9, ఫిబ్రవరి 2021, మంగళవారం

మూత్రపిండములలో రాళ్లు

 మూత్రపిండములలో రాళ్లు కరిగించు గొప్ప ఔషధ యోగములు  - 


 *  కానుగ గింజలలోని పప్పు మూడు గ్రాములు తీసుకుని పొడిచేసి 60 మిల్లీలీటర్ల ఆవుపాలలో కలిపి లోపలికి తీసుకొనుచుండిన మూత్రపిండాలలోని రాళ్లు పడిపోవును .


 *  యవాక్షరం , బెల్లం సమాన భాగాలుగా కలిపి రెండు గ్రాముల చొప్పున రోజుకొకసారి ఒక వారం నుంచి పదిరోజులపాటు తినిన రాళ్లు కరిగి పడిపోవును . దీనితో పాటు బూడిదగుమ్మడికాయ రసం కూడా వాడిన ఫలితం తొందరగా కనిపించును.


 *  వేపాకు నీడలో ఎండించి కాల్చి భస్మం చేసి పూటకు ఒకటిన్నర గ్రాము చొప్పున ఒకరోజు నిలువ ఉంచిన నీళ్లతో కలిపి తీసుకొనుచున్న మూత్రపిండాలలో రాయి కరిగిపోవును . రెండుపూటలా తీసికొనవలెను .


 *  రణపాల ఆకు రసము 6 గ్రాములు కాచిన వెన్న 13 గ్రాములు కలిపి ప్రతినిత్యము తాగుచున్న రాళ్లు కరుగును.


 *  పల్లేరు చూర్ణం ఒక స్పూన్ , కొండపిండి చూర్ణం ఒక స్పూన్ ఒక గ్లాసు నీటిలో వేసి మరిగించి ఉదయం మరియు సాయంత్రం తీసుకొనుచున్న మూత్రపిండాలలో రాళ్లు నివారణ అగును.


 *  పొద్దుతిరుగుడు పువ్వు చెట్టు వేర్లు పొడి 25 గ్రాములు తీసుకుని ఒక లీటర్ తియ్యటి మజ్జిగతో కలిపి తీసుకొనుచున్న రాళ్లు కరుగును.


 *  పూటకు రెండు వెల్లుల్లి రేకల గుజ్జు తినుచున్న మూత్రాశయపు రాళ్లు కరుగును. అలా అప్పుడప్పుడు తినుచున్న రాళ్లు పుట్టవు .


  మూత్రపిండాలలో రాళ్లు ఉన్నవారు పాటించవలసిన ఆహారనియమాలు  -


 తినవలసిన ఆహారపదార్దాలు  -


  పాతబియ్యపు అన్నం , యవలు , గోధుమలు , ఉలవలు , పెసలు , మజ్జిగ , ఆవునెయ్యి , ఆవుపాలు , పెసరకట్టు , ఉలవకట్టు , అల్లం , తియ్యని కల్లు , చక్కెర , ముదురు గుమ్మడికాయ , బూడిద గుమ్మడికాయ , పొట్లకాయ , కొండపిండికూర , పల్లేరుకూర , చిర్రికూర , పెరుగుతోటకూర , ఖర్జురము , వెదురుమొలకలు , కొబ్బరికాయ , తాటిముంజలు , నక్కదోసకాయ , మేకమాంసం .


 తినకూడని ఆహార పదార్ధాలు  -


    మలబద్ధకర ఆహారాలు , చద్ది అన్నం , బిరుసుఅన్నం , తాంబూలం , ఎక్కువ ఉప్పు గల ఆహారపదార్థాలు , ఎక్కువ నూనె , పిండివంటలు , నువ్వులపిండి , పులుసు , ఇంగువ , నువ్వులు , ఆవాలు , మినుములు , మామిడికాయ , వెల్లుల్లి మొదలగు వేడివస్తువులు , మలబద్దకాన్ని కలిగించు వస్తువులు , కోడిమాంసం , పందిమాంసం , చేపలు , మద్యం , మైథునం , అతిశ్రమ , మూత్రము , వీర్యము నిరోధము చేయరాదు . 


         పైన చెప్పిన ఆహారపదార్ధాలు పాటిస్తూ ఔషధాలను వాడగలరు .


  

         మరిన్ని సులభయోగాలు నా గ్రంథాల యందు ఇవ్వడం జరిగినది.

 

    గమనిక  -


                  నాచే రచించబడిన "ఆయుర్వేద మూలికా రహస్యాలు " , " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు "  అను ఈ రెండు గ్రంథముల యందు అత్యంత రహస్యమైన సులభముగా ఇంటి యందు , చుట్టుపక్కల దొరికే మూలికలతోనే పెద్దపెద్ద రోగాలను నయం చేసుకొనే విధముగా అనేక వైద్య యోగాలను ఇచ్చాను. ఈ గ్రంథాలలో ఇచ్చినటువంటి యోగాలు అన్నియు గత 250 సంవత్సరాల నుంచి వంశపారంపర్యముగా మాకు వస్తున్న రహస్యయోగాలు పరోపకారార్థం దాచుకోకుండా ప్రచురించాను.


           మన చుట్టుపక్కల ఉండే మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల బొమ్మలతో మొక్కల చిత్రపటాలు ఇవ్వడం జరిగింది.


            రైతులకు ఉపయోగపడేవిధముగా చెట్లను , భూమిని బట్టి , రాళ్లని బట్టి భూమి యందు జలమును కనుగొను విధానం , ముహూర్తాలను అనుసరించి ఏయే సమయాలలో పంటలు వేయాలి . ఆయుర్వేద మూలికల సహాయముతో పురుగు మందులు వాడకుండా అత్యంత ఎక్కువ దిగుబడులు సాధించే రహస్య వృక్షయుర్వేద యోగాలు , పశువులకు సంబంధించిన వైద్య యోగాలు కూడా ఇవ్వడం జరిగింది . ఈ గ్రంథాలలో ఇచ్చిన యోగాలు ఉపయోగించటం వలన ఎటువంటి వ్యతిరేక ఫలితాలు రావు.


      ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు  గ్రంథం 288 పేజీలు ఉంటుంది . విలువ 350 రూపాయలు మాత్రమే . ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథం 384 పేజీలు ఉంటుంది . విలువ 450 రూపాయలు . కొరియర్ చార్జి 100 రూపాయలు అదనం .పుస్తకములు ఎక్కువ కాలం మన్నిక కొరకు కుట్టించి ఇవ్వడం మరియు అత్యంత నాణ్యమైన తెల్లటి 80GSM పేపరుతో ఉంటాయి.


            ఈ రెండు గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా 9885030034 నెంబర్ కి ఫోన్ చేయగలరు. కామెంట్లు , మెస్సేజెస్ సమాధానము ఇవ్వబడదు. కాల్ చేయగలరు .


                  కాళహస్తి వేంకటేశ్వరరావు 


                         9885030034 


               అనువంశిక ఆయుర్వేద వైద్యులు

ఈడబ్ల్యూఎస్

 ఈడబ్ల్యూఎస్  రిజర్వేషన్లు  పొందడానికి  రాష్ట్ర  ప్రభుత్వం జారీచేసే  #EWS_సర్టిఫికేట్  మీ స్థానిక  ఈసేవ / మీసేవ కేంద్రాల్లో  తీసుకోండి..


EWS  సర్టిఫికెట్  పొందడానికి  అర్హతలు..

************************************


1 ) కుటుంబ  వార్షిక  ఆదాయం  8 లక్షలు  లోపు  ఉండాలి...


2 ) కుటుంబాన్నికి  5  ఎకరాల  లోపు  భూమి  ఉండాలి..


3 )  గ్రామీణ  / నాన్ మున్సిపాలిటీ ఏరియాలో 200 గజాల కంటే ఎక్కువ ఇల్లు జాగా ఉండకూడదు...


4 ) మున్సిపాలిటీ ఏరియాలో 100 గజాల కంటే ఎక్కువ  ఇల్లు జాగా ఉండకూడదు...


5 ) పట్నం ప్రాంతాల్లో  1000 చదరపు అడుగుల  ఇల్లు అంతకంటే ఎక్కువ సైజు కలిగిన ఫ్లాట్  ఉండకూడదు..


EWS  అప్లికేషన్ ఫార్మ్  క్రింద గూగుల్   డ్రైవ్ లింక్ నుంచి డౌన్లోడ్  చేసుకోవచ్చు...


https://drive.google.com/file/d/1rLo7oyXKg8PkWmFS0IhHq0OZpG7-60k8/view?usp=drivesdk


కేంద్ర ప్రభుత్వం కల్పించిన 10%  ఈడబ్ల్యూఎస్  రిజర్వేషన్లు విద్య,ఉద్యోగాల్లో  ఈ EWS  సర్టీఫికేట్ వున్న వారికి వర్తిస్తుంది కావున అందరు ఈ యొక్క సర్టీఫికేట్ పొందగలరు...


ఈ సమాచారం అందరికీ  షేర్  చేయగలరు

ప్రైవేటీకరణకి మేము వ్యతిరేకం

 ప్రైవేటీకరణకి మేము వ్యతిరేకం... కానీ


మాకు గవర్నమెంట్ హాస్పిటల్ వద్దు. కార్పొరేట్ హాస్పిటల్ ముద్దు.


గవర్నమెంట్ టీవీ చానల్స్ డీడీ చూడము. ప్రైవేట్ చానల్స్ కార్తీకదీపం ముద్దు.


గవెర్ణమెంట్ BSNL సెల్ ల్యాండ్ లైన్ వాడం. ప్రైవేట్ జియో ఎయిర్టెల్ సంస్థల సెల్ వాడుతూ ప్రైవేటీకరణ వద్దు అని పోస్టులు పెడతాం.


ఏర్ ఇండియా విమానాలు ఎక్కం.ప్రైవేట్ ఇండిగో  విమానాలు అంటే ముద్దు.


ఆర్టీసీ బస్ లు మాకు వద్దు. ప్రైవేట్ రవాణా ముద్దు.


ప్రభుత్వ పోస్ట్ ఆఫీసు వద్దు. ప్రైవేట్ కొరియర్ ముద్దు.


ప్రభుత్వ స్కూళ్లు వద్దు. ప్రైవేట్ స్కూల్స్ ముద్దు.


అయినా ప్రైవేటీకరణకు మేము వ్యతిరేకం..

Forwarded as received

తమలపాకులతో పూజ

 *హనుమంతుడికి తమలపాకులతో పూజ ఎందుకు చేస్తారు, ప్రయోజనం ఏమిటి?*


ఆంజనేయ స్వామిని తమలపాకులతో పూజిస్తే కలుగే ఫలితాలు ఏమిటో గమనిద్దాం. సీతమ్మ తల్లికి శోకాన్ని పోగొట్టి ఓదార్పునిచ్చినవాడు, రామయ్యకు సీతమ్మ జాడ తెలిపి దుఃఖాన్ని దూరం చేసిన వాడు, రామ లక్ష్మణులు నీకు మిత్రులే కాని, వాలి పంపగా వచ్చినవారు కారని సుగ్రీవునికి శాంతిని కలుగ చేసినవాడు, నీ అహంకారం నీకు మృత్యువును తెచ్చిపెడుతుంది అని నిర్భయంగా రావణునికి చెప్పినవాడు ఆంజనేయుడు.



ఆంజనేయుడు శివాంశ సంభూతుడని శాస్త్ర వచనం. శివుని 11వ అవతారంగాను, వైశాఖ మాస బహుళ దశమి తిథి హనుమజ్జయంతిగాను పరాశర సంహిత తెలియచేస్తుంది. వాయుదేవుని అనుగ్రహంతో పుట్టినవాడు కనుక వాయుసుతుడని పేరు. ఆంజనేయ స్వామిని తమలపాకులతో పూజించిన వారందరికీ సకల శుభాలు, ఆయురారోగ్యాలు కలుగుతాయి.


ఆంజనేయునికి తమలపాకుల పూజ చేయడానికి ఒక కారణం ఉంది - ఒకసారి సీతమ్మతల్లి అందించే తమలపాకుల చిలుకల్ని సేవిస్తున్న శ్రీరాముని వద్దక వచ్చిన ఆంజనేయుడు శ్రీరాముడిని ''స్వామీ ఏమిటది ? మీ నోరు అంత ఎర్రగా ఎందుకయ్యింది? అని అడిగాడు.అప్పుడు రాముడు 'తమలపాకులు తింటే నోరు ఎర్రగా అవుతుంది. అంతేకాదు ఆరోగ్యానికి చాలా మంచిది అని చెప్పగానే వెంటనే ఆంజనేయుడు అక్కడి నుండి వెళ్లిపోయి కొంత సేపటికి ఒళ్లంతా తమల పాకులను కట్టుకొని గంతులు వేసుకుంటూ ఆనందంగా వచ్చాడు.


స్వామివారు ఎక్కువగా తమలపాకు తోటలలోనూ,అరటి తోటలలోనూ విహరిస్తారు. ఆంజనేయస్వామి రుద్ర సంభూతుడు. తమలపాకులు శాంతినిస్తాయి. అందువలన తమలపాకులతో పూజించడం వలన మనకు కూడా శాంతి, సుఖము లభిస్తాయి. తమలపాకులకు మరోపేరు నాగవల్లీ దళాలు. తమలపాకులతో పూజించడంవలన నాగదోష శాంతి కూడా జరుగుతుంది.


మరో కథ ప్రకారం.. అశోక వనంలో ఉన్న సీతమ్మవారికి హనుమంతుడు రాములవారి సందేశము చెప్పినప్పుడు, అమ్మవారు ఆనందంతో హనుమంతునికి తమలపాకుల దండ వేశారట దగ్గరలో పువ్వులు కనిపించక! అందుకే స్వామికి తమలపాకుల దండ అంటే ప్రీతి అని చెప్తారు. అంజనేయ స్వామిని తమలపాకులతో పూజించటం వలన అనేక ప్రయోజనాలు చేకూరుతాయి.



అరటి తోటలో హనుమంతునికి పూజ కోటిరెట్లు ఫలితం వస్తుందని పెద్దలు చెబుతారు. శతవృద్ధ జిల్లేడు, తెల్లజిల్లేడు వేరు చెక్కతో హనుమంతుని ప్రతిమను చేయించి అరటితోటలో పూజించుట వలన సత్వరం హనుమంతుడు అనుగ్రహిస్తాడు. అరటి తోటలో హనుమంతునికి పూజ కోటిరెట్లు ఫలితాలను ఇస్తుంది. అరటిపండ్ల నివేదన, సింధూర సమర్పణ, శని, మంగళవారములలో తమలపాకులతో పూజ హనుమంతుని ఆరాధనలో ముఖ్యమైనవి.


హస్త,మృగశిర నక్షత్రములతో కూడిన ఆదివారాలు మారుతికి ఇష్టమైన రోజులు. భూత, ప్రేత పిశాచాది బాధలు, రోగాలు, కష్టాలు తొలగడానికి అభీష్టసిద్ధికి ఆంజనేయ ప్రదక్షిణములు శ్రేష్ఠం. స్వామి మహిమలు పరాశర సంహిత, ఉమాసంహిత, హనుమ సంహిత తదితర గ్రంథాలు చెబుతున్నాయి.


హనుమారాధన భోగ, మోక్షములను రెండింటినీ ఇస్తుంది. రామ భజన ఎక్కడ జరుగుతున్నా హనుమంతుడు వచ్చి కూర్చుంటాడని భక్తుల విశ్వాసం. ఆంజనేయుని చూసి మానవులు పట్టుదల కార్యదీక్షా దక్షత, మాట నేర్పు ఇలాంటివెన్నో తెలుసుకోవాలి.


అంజనేయ స్వామిని తమలపాకులతో పూజించటం వలన కలుగు ప్రయోజనాలు


1. ఆంజనేయ స్వామికి లేత తమలపాకుల మాలను వేస్తే రోగాలతో ఇబ్బందులు పడేవారికి త్వరగా గుణం కనిపిస్తుంది.

2. ఇంట్లో మాంత్రిక దోషాలు ఉన్నవారు ఆంజనేయస్వామికి తమల పాకుల హారాన్ని వేస్తే మంత్ర సంబందమైన పీడలు తొలగిపోతాయి.


3. సంసారంలో ప్రశాంతత లేని వారు స్వామికి తమల పాకుల హారాన్ని వేయిస్తే సంసారంలో సుఖం లభిస్తుంది.

4. కొందరు చిన్న పిల్లలు ఎంత ఆహారాన్ని తిన్నప్పటికీ సన్నగానే ఉంటారు. చాలా నీరసంగా కనిపిస్తుంటారు. ఇలాంటి వారు స్వామికి తమలపాకుల హారాన్ని వేస్తే ఆరోగ్యం బాగుపడి చక్కగా ఎదుగుతారు.

5. వ్యాపారంలో చాల నష్టాలు వస్తుంటే స్వామికి తమలపాకుల హారాన్ని వేయించి తమలపాకులు, పండ్లు దక్షిణ సమేతంగా దానం చేస్తే వ్యాపారం వృద్ధిలోకి వస్తుంది.

6. ఏ వ్యక్తి అయితే హీనంగా చూడబడుతాడో అటువంటి వ్యక్తి స్వామికి తమలపాకుల హారాన్ని సమర్పిస్తే సంఘంలో గౌరవం లభిస్తుంది.

7. శనైశ్చర దృష్టి ఉన్నవారు ఆంజనేయ స్వామికి తమలపాకుల హారాన్ని వేస్తే 

శనేశ్వరుని అనుగ్రహం కలుగుతుంది

9. వైద్య పరంగా నయంకానీ వ్యాధులు ఉన్నవారు స్వామికి తమలపాకుల హారాన్ని వేసి, ప్రసాదాన్ని స్వీకరిస్తే అన్ని రోగాలు నయమవుతాయి.

10. సుందర కాండ పారాయణం చేసి స్వామికి తమలపాకుల హారాన్ని వేస్తే అన్ని కార్యాలలో విజయం సిద్ధిస్తుంది.

11. హనుమాన్ చాలీసా చదివి స్వామిని ప్రార్ధించి తమలపాకుల హారాన్ని వేస్తే పరమాత్మని అనుగ్రహం కలుగుతుంది.

12. వాద ప్రతివాదాల్లో స్వామిని ప్రార్ధించి తమలపాకుల హరాన్ని సమర్పించి, ప్రసాదం తీసుకుంటే జయం మీదే అవుతుంది.

13. తాంబూల దానంతో గంగా దేవి సంతృప్తి పడుతుంది.పర్ణ ప్రసాదాన్ని ఆంజనేయ స్వామి పూజల్లో కూడా వాడతారు. తమలపాకులతో మాలను చేసి ఆంజనేయ స్వామికి వేస్తారు. అనంతరం తమలపాకును భక్తులకు ప్రసాదంగా ఇస్తారు. దీనికే పర్ణ ప్రసాదమనే పేరు.


🍁🍁 *సేకరణ*🍁🍁

నిద్రలో మెలకువవస్తే

 _*నిద్రలో మెలకువవస్తే ఆరోగ్యానికి సమస్యే.. తీసుకోవల్సిన జాగ్రత్తలివే >*_


_రాత్రి నిద్రమెుదలవగానే.. లోపల ఒక్కొక్క ఆర్గాన్‌‌‌‌ డ్యూటీ ఎక్కుతయ్‌‌‌‌. ‘ఈ టైంకి నువ్వు ! ఫలానా టైంకి నువ్వు’ అని వంతులు పెట్టుకొని షిష్ట్‌‌‌‌వైజ్‌‌‌‌ పని చేసుకుంటయ్‌‌‌‌. వాటికి ఎలాంటి డిస్టర్బెన్స్‌‌‌‌ లేకుండా పని చేసుకుంటే.. నిద్ర కూడా సుఖంగా ఉంటది. వాటికేదన్నా ప్రాబ్లమ్‌‌‌‌ వస్తే.. అవి మన నిద్రని డిస్టర్బ్​ చేస్తయ్‌‌‌‌. నిద్ర మధ్యలో ఒకే టైం రోజూ మెలకువ వచ్చిందంటే ఆ టైమ్‌‌‌‌ల డ్యూటీ చేస్తున్న ఆర్గాన్‌‌‌‌కి సుస్తీ చేసినట్టు! అంటే టెస్ట్‌‌‌‌లు లేకుండా ఆర్గాన్‌‌‌‌ హెల్త్‌‌‌‌ కండిషన్‌‌‌‌ని గుర్తు పట్టొచ్చన్నమాట !_


చాలామందికి నిద్ర పోయేటప్పుడు మధ్యలో మెలకువ వస్తుంది. నిద్ర మధ్యలో ఒకట్రెండు సార్లు లేచి, మళ్ళీ నిద్రలోకి జారుకుంటారు. అయితే  రోజూ ఒకే టైంకి మెలకువ వస్తుందంటే.. శరీరంలో ఏదో తేడా ఉన్నట అంటున్నారు డాక్టర్లు. మెలకువ వచ్చే టైంని బట్టి శరీరంలో ఎక్కడ ప్రాబ్లమ్ ఉందో చెప్పొచ్చంటున్నారు._


_రిపేరింగ్ టైం_


_నిద్ర పోయేటప్పుడు శరీరం.. ప్రాబ్లమ్స్‌‌ను రిపేర్ చేసుకుంటుంది. ఆరోజులో జరిగిన మెంటల్, ఫిజికల్ ఇంబాలెన్స్‌‌ను బాలెన్స్ చేసే ప్రయత్నం చేస్తుంది. హార్మోన్స్‌‌ను సమతుల్యం చేసి, మరుసటి రోజుకు శరీరాన్ని రెడీ చేస్తుంది. ఈ ప్రాసెస్ రాత్రంతా జరుగుతుంది. అయితే ఈ ప్రాసెస్ ఒక టైం టేబుల్ ప్రకారం జరుగుతుంది._


_ఒక్కో అవయవానికి ఒక్కోటైం ఉంటుంది. ఆ టైంలో అవయవానికి ఏదైనా డిస్టర్బెన్స్ఉంటే పనికి ఆటంకం జరిగి, శరీరం మేల్కొంటుంది. అంటే మెలకువ వచ్చే సమయాన్ని బట్టి.. అవయవాల పనితీరుని డిసైడ్ చేయొచ్చన్న మాట._


_శరీరం నిద్రలో ఉన్నా, మేల్కొని ఉన్నా తన పనితీరుకి సంబంధించిన సిగ్నల్స్‌‌ని ఎప్పుడూ ఇస్తూనే ఉంటుంది. వాటిని అర్ధం చేసుకొని మార్పులు చేసుకున్నప్పుడే ఆరోగ్యంగా ఉంటాం. నిద్రకు ఆటంకం కలుగుతుందంటే… ఎక్కడో, ఏదో ప్రాబ్లమ్ ఉన్నట్టు లెక్క. ఆ ప్రాబ్లమ్‌‌ని ఎలా కనిపెట్టాలో చూద్దాం._


_9–11_


_తొమ్మిది నుంచి పది గంటల మధ్యలోనే చాలామంది నిద్రలోకి జారుకుంటారు. అయితే కొంతమందికి ఇలా పడుకోగానే అలా మెలకువ వస్తుంది. తొమ్మిదింటికి పడుకుంటే పదకొండులోపే మెలకువ వచ్చి, సరిగా నిద్ర పట్టక ఇబ్బంది పడుతుంటారు. 11గంటలలోపు మెలకువ వచ్చిందంటే.. మెదడు ఎక్కువగా ఆలోచిస్తున్నట్టు లెక్క. ఇలాంటి వాళ్లు ఎక్కువగా ఒత్తిడిని ఫేస్ చేస్తున్నట్టు అర్ధం. అలాగే తొమ్మిది నుంచి పదకొండు గంటల మధ్య థైరాయిడ్ గ్లాండ్ యాక్టివ్‌‌గా ఉంటుంది. ఈ టైంలో నిద్రకు డిస్టర్బెన్స్ వస్తుందంటే.. థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉండే అవకాశం కూడా ఉంది. అందుకే ఇలాంటి వాళ్ళు ఆరోగ్యకరమైన లైఫ్‌‌స్టైల్‌‌ని అలవరచుకోవాలి. పండ్లు, కూరగాయలు, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ , విటమిన్–ఎ ఉన్న ఆహారాలను ఎక్కువగా తీసుకోవాలి. మెడిటేషన్ చేయడం, శుభ్రమైన నీళ్ళు తాగడం, స్వచ్ఛమైన గాలి పీల్చడం మంచిది. రోజూ అరగంట వ్యాయామం తప్పనిసరిగా చేయాలి. కొవ్వు, ఉప్పు తక్కువగా ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవాలి._


_11–1_


_సాధారణంగా రాత్రి 11గంటల నుంచి ఒంటి గంట మధ్యలో గాల్ బ్లాడర్ (పిత్తాశయం).. శరీరంలోని ఫ్యాట్స్‌‌ని కరిగిస్తుంది. గాల్ బ్లాడర్ నుంచి రిలీజ్ అయ్యే  పైత్యరసం చిన్న పేగుల్లోకి వెళ్ళి, ఆహారం జీర్ణం అయ్యేందుకు హెల్ప్ చేస్తుంది. ఇందులోని ఎంజైమ్స్, కొవ్వు పదార్థాలను జీర్ణం చేసి, వాటి  ద్వారా అందే ఏ, డీ, ఈ, కె విటమిన్లను శరీరానికి అందిస్తాయి. ఈ సమయంలో నిద్ర ఇబ్బందిగా మారిందంటే.. గాల్ బ్లాడర్ పని తీరు సరిగా లేదని అర్ధం. ఇలాంటి వాళ్లు  డైట్‌‌లో అన్‌‌హెల్దీ ఫ్యాట్స్, ఆయిల్స్‌‌ను తగ్గించాలి. పడుకునే ముందు ఈజీగా అరిగే ఆహారాన్ని తీసుకోవాలి._


_1–3_


_ఒంటి గంట నుంచి మూడు గంటల మధ్యలో లివర్ యాక్టివ్‌‌గా ఉంటుంది.  శరీరంలోని మలినాలను క్లీన్ చేసి, బ్లడ్ ను ప్యూరిఫై చేస్తుంది. ఈ టైంలో మెలకువ వచ్చిందంటే.. లివర్‌‌‌‌లో ఏదో ప్రాబ్లమ్‌‌ ఉందని అర్ధం. రాత్రిళ్లు ఎక్కువగా ఫ్యాట్ ఫుడ్స్ తిన్నా, ఆల్కహాల్ తాగినా ఇలా జరుగుతుంది. కాలేయం జీర్ణవ్యవస్థలో ముఖ్యమైన అవయవం. ఇది శరీరానికి కావాల్సిన రసాయనాలను తయారు చేసి, సరఫరా చేస్తుంది. మనం తీసుకునే ఆహారంలోని విషపదార్థాలను తనలో దాచుకుని, శరీరానికి హాని జరగకుండా కాపాడుతుంది. శరీరానికి గుండె ఎంత ఇంపార్టెంటో లివర్​ కూడా అంతే ఇంపార్టెంట్. అందుకే ఈ టైంలో మెలకువ వచ్చే వాళ్ళు ఆల్కహాల్, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి. నీళ్ళు, ఆహారం కలుషితంగా ఉన్నాయేమో చూసుకోవాలి. కొవ్వు పదార్థాలు తగ్గిస్తే మంచిది._


_3–5_


_3 గంటల నుంచి 5 గంటల మధ్యలో  ఊపిరితిత్తులు ఆక్సిజన్‌‌ను ఎక్కువగా పంప్ చేస్తాయి. కండరాలకు రక్తం, ఆక్సిజన్ అందే సమయం ఇదే. ఈ సమయంలో మెలకువ వస్తోందంటే లంగ్స్‌‌లో సమస్య ఉన్నట్టు గుర్తించాలి. అందుకే ఇలాంటి వాళ్లు  రెగ్యులర్‌‌‌‌గా బ్రీతింగ్ ఎక్సర్‌‌‌‌సైజులు, కార్డియో వ్యాయామాలు చేయాలి. జంక్ ఫుడ్స్ అస్సలు తీసుకోకూడదు. పడుకునే ముందు లైట్‌‌ఫుడ్‌‌ తీసుకోవాలి. భోజనం తర్వాత కొద్దిసేపు నడిస్తే, ఆహారం జీర్ణమై పడుకునే సమయానికి గాలి బాగా ఆడుతుంది._


_5–7_


_5 నుంచి 7 గంటల మధ్యలో శరీరం టాక్సిన్స్‌‌ని బయటకు పంపుతుంది. శరీరం మొత్తాన్ని క్లీన్ చేసే టైం ఇది. అందుకే ఈ టైంలో మెలకువ వస్తే వెంటనే లేవడం మంచిది. లేచి కాలకృత్యాలు తీర్చుకుంటే.. హెల్దీగా, ఫ్రెష్‌‌గా రోజుని స్టార్ట్ చేయడానికి శరీరం రెడీ అవుతుంది. ఈ టైంలో మెలకువ వచ్చినా లేవకుండా అలాగే నిద్రపోతే.. శరీరం తాజాదనాన్ని కోల్పోయి, అలసిపోయినట్టు తయారవుతుంది. ఆ ఎఫెక్ట్ రోజంతా ఉంటుంది._


_ఇవి కూడా.._


_ఎక్కువగా టీవీ చూడడం, మొబైల్ వాడడం, జంక్ ఫుడ్ తినడం, మద్యం, సిగరెట్ల లాంటి అలవాట్లు నిద్రను పాడుచేస్తాయి. నిద్ర సరిగా లేకపోతే అవయవాల పనితీరు మందగించి, బీపీ పెరగడం, గుండె సమస్యలు, ఒత్తిడి, ఆందోళన, నరాల బలహీనత, చేతులు తిమ్మిర్లు రావడం, రోగ నిరోధక శక్తి సన్నగిల్లడం లాంటి ఎన్నో సమస్యలు వచ్చే ప్రమాదముంది._


_*మంచి నిద్ర కోసం..*_


_నిద్రకు సరైన టైం టేబుల్ అలవర్చుకోవాలి._


_6 నుంచి 8 గంటల నిద్ర ఖచ్చితంగా ఉండేలా చూసుకోవాలి._


_ఆల్కహాల్​, సిగరెట్‌‌ అలవాట్లకు దూరంగా ఉండాలి._


_పడుకునే ముందు స్నానం చేయాలి. రాత్రిళ్లు లైట్ ఫుడ్ తీసుకోవాలి. రాత్రి 8 గంటలలోపే భోజనం ముగించాలి._

_*రాత్రిళ్లు టీవీ చూడడం, సెల్‌‌ఫోన్‌‌ వాడడం తగ్గించాలి

 బహుజనహితాయ:

బహుజనసుఖాయా: SARMAS RPO GUNTAKAL 💐💐

✊🤝🏻💐🏃🏾‍♂️🙏🐘✍️

ఆపదలో ఉన్నప్పుడు

 ఏదైనా ఆపదలో ఉన్నప్పుడు లేక ఏ నిర్ణయం తీసుకోవాలో దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నప్పుడు మనసు దుర్బలంగా ఉన్నప్పుడు ఒక్కసారి ఈ జయమంత్రాన్ని నమ్మకం తో పఠించి స్వామికి ఒక్క కొబ్బరి కాయ పంచదార ను నివేదించి నిర్భయంగా ముందుకు వెళ్ళండి ఒక్క సారిగా మీ మనసు తేలిక పడి యధార్థమైన త్రోవ భోధ పడుతుంది!!  మీ మనసు తేలిక పడిన తరువాత చిన్న పిల్లల కు పానకం వడపప్పు పంచండి చాలు ఉప్పొంగిపోతారు మారుతి! 


 ఇది సుందరకాండ లో స్వామి హనుమ ఇక్ష్వాకు వంశాన్ని మన తండ్రి రామయ్య నూ లక్ష్మణుడు ని సుగ్రీవుడిని కీర్తిస్తూ సీతమ్మ కి నమ్మకాన్ని కలిగించి లంకాదహనం చేసినప్పుడు ఆనందంగా తన స్వామి వైభవాన్ని కొనియాడుతూ పని పూర్తి చేసుకొచ్చిన అద్భుత మంత్రం ఇది!!

జయత్యతి బలో రామః 

లక్ష్మణస్య మహా బలః !

రాజా జయతి సుగ్రీవో 

రాఘవేణాభి పాలితః !!


దాసోహం కౌసలేంద్రస్య 

రామస్యా క్లిష్ఠ కర్మణః !

హనుమాన్ శత్రు సైన్యానాం నిహంతా మరుతాత్మజః !!


నరావణ సహస్రం మే 

యుధ్ధే ప్రతిబలం భవేత్ !

శిలాభిస్తు ప్రహారతః

పాదపైశ్చ సహస్రశః !!


అర్ధయిత్వాం పురీం లంకాం 

మభివాద్యచ మైథిలీం !

సమృధ్ధార్థ్యో గమిష్యామి 

మిషతాం సర్వ రక్షసాం !!


అర్థం : మహాబల సంపన్నులైన శ్రీరామునకు జయము. మిక్కిలి పరాక్రమశాలియైన లక్ష్మణస్వామికి జయము. శ్రీరామునకు విధేయుడై, కిష్కింధకు ప్రభువైన సుగ్రీవునకు జయము. అసహాయ శూరుడు, కోసలదేశ ప్రభువైన శ్రీరామునకు నేను దాసుడను, వాయుపుత్రుడను. నా పేరు హనుమంతుడు.


శత్రుసైన్యములను రూపుమాపువాడను. వేయిమంది రావణులైనను యుధ్ధ రంగమున రంగమున నన్నెదిరించి నిలువ జాలరు. వేలకొలది శిలలతోను, వృక్షములతోను, సకల రాక్షసులను, లంకాపురిని నాశన మొనర్చెదను. రాక్షసులందరును ఏమియూ చేయలేక చూచుచుందురుగాక. నేను వచ్చిన పనిని ముగించుకొని సీతాదేవికి నమస్కరించి వెళ్ళెదను.


ఇది పఠించిన వారికి జయం తధ్యం !!

 జయశ్రీ రామ!!  శుభమ్ భూయాత్!!!!

 (సేకరణ)

టూల్ కిట్

 Pardha Saradhi Upadrasta :


నిన్న రాత్రి నుండి  ఈ గూగుల్ డాక్యుమెంట్ ఏమిటి? టూల్ కిట్ ఏమిటి అనేది చాల మందికి కొంచెం కన్ఫ్యూషన్ గా వుంది;  దేనిని influencer marketing   అంటారు, కొంత వివరించే ప్రయ్తత్నము చేస్తాను 🙂 


ప్రాథమిక స్థాయిలో,  influencer మార్కెటింగ్ అనేది ఒక రకమైన సోషల్ మీడియా మార్కెటింగ్,  దీన్ని  ప్రోడక్ట్ లను అమ్ముకోవటానికి వాటిని మార్కెటింగ్ చేయటానికి వాడే వారు;  సోషల్ మీడియా లో ఎక్కువ సామాజిక ఫాలోయింగ్ ఉన్న వ్యక్తుల ను వారి  సముచితంలో నిపుణులుగా చేసి ,  సోషల్ మీడియా లో ఎక్కువ ప్రభావము చేసే వ్యక్తుల , వారి follower ల నుండి వచ్చిన సిఫార్సులు  బ్రాండ్ యొక్క ఫ్యూచర్ వినియోగదారులకు ఒక రుజువు యొక్క రూపంగా పనిచేస్తాయి. ఇలా ప్రోడక్ట్ మీద ఎక్కువ నమ్మకాన్ని పెంచుకునే విధముగా   ఇన్ఫ్లుఎన్సర్ మార్కెటింగ్ పనిచేస్తుంది


ఉదాహరణకు ఏ కంపెనీ అయినా ఒక కొత్త ప్రోడక్ట్ లాంచ్ చేస్తే  కొంత మంది ఆ ప్రోడక్ట్ డొమైన్ లో influencer లు, ఎక్స్పర్ట్ ల కోసము వెతికి, వారి ద్వారా ఆ ప్రోడక్ట్ గురించి ఒక ట్వీట్ లేదా పోస్ట్ పెట్టిస్తారు,  దానిని వారి ఒక follower లు  ఎక్కువ మంది ఫార్వర్డ్ చేస్తారు , త ద్వారా ఎక్కువ మందికి చేరటం ద్వారా ప్రోడక్ట్ మార్కెట్ లోకి ఎక్కువ మందికి తెలుస్తుంది  అనేది influence marketing ఒక్క ముక్య ఉద్దేశ్యము. 


influencer కి ఏమొస్తుంది?   అసలు ఈ influencer అంటే ఏమిటి? వాళ్ళు influencer ర్యాంకింగ్ ఎలా నిర్నయిస్తారు;  


దానికి  ఒకొక్క బ్రాండింగ్ platform ఒక్కక్క algorithm ఉపయోగిస్తుంది;  basically సోషల్ మీడియా లో ఎంత మంది follower /friend లున్నారు,  వాళ్ళు రోజుకి ఎన్ని ట్వీట్/పోస్ట్ లు చేస్తారు,  వాళ్ళు ట్వీట్/పోస్ట్ చేస్తే ఎంత మంది కి చేరుతుంది;  వీటి మీద ఆధారపడి influencer రాంక్ ఇస్తారు, ర్యాంకింగ్ ను బట్టి  influencer కి డబ్బులొస్తాయి ; 🙂 


ఇలాంటి ఒక platform  https://www.brand360.io/ ;  ఇదొక brand creation platform ;  https://www.brand360.io/Home/InfluencerHowItWorks


ఈ ఇన్ఫ్లుయెన్సుర్ లను కొంత మంది campaign లు create  చేసే కంపెనీలు పక్కన పెట్టుకుంటారు;  ఒక ట్వీట్ చేస్తే లేదా ఒక పోస్ట్ చేస్తే ఇంత డబ్బు అని campaign లు  create  చేస్తుంది ఆ ప్లాన్ ప్రకారము  ఆ influencer లు ఆ ట్వీట్ లను ట్వీట్ చేస్తూ వుంటారు;  ఒకొక్క సారి ఆ tweet  చేసే వారికి ఆ డొమైన్ అంటే ఏ విషయం గురించో కూడా , ఇష్యూ గురించి కూడా తెలిసి అవకాశము  లేదు. 


అందుకే కంటెంట్  creator  లు సెపెరేట్ గా వుంటారు,  వాళ్ళు కంటెంట్ క్రీయేట్ చేసి ఏ రోజు ఏ ట్వీట్ ఎన్ని సార్లు చేయాలి అంటే వీళ్ళు గుడ్డిగా చేస్తూ వుంటారు,  నెంబర్ అఫ్ ట్వీట్ లను బట్టి,  ఫార్వర్డ్/రీట్వీట్/షేర్ చేసే సంఖ్యను బట్టి అసలు influencer కి వారి క్రింద కొంత గ్రూప్ లకు ఆ డబ్బులు అందుతూ పోతాయి; 


ఆ influencer క్రింద వున్న  ఫాల్లోవెర్ లందరి ID లు కూడా పర్మనంట్, ఒరిజినల్ కూడా కాకపోవచ్చు;  ఒకొక్క సారి వాళ్ళు తీసుకున్న campaign ఒక్క ప్రయారిటీ ను బట్టి ID  లు కూడా కృత్రిమంగా  పుట్టుకొస్తాయి;  ఆ campaign అవగానే ఆ ID లు డిలీట్ కూడా అయిపోతాయి;  


ఈ campaign ల ఒక్క ముఖ్య ఉద్దేశ్యము ఏమిటంటే తీసుకునే అంశము  మీద సోషల్ మీడియా లో ఒక బజ్ create  చేయటము;  ఒకొక్క సారి లేని బజ్  , లేని influence కూడా create చేయవలసి వస్తుంది;  చేస్తారు ;

 

మొన్న రైతుల ఆందోళన విషయంలో విదీశీ టూల్ కిట్ లో జరిగింది అదే;  జనవరి 13 నుండి మొదలు అయ్యి, ఏ రోజు ఏమి చేయాలి, ఏ రోజు ఎంత కంటెంట్ create చేయాలి, ఎవరెవరిని ఫాలో అవ్వాలి,  దానికి ఒక వారము ట్రైనింగ్,  ఏ జూమ్ మీటింగ్ కి రావాలి, ఎలా చేయాలి అనేది ట్రైనింగ్ కూడా ఇచ్చారు, 


జనవరి 23 మొదలు పెట్టుకోండి 26 ఈవెంట్ కి ఏమి చేయాలి, ఏమేమి ట్వీట్ లు ఎప్పుడు చేయాలి, ఎవరికీ ఆ ట్వీట్ లు పెట్టాలి ఇదంతా ఆ campaign లో భాగమే;  ట్వీట్ లలో కంటెంట్ కూడా డిసైడ్ అయ్యింది;  ఇలా ఫిబ్రవరి 4 మొదలు పెట్టుకోండి మార్చ్ చివరి వరకు ఏ రోజు ఎవరు ఎలా  ట్వీట్ లు చేయాలో, content ఏమిటి అనేది మొత్తము ప్లాన్ చేసుకున్నారు;  

 

ఆ కంటెంట్ , campaign ల ఆబ్జెక్టివ్ భారత దేశములో ఎదో జరిగిపోతోంది అన్న విషయములో గ్లోబల్ ప్రపంచ దుష్టిలో భారత దేశాని తిట్టి, భారత దేశ విలువను తగ్గించటమే ;


నా మాట: 


ఇటువంటి ట్వీట్స్ పోస్ట్స్ కనిపెట్టడం సులువు కూడా! 

ట్వీట్స్ ఒక పదో లేక ఇరవై లేక ఇంకా ఎక్కువ సంఖ్యలో నమూనా ట్వీట్స్ తయారు చేస్తారు. ఆ గ్రూప్ లో ట్వీట్ చేసేవారందరూ ఈ నమూనా ట్వీట్స్ నే షేర్ చేస్తూ ఉంటారు. వాటిల్లో షార్ట్ కట్ పదాలు,ఏబ్రీ వేషన్స్, స్పెల్లింగ్ మిస్టేక్స్ కూడా వంటివి అన్ని ట్వీట్స్ లో.కనబడతాయి.


మనకు విదేశీ పెట్టుబడులు రాకుండా మన భారత్ ని బదనాం చేసే కంపైన్ వెనుక బహుశా చైనా

శక్తులు ఖచ్చితంగా ఉండి వుండవచ్చు. కానీ దురదృష్టం ఏమిటంటే విదేశీయులు మన భారత్ కి చెడ్డపేరు తేవాలి  చేస్తున్న ఈ విద్వేష కంఫైన్ కి మన విపక్ష పార్టీలు, సెలెబ్రెట్ జర్నలిస్టులు, మోడీ అంటే పడని మేధావులు కూడా తమ వంతు సాయం చేస్తున్నారు. వీళ్ళు మోడీకి హాని చేస్తున్నారు అని అనుకుంటున్నారు కానీ దేశానికి హాని కలుగుతోంది అని ఆలోచించడం లేదు. విదేశీ శక్తుల చేతుల్లో పావుల్లాగా మారిపోయారు.ఇవి ఆరోపణలు కావు..పచ్చి నిజం. మొన్న toolkit కంపైన్.లో మన వారి ట్వీట్స్ నమూనాలు చూడండి మీకే అర్ధం అవుతుంది.

వంకాయతో

 వంకాయతో వంద వంటలు

           ఆచార్య రాణి సదాశివ మూర్తి

(సీసమాలిక)

నూరవ కూర తరువాత ఎత్తు గీతి

(అంతవరకు వేచి యుందురు గాక)

గమనిక - ఈ కూరలన్నీ వంకాయతో కలిపి చేసెడివే


అల్లంబు గుప్పించ నలరించు నొకకూర (1)

      ఆలుదుంపలజేర నదియు నొకటి (2)

అరటికాయ కలిపి యందింప నొక కూర (3)

                 ఉల్లికారముతోడ నొక్కకూర (4)

ఉల్లిపాయలతోడ నుడికించి ఒక కూర (5)

శనగల జోడింప చవులు బుట్టు(6)

శనగపిండి కలుప చక్కనౌ నొకకూర (7)

పచ్చిబఠానీల పరగు కూర (8)

పచ్చిమిరపజేర్చి(9) పలుదినుసులఁజేర్చి (10)

ముద్దకూరనుజేయ ముచ్చటౌను (11)

కూరి కారము సుంత గుత్తిగా నుడికించ (12)

మెంతికారమిడగ మెచ్చు కొనగ(13)

కోరి కొబ్బరి కల్పి(14) కొత్తిమిరను దంచి (15)

జీడిపప్పు ను జేర్చి(16) జీరకమున (17)

ఎండుకొబ్బరిపొడిన్ (18), ఏలాలవంగాల (19)

ఇగురు కూర నొకటి (20) యింపుగాను

చింతపండు పులుసు నందంతనుడికించ (21)

చిక్కుడుగింజల మిక్కుటముగ (22)

వంగకాయను కాల్చి పచ్చడి గనుజేయ(23)

గుగ్గిళ్ళ జతజేసి కూర వండ(24)                                       

నూపప్పు పొడి కూర (25) నూనె వేపుడు కూర(26)

అలసంద లుడికించి(27) ఆవ పెట్టి (28)

ధని యాల కారాన (29) దంచి వెల్లుల్లితో (30)

మెంతి పెట్టిన కూర (31) మేలు చాటు (32)

పుదినాకు వేయింపు (33)పుల్లాకు తాళింపు(34)

కందికూటునకూర (35) కంది కట్టు (36)

తేటమజ్జిగ చారు (37) తీపిగుమ్మడి జోడు(38)

వాంగి బాతొక్కటి (38) వంగ బజ్జి (39)

ఆవకాయయునొప్పు(40) అనపగింజలనొప్పు(41)

ఆనపకాయతో(42) అలరునదియు

అవిశెపొడినిజల్లి(43) అవిశాకుతో కూర (44)

రామములగతోడ (45) రంజుగాను

వంగబగారాన (46) పప్పు కందులగల్పి(47)

పెసరపప్పున గూర్చ (48) పెసలలోన (49)

పెసరట్టు లోజేర్చి(50) పెసరపులుసులోన(51)

పెసరపచ్చడిలోన (52) పెరుగు నందు (53)

బీన్సు నందు న(54) సోయ బీన్సు నందు (55)

సోయపిండిని జేర్చి (56) సుండలందుకలిపి (57)

కొరివి కారమునందు (58) కోరినట్లు

పనస పొట్టునకూర (59) వరిపిండితోకూర (60)

దోసపచ్చడిలోన (61) దొండ తోడ (62)

బీరకాయలతోను (63) బెండకాయలజేర్చి (64)

తోటకూర కలిపి (65) దోరఁ వేచి (66)

దొండవేపుడులోన (67) బెండవేపుడులోన (68)

కరివేపపొడిలోన (69) కారమద్ది (70)

పన్నీరు తో కూర (71) పల్లీలతోకూర (72)

తెలగపిండిని కూర (73) తిలలకూర (74)

నవకాయ*శాకంబు (75) నవకాయ పులుసును (76)

అయిదుకాయలకూర (77) అటుల పులుసు (78)

వాముపొడినిజల్లి (79)  వార్చిన గంజితో (80)

వంగతో పులిహోర (81) పొంగలియును (82)

వంకాయ మాజిక్కు(83) వంగబజ్జీకూర (84)

వరకదంబమమర (85) వంగ చట్ని (86)

నిమ్మ రసపుపప్పు (87) నిమ్మకారములోన (88)

మామిడల్లముతోడ (89) మక్కువగను

కలిపి గోసుపువుల(90) కలిపి గోబీపూల (91)

పూని ఉప్మాకూర (92) పులుసుకూర (93)

ఎండు మామిడి తోళ్ళ (94) ఎర్రదుంపలఁ జేర్చి (95)

పచ్చిమామిడి జతన్ పప్పు (96) కూర (97)

కలిపి కారెట్టుతో (98) కనగముల్లంగితో (99)

నూలుకోల్ దుంపలన్ (100) నూరు జేర


ఆటవెలది

వంగతోడనిట్లు వండగా తగునండి

వంగ చుట్టమరయనంగనలకు

శాకరాజమిదియె శాకభుక్కులకెల్ల

చేసి చూడ రండి చెలిమి మీర

(*నవకాయ ... తొమ్మిది కాయలవంటగా వ్రతాలలో వాడుక కలదు. అందుకని వాడటమైనది)


😄😄😄 సుప్రభ 😄😄😄

ఇండియన్ రైల్వే:

*ఇండియన్ రైల్వే: కొత్త సర్వీస్*

ఎవరైనా రైలు ప్రయాణం చేసేటప్పుడు ఒకటీ లేదా రెండు బ్యాగుల లగేజీని తమతో తీసుకెళ్తుంటారు. కొంత మందికి మాత్రం నాలుగైదు లగేజీ బ్యాగులు ఉంటాయి. వాటిని మొయ్యలేక, తీసుకెళ్లలేక నానా ఇబ్బందులు పడుతూ ఉంటారు. అలాంటి వారిని దృష్టిలో పెట్టుకొని భారతీయ రైల్వే శాఖ కొత్త సదుపాయాన్ని అమల్లోకి తెచ్చింది. 


ఇందుకోసం రైల్వే శాఖ... బుక్‌బ్యాగేజ్ ( *Book Baggage* ) అనే App తెచ్చింది. ఈ యాప్ ద్వారా ఈ సర్వీసును ప్రయాణికులు పొందవచ్చు. దీని వల్ల మీరు ఇంట్లో ఉండి... మీ లగేజీని ఇంటి నుంచి ఎక్కడికి పంపాలో డిసైడ్ చేయవచ్చు. మీరు కోరుకున్నట్లే లగేజీని తీసుకొని... దాన్ని శానిటైజ్ చేసి... మీరు చెప్పిన చోటికి రైల్వే శాఖ తరలిస్తుంది. అంటే... మీరు రైల్వేస్టేషన్‌కి లగేజీని మీతోపాటూ తెచ్చుకోవాల్సిన పనిలేదు. దాని దారిన అది మీరు వెళ్లాలనుకున్నచోటికి యాప్ సర్వీస్ ద్వారా వెళ్లిపోతుంది. 


నిజానికి మీరు బుక్ బ్యాగేజ్ ద్వారా అప్లై చేసుకుంటే... మీ ఇంటి నుంచి తీసుకెళ్లే లగేజీని... రైల్లోనే ప్రత్యేక బోగీలో ఉంచుతారు. అది మీరు ఎక్కే రైలు కావచ్చు లేదో మరో రైలు కావచ్చు. ఏదైతేనేం... మీ ప్రయాణం ఎంత వేగంగా జరుగుతుందో, మీ సామాన్లు కూడా అంతే వేగంగా డెస్టినేషన్ చేరుకుంటాయి. మీరు రైలు దిగి... మీ గమ్యానికి చేరుకోగానే... మీ లగేజీని... అక్కడకు తెచ్చేస్తారు. ఇందుకోసం ప్రయాణికులు ఒక్కో బ్యాగుకీ రూ.125 చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో ఇతరత్రా ఎన్ని ఖర్చులున్నా... వాటితో ప్రయాణికులకు సంబంధం లేదు. రైల్వే శాఖ ఆ యాప్ ద్వారా ఈ సర్వీసును మంగళవారం నుంచి అమల్లోకి తెచ్చింది. ట్రావెలర్స్‌కి ఈ సదుపాయం బాగా ఉపయోగపడగలదు. 


డెలివరీ ఇలా ఉంటుంది. ముందుగా మీరు లగేజీ ఇవ్వగానే దాన్ని రైల్వే స్టేషన్‌కి తీసుకెళ్లి... 360 డిగ్రీల్లో అంటే... మొత్తం శానిటైజ్ చేస్తారు. ఇందుకోసం ఫస్ట్ అల్ట్రావయలెట్ లైట్ వాడుతారు. తర్వాత లగేజీని ప్యాక్ చేస్తారు. అందువల్ల మీ లగేజీ పాడవ్వదు. మీరు యాప్ సర్వీస్ ద్వారా... మీ లగేజీ ఎక్కడుందో ట్రాక్ చేసి ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. లగేజీకి ఎలాంటి సమస్యలూ రాకుండా పూర్తిస్థాయిలో రక్షణ కల్పిస్తామని రైల్వే శాఖ తెలిపింది.


ఈ సర్వీస్ పొందేందుకు మీరు ముందుగా బుక్ బ్యాగేజ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఆ తర్వాత 3 గంటల తరవాత నుంచి మీకు ఈ సర్వీసులు అందుబాటులోకి వస్తాయి. 3 గంటల తర్వాత మీ లగేజ్ ని బుక్ చేసుకోవచ్చు. మీరు హోమ్ నుంచి లగేజీ డెలివరీకి ఆర్డర్ ఇస్తే... మీరు ఎక్కే రైలు బయలుదేరే 3 గంటల ముందే లగేజీని తీసుకుపోతారు. తద్వారా మీరు ఎక్కే రైలులోనే లగేజీ కూడా ఉండేలా చేస్తారు. 


లగేజీ డెలివరీకి ముందే ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది. రైలు స్టేషన్ నుంచి బయలుదేరే పావు గంట ముందే రూ.125 చెల్లించాల్సి ఉంటుంది. ఎన్ని బ్యాగులు ఉంటే... అన్ని రూ.125లు చెల్లించాల్సి ఉంటుంది. ట్రైన్ గమ్యానికి చేరుకున్న తర్వాత 3 గంటల్లో మీ లగేజీ మీరు కోరుకున్న చోటికి తెస్తారు. 


ఈ సర్వీసు చాలా బాగుందని ప్రయాణికులు చెబుతున్నారు. కొంత మంది ముసలివారు సామాన్లు మోయలేరు. అలాంటి వారికి ఈ సర్వీస్ చాలా బాగా ఉపయోగపడుతుందని చెబుతున్నారు. అలాగే స్పోర్ట్స్ క్రీడాకారులు, ఫిల్మ్ షూటింగ్ వారు... భారీ ఎత్తున లగేజీని తమతో తీసుకెళ్లాల్సి ఉంటుంది. అలాంటి వారికి ఈ సర్వీస్ ఎంతో మేలు చేస్తుందని అంటున్నారు.

బాల్యంలో

 🙏🌺దేవుడు తెలివైనోడు. బాల్యంలో ఏ టెన్షన్ లేకుండా తిరుగుతుంటే, తీసి స్కూల్ లో వేస్తాడు. టెన్షన్ స్టార్ట్ అవుతుంది. 🌺🙏


🌺స్కూల్ అయిపోయి కాలేజ్ లో ఎంజాయ్ చేద్దాం అనుకుంటే బాధ్యత గుర్తు చేస్తాడు. 


సరే  జాబ్ చేస్తూ ఎంజాయ్ చేద్దాం అనుకుంటే డబ్బు మీద ఆశను పుట్టిస్తాడు. డబ్బు మోజులో పడి కొట్టుకుపోతుంటే, లాగిపెట్టి ఒకటి పీకి, ఆరోగ్యం జాగ్రత్త అని గుర్తు చేస్తాడు. 


శక్తి లేనప్పుడు మనల్ని చూసుకోవడానికి ఎవరుంటారు అనుకున్నప్పుడు భార్యని పంపిస్తాడు.🌺 


🌺సరే భార్యా-పిల్లలతో ఎంజాయ్ చేద్దాం అనుకుంటే పిల్లల భవిష్యత్తు అంటాడు. పిల్లల భవిష్యత్తు కోసం డబ్బు వెంట పరిగెడితే, 


ప్రేమని కోల్పోతున్నాం అని గుర్తు చేస్తాడు. కానీ ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాలి అని మనిషి ఈ సారి దేవుడి మాట వినడు. 


కట్టల కొద్దీ పైసలు కూడబెడతాడు. హమ్మయ్య అని ఇంటికి తిరిగి వచ్చేసరికి వాడితో ఆడుకోడానికి ఎవరూ ఉండరు, పిల్లలు పెద్దవాళ్ళు అయిపోతారు. 🌺


🌺సరే పిల్లలకు పెళ్ళి చేసి, కనీసం వాళ్ళ పిల్లలతో అయినా ఆడుకుందాం అనుకుంటే, వాడి పిల్లలు వాళ్ళ భవిష్యత్తు అని ఎక్కడికో ఎగిరిపోతారు. కొందరు పిల్లలు ఇంకొక అడుగు ముందుకేసి వీళ్ళను తీసి అనాథ శరణాలయంలో పడేస్తారు. 


శక్తి మొత్తం క్షీణించి, ఏమీ చేయలేని ముసలి వయసులో జీవితం కళ్ళ ముందు కదలాడుతుంది.  తెలియకుండానే కళ్ళల్లో నీళ్ళు తిరుగుతుంటాయ్.


అప్పుడొస్తాడు దేవుడు, ఏడ్చింది చాలు నాయనా! నీ టైం అయిపోయింది వెళ్దాం పదా అని తీసుకెళ్లిపోతాడు. 🌺


🌺ఇదే సగటు మనిషి బతుకుతున్న జీవితం.🌺


🌺కాబట్టి_డబ్బు_మోజులో_పడకుండా

కాస్త_కుటుంబానికి_ప్రాధాన్యత_ఇవ్వండి.🌺

పంచముఖ ఆంజనేయ స్వామి

 *పంచముఖ ఆంజనేయ స్వామి* అని మనం వినే ఉంటాం. ఈ పంచముఖ ఆంజనేయ స్వామి గురించి మనకు రామాయణం లో వివరణ దొరుకుతుంది. రామ రావణ యుద్దము నందు, రావణుడు మహీరావణుడి సాయం కోరుతాడు, పాతాళానికి అధిపతి మహీరావణుడు.


ఆంజనేయుడు ఏర్పాటు చేసిన వాల శయనమందిరము ( తోకతో ఏర్పాటు చేసినది) నుండి రామ లక్ష్మణులను మహీరావణుడు విభీషణుడి రూపంలో వచ్చి అపహరిస్తాడు. అది తెలుసుకొన్న ఆంజనేయుడు శ్రీ రామ లక్ష్మణులను వెతకడానికి పాతాళానికి వెళ్తాడు.


పాతాళంలో వివిధ దిక్కులలో ఉన్న ఐదు దీపలను ఒకేసారి విచ్చిన్నం చేస్తే మహీరావణుడు ప్రాణాలు వీడుతాడని తెలుసుకొన్న పవనుడు పంచముఖ ఆంజనేయ స్వామి రూపం దాలుస్తాడు. అందులో ఒక ముఖం ఆంజనేయుడిది కాగ, గరుడ, వరాహ, హయగ్రీవ, నరసింహాదులు కలసి పంచముఖ అవతారంగా ఏర్పడి ఆ దీపాలను ఒకేసారి విచ్చినం చేసి (ఆర్పి) శ్రీరామ లక్ష్మణులను కాపాడుకొంటాడు.


*పంచముఖాలు ఐదు దిక్కులు వాటి వివరాలు*


హనుమంతుడు శ్రీరాముడికి పరమభక్తుడు, హనుమంతుడు భక్తసులభుడు, హనుమంతుడి కరుణాకటాక్షాలు కలగాలంటే శ్రీరాముడిని పూజించి భజన చేస్తే చాలు భజన చేస్తున్న ప్రదేశంలో హనుమంతుడు ఏదో ఒక అవతారంలో ఉంటాడు అని వేదపండితులు తెలియజేస్తున్నారు. అలాగే ఆంజనేయస్వామి నవ అవతారాలలో దర్శనం ఇస్తాడు.


ఆంజనేయస్వామి నవావతరాలు ప్రసన్నాంజనేయస్వామి, వీరాంజనేయస్వామి, వింశతి భుజ ఆంజనేయస్వామి, పంచముఖ ఆంజనేయస్వామి, అష్టాదశ భుజ ఆంజనేయస్వామి, సువర్చల ఆంజనేయస్వామి, చతుర్భుజ ఆంజనేయస్వామి, ద్వాత్రింశద్భుజ ఆంజనేయస్వామి మరియు వానరాకార ఆంజనేయస్వామి.


ఆంజనేయస్వామి నవావతారాలలో పంచముఖ ఆంజనేయస్వామి శ్రీ విష్ణుమూర్తి అంశలలో ఉద్భవించాడు. పంచముఖాలు ఐదు దిక్కులను దృష్టిని సారించి ఉండగా ఆ ముఖాలలోని వివరాలు ఈ విధంగా చెప్పబడ్డాయి.


*తూర్పుముఖముగా హనుమంతుడు:*


తూర్పుముఖముగా హనుమంతుడు: పాపాలను హరించి, చిత్త సుధ్ధిని కలుగ చేస్తాడు. ఆంజనేయ స్వామి, తూర్పునకు అభిముఖుడై, బాధలు కష్టాలనుండి రక్షించేవాడు


*దక్షిణముఖంగా*


దక్షిణముఖంగా కరాళ ఉగ్ర నరసింహ స్వామి: శతృభయాన్ని పోగొట్టి, విజయాన్ని కలుగజేస్తాడు.నరసింహ, దక్షిణాభిముఖుడు, దుష్ప్రభావాల నుండి రక్షిస్తాడు.


*పడమర ముఖంగా*


పడమర ముఖంగా మహావీరగరుడ స్వామి, దుష్ట ప్రభావలను పోగొట్టీ, శరీరానికి కలిగే విష ప్రభావలనుండి రక్షిస్తాడు. గరుడు, పడమటి దిక్కు వైపు ఆసీనుడై, ఆయుర్దాయ కాలాన్ని పెంపొందించేవాడు


*ఉత్తరముఖముగా*


ఉత్తరముఖముగా లక్ష్మీవరాహమూర్తి గ్రహ చెడు ప్రభావాలను తప్పించి, అష్టైశ్వర్యాలు కలుగజేస్తాడు.వరాహ, ఉత్తరాభిముఖుడు, మంచి జీవితాన్ని ప్రసాదించువాడు


*ఊర్ధ్వంగా*


ఊర్ధ్వంగా ఉండే హయగ్రీవస్వామి జ్ఞానాన్ని, జయాన్ని, మంచి జీవనసహచరిని, సంతానాన్ని ప్రసాదిస్తాడు.


*సేకరణ*

కపిల గోవు మహిమ

 _*కపిల గోవు మహిమ*_

ధర్మరాజు " పితామహా ! కపిలగోవు విశిష్ఠత తెలపండి " అని అడిగాడు. భీష్ముడు *"ధర్మనందనా ! పూర్వము దేవతలకు ఆకలి వేసింది. వారంతా బ్రహ్మదేవుడి వద్దకు వెళ్ళారు. బ్రహ్మదేవుడు వారికి అమృతం ఇచ్చాడు. దేవతలు ఆ అమృతము సేవించారు. ఆ అమృతపు సువాసనల నుండి కామధేనువు ఉద్భవించింది. కామధేనువు నుండి మరి కొన్ని ఆవులు జన్మించాయి. ఆ ఆవులన్ని హిమాలయాల మీద విహరిస్తున్నాయి. ఆ సమయంలో ఒక లేగదూడ తన తల్లిదగ్గర పాలు తాగుతుంది. ఆ పాల నురగ గాలికి ఎగిరి అక్కడే తపస్సు చేసుకుంటున్న పరమశివుడి తల మీద పడింది. పరమశివుడికి కోపం వచ్చి మూడో కన్ను తెరచి ఆ ఆవులను చూసాడు. ఆ ఆవులన్ని ఆ కోపాగ్ని వేడికి ఎర్రగా అయిపోయాయి. ఆవులన్ని బెదిరి తలోదిక్కుకు పారి పోయాయి. ఈ సంగతి తెలుసుకున్న బ్రహ్మదేవుడు పరమశివుని వద్దకు వచ్చి " మహేశా ! నీ తల మీద ఉన్న చంద్రుడు నిరంతరం నీ మీద అమృతం కురిపిస్తుంటాడు కదా ! లేగ దూడల నోటి నుండి వచ్చే నురగ కూడా అమృత సమానము కదా ! అది ఎంగిలి ఎలా ఔతుంది ! గోవు పాలు అమృతమైతే వాటి నురగ కూడా అమృతమే కదా ! దీనికి ఆగ్రహిస్తే ఎలా ! వాటిని కరుణించు"* అని వేడుకుని ఒక మంచి ఎద్దును శివుడికి కానుకగా ఇచ్చాడు. పరమశివుడు శాంతించి ఆ ఎద్దును తన వాహనముగా చేసుకుని ఆవులను ఆప్రాంతంలో తిరగడానికి అనుమతి ఇచ్చాడు. వెంటనే బెదిరి పోయిన ఆవులు తిరిగి వచ్చాయి. శివుడు *"బ్రహ్మదేవా ! ఈ గోవులన్ని నా మూడవ కంటిచూపుతో ఎర్రగా అయిపోయాయి. ఇప్పటి నుండి ఇవి అతి శ్రేష్ఠమైనవిగా భావించబడతాయి"* అని వరం ఇచ్చాడు. అప్పటి నుండి కపిలగోవులనబడే ఎర్రటి గోవులు దానం ఇవ్వడం ఆనవాయితి అయింది " అని భీష్ముడు చెప్పాడు.

*కపిల గోవు మహిమ*

శుకుడు తన తండ్రి అయిన వ్యాసుడితో *"తండ్రి గారూ ! కపిలగోవులకు అంత మాహాత్మ్యము ఎలా వచ్చింది"* అని అడిగాడు. వ్యాసుడు *"ఒకసారి దేవతల సంఘానికి కనపడకుండా తనను దాచమని అగ్నిదేవుడు గోవులను వేడుకున్నాడు. అలాగే అని గోవులు అగ్నిదేవుడిని దాచి పెట్టాయి. దేవతలు అగ్ని దేవుడిని వెతుకుతూ చివరకు ఆవుల వద్ద ఉన్నాడని తెలుసుకుని *"గోవులారా ! అగ్నిదేవుడిని దాచడం లోకములకు మంచిది కాదు. కనుక అగ్నిదేవుడు ఎక్కడ ఉన్నాడో చెప్పండి"* అని అడిగారు. ఆవులు వారిమాట మన్నించి అగ్నిదేవుడు దాగి ఉన్నచోటు చూపాయి. దేవతలు అగ్నిదేవుడితో గోవులకు ఏదైనా వరం ప్రసాదించమని అడిగారు. అగ్నిదేవుడు తాను దాగి ఉన్న కారణంగా వాటికి ఎర్రరంగు వస్తుంది అని వరమిచ్చాడు. పైగా ఆవులలో ఎర్రటి ఆవులు శ్రేష్టమైనవని వాటిని పూజించిన వారికి ఉత్తమ లోకాలు ప్రాప్తిస్తాయని చెప్పాడు. కపిలగోవును దానం ఇచ్చిన వాడు పుచ్చుకున్న వాడు కూడా పుణ్యలోకాలకు పోతారని వరమిచ్చాడు.
కపిల గోవు లక్షణములు

శుకుడు *" తండ్రీ ! కపిలగోవు లక్షణము ఏమిటో వివరించండి "* అని అడిగాడు. వ్యాసుడు *" కుమారా ! సాధారణంగా కపిల గోవులకు చెవులు , ముక్కు , కళ్ళు , కొమ్ములు కపిల వర్ణంలో ఉంటాయి. అలాకాక ఏ ఒక్క చోట ఎర్రగా ఉన్నా చాలు. అది కపిల గోవు అని పిలువబడుతుంది. ఇక శరీరం అంతా ఎర్రగా ఉంటే ఇక దాని మహిమ చెప్ప వలసిన అవసరం లేదు. కపిల గోవు మీద బరువు వెయ్యరాదు. దానిని హింసించరాదు. దానిని బలికి ఉపయోగించ రాదు. కపిలగోవును కాలితోకాని చేతితోకాని గోటితోకాని కర్రతోకాని కొట్టిన వాడు నరకానికి పోతాడు. కపిల గోవుకు వేళకు మేత నీరు పెట్టినవాడు సద్గతికి పొందుతాడు. గోవులతో పాటు , బ్రాహ్మణులు , గాయత్రీమాత , వసంతకాలము , సత్యము , బంగారము పుట్టాయని పెద్దలు చెప్తారు. దానము ఇవ్వతగిన వస్తువులలో ఆవులు , బంగారము , భూమి శ్రేష్టమైనవి అని " వ్యాసుడు తన కుమారుడైన శుకుడికి వివరించాడు "* అని భీష్ముడు ధర్మరాజుకు చెప్పాడు.

*గోదాన విధి*

ధర్మరాజు *" పితామహా ! గోదానము ఇవ్వవలసిన విధానం వివరించండి "* అని అడిగాడు. భీష్ముడు *" ధర్మనందనా ! ఈ గోదానమహిమ గురించి పూర్వము బృహస్పతి మాంధాతకు చెప్పాడు. ఒక పుణ్యదినము అందు బ్రాహ్మణుల అనుమతి తీసుకుని ఆ రోజంతా ఉపవాసము ఉండి గోవులు ఉన్న మంద వద్దకు పోయి ఒకరోజు ఆ గోశాలలో ఉండి మరునాడు సూర్యోదయమున తాను దానము ఇవ్వదలచిన గోవును పేరు పెట్టి పిలిచి బ్రహ్మదేవుడు చెప్పిన మంత్రము ఈ విధముగా పఠించుతూ *" ఈ గోవు నా తల్లి , ఈ ఎద్దు నా తండ్రి , ఈ గోవుగర్భం స్వర్గం , ఈ గోవు నిలిచిన ప్రదేశం పుణ్యలోకం ఇచ్చిన వ్యక్తికి శాశ్వత సుఖసంతోషాలు లభిస్తాయి. ఇక దానము పుచ్చుకునే వాడు విద్యాభ్యాసము చేసే విద్యార్థికాని , వ్రతములు చెయ్యడంలో ఆసక్తి ఉన్న వాడు కాని , ఎటువంటి పాపములు చెయ్యనివాడు కాని , శాంతచిత్తుడు కాని , ఇంద్రియ నిగ్రహము కలవాడు కాని , కోపము లేనివాడు కాని అయి ఉండవలెను. మహారాజా ! ఆశ్వీజమాసంలో కృష్ణపక్షంలో అష్టమి నుండి మూడు రోజులు దీక్షలో ఉండి గోమూత్రము గోమయము పుచ్చుకుంటే అతడు కోరినకోరికలు సిద్ధిస్తాయి " అని మాంధాతకు చెప్పాడు. కనుక ధర్మనందనా నీవు కూడా పై నియమములు ఆచరించి గోదానము చెయ్యి. పొద్దుననే లేచి కాలకృత్యములు తీర్చుకుని ఉపవాసము ఉండి గోదానము చేస్తే ఎంతో పుణ్యము వస్తుంది. ఇక కపిలవర్ణ గోవును దానం చేస్తే సకలపాపములు నశించగలవు "* అని భీష్ముడు చెప్పాడు.

జన్మజన్మల పాప పరిహారానికి 
గోమాత సాయం
*"పూర్వ జన్మ కృతం పాపం వ్యాధి రూపేణ బాధతే"* పూర్వ జన్మలో మనం చేసుకున్న పాపం వ్యాధి రూపంలో మనని బాధిస్తుంది. అటువంటి పాపాల వల్ల సంక్రమించే వ్యాధులకు గోమాత ద్వారా పరిష్కారాలున్నాయి. ధర్మశాస్త్రాలు వాటిని సూచించాయి. శాతాతప స్మృతి ఇలా చెప్పింది: 

పూర్వజన్మలో కొంగను హింసిస్తే అది పాతకమై అనంతర జన్మలో ముక్కుకి సంబంధించిన సమస్యలతో బాధపడతారు. అందవికారమైన ముక్కు కారణంగా పరిహాసానికి గురికావడం లేదా ముక్తికి సంబంధించిన వ్యాధులతో బాధపడడం ఉంటుంది. అట్టి వారు తెల్లగోవును దానం చేయడం ఆ పాపానికి పరిష్కారం. 

గత జన్మలో కాకిని హింసించిన వారు ఈ జన్మలో చెవి సంబంధమైన వ్యాధితో బాధపడతారనీ , దానికి పరిహారంగా కృష్ణవర్ణ ధేనువును అంటే నల్లని ఆవును దానం చేయాలనీ చెప్పారు. 

పూర్వజన్మలో వంచన చేసినవారు ఆ వంచన దారుణమైన ఫలితాన్ని ఇవ్వడం వలన ఈ జన్మలో మూర్ఛరోగంతో బాధపడతారు. దానిని పోగొట్టుకోవడానికి కపిల గోవును దానం చేయాలని శాతాతపుడు తెలిపాడు. శాతాతప స్మృతి 109వ శ్లోకం ఇలా చెప్పింది.
*ఖల్సాటః పరనిందావాన్ ధేనం దద్యాత్ స కాంచనామ్*
*పరోపహసకృతే కాణః స గాం దద్యాత్ స మౌక్తికామ్*

పూర్వజన్మలో ఎవరు పరనింద చేశారో , వారికి ఈ జన్మలో బట్టతల వస్తుంది. ఆ పాప పరిహారార్థం బంగారంతోపాటు గోవును దానం చేయాలి. 

పూర్వజన్మలో పరులను ఎగతాళి చేసిన వారికి ఈ జన్మలో ఒక కన్ను కనబడదు. పరిహారంగా వారు గోవును ముత్యంతో దానం చేయాలి. పాప తీవ్రత పెరిగిన వారు ఆత్మహత్య చేసుకోవాలనే దుశ్చింతలకు లోనవుతారు. అట్టి తీవ్రతాపం జన్మజన్మలలో అనేక రీతులుగా బాధించవచ్చు. కాబట్టి వేదాలు పాపపరిహారం అనంతర జన్మలకు కూడా ఉపకరిస్తుంది. ఇలా వేదాలు , ధర్మశాస్త్రాలు గోమాతను గురించి ఎంతగానో తెలిపాయి.
గోవులే ఐశ్వర్యం. గోవులే ఇంద్రియ బలవర్థకాలు. సోమరసంలో గోక్షీరాలను తప్ప వేరే వాటిని కలుపకూడదు. సోమరసం అంటే యజ్ఞాలలో దేవతలకు ప్రీతికరంగా సోమరసాన్ని సమర్పించడానికి సోమలత నుంచి సిద్ధం చేసింది. వాటిలో కలపడానికి యోగ్యమైనది ఆవుపాలు మాత్రమే. కాబట్టి ఓ మానవులారా ! గో సంపదను పొందాలని మనస్ఫూర్తిగా కోరుకోండి. గోవులే ఐశ్వర్యాన్ని ఇచ్చేవని ఋగ్వేదంలోని 4-28-5 ఋక్కు తెలియజేస్తుంది.
*"గావో భ గో గావ ఇంద్రో యే ఇచ్చాద్ గావః సోమస్య ప్రథమస్య భక్షః ఇమా వాయా గావః సజనా స ఇంద్ర ఇచ్ఛామి ధ్రుదా మానసా చిదింద్రిమ్"*
స్మృతి సంగ్రహం ఆ విషయాన్నే బలపరుస్తూ ఇలా తెలియజేసింది.
*గవాం సేవాతు కర్తవ్యా గృహస్థైః పుణ్య విప్సుభిః*
*గవాం సేవాపరో యస్తు తస్య శ్రీర్వర్ధతే చిరాత్ !!*
పుణ్యాన్ని ఆకాంక్షించే గృహస్థులు తప్పక గోసేవ చేయాలని ఆ ధర్మశాస్త్రం తెలియజేస్తోంది. అలా గోసేవ చేసేవారికి సంపద చిరకాలం వర్థిల్లుతుందని తెలిపింది. అందుకే అథర్వవేద ఋషి దేవతలను ప్రార్థిస్తూ *'ఓ దేవా ! మా భార్య , పిల్లలకు గోసంపదకు మంగళం జరిగేటట్లు చేయవలసింది'* అంటారు. సామవేదం 20-7 లోనూ , ఋగ్వేదం 8-14-3 లోనూ ఇంద్రుడిని స్తుతిస్తూ గో సమృద్ధిని ఈయవలసినదిగా ప్రార్థించడం జరిగింది.
అలాగే సామవేదంలో 1-3లో కూడా *"క్షుమంతం వాజగ్ం సహస్తిణాయాక్షు గో మంత మీ మహే"* అని గో సంపత్తిని విశేషంగా ఇమ్మని కోరటం జరుగుతుంది. ఎందుకంటే *ధేనుం సదనమ్ రణియానాం* అని అథర్వణం 11-1-34 లో ధన సంపదకు ప్రాప్తి స్థానం గోవు అనీ , గోవు ఉన్న గృహానికి సౌభాగ్యం కలుగుతుందని తెలిపింది. శుక్ల యజుర్వేదం 7-10 మంత్రంలో మిత్రావరుణ దేవతలకు యజ్ఞం ద్వారా హవిస్సులు సమర్ఫించడం వలన వారు తృప్తి పొందుతున్నారని , ధేనువు పచ్చి గరిక తిని తృప్తి పొంది పాలు , పెరుగు , నెయ్యి ఇవ్వడం వల్లనే యజ్ఞకర్మలు నిర్వఘ్నంగా జరుగుతున్నాయనీ , ఆ కారణంగా సర్వ సంపదలకు సాధనంగా గోవును గ్రహించాలని చెప్పడం జరిగింది.
ధర్మ శాస్త్రాలు గోవును అనేక రీతుల ప్రశంసించాయి. *"పంథా దేయో బ్రాహ్మణాయా గవే రాజేహ్య చక్షుషే"* అని చెప్పింది బోధనాయ స్మృతి. అంటే బ్రహ్మణుడు , గోవు , రాజు , అంధుడు దారిలో ఎదురైతే , వారికి దారి ఇస్తూ మనమే పక్కకి తప్పుకోవాలని తాత్పర్యం. అంతే కాదు. వేద ధ్వని వినబడని గృహము , అలంకృతమైన ఆదరింపబడుతున్న     గో సంపద లేని ఇల్లు ఇల్లే కాదని కూడా చెప్పింది.
*"గాం ధృహ్యంతే పర మై నీచక్షేతన చైనం వా రమేత్"* అని గౌతమ మహర్షి తన గౌతమ స్మృతిలో చెప్పాడు. అంటే గోవు పాలు తాగి మానవులందరూ లాభం పొందుతున్నారు తప్ప గోవు ఏ లాభమూ పొందడం లేదు. అంటే గోమాత పరోపకారం కోసమే పాలనిస్తోంది అని భావం. పంచగవ్యాలైన గోమూత్రం , గోమయం , గోక్షీరం , ఆవు పెరుగు , ఆవు నెయ్యిలను ఆహారంగా స్వీకరించి , ఐదు రాత్రులు ఉపవాసం చేస్తే వారి సమస్త మహాపాతకాలూ తొలగిపోతాయి అని చెప్పాడు వశిష్ఠుడు తన స్మృతి (11-380)లో. యమ స్మృతి కూడా (71-72)లో కపిల గోవు నెయ్యి తాగిన వారికి మహాపాతకాలు నశిస్తాయని చెప్పింది. 

మొగలిచెర్ల

 *మనో శుద్ధి..*


"చాలా క్షేత్రాలు చూసాము..దాదాపుగా అన్ని దత్తక్షేత్రాలూ దర్శించుకున్నాము..అలాగే శిరిడీ మొదలుకొని అన్ని అవధూతల ప్రదేశాలూ చూసాము..ఈ క్షేత్రం గురించి గత రెండేళ్లుగా వింటున్నాము..ఇప్పటికి మాకు కుదిరింది ఇక్కడికి రావడానికి..ప్రశాంతంగా వుందండీ..మీరు శనివారం నాడు వస్తే పల్లకీసేవ లో పాల్గొనవచ్చు..ఎక్కువ మంది భక్తులతో కోలాహలంగా ఉంటుంది..ఆదివారం నాడు ఈ అవధూత సమాధి వద్దకు వెళ్ళొచ్చు అని చాలా పోస్టుల్లో వ్రాస్తూ వున్నారు..అన్నీ చదివాము..కానీ ఇలా విడిగా గురువారం నాడు వస్తే..హాయిగా..స్వామివారి సమాధి చూడొచ్చు..ప్రశాంతంగా ధ్యానం చేసుకోవచ్చు..ఎటువంటి హడావిడి లేకుండా రాత్రికి ఈ మంటపం లో నిద్ర చేయొచ్చు..అందుకని..బాగా ఆలోచించుకుని..ఈరోజు గురువారం వచ్చాము..మీ సిబ్బంది కూడా బాగా సహకరించారు.." అని ఆ దంపతులు సంతోషంగా చెప్పారు..


"శనివారం నాడు వస్తే..ఈ స్వామివారు తపస్సు చేసుకున్న నారసింహ క్షేత్రం మాలకొండ లో కూడా ఆ లక్ష్మీనరసింహ స్వామిని..అమ్మవారిని.. దర్శించుకోవచ్చు..అదికూడా కలిసి వస్తుంది అని ఆ విధంగా తెలుపుతాను..శనివారం పల్లకీసేవ కు ఒక ప్రాముఖ్యత ఉన్నది..ఆ పల్లకీసేవ లో పాల్గొని..పల్లకీ ప్రదక్షిణాలు పూర్తి ఆయిన తరువాత..ప్రధాన ద్వారం వద్ద పల్లకీ ని పైకెత్తి పట్టుకుంటారు..ఆ పల్లకీ క్రింద నుంచి నడచి వస్తూ..తమ కోర్కెలు విన్నవించుకొని వస్తే..అవి తప్పక తీరుతాయని ఇక్కడ భక్తుల విశ్వాసం..ఆరాత్రికి ఈ క్షేత్రంలో నిద్ర చేసి, తెల్లవారి ఆదివారం నాడు ప్రభాతసేవ లో శ్రీ స్వామివారికి ఇచ్చే హారతులు ప్రత్యేకంగా ఉంటాయి..వాటిని చూసి, ఆపై స్వామివారి సమాధిని  దర్శించుకొని ఇవతలికి వస్తే మంచిదని కూడా ఒక నమ్మకం..ఇలా పల్లకీసేవ..రాత్రికి నిద్ర..ఉదయం స్వామివారి సమాధి దర్శనం అన్నీ కలిసి వస్తాయని..ఆవిధంగా తెలుపుతున్నాను..అంతేగాని మిగిలిన రోజుల్లో రాకూడదని కాదు..ధ్యానం చేసుకోవాలనుకొన్నా..పారాయణం చేసుకోవాలనుకొన్నా..శని ఆదివారాలు కాకుండా రావడమే మంచిది..చాలా ప్రశాంతంగా ఉంటుంది.." అని వివరణ ఇచ్చాను..


ఆ దంపతులు మంటపం లో వెళ్లి కూర్చున్నారు..ఇద్దరూ ధ్యానం చేసుకోసాగారు..సుమారు రెండు గంటల తరువాత..సరిగ్గా మధ్యాహ్న హారతి సమయానికి లేచి వచ్చారు..స్వామివారికి నైవేద్యం పెట్టి హారతి ఇచ్చిన తరువాత..అన్నదాన సత్రానికి వెళ్లి భోజనం చేసి వచ్చారు.."ప్రసాద్ గారూ..మంచి భోజనం పెట్టారు..ధన్యవాదములు..మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలండీ..ఇందాక ధ్యానం లో కూర్చున్నప్పుడు..ఒక అరగంట తరువాత ఒళ్ళంతా ఒకటే జలదరింపు మొదలైంది..సుమారు ఇరువై నిమిషాలపాటు అలా జలదరింపు కలిగింది..ఇక్కడ స్వామివారి తపో మహిమ నిక్షిప్తమై ఉన్నదండీ..నేను అలానే కళ్ళు మూసుకొని ఉండిపోయాను..ఆ జలదరింపు తగ్గిన తరువాత..నా శరీరం నా వశం తప్పింది..మరో అరగంటపాటు అలా కూర్చునే గాఢ నిద్ర పోయాను..మనసూ ఒళ్ళూ కూడా తేలిక పడ్డాయి..మహాత్ములు వర్ణించే స్థితి ని పొందానేమో అని అనిపించింది.." అని ఆయన చెప్పారు.."అదృష్టవంతులు.." అన్నాను..


ఆరోజు రాత్రికి ఆ దంపతులిద్దరూ స్వామివారి మంటపం లోనే పడుకున్నారు..ప్రక్కరోజు శుక్రవారం ఉదయం లేచి..రూముకు వెళ్లి స్నానాదికాలు ముగించుకొని తిరిగి మందిరం లోకి వచ్చారు..ప్రతి శుక్రవారం నాడు స్వామివారి సమాధి మందిరాన్ని మా అర్చకస్వాములు నీటితో కడిగి..మళ్లీ అన్నీ అలంకారం చేస్తారు..గర్భాలయం శుద్ధి చేసే కార్యక్రమం కూడా ఆరోజే జరుగుతుంది..అన్నీ శ్రద్ధగా చూసారు..స్వామివారి మందిరం.. మంటపం..ఆలయ ప్రాంగణం అంతా శుభ్రం చేసే కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు..ఆ తరువాత నా దగ్గరకు వచ్చి.."ప్రసాద్ గారూ ఏ దత్తక్షేత్రం లోనూ ఇటువంటి అనుభవాన్ని పొందలేదు..నిన్నటి నుంచీ మేము ఏంటో పారవశ్యం తో ఉన్నాము..మాకు అవకాశాన్ని ఇచ్చారు..అనేక ధన్యవాదాలు.." అంటూ..మా దంపతుల చేతులు పట్టుకొని..కన్నీళ్లు పెట్టుకున్నారు..బాగా భావోద్వేగాన్ని పొందారు..ఆరోజు సాయంత్రం మళ్లీ స్వామివారి సమాధిని దర్శించుకొని మాతో వెళ్ళొస్తామని చెప్పి వెళ్లిపోయారు..


మరో మూడు నెలల తరువాత ఒక గురువారం నాడు ఆ దంపతులు మళ్లీ వచ్చారు..స్వామివారి సమాధి దర్శించుకొని ఇవతలికి వచ్చి.."ప్రసాద్ గారూ పోయిన సారి మేము ఇక్కడికి వచ్చినప్పుడు..ఇన్నాళ్లూ అద్దె ఇళ్లలో ఉన్నాము..ఒక స్వంత ఇల్లు ఉంటే బాగుండు అని స్వామివారి వద్ద అనుకున్నాము..ఈవిడకు మేమున్న ప్రాంతం లో ఉన్న ఒక ఇల్లు నచ్చింది..కానీ వాళ్ళు రేటు ఎక్కువ చెప్పారు..వేరేది చూద్దామని అనుకున్నాము కానీ ఈవిడ ధ్యాసంతా ఆ ఇంటిమీదే ఉంది..ఇక్కడికు వచ్చి వెళ్లిన తరువాత..ఆ ఇంటి యజమాని మేము అడిగిన ధరకన్నా తక్కువకు ఇల్లు అమ్మడానికి ముందుకు వచ్చాడు..మొత్తం ప్రక్రియ ఒకటిన్నర నెలలో అయిపోయింది..పోయిన గురువారం గృహప్రవేశం చేసాము..ఈ గురువారం ఈ సద్గురువు చెంతకు కృతజ్ఞతలు చెప్పుకోవడానికి వచ్చాము..మేము ఇంటికొఱకు తీసి ఉంచిన డబ్బులో ఇంకా కొంతభాగం మిగిలే ఉంది..దానిని ఇక్కడ మీరు కట్టించబోయే రూముల నిర్మాణానికి ఉపయోగించండి.." అన్నారు..


"ఈ దసరా అయిపోయిన తరువాత రూముల నిర్మాణం మొదలుపెడతాము..అంతవరకూ ఆ ధనాన్ని మీ వద్దే ఉంచండి..నేను తెలిపిన తరువాత ఇవ్వండి.." అన్నాను.."సరే..ఆ మిషతో మళ్లీ స్వామివారి దర్శనానికి వస్తాము..చిన్న కోరిక..మేము ఇకపై ఎప్పుడొచ్చినా గురువారమే వస్తాము..శుక్రవారం సాయంత్రం తిరిగి వెళతాము..శుక్రవారం ఈ ఆలయ శుద్ధి కార్యక్రమంలో మాకూ అవకాశం ఇవ్వండి..మందిరం తో పాటు మా మనస్సులో ఏమన్నా మాలిన్యం వున్నా తొలగిపోతుంది.." అన్నారు..


వాళ్ళది ఎంతటి మనో పరిపక్వత అని పించింది..స్వామివారి సమక్షం లో తమ మనస్సును కూడా శుద్ధి చేసుకుంటారట..మనస్సులోనే వారికి నమస్కారం చేసుకున్నాను.."తప్పకుండా కల్పిస్తాను.." అని చెప్పి..మా సిబ్బంది కి కూడా వీళ్ళను పరిచయం చేసి..శుక్రవారం మందిరం శుభ్రం చేసే కార్యక్రమంలో వీరిని కూడా కలుపుకోమని చెప్పాను..దంపతులిద్దరూ ఎంతో సంతోషపడ్డారు..


ఒక్కొక్కరిదీ ఒక్కొక్క అనుభవం..ఆ అనుభవాలను ఇలా అక్షరబద్ధం చేసి మీబోటి పుణ్యాత్ములకు చేరవేసే బాధ్యతను ఆ దిగంబర అవధూత దత్తాత్రేయుడు నన్నుఎం కేవలం ఒక సాధనంగా ఉపయోగించుకుంటున్నాడు..అది కూడా ఒక భాగ్యమే..


సర్వం..

శ్రీ దత్తకృప!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..వయా కందుకూరు..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్ : 523114..సెల్..94402 66380 & 99089 73699).