, అక్కడ ఆడుకుంటున్న పిల్లల దగ్గరకు ఈ గిన్నె తీసుకునివెళ్లి, అంతా వారికి పంచి ఖాళీ గిన్నెను తీసుకునిరా, సరేనా? నాకోసం ఇంకోసారి తయారుచేసుకుని తీసుకునిరా . . .”


క్షీర సాగర శయనుడు మొహిని దేవి రూపంలో అమృతాన్ని పంచినట్టు, ఆమె ఆ పాలకోవాను పరిపూర్ణ తృప్తితో పిల్లలకు ఇచ్చింది. అ పిల్లలు ఆ పాలకోవా తినదన్ చూసి స్వామివారు ఆనందించారు.


*******************************


పరమాచార్య స్వామివారి ఆగమనాన్ని ప్రతి చిన్న ప్రాణి కూడా ఆనందించింది. శివాస్థానంలో ఎవరూ స్వామివారి గదిలోకి వెళ్ళేవారు కాదు. తమ పనులను స్వామివారే స్వయంగా చేసుకునేవారు.


సేవకులు స్వామివారి గది బయట చిన్న చెక్క పాత్రల్లో నీరు ఉంచేవారు. కాళ్ళు, చేతులు కడుక్కోవడానికి మరియు అనుష్టానానికి వాటికవే ప్రత్యేకంగా ఉంచేవారు. ఎండాకాలంలో ఎలుకలు, ఉడుతలు మరియు పక్షులు నీతి కోసం అంతా తిరిగి తిరిగి వెతికేవి.


శిష్యులు, భక్తులు ఎవ్వరూ కూడా స్వామివారి గదిలోకి వెళ్లలేకపోయినా, ఈ జంతువులకి అలాంటి అడ్డంకి ఏం లేదు. పూర్తి స్వాతంత్ర్యంతో లోపలకు వెళ్ళి, ఆ చక్క పాత్రలపైకి ఎక్కి, లోపలకు తొంగిచూసి, దాహం తీరేదాకా నీరు త్రాగి పారిపోయేవి.


అవి వచ్చి నీరుతాగి వెళ్లిపోవడాన్ని గమనిస్తూ ఆనందించేవారు స్వామివారు. మనకు అవి ఎలుక, ఉడుత, పిచ్చుక లాగా కనిపిస్తాయి, కానీ స్వామివారికి అవి గణపతి, రామపిరన్, నారాయణుడుగా కనిపిస్తాయేమో.


--- శ్రీమఠం బాలు, కాంచీపురం. మహా పెరియవాళ్ - దరిశన అనుభవంగళ్ 1


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

_సిద్ధమంగళ_స్తోత్రం

#శ్రీ_పాద_శ్రీ_వల్లభ_స్వామివారి_సిద్ధమంగళ_స్తోత్రం👍💐💐
.

శ్రీ పాద శ్రీ వల్లభ స్వామి వారి సిద్ధ మంగళ స్తోత్రం

శ్రీమదనంత శ్రీ విభూషిత అప్పల లక్ష్మీనరసింహ రాజా
జయవిజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ

శ్రీవిద్యాధరి రాధ సురేఖా శ్రీరాఖీధర శ్రీపాదా
జయవిజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ

మాతా సుమతీ వాత్సల్యామృత పరిపోషిత శ్రీపాదా
జయవిజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ

సత్య ఋషీశ్వర దుహితానందన బాపనార్యనుత శ్రీపాదా
జయవిజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ

సవితృకాఠక చయన పుణ్యఫల భరద్వాజ ఋషీగోత్ర సంభవా
జయవిజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ

దోచౌపాతీదేవ లక్ష్మీ ఘన సంఖ్యా భోదిత శ్రీపాదా
జయవిజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ

పుణ్యరూపిణి రాజమాంబ సుత గర్భ పుణ్యఫల సంజాతా
జయవిజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ

సుమతీ నందన నరహరి నందన దత్తదేవ ప్రభు శ్రీపాదా
జయవిజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ

పీఠికాపుర నిత్య విహారా మధుమతి దత్త మంగళరూప
జయవిజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ

ఈ సిద్ధమంగళ స్తోత్రమును మూడు కాలముల యందు పఠించిన వారికి
అవధూతలు,సిద్ధపురుషుల దర్శనభాగ్యం కలుగుతుందని శ్రీపాదుల వారే స్వయంగా తెలియజేసారు..

కృతే జనార్ధనో దేవః
త్రేతాయాం రఘునందనః
ద్వాపరే రామకృష్ణాచ
కలౌ శ్రీపాద వల్లభః

కృత యుగములో జనార్ధనుడు,త్రేతా యుగములో రాముడు
ద్వాపర యుగములో కృష్ణుడు,కలి యుగములో శ్రీపాద శ్రీవల్లభుడు
అవతార పురుషులని ఆది గురువు వేదవ్యాస మహర్షి తమ భవిష్యపురాణంలోప్రస్తావించారు.

శ్రీపాద శ్రీవల్లభులు కలియుగములో ప్రప్రధమ దత్తాత్రేయ అవతారం.తరువాత ఈ గురువు గారు
శ్రీ నృసింహ సరస్వతి యతీంద్రులుగాను,శ్రీ మాణిక్య ప్రభువుగాను, స్వామి సమర్ధుల గాను,శిరిడీ సాయి బాబా గాను
షేగాఁ శ్రీ గజానన్ మహరాజ్ గాను,శ్రీ హజరత్ తాజుద్దీన్ బాబాగాను అవతరించారు.భగవంతుని అన్ని అవతారాలు అవతారకార్యం ముగియగానే మూలంలో నిక్షిప్తమౌతాయి.కానీ దత్తావతార విశిష్టత ఏమిటంటే ఈ అవతారం కృత యుగం నుండి కలియుగం వరకూ ప్రతి యుగంలోనూ ఉంటుంది.ప్రతి యుగంలోనూ ఒక లక్షా ఇరవై ఐదు వేల మంది అవధూత మహాత్ముల్ని తయారుచేస్తూనే ఉంటానని అని దత్త ప్రభువులు వాగ్ధానం చేసివున్నారు.దత్త సంప్రదాయమైన గురు పరంపర ప్రతి మతంలోనూ కనిపిస్తుంది.

స్వామి వారి జన్మస్థలం: తూర్పుగోదావరి జిల్లా శ్రీ సత్యనారాయణ స్వామి వారు కొలువై వున్న అన్నవరం పట్టణానికి
30 కిలోమీటర్ల దూరంలో ఉన్న పిఠాపురం అని పిలవబడుతున్న శ్రీ పీఠికాపురం అనే పట్టణంలో జన్మించారు.అక్కడ
16 సంవత్సరాలు నివశించి,ఆ తర్వాత కృష్ణా నది తీరంలో ఉన్న కురువపురం/కురుగడ్డ లేదా కురుంగడ్డ చేరుకుని అక్కడ
14 సంవత్సరములు తపస్సు చేసి కృష్ణా నదిలో అంతర్హితమయ్యారు.వీరి చరిత్ర శ్రీమాన్ శంకరభట్టుగారు సంస్కృతంలో రచించారు, మల్లాది గోవింద దీక్షితుల వారు తెలుగు ప్రతిని మనకందించారు..


అరుదైన సమాచారం

ఈ మెసేజ్ మళ్ళా దొరకదు.. . దీనిని తయారు .

 దిక్కులు : (1) తూర్పు, (2) దక్షిణం, (3) పడమర, (4) ఉత్తరం

మూలలు :(1) ఆగ్నేయం, (2) నైరుతి,(3) వాయువ్యం, (4) ఈశాన్యం

 వేదాలు :(1) ఋగ్వే దం,
(2) యజుర్వేదం,(3) సామవేదం,
(4) అదర్వణ వేదం

 పురుషార్ధాలు :(1) ధర్మ, (2) అర్థ,
(3) కామ,(4) మోక్షా

 పంచభూతాలు :(1) గాలి, (2) నీరు,
(3) భూమి,(4) ఆకాశం,(5) అగ్ని.

  పంచేంద్రియాలు : (1) కన్ను,
(2) ముక్కు, (3) చెవి, (4) నాలుక,
(5) చర్మం.

 లలిత కళలు : (1) కవిత్వం,
(2) చిత్రలేఖనం, (3) నాట్యం,
(4) సంగీతం, (5) శిల్పం.

 పంచగంగలు : (1) గంగ, (2) కృష్ణ,
(3) గోదావరి, (4) కావేరి,
(5) తుంగభద్ర.

 దేవతావృక్షాలు : (1) మందారం,
(2) పారిజాతం, (3) కల్పవృక్షం,
(4) సంతానం, (5) హరిచందనం.

 పంచోపచారాలు : (1) స్నానం,
(2) పూజ, (3) నైవేద్యం,
(4) ప్రదక్షిణం, )5) నమస్కారం.

 
పంచామృతాలు : (1) ఆవుపాలు,
(2) పెరుగు, (3) నెయ్యి, (4) చక్కెర,
(5) తేనె.

 పంచలోహాలు : (1) బంగారం,
(2) వెండి, (3) రాగి,
(4) సీసం, (5) తగరం.

 పంచారామాలు : )1) అమరావతి,
(2) భీమవరం, (3) పాలకొల్లు,
(4) సామర్లకోట, (5) ద్రాక్షారామం

 షడ్రుచులు : (1) తీపి, (2) పులుపు,
(3) చేదు, (4) వగరు,
(5) కారం, (6) ఉప్పు.

అరిషడ్వర్గాలు షడ్గుణాలు:(1) కామం,
(2) క్రోధం, (3) లోభం, (4) మోహం,
(5) మదం, (6) మత్సరం.

ఋతువులు : (1) వసంత,(2) గ్రీష్మ,
(3) వర్ష, (4) శరద్ఋతువు,
(5) హేమంత, (6) శిశిర

 సప్త ఋషులు : (1) కాశ్యపుడు,
(2) గౌతముడు, (3) అత్రి,
(4) విశ్వామిత్రుడు, (5) భరద్వాజ,
(6) జమదగ్ని, (7) వశిష్ఠుడు.

తిరుపతి సప్తగిరులు : (1) శేషాద్రి,
(2) నీలాద్రి, (3) గరుడాద్రి,
(4) అంజనాద్రి, (5) వృషభాద్రి,
(6) నారాయణాద్రి, (7) వేంకటాద్రి.

సప్త వ్యసనాలు : (1) జూదం,
(2) మద్యం, (3) దొంగతనం,
(4) వేట, (5) వ్యభిచారం,
(6) దుబారఖర్చు,
(7) కఠినంగా మాట్లాడటం.

 సప్త నదులు : (1) గంగ,
(2) యమునా, (3) సరస్వతి,
(4) గోదావరి, (5) సింధు,
(6) నర్మద, (7) కావేరి.
           
నవధాన్యాలు : (1) గోధుమ,
(2) వడ్లు, (3) పెసలు,
(4) శనగలు, (5) కందులు,
(6) నువ్వులు, (7) మినుములు,
(8) ఉలవలు, (9) అలసందలు.

నవరత్నాలు : (1) ముత్యం,
(2) పగడం, (3) గోమేధికం,
(4) వజ్రం, (5) కెంపు, (6) నీలం,
(7) కనకపుష్యరాగం,
(8) పచ్చ (మరకతం),
(9) ఎరుపు (వైడూర్యం).

నవధాతువులు : (1) బంగారం,
(2) వెండి, (3) ఇత్తడి, (4) రాగి,
(5) ఇనుము, (6) కంచు,
(7) సీసం, (8) తగరం,
(9) కాంతలోహం.

నవరసాలు : (1) హాస్యం,(2) శృంగార,
(3) కరుణ, (4) శాంత, (5) రౌద్ర,
(6) భయానక, (7) బీభత్స,
(8) అద్భుత, (9) వీర

నవదుర్గలు : (1) శైలపుత్రి,
(2) బ్రహ్మ చారిణి, (3) చంద్రఘంట,
(4) కూష్మాండ, (5) స్కందమాత,
(6) కాత్యాయని, (7) కాళరాత్రి,
(8) మహాగౌరి, (9) సిద్ధిధాత్రి.

 దశ సంస్కారాలు : (1 ) వివాహం,
( 2 ) గర్భాదానం, (3 ) పుంసవనం ,
(4 ) సీమంతం, (5) జాతకకర్మ,
(6 ) నామకరణం, (7) అన్నప్రాశనం,
(8 ) చూడకర్మ, (9 ) ఉపనయనం,
(10) సమవర్తనం

దశావతారాలు : (1) మత్స్య,
(2) కూర్మ, (3 ) వరాహ,
(4) నరసింహ, (5) వామన,
(6) పరశురామ, (7) శ్రీరామ,
(8) శ్రీకృష్ణ, (9) బుద్ధ, (10) కల్కి.

జ్యోతిర్లింగాలు :

హిమలయపర్వతం ~ కేదారేశ్వరలింగం .

కాశీ ~ కాశీవిశ్వేశ్వరుడు .

మధ్యప్రదేశ్ ~ మహాకాలేశ్వరలింగం, ఓంకారేశ్వరలింగం. (2)

గుజరాత్ ~ సోమనాధలింగం, నాగేశ్వరలింగం. (2)

మహారాష్ట్ర ~ భీమశంకరం, త్ర్యంబకేశ్వరం, ఘృష్ణేశ్వరం, వైద్యనాదేశ్వరం. (4)

ఆంధ్రప్రదేశ్ ~ మల్లిఖార్జునలింగం (శ్రీశైలం)

తమిళనాడు ~ రామలింగేశ్వరం

తెలుగు వారాలు : (1) ఆది, (2) సోమ,
(3) మంగళ, (4) బుధ, (5) గురు,
(6) శుక్ర, (7) శని.

తెలుగు నెలలు : (1) చైత్రం,
(2) వైశాఖం,(3) జ్యేష్ఠం,(4) ఆషాఢం,
(5) శ్రావణం, (6) భాద్రపదం,
(7) ఆశ్వీయుజం, (8) కార్తీకం,
(9) మార్గశిరం, (10) పుష్యం,
(11) మాఘం, (12) ఫాల్గుణం.

 రాశులు : (1) మేషం,(2) వృషభం,
(3) మిథునం, (4) కర్కాటకం,
(5) సింహం, (6) కన్య, (7) తుల,
(8) వృశ్చికం, (9) ధనస్సు,
(10) మకరం, (11) కుంభం,
(12) మీనం.

తిథులు : (1) పాఢ్యమి, (2) విధియ,
(3) తదియ, (4) చవితి,(5) పంచమి,
(6) షష్ఠి, (7) సప్తమి, (8) అష్టమి,
(9) నవమి, (10) దశమి,(11) ఏకాదశి,
(12) ద్వాదశి, (13) త్రయోదశి,
(14) చతుర్దశి,
(15) అమావాస్య /పౌర్ణమి.

నక్షత్రాలు : (1) అశ్విని, (2) భరణి,
(3) కృత్తిక, (4) రోహిణి, (5) మృగశిర,
(6) ఆరుద్ర, (7) పునర్వసు,
(8) పుష్యమి, (9) ఆశ్లేష, (10) మఖ,
(11) పుబ్బ, (12) ఉత్తర, (13) హస్త,
(14) చిత్త, (15) స్వాతి, (16) విశాఖ,
(17) అనురాధ, (18) జ్యేష్ఠ,
(19) మూల, (20) పూర్వాషాఢ,
(21) ఉత్తరాషాఢ, (22) శ్రావణం,
(23) ధనిష్ఠ, (24) శతభిషం,
(25) పూర్వాబాద్ర, (26) ఉత్తరాబాద్ర,
(27) రేవతి.

తెలుగు సంవత్సరాల పేర్లు :
(1) ప్రభవ :-
1927, 1987, 2047, 2107

(2) విభవ :-
1928, 1988, 2048, 2108

(3) శుక్ల :-
1929, 1989, 2049, 2109

( 4 ) ప్రమోదూత :-
1930, 1990, 2050, 2110

( 5 ) ప్రజోత్పత్తి :-
1931, 1991, 2051, 2111

( 6 ) అంగీరస :-
1932, 1992, 2052, 2112

( 7 ) శ్రీముఖ :-
1933, 1993, 2053, 2113

( 8 )భావ. -
1934, 1994, 2054, 2114

9యువ. -
1935, 1995, 2055, 2115

10.ధాత. -
1936, 1996, 2056, 2116

11.ఈశ్వర. -
1937, 1997, 2057, 2117

12.బహుధాన్య.-
1938, 1998, 2058, 2118

13.ప్రమాది. -
1939, 1999, 2059, 2119

14.విక్రమ. -
1940, 2000, 2060, 2120

15.వృష.-
1941, 2001, 2061, 2121

16.చిత్రభాను. -
1942, 2002, 2062, 2122

17.స్వభాను. -
1943, 2003, 2063, 2123

18.తారణ. -
1944, 2004, 2064, 2124

19.పార్థివ. -
1945, 2005, 2065, 2125

20.వ్యయ.-
1946, 2006, 2066, 2126

21.సర్వజిత్తు. -
1947, 2007, 2067, 2127

22.సర్వదారి. -
1948, 2008, 2068, 2128

23.విరోధి. -
1949, 2009, 2069, 2129

24.వికృతి. -
1950, 2010, 2070, 2130

25.ఖర.
1951, 2011, 2071, 2131

26.నందన.
1952, 2012, 2072, 2132

27 విజయ.
1953, 2013, 2073, 2133,

28.జయ.
1954, 2014, 2074, 2134

29.మన్మద.
1955, 2015, 2075 , 2135

30.దుర్మిఖి.
1956, 2016, 2076, 2136

31.హేవళంబి.
1957, 2017, 2077, 2137

32.విళంబి.
1958, 2018, 2078, 2138

33.వికారి.
1959, 2019, 2079, 2139

34.శార్వారి.
1960, 2020, 2080, 2140

35.ప్లవ
1961, 2021, 2081, 2141

36.శుభకృత్.
1962, 2022, 2082, 2142

37.శోభకృత్.
1963, 2023, 2083, 2143

38. క్రోది.
1964, 2024, 2084, 2144,

39.విశ్వావసు.
1965, 2025, 2085, 2145

40.పరాభవ.
1966, 2026, 2086, 2146

41.ప్లవంగ.
1967, 2027, 2087, 2147

42.కీలక.
1968, 2028, 2088, 2148

43.సౌమ్య.
1969, 2029, 2089, 2149

44.సాధారణ .
1970, 2030, 2090, 2150

45.విరోధికృత్.
1971, 2031, 2091, 2151

46.పరీదావి.
1972, 2032, 2092, 2152

47.ప్రమాది.
1973, 2033, 2093, 2153

48.ఆనంద.
1974, 2034, 2094, 2154

49.రాక్షస.
1975, 2035, 2095, 2155

50.నల :-
1976, 2036, 2096, 2156,

51.పింగళ               
1977, 2037, 2097, 2157

52.కాళయుక్తి       
1978, 2038, 2098, 2158

53.సిద్ధార్ధి             
1979, 2039, 2099, 2159

54.రౌద్రి               
1980, 2040, 2100, 2160

55.దుర్మతి             
1981, 2041, 2101, 2161

56.దుందుభి           
1982, 2042, 2102, 2162

57.రుదిరోద్గారి       
1983, 2043, 2103, 2163

58.రక్తాక్షి               
1984, 2044, 2104, 2164

59.క్రోదన                 
1985, 2045, 2105, 216

60.అక్షయ             
1986, 2046, 2106, 2166.

ఈ తరం పిల్లలకు నేర్పించండి. చదివించండి మరియు మనం మరోసారి మననం చేసుకుందాం....
నమస్కారం👏👏👏

హనుమాన్ స్తోత్రం

🌼🌿శ్రీ పంచముఖ హనుమాన్ స్తోత్రం🌼🌿

శత్రు బాధలు, పిశాచ బాధలు, ఆరోగ్య సమస్యలువున్నవారు ప్రతినిత్యము అత్యంత శ్రద్ధతో శ్రీ పంచముఖ హనుమాన్ స్తోత్రం పఠించిన వారికి తప్పక శుభములు చేకూరగలవు.

ఐదు ముఖాలు పదిచేతులు అందలి ఆయుధములు తూర్పున వానరము , దక్షిణమున నారసింహ , పడమర గరుత్మాన్ , ఉత్తరాన వరాహం పై భాగాన హయగ్రీవ ముఖములు కల్గిఉండే మూర్తి.

ఒక్కొక్క ముఖానికి 3 నేత్రాలు .పూర్ణ రుద్రావతారం విభీషణుని కుమారుడు.నీలుని కొరకు అవతరించినమూర్తి

శ్లో || విభీషణ సుతో నిలః సతతం సాధుపూజితః పంచవక్ర్త హనుమంత ముపాసే త్సమృద్దిభాక్

మూలమంత్రము : “ ఓమ్ హరి మర్కట మర్కటాయస్వాహా ”

శ్రీ పంచముఖ హనుమాన్ స్తోత్రం

వందే వానర నారసింహ ఖగరాట్ క్రోడాశ్వ వక్రాంచితం
నానాలంకరణం త్రిపంచనయనం దేదీప్యమానం రుచా
హస్తాబ్జె రసి ఖేట పుస్తక సుధాకుంభాం కుశా ద్రిం గదాం
ఖట్వాంగం ఫణి భూరుహం దశభుజం సర్వారి గర్వాపహం

భావం:-
వానర ,నారసింహ ,గరుడ ,సూకర (వరాహం ),
అశ్వ అనే అయిదు ముఖాలతో ,అనేక అలంకారాలతో ,
దివ్య కాంతి తో,దేదీప్యమానమైన 15 నేత్రాలు, పద్మాలవంటి హస్తాలు, ఖడ్గం, డాలు, పుస్తకం, అమృత కలశం ,అంకుశం,పర్వతం ,నాగలి, మంచంకోడు (ఖత్వాంగం ),మణులు ,ధరించిన వాడు,సర్ప శత్రువు అయిన గరుత్మంతుని గర్వాన్ని హరించిన వాడు అయిన హనుమంతునికి నమస్కారం .


*శ్రీ మన్యు సూక్తమ్*



మన్యు సూక్తంలో ముఖ్యంగా చెప్పబడినది శత్రు జయం గురించి. శత్రువులంటె బాహ్య శత్రువులు కాదు. నిజానికి బాహ్య శత్రువులు శత్రువులు కాదు. అంతః కరణాన్ని అంటి పెట్టుకుని ఉండే కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలే నిజమైన శత్రువులు. వీటిని జయించడమే నిజమైన విజయం. మన్యుసూక్తమ్ ఈ శత్రువులను జయించే దిశగా మనకు ఉపయోగపడే ప్రార్థన.

*(01) యస్తే మన్యో విధద్వజ్రసాయకసహఓజః పుష్యతి విశ్వమనుషక్ సాహ్యామదాస మార్యం త్వయా యుజా సహస్కృతేన సహసా సహస్వతా*

(క్రోధ అభిమాని) మన్యుదేవతా! ఏ యజమాని నీ పరిచర్య చేయునో అతడు బాహ్యము, అభ్యంతరమునూ అయిన మొత్తము బలమునూ వెంట ఉండునదిగా పొంది నీ అనుగ్రహముచే యుద్దములో బలమును పెంపొందించుకొనును. వజ్రమువలె దృఢమైన, బాణమువలె శత్రువుల అణచివేయునది, బలవంతమైనది అయిన నీ సహాయముతో మేము నాశనము చేయువాడు, మాకంటె ఎక్కువైన వాడు అయిన శత్రువును కూడ అణచివేసెదము.

*శుభంభూయాత్*

🙏☀పితృ యజ్ఞ మహిమ.☀🙏

 


  దీనిని పూర్తిగా చదవగలిగితే మీకు పితృదేవతల అనుగ్రహం ఉన్నట్టే. *


 *మాసికాల_రహస్యం_ఇదే*!

 *మాసికాలు_ఎందుకు_పెట్టాలి?*

*అన్ని_మాసికాలు_పెట్టాలా?*

*కొన్నిమానేయవచ్చా?*


 వేదవేదాంతాలలో ఉన్న మహాసాధనా రహస్యాలు చెపుతుంటే చొప్పదండు ప్రశ్నలు వేసేవారు కొందరైతే, మరికొందరు తమ సున్నతమైన వేదబోధ గమనించకుండా కుతర్కాలు చేస్తున్నారు. దీనికి ప్రధాన కారణం ఈ పితృయజ్ఞాలలోనే ఉంది. 


*అతి తేలిగ్గా సకల పుణ్యాలు, సకల సంపదలూ ఇచ్చే ఈ పుణ్యకార్యాలు ఆచరించకుండా పిశాచగ్రస్తులు అడ్డుపడుతుంటారు. కనుకనే ఈ మంచి మాటలు వారి చెవులకు సోకవు.*


*కేవలం పితృదేవతల అనుగ్రహం ప్రాప్తం ఉన్నవారిని మాత్రమే ఇవి చేరుకుంటాయి.* 


చనిపోయిన తరువాత జీవుడు ఏమవుతాడు? మనం పెట్టే పిండాలు వారికి ఎలా చేరుతాయి? దేవతగా ప్రేత ఎలా మారుతుంది? పిండాల వల్ల ప్రయోజనం ఏమిటి? అనేవి అందులోని ముఖ్యప్రశ్నలు.


వీటికి సమాధానం ఒక ఉపనిషత్తు చెబుతోంది. ఆ ఉపనిషత్తు పేరు పిండోపనిషత్తు. ఇది అథర్వణ వేదశాఖకు చెందినది. ఈ వేదం ఎక్కువగా కర్మయోగానికి చెందినది. ఇందులో నిత్యనైమిత్తికకామ్య యజ్ఞాలు ఎలా చేయాలో ఎక్కువగా ఉంటుంది. దీనికి చెందిన ఈ ఉపనిషత్తులో ఈ రహస్యాలు చెప్పారు.


బ్రహ్మదేవుని దేవతలు, మహర్షులు ఈ విధంగా ప్రశ్నించారు.


*మృతులకు సమర్పించిన పిండాలను వారు ఏవిధంగా స్వీకరిస్తారు? అనే ప్రశ్నలు వేశారు.*


దానికి సమాధానంగా బ్రహ్మ దేహం దేహి గురించి వివరాలు చెప్పాడు.


*మరణించిన తరువాత పాంచభౌతికమైన శరీరం నుంచీ పంచభూతాలూ విడిపోతాయి.* 


*ఈ శరీరం భూమి, నిప్పు, నీరు, గాలి, ఆకాశం అనే మహాభూతాలతో ఏర్పడింది*.


*ఎప్పుడైతే ఇందులోని దేహి శరీరం నుంచీ వెళిపోతాడో, పంచభూతాలు కూడా ఎలా వచ్చినవి అలానే వెళిపోతాయి. ఇది ఆధునిక వైద్యశాస్త్రజ్ఞలు కూడా అంగీకరించినదే.*


*ముందుగా గాలి వెళిపోతుంది (ఊపిరి తీసుకోవడం). దాని వలన పంచప్రాణాలు పోతాయి. గాలి తరువాత అగ్ని పోతుంది. శరీరం చల్లబడుతుంది. వైశ్వానరాగ్ని వెళిపోతుంది. తరువాత శరీరంలో ఉన్న నీరు తోలుతిత్తిలోని తొమ్మిది రంధ్రాల నుంచీ కారిపోతుంది. ఎప్పుడైతే గాలి, నీరు, నిప్పు శరీరం నుంచీ తప్పుకున్నాయో భూతత్త్వం అయిన ధాతువులు ఎముకలు వెంట్రుకలు గోళ్ళు వంటి రూపంలో మిగులుతాయి. ఇవి భూమిలో కలిసిపోతాయి. శరీరాకాశం మహాకాశంలో కలిసిపోతుంది. క్లుప్తంగా జరిగేది ఇదే. ఇది పంచభూతాలు వెళిపోయే విధానం.*


*నిజానికి మనకు కనిపించే స్థూలమైన బాహ్య శరీరంతో పాటుగా ప్రతీ ఒక్కరికీ కారణ శరీరం, యాతనా శరీరం అని ఉంటాయి.* 


*కారణ శరీరం మరో జన్మకు మనం చేసుకున్న పాపపుణ్యాల సంచులు మోసే శరీరం. తన సంచుల్లో ఉన్న పాపపుణ్యాల ప్రకారం మరో శరీరం వెతుక్కుంటూ వెళిపోతుంది. అదే నూతన శరీరం పొందుతుంది.*


*యాతనా శరీరం నరకానికో లేక స్వర్గానికో వెళిపోతుంది. ఇలా వివిధ శరీరాలు ఎవరి దోవన అవి వెళిపోతే మృతుని ప్రేత మిగిలి ఉంటుంది.*


*ప్రేత ముందు పదిరోజులూ తన ఇల్లూ, తన పరివారం, తన ఆస్తులు చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఆ సమయంలో వేసే నిత్యపిండం కాకి రూపంలో వచ్చి తీసుకుంటుంది.*


*దీని తరువాత పదోరోజున సపిండులు, సగోత్రీకులు, బంధువులు, స్నేహితులు వచ్చి వదిలే ఉదకాలు దాని దాహాన్ని తీరుస్తాయి. వీటికి తృప్తి పడి అది పదిరోజుల తరువాత తన వారిని, నా అనుకునే వారిని వదిలి వెళిపోతుంది.*


*అయితే ఇది ప్రేత రూపంలోనే ఉంటుంది. పూర్వక్రియలు అయిన దహన సంస్కారాది 12 రోజుల క్రియలు పూర్తి అయి, మధ్యమ క్రియలు అయిన మాసికాలు జరిగి, పూర్వక్రియలకు అర్హమైన సపిండీకరణం జరిగే వరకూ ఈ ప్రేత రూపంలోనే ఉంటుంది.*


*సపిండికరణం తరువాత తన ముందున్న వర్గత్రయంలో తన తండ్రి తాత ముత్తాతల్లో ముత్తాతను ముందు జరిపి ఆయన ఖాళీలో తాతను, తాత స్థానంలో తండ్రిని, తండ్రి స్థానంలో తాను చేరుకుంటుంది. పితృదేవతాస్థానం పొందుతుంది.*


*దీనికి కావలసిన క్రొత్త శరీరం మాసికాల ద్వారా చేసే ఏకోద్దిష్టశ్రాద్ధాల రూపంలో అందుతుంది. నిన్నటి బాహ్యశరీరాన్ని విడిచి కారణశరీరం, యాతనా శరీరం కోల్పోయి ప్రేతగా ఏ శరీరం లేకుండా ఉన్న మృతుడు మాసికాలలో కేవలం తనకు మాత్రమే ఉద్దేశించి వదిలే పిండాల ద్వారా క్రొత్త శరీరం సంతరించుకుంటాడు.*


*వీటిలో మొదటి పిండం ద్వారా క్రొత్త శరీరానికి బీజం పడుతుంది. దీన్నే కలనం అన్నాడు.*


*దీని తరువాత మాంసం చర్మం రెండో పిండం ద్వారా ఏర్పడతాయి.*


*మూడో పిండం వలన బుద్ధి కలుగుతుంది. (మెదడు).* 


*నాలుగో పిండం వలన ఎముకలు, ఎముకల్లోని గుజ్జు ఏర్పడతాయి.*


*ఐదో పిండం వలన శిరస్సు, ముఖం, వేళ్ళు ఏర్పడతాయి.* 


*ఆరో పిండం వలన హృదయం, మెడ, నోటిలోని భాగాలు ఏర్పడతాయి.*


*ఆయుప్రమాణం ఏడో పిండం ద్వారా కలుగుతుంది.* 


*ఎనిమిదో పిండం ద్వారా మాటకు చెందిన వ్యవస్థలు కలుగుతాయి.*


*తొమ్మిదో పిండం ద్వారా అన్ని అవయవాలకు పరిపుష్టి చేకూరి దృఢపడతాయి.* 


*పదో పిండం వలన క్రొత్త జీవితానికి అవసరమైన శారీరక పరిపూర్ణత చేకూరుతుంది.*


*ఈ విధంగా మాసికాలలోని పిండదానం వలన పిండశరీరం నుంచీ సంపూర్తి శరీరం పిండాల వలన కలుగుతుంది.* 


*ప్రపంచంలో భోగాలు అనుభవించడానికి శరీరం ఇచ్చిన తల్లి తండ్రులకు మాసికాలు నిర్వహించి వారికి శరీరం ఏర్పడడానికి అవసరమైన పిండాలు సమర్పించి వారి ఋణం తీర్చుకోవాలి.*

 

*నిజానికి మొత్తం 16 పిండాలు ఈ సంవత్సర కాలంలో ఇస్తారు.*


*వీటిలో 10 పిండాల గురించి మృతుడు క్రొత్త శరీరాలు పొందడానికి దోహదం చేసే ఆహారంగా ఉపయోగిస్తాయని పిండోపనిషత్తు చెప్పింది, మిగిలిన పిండాల గురించి గరుడపురాణంతో పాటు అనేక పురాణాలు చెబుతున్నాయి.*


*అంతేకాక మృతుని శరీరం నుంచీ పంచభూతాలు ఏవిధంగా దూరం అవుతాయో అదే విధంగా తిరిగి వారికి భౌతిక శరీరం ఏర్పడడానికి పంచభూతాలూ కలుస్తాయి.*


*ముందుగా జీవికి ఆస్తిక్యం ఇవ్వడానికి కారణం అయిన ఆకాశం అతనికి స్థలం ఇస్తుంది. ఆ తరువాత అగ్ని, జలం, వాయువు, భూమి తత్త్త్వాలు అతనికి శరీరం కల్పిస్తాయని ఉపనిషత్తు చెబుతోంది.*


*కనుక మృతులకు మాసికాలు అన్నీ పెట్టవలసిందే. మాసికాలకు ప్రత్యామ్నాయం లేదు.*


*ఏది వదిలితే, అది ఎన్నో పిండమైతే ఆ దశలో ఏర్పడాల్సినవి ఏర్పడక మృతునికి వైలక్యం కలుగుతుంది.* 


*మనకు కోట్లు ఖరీదు చేసినా దొరకని భోగశరీరాన్ని ఇచ్చిన తండ్రికి ఇంత పిండం పెట్టకపోవడం వలన అతనికి వైకల్యం కలిగించినవారమవుతాము. మహాఘోరమయ్యే తప్పు చేయకూడదు.*


*మాసికాలు మానివేస్తే ఇటువంటి వైకల్యం కలుగుతుంది. సపిండీకరణం చేయకపోతే పితృదేవతా రూపం రాదు.* 


*తండ్రికి ప్రేతత్త్వం విడుదల చేయకపోతే తరువాత తరాలు అన్నీ ప్రేతత్త్త్వంలోనే ఉండిపోతాయి.*


*కనుక మధ్యమ క్రియలైన మాసికాదులు చేయడం చనిపోయిన వారికి మాత్రమే కాదు, కర్తకు కూడా లాభం చేకూర్చేది. తనకు దుర్గతి రాకుండా మంచి మార్గం వేసుకోవడం వంటిది.*


ఇవి మన పురాణాలు, ఉపనిషత్తులు చెబుతున్న పితృయజ్ఞరహస్యాలు.   


ఇవన్నీ సామాన్యంగా తప్పనిసరిగా చేయవలసినవి.


*ఇవే మరింత ప్రేమగా చేయాలనుకుంటే పుణ్యక్షేత్రాలైన కురుక్షేత్రం, ప్రయాగ, కాశీ, గయా వంటి వాటిలో చేయాలి.*


*ఇలా చేస్తే వారికి విశేషమైన శరీరాలు కలిగించిన వారమవుతాము. దాని వల్ల మనకే ప్రయోజం ఉంటుంది. వారికి కలిగే ఉత్తమ శరీరాల వల్ల పరమానందం పొంది మరింతగా సకల సంపదలు మనకు ఇస్తారు.*


పిండాలు ప్రేతాలకు వెళతాయా? అని వితండవాదం చేసే వారికి సమాధానమే ఈ పిండోపనిషత్తు. 


*నిజానికి ఉపనిషత్తులు అన్నీ రహస్యాల సమూహాలు. అవి పైకి ఒక అర్ధంలో కనిపించే సామాన్యపదాలుగా కనిపించినా వాటి వెనుక కేవలం మహాసాధకులకు మాత్రమే తెలిసే అనేక రహస్యాలు ఉంటాయి.* 


అవి కేవలం సాధకులు, పరిశ్రమ చేసిన విజ్ఞులు మాత్రమే అందుకోగలుగుతారు. వీటిని వారు అందరికీ చెప్పరు. కేవలం ఫలానా పిండదానాలు ఫలానా చోట చేయండి అనిమాత్రమే చెబుతారు. 


గయలో ఎందుకు చేయాలి? ప్రయాగలో ఎందుకు చేయాలి అంటే వాటికి అనేక రకాలైన కారణాలు కూడా చెబుతారు. పుణ్యక్షేత్రాలుగా చెబుతున్న ప్రాంతాలు అన్నీ పరమాత్మ శరీరాంగాలు. ఒకటి శిరస్సు, మరొకటి హృదయం, కాళ్ళు, చేతులు.... వంటివి. 


ఇలా ఆ ప్రాంతాలలో చేయలేని వారు కనీసం తాను ఉన్న చోటునైనా చేయాలి.


 వెళ్ళగలిగిన వారు ప్రయాగ కుంభమేళాల వంటి వాటికి వెళ్ళి చేయడం వలన దివ్యమైన ఫలితాలు పితృదేవతానందం వలన కలుగుతాయి.  


వెళ్ళలేని వారు మానసికంగా అయినా వాటిని కీర్తించడం వలన పుణ్యం పొందుతారు. 


ఉదాహరణకు మాఘపౌర్ణమి చాలా మంచిది. దాన్ని మాఘపౌర్ణమి, మహామాఘి అని అంటారు. ఆ రోజున పితరలకు ప్రయాగలో పిండప్రదానం చేస్తే దివ్యమైన ఫలాలు, సంపదలు కలుగుతాయి. ప్రయాగలో చివరిగా రాబోతున్న మహాశివరాత్రి స్నానానికి ముందు రానున్న పుణ్యదినం. ఆ సమయానికి వెళ్ళలేని వారు మానసికంగా అయినా తమపెద్దలకు నమస్కరించుకొని స్వధానామసాధన చేసి, స్వధా స్తోత్రం, పితృస్తోత్రం పఠించుకొని ఆవుకు ఒకరోజు గ్రాసం వేయడం వలన కూడా ఉత్తమ పుణ్యసంపదలు ఉన్న చోటు నుంచే పొందవచ్చు.


ఇవే మాసికాలు పిండప్రదానాల రహస్యాలు. 


మాఘమాసం పితృదేవతా అర్చనలకు మహాదివ్యమైన కాలం.శ్రీగురు పరదేవతాయై నమ:



శ్రీధరాష్టకం


1) నమో భగవతే శ్రీధరాయ

   హర్షామర్షభయోద్వేగరహితమానసాయ 

   గోపరమణీదుకూలాపహారచతురాయ 

   ఘనపీతాంబరవనమాలాధరముకుందాయ ||

2) నమో భగవతే శ్రీధరాయ

   కంసధేనుకతృణావర్తశకటాసురాదిభంజనాయ 

   శ్రీరుక్మిణీసత్యభామానాగ్నజితీసమేతాయ 

   ప్రద్యుమ్నసాంబజనకాయ ||


3) నమో భగవతే శ్రీధరాయ 

   అరిషడ్వర్గభంజనకుఠారాయ 

   అష్టాంగయోగమార్గప్రవీణాయ 

    అష్టసిద్ధిప్రదాయకహస్తాయ ||

4) నమో భగవతే శ్రీధరాయ 

   గోపీచందనచర్చితాంగమృదుభాషణాయ 

   యమునాతీరవిహారరాసలీలాలోలాయ

   కాళీయదర్పదమననాట్యవిద్యాప్రదర్శకాయ || 


5) నమో భగవతే శ్రీధరాయ 

   సత్రాజిత్ శంకావిమోచకశ్యమంతకమణిప్రదాయకాయ

   శాశ్వతైశ్వర్యప్రదాయకజ్ఞానమకరందనిలయాయ  

   పూతనస్తన్యపిబనిజజీవితాపహరణాయ ||


6) నమో భగవతే శ్రీధరాయ 

   దధిక్షీరనవనీతఘృతచాతుర్యచోరాయ 

   భానుశశితేజోమయదివ్యమంగళవిగ్రహాయ 

   జనరంజకపరిపాలనాదక్షద్వారకాధీశాయ ||


7) నమో భగవతే శ్రీధరాయ 

   విరహిణిరాధాహృదయభారశమనశీతలచందనాయ 

   ధర్మాధర్మవిచక్షణాశీలజగదాదర్శమార్గదర్శకాయ 

   యమునానదీవేగహరగోవర్ధనోద్ధరసాంద్రకరుణాంతరంగాయ || 


8) నమో భగవతే శ్రీధరాయ 

   చతుర్దశభువనమండలప్రదర్శకభ్రమాశ్చర్యస్వరూపాయ 

  బిందునాదకళాతీతయోగానందవిమలస్వరూపాయ 

  బర్హిబర్హావతంసకత్రైలోక్యవ్యాపకపరంజ్యోతిస్వరూపాయ ||


  సర్వం శ్రీశ్రీధరదివ్యచరణారవిందార్పణమస్తు

కం.

  

పదపద గబగబ దబదబ

ముదముద వలదే పదపదముదమున పదవే

పదములు పాడుతు హరి పద

సదనము చేరి పరమపద సదయుని గనవే

🌸 *సుభాషితమ్* 🌸

 



శ్లో|| ధృతిః క్షమా దమోస్తేsయం శౌచమిన్ద్రియనిగ్రహః|

ధీర్విద్యా సత్యమక్రోధో దశకం ధర్మలక్షణమ్||


తా|| ధైర్యము, క్షమా, నిగ్రహము, చౌర్యరాహిత్యము, పరిశుద్ధత, ఇంద్రియ నిగ్రహము, సద్బుద్ధి, విద్య, సత్యము, క్రోధరాహిత్యము అను ఈ పది ధర్మము యొక్క లక్షణాలు అని చెప్పబడుచున్నవి.

కం.


కర్మంబు వలన పాపము

కర్మంబున బుణ్య ఫలము కల్గును గదరా

కర్మంబె జనన మరణము

కర్మ ఫలము హరకిజేర్చ కల్గవు జన్మల్

వాట్సప్పులో పరిభ్రమించ


ఒక వ్యక్తి తన మిత్రుణ్ణి కలవడానికి వాళ్ళింటికి ఉదయం 10 గంటల సమయంలో వచ్చాడు. అంతా పిచ్చాపాటి మాట్లాడిన తర్వాత అటు యిటు ఆడుతూ తిరుగుతున్న అతని 10 సంవత్సరం వయస్సు గల కొడుకుని చూసాడు. 


ఏంట్రా అబ్బాయి పాఠశాలకు వెళ్ళకుండా యింట్లోనే ఆట్లాడుకుంటున్నాడు ఏంటి, ఏదైనా అనారోగ్యం పాలయ్యాడా అని ప్రశ్నించాడు. 


అతని మిత్రుని ముఖ కవళికలు చెప్పనలవికాదు. ఏం చెప్పనురా, వాడు స్కూలుకు వెళ్ళడం అంటే అంత యిష్టం. ఆర్నెలల ముందువరకు తనే ముస్తాబయి వెళ్ళిపోయేవాడు. చదువులో కూడా మొదటి రేంకే. కాని యేంజెయ్యను. ఆర్నెలల క్రితం ఒకరోజు ఎప్పటిలాగే ప్రొద్దునే స్కూలుకు వెళ్ళాడు. సాయంత్రం వరకు స్కూలులోనే వున్నాడంట. తిరిగి యింటికి బయలుదేరి వస్తున్నప్పుడు మార్గ మధ్యంలో ఒక గారడివాడు గారడివిద్య చూపిస్తుంటే అక్కడ వున్న జనాన్ని చూసి తనూ ఉవ్విళ్లూరై అలా వుండి పోయాడు. చీకటయింది. యింటి దారి మరచిపోయాడు. అంతే, ఒక రెండు రోజులు జాడనే లేదు. యిలా అకస్మాత్తుగా తప్పిపోయాడు.


మేము అన్ని ప్రయత్నాలు చేసాము, చివరకు రక్షక నిలయంలో కూడా కంప్లయింటు యిచ్చాము. కాని యేమీ ఫలితం కనబడలేదు. 


చివరకు నీలాంటి మరో మిత్రుడు ఒక సలహా యిచ్చాడు, బాబు ఈ రోజుల్లో వాట్సప్పు అందరూ వాడుతున్నారు, ఈ తప్పిపోయిన విషయం వాట్సప్పులో అందరికి తెలిపావంటే వాడి ఆచూకి యిట్టే తెలియగలదు అని. నేనూ అలాగే యిచ్చాను. నిజంగా యీ వాట్సప్పు యెలా పనిచేస్తుందంటే, ఆ తప్పిపోయిన విషయం అందరికి బట్వాడ చేసిన 5 గంటలలోపే ఒక వ్యక్తి ఫోన్ చేసాడు సార్ మీ అబ్బాయి ఫలానా రోడ్డులో ఏడుస్తూ తిరుగుతున్నాడని. వెంటనే మేము వెళ్ళి వాణ్ఢి యింటికి తీసుకొని వచ్చాము. ఆ మరుసటిరోజు వాడికి అన్ని నచ్చజెప్పి స్కూలులో వదిలేసి వచ్చాను. అలాగే ప్రతిరోజూ యిప్పటిదాకా వదిలేసి వస్తున్నాను. రోజూ నేను యింటికి వచ్చిన అరగంటకే యెవరో ఒకరు తలుపు తట్టి యిదిగో సార్ మీ అబ్బాయి, తప్పిపోయాడన్న ప్రకటన యిచ్చారు కదా, స్కూలు దగ్గర కనబడ్డాడు అని చెప్పి వదిలేసి వెళ్తున్నారు. ప్రతిరోజూ యిదే గొడవ, యేంజెయ్యను. ఎందుకురా వాట్సప్పులో యిచ్చానన్న భాధ పడని రోజు లేదు.

పోత‌న త‌ల‌పు‌లో... (41)



ఉత్త‌ర  వైపు దూసుకువ‌స్తున్న బాణం, అశ్వ‌త్థామ  ఇంత‌కుముందు వ‌దిలిన‌ద‌ని గ్ర‌హించాడు కృష్ణ‌ప‌ర‌మాత్మ‌.   అపాండ‌వం చేయ‌డం కోసం వదిలిన దివ్యాస్త్రం అది. ఉత్త‌ర గ‌ర్భం వైపు దూసుకువ‌స్తోంది. వెంట‌నే  కృష్ణ‌ప‌ర‌మాత్మ‌, చక్రాయుధుడై ఉత్త‌ర గ‌ర్భాన్ని ర‌క్షిస్తాడు.



                               ****

సకలప్రాణిహృదంతరాళముల భాస్వజ్జ్యోతియై యుండు సూ

క్ష్మకళుం డచ్యుతుఁ డయ్యెడన్ విరటజా గర్భంబుఁ దాఁ జక్రహ

స్తకుఁడై, వైష్ణవమాయఁ గప్పి, కురు సంతానార్థియై యడ్డమై,

ప్రకటస్ఫూర్తి నడంచె ద్రోణతనయబ్రహ్మాస్త్రమున్ లీలతోన్.

                   ****

సూక్ష్మాతి సూక్ష్మమైన రూపంతో సమస్త ప్రాణుల హృదయాంతరాళాల్లో జ్యోతిర్మూర్తియై ప్రకాశించే వాసుదేవుడు పాండవుల వంశాంకురాన్ని రక్షించటం కోసం చక్రాన్ని ధరించి, ఉత్తరాగర్భాన్ని యోగమాయతో కప్పివేసి, అమోఘమైన వైష్ణవ తేజస్సుతో అశ్వత్థామ బ్రహ్మాస్త్రాన్ని అవలీలగా అణచివేశాడు.


   🏵️  పోత‌న ప‌ద్యం🏵️

🏵️ఆప‌న్నుల‌కు అభ‌యప్ర‌దం🏵️

*ఆచార్య సద్భావన

 *


నిజమైన ప్రేమలో అంచనాలు, బేర సారాలు  ఉండవు. ఒక అందమైన దృశ్యాన్ని చూసినప్పుడు దాన్ని చూసి సంతోషిస్తాం. కాని దాని నుండి ఏమీ కోరుకోము. అది సుందరంగా ఉన్నందున ఆనందిస్తాం. అదే విధంగా ప్రతి ఫలాపేక్ష లేకుండా భగవంతుని ప్రేమించాలి. ఎందుకంటే ఈ విశ్వంలో అన్నింటికంటే ప్రేమింపదగినవాడు ఆయనే. అటువంటి అవగాహనతో ఉన్న శుద్ధ ప్రేమ వెలకట్టలేని మహోన్నతంగా జీవితంలో భాసిస్తుంది. అది సాధించబడినప్పుడు మనం ఆశించిన దానికంటే అధికమైన ఫలితాన్నే పొందుతాం.


అందుకై  మనం భగవంతుని ఈ విధంగా ప్రార్థించాలి.


*శ్రీమన్నారాయణా!*

హే సర్వహిత దేవా! నిన్ను పరిపూర్ణంగా ప్రేమించే హృదయ విశాలతను మాకు ప్రసాదించు, మాలో నీవు మరింత ప్రేమ శక్తిని మేల్కొలుపు. దాపరికం, అంచనాలు లేకుండా మమ్మల్ని మేము అర్పించుకొని తిరిగి స్వార్థ బంధంలో పడకుండునట్లు మమ్మల్ని అనుగ్రహించు, కాని సర్వవేళలా మార్గ దర్శకత్వం కోసం, రక్షణ కోసం నీ వైపే మమ్మల్ని చూడనీ!.

సర్వేజనా సుఖినోభవంతు.


*సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

శ్రీకృష్ణార్పణమస్తు

 *జై శ్రీమన్నారాయణ - జై శ్రీహనుమాన్*


సందేహం;- *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు* అనడానికి కారణమేమిటి? ఫలితమేమిటి?


సమాధానం;- ఏదో ఒక కర్మ చెయ్యకుండా ఏ ప్రాణీ ఉండలేదు. మంచి పనులు చేస్తే కీర్తి, ప్రతిష్ఠలు, స్వర్గ సుఖాలు, పుణ్య ఫలాలు వస్తాయి. చెడ్డ పనులు చేస్తే సంఘంలో చెడ్డ పేరు, నరకయాతనలు, పాప ఫలాలు వస్తాయి. ఇలా పాప పుణ్యాలు చేస్తూ, స్వర్గ నరకాలనుభవిస్తూ, మరల మరల జన్మలెత్తుతూ ఈ జన్మ మరణ సంసారచక్రంలో ఉండిపోవలసిందేనా? లేక మోక్షం పొందడం ఉందా? అని మనం విచారించడం సహజం. మనలోని ఈ విచారాన్ని దూరం చేయడానికే గీతలో శ్రీకృష్ణ భగవానుడు చక్కని మార్గం చూపాడు.


*(09-27)*

*యత్కరోషి యదశ్నాసి యజ్జుహోషి దదాసి యత్*

*యత్తపస్యసి కౌంతేయ తత్ కురుష్వ మదర్పణమ్* 


తా" ఓ కౌంతేయా! నీవు ఆచరించు కర్మను, భుజించెడి ఆహారమును, హోమముచేయు హవ్యమును, అర్పించు దానమును, ఆచరించు తపస్సును నాకే సమర్పింపుము.


అయితే ఈ సలహా పాటిస్తే మనకు వచ్చే లాభం ఏమిటి? ఇలా చేస్తే, మనం మూడు త్యాగాలు చేసినట్లవుతుంది. 


01. కర్తృత్వ త్యాగం;- ఈ పని నేనే చేస్తున్నాను లేదా చేయిస్తున్నాననే అహంకారం వదలాలి. ఏ కర్మయినా ఆ భగవంతుడే చేయిస్తున్నాడని భావించాలి. ఏం చేసినా భగవత్పరంగా చెయ్యాలి. ఇలా చేస్తే, నువ్వు పాపపు పనులు చేయడానికి జంకుతావు. కర్మ సాక్షి అయిన భగవానుణ్ణి తలుచుకుంటూ సదా సత్కార్యాలకు పూనుకుంటావు.


02. ఫలత్యాగం;- ఏం చేసినా ఇది నా కర్తవ్యం అని చెయ్యి. అంతేగాని ఇది చేస్తే నాకీ ఫలం వస్తుంది అని కోరికతో చెయ్యకు. నేనేం చేసినా దాని ఫలం భగవానుడిదే. అన్నీ భగవత్ కైంకర్య రూపాలే అని నమ్మాలి.


03. సంగత్యాగం;- ఇది నాది, ఇది నేనే చెయ్యాలి, అంతా నా ఇష్ట ప్రకారం జరగాలి, ఇది నా ఆనందం కోసం అని బంధం పెంచుకోవద్దు. అంతా భగవన్ముఖ వికాసం కోసం, ఆయన ఆనందమే నా ఆనందం అని మనస్ఫూర్తిగా అనుకోవాలి. 


సరే ఈ త్రివిధ త్యాగాలు ఎలా చేయాలి? ఏ పనిచేసినా, ఒక్క నమస్కారం పెట్టి, ఒక్క మాట చెప్పుకోవాలి చాలు. ఏమిటండీ ఆ బంగారాల మాట? *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*. 


పై త్రివిధ త్యాగాలను త్రికరణశుద్ధిగా అవలంబిస్తూ, ఇంకొక్క మాటను కూడా జోడించాలి *సర్వేజనా స్సుఖినోభవంతు*.


*సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

*""సర్దుకున్నారా?""*



మంచి కథ.....

వాతావరణం బాగుంది. ఇంకా సూర్యుడు నిండుగా రాలేదు. కానీ చలిగా కూడా లేదు.

చలిలో తిరిగితే నాకు ఆయాసం వస్తుంది. అందుకే నాకు తెల్లవారుజామునే మెలుకువ వచ్చినా, ఏడింటికి వరకు ఇంటి బయటకు రాను. చలి తగ్గగానే, మా అపార్ట్ మెంటు బిల్డింగ్ గేటు దాటి ఇందిరా పార్కు వైపు నడక సాగించాను.

చిన్నప్పుడు పార్కులో ఎక్కువ సేపు ఆడుకుంటే మా నాన్న తన్నేవాడు. ఇప్పుడేమో, 'ఎప్పుడూ ఇంట్లో కూర్చోకండి. పొద్దున్నపూట తప్పనిసరిగా నాలుగు కిలోమీటర్లు నడవండి. మధ్యాహ్నం, రాత్రి భోజనం తిన్న తర్వాత కూడా వెంటనే పడుకోకుండా కాసేపు బయట తిరిగితే మంచిది' అని డాక్టర్లు చెప్పడంతో, ఉదయం, రాత్రి నడక అలవాటు చేసుకున్నాను.

ఇందిరా పార్కులో కొన్ని రోజుల్లోనే మాకొక గ్రూపు తయారయింది. అందరం రిటైరైనవాళ్ళమే. వాళ్ళందరినీ కలిస్తే చాలా ఉత్సాహంగా ఉంటుంది. అందరం కలిసి కబుర్లు చెప్పుకుంటూ నడుస్తాము. ఉదయం పూట ఇందిరా పార్కు మహా సంరంభంగా ఉంటుంది. ఏదో పెళ్ళికో, పండగరోజున గుడికి వచ్చినట్టుగానో వేలాది మంది హడావుడిగా నడుస్తుంటారు.

ఇందిరా పార్కు ఉదయం పూట ఒక చిన్న సైజు సూపర్ మార్కెట్టులా ఉంటుంది. పళ్ళూ, కూరగాయలూ, రకరకాల సూప్స్, బట్టలూ అమ్మే సమస్త దుకాణాలు ఉంటాయి. కానీ, పదింటికల్లా నిర్మానుష్యమై పోతుంది.

మా గ్రూపులో నాతో పాటు రెడ్డి, రాజారావు, పద్మనాభం, శేషగిరి, రామ్మూర్తి మెంబర్లు ఉన్నారు. ఒక్కోరోజు మా గ్రూపులో ఉన్న మితృలకు తెలిసిన మితృలు కూడా కలుస్తుంటారు.

మేము చివరగా పార్కు మధ్యలో ఉన్న వినాయకుడికి దండం పెట్టుకుని నడక ముగించి, ముఖద్వారం దగ్గరున్న మెట్ల మీదనో, బెంచీ మీదనో కూర్చుని లోకాభిరామాయణం మాట్లాడుకుంటుంటాము.

మా మాటల్లో ఎక్కువగా రాజకీయాలు, మేము చేసిన ఉద్యోగాలకు సంబంధించిన విషయాలు దొర్లుతుంటాయి. ఎప్పుడైనా ఆరోగ్యం గురించిన ప్రస్తావన వస్తే, అందరి మనసులూ భారమౌతాయి.

మా గ్రూపులో డెభ్భై ఏళ్ళు దాటిన వాళ్ళు ఇద్దరున్నారు. ఆరోగ్యం గురించి మాట్లాడగానే, అందరి దృష్టి వాళ్ళ మీదనే పడుతుంది. వాళ్ళు కొంచెం ఇబ్బందిగా ఫీలవుతుంటారు. ఈ వయసులో ఎప్పుడేం జరుగుతుందో ఊహించలేము. ఆ భయం మా అందరిలోనూ అంతర్లీనంగా ఉంది.

ఒక్కొక్కరోజు నడక ముగిసిన తర్వాత విడిపోతుంటే, మా ఆరేడుగురిలో మరునాడు ఏ ఒక్కరైనా మిస్ అవుతారేమోనని; మరునాడు పేపర్లో 'నిర్యాణం' కాలంలో ఫోటో వస్తుందేమోనని లేదా ఏ వారం రోజులకో, 'దశదిన కర్మ' కార్డు వారి మరణ సందేశం మోసుకొస్తుందేమోనన్న ఒక అదృశ్యపు సందేహపు మొలక మా మనసు పొరల్లో ప్రతీరోజూ ప్రాణం పోసుకుంటూనే ఉంటుంది.

మా మధ్య కుటుంబ స్నేహాలు లేవు కాబట్టి మా పరిచయాలు నడక వరకు మాత్రమే పరిమితం. తరువాత ఎవరి జీవితాల గురించి, ఎవరికీ తెలియదు కాబట్టి ఒక్కోసారి మరణ వార్త తెలియదు కూడా.

ఇంతలో రమణ అనే మితృడు మా గ్రూపులోకి వచ్చి చేరాడు. ఒక జాతీయ బ్యాంకులో అసిస్టెంట్ జనరల్ మేనేజరుగా ఈ మధ్యనే రిటైరయ్యాడు.

రమణ రాకతో మా గ్రూపు రూపురేఖలే మారిపోయాయి. రమణ మాటల పుట్ట. ఎన్నో విషయాల గురించి అనర్ఘళంగా మాట్లాడేవాడు. అప్పటివరకు పైపైన, పలుచగా ఉన్న మా స్నేహం అతని రాకతో చిక్కబడింది, గాఢంగా మారింది.

అసలు ఆయన చెబితేనే గానీ ఆయన రిటైరయ్యాడని నమ్మలేం. స్లిమ్ గా, లేటెస్ట్ మాడల్ రీబాక్ షూ, కళ్ళకు గాగుల్స్, ఒంటి మీద నుండి తేలుతూ వచ్చే కమ్మనైన సెంటు మధురిమలతో కులాసాగా ఉంటాడు. ప్రతీరోజూ తన ఇన్నోవా క్రిస్టా కారులో పార్కుకు వస్తాడు.

రమణ వచ్చిన తర్వాత నడక పూర్తి కాగానే మమ్మల్ని తన కారులో ఎక్కించుకుని రోజుకో హోటలుకు తీసికెళ్ళి కాఫీ, టిఫిన్లు ఇప్పించేవాడు.

పరిచయమైన మొదటి రోజు సాయంత్రమే పళ్ళబుట్ట పట్టుకుని మా ఇంటికి వచ్చాడు. మా ఆవిడతో 'అక్కయ్యా' అని వరస కలిపి క్లోజ్ అయిపోయాడు. మా కోడలితో ముచ్చట్లు పెట్టాడు. ఆరునెలల వయసున్న మా మనుమణ్ణి ఎత్తుకుని వాడి చేతిలో ఐదువందల నోటు పెట్టాడు.

'బయటకు వెళ్దాం పదమని' నన్ను బలవంత పెట్టాడు. కారు తిన్నగా క్రిస్టల్ బారు ముందు ఆపాడు. రమణని చూడగానే, గుమ్మంలో ఉన్న 'వాలె' పార్కింగ్ బాయ్ నుంచి లోపల స్టీవార్డ్ వరకూ ఆప్యాయంగా విష్ చేయడం చూసి నేను విస్తుపోయాను.

నేను మొహమాటపడుతుంటే,

"ఫర్వాలేదు సార్! రెండు పెగ్గుల విస్కీ తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది. హెచ్డీయల్ కొలెస్టరాల్ పెరుగుతుంది. గుండె గట్టి పడుతుంది!" అంటూ బుజ్జగించి మందు పోయించాడు. రెండు పెగ్గులు కాగానే ముగించాడు. అందరికీ భారీగా టిప్పులు ఇచ్చాడు. 

రమణ కారు దిగగానే, రోజూ 'వాలే' బాయ్, రమణ డ్రైవరుకు ఫోన్ చేస్తాడంట. అందుకే మందు తాగి బయటకు రాగానే, కారు దగ్గర నిలబడిన డ్రైవరుకు, రమణ మా ఇంటి అడ్రస్ చెప్పాడు. నన్ను ఇంటి దగ్గర దించి, 'గుడ్ నైట్' అని చెప్పి వెళ్ళిపోయాడు.

చాలా రోజుల తర్వాత నాకు ఆ సాయంత్రం సంతోషంగా గడిచినట్టనిపించింది. హాయిగా నిద్రపోయాను. కలలో రమణ ముఖమే కనిపించింది.

మరునాడు, అందరం కలుసుకున్నాం. రమణతో గడిపిన సాయంత్రం గురించి చెప్పుకున్నాము. రమణ మా వాకర్స్ గ్రూపులోని అందరి ఇళ్ళకు వెళ్ళాడు. నన్ను తోడు రమ్మంటే నేను కూడా వెళ్ళాను. ఎవ్వరింటికి వెళ్ళినా అక్కడ నవ్వుల పువ్వులు పూయించేవాడు.

అలా ఒక నెలరోజుల్లో రమణ మా అందరి ఇళ్ళకు వచ్చాడు. అందరిని పిలిచి వాళ్ళ ఫార్మ్ హౌజులో వన భోజనాలు ఏర్పాటు చేసాడు.

డిసెంబర్ నెలలో తన కారులోనే గోవా ట్రిప్ ప్లాన్ చేసాడు. మేమందరం వెళ్ళడానికి సిద్ధమే అయినా, అంత ఖర్చు అతనితో పెట్టించడం బాగుండదని తలా కొంత కంట్రిబ్యూట్ చేస్తామని చెప్పాము.

"ఏం ఫర్వాలేదు సార్! డబ్బుల విషయాలన్నీ గోవా నుండి వచ్చాక చూసుకుందాం!" అని అన్ని ఖర్చులు తనే పెట్టుకున్నాడు. గోవాలో మా కోసం ఒక పెద్ద బంగళా రిజర్వ్ చేసాడు. డిసెంబర్ నెలలో గోవాలో అంతా పండగ వాతావరణం ఉంది. పడుచు జంటల కోలాహలంతో, ఒక సీతాకోకచిలుకల వనంలా ఉంది.

మేమంతా కొంచెం మొహమాట పడుతుంటే, రమణే,

"సార్! మనం ఉద్యోగం నుండి మాత్రమే రిటైరయ్యాము. జీవితాల నుండి కాదు. అందరూ 'శేషజీవితం' అంటూ మనకు వీడ్కోలు పలుకుతూ అంటారు. కానీ… నిజంగా మనది శేష జీవితం కాదు. బరువులు, బాధ్యతలు లేని చిన్న పిల్లవాడి లాంటి 'విశేషజీవితం' మనది. మనముందు ఇంకా చాలా జీవితం ఉంది. అందుకే, మరణించేవరకు జీవించాలి,
హాయిగా గడపాలి !" అని మమ్మల్ని ఉత్సాహపరిచాడు.

దాంతో, అక్కడి యౌవ్వనపు వాతావరణం చూస్తుంటే మాక్కూడా హుషారు పుట్టుకొచ్చింది. మేము రిటైరయిన వృద్ధులమన్న విషయమే మరిచిపోయి, కేరింతలు కొడుతూ బీచుల్లో సరదాగా గడిపాము.

నాలుగు రోజుల తర్వాత హైదరాబాదుకు తిరిగొచ్చాము. నాకైతే, ఈ గోవా ట్రిప్పు బాగా నచ్చింది. శరీరం, మనసూ రిజొవనేట్ అయి, పునరుజ్జీవనం పొందినట్టయింది. అంతకు ముందులాగా నిస్తత్తువగా, నిరాసక్తంగా కాకుండా జీవితం కొత్త అందాలతో కనిపించసాగింది.

రెండు రోజుల విరామం తర్వాత, ఇందిరా పార్కుకు వెళ్ళాను. ఆ రోజు రమణ రాలేదు. బహుశా అలసట తీరలేదేమోననుకుని, ఫోన్ చేసాను.

ఫోన్ లో వాళ్ళబ్బాయి చెప్పిన వార్త విని మ్రాన్పడిపోయాను.

అందరం కలిసి రమణ ఉన్న హాస్పిటలుకు పరుగు పరుగున వెళ్ళాము.

"గోవా నుండి వచ్చిన రోజు తెల్లవారుఝామున తీవ్రమైన గుండె పోటు వచ్చిందనీ, వెంటనే హాస్పిటలుకు తీసుకు వస్తే రెండు స్టెంట్లు వేసారని, ఇప్పుడు బాగానే ఉన్నారని" వాళ్ళబ్బాయి చెప్పాడు.

మేమందరమూ తీవ్ర దుఃఖంతో బయటకు నడిచాము. నేనైతే ప్రతీరోజు హాస్పిటలుకి వెళ్ళి రమణని కలిసేవాణ్ణి. కొంత కోలుకోగానే రమణలో మళ్ళీ అదే హూషారు కనిపించింది.

రెండు నెలల తర్వాత రమణ ఇందిరా పార్కుకు, వాకింగుకు వచ్చాడు. నడక పూర్తయిన తర్వాత, పార్కు బయట టీ తాగుతూ,

"సర్దేసుకున్నాను బాస్!" అన్నాడు నవ్వుతూ. మాకర్థం కాలేదు. మళ్ళీ ఏదైనా ట్రిప్పుకు కు ప్లాన్ చేస్తున్నాడేమోననుకుని,

"ఈ సారి ట్రిప్ ఎక్కడికి?" అని అడిగాను నేను కుతూహలంగా.

రమణ నవ్వుతూ,

"బాస్! ఈ సారి ట్రిప్ అంటూ వేస్తే, అది పైకే! అందుకే అన్నీ సర్దేసుకున్నాను. అన్ని బాకీలు తీర్చేసుకున్నాను. ఈ జీవితం ప్రసాదించిన అందమైన మధురస్మృతులన్నీ మూటకట్టి మనో మంజూషలో దాచుకుని, మిగిలినవన్నీ వొదిలించుకున్నాను. ఆత్మీయులందరినీ కలిసి నా జీవితాన్ని ఇంత అందంగా మలిచినందుకు వారికి కృతజ్ఞతలు తెలియచేసాను. నా వల్ల కష్టం కలిగిన వాళ్ళందరినీ; తెలిసో తెలియకో, ఉద్యోగ ధర్మం మీరలేకో నా వల్ల నష్టం కలిగినవారందరినీ కలిసి సారీ చెప్పాను. మనస్ఫూర్తిగా క్షమాభిక్ష కోరాను. నాకు నష్టం కలిగించినవారిని, నన్ను నమ్మించి మోసం చేసినవారిని కూడా కలిసి, వాళ్ళను కూడా క్షమించేసాను. ఇంకా ఒకరిద్దరిని కలిసే ప్రయత్నం చేస్తూనే ఉన్నాను.

అందుకే, మీ అందరికి కూడా థ్యాంక్స్ చెబుదామనే వచ్చాను. గత కొద్ది నెలలు, మీరందరూ నాకు ఆనందాన్ని పంచారు. థ్యాంక్యూ వన్స్ అగైన్!

ఇప్పుడు నా మనసు ప్రశాంతంగా ఉంది. ఏ కోరికలు లేవు. ఏ అసంతృప్తి, నిరాశానిస్పృహలు లేవు. ఒక అలౌకిక ఆనందంలో మునిగి తేలుతున్నాను.

ఐయాం రెడీ ఫర్ హిస్ కాల్. లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ కాబట్టి, జీవితాంతం ఆరాటంతో సంపాదించిన వస్తువులనన్నింటినీ వదిలించుకుని నా భౌతిక జీవితాన్ని శుభ్రపరుచుకున్నాను. ద్వేషాన్ని, కోపాన్ని అసంతృప్తిని వీడి ఆత్మను పరిశుద్ధపరుచుకున్నాను. దీన్నే 'డెత్ క్లీనింగ్' (Death Cleaning) అంటారని, ఈ మధ్యనే ఒక వాట్సప్ మెసేజ్ లో చదివాను. నేను డెత్ క్లీనింగ్ చేసుకుని సిద్ధంగా ఉన్నాను. అంత మాత్రాన నేను ఇవ్వాళ్ళో రేపో చనిపోతానని కాదు. కానీ, ఈ గుండె ఉంది చూసారూ... ఎప్పుడేం చేస్తుందో చెప్పలేము." అంటూ వీడ్కోలు తీసుకున్నాడు.

+++

అదే చివరిసారిగా రమణని చూడడం. 'గోవా' ట్రిప్పు ఖర్చు బాకీ తీర్చే అవకాశమే లేకుండా పోయింది మాకు. మరో జన్మంటూ ఉంటే మమ్మల్ని మళ్ళీ కలపడానికి ఋణశేషం మిగిలే ఉంది.

ఇప్పుడు నేను ఇందిరా పార్కుకు ఎక్కువగా పోవడం లేదు. నేను కూడా 'డెత్ క్లీనింగ్' పనిలో ఉన్నాను.

+++

దీపావళి పండగ రోజు గుడికి వెళ్ళే హడావుడిలో ఉండి మా కోడలు,

"అత్తయ్యా! అన్నీ సర్దుకున్నారా?" అని అడగడం వినిపించింది.

ఆ ప్రశ్న వినగానే మా ఆవిడ తన చీరె కొంగుతో కళ్ళొత్తుకోవడం, నేను దూరం నుండి చూస్తూనే ఉన్నాను. ఈ రోజంతా ఉదయం నుండీ తను అలాగే, దిగులుగా, ముఖానికి మబ్బులు కమ్మినట్టుగా ఉంది. దానికి కారణం కూడా నాకు తెలుసు.

నేను ఫోన్ తీసి చూసాను. ఆ మబ్బుల్లో నుంచే మొలిచిన హరివిల్లు ఆమె ముఖంలో విరిసే క్షణం ఇంకెంతో దూరం లేదు. నాకు తెలుసు, ఎందుకంటే......

+++

నేను ఎప్పటిలాగానే, ఇంకా కొంచెం ముందుగానే, మా ఆవిడకు ఇందిరా పార్కకు వాకింగుకు వెళ్తున్నానని చెప్పి ఇంట్లో నుంచి బయటపడ్డాను. నా చేతిలో ఎప్పుడూ ఉండే చిన్న బ్యాగు తప్ప మరేం లేదు. బయటకు రాగానే, నేను బుక్ చేసిన క్యాబ్ నంబరు సరి చూసుకొని కారులో ఎక్కాను.

ఇందిరా పార్కుకు అని నా భార్యకు చెప్పిన నేను పది గంటలకల్లా ఢిల్లీ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్ రెండులో దిగాను. క్యాబ్ బుక్ చేసి, అది వొచ్చేలోగా, రెస్ట్ రూములోకి వెళ్ళి ఫ్రెష్ అయి, బ్యాగులో నుంచి తీసిన టై కట్టుకుని, కోట్ వేసుకుని క్యాబ్ వాడు ఫోన్ చేయగానే వెళ్ళి కారులో కూర్చున్నాను.

నా మనసు చాలా ఉద్విగ్నంగా ఉంది. దాదాపు పదేళ్ళ తర్వాత నేను నా కూతురును చూడడానికి వెళ్తున్నాను. ఈ రోజు సోమవారం. అల్లుడికి ఆఫీసు ఉంటుంది. అమ్మాయి మాత్రం 'వర్క్ ఫ్రం హోం' చేస్తుంది. దాని కూతురు, ఎనిమిదేళ్ళ మైత్రేయి ఖాన్, నాలుగేళ్ళ మనుమడు సలీం శాస్త్రి స్కూలుకు వెళ్ళి ఉంటారు.

మా అమ్మాయి చందన మా అభీష్టానికి వ్యతిరేకంగా ఒక ముస్లిం కుర్రాడిని ప్రేమించి పెళ్ళి చేసుకుంది. మమ్మల్ని అనుమతి అడిగితే మేము నిరాకరించాము. తను వినలేదు. ఒకరోజు ఆఫీసుకు వెళ్ళిన చందన తిరిగి మా ఇంటికి రాలేదు.

ఆ రోజు రాత్రి పదకొండింటికి వాళ్ళ అమ్మకు ఫోన్ చేసి తనూ, సలీంఖానూ పెళ్ళి చేసుకున్నామని చెప్పింది. నా భార్య విభ్రాంతికి గురయింది. ముందు ఏడ్చింది. తర్వాత వాళ్ళను ఇంటికి రమ్మని చెప్పింది. నాన్న పిలిస్తే వస్తానంది. నా భార్య నా వైపు దీనంగా చూసింది. నేను పిలవలేదు. తను రాలేదు. పది సంవత్సరాలు గడిచిపోయాయి. ఇద్దరు పిల్లలు పుట్టారనీ, అతగాడికి ఢిల్లీ సెక్రెటేరియట్లో పెద్ద పదవి వచ్చిందన్న విషయాలు తెలుస్తూనే ఉన్నాయి.

నేను గుండె రాయి చేసుకుని బతుకుతున్నాను. కానీ, ఎక్కడ ఒక చక్కని భార్యాభర్తల జంట, ఇద్దరు పిల్లలతో కలిసి నడుస్తున్న దృశ్యం కనపడ్డా గుండెలో కలుక్కుమంటుంది. ఆ రోజు నా చందనను మన్నించి, నేనెందుకు పిలవలేదానన్న ప్రశ్న నన్ను చిత్రవధకు గురిచేస్తుంది.

ఇన్నాళ్ళూ ఈ బాధను, భారాన్నీ గరళ కంఠుడిలా దిగమింగుకుంటూ జీవిస్తున్నాను. నా భార్య, నా భుజం మీద వాలి తనివితీరా ఏడ్చి తన భారాన్ని దించుకుంటుంది. మగవాడినైన నాకా అదృష్టం లేదు.

అయితే, రమణ చివరిసారిగా కలిసి 'సర్దుకున్నాను బాస్!' అని చెప్పిన కొన్నాళ్ళకే చనిపోవడంతో నాలో భయం మొదలైంది. నేను కూడా అన్నీ సర్దుకోవాల్సిన ఆవశ్యకత ఆసన్నమైందని గుర్తించాను.

నేను సర్దుకునే సామాను ఢిల్లీలో ఉందని నాకర్థమయ్యింది. వెంటనే, అభిఙ్ఞవర్గాల ద్వారా, అంటే ఎవ్వరికీ చెప్పకూడదని ఒట్టేయించుకుని, మా అబ్బాయి ద్వారా చందన ఇంటి అడ్రస్, ఫోను నెంబర్లు, మిగిలిన వివరాలు సంపాదించాను. వాడే నాకు ఢిల్లీకి టిక్కెట్లు బుక్ చేసాడు. వాడు అక్కతో టచ్ లోనే ఉన్నట్టుంది.

చందనను సర్ప్రైజ్ చేద్దామని వెళ్తున్నాను కానీ అక్కడ ఎటువంటి స్వాగతం ఎదురవుతుందోనని కొంచెం గాభరాగానే ఉంది. ఒక వేళ అల్లుడు ఆఫీసుకు వెళ్ళకుండా ఇంట్లోనే ఉంటాడేమో, ఒకవేళ వాళ్ళు ఇల్లు మారి ఉంటారేమో లేక ఏదైనా ట్రిప్పుకు వెళ్ళి ఉంటారేమోనన్న సవాలక్ష ప్రశ్నలు నన్ను వేధిస్తున్నప్పటికీ, ఏదైతే అదవుతుందని, మనసును నిబ్బర పరుచుకుని, ఢిల్లీ వీధులను చూస్తూ కూర్చున్నాను.

ముప్పావు గంట తరువాత, నేను దిగాల్సిన సమయం ఆసన్నమయింది. అల్లుడు పెద్ద ఆఫీసరేమో కాబోలు, పెద్ద క్వార్టర్ ముందర నిలబడ్డాను. గేటు తీసుకుని లోపలికి వెళ్ళి బెల్ మోగించాను. అది నా గుండెల్లోనే మోగినట్టుగా అనిపించింది.

తలుపు తెరిచిన నా కూతురు నన్ను చూసి ముందు ఒక్క క్షణం గుర్తు పట్టక "కౌన్...?" అని అనబోయిందల్లా నన్ను తేరిపార చూసి,

"నాన్నా...! నాన్నా..! మీరూ..!" అంటూ మాటలు రాక నిశ్చేష్టురాలై నిలబడిపోయింది. నా రక్తం పంచుకుని పుట్టిన బిడ్డను పదేళ్ళ పాటు కనీసం చూసుకోలేని దురదృష్టానికి చింతిస్తూ, దుఃఖిస్తూ నేను నిలబడ్డాను.

ఏడుస్తున్న నన్ను చూసి, నా చందన, కంగారుగా,

"నాన్నా! ఏమైంది నాన్నా!" అంటూ నన్ను కౌగలించుకుంది. నేను ఒక అపురూపమైన ఆత్మీయ ఆలింగనంలో, నోటమాట రాక నిలబడిపోయాను.

ఆ అలికిడికి, లోపలి నుంచి ఎవరో వచ్చారు.

"మేరా బాబూజీ! కాఫీ బనావో!" అని చెప్పి నా చేతులు పట్టుకుని లోపలికి నడిచింది.

ఒక్క క్షణం నిలబడి, నా కూతురిని చూసుకున్నాను. ఇరవయ్యేళ్ల వయస్సులో మమ్మల్ని వదిలిన చందన ఈ పదేళ్ళలో, సంపూర్ణ మహిళగా రూపాంతరం చెందింది. కొంత పెద్దరికం వచ్చినట్టుగా, మరింత అందంగా తయారయింది.
మన పిల్లలు మనకు ఎప్పుడూ అందంగానే, అపురూపంగానే కనిపిస్తారు కదా!

"ఏంటి నాన్నా! అలా చూస్తున్నావ్?" అని అడిగితే,

"పదేళ్ళయ్యింది కదమ్మా! తనివితీరా చూసుకుంటు... " అని అంటుండగానే నా కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.

"ఏమయింది నాన్నా! అందరూ బాగున్నారా? అమ్మ బాగుందా?" అని ఆదుర్దాగా ప్రశ్నించింది.

"చందూ! నన్ను క్షమిస్తావా తల్లీ!" అని అడిగాను.

"అయ్యో! అదేంటి నాన్నా! నిన్ను నేను క్షమించడమేంటి? మీరే నన్ను క్షమించాలి!" అంటూ నా చేతులు పట్టుకుంది.

పరస్పరం క్షమించేసుకున్నాము. తరువాత సంఘటనలు చకచకా జరిగిపోయాయి. నేను వచ్చానని చందన చెప్పగానే, అల్లుడు భోజనానికి మధ్యాహ్నం ఇంటికి వస్తున్నానని చెప్పాడు. కారు డ్రైవరును పంపించి మనుమణ్ణి, మనుమరాలిని స్కూలు నుండి పిలిపించింది. వాళ్ళను చూసి నా కళ్ళు చెమర్చాయి. వాళ్ళ జీవితాల్లో పదేళ్ళ పాటు అమ్మమ్మ, తాతయ్యల ప్రేమ లేకుండా చేసిన దుర్మార్గుణ్ణనిపించింది. భోజనాలయ్యాక, అల్లుడు ఆఫీసుకు వెళ్తుంటే,

"ఇంటికి రండి అల్లుడు గారూ!" అన్నాను.

"ష్యూర్! మీరెప్పుడు పిలుస్తారా అని చందూ ఎదురు చూస్తుంది." అన్నాడు.

సాయంత్రం హైదరాబాదు తిరుగు ప్రయాణం అయ్యాను. అమ్మాయి, మనుమడు, మనుమరాలు టాటా చెప్తుంటే, తృప్తిగా ఏర్ పోర్టులోకి నడిచాను.

పదింటికి ఇంటికి చేరిన నన్ను చూసి,

"ఎటు వెళ్ళారండీ! పొద్దటి నుంచి ఫోన్ కూడా కలవడం లేదు. ఎంత కంగారు పడ్డానో తెలుసా!.... " అని నా భార్య చివాట్లు పెడుతుంటే, కమ్మగా అనిపించింది.

+++

దీపావళి రోజే మా అమ్మాయి చందన పుట్టినరోజు. అందరూ మహాలక్ష్మి పుట్టిందన్నారు. ఆ మహాలక్ష్మే, పదేళ్ళ తర్వాత మళ్ళీ ఈ రోజు మా ఇంట అడుగుపెట్టబోతుంది. శంషాబాద్ ఏరుపోర్టులో దిగగానే చందన ఫోన్ చేసింది. అందుకే, ఇప్పుడో మరో క్షణంలోనో....

ఇంతలో, "అమ్మా!" అని చందన పిలుపు వినబడగానే, నా భార్య ముఖంలో సప్తవర్ణాల ఇంద్రధనస్సు వింతగా మెరిసింది.

+++

నేను కూడా అన్నీ సర్దేసుకుంటున్నాను.



*ధార్మికగీత - 9*


                                                       
               *శ్లో:- వర మేకో గుణీ పుత్రః* !
                      *న చ మూర్ఖ శతాన్యపి* ౹
                      *ఏకః చంద్ర స్తమో హన్తి* ౹
                      *న చ తారా గణో౽పి చ* ౹౹
                                         *****
*భా:- విద్య, వినయము, విధేయత, వివేకము, విచక్షణ, సంస్కారము, పితృభక్తి, మాతృప్రేమ, గురుశుశ్రూష, వృద్ధసేవ, బంధుప్రీతి ఇత్యాది గుణగణాలు కలిగిన "ఒకే ఒక్క కొడుకు"న్నా చాలు. మానవ జన్మ ధన్యమవుతుంది. ఆ పుత్రుడే పున్నామ నరకం నుండి కాపాడేది. మూర్ఖులు, నీచులు, సంస్కారహీనులై, బ్రతికుండగానే నరకాన్ని చూపించే కుమారులు వందమంది ఉంటే మాత్రం ప్రయోజన మేముంది? నేటి సమాజంలో అలాంటి ప్రబుద్ధులకు కొదవలేదు. వారి కారణంగానే వృద్ధాశ్రమాలు వెల్లి విరుస్తున్నాయి. చక్కనివాడు, చల్లనివాడు, ఆబాలగోపాలాన్ని తన వెన్నెలతో మురిపించి, మరపించేవాడు అయిన "చంద్రుడు" ఒక్కడే చీకట్లను పారద్రోలి కాంతులను వె దజల్లుతూ పరవశింపజేస్తున్నాడు. ఆకాశంలో కోట్లాది నక్షత్రాలు ఉన్నా, అంధకారాన్ని రూపుమాపలేక, వెలవెల పోవడం మనమెరిగిందే కదా! "పుత్రాత్ ఇచ్ఛేత్ పరాజయమ్" -ప్రతి తండ్రి తన కంటె మిన్నగా రూపుదిద్దుకున్న గొప్పవాడైన కొడుకు చేతిలో ఓడిపోవాలని ముచ్చట పడిపోతాడట! పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ! అంటే ఇదే మరి. అది తండ్రి నైజం కాబోలు. బిడ్డలను ప్రయోజకులుగా తీర్చిదిద్దడం తల్లిదండ్రులుగా మన విధి యని సారాంశము*.
                                  *****       
                   *సమర్పణ : పీసపాటి* 
🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲

శివామృతలహరి శతకం

 శ్రీ.చిల్లర కృష్ణమూర్తి గారు వ్రాసిన
 #శివామృతలహరి శతకంలోని ఒక పద్యం;

మ||

తలలూపన్ ధరణీజముల్ సుమలతల్ తామ్రాచ్చపుష్పద్వుతిన్
లలినీరాజనమెత్తి నర్తనము సల్పన్ ; తుమ్మెదల్ పాడ, చి
ల్కలు వల్లింపగ వేదపాఠములు చక్కన్;బాల భానుండుభా
సిలె లింగాకృతి పూర్వ దిక్తటమునన్ శ్రీ సిద్ధలింగేశ్వరా !

భావం ;( నాకు అర్ధమైన రీతిలో)
ప్రకృతి అంతటి లోనూ శివుడు ఉన్నాడు.భక్తితో చూసేవారికి ప్రతి దాన్లోనూ  శివుడే దర్శనమిస్తాడు.
అది తెలపడానికి సూర్యోదయ కాలాన్ని లింగోద్భవం లాగా ఈ పద్యంలో వర్ణించారు.
చెట్లు గాలికి ఊగుతుంటే అవి సంతోషంగా తలలూపుతున్నట్లు కనిపిస్తున్నాయట,
పుష్ప కాంతులతో విలసిల్లుతున్న పూల మొక్కలు ప్రేమతో నీరాజనం అర్పిస్తున్నట్లుగా నాట్యం చేస్తున్నాయట,
పూల మకరందాన్ని గ్రోలడానికి వచ్చిన తుమ్మెదలు ఝంకార నాదం  చేస్తూ పాడుతున్నట్లు అనిపిస్తోంది.
చిలకల పలుకులు చక్కగా వేదాలు
వల్లిస్తున్నట్లుందట.అటువంటి ఉషస్సమయంలో తూర్పు దిక్కున  ఉదయిస్తున్న బాల భానుడు లింగాకృతిలో దర్శనమి స్తున్న శివుడిలా గోచరిస్తున్నాడు.
అని నాన్న గారి భావన.

రేపటి నుండి కొత్త కమ్యూనికేషన్ నిబంధనలు ఉన్నాయి. (3-9-2020)



* 1. * అన్ని కాల్‌లు రికార్డ్ చేయబడతాయి

* 2. * అన్ని ఫోన్ కాల్ రికార్డింగ్‌లు సేవ్ చేయబడ్డాయి

* 3. * వాట్సాప్ పరిశీలించబడుతుంది

* 4. * ట్విట్టర్ పర్యవేక్షించబడుతుంది

* 5. * ఫేస్‌బుక్ పర్యవేక్షిస్తుంది

* 6. * అన్ని సోషల్ మీడియా మరియు ఫోరమ్‌లు పర్యవేక్షించబడతాయి

* 7. * తెలియని వారికి తెలియజేయండి.

* 8. * మీ పరికరాలు మంత్రిత్వ వ్యవస్థలకు అనుసంధానించబడి ఉన్నాయి.

* 9. * అనవసరమైన సందేశాలు పంపకుండా జాగ్రత్త వహించండి

* 10. * జాగ్రత్త వహించడానికి మీ పిల్లలు, బంధువులు మరియు స్నేహితులకు దీని గురించి తెలియజేయండి

* 11. * పోస్టులు లేదా వీడియోలు మొదలైనవి ఫార్వార్డ్ చేయవద్దు, ప్రభుత్వం , ముఖ్యమంత్రి, ప్రధాని గురించి, రాజకీయాలు, ప్రస్తుత పరిస్థితుల గురించి మీరు ఎలాంటి వ్యతిరేక పోస్టులు చేయవద్దు.

* 12. * పోలీసులు * సైబర్ క్రైమ్ * అనే నోటిఫికేషన్ పెట్టారు మరియు చర్యలు తీసుకుంటారు. కాబట్టి తొలగించవద్దు ......

* 13. * ఏదైనా రాజకీయ మరియు మతపరమైన చర్చలపై ఏదైనా సందేశం రాయడం లేదా ఫార్వార్డ్ చేయడం ఇప్పుడు నేరం .... వారెంట్ లేకుండా అరెస్ట్ చేస్తారు ...

* 14. * ఇది చాలా తీవ్రమైనది, దయచేసి గ్రూప్ అడ్మిన్ & పోస్ట్ చేసినవారు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతారు. అలాగే ఈ సమాచారం మీకు తెలిసిన  సమూహాలకు మరియు వ్యక్తిగత సభ్యులకు ఈ విషయం తెలియజేయండి.

* 15. * అనవసరమైన సందేశాలు పంపకుండా జాగ్రత్త వహించండి. జాగ్రత్త వహించడానికి దీని గురించి ప్రతి ఒక్కరికీ తెలియజేయండి.

మీ స్నేహితులు మరియు ఇతరులకు తెలియజేయండి.

దయచేసి భాగస్వామ్యం చేయండి; గుంపులు గుంపులుగా ఉండకండి దయచేసి జాగ్రత్తగా ఉండండి.

 *కమ్యూనికేషన్ మరియు డిజిటల్ ఎకానమీ మంత్రి *
🙏🏻🙏🏻🙏🏻
---------------------------------
ఈ రోజు అర్ధరాత్రి నుండి కరోనా వైరస్ అప్డేట్స్ గూర్చి గ్రూపులలో  ఏమి కూడా పెట్టకండి.
డిసాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ అమలవుతుంది. ఒకవేళ పోస్టులు పెడితే
దీని వలన శిక్షకు గురి అవుతారు..!
అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను...
***********************

మన లైఫ్ ఇప్పటిదాకా ఒక లెక్క..ఇప్పుడోలెక్క



కరోనా పూర్తిగా కనుమరుగైన తర్వాత కూడా ఇలాంటి వైరస్​లు మరిన్ని పుట్టుకురావొచ్చు. అందుకే ఇప్పటిదాకా గ డిపిన జీవితం వేరు.. ఇక నుంచి గడపాల్సిన జీవితం వేరు. పర్సనల్​గానే కాదు ఫ్యామిలీ మెంబర్స్​తో గడిపే లైఫ్​ కూడా మార్చుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్​, రిలేటివ్స్​, కొలీగ్స్​తో రిలేషన్​ కూడా చేంజ్​ చేసుకోవాలి.  వీటన్నింటితో పాటు.. మన అలవాట్లు కూడా మార్చుకోవాలి.

🏠🏕 ఇంటి నుంచే మొదలవ్వాలి🏡🏝🏕

లైఫ్​స్టైల్​ చేంజ్​ అనేది ముందుగా ఇంటి నుంచే మొదలవ్వాలి. బయటి పరిస్థితులు ఎలా ఉన్నా… ఇంట్లో ఉండాల్సి వస్తే, ఆ ఇల్లు ఆరోగ్యాన్నిచ్చేదిలా ఉండాలి. అంటే.. అవసరమైనప్పుడే ఇంట్లోకి గాలి, వెలుతురు వచ్చేలా మార్పులు చేసుకోవాలి. ఎప్పుడూ మెడికల్​ షాపు​లోని మందులపైనే ఆధారపడకుండా ఆయుర్వేదంలో ఉపయోగించే ఔషధ మొక్కలను ఇంట్లో పెంచాలి. ఇల్లు ఎప్పుడూ పొడిగా ఉండాలి. వాటర్ లీకేజీ లేకుండా రిపేర్​ చేయించుకోవాలి. అలాగే స్థలం ఉంటే బాత్రూమ్​, వాష్​రూమ్​ వంటివి ఆరుబయట ఏర్పాటుచేసుకోవాలి. బ్రష్​ చేసుకునే సింక్​ వంటివి కూడా ఇంట్లో కాకుండా బయటే ఉంటే బెటర్​. ఇంట్లోని ఫ్లోర్​ను ఈజీగా క్లీన్​ చేసుకునేలా స్పేస్​ ఫ్రీగా ఉంచుకోవాలి. అవసరంలేని వస్తువులన్నింటిని అటకెక్కించాలి.

🗒 కిరాణా లిస్ట్​ మారాలి 🗒

ఇప్పటిదాకా కిరాణా లిస్ట్​ కేవలం వంటింటి సరుకులు, సబ్బులు, సర్ఫ్​లకే పరిమితమయ్యేది. ఇకపై ఆ లిస్ట్​లో హ్యాండ్​వాష్, శానిటైజర్​ వంటివి కూడా చేర్చాలి. ఇప్పుడు కరోనా కలకలం ఉంది కదా అని మాత్రమే చేతులు కడుక్కుంటే సరిపోదు. ఇకపై కూడా చేతులు శుభ్రంగా ఉంచుకోవడం అలవాటుగా మార్చుకోవాలి.
అందుకే ఇంట్లో ఎప్పుడూ హ్యాండ్​వాష్​, బ్యాగ్​లో ఎప్పుడూ శానిటైజర్​ ఉంచుకోవాలి.

🍉🍊🍅🍋🥥🍌🥬🥒🌶🍆🌽🧅🥦🥕🥭🍑🍈🍒 ఫుడ్​ హ్యాబిట్స్ మారాలి

కాలంతో సంబంధం లేకుండా వేడి వేడివి  మాత్రమే తినాలి. ఫ్రిజ్​లో పెట్టి తినే అలవాటు మార్చుకోవాలి. కేవలం రుచికోసమే కాకుండా ఆరోగ్యం గురించి కూడా ఆలోచించి అన్నిరకాల ఆహారపదార్థాలు తినడం అలవాటు చేసుకోవాలి. జంక్​ ఫుడ్​, కూల్​ డ్రింక్స్​ వంటివాటికి వీలైనంత దూరంగా ఉండాలి.  తాజా కూరగాయలు, పండ్లు, మొలకెత్తిన గింజలు, డ్రైఫ్రూట్స్​ వంటివి రెగ్యులర్​గా తినాలి. నిజానికి జంక్​ఫుడ్​తో పోలిస్తే వీటికి అయ్యే ఖర్చు చాలా తక్కువే. ఫ్రిజ్​లో నీళ్లు తాగడం మానేసి వేడి నీళ్లు తాగడం అలవాటు చేసుకోవాలి. అంతగా చల్లటి నీళ్లు తాగాలనుకుంటే కుండలో నీళ్లు తాగాలి.

 🧘‍♂🧘‍♀ వర్కవుట్స్​ కంపల్సరీ

శరీరానికి తగినంత ఇమ్యూనిటీ​ ఉంటే వైరస్​లు, బ్యాక్టీరియాల వల్ల వచ్చే వ్యాధులన్నింటినీ దాదాపు తరిమికొట్టొచ్చు. అదే లేకపోతే మనం ఎన్నిజాగ్రత్తలు తీసుకున్నా లాభం ఉండదు. మరి ఈ ఇమ్యూనిటీ కోసం మంచి ఫుడ్​ మాత్రమే తీసుకుంటే సరిపోదు. శరీరంలోని ప్రతి వ్యవస్థ బలంగా మారేలా వర్కవుట్స్​ కూడా చేయాలి. ఇప్పటిదాకా అలవాటు లేకపోయినాసరే.. ఇక నుంచి వర్కవుట్స్​ హాబీగా మారాలి. యోగ, ధ్యానం, ప్రాణాయామం వంటివి కూడా ప్రాక్టీస్​ చేయాలి. వీటిని ఏదో ఒక మతానికి సంబంధించినవిగా చూడొద్దు.

 🛀 🚿 పర్సనల్​  హైజీన్​ 🚿🚰

వ్యక్తిగత పరిశుభ్రత అనేది ఎప్పుడూ అవసరమే. బిజీ షెడ్యూల్​ ఉందని స్నానం చెయ్యకుండా ఉండొద్దు. తరచూ కాళ్లు, చేతులు కడుక్కోవడం అనేది ఎప్పుడూ కంటిన్యూ చేయాలి. ఇంట్లోకి అడుగుపెట్టకముందే కాళ్లు, చేతులు, ముఖం శుభ్రంగా కడుక్కోవాలి. అంతేగానీ.. అలసిపోయి వచ్చామంటూ సోఫాలో అలాగే సాగిలపడొద్దు. వీలైతే ఆఫీస్​ నుంచి వచ్చాక కూడా వేడివేడి నీళ్లతో స్నానం చేయాలి. అంతేకాకుండా తరచూ చేతులతో ముఖాన్ని, శరీర భాగాలను తాకే అలవాటు కూడా మార్చుకోవాలి.

🧹🚽🪒🧽 శుభ్రత

ఇంటిని, పరిసరాలను మాత్రమే శుభ్రం  చేసుకుంటే సరిపోదు. వైరస్​లు, బ్యాక్టీరియాలబారిన పడకుండా ఉండాలంటే ఇంటితోపాటు ఇంట్లో ఉండే వస్తువులను, పర్సనల్​గా మనం వాడే వస్తువులను కూడా క్లీన్​ చేసుకోవాలి. ల్యాప్​టాప్​, ఫోన్​, వ్యాలెట్, హ్యాండ్​ బ్యాగ్​, కంప్యూటర్​, కీబోర్డ్, టీవీ రిమోట్​, రిస్ట్​ వాచ్​, బుక్స్​ వంటివి క్లీన్​ చేయడం గురించి ఆలోచించం. కానీ వీటిని ఎప్పటికప్పుడు క్లీన్​ చేసుకోవాలి. ఎందుకంటే నిజానికి వీటివల్లే  వైరస్​ స్ప్రెడ్​ అవుతుంది.

 👨‍👨‍👦 పిల్లలు, పెద్దల పట్ల..

పిల్లలు, పెద్దల ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యంగా అస్సలు ఉండొద్దు. ‘జ్వరమేకదా.. జలుబే కదా.. దగ్గు కామనే’.. అంటూ నిర్లక్ష్యంగా ఉండొద్దు. ఎప్పుడూ ఇలాగే వస్తుంది కదా, అదే తగ్గిపోతుందిలే అనే వైఖరి ఇకపై మారాలి.  అలాగని మెడికల్​ షాపు​ నుంచి ఏదిపడితే అది తెచ్చి వేయొద్దు. పిల్లలను శుభ్రంగా ఉంచడంతోపాటు వాళ్లకు బలమైనవి తినిపించాలి. ఏదైనా ఆరోగ్య సమస్య వచ్చిన వెంటనే డాక్టర్​ను కలవాలి. ఎక్కువయ్యేదాకా ఆగడం మంచిదికాదు. పెద్దోళ్ల విషయంలో కూడా ఇలాగే జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే పిల్లలు, వృద్ధుల్లో ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుందనే విషయాన్ని గుర్తించాలి.

 🚷 అవుట్​డోర్​ మీటింగ్స్​.. ,

టైంపాస్​ కాకపోతే అలా బయటకి వెళ్లొస్తామంటూ వెళ్లిపోతారు. సెలవు దొరికితే షికార్లకు ప్లాన్​చేస్తారు. కొన్నిసార్లు నేరుగా కలవాల్సిన​ అవసరం లేకపోయినా వెళ్లి కలిసి వస్తారు. బ్యాంకులు, బిల్లుల చెల్లింపు వంటివాటి కోసం గంటల తరబడి లైన్లలో నిలబడతారు. నిజానికి ఇవన్నీ ఇంటి నుంచే చేసుకోవచ్చు. అందుకే ఇకపై అవుట్​డోర్​ మీటింగ్స్​ను సాధ్యమైనంత వరకు తగ్గించుకోవాలి. వీలైనంత వరకు ఫోన్​, ఆన్​లైన్​ చాటింగ్​ ద్వారానే పూర్తయ్యేలా చేసుకోవాలి. తప్పనిసరి అయితే తప్ప బయటికి వెళ్లొద్దు.

 సెల్ఫ్​ డిసిప్లిన్​..

సెల్ఫ్​ డిసిప్లిన్​ తప్పనిసరి. అది ఇంట్లో ఉన్నా సరే.. బయటకెళ్లినా సరే. ఎక్కడైనా ‘క్యూ’లో నిలబడాల్సి వస్తే మనిషికి, మనిషికి మధ్య స్పేస్​ ఉండేలా నిలబడాలి. విదేశాల్లో ఈ కల్చర్​ ఉన్నా.. మనదేశంలో మాత్రం మీదపడి తోసుకోవడమే. అంతేకాదు.. తుమ్మినా, దగ్గినా దస్తీ​ అడ్డంగా పెట్టుకోవాలి. మాట్లాడేటప్పుడు కూడా దూరంగా ఉండి మాట్లాడాలి. తుంపర్లు పడేలా మరీ దగ్గరగా ఉండొద్దు.
~~~~~

సామెత లో మార్పు...

గుంపులో గోవిందా కాదు...
గుంపైతే గోవిందా....
          ఇట్లు
Ayurveda Neuro Therapy center, Hydernagar, Kukatpally, Hyderabad.
Call 8333830329,9966834469
********************

నేను



 నేను అన్న దగ్గరే మన బాధ మొదలవుతుంది.

నేను అన్యాయం అయిపోయాను*
నాకు అవమానం జరిగింది*
నన్ను నిర్లక్ష్యం చేసారు*
నన్ను తేలిగ్గా చూసారు*
నాకు విలువ ఇవ్వలేదు*
నాకు మర్యాద ఇవ్వలేదు*
నా పరువు పోతుంది*
నాకు చెడ్డపేరు వస్తుంది*

నన్ను నలుగురూ గొప్పగా గుర్తించాలి. నన్ను బాధించినవారి మొహం నేనింక ఎప్పుడూ చూడను.

ఇలా... ఇలా...ప్రతీచోటా "నేను" ని నింపేస్తే జీవితం ఇరుకైపోతుంది..

కొంచెం "నేను" కి విలువ ఇవ్వటం తగ్గించుకుంటూ ఉంటే జీవితం మరీ అంత బరువవ్వకుండా సులువుగా ముందుకి నడుస్తుంది..

మనసులో ఎన్నో గజిబిజి ఆలోచనలకు మూలం నేను..

ఒక్కసారి నేను, నాకు అనే భావం తొలిగించి చూస్తే చాలా అంతర్మధనాలు దూరం అవుతాయి.

చాలా అయోమయాలు, కోపాలు, ఆవేశాలు, ఆలోచనల తాలూకూ బరువును మన మనసు మోయనక్కరలేదు..

నేను అనబడే నన్నుని ఎవరో ఏదో అన్నారని బాధపడి దిగులుపడి, ఆ అన్నవారిని తిరిగి బాధించటానికి ఎన్నో ఆలోచనలు చేయటం అనవసరం..

మనని అన్నవారు అనేసి హాయిగా తమ పనులలో మునిగిపోతారు, వారికి మనము గుర్తు కూడా ఉండము..
మనం మాత్రం ప్రతీకార వాంఛతో నిత్యం వారినే గుర్తుచేసుకుంటూ ఉంటాము..

సమయం వ్రృధా, అనవసర శ్రమ....
పైసా పుట్టించలేము ఈ ప్రతికూల ఆలోచనలతో....

అదే ఒక్కసారి " నన్ను " అవమానించారు అనే బరువుని గుప్పిట్లో పట్టుకుని ఉంచుకోక,
కాసేపు గుప్పిట విప్పి నేను , నన్ను అనే భావనని గాలికి వదిలేస్తే అసలైన శాంతి అక్కడ మొదలవుతుంది..
ప్రయత్నించి చూస్తే ఇది కష్టమైన పనేమో కానీ.... అసాధ్యమైనది మాత్రం కాదు నేస్తం... కాకపొతే... కష్టసాధ్యం.

అస్థిత్వం రూపేణా "నేను" అనే ఆలోచన అవసరం..
కానీ మనం చిన్న చిన్న విషయాలలో కూడా, నేను అనే అంశం ఆధారంగా ఎక్కువగా తీసుకుని, మన మనసుని ఎదుటివారి కంటే కూడా, మనకి మనమే ఎక్కువగా బాధించుకుంటాము అనిపిస్తోంది.
కుటుంబాలలో అందరమూ ఎంతో కొంత నిస్వార్ధంగానే చాలాచోట్ల ఉంటాము

కానీ ఉన్నట్టుండి, ప్రేమలను పోల్చిచూసుకోవటమో, బేరీజు వేసుకోవటమో చేసి, మన అశాంతిని మనమే కొని తెచ్చుకుని కుటుంబాలలో కలహాలు తెచ్చుకుంటాము.. ఇలాంటి చాలా అనవసర, అల్పమైన విషయాల్లో నేను అనే కోణాన్ని వదిలేస్తే అన్నివిధాలా మంచిదేమో..

చాలా మనస్పర్ధలు ఇలాంటివే, అందుకే చాలాచోట్ల నేను ని వదిలేస్తేనే జీవించటం తేలికవుతుంది..
****************************

రామాయణమ్..50


..
అమ్మా! నా తండ్రి మాటలు యుక్తమా లేక అయుక్తమా అని నేను విచారణ చేయను ,
.
ఆయన కోరిక ప్రకారము పదునాలుగేండ్లు వనవాసమునకు ఈ క్షణమే బయలు దేరగలను..
.
ఒక్కవిషయము మాత్రము నా హృదయమును దహించి వేయుచున్నదమ్మా! నా తండ్రిగారే నాకు స్వయముగా చెప్పకున్నారేమి?
.
 అయినా రాజ్యాభిషేకమునకు భరతుడికి అభిలాష ఉన్నదని నాకు తెలియదు .తెలిసియున్న ఎడల నా సర్వస్వము అతనికి ధారపోసి యుండెడి వాడను.
.
రాముడి ఈ పలుకులు దశరధమహారాజు యొక్క గాయమయిన హృదయాన్ని కెలికినట్లుగా ఉన్నాయి. ముదుసలి మహారాజు తట్టుకోలేక పోతున్నాడు.ఆయన కళ్ళనుండి ధారాపాతంగా కన్నీరు కారుతున్నది వంచిన తల ఎత్తలేక ,సూటిగా రాముని చూడలేక సతమతమవుతూ యమయాతన అనుభవిస్తున్నాడు.
.
ఇటు కైక సంతోషము పట్టనలవిగాకుండా ఉన్నది ! రామా ! నేను చెపితే రాజు చెప్పినట్లేగదా ! ఎవరు చెప్పారన్నదిఅంత ప్రధానముకాదు ! ఇది రాజుగారి అభిమతము.
.
ఇంక నీవు ఆలస్యము చేయక వెంటనే బయలుదేరవలెను అని అంటూ తొందరపెట్టసాగింది.నీవు ఈ పట్టణము విడిచి వెళ్ళనంతవరకు నీ తండ్రి స్నానము, భోజనము చేయరు!
.
ఈ మాటలు వింటున్న దశరధుడు దీర్ఘముగా నిట్టూర్చి ఛీ ! ఎంత కష్టము వచ్చినది అని తనలో తనే అనుకుంటూ కూర్చున్న మంచముమీద కూర్చున్నట్లే ఒరిగిపోయాడు ,స్పృహతప్పిపోయాడు.
.
రాముడు తండ్రిని లేవదీసి మరల కూర్చుండపెట్టబోయాడు ,కానీ  మరలమరల కొరడాతో గుర్రాన్ని కొట్టినట్లుగా కైక ప్రేరేపించటం మొదలు పెట్టింది ! ఆవిడ తొందరను గమనించిన రాముడు...
.
అమ్మా ! నాకు ధనము ప్రధానము కాదు ,ఋషులవలే నాకు కూడా ధర్మమే ప్రధానము తల్లీ ! నీవింతగా నన్ను తొందర పెట్టవలసిన పనిలేదమ్మా ! నా తండ్రికొరకు ఇప్పటికిప్పుడు నా ప్రాణములనయినా ధారపోయగలనమ్మా ! అని అన్నాడు.
.
తండ్రి ఆజ్ఞను పాటించుటకు మించి ధర్మాచరణము లేదమ్మా నాకు!..
.
నా జీవితములో అర్ధమునకు,సంపదలకు ప్రధానములేదమ్మా! ధర్మమే ! నా జీవన హేతువు !
.
అమ్మా ! నీకు నా మీద అధికారమున్నదమ్మా ! భరతునికి రాజ్యమిమ్మని నీవే నాతో చెప్పవచ్చుగదమ్మా! తండ్రిగారి ద్వారా ఎందులకు? నీకు నా గుణములమీద ఇప్పటికీ నమ్మకములేదని తెలుస్తున్నదమ్మా!
.
అమ్మా! మాఅమ్మ కౌసల్యకు,సీతకు చెప్పి తక్షణమే పయనమైపోగలవాడను అని పలికి తండ్రికి,పినతల్లికి నమస్కరించి అచటనుండి నిష్క్రమించాడా ధర్మస్వరూపుడు!
జానకిరామారావు వూటుకూరు గారి
సౌజన్యం తో ....
ధర్మధ్వజం
హిందు చైతన్య వేదిక
*****************

నవగ్రహాలకి ఇష్టం లేని పనులు.....!!



అద్దం పుట్టడానికి చంద్రుడు కారణమట.
అందుకే అద్దములో దిగంబరముగా చూచుకొనుట, వెక్కిరించుట చేయకూడదు.

సర్వ శాస్త్రములు తెలిసిన గురువు బృహస్పతి, ఎవరైనా గురువుని కించపరచితే గురుదేవునికి అగ్రహము కలుగుతుందట.

బుధుడికి చెవిలో వ్రేలు పెట్టి తిప్పుకుంటే కోపమట. అందునా బుధవారం అస్సలు చేయకూడదట. వ్యాపారాన్ని అశ్రద్ధ చేసిన,
జ్ఞానం ఉంది అని విర్రవీగిన కోపమట.

శనికి పెద్దల్ని కించపరచిన,
మరుగుదొడ్లు శుచిగా లేకపోయినా కోపమట. తల్లితండ్రిని చులకన చేసిన కోపమట.
సేవక వృత్తి చేసిన, సేవ చేసిన వారిని కాపాడతాడు.

పితృ దేవతలని దూషిస్తే రవికి కోపమట.
సూర్య దేవునికి ఎదురుగా మల మూత్ర విసర్జన దంతావధానం చేయకూడదట.

శుక్రుడికి భార్య/భర్త అగౌరవ పరచుకుంటే కోపమట. లక్ష్మీ దేవి కృప లేకపోతే శుక్ర కృప కష్టమే.
అమ్మకి శుచి శుభ్రత లేని ఇళ్లు మనుషులు నచ్చరుట, గొడవలు లేని ఇల్లు ఇష్టము.

అప్పు ఎగ్గొడితే కుజుడికి కోపమట.
వ్యవసాయ పరంగా మోసం చేస్తే ఊరుకోడట.

జ్ఞానం ఉండి కూడా పంచడానికి వెనకడిన,
మోక్ష కారకుడు అయిన కేతువుకి పెద్దలకు మరణాంతరము చేయవలసిన కార్యములు చేయకపోతే కోపమట.
ఈయన జాతకంలో బాగోలేకపోతే పిశాచపీడ కలుగుతుంది.

రాహు వైద్య వృత్తి పేరుతో మోసగించినా, సర్పములని ఏమైనా చేసిన ఆయనకి కోపము కలుగునట.
ఈయన భ్రమ మాయ కి కారణము..!!
********************

వాస్తు శాస్త్రము


(వాస్తు పురాణం):పూర్వ‌కాలంలో అంధ‌తాసుర‌డ‌నే రాక్ష‌సుడు ముల్లోకాల వాసుల‌ను ముప్ప‌తిప్పులు పెట్టుచుండెను. అప్పుడు లోక సంర‌క్ష‌ణార్థం ప‌ర‌మేశ్వ‌రుడు ఆ రాక్ష‌సునితో యుద్ధం చేశాడు. ఆ స‌మ‌యంలో శివుని ల‌లాటం నుండి రాలిన ఒక చెమ‌ట బిందువు భూమిపై ప‌డి దాని నుండి భ‌యంక‌ర‌మైన క‌రాళ వ‌ద‌నంతో ఒక గొప్ప భూతం ఉద్భ‌వించి క్ర‌మ‌క్ర‌మంగా భూమి, ఆకాశాల‌ను ఆవ‌రించి సాగింది. ఆ మ‌హాభూతాన్ని చూసిన ఇంద్రాది దేవ‌త‌లు భయ‌భ్రాంతుల‌య్యారు. బ్ర‌హ్మ‌దేవుని శ‌ర‌ణువేడారు. స‌మ‌స్త భూత‌ముల‌ను సంభ‌వించువాడు, స‌ర్వ‌లోక పితామ‌హుడు అయిన బ్ర‌హ్మ దేవ‌త‌ల‌ను ఊర‌డించి ఆ భూత‌మును ఆధోముఖంగా భూమి యందు ప‌డ‌వేసి విధానం చెప్పాడు. బ్ర‌హ్మ‌దేవుని ఆన‌తి ప్ర‌కారం దేవ‌త‌లంద‌రూ ఏక‌మై ఆ భూత‌మును ప‌ట్టి అధోముఖంగా క్రింద‌కు ప‌డ‌వేశారు. ఆ భూతం భూమిపై ఈశ‌న్య కోణ‌మున శిర‌స్సు, నైరుతి కోణ‌మున పాద‌ములు, వాయువ్య‌, ఆగ్నేయ కోణాలందు బాహువులు వుండున‌ట్లు ఆధోముఖంగా భూమిపై ప‌డింది. అది తిరిగి లేవ‌కుండా దేవ‌త‌లు దానిపై కూర్చున్నారు. ఇంత‌మంది దేవ‌త‌ల తేజస్ర్స‌ముదాయంతో దేదీప్య‌మానంగా వెలుగొందుతున్న ఆ భూతాకార అద్భుతాన్ని తిల‌కించిన బ్ర‌హ్మ దేవుడు దాన్నే వాస్తు పురుషుడుగా సృష్టిగావించాడు. వాస్తు పురుషుడు భాద్ర‌ప‌ద బ‌హుళ త‌దియ‌, శ‌నివారం, కృత్రికా న‌క్ష‌త్ర‌ము, వ్య‌తీపాత యోగ‌ము, భ‌ద్ర‌నా క‌ర‌ణ‌ము గుళిక‌తో కూడిన కాలంలో ఆ వాస్తు పురుషుడు జ‌న్మించాడు. ఏ అప‌కారం చేయ‌ని నాపై అధిష్టించి ఈ దేవ‌త‌లు పీడించుచున్నారు. వీరి నుండి న‌న్ను కాపాడ‌మ‌ని వాస్తు పురుషుడు బ్ర‌హ్మ‌దేవున్ని వేడుకున్నాడు.అప్పుడు బ్ర‌హ్మ‌దేవుడు సంతోషించి వాస్తు పురుషా ! గృహ‌ములు నిర్మించున‌ప్పుడు, త్రివిధ‌మ‌యిన గృహ ప్ర‌వేశ స‌మ‌య‌ములందు, గ్రామ‌, న‌గ‌ర ప‌ట్ట‌ణ‌, దుర్గ దేవాల‌య‌, జ‌లాశ‌య, ఉద్యాన‌వ‌న నిర్మాణ స‌మ‌య‌ములందు ముందుగా నిన్నే పూజిస్తారు. అలా పూజించ‌ని వారికి ద‌రిద్ర‌ముతో పాటు అడుగ‌డుగునా విఘ్న‌ములు చివ‌ర‌కు మృత్యువు కూడా సంభ‌వించున‌ని వాస్తు పురుషునికి వ‌ర‌మిచ్చారు. అంతేకాక వాస్తు ప‌రుషునిపై అష్ట‌దిక్కుల‌లో వున్న దేవ‌త‌లు తృప్తి పొందు విధంగా ఆయా స్థ‌లాల‌లో నివ‌సించే దేవ‌త‌లు వారివారి విధులు నిర్వ‌హించుట వ‌ల‌న గృహ‌స్థుల‌కు స‌ర్వ‌సుఖ‌ములు, స‌త్ఫ‌లితులు క‌లుగున‌ట్లు ఆశీర్వ‌దించారు. బ్ర‌హ్మ‌దేవుని ఆశీస్సులు ప్ర‌కారము ఈశాన్య‌మున – ఈశ్వ‌రుడు (ఈశ‌), ఆగ్నేయ‌మున – అగ్ని, నైరుతిన ఆదిత్య‌డు, వాయువ్య‌మైన – వాయువు, తూర్పున – వ‌రుణుడు, ఉత్త‌ర‌మున – కుబేరుడు (సోమ‌), అష్ట‌దిక్కుల‌లో అధిష్టించిన ఈ దేవ‌త‌లు తృప్తి చెందే విధంగా నిర్మాణ క్ర‌మం వుంటే ఆ గృహంలో నివ‌సించే వాళ్లు స‌ర్వ‌సుఖ సంప‌ద‌ల‌ను పొందుతారు. ఇదీ వాస్తు – పురాణం. ఈశాన్య‌ములో పూజ‌లు, ప‌విత్ర కార్య‌ములు అగ్నేయ‌మున అగ్నిదేవునికిసంబంధించిన వంటావార్పు నైరుతిన ఆయుధ సామాగ్రి, వాయువ్య‌మున స్వ‌తంత్రాభిలాష చిహ్న‌ములు, తూర్పున ఆధిత్యునికి ప్రీతిక‌ర‌మైన ప‌నులు,య‌మ‌స్థాన‌మైన ద‌క్షిణ‌ము శిర‌స్సు ఉంచి నిద్రించుట‌, కుబేర స్థాన‌మైన ఉత్త‌రాన్ని ద‌ర్శిస్తూ మేలు కొనుట‌, వ‌రుణ స్థాన‌మైన ప‌శ్చిమాన పాడి ప‌శువుల‌ను పెంచుట మొద‌లైన విధులు ఆయా దిక్కుల్లో ఉన్న దేవ‌త‌ల‌కు తృప్తిని క‌లిగిస్తాయి. ఈ సారాంశాన్ని వాస్తు శాస్త్రం నియ‌మాలు మ‌న‌కు వెళ్ల‌డిస్తున్నాయి. గృహ నిర్మాణాలు చాలా ర‌కాలు వీటిలో మ‌న‌ష్యోప‌యుక్త‌ములు, ప‌శ‌వుల‌కు సంబంధించిన నిర్మాణాలు, ప‌క్షుల‌కు సంబంధించిన నిర్మాణాలు దేవ‌త‌ల‌కు సంబంధించిన నిర్మాణాలు ఇలాగ అనేక విధాలుగా వున్నాయి. వాస్తుశాస్త్రక‌ర్త‌లు నిర్మాణాల‌ను ముఖ్యంగా 4 భాగాలుగా విభ‌జించారు. (1) సాధార‌ణ మ‌నుష్య నివాస‌ములు (2) ప్ర‌భు నిర్మాణ‌ములు (3) దేవ‌తా నిర్మాణ‌ములు (4) స‌ర్వ‌సాధార‌ణ ప్ర‌జోప‌యోగ నిర్మాణాలు. సామాన్యంగా ప్ర‌తి గృహ‌స్తుల‌కు అవ‌స‌ర‌మైన స‌దుపాయ‌ముల‌ను గురించి మార్పుల‌తో నిర్మాణాలు చెప్ప‌బ‌డియున్న‌వి...మీ... చింతా గోపీ శర్మ సిద్ధాంతి* లక్ష్మీలలితా వాస్తు జ్యోతిష నిలయం (భువనేశ్వరి పీఠం) పెద్దాపురం, సెల్ :- 9866193557
************************

35వ పద్యం

మ.
దినముం జిత్తములో సువర్ణముఖరీతీరప్రదేశామ్రకా
ననమధ్యోపరివేదికాగ్రమున, నానందంబునం బంకజా
సన నిష్ఠ న్నిను జూడ గన్న నదివో సౌఖ్యంబు లక్ష్మీ విలా
సిని మాయానటనల్ సుఖంబు లగునే? శ్రీకాళహస్తీశ్వరా!
***************

మొగలిచెర్ల అవధూత

మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారితో అనుభవాలు..
విభూతి..గంధం..

"మేము అండమాన్ లో వుంటామండీ..మా బంధువులు ఇక్కడికి దగ్గరలో ఉన్న చుండి గ్రామం లో వుంటారు..ఒకప్పుడు మేమూ ఈ ప్రాంతం వాళ్ళమే.. కానీ కొన్ని సంవత్సరాల క్రిందట అండమాన్ వెళ్లి..అక్కడే వ్యాపారం చేసుకుంటూ స్థిరపడ్డాము.. మావాళ్ళు ఈ క్షేత్రం గురించి..శ్రీ స్వామివారి గురించి గొప్పగా చెపితే..చూసిపోదామని వచ్చాము..మాకు ఈ క్షేత్రం గురించి వివరాలు చెపుతారా?.." అన్నారా దంపతులు..వాళ్ళు మాట్లాడుతున్నది తెలుగులోనే అయినా..కొద్దిగా తేడాగా ఉంది..

శ్రీ స్వామివారు మాలకొండ క్షేత్రం లో తపస్సు చేసుకుంటూ ఉన్నప్పటి నుంచి..మొగలిచెర్ల లోని ఫకీరు మాన్యం లో తాను నిర్మించుకున్న ఆశ్రమం లో కపాలమోక్షం ద్వారా సిద్ధిపొందిన దాకా జరిగిన సంఘటనలన్నీ క్లుప్తంగా వివరించాను..శ్రద్ధగా విన్నారు..శ్రీ స్వామివారు సమాధి చెందిన అనంతరం..వేలాదిమంది వచ్చి దర్శించుకొని వెళుతున్నారని..వారికేమైనా సమస్యలు ఉన్నా..ఈ సమాధి దగ్గర మ్రొక్కుకుంటే..అవి తీరిపోతున్నాయనీ ..తమ బంధువుల ద్వారా విన్నామని వాళ్ళు నాతో అన్నారు..

ఆ తరువాత ఆ దంపతులు శ్రీ స్వామివారి మందిరానికి మూడు సార్లు ప్రదక్షిణాలు చేసి..శ్రీ స్వామివారి విగ్రహం వద్ద పూజ చేయించుకుని..శ్రీ స్వామివారి సమాధి వద్దకు వెళ్లి..ఒక ఐదారు నిమిషాల పాటు ప్రార్ధన చేసుకొన్నారు..శ్రీ స్వామివారి విభూతి..గంధం..రెండూ తీసుకున్నారు..వెళ్ళొస్తామని చెప్పి వెళ్లిపోయారు..

మరో మూడు నాలుగు నెలల తరువాత..మందిరానికి నూరు రూపాయల మనీ ఆర్డర్ వచ్చింది..అందులో..తమ చిరునామాకు..శ్రీ స్వామివారి విభూతి, గంధం..రెండూ పోస్ట్ ద్వారా పంపమని వ్రాసారు..ఆ చిరునామా..అండమాన్ లోని పోర్టుబ్లయర్ కు సంబంధించినది..అప్పుడు మాకు గుర్తుకు వచ్చింది..కొంతకాలం క్రిందట వచ్చి వెళ్ళింది వీళ్ళే కదా అని..అందులో వారి ఫోన్ నెంబర్ ఇవ్వలేదు..వారు కోరిన విధంగా విభూతి..గంధం..పోస్ట్ ద్వారా పంపాము..మరో రెండు నెలల తరువాత..చుండి గ్రామం నుంచి ఒక వ్యక్తి వచ్చి..తాను అండమాన్ వెళుతున్నాననీ..తమ బంధువుల కోసం శ్రీ స్వామివారి విభూతి, గంధం కావాలని అడిగారు..ఇచ్చాము..వచ్చిన ఆ వ్యక్తి ద్వారా తెలిసింది..అప్పుడు వచ్చిన ఆ దంపతుల కోసమే ఈ విభూతి.. గంధం..

మరో ఆరేడు నెలల తరువాత..ఒక శనివారం నాడు ఆ దంపతులు శ్రీ స్వామివారి మందిరానికి వచ్చారు.."శ్రీ స్వామివారు చాలా మహిమ కలవాడు..మేము పోయినసారి ఇక్కడికి వచ్చినప్పుడు చాలా సమస్యల్లో ఉన్నామండీ..ఒక రకంగా చెప్పాలంటే ఆర్ధికంగా..మానసికంగా కృంగిపోయి వున్నాము..ఎటూ దిక్కుతోచని పరిస్థితి లో వున్నాము..ఇక్కడినుంచి పోతూ పోతూ..శ్రీ స్వామివారి విభూతి..గంధం..తీసుకెళ్లాము..ప్రతిరోజూ ఇంటినుంచి ఉదయాన్నే స్నానం చేసి..దీపారాధన చేసుకొని..శ్రీ స్వామివారి విభూతిని..గంధాన్ని.. నుదుటిన ధరించడం అలవాటు చేసుకున్నామండీ..కేవలం పదిహేను రోజుల లోపే మాకు చాలా మార్పు కనబడింది..మా దగ్గర అప్పు తీసుకొని..ఇవ్వకుండా మమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళు..ఇంటికొచ్చి మరీ చెల్లించి వెళ్లారు..దాదాపు డెబ్భై శాతం వసూలు అయ్యాయి..ఆ డబ్బు చేతికి వచ్చిన మరుక్షణం మేము చెల్లించాల్సిన వాళ్లకు చెల్లించివేశాము..ఇప్పుడు మాకున్న అప్పులన్నీ తీరిపోయాయి..వడ్డీ వ్యాపారం కూడా మానేసాము..ఒకళ్లను పీడించి..ఏడిపించి.. వాళ్ళ ఆర్ధిక బలహీనత మీద చేసే ఆ వ్యాపారం మంచిది కాదని..మాకు తోచింది..వేరే వ్యాపారం చూసుకున్నాము..అంతా ఆ స్వామివారి విభూతి మహిమ..అందుకే మీ దగ్గరనుంచి విభూతి..గంధం..రెండు మూడు సార్లు తెప్పించుకున్నాము..ఈరోజు శ్రీ స్వామివారిని దర్శించుకుని మా మ్రొక్కు చెల్లించుకోవాలని అనుకున్నాము.." అన్నారు..

" రాబోయే శనివారం, ఆదివారం రోజులలోఅన్నదానం చేయాలని అనుకున్నాము..సరుకులన్నీ మేమే తీసుకొస్తాము..సుమారు ఎంతమందికి తయారు చేయాలో మీరు చెపితే..దానికి తగ్గ విధంగా ఏర్పాటు చేసుకుంటాము.." అన్నారు..శనివారం రాత్రికి సుమారుగా వేయి మంది భక్తులు వుంటారనీ.. ఆదివారం మధ్యాహ్నం అయితే..ఎనిమిది వందల మంది భక్తుల కొరకు ఏర్పాట్లు చేయాలనీ.. చెప్పాము..వచ్చే శని, ఆదివారాల్లో రెండుపూటలా తామే చేస్తామని చెప్పారు..

అనుకున్న విధంగానే ఆ దంపతులిద్దరూ అన్నదానం చేశారు..అవకాశం ఇచ్చినందుకు నాకూ మా సిబ్బందికి ధన్యవాదములు తెలిపారు..తిరిగి వెళుతూ..మర్చిపోకుండా శ్రీ స్వామివారి విభూతి..గంధం..రెండూ ఎక్కువ మోతాదులో తీసుకొని వెళ్లిపోయారు..ఇప్పటికీ సంవత్సరం లో కనీసం మూడు నాలుగు సార్లు మనీ ఆర్డర్ ద్వారా నగదు పంపి..విభూతి..గంధం..తెప్పించుకుంటూ వుంటారు..

విభూతి..గంధం..ఈ రెండింటి ద్వారా ఆ దంపతుల భక్తిని శ్రీ స్వామివారు స్థిరపరచారు..

సర్వం..
దత్తకృప.

(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్:523114.. సెల్..94402 66380 & 99089 73699).
***************************

గాయత్రీ శక్తి

గాయత్రీ శక్తిని గురించి వక మంత్రంలో వివరణ కనబడుచున్నది. సప్త దశ్యాదితి సత్ అఋుణాంఅశ్వనౌ అని కలదు. కేతువు శక్తియే దీనికి మూలం. మరియు తత్ అది అఋణాం ఉషాఅణవుయెక్క చైతన్య శక్తియే యని అది ఋక్కుగా ప్రకృతి గా మారి నా రూపంలో అనగా భగవత్ శక్తి జీవ శక్తిగా ఉన్నదని.అదే గాయత్రీ అస్మాకం తత్ అస్తి. అని తెలియుచున్నది. సప్త గుర్రములు సూర్య శక్తి యే గాయత్రీగా అదే ప్రకృతి శక్తిగా తెలియుచున్నది. సప్త గుర్రములు అనగా 7 రకములైన కాంతి ప్రచండమైనప్రచండమైనకశ్యపాత్మజం భూమికి శక్తి ఆత్మయే యని ఆత్మయే జీవులను. జీవునికి అటువంటి కిరణ శక్తి వలననే జీవ సృష్టి యని లక్షణముగా వాటి పేర్లు కూడా వివరించబడినది. ఆదిత్య హృదయంలో. గుర్రంయెుక్క శక్తి వేగము ఎటుల నడిచే కొలదీ అపరిమితమగునో సప్త కిరణ కాంతి లక్షణము కూడా భూమిని చేరుటలో అదే సూత్రము అన్వయించవచ్చును.
*****************

Did you know this story?


The year was 1555. Portuguese colonial power was at its peak in the 1500’s. They destroyed Zamorins of Calicut. Defeated the Sultan of Bijapur. Took away Daman from the Sultan of Gujarat, Established a colony in Mylapore, Captured Bombay and made Goa as their headquarters. And while they were at it, pretty much unchallenged, they even ruined the ancient Kapaleeswarar Temple to build a Church over it.

Their next target, the super profitable port of Mangalore.

Their only bad luck, just 14 kilometers south of Mangalore was the small settlement of Ullal - ruled then by a feisty 30 year old woman - RANI ABBAKKA CHOWTA

Initially, they took her lightly and sent a few boats and soldiers to capture and bring her back to Goa - Those boats never came back.

Shocked and enraged, they sent a huge fleet of ships this time, under the command of much celebrated Admiral Dom Álvaro da Silveira - The admiral soon returned, badly injured and empty handed.

Thereafter, another Portuguese fleet was sent - only a few injured from the crew managed to make it back.

Then the Portuguese went on to capture the Mangalore port and the fort anyways, perhaps planning to tackle Rani Abbakka Chowta from the convenient distance of the Mangalore fort.

After the successful capture of Mangalore, a huge army under João Peixoto, an experienced Portuguese General was sent to Ullal.

The brief was simple: Subjugate Ullal and capture Abbakka Chowta.

The plan was foolproof- there was no way a 30 year old lady with a few men could withstand the might of an army of thousands with advanced weapons.

The Portuguese reached Ullal and found it deserted. Abbakka was nowhere in sight.

They roamed around, relaxed and thanked their stars - Just when they were about to call it a victory - Mrs Chowta attacked with 200 of her chosen men - there was chaos all around and many portuguese lost their lives even without a fight.

General João Peixoto was assassinated, 70 Portuguese were captured and the rest just ran away.

So if you’re Abbakka Chowta, who’s just defeated a large army of aggressors, killed a general, captured fighters and defended her city - What will you do?

- Rest and enjoy the moment right?

- Right?

- No!

_Rani Abbakka Chowta, rode with her men towards Mangalore that same night, and laid a siege of the Mangalore fort - She not just broke inside the fort successfully - but assassinated Admiral Mascarenhas the Chief of the Portuguese power there and forced the remaining Portuguese to vacate the fort._

She didn’t just stop at this but went on to even capture the Portuguese settlement at Kundapura, a full 100 kms, north of Mangalore - Just to make a point.

The Portuguese finally managed to get back at Abbakka Chowta by convincing her estranged husband, ( a traitor) to betray for money. * She was arrested and put in the prison where she revolted again and was killed while trying to escape. *Lesson from story : It is the local Indians, who themselves are responsible for slavery of our nation for 1000 years by siding with Enemies.

Abbakka Chowta was a Jain who fought against the Portuguese for four decades, with an army comprising of both Hindus and Muslims, a full 300 years before the First War of Indian Independence in 1857.

What did we Indians do to her, as a mark of our respect and gratitude? - We just forgot her.

We didn’t name our girls after her. We didn’t even teach her stories to our kids.

Yes we did release a Postal Stamp in her name, named a boat after her and erected 2 statues - yes just 2 statues in the whole of India for someone who should be our national hero.

The Indian Coast Guard ship ICGS Rani Abbakka the 1st of a series of five inshore patrol vessels built at Hindustan Shipyard Ltd is named after Abbakka Mahadevi.

We might have got to read a chapter about her in our text books, had she been a European or an American.

Many talk about her being the last Indian to have the power of the agni-ban. In all this cacophony, our generation has lost a great hero - a great source of inspiration.

Still wondering why you’ve not heard about her yet?

*********************

భాగవతామృతం


గ్రంధకర్త వంశ వర్ణనము
1-24-సీ.సీస పద్యము

కౌండిన్యగోత్ర సంకలితుఁడాపస్తంబ;
సూత్రుండు పుణ్యుండు సుభగుఁడైన
భీమన మంత్రికిఁ బ్రియపుత్త్రుఁ డన్నయ;
కలకంఠి తద్భార్య గౌరమాంబ
కమలాప్తు వరమునఁ గనియె సోమన మంత్రి;
వల్లభ మల్లమ వారి తనయుఁ
డెల్లన యతనికి నిల్లాలు మాచమ;
వారి పుత్త్రుఁడు వంశవర్ధనుండు
1-24.1-ఆ.
లలిత మూర్తి బహుకళానిధి కేసన
దాన మాన నీతి ధనుఁడు ఘనుఁడు
దనకు లక్కమాంబ ధర్మగేహిని గాఁగ
మనియె శైవశాస్త్రమతముఁ గనియె.
కౌండిన్య = కౌండిన్యస; గోత్ర = గోత్రంలో; సంకలితుఁడు = ఆవిర్భవించినవాడు; ఆపస్తంభ = ఆపస్తంభ; సూత్రుండు = సూత్రానుయాయి; పుణ్యుండు = పుణ్యాత్ముడు; సుభగుఁడు = సౌభాగ్యసంపన్నుడు; ఐన = ఐనటువంటి; భీమనమంత్రి = భీమనమంత్రి; కిన్ = కి; ప్రియ = ప్రియమైన; పుత్త్రుఁడు = కొడుకు; అన్నయ = అన్నయ; కలకంఠి = మంచి వాక్కు ఉన్నామె; తత్ = అతని; భార్య = భార్య; గౌరమాంబ = గౌరమాంబ; కమల = పద్మముల; ఆప్తు = బంధువు - సూర్యుని; వరమున = వరమువలన; కనియె = కనినది; సోమనమంత్రిన్ = సోమనమంత్రిని; వల్లభ = (అతని) భార్య; మల్లమ = మల్లమ; వారి = వారి; తనయుఁడు = కొడుకు; ఎల్లన = ఎల్లన; అతని = అతని; కిన్ = కి; ఇల్లాలు = భార్య; మాచమ = మాచమ; వారి = వారి; పుత్త్రుఁడు = కొడుకు; వంశ = వంశమును; వర్ధనుండు = ఉద్ధరించినవాడు;
లలిత = అందమైన; మూర్తి = రూపుగలవాడు; బహు = అనేక; కళా = కళల; నిధి = సంపన్నుడు; కేతన = కేతన; దాన = దానగుణము; మాన = మన్నింపదగిన గుణము; నీతి = నీతితో కూడిన ప్రవర్తన; ధనుఁడు = ధనముగాకలవాడు; ఘనుఁడు = గొప్పవాడు; తను = అతను; కున్ = కి; లక్కమాంబ = లక్కమాంబ; ధర్మ = ధర్మబద్ధమైన; గేహిని = గృహిణి - భార్య; కాఁగ = అయ్యి యుండగా; మనియె = జీవించెను; శైవశాస్త్ర = శైవమును; మతమున్ = మతముగా; కనియెన్ = స్వీకరించినాడు.
ఇక మా వంశ చరిత్ర. కౌండిన్యసగోత్రంలో ఆవిర్భవించిన వాడు. అపస్తంబసూత్ర అనుయాయి, పుణ్యాత్ముడు, ధన్యాత్ముడు అయిన వాడు భీమన్న మంత్రి. ఆయన కుమారుడు అన్నయ్య. ఆయన అర్ధాంగి గౌరమ్మ. ఆ దంపతులకు సూర్యుని వరప్రసాదం వల్ల సోమన్న జన్మించాడు. ఆయన ఇల్లాలు మల్లమ్మ. ఆ సతీపతుల సంతానం ఎల్లన్న. ఆయన భార్య మాచమ్మ. వారిద్దరికీ వంశవర్థనుడైన కేసనమంత్రి ఉదయించాడు. చక్కనివాడు, పెక్కు కళలలో ప్రసిద్ధుడు, దాత, నీతిమంతుడు, ఆభిమానధనుడు ఐన కేసన్నగారు లక్కమాంబను సహధర్మచారిణిగా వరించి శాస్ర్త సమ్మతమైన శైవమతాన్ని స్వీకరించాడు.
1-25-క.కంద పద్యము

నడవదు నిలయము వెలువడి
తడవదు పరపురుషు గుణముఁ దనపతి నుడువుం
గడవదు వితరణ కరుణలు
విడువదు లక్కాంబ విబుధ విసరము వొగడన్.
నడవదు = వెళ్ళదు; నిలయము = ఇల్లు; వెలువడి = విడిచి; తడవదు = తలపులోకి రానీయదు; పర = పరాయి; పురుషు = మగవారి; గుణము = గుణాలను; తన = తన; పతి = పతి; నుడువున్ = మాటను; గడవదు = దాటదు; వితరణ = దాన గుణము; కరుణలు = జాలిని; విడువదు = విడిచి పెట్టదు; లక్కాంబ = లక్కమాంబ; విబుధ = మంచి జ్ఞానుల; విసరము = సమూహం; పొగడన్ = కీర్తించగ.
ఆ లక్కమాంబ మహా యిల్లాలు. యింటి బయటకు కాలు పెట్టి ఎరుగదు. పరపురుషుల సంగతి తలచుట ఎరుగదు. భర్త మాట జవదాటి ఎరుగదు. దాన ధర్మాలకు, దయా దాక్షిణ్యాలకు పెట్టింది పేరు. పెద్దల మన్ననలను పొందిన మహా సాధ్వి.
1-26-ఉ.ఉత్పలమాల

మానిను లీడుగారు బహుమాన నివారిత దీనమానస
గ్లానికి, దాన ధర్మ మతిగౌరవమంజులతాగభీరతా
స్థానికి, ముద్దుసానికి, సదాశివపాదయుగార్చనానుకం
పానయవాగ్భవానికిని, బమ్మెర కేసయ లక్కసానికిన్.
మానినులు = స్త్రీలు, {మానిని - మానము గల స్త్రీ}; ఈడు = సాటి; కారు = రారు; బహుమాన = తను చేసిన బహుమానములచే; నివారిత = తొలగింపబడిన; దీన = దీనులయొక్క; మానస = మనసులలోని; గ్లాని = దఃఖముగలామె; కిన్ = కి; దాన = దాన; ధర్మ = ధర్మ; మతి = బుద్ధి; గౌరవ = గౌరవ; మంజులతా = మృదువైన; గభీరతా = గంభీరమైన ప్రవర్తనలకి; స్థాని = నిలయమైనామె; కిన్ = కి; ముద్దు = మనోజ్ఞమైన; సాని = అధికురాలు; కిన్ = కి; సదా = ఎల్లప్పుడూ; శివ = శివునియొక్క; పాద = పాదముల; యుగ = ద్వయాన్ని; అర్చన = పూజించుటందు; అనుకంపా = దయాకలిత; నయ = మృదు; వాక్ = సంభాషణలో; భవాని = పార్వతీదేవి లాంటి ఆమె; కిన్ = కి; బమ్మెర = బమ్మెర; కేసయ = కేసయగారి; లక్కసాని = లక్కాంబ; కిన్ = కు.
లక్కమాంబ బీదసాదలను ఆదరించి వారి కష్టాలు పోగొట్టే చల్లని తల్లి. ఔదార్యానికీ, బుద్థి చాతుర్యానికి, సౌందర్యానికి, గాంభీర్యానికి ఆమె పెట్టిందిపేరు. సదా, సదాశివుని పదాలు అర్చిస్తూ, దయతో కూడిన నయవాక్కులతో, సాక్షాత్తు భవానీమాతలా కనిపించే ఆ కేసయ గారి ధర్మపత్నికి సామాన్య కాంతలు సాటిరారు.
1-27-క.కంద పద్యము

ఆ మానినికిం బుట్టితి
మే మిరువుర మగ్రజాతుఁ డీశ్వరసేవా
కాముఁడు తిప్పన, పోతన
నామవ్యక్తుండ సాధునయ యుక్తుండన్.
ఆ = అటువంటి; మానిని = మంచి మానము గలామె {మానిని - మానము గల స్త్రీ}; కిన్ = కి; పుట్టితిమి = పుట్టితిమి; మేము = మేము; ఇరువురము = ఇద్ధరము; అగ్ర = ముందు; జాతుడు = పుట్టినవాడు - అన్న; ఈశ్వర = శివ; సేవా = పూజయందు; కాముఁడు = కోరికగలవాడైన; తిప్పన = తిప్పన; పోతన = పోతన అనే; నామ = పేరుతో; వ్యక్తుండ = తెలియబడేవాడిని; సాధు = మంచితనం; నయ = నీతి; ఉక్తుండన్ = ఉన్నవాడిని.
ఆమెకి మేమిద్దరం కొడకులం పుట్టాము. పెద్దవాడు తిప్పన్న, ఆయన ఈశ్వరార్చన కళాశీలుడు. నేను చిన్నవాణ్ణి. నా పేరు పోతన్న. పెద్దల అడుగుజాడల్లో నీతి యుక్త సాధువర్తనతో మెలగే వాడిని.
1-28-వ.వచనము
అయిన నేను, నా చిత్తంబున శ్రీరామచంద్రుని సన్నిధానంబు గల్పించుకొని.
అయిన = ఐనటువంటి; నేను = నేను; నా = నాయొక్క; చిత్తంబున = మనసులో; శ్రీ = శ్రీ; రామచంద్రుని = రామచంద్రుని; సన్నిధానంబు = సాన్నిధ్యము; కల్పించుకొని = కల్పించుకొని;
అట్టి నేను శ్రీ రామచంద్రుణ్ణి నా నిండుగుండెలో నిలుపుకొన్నవాడని అయి.
******************

పితృ తర్పణము - విధానము



పితృ దేవతలకు శ్రాద్ధం చేసినపుడు , తర్పణము కూడా అందులో భాగం గా చెయ్యాలి. దీనిని చదివి , బ్రాహ్మణుడు దొరకకున్ననూ , ఎవరికి వారు తర్పణము చేయవచ్చును

తర్పణము అర్థము , అవసరము , ప్రాశస్త్యము వంటి వాటి గురించి వేరొక చోట వ్రాయుచున్నాను )

ముగ్గురు పితృ దేవతలను బ్రాహ్మణులలో ఆవాహన చేసి కూర్చోబెట్టి చేసే శ్రాద్ధాన్ని ’ పార్వణ శ్రాద్ధం ’ లేక ’ చటక శ్రాద్ధం ’ అంటారు..కొన్ని సాంప్ర దాయాలలో బ్రాహ్మణులు లేకుండా కేవలము కూర్చలలో పితృదేవతలను ఆవాహన చేస్తారు ..

.తగిన కారణము వలన అది కూడ వీలు కానప్పుడు క్లుప్తముగా చేసే శ్రాద్ధాలు... దర్శ శ్రాద్ధము , ఆమ శ్రాద్ధము , హిరణ్య శ్రాద్ధము.

ఆ పద్దతి ముందుగా ఇచ్చి , తదుపరి తర్పణ విధి వివరించడమయినది..

దర్శాది హిరణ్య / ఆమ శ్రాద్దం

పుణ్య కాలే | దర్భేషు ఆశీనః | దర్భాన్ ధారయమాణః | ఆచమ్య , పవిత్ర పాణిః ప్రాణానాయమ్య |

ఓం భూః ..ఓం భువః...ఓగ్ం సువః.. ఓం మహః.. ఓం జనః.. ఓం తపః.. ఓగ్ం సత్యం..| .....ఓం తత్సవితుర్వరేణ్యం | భర్గో దేవస్య ధీమహి | ధియో యోనః ప్రచోదయాత్ |

ఓమాపోజ్యోతీ రసోఽమృతం బ్రహ్మ భూర్భువస్సువరోమ్

సంకల్ప్య || శ్రీగోవింద గోవింద......దేశకాలౌ సంకీర్త్య , .అస్యాం పుణ్య తిథౌ

| ప్రాచీనావీతి |

అస్మత్ పితృ , పితామహ , ప్రపితామహానాం ... ----- గోత్రాణాం. .. ------ , -------- , ------ శర్మాణాం , వసు , రుద్ర , ఆదిత్య స్వరూపాణాం

అస్మత్ మాతృ , పితామహీ , ప్రపితామహీనాం ... -------- గోత్రాణాం , ------- , --------- ,-------దానాం , వసు , రుద్ర , ఆదిత్య స్వరూపాణాం ,

అస్మత్ మాతామహ , మాతుః పితామహ , మాతుః ప్రపితామహానాం ... ------ గోత్రాణాం , --------, ---------- , --------- శర్మాణాం , వసు , రుద్ర , ఆదిత్య స్వరూపాణాం

అస్మత్ మాతామహీ , మాతుః పితామహీ , మాతుః ప్రపితామహీనాం ... -------- గోత్రాణాం ,

--------, ------------ , --------------- దానాం , వసు , రుద్ర , ఆదిత్య స్వరూపాణాం ,

ఉభయ వంశ పితృణాం .. అక్షయ తృప్యర్థం , అమావాస్యా పుణ్యకాలే ( సంక్రమణ పుణ్యకాలే ,/ సూర్యోపరాగ పుణ్యకాలే / సోమోపరాగ పుణ్యకాలే / వస్వాది పుణ్యకాలే ) దర్శ శ్రాద్ధం ../ .. ఆమ శ్రాద్ధం హిరణ్య రూపేణ అద్య కరిష్యే | తదంగ తిల తర్పణం చ కరిష్యే |

దక్షిణతో దర్భాన్ నిరస్య | అప ఉపస్పృశ్య |

హిరణ్య శ్రాద్ధం |

అమావాస్యా పుణ్యకాలే అస్మిన్ మయా క్రియమాణే హిరణ్యరూప దర్శ శ్రాద్ధే , ఏక బ్రాహ్మణ సంభవే వర్గ ద్వయ పితృణాం ఇదమాసనం | తిలాది సకలారాధనైః స్వర్చితం | ( అనేక బ్రాహ్మణ పక్షే పృథక్ వరణం కుర్యాత్ )

తాంబూలం , హిరణ్యం చ గృహీత్వా ||

|| హిరణ్య గర్భ గర్భస్థం హేమ బీజం విభావసోః |

అనంత పుణ్య ఫలదం అతః శాంతిం ప్రయఛ్చ మే ||

అస్మత్ పితృ , పితామహ , ప్రపితామహానాం | -------- గోత్రాణాం. .. -------- , --------- , --------- శర్మణాం , వసు , రుద్ర , ఆదిత్య స్వరూపాణాం

అస్మత్ మాతృ , పితామహీ , ప్రపితామహీనాం ... --------- గోత్రాణాం , --------- , ---------, --------దానాం , వసు , రుద్ర , ఆదిత్య స్వరూపాణాం ,

అస్మత్ మాతామహ , మాతుః పితామహ , మాతుః ప్రపితామహానాం ... ------- గోత్రాణాం , ---------, -------- , ---------- శర్మాణాం , వసు , రుద్ర , ఆదిత్య స్వరూపాణాం

అస్మత్ మాతామహీ , మాతుః పితామహీ , మాతుః ప్రపితామహీనాం ... -------- గోత్రాణాం ,

-------- , ---- , --------- దానాం , వసు , రుద్ర , ఆదిత్య స్వరూపాణాం ,

ఉభయ వంశ పితృణాం .. అక్షయ తృప్యర్థం ,దర్శ శ్రాద్ధ ప్రత్యామ్నాయం యద్దేయం అన్నం తత్ ప్రతినిధి హిరణ్యం వర్గ ద్వయ పితృ ప్రీతిం కామయమానః తుభ్యమహం సంప్రదదే | నమమ | ఓం తత్ సత్ |

ఉపవీతి |

ప్రదక్షిణం |

|| దేవతాభ్యః పితృభ్యశ్చ మహా యోగిభ్యః ఏవ చ |

నమః స్వధాయై స్వాహాయై నిత్యమేవ నమో నమః ||

| యాని కాని చ పాపాని జన్మాంతర కృతాని చ

తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే |

నమస్కారః

ప్రాచీనావీతి | వర్గ ద్వయ పితృభ్యో నమః | స్వామినః మయా కృతేన హిరణ్య రూప దర్శ శ్రాద్ధేన మమ వర్గ ద్వయ పితరః సర్వే నిత్య తృప్తా భూయాసురితి భవంతోను గృహ్ణంతు | ఇతి ప్రార్థ్య |

( యజమానస్య వర్గద్వయ పితరః సర్వే నిత్య తృప్తా భూయాసుః ఇతి బ్రాహ్మణాశీర్వాదః )

తర్పణమ్

దీనికి ఇచ్చిన బొమ్మ చూడుడు ...దర్భలతో కూర్చలు చేసుకొన వచ్చును .

పితృ దేవతల ప్రీతి కొరకు అర్పించే తిలాంజలినే ’ తర్పణం ’ అంటారు..

ముఖ్య గమనిక :

ఇంటి లోపల తిల తర్పణము నిషిద్ధము..ఇంటి బయట ఆవరణలో గానీ , బాల్కనీ లో గాని లేదా తులసి కోట దగ్గరగానీ తర్పణము ఆచరించవచ్చును..

తండ్రి బ్రతికి ఉన్న వారు తర్పణము ఆచరించరాదు..సజీవులు గా ఉన్న వారిని వదలి , మిగిలిన వారికి మాత్రమే తర్పణము ఇవ్వాలి.

అమావాశ్య , గ్రహణ కాలము , అర్ధోదయ , మహోదయ పుణ్యకాలాలు , ఆయనములు , సంక్రమణ కాలములందు తర్పణాలు ఇవ్వాలి. అప్పుడు ద్వాదశ పితృ దేవతలకు మాత్రము తర్పణం ఇవ్వాలి అనేది కొందరి మతము. అయితే , సాధారణ సంక్రమణము మరియు అమావాశ్యలందు ద్వాదశ పితృ దేవతలకు , మిగిలిన కాలాలలో సర్వే పితృ తర్పణము చెయ్యడము వాడుక లో ఉంది... వారి వారి సంప్రదాయాన్ని అనుసరించి చేయవచ్చును..

మహాలయ పితృ పక్షమునందు మరియు పుణ్య క్షేత్రములందు సర్వ పితృ దేవతలకూ తర్పణం వదలాలి. మహాలయ పక్షము నందు ఆయా తిథులలో మరణించిన పితృ దేవతలకు ఆయా రోజుల్లో తర్పణం వదలవచ్చు.

తిథులు తెలియని యెడల , అందరికీ అన్ని రోజులూ తర్పణం వదలవచ్చు. అది వీలు కానిచో , కనీసం అమావాశ్య రోజైనా అందరికీ తర్పణం ఇవ్వాలి.. వారి వారి శక్త్యానుసారం చెయ్యవచ్చును.

తర్పణము ఇచ్చునపుడు , మొదట సంబంధము ( మాతుః ... పితుః... మాతులః.. ఇలా ) , తరువాత వారి పేరు , గోత్రము చివర పితృదేవతారూపము ( వసు , రుద్ర , ఆదిత్య.... ఇలా ) చెప్పి వదలవలెను..

ఆడవారు సుమంగళి అయిన ’ దేవి ’ అని , కానిచో ’ కవీ ’ అని చెప్పి ఇవ్వాలి.

మాతృ , పితామహి , ప్రపితామహి...ఈ మూడు వర్గాలు తప్ప మిగిలిన స్త్రీలందరికీ ఒక్కొక్కసారి మాత్రమే తర్పణం వదలాలి..

మిగిలినవారికి , వారి వారి సూత్రానుసారముగా చెప్పినటువంటి సంఖ్యలో తర్పణం ఇవ్వాలి...

ఇతర నియమాలు

తర్పణము ఇచ్చునపుడు కుడి చేతి ఉంగరపు వేలికి మూడు దర్భలతో చేసిన పవిత్రం ధరించాలి.

తర్పణానికి ఉత్తమమైన కాలము సుమారు మధ్యాహ్నము 12 గంటలకు . తర్పణము వదలు నపుడు ప్రాచీనావీతి గా ఉండి జంధ్యమును కుడి భుజం పై వేసుకొని ( అపసవ్యము ) ఎడమచేతిలో నీటి పాత్ర పట్టుకొని , కుడి చేతిలో నువ్వులు ఉంచుకుని , చూపుడు వేలు , బొటన వేలు మధ్యనుండి ( పితృ తీర్థం లో ) నీరు , తిలలు వదలాలి

తర్పణము ఈ కింది సందర్భాలలో ఆచరించవచ్చు..

అమావాశ్య మరియు సాధారణ సంక్రమణ కాలములందు

గ్రహణ , అర్ధోదయ , మహోదయ పుణ్యకాలములలో , దక్షిణాయన , ఉత్తరాయణ పుణ్య కాలాలలోను , మహాలయ పితృ పక్షం లోనూ , మరియు తీర్థ క్షేత్రములకు వెళ్ళినపుడు...

ఒకేసారి , ఒకే రోజు రెండు కారణాలవలన రెండు సార్లు తర్పణము ఇవ్వరాదు..ఒకే తర్పణము ఇవ్వాలి..ఉదాహరణకి ,

అమావాశ్య , సంక్రమణము ఒకే రోజు వస్తే , అమావాశ్య తర్పణము మాత్రము ఇవ్వాలి.

దక్షిణాయన / ఉత్తరాయణ పుణ్య కాలాలు అమావాశ్య రోజున వస్తే , ఆయన పుణ్యకాలం లో మాత్రము తర్పణము ఇవ్వాలి..

గ్రహణము , మరియు దక్షిణ / ఉత్తర పుణ్యకాలాలు ఒకరోజే వస్తే , గ్రహణ నిమిత్తం మాత్రం తర్పణం ఇవ్వాలి. ఉత్తరాయణ పుణ్య కాలము , అర్ధోదయ / మహోదయ పుణ్యకాలాలు ఒకే రోజు వస్తే , అర్ధోదయ / మహోదయ పుణ్యకాలాల తర్పణం ఇవ్వాలి..

చంద్ర గ్రహణమైతే గ్రహణ మధ్య కాలము దాటిన తర్వాత , సూర్య గ్రహణమైతే గ్రహణ మధ్య కాలానికన్నా ముందుగాను , తర్పణము ఇవ్వాలి.

సంక్రమణమైతే , పుణ్యకాలంలో ఇవ్వాలి..

విధానము

ప్రాగగ్రాన్ దర్భాన్ ఆస్తీర్య | తేషు దక్షిణాగ్రౌ ద్వౌ కూర్చౌ నిధాయ | ( మూడు దర్భలను బొమ్మలో చూపినట్టు , కొనలు తూర్పుకు వచ్చేలా ఒకదానికొకటి సమాంతరం గా పరచాలి... వాటిపైన రెండు కూర్చ లను , దక్షిణానికి కొనలు వచ్చునట్లు పరచాలి.)

కూర్చలను చెయ్యడానికి : రెండేసి దర్భలను తీసుకుని పైనుంచి ( కొనలనుంచి ) ఆరంగుళాలు వదలి మడవాలి, మడిచినచోట ఒక వృత్తం లాగా చేసి, రెండు సార్లు కొనలను దర్భల చుట్టూ తిప్పి వృత్తం లోనించీ అవతలికి తీసుకొని ముడి వెయ్యాలి. తర్వాత ,

ఆచమనము చేసి , పవిత్రము ధరించి , తర్వాత ప్రాణాయామము చేసి , సంకల్పము ఇలా చెప్పాలి

సంకల్పము : ( దేశకాలౌ సంకీర్త్య ) శ్రీ గోవింద గోవింద మహా విష్ణురాజ్ఞయా ప్రవర్ధమానస్య , అద్య బ్రహ్మణః , ద్వితీయ పరార్థే , శ్వేత వరాహ కల్పే ,

వైవస్వత మన్వంతరే , కలియుగే , ప్రథమపాదే , జంబూద్వీపే , భరత వర్షే , భరత ఖండే , రామ క్షేత్రే , బౌద్దావతారే ,

అస్మిన్ వర్తమానే వ్యావహారికే చాంద్రమానేన , ప్రభవాది షష్టి సంవత్సరణాం మధ్యే , శ్రీ ------నామ సంవత్సరే ( సంవత్సరం పేరు ) , -----ఆయనే ( ఆ కాలపు ఆయనము పేరు ) , ........ఋతౌ ( ఋతువు పేరు ) , ..... మాసే ( మాసపు పేరు ) , .....పక్షే (శుక్ల .. లేక కృష్ణ పక్షము) ,....తిథౌ ( ఆనాటి తిథి పేరు )..... వాసరే ( ఆనాటి వారము.. భాను ( ఆది ) / ఇందు ( సోమ ) / భౌమ ( మంగళ ) / సౌమ్య ( బుధ ) / బృహస్పతి ( గురు ) / భార్గవ ( శుక్ర ) / స్థిర ( శని ) ....

విష్ణు నక్షత్ర , విష్ణుయోగ , విష్ణు కరణ ఏవంగుణ విశేషణ విశిష్టాయాం పుణ్య తిథౌ

ప్రాచీనావీతి ( జంధ్యము అపసవ్యము గా వేసుకొనవలెను..)

అస్మత్ పిత్ర్యాది ద్వాదశ పితౄణాం అక్షయ పుణ్య లోకావాప్త్యర్థం అమావాశ్యాయామ్ / సంక్రమణ పుణ్య కాలే...

( లేక , సూర్యోపరాగ / చంద్రోపరాగ / అర్ధోదయ / మహోదయ పుణ్య కాలే / దక్షిణాయణ / ఉత్తరాయణ పుణ్యకాలే / కన్యాగతే సవితరి ఆషాఢ్యాది పంచ మహాఽపర పక్షేషు అస్మిన్ పితృ పక్షే సకృన్మహాలయే / గంగా కావేరీ తీరే .....

ఇలా ఏది సందర్భోచితమో దాన్ని చెప్పి )

శ్రాద్ద ప్రతినిధి సద్యః తిల తర్పణమ్ ఆచరిష్యే...

( కింద చెప్పిన విధముగా , తిలోదకాలతో వారి వారి పేరు , గోత్రము , రూపము చెప్పి తర్పణము ఇవ్వాలి..)

మొదట పితృ దేవతలను ఆవాహన చెయ్యాలి.మనకు కుడి వైపున ఉన్న మొదటి కూర్చ లో తండ్రి వైపు పితృ దేవతలను , ఎడమ వైపున ఉన్న రెండో కూర్చలో మాతృ వర్గపు పితృ దేవతలను ఆవాహన చెయ్యాలి.

ప్రథమ కూర్చే ..

|| ఆయాత పితరః సోమ్యా గంభీరైః పతిభిః పూర్వ్యైః |

ప్రజామస్మభ్యం దదతో రయించ దీర్ఘాయుత్వం చ శత శారదం చ ||

ఓం భూర్భువస్సువరోమ్

అస్మిన్ కూర్చే....--------- గోత్రాన్. .. ---------( తండ్రి పేరు ) , .........తాతయ్య పేరు , ........ముత్తాత పేరు శర్మాణః , వసు , రుద్ర , ఆదిత్య స్వరూపాన్ , అస్మత్ పితృ , పితామహ , ప్రపితామహాన్ ,

-------- గోత్రాః , -------- , -----------, ---------దాః , వసు , రుద్ర , ఆదిత్య స్వరూపాః , అస్మత్ మాతృ , పితామహీ , ప్రపితామహీశ్చ ధ్యాయామి | ఆవాహయామి |

|| సకృదాఛ్చిన్నం బర్‍హిరూర్ణామృదు | స్యోనం పితృభ్యస్త్వా భరామ్యహం | అస్మిన్ సీదంతు మే పితరః సోమ్యాః | పితామహాః ప్రపితామహాశ్చానుగైః సహ ||

పితృ , పితామహ , ప్రపితామహానాం , మాతృ , పితామహీ , ప్రపితామహీనాం ఇదమాసనం | తిలాది సకలారాధనైః స్వర్చితం |

( మొదటి కూర్చ పై నువ్వులు కాసిని చల్లాలి )

ద్వితీయ కూర్చే ( రెండవ కూర్చ పై )

|| ఆయాత మాతుః పితరః సోమ్యా గంభీరైః పతిభిః పూర్వ్యైః |

ప్రజామస్మభ్యం దదతో రయించ దీర్ఘాయుత్వం చ శత శారదం చ ||

ఓం భూర్భువస్సువరోమ్

అస్మిన్ కూర్చే..------ గోత్రాన్ .........( తల్లి యొక్క తండ్రి ) , ..........( తల్లి తాత ), .........( తల్లి ముత్తాత ) శర్మాణః ...వసు , రుద్ర , ఆదిత్య స్వరూపాన్ అస్మత్ మాతామహ , మాతుః పితామహ , మాతుః ప్రపితామహాన్ | , ,

-------- గోత్రాః ,........( తల్లి యొక్క తల్లి ) , .........( తల్లి యొక్క అవ్వ ) , ...........( తల్లి యొక్క ముత్తవ్వ ) దాః , వసు , రుద్ర , ఆదిత్య స్వరూపాః , మాతామహీ , మాతుః పితామహీ , మాతుః ప్రపితామహీశ్చ ధ్యాయామి | ఆవాహయామి ||

|| సకృదాఛ్చిన్నం బర్‍హిరూర్ణామృదు | స్యోనం పితృభ్యస్త్వా భరామ్యహం | అస్మిన్ సీదంతు మే పితరః సోమ్యాః | పితామహాః ప్రపితామహాశ్చానుగైః సహ ||

సపత్నీక మాతామహ , మాతుః పితామహ , మాతుః ప్రపితామహానాం ఇదమాసనం | తిలాది సకలారాధనైః స్వర్చితం | ( రెండవ కూర్చ పై నువ్వులు కాసిని చల్లాలి )

పితృ వర్గము వారికి తర్పణము ఇచ్చునపుడు మొదటి కూర్చ పైనను , మాతృ వర్గము వారికి ఇచ్చేటప్పుడు రెండో కూర్చ పైనను నువ్వులు , నీళ్ళు పితృ తీర్థం లో వదలాలి.

ప్రథమ కూర్చే.. ...పితృ వర్గ తర్పణం |

౧ పితృ తర్పణం (ఒక్కో మంత్రము చెప్పి ఒక్కోసారి , మొత్తం మూడు సార్లు తండ్రి కి ... అలాగే మూడేసి సార్లు ఇవ్వ వలసిన మిగిలిన వారికి )

౧. || ఉదీరతా మవర ఉత్పరాస ఉన్మధ్యమాః పితరః సోమ్యాసః |

అసుం య ఈయురవృకా ఋతజ్ఞాస్తేనోవంతు పితరో హవేషు ||

-------- గోత్రాన్. .. ---------- శర్మణః , వసు రూపాన్ , అస్మత్ పితౄన్ స్వధా నమః తర్పయామి ||

౨. || అంగిరసో నః పితరో నవగ్వా అథర్వాణో భృగవః సోమ్యాసః |

తేషాం వయగ్ం సుమతౌ యజ్ఞియానామపి భద్రే సౌమనసే స్యామ ||

------- గోత్రాన్. .. --------- శర్మణః , వసు రూపాన్ , అస్మత్ పితౄన్ స్వధా నమః తర్పయామి ||

౩. || ఆయంతు నః పితరః సోమ్యాసః | అగ్నిష్వాత్తాః పథిభిర్దేవయానైః | అస్మిన్ యజ్~ఝే స్వధయా మదంత్వధి బ్రువంతు తే అవంత్వస్మాన్ ||

------- గోత్రాన్. .. ----------- శర్మణః , వసు రూపాన్ , అస్మత్ పితౄన్ స్వధా నమః తర్పయామి ||

౨.. పితామహ తర్పణం ( మూడు సార్లు తాత కు)

౧. || ఊర్జం వహంతీ రమృతం ఘృతం పయః | కీలాలం పరిస్రుతం | స్వధాస్థ తర్పయత మే పితౄన్ ||

--------గోత్రాన్. .. --------- శర్మణః , రుద్ర రూపాన్ , అస్మత్ పితామహాన్ స్వధా నమః తర్పయామి ||

౨. || పితృభ్యః స్వధా విభ్యః స్వధా నమః | పితామహేభ్యః స్వధా విభ్యః స్వధా నమః | ప్రపితామహేభ్యః స్వధా విభ్యః స్వధా నమః ||

------- గోత్రాన్. .. ---------- శర్మణః , రుద్ర రూపాన్ , అస్మత్ పితామహాన్ స్వధా నమః తర్పయామి ||

౩. || యేచేహ పితరో యే చ నేహ యాగ్ంశ్చ విద్మ యాగ్ం ఉ చ న ప్ర విద్మ | అగ్నే తాన్వేత్థ యదితే జాత వేదస్తయా ప్రత్తగ్గ్ం స్వధయా మదంతు ||

--------- గోత్రాన్. .. ---------- శర్మణః , రుద్ర రూపాన్ , అస్మత్ పితామహాన్ స్వధా నమః తర్పయామి ||

౩. ప్రపితామహ తర్పణం ( మూడు సార్లు )

౧. || మధు వాతా ఋతాయ తే మధుక్షరంతి సింధవః | మాధ్వీర్నః సంత్వోషధీః ||

-------- గోత్రాన్. .. -------- శర్మణః , ఆదిత్య రూపాన్ , అస్మత్ ప్రపితామహాన్ స్వధా నమః తర్పయామి ||

౨. || మధునక్త ముతోషసి మధుమత్ పార్థివగ్ం రజః | మధు ద్యౌరస్తునః పితా ||

------- గోత్రాన్. .. ------- శర్మణః , ఆదిత్య రూపాన్ , అస్మత్ ప్రపితామహాన్ స్వధా నమః తర్పయామి ||

౩. || మధు మాన్నో వనస్పతిర్మధుమాగ్ం అస్తు సూర్యః | మాధ్వీర్గావో భవంతు నః ||

------- గోత్రాన్. .. -------- శర్మణః , ఆదిత్య రూపాన్ , అస్మత్ ప్రపితామహాన్ స్వధా నమః తర్పయామి ||

౪. మాతృ తర్పణం ( మూడు సార్లు )

------ గోత్రాః , --------- దేవీ ( కవీ ) దాః , వసు రూపాః అస్మత్ మాతౄః , స్వధా నమః తర్పయామి || ( మూడు సార్లు )

౫.. పితామహీ తర్పణం

-------- గోత్రాః , ---------దేవీ ( కవీ ) దాః , రుద్ర రూపాః , అస్మత్ పితామహీః , స్వధా నమః తర్పయామి || ( మూడు సార్లు )

౬. ప్రపితామహీ తర్పణం

--------- గోత్రాః , ----------- దేవీ ( కవీ ) దాః , ఆదిత్య రూపాః , అస్మత్ ప్రపితామహీః స్వధా నమః తర్పయామి || ( మూడు సార్లు )

౭. ద్వితీయ కూర్చే మాతృ వర్గ తర్పణం. ( రెండవ కూర్చ పై )

మాతా మహ తర్పణం ( మూడు సార్లు )

౧. || ఉదీరతా మవర ఉత్పరాస ఉన్మధ్యమాః పితరః సోమ్యాసః |

అసుం య ఈయురవృకా ఋతజ్~ఝాస్తేనోవంతు పితరో హవేషు ||

--------గోత్రాన్. .. ---------- శర్మణః , వసు రూపాన్ , అస్మత్ మాతా మహాన్ స్వధా నమః తర్పయామి ||

౨. || అంగిరసో నః పితరో నవగ్వా అథర్వాణో భృగవః సోమ్యాసః |

తేషాం వయగ్ం సుమతౌ యజ్ఞియానామపి భద్రే సౌమనసే స్యామ ||

---------- గోత్రాన్. .. --------- శర్మణః , వసు రూపాన్ , అస్మత్ మాతా మహాన్ స్వధా నమః తర్పయామి ||

౩. || ఆయంతు నః పితరః సోమ్యాసః | అగ్నిష్వాత్తాః పథిభిర్దేవయానైః | అస్మిన్ యజ్~ఝే స్వధయా మదంత్వధి బ్రువంతు తే అవంత్వస్మాన్ ||

---------- గోత్రాన్. .. --------- శర్మణః , వసు రూపాన్ , అస్మత్ మాతా మహాన్ స్వధా నమః తర్పయామి ||

౮.. మాతుః పితామహ తర్పణం ( మూడు సార్లు )

౧. || ఊర్జం వహంతీ రమృతం ఘృతం పయః | కీలాలం పరిస్రుతం | స్వధాస్థ తర్పయత మే పితౄన్ ||

--------- గోత్రాన్. .. ------------ శర్మణః , రుద్ర రూపాన్ , అస్మత్ మాతుః పితామహాన్ స్వధా నమః తర్పయామి ||

౨. || పితృభ్యః స్వధా విభ్యః స్వధా నమః | పితామహేభ్యః స్వధా విభ్యః స్వధా నమః | ప్రపితామహేభ్యః స్వధా విభ్యః స్వధా నమః ||

----------గోత్రాన్. .. ------------- శర్మణః , రుద్ర రూపాన్ , అస్మత్ మాతుః పితామహాన్ స్వధా నమః తర్పయామి ||

౩. || యేచేహ పితరో యే చ నేహ యాగ్ంశ్చ విద్మ యాగ్ం ఉ చ న ప్ర విద్మ | అగ్నే తాన్వేత్థ యదితే జాత వేదస్తయా ప్రత్తగ్గ్ం స్వధయా మదంతు ||

---------- గోత్రాన్. .. ------------ శర్మణః , రుద్ర రూపాన్ , అస్మత్ మాతుః పితామహాన్ స్వధా నమః తర్పయామి ||

౯. మాతుః ప్రపితామహ తర్పణం ( మూడు సార్లు )

౧. || మధు వాతా ఋతాయ తే మధుక్షరంతి సింధవః | మాధ్వీర్నః సంత్వోషధీః ||

--------గోత్రాన్. .. ----------- శర్మణః , ఆదిత్య రూపాన్ , అస్మత్ మాతుః ప్రపితామహాన్ స్వధా నమః తర్పయామి ||

౨. || మధునక్త ముతోషసి మధుమత్ పార్థివగ్ం రజః | మధు ద్యౌరస్తునః పితా ||

--------- గోత్రాన్. .. -------- శర్మణః , ఆదిత్య రూపాన్ , అస్మత్ మాతుః ప్రపితామహాన్ స్వధా నమః తర్పయామి ||

౩. || మధు మాన్నో వనస్పతిర్మధుమాగ్ం అస్తు సూర్యః | మాధ్వీర్గావో భవంతు నః ||

-------- గోత్రాన్. .. ------- శర్మణః , ఆదిత్య రూపాన్ , అస్మత్ మాతుః ప్రపితామహాన్ స్వధా నమః తర్పయామి ||

౧౦ మాతామహీ తర్పణం ( మూడు సార్లు )

--------- గోత్రాః , ------ దేవీ ( కవీ ) దాః , వసు రూపాః అస్మత్ మాతామహీః , స్వధా నమః తర్పయామి || ( మూడు సార్లు )

౧౧. మాతుః పితామహీ తర్పణం

--------గోత్రాః , ------- దేవీ ( కవీ ) దాః , రుద్ర రూపాః , అస్మత్ మాతుః పితామహీః , స్వధా నమః తర్పయామి || ( మూడు సార్లు )

౧౨.. మాతుః ప్రపితామహీ తర్పణం

------- గోత్రాః , -------దేవీ ( కవీ ) దాః , ఆదిత్య రూపాః , అస్మత్ మాతుః ప్రపితామహీః స్వధా నమః తర్పయామి || ( మూడు సార్లు )

ద్వాదశ పితృ దేవతలకు మాత్రమే తర్పణం ఇస్తే , కింది మంత్రం చెప్పి ఒకసారి తిలోదకం ఇవ్వాలి...

జ్ఞాతాఽజ్ఞాత సర్వ కారుణ్య పితౄన్ స్వధా నమః తర్పయామి ||

|| ఊర్జం వహంతీ రమృతం ఘృతం పయః | కీలాలం పరిస్రుతం | స్వధాస్థ తర్పయత మే పితౄన్ || తృప్యత తృప్యత తృప్యత |

సర్వే కారుణ్య పితృ దేవతలకు ఇస్తే కింది విధం గా , సజీవం గా ఉన్న వారిని వదలి , మిగిలిన వారికి ఒక్కొక్క సారి మాత్రము తిలోదకం వదలాలి..

ఆత్మ పత్నీం( భార్య ) ------దేవీదామ్-----గోత్రాం వసురూపాం స్వధానమస్తర్పయామి.

అస్మత్ సుతమ్ ( పుత్రుడు ) ------శర్మాణం---గోత్రం వసురూపం స్వధానమస్తర్పయామి.

అస్మత్ జ్యేష్ట భ్రాతరం ( అన్న ) ------శర్మాణం---గోత్రం వసురూపం స్వధానమస్తర్పయామి.

అస్మత్ కనిష్ట భ్రాతరం ( తమ్ముడు ) ------శర్మాణం---గోత్రం వసురూపం స్వధానమస్తర్పయామి.

అస్మత్ జ్యేష్ట పితృవ్యం ( పెదనాన్న ) ------శర్మాణం---గోత్రం వసురూపం స్వధానమస్తర్పయామి.

తత్పత్నీం ( పెద్దమ్మ ) -----దేవీదాం / కవీదాం --------గోత్రాం వసురూపాం స్వధానమస్తర్పయామి.

అస్మత్ కనిష్ట పితృవ్యం ( చిన్నాన్న )-----శర్మాణం---గోత్రం వసురూపం స్వధానమస్తర్పయామి.

తత్పత్నీం ( పిన్ని ) -----దేవీదాం / కవీదాం --------గోత్రాం వసురూపాం స్వధానమస్తర్పయామి.

అస్మత్ మాతులం ( మేనమామ )-----శర్మాణం---గోత్రం వసురూపం స్వధానమస్తర్పయామి.

తత్పత్నీం ( మేనత్త) -----దేవీదాం / కవీదాం --------గోత్రాం వసురూపాం స్వధానమస్తర్పయామి.

( ఇలా మేనమామలు , మేనత్తలు , పెద్దమ్మలు....ఎంతమంది కీర్తి శేషులై ఉంటే అంతమందికీ అదే శ్లోకం చెప్పి , వారి వారి పేర్లతో విడివిడి గా తర్పణం ఇవ్వాలి..)

అస్మద్దుహితరం ( కూతురు )-----దేవీదాం / కవీదాం --------గోత్రాం వసురూపాం స్వధానమస్తర్పయామి

ఆత్మ భగినీం ( అక్క / చెల్లెలు ) -----దేవీదాం / కవీదాం --------గోత్రాం వసురూపాం స్వధానమస్తర్పయామి

అస్మత్ దౌహిత్రం ( కూతురు కొడుకు )-----శర్మాణం---గోత్రం వసురూపం స్వధానమస్తర్పయామి.

అస్మత్ భాగినేయకం ( అక్క చెల్లెళ్ళ కొడుకు )-----శర్మాణం---గోత్రం వసురూపం స్వధానమస్తర్పయామి.

అస్మత్ పితృ భగినీం ( మేనత్త) -----దేవీదాం / కవీదాం --------గోత్రాం వసురూపాం స్వధానమస్తర్పయామి

తద్భర్తారమ్( ఆమె భర్త )-----శర్మాణం---గోత్రం వసురూపం స్వధానమస్తర్పయామి.

అస్మత్ మాతృ భగినీం ( తల్లి అక్క/చెల్లెలు) -----దేవీదాం / కవీదాం --------గోత్రాం వసురూపాం స్వధానమస్తర్పయామి

తద్భర్తారమ్( ఆమె భర్త )-----శర్మాణం---గోత్రం వసురూపం స్వధానమస్తర్పయామి.

అస్మత్ జామాతరం ( అల్లుడు )-----శర్మాణం---గోత్రం వసురూపం స్వధానమస్తర్పయామి.

అస్మత్ భావుకం ( బావ )-----శర్మాణం---గోత్రం వసురూపం స్వధానమస్తర్పయామి.

అస్మత్ స్నుషాం ( కోడలు) -----దేవీదాం / కవీదాం --------గోత్రాం వసురూపాం స్వధానమస్తర్పయామి

అస్మత్ శ్వశురం ( పిల్లనిచ్చిన మామ )-----శర్మాణం---గోత్రం వసురూపం స్వధానమస్తర్పయామి.

అస్మత్ శ్వశ్రూః ( పిల్లనిచ్చిన అత్త) -----దేవీదాం / కవీదాం --------గోత్రాం వసురూపాం స్వధానమస్తర్పయామి

అస్మత్ స్యాలకం ( భార్య సోదరులు )-----శర్మాణం---గోత్రం వసురూపం స్వధానమస్తర్పయామి

అస్మత్ సఖాయం ( ఆప్తులు / స్నేహితులు )-----శర్మాణం---గోత్రం వసురూపం స్వధానమస్తర్పయామి.

అస్మద్గురుం ( గురువు )-----శర్మాణం---గోత్రం వసురూపం స్వధానమస్తర్పయామి.

అస్మదాచార్యం ( ఆచార్యుడు )-----శర్మాణం---గోత్రం వసురూపం స్వధానమస్తర్పయామి.

పైన చెప్పిన వారిలో సజీవులుగా ఉన్నవారిని వదలి , మిగిలిన వారికి తర్పణం ఇవ్వాలి.

ఉపవీతి | ప్రదక్షిణం | ( జంధ్యము సవ్యం గా వేసుకొని కింది మంత్రం చెప్పుతూ , పరచిన దర్భల చుట్టూ ప్రదక్షిణం చెయ్యాలి )

|| దేవతాభ్యః పితృభ్యశ్చ మహా యోగిభ్యః ఏవ చ |

నమః స్వధాయై స్వాహాయై నిత్యమేవ నమో నమః ||

నమోవః పితరో రసాయ నమోవః పితరః శుష్మాయ నమోవః పితరో జీవాయ నమోవః పితరః స్వధాయై నమోవః పితరో మన్యవే నమోవః పితరో ఘోరాయ పితరో నమో వో య ఏతస్మిన్ లోకేస్థ యుష్మాగ్ స్తేఽను యేస్మిన్ లోకే మాం తే ను య ఏతస్మిన్ లోకేస్థ యూ యం తేషాం వసిష్ఠా భూయాస్త యేస్మిన్ లోకేహం తేషాం వసిష్ఠో భూయాసం ||

తనచుట్టూ తాను ప్రదక్షిణం

| యాని కాని చ పాపాని జన్మాంతర కృతాని చ

తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే |

పాపోఽహం పాప కర్మోఽహం పాపాత్మా పాప సంభవః

త్రాహిమాం కృపయా దేవ శరణాగత వత్సల

అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష పితృదేవతాః..

|| చతుస్సాగర పర్యంతం ... .... .... అభివాదయే || ( ప్రవర చెప్పి సాష్టాంగ నమస్కారం చెయ్యాలి )

పిత్రాదిభ్యో నమః |

ప్రాచీనావీతి | ఉద్వాసనం ( అపసవ్యం గా జంధ్యం వేసుకొని కింది మంత్రం చెప్పి కూర్చలను విప్పి పక్కన పెట్టాలి

|| ఉత్తిష్ఠత పితర ప్రేత శూరా యమస్య పంథా మను వేతా పురాణం | ధత్తాదస్మాసు ద్రవిణం యచ్చ భద్రం ప్రణో బ్రూతాత్ భాగధాన్దేవతాసు ||

|| పరేత పితరః సోమ్యా గంభీరైః పతిభిః పూర్వ్యైః |

అథా పితౄంథ్సువిదత్రాగ్ం అపీత యమేనయే సధమాదం మదంతి ||

అస్మాత్ కూర్చాత్ మమ పితృ , పితామహ , ప్రపితామహాన్ , మాతృ , పితామహీ , ప్రపితామహీశ్చ యథా స్థానం ప్రతిష్ఠాపయామి |

ద్వితీయ కూర్చాత్ సపత్నీక మాతామహ , మాతుః పితామహ , మాతుః ప్రపితామహాన్ యథా స్థానం ప్రతిష్ఠాపయామి | శోభనార్థే క్షేమాయ పునరాగమనాయ చ |

| కూర్చ ద్వయం విస్రస్య |

నివీతి |( జంధ్యము మాల లాగా వేసుకోవాలి ) తర్వాత , గోత్రాలు , సంబంధాలు తెలియని బంధువుల కొరకు తర్పణం ఇవ్వాలి..

యేషాం న మాతా న పితా న బంధుః నాన్య గోత్రిణః | తే సర్వే తృప్తిమాయాంతు మయోత్సృష్ట్యైః కుశొదకైః || ఇతి తిలోదకం నినీయ |

ఈ కింది శ్లోకము చెప్పి , జంధ్యాన్ని కాని నీటితో తడిపి , ( జంధ్యపు ముడిని ) ఆ నీటిని నేల పైకి పిండాలి..

|| యేకేచాస్మత్ కులే జాతాః అపుత్రా గోత్రిణోమృతాః

తే గృహ్యంతు మయా దత్తం వస్త్ర ( సూత్ర ) నిష్పీడనోదకం ||

దర్భాన్ విసృజ్య || పవిత్రం విసృజ్య || ఉపవీతి | దర్భలను , పవిత్రాన్ని విప్పి తీసెయ్యాలి , జంధ్యాన్ని సవ్యం గా వేసుకోవాలి )

తర్పణము అయ్యాక ,ఇది చెప్పాలి

యస్య స్మృత్యా చ నామోక్త్యా తపో తర్పణ క్రియాదిషు | న్యూనం సంపూర్ణతాం యాతి సద్యో వందే తమచ్యుతం ||

మంత్ర హీనం క్రియా హీనం భక్తి హీనం జనార్దన | యత్కృతం తు మయా దేవ పరిపూర్ణం తదస్తు మే ||

అనేన మయా అమావాస్యా పుణ్యకాలే / సూర్యోపరాగే / చంద్రోపరాగే / అర్ధోదయ / మహోదయ పుణ్య కాలే / దక్షిణాయణ / ఉత్తరాయణ పుణ్యకాలే / పితృ పక్షే సకృన్మహాలయే / తీర్థ క్షేత్రే కృతేన తిల తర్పణేన శ్రీమజ్జనార్దన వాసుదేవ ప్రియతాం ప్రీతో వరదో భవతు||

అని చెప్పి , అరచేతిలో నీళ్ళు వేసుకొని వదలాలి.

మధ్యే మంత్ర , తంత్ర , స్వర , వర్ణ , ధ్యాన , నేమ , లోప దోష పరిహారార్థం నామ త్రయ మంత్ర జపమ్ కరిష్యే |

అచ్యుతాయ నమః | అనంతాయ నమః | గోవిందాయ నమః || ( రెండు సార్లు పలకాలి )

అచ్యుతానంత గోవిందేభ్యో నమః |

|| కాయేన వాచా మనసేంద్రియైర్వా బుధ్యాత్మనా వా ప్రకృతేః స్వభావాత్ |

కరోమి యద్యద్ సకలం పరస్మై శ్రీమన్నారాయణేతి సమర్పయామి ||

అని చెప్పి నీరు వదలాలి

శ్రీ కృష్ణార్పణమస్తు

పైన చెప్పినంత విస్తారముగా చేయుటకు సమయము లేనిచో , క్లుప్తముగా కిందివిధముగా చెయ్య వచ్చును..ఇది కేవలం విధి లేని పరిస్థితి లో మాత్రమే...ఎందుకంటే, శ్రాద్ధానికి , తర్పణానికి శ్రద్ధ ముఖ్యము.

ఈ శ్లోకము చెప్పి , మూడు సార్లు తిలోదకాలు ఇవ్వవలెను

|| ఆ బ్రహ్మ స్తంభ పర్యంతం దేవర్షి పితృ మానవాః |

తృప్యంతు పితరః సర్వే మాతృ మాతా మహాదయః |

అతీత కుల కోటీనాం సప్త ద్వీప నివాసినాం |

ఆ బ్రహ్మ భువనాల్లోకాత్ ఇదమస్తు తిలోదకం ||

ఆచమ్య || బ్రహ్మ యజ్ఞాదికం చరేత్ || యథా శక్తి బ్రాహ్మణాన్ భోజయేత్ || ఓం తత్ సత్

( ఆచమనం చేసి , శక్తి ఉన్నవారు బ్రహ్మ యజ్ఞం చెయ్యాలి ... బ్రాహ్మణులకు భోజనం పెట్టవచ్చు )
***************************