Pardha Saradhi Upadrasta :
నిన్న రాత్రి నుండి ఈ గూగుల్ డాక్యుమెంట్ ఏమిటి? టూల్ కిట్ ఏమిటి అనేది చాల మందికి కొంచెం కన్ఫ్యూషన్ గా వుంది; దేనిని influencer marketing అంటారు, కొంత వివరించే ప్రయ్తత్నము చేస్తాను 🙂
ప్రాథమిక స్థాయిలో, influencer మార్కెటింగ్ అనేది ఒక రకమైన సోషల్ మీడియా మార్కెటింగ్, దీన్ని ప్రోడక్ట్ లను అమ్ముకోవటానికి వాటిని మార్కెటింగ్ చేయటానికి వాడే వారు; సోషల్ మీడియా లో ఎక్కువ సామాజిక ఫాలోయింగ్ ఉన్న వ్యక్తుల ను వారి సముచితంలో నిపుణులుగా చేసి , సోషల్ మీడియా లో ఎక్కువ ప్రభావము చేసే వ్యక్తుల , వారి follower ల నుండి వచ్చిన సిఫార్సులు బ్రాండ్ యొక్క ఫ్యూచర్ వినియోగదారులకు ఒక రుజువు యొక్క రూపంగా పనిచేస్తాయి. ఇలా ప్రోడక్ట్ మీద ఎక్కువ నమ్మకాన్ని పెంచుకునే విధముగా ఇన్ఫ్లుఎన్సర్ మార్కెటింగ్ పనిచేస్తుంది
ఉదాహరణకు ఏ కంపెనీ అయినా ఒక కొత్త ప్రోడక్ట్ లాంచ్ చేస్తే కొంత మంది ఆ ప్రోడక్ట్ డొమైన్ లో influencer లు, ఎక్స్పర్ట్ ల కోసము వెతికి, వారి ద్వారా ఆ ప్రోడక్ట్ గురించి ఒక ట్వీట్ లేదా పోస్ట్ పెట్టిస్తారు, దానిని వారి ఒక follower లు ఎక్కువ మంది ఫార్వర్డ్ చేస్తారు , త ద్వారా ఎక్కువ మందికి చేరటం ద్వారా ప్రోడక్ట్ మార్కెట్ లోకి ఎక్కువ మందికి తెలుస్తుంది అనేది influence marketing ఒక్క ముక్య ఉద్దేశ్యము.
influencer కి ఏమొస్తుంది? అసలు ఈ influencer అంటే ఏమిటి? వాళ్ళు influencer ర్యాంకింగ్ ఎలా నిర్నయిస్తారు;
దానికి ఒకొక్క బ్రాండింగ్ platform ఒక్కక్క algorithm ఉపయోగిస్తుంది; basically సోషల్ మీడియా లో ఎంత మంది follower /friend లున్నారు, వాళ్ళు రోజుకి ఎన్ని ట్వీట్/పోస్ట్ లు చేస్తారు, వాళ్ళు ట్వీట్/పోస్ట్ చేస్తే ఎంత మంది కి చేరుతుంది; వీటి మీద ఆధారపడి influencer రాంక్ ఇస్తారు, ర్యాంకింగ్ ను బట్టి influencer కి డబ్బులొస్తాయి ; 🙂
ఇలాంటి ఒక platform https://www.brand360.io/ ; ఇదొక brand creation platform ; https://www.brand360.io/Home/InfluencerHowItWorks
ఈ ఇన్ఫ్లుయెన్సుర్ లను కొంత మంది campaign లు create చేసే కంపెనీలు పక్కన పెట్టుకుంటారు; ఒక ట్వీట్ చేస్తే లేదా ఒక పోస్ట్ చేస్తే ఇంత డబ్బు అని campaign లు create చేస్తుంది ఆ ప్లాన్ ప్రకారము ఆ influencer లు ఆ ట్వీట్ లను ట్వీట్ చేస్తూ వుంటారు; ఒకొక్క సారి ఆ tweet చేసే వారికి ఆ డొమైన్ అంటే ఏ విషయం గురించో కూడా , ఇష్యూ గురించి కూడా తెలిసి అవకాశము లేదు.
అందుకే కంటెంట్ creator లు సెపెరేట్ గా వుంటారు, వాళ్ళు కంటెంట్ క్రీయేట్ చేసి ఏ రోజు ఏ ట్వీట్ ఎన్ని సార్లు చేయాలి అంటే వీళ్ళు గుడ్డిగా చేస్తూ వుంటారు, నెంబర్ అఫ్ ట్వీట్ లను బట్టి, ఫార్వర్డ్/రీట్వీట్/షేర్ చేసే సంఖ్యను బట్టి అసలు influencer కి వారి క్రింద కొంత గ్రూప్ లకు ఆ డబ్బులు అందుతూ పోతాయి;
ఆ influencer క్రింద వున్న ఫాల్లోవెర్ లందరి ID లు కూడా పర్మనంట్, ఒరిజినల్ కూడా కాకపోవచ్చు; ఒకొక్క సారి వాళ్ళు తీసుకున్న campaign ఒక్క ప్రయారిటీ ను బట్టి ID లు కూడా కృత్రిమంగా పుట్టుకొస్తాయి; ఆ campaign అవగానే ఆ ID లు డిలీట్ కూడా అయిపోతాయి;
ఈ campaign ల ఒక్క ముఖ్య ఉద్దేశ్యము ఏమిటంటే తీసుకునే అంశము మీద సోషల్ మీడియా లో ఒక బజ్ create చేయటము; ఒకొక్క సారి లేని బజ్ , లేని influence కూడా create చేయవలసి వస్తుంది; చేస్తారు ;
మొన్న రైతుల ఆందోళన విషయంలో విదీశీ టూల్ కిట్ లో జరిగింది అదే; జనవరి 13 నుండి మొదలు అయ్యి, ఏ రోజు ఏమి చేయాలి, ఏ రోజు ఎంత కంటెంట్ create చేయాలి, ఎవరెవరిని ఫాలో అవ్వాలి, దానికి ఒక వారము ట్రైనింగ్, ఏ జూమ్ మీటింగ్ కి రావాలి, ఎలా చేయాలి అనేది ట్రైనింగ్ కూడా ఇచ్చారు,
జనవరి 23 మొదలు పెట్టుకోండి 26 ఈవెంట్ కి ఏమి చేయాలి, ఏమేమి ట్వీట్ లు ఎప్పుడు చేయాలి, ఎవరికీ ఆ ట్వీట్ లు పెట్టాలి ఇదంతా ఆ campaign లో భాగమే; ట్వీట్ లలో కంటెంట్ కూడా డిసైడ్ అయ్యింది; ఇలా ఫిబ్రవరి 4 మొదలు పెట్టుకోండి మార్చ్ చివరి వరకు ఏ రోజు ఎవరు ఎలా ట్వీట్ లు చేయాలో, content ఏమిటి అనేది మొత్తము ప్లాన్ చేసుకున్నారు;
ఆ కంటెంట్ , campaign ల ఆబ్జెక్టివ్ భారత దేశములో ఎదో జరిగిపోతోంది అన్న విషయములో గ్లోబల్ ప్రపంచ దుష్టిలో భారత దేశాని తిట్టి, భారత దేశ విలువను తగ్గించటమే ;
నా మాట:
ఇటువంటి ట్వీట్స్ పోస్ట్స్ కనిపెట్టడం సులువు కూడా!
ట్వీట్స్ ఒక పదో లేక ఇరవై లేక ఇంకా ఎక్కువ సంఖ్యలో నమూనా ట్వీట్స్ తయారు చేస్తారు. ఆ గ్రూప్ లో ట్వీట్ చేసేవారందరూ ఈ నమూనా ట్వీట్స్ నే షేర్ చేస్తూ ఉంటారు. వాటిల్లో షార్ట్ కట్ పదాలు,ఏబ్రీ వేషన్స్, స్పెల్లింగ్ మిస్టేక్స్ కూడా వంటివి అన్ని ట్వీట్స్ లో.కనబడతాయి.
మనకు విదేశీ పెట్టుబడులు రాకుండా మన భారత్ ని బదనాం చేసే కంపైన్ వెనుక బహుశా చైనా
శక్తులు ఖచ్చితంగా ఉండి వుండవచ్చు. కానీ దురదృష్టం ఏమిటంటే విదేశీయులు మన భారత్ కి చెడ్డపేరు తేవాలి చేస్తున్న ఈ విద్వేష కంఫైన్ కి మన విపక్ష పార్టీలు, సెలెబ్రెట్ జర్నలిస్టులు, మోడీ అంటే పడని మేధావులు కూడా తమ వంతు సాయం చేస్తున్నారు. వీళ్ళు మోడీకి హాని చేస్తున్నారు అని అనుకుంటున్నారు కానీ దేశానికి హాని కలుగుతోంది అని ఆలోచించడం లేదు. విదేశీ శక్తుల చేతుల్లో పావుల్లాగా మారిపోయారు.ఇవి ఆరోపణలు కావు..పచ్చి నిజం. మొన్న toolkit కంపైన్.లో మన వారి ట్వీట్స్ నమూనాలు చూడండి మీకే అర్ధం అవుతుంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి